బీజింగ్: చైనాలోని తూర్పు ప్రాంతానికి చెందిన ఏడేళ్ల టాంగ్‌డౌ తన బరువు తగ్గించుకోవడానికి చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వయస్సుకు మించి బరువు పెరిగిన టాంగ్‌డౌకు అతని తండ్రి ‘హే’ స్కిప్పింగ్ చేయమని సలహా ఇచ్చాడు. తండ్రి వీడియో తీస్తుండగా..‘సమ్మర్ హాలిడేస్‌లో నువ్వు చెప్పినట్లే చేస్తాను నాన్న’ అని మాట ఇచ్చాడు.
అంతేకాకుండా..‘నువ్వు పోస్టు చేసే వీడియోకి ఎన్ని లైక్స్ వస్తే, అన్ని సార్లు స్కిప్పింగ్ చేస్తా’అని సరదాగా చెప్పాడు. చెప్పినట్లుగా తండ్రి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తొలి రోజు ఆ వీడియోకి 150 లైక్స్ వచ్చాడు. లైక్స్‌కు అనుగుణంగా స్కిప్పింగ్ చేశాడు. రోజులు గడిచేకొద్దీ విపరీతంగా వైరల్ అయింది. ప్రస్తుతం ఆ వీడియోకు 18 లక్షల లైక్స్ వచ్చాయి. దీంతో,‘టాంగ్‌డౌ నిజంగా 18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా?’ అన‍్నది చైనా సోషల్ మీడియాలో చర్చాంశమైంది.
ప్రపంచ దేశాల్లో ఊబకాయం సమస్యతో బాధపడుతున్న దేశాల్లో చైనా ఒకటి. పెద్దల్లో 35 శాతం, పిల్లల్లో 12 శాతం మంది ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టాంగ్‌డౌ వీడియో చైనాలో పేరెంటింగ్ ట్రెండ్‌గా మారింది.
పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తల్లిదండ్రులు కొత్త పద్ధతులను ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, ఇంత పెద్ద సంఖ్యలో స్కిప్పింగ్ చేయడం శారీరకంగా సాధ్యం కాదని, ఇది కేవలం సోషల్ మీడియా వినియోగదారుల సరదా ప్రతిస్పందనగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.
Tangdou just discovered that the internet can be a very scary place lolpic.twitter.com/O83uFVcUYQ
— China Scroll (@TheChinaScroll) February 12, 2026


