డబ్బే డబ్బు.. లెక్కపెట్టింది తీసుకెళ్లండి..! | Chinese CEO Distributes Millions In Cash And Challenges Employees To Take What They Can Count, Check More Details | Sakshi
Sakshi News home page

డబ్బే డబ్బు.. లెక్కపెట్టింది తీసుకెళ్లండి..!

Feb 27 2026 11:54 AM | Updated on Feb 27 2026 12:33 PM

 Hundreds of crores of rupees in bonuses for employees in China

ఈ కాలంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఎంప్లాయిస్‌కి  షాకింగ్‌ న్యూస్‌తో దడపుట్టిస్తున్నాయి. రాత్రికి రాత్రి జాబులు పోయాయంటూ మెయిల్స్ పంపి ఉద్యోగులను షాక్‌కు గురిచేస్తున్నాయి. అయితే చైనాలో మాత్రం ఓ కంపెనీ తమ ఉద్యోగులకు సఫ్రైజ్ ఇచ్చింది. అయితే అది జాబులు ఉస్టయ్యాయంటూ కాదు.. మీరు లెక్కపెట్టగలిగే డబ్బు తీసుకెళ్లండంటూ ఛాలెంజ్ విసిరింది. 

చైనాకు చెందిన హోనాన్ కువాంగ్షాన్ క్రేన్‌కో  వ్యాపార సంస్థ  తన  వార్షిక లాభాలను ఉద్యోగులకు పంచాలని నిశ్చయించుకుంది. అయితే సాధారణంగా కాకుండా కొంత కొత్తగా ఉండాలని ఆ కంపెనీ సీఈఓ కుయ్ పెనుజున్ వినూత్నంగా ప్లాన్ చేశారు. తమ ఉద్యోగస్థులందరీకి డబ్బులు పంచడానికి  ఒక పోటీ పెట్టారు.

800 టేబుళ్లలో వందల కోట్ల డబ్బు కట్టలని ఉంచారు. వారికి నిర్ణీత సమయం పెట్టి  ఆ టైమ్‌లో వారు లెక్కపెట్టిన డబ్బంతా వారి సొంతం అన్నారు. దీంతో  ఆ సంస్థ ఉద్యోగులంతా ఆశ్చర్యపోయారు. ఇంకేంటి చకాచకా డబ్బులెక్కపెట్టి అందిన కాడికి సోమ్మును తీసుకెళ్లారు. కొంతమంది ఉద్యోగులైతే వారు లెక్కపెట్టిన డబ్బును మోయలేక ఇబ్బందులు సైతం ఎదుర్కొన్నారు.

అయితే ఇంచ డబ్బు ఇచ్చినా ఆ యజమాని  సంతృప్తి చెందలేదు. అయినప్పటికీ తమ ఉద్యోగులకు ఇంకా ఏదో చేయాలని ఆలోచించిన ఆ బాస్ ఒక్కక్కరికి తలా 20 వేల యువాన్లు రూ 2.44 లక్షలు ఇచ్చారు.  దీంతో ఉబ్బితబ్బిబ్బవడం ఆ ఎంప్లాయిస్ వంతయింది. అయితే ఈ మనీ వేడుకలో మెుత్తంగా 70 శాతం లాభాలు  రూ. 236 కోట్లు ఉంచినట్లు తెలుస్తుంది.

కాగా ఈ మనీ వేడుకపై కుయ్ పెనుజున్  స్పందించారు.  తమ సంస్థ ఉద్యోగస్థులందురూ  వివిధ రకాలైన ఆర్థిక కష్టాలతో ఉన్నారని కనుక ఈ డబ్బులు వారికి కొంత మేర ఉపశమనం కలిగిస్తాయని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2 వేల మంది మహిళ ఉద్యోగులకు రూ.2.1 కోట్లు స్పెషల్ బోనస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇవేకాకుండా గతంలోనూ ఈయన పలు దాతృత్వ కార్యక్రమాలు జరిపినట్లు ఎంప్లాయిస్ తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement