రూ. 3 లక్షల బంగారం కొంటే.. కోట్ల గోల్డ్‌ మెర్సిడెస్‌ వచ్చింది! | meet Sumith Dubai call centre employee invested in gold biscuit won gold Mercedes | Sakshi
Sakshi News home page

రూ. 3 లక్షల బంగారం కొంటే.. కోట్ల గోల్డ్‌ మెర్సిడెస్‌ వచ్చింది!

Feb 26 2026 4:06 PM | Updated on Feb 26 2026 5:01 PM

meet Sumith Dubai call centre employee invested in gold biscuit won gold Mercedes

షాపింగ్‌ మాల్స్‌లో షాపింగ్‌ చేయడం, కూపన్స్‌ నింపడం, బంపర్‌ డ్రాలు కోసం  ఎదురు చూడటం మనలో చాలామందికి అలవాటే. కానీ అదృష్టం వరించేది చాలా తక్కువ మందికే. కానీ  కాల్‌ సెంటర్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తి లక్షల్లో పెట్టుబడి పెట్టి 50రెట్ల లాభంతో గోల్డ్‌ లగ్జరీ మెర్సిడెస్‌ కారు దక్కించుకున్నాడు. ఎవరా లక్కీ ఫెలో? ఏమా కథ?

ప్రతీ వేసవిలో దుబాయ్‌  'షాప్ & విన్' (Shop & Win) ప్రమోషన్లు , షాపింగ్ ఫెస్టివల్స్‌ సర్వ సాధారణం. కానీ దుబాయ్‌లోని కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్ అనే వ్యక్తి తనకు లగ్జరీ కారు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. 

ఖలీజ్ టైమ్స్  రిపోర్ట్‌ ప్రకారం సుమిత్‌ 15 వేల దీనార్లతో( సుమారు రూ.3 లక్షల 70వేల) బంగారు బిస్కెట్‌లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్‌ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లడం అదే తొలిసారి కూడా. కట్‌ చేస్తే ఈ పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి వరించింది.ఈ విషయాన్నిఇంకా నమ్మలేక పోతున్నాను అంటూ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు సుమిత్‌.

​కారుతో సరదాగా ఫోటో  కట్‌ చేస్తే
20ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న  సుమిత్‌  దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో పెట్టుబడిగా బంగారు బిస్కెట్‌ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్‌లకు ఒక వోచర్‌ను అందించే 'స్పెండ్ అండ్ విన్' ప్రచారం కింద అతనికి రాఫిల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 - ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్  'షాప్ & విన్' ప్రచారంలో అతడిని అదృష్టం వరించింది. గోల్డ్‌ బిస్కట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్‌ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారు గెలుచుకుంటానని మాత్రం అస్సలు ఊహించలేదు. 

 

సర్‌ప్రైజ్‌  చేసిన కాల్‌
ఒకరోజు నైట్‌ డ్యూటీనుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు పక్రమించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్నిఊహించని మలుపు తిప్పిన ఫోన్‌ కాల్‌ వచ్చింది.  మెయిల్‌ చెక్‌ చేసుకోండి అని చెప్పారు.  చెక్‌  చేశాక తన కళ్లను తానే నమ్మలేక పోయాడు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆనందంలో మునిగి పోయాడు. చాలామంది ఆ కారు అమ్మేసి డబ్బులు వాడుకోవాలని సూచించారు. కానీ సుమిత్ మాత్రం తనకు ఆ కారు కావాలనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. రెండు దశాబ్దాల తరువాత తనకు దేవుడిచ్చిన వరం అంటూ ఆనందాన్ని ప్రకటించాడు.

 (తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?)

Advertisement
 
Advertisement
Advertisement