అల్లాడిన భూ అయస్కాంత క్షేత్రం
2024 అక్టోబర్‌లో సంభవించిన భారీ సౌర తుఫాను భూమిని గట్టిగా వణికించిందని సైంటిస్టులు తాజాగా తేల్చారు. ముఖ్యంగా భూ అయస్కాంత క్షేత్రంపై అది పెను ప్రభావమే చూపిందట. భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సౌర అబ్జర్వేటరీయే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం విశేషం!
నాటి సౌర తుఫాను భూ అయస్కాంత క్షేత్రంతో పాటు దాని తాలూకు రక్షణ వ్యవస్థలను కూడా పునాదులతో సహా కంపింపజేసింది! ఆదిత్య ఎల్1 అందించిన డేటాను విశ్లేషించిన మీదట సైంటిస్టులు ఈ మేరకు నిర్ధారించారు. ఆ తుఫానర తాలూకు పెను ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆదిత్య ఎల్1 అందించిన డేటాను అప్పటికే అందుబాటులో ఉన్న ఇతర అంతర్జాతీయ డేటాతో కలగలిపి నాసా లోతుగా విశ్లేషించింది.
2024 అక్టోబర్‌లో సూర్యునిపై అతి శక్తిమంతమైన ప్లాస్మా పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా చెలరేగిన అపార శక్తి కణాలు అతి భారీ పరిమాణంలో భూమికేసిదూసుకొచ్చాయి. భూమిని సూర్యుని తాలూకు పరారుణ, రేడియో ధార్మిక కిరణాలు తదితరాల బారినుంచి అనునిత్యం కాపాడే అయ స్కాంతావరణాన్ని అపార శక్తితో ఢీకొ ట్టాయి. వాటి ధాటికి అది కిందమీదులై నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఆ ఆఘాతం దెబ్బకు అయస్కాంతావరణం స్వల్పకాలం పాటు చెప్పుకో దగ్గ స్థాయిలో కుంచించుకు పోయిందట కూడా!
అంతేగాక భూ ఎగువ వాతావరణ పొరల్లో అరోరా ప్రవాహాలు విపరీత స్థాయికి పెరిగాయి. ఫలితంగా పలు కృత్రిమ ఉపగ్రహాలు కూడా ప్రభావితం కావడం, పలు దేశాల్లో కమ్యూనికేషన్ల వ్య వస్థ తాత్కాలికంగా దెబ్బతినడం, పవర్ గ్రిడ్లు, మౌలిక వ్యవస్థలు పడకేయడం, జీపీఎస్ వ్యవస్థలు మొరాయించడం తెలిసిందే. ఈ భీకర సౌర తుఫానుకు సంబంధించిన రియల్ టైమ్ నిర్మాణాత్మక విశ్లేషణను ఆదిత్య ఎల్1 అందించింది.
అంతరిక్షంలో జరుగుతున్న కీలక పరిణా మాలకు సంబంధించి రియల్ టైమ్ డేటా ఆవశ్యకతను ఈ ఉదంతం మరోసారి కళ్లకు కట్టిందని సైంటిస్టులు చెబుతు న్నారు. ముఖ్యంగా 2026లో సూర్యప్ర తాపం పరాకాష్టకు చేరవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇది మరీ ముఖ్యమని వారంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


