breaking news
Dubai
-
అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు.. దుబాయ్‌లో కొత్త చట్టం
దుబాయ్ ప్రభుత్వ సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచడానికి ప్రైవేట్ కంపెనీల సహకారాన్ని ప్రోత్సహిస్తూ కొత్త చట్టం ప్రవేశపెట్టింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేసిన లా నెం. (5) 2026 ప్రకారం.. ప్రభుత్వ సంస్థలు కొన్ని లేదా అన్ని సేవలను ప్రైవేట్ కంపెనీలకు అవుట్సోర్సింగ్ చేసుకోవడానికి అధికార అనుమతి పొందాయి.చట్టం ప్రకారం.. అవుట్సోర్సింగ్ ఒప్పందాలు అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అనుసరిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తాయి. దుబాయ్ ఆర్థిక శాఖ ఈ ఒప్పందాలను పర్యవేక్షిస్తుంది. నియంత్రించే విధానాలను అమలు చేస్తుంది.ఒక ప్రభుత్వ సంస్థ ఒకే సేవ కోసం ఒకటి కంటే ఎక్కువ కాంట్రాక్టర్లను నియమించవచ్చు. ఒక కంపెనీ ఏకైక బిడ్డర్‌గా ఉంటే మాత్రమే ప్రత్యేక ఒప్పందాలకు అనుమతి ఉంటుంది. ఇది న్యాయమైన పోటీని నిర్వహించడానికి ఉద్దేశించిన నిబంధన.చట్టంలోని నిబంధనలుచట్టంలో అవుట్సోర్సింగ్ ఒప్పందాల్లో కాంట్రాక్ట్ వ్యవధి, రద్దు విధానాలు, కాంట్రాక్టర్ ఆస్తులను రక్షించే చర్యలు తదితర అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు.ప్రభుత్వ సంస్థలు కాంట్రాక్టర్ల పనితీరు సూచికల ద్వారా వారిని పర్యవేక్షించి, మూల్యాంకనం చేయాలి.అవుట్సోర్సింగ్ కంపెనీలు ప్రతి విదేశీ ఉద్యోగికీ ఒక యూఏఈ జాతీయుడని నియమించుకోవాల్సి ఉంటుంది.ఎమిరాటీ సిబ్బందికి జీతాలు, ప్రోత్సాహకాలు ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.జ్యుడీషియల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి ప్రభుత్వం నిర్ధారించిన పరిమితుల కంటే ఎక్కువ జరిమానాలు విధించే హక్కు లేదు.ప్రభుత్వ సంస్థలు, కాంట్రాక్టర్లు చట్టాన్ని అమలు చేయడం మూడేళ్ల లోపే ప్రారంభించాలి. -
భారీ శబ్దంతో దుబాయ్‌లో కుప్పకూలిన డ్రోన్
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ప్ ప్రాంతం కూడా తీవ్ర దాడులతో దద్దరిల్లుతోంది. దుబాయ్‌లోని అల్ బదా ప్రాంతంలో డ్రోన్ ఒకటి క్రాష్ అయిన ఘటన కలకలం రేపింది. గల్ఫ్‌లో ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తుండటంతో 13వ రోజు దుబాయ్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. దుబాయ్ క్రీక్ హార్బర్ సమీపంలోని భవనంపై డ్రోన్ పడిందని, స్వల్ప మంటలు చెలరేగాయని అధికారులు నిర్ధారించారు. అయితే దీనిని త్వరగా అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పింది. దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకారం, ఒక చిన్న డ్రోన్ కూలిన ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు గురువారం ప్రకటించారు. (ఉచిత బస్సు, వ్యాపారాలు తుస్సు : మడిగెలు ఢమాల్)సివిల్ డిఫెన్స్, ఇతర సంబంధిత బృందాలు వేగంగా స్పందించి మంటల్ని అదుపు చేశాయి. భవనంలోని నివాసితులకు ఎలాంటి ముప్పూ లేదన్నారు.(చమురు కొరతలేదు : వదంతులకు ఇది సమయం కాదు : హర్దీప్ పూరి) -
దుబాయ్ పై మరోసారి దాడి..
-
దుబాయ్‌లో హౌస్ షేరింగ్.. కొత్త రూల్స్
దుబాయ్‌లో భాగస్వామ్య వసతి (హౌస్ షేరింగ్/బెడ్ స్పేస్ రెంటల్స్)పై కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. దుబాయ్ పాలకుడు, యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మార్చి 11న ఈ మేరకు లా నెం. (4) ఆఫ్ 2026 జారీ చేశారు. భాగస్వామ్య వసతిని నియంత్రించి, నివాసుల హక్కులను కాపాడటం, సురక్షితమైన, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులను నిర్ధారించడం, అధిక జనసాంద్రతను నివారించడం, అక్రమ భవన మార్పులను అరికట్టడం ఈ చట్టం లక్ష్యాలు.కీలక నిబంధనలు ఇవే.. ఏ వ్యక్తి లేదా సంస్థ అయినా, యూనిట్‌ను భాగస్వామ్య వసతిగా కేటాయించాలంటే దుబాయ్ మున్సిపాలిటీ నుండి ముందస్తు అనుమతి (పర్మిట్) తీసుకోవాలి. అనుమతి లేకుంటే ఇది చట్టవిరుద్ధం. అనుమతులు ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతాయి. యజమాని అభ్యర్థన మేరకు రెండేళ్ల పర్మిట్ కూడా ఇవ్వవచ్చు. పునరుద్ధరణ కోసం గడువు ముగియడానికి కనీసం 30 రోజుల ముందు దరఖాస్తు చేయాలి. భాగస్వామ్య యూనిట్లలో గరిష్ట ఆక్యుపెన్సీ లిమిట్, ప్రతి వ్యక్తికి కనీస స్థలం, అవసరమైన షేర్డ్ ఫెసిలిటీలు (వెంటిలేషన్, షేర్డ్ ఏరియాలు) నిర్ధారించాలి. అద్దెదారులు లేదా ఇతరులు యూనిట్లో ఏ భాగాన్నైనా సబ్-లీజ్‌కు ఇవ్వకూడదు లేదా పార్టిషన్లు (తాత్కాలిక గోడలు) ఏర్పాటు చేయకూడదు – ఇది నిషేధం. భాగస్వామ్య వసతి మార్కెట్‌పై ప్రత్యేక అద్దె సూచిక (రెంటల్ ఇండెక్స్) ఏర్పాటు చేస్తారు. ఇది సాధారణ అద్దె మార్కెట్ సూచిక నుండి వేరుగా ఉంటుంది.భారీ జరిమానాలుఉల్లంఘనలకు 500 నుండి 500,000 దిర్హమ్ల వరకు జరిమానా విధిస్తారు. ఒక క్యాలెండర్ ఇయర్లో పదేపదే ఉల్లంఘనలు జరిగితే గరిష్టంగా 1 మిలియన్ దిర్హమ్లు (సుమారు రూ.2.25 కోట్లు) వరకు జరిమానా పడవచ్చు.ఎందుకీ కొత్త చట్టం?గతంలో దుబాయ్‌లో అక్రమ విభజనలు (పార్టిషన్లు), బెడ్ స్పేస్ రెంటల్స్ వల్ల అగ్నిప్రమాదాలు, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు, గత జూలైలో దుబాయ్ మెరీనాలో అక్రమంగా పార్టీషన్ చేసిన ఒక భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ భవనంలో 3,800 మందికి పైగా జనం నివసిస్తున్నారు. ఇలాంటి పార్టీషన్ల కోసం ఉపయోగించే తాత్కాలిక గోడలతో (చెక్క లేదా జిప్సమ్ బోర్డులు) అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వెంటిలేషన్ కూడా సక్రమంగా ఉండదు. అత్యవసర నిష్క్రమణ మార్గాలకు ఆస్కారం ఉండదు. -
దుబాయ్‌లో ‘అత్యవసర’ మార్గదర్శకాలు విడుదల
దుబాయ్: ప్రజా భద్రతను దృష్టిలో ఉంచుకుని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎమిరేట్ పూర్తిస్థాయిలో సురక్షితంగా ఉందని, అన్ని కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే అత్యవసర హెచ్చరికలు జారీ అయిన సందర్భంలో నివాసితులు, సందర్శకులు ఎలా స్పందించాలనే విషయంపై ముందస్తు జాగ్రత్త సూచనలు ఇచ్చారు.మొబైల్ ఫోన్లకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికలు అందినప్పుడు ప్రజలు ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరించేలా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపారు.మార్గదర్శకాల ప్రకారం.. హెచ్చరిక అందిన సమయంలో బయట ఉన్నవారు భయపడకుండా వెంటనే సమీప భవనంలోకి వెళ్లాలని సూచించారు. వాహనం నడుపుతున్నవారు కూడా సమీపంలోని ఇండోర్ ప్రదేశానికి సురక్షితంగా చేరుకోవాలని, కిటికీలు, బాల్కనీలు లేదా బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే భవనాల బయటి గోడలు, గాజు ప్యానెల్స్ సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు.ప్రజలు అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే నమ్మాలని, ప్రభుత్వ అధికారులు ధ్రువీకరించిన అప్డేట్స్నే అనుసరించాలని సూచించారు. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే ధ్రువీకరించని సందేశాలు, వాయిస్ రికార్డింగులు లేదా వీడియోలను షేర్ చేయవద్దని కూడా స్పష్టం చేశారు.ఇంట్లో ఉన్నవారికి సూచనలుఇళ్లలో లేదా కార్యాలయాల్లో అప్పటికే భవనాల లోపల ఉన్నవారు కిటికీలు, బాల్కనీలు, బహిరంగ ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని గైడ్ సూచించింది. అవసరమైతే భవనం లోపల మరింత సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని తెలిపింది.అదేవిధంగా పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్స్ లేదా భద్రతా సిబ్బంది ఇచ్చే సూచనలను గమనించాలని, ప్రత్యేకంగా సూచించని వరకు ఎలివేటర్ల వినియోగాన్ని నివారించాలని అధికారులు పేర్కొన్నారు. పెద్ద గాజు ఉపరితలాలు లేదా గాజు గోడల సమీపంలో ఉండకూడదని సూచించారు.పరిస్థితి పూర్తిగా ముగిసిందని అంతర్గత మంత్రిత్వ శాఖ నుంచి “ఆల్ క్లియర్” నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రజలు తమ ప్రస్తుత స్థానంలోనే ఉండాలని దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. అనంతరం సాధారణ కార్యకలాపాలను ప్రశాంతంగా పునఃప్రారంభించవచ్చని పేర్కొంది. -
మరో దుబాయ్ వ్యాపారవేత్త ఔదార్యం, 64 ఫ్లాట్స్ ఫ్రీగా
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అనిశ్చిత పరిస్థితుల మద్య దుబాయ్‌లో భారతీయ వ్యాపారవేత్త మానవత్వాన్ని చాటుకున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న భీకరపోరులో చిక్కుకున్న భారతీయ పౌరులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. వారికోసం తన 64-యూనిట్ అపార్ట్‌మెంట్‌ను వసతిని ఆహారంతో సహా ప్రాథమిక సౌకర్యాలతో ఉచితంగా అందించారు.అల్ మిజాన్ గ్రూప్ చైర్మన్ యోగేష్ దోషి మానవతా దృక్పథంలో స్పందించిన తీరు ప్రశంసలందుకుంది. నగరంలో చిక్కుకున్న భారతీయులకు 64 అపార్ట్మెంట్లతో కూడిన తన నివాస భవనాన్నివసతిని ఆహారంతో సహా ప్రాథమిక సౌకర్యాలతో ఉచితంగా అందించడం విశేషంగా నిలిచింది.ఈ ప్రక్రియను ఇండియన్ పీపుల్స్ ఫోరం UAE, దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో సమన్వయంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లలతో ఉన్న కుటుంబాలతో సహా 125 మందికి పైగా భారతీయులకు క్లిష్ట కాలంలో తాత్కాలిక ఆశ్రయం కల్పించడంలో సహాయం చేశామని దోషి చెప్పారు. కీలకమైన సమయంలో ఈ సహాయం లభించడం చాలా ఊరటనిచ్చిందని బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.రియా మకాడియా, పరాస్ భలోడియా మరియు గ్రిష్మా భలోడియాతో పాటు మోహిత్ వచ్చానీ, వారి హోటల్ బుకింగ్‌లు ముగియడంతో, పొడిగింపులు సాధ్యం కాక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. నిరంతరం ఫోన్లో అలర్ట్‌లు రావడం కూడా ఆందోళనను పెంచిందని వారు చెప్పారు.UAEలో భారతీయ వ్యాపారవేత్త ఫామ్‌హౌస్‌ను ఆశ్రయందుబాయ్లో చిక్కుకుపోయిన భారతీయుల కోసం, యుఎఇకి చెందిన వ్యాపారవేత్త ధీరజ్ జైన్ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్మాన్‌లోని పెద్ద ఫామ్‌హౌస్‌ను వారికోసం తాత్కాలిక వసతిగా మార్చారు. అనేక ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఉచిత వసతి భోజనం అందించారు. హోటళ్ళు, వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని ఫామ్‌హౌస్‌కు తీసుకొచ్చేందుకు ఆరు రోల్స్ రాయిస్ వాహనాలతో సహా 11 కార్లను కూడా వినియోగించడం విశేషం. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్, రెండు మిత్రదేశాలు ఇరాన్‌పై సంయుక్త దాడులు చేసి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హత మార్చడంతో మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుండి, ఇరాన్ గల్ఫ్ దేశాలలోని ఇజ్రాయెల్, యుఎస్ సైనిక స్థావరాలపై దాడి చేస్తోంది. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి.(International Women's Day ప్రతీ అడుగు కన్నీటి మడుగు) -
దుబాయ్‌లో భారతీయులకు భారీ ఊరట
అబుదాబి:అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై జరిపిన దాడుల కారణంగా మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రవాణా కార్యకలాపాలు నిలిచిపోవడంతో పశ్చిమాసియా దేశాల్లో నివసిస్తున్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబాలతో కలిసి స్వదేశానికి చేరలేక, బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో దుబాయ్‌లోని ప్రవాస భారతీయ వ్యాపారవేత్త యోగేష్ దోషి ముందుకు వచ్చారు. ఆయన తన 64 అపార్ట్మెంట్ల భవనాన్ని భారతీయులకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. భారతీయులకు వసతి, భోజనం, కనీస అవసరాలను తీర్చేలా ఏర్పాట్లు చేశారు. హోటళ్లలో ధరలు అమాంతం పెరిగిన ఈ సమయంలో, దోషి కల్పిస్తున్న సౌకర్యాలు భారతీయులకు పెద్ద ఊరట లభించినట్లైంది. దుబాయ్‌లో చిక్కుకున్న 125 మంది భారతీయులకు ఇప్పటికే ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. భారత రాయబార కార్యాలయంతో కూడా ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులు తమకు సమాచారం అందించాలని రాయబార కార్యాలయం కోరింది.దుబాయ్‌కు సమీపంలోని అజ్మాన్‌లో కూడా భారతీయులకు ఆశ్రయం లభిస్తోంది. యుఎఇ వ్యాపారవేత్త ధీరజ్ జైన్ తన ఫామ్‌హౌస్‌ను తాత్కాలిక వసతిగా మార్చి, ఉచిత నివాసం, భోజనం అందిస్తున్నారు. హోటళ్లలో స్థలం లేక, డబ్బు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులను ఆయన తన కార్లతో భారతీయుల్ని తరలిస్తున్నారు. అందులో ఆరు రోల్స్ రాయిస్ వాహనాలతో తీసుకువచ్చి ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం కల్పించారు.ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు జరిపి, సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుండి ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో దుబాయ్‌లో చిక్కుకున్న భారతీయులకు యోగేష్ దోషి, ధీరజ్ జైన్ వంటి వ్యాపారవేత్తల మానవతా చర్యలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. -
దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం.. బుర్జ్ ఖలీఫా ఎలా ఉందంటే
-
రికార్డుల రియల్ ఎస్టేట్.. ఇప్పుడంతా టెన్షన్!
స్థిరాస్తి రంగం లావాదేవీలలో అత్యంత ప్రధానమైంది సెంటిమెంట్. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే.. వారి భావోద్వేగాలపై ప్రభావం పడిందంటే చాలు తుది నిర్ణయానికి పునరాలోచనలో పడతారు. ఏ దేశ స్థిరాస్తి రంగంలోనైనా ఇదే పరిస్థితి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాలలో యుద్ధం నేపథ్యంలో ప్రధానంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగం అనిశ్చితిలో పడింది. గతేడాది దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో 2.70 లక్షలకు పైగా స్థిరాస్తి లావాదేవీలు జరిగాయి. వీటి విలువ 917 బిలియన్ ఏఈడీ. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల రూ.2,30,872 కోట్లు. దుబాయ్ రియల్టీ చరిత్రలో ఇదే అత్యధిక లావాదేవీలు కావడం గమనార్హం. – సాక్షి, సిటీబ్యూరో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం క్రమంగా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్(యూఏఈ) దేశాలకు విస్తరించింది. దీంతో స్థిరాస్తి పెట్టుబడిదారులు ప్రపంచంలోని అత్యంత డైనమిక్ ప్రాపర్టీ మార్కెట్లలో ఒకటైన దుబాయ్‌లో ప్రాంతీయ అస్థిరత దెబ్బతింటుందా అనే సందిగ్ధంలో పడిపోయారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.2008 ఆర్థిక సంకోభం, కరోనా మహమ్మారి కాలంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ షాక్‌కు గురైంది. కాకపోతే విధానపరమైన సంస్కరణలతో ఆయా విపత్కర పరిస్థితుల నుంచి వేగవంతంగా కోలుకుంది. అయితే ఈసారి దుబాయ్ కూడా ఎదురుదాడికి దిగడంతో పశ్చిమాసియా దేశాల్లో సురక్షిత ఆర్థిక కేంద్రమైన ఎమిరేట్స్‌లో భౌతిక నష్టం పరిమితమే అయినప్పటికీ.. ప్రపంచ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం తప్పక ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.భారతీయుల పెట్టుబడులు ఎందుకంటే? 150 దేశాల పెట్టుబడిదారులు యూఏఈ ప్రాపర్టీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. యూఏఈ జనాభాలో దాదాపు 88–89 శాతం మంది ప్రవాసులు ఉంటారు. దీంతో సహజంగానే ఇక్కడ ప్రాపర్టీ మార్కెట్లో వీరిదే హవా.. భౌగోళిక సామీప్యత, డాలర్ కంటే దిర్హమ్ స్థిరత్వం, ఎక్కువ విలువ, అద్దె రాబడులు అధికంగా ఉండటం వంటి కారణంగా భారతీయులు దుబాయ్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపిస్తుంటారు. భారత సంతతికి చెందిన డెవలపర్ల వాటా నిర్మాణ దశలోని ప్రాజెక్ట్‌లలో 8–10 శాతం వరకు ఉంటుంది.మన ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.2,30,872 కోట్లు.. ప్రపంచదేశాలతో పోలిస్తే అత్యధిక అద్దె రాబడి వచ్చేది దుబాయ్‌లోనే.. ఇక్కడ అద్దె వార్షిక ఆదాయం 6–9 శాతం మధ్య ఉంటుంది. భారత్ అతిపెద్ద విదేశీ పెట్టుబడుల దేశం దుబాయ్. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఇండియన్స్ ఆస్తి కొనుగోళ్ల వాటా 20–22 శాతంగా ఉందని అనరాక్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2021 నుంచి దుబాయ్‌లో గృహాల ధరలు సుమారు 60–75 శాతం మేర పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు దుబాయ్‌లో దాదాపు 2 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. వీటి విలువ 538 బిలియన్ ఏఈడీ(ఇండియన్ కరెన్సీలో రూ.1,34,945 కోట్లు).ఆర్థిక సంకోభం, కోవిడ్ సమయంలో.. దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్ గతంలోనూ చేదు అనుభవాలను చవిచూసింది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దుబాయ్‌లో ప్రాపర్టీల ధరలు 50–60 శాతం మేర క్షీణించాయి. దీని నుంచి కోలుకునేందుకు 6–7 ఏళ్ల కాలం పట్టింది. చమురు ధరల పతనం, అధిక సరఫరా కారణంగా 2014, 2019లలో ఇక్కడ ధరలు దాదాపు 25–30 శాతం మేర తగ్గాయి. ఇక, ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి కాలంలో ప్రాపర్టీ మార్కెట్లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. అద్దెలపై ప్రభావం.. సాధారణంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రవాసులపై అధికంగా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాపర్టీ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా వేచి చూసే ధోరణి అవలంబిస్తారు. ఇలాంటి సెంటిమెంట్ ప్రభావం తొలుత నిర్మాణ ప్రారంభ దశలో కొనుగోళ్ల, ఊహాజనిత పెట్టుబడులపై చూపిస్తాయి. ఎందుకంటే ఈ విభాగాలు మార్కెట్ సెంటిమెంట్, విశ్వసనీయత మీద ఆధారపడి ఉంటాయి. అలాగే యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల పర్యాటక పరిశ్రమ దెబ్బతింటుంది. దీంతో పర్యాటక ప్రాంతాల్లోని అద్దెలు, ఆతిథ్య ప్రాపర్టీలు, రిటైల్ ఆస్తులపై తాత్కాలిక ప్రభావం ఉంటుంది. -
బంగారంపై భారీ డిస్కౌంట్.. అమ్మేసుకుంటున్న వ్యాపారులు
మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో దుబాయ్‌లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో, కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది.విమానాలపై ఆంక్షలు, పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలా మంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లను ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ, నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్‌కు సుమారు 30 డాలర్ల వరకు తగ్గింపుతో బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.ఈ వారం మధ్య నుంచి కొంతమేర బంగారం విమానాల్లో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ, శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్.. ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్‌కు, అమెరికా-ఇజ్రాయెల్‌కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది.ఇది చదివారా? 👉 స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల కార్గో విభాగాల్లో తరలిస్తారు. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది. అయితే భూసరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండటంతో సౌదీ అరేబియా లేదా ఒమాన్ విమానాశ్రయాలకు భూభాగం మీదుగా అధిక విలువ గల సరుకులను తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. -
గత 23 ఏళ్లుగా రంజాన్ దీక్ష చేస్తున్న 56 ఏళ్ల ఎన్ఆర్ఐ
పవిత్ర రంజాన్ (Ramadan) మాసం వేళ మత సామరస్యానికి సంబంధించి అపురూపమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రంజాన్‌మాసం అంతా ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష చేస్తారు ఇది అందరికీ తెలిసిందే. కానీ దుబాయ్‌లో 56 ఏళ్ల నాన్ ముస్లిం గత 23 ఏళ్లు ఉపవాస దీక్ష చేస్తుండటం విశేషంగా నిలుస్తోంది. 2002 నుండి సతీష్ కుమార్‌న దుబాయ్‌లో ఉంటున్నారు. స్వయంగా తాను హిందువు అయినప్పటికీ పవిత్ర రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తున్నారు. రంజాన్ అంటే మంచి పనులను పంచుకుంటూ, జీవించడం అంటే సమాజంతో ఐక్యంగా ఉండటం అంటారు సతీష్. తన చుట్టూ ఉన్న ప్రజల పట్ల గౌరవం ఉందని, వారిమీద ప్రేమతోనే ఈ దీక్ష చేస్తానని చెప్పుకొచ్చారు. గల్ఫ్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, కుమార్ రోజువారీ ఉపవాసం కేవలం శారీరక సవాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రక్రియగా విశ్వసిస్తానని తెలిపారు. ఇది ఆహారం, పానీయం, పాప ప్రవర్తనకు దూరంగా ఉండటంతోపాటు స్వీయ-క్రమశిక్షణ, ఆధ్యాత్మిక శుద్ధిని పెంపొందించుకునే మార్గం ఇదని చెప్పారు.ఇదీ చదవండి: పరీక్షలకు వెళుతుండగా పిల్లల్ని కొట్టి చంపేశాడు.. సొంత బాబాయే!దీంతోపాటు, వారి రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడే వ్యక్తుల ఇబ్బందులను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి చూడటానికి ఉపవాసం తనకు సహాయపడిందన్నారు. ఆకలిదప్పుల బాధను అనుభవించడం వల్ల పేదల దుస్థితిని అర్థం చేసు కోచ్చని, తద్వారా మనలో దాతృత్వం,కరుణ అనే భావం పెరుగుతుందని తెలిపారు. ఉపవాసంతో అనేక శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలున్నాయన్నారు. ముఖ్యంగా ఉపవాసంద్వారా జీర్ణవ్యవస్థకు విరామం ఇవ్వడం అంటే శారీరక ప్రయోజనాలను పొందమే అన్నారు. దీంతో మానసిక బలం పెరుగుతుంది, ఉత్పాదకత పెరుగుతుంది అనేది తన అనుభవంలో తెలిసిందన్నారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్ : మైనర్‌పై దారుణం, ట్రంప్‌కు మరో షాక్ -
T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట
జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిభారత్- శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీలో గ్రూప్-బి నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్‌లతో కలిసి జింబాబ్వే పోటీ పడింది. అనూహ్య రీతిలో మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి గ్రూప్ టాపర్‌గా సూపర్-8 చేరింది. అయితే, కీలక దశలో వెస్టిండీస్, టీమిండియా, సౌతాఫ్రికా చేతిలో ఓడి నిష్క్రమించింది.యుద్ధం కారణంగాఈ నేపథ్యంలో మార్చి 2న భారత్ నుంచి జింబాబ్వే జట్టు స్వదేశానికి పయనం కావాల్సింది. కానీ ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్ వేదికగా ప్రయాణించాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఫలితంగా జింబాబ్వే జట్టు బుధవారం వరకు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఈ క్రమంలో బ్యాచ్‌ల వారీగా భారత్‌ను వీడేందుకు జింబాబ్వే సిద్ధమైనట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. బుధవారం తొలి బ్యాచ్ స్వదేశానికి పయనం కాగా.. శుక్రవారం ఆఖరి బ్యాచ్ ఇండియా నుంచి బయల్దేరుతుందని తెలిపింది.అందుకే విడతల వారీగాఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పేర్కొంది. తగినన్ని విమానాలు అందుబాటులో లేనందున విడతల వారీగా ఆటగాళ్లు జింబాబ్వేకు చేరుకుంటాడని బోర్డు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జింబాబ్వే జట్టు దుబాయ్ మీదుగా ఎమిరేట్స్ ఫ్లైట్‌లో వెళ్లాల్సింది. అయితే, యుద్ధ ప్రభావం కారణంగా అదిస్ అబాబా, ఇథియోపియా మీదుగా హరారేకు వారు చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు.. వెస్టిండీస్ క్రికెట్ జట్టు సైతం భారత్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: మొయిన్ అలీపై నిషేధం..! -
యుద్ధం దగ్గరగా చూశా.. దుబాయ్ లో భయంకర పరిస్థితులపై PV సింధు రియాక్షన్
-
స్తంభించిన దుబాయ్ రియల్ ఎస్టేట్!
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా మారడంతో అనేక ఆస్తి కొనుగోలు ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.భారతీయ పెట్టుబడిదారుల ‘బ్రేక్’దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొంతకాలం వాయిదా వేస్తున్నారు. కొన్ని విలాసవంతమైన బీచ్‌ఫ్రంట్ ప్రాపర్టీల కొనుగోలు ఒప్పందాలు కూడా నిలిపివేసినట్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు.భద్రమైన పెట్టుబడి కేంద్రం… ఇప్పుడు సందేహాలుఇప్పటివరకు దుబాయ్ పెట్టుబడిదారులకు ‘సేఫ్ హేవన్’ అనే భావన ఉండేది. కానీ తాజా సైనిక ఉద్రిక్తతలు, మిస్సైల్ దాడుల భయం, ఎయిర్‌స్పేస్ పరిమితులు వంటి అంశాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. విదేశీ మూలధనంపై ఆధారపడిన ఈ మార్కెట్లో కొనుగోళ్ల వేగం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు.దుబాయ్ గతంలో కూడా 1990 గల్ఫ్ వార్, 9/11, అరబ్ స్ప్రింగ్, కోవిడ్ సందర్భాల్లో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొని తిరిగి బలంగా లేచింది. ఇప్పుడు కూడా మార్కెట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయని, ఇది కేవలం సెంటిమెంట్ ఆధారిత 'బ్లిప్' మాత్రమేనని డనుబే గ్రూప్ వంటి డెవలపర్లు అంటున్నారు.దుబాయ్‌కి ప్రత్యామ్నాయం ఏది? ఈ నేపథ్యంలో ‘ఎక్స్’ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ వైరల్ అయింది. దుబాయ్ బదులు ముంబై, బెంగళూరు, గిఫ్ట్ సిటీ వంటి భారతీయ నగరాలను ప్రత్యామ్నాయాలుగా సూచించారు. దీనిపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరు భారత్‌లోని ఏ నగరమూ దుబాయ్ స్థాయికి చేరదని, ట్యాక్స్ లాభాలు, లగ్జరీ ఇన్ఫ్రా, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ దుబాయ్‌కే ఉన్నాయని వాదిస్తున్నారు. మరికొందరు గిఫ్ట్ సిటీ (అహ్మదాబాద్-గాంధీనగర్ మధ్య)ను భవిష్యత్ పోటీదారుగా చూస్తున్నారు.డీల్స్ ఆగినా… పూర్తిగా కుదేలుకాదుదుబాయ్లో ప్రస్తుతం కొన్ని ప్రాపర్టీ ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచినా పరిస్థితులు సద్దుమణిగితే మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే త్రైమాసికంలో నిలిచిపోయిన డీల్స్‌లో 60%–80% వరకు పూర్తి అయ్యే అవకాశం ఉందని అంచనా.క్లిక్ చేయండి 👉 దుబాయ్ దాటని బంగారం.. ధరలపై ప్రభావం?కొనుగోళ్లు మందగిస్తే వచ్చే కొన్ని నెలల్లో ధరలపై ఒత్తిడి కనిపించే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో భారీగా కొత్త గృహ ప్రాజెక్టులు మార్కెట్లోకి రావడం కూడా ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. -
మళ్లీ సోనూసూద్ ఉదారత.. ఈసారి దుబాయ్‌లో..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం నటుడు, మానవతావాది సోనూ సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సంక్షోభం కారణంగా దుబాయ్‌లో తలదాచుకుంటున్న పర్యాటకులు, ప్రయాణికులకు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ, బాధితులకు అండగా ఉంటానిని భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి సమయంలోనూ సోనూసూద్ వందలమందికి సాయం అందించారు.ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం పశ్చిమాసియాలోని విమానయాన రంగాన్ని అతలాకుతలం చేసింది. ఫిబ్రవరి చివరిలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిపాయి. దానికి ప్రతిచర్యగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ పరిణామాల దృష్ట్యా భద్రతా కారణాలతో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడం, విమాన సర్వీసులను రద్దు చేయడంతో దుబాయ్‌లో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు.విమానాల రద్దు, దారిమళ్లింపుల వల్ల విమానాశ్రయాల్లోనే గంటల తరబడి నిరీక్షిస్తున్న బాధితుల కష్టాలను చూసి సోనూ సూద్ స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులతో పాటు ఏ దేశానికి చెందిన వారైనా సరే, దుబాయ్‌లో వసతి లేక ఇబ్బంది పడుతుంటే తనకు నేరుగా మెసేజ్ పంపాలని సోనూ సూద్ కోరారు. బాధిత ప్రయాణికులు తమ స్వదేశాలకు చేరుకునే వరకు వారికి ఉచిత వసతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘మానవత్వానికి దేశ సరిహద్దులు, నిబంధనలు ఉండవు’ అని పేర్కొంటూ, దుబాయ్‌లో ఆశ్రయం అవసరమైన వారు ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాలని సూచించారు. War has left many travelers stranded in Dubai.If you or someone you know has nowhere to stay, we are offering safe accommodation free of cost.No nationality. No conditions. Just humanity.DM us on Instagram if you need help.@dugastapropertiesPlease share so this reaches… pic.twitter.com/TDDr9st79M— sonu sood (@SonuSood) March 5, 2026 -
దుబాయ్ దాటని బంగారం..
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ బంగారం (Gold) వ్యాపారంపై పడుతోంది. బులియన్ హబ్‌గా పేరుగాంచిన దుబాయ్ (Dubai) నుంచి విమానాలను సామూహికంగా రద్దు చేయడంతో వ్యాపారులు బంగారం, వెండి రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రపంచ బంగారం మార్కెట్లో కీలక కేంద్రంగా నిలిచిన యూఏఈ (United Arab Emirates) ఆసియా దేశాలకు బులియన్‌ను శుద్ధి చేసి ఎగుమతి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్, లండన్ నుంచి రవాణా అయ్యే బంగారం కూడా దుబాయ్ మార్గం ద్వారానే ఆసియాకు చేరుతుంది. అయితే ఇరాన్ (#Iranwar) చేపట్టిన క్షిపణి దాడుల నేపథ్యంలో యూఏఈ తన గగనతలాన్ని పాక్షికంగా మూసివేయగా, దుబాయ్ విమానాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికుల విమానాల కార్గో హోల్డ్‌లలో తరలించే బంగారం, వెండి రవాణా పూర్తిగా నిలిచిపోయింది.దుబాయ్‌కు, వివిధ దేశాలకు మధ్య లోహ రవాణాను నిరవధికంగా నిలిపివేసినట్లు పలువురు వాణిజ్య, లాజిస్టిక్స్ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. తుది గమ్యస్థానాలకు చేరాల్సిన సరుకులను ఇతర మార్గాలకు మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అధిక విలువ గల బులియన్‌ను రోడ్డు మార్గంలో ఇతర విమానాశ్రయాలకు తరలించడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.సాధారణంగా ట్రేడింగ్ హబ్‌ల మధ్య బంగారాన్ని ప్రయాణికుల విమానాల ద్వారా తరలిస్తారు. ఇందుకు ఒక్క ట్రిప్‌కు ఔన్సుకు ఒక డాలర్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఒక విమానంలో తీసుకెళ్లగల బంగారం పరిమాణానికి బరువుతో కాకుండా విలువ ఆధారంగా పరిమితి ఉంటుంది. బీమా సంస్థలు కూడా ఒక విమానంలో తరలించే కొన్ని టన్నుల విలువైన లోహానికే అండర్‌రైటింగ్ చేస్తాయి.ఈ అంతరాయం తాత్కాలికమే అవుతుందని భావిస్తున్నప్పటికీ, యూఏఈ నుంచి విమానాల నిలిపివేత కొనసాగితే భారత్ సహా ఇతర ప్రధాన మార్కెట్లలో సరఫరా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సౌదీ అరేబియాలో బులియన్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం సరఫరాపై ఆందోళనలను ప్రతిబింబిస్తోందని మెటల్స్ ఫోకస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ న్యూమాన్ తెలిపారు.విమాన ట్రాకింగ్ వేదిక ఫ్లైట్రేడర్24 సమాచారం ప్రకారం.. ఇరాన్ తొలి ప్రతీకార దాడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 12,300కిపైగా విమానాలు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఎయిర్‌లైన్‌గా పేరొందిన ఎమిరేట్స్ బుధవారం రాత్రి వరకు దుబాయ్ నుంచి విమానాలను నిలిపివేయగా, ఇతిహాద్ ఎయిర్వేస్ గురువారం వరకు కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది.గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు బంగారం వ్యాపారులను కష్టాల్లోకి నెట్టాయి. 2020లో కరోనా మహమ్మారి ప్రారంభ సమయంలో ప్రయాణ ఆంక్షల కారణంగా లండన్, న్యూయార్క్ నగరాల మధ్య బంగారం రవాణా దెబ్బతింది. ఆ సమయంలో జేపీమోర్గాన్ ఛేస్ వంటి బ్యాంకులకు అపూర్వమైన మధ్యవర్తిత్వ అవకాశాలు లభించాయి. -
తాళి కట్టే వేళ.. తల పైనుంచి మిసైళ్లు !
కొట్టాయం: పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలు ఒక కేరళ యువతి పెళ్లి కలలను నీరుగారుస్తున్నాయి. సరిగ్గా మరో వారం రోజుల్లో కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టాల్సిన ఆ వధువు ఇప్పుడు దుబాయ్‌లో చిక్కుకుని, విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం ఆందోళనగా ఎదురుచూస్తోంది.కేరళలోని చెర్తలాకు చెందిన 29 ఏళ్ల అన్మోల్ దుబాయ్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఈ నెల 12న కొట్టాయం వడవత్తూరులోని మార్ అఫ్రెమ్ యాకోబైట్ సిరియన్ చర్చిలో మణర్కాడ్కు చెందిన ఫార్మసిస్ట్ ఆల్బిన్తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు నిశ్చయించిన ఈ సంబంధంలో వధూవరులిద్దరూ ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. కేవలం ఫోన్ కాల్స్ ద్వారానే తమ భావాలను పంచుకున్నారు. ఫిబ్రవరి 28న ఇండిగో విమానంలో కొచ్చికి చేరుకుని, వివాహ పనులకు సిద్ధం కావాలని ఆమె వేసుకున్న ప్లాన్ ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడులతో తలకిందులయ్యింది.దుబాయ్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అన్మోల్ ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నప్పటికీ, టికెట్ల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరడం ఆమెను మరింత కలవరానికి గురిచేస్తోంది. చార్టర్డ్ విమానాల కోసం ట్రావెల్ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్న భారీ మొత్తాన్ని చెల్లించడం ఆమెకు భారంగా మారింది. ప్రధాన వివాహ ముహూర్తం దగ్గర పడుతుండటంతో అటు దుబాయ్‌లో వధువు, ఇటు కేరళలో ఆమె కుటుంబం ఆందోళనలో చిక్కుకుంది.అన్మోల్ తండ్రి సుభాష్ కేరళలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తన కుమార్తె క్షేమంగా తిరిగి వస్తుందని ఆయన వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. కేరళ ప్రవాస సంస్థ ‘నార్కా’ (NORKA) వెల్లడించిన వివరాల ప్రకారం విమానయాన సంస్థలు ఇంకా సాధారణ సేవలను పునరుద్ధరించలేదు. దీంతో కొందరు ప్రయాణికులు రోడ్డు మార్గంలో ఒమన్ చేరుకుని, అక్కడి నుండి విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు సౌదీ అరేబియా, కువైట్ మీదుగా కేరళ చేరుకోవాలని చూస్తున్నారు.ఇది కూడా చదవండి: భీకర యుద్ధం దిశగా పాక్-అఫ్గాన్?.. లక్షలాది మంది విలవిల -
ఇరాన్ డ్రోన్ దాడి.. ఉలిక్కిపడ్డ దుబాయ్
-
మంటల్లో దౌత్య కార్యాలయాలు.. నిన్న రియాద్.. నేడు దుబాయ్..
దుబాయ్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై ప్రారంభించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి ప్రతిచర్యగా ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా దుబాయ్ నగరంలోని అమెరికా కాన్సులేట్‌పై డ్రోన్ దాడి జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. ఈ దాడిలో కాన్సులేట్ భవనంలో భారీగా మంటలు చెలరేగగా, దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. అంతకుముందు రోజు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కూడా డ్రోన్లు విరుచుకుపడ్డాయి. వరుసగా చోటు చేసుకుంటున్న ఈ దాడులు అమెరికా దౌత్య కార్యాలయాలు మనుగడకు ముప్పు కలిగిస్తున్నాయి.దుబాయ్ కాన్సులేట్ ఘటన గురించి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ అక్కడి సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని, డ్రోన్ ప్రధాన భవనం పక్కనే ఉన్న పార్కింగ్ స్థలాన్ని తాకిందని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధ ఆశయాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ప్రకటించిన విషయం విదితమే. ఇరాన్ పాలన అమెరికాకు, ప్రపంచ దేశాలకు ముప్పుగా మారిందని, వారి క్షిపణి వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.ఈ క్రమంలో జరిగిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ మృతిచెందారు. గత నాలుగు రోజులుగా సాగుతున్న ఈ భీకర పోరులో ఇరువైపులా సుమారు 800 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికులు ఇరాన్ పౌరులేనని, అక్కడ మరణాల సంఖ్య 787కు చేరిందని రెడ్ క్రెసెంట్ సంస్థ వెల్లడించింది. ఇరాన్ వ్యాప్తంగా 153 కౌంటీలలో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, బాంబు దాడుల తీవ్రత కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లోని 14 దేశాలలో ఉన్న అమెరికా పౌరులను వెంటనే ఆయా దేశాలను విడిచి వెళ్లిపోవాలని స్టేట్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే దుబాయ్ తదితర నగరాల్లో విమాన సర్వీసులు నిలిచిపోవడం, గగనతలం మూసివేయడంతో వేలాది మంది అమెరికన్లు స్వదేశానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. -
అందరికీ ధన్యవాదాలు.. మేము క్షేమంగానే ఉన్నాం: మంచు విష్ణు
దుబాయ్‌లో తాము క్షేమంగానే ఉన్నామని టాలీవుడ్ హీరో మంచు ట్వీట్ చేశారు. మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అప్పుడప్పుడు దూరంలో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ.. అంతా ప్రశాంతంగానే ఉందని వెల్లడించారు. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో క్షేత్రస్థాయిలో అద్భుతమైన చర్యలు తీసుకుంటున్న యూఏఈ నాయకత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.కాగా.. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. దీంతో దుబాయ్, యూఏఈ గగనతలాన్ని మూసి వేయడంతో అక్కడే ఉన్న భారతీయులు చిక్కుకుపోయారు. మంచు విష్ణు ఫ్యామిలీ, పీవీ సింధు సైతం ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉండిపోయింది. To everyone concerned about our safety, thank you. 🙏 We are safe in Dubai. The family is safe. Aside from occasional distant sounds, life continues with calm and order.In tense times, what stands out is the quiet efficiency and brilliant preparedness on the ground. Grateful…— Vishnu Manchu (@iVishnuManchu) March 2, 2026 -
మధ్యప్రాచ్యంలో యుద్దం.. ఆపదలో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జానీ బెయిర్‌స్టో ఆపదలో ఉన్నాడు. అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ద నేపథ్యంలో కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకుని, బిక్కుబిక్కుమంటున్నాడు. బెయిర్‌స్టో కొద్ది రోజుల కిందట కుటుంబంతో కలిసి దుబాయ్ పర్యటనకు వెళ్లాడు. వారు తిరిగి స్వదేశానికి బయల్దేరాల్సిన సమయంలో మధ్యప్రాచ్యంలో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో దుబాయ్ విమానాశ్రయం సహా మధ్యప్రాచ్యంలోని అన్ని విమానాశ్రయాలు మూసివేయబడ్డాయి. ఎక్కడి వారు అక్కడే బిక్కుబిక్కుమంటూ కలం వెల్లదీస్తున్నారు.For those writing that I’m with the England Lions team… I am not. I am with my young family in Dubai…sure the England Lions security staff will be doing all they can to get them out of Abu Dhabi but I am trying to keep my family safe and get us out of here!!— Jonny Bairstow (@jbairstow21) March 2, 2026ముందుగా బెయిర్‌స్టో అబుదాబీలో పర్యటిస్తున్న ఇంగ్లండ్ లయన్స్ బృందంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని బెయిర్‌స్టో స్వయంగా స్పష్టం చేశాడు. తాను కుటుంబంతో సహా దుబాయ్‌లో చిక్కుకున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించాడు.ఇంగ్లండ్ లయన్స్‌ను భద్రతా సిబ్బంది అబుదాబి నుండి బయటకు తీసుకురావడానికి చేయగలిగినదంతా చేస్తుందని అనుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకొని, ఇక్కడి నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కాగా, మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఈ యుద్ధం కారణంగా అబుదాబీలో జరగాల్సిన పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ వన్డే సిరీస్ రద్దైంది. ఇక్కడే ఏర్పాటు చేసిన ఇంగ్లండ్ మహిళల జట్టు శిక్షణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. త్వరలో దుబాయ్, అబుదాబీ వేదికలుగా ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కూడా సందిగ్దంలో పడింది. మరోవైపు సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కూడా దుబాయ్ విమానాశ్రయం మూసివేయడంతో డర్బన్‌లోనే ఇరుక్కుపోయింది. -
మిసైల్ బ్లాస్ట్ లైవ్ వీడియో.. దెబ్బకు ఎగిరిపడ్డ మహిళ
-
ఇరాన్ విధ్వంసం.. దుబాయ్ అతలాకుతలం
-
దుబాయ్‌పై దాడులు.. బుర్జ్ ఖలీఫాకు ఇన్సూరెన్స్ ఉందా?
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరాయి. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల నేపథ్యంలో (#IranWar) దుబాయ్ (Dubai) సహా యూఏఈలోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ప్రధానంగా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నప్పటికీ, పౌర ప్రాంతాలపైనా ప్రభావం పడుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) వద్ద అత్యవసర చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల రీత్యా టవర్‌ను ఖాళీ చేయించారు. ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు బుర్జ్ ఖలీఫా సమీపంగా వచ్చినప్పటికీ భవనం నేరుగా దెబ్బతినలేదని తెలుస్తోంది.బుర్జ్ ఖలీఫాకు బీమా ఉందా?ప్రస్తుతం జనంలో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న ఇదే. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులను ఆకర్షించే ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం వెనుక బలమైన బీమా వ్యవస్థ ఉందని తెలుస్తోంది.బుర్జ్ ఖలీఫా డెవలపర్ అయిన ఎమ్మార్ ప్రాపర్టీస్ కోసం సమగ్ర ‘ఆల్ రిస్క్’ ప్రాపర్టీ పాలసీని రూపొందించారు. ఈ కోర్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్‌ను ఓమన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేయగా, ప్రధాన రీఇన్సూరెర్గా మ్యూనిచ్ రీ వ్యవహరించినట్లు సమాచారం.ఈ పాలసీ ద్వారా సుమారు 1.5 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు (సుమారు రూ. 13,722 కోట్లు) నిర్మాణ వ్యయాన్ని కవర్ చేసినట్లు తెలుస్తోంది. భవనం యాజమాన్యానికి ఇది వర్తించగా, టవర్లోని అపార్ట్మెంట్లు, హోటల్ ఇంటీరియర్స్, కార్యాలయాలు వంటి వాటికి ఆయా యజమానులు వేర్వేరుగా బీమా తీసుకుంటారు.యుద్ధ ప్రమాదాలకు వర్తిస్తుందా? దుబాయ్‌లోని ఎమ్మార్ యాజమాన్యంలోని ప్రధాన ఆస్తులు సాధారణంగా రాజకీయ హింస, ఉగ్రవాదం, అల్లర్లు, పౌర గందరగోళం, దండయాత్ర, శత్రుత్వం (యుద్ధం ప్రకటించినా, లేకపోయినా), అంతర్యుద్ధం వంటి ప్రమాదాలకు బీమా రక్షణ కలిగి ఉంటాయని బీమా వర్గాల సమాచారం.అయితే పూర్తి స్థాయి యుద్ధ పరిస్థితులు చాలాసార్లు పాలసీల్లో మినహాయింపులుగా ఉండే అవకాశముంది. క్షిపణి దాడి వంటి ఘటనలు ‘ఉగ్రవాదం’ లేదా ‘రాజకీయ హింస’ కింద పరిగణిస్తారా? లేక ‘యుద్ధ ప్రమాదం’ కింద వస్తాయా? అనేది పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.బుర్జ్ ఖలీఫా నిర్మాణ వ్యయం సుమారు 1.4 నుంచి 1.5 బిలియన్ డాలర్లుగా అంచనా. ప్రస్తుత కాలంలో ఆ ఖర్చు 3.5 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ.32 వేల కోట్లు) ఉండవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు, ఈ టవర్ ఆధారంగా అభివృద్ధి చెందిన డౌన్‌టౌన్ దుబాయ్ ప్రాజెక్ట్ మొత్తం విలువ 20 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: ఆ యుద్ధం అందుకే.. కియోసాకి సంచలన ట్వీట్ -
అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఆరామ్‌కోపై ఇరాన్ బీభత్సం
రియాద్: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ డ్రోన్లు సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై విరుచుకుపడ్డాయి. తస్ తనారాలోని ఆరామ్కో ఆయిల్ రిఫైనరీని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు భారీ నష్టాన్ని మిగిల్చాయి.డ్రోన్లతో జరిగిన ఈ దాడుల కారణంగా రోజుకు సుమారు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. గల్ఫ్ ప్రాంతానికి ప్రధాన ఆదాయ మూలమైన ఆయిల్ సరఫరా తాత్కాలికంగా దెబ్బతింది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇరాన్ ఈ దాడులతో గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. సౌదీ–ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని, ఈ పరిణామం గల్ఫ్ ప్రాంత భద్రతా పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
టెన్షన్ టెన్షన్.. దుబాయ్ లో ఎమర్జెన్సీ..
-
అక్కడ దాడులు.. ఇక్కడ గుబులు
జగిత్యాలక్రైం: గల్ఫ్ దేశాలైన ఖతర్, బహ్రెయిన్, దుబాయ్, అబుదాబిలోని అమెరికా సైనిక స్థావరా లే టార్గెట్‌గా ఇరాన్ శనివారం మిసైల్ రాకెట్లతో మెరుపుదాడులు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఉమ్మడి కరీంనగర్ నుంచి వలసవెళ్లిన సుమారు రెండులక్షల మంది భయం గుప్పిట్లో వణుకుతున్నారు. అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమై కార్మి కులను క్యాంప్ కార్యాలయాలకు తరలించాయి. ఖతర్‌లో 15 నిమిషాలకోసారి బాంబుల వర్షం కురుస్తున్నట్లు అక్కడి నుంచి కార్మికులు చెబుతున్నారు. బహ్రెయిన్లోనూ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి దాడులు జరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలను అప్రమత్తం చేసి పనులు నిలిపివేసి కార్మికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దుబాయ్‌లోని మరీన వద్ద మిసైల్ దా డిని అక్కడి ప్రభుత్వం అడ్డుకుని గాలిలోనే పేల్చేసింది. పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వలసవెళ్లిన వారి ఇక్కడి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. దాడుల నేపథ్యంలో ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. విమానాశ్రయాల మూసివేతఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్దేశాలు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచే విమానాశ్రయాలు మూసివేశాయి. ఖతర్, బహ్రెయిన్‌లోని ప్రధాన ఎయిర్‌పోర్టులను మూసివేయడంతోపాటు, విమాన రాకపోకలను రద్దు చేశారు.మెరుపుదాడులు చేస్తున్నారుదోహఖతర్లో వైమానిక స్థా వరాలను టార్గెట్‌గా చేసుకు ని ఇరాన్ శనివారం మధ్యాహ్నం నుంచి మెరుపుదాడులు చేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వం అప్రమత్తమై కార్మికులందరినీ పనులు రద్దు చేసి క్యాంప్‌లకు తరలించింది. మెరుపుదాడులతో తెలంగాణ కార్మికులంతా భయంభయంగా గడుపుతున్నాం. – జీవన్‌రెడ్డి, దోహఖతర్విమానాశ్రయాలు మూసివేశారుదుబాయ్లో ఇరాన్ దాడులు చేస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం కొన్ని క్షిపణిలను గాలిలోనే పేల్చివేసింది. మరికొన్ని క్షిపణిలు పేలడంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. దుబాయ్‌లోని ప్రధాన విమానాశ్రయాలను ప్రభుత్వం ముందస్తుగా మూసివేసింది. – ముకేశ్, దుబాయ్కార్మికుల్లో ఆందోళనదాడులు జరుగుతుండడంతో తెలంగాణ కార్మికులమంతా ఆందోళన చెందుతున్నాం. ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వం ధీటుగా క్షిపణులను గాలిలో పేల్చేస్తూ ప్రమాదం జరగకుండా చర్యలు చేపడుతోంది. – గంగాధర్, దుబాయ్ -
‘ప్రాణభయంతో పరుగులు’.. వణుకుతూ వివరించిన ‘ఏంజెల్’
దుబాయ్: ‘అది ఒక పీడకల.. కళ్లముందే క్షిపణులు పేలుతుంటే ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో బేస్మెంట్కు పరుగులు తీశాం’ అంటూ బ్రిటన్ పర్యాటకురాలు జేడ్ ఏంజెల్ బీన్స్ తన భయానక అనుభవాన్ని వివరించారు. దుబాయ్‌లోని విలాసవంతమైన 'రిక్సోస్ ది పామ్' హోటల్లో బస చేస్తున్న ఆమెకు ఆదివారం ఉదయం వినిపించిన సైరన్ల మోత దడపుట్టించింది. వరుస పేలుళ్ల ధాటికి హోటల్ గదులు కంపించాయని, తోటి పర్యాటకులు భయంతో వాంతులు చేసుకోవడం, స్పృహ తప్పి పడిపోవడం లాంటి దృశ్యాలు అక్కడ కనిపించాయని ఆమె కన్నీటి పర్యంతమవుతూ మీడియాకు తెలిపారు.ఇరాన్ క్షిపణుల దాడులతో పర్యాటక స్వర్గధామం దుబాయ్ ఒక్కసారిగా వణికిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు ప్రతిగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను గాలిలోనే అడ్డుకుంటున్న తరుణంలో సంభవిస్తున్న భారీ పేలుళ్లతో నగరం దద్దరిల్లిపోతోంది. అత్యంత సురక్షితమైన ప్రాంతాలుగా భావించే ఫైవ్ స్టార్ హోటళ్లు సైతం ఈ దాడుల ప్రభావానికి లోనవడంతో వేలాది మంది పర్యాటకులు హోటల్ బేస్మెంట్లలో తలదాచుకోవాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.దుబాయ్‌లోని మానవ నిర్మిత ద్వీపం ‘పామ్ జుమేరా’లో యుద్ధ భీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న ప్రఖ్యాత ‘ఫెయిర్మాంట్ ది పామ్’ హోటల్ క్షిపణి తాకిడికి గురికాగా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘బుర్జ్ అల్ అరబ్’ సమీపంలో డ్రోన్ శిథిలాలు పడి అగ్నిప్రమాదం సంభవించింది. బిల్లింగ్హేకు చెందిన మిక్ బ్రోమెల్ అనే మరో పర్యాటకుడు మాట్లాడుతూ.. తాము ఉంటున్న హోటల్ వెనుక భాగంలోనే క్షిపణులు పేలడం చూశామని, ఇది ఏదో యుద్ధ సినిమా చూస్తున్నట్లుగా ఉందని, ప్రాణాలతో స్వదేశానికి చేరుకుంటే చాలని అనుకుంటున్నామన్నారు.ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్, టెల్ అవీవ్, దోహా తదితర నగరాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే తమ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేస్తూ.. అత్యవసరమైతే తప్ప యూఏఈ, కతార్, కువైట్ వంటి దేశాలకు వెళ్లవద్దని సూచించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ అస్థిరతతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, ప్రపంచ దేశాలు ఈ యుద్ధ పరిణామాలను ఆందోళనతో గమనిస్తున్నాయి.ఇది కూడా చదవండి: ‘మమ్మల్ని కెలకొద్దు’.. లెబనాన్ ప్రధాని సీరియస్ వార్నింగ్! -
ఉపగ్రహ చిత్రాల్లో దుబాయ్ నగరంపై కమ్ముకున్న నల్ల పొగలు
ఉపగ్రహ చిత్రాల్లో దుబాయ్ నగరంపై నల్ల పొగలు కమ్ముకున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఫిబ్రవరి 24న తీసిన ఈ చిత్రాల్లో మెరిసే టవర్లు, క్రమబద్ధమైన హైవేలు, కృత్రిమ దీవులు కనిపించాయి. మార్చి 1న తీసిన తాజా చిత్రాల్లో నగరంలోని కొన్ని ప్రాంతాలపై దట్టమైన పొగలు ఎగసిపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. వందలాది డ్రోన్లు, క్షిపణులను గల్ఫ్ దేశాలపై ప్రయోగించింది. ఎక్కువ భాగం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నప్పటికీ, మిగిలిన శకలాలు దుబాయ్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో నష్టం కలిగించాయి. బుర్జ్ అల్ అరబ్ లగ్జరీ హోటల్ పరిసరాలు, పామ్ జుమైరా ప్రాంతంలో నష్టం జరిగినట్లు నివాసులు తెలిపారు. రాత్రి వేళల్లో పేలుళ్లతో మెలకువ వచ్చిందని, ఆకాశంలో ఇంటర్‌సెప్టర్ క్షిపణులు దూసుకెళ్లినట్లు వారు వివరించారు. దుబాయ్ మీడియా కార్యాలయం పాత అగ్నిప్రమాదాల వీడియోలను సోషల్ మీడియాలో పంచుతున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. UAE మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ప్రైవేట్ రంగానికి మంగళవారం వరకు రిమోట్ వర్క్ సూచించింది. ఇరాన్, ఇజ్రాయెల్‌పై నిరంతర దాడులు చేస్తుందని ప్రకటించింది. అమెరికా సైన్యం ప్రకారం, ఇప్పటివరకు మూడు అమెరికా సైనికులు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. తెహ్రాన్‌లో ప్రభుత్వ భవనాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ అధికారుల ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో 200 మందికి పైగా మరణించారు.దక్షిణ ఇరాన్లో ఒక బాలికల పాఠశాలపై దాడి జరగగా, 165 మంది మరణించినట్లు IRNA వార్తా సంస్థ తెలిపింది. మధ్యప్రాచ్యంలో శాంతి, భద్రతకు ప్రతీకగా భావించబడిన దుబాయ్ ఇప్పుడు యుద్ధ ప్రభావంతో తీవ్ర ఆందోళనలో ఉంది. అమెరికా భారీ దాడి.. IRGC ప్రధాన కార్యాలయం ధ్వంసంThe Iranian Islamic Revolutionary Guard Corps (IRGC) killed more than 1,000 Americans over the past 47 years. Yesterday, a large-scale U.S. strike cut off the head of the snake. America has the most powerful military on earth, and the IRGC no longer has a headquarters. pic.twitter.com/WdpN7JBECr— U.S. Central Command (@CENTCOM) March 1, 2026వాషింగ్టన్: అమెరికా సైన్యం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) పై భారీ దాడి జరిపి వారి ప్రధాన కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసిందని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. గత 47 ఏళ్లలో IRGC 1,000 మందికి పైగా అమెరికన్లను హతమార్చిందని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. IRGC ఇకపై ప్రధాన కార్యాలయం లేకుండా పోయిందని పేర్కొన్నారు. -
భయం భయంగా ఉంది.. దుబాయ్ లో తాజా పరిస్థితిపై PV సింధు వీడియో
-
దుబాయ్ లో హైటెన్షన్ బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ దాడి
-
నాడు కట్టుబట్టలతో ప్రయాణం: నేడు దుబాయ్‌లో వేలమందికి ఉద్యోగం!
సాధించాలనే తపన, కష్టపడే మనస్తత్వం ఉంటే ఎవరైనా సక్సెస్ అవ్వొచ్చు. దీనికి నిదర్శనమే 'కున్హు మొహమ్మద్'. కేరళ నుంచి కేవలం కట్టుకున్న బట్టలతో దుబాయ్ చేరిన ఈయన, సొంతంగా కంపెనీ స్థాపించి.. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. నేడు ఎందోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈయన గురించి, ఈయన సాధించిన సక్సెస్ గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.కేరళకు చెందిన కున్హు మొహమ్మద్ 22 సంవత్సరాల వయసులో.. ఉన్న ఊరును వదిలి, కట్టుబట్టలతో దుబాయ్ వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఖ్వాజా మొయిదీన్ అనే చెక్క పడవపై సముద్రంలో.. కొంతమందితో కలిసి 40 రోజులు ప్రయాణం చేసి, ఒమన్‌లోని దిబ్బా అల్ బయా సమీపానికి చేరుకున్నారు. తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు చూసారు. అయితే దేవుడిపై భారం వేసి ప్రయాణం కొనసాగించారు.మొదటి జీతందిబ్బా అల్ బయా నుంచి ఒమన్ సరిహద్దుకు చేరుకోవడానికి తోటి ప్రయాణికులతో కలిసి గంటల తరబడి నడిచారు. ఆ తరువాత పుచ్చకాయలను తీసుకెళ్తున్న ట్రక్కులో ప్రయాణం చేసి షార్జాకు చేరుకున్నారు. కున్హు మొహమ్మద్ అక్కడే ఒక ప్లంబర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. అయితే అతని చేతులు చెమటలు పట్టడం వల్ల.. పనిముట్లను పట్టుకోలేకపోయారు. దీంతో కున్హు ఆ పనిచేయలేకపోయారు. అయితే అప్పటికే అక్కడ 20 రోజులు పనిచేయడం వల్ల 100 రియాల్ పొందారు. ఇదే అతని మొదటి జీతం.ఆ తరువాత కున్హు మొహమ్మద్.. ఆవులకు పాలు పితకడం, పాత్రలు శుభ్రం చేయడం, చేపల బుట్టలు తయారు చేయడం వంటి ఇతర ఉద్యోగాలను ప్రయత్నించారు. ఒకసారి.. తాను పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు, యజమాని కారు మురికిగా ఉండటం చూసి దానిని కడిగి, పాలిష్ చేసి, లోపల బుఖూర్ (ధూపం) వేసాను. తాను చేసిన పనికి యజమాని తన జీతం 100 ఖతార్ దుబాయ్ రియాల్స్ పెంచారు.రస్ అల్-ఖైమా పాలకుడి పరిచయంకున్హు మొహమ్మద్ స్నేహితుడు ఒకరు.. అప్పటి యుఎఇ నగరమైన రస్ అల్-ఖైమా పాలకుడు షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమికి పరిచయం చేసారు. ఇదే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత అతను షేక్ ఇంట్లో డ్రైవర్ అయ్యాడు, అక్కడే అతను నాలుగు సంవత్సరాలు పనిచేశాడు. యజమాని అతన్ని గౌరవంగా చూసుకున్నారు. యజమాని నుంచే.. నమ్మకం & బాధ్యత విలువను మొహమ్మద్ నేర్చుకున్నారు. అదే ఆ తరువాత వ్యాపారం చేయడానికి మార్గమైంది.1700 మందికి ఉపాధి1972లో కున్హు మొహమ్మద్ జలీల్ ట్రేడర్స్ కంపెనీ ప్రారంభించారు. తరువాత దానికి జలీల్ హోల్డింగ్స్ అని పేరు మార్చారు. ఈ కంపెనీ అభివృద్ధికి షేక్ సఖ్ర్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎంతో సహకరించారని ఆయన పేర్కొన్నారు. ఒక సాధారణ ఆహార పదార్థాల వ్యాపార సంస్థగా మొదలైన కంపెనీ.. ఆ తరువాత తాజా ఉత్పత్తులు & FMCG పంపిణీని నిర్వహించే కంపెనీకి అవతరించింది. ప్రస్తుతం కున్హు మొహమ్మద్ సారథ్యంలోని కంపెనీలో సుమారు 1,700 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈయన ఎంత ఎదిగిపోయారు అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: అందుకేనా.. హైవేపై గ్రీన్ కలర్ బోర్డులు! -
దుబాయ్ లో బాంబుల వర్షం.. బుర్జ్ ఖలీఫా మీదుగా ఇరాన్ మిస్సైల్స్
-
దుబాయ్ లో డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్ మిస్సైల్స్
-
దుబాయ్ లో తాజా పరిణామాలపై పీవీ సింధు వీడియో విడుదల
-
మంచు విష్ణుకు దుబాయ్‌లో మిస్సైల్ పేలుడు అనుభవం
దుబాయ్‌లో కుటుంబంతో ఉన్న హీరో మంచు విష్ణు తాజాగా జరిగిన మిస్సైల్ పేలుడు సమయంలో తన ఇల్లు కంపించిందని, ఆ క్షణం తీవ్ర భయానకంగా అనిపించిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. In Dubai visiting family tonight. Missiles visible in the sky. The loud interceptions shook our home and frightened little Ayra.Praying for peace. No child anywhere should grow up hearing the sound of war above their roof.Grateful to the UAE defense forces for keeping… pic.twitter.com/tCbE78eoBY— Vishnu Manchu (@iVishnuManchu) February 28, 2026మిస్సైల్ పేలుడు కారణంగా మా ఇల్లు షేక్ కావడం వల్ల మేము తీవ్రంగా భయపడ్డాం. శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. ఏ బిడ్డ కూడా తమ ఇళ్ల పైకప్పు పైన యుద్ధ శబ్దం విని పెరగకూడదు. పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యుఎఇ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు జీవితం ఎంత దుర్బలమైనదో గుర్తు చేస్తాయి. శక్తి, శాంతి కోసం ప్రార్థిస్తున్నాము. హర్ హర్ మహాదేవ్ అంటూ మంచు విష్ణు తన ట్వీట్‌ను ముగించారు. యుద్ధ పరిస్థితుల్లో సాధారణ ప్రజలు ఎదుర్కొనే భయాన్ని ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి. -
దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం
-
రూ. 3 లక్షల బంగారం కొంటే.. కోట్ల గోల్డ్ మెర్సిడెస్ వచ్చింది!
షాపింగ్ మాల్స్‌లో షాపింగ్ చేయడం, కూపన్స్ నింపడం, బంపర్ డ్రాలు కోసం ఎదురు చూడటం మనలో చాలామందికి అలవాటే. కానీ అదృష్టం వరించేది చాలా తక్కువ మందికే. కానీ కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి లక్షల్లో పెట్టుబడి పెట్టి 50రెట్ల లాభంతో గోల్డ్ లగ్జరీ మెర్సిడెస్ కారు దక్కించుకున్నాడు. ఎవరా లక్కీ ఫెలో? ఏమా కథ?ప్రతీ వేసవిలో దుబాయ్ 'షాప్ & విన్' (Shop & Win) ప్రమోషన్లు , షాపింగ్ ఫెస్టివల్స్ సర్వ సాధారణం. కానీ దుబాయ్‌లోని కాల్ సెంటర్లో పనిచేస్తున్న శ్రీలంక వాసి సుమిత్ అనే వ్యక్తి తనకు లగ్జరీ కారు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం సుమిత్ 15 వేల దీనార్లతో( సుమారు రూ.3 లక్షల 70వేల) బంగారు బిస్కెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లడం అదే తొలిసారి కూడా. కట్ చేస్తే ఈ పెట్టుబడి కంటే 50 రెట్లు ఎక్కువ విలువైన బహుమతి వరించింది.ఈ విషయాన్నిఇంకా నమ్మలేక పోతున్నాను అంటూ సంతోషంగా ఉబ్బితబ్బిబ్బవు తున్నాడు సుమిత్. View this post on Instagram A post shared by Dubai Gold District (@dubaigolddistrict)కారుతో సరదాగా ఫోటో కట్ చేస్తే20ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న సుమిత్ దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో పెట్టుబడిగా బంగారు బిస్కెట్‌ను కొనుగోలు చేశారు. ఖర్చు చేసిన ప్రతి 500 దిర్హామ్‌లకు ఒక వోచర్‌ను అందించే 'స్పెండ్ అండ్ విన్' ప్రచారం కింద అతనికి రాఫిల్ కూపన్లు 30 వచ్చాయి. డిసెంబర్ 11 - ఫిబ్రవరి 8 వరకు జరిగిన దుబాయ్ గోల్డ్ డిస్ట్రిక్ట్ 'షాప్ & విన్' ప్రచారంలో అతడిని అదృష్టం వరించింది. గోల్డ్ బిస్కట్లను కొనుగోలు చేసిన అక్కడున్న కారుతో సుమిత్ సరదాగా ఫోటో తీసుకున్నాడు. కానీ అదే కారు గెలుచుకుంటానని మాత్రం అస్సలు ఊహించలేదు. సర్ప్రైజ్ చేసిన కాల్ఒకరోజు నైట్ డ్యూటీనుంచి ఉదయం సుమిత్ ఇంటికొచ్చి నిద్రకు పక్రమించాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితాన్నిఊహించని మలుపు తిప్పిన ఫోన్ కాల్ వచ్చింది. మెయిల్ చెక్ చేసుకోండి అని చెప్పారు. చెక్ చేశాక తన కళ్లను తానే నమ్మలేక పోయాడు. వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే ఆనందంలో మునిగి పోయాడు. చాలామంది ఆ కారు అమ్మేసి డబ్బులు వాడుకోవాలని సూచించారు. కానీ సుమిత్ మాత్రం తనకు ఆ కారు కావాలనే తన నిర్ణయాన్ని స్పష్టం చేశాడు. రెండు దశాబ్దాల తరువాత తనకు దేవుడిచ్చిన వరం అంటూ ఆనందాన్ని ప్రకటించాడు. (తొమ్మిదేళ్లకు గుర్తొచ్చి గొల్లుమన్న భార్య, మరి భర్త పరిస్థితి ఏంటో?) -
దుబాయ్ లో రోబో పోలీస్
-
ఆరు నెలల్లో 12 కిలోలు బరువు తగ్గిన మహిళ..!
బరువు తగ్గడం అంత ఈజీ కాకపోయినా..అసాధ్యం మాత్రం కాదు. అదనపు బరువుని తగ్గించుకోవడానికి ఇక్కడొక మహిళ అనుసరించిన విధానం..అందర్నీ కదిలిస్తోంది, ప్రేరేపిస్తోంది కూడా. కేవలం ఆరు నెలల్లోనే మంచి ఫలితాన్ని అందుకుంది. పైగా అందుకోసం ఆమె ఎంతలా కష్టపడిందో తెలిస్తే..విస్తుపోతారు. మంచి శీరారకృతి, ఆరోగ్యకరమైన బరువు కోసం ఆ మాత్రం డెడికేషన్ ఉండాల్సిందే మరి. ఇక్కడ ఈ మహిళ బరువు తగ్గడం కోసం ఏం అనుసరించిందంటే..దుబాయ్‌కి చెందిన షెర్రీ పీటర్ అనే మహిళ తాను ఆరు నెలల్లో 12 కిలోలుకు పైగా బరువు తగ్గానని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొంది. అంతేగాదు ఆగస్టు 2025 vs ఫిబ్రవరి 2026 కల్లా 12 కిలోలు తగ్గి..స్లిమ్‌గా మారాను అని పోస్ట్‌లో తెలిపింది. మంచి శరీరాకృతి కోసం అనుసరించిన వెయిట్‌లాస్ వ్యూహం గురించి పేర్కొన్నారామె.ప్రతిరోజూ పదివేల అడుగులురోజువారీగా పదివేల అడుగుల వాకింగ్. ఇది బరువు తగ్గడానికి ఒక ప్రభావవంతమైన వ్యూహం. దీనివల్ల రోజుకు దాదాపు 300–500 అదనపు కేలరీలను బర్న్ చేస్తుంది. తాను దీన్ని ఒక ఏడాది నుంచి పాటిస్తున్నానని చెప్పారు. జిమ్‌కి వెళ్లడానికంటే మందు నుంచి ప్రారంభించానని చెప్పారు. వారంలో నాలుగు రోజులు..బరువులు ఎత్తడం, పైలేట్స్ వెయిట్ లిఫ్టింగ్, పైలేట్స్‌ను వారానికి నాలుగు నుంచి ఐదు రోజులు కేటాయించానని తెలిపింది. వాటిలో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ జీవక్రియను పెంచగా, పైలేట్స్ కోర్ బలాన్ని పెంపొందిస్తాయి. ఎమ్స్కల్ప్ట్ నియో వారానికి రెండుసార్లుఎమ్స్కల్ప్ట్ నియో అనే మిషన్ సాయంంతో శరీర ఆకృతి చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఏకకాలంలో కొవ్వును కరిగింఇచ 30 నిమిషాల సెషన్లలో కండరాలను నిర్మిస్తుంది. ఇది ఉదరం, పిరుదులు, చేతులు, తొడలపై ప్రభావవంతంగా ఉంటుంది.ఆహారంసమర్థవంతమైన బరువు తగ్గడంలో అధిక ఫైబర్, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి సారించడం అత్యంత కీలకం. అలాగే హైడ్రేటెడ్‌గా ఉంటూనే చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ వినియోగాన్ని కూడా పరిమితం చేయాలి. అదనంగా తినాలనిపించినప్పుడల్లా.. తీసుకున్న గ్రీన్ టీ కాస్త భావోద్వేగ మద్దతుగా మారిందని షెర్రీ చెప్పింది.మద్యం మానేయడంక్యాలరీ తీసుకోవడం తగ్గించడానికి ఆల్కహాల్ తగ్గించడం అనేది చాలా ప్రభావవంతమైన మార్గం. సాధారణంగా ప్రతి పెగ్ ఆల్కహాల్ వంద కేలరీనలు పెంచుతుంది. అందుకే పూర్తిగా మానేసి పైలేట్స్, జిమ్, వాకింగ్లపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారామె.సింపుల్‌గా చెప్పాలంటే..ఎక్కువ నడవడం, తక్కువ తినడం బరువు తగ్గడానికి సరళమైన మార్గం అని అందరికీ తెలుసు. కానీ ఇలా షెర్రీ లాంటి మహిళల అనుభవపూర్వకమైన వెయిట్లస్ స్టోరీలు..ఇలాంటి వాటిని అనుసరించేలా చేయడంలో ప్రేరణటీ ఉంటాయి కదూ..!. ఇంకెందుకు ఆలస్యం ప్రయత్నించి చూడండి మరి..!.august 2025 vs february 202612kgs down and in the best shape of my life pic.twitter.com/ZLMHIIr4H3— deSherry (@Sherrypeter) February 20, 2026 (చదవండి: నాట్యమయూరి సుధా చంద్రన్ వెల్నెస్ సీక్రెట్..! ఆయిల్ మసాజ్‌లు, ఇంట్లో తయారు చేసే..) -
పార్టీ టైమ్
అల్లు శిరీష్ – నయనికల వివాహం మార్చి 6న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఇటీవలే ఫ్రెండ్స్‌తో కలిసి దుబాయ్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు అల్లు శిరీష్.సోదరుడి వివాహం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల కోసం అల్లు అర్జున్ తన నివాసంలో ఓ గ్రాండ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి రామ్‌చరణ్ దంపతులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. -
సెలబ్రిటీల కళ్లు, ఇళ్లు అక్కడే.. ఎందుకంటే...
అత్యధికశాతం మంది భారతీయులకు నచ్చే టూరిస్ట్ డెస్టినేషన్ కావచ్చేమో కానీ గత కొన్నేళ్లుగా దుబాయ్ భారతీయ సినీ సెలబ్రిటీలకు పెట్టుబడులకు కేంద్రంగా కూడా మారింది. ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖ నటులు దుబాయ్‌లో ఇళ్లు, స్థలాలు, లగ్జరీ అపార్ట్మెంట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రాపర్టీల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. కొందరైతే మరింత ముందుకెళ్లి అక్కడ స్థిరనివాసాలు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.కారణాలివే...అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు, భద్రత, విలాసవంతమైన జీవనశైలి, అలాగే గ్లోబల్ బిజినెస్ అవకాశాలు సెలబ్రిటీలను దుబాయ్ వైపు ఆకర్షిస్తున్న ప్రధాన కారణాలు. అంతేకాకుండా, సినిమా షూటింగ్‌లకు బాగా అనుకూలమైన లొకేషన్లు, వరల్డ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ వేదికలు కూడా దుబాయ్‌ను ఫేవరెట్ డెస్టినేషన్ గా మార్చాయి. ఇటీవలే దుబాయ్‌లో స్టూడియో సిటీ పేరుతో ఒక అత్యాధునిక షూటింగ్ వేదికను కూడా ఏర్పాటు చేశారు. గత కొంత కాలంగా సినిమా అవార్డుల వేడుకలు దుబాయ్‌లో విజయవంతంగా నిర్వహిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తుండడం వల్ల ఎంటర్టైన్ మెంట్ షోలు, మూవీ ప్రమోషన్లు నిర్వహించడానికి దుబాయ్ అనువైన వేదికగా మారింది. అది సెలబ్రిటీలకు మరో ప్లస్ పాయింట్‌గా మారింది. అంతేకాక ప్రపంచంలోని అనేక దేశాలకు కేవలం 8 గంటల్లోనే దుబాయ్ నుంచి రాకపోకలు సాగించవచ్చు కూడా. నాణ్యమైన విద్యను అందించే ఇంటర్నేషనల్ స్కూల్స్, అత్యాధునిక వైద్య వసతులు, విలాసవంతమైన లైఫ్ స్టైల్...వంటివన్నీ ఆకర్షణలే.పన్ను తక్కువ భధ్రత ఎక్కువ...దుబాయ్‌లోని పన్నుల వ్యవస్థే అత్యంత ప్రధాన ఆకర్షణ అనేది విశ్లేషకుల మాట. అక్కడి వారు వ్యక్తిగత పన్నును చెల్లించనక్కర్లేదు. అలాగే అధిక సంపదపై విధించే పన్ను లేదా వారసులకు ఆస్తుల బదిలీపై పన్ను బెడద కూడా ఉండదు. కార్పొరేట్ కంపెనీల లాభాలపై.. అదీ ఓ మోస్తరుగా పన్ను కడితే సరిపోతుంది. ఫలితంగా అక్కడ చిన్న, మధ్య స్థాయి వాణిజ్య వ్యాపారాల ఎదుగుదలకు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటున్నారు. రాజకీయ సుస్థిరత, నేరాల శాతం తక్కువగా ఉండటం, వంటి వాటి వల్ల సెలబ్రిటీలు తమ కుటుంబాలతో సహా దుబాయ్‌కు మకాం మారుస్తున్నారు. దుబాయ్‌లో అనుమతి లేకుండా అవతలి వారి ఫొటోలు తీయడం నిషిద్ధం. విలేకరుల హడావుడి కూడా ఉండదు. ఇలా ప్రైవెసీని కాపాడేలా కట్టుదిట్టమైన చట్టాలు, భద్రత కూడా సెలబ్రిటీలను దుబాయ్‌కి రా రమ్మంటున్నాయ్. బాలీవుడ్ పాగా...ఈ నేపధ్యంలో దుబాయ్‌లో పలువురు బాలీవుడ్ నటులు పాగా వేస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్‌కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశంగా పేరొందిన దుబాయ్‌లోని పామ్ జుమైరా ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ఉంది. ఇది అక్కడి ఆయన అభిమానులకు ఓ ప్రత్యేక ఆకర్షణగా కూడా. ఇదే ప్రదేశంలో మన దేశానికి చెందిన వ్యాపార ప్రముఖులు అంబానీ కుటుంబీకులకు కూడా నివాసాలు ఉన్నాయి. అలాగే సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి నటులు కూడా దుబాయ్‌లో ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయ ప్రముఖులతో పాటు భారత్‌కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు యూఏఈకి ఇప్పటికే మకాం మార్చారు. స్విమ్మింగ్‌లో రాణిస్తున్న తన తనయుడి కెరీర్ కోసం అని చెబుతూ ప్రముఖ నటుడు మాధవన్ తన కుటుంబంతో సహా దుబాయ్‌కు అడ్రెస్ మార్చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా కూడా విడాకుల అనంతరం దుబాయ్‌లోనే నివసిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ భార్య తమ పిల్లల చదువుల కోసం దుబాయ్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు. పాప్ స్టార్ యో యో హనీ సింగ్, నటి రాఖీ సావంత్ కూడా దుబాయ్‌లోనే సెటిలైపోయారు. కార్ రేస్‌ల గురించి తమిళ సూపర్‌స్టార్ అజిత్ తరచుగా దుబాయ్‌కు రాకపోకలు సాగిస్తున్నారు.టాలీవుడ్ నుంచి కూడా పలువురు నటులు దుబాయ్‌లో అపార్ట్మెంట్లు, హాలిడే హోమ్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ల సమయంలో ఉండేందుకు, కుటుంబంతో విహారానికి వీలుగా వీటిని ఉపయోగిస్తున్నారు. నివాసాలకే కాకుండా, కొంతమంది సెలబ్రిటీలు దుబాయ్‌లోని అభివద్ధి చెందుతున్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌లలో పెట్టుబడులు పెడుతున్నారు. పర్యాటక పరంగా దూసుకుపోతున్న ప్రాంతం కావడంతో భవిష్యత్తులో విలువ పెరిగే అవకాశాలు ఉండటంతో, సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు.వినోదానికి లోటు లేదు...ఇస్లామిక్ దేశమైనప్పటికీ మతపరమైన అంశాల్లో ఇతర మధ్య ప్రాచ్య దేశాలతో పోలిస్తే దుబాయ్ చాలా సరళమైన విధానాలను అనుసరిస్తుంది. అక్కడి ముస్లిమేతరుల కోసం దేశవ్యాప్తంగా సివిల్ పర్సనల్ స్టేటస్ చట్టం అమలులో ఉంది. అలాగే ప్రస్తుతం సెలబ్రిటీల్లో ఎక్కువ మంది అనుసరిస్తున్న లివ్–ఇన్ రిలేషన్ షిప్స్‌ను నేరంగా పరిగణించొద్దని కొంత కాలం క్రితం యూఏఈ నిర్ణయించింది. అంతేకాదు దుబాయ్‌కి సమీపంలో ఉన్న యూఏఈ లోని రస్ ఉల్ ఖైమా ప్రాంతంలో త్వరలోనే క్యాసినో కూడా రానుంది. దీంతో మరింతగా ఈ ఎడారి దేశం సెలబ్రిటీలు ఎంచుకునే రహదారిగా మారడం తధ్యంగా కనిపిస్తోంది. -
బ్రయాన్‌స్టన్‌తో బొండాడ ఇంజినీరింగ్ ఎంవోయూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హరిత విద్యుత్ ఆధారిత డేటా సెంటర్ ప్యాకేజీలను సంయుక్తంగా అభివృద్ధి చేసే దిశగా బొండాడ ఇంజినీరింగ్ (బీఈఎల్), దుబాయ్‌కి చెందిన బ్రయాన్స్టన్ రెన్యువబుల్స్ ఎఫ్‌జెడ్‌సీవో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌తో పాటు నిర్దిష్ట అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడులో 69.51 ఎండబ్ల్యూపీ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టులను జనవరిలో విజయవంతంగా వినియోగంలోకి తెచి్చనట్లు కంపెనీ తెలిపింది. పారడైమ్ ఐటీ, మహాజెన్‌కో, ఎన్ఎల్సీ ఇండియా తదితర క్లయింట్ల కోసం ఈ ప్రాజెక్టులను నిర్మించినట్లు వివరించింది. -
టెన్షన్ లేని లైఫ్ కావాలి..అందుకే భారత్‌కి వచ్చేశా..!
విదేశాలకు వెళ్లడం అక్కడే స్థిరపడటం చాలామంది డ్రీమ్. 'దూరపు కొండలు నునుపు' అన్నట్లుగా విదేశాల్లోని అక్కడి సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం రా..రమ్మని ఆకర్షిస్తుంటుంది. తీరా వెళ్లాక గానీ తెలియదు. అక్కడి సమస్యలు..పరిస్థితులు. ఇక్కడొక భారత మహిళకు కూడా అలా అనిపించే తక్షణమే భారత్‌కు కుటుంబంతో సహా వచ్చి వాలిపోయింది. ఎందువల్ల తాను ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. కానీ ఆమె చెబుతున్న మాటలు ఆలోచింపదగినవిగానూ విదేశాలకు చెక్కేద్దామనే ఔత్సాహుకులకు గొప్ప పాఠాలుగానూ ఉన్నాయి. మరి ఇంతకీ ఎందవల్ల ఇలా కుటుంబంతో సహా ఆమె భారత్‌కు వచ్చేసిందో తెలుసా..!?..లీబా సుబిన్ అనే మహిళ కుటుంబం దుబాయ్ నుంచి భారత్‌లోని తన స్వస్థలం కేరళకు వచ్చేసింది. తాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆమె కారణాన్ని వివరిస్తూ..ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా చేశానని అంటోంది. ఈ నిర్ణయాన్ని సమయా పాలన, మానసిక శాంతికి సంబంధించిన విషయంగా పేర్కొంది. అదీగాక తమ ఫ్యామిలీ వీసా రెన్యువల్, అలాగే ఇంటి అద్దె రెన్యువల్ చేయాల్సి ఉండగానే.. చకచక ఈ నిర్ణయం తీసుకుని వచ్చేసినట్లు తెలిపారు. అలాగని ఏదో హడావిడిగా తీసుకున్న నిర్ణయం అయితే కాదని, బాగా ఆలోచించి, తన భాగస్వామితో, పిల్లలతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇలా వెనక్కి వచ్చేసి కేరళలో తమ సొంతింటిలో నివశించడం వల్ల దుబాయ్‌లోని అద్దె టెన్షన్ తగ్గింది, అలాగే ఇక్కడి సమాజంలో నివశించడం వల్ల సామాజిక సంబంధాలు పునరుద్ధరింపబడతాయి. పైగా ఎలాంటి అప్పులు, ఈఎంఐల బెడద లేకుడా మానసిక ప్రశాంతతో గడపొచ్చు అని చెప్పుకొచ్చిందామె. పైగా పిల్లవాడికి కేరళలో అంతర్జాతీయ స్కూల్ ఇంటికి సమీపంలోనే ఉంది పదినిమిషాల్లో వెళ్లొచ్చు. కానీ దుబాయ్‌లో 90 నిమిషాలు ప్రయాణించాల్సి వస్తుందని జోడించారామె. బహుశా మాకు అనిపించింది..మీకు వర్కౌట్ కాకపోవచ్చు, పైగా మీరు విదేశాల్లోనే కంఫర్ట్ లైఫ్‌ని లీడ్ చేస్తుండొచ్చని, అది వారి వ్యక్తిగత విషయమని తేల్చి చెప్పింది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడూ..మొత్తం కుటుబ సభ్యులు కలసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావడం అన్ని విధాల శ్రేయస్కరం అంటూ తన పోస్ట్‌ని ముగించింది లీబా సుబిన్. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయంతో ఏకభవించారు, పైగా తిరిగి వెళ్లకూదనుకుంటున్న ఆమె నిర్ణయానికి స్వాగతం, శుభాకాంక్షలు అని పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by leeba (@unfilteredvoiceswithinme) (చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్! -
భార్య కోసం ప్రతి ఏడాది మూడు కిలోలు బంగారమా..!?
బంగారం ధరలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. రోజు రోజుకి ధరలు గుభ గుయ్యిమనేలా కొండపైకి ఎక్కి కూర్చొంటున్నాయి. సామాన్యులు కొనాలి అన్న ఆలోచనే మనసులోకి రానివ్వలేనంతగా భయపెడుతోంది దాని ధర. మరోవైపు వెండి ధర కూడా అలానే అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటే..ఇంతలా బంగారం ధర దద్దరిల్లిపోతుంటే..ఇక్కడొక వ్యక్తి భార్య కోసం ప్రతి ఏడాది ఏకంగా మూడు కిలోల బంగారం కొంటాడంట. మూడు కిలలు అంటే ఇప్పుడున్న గోల్డ్ ధరల ప్రకారం..ఎంత ఖర్చు అవుతుందో ఆలోచిస్తేనే..నోటమాటరాదు కదా..!. మరి అలాంటిది అంతలా ఎవడ్రాబాబు బంగారం కొంటుంది అంటే..భారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్, నెట్‌ఫ్లిక్స్‌లో తన రాబోయే రియాలిటీ షో 'దేశీ బ్లింగ్' ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ షో దుబాయ్‌లోని ఉన్నత వర్గ భారతీయ ప్రవాసులపైనా, వారి విలాసవంతమైన జీవనశైలిని హైలెట్ చేస్తుంది. ఈ సిరీస్‌లో నటీనటులు కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్‌తో పాటు డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ రిజ్వాన్ సజన్, అనక్స్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు సతీష్ సన్పాల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ఈ షో ధనవంతులు ఆడంబర జీవితాన్ని వారి విలాసవంతమైన వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఆ ట్రైలర్లో బారత సంతతికి చెందిన బిలియనీర్ సతీష్ సన్పాల్ భార్య తబిందా సన్పాల్ తన భర్తకు బంగారంపై ఉన్న ప్రేమను గురించి వెల్లడిస్తుంది. తన భర్త సతీష్‌కు బంగారం కొనడం అంటే చాలా ఇష్టమని, ప్రతి ఏడాది తన కోసం మూడు కొలోల బంగారం కొంటాడని పేర్కొంది. అంటే ప్రస్తుతం ధర బట్టి..కిలో బంగారం సుమారు రూ. 1.5 కోట్లు పలుకుతుంది. అంటే మూడు కిలోల బంగారం రూ. 4.5 కోట్లు పైమాటే పలుకుతుంది..!.ఎవరీ సతీష్ సన్పాల్.. ?సతీష్ సన్పాల్ భారతదేశంలో జన్మించిన అనక్స్ హోల్డింగ్ చైర్మన్. అతని కంపెనీ దుబాయ్ రియల్ ఎస్టేట్, ఆర్థిక మార్కెట్లు, హాస్పిటాలిటీ, మీడియా వంటి అనేక రంగాలలో భాగస్వామ్యం ఉంది. అతను బ్రిటిష్-పాకిస్తానీ మహిళ అయిన తబిందా సన్పాల్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇసాబెల్లా అనే ఒక ఏడాది కుమార్తె ఉంది. ఆయన గతేడాది ప్రారంభంలో తన కుమార్తెకు కస్టమ్ పింక్ రోల్స్ రాయిస్‌ను బహుమతిగా ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఇక సన్పాల్ ఒక ఇంటర్వ్యూలో తాను భారతదేశంలోని జబల్పూర్లో జన్మించానని, కేవలం రూ. 80 వేలు జేబులో పెట్టుకుని దుబాయ్‌కి వచ్చినట్లు తెలిపాడు. ఇక తబిందా కూడా అదే ఇంటర్వ్యూలో తాను ముస్లీం కావడంతో మొదట్లో తన కుటుంబం సతీష్‌ని పెళ్లి చేసుకోవడాన్ని అంగీకరించలేదని, అయితే ఆయన సాధించిన విజయం చూసి అభిప్రాయం మార్చుకుందని అంటుంది. అందుకు సతీష్ వెంటనే డబ్బు దేవుడు కాదని, అలా అని దేవుడి కంటే తక్కువ కూడా కాదని నవ్వుతూ అన్నాడు. View this post on Instagram A post shared by Luxe Life | لوكس لايف (@luxelifedubai) (చదవండి: 'భారతీయ పేరెంటింగ్'పై మ్యాట్రిమోని యాప్ సీఈవో ఫైర్..! భావోద్వేగపరంగా..) -
న్యూస్టార్ట్ చర్చలకు అమెరికా, రష్యా ఓకే
మాస్కో: ఆయుధాల నియంత్రణకు సంబంధించిన న్యూస్టార్ట్ ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని అమెరికా, రష్యాలు అంగీకారానికి వచ్చాయి. రష్యా, ఉక్రెయిన్, అమెరికా ప్రతినిధుల మధ్య యూఏఈలోని దుబాయ్‌లో జరుగుతున్న శాంతి చర్చల సమయంలో ఈ అంశం ప్రస్తావనకు వచి్చనట్లు శుక్రవారం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. అదేవిధంగా, రెండు దేశాల మిలటరీ మధ్య 2021 నుంచి నిలిచిపోయిన ప్రత్యక్ష సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయని వివరించారు. బాధ్యతాయుతమైన రెండు దేశాలు స్టార్ట్ చర్చలపై ఆసక్తితో ఉన్నాయన్నారు. అమెరికా, రష్యాల మధ్య చిట్టచివరి వ్యూహాత్మక ఆయుధాల నియంత్రణ ఒప్పందం(స్టార్ట్) గడువు గురువారంతో ముగిసిపోయింది. దీంతో, అత్యధికంగా అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు దేశాలకు ఇప్పుడు ఇక ఎటువంటి పరిమితులు లేవు. స్టార్ట్ ఒప్పందం విధించిన పరిమితులకు కట్టుబడి ఉండేందుకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల ప్రకటించగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టించుకోలేదు. చైనా కూడా ఈ ఒప్పందంలో చేరాలని పిలుపునిచ్చారు. చైనా మాత్రం ససేమిరా అంటోంది. -
అల్లు శిరీష్ బ్యాచిలర్ పార్టీ.. మరిన్ని కొత్త (ఫొటోలు)
-
దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)
-
దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)
-
అంతా రోబోటిక్ టెక్నాలజీనే..!
రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించి దుబాయ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి సారి రెసిడెన్షియల్ విల్లాను నిర్మించనున్నారు. ఎక్స్ పో సిటీలో కన్స్ట్రక్షన్స్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా దుబాయ్ మునిసిపాలిటీ ఈ ప్రాజెక్టును ప్రకటించింది. నిర్మాణపు అన్ని దశలలో రోబోట్లు ఆటోమేటెడ్ వ్యవస్థలను ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థ సహాయంతో విల్లాను నిర్మిం చడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక సంస్థలు.... మరియు నిపుణులను ఆహ్వా నించింది. -
దుబాయ్ బిలియనీర్ బంపర్ ఆఫర్..! పెళ్లికి రూ. 12 లక్షలు, పిల్లలు కంటే..
దుబాయ్ షేక్ ఇచ్చిన బంపర్ ఆఫర్ చూస్తే షాకవ్వుతారు. జస్ట్ పెళ్లి చేసుకుంటే రూ. 12 లక్షలు. పిల్లలు కంటే మరో రూ. 12 లక్షలు ఇస్తామని సోషల్ మీడియా ఎక్స్‌లో కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించారు దుబాయ్‌లోని బిలియనీర్ వ్యాపారవేత్త ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూ సోషల్ మీడియా పోస్ట్‌లో. వివాహం, కుటుంబాన్ని పోషించడం వ్యక్తిగత విషయాలు కాదని అవి సామాజిక బాధ్యతలని పిలుపునిస్తూ..తన అల్ హబ్తూర్ గ్రూప్‌లోని ఎమిరేట్ ఉద్యోగులకు ఈ ఆఫర్ అందిస్తూ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. "కుటుంబాలే బలమైన దేశానికి కీలకమని, పిల్లలు దేశ భవిష్యత్తులో పెట్టుబడి అని అన్నారు. మా ప్రభుత్వాలు యువకుల కుటుంబ జీవితాలు ప్రారంభంలో మద్దతివ్వడానికి వెనకడుగు వేయవు. అందువల్ల యుఏఈ జాతీయులు వివాహం చేసుకుని కుటుంబాన్ని పెంచుకునేలా ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరి నుంచి ఆచరణాత్మక చొరవలు కూడా అవసరంర. కుటుంబాలు నిర్మించడం అనేది ఉమ్మడి బాధ్యత అని, కుటుంబం చిన్నదైనా లేదా పెద్దదైనా సమాజం, దేశం భవిష్యత్తులో చాలా ప్రభావాన్ని చూపిస్తుంది." అని అన్నారు. కాగా, ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్టూర్ UAE వ్యాపారవేత్త, అల్ హబ్టూర్ గ్రూప్ అండ్ దుబాయ్ నేషనల్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ కంపెనీకి ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన గతంలో దుబాయ్ కమర్షియల్ బ్యాంక్ ఛైర్మన్‌గానూ, అల్ జలీలా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ ఛైర్మన్‌గా, అలాగే UAE ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశారు.గతేడాది అక్టోబర్‌లో, అల్ హబ్టూర్ యువకులను వివాహం చేసుకోవాలని కోరారు. అంతేగాదు ఆయన యువకులు 30 ఏళ్లలోపు వివాహం చేసుకునేలా ప్రోత్సహించే చట్టం కోసం ఆశిస్తుండటం గమనార్హం. వివాహం చేసుకోకుండా ఉండిపోయిన యువకులను జవాబాదారీగా ఉంచాలని కూడా అన్నారు. ఇది సమాజంలో మనుగడకు, ఐక్యతకు సంబంధించిన విషయం అని అన్నారు. కుటుంబాలే దేశానికి కీలకం అంటూ అందర్నీ ఆలోచింపచేసేలా ఆయన ఈ షేకింగ్ ఆఫర్ ఇచ్చారు.تزوّجتُ وأنا في عمر 17 عاماً، وأسّستُ مع زوجتي عائلة جميلة، أحمدُ الله على هذه النعمة في كل لحظة. منذ تلك اللحظة، أصبحت الأسرة بالنسبة لي دائماً ملاذ راحة، ومصدر سكينة، ونعمة حقيقية أستمدّ منها القوة والسعادة.ومن هذا الإيمان، أودّ أن أُشجّع شبابنا على تأسيس أسر متماسكة تكون… pic.twitter.com/ououH8gqkj— Khalaf Ahmad Al Habtoor (@KhalafAlHabtoor) January 24, 2026 (చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?) -
11 లైసెన్సులు, 75 ఏళ్లు : ఆమెకు ప్రతీ దారి ఒక పాఠం!
కుటుంబాన్ని పోషించుకునేందుకు, గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు మహిళలు ఎంతటి సాహసాని కైనా పూనుకుంటారు. క్లిష్టమైన డ్రైవర్ వృత్తిలో రాణిస్తూ 75 ఏళ్ల మహిళ శభాష్ అనిపించు కుంటోంది. ఒకపుడు డ్రైవింగ్‌ను జీవనోపాధిగా చూసేవారు, అదీ పురుషులకు మాత్రమే పరిమితమని భావించేవారు. కానీ ప్రస్తుతం ఎలాంటి లింగ భేదాలు లేకుండా డ్రైవింగ్‌ను ఒక అభిరుచిగా కొనసాగిస్తున్నారు. స్త్రీలైనా, పురుషులైనా, డ్రైవింగ్ ఒక అవసరం. కేరళకు చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు రాధామణి మరింత ప్రత్యేకం. రాధామ ఏకంగా చీరలోదుబాయ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ నడుతూ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిభకు వయసుతో పనిలేదని నిరూపిస్తూ అత్యంత నిష్ణాతులైన డ్రైవర్లలో ఒకరిగా అరుదైన ఖ్యాతిని సంపాదించింది. వాహనంఏదైనా...ఆమె చేతికి స్టీరింగ్ వచ్చిందంటే.. రయ్ రయ్‌మని దూసుకుపోవాల్సిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మందికి పైగా అనుచరులున్న మణి అమ్మ లేదా డ్రైవర్ అమ్మగా ప్రసిద్ధి చెందిన రాధామణి అమ్మ, లగ్జరీ కార్లు మ్తాత్రమే కాదు లగ్జరీ కార్లను మాత్రమే కాదు,రోడ్ రోలర్లు, క్రేన్లు, బస్సులు, JCB వంటి ఎక్స్కవేటర్లు, ట్రక్కులు, ఫోర్క్‌లిఫ్ట్‌లు ఇతర భారీ యంత్రాలతో సహా 11 వేర్వేరు డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉండటం విశేషం. విదేశాలకు డ్రైవింగ్ చేసేందుకు అవసరమైన అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌ను సాధించింది. కేరళలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. అందుకే మణి అమ్మ ‘ది డ్రైవర్ అమ్మ’గా నెటిజన్స్ అభివర్ణిస్తున్నారు. ‘‘ప్రతి దారి ఒక కొత్త పాఠం లాంటిది. ఆత్మవిశ్వాసం, శ్రద్ధ, ప్రేమ- ఇవే నా ప్రయాణానికి బలాలు. రోడ్లు ఎలా తిరిగినా సాగిపోతూనే ఉండే ధైర్యం ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు’’ మణి అమ్మకేరళలో డ్రైవింగ్ స్కూల్ బస్సు, ట్రక్ డ్రైవర్లకు శిక్షణ1978లో డ్రైవింగ్ స్కూల్ తెరవమని ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడట. 2004లో ఆమె భర్త మరణించిన తర్వాత ఇంటిని నడపడానికి ఆమె ఈ పాఠశాల బాధ్యతను చేపట్టింది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ ఎక్కడా బెదరలేదు. వెనకడుగు వేయలేదు. కేరళలో మహిళలు భారీ వాహనాలను నడపడమే గగనమైన సమయంలోనే A2Z ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్కు సహ-వ్యవస్థాపకురాలిగా, డిఫరెంట్ కరియర్‌ను ఎంచుకోవడంలో మహిళలను బాగా ప్రోత్సహించింది. రాధామణి తన ప్రయాణాన్ని నలభయ్యేళ్లకు పైగా కొనసాగించింది. తన భర్త సూచనమేరకే డ్రైవింగ్‌లోకి అడుగుపెట్టి 1981లో తన ఫోర్-వీలర్ లైసెన్స్‌ను , 1984లో తన హెవీ వెహికల్ లైసెన్స్‌ను పొందింది. డ్రైవింగ్ వృత్తిలో కొనసాగేందుకు ఆమె చేసిన పోరాటం కూడా గొప్పదే. ఈ లైసెన్సులు పొందడానికి పడ్డ కష్టాలు, ఆమె పేరు మీద కేరళలో మొట్టమొదటి హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌ను స్థాపించడానికి చట్టపరమైన పోరాటాలు కూడా అవసరమని కూడా ఆమె తన అనుభవాలను గుర్తు చేసుకుంది.ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు 70 ఏళ్ల వయసులో డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందిన మహిళగా రాధామణి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి గుర్తింపు పొందింది. 2022లో ఆమె 'ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా కూడా ఎంపికైంది. డెబ్బైల ప్రారంభంలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేయడం మరో విశేషం. సోషల్ మీడియా అంతా మహిళలు వస్త్రధారణమీద తీవ్ర చర్చ నడుపుతున్న ప్రస్తుత తరుణంలో నైపుణ్యాలకు, వృత్తికి లింగభేదం లేదని రాధామణి నిరూపించారు..నిజంగా ఏదైనా సాధించాలన్న సంకల్పం ఉంటే, అంకితభావం, నమ్మకంతో ప్రయత్నిస్తే కచ్చితంగా సాధించగలరు అంటారు ఆమె. తన దృష్టిలో నేర్చుకోవడం అనేది "ఒక శాశ్వత ప్రయాణం" అని కూడా అంటారు. View this post on Instagram A post shared by The Logical Indian (@thelogicalindian) -
యూఏఈలో అనుమతి లేకుండా ఫోటోలు తీశాడు.. కట్ చేస్తే భారీ జరిమానా
గల్ఫ్ దేశాల్లో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. చిన్నచిన్న తప్పులకు కూడా పెద్ద శిక్షలు ఉంటాయి. తాజాగా యూఏఈలోని అబుదాబి ఫ్యామిలీ, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు ఇచ్చిన తీర్పు అందరిని షాక్‌కు గురిచేసింది. ఓ వ్యక్తి ప్రైవసీకి భంగం కలిగించినందుకు కోర్టు ఏకంగా 25,000 దిర్హామ్‌లు (సుమారు రూ. 5.6 లక్షలు) జరిమానా విధించింది.ఏమి జరిగిందంటే?ఓ వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తనకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో బీజీగా ఉండగా.. మరొకరు అతడికి తెలియకుండా ఫోటోలు, వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా వాటిని తన స్నాప్‌చాట్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో సదరు వ్యక్తి తనకు ప్రైవసీకి భంగం కలిగించరాని, మనస్తాపానికి గురయ్యానని కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన అబుదాబి ఫ్యామిలీ, సివిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టు నిందితుడికి 25,000 దిర్హామ్‌లు ఫైన్ విధించింది. అదేవిధంగా నిందితుడి స్నాప్‌చాట్ అకౌంట్‌ను వెంటనే రద్దు చేయాలని, ఆరు నెలల పాటు ఇంటర్నెట్ ఉపయోగించకూడదని కోర్టు ఆదేశించింది. కాగా యూఏఈ సైబర్ సెక్యూరిటీ చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం లేదా వాటిని ప్రచారం చేయడం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించినట్లు' గా పరిగణిస్తారు. -
దుబాయ్‌లో ‘వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్’
భవిష్యత్ ప్రభుత్వాల రూపకల్పన లక్ష్యంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు దుబాయ్‌లో వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ నిర్వహించనున్నారు. వాతావరణ మార్పు, ఆరోగ్యం, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), విద్య వంటి కీలక రంగాల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం వేదికగా నిలవనుంది. ఈ సమావేశంలో నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా పాల్గొననున్నారు.ప్రపంచ స్థాయి శాస్త్రీయ సవాళ్లపై చర్చించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం, వరల్డ్ లారియేట్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ట్యూరింగ్ ప్రైజ్, వోల్ఫ్ ప్రైజ్, ఫీల్డ్స్ మెడల్ విజేతలతో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.ఈ శిఖరాగ్ర సమ్మేళనంలో 35 మందికి పైగా దేశాధినేతలు, 150 అధికారిక ప్రతినిధి బృందాలు, అలాగే సుమారు 6,000 మంది సందర్శకులు హాజరుకానున్నారు. వినూత్న పాలన విధానాల రూపకల్పనలోను, ప్రజా సంక్షేమానికి పటిష్టమైన భరోసా కల్పించడంలోను ఈ సమావేశం కీలక పాత్ర పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక సాంకేతికతలను పాలనలో ఎలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చో ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు మార్గాలు సుగమమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
దుబాయ్‌లో కొత్త కనీస వేతనం.. మారిన జీతాలు
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎమిరాటి పౌరుల కోసం కొత్త కనీస వేతనాన్ని ప్రకటించింది. 2026 జనవరి 1 నుండి, ఎమిరాటి ఉద్యోగులకు నెలకు కనీసం 6,000 యూఏఈ దిర్హామ్‌లు (సుమారు రూ.1.48 లక్షలు) ఇవ్వడం తప్పనిసరి. ఇంతకు ముందుక ఇది 5,000 దిర్హామ్‌లుగా (రూ.1.23 లక్షలు) ఉండేది.ఈ నిర్ణయం ప్రైవేట్ రంగంలో ఎమిరాటీలకు అధికారిక వేతన అంతస్తును ఏర్పరచడం ద్వారా ఉద్యోగ ప్రమాణాలను బలోపేతం చేస్తుంది. కొత్త, పునరుద్ధరించిన, లేదా సవరించిన వర్క్ పర్మిట్లకు ఈ వేతన అంతస్తు వర్తిస్తుంది. ఇప్పటికే ఉన్న ఎమిరాటి ఉద్యోగుల వేతనాలను 2026 జూన్ 30 నాటికి సవరించాల్సి ఉంటుంది.నిబంధనలు ఉల్లంఘిస్తే..2026 జూలై 1 నుండి కనీస జీతాల మార్గదర్శకాలను పాటించని కంపెనీలపై కఠిన చర్యలు ఉంటాయి. ఇందులో ఎమిరటైజేషన్ కోటాల నుండి తొలగించడం, కొత్త వర్క్ పర్మిట్లను నిలిపివేయడం వంటివి ఉంటాయి.ప్రవాస కార్మికులకు వర్తిస్తుందా?ఈ కొత్త కనీస వేతనం కేవలం యూఏఈ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. భారతీయులతోపాటు ఇతర ప్రవాస కార్మికులకు అధికారిక కనీస వేతనం వర్తించదు. ప్రవాస కార్మికుల వేతనాలు పరిశ్రమ, నైపుణ్యం, ఒప్పందాల ఆధారంగా మారుతూ వస్తాయి. అయితే, కార్మిక చట్టాల ప్రకారం ప్రాథమిక జీవన అవసరాలు తీర్చేలా యజమానులు వేతనాలను కేటాయించాలి.వేతన మార్గదర్శకాలుమానవ వనరులు, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) కొన్ని వర్గాల ఉద్యోగుల కోసం సిఫార్సు చేసిన వేతన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లకు కనీస జీతం నెలకు 12,000 దిర్హామ్‌లు, డిప్లొమా/టెక్నీషియన్లకు 7,000 దిర్హామ్‌లు, సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ ఉన్న నైపుణ్య కార్మికులకు 5,000 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. -
ఎయిర్ ట్యాక్సీ సర్వీసు ప్రారంభం త్వరలోనే..
దుబాయ్: రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే ఎయిర్ ట్యాక్సీ సేవను ఈ ఏడాది చివరి నాటికి దుబాయ్‌లో ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో 45 నిమిషాలు పట్టే ప్రయాణాలు, ఫ్లయింగ్ ట్యాక్సీ ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే పూర్తవుతాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరాకు 10 నిమిషాల్లో చేరుకోవచ్చు.ఈ ట్యాక్సీ సర్వీస్ పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులకు దుబాయ్ నగరంలో వేగవంతమైన, సులభమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది. అమెరికాకు చెందిన జోబీ ఏవియేషన్ సంస్థ రూపొందించిన జోబీ ఎస్-4 ఎలక్ట్రిక్ విమానాన్ని ఈ సర్వీస్‌లో ఉపయోగించనున్నారు. పైలట్‌తో కలిపి మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఇది గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.మొదటి దశలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా, పామ్ జుమేరాలోని అట్లాంటిస్ ది రాయల్ హోటల్ సమీప ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) చైర్మన్ మత్తర్ అల్ తయర్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు చెప్పారు.పూర్తిగా విద్యుత్తుతో నడిచే ఎయిర్ ట్యాక్సీలు కావడంతో శబ్ద, పర్యావరణ కాలుష్యం చాలా తక్కువగా ఉంటుంది. ప్రయాణికులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఎయిర్ ట్యాక్సీలను బుక్ చేసుకోవచ్చు. దుబాయ్ ప్రజా రవాణా నెట్‌వర్క్‌తో ఈ సేవలను అనుసంధానించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. అయితే ఎయిర్ ట్యాక్సీ ఛార్జీలు ఎలా ఉంటాయన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. -
గోల్డ్ కార్డు: బంగారంతోనే షాపింగ్!
నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని వినియోగించే వినూత్న విధానంతో ‘ఓ గోల్డ్ మాస్టర్ కార్డు’ను దుబాయ్‌లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించకుండా, నేరుగా కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.ఓ గోల్డ్ మేనేజ్మెంట్ సంస్థ తమ డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను లైఫ్‌స్టైల్ సూపర్ యాప్‌గా తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ యాప్ ద్వారా తక్కువ పరిమాణంలోనూ బంగారం యాజమాన్యాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నారు.కొత్తగా ప్రవేశపెట్టిన ఓ గోల్డ్ మాస్టర్ కార్డుతో, వినియోగదారులు బంగారాన్ని నగదు మాదిరిగా ఉపయోగించి వివిధ వస్తువులు, సేవలను కొనుగోలు చేయవచ్చు. ఈ లావాదేవీలు సులభమైనవి, సురక్షితమైనని, అన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థను మావరిడ్ ఫైనాన్స్, మాస్టర్ కార్డ్ సహకారంతో అమలు చేశారు.ఈ కార్డు వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్‌లకు కాంప్లిమెంటరీ ప్రవేశం, హోటళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఆఫర్లు, అలాగే రెస్టారెంట్లు, ఈ-కామర్స్, ఎంటర్టైన్మెంట్ సేవలపై రాయితీలు లభిస్తాయి.ఓ గోల్డ్ మాస్టర్ కార్డు ద్వారా 8,000కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. యాప్ ద్వారా వోచర్లు, గిఫ్ట్ కార్డులను సులభంగా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే ఈ-సిమ్ కార్డులు, రివార్డులు, లాయల్టీ ప్రోగ్రామ్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని ఓ గోల్డ్ వ్యవస్థాపకుడు బందర్ అల్ ఓట్మాన్ తెలిపారు. -
సిటీలో కొడితే దుబాయ్‌లో తగిలింది!
దుబాయ్ కేంద్రంగా మాఫియా నడిపించిన అలీ భాయ్, 2001లో హైదరాబాద్‌లోని టోలిచౌకి నుంచి పన్నెండేళ్ల సుమేధను తన అనుచరులతో కిడ్నాప్ చేయించాడు. ఆమె తండ్రికి ఫోన్ చేసి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ చిన్నారిని రక్షించడానికి ఉన్నతాధికారులు ప్రత్యేక పోలీసు బృందాన్ని రంగంలోకి దింపారు. అలీ భాయ్ దుబాయ్‌లో ఉండటం; ఇక్కడి అనుచరుల ఆచూకీ తెలియకపోవడం; డిమాండ్ చేసిన మొత్తం చెల్లించకుంటే చిన్నారిని చంపేస్తామని బెదిరిస్తుండటంతో స్పెషల్ టీమ్ తీవ్ర ఒత్తిడికి లోనైంది. అప్పుడే తనదైన పంథాలో ఆలోచించిన ఓ అధికారి ఇక్కడ కొందరిని ‘టచ్’ చేసి ఆ సౌండ్ దుబాయ్‌కి వినిపించేలా చేశారు. దెబ్బకు దిగివచ్చిన అలీ భాయ్ సుమేధను సురక్షితంగా జహీరాబాద్‌లో విడిచిపెట్టించాడు. అప్పుడు ఏం జరిగిందంటే..!మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన సయ్యద్ అబిద్ హుస్సేన్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమారుడు. 1993లో దుబాయ్ వెళ్లి వ్యాపారం చేశాడు. అతడికి అక్కడే ముంబైకి చెందిన అబ్దుల్ ఖయ్యూం షేక్ అలియాస్ రాజ్, ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌కు చెందిన అల్తాఫ్ ఆలం ఖాన్ అలియాస్ విక్కీతో పరిచయమైంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించిన ఛోటా రాజన్‌కు ఈ ద్వయం అనుచరులుగా వ్యవహరించింది. వీరి పరిచయంతో అబిద్ తన పేరును అలీ భాయ్‌గా మార్చుకుని విక్కీకి అనుచరుడిగా మారాడు. అంతటితో ఆగకుండా ఆ ద్వయంతో కలిసి బెదిరింపు వసూళ్లు, కిడ్నాప్‌లు చేయాలని పథకం వేశాడు. దీనికి వాళ్లు అంగీకరించడంతో దుబాయ్ నుంచే హైదరాబాద్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల్లో కొన్ని నేరాలు చేశారు. అక్కడ నుంచే కథ నడిపించిన ఈ ముగ్గురూ ఇక్కడ అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు. దుబాయ్ నుంచి అలీ భాయ్ పథకం వేయడం; మిగిలిన ఇద్దరూ తమ అనుచరుల ద్వారా అమలు చేయడం; సెల్ ఫోన్, శాటిలైట్ ఫోన్ల ద్వారా టార్గెట్‌ను బెదిరించి డబ్బు వసూలు చేయడం– ఇలా కొన్నాళ్లు ఓ మాఫియా సామ్రాజ్యాన్నే నడిపారు. ఎక్కడిక్కడ స్థానిక రౌడీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని హడలెత్తించారు. హైదరాబాద్ గోల్కొండ ప్రాంతానికి చెందిన మీర్జా అసద్ అలీ, మహ్మద్ నవీద్, బుద్వేల్‌కు చెందిన అహ్మద్ హుస్సేన్ తదితరులు అలీ భాయ్ కోసం పని చేశారు. అలీ భాయ్ 2001 మార్చి 23న జూబ్లీహిల్స్‌కు చెందిన బడా వ్యాపారి కుమార్తె సుమేధను కిడ్నాప్ చేయించాడు. అప్పట్లో తొమ్మిదో తరగతి చదవుతున్న ఆమె పాఠశాలకు వెళ్తుండగా టోలిచౌకిలో అపహరణకు గురైంది. ఈ చిన్నారిని తీసుకువెళ్లిన అలీ భాయ్ అనుచరులు జహీరాబాద్‌లో సిద్ధం చేసుకున్న డెన్‌లో దాచారు. దుబాయ్ నుంచి చిన్నారి తండ్రికి ఫోన్ చేసిన అలీ భాయ్ తమ అధీనంలో ఉన్న సుమేధను సురక్షితంగా విడిచిపెట్టడానికి రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. తాను దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడినని, ఈ మొత్తాన్ని డాలర్ల రూపంలో సిద్ధం చేసి ఉంచాలని, ఎక్కడ ఇవ్వాలో చెప్తానని చెప్పాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా, నిర్ణీత సమయంలో డబ్బు చెల్లించకపోయినా చిన్నారిని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ వ్యవహారంలో విక్కీ సైతం సుమేధ తండ్రితో బేరసారాలు చేశాడు. అలీ భాయ్, విక్కీ బెదిరింపులకు భయపడని సుమేధ తండ్రి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. అప్పటికే అలీభాయ్ వ్యవహారాలపై సమాచారం ఉన్న ఉన్నతాధికారులు సుమేధ కేసు డీల్ చేయడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. దీనికి నేతృత్వం వహించిన కీలక అధికారి తనదైన పం«థాలో ముందుకు వెళ్లారు. సుమేధను సురక్షితంగా తీసుకురావాలంటే అలీ భాయ్‌ని ఎమోషనల్‌గా డీల్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఓ బృందాన్ని జహీరాబాద్ పంపి అలీ పూర్వాపరాలు, ఆప్తుల వివరాలు ఆరా తీయించారు. అలీ భాయ్ అమితంగా అభిమానించే ఇద్దరు సమీప బంధువుల విషయం ఇలా పోలీసుల దృష్టికి వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయని పోలీసులు వారిని హైదరాబాద్ తీసుకువచ్చారు. అప్పటికే శివార్లలో ఓ రహస్య సేఫ్ హౌస్‌ను సిద్ధం చేసి ఉంచారు. అలీ భాయ్ సమీప బంధువులను అక్కడకు తరలించిన పోలీసులు తమదైన ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఇక్కడ సేఫ్ హౌస్‌లో ఉన్న వారిని ఇంటరాగేషన్ చేస్తూ వారి అరుపులు, మాటల్ని ఫోన్ ద్వారా దుబాయ్‌లో ఉన్న అలీ భాయ్‌కి వినిపించారు. ఆ చిన్నారిని చిన్న గాయమైనా వీళ్లను ఎన్కౌంటర్ చేస్తామని, 24 గంటల్లో సుమేధ సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరకుంటే మళ్లీ ఈ ఇద్దరు సన్నిహితులు నీకు కనిపించరంటూ అల్టిమేటం ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన ఈ షాక్‌కు భయపడిన అలీ భాయ్ దిగి వచ్చాడు. సుమేధను వదిలి వెళ్లిపోవాలంటూ తన అనుచరులకు చెప్పి, జహీరాబాద్ చిరునామాను పోలీసులకు అందించాడు. హైదరాబాద్ అధికారుల ద్వారా సమాచారం అందుకున్న మెదక్ పోలీసులు సుమేధను సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఆ తర్వాతే ప్రత్యేక బృందం అలీ భాయ్ సన్నిహితులను తమ సేఫ్ హౌస్ నుంచి బయటకు పంపింది. దీంతో పాటు మరికొన్ని నేరాలు చేసిన అలీ భాయ్, విక్కీలను పోలీసులు దుబాయ్ నుంచి రప్పించారు. అలీ భాయ్‌ని 2007లో హైదరాబాద్, విక్కీని దీనికి ముందే పుణేకు డిపోర్ట్ అయ్యారు. అలీ భాయ్‌ని బలవంతంగా దుబాయ్ నుంచి తీసుకువచ్చిన తర్వాత సుమేధ కేసు విచారణ కోసం విక్కీని సైతం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఆ సమయంలో కేవలం ఇద్దరు అధికారులే వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించడానికి సిద్ధం అయ్యారు. ఎలాంటి సాయుధ ఎస్కార్ట్ లేకుండా కేవలం ఇద్దరు అధికారులు ఓ సుమోలో తీసుకువెళ్లడంతో ఆ ద్వయం కంగుతింది. తాము మాఫియా డాన్స్ అని, దావూద్ అనుచరులమని, ఇలా భద్రత లేకుండా తీసుకువెళ్తే ఎలా? అంటూ ప్రశ్నించింది. పోలీసులు ఇవేవీ పట్టించుకోలేదు. దీంతో ఓ దశలో ఇలా సింపుల్‌గా కోర్టుకు రావడానికి అలిగిన అలీ, విక్కీ తప్పనిసరి పరిస్థితిలో సుమో ఎక్కారు. -
ఆరు దశాబ్దాల ఎడారి జీవితం.. ఆ జ్ఞాపకాలే ఖరీదంటోన్న మలయాళీ.!
ఐదు దశాబ్దాల క్రితం గల్ఫ్‌లోని ఎడారిలో జీవితాన్ని ప్రారంభించిన మలయాళీ ముహమ్మద్ కుంజి (77). మత్స్యకారులైన పొన్నిచి ముసాన్, ఒలకోన్ సారా దంపతుల కుమారుడైన కుంజి 21 సంవత్సరాల వయసులో దుబాయ్‌కు ఓడ ఎక్కాడు. అతని తండ్రి సంపాదన అంతంత మాత్రమే కావడంతో అతని కుటుంబం ఆకలి కూడా తీర్చలేకపోయేవాడు. మడాయిలోని ముత్తోంలోని కొవ్వప్పురానికి చెందిన పొన్నిచి ముసాన్ ఇక జీవించడానికి అతనికి వేరే మార్గం లేకపోవడంతో.. ఐదవ తరగతిలో చదువు మానేసి బీడీ కార్మికుడిగా పనికి వెళ్లేవాడు.కానీ అతని సోదరుడు ముస్తఫా మాత్రం మొదట దుబాయ్‌కి వెళ్ళాడు. ముస్తఫా అక్కడ టీ దుకాణం నడుపుతున్నాడు. తన సోదరులను దుబాయ్‌కు తీసుకువస్తేనే కుటుంబంలో పేదరికం తొలగిపోతుందని తెలిసుకున్న ముస్తఫా.. వీసా వచ్చాక ముహమ్మద్ కుంజిని అక్కడికి రమ్మని కోరాడు. అలా మహమ్మద్ కుంజి మార్చి 3, 1967న దుబాయ్‌లో అడుగుపెట్టాడు.అలా మహమ్మద్ కుంజిని దుబాయ్ తీసుకువచ్చాడు ముస్తఫా. అక్కడికి వెళ్లిన కుంజి టీ, స్వీట్లు తయారు చేయడం నేర్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వ్యాపారం.. రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగేది. తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నేను దాచుకునేవాడు. ఇంట్లో ఆకలితో అలమటిస్తున్న నా తండ్రి, తల్లి, తోబుట్టువుల కోసం పంపేవాడు. అప్పట్లో తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ దుబాయ్‌కు వచ్చిన వారిలో ఎక్కువ మంది మలయాళీలు, బలూచిస్తానీలే ఎక్కువ. కుంజి దుబాయ్‌లో తొమ్మిది సంవత్సరాలు పనిచేశాజు.అప్పట్లో దుబాయ్ కరెన్సీ దిర్హామ్‌కి మన డబ్బుల్లో 2 రూపాయలు. ఆ తర్వాత 1976లో అబుదాబి పోలీస్ ఉద్యోగం వచ్చింది. పోలీస్ శాఖలో వంటవాడిగా కెరీర్ ప్రారంభించాడు. అప్పట్లో కుంజి జీతం 900 దిర్హామ్‌లు. అలా జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేసుకుని మిగిలిన మొత్తాన్ని ఇంటికి పంపేవాడినని తెలిపారు. అప్పుడు కేవలం ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేది. పనిలో భాగంగా ఒక చిన్న ప్రమాదం జరగడంతో నా ఉద్యోగాన్ని కోల్పోయి టీ అమ్మడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం వచ్చే వరకు అది కష్టమైన పని. ఆ తర్వాత 1987లో అబుదాబి సైన్యంలో ఉద్యోగం. అక్కడ కూడా నా ఉద్యోగం వంట. జీతం 1800 దిర్హామ్‌లు. అప్పుడు ఇంటికి ఎక్కువ డబ్బు పంపగలిగానని కుంజి వెల్లడించారు. నేను మొదట మా ఊరికి వచ్చినప్పుడు, నేను కోటీశ్వరుడిననని నా కుటుంబం, స్థానికులు చాలా ఆశలు పెట్టుకునేవారని తెలిపారు.నేను అబుదాబి సైన్యంలో చేరిన తర్వాత వివాహం చేసుకున్నానని తెలిపారు. నేను అప్పట్లో గల్ఫ్ గురించి చెబితే ప్రజలు నన్ను నమ్మలేదు. అప్పట్లో అరబ్బులకు కూడా చిన్న ఇళ్లే ఉండేవి. మేమందరం చిన్న గుడిసెలలో నివసించామని.. స్నానం చేయడానికి గాడిదలపై టిన్ డబ్బాల్లో తెచ్చిన నీటికి డబ్బు చెల్లించాల్సి వచ్చేదన్నారు. కేవలం ప్రతి నాలుగైదు రోజులకు నీరు వస్తుందన్నారు. కుటుంబ ఉత్తరం కోసం వేచి ఉన్న సమయం చాలా బాధాకరంగా ఉండేదని అన్నారు.నేను రాడో వాచ్‌ను 1987లో కొన్నాను. లడఖ్‌లో ఉద్యోగం వచ్చినప్పుడు నా మొదటి జీతంతో కొన్నానని తెలిపారు. ఈ వాచ్ ధర 2025 దిర్హామ్లని వెల్లడించారు. ఈ గడియారం నా గల్ఫ్ జీవితాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. అప్పటి నుండి, నా కుటుంబం. ఈ గడియారం నాతోనే ఉన్నాయని తెలిపారు. ఒకరోజు నేను ఒక గడియార దుకాణానికి వెళ్లి రాడో వాచ్ ధర ఎంత అడిగా.. అర మిలియన్ రూపాయలు అన్నారు. కానీ నాకు, దాని విలువ కంటే జ్ఞాపకాలే చాలా రెట్లు ఎక్కువ అనిపించిందన్నారు.నా వయస్సు 60 సంవత్సరాల వరకు అబుదాబిలో పనిచేశానని.. తరువాత నా ప్రవాసాన్ని ముగించానని కుంజి వెల్లడించారు. నా కుమార్తెలు ఆయేషా, అమీనా వివాహం చేసుకున్నారు. మనదేశానికి తిరిగి వచ్చి ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మే దుకాణాన్ని ప్రారంభించానని తెలిపారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు, గల్ఫ్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని.. అప్పుడు ఈ గడియారాన్ని ఎల్లప్పుడూ చూస్తానని పేర్కొన్నారు. -
చైనా కంపెనీకి జాక్‌పాట్.. దుబాయ్‌లో అనుమతులు..!
చైనీస్ టెక్ కంపెనీ అయిన అపోలో గో అరుదైన ఘనత సాధించింది. దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ కార్ల పరీక్షకు అనుమతి పొందిన ఏకైక కంపెనీగా నిలిచింది. దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) పూర్తి డ్రైవర్‌లెస్ పరీక్ష అనుమతిని మంజూరు చేసింది. దీంతో డ్రైవర్ సీటులో వ్యక్తి లేకుండా వేగంగా వెళ్లే కార్లు దుబాయ్ రోడ్లపై కనిపించనున్నాయి.కాగా.. 2026 మొదటి అర్ధభాగం నాటికి వాణిజ్య ప్రాతిపదికన పూర్తిగా డ్రైవర్‌లెస్ టాక్సీ సేవలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దుబాయ్ రోడ్లపై వెయ్యికి పైగా వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ వినూత్న సాంకేతికత సజావుగా సాగేందుకు వీలుగా దుబాయ్‌లోని మిడిల్ ఈస్ట్‌లో మొట్టమొదటి 'ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్'ను కూడా కంపెనీ ప్రారంభించింది. వాహన నిర్వహణ, భద్రతా తనిఖీలు, నిపుణుల శిక్షణ అన్నీ ఈ హబ్‌లో నిర్వహిస్తారు.2030 నాటికి దుబాయ్ మొత్తం ట్రాఫిక్‌లో 25 శాతం డ్రైవర్‌లెస్ వాహనాలుగా మార్చాలనే పాలకుల నిర్ణయానికి ఈ చర్య ప్రోత్సాహకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధునిక రవాణా వ్యవస్థలను వేగంగా అవలంబిస్తున్న దుబాయ్ పరిస్థితి వారి సాంకేతికతకు ఉత్తమంగా సరిపోతుందని చైనాకు చెందిన బైడు ఉపాధ్యక్షుడు వాంగ్ యున్పెంగ్ అన్నారు.కాగా.. గత మార్చిలో ఆర్టీఏతో కుదుర్చుకున్న ఒప్పందం తర్వాత కంపెనీకి జూలైలో టెస్ట్ లైసెన్స్ మంజూరు చేశారు. సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా స్మార్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ప్రపంచ మోడల్‌గా మారాలని దుబాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే నెలల్లో దుబాయ్‌లో రద్దీగా ఉండే వీధుల్లో డ్రైవర్‌లెస్ కార్లు పరీక్షించనున్నారు. -
లోకల్ కంపెనీల గ్లోబల్ జంప్
అంతర్జాతీయంగా కార్యకలా పాలు విస్తరించే ప్రణాళికల్లో ఉన్న దేశీ సంస్థలకు దుబాయ్ ఇప్పుడు ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. ఇన్వెస్టర్లకు అనుకూల విధానాలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లెక్స్ ఆఫీస్ సరీ్వసులందించే సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఫండ్ హౌస్‌లు, ఫ్యామిలీ ఆఫీసులు మొదలైనవి దుబాయ్ బాట పడుతున్నాయి. ఇటీవలే ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సంస్థ కార్పొరేట్ఎడ్జ్ 31,000 చ.అ. ఆఫీస్ స్పేస్‌ని లీజుకి తీసుకుంది. అటు నిసస్ ఫైనాన్స్ సరీ్వసెస్ కంపెనీ (నిఫ్కో) అనే లిస్టెడ్ ఆల్టర్నేటివ్ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అత్యధికంగా రూ. 536 కోట్ల పెట్టుబడులు పెట్టింది. దుబాయ్ మోటర్ సిటీలోని లుటా ఎవెన్యూ అనే రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పటికే శోభా, సన్‌టెక్ లాంటి దిగ్గజ రియల్టర్లు అక్కడ చేపట్టిన ప్రాజెక్టులకు ఇవి అదనం. 2024లో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యధికంగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీల్లో భారతీయ సంస్థలు కూడా ఉన్నాయి. ఇవి సుమారు 35 బిలియన్ దిర్హామ్‌ల మేర పెట్టుబడులు పెట్టాయి. జెబెల్ అలీ ఫ్రీ జోన్లో సుమారు 2,300 భారతీయ కంపెనీలకు కార్యకలాపాలు ఉన్నాయి. 2024–25 లో ఇరు దేశాల మధ్య జరిగిన 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంలో వీటి వాటా 6.9 బిలియన్ డాలర్లకు పైగా నమోదైంది. గ్లోబల్ హబ్.. ప్రపంచం నలుమూలలి్నంచి కంపెనీలు తమ ప్రాంతీయ, అంతర్జాతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు దుబాయ్‌ని ఎంచుకుంటున్నాయి. దీంతో అది అత్యంత వేగంగా గ్లోబల్ బిజినెస్ హబ్‌గా ఎదుగుతోంది. భారతీయ ఉద్యోగుల దన్నుతో అంతర్జాతీయంగా కార్యకలాపాలను విస్తరించాలనుకునే దేశీ సంస్థలకు దుబాయ్ ఆకర్షణీయంగా ఉంటోందని పరిశ్రమవర్గాలు వివరించాయి. ఇన్వెస్టర్లకు అనుకూలమైన విధానాలు, పన్నులపరంగా ప్రయోజనకరంగా ఉండే నిబంధనలు, పటిష్టమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలు దుబాయ్‌కి సానుకూలంగా ఉంటున్నాయి. భారత్‌లో ఖరీదైన మార్కెట్లకు దుబాయ్ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని రియల్టీ రంగ నిపుణులు తెలిపారు. దేశీయంగా విలాసవంతమైన ప్రాపరీ్టల విలువ గత అయిదేళ్లలో దాదాపు 60 శాతం పైగా పెరిగాయని, ముంబైలాంటి నగరాల్లో బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్టుల్లో ప్రాపరీ్టల ప్రారంభ ధరే రూ. 5 కోట్లుగా ఉంటోందని వివరించారు. ఇక ప్రధాన ప్రాంతాల్లో చూస్తే రూ. 50 కోట్లు కూడా దాటేస్తోందని పేర్కొన్నారు. అదే దుబాయ్‌లో సగటు ప్రాపర్టీ లావాదేవీ విలువ రూ. 5 కోట్లుగా ఉంటోంది. అందుబాటు ధరలో లభించడంతో పాటు ఆదాయ పన్ను లేకపోవడం, 2 మిలియన్ దిర్హామ్‌ల పెట్టుబడులు పెడితే పదేళ్ల పాటు గోల్డెన్ వీసాలాంటి ప్రయోజనాలు దుబాయ్‌కి సానుకూలంగా ఉంటున్నాయి. లగ్జరీతో పాటు కమ్యూనిటీ లివింగ్‌ని కోరుకునే భారతీయ కొనుగోలుదారులు ప్రధానంగా దుబాయ్ మెరీనా, డౌన్‌టౌన్ దుబాయ్, ది పా మ్ జుమేరాలాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నారు.సాక్షి, బిజినెస్ డెస్క్ -
దుబాయ్ వెళ్లే వారికి గుడ్ న్యూస్.. పాస్‌పోర్ట్ లేకుండానే..!
దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై విమానాశ్రయాల్లో ధృవపత్రాల పరిశీలన మరింత సులభం కానుంది. ప్రయాణికులు విమానాశ్రయంలో తమ పాస్‌పోర్ట్‌లు, ఇతర పత్రాలను చూపించకుండానే వెళ్లేందుకు అవకాశం కల్పించనున్నారు అధికారులు. దీని కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వలస విధానాలను పూర్తి చేసుకునేందుకు వీలు కల్పించే బయోమెట్రిక్ (రెడ్ కార్పెట్) వ్యవస్థను ఈ నెలాఖరు నాటికి అన్ని విమానాశ్రయాల్లో విస్తరించనున్నారు.దుబాయ్ చేరుకునే టెర్మినల్-3 ప్రయాణీకులకు ఇది అందుబాటులో ఉంటుంది. దుబాయ్ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యంత అధునాతన కేంద్రంగా మార్చడంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నారు. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్..ఎమిరేట్స్ యాప్, విమానాశ్రయ కియోస్క్‌ల ద్వారా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వారికి ఈ సేవ అందుబాటులో ఉంటుంది. మీరు మొదటిసారి స్మార్ట్ గేట్‌ను ఉపయోగిస్తుంటే.. ఏఐ కెమెరాలు మీ బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించి భవిష్యత్‌లోనూ వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. ఇందులో నమోదు చేసుకోవడానికి మీకు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, ఎమిరేట్స్ ఐడీ ఉండాలి. అలా నమోదు చేసుకున్న తర్వాత, మీరు మీ పాస్‌పోర్ట్, బోర్డింగ్ పాస్‌ను చూపించకుండానే స్మార్ట్ కారిడార్ గుండా వెళ్లొచ్చు. -
రెండేళ్ల నిరీక్షణ.. రూ.24 లక్షలు గెల్చుకున్నాడు
దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయుడికి జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఒకటీ రెండూ కాదు ఏకంగా పాతిక లక్షల రూపాయలను గెల్చుకున్నాడు. గత రెండేళ్లుగా లాటరీ టికెట్లను కొనుగోలు చేస్తున్న 57 ఏళ్ల బషీర్‌ను ఎట్టకేలకు అదృష్టదేవతవరించింది.కేరళకు చెందిన బషీర్ కైపురత్ గత పాతికేళ్లుగా యూఏఈలో నివసిస్తున్నాడు. అతని వృత్తి డ్రైవర్. ఏదో ఒక రోజు ఫలితం దక్కకపోతుందా అనే ఆశతో ప్రతీ నెలా క్రమం తప్పకుండా బిగ్ టికెట్ టిక్కెట్లను కొనుగోలు చేయడం అతనికి అలవాటు. చివరికి రెండేళ్లకు పైగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అతని కల ఫలించింది. బిగ్ టికెట్ ఈ-డ్రాలో 276640 నంబర్ టిక్కెట్‌తో Dh100,000 (సుమారు రూ. 24 లక్షలు) గెలుచుకున్నాడు. చదవండి: అధికారులే షాక్ : పౌర్ణమి, గుప్త నిధులు, 8 నెలల బాలుడుఆసక్తికర విషయం ఏమిటంటే.. 'రెండు కొంటే మూడు ఉచితం అనే పరిమిత కాల ఆఫర్ కింద దీన్ని కొనుగోలు చేశాడు. ఈ నిర్ణయం అతని జీవితాన్ని మార్చేసింది. ఈ డ్రా గెల్చుకున్నట్టు ఫోన్ రాగానే తొలుత తాను అస్సలు నమ్మలేదని ఆ గెలుపును ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా అంటూ పట్టరాని సంతోషాన్ని ప్రకటించాడు. ఈ డబ్బులో కొంత భాగాన్ని భారతదేశంలోని తన కుటుంబానికి ఇవ్వాలని భావిస్తున్నాడు. ఓపిక, పట్టుదల తప్పకుండా గెలుస్తాయంటున్నాడు. అంతేకాదు భవిష్యత్తులో కూడా డ్రాలలో కూడా పాల్గొంటానని చెప్పాడు.ఇంతకు ముందు గుజరాత్‌కు చెందిన 52 ఏళ్ల కంప్యూటర్ టీచర్ రితేష్ ధనక్ సుమారు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు. గత 30 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్న రితేష్, దశాబ్దానికి పైగా క్రమం తప్పకుండా బిగ్ టిక్కెట్లను కొనుగోలు చేసే అలవాటున్న రితేష్ తన స్నేహితులతో కలిసి దీన్ని కొనుగోలు చేసి, గెల్చుకున్నాడు. ఇదీ చదవండి: గాయని చిత్ర అయ్యర్ సోదరి దుర్మరణం, ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌కాగా బిగ్ టికెట్ యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన రాఫెల్ డ్రాలలో ఒకటి. ఇందులో గెలుపొందిన విజేతలు భారీ నగదు బహుమతులు, లగ్జరీ కార్లను దక్కించుకోవచ్చు. ఇది అబుదాబిలో ఉన్నప్పటికీ, దుబాయ్‌తో సహా దేశవ్యాప్తంగా ఇది ఆకర్షిస్తుంది. ఈ డ్రాలు నెలవారీగా జరుగుతాయి. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు న్నవారు ఈ టిక్కెట్లను అధికారిక బిగ్ టికెట్ వెబ్సైట్ ద్వారా లేదా అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం, లేదా ఎంపిక చేసిన అధీకృత అవుట్లెట్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. -
దుబాయి ట్రిప్‌లో భార్యతో కలిసి రాహుల్ సిప్లిగంజ్ (ఫొటోలు)
-
తెల్లారితే గల్ఫ్ పయనం.. అంతలోనే గుండెపోటు
జగిత్యాల జిల్లా: తెల్లారితే దుబాయ్ వెళ్లాల్సిన ఓ వలసకార్మికుడు.. పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుకు గురై చనిపోయిన సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంచతి గంగారెడ్డి (48) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. కంపెనీ ఇచ్చిన సెలవులు పూర్తికావడంతో ఆదివారం తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శనివారం తన పొలంలో కుటుంబసభ్యులతో కలిసి పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గంమధ్యలో మృతిచెందాడు. గంగారెడ్డికికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండు రోజులుగా కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న గంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. -
నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)
-
దుబాయ్‌లో ఉంటున్నారా..? అయితే ఇది మీకోసమే?
న్యూ ఇయర్- 2026 దుబాయ్‌లో ఉండే వారికి షాక్ ఇవ్వనుంది. ప్రపంచ వ్యాప్తంగా దుబాయ్ వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగడంతో అక్కడ అద్దెలు ఈ ఏడాది గరిష్ఠంగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటితో పాటు విల్లాలు, ప్లాట్ల రేట్లు కూడా అధికంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దుబాయ్ అంటే కాస్లీ లైఫ్‌కు పెట్టింది పేరు. ఆ నగరం కేవలం టూరిస్ట్ స్పాట్‌గానే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్‌లు, సాంస్కృతిక వైభవం, సైక్యూరిటీ తదితర కారణాల రీత్యా దుబాయ్‌కి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఈ నేపథ్యంలో 2026లో అక్కడి భవనాల అద్దెరెట్లు దాదాపు ఆరుశాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. పామ్ జుమేరా, దుబాయ్ హిల్స్, డౌన్‌టౌన్, దుబాయ్ మెరీనా వంటి ప్రాంతాలలో నివసించడానికి విదేశీయులు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారని అందుచేత అక్కడ అద్దెలు ఈ ఏడాది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వీటితో పాటు సాధారణ ప్రాంతాలలో అద్దెలు సైతం గణనీయంగా పెరుగుతుండడంతో ఆ ప్రాంతంలో నివసిస్తున్న మధ్యతరగతి ప్రజలకు వీటిని చెల్లించడం అధిక భారంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు.వీటితో పాటు గోల్డెన్ వీసా హోల్డర్లు, విదేశీ నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో పాట్లు, విల్లాల అమ్మకాలకు అధిక డిమాండ్ ఏర్పడనున్నట్లు తెలిపారు. -
ఉస్మాన్ హాదీ హత్యపై నిందితుడి సంచలన వీడియో
బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం సృష్టించిన రాడికల్ నేత ఉస్మాన్ హాదీ హత్య విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మసూద్ ఈ అంశంపై కీలక సమాచారం తెలుపుతూ వీడియో విడుదల చేశాడు. ఉస్మాన్ హాదీ మృతితో తనకు ఏటువంటి సంబంధం లేదని తెలిపాడు. ఈ నిందితుడు ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మసూద్ భారత్‌లో తలదాచుకున్నట్లు బంగ్లా ఆరోపించింది. రాడికల్ విద్యార్థి లీడర్ ఉస్మాన్ హాది హత్యతో బంగ్లాదేశ్‌లో ఏ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉస్మాన్ మృతితో ఆ దేశంలో విద్వేశజ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. హిందువులే టార్గెట్‌గా దాడులు జరిగాయి. ఇవి చాలవన్నట్లు ఇటీవలే అక్కడి మీడియా కథనాలు ఉస్మాన్ హాదీ హంతకులు భారత్‌లో తలదాచుకున్నారని తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో ఉస్మాన్ హత్యలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మసూద్ దుబాయ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ఈ వివరాల్ని సీఎన్ఎన్ మీడియా సంస్థ ప్రచురించింది.ఫైసల్ కరీం మసూద్ మాట్లాడుతూ" నేను ఉస్మాన్ హాదీని చంపలేదు. బంగ్లాదేశ్‌లో నేను నాకుటుంబం రాజకీయంగా తీవ్రంగా హింసించబడుతున్నాం. ఆ హింస నుంచి తప్పించుకోవడానికి నేను దుబాయ్‌కి వచ్చాను. ఉస్మాన్ హాదీతో నాకుంది కేవలం వ్యాపార సంబంధమే, నా ఐటీ సంస్థ ప్రయోజనం కోసం ఉస్మాన్ని కలిశాను. అతనికి రాజకీయ విరాళాలు కూడా ఇచ్చాను " అని మసూద్ వీడియోలో తెలిపారు.ఈ హత్య ఖచ్చితంగా జమాతే-ఈ- ఇస్లామి సృష్టేనని దీని వెనుక ఆ కార్యకర్తలు ఉండవచ్చని మసూద్ అనుమానం వ్యక్తం చేశారు. తాను భారత్‌లో తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యాలని అన్నారు. జమాతి-ఈ- ఇస్లామి అనిదే బంగ్లాదేశ్‌లోని ఓ రాజకీయ పార్టీ ఇది ఇస్లామిక్ భావజాలలను ప్రోత్సహిస్తోంది.అయితే రెండురోజుల క్రితం ఉస్మాన్ హాదీ హత్యతో సంబంధమున్నట్లు భావిస్తున్న ఫైజల్ కరీం మసూద్, షేక్ ఆలంగీర్ అనే ఇద్దరు నేరస్థులు బంగ్లాదేశ్ జిల్లాలోని మైమాన్సింగ్ జిల్లా సరిహాద్దు గుండా మేఘాలయలో ప్రవేశించారని బంగ్లాదేశ్ పోలీసులు ఆరోపించింది. అయితే ఈ ఆరోపణల్ని అప్పుడే మేఘాలయ పోలీసులు ఖండించారు. -
న్యూ ఇయర్ కోసం దుబాయ్ బంపర్ ఆఫర్
దుబాయ్ ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సెలబ్రేషన్స్‌కు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండడానికి 43గంటల పాటు నిరంతరంగా పబ్లిక్ ట్రాన్స్‌ఫోర్ట్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. అంతే కాకుండా వాహనాల పార్కింగ్‌లకు జనవరి 1న ఎటువంటి రుసుము తీసుకోనున్నట్లు తెలిపింది.సాధారణ సమయాల్లోనే దుబాయ్‌కి టూరిస్టుల రద్దీ అధికంగా ఉంటుంది. ఇక న్యుఇయర్ వేడుకల సమయంలో ఉండే రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సెలబ్రేటీలు, టూరిస్టులు, కార్పోరేట్ సంస్థలకు చెందిన వారు ఇయర్ ఎండ్ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వస్తుంటారు. ఈ రద్దీ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం టూరిస్టుల కోసం మంచి ఆఫర్ ప్రకటించింది.డిసెంబర్ 31 వేడుకల దృష్యా బుధవారం ఉదయం 5గంటలకు ప్రారంభమయ్యే అక్కడి మెట్రో సర్వీస్ జనవరి 1 రాత్రి 11 గంటల 59 నిమిషాల వరకూ నిరంతరాయంగా నడవనున్నట్లు తెలిపింది. అదే విధంగా దుబాయ్ ట్రామ్ ఉదయం 6గంటల నుండి జనవరి 1 ఉదయం ఒంటిగంట వరకూ నడపనున్నట్లు తెలిపింది. వీటితో పాటు జనవరి1న బహుళ అంతస్థుల భవనాలు, ఆల్ఖైల్ గేట్ పార్కింగ్ మినహా మిగతా అన్ని ప్రాంతాలలో పార్కింగ్ సేవలు పూర్తిగా ఉచితం అని ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకలకు టూరిస్టుల రద్దీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. -
చిన్నగానే చుట్టేసొద్దాం..
సాక్షి, బిజినెస్‌డెస్క్: కరెన్సీ కదలికలు, క్రిస్మస్..న్యూ ఇయర్ సీజన్ వ్యయాలు విహారయాత్రల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. చాలా మంది పర్యాటకులు సుదీర్ఘ యాత్రల కన్నా అయిదు రోజుల్లో చుట్టేసొచ్చేలా టూర్లను ప్లాన్ చేసుకుంటున్నారు. అందులోనూ వీసా సులభంగా దొరికే దేశాలను ఎంచుకుంటున్నారు. ట్రావెల్ సర్విసుల కంపెనీ కాక్స్ అండ్ కింగ్స్‌కి నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గత శీతాకాలంతో పోలిస్తే ఈసారి అంతర్జాతీయ ప్రయాణాలకి కేవలం 15–20 రోజులు ముందుగా బుక్ చేసుకునే ధోరణి 30 శాతం పెరిగింది.65 శాతం బుకింగ్స్ అయిదు రోజుల్లోపు ట్రిప్‌లకే పరిమితమైంది. ఈసారి భారతీయ ప్రయాణికులు బయల్దేరడానికి కాస్త ముందుగా మాత్రమే బుక్ చేసుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో ఖర్చులు అంచనాలకు అనుగుణంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారని, సుదీర్ఘ ప్రయాణాలను...డాలర్ మారకంతో ముడిపడి ఉండే ప్రయాణ ఖర్చులను తగ్గించుకుంటున్నారని నివేదిక పేర్కొంది. అలాగని ప్రయాణాలకు డిమాండేమీ తగ్గిపోలేదని తెలిపింది. ఈసారి క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పర్యాటకులు తమ సౌకర్యానికి, ఖర్చు చేసే ప్రతి రూపాయికి లభించే ప్రయోజనాలకి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారని వివరించింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. ⇒ మిగతా పేరొందిన ప్రాంతాలతో పోలిస్తే దుబాయ్, వియత్నాంల వైపు పర్యాటకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కనెక్టివిటీ బాగుండటం, వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం, తక్కువ రోజుల్లోనే ఎక్కువగా చుట్టేసేయడానికి అవకాశంలాంటి అంశాలు వీటికి సానుకూలంగా ఉంటున్నాయి. అందుకే ఆఖరు నిమిషంలో ప్లాన్ చేసుకునే వారు దుబాయ్, వియత్నాంల వైపు చూస్తున్నారు. శ్రీలంక, బాలి, ఒమన్ వెళ్లే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ⇒ ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటున్న వారిలో 45 శాతం మంది పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణిస్తున్న కుటుంబాలకు చెందినవారే ఉంటున్నారు. వారు భద్రత, వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉండే దుబాయ్‌లాంటి డెస్టినేషన్లను ఎంచుకుంటున్నారు. ఇక తొలిసారిగా విదేశీ పర్యటన చేస్తున్న వారికి, మిలీనియల్స్‌కి, జెనరేషన్ జెడ్‌కి, యువ జంటలకి, బ్యాక్‌ప్యాకర్స్, యువ ప్రొఫెషనల్స్, మిత్ర బృందాలకి వియత్నాం ఫేవరెట్‌గా ఉంటోంది. సాధారణంగా ఇది పీక్ సీజన్ కావడంతో పాటు కొన్ని ప్రదేశాలకు టికెట్ల కొరత ఉన్నప్పటికీ ఈ–వీసా ప్రక్రియపై స్పష్టత, ఎయిర్ కనెక్టివిటీ మెరుగ్గా ఉండటంలాంటి అంశాలు ఆ దేశానికి సానుకూలంగా ఉంటున్నాయి. ⇒ శీతాకాలంలో స్వల్ప వ్యవధి టూర్లకు బుక్ చేసుకునే వారిలో 55 ఏళ్ల పైబడిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మౌలిక సదుపాయాలు, ప్రయాణం సులభతరంగా ఉండే ప్రాంతాలను వారు ఎంచుకుంటున్నారు. ⇒ ఆఖరు నిమిషపు శీతాకాలం బుకింగ్స్‌లో అత్యధిక వాటా దుబాయ్‌ది ఉంటోంది. ముఖ్యంగా పిల్లలు, వయోవృద్ధులున్న కుటుంబాలు దీన్ని ఎంచుకుంటున్నాయి. -
పాక్ అభిమానుల చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు అభిమానులు మరోసారి తమ వక్రబుద్ధిని చాటుకున్నారు. భారత అండర్-19 క్రికెటర్లపై విద్వేష విషం చిమ్మారు. ప్రధానంగా పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీని టార్గెట్ చేస్తూ చిల్లర చేష్టలకు దిగారు.ఫైనల్లో పాక్ గెలుపుఏసీసీ మెన్స్ ఆసియా కప్ (యూత్ వన్డే)-2025 టోర్నమెంట్ దుబాయ్ (Dubai) వేదికగా ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాయాదులు భారత్- పాకిస్తాన్.. గ్రూప్-ఎ నుంచి పోటీపడ్డాయి. లీగ్ దశలో పాక్‌ను భారత్ ఓడించగా.. ఫైనల్లో పాకిస్తాన్ 191 పరుగుల తేడాతో యువ భారత జట్టుపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది.ఇక ఆసియా కప్ అండర్-19 టైటిల్‌ను భారత్ ఇప్పటికే ఎనిమిదిసార్లు గెలవగా.. పాక్ తాజాగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా పాక్ ఆటగాళ్లు.. భారత ప్లేయర్లను రెచ్చగొట్టగా అందుకు ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యంగా విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. పాక్ ఆటగాళ్లకు వారి శైలిలోనే ఘాటుగా జవాబిచ్చాడు.చిల్లర చేష్టలు.. వైభవ్ సూర్యవంశీ ఏం చేశాడంటే..ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత అండర్-19 ఆటగాళ్లు టీమ్ బస్ ఎక్కే వేళ.. అక్కడికి చేరుకున్న పాక్ అభిమానులు.. యువ క్రికెటర్లను హేళన చేస్తూ కామెంట్లు చేశారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)పై అనుచిత రీతిలో కామెంట్లు చేస్తూ రాక్షసానందం పొందారు. అయితే, ఇక్కడ వైభవ్ హుందాగా ప్రవర్తించడం విశేషం.ఓవైపు.. వయసులో పెద్ద అయిన పాక్ ఫ్యాన్స్ తన పట్ల విద్వేషం ప్రదర్శిస్తున్నా.. వైభవ్ మాత్రం అసలు ఆ వైపు కూడా చూడకుండా పక్కవాళ్లతో మాట్లాడుతూ వెళ్లి బస్సు ఎక్కాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చిన్నపిల్లాడిపై ఇంత విద్వేషమా?ఈ నేపథ్యంలో.. ‘‘పద్నాలుగేళ్ల వయసులోనే క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్‌ను సిగ్గు లేకుండా హేళన చేస్తున్నారు. అండర్-19 ఆసియా కప్ గెలిస్తే ఏదో ప్రపంచ చాంపియన్లు అయినట్లు ఆ బిల్డప్ ఎందుకు?చిన్నపిల్లాడి పట్ల మీరు ప్రవర్తించిన తీరు మీ సంస్కారానికి అద్దం పడుతోంది. మరీ ఇంత అసూయ పనికిరాదు. ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకోండి. చిన్నపిల్లాడే అయినా అతడు ఎంత హుందాగా ఉన్నాడో చూడండి. తనని చూసైనా నేర్చుకోండి’’ అని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. కాగా ఆసియా కప్ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ 252 పరుగులు సాధించాడు. ఇందులో ఓ భారీ శతకం (171) ఉంది.చదవండి: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫినిషర్ ఎవరు?Pakistan’s fans are acting shamelessly and they have no sense of shame whatsoever.👀These people are booing 14-year-old Vaibhav Suryavanshi just because Pakistan won a ‘cheap’ U19 Asia Cup. They’re acting like Pakistan won the World Cup.🤦🏻This is why Pakistani people have no… pic.twitter.com/D1X6lgshr0— Mention Cricket (@MentionCricket) December 22, 2025 -
లగ్జరీ హోటల్లో ఫ్లైట్ అటెండెంట్ దారుణ హత్య, మాజీ భర్త అరెస్ట్
దుబాయ్‌లోని లగ్జరీ హోటల్లో యువతి దారుణ హత్య కలకలం రేపింది. ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిని మాజీ భర్తే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం దేశం విడిచి పారి పోయాడు.పోలీసులు సమాచారం ప్రచారం రష్యన్ విమానసేవల సంస్థ పోబెడా ఎయిర్ లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్న అనస్తాసియా దుబాయ్‌లోని లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్లో శవమై తేలింది. దుబాయ్‌లోని జుమేరా లేక్స్ టవర్స్ ప్రాంతంలోని వోకోబోనింగ్టన్ హోటల్లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, మొండెం, అవయవాలపై 15 కత్తి పోట్లున్నాయని, దర్యాప్తు అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం రష్యాలో ఆమె మాజీ భర్తను అరెస్టు చేశారు.ప్రధాన నిందితుడుగా రష్యన్ జాతీయుడు అనస్తాసియా మాజీ భర్త అయిన 41 ఏళ్ల ఆల్బర్ట్ మోర్గాన్ గా గుర్తించారు. యుఎఇ చట్ట అమలు సంస్థల అభ్యర్థన మేరకు, డిసెంబర్ 20న దుబాయ్ నుండి రష్యాలో దిగిన కొద్దిసేపటికే మోర్గాన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హత్య డిసెంబర్ 17-18 మధ్య హత్య జరిగిందని భావిస్తున్నారు. హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుబాయ్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నారు. మోర్గాన్‌ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఫిబ్రవరి 18 వరకు కనీసం రెండు నెలల పాటు కస్టడీలో ఉంచాలని రష్యన్ కోర్టు ఆదేశించింది.అనస్తాసియా మోర్గాన్ మధ్య విభేదాలు తలెల్తాయి. నిరంతరం ఆమెను అనుమానంతో వేధించేవాడు. దీంతో దాదాపు రెండేళ్ల నుంచీ వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం నిందితుడు దుబాయయ్లో ఉంటున్నాడు. అయితే నిర్భయంగా ఆమె జీవిస్తున్న తీరుపై అసూయ, అనుమానంతో రగిలిపోయి చివరకు ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త. మరోవైపు ప్రభుత్వ సంస్థ ఏరోఫ్లాట్ యాజమాన్యంలోని పోబెడా ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది... శివాజీపై నెటిజన్లు ఫైర్ -
వాటే ట్రయల్ రూమ్..! ఆ వైబ్స్‌కి ఫిదా అవ్వాల్సిందే..
సాధారణంగా మాల్స్‌లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయల్ రూమ్ మాత్రం అస్సలు చూసుండే ఛాన్సే లేదు. పైగా ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే..బయటకు రావడం చాలా కష్టమట. చెప్పాలంటే అస్సలు వదిలపెట్టి రాబుద్ధి కాదట.అబ్బా అంత స్పెషాలిటి ఏముంది అనుకుంటున్నారా..!.ఇన్స్టాగ్రామ్ యూజర్ సార్థక్ సచ్‌దేవా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అది చూస్తే దుబాయ్‌లో ట్రయల్ రూమ్స్ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఆ వీడియోలో దుబాయ్‌లోని H&M స్టోర్‌లోని హైటెక్ ట్రయల్ రూమ్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు సార్థక్ సచ్‌దేవా. చక్కటి మ్యూజిక్‌ని వింటూ డ్రెస్ మార్చుకోవచ్చు. అంతేగాదు అక్కడ ముందు ఉన్న టచ్‌స్క్రీన్ ప్యానెల్లో హైప్, వైబ్, చిల్, లోకల్ అనే నాలుగు రకాల సంగీత శైలిని అందిస్తుంది. వాటిలో మనకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకున్నాక..మొత్తం ట్రయల్ రూమ్ మ్యూజిక్ పరంగానే కాదు రూమ్ వ్యూ కూడా మారిపోతుంది. ఇక లోపలి గది గోడలు స్క్రీన్లతో ఉంటాయి. ఇందులోని డైనమిక్ విజువల్స్, కదిలే నమునాలు మనం ఎంచుకున్న సంగీతానికి అనుగుణంగా గది అంతా లైటింగ్‌ని ప్రొజెక్ట్ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే..ఆ గది హంగుఆర్భాటం, మంచి సంగీతానికి అందులోనే లీనమై ఉండిపోయేలా చేస్తుంది.అందుకు సంబంధించిన వీడియోకి “దుబాయ్‌లో వైరల్ డ్రెస్సింగ్ రూమ్!” అనే క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి..ఇలాంటి ట్రయల్ రూమ్ అయితే అక్కడే ఉండిపోతా అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sarthak Sachdeva (@sarthaksachdevva) (చదవండి: ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..? పీవీ సింధు ఏకంగా రూ. 7 లక్షలు..) -
ట్రయల్ రూమ్ @ నెక్ట్స్ లెవల్
కెమెరా క్లోజప్‌లో ఒక హైటెక్ టచ్ స్క్రీన్. పక్కనే కళ్లు జిగేల్మనే రంగురంగుల దీపాలు. బయట వేలాదిమంది సందడి చేసే షాపింగ్ మాల్. కానీ అందులోని ఓ చిన్న గదిలోకి వెళ్లగానే అంతా మాయా ప్రపంచం. మీరు ఎంపిక చేసే సంగీతం బీట్‌కు తగ్గట్టుగా గోడలు రంగులు మారిపోతాయి. అద్దం ముందు నిల్చున్నప్పుడు మీరొక సామాన్య కస్టమర్లా.. కాదుకాదు.. ఏదో గ్లామర్ వరల్డ్ సూపర్ స్టార్లా ఫీలైపోతారు..దుబాయ్‌లోని ప్రసిద్ధ హెచ్ అండ్ ఎం స్టోర్‌లో సార్థక్ సచ్‌దేవా అనే భారతీయ యువకుడికి ఒక వింత అనుభవం ఎదురైంది. సాధారణంగా మనం ట్రయల్ రూమ్‌లోకి వెళ్తే బట్టలు వేసుకుని చూసుకుని వచ్చేస్తాం. కానీ ఈ స్టైలిష్ డ్రెస్సింగ్ రూమ్ మాత్రం వేరే లెవల్. సార్థక్ సచ్‌దేవా షేర్ చేసిన ఈ వీడియో, షాపింగ్ అనుభవాన్ని సాంకేతికత ఎలా మారుస్తుందో కళ్లకు కట్టినట్లు చూపుతోంది. నాలుగు రకాల మూడ్స్.. ఆ ట్రయల్ రూమ్ లోపల ఒక టచ్ స్క్రీన్ ప్యానెల్ ఉంటుంది. అందులో నాలుగు ఆప్ష న్లు ఉంటాయి. ఫుల్ ఎనర్జీతో కూడిన సంగీతం.. దానికి తగ్గట్టుగా వేగంగా మారే కాంతి కిరణాలు. ట్రయల్ రూమ్ లోని టచ్‌స్క్రీన్ ప్యానెల్ ద్వారా యూజర్లు తమకు నచి్చన సంగీతాన్ని ఎంచుకోవచ్చు. వాటిలో హైప్, వైబ్, చిల్, లోకల్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. వైబ్: పార్టీ మూడ్‌ని సెట్ చేసే విజువల్స్. చిల్: ప్రశాంతమైన సంగీతం, ఆహ్లాదకరమైన రంగులు. లోకల్: అక్కడి నేటివిటీని ప్రతిబింబించే సంగీతం. తాకితే చాలు మతిపోతోంది సార్థక్ ఒక్కొక్క ఆప్షన్ని టచ్ చేస్తుంటే.. ఆ గది గోడలపై ఉన్న స్క్రీన్లు డైనమిక్ విజువల్స్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి. సంగీతం మారిన ప్రతిసారీ లైటింగ్ సింక్ అవుతూ సెకన్లలో గది వాతావరణాన్ని మార్చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేయగానే నిమిషాల్లో వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘దుబాయ్ ఎక్కడో ఉందనుకున్నాం.. ఇది నెక్సŠట్ లెవల్‘ అని ఒకరంటే.. ‘నాకు ఇలాంటి ట్రయల్ రూమ్ దొరికితే అసలు బయటికే రాను’.. అని ఇంకొకరు సరదాగా వ్యాఖ్యానించారు. అందమైన అనుభవాల గది సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని ఎంతగా మార్చేస్తుందంటే.. బట్టలు సరిపోయాయో లేదో చూసుకునే ఒక సాదాసీదా గదిని కూడా ఒక మధుర సంగీతానుభవాల లోకంగా మార్చేసింది. షాపింగ్ అంటే కేవలం వస్తువు కొనడం కాదు, అదొక అందమైన.. అద్భుతమైన జ్ఞాపకం కూడానని దుబాయ్ మరోసారి నిరూపించింది. మీరు కూడా ఇలాంటి ట్రయల్ రూమ్ లోకి వెళ్తే మొదట ఏ సంగీతం ప్లే చేస్తారో ఊహించుకోండి..! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మునిగిన దుబాయ్.. బయటకు రావొద్దంటూ హెచ్చరిక
-
ఉరుములు, మెరుపులతో దుబాయ్ ను వణికిస్తున్న భారీ వర్షం
-
దుబాయ్‌లో భారీ వర్షం.. బుర్జ్ ఖలీఫా పరిస్థితి ఇది..
దుబాయ్ (Dubai)ని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపిలేని కుండపోత వర్షం కారణంగా దుబాయ్ వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి కాలనీలు నీట మునిగాయి. పలుచోట్ల పిడుగులతో (Lightning strikes) కూడిన వర్షం కురిసింది. వర్షం సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)ను పిడుగు తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం సమయంలోనే దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యాన్ని స్వయంగా ఆ దేశ యువరాజు (Dubai crown prince) షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకింది. ఈ వీడియోకి ‘దుబాయ్’ అనే చిన్న క్యాప్షన్ మాత్రమే జోడించారు యువరాజు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లు, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, తరచూ పిడుగులు పడుతున్నా, భవనానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.Heavy rain early this morning led to localized flooding across parts of Dubai and other UAE areas. Waterlogging was reported on several roads as authorities issued weather warnings and urged residents to stay cautious and avoid unnecessary travel.Emergency teams are monitoring… pic.twitter.com/dwSYOXuT4Y— Mazhar Khan (@Mazhar4justice) December 19, 2025ఇక, ప్రస్తుతం యూఏఈలో వాతావరణం అస్థిరంగా ఉంది. 'అల్ బషాయర్' అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా రాస్ అల్ ఖైమాలో గోడ కూలిపోవడంతో భారత్‌కు చెందిన 27 ఏళ్ల సల్మాన్ ఫరీజ్ మృతి చెందినట్టు స్థానిక అధికారులు తెలిపారు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. First Rain in Dubai this year. Thank you, God, for this life-giving rain! We praise You for replenishing the earth, and bringing relief and new life, Thank you for every drop that nourishes our plants, fills our rivers, and refreshes our souls, making us remember our dependence… pic.twitter.com/AVCtSWysVg— Dolly_Pizzle of Chelsea💙🦅 (@harbyhorlar2) December 19, 2025Shaikh Hamdan posts video of lightning strike on Burj KhalifaShaikh Hamdan bin Mohammed bin Rashid Al Maktoum, Crown Prince of Dubai, posted a video of lightning striking the tip of the world's tallest building, Burj Khalifa, as heavy rain hit parts of Dubai and the rest of the… pic.twitter.com/wHZpC49W3I— GDN Online (@GDNonline) December 18, 2025 -
దుబాయ్‌లో దంచికొట్టిన వర్షం.. బుర్జ్ ఖలీఫాను తాకిన పిడుగు (ఫొటోలు)
-
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి. -
ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన: వ్యక్తి రిమాండ్
శంషాబాద్: ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మూడు రోజుల కిందట దుబాయ్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన బాలకృష్ణన్ రమేష్ (58) అనే ప్రయాణికుడు మద్యం తాగుతూ ఎయిర్‌హోస్టెస్‌ను ఉద్దేశపూర్వకంగా చేతితో తగిలి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై ఎయిర్‌లైన్స్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆసియా కప్- 2025: భారత్ ఘన విజయం
ఆసియా క్రికెట్ మండలి మెన్స్ అండర్-19 ఆసియా కప్-2025 టోర్నీలో భారత్ శుభారంభం చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఏకంగా 234 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.దుబాయ్‌లో ఐసీసీ అకాడమీ వేదికగా భారత్- యూఏఈ (IND vs UAE) మ్యాచ్‌తో ఈ వన్డే ఫార్మాట్ టోర్నీకి తెరలేచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం ఆరు వికెట్లు నష్టపోయి ఏకంగా 433 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.దంచికొట్టిన భారత బ్యాటర్లుఇందులో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)ది కీలక పాత్ర. పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు కేవలం 95 బంతుల్లోనే 171 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, 14 సిక్సర్లు ఉండటం విశేషం. ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఆరోన్ జార్జ్ (69), ఆ తర్వాతి స్థానంలో వచ్చిన విహాన్ మల్హోత్రా (69) అర్ధ శతకాలతో సత్తా చాటగా.. వేదాంత్ త్రివేది (38) కూడా రాణించాడు.ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు (17 బంతుల్లో 32 నాటౌట్), కనిష్క్ చౌహాన్ (12 బంతుల్లో 28) దంచికొట్టారు. అయితే, కెప్టెన్, ఓపెనర్ ఆయుశ్ మాత్రే (4) మాత్రం నిరాశపరిచాడు. ఇక యూఏఈ బౌలర్లలో యుగ్ శర్మ, ఉద్దిశ్ సూరి చెరో రెండు వికెట్లు తీయగా.. షాలోమ్ డిసౌజా, కెప్టెన్ యాయిన్ రాయ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.కుదేలైన యూఏఈ బ్యాటింగ్ ఆర్డర్ఇక భారత్ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లు కెప్టెన్ యాయిన్ రాయ్ (17), షాలోమ్ డిసౌజా (4).. వన్‌డౌన్ బ్యాటర్ అయాన్ మిస్బా (3) విఫలమయ్యారు. నాలుగో స్థానంలో ఆడిన ముహమూద్ రేయాన్ ఖాన్ (19) కూడా నిరాశపరిచగా.. అహ్మద్ హుదాదాద్ డకౌట్ అయ్యాడు.మిగతా వారిలో నూరుల్లా ఆయోబి 3 పరుగులకే పెవిలియన్ చేరగా.. ఐదో నంబర్ బ్యాటర్ పృథ్వీ మధు (50), ఉద్దిశ్ సూరి (106 బంతుల్లో 78 నాటౌట్) గట్టి పోరాటం చేశారు. వీరికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ సలే అమీన్ (20 నాటౌట్) తన వంతు ప్రయత్నం చేశాడు.234 పరుగుల తేడాతో జయభేరిఅయితే, భారత బౌలర్ల ధాటికి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 199 పరుగులకే యూఏఈ పరిమితమైంది. ఫలితంగా యువ భారత్ 234 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ రెండు వికెట్లు తీయగా.. కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్ తదుపరి డిసెంబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది.చదవండి: వాళ్లకు చెడు అలవాట్లు.. నా భర్త ఎలాంటివాడంటే: జడేజా భార్యVaibhav Sooryavanshi moves. The action responds. 😮💨A classy grab from our Boss Baby 👏 Watch #INDvUAE at the #DPWorldMensU19AsiaCup2025 LIVE NOW, on Sony Sports Network TV channels & Sony LIV!#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/5w0MUUWzzZ— Sony Sports Network (@SonySportsNetwk) December 12, 2025 -
రూ. 1500కోట్ల స్కాం : నటుడు సోనూ సూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీకి సిట్ నోటీసులు
దుబాయ్ బ్లూచిప్ కేసులో కీలక పరిణామం చేసుకుంది. రూ.1500 కోట్ల కుంభకోణం కేసులో నటుడు సోనూసూద్ , రెజ్లర్ గ్రేట్ ఖలీకి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇటీవల అరెస్ట్ అయిన UAEలో అతిపెద్ద పెట్టుబడి మోసానికి పాల్పడిన వ్యాపారవేత్త రవీంద్ర నాథ్ సోనిని 7 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బ్లూ చిప్ కంపెనీల ద్వారా రూ.1500 కోట్ల మెగా స్కాంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణలో భాగంగా నటుడు సోను సూద్ , గ్రేట్ ఖలీ ఇద్దరూ కంపెనీని ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి ప్రశ్నలకు సమాధానాలు కోరుతూ పోలీసులు ఇద్దరికీ నోటీసులు పంపారు. వారు బ్లూ చిప్ కంపెనీని ప్రమోషన్స్, ప్రచారం చేశారా లేదా అనేది స్టేట్మెంట్లను రికార్డ్ చేయమని కోరారు. ఇద్దరూ బ్లూ చిప్ కంపెనీని ప్రోత్సహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు అజారుద్దీన్ పేరు కూడా చర్చనీయాంశమైంది, సోనూ సూద్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ రవీంద్ర సోని కంపెనీ ఈవెంట్లలో పాల్గొన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోను బాధితులు దుబాయ్ నుండి కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు పంపారు. ఈ వీడియోలను పరిశీలించిన అనంతరం అజారుద్దీన్‌కు కూడా నోటీసు పంపవచ్చని పోలీసులు చెబుతున్నారు.ఏడీసీపీ నాయకత్వంలో SITపోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ ఈ భారీ మోసం కేసును దర్యాప్తు చేయడానికి ఒక SITని ఏర్పాటు చేశారు. ADCP అంజలి విశ్వకర్మ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే రవీంద్ర సోనీకి సంబంధించిన ఎనిమిది క్రిప్టో ఖాతాల వివరాలను సేకరించారు. దీనిలో ప్రవాస భారతీయులు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి. ఈ విషయంలో ఢిల్లీ , డెహ్రాడూన్‌తో సహా 22 ప్రదేశాలలో ఖాతాలను సిట్ గుర్తించింది. ఈ కేసులో SIT దుబాయ్ పోలీసులతో కూడా సంప్రదిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ రఘువీర్ లాల్ పేర్కొన్నారు. ఇప్పటివరకు, రవీంద్ర సోనిపై 17 మంది ముందుకు వచ్చారు. వీరిలో దుబాయ్‌లో నివసిస్తున్న ముగ్గురు బాధితులు కేసులు నమోదు చేశారు.ఇదీ చదవండి: Indigo Crisis చేతకాని మంత్రీ తప్పుకో.. నెటిజన్లు ఫైర్అసలేంటీ రవీంద్ర సోనీ కసుఢిల్లీలోని మాల్వియా నగర్‌కు చెందిన సోని కొన్నేళ్ల క్రితం దుబాయ్‌కు మకాం మార్చి 12 షెల్ కంపెనీలను స్థాపించాడు, వాటిలో ఒకటి ‘బ్లూ చిప్ ట్రేడింగ్’ కంపెనీ. హై-ఎండ్ ఫారెక్స్ ట్రేడింగ్ ముసుగులో, 30–40శాతం తక్షణ రాబడి హామీలతో ప్రవాస భారతీయులను ఆకర్షించాడు. భారతదేశంలోనూ, దుబాయ్‌లోనూ వందలాది భారతీయులను మోసాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ స్కాం బహుళ దేశాలకు విస్తరించి ఉందని, క్రిప్టోకరెన్సీ లాండరింగ్, హవాలా మార్గాలు ఉన్నాయని, జాతీయ భద్రతాపరమైన చిక్కులు కలిగి ఉండవచ్చని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. కనీసం 400–500 మంది పెట్టుబడిదారులను ఈ కంపెనీ మోసంచేసి దాదాపు రూ. రూ. 1500 కోట్లు వసూలు చేసిందని అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో ఒకటి, అలీఘర్, కాన్పూర్ నగర్, ఢిల్లీ,పానిపట్‌లలో ఒక్కొక్కటి సహా అతనిపై ఐదు ఎఫ్ఐఆర్లు ఇప్పటికే నమోదయ్యాయి.ఈ స్కాం ఎలా బయట పడిందిబ్లూచిప్, 18 నెలల పాటు కనీసం 10వేల డాలర్లపై పెట్టుబడిపై నెలకు 3 శాతం - లేదా సంవత్సరానికి 36 శాతం - "గ్యారంటీ" రాబడిని ప్రకటించాడు. మొదటి కొన్ని సంవత్సరాలుగా, క్రమం తప్పకుండా రిటర్న్‌లను చెల్లించి అందర్నీ నమ్మించాడు. అకస్మాత్తుగా నిధులను వ్యక్తిగత ఖాతాలు, క్రిప్టోకరెన్సీలు మరియు ఆఫ్‌షోర్ ఛానెల్‌లలోకి మళ్లించేవాడని ఆరోపించారు. అయితే ఈ కంపెనీ 2024లో దివాలా తీసింది. దీంతో వందలాది ఎన్ఆర్ఐలు భారీ ఎత్తున నష్టపోయారు. దీనిపై జనవరి 5న ఢిల్లీ నివాసి అబ్దుల్ కరీం తనపై దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నవంబర్ 30న, డెహ్రాడూన్‌లో కాన్పూర్ పోలీసులు సోనిని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ నగర్‌లోని లా & ఆర్డర్ అదనపు డిప్యూటీ కమిషనర్ అంజలి విశ్వకర్మ సమాచారం ప్రకారం వారు ఆర్డర్ చేసిన ఫుడ్ చిరునామా ఆధారంగా సోని బస చేసిన రహస్య ప్రదేశాన్ని గుర్తించారు. -
ఐపీఎల్-2026 వేలంలో బిగ్ ట్విస్ట్..! ఫైనల్ లిస్ట్ ఖరారు
ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న దుబాయ్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వేలంలో పాల్గోనే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేలం కోసం మొత్తం 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 350 మంది షార్ట్‌లిస్ట్ అయినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. ఈ లిస్ట్‌లో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన 35 మంది ఆటగాళ్లు ఉండటం గమనార్హం. సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తొలుత తన పేరును రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో మొదటి ప్రకటించిన జాబితాలో అతడు పేరు లేదు. కానీ చివరి నిమిషంలో తన మనసును మార్చుకుని వేలంలో పాల్గోవాలని నిర్ణయించుకున్నాడు.దీంతో కొన్ని ఫ్రాంచైజీల అభ్యర్థన మేరకు డి కాక్‌ను తుది జాబితాలో చేర్చారు. డికాక్ తన బేస్ ధరను 50 శాతం తగ్గించుకున్నాడు. కనీస ధర రూ. రూ.కోటి రూపాయలతో అతడు వేలం బరిలోకి దిగనున్నాడు. ఈ 35 మంది క్రికెటర్లలో శ్రీలంక, సౌతాఫ్రికా ప్లేయర్లతో పాటు భారత దేశవాళీ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇక వేలానికి సంబంధించిన విదివిధానాలు బీసీసీఐ ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలను మెయిల్ చేసినట్లు తెలుస్తోంది.వేలం రూల్స్ ఇవే..ఈ మినీ వేలం మొదట క్యాప్డ్ (Capped) ఆటగాళ్లతో ప్రారంభమవుతుంది. ఇందులో బ్యాటర్లు, ఆల్-రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ఉంటారు. తరువాత అన్క్యాప్డ్ (Uncapped) ఆటగాళ్లతో పూర్తి రౌండ్ కొనసాగుతుంది.మొదటి 70 మంది ఆటగాళ్ల పేక్లు పూర్తయిన తర్వాత మిగిలిన ప్లేయర్ల కోసం యాక్సిలరేటెడ్ రౌండ్‌ను నిర్వహించనుంది. చివగా తొలి మూడు రౌండ్లలో అమ్ముడుపోని ఆటగాళ్లు ఆఖరిలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే ఈసారి మార్క్యూ లిస్ట్ రౌండ్ ఉండదు. తొలి రౌండ్లో కెమెరూన్ గ్రీన్, డెవాన్ కాన్వే, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, డేవిడ్ మిల్లర్ వంటి విదేశీ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశముంది. అదే విధంగా వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్‌కు కూడా భారీ ధర దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ వేలంలో అన్ని జట్లు కలిపి మొత్తం 77 స్లాట్లు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో 31 విదేశీ స్థానాలు ఉన్నాయి.ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్లువిదేశీ ఆటగాళ్లు: అరబ్ గుల్ (ఆఫ్ఘనిస్తాన్), మైల్స్ హమ్మండ్ (ఇంగ్లండ్), డాన్ లాటెగాన్ (ఇంగ్లండ్), క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎస్టర్‌హూజెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బయాండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), డిసురి లంకాల్ (పెర్నాగెసల్ వెల్సాల్ లంకా), డిసురి లంకాల్ (శ్రీలంక), అకీమ్ అగస్టే (వెస్టిండీస్).భారత ఆటగాళ్లు: సాదేక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యష్‌రాజ్ పుంజా, సాహిల్ పరాఖ్, రోషన్ వాఘ్సారే, యష్ డిచోల్కర్, అయాజ్క్ వల్కర్, ధుర్మిల్త్ ఖాన్, ధుర్మిల్త్ ఖాన్ పురవ్ అగర్వాల్, రిషబ్ చౌహాన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన్ షెకావత్.చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్..! -
ఆరోన్ జార్జికు చోటు
న్యూఢిల్లీ: వచ్చే నెలలో 12 నుంచి 21 వరకు దుబాయ్ వేదికగా జరిగే అండర్–19 ఆసియా కప్ టోరీ్నలో పోటీపడే భారత జట్టును ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ఆరోన్ జార్జికు ఈ జట్టులో స్థానం లభించింది. ఆరోన్ జార్జి సారథ్యంలో ఇటీవలే హైదరాబాద్ జట్టు వినూ మన్కడ్ ట్రోఫీలో తొలిసారి విజేతగా నిలిచింది. 15 మంది సభ్యులతో కూడిన భారత అండర్–19 జట్టుకు ముంబైకు చెందిన ఆయుశ్ మాత్రే సారథిగా వ్యవహరిస్తాడు. విహాన్ మల్హోత్రా వైస్కెపె్టన్గా ఎంపికయ్యాడు. వన్డే ఫార్మాట్లో జరగనున్న ఈ టోరీ్నలో ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లపై అందరి దృష్టి నిలవనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో జింబాబ్వే, నమీబియా వేదికగా అండర్–19 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నమెంట్ భారత జట్టుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇటీవల రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో 32 బంతుల్లోనే సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ... ఈ టోరీ్నలో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది ఆసక్తికరం. టోరీ్నలో భాగంగా డిసెంబర్ 12న భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రత్యర్థి ఇంకా తేలలేదు. రెండో మ్యాచ్‌లో 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. డిసెంబర్ 16న మూడో లీగ్ మ్యాచ్ ఆడనుంది. డిసెంబర్ 19న సెమీఫైనల్స్, 21న ఫైనల్ జరగనున్నాయి. భారత అండర్–19 జట్టు: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్, హర్వన్‡్ష, యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్, నమన్, దీపేశ్, హెనిల్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జి. స్టాండ్‌బై ప్లేయర్లు: రాహుల్, హెమ్చుడెశన్, కిషోర్, ఆదిత్య రావత్. -
దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)
-
దుబాయి మ్యూజియంలో అల్లు స్నేహ (ఫొటోలు)
-
ఇంత విషాదం చోటు చేసుకున్నా కంటిన్యూ చేస్తారా?
దుబాయ్‌లో శుక్రవారం నాటి ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ నమాంశ్ సియాల్(37) దుర్మరణం చెందాడు. యుద్ధ విమానం అదుపు తప్పి క్రాష్ కావడంతో పైలట్ మృత్యువాత పడ్డారు ఇంతటి విషాదం చోటు చేసుకున్న సదరు ఎయిర్ షో కొనసాగించడంపై యూఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్ మేజర్ టేలర్ ఫెమీ హీస్టర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఇంతటి దారుణం చేసుకున్నా షోను ఎలా కొనసాగిస్తారంటూ ప్రశ్నించాడు. ఇదేనా సాటి పైలట్ ఇచ్చే గౌరవం అంటూ షో నిర్వహకులపై మండిపడ్డారు. అదే సమయంలో తాను ఈ షోలో పాల్గొననంటూ వైదొలిగారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు హీస్టర్. ‘ మా తుది ప్రదర్శనను ఇవ్వడానికి మా టీమ్ సిద్ధంగా లేదు. ఈ షో నుంచి మేము వైదులుగుతున్నాం. అందుకు కారణం.. తేజస్ యుద్ధ విమానం కూలిపోయి భారత పైలట్ దుర్మరణం చెందితే షోను కొనసాగించాలనుకోవడం మంచి పరిణామం కాదు. ఇదేనా మనం తోటి పైలట్‌కు, వారి కటుంబానికి ఇచ్చే గౌరవం?’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినప్పటికీ ఎగిరే ప్రదర్శనలు కొనసాగుతాయని సమాచారం అందిన తర్వాత ఏం జరిగిందనేది హీస్టర్ వివరించాడు. ప్రమాదం జరిగిన గంట, రెండు గంటల మధ్యలో అక్కడకి వెళ్లాను,. అది ఖాళీగా ఉంది. షో ఆపివేయబడుతుందని అనుకున్నాను. అలా జరగలేదు. మళ్లీ యథావిధిగా షో నిర్వహించారు. అందుకే మా టీమ్ షో నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది’ యూఎస్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ తెలిపారు.ఆరోజు జరిగిన ప్రమాదం తేజస్ యుద్ధ విమానం కంట్రోల్ తప్పి నేలపై పడటంతో మంటలు చుట్టుముట్టాయి. ఆ ఘటనలో తేజస్ పైలట్ మాంశ్ సియాల్ ప్రాణాలు కోల్పోయాడు.సెల్యూట్‌తో భర్తకు కన్నీటి వీడ్కోలు -
సెల్యూట్‌తో భర్తకు కడసారి వీడ్కోలు..
సిమ్లా: దుబాయ్‌లో శుక్రవారం ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ నమాంశ్ సియాల్(37) అంత్యక్రియలు ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని సొంతూళ్లో జరిగాయి. తమ ప్రియమైన ‘నమ్ము’కు నివాళులర్పించేందుకు అధికారులు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వింగ్ కమాండర్ నామాంశ్ సియాల్‌కు ఆయన భార్య, వింగ్ కమాండర్ అయిన అఫ్షాన్ సెల్యూట్‌తో ఘనంగా నివాళులర్పించారు. కన్నీరు చెమర్చిన కళ్లతో కూతురును పొదివి పట్టుకుని భర్తకు ఆమె తుది వీడ్కోలు పలికారు. పూర్తి సైనిక లాంఛనాలు, గన్ సెల్యూట్‌తో అంత్యక్రియలు జరిపారు. నమాంశ్ సియాల్ చితికి బంధువు నిశాంత్ నిప్పు పెట్టారు. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆయనకు పుష్పాంజలి సమర్పించాయి. నమాంశ్ సియాల్‌కు తల్లిదండ్రులతోపాటు భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన తండ్రి జగన్నాథ్ సియాల్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా ఉన్నారు. అంతకుముందు, దుబాయ్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న సూలూర్ ఎయిర్‌బేస్‌కు విమానంలో అధికారులు సియాల్ పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో గగ్గాల్ ఎయిర్‌పోర్టుకు ఐఏఎఫ్ విమానంలో మృతదేహాన్ని తరలించారు. పలువురు రాష్ట్ర నేతలు, అధికారులు గగ్గల్ ఎయిర్‌పోర్టు నుంచి స్వగ్రామం పటియాల్కార్ గ్రామానికి ఆర్మీ ట్రక్కులో మృతదేహాన్ని తీసుకువచ్చారు. కాగా, విమానప్రమాదంలో అసువులు బాసిన వింగ్ కమాండర్ నమాంశ్కు సినీ ప్రముఖులు కమల్ హాసన్, సోనూ సూద్, అద్నాన్ సమీ నివాళులర్పించారు. -
నా షో వస్తుంది చూడు నాన్న ..!
నిన్న దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో తేజస్ ఫైటర్ కుప్పకూలడంతో భారత ఫైలట్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన వివరాలు యూట్యూబ్ రీల్స్ చూస్తుండగా తెలిసిందని ఆయన తండ్రి మీడియాతో తెలిపారు. ఈ ఘటన వివరాలు తెలియగానే తన కోడలికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు గొప్ప స్థానాల్లో ఉంటే చూడాలని కలలుగంటారు. ఇక వారి పిల్లల గొప్పతనాన్ని ఏవరైనా ప్రశంసిస్తే ఇక వారి ఆనందానికి అవదులే ఉండవు. అయితే తమ పిల్లల గొప్పతనాన్ని చూసి సంబరపడిపోదామనుకున్న తల్లిదండ్రులకు వారు మృతిచెందడం చూడాల్సి వస్తే ఇక ఆ బాధ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో వారు ప్రత్యక్ష నరకమే అనుభవిస్తారు. నిన్న దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షో అటువంటి చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది. దుబాయ్ లో జరిగిన ఎయిర్ షో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతుందని దానిని చూడాలని వింగ్ కమాండర్ నమాన్ష్ సయాల్ తన తండ్రికి చెప్పారు. దీంతో ఎంతో సంబురంగా తన కొడుకు ప్రతిభను చూడాలనుకున్న తండ్రికి ప్రమాదంలో కుమారుడు మృతి చెందడం చూడాల్సి వచ్చింది.దుబాయ్ లో జరిగిన ఎయిర్ క్రాష్ ఘటనపై వింగ్ కమాండర్ నమాన్ష్ సయీల్ తండ్రి స్పందించారు. " నిన్న 4 గంటల ప్రాంతంలో ఎయిర్ షో లైవ్ వీడియోల కోసం యూట్యూబ్ లో వెతుకుతున్నాను. అప్పుడే జెట్ క్రాష్ అయిందనే సంగతి నాకు తెలిసింది. దీంతో వెెంటనే తన కోడలుకు కాల్ చేశానని, కొద్ది సేపటికే ఐదుగురు ఎయిర్ ఫోర్స్ అధికారులు తమ ఇంటికి రావడంతో ఎదో జరిగిందని నాకు అర్థమైంది" అన్నారు. ఈ ప్రమాద ఘటనకు ఒకరోజు ముందే తన కొడుకుతో మాట్లాడనని ఎయిర్ షో టీవీలో వస్తుంది చూడాలని తనకు తెలిపాడన్నారు.నమాన్ష్ సయీల్ తండ్రి హిమాచల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా రిటైరయ్యారు. సయీల్ భార్య సైతం ఐఏఎఫ్ లో వింగ్ కమాండర్‌గా విధులు నిర్వహిస్తుంది. నిన్న దుబాయ్ లో జరిగిన ఎయిర్ షోలో ప్రమాదవశాత్తు తేజస్ ఫైటర్ కూలి వింగ్ కమాండర్ సయీల్ మృతి చెందారు. -
కుప్పకూలిన తేజస్
న్యూఢిల్లీ/దుబాయ్: దుబాయ్ వైమానిక ప్రదర్శనలో పెనువిషాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో తేజస్ పైలట్ మృతి చెందినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. తేజస్ ఎంకే1 కూలిపోయి మంటలు చెలరేగిన దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి. శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో భాగంగా టేకాఫ్ తీసుకున్న ఈ ఫైటర్ జెట్ హఠాత్తుగా కిందికి దిగింది. నేలను తాకగానే బంతి ఆకారంలో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వెలువడింది. పైలట్, వింగ్ కమాండర్ నమాన్‡్ష సయాల్ అక్కడికక్కడే మరణించారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన జనం ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు. చాలాసేపటి దాకా షాక్‌లోనే ఉండిపోయామని చెప్పారు. ప్రమాదం జరగ్గానే అగి్నమాపక, అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేశారు. సంతాపం ప్రకటించిన సీడీఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దుబాయ్ ఎయిర్ షోలో వివిధ దేశాలకు చెందిన విమానాలు, ఫైటర్ జెట్లు పాల్గొంటున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్సీఏ) తేజస్ ఎంకే1 కూడా ఇందులో చేరింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.10 గంటలకు విన్యాసాల్లో భాగంగా అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ కాగానే ప్రమాదం జరిగినట్లు భారత వైమానిక దళం ‘ఎక్స్’లో వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన పైలట్ ఘటనా స్థలంలోనే మృతిచెందారని పేర్కొంది. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని, బాధితుడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని, అన్నివిధాలుగా అండగా ఉంటామని వివరించింది. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తుకు ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సైతం స్పందించారు. పైలట్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తేజస్ విమాన ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోవడం పట్ల సీడీఎస్తోపాటు సైనిక దళాల్లోని అన్ని ర్యాంకుల అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టుచేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్‌లో ప్రతి రెండేళ్లకోసారి ఎయిర్ షో నిర్వహిస్తుంటారు. రకరకాల విమానాలను ఇందులో ప్రదర్శిస్తుంటారు. విమానాల విన్యాసాలు సైతం ఉంటాయి. ఈసారి 150 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. భారత వైమానిక దళం నేతృత్వంలోని సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఈ ఎయిర్‌షోలో విజయవంతంగా విన్యాసాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం విషాదాన్ని నింపింది. ఆయిల్ లీకేజీ వల్లేనా? తేజస్ ఫైటర్‌జెట్ కూలిపోవడం గత 24 ఏళ్లలో ఇది కేవలం రెండోసారి మాత్రమే. ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించడానికి నిపుణులు ప్రయతి్నస్తున్నారు. దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొంటున్న తేజస్ ఎంకే1 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో చమురు లీక్ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ప్రభుత్వం ఖండించింది. అలాంటిదేమీ లేదని, అంతా సవ్యంగానే ఉన్నట్లు వివరణ ఇచ్చింది. ఇంతలోనే ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. చమురు లీక్ వల్లే కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇంజన్లో మంటలు అంటుకోవడం వల్లే తేజస్ అదుపుతప్పి నేలకూలినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏమిటీ తేజస్? తేజస్‌ను బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) ఉమ్మడిగా చాలావరకు దేశీయ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశాయి. ఇది సింగిల్–ఇంజన్, మల్టీ–రోల్ ఫైటర్‌జెట్. 2003లో తేజస్ అని అధికారికంగా పేరుపెట్టారు. ఇందులోని ఇంజన్మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. భారత వైమానిక దళం ప్రస్తుతం ఎంకే1 వేరియంట్ తేజస్‌ను ఉపయోగిస్తోంది. అత్యాధునిక ఎంకే1ఏ వేరియంట్ కోసం ఎదురు చూస్తోంది. తేజస్ విమానం షార్ట్–రేంజ్ క్షిపణులను, ఆకాశం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను మోసుకెళ్లగలదు. ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకోగలదు. 2020 అక్టోబర్‌లో తేజస్ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. తర్వాత సరిచేశారు. తేజస్‌ను వైమానిక దళంలో కీలక అస్త్రంగా పరిగణిస్తుంటారు. ఏడాది క్రితం ప్రమాదం 2024 మార్చి నెల లో ‘భారత్ శక్తి’ ప్రదర్శనలో భాగంగా రాజస్తాన్‌లోని పోఖ్రాన్లో విన్యాసాలు నిర్వహించి వెనక్కి తిరిగివస్తుండగా తేజస్ విమానం కూలిపోయింది. జైసల్మేర్ సమీపంలోని ఓ కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పైలట్ క్షేమంగా బయటపడ్డాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తేజస్ జెట్లు 2001లో విధుల్లో చేరగా, కూలిపోవడం అదే మొదటిసారి. తాజాగా దుబాయ్‌లో జరిగిన ప్రమాదం రెండోది. -
Dubai: కుప్పకూలిన భారత ఫైటర్ జెట్ విమానం
-
దుబాయ్ ఎయిర్ షోలో కూలిన భారత తేజస్.. పైలట్ మృతి
యూఏఈ: దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. శుక్రవారం దుబాయ్‌లో జరిగిన ఎయిర్‌షోలో ప్రదర్శన సందర్భంగా భారత్ తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ మృతిచెందారు.భారత్ ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ,హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ తేజస్ యుద్ధవిమానం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఎయిర్ షోలో కూలింది. యుద్ధ విమానం కూలిన తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? లేదంటే పైలెట్ తప్పిదమా? అన్నది తెలియాల్సి ఉండగా.. దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ మృతి చెందినట్లు దుబాయ్ మీడియా కార్యాలయం ధృవీకరించిందిరెస్క్యూ ఆపరేషన్లు వెంటనే ప్రారంభమయ్యాయి, ప్రదర్శన తాత్కాలికంగా నిలిపివేయబడింది మరియు సందర్శకులను అది కలిగించిన అంతరాయం తర్వాత ప్రదర్శన ప్రాంతానికి తిరిగి రావాలని ఆదేశించారు. ఈ సంవత్సరం నవంబర్ 17 న ప్రారంభమైన మరియు నవంబర్ 24 వరకు కొనసాగే ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ షోలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షో, 1,500 మందికి పైగా ఎగ్జిబిటర్లను ఒకచోట చేర్చింది. #WATCH | Dubai | An IAF Tejas fighter aircraft has crashed during the Dubai Air Show; no pilot ejection has been detected so far. This is only the second reported accident involving the Tejas jet. More details awaited. #DubaiAirShow #Tejas #IAF #Breaking pic.twitter.com/04zcckv8xA— Argus News (@ArgusNews_in) November 21, 2025 -
దుబాయ్‌లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు: ఎప్పుడంటే?
ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు 2025 డిసెంబర్ 12 నుంచి 14 వరకు యుఎఇలోని.. ప్రతిష్టాత్మక దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో నిర్వహించనున్నట్లు ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ) అధికారికంగా ప్రకటించింది. మూడు రోజుల ఈ అంతర్జాతీయ మహా సభలు డిసెంబర్ 12న ప్రత్యేకమైన నెట్వర్కింగ్ ఈవెంట్ & యాచ్ పార్టీతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 13, 14 తేదీల్లో ప్రధాన సమావేశాలు, డబ్ల్యూటీఐటీసీకు నూతన నాయకత్వం వహించేవారు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది.ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించబడే “ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు” ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తల అత్యంత ప్రాధాన్యమైన ప్రపంచ సమావేశాల్లో ఒకటిగా అవతరించింది. 2023లో సింగపూర్‌లో నిర్వహించిన గత మహాసభలో 100 దేశాలను ప్రాతినిధ్యం వహించిన 3,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని, సాంకేతిక రంగంలో తెలుగు వృత్తిపరుల ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్న మార్పులు, అధునాతన సాంకేతికతపై పెద్ద ఎత్తున్న చర్చించారు. 2025లో దుబాయ్‌లో జరగబోయే ఈ మహా సభ విజయ వారసత్వాన్ని కొనసాగిస్తూ, 2027లో జరగబోయే తదుపరి ద్వైవార్షిక ఎడిషన్‌కు వేదికను ఏర్పాటు చేస్తుంది.ఈ కార్యక్రమం ద్వారా 100కి పైగా దేశాల నుంచి తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు ఒక వేదికపైకి రానున్నారు. ఈ మహాసభ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బ్లాక్‌చైన్, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ డిజైన్, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫిన్‌టెక్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ వంటి అత్యాధునిక రంగాల్లో జరుగుతున్న పురోగతులను ప్రదర్శించనున్నారు. యూఏఈ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, రాజ కుటుంబ ప్రతినిధులు, విధాననిర్మాతలు అలాగే ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి తమ అధికారిక మద్దతును ప్రకటించాయి. రెండు రాష్ట్రాలు కూడా ఈ కాన్ఫరెన్స్‌లో తమ ప్రధాన సాంకేతిక, స్టార్టప్ అండ్ ఆవిష్కరణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నాయి. రెండు రాష్ట్రాల నుంచి ముఖ్యాధికారులు, మంత్రులు పాల్గొని, తమ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ రోడ్‌మ్యాప్స్ & ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను వివరించనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా ఉన్న స్థాయిని మరింత బలపరచనుంది.ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సిద్ధంగా ఉండేందుకు, డబ్ల్యూటీఐటీసీ దుబాయ్ లీడర్షిప్ టీమ్ ఇటీవల దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఒక ప్రణాళికా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 40 మందికిపైగా కోర్ సభ్యులు, నిర్వాహకులు పాల్గొని, ఈ మహాసభకు సంబంధించిన లాజిస్టిక్స్ & అమలు ప్రణాళికలను తుది రూపమిచ్చారు. ఈ సమావేశానికి డబ్ల్యూటీఐటీసీ అంతర్జాతీయ సమన్వయకర్తలు, యూఏఈ చాప్టర్ నాయకులు, ప్రముఖ ఐటీ నిపుణులు హాజరయ్యారు. ఈ సమావేశం ద్వారా భారతదేశం వెలుపల జరగబోయే అతిపెద్ద తెలుగు సాంకేతిక సదస్సు కోసం అధికారికంగా ప్రారంభమైనట్లు గుర్తించబడింది.ఈ కార్యక్రమంలోని ప్రధాన ఆకర్షణగా 2026–2028 కాలానికి నియమించబడిన డబ్ల్యూటీఐటీసీ గ్లోబల్ లీడర్షిప్ టీమ్ గ్రాండ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నాయకత్వం, సహకారంలో ఒక కొత్త యుగానికి నాందిగా నిలవనుంది.సింగపూర్‌లో పొందిన అపార విజయానంతరం, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సాంకేతిక నిపుణులను ఏకైకంగా కలపడానికి మా తదుపరి స్థానం దుబాయ్ అవుతుందని డబ్ల్యూటీఐటీసీ ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు. ఈ మహాసభ కేవలం సాంకేతికత గురించి కాదు, ఇది తెలుగు గౌరవం, ఆవిష్కరణ, ప్రపంచ వేదికపై నాయకత్వం గురించి అని ఆయన పేర్కొన్నారు.డబ్ల్యూటీఐటీసీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు, పరిశోధకులు, అకాడెమిక్‌లు, వ్యాపార నాయకులు ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నది. ప్రతినిధులు, ప్రసంగకారులు, స్పాన్సర్లు, భాగస్వాముల కోసం నమోదులు ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. -
ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: మహిళా క్రికెట్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి మహిళల వన్డే వరల్డ్ కప్‌లో జట్ల సంఖ్యను ఎనిమిది నుంచి పదికి పెంచాలని నిర్ణయించింది. దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు బోర్డు తీసుకుంది.ఇకపై ఐసీసీలోని అసోసియేట్ దేశాలకు ఇచ్చే నిధులను 10 శాతం పెంచనున్నారు. అమెరికా క్రికెట్ బోర్డుపై నిషేధం ఉన్నా... దాని ప్రభావం ఆటగాళ్లపై పడరాదని భావిస్తూ మ్యాచ్‌ల నిర్వహణకు తగిన చర్యలు తీసుకునేందుకు కూడా ఐసీసీ సిద్ధమైంది. క్రికెట్ భాగంగా ఉన్న 2028 ఒలింపిక్స్ అమెరికాలో జరగనుండటం కూడా దీనికి కారణం.మరోవైపు.. ఐసీసీ మహిళల క్రికెట్ కమిటీలో భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj)కు చోటు కల్పించారు. యాష్లీ డిసిల్వా, అమోల్ మజుందార్, చార్లెట్ ఎడ్వర్డ్స్, స్టెల్లా సియాలె ఈ కమిటీలో ఇతర సభ్యులుగా ఉన్నారు. రికార్డు రేటింగ్స్... ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీ వీక్షణపరంగా డిజిటల్ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా 446 మిలియన్ల మంది వీక్షకులు ఈ టోర్నీని జియో హాట్‌స్టార్‌లో చూసినట్లు ప్రసారకర్తలు వెల్లడించారు. ఇది మహిళల క్రికెట్లో అత్యధికమని పేర్కొంది.మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ (IND vs SA) మ్యాచ్ కూడా కొత్త రికార్డు నమోదు చేసింది. ఫైనల్‌ను 185 మిలియన్ల మంది డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై వీక్షించారని... 2024 టీ20 పురుషుల వరల్డ్ కప్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఫైనల్‌తో ఇది సమానమని నిర్వాహకులు ప్రకటించడం విశేషం. -
ఇన్ఫ్లూయెన్సర్ హఠాన్మరణం : షాక్‌లో ఫ్యాన్స్
అతనికి ప్రపంచాన్ని చుట్టి రావడం అంటే ఇష్టం. అంతేకాదు తాను చూసిన అద్బుతాలను విశేషాలను తన అభిమానులతో పంచుకోవడం అంటే మరీ మరీ ఇష్టం. అలా పాపులర్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్‌గా సోషల్ మీడియాలో మంచి పేరుతెచ్చుకున్నాడు. 10 లక్షలకుపైగా ఫాలోయవర్లతో ఇన్‌స్టాలో అత్యంత ప్రజాదరణ పొందిన ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకడిగా మారాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, దురదృష్టవశాత్తు, 32 ఏళ్లకే ఆయన ప్రయాణం ఆగిపోయింది. కానీ తుదిశ్వాస వరకు ఆసక్తిగల ప్రయాణికుడిగానే ఉన్నాడు. ప్రముఖ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, దుబాయ్‌కు చెందిన, అనునయ్ సూద్ (Anunay Sood) ఇక లేరన్న వార్త నెటిజనులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.32 ఏళ్ల అనునయ్ సూద్ ఆకస్మికంగా మరణించారన్న వార్తను ఆయన కుటుంబం గురువారం తెల్లవారుజామున అతని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది. అయితే, ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చనిపోయే సమయానికా అనునయ్ లాస్ వెగాస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడిఎవరీ అనునయ్ సూద్ అనునయ్ సూద్ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్, గ్లోబల్ ఫోటోగ్రాఫర్, ఇన్‌స్టాగ్రామ్‌లో1.4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 3.8 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఆయన సొంతం. ప్రపంచవ్యాప్తంగా పలుసందర్శనా స్థలాలకు సంబంధించి ఎంతో మంచి ట్రావెల్ కంటెంట్, అద్భుతమైన ట్రావెల్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ రీల్స్, వ్లాగ్స్‌తో ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు. 2022 -2024 వరకు వరుసగా మూడేళ్లు ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో చోటు సంపాదించుకున్న అనునయ్ సూద్‌ది. లాస్ వెగాస్‌లో స్పోర్ట్స్ కారు నడుపుతూ పెట్టిన పోస్ట్ ఆయన చివరి పోస్ట్. -
తండ్రి మత్స్యకారుడు.. కొడుకు బుర్జ్ ఖలీఫా ఓనర్
దుబాయ్ అంటే అందరికీ 'బుర్జ్ ఖలీఫా' గుర్తొస్తుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనంగా ప్రసిద్ధి చెందిన ఈ బుర్జ్ ఖలీఫాను ఒక మత్స్యకారుడి కుమారుడు నిర్మించారనే విషయం బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను తెలుసుకుందాం.బుర్జ్ ఖలీఫాను.. దుబాయ్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించింది. ఈ కంపెనీ ఫౌండర్ 'మహమ్మద్ అలబ్బర్' (Mohamed Alabbar). ఈయనే బుర్జ్ ఖలీఫా యజమాని.తండ్రి మత్స్యకారుడుమహమ్మద్ అలబ్బర్.. దుబాయ్‌లో ఒక సాధారణ, మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఒక మత్స్యకారుడు. చిన్నప్పుడు తన తండ్రి చేసే పనిలో సహాయం చేసేవాడు. పట్టుదల, క్రమశిక్షణ, వినయాన్ని నా తండ్రి నుంచే నేర్చుకున్నానని అలబ్బర్ అనేక ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.ప్రాధమిక విద్యను దుబాయ్‌లో పూర్తిచేసిన మహమ్మద్ అలబ్బర్.. ఆ తరువాత ప్రభుత్వం అందించిన స్కాలర్షిప్ ద్వారా అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత 1981లో స్వదేశానికి (దుబాయ్) తిరిగి వచ్చాడు. అలబ్బర్ అమెరికా నుంచి కేవలం డిగ్రీతో రాలేదు. జీవితంలో ఎదగడానికి ఎదో ఒకటి చేయాలనే లక్ష్యంతో వచ్చాడు.బ్యాంక్‌లో ఉద్యోగంఅలబ్బర్ తన కెరియర్ను యుఎఈ సెంట్రల్ బ్యాంక్‌లో ప్రారంభించి, ఆర్థిక వ్యవస్థల గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. పనితనంతో అందరి దృష్టినీ ఆకసారిస్తూ.. చాలా తక్కువ కాలంలోనే ఆయన దుబాయ్ ఆర్థిక అభివృద్ధి విభాగానికి డైరెక్టర్ జనరల్ అయ్యారు. ఆ సమయంలోనే దుబాయ్ దార్శనిక పాలకుడు 'షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్'తో పరిచయం ఏర్పడింది. ఆ తరువాతే భవిష్యత్తును ఊహించాడు.1997లో అలబ్బర్ ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను స్థాపించినప్పుడు. ఆ సమయంలో చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఒక దశాబ్దంలోనే దీనికి ఎనలేని గుర్తింపు లభించింది. ఆ తరువాత దుబాయ్ ఫౌంటెన్, డౌన్‌టౌన్ దుబాయ్, దుబాయ్ మాల్ వంటి నిర్మాణాలను పూర్తిచేసి.. ఈ రంగంలో అలబ్బర్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు.బుర్జ్ ఖలీఫా గురించిప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా.. అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ భవనాల్లో కూడా ఒకటి. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ అద్దె ఏడాదికి 180000 – 250000 దిర్హామ్‌లు (రూ. 40 లక్షల నుంచి రూ. 55 లక్షలు).బుర్జ్ ఖలీఫా ఎత్తు 829.8 మీటర్లు (2,722 అడుగులు). ఇందులో 163 అంతస్తులు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణం 2010కి పూర్తయింది. 95 కిలోమీటర్ల నుంచి కూడా కనిపించే ఈ భవనంలో 304 విలాసవంతమైన హోటల్ రూల్స్, 900 హై-ఎండ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్డింగ్ బయటివైపు శుభ్రం చేయడానికే సుమారు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందన్న భయం: రోజుకు రెండు గంటలే నిద్ర! -
Air India: ‘బొద్దింకను చనిపోయే వరకు ఉరితీశారు’
ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 24 (శుక్రవారం)ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఏఐ315 ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు బొద్దింకను చంపాడు. తన సీటు వద్ద కనిపించిన కాక్రోచ్‌ను ప్రయాణికుడు చంపిన ఘటనను విమాన సిబ్బంది లాగ్‌బుక్‌లో నమోదు చేశారు. అందులో ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అంటే బొద్దింకను చనిపోయే వరకు ఉరి తీశారు అని పేర్కొన్నారు. అంతే ఈ లాగ్‌బుక్ ఘటన నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ‘కాక్రోచ్ ఎగ్జిక్యూషన్’ అనే పదాన్ని ఉపయోగించడం నెటిజన్లను నవ్వులు పూయిస్తోంది. An entry in Air India’s cabin defect log recorded that a live cockroach was discovered by a passenger. The rectification note wryly mentioned that the matter was dealt with… conclusively.Khalaas, Dubai style pic.twitter.com/sifW6NNtG5— Jagriti Chandra (@jagritichandra) October 25, 2025ఈ ఘటనపై నెటిజన్లు ఎగ్జిక్యూషన్ అనే పదాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు స్మైలీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. మరికొ మరికొందరు విమానంలో హైజీన్ స్టాండర్డ్స్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. ఎయిరిండియా విమానం అధికారికంగా ఈ ఘటనపై స్పందించలేదు. అయితే, విమానాల్లో శుభ్రత, హైజీన్ ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విమానంలో లాగ్‌బుక్ విమానంలో లాగ్‌బుక్ (Logbook) అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది విమాన సిబ్బంది, పైలట్లు, మైంటెనెన్స్ టీమ్ కోసం ఉపయోగపడే అధికారిక రికార్డు. విమానంలో ఏదైనా సమస్య (ఉదాహరణకు: లైట్స్ పని చేయకపోవడం, సీటు సమస్య, బొద్దింక కనిపించడం) ఉంటే, దాన్ని లాగ్‌బుక్‌లో రాసి మైంటెనెన్స్ టీమ్‌కు తెలియజేస్తారు.ప్రతి చిన్న సమస్యను నమోదు చేయడం వల్ల..తదుపరి ప్రయాణానికి ముందు వాటిని పరిష్కరిస్తారు. -
దుబాయ్ పర్యాటక శోభ..!
ప్రపంచంలో ఎత్తైన నిర్మాణం బుర్జ్ ఖలీఫా. టాలెస్ట్ అబ్జర్వేషన్ వీల్స్ ఎయిన్ దుబాయ్. గోల్డెన్ టూరిజమ్ స్పాట్ మిరకిల్ గార్డెన్. ప్రపంచదేశాల కలబోత గ్లోబల్ విలేజ్. దుబాయ్ నిర్మాణ కీర్తికిరీటం బుర్జ్ ఖలీఫా. హిందూ పౌరాణిక శిల్పగ్రంథం బాప్స్ మందిరం. ద్వైపాక్షిక స్నేహబాంధవి షేక్ జాయేద్ మసీదు. ఇదీ మా దేశం... అని చూపించే దుబాయ్ ఫ్రేమ్. ఆహ్లాదకర సాయంత్రానికి థో క్రూయిజ్ విహారం. సాంస్కృతిక వేడుకల మధ్య ఎడారి అన్వేషణం. దుబాయ్ టూర్లో శోభాయమాన సొగసులివి.1వరోజుఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టూర్ నిర్వహకులకు రి΄ోర్ట్ చేయాలి. విమానం పది గంలకు బయలుదేరి 12.25కి దుబాయ్‌కి చేరుతుంది. ఎయిర్΄ోర్ట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర టూర్ నిర్వహకులు (దుబాయ్ టీమ్) రిసీవ్ చేసుకుని లంచ్, ఆ తర్వాత బస చేయాల్సిన హోటల్‌కు తీసుకువెళ్తారు. హోటల్ గదిలో చెక్ ఇన్ అయ్యి కొద్ది సేపు విశ్రాంతి. సాయంత్రం ధో క్రూయిజ్‌లో విహారం, రాత్రి డిన్నర్ క్రూయిజ్‌లోనే. క్రూయిజ్ విహారం తర్వాత హోటల్ గదికి చేరుస్తారు.క్రూయిజ్ విహారంపర్షియన్ గల్ఫ్‌లో క్రూయిజ్ విహారం దుబాయ్ టూర్లో నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. దుబాయ్‌లో విస్తరించిన ఆకాశహర్మ్యాలను ఆసాంతం వీక్షించాలంటే దుబాయ్ వీథుల్లో ఎంత తిరిగినా పూర్తిగా చూడలేం. క్రూయిజ్‌లో నీటి మీద నుంచి నేలను చూడాలి. నింగి–నేలను తాకుతున్నట్లున్న నిర్మాణాలు కనువిందు చేస్తాయి. ఎయిర్ కండిషన్డ్ క్రూయిజ్‌లో దాదాపు మూడు గంటల పాటు సాగే విహారంలో బఫే భోజనం, డాన్స్ షోలను ఆస్వాదించడం గొప్ప అనుభూతి. డిన్నర్లో కాంటినెంటల్, అరబిక్ వంటకాలు నోరూరిస్తాయి. మాంసాహారంతోపాటు శాకాహార వంటకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఉంటాయి. దుబాయ్‌లో క్రూయిజ్ విహారానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం అనువుగా ఉంటుంది. అందమైన సాయంత్రాలు, ఫ్రెండ్స్‌తో గెట్ టు గెదర్‌లకు ధరించినట్లు క్రూయిజ్ విహారానికి ఆహ్లాదకరమైన దుస్తులు ధరించాలి. లైట్ కలర్, ఫ్లోరల్ డిజైన్లయితే స్కై స్క్రాపర్స్, డాన్స్ షో బ్యాక్‌డ్రాప్‌లో ఫొటోలు అందంగా వస్తాయి. 2వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత దుబాయ్ సిటీ టూర్. ఎయిన్ దుబాయ్ (వరల్డ్స్ టాలెస్ట్ అబ్జర్వేషన్ వీల్స్ అడ్మిషన్) వీక్షణం. ఇండియన్ రెస్టారెంట్లో భోజనం. ఆ తర్వాత డెసర్ట్ సఫారీకి ప్రయాణం. డెజర్ట్ సఫారీలోనే రాత్రి భోజనం చేసి రాత్రి బసకు హోటల్‌కు చేరాలి.జెయింట్కే జెయింట్ఎయిన్ దుబాయ్ కొత్త టూరిస్ట్ అట్రాక్షన్. ప్రపంచంలో అత్యంత పెద్ద అబ్జర్వేషన్ వీల్ అది. సాధారణ భాషలో చె΄్పాలంటే జెయింట్ వీల్లకే జెయింట్ వీల్. కరోనాకు ముందు దుబాయ్ పర్యటనకు వెళ్లిన వాళ్లు దీనిని చూసి ఉండరు. నాలుగేళ్ల కిందట నిర్మాణం పూర్తి చేసుకుంది. 850 అడుగుల ఎత్తున్న ఈ వీల్లో ఒకసారి 1,750 మంది కూర్చుని ఆకాశ విహారం చేయవచ్చు.ఎడారిలో పాదముద్రలుఓ గంటపాటు వాహనంలో విహారం, ఆ తర్వాత ఒంటె మీద విహారం, క్యాంప్ గుడారాల్లో విశ్రాంతి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్‌ల వీక్షణం, బఫే భోజనాన్ని ఆస్వాదించడం లైఫ్‌టైమ్ మెమొరీ అనే చెప్పాలి. ఎడారిలో విహారం అనగానే వడగాలి వస్తుందని భయపడతాం. కానీ నవంబర్ నుంచి సాయంత్రాలు ఇసుక తిన్నెల మీద నుంచి చల్లని పిల్లగాలులు వీస్తూ విహారం ఆహ్లాదకరంగా సాగుతుంది. పగలు గాలికి ఇసుక పైకి లేస్తూ ఒంటిని తాకి కొంత సేపటి తర్వాత చికాకు పెడుతుంది. కానీ చలికాలం సాయంత్రాలు ఇసుక కూడా బరువుగా నేల మీదే ఉంటుంది. ఇసుకలో పాదముద్రలను చూసుకుంటూ నడవాలనే సరదా కూడా తీరుతుంది. 3వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత మిరకిల్ గార్డెన్లో విహారం, గ్లోబల్ విలేజ్ వీక్షణం. ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ తర్వాత బుర్జ్ ఖలీఫా విజిట్. సాయంత్రం లైట్ షో, రాత్రి భోజనం తర్వాత రాత్రి బస కోసం తిరిగి హోటల్‌కు చేరడం.ఎడారి పూదోటదుబాయ్ మిరకిల్ గార్డెన్ నిజంగానే ఓ అద్భుతం. పైగా ఇది ప్రపంచంలో అతి పెద్ద ఉద్యానవనం. దుబాయ్ వంటి ఎడారి దేశంలో రంగురంగుల పూలతో 72 వేల చదరపు మీటర్ల పూలతోట ఒక ఆశ్చర్యం. కోట్లాది మొక్కలు, పూలతో స్వర్గంలో విహరిస్తున్న భావన కలుగుతుంది. ఈ గార్డెన్ 2015లో గోల్డెన్ టూరిజమ్ అవార్డు కూడా అందుకుంది.దుబాయ్‌లో ఇండియాదుబాయ్ గ్లోబల్ విలేజ్, పేరుకు తగ్గట్టే ప్రపంచదేశాలను ప్రతిబింబిస్తున్న గ్రామం. ఆఫ్గనిస్తాన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, చైనా, ఈజిప్ట్, ఇండియా, ఇరాన్, ఇరాక్, జపాన్, కువైట్, లెబనాన్, మొరాకో, ఒమన్, పాకిస్తాన్, పాలస్తీనా, ఖతర్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ కొరియా, శ్రీలంక, సిరియా, థాయ్‌లాండ్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యెమెన్ దేశాల సంస్కృతి సంప్రదాయాలు కొలువుదీరాయి. సరాసరిన రోజుకు 40 వేల మంది పర్యాటకులు సందర్శిస్తారు. 20 వేలకు పైగా వాహనాలను పార్కింగ్ చేయగలిగినంత పార్కింగ్‌లాట్ అది.దుబాయ్ కీర్తిశిఖరందుబాయ్ కీర్తికిరీటంలో కలికితురాయి వంటిది బుర్జ్ ఖలీఫా. ఇది ప్రపంచంలో ఎత్తైన నిర్మాణం కూడా. దీని ఎత్తు 2,722 అడుగులు. యాంటెన్నాతో కలుపుకుంటే దీని ఎత్తు 2,717 అడుగులు. ఇది 163 అంతస్థుల భవనం. ఈ భవనం మీద నుంచి పరిసరాలను వీక్షించడానికి వీలుగా 124, 125, 148వ అంతస్థుల్లో అబ్జర్వేషన్ డెక్లున్నాయి. ఇంకా పైకి వెళ్లి ప్రశాంతంగా సమయం గడుపుతూ వీక్షించడానికి 152, 153, 154 అంతస్థుల్లో విశాలమైన లాంజ్లున్నాయి. వీటికి వరల్డ్స్ హైయ్యస్ట్ లాంజ్‌లుగా రికార్డు కూడా ఉంది. ప్రపంచ పటంలో దుబాయ్‌కి గొప్ప స్థానం కల్పించాలనే ఉద్దేశంతో జరిగిన నిర్మాణాలు దుబాయ్ ప్రపంచ రికార్డుల జాబితాను పెంచేశాయి. బుర్జ్ ఖలీఫాకి పాతికకు పైగా అవార్డులున్నాయి. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత దుబాయ్ సిటీ టూర్. బీపీఏఎస్ టెంపుల్ దర్శనం. ఫెరారీలో ఫొటో షూట్. షేక్ జాయేద్ మాస్క్ వీక్షణం. ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ తర్వాత హోటల్లో డ్రాప్ చేస్తారు.దుబాయ్ హైందవంశిల్పశాస్త్రం చెప్పిన నియమానుసారం నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయం కోసం యూఏఈ ప్రభుత్వం 27 ఎకరాలను బహూకరించింది. ఇది 108 అడుగుల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పు నిర్మాణం. స్థపతుల బృందం భారతదేశం నుంచి వెళ్లి నిర్మించింది. ఆలయంలో ప్రతి అంగుళమూ పౌరాణిక గ్రంథాల దృశ్యాలతో నిండి, శిల్పనైపుణ్యానికి అద్దం పడుతుంటుంది. కోణార్క్, రాణక్పూర్, దిల్వారా ఆలయాలు గుర్తు వస్తాయి. ఈ నిర్మాణం గత ఏడాది ‘బెస్ట్ కల్చరల్ ప్రాజెక్ట్‘ అవార్డు అందుకుంది.పెద్ద మసీదుషేక్ జాయేద్ మసీదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుదాబిలో ఉంది. ఇది 30 ఎకరాల్లో విస్తరించిన నిర్మాణం, దేశంలోకే పెద్ద మసీదు. రోజూ ప్రార్థనలు జరుగుతుంటాయి. ఈ మసీదు పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు, యూఏఈకి ఇతర దేశాలతో సుహృద్భావ సంబంధాలను కూడా ఏర్పరుస్తోంది. గతంలో బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్, యూఎస్ నుంచి జో బైడెన్, మన ప్రధాని నరేంద్రమోదీలు ఈ మసీదును సందర్శించారు. 5వరోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి బయలుదేరాలి. దుబాయ్ ఫ్రేమ్ సందర్శన, లంచ్, షాపింగ్ తర్వాత ఆరున్నరకు టూర్ నిర్వహకులు పర్యాటకులను దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు.గవాక్ష వీక్షణందుబాయ్ ఫ్రేమ్ అనేది ఒక వ్యూ పాయింట్. మన కోటలను సందర్శించినప్పుడు అంతఃపుర స్త్రీలు నగరాన్ని చూడడం కోసం, నగరంలో జరిగే కార్యక్రమాలను వీక్షించడం కోసం రాజమందిరాల్లో ఏర్పాటు చేసిన గవాక్షాలను చూస్తుంటాం. ఆ కిటికీ వ్యూ నగరమంతా కనిపించేటట్లు ఉంటుంది. దాదాపుగా అలాంటిదే ఇది కూడా. ఇక్కడి నుంచి చూస్తే దుబాయ్ సిగ్నేచర్ వ్యూ కనిపిస్తుంది. ఈ చట్రం నుంచి చూస్తే దుబాయ్‌లోని ఆకాశహర్మ్యాలన్నీ ఒక చోటకు చేర్చి దండకట్టినట్లు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి ఫొటో తీసుకుంటే దుబాయ్ అంతటినీ బ్యాక్‌డ్రాప్‌లో ఇముడ్చుకున్నట్లు ఉంటుంది. ప్రపంచంలో అది పెద్ద ఫ్రేమ్‌గా రికార్డు కూడా తన టూరిజమ్ ఖాతాలో జమ చేసుకుంది దుబాయ్. ‘ద స్లె్పండర్స్ ఆఫ్ దుబాయ్’ టూర్ తర్వాత ఈ ఫొటోలతో ఆల్బమ్ చేసుకుంటే... దుబాయ్ పర్యటనలో మధురానుభూతులను కూడా ఒక ఫ్రేమ్‌లో బంధించుకున్నవారవుతాం. ప్యాకేజ్‌లో ఏమేమి వర్తిస్తాయి?హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి ΄ోను రాను విమాన టికెట్లు. త్రీ స్టార్ హోటల్ బస, నాలుగు రోజులు బ్రేక్‌ఫాస్ట్, ఐదు రోజులు లంచ్, నాలుగు రోజులు డిన్నర్. టూర్లో ఉదహరించిన సైట్‌సీయింగ్‌కి రవాణా, ఎంట్రీ టికెట్లు, లోకల్ టూర్ గైడ్ సౌకర్యం, మిరకిల్ గార్డెన్, గ్లోబల్ విలేజ్, హాఫ్ డే దుబాయ్ సిటీ టూర్, అనీ దుబాయ్ దుబాయ్, గ్రాండ్ మాస్క్, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫేమ్ వీక్షణం. క్రూయిజ్ జర్నీ, ఎనభై ఏళ్ల లోపు వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్, దుబాయ్‌కి వీసా చార్జీలు, ఐదు శాతం టీసీఎస్.ఏమేమి వర్తించవు?ఎయిర్‌పోర్ట్‌లో చెల్లించాల్సి వచ్చిన అదనపు చార్జీలు (ఎక్స్ ట్రా లగేజ్ చార్జ్ వంటివి). డ్రైవర్, గైడ్లకు టిప్పులు, లాండ్రీ, మెనూలో లేని మద్యం వంటి ఇతర పానీయాలు. ఏయే డాక్యుమెంట్లు ఉండాలి!పాస్‌పోర్ట్ ఒరిజినల్. పాన్ కార్డ్. ఫొటో సాఫ్ట్‌కాపీ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉండాలి.బుకింగ్ కోసం సంప్రదించాల్సిన చిరునామా:జోనల్ ఆఫీస్, ఐఆర్సీటీసీ, 9–1–129/1/302, థర్డ్ ఫ్లోర్, ఆక్స్ఫోర్డ్ప్లాజా, ఎస్డీ రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ. ఫోన్ నంబరు: 040–27702407.ఐఆర్సీటీసీ, నియర్ రైల్వె రిటైరింగ్ రూమ్స్, అప్ స్టైర్స్, స్టేషన్ బిల్డింగ్, విజయవాడ. ఫోన్ నంబరు: 92810–30714ఇది దుబాయ్ టూర్!ఐఆర్సీటీసీ దుబాయ్ పర్యటన కోసం డిజైన్ చేసిన ΄్యాకేజ్ పేరు ‘ద స్లె్పండర్స్ ఆఫ్ దుబాయ్’. ప్యాకేజ్ కోడ్ ఎస్హెచ్ఓ3. నవంబర్ 8వ తేదీన మొదలయ్యే ఈ ఐదు రోజుల టూర్లో దుబాయ్, అబూదాబీ కవర్ అవుతాయి.టికెట్ ధరలిలా:సింగిల్ ఆక్యుపెన్సీలో రూపాయలు 1,34, 950. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 1,13, 400. ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 1, 12, 250 రూపాయలు.ప్రయాణం ఎప్పుడు?8–11–2025 ఉదయం పది గంటలకు ‘ఈకే–527’ విమానం హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. దుబాయ్‌కి 12.25 గంటలకు చేరుతుంది.12– 11– 2025 రాత్రి తొమ్మిదిన్నరకు దుబాయ్‌లో ‘ఈకే– 524’ విమానం బయలుదేరుతుంది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి (చదవండి: సకలైశ్వర్య ప్రదం శ్రీముఖలింగ లింగేశ్వర దర్శనం) -
దుబాయిలో ఫైట్ నైట్.. హీరోహీరోయిన్ సందడి (ఫొటోలు)
-
సల్మాన్ ఖాన్‌ను 'ఉగ్రవాది'గా ప్రకటించిన పాకిస్తాన్.. కారణం ఇదే..
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) కొద్దిరోజుల క్రితం బలూచిస్తాన్ (Balochistan)ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాక్ మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం సల్మాన్‌ను ఒక ఉగ్రవాదిగా ముద్రవేసి.. పాకిస్తాన్ 1997 ఉగ్రవాద నిరోధక చట్టంలోని 4వ షెడ్యూల్ కింద ఆయన పేరును చేర్చారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానించబడిన వ్యక్తుల బ్లాక్‌లిస్ట్‌లో సల్మాన్ పేరును పొందుపరిచారు. పాక్ చట్టాల ప్రకారం ఈ లిస్ట్‌లో ఉన్న వారిపట్ల నిఘా, కదలికలపై ఆంక్షలతో పాటు చట్టపరమైన చర్యలకు అవకాశం కల్పిస్తుంది.పాక్ విషయంలో సల్మాన్ ఏమన్నారంటే..?కొద్దిరోజుల క్రితం సౌదీ అరేబియాలో ‘జాయ్ ఫోరమ్ 2025’ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే.. ఇందులో కి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో పాటు షారుక్ ఖాన్, ఆమిర్‌ఖాన్ వంటి స్టార్స్ పాల్గొన్నారు. ఈ వేదికపై సల్మాన్ మాట్లాడుతూ.. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుంది. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్‌హిట్ అవుతుంది. ఆపై తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయి. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనని చెప్పాలి. బలూచిస్తాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ (Pakistan) నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. అంటూ ఆయన మాట్లాడారు.సల్మాన్‌పై బలూచిస్తాన్ ప్రశంసలుసల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ ప్రభుత్వానికి కోపం తెప్పించింది. బలూచిస్తాన్, పాకిస్థాన్‌లను సల్మాన్‌ఖాన్ వేర్వేరుగా చెప్పడం ఏంటి అంటూ భగ్గుమంది. పాకిస్థాన్‌కు చెందిన బలోచిస్థాన్‌ను ఇలా వేరు చేసి మాట్లాడటం ఏంటి అంటూ అక్కడి మీడియా కూడా విమర్శలు చేసింది. అయితే, బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనను స్వాగతించారు. బలూచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ప్రముఖ న్యాయవాది మీర్ యార్ బలూచ్ ఒక ట్వీట్ కూడా చేశారు. సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఆరు కోట్ల బలూచిస్తాన్ ప్రజలకు ఆనందాన్ని కలిగించిందని కృతజ్ఞత తెలిపారు. ఇలా మాట్లాడేందుకు చాలా దేశాలు వెనకడుగు వేశాయని వారు గుర్తుచేశారు. బలూచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించడాన్ని హైలైట్ చేసేలా సల్మాన్ వ్యాఖ్యలు చేరుతాయని అభిప్రాయపడ్డారు.ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న బలూచిస్తాన్ చాలా వెనుకబడిన ప్రాంతంగా మిగిలిపోయింది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి తదితర వనరులు ఎక్కువగా ఉన్నాయి. వీటి ఆదాయం పాక్ ఖజానాను కాపాడుతుంది. కానీ, బలూచిస్తాన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పాక్ నిర్లక్ష్యంగా ఉండటంతో అక్కడ వ్యతిరేకత మొదలైంది. ఫలితంగా రాజకీయ అనిశ్చితి ఏర్పడటం ఆపై వేర్పాటువాదులు శక్తిమంతమయ్యారు. ఇప్పుడు ఏకంగా ఆక ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకునే రేంజ్‌కు బలూచిస్తాన్ చేరుకుంది. పాక్‌కు పక్కలో బల్లెంలా బలూచిస్తాన్ తయారైంది. పాక్ నుంచి వేరు కావడంతో పాటు ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడాలని ఇక్కడి ప్రజలు కొన్ని దశాబ్దాలుగా పోరాడుతున్నారు.Salman Khan has been placed on the Fourth Schedule by the Government of Balochistan.@BeingSalmanKhan #Balochistan pic.twitter.com/Pbg1uaKiJU— Nasir Azeem (@BeloetsjNasir) October 25, 2025I don’t know if it was slip of tongue, but this is amazing! Salman Khan separates “people of Balochistan” from “people of Pakistan” . pic.twitter.com/dFNKOBKoEz— Smita Prakash (@smitaprakash) October 19, 2025 -
పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?
సాధారణంగా సుజుకి హయబుసా ధర కొంత ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ బైకును బంగారంతో తయారు చేస్తే.. దాని ధర ఇంకెంత ఉంటుందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఒక మోటార్ ఈవెంట్లో బంగారు హయాబుసా కనిపించింది.బంగారు హయాబుసాకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ధర అక్షరాలా రూ.1.67 కోట్లు అని సమాచారం. ఈ బైకులో చాలా వరకు గోల్డ్ బాడీవర్క్ జరిగి ఉండటాన్ని గమనించవచ్చు. ఇందులో వజ్రాలను కూడా ఉపయోగించారు. కాగా బోల్టులు కూడా బంగారమే కావడం గమనార్హం.ఇక్కడ కనిపించే బైకుకు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసం మాత్రమే రూ. 13.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెయింట్ వర్క్ మొత్తాన్ని.. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమోటివ్ కళాకారులలో ఒకరైన మిస్టర్ డానీ పూర్తిచేశారు.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!గోల్డ్ హయబుసా వెనుక టైరు.. పరిమాణంలో బుగట్టి కారు కంటే పెద్దదిగా ఉంది. కాగా ఇది 400 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో ఆటోమొబైల్ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Tharesh Kumar (@tharesh_kumar) -
పాతబస్తీ మహిళకు పాతికేళ్ల జైలు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళకు దుబాయ్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గంజాయి అక్రమ రవాణా చేస్తూ అక్కడి విమానాశ్రయంలో చిక్కడంతో ఈ మేరకు తీర్పు ఇచి్చంది. బహదూర్‌పురలోని ఆమె కుటుంబీకులు బ్యాంకాక్‌కు చెందిన ట్రావెల్ ఏజెంట్‌పై ఆరోపణలు చేస్తున్నారు. మహిళకు న్యాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బహదూర్‌పురకు చెందిన ఓ మహిళ బ్యూటీషియన్ కోర్సు చేశారు. ఈమెకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. తండ్రి పక్షవాతంతో మంచం పట్టగా...తల్లి గృహిణి కావడంతో కుటుంబ పోషణ భారం మహిళ పైనే పడింది. దీంతో కుమారుడిని తల్లిదండ్రుల వద్ద వదిలి దుబాయ్ వెళ్లి బ్యూటీషియన్ ఉద్యోగం చేయాలని భావించింది. దీనికోసం ఓ ఏజెంట్ ద్వారా వీసా ప్రాసెసింగ్ చేయించుకుంది. అతగాడు ఈ మహిళను బ్యాంకాక్ మీదుగా దుబాయ్ పంపాడు. బ్యాంకాక్‌లో సదరు ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తి ఈ మహిళకు ఓ ప్యాకెట్ ఇచ్చాడు. దాన్ని దుబాయ్‌లో తమ మనిషి వచ్చి తీసుకుంటారని చెప్పారు. ఈ ప్యాకెట్‌తో మహిళ ఈ ఏడాది మే 18న దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది. అక్కడ తనిఖీలు చేపట్టిన అధికారులు మహిళ తీసుకువచి్చన ప్యాకెట్లో గంజాయి ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు ఈ నెల 6న నేరం నిరూపణ అయినట్లు ప్రకటించింది. మçహిళకు 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రెండు రోజుల క్రితం దుబాయ్ నుంచి సదరు మహిళ వీడియో కాల్ ద్వారా నగరంలోని తల్లితో మాట్లాడింది. తీవ్రంగా రోదిస్తూ తాను కేవలం పది నిమిషాలే మాట్లాడగలనని, ఒక్కసారి తన కుమారుడిని చూపించాలంటూ తల్లిని కోరింది. న్యాయసహాయం చేస్తే నిరోషిగా బయటపడతాననే నమ్మకం ఉందని చెప్పింది. దీంతో మహిళ తల్లి పాతబస్తీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులకు విషయం తెలిపింది. వీరి ద్వారా విషయం తెలుసుకున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో దుబాయ్‌లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ జనరల్ (సీజీఐ) స్పందించారు. యువతికి అవసరమైన న్యాయసహాయం అందిస్తామని హామీ ఇచ్చి బహదూర్‌పురలోని ఆమె కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
ముంబై: విమానాల్లో వరుస సమస్యలు ఎయిర్ ఇండియాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. తాజాగా గురువారం ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787 రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తటంతో దుబాయ్‌లో సురక్షితంగా దించినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. అయితే, ఈ ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్‌పీఐ) కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో కూలిపోయిన విమానం కూడా బోయింగ్ 787 రకానికి చెందినదే. ఈ నెల 4న బర్మింగ్‌హామ్ వెళ్తుండగా ఇదే రకం విమానంలో ఉన్నట్లుండి అత్యవసర ర్యాట్ తెరుచుకుంది. తాజాగా అదే రకం విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఎయిర్ ఇండియా పేర్కొంది. అయితే, ఆ సమస్యలు ఏమిటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. కానీ, ఎఫ్ఐపీ మాత్రం ఆ విమానంలో ఆటోపైలట్, ఇన్స్ట్రుమెంట్ లాండింగ్ సిస్టమ్స్ (ఐఎల్ఎస్), ఫైట్ డైరెక్టరేట్స్ (ఎఫ్‌డీస్) ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కీలక వ్యవస్థలన్నీ చెడిపోయాయని ఆరోపించింది. -
ఈ దుబాయ్ యువరాణి ఎంత రిచ్ అంటే..
ప్రపంచవ్యాప్తంగా రాజ కుటుంబాలు ముఖ్యంగా వారి విలాసవంతమైన జీవనశైలి, వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే దుబాయ్ యువరాణి (Dubai Princess) షేఖా మహ్రాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచూ తన జీవనశైలి, వ్యాపార యత్నాలు, సొంత ప్రయాణాల గురించి అభిమానులతో పంచుకుంటారు.షేఖా మహ్రా నేపథ్యం1994 ఫిబ్రవరి 26న జన్మించిన షేఖా మహ్రా (Sheikha Mahra).. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె. ఆమె తన ప్రారంభ విద్య దుబాయ్‌లోని ప్రైవేట్ పాఠశాలలో పూర్తి చేసి, లండన్‌లో అంతర్జాతీయ సంబంధాల్లో డిగ్రీ పొందారు. ఆమె పరోపకార కార్యకలాపాలలోనూ చురుకుగా పాల్గొంటారు. స్థానిక డిజైనర్లకు సహకారం అందిస్తుంటారు.షేఖా మహ్రా నెట్వర్త్పలు నివేదికల ప్రకారం.. షేఖా మహ్రా నెట్‌వర్త్ 300 మిలియన్ డాలర్ల నుండి 1.5 బిలియన్ల డాలర్ల (రూ.2,600 కోట్ల నుంచి రూ.13,000 కోట్లు) మధ్య ఉంటుందని అంచనా. ఆమె సంపాదనకు ఆమె కుటుంబ వారసత్వం, వ్యాపారంలో విజయాలు, 2024లో ప్రారంభించిన లగ్జరీ పెర్ఫ్యూమ్ బ్రాండ్ "మహ్రా ఎం1"తో సహా పలు కారణాలు దోహదం చేశాయి. తన వ్యక్తిగత అనుభవం ప్రేరణతో "డివోర్స్" పేరుతో ఆమె తన బ్రాండ్ మొదటి ఫ్రాగ్రన్స్ను విడుదల చేయగా విజయవంతమైంది.విలాసవంతమైన జీవనశైలిషేఖా మహ్రా విలాసవంతమైన జీవనశైలితో ప్రసిద్ది చెందారు. రోల్స్ రాయిస్, లంబోర్ఘిని, ఫెరారీ వంటి లగ్జరీ కార్లెన్నో ఆమె వద్ద ఉన్నాయి. ఆమె సంపాదన నెలకు సుమారు 5 మిలియన్ డాలర్లు (రూ.41 కోట్లు). ఆమెకు గుర్రాలంటే అమితమైన ఇష్టం. ఫ్యాషన్ సెన్స్ కూడా మహ్రా ప్రసిద్ది చెందారు.రూ.9 కోట్ల ఉంగరం 2024లో షేఖా మహ్రా తన భర్త షేక్ మానా బిన్ మోహమ్మద్ కు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా విడాకులు ప్రకటించింది. తర్వాత 2025లో ఆమె రాపర్ ఫ్రెంచ్ మోంటానాతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 11 క్యారెట్ల డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ ధరించారు. దీని విలువ 1.1 మిలియన్ డాలర్లు (రూ.9 కోట్లు) అని అంచనా. View this post on Instagram A post shared by Xtianna (@_xtianna_) -
దుబాయ్‌లో సెటిల్ అవుతున్న స్పోర్ట్స్ స్టార్స్!.. కారణం ఇదే
ఇటీవలి కాలంలో దుబాయ్ (Dubai)లో నివాసం ఏర్పరచుకుంటున్న క్రీడాకారుల సంఖ్య పెరిగిపోతోంది. వేల కోట్లకు అధిపతి అయిన పోర్చుగీస్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) నుంచి బాక్సర్ ఆమిర్ ఖాన్ దాకా చాలా మంది దుబాయ్‌లోనే సెటిల్ అయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.బిలియనీర్స్ ఐలాండ్‌లో..పోర్చుగల్‌కు చెందిన రొనాల్డో అల్ నసర్ (Al Nassr) జట్టుతో భారీ మొత్తానికి డీల్ కుదుర్చుకున్నాడు. దీంతో ఎక్కువ సమయం దుబాయ్‌లోనే గడుపుతున్న ఈ ఫుట్‌బాల్ కింగ్ గతేడాది జూన్‌లో ఓ భారీ ప్రాపర్టీ కొనుగోలు చేశాడు. బిలియనీర్స్ ఐలాండ్‌లోని జుమేరా బేలో భూమి కొనుక్కున్నాడు.వందల కోట్ల విలువైన పెంట్హౌజ్ఇక బ్రెజిల్ ఫుట్‌బాల్ లెజెండ్ నెయ్మార్ కూడా దుబాయ్‌లో భారీ పెట్టుబడి పెట్టాడు. బుగాటి రెసిడెన్స్‌లో అత్యాధునిక పెంట్‌హౌజ్‌ను రూ. 450 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్నాడు. మరోవైపు.. బ్రిటిష్-పాకిస్తానీ బాక్సర్ ఆమిర్ ఖాన్ లండన్‌లో తనపై దాడి తర్వాత దుబాయ్‌కు మకాం మార్చాడు.ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ మొయిన్ అలీ కూడా కుటుంబంతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నాడు. ‘‘ఈ భూమ్మీద ఉన్న అత్యంత సురక్షితమైన ప్రదేశం’’ అంటూ మొయిన్ అలీ పలు సందర్భాల్లో దుబాయ్‌పై ప్రశంసలు కురిపించాడు. వీరే కాదు.. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కూడా దుబాయ్ మరీనాలో ఇల్లు కొన్నాడు. భారత టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా కూడా దుబాయ్‌లోనే సెటిల్ అవడమే కాకుండా.. అక్కడే అకాడమీ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.దుబాయ్‌కే ఎందుకు?దుబాయ్ విలాసాలకు పెట్టింది పేరు. అత్యాధునిక సౌకర్యాలు గల ఇళ్లు, అగ్ర శ్రేణి విద్యా సంస్థలు, అత్యాధునిక వైద్యం, వేగవంతమైన, సాఫీ ప్రయాణాలకు వీలైన మార్గాలు, గోల్డెన్ వీసా రూల్స్, రక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకునే జాగ్రత్తలు వంటివి స్పోర్ట్స్ స్టార్స్ అనే కాదు.. ఇతర సెలబ్రిటీలు కూడా ఇక్కడ సెటిల్ అయ్యేందుకు ప్రధాన కారణాలు.అన్నింటికంటే.. ఇక్కడ పన్నులు తక్కువగా ఉండటం సెలబ్రిటీలను ఆకర్షించే మరో అంశం. ముఖ్యంగా ఫుట్‌బాలర్ లేదంటే అథ్లెట్ తమ సొంత దేశాల్లో 40- 50 శాతం టాక్స్ చెల్లిస్తుండగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రం ఇది నామ మాత్రం లేదంటే కొన్నిసార్లు సున్నాగా ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు పేర్కొంది. చదవండి: ‘మీ నాన్నతో కలిసి ఆటో తోలుకో’;.. ధోని ఆరోజు చెప్పిన మాటతో ఇలా..: సిరాజ్ -
10 కేజీల బంగారంతో డ్రెస్..! ఎక్కడంటే..
బంగారం రేటు ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్‌ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది. ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్‌ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.(చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
దుబాయ్ రోడ్ల మీద డ్రైవరమ్మ జోరు!
ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా లెఫ్ట్ ఇండికేటర్ వేసి, రైట్కి తిరిగిందంటే, వెనక వున్నవాళ్లు తక్షణమే ‘లేడీ డ్రైవర్!’ అని ఫిక్స్ చేసేసుకుంటారు. కాని కొంతమంది ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చి చూస్తే, చీర కట్టుకుని, పూలు పెట్టుకుని, స్టీరింగ్‌పై స్పీడ్ రేస్ చేస్తున్న మహిళలని చూసి షాక్ అవుతుంటారు. ఇలా సమాజంలో మహిళల డ్రైవింగ్‌పై ఇంకా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కాని కేరళకు చెందిన డెబ్బై రెండేళ్ల మణి అమ్మ ఆ మాటలన్నింటినీ రోడ్డుమీద దుమ్ము దులిపేసింది. అందుకే ఆమెను అందరూ ‘డ్రైవర్ అమ్మ’ అని పిలుస్తారు. మణి అమ్మ కేవలం యాక్టివా నడిపే స్థాయిలో ఆగిపోలేదు. లగ్జరీ కార్లు, బస్సులు, ట్రక్కులు, క్రేన్లు, రోడ్ రోలర్లు ఇలా మీరు పేరు చెప్పండి, ఆమె ఆ వాహనాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉంటుంది. మొత్తం పద్దెనిమిది రకాల వాహనాలను నడిపేందుకు కావలసిన పదకొండు లైసెన్సులు ఆమె చేతిలో ఉన్నాయి. 2004లో భర్త మరణం తర్వాత అతని ‘ఏ టు జెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్స్’ అనే డ్రైవింగ్ స్కూల్‌ను మూసేయకుండా, తానే స్కూల్ నడిపించి, తన జీవితాన్నే రేస్ ట్రాక్‌లా మార్చేసుకుంది. ఇటీవల దుబాయ్ వీథుల్లో, సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఆత్మవిశ్వాసంగా రోల్స్–రాయిస్ ఘోస్ట్ కారును నడుపుతున్న ఆమె వీడియో వైరల్ అవ్వడంతో, అది చూసి ‘మహీంద్రా’ అధినేత ఆనంద్ మహీంద్రా కూడా ఆమెకు సెల్యూట్ చేశారు. ప్రస్తుతానికి ఈ అమ్మ ఒక్క విమానం నడపటం మాత్రమే మిగిలి ఉంది, అది కూడా నేర్చుకుని నడిపించే ధైర్యం ఉంది అంటోంది మణి అమ్మ. -
కొత్త కస్టమర్లను తీసుకోవద్దు: హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై ఆంక్షలు
హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు.. దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ (DFSA) షాకిచ్చింది. హెచ్డీఎఫ్సీ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) బ్రాంచ్.. కొత్త కస్టమర్లను చేర్చుకోవడపై నిషేధం విధించింది.దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు సెప్టెంబర్ 26 నుంచి అమలులోకి వచ్చాయి. తరువాత నోటీసులు అందేవరకు ఈ ఆర్డర్ అమలులోనే ఉంటుంది. కాబట్టి అప్పటివరకు కొత్త ఆర్ధిక ఉత్పత్తులకు సంబంధించిన సలహాలు ఇవ్వడం, ఇన్వెస్ట్మెంట్ డీల్స్, క్రెడిట్ సంబంధిత సలహాలు ఇవ్వడం, కస్టడీ సర్వీస్ వంటి పలు ఆర్థిక సేవలను నిలిపివేయాలి. అంతే కాకుండా కొత్త ఆర్ధిక ప్రచారాల్లో కూడా బ్యాంక్ పాల్గొనకూడదు. అయితే ఇప్పటికే ఉన్న బ్యాంక్ కస్టమర్లు.. తమ సేవలను యధావిధిగా పొందవచ్చు.దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాలు పాటించడానికి బ్యాంక్ సిద్దమైంది. అంతే కాకుండా ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవడానికి.. డీఎఫ్ఎస్ఏతో కలిసి పనిచేయడానికి తాము కట్టుబడి ఉన్నామని హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో వెల్లడించింది.ఇదీ చదవండి: అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్: ఇదిగో జాబితా..సెప్టెంబర్ 23 నాటికి, దాని డీఐఎఫ్సీ బ్రాంచ్‌లో జాయింట్ హోల్డర్లతో సహా 1,489 మంది కస్టమర్లు ఉన్నారని హెచ్డీఎఫ్సీ తెలిపింది. అయితే దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్.. బ్యాంకు మొత్తం కార్యకలాపాలు లేదా ఆర్థిక స్థితిపై అటువంటి ప్రభావం చూపదని హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. అంతే కాకుండా బ్రాంచ్ కస్టమర్ల నిరంతర సేవలకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. -
భవిష్యత్ ఆశాకిరణం.. అతడిని బెంచ్‌కే పరిమితం చేయండి: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా చేతిలో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ ఎట్టకేలకు ఆసియా కప్-2025 టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుది. సూపర్-4లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లపై విజయం సాధించడం ద్వారా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మరోవైపు.. భారత్ లీగ్, సూపర్-4 దశలో పరాజయమన్నదే లేకుండా ఫైనల్లో పాక్ (IND vs PAK)తో తలపడేందుకు సిద్ధమైంది.అయితే, ఈ టోర్నీలో పాకిస్తాన్ బౌలింగ్ పరంగా ఫర్వాలేదనిపించినా.. బ్యాటింగ్‌లో మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన యువ ఓపెనర్ సయీమ్ ఆయుబ్ (Saim Ayub) దారుణంగా విఫలమవుతున్నాడు.హ్యాట్రిక్ డకౌట్లుఒమన్తో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయిన సయీమ్ ఆయుబ్.. టీమిండియా, యూఏఈతో మ్యాచ్‌లలోనూ పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇలా హ్యాట్రిక్ డకౌట్లతో విమర్శల పాలైన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. సూపర్-4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో 21 పరుగులు చేయగలిగాడు.ఆ తర్వాత శ్రీలంకతో మ్యాచ్‌లో రెండు పరుగులు చేయగలిగిన సయీమ్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మరోసారి డకౌట్ అయ్యాడు. బ్యాటింగ్ పరంగా విఫలమైనా పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా ఏడు వికెట్లు తీయగలిగాడు.భవిష్యత్ ఆశాకిరణంఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ సయీమ్ ఆయుబ్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. ‘‘అతడు రెండోసారి డకౌట్ అయినపుడే.. బెంచ్‌కే పరిమితం చేయాలని చెప్పాను. దానర్థం అతడిలో ప్రతిభ లేదని కాదు.అతడు టాలెంటెడ్ ప్లేయర్. పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణం. కానీ కొన్నిసార్లు అనుకున్న ఫలితాలు రావు. ఆ క్రమంలో రోజురోజుకీ మరింత దిగజారితే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఆయుబ్ విషయంలో ఇదే జరిగింది. అతడి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా వీక్‌గా అనిపిస్తోంది.ఇలాంటపుడు బెంచ్‌కే పరిమితం చేయాలిబౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి అతడిని తుదిజట్టులోకి తీసుకుంటున్నారు. కానీ అతడు బౌలింగ్ కోసం కాదు.. బ్యాటింగ్ కోసం జట్టులో ఉంటున్నాడు. అతడు పరుగులు చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అది జరగడం లేదు. అతడిని బెంచ్‌కే పరిమితం చేయాల్సి ఉంటుంది’’ అని వకార్ యూనిస్ పేర్కొన్నాడు. కాగా భారత్- పాకిస్తాన్ ఆసియా కప్-2025 ఫైనల్లో ఆదివారం తలపడనున్నాయి. ఇందుకు వేదిక దుబాయ్.చదవండి: ఆసియా కప్: చరిత్ర సృష్టించిన నిసాంక.. కోహ్లి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు -
దుబాయ్‌లో అభిషేక్ శర్మ ఫ్యామిలీ.. ఫొటోలు షేర్ చేసిన కోమల్ (ఫొటోలు)
-
ఇంకోసారి అలా అనకండి: పాక్ జట్టు పరువు తీసిన సూర్య
దాయాది పాకిస్తాన్‌పై టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఆసియా కప్-2025 లీగ్ దశలో పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన సూర్యకుమార్ సేన.. సూపర్-4లో భాగంగా మరోసారి ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది.దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. పాకిస్తాన్ (IND vs PAK)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. టీ20 ఫార్మాట్లో పాక్‌పై టీమిండియాకు ఇది పన్నెండో విజయం. ఇప్పటికి పదిహేను సార్లు ముఖాముఖి పోటీ పడగా.. భారత్ ఈ మేరకు ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది.ఇంకోసారి అలా అనకండి ఈ నేపథ్యంలో పాక్‌పై విజయానంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీడియా సమావేశంలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల పోరు అంటూ ఓ విలేకరి ప్రస్తావించగా.. ‘‘సర్.. ఇకపై నుంచైనా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రత్యర్థుల పోరు అని అనడం మానేయాలి.పాక్ జట్టు పరువు తీసిన సూర్యసర్.. ఏ రకంగా చూసినా ఇలా అనేందుకు నాకు ఎలాంటి కారణం కనపడటం లేదు. ఇంకా రైవలరీ ఏంటి? రెండు జట్లు 15 మ్యాచ్‌లలో తలపడి ఒకటి 8.. ఇంకోటి 7 గెలిస్తే దానిని ప్రత్యర్థుల పోరుగా అభివర్ణించవచ్చు. కానీ ఇక్కడ 13- 1, 12-3 లా ఉన్నపుడు ఇంకా ఇలా ఎలా అనగలం?అసలు రెండు జట్ల మధ్య పోటీ అనేదే లేదు కదా!’’ అని సూర్యకుమార్ యాదవ్.. పాక్ జట్టుకు తమ స్థాయి ఏమిటో తెలియజేశాడు. కాగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారిగా ఆసియా కప్ లీగ్ దశలో భారత్- పాక్ ముఖాముఖి పోటీపడిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత జట్టు నిరాకరించింది.బుద్ధి చూపించారుదీంతో రచ్చకెక్కిన పాక్ బోర్డు.. నానాయాగీ చేసి.. టోర్నీ నుంచి వైదొలుగుతామని బెదిరించింది. అయితే, ఐసీసీ దిగిరాకపోవడంతో టోర్నీలో కొనసాగుతోంది. ఇక ఆదివారం నాటి మ్యాచ్‌లోనూ పాక్ తన బుద్ధి చూపించింది. అర్ధ శతకం (34 బంతుల్లో) పూర్తి చేసుకున్న తర్వాత పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఏకే-47 పేలుస్తున్న తరహాలో బ్యాట్ చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ మధ్యలోనూ ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు.సూపర్-4 : భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్👉పాక్ స్కోరు: 171/5 (20)👉భారత్ స్కోరు: 174/4 (18.5)👉ఫలితం: పాక్‌పై ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74).చదవండి: వైభవ్ సూర్యవంశీ ధనాధన్.. ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్..Starting your Monday with the Blue Storm that lit up Dubai last night 🌪️ 💙 Watch the #DPWorldAsiaCup2025, Sept 9-28, 7 PM onwards, LIVE on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/DNKy14ylYn— Sony Sports Network (@SonySportsNetwk) September 22, 2025 -
ఆసియా కప్: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు
ఆసియా కప్-2025 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ ఖండాంతర టోర్నీలో రెండు గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ స్టేజ్‌లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడ్డాయి. అయితే, వీటిలో భారత్, పాకిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 (Asia Cup Super 4)లో అడుగుపెట్టగా.. యూఏఈ, ఒమన్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి. కాగా లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. నామమాత్రపు మ్యాచ్ఆఖరిగా భారత్- ఒమన్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగుతుంది. అయితే, టీమిండియా ఇప్పటికే యూఏఈ, పాకిస్తాన్ జట్లను ఓడించి సూపర్-4కు చేరగా.. పాక్ ఒమన్, యూఏఈలపై గెలిచి అర్హత సాధించింది. దీంతో టీమిండియా- ఒమన్ మధ్య మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్‌గానే మిగిలిపోనుంది. మరోవైపు.. నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ రేటు (+4.793) పరంగానూ టీమిండియా ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నందున.. ఒమన్ మ్యాచ్ తర్వాత కూడా గ్రూప్-ఎ టాపర్‌గా ఉండటం లాంఛనమే.గ్రూప్-బి నుంచి ఆ రెండు జట్లుఇక గ్రూప్-బి విషయానికొస్తే... అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ ద్వారా ఫలితం తేలింది. అఫ్గనిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన లంక.. రషీద్ ఖాన్ బృందాన్ని నాకౌట్ చేసింది. ఫలితంగా లంకతో పాటు బంగ్లాదేశ్ సూపర్-4కు క్వాలిఫై అయింది. గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లన్నీ ముగిసిపోవడంతో టాపర్‌గా శ్రీలంక నిలవగా.. బంగ్లాదేశ్ రెండో స్థానం ఆక్రమించింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2025 సూపర్-4 దశ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్ వివరాలు తెలుసుకుందాం!సూపర్-4 షెడ్యూల్👉మ్యాచ్ 1: సెప్టెంబరు 20- శనివారం- శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 2: సెప్టెంబరు 21- ఆదివారం- భారత్ వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్👉మ్యాచ్ 3: సెప్టెంబరు 23- మంగళవారం- పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి👉మ్యాచ్ 4: సెప్టెంబరు 24- బుధవారం- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 5: సెప్టెంబరు 25- గురువారం- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్👉మ్యాచ్ 6: సెప్టెంబరు 26- శుక్రవారం- భారత్ వర్సెస్ శ్రీలంక- దుబాయ్ఫైనల్👉సెప్టెంబరు 28- దుబాయ్టైమింగ్స్👉ఫైనల్ సహా సూపర్-4 మ్యాచ్‌లన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభంలైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే👉టీవీ: సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్👉డిజిటల్: సోనీ లివ్ వెబ్సైట్, మొబైల్ యాప్జట్లు ఇవేటీమిండియాసూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.పాకిస్తాన్సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్శ్రీలంకచరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.బంగ్లాదేశ్లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్స్టాండ్బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్. చదవండి: Asia Cup: మా జట్టులో భారత్, పాక్ వినిపించదు.. మేమంతా ఒకే కుటుంబం -
దుబాయ్ లాంటి దేశం.. చాలా తక్కువ ఖర్చుతో వీసా
దుబాయ్ అంటే చాలా మంది భారతీయ పర్యాటకులకు ఇష్టమైన గమ్యస్థానం. అయితే దుబాయ్ కు ప్రత్యామ్నాయంగా బహ్రెయిన్ దేశాన్ని చూస్తారు. ఇక్కడి వాతావరణం నిశ్శబ్దంగా, నిర్మలంగా ఉంటుంది. మనామాలో శతాబ్దాల నాటి కోటల పక్కన మెరిసే గాజు టవర్లను చూడవచ్చు. ఉదయం పూట సూక్ లో విక్రయించే ముత్యాలను బేరమాడి కొనుక్కోవచ్చు. మధ్యాహ్నం బీచ్ ఐలండ్‌లో సేద తీరవచ్చు. సూర్యాస్తమయం సమయంలో అరేబియన్ గల్ఫ్ మెరుపులను చూడవచ్చు. కుటుంబాలతో వచ్చినా, జంటగా వచ్చినా లేదా వ్యాపార పనుల మీద వచ్చినా ఇక్కడి అందాలను ఆస్వాదించవచ్చు.బహ్రెయిన్‌కు వీసా అవసరమా?అవును.. బహ్రెయిన్ సందర్శనకు వీసా అవసరం. భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు వీసా లేకుండా బహ్రయిన్లోకి ప్రవేశించలేరు. వీసా పొందడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి ఈ-వీసా (ముందస్తుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి). మరొకటి వీసా ఆన్ అరైవల్ (అర్హత ఉన్నట్లయితే విమానాశ్రయం వద్ద పొందవచ్చు). రెండింటికీ చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్, రిటర్న్ ఫ్లైట్ టికెట్, తగినంత నిధులు ఉండాలి. అయితే ఈ వీసాలపై అక్కడ పనిచేసుకోవడానికి మాత్రం అనుమతి ఉండదు.ఆన్ లైన్ వీసా ఫీజులు• 2 వారాల సింగిల్ ఎంట్రీ — 10.000 బెహ్రెయినీ దినార్లు (రూ.2,336)• 3 నెలల మల్టిపుల్ ఎంట్రీ — 17.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 3,972)• 1 సంవత్సరం మల్టిపుల్ ఎంట్రీ — 45.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 10,515)ఆన్ అరైవల్ వీసా ఫీజులు• 2 వారాల సింగిల్ ఎంట్రీ - 5.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 1,168)• 3 నెలల మల్టిపుల్ ఎంట్రీ — 12.000 బెహ్రెయినీ దినార్లు (రూ. 2,804)ఈవీసాకు దరఖాస్తు ఇలా..బహ్రెయిన్ అధికారిక వీసా పోర్టల్ (జాతీయత, పాస్ పోర్ట్ లు, నివాస వ్యవహారాలు)లో అర్హతను సరిచూసుకోండిఆన్ లైన్ దరఖాస్తును పూరించి పత్రాలను అప్ లోడ్ చేయండి. తగిన రుసుము చెల్లించండి.ఆమోదం పొందాక కొన్ని రోజుల్లోనే ఈమెయిల్ ద్వారా అప్రూవల్ వస్తుంది.వీసా ఆన్ అరైవల్అన్ని పత్రాలతో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోండి.వీసా కౌంటర్ వద్దకు వెళ్లి ఫీజు చెల్లించండి.వేలిముద్రలు లేదా ఫోటో వంటి బయోమెట్రిక్ తనిఖీలు చేయించుకోండి.కస్టమ్స్ క్లియర్ చేసి లగేజీని తీసుకోండి.చాలా ఈవీసాలు ౩ నుండి 5 రోజుల్లో ప్రాసెస్ చేస్తారు. ఆన్-అరైవల్ వీసాలు మాత్రం అదే రోజు మంజూరు చేస్తారు.బహ్రయిన్ సందర్శించడానికి మంచి సమయంబహ్రయిన్ ఎడారి దేశం కాబట్టి ఇక్కడ సమయం ముఖ్యమైనది.డిసెంబర్ నుండి మార్చి వరకు ఉత్తమ సీజన్. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.జూలై, ఆగస్టు నెలల్లో, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వెళ్లకపోవడం మంచిది.రంజాన్, ఈద్ వ్యాపార సమయాలు హోటల్ రేట్లు, రెస్టారెంట్ షెడ్యూల్ ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. -
సైమా అవార్డ్స్ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే
-
ఏడ్చేసిన షోయబ్ అక్తర్..! కాస్తైనా బుద్ధి లేదంటూ ఫ్యాన్స్ ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు టీమిండియా (IND vs PAK) గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ముఖాముఖి తలపడిన తొలి పోరులో దాయాదికి చుక్కలు చూపించింది. దుబాయ్ వేదికగా ఆసియా కప్-2025 (Asia Cup)లో సమిష్టి ప్రదర్శనతో రాణించి.. పాక్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.ఊహించని దెబ్బఅయితే, ఆట పరంగానే కాకుండా.. నైతికంగానూ భారత జట్టు పాకిస్తాన్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. మైదానంలో పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. అంతేకాదు.. షేక్‌హ్యాండ్ కోసం మరోసారి ప్రయత్నం చేసినా డ్రెసింగ్‌రూమ్ తలుపులు మూసివేసినట్లు సమాచారం.మంచిగానే బుద్ధి చెప్పారుఈ విషయంపై స్పందించిన టీమిండియా అభిమానులు.. ‘‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి మంచిగానే బుద్ధి చెప్పారు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా భారత ఆటగాళ్లను సమర్థిస్తున్నారు. అయితే, పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం నో- షేక్‌హ్యాండ్ చర్యను జీర్ణించుకోలేకపోయాడు.‘‘నాకేం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. నా మనసు ముక్కలైంది. హ్యాట్సాఫ్ ఇండియా. కానీ మీరు క్రికెట్ మ్యాచ్‌ను రాజకీయాల నుంచి వేరుగా ఉంచండి. మీ గురించి మేము ఎన్నో గొప్ప విషయాలు చెప్పాము.అక్తర్ కంటతడిఅలాంటి మాకు ఈ నో-షేక్‌హ్యాండ్ చర్య గురించి కూడా ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కానీ వాటినే గుర్తుపెట్టుకుని ఇలా చేయకూడదు. మరచిపోయి ముందుకు సాగిపోవాలి.ఇది క్రికెట్. చేతులు కలపండి. కాస్త దయ చూపండి’’ అంటూ అక్తర్ కంటతడి పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ నెటిజన్లు అక్తర్‌కు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తున్నారు.షేక్‌హ్యాండ్ ఇవ్వనందుకే ఇంత బాధగా ఉంటే..‘‘అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల గురించి మర్చిపోవాలా?.. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా?.. షేక్‌హ్యాండ్ ఇవ్వనందుకే మీరు ఇంతగా బాధపడిపోతున్నారు.. తమ వారిని శాశ్వతంగా పోగొట్టుకున్న బాధితుల మనసులో ఎలాంటి అలజడి చెలరేగుతుందో మీరు కనీసం ఊహించగలరా?మ్యాచ్ గెలవడమే కాదు.. ఇలా వారికి సరైన బుద్ధి చెప్పినందుకు టీమిండియాకు హ్యాట్సాఫ్. దెబ్బ అదుర్స్’’ అంటూ అక్తర్ తీరును ఏకిపారేస్తూ.. సూర్యకుమార్ సేనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.ఇందుకు బదులుగా భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాకిస్తాన్ సైన్యం.. ఎదురుదాడికి ప్రయత్నించగా.. భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆసియా కప్ టోర్నీలో టీమిండియా- పాక్ ముఖాముఖి తలపడటం గమనార్హం.చదవండి: IND vs PAK: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మShoaib Akhtar crying over the handshake saga 😂 Same guy was chilling with Asim Munir & Afridi months back. Well done Surya – strike as deep as Nur Khan Air Base! 🔥🇮🇳 #INDvsPAK #IndianCricket #IndiaVsPakistan #aisacup2025 #indvspak2025 https://t.co/6O4XkugN8U pic.twitter.com/t9V8pCk0U8— Gaurav (@k_gauravs) September 15, 2025CAKEWALK 👏#TeamIndia cruise past Pakistan, chasing 127 inside 16 overs 🤩 Watch #DPWorldAsiaCup2025, from Sept 9-28 on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #INDvPAK pic.twitter.com/EncO07RSlD— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
IND vs PAK: టాస్ గెలిచినా అదే చేసేవాళ్లం: సూర్య!.. తుదిజట్లు ఇవే
భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు నగారా మోగింది. టీమిండియాతో మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్-2025 టోర్నమెంట్లో భాగంగా గ్రూప్-‘ఎ’లో ఉన్న దాయాదుల మధ్య ఆదివారం నాటి పోరుకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.ఈసారి టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ ఖండాంతర టోర్నీలో టీమిండియా, పాక్‌లతో పాటు యూఏఈ, ఒమన్ గ్రూప్-‘ఎ’లో ఉన్నాయి. ఇప్పటికే భారత జట్టు యూఏఈపై ఘన విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒమన్‌పై గెలుపొందింది. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు ఈ టోర్నీలో తమ రెండో మ్యాచ్‌లో పరస్పరం తలపడుతున్నాయి.మేము గొప్పగా ఆడుతున్నాముఇక భారత్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బ్యాటింగ్ చేస్తాము. గత కొన్ని రోజులుగా మేము గొప్పగా ఆడుతున్నాము. ఈ మ్యాచ్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నాం.ఇది కాస్త స్లో వికెట్లా కనిపిస్తోంది. అందుకే తొలుత బ్యాటింగ్ చేసి మెరుగైన స్కోరు సాధించాలని పట్టుదలగా ఉన్నాము. గత ఇరవై రోజులుగా మేము ఇక్కడ ఆడుతున్నాం కాబట్టి పిచ్ పరిస్థితులపై మాకు పూర్తి అవగాహన ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా ఆసియా కప్ టోర్నీ సన్నాహకాల్లో భాగంగా పాక్.. యూఏఈ- అఫ్గనిస్తాన్‌తో టీ20 ట్రై సిరీస్ ఆడింది. ఈ ముక్కోణపు సిరీస్‌ను పాక్ కైవసం చేసుకుంది. మరోవైపు.. టీమిండియాకు కూడా దుబాయ్ పిచ్‌లు కొత్తేం కాదు.తొలుత బౌలింగ్ చేయాలనే భావించాంఇక టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్ చేయాలనే భావించాం. వికెట్ చాలా బాగుంది. పాతబడే కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. తేమగా ఉంది. కాబట్టి డ్యూ ఉంటుందని ఆశిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో... యూఏఈతో ఆడిన తుదిజట్టునే ఆడిస్తున్నాం’’ అని తెలిపాడు.ఆసియా కప్-2025 భారత్ వర్సెస్ పాకిస్తాన్ తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిపాకిస్తాన్సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా తిలక్ వర్మ.. బీసీసీఐ ప్రకటన Coin falls in favour of Pakistan and they choose to bat first 🏏Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/IU98kUSWda— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025 -
అబుదాబిలో గంగా హారతి..! ఏకంగా రూ. 961 కోట్లు..
అబుదాబిలో ఆధ్యాత్మికత వెల్లివిరవడం అనేది ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలు అక్కడ హిందూ దేవాలయాలా..! అనే అనిపిస్తుంది గానీ నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం అనేలా కళ్లముందు కదాలాడుతున్న ఆ వైరల్ వీడియోనే అందుకు నిదర్శనం. ఆ హారతి ఘటన చూస్తే..మనం దుబాయ్‌లో ఉన్నామా? కాశీలో ఉన్నామా..? అన్న సందేహం రాక మానదు. మరి ఆ కథా కమామీషు ఏంటో చదివేద్దాం రండి..ఇటీవల దుబాయ్‌కు వెళ్లిన ఒక భారతీయుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుదాబిలోని బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ(BAPS) హిందూ మందిర్‌లో గంగా హారతి చూసి తన్మయత్వానికి గురయ్యాడు. యూఏఈకి మకాం మార్చిన మూడు వారాల తర్వాత ఈ 24 ఏళ్ల వ్యక్తి ఈ ఆలయ సందర్శన వీడియోని నెట్టింట పంచుకున్నాడు. రెండు వారాలు ఒక హోటల్లో గడిపి..చివరికి ఒక కొత్త ఇంట్లోకి మారిన తర్వాత ఈ ఐకానికి ఆలయాన్ని అన్వేషించాడు. ఒక వీక్ఆఫ్(సెలవు) రోజున ఈ ఆలయాన్ని సందర్శించి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాడు. అక్కడ గంగా హారతిని చూసి తన దేశంలోనే ఉన్నానా అన్న బ్రాంతిని పొందానంటూ అందుకు సంబంధించిన వీడియోని నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ వీడియోకి నేను "నేను UAEలో గంగా హారతిని చూశాను" అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్ చేశాడు. విదేశాలలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో ఈ ఆలయాల పాత్ర హైలెట్‌గా నిలుస్తుంది. BAPSకి చెందిన ఈ ప్రార్థనా స్థలాలు మంచి ఆధ్యాత్మిక ఓదార్పుని అందిస్తాయి. తాము వేరు అనే భావన కాకుండా తన స్వదేశం మూలాలు, సంస్కృతితో గాఢంగా పెనవేసుకునేందుకు ఉపకరిస్తుంది కూడా. కాగా, ఈ ఆలయంలో రోజువారి గంగా ఆరతి వేడుకలను నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. ఇక ఈ అబుదాబిలోని బోచసన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ మందిర్ (BAPS) 27 ఎకరాల స్థలాన్ని విస్తరించి ఉంది. దీన్ని UAE అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉదారంగా ఇచ్చిన 13.5 ఎకరాల స్థలంలో నిర్మించడం విశేషం. ఈ ఆలయాన్ని 2019లో నిర్మించారు. అందుకు 400 మిలియన్ యుఏఈ దిర్హామ్‌లు అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 961 కోట్లు పైనే ఖర్చు అయ్యింది. View this post on Instagram A post shared by Akash Kawale (@akashkawale10) (చదవండి: నైట్ ఈటింగ్ సిండ్రోమ్..! ఆరోగ్యాన్ని అమాంతం తినేస్తుంది..) -
ఇదే నా బెస్ట్ లైఫ్.. త్రిష పోస్ట్ వైరల్ (ఫొటోలు)
-
ఆసియా కప్-2025కి రె‘ఢీ’ అంటున్న కెప్టెన్లు.. హైలైట్‌గా సూర్య (ఫొటోలు)
-
ఘనంగా సైమా అవార్డ్స్ వేడుక
ప్రతి ఏడాది నిర్వహించే ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సైమా) వేడుకలు ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతున్నాయి. 13వ సైమా అవార్డు వేడుకని దుబాయ్‌లోని ఎగ్జిబిషన్ సెంటర్, ఎక్స్ పో సిటీలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు తెలుగు చిత్రాలకు అవార్డులు అందజేశారు నిర్వాహకులు.‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ‘సైమా’ అవార్డ్‌ని సొంతం చేసుకున్నారు. ‘సైమా’ నుంచి ఆయన అందుకున్న ఐదో అవార్డు ఇది. ‘సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అల వైకుంఠపురములో (2021), పుష్ప (2022)’ వంటి చిత్రాలకుగాను ఇప్పటికే ఆయన నాలుగుసార్లు ఉత్తమ నటుడిగా అవార్డ్స్ అందుకున్నారు.ఇక ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి ఉత్తమ నటిగా రష్మికా మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్, ఉత్తమ సంగీతదర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్‌గా శంకర్‌బాబు అవార్డులు అందుకున్నారు. ‘కల్కి 2898 ఏడి’ చిత్రానికి గాను ఉత్తమ చిత్రం అవార్డును నిర్మాత సి. అశ్వనీదత్, ఉత్తమ ప్రతినాయకుడి అవార్డును కమల్‌హాసన్, ఉత్తమ సహాయ నటి అవార్డును అన్నా బెన్‌లకు ప్రదానం చేశారు. ఇదే చిత్రానికి ఉత్తమ సహాయనటుడి అవార్డుకు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు.హీరో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికిగాను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, రచయిత రామజోగయ్య శాస్త్రి, గాయని శిల్పారావు అవార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటుడు (క్రిటిక్స్) తేజ సజ్జా, ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) ప్రశాంత్ వర్మ, ఉత్తమ నటి (క్రిటిక్స్) మీనాక్షీ చౌదరి... ఇంకా పలు విభాగాల్లో పలువురు తారలు అవార్డులు అందుకున్నారు.‘పుష్ప 3’ ఉంటుంది: ఇదే వేదికపై ‘పుష్ప 3’ ఉంటుందా? అని సుకుమార్‌ని యాంకర్ అడగ్గా... అల్లు అర్జున్ వైపు చూశారాయన. ఆ తర్వాత ‘ఉంటుంది’ అని స్పష్టం చేశారు సుకుమార్. -
సైమా అవార్డ్స్-2025 విజేతలు (ఫొటోలు)
-
దుబాయ్‌లో 'సైమా' అవార్డ్స్.. మెరిసిన సినీ తారలు (ఫోటోలు)
-
సైమా అవార్డ్స్-2025 విజేతలు వీరే.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
దుబాయ్‌లో సైమా అవార్డ్స్ (South Indian International Movie Awards 2025) వేడుక ఘనంగా ప్రారంభమైంది. దక్షిణాదిలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా (SIIMA) అవార్డ్స్‌కు ఎంతో గుర్తింపు ఉంది. సౌత్ చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి వారిని అవార్డ్‌తో సైమా గౌరవిస్తుంది. 2024లో సెన్సార్ అయిన చిత్రాలకు సంబంధించి తాజాగా విన్నర్స్ జాబితాను విడుదల చేశారు. గత పన్నేండేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 13వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 5న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక జరిగింది. సెప్టెంబర్ 6న తమిళ్,మలయాళం ఇండస్ట్రీకి చెందిన కార్యక్రమాలు జరుగుతాయి. సైమా అవార్డ్స్-2025లో 'పుష్ప2' చిత్రం పంట పండింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా, ఉత్తమ దర్శకుడిగా సుకుమారు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ అవార్డ్స్ దక్కించుకున్నారు. అయితే, ఉత్తమ చిత్రంగా 'కల్కి' నిలిచింది.సైమా విజేతలు.. వారి వివరాలు* ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ* ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప-2)* ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): ప్రశాంత్ వర్మ (హనుమాన్) * ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2) * ఉత్తమ నటి : రష్మిక మందన్నా (పుష్ప-2)* ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజా సజ్జా (హనుమాన్)* ఉత్తమ నటి (క్రిటిక్స్): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్) * ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి) * ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్ (కల్కి) * ఉత్తమ నూతన నటి : భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్ బచ్చన్)* ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప -2)* ఉత్తమ గేయ రచయిత 'చుట్టమల్లే' పాట కోసం: రామజోగయ్య శాస్త్రి (దేవర)* ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: శిల్పారావ్ (దేవర) 'చుట్టమల్లే' పాట కోసం* ఉత్తమ గాయకుడు: శంకర్ బాబు కందుకూరి (పుష్ప2) 'పీలింగ్స్' పాట* ఉత్తమ విలన్ : కమల్ హాసన్ (కల్కి) * ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (దేవర) * ఉత్తమ హాస్యనటుడు: సత్య (మత్తు వదలరా 2) * ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)* ఉత్తమ నూతన నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)* ఉత్తమ నూతన దర్శకుడు: నందకిషోర్ ఇమాని (35 ఒక చిన్నకథ)* ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్ 50 ఏళ్లు పూర్తి) -
దుబాయ్ ట్రిప్‌లో నిహారిక కొణిదెల (ఫోటోలు)
-
ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్
సమంత ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు. కొన్ని నెలల క్రితం 'శుభం' అనే చిన్న చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ హిట్ కాలేదు గానీ పెట్టిన డబ్బులు వచ్చేశాయి. మరోవైపు సమంత రిలేషన్ గురించి గత కొన్నిరోజులుగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఫొటోనో వీడియోనో వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా రూమర్ బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సామ్.. దుబాయి వెళ్లినట్లు అనిపిస్తుంది.గతంలో హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత.. నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. అప్పటినుంచి సింగిల్‌గానే ఉంటుంది. అయితే సామ్ తనతో 'ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్' సిరీస్‌లు తీసిన రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉందని పుకార్లు గత కొన్నిరోజులుగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లు వీళ్లిద్దరూ అడపాదడపా కలిసి కనిపిస్తుండటం వీటికి ఊతమిస్తోంది.(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్‌గా మొదలుపెట్టేశారు)తాజాగా ఓ ఫ్యాషన్ షో చూసేందుకు దుబాయి వెళ్లిన సమంత.. ఆ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇందులోనే ఓ వ్యక్తి చేతిని పట్టుకుని కనిపించింది. అయితే ఆ వ్యక్తి రాజ్ నిడిమోరు అని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో దిగువన వరుణ్ ధావన్, దిశా పటానీ, రుహానీ శర్మ తదితరులు కామెంట్ కూడా చేశారు.మరోవైపు రాజ్ నిడిమోరుకు ఇదివరకే పెళ్లయింది. శ్యామలిని 2015లో వివాహమాడారు. రీసెంట్ టైంలో సమంత-రాజ్ మధ్య రూమర్స్ వస్తుండటంతో శ్యామలి.. పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతోంది. మరి సమంత.. ఈ బంధాన్ని ఏమైనా అధికారికంగా ప్రకటిస్తుందా లేదా ఇలానే రహస్యంగా ఉంచుతుందా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరోయిన్లు అంటే చిన్నచూపు.. హీరోలకు ఆ మాట చెప్పలేరు: కృతి సనన్) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
దుబాయ్‌లో 'గామా' అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
ప్రతిష్టాత్మమైన GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ కు టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. గామా 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్‌గా జరిగాయి. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు , సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది.గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు - ఏ. కోదండ రామిరెడ్డి , ప్రముఖ సంగీత దర్శకులు - కోటి , ప్రముఖ సినీ దర్శకులు - బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు GAMA అవార్డ్స్ బహుకరించబడ్డాయి. నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపును అందుకున్న 'పుష్ప 2' గామా బెస్ట్ మూవీగా అవార్డ్ కైవసం చేసుకుంది.గామా అవార్డు గ్రహీతలు:బెస్ట్ యాక్టర్ 2024 – అల్లు అర్జున్ (పుష్ప2 ది రూల్)బెస్ట్ హీరోయిన్ – మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్)బెస్ట్ మూవీ – పుష్ప 2 (మైత్రి మూవీ మేకర్స్.. యలమంచిలి రవి నవీన్ యెర్నేని)బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్ (పుష్ప 2)బెస్ట్ ప్రొడ్యూసర్ – అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ (కల్కి 2898AD)బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవిశ్రీప్రసాద్ (పుష్ప 2)బెస్ట్ కొరియోగ్రఫీ : భాను మాస్టర్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్)బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)బెస్ట్ సినిమాటోగ్రఫీ : రత్న వేలు (దేవర)బెస్ట్ లిరిసిస్ట్ – రామ జోగయ్య శాస్త్రి (చుట్టమల్లే..దేవర)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ : అనురాగ్ కులకర్ణి (సుట్టమలా సూసి.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ : మంగ్లీ (కళ్యాణి వచ్చావచ్చా.. ఫ్యామిలీ స్టార్)బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్ : సమీరా భరద్వాజ్ (నల్లంచు తెల్లచీర.. మిస్టర్ బచ్చన్) బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ : రజాకార్బెస్ట్ యాక్టర్ క్రిటిక్ : తేజ సజ్జాబెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టర్ జ్యూరీ : రాజా రవీంద్ర (సారంగదరియా)బెస్ట్ యాక్టర్ జ్యూరీ : కిరణ్ అబ్బవరం (క)బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ : రోషన్ (కోర్ట్)బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : శ్రీదేవి (కోర్ట్)బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్ : మానస వారణాశిబెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్ : అప్సర్ (శివం భజే)గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్ : మట్ల తిరుపతిబెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : వినయ్ రాయ్ (హనుమాన్)బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్ అవార్డ్ : హర్ష చెముడు (సుందరం మాస్టర్)బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్ : బాలిరెడ్డి పృథ్వీరాజ్బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్ : నయన్ సారిక (ఆయ్, క)బెస్ట్ డెబ్యూ యాక్టర్ జ్యూరీ : ధర్మ కాకాని (డ్రింకర్ సాయి)బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రాళ్ళు)బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రాళ్ళు)గ్లోబల్ కమెడియన్‌గా ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం స్పెషల్ అవార్డును అందుకున్నారు. వీరితోపాటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీ దత్ అందుకున్నారు. అలాగే హీరో సత్యదేవ్ జీబ్రా చిత్రానికి గాను ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డును కైవసం చేసుకున్నారు. ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డును అందాల భామ ఊర్వశి రౌటెల అందుకున్నారు.గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ..”వేలాదిమంది తెలుగు, తమిళ, మళయాల సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదికపై ఇలా ప్రెస్టేజియస్ గా ఈ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉంది. గామా స్థాపించినప్పటి నుండి.. గామా అవార్డు వేదికకు సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అని తెలియచేశారు.అలాగే హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, ఊర్వశి రౌటెల, మానస వారణాశి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించిన ఈ కార్యక్రమంలో.. యాంకర్ సుమ, అతడు హర్ష వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన తీరు హైలెట్‌గా నిలిచింది. -
పేరుకు మాత్రమే 'దుబాయ్ యువరాణి'.. నిరాడంబర జీవితం (ఫోటోలు)
-
దుబాయ్‌కు వేర్వేరుగా వెళ్లనున్న భారత ఆటగాళ్లు
ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత పురుషుల క్రికెట్ జట్టు సభ్యులు సెప్టెంబర్ 4న దుబాయ్‌కు చేరుకోనున్నారు. జట్టుగా కాకుండా ఒక్కొక్క ఆటగాడు తమ సొంత నగరాల నుంచి విడివిడిగా దుబాయ్‌కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 4న అందరూ చేరుకున్న తర్వాత 5 నుంచి టీమ్ ప్రాక్టీస్ మొదలవుతుంది. 10న భారత జట్టు ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. సాధారణంగా విదేశాల్లో ఆడేందుకు వెళ్లే ముందు టీమ్ మొత్తం ముంబైలో ఒక్క చోటికి ఒకే సారి ప్రయాణించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మాత్రం దీనిని మార్చినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.ఆటగాళ్ల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు సభ్యుడొకరు వెల్లడించారు. ‘తమ అనుకూలత ప్రకారం కొంత మంది ముంబై నుంచే వెళతారు. కానీ అందరినీ అక్కడికే పిలవడంలో అర్థం లేదు. పైగా ఇతర అంతర్జాతీయ వేదికలతో పోలిస్తే దుబాయ్ స్వల్ప దూరమే. కాబట్టి అందరికీ తమ ప్రయాణాన్ని ఎంచుకునే అవకాశం కల్పించాం’ అని ఆయన చెప్పారు. ఆసియా కప్‌కు ఎంపికైన 15 మంది సభ్యులు కొందరు ప్రస్తుతం విరామంలో ఉండగా, మరి కొందరు దులీప్ ట్రోఫీ దేశవాళీ టోరీ్నలో ఆడుతున్నారు. ఈ టోర్నీ కోసం స్టాండ్‌బైగా ఎంపికైన క్రికెటర్లు దుబాయ్‌కు వెళతారా లేదా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.చదవండి: పొట్టివాళ్లే గొప్ప బ్యాటర్లు... సచిన్, కోహ్లి ఇందుకు ఉదాహరణ: ద్రవిడ్ -
సింగర్‌తో దుబాయ్ యువరాణి రెండో పెళ్లి
దుబాయ్ యువరాణి షేకా మహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్(31) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచారు.అమెరికన్ రాపర్ 'ఫ్రెంచ్ మోంటానా'(41)తో మహ్రా కొంతకాలంగా ప్రేమలో ఉంది. తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు రాపర్ ప్రతినిధి ధృవీకరించారు. ఈ సంవత్సరం జూన్‌లో పారిస్ ఫ్యాషన్ వీక్ సందర్భంగా నిశ్చితార్థం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, ఆ విషయాన్ని ఇప్పటి వరకు రహస్యంగానే ఉంచినట్లు తెలిపారు. రాపర్ 'ఫ్రెంచ్ మోంటానా' కంటే ఆమె వయసులో సుమారు పదేళ్లు చిన్నది. పెళ్లి తేదీ, ఇతర విషయాలు ఇంకా ప్లాన్ చేయలేదని చెబుతున్నారు. కానీ, ఈ జంట ఇరువురి కుటుంబాలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాయని సమాచారం.షేక్ మహ్రా ఎవరు.. మొదటి భర్తతో విడాకులకు కారణం..?దుబాయ్ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి 'షేకా మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్' కుమార్తె 'షేకా మహ్రా' బ్రిటన్‌లో చదువుకున్న ఆమె 2023 మే నెలలో దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త 'షేకా మనా బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్'ను పెళ్లి చేసుకున్నారు. వారికి తొలి సంతానం కలిగిన రెండు నెలలకే విడిపోతున్నట్లు 2024 జులైలో ప్రకటించారు. తన భర్త ఇతరుల సహచర్యం కోరుకున్నందున తాను విడాకులు తీసుకుంటున్నట్లు ఆమె చెప్పారు. 'ఐ డైవర్స్ యూ.. టేక్ కేర్..' మీ మాజీ భార్య అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం తన కుమార్తెతో షేకా మహ్రా ఉంది. ఇప్పుడు ప్రేమించి మరో పెళ్లి చేసుకోనున్నడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే.., రాపర్ 'ఫ్రెంచ్ మోంటానా' ప్రతినిధి ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారని ధృవీకరించినప్పటికీ, వారిద్దరు మాత్రం దాని గురించి ఎటువంటి అధికారిక ప్రకటనను పంచుకోలేదు. View this post on Instagram A post shared by Xtianna (@xtianna_official) -
బిడ్డ భవిష్యత్తు కోసం..
తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తిమేరకు కూడబెట్టాలని ప్రయత్నిస్తుంటారు. స్థలాలు, ఇళ్లు లాంటి స్థిరాస్తులు తమ వారసులకు ఇచ్చేందుకు కష్టపడుతుంటారు. దుబాయ్‌కు చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ జంట తమ పసిపాప కోసం అపురూప కానుకను సిద్ధం చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరు గడించిన బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేసి.. తమ పాప భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వీరిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.దుబాయ్‌కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్లు నోరా, ఖలీద్ భార్యాభర్తలు. ఐకానిక్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాలో తమ బిడ్డ కోసం ఒక ఫ్లాట్ కొన్నారు. ఈ సందర్భంగా తమ పాపతో కలిసి ఆనందాన్ని పంచుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 24 గంటలు గడవకముందే ఈ వీడియోకు 5 లక్షలకుపైగా వ్యూస్, 26 వేలకు పైగా లైకులు వచ్చాయి. పెద్దయ్యాక తమ కూతురికి ఆర్థిక సమస్యలు లేకుండా చేయాలన్న ముందుచూపుతో ఈ ఫ్లాట్ కొన్నామని నోరా వెల్లడించారు.తమ జీవితంలోని ఉత్తమ పెట్టుబడులలో ఇది ఒకటని ఆమె తెలిపారు. 1% పేమెంట్ ప్లాన్‌తో ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశామని, తమ బిడ్డ పెద్దయ్యే నాటికి మొత్తం చెల్లించేస్తామని నోరా చెప్పారు. ఫ్లాట్ రెడీ అయిన తర్వాత అద్దెకు ఇస్తామని, తమ కూతురు పెద్దైన తర్వాత ఇందులో ఉండాలనుకుంటే ఉంటుందన్నారు. బుర్జ్ ఖలీఫాలో వ్యూ ఫ్లాట్ కాబట్టి దీని విలువ భవిష్యత్తులో బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో చూసిన నెటిజనులు.. నోరా, ఖలీద్ దంపతులను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డకు ఇలాంటి స్థిరత్వం కావాలని కలలు కంటారని ఒకరు కామెంట్ చేశారు. కాగా, నోరా, ఖలీద్ ఉమ్మడి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Nora & Khalid (@noraandkhalid) -
టీ ఒక్కటి వెయ్యి రూపాయలా..?
దుబాయ్: భారత్‌లో ఒక్క టీ ఖరీదు వెయ్యి రూపాయలుందంటూ వ్లాగర్ పరీక్షిత్ బలోచ్ ఆశ్చర్యంతో చేసిన పోస్ట్‌కు భారీగా స్పందన లభిస్తోంది. దుబాయ్‌లో ఉంటున్న భారతీయ ట్రావెల్ వ్లాగర్, రేడియో ప్రజెంటేటర్ ఇటీవల ముంబైలో తనకు కలిగిన అనుభవాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘ముంబైలోని ఓ హోటల్లో ఒక కప్పు టీ తాగితే నాకు వెయ్యి రూపాయల బిల్లయింది. అది చూసి షాకయ్యా. సాధారణమైన అవసరాలు సైతం ఇంత ఖరీదుగా మారడం చూసి నమ్మలేకపోయా. దుబాయ్‌లో ఉంటూ దిర్హామ్‌లలో సంపాదన కలిగిన నేను భారత్‌లో ఉండగా ఎన్నడూ పేదవానిగా భావించలేదు. కానీ, టీ బిల్లు చూసి మునుపటిలా కాకుండా, భారత్‌లో సైతం పరిస్థితులు మారాయని అనిపించింది’అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. భారత్‌లో విపరీతంగా పెరిగిన జీవన వ్యయంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. పలువురు ఇలాంటి అనుభవాల్నే పంచుకున్నారు. ముంబైలాంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయంపై ఆశ్చర్యం వ్యక్తపరిచారు. ‘నేను ఏటా ముంబై వెళ్తుంటా. కొన్నిటికైతే దుబాయ్ కంటే ముంబైలోనే ఖరీదెక్కువ’అని ఒకరంటే, ‘చివరికి ఏవరో ఒకరు ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకున్నారు. భారత్‌కు వచ్చాక పేదవానిగా మారింది నేను ఒక్కడినే అని ఇప్పటిదాకా అనుకునేవాణ్ని’అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఇండియా వెళ్లిన ప్రతిసారీ నాకు ఇదే అనుభవం ఎదురవుతోంది. డాలర్లలో సంపాదన కలిగిన నేనే ఇంతగా ఇబ్బంది పడితే, స్థానికంగా ఉండే వారు ఎలా బతుకుతున్నారో ఏమో? ఇంత డబ్బు వారికి ఎలా వస్తుంది? నాకీ విషయం తెలిస్తే, ఇండియాను వదిలేసే వాణ్నే కాదు’అంటూ ఇంకొకరు ముక్తాయింపునిచ్చారు. -
ఎడారి దేశంలో బిక్కుబిక్కుమంటూ..
వెల్గటూర్: బతుకుదెరువు కోసం ఎడారి దేశం వెళ్లిన తొమ్మిది మంది తెలుగువారు అక్కడ ఓ ముఠా చేతిలో మోసపోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరిలో ఆరుగురు తెలంగాణవారు కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నారు. తమను కాపాడి ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో తీసి పంపించాడు జగిత్యాల జిల్లా ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఎండపల్లికి చెందిన మంతెన కిరణ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. అక్కడ గ్రీన్ స్కెచ్ ఎల్ఎల్సీ కంపెనీలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉద్యోగంలో చేరాడు. అతడితోపాటు తెలంగాణకు చెందిన మరో ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పనికి కుదిరారు. అక్కడ వీరికి ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతను వేరే కంపెనీలో ఎక్కువ జీతం వస్తుందని చెప్పగా.. అతడి మాటలు నమ్మిన ఈ తొమ్మిది మంది అతడితో ఓ ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఆ ముఠా సభ్యులు వీరి నుంచి ఐడీ కార్డులు, సిమ్‌కార్డులు, బ్యాంక్ అకౌంట్ వివరాలు, సంతకాలు, ఫొటోలు తీసుకుని ఈనెల 5న విడిచిపెట్టారు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కిరణ్‌తోపాటు ఏపీకి చెందిన ఓ వ్యక్తిని విడిచి పెట్టారు. మిగిలిన ఏడుగురిని పోలీసుల అదుపులోనే ఉంచుకున్నారంటూ కిరణ్ సెల్ఫీ వీడియో తీసి అతని స్నేహితులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డికి పంపించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు జేబలాలి ప్రాంతంలో సిమెంట్ పైపుల్లో తలదాచుకున్నట్లు కిరణ్ తెలిపాడు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో వెల్గటూర్ మండలం జగదేవుపేటకు చెందిన మధు, నిజామాబాద్ జిల్లాకు చెందిన వినయ్, రాజు, శ్రీకాంత్ నిర్మల్ జిల్లాకు చెందిన అశోక్, ఏపీకి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. పొట్ట కూటికి ఆశపడి పొరుగు దేశం వెళ్లి మోసపోయిన తమవారిని ప్రభుత్వం ఆదుకొని ఇండియాకు తీసుకురావాలని కిరణ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
ప్రపంచంలో ఎత్తైన భవనం.. బుర్జ్ ఖలీఫా ఓనర్ ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా' (Burj Khalifa) గురించి దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే అంతటి ప్రతిష్టాత్మక భవనాన్ని ఎవరు నిర్మించారు?, దాని ఓనర్ ఎవరు? అనే ఆసక్తికరమైన వివరాలు బహుశా కొంతమందికి తెలిసుండక పోవచ్చు. ఈ కథనం ఆ వివరాలు తెలుసుకుందాం.ప్రపంచంలో ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా.. అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ భవనాల్లో కూడా ఒకటి. ఇందులో సింగిల్ బెడ్ రూమ్ అద్దె ఏడాదికి 150000 దిర్హామ్స్ నుంచి 180000 దిర్హామ్‌లు (రూ. 42 లక్షల కంటే ఎక్కువ). దీనిని (బుర్జ్ ఖలీఫా) దుబాయ్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎమ్మార్ ప్రాపర్టీస్ నిర్మించింది. ఈ కంపెనీ ఫౌండర్ 'మహమ్మద్ అలబ్బర్' (Mohamed Alabbar). ఈయనే బుర్జ్ ఖలీఫా అసలైన యజమాని.ఎమ్మార్ ప్రాపర్టీస్ బుర్జ్ ఖలీఫాను మాత్రమే కాకుండా.. దుబాయ్ మాల్, దుబాయ్ క్రీక్ టవర్, దుబాయ్ ఫౌంటెన్ వంటి ఇతర ఐకానిక్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేసింది.బుర్జ్ ఖలీఫా వివరాలుబుర్జ్ ఖలీఫా ఎత్తు 829.8 మీటర్లు (2,722 అడుగులు). ఇందులో 163 అంతస్తులు ఉన్నాయి. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణం 2010కి పూర్తయింది. 95 కిలోమీటర్ల నుంచి కూడా కనిపించే ఈ భవనంలో 304 విలాసవంతమైన హోటల్ రూల్స్, 900 హై-ఎండ్ అపార్ట్మెంట్లు ఉన్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ బిల్డింగ్ బయటివైపు శుభ్రం చేయడానికే సుమారు మూడు నెలల సమయం పడుతుందని సమాచారం. -
జాక్‌పాట్.. కుర్రాడు రూ.కోట్లు గెలిచాడు
అదృష్టం ఎప్పుడు ఎవరినీ ఎలా వరిస్తుందో చెప్పలేం. 30 ఏళ్లుగా తల్లిదండ్రులకు దక్కని అదృష్టం వారి కొడుక్కి దక్కింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రాలో 18 ఏళ్ల భారత సంతతి విద్యార్థి వేన్ నాష్ డిసౌజా 1 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8.7 కోట్లు గెలుచుకున్నాడు.ఇల్లినాయిస్ అర్బానా-చాంపైన్ విశ్వవిద్యాలయంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యను ప్రారంభించడానికి యూఎస్ వెళ్తున్న వేన్.. వెళ్తూ వెళ్తూ జూలై 26న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాటరీ టికెట్ కొన్నాడు. లక్కీ డ్రాలో ఆ టికెట్‌కే (సిరీస్ 510, నంబర్ 4463) జాక్‌పాట్ తగిలింది.వేన్ నాష్ డిసౌజా దుబాయ్‌లోనే పుట్టి పెరినప్పటికీ అతని తల్లిదండ్రులు ముంబైకి చెందినవారు. వేన్కు టీనేజర్ కావడంతో సొంతంగా అకౌంట్ లేదు. 18 ఏళ్లు నిండినా ఇప్పుడిప్పుడే కావడంతో అకౌంట్ సెట్ చేసుకోలేదు. దీంతో తన తండ్రి అకౌంట్‌ను ఉపయోగించి వేన్ డ్రాలోకి ప్రవేశించాడు. అతని కుటుంబం 30 సంవత్సరాలకు పైగా రాఫెల్ డ్రాలో పాల్గొంటోంది. అయినా వారికి దక్కని జాక్‌పాట్ వేన్కు దక్కింది.వేన్ ఒక రోజు యూనివర్సల్ స్టూడియోలో నిద్రిస్తుండగా కాల్ వచ్చింది. తాను లాటరీ గెలిచినట్లు వారు తెలియజేశారు. దీంతో అతనికి ఇంక నిద్ర పట్టలేదు. ఈ విషయాన్ని వేన్ మొదట నమ్మలేదు. అంతా కల అనుకున్నాడు. ఈ ప్రైజ్ మనీని తన విద్యకు, తన సోదరి చదువుల కోసం, దుబాయ్ లో ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించాలనుకుంటున్నట్లు వేన్ తెలిపాడు. 1999లో ఈ డ్రా ప్రారంభమైనప్పటి నుంచి 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ అందుకున్న 255వ భారతీయుడిగా వేన్ నిలిచాడు. -
దుబాయ్‌కి డ్రైవర్లు కావలెను.. జీతం ఎంతంటే?
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్‌కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీనికోసం జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. దుబాయ్‌కి చెందిన త్రీస్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్‌పోర్టు, దుబాయ్పోర్ట్ వంటి సంస్థలు డ్రైవర్ల నియామకం కోసం 10, 30వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో గణేష్‌కుమార్ తెలిపారు.కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో దుబాయ్ (Dubai) నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు (Drivers) అత్యధికంగా ఉన్నారని, వారిని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యూఏఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించనున్నారు. 24 నుంచి 48 ఏళ్లలోపు ఉన్న వారు అర్హులని, నెలకు రూ.35,000 నుంచి రూ.94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్ఎస్డీసీ తెలిపింది. డ్రైవింగ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఆగస్టు 10న స్టార్ గ్రూపు, వియోలీయ, అల్లయ్డ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగాలకు ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు (Interviews) నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. లేదా skillinternational@apssdc.in ఈమెయిల్, 91–99888533 35, 8712655686, 8790118349, 8790117279 నంబర్లలో సంప్రదించాల్సిందిగా కోరింది.చదవండి: స్కూల్లో కూలి పనులు చేయిస్తున్నారు -
ఆసియాకప్ పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?
ఆసియాకప్-2025 వేదికలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. తాజాగా మ్యాచ్‌లు జరిగే వేదికలను ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ యూఏఈలోని అబుదాబి, దుబాయ్ వేదికలగా జరగనున్నట్లు ఏసీసీ వెల్లడించింది.ఈ ఆసియాకప్‌లో 11 మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మరో 8 మ్యాచ్‌లు అబుదాబి ఇంటర్ననేషనల్ మైదానంలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న జరగనుంది.ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై 28న ముగియనుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సింది.కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. ఈ జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు.ఏ గ్రూప్‌లో ఎవరు?గ్రూప్ ఎ: భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్ఆసియా కప్‌లో టీమిండియా షెడ్యూల్..10 సెప్టెంబర్: భారత్ - యూఏఈ (దుబాయ్)14 సెప్టెంబర్: భారత్ - పాకిస్తాన్ (దుబాయ్)19 సెప్టెంబర్: భారత్ - ఒమన్ (అబుదాబీ)ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించే అవకాశముంది. అయితే ఈ ఆసియా జెయింట్స్ పోరుకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.చదవండి: IND vs ENG: టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా? -
Asia Cup: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్‌ల తేదీలివే!
Asia Cup 2025: ఆసియా కప్-2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా క్రికెట్ మండలి (ACC) శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.మూడుసార్లు ఢీకొట్టే అవకాశం!చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ (India vs Pakistan) జట్లు సెప్టెంబరు 14న పరస్పరం తలపడనున్నాయి. దాయాదులు రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి సూపర్ ఫోర్ దశలో మరోసారి అంటే.. సెప్టెంబరు 21న ఢీకొట్టే వీలుంది. ఒకవేళ ఇరుజట్లు ఫైనల్ చేరితో సెప్టెంబరు 28న మరోసారి ముఖాముఖి పోటీపడతాయి.గ్రూప్- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ గ్రూప్-బి నుంచి తలపడతాయి. దుబాయ్, అబుదాది వేదికలుగా ఈ 19 మ్యాచ్‌ల టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు.బీసీసీఐపై విమర్శలుకాగా ఆసియా కప్ టీ20 టోర్నీకి ఈసారి భారత్ వేదిక. అయితే, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతంలో మాదిరి ఈసారి కూడా తటస్థ వేదికపై టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో అన్ని స్థాయిల్లోనూ క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. బీసీసీఐ సైతం దాయాదితో పోటీ పడేందుకు సుముఖంగా లేమని వెల్లడించింది.కానీ.. తాజా షెడ్యూల్ ప్రకారం చిరకాల ప్రత్యర్థితో టీమిండియా తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు ఇండియా చాంపియన్స్ నిరాకరించింది. దీంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ రద్దు కాగా.. చెరో పాయింట్ వచ్చింది.లీగ్ దశ షెడ్యూల్👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్ వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్ వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 12: పాకిస్తాన్ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్ పాకిస్తాన్👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్ ఒమన్👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్ హాంగ్‌కాంగ్👉సెప్టెంబరు 17: పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్ అఫ్గనిస్తాన్👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్ ఒమన్సూపర్ 4 దశ👉సెప్టెంబరు 20: గ్రూప్- బి టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)👉సెప్టెంబరు 21: గ్రూప్-ఎ టాపర్ వర్సెస్ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)👉సెప్టెంబరు 23: A2 vs B1👉సెప్టెంబరు 24: A1 vs B2👉సెప్టెంబరు 25: A2 vs B2👉సెప్టెంబరు 26: A1 vs B1👉సెప్టెంబరు 28: ఫైనల్.చదవండి: IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ మాత్రం విఫలం -
ప్రపంచంలోనే ఎత్తైన భవనం.. కోట్లు పెట్టి కొన్న సినీతారలు వీళ్లే..!
బుర్జ్ ఖలీఫా.. ఈ పేరు తెలియని వారు దాదాపు ఉండరు. దుబాయ్‌లోని ఆకాశసౌధం ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా గుర్తింపు పొందింది. దుబాయ్ ట్రిప్ వెళ్లినవారు అక్కడ తప్పకుండా ఫోటోలు తీసుకోకుండా ఉండలేరు. అంతలా పర్యాటకంగా బుర్జ్ ఖలీఫా ఫేమస్ అయింది. అయితే ఇది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే అనుకుంటే పొరపాటే. అంత ఎత్తైన శిఖరంలా కనిపించే ఈ ఆకాశం సౌధంలో నివాసానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. అత్యంత విలాసవంతమైన నివాసాలకు నిలయంగా మార్చారు. ఈ లగ్జరీ లైఫ్ స్టైల్‌కు చిరునామాగా మారిన ఈ బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్ కొనాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే.ఈ ప్రపంచంలోనే ఎత్తైన ఈ భవనంలో నివసించాలని ఎవరు కోరుకోరు. ఎన్ని కోట్లైనా సరే పెట్టేందుకు బడా వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు క్యూ కడతారు. అలా ఈ ఆకాశ సౌధంలో మన సినీతారలు సైతం అపార్ట్మెంట్స్ కొనేశారు. ఇందులో బాలీవుడ్ భామ శిల్పాశెట్టితో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఖరీదైన ఫ్లాట్లను తమ సొంతం చేసుకున్నారు. ఆ వివరాలేంటో చూసేద్దాం.బాలీవుడ్ ముద్దుగుమ్మ శిల్పాశెట్టి ఈ ఫ్లాట్ బహుమతిగా లభించింది. ఆమె భర్త, నటుడు రాజ్ కుంద్రా వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా బుర్జ్ ఖలీఫాలో లగ్జరీ ఫ్లాట్‌ను తన సతీమణికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఆమె విలాసవంతమైన నివాసం 19వ అంతస్తులో ఉంది. దీని విలువ దాదాపు రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.మోహన్ లాల్ స్వర్గధామం..మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సైతం బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఆయన 29వ అంతస్తులో లగ్జరీ ఫ్లాట్‌ను కొన్నారు. దాదాపు 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఆధునాతన సౌకర్యాలు ఉన్నాయి. దీని విలువ దాదాపు రూ. 3.5 కోట్లు ఉంటుందని అంచనా. అయితే ఈ ఫ్లాట్‌ను మోహన్ లాల్ తన భార్య సుచిత్ర మోహన్‌లాల్ పేరు మీద రిజిస్టర్ చేశారు. వీరితో పాటు కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ వి నీరియపరంబిల్కు ఈ భవనంలో దాదాపు 22 ఫ్లాట్స్ కొనుగోలు చేశారట. అందువల్లే ఆయనను బుర్జ్ ఖలీఫా రాజు అని ముద్దుగా పిలుస్తారట. -
ఆమె ఏమో దుబాయ్‌లో.. నేనేమో ఇంకా ఈ ట్రాఫిక్‌లో!
మన దేశంలో బెంగళూరు ట్రాఫిక్కంటూ (Bengaluru Traffic) ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. నిత్యం ఆ ట్రాఫిక్‌లో నరకం అనుభవించేవాళ్లకే ఆ బాధేంటో తెలుస్తుంది. ఇటు.. సోషల్ మీడియాలో దీనిపై నడిచే చర్చ అంతా ఇంతా కాదు. అలా అక్కడి పరిస్థితులపై ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దుబాయ్ వెళ్తున్న తన స్నేహితురాలిని ఒకడు బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగబెట్టాడట. తిరిగి తాను ఇంటికి వెళ్లే క్రమంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాడట. అలా ఆమె దుబాయ్‌కి చేరుకుంటే.. అతను మాత్రం ఇంకా ఆ ట్రాఫిక్‌లోనే ఉండిపోయాడట. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అకౌంట్ ఎక్స్ అకౌంట్లో ఈ వీడియో షేర్ అయ్యింది.బెంగళూరుకు చెందిన @bengalurupost1 యూజర్ ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదెంత వరకు నిజం? అని ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇది సెటైరికల్ పోస్టే అని స్పష్టమవుతున్నా.. సరదాగా కాసేపు కామెంట్లతో బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై జోకులు పేలుస్తున్నారు.How true is this #Bengaluru? pic.twitter.com/02v0KwngoA— Bengaluru Post (@bengalurupost1) July 18, 2025ఇదిలా ఉంటే.. ఇటు గురుగ్రామ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వర్షం పడడంతో నీరు నిలిచిపోయి.. నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్న దృశ్యాలు అవి. అయితే దానికి కూడా బెంగళూరుకు ముడిపెట్టి జోకులు పేలుస్తున్నారు. ఇది బెంగళూరు ట్రాఫిక్ కంటే ఎంతో నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ankit Tiwari (@nomadic_ankit_) ఇదీ చదవండి: బెంగళూరు ట్రాఫిక్ సమస్య చెక్ ఇలా.. -
దక్షిణాది సినీ అవార్డుల సంబురం.. తేదీ, వేదిక ఫిక్స్!
దక్షిణాదిలో ప్రతిష్టాత్మక సినీ పండుగ తేదీలు ఖరారు చేశారు. సౌత్ ఇండస్ట్రీలో అందించే ప్రముఖ సైమా అవార్డుల వేడుక జరిగే వేదికను కూడా నిర్ణయించారు. ఈ ఏడాది జరగనున్న 13వ ఎడిషన్ అవార్డుల వేడుకను దుబాయ్‌లోనే నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5,6 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకలు వెల్లడించారు.దక్షిణాది సినిమాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందజేయనున్నారు. ఇప్పటివరకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరిట 12 ఎడిషన్లు పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన నామినేషన్స్ జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నారు. గత రెండేళ్లుగా ఈ వేడుకను దుబాయ్‌లోనే నిర్వహిస్తున్నారు. ఈసారి అక్కడే సినీ అవార్డుల వేడుక సైమా జరగనుంది.The biggest celebration of South Indian Cinema is back!Dubai 5th & 6th SeptemberGet ready for SIIMA's 13th edition, where stars shine the brightest!@BrindaPrasad1 @vishinduri#SIIMA2025 #NEXASIIMA #SouthIndianCinema #dubai pic.twitter.com/AC2iihRNib— SIIMA (@siima) July 18, 2025 -
పెళ్లి చేసుకోండి.. సెలవులిస్తాం
ఉద్యోగుల సంక్షేమం, కుటుంబ వ్యక్తిగత జీవనాన్ని మెరుగుపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రభుత్వంలోని వివిధ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు పెళ్లి కోసం 10 పనిదినాల పూర్తి వేతనంతో కూడిన సెలవును మంజూరు చేస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. తమ పౌరులకు పని-జీవిత సమతుల్యత, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి దుబాయ్ ప్రకటించిన ఈ నూతన సెలవు విధానం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది.దీనికి సంబంధించి యూఏఈ ప్రధాని, దుబాయ్ పాలకుడైన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిక్రీ జారీ చేశారు. ఈ కొత్త ఆదేశాలు వివిధ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న యూఏఈ పౌరులందరికీ వర్తిస్తాయి. ఇందులో దుబాయ్ ప్రభుత్వ విభాగాలు, న్యాయాధికారులు, సైనిక సిబ్బంది, ఫ్రీ జోన్లు, స్పెషల్ డెవలప్మెంట్ జోన్లు, దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (డీఐఎఫ్సీ) వంటి సంస్థలు ఉన్నాయని ఖలీజ్ టైమ్స్ తెలిపింది. భవిష్యత్తులో అదనపు కేటగిరీల ఉద్యోగులను కవర్ చేయడానికి విస్తరణకు కూడా ఈ డిక్రీ అనుమతిస్తుంది.కొత్త వివాహ సెలవుకు అర్హత పొందడానికి ఉద్యోగులు వారి ప్రొబేషనరీ వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. అలాగే తాము పెళ్లి చేసుకోబోయే వారు కూడా యూఏఈ పౌరులే అయి ఉండాలి. 2024 డిసెంబర్ 31 తర్వాత అయిన వివాహాలకే ఇది వర్తిస్తుంది. ఈ వివాహ ఒప్పందాన్ని యూఏఈ అధీకృత సంస్థలు అధికారికంగా ధృవీకరించాలి. వెరిఫికేషన్ కోసం మ్యారేజ్ సర్టిఫికేట్ సర్టిఫైడ్ కాపీ అవసరం. పెళ్లి జరిగిన రోజు నుంచి ఈ సెలవులను ఒకసారి కానీ, విడదలవారీగా కానీ ఉపయోగించుకోవచ్చు. వివాహ సెలవుల కాలంలో ఉద్యోగికి వర్తించే అన్ని అలవెన్సులు, ఆర్థిక ప్రయోజనాలతో సహా పూర్తి వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. -
అమ్మా నీ పాడి మోసేందుకు రాలేకపోతున్నా.. క్షమించు..!
నంద్యాల: ‘అమ్మా నిన్ను చూసేందుకు రాలేకపోతున్నా.. నీ కడ చూపునకు నోచుకోలేనంతా దూరంలో ఉన్నాను. నీ పాడి మోయలేక పోతున్నా.. నన్ను క్షమించు’ అంటూ ఓ తనయుడి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది. ఉపాధి కోసం దుబాయ్‌లో ఉన్న కుమారుడు తల్లి అంత్యక్రియలకు రాలేక ఎంతో కుమిలిపోయాడు. వీడియో కాల్లో తన తల్లి చివరి చూపును వీక్షించి కన్నీటిపర్యంతమయ్యాడు. క్రిష్టిపాడు గ్రామానికి చెందిన పగిడి జయమ్మ(48) గత కొంతకాలంగా ఆనారోగ్యంతో ఇబ్బందులు పడేది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె మంగళవారం మృతి చెందింది. గత ఏడేళ్ల క్రితం భర్త కూడా మృతి చెందాడు. ఇద్దరు కూతుళ్లు సారిక, ఓళమ్మ, ఒక్కగానొక్క కొడుకు ఓబులేసు ఉన్నారు. కొడుకు దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిమరణ వార్త తెలుసుకున్న తనయుడు ఆందోళనకు గురయ్యాడు. దీంతో బంధువులు వీడియో కాల్ చేసి అతని తల్లి అంత్యక్రియలను చూయించారు. తాను బతికుండి కన్న తల్లి పాడి మోయలేక పోతున్నానని.. కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ ఘటన గ్రామంలో పలువురిని కంటతడి పెట్టించింది. -
దుబాయ్‌లో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి
ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఈనెల 8న దుబాయ్‌లోని కరామా పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. యుఏఈ వైయస్సార్సీపీ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి, ప్రేం, యండ్రా సేను, షేక్ అబ్దుల్లా కీలకంగా వ్యవహరించారు. వైఎస్సార్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పణతో కార్యక్రమాన్నిప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి మహానేత సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కార్మికులకు అన్నదానం చేశారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని వైఎస్సార్ సేవా తత్వాన్ని గౌరవంగా స్మరించుకున్నారు.ఈ సందర్భంగా సయ్యద్ అక్రమ్, అరుణ్ చరవర్థి మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ సామాజిక న్యాయం, సంక్షేమాన్ని సమన్వయం చేసిన అజరామర నాయకుడని కొనియాడారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చిన నాయకుని సేవలను సేవా కార్యక్రమాల ద్వారా గుర్తుచేసుకోవడం గర్వకారణమని అన్నారు.ప్రధాన, గౌరవ అతిథులు డాక్టర్ ఖాజా అబ్దుల్ ముత్తలిబ్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & ప్రైవేట్ అడ్వైజర్ — H.H. శైఖా సలామా తహ్మూన్ అల్ నాహ్యాన్ కార్యాలయం – యుఏఇ), నజీరుద్దీన్ మహమ్మద్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, Spread Kindness) హాజరయ్యారు. పి. రావు, అబ్దుల్ ఫహీమ్, షోయబ్, అబ్దుల్ రఫీక్, షామ్, ఘానీ, సిరాజ్, షేక్ సమీర్, రవి, పిల్లి రవి, కె. ప్రసాద్, జో బాబు, కిషోర్, బాబ్జీ, ప్రభాకర్, చిట్టి బాబు, నరేశ్, మహిళా సభ్యులు.. శాంతి, రాణి, ప్రభావతి, చిన్ని, విజయ, మేరీ, రాజేశ్వరి, సునీత, వనిత, కమల, భారతీ తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ వైఎస్సార్ సేవా విలువలు, ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్న సంకల్పంతో.. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు.వైఎస్సార్ వల్లే ఎదిగా..డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లబ్ధి పొంది దుబాయ్‌లో స్థిరపడిన షేక్ సమీర్ ఈ సందర్భంగా తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ''ఫీజు రీయింబర్స్మెంట్ వల్లే నేను ఇంజినీరింగ్ చదవగలిగాను. ఈ విద్యార్హత ఆధారంగా ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్‌జెమినీ, డెలాయిట్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల్లో పనిచేశాను. ఆరోగ్యం, టెక్నాలజీని కలిపే వినూత్న ఆలోచనతో ఏఐ ఆర్కిటెక్ట్, Fit Techies LLC అనే సంస్థను స్థాపించి నడుపుతున్నాను. ఈ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఫిట్నెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి బోధిస్తున్నా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం నా జీవితాన్ని మార్చింది. నేను విద్యార్థి నుంచి మార్గదర్శకుడిగా మారిన ప్రయాణానికి ఇది మూలకారణం” అన్నారు సమీర్. -
ఒంటె కన్నీటి చుక్క విషానికి విరుగుడు!
బికనీర్: లొట్టిపిట్టగా, ఎడారి ఓడగా పేరు తెచ్చుకున్న ఒంటె అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. దానిని ఎక్కితే మొదటి అంతస్తు నుంచి చూస్తున్నంత అనుభూతి కల్గుతుంది. పిల్లలకు ఆనందాన్ని పంచే ఈ ఒంటెలు ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అందరికీ రక్షణగా సైతం నిలుస్తాయని తాజా అధ్యయనమొకటి గట్టిగా నమ్ముతోంది. 26 రకాల పాముల విషాలను సైతం తట్టుకునేంత అద్భుతమైన శక్తిసామర్థ్యాలు ఒంటె కన్నీటికి ఉందని ఒక పరిశోధనా బృందం అభిప్రాయపడుతోంది. ఇసుక తుపాన్లు, చుక్క నీరులేని ఎడారి ప్రాంతం, ఒళ్లు కాలి మండిపోయేంత ఎండ.. ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలీలగా బతికే గుణం ఒంటెకు ఉన్న ట్లే ఆ ఒంటె కన్నీటికీ అసాధారణ శక్తి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లే»ొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. పాముకాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన పోషకాలు అక్కరకొస్తాయని వాళ్లు చెబుతున్నారు. బ్యాక్టీరియా కణ గోడలను ధ్వంసంచేసి వాటిని చంపేసే రోగనిరోధక శక్తి ఉండే ప్రోటీన్లు ఈ కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని, ఈ కన్నీటి సాయంతో అత్యంత శక్తివంతమైన పాముకాటు విరుగుడు మందును తయారుచేయొచ్చని పరిశోధకులు చెప్పారు. సన్నని ఇసుకరేణువుల గాలిలో ఏళ్లతరబడి గడిపిన కారణంగా ఒంటె కన్నీటిలో సహజంగానే కంటిసంబంధ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఉంటుందని, ఆ కోణంలో శోధించి ఈ కొత్త విషయాన్ని సాధించామని వాళ్లు చెప్పారు. ఒంటె కన్నీళ్లలో పాముకాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని వాళ్లు వెల్లడించారు. ఎలా కనిపెట్టారు? ఎకీస్ కారినాటస్ సోచిరేకీ అనే విషపూరితమైన పాము నుంచి విషాన్ని బయటకు తీసి క్యామలస్ డ్రోమిడేరియస్ రకం ఒంటెకు స్వల్పస్థాయిలో ఎక్కించారు. విషానికి ఒంటె రక్తం, కన్నీరు ఎలా స్పందిస్తున్నాయో అధ్యయనంచేశారు. గుర్రాలకు పాము విషాన్ని ఎక్కించి పాముకాటు విరుగుడు తయారుచేస్తారు. అలా తయారుచేసిన విరుగుడుతో పోలిస్తే ఒంటె కన్నీటిలో యాంటీబాడీ పాళ్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. అయితే ప్రపంచస్థాయిలో అన్ని రకాల పాముల విషాలకు ఒంటె కన్నీరు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన జరగలేదు. దుబాయ్, బికనీర్‌లో జరిగిన స్థాయిలో అన్నిచోట్లా పరిశోధనలు సత్ఫలితాలనిస్తే విరుగుడు మందు తయారీలో కొత్త అధ్యయనం మొదలైనట్లేనని అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. భారత్‌లో ఏటా వేలాది మంది పాముకాటు కారణంగా చనిపోతున్న సంగతి తెలిసిందే. -
దుబాయ్‌లో ప్రపంచ కబడ్డీ లీగ్
న్యూఢిల్లీ: మనదేశంలో విశేషాదరణ చూరగొన్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) త్వరలో విశ్వవ్యాప్తంగా కూత పెట్టేందుకు ముస్తాబైంది. ప్రపంచ సూపర్ కబడ్డీ లీగ్ (డబ్ల్యూఎస్‌కేఎల్)కు వచ్చే ఏడాది నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రారంభ ప్రపంచ లీగ్ దుబాయ్‌లో వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్) భాగస్వామ్యంతో ఫ్రాంచైజీ లీగ్ నిర్వహిస్తామని డబ్ల్యూఎస్‌కేఎల్ వర్గాలు తెలిపాయి.మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో పటిష్టమైన భారత బలగం ప్రధాన భూమిక పోషించనుంది. ‘ఒక్క భారత్‌లోనే కాదు... ప్రపంచస్థాయిలోనే కబడ్డీ క్రీడా ఎంతో ఎదిగింది. అంతర్జాతీయ క్రీడల్లో మన గ్రామీణ ఆట ప్రముఖ స్థానం సంపాదించుకుంది. పీకేఎల్ ద్వారా దేశంలో సంపాదించుకున్న అభిమాన దళాన్ని ఇక మీదట ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకునేందుకు వరల్డ్ సూపర్ కబడ్డీ లీగ్ దోహదం చేస్తుంది.తద్వారా భవిష్యత్తులో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) గుర్తింపు కూడా పొందాలన్నదే మా ప్రధాన లక్ష్యం’ అని ఎస్జే కబడ్డీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు శాంభవ్ జైన్ తెలిపారు. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే డబ్ల్యూఎస్‌కేఎల్ టోర్నీ జరగనుంది. అంతర్జాతీయ కబడ్డీలో రాణిస్తున్న దక్షిణ కొరియా, ఇరాన్, థాయ్‌లాండ్, పాకిస్తాన్, మలేసియా, జపాన్, కెనడా, అమెరికా దేశాల కబడ్డీ సమాఖ్యలు ఈ లీగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన చెప్పారు. ఒక్కో ఫ్రాంచైజీ ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ. 48 కోట్ల పర్సు కలిగి ఉంటుంది. ముందుగా ఎనిమిది ఫ్రాంచైజీల ఎంపిక అనంతరం పూర్తిస్థాయి వివరాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు. -
ఒక్క ఇల్లు.. ఎక్కువ ఈఎంఐలు.. తక్కువ రిటర్న్స్
ఎక్కువ మంది భారతీయ దంపతులు తమ రిటైర్మెంట్ ప్రణాళికల్లో భాగంగా ఇండియాలో కాకుండా దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూఏఈలోని భారతీయులు విభిన్న ప్రాపర్టీల్లో పెట్టుబడులు పెట్టి అద్దె ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని, తద్వారా రియల్ ఎస్టేట్‌ను స్మార్ట్ రిటైర్మెంట్ ప్లాన్‌గా మారుస్తున్నారని బెంగళూరుకు చెందిన సీఏ, ఒబెయా స్టార్టప్ ఫౌండర్ అభిషేక్ జమువార్ తెలిపారు.జమువార్ తన లింక్డ్ఇన్లో ఇందుకు సంబంధించిన వివరాలు పంచుకున్నారు. ‘ఇలా చెబుతున్నందుకు నన్ను క్షమించాలి. దుబాయ్‌లో ఇన్వెస్ట్ చేసిన భారతీయులు ఇండియాలో పెట్టుబడి పెట్టినవారితో పోలిస్తే సంతోషంగా ఉన్నారు. దుబాయ్‌లో 2-3 ప్రాపర్టీస్ కొన్న భారతీయ జంటలు చాలానే ఉన్నాయి. కేవలం రికార్డు కోసం నేను సంపన్న వర్గం గురించి మాట్లాడటం లేదు. కష్టపడి, డబ్బు ఆదా చేసి, వారి భవిష్యత్తును సులభతరం చేయడానికి తమ కెరియర్లో 10 నుంచి 15 సంవత్సరాలు శ్రమించిన సాధారణ జంటల గురించి మాట్లాడుతున్నాను. దుబాయ్‌లో చాలా మంది మధ్యతరగతి భారతీయ జంటలు కొన్నేళ్లుగా పొదుపు చేసి రెండు, మూడు ప్రాపర్టీలను కొనుగోలు చేయగలిగారు. 6–7% అద్దె రాబడులను అందించే ఈ ప్రాపర్టీలను కేవలం 5% వడ్డీ రేటుతో కొనుగోలు చేశారు. ఆదాయ వనరు, పదవీ విరమణ ప్రణాళికలు రెండింటికీ ఉపయోగపడే స్థిరాస్తులను సృష్టించుకుంటున్నారు’ అని చెప్పారు.భారత్‌లో వడ్డీరేట్లు అధికం‘అయితే ఇండియాలో వన్ హోమ్, ఎక్కువ ఈఎంఐలు, తక్కువ రిటర్న్స్.. ఇదీ పరిస్థితి. ఇక్కడి విధానాల ద్వారా చాలా మంది మధ్యతరగతి వారు సాధారణంగా ఒక ఇంటిని మాత్రమే కలిగి ఉంటారు. ఇక్కడి నిబంధనల ప్రకారం ఈఎంఐలపై 10% వరకు వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. అదీ చాలక అప్పు తీసుకుంటారు. అద్దె రాబడిలో కేవలం 3% వరకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. వ్యక్తి మొత్తం ఆదాయం ఈఎంఐలకే వెళుతుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: బూమరాంగ్‌లా బంగారం ధరలు! తులం ఎంతంటే..ఆదాయ మార్గాలపై దృష్టిసామాన్య ప్రజలు తమ సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఆదాయ మార్గాలు పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈల్డ్ జనరేట్ చేసే పొదుపు మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అంతిమంగా సొంతిల్లు కలిగి ఉండడం మాత్రమే కాదు.. ఒత్తిడి లేకుండా జీవించడం, ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా రిటైర్ అవ్వడం ముఖ్యమని చెబుతున్నారు. అందుకు ముందునుంచే ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలంటున్నారు. -
దుబాయ్‌లో ‘గామా అవార్డ్స్’.. హాజరయ్యే హీరోహీరోయిన్లు వీళ్లే!
గల్భ్ అకాడమీ మూవీ అవార్డ్స్ (గామా) ఐదవ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఆగస్ట్ 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం గ్రాండ్‌గా జరగనుంది. ఇందుకు సంబంధించిన థీమ్ సాంగ్‌ను దుబాయ్‌లో లాంచ్ చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను రఘు కుంచె కంపోజ్ చేసి పాడారు. సందర్భంగా ‘గామా అవార్డ్స్’ చైర్మన్ త్రిమూర్తులు గారు మాట్లాడుతూ ‘ దుబాయ్ లో జరిగే ఏకైక అతి పెద్ద వేడుక గామా అవార్డ్స్. గత నాలుగు ఎడిషన్లు ఘనంగా పూర్తి చేసుకున్నాం. ఆగస్ట్ 30న జరగబోయే 5వ ఎడిషన్‌ను కూడా మన తెలుగు వారు అందరూ , ఈ కార్యక్రమానికి సహకరించి, అధిక సంఖ్యలో హాజరు అయ్యి విజయవంతం చేయాలి’అని కోరారు.దుబాయ్‌లో జరిగే ఈ ఈవెంట్‌కి టాలీవుడ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్.. హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్ తో పాటు.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు. అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పర్ఫార్మెన్స్ లతో అలరించనున్నారు.ప్రత్యేక అతిధులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు.వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ ప్రైజ్ గెస్ట్ లుగా హాజరు కానున్నారు. అతిరథ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా జరగనున్న ఈ అవార్డ్స్ వేడుక కోసం చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
దుబాయ్: 67 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం..
దుబాయ్: అరబ్ దేశం దుబాయ్‌లో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ‘టైగర్ టవర్’గా పేరొందిన 67 అంతస్తుల ‘మెరీనా పినాకిల్’ భవనంలో అర్ధరాత్రి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సహాయక బృందాలు.. 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి. ఇక, ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు.వివరాల ప్రకారం.. దుబాయ్‌లో ‘మెరీనా పినాకిల్’ భవనంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దాదాపు 6 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో సహాయక బృందాలు 764 ఫ్లాట్ల నుంచి 3,820 మంది నివాసితులను సురక్షితంగా బయటకు తరలించాయి.A massive fire broke out at the 67-story Marina Pinnacle (also known as Tiger Tower) in Dubai Marina on June 13, 2025, starting around PM. Dubai Civil Defense teams evacuated 3,820 residents from 764 apartments, with no reported injuries or casualties. The fire, which began… pic.twitter.com/OOsWDHj6pu— EternalChaos (@EternalChaos158) June 14, 2025 ఇక, అగ్ని ప్రమాదం కారణంగా ప్రమాదస్థలిలో అంబులెన్సులు, వైద్యసిబ్బందిని మోహరించారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశారు. మెరీనా పినాకిల్‌లో మంటలు చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. 2015లోనూ 47వ అంతస్తులో మంటలు చెలరేగి.. 48వ అంతస్తుకు వ్యాపించాయి. సహాయక సిబ్బంది మంటలార్పారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడయాలో వైరల్‌గా మారాయి. 🚨 BREAKING: Scenes from Dubai, As Projectile from Yemen hits a Marina Pinnacle Tower or Tiger Tower in Dubai Marina. This is a first inclident during the ongoing Iran Israel war in UAE pic.twitter.com/eVxPrJ6Wyu— True Pulse Global (@truepulseglobal) June 14, 2025 -
ఏ అలా, ఏ తుఫానూ ఎంతో కాలం ఉండవు, దారి మనమే వెతుక్కోవాలి: సమంతా పోస్ట్ (ఫోటోలు)
-
ఇక్కడ ఏమీ లేదు.. సమంత పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత(Samantha) క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగతం లేదా సినిమాలు, వర్కౌట్స్, ఆరోగ్య సూత్రాలు... ఇలా ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం ఆమె అబుదాబీలో ఉన్నారు. అక్కడ హ్యాపీగా... జాలీగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు సమంత. (చదవండి: అక్కినేని అఖిల్ పెళ్లి.. బరాత్‌లో జోరుమీదున్న నాగచైతన్య)‘‘ఇక్కడ ఏమీ లేదు... సౌండ్ లేదు... హడావిడి లేదు... చక్కని స్పేస్ ఉంది’’ అంటూ వెకేషన్లో భాగంగా అబు దాబీలో సంతోషంగా ఉన్న అక్కడి ఫొటోలను ఆమె షేర్ చేయగా, వైరల్‌గా మారాయి. దుబాయ్‌లో జరిగిన ఓ జ్యువెలరీ బ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్న సమంత అనంతరం అక్కడి అందాలను చూస్తూ సందడి చేస్తున్నారు. ఇక సమంత కెరీర్ విషయానికొస్తే... విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్‌తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)


