మన ఓణీకి రాణింపు!  | From Indian Homes To Global Runways, American Girl Impressed Indian Traditional Dress Oni Becomes A Fashion Sensation | Sakshi
Sakshi News home page

మన ఓణీకి రాణింపు! 

Feb 9 2026 5:59 AM | Updated on Feb 9 2026 11:37 AM

American girl impressed indian traditional dress Oni

ఫిదా అయిపోయిన అమెరికా భామ 

మనం దేన్నయితే ‘ఓల్డ్‌ ఫ్యాషన్‌’అని అలుసుగా చూస్తున్నామో.. దేన్నయితే కేవలం తల దాచుకోవడానికో, మొహం తుడుచుకోవడానికో వాడుతున్నామో.. అదే ఇప్పుడు అమెరికాలో ఒక ‘స్టైల్‌ బాంబ్‌’లా పేలింది! ‘ఓణీని కనిపెట్టిన భారతీయులారా.. మీకు పాదాభివందనం’.. అంటూ ఒక అమెరికన్‌ యువతి షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. 

అదే.. మన ఇంటి ఓణీ  
అవును, మనం ఓణీ అనో.. చున్నీ లేదా దుపట్టా అని పిలిచే ఆ రెండు మీటర్ల వస్త్రమే ఇప్పుడు గ్లోబల్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా మారిపోయింది. అమెరికాకు చెందిన కెమి అనే యువతి, తన పాశ్యాత్య దుస్తులపై భారతీయ యువతలు ధరించే ఓణీని వేసుకుని ఒక్కసారిగా మురిసిపోయింది. ‘నా అందం ఒక్కసారిగా పది రెట్లు పెరిగిపోయింది.. ఇది కదా అసలైన ఫ్యాషన్‌ అంటే!’.. అంటూ ఆమె పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

మురిసిపోతున్న అమెరికా అమ్మడు 
మనం మోడ్రన్‌ పిచ్చితో చున్నీలను అటకెక్కించి జీన్స్, టీషర్టులకు అలవాటు పడుతుంటే.. ఆ అమెరికా అమ్మాయి మాత్రం మన ఓణీని భుజంపై వేసుకుని మురిసిపోతోంది. ‘ఈ కాన్సెప్‌్టను కనిపెట్టిన భారతీయులకు నా పాదాభివందనం. ఇది కేవలం వస్త్రం కాదు, ఒక అద్భుతం!’అంటూ ఆమె కొనియాడుతోంది. మనం విదేశాల వైపు వ్యామోహంతో చూస్తుంటే, వాళ్లు మాత్రం మన సంస్కృతిలోని చిన్న చిన్న విషయాలను పట్టుకుని వావ్‌ అంటున్నారు. మన ఇంటి ఓణీకి ఇప్పుడు అమెరికా వీధుల్లో ఎర్ర తివాచీ స్వాగతం దక్కుతోంది. 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement