ఆకాశంలో అలరిస్తున్న కొత్త అతిథి  | Comet from edge of Solar System to be visible from India | Sakshi
Sakshi News home page

ఆకాశంలో అలరిస్తున్న కొత్త అతిథి 

Feb 9 2026 5:44 AM | Updated on Feb 9 2026 5:44 AM

Comet from edge of Solar System to be visible from India

భూమికి అత్యంత సమీపానికి చేరుకున్న సీ/2024 ఈ1 తోకచుక్క 

వాషింగ్టన్‌: మన సౌరమండలానికి సుదూరంగా మంచు, దుమ్ములతో నిండిపోయిన ఊర్ట్‌ క్లౌడ్‌ ప్రాంతం నుంచి దూసుకొస్తున్న సీ/2024 ఈ1 తోకచుక్క భూమికి అత్యంత సమీపానికి దూసుకొస్తోంది. దీనిని దక్షిణభారత దేశ ప్రజలు సైతం చూసే అవకాశముందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీనిని 2024 మార్చి నెలలో పోలండ్‌ ఖగోళ శాస్త్రవేత్త కాస్పెర్‌ వెర్జో తొలిసారిగా కనుగొన్నారు. 

అమెరికాలోని అరిజోనాలోని ‘కటలీనా స్క్రై సర్వే’మిషన్‌లో భాగమైన మౌంట్‌ లెమన్‌ సర్వే స్కాన్‌లో భాగంగా అంతరిక్షాన్ని పరిశీలిస్తుండగా ఇది ఆయన కంటపడింది. సౌరకుటుంబం చుట్టూతా ఏకంగా 1.58 కాంతి సంవత్సరాల దూరంలో వ్యాపించి ఉన్న మంచు, దుమ్ము వలయాన్నే ఊర్ట్‌ క్లౌడ్‌ అంటారు. ఇక్కడి నుంచే సీ/2024 ఈ1 తోకచుక్క దూసుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 20వ తేదీన సూర్యునికి అతి సమీప బిందువు అయిన ‘పెరీలియాన్‌’కు చేరుకుంది. 

అంటే తన పథంలో దూసుకుపోతూ దాదాపు 8.5 కోట్ల కిలోమీటర్ల సమీపానికి వచి్చంది. ఇది మరోసారి సౌరకుటుంబంలోకి రాబోదని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. సూర్య–గ్రహబలాలు అత్యంత బలంగా దీనికి నెట్టేయడంతో అది భవిష్యత్తులో ఎప్పటికీ మన సౌరమండలంలోకి రాబోదని శాస్త్రవేత్తలు విశ్లేíÙంచారు. గతేడాది ఫిబ్రవరిలో తొలిసారిగా దీని స్పష్టమైన ఫొటోలను తీయగలిగారు. జనవరి ఒకటో తేదీన శుక్రగ్రహం సమీపానికి చేరుకున్న ఈ తోకచుక్క ఈ ఫిబ్రవరి 17వ తేదీన భూమికి అత్యంత చేరువగా రానుంది.

 భూ దక్షిణార్థభాగంలోని దేశాల ప్రజలు ఆ సమయంలో రాత్రిపూట నైరుతి దిశలో ఆకాశంలో దీనిని చూడొచ్చు. ధనస్సు రాశి నక్షత్ర మండలం(సాగిటేరియస్‌ కాన్‌స్టెలేషన్‌) ఉన్న దిశలో ఇది స్పష్టంగా కన్పిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. తలభాగం ఆకుపచ్చ రంగులో తోకభాగం నీలిరంగులో కని్పస్తుంది. కార్భన్‌ డయాక్సైడ్‌ వాయువు కారణంగా తోకచుక్కలోని తోకభాగం సూర్యకిరణాల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అప్పుడే మనం తోకచుక్కను చూడగలం. ఈ తోకచుక్కలోని కేంద్రకం కేవలం 2–10 కి.మీ.ల వెడల్పు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement