అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు.. దుబాయ్‌లో కొత్త చట్టం | Dubai issues new law regulating outsourcing of government services | Sakshi
Sakshi News home page

అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు.. దుబాయ్‌లో కొత్త చట్టం

Mar 13 2026 2:46 AM | Updated on Mar 13 2026 11:25 AM

Dubai issues new law regulating outsourcing of government services

దుబాయ్ ప్రభుత్వ సేవల నాణ్యత, సామర్థ్యాన్ని పెంచడానికి ప్రైవేట్ కంపెనీల సహకారాన్ని ప్రోత్సహిస్తూ కొత్త చట్టం ప్రవేశపెట్టింది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేసిన లా నెం. (5) 2026 ప్రకారం.. ప్రభుత్వ సంస్థలు కొన్ని లేదా అన్ని సేవలను ప్రైవేట్ కంపెనీలకు అవుట్‌సోర్సింగ్ చేసుకోవడానికి అధికార అనుమతి పొందాయి.

చట్టం ప్రకారం.. అవుట్‌సోర్సింగ్ ఒప్పందాలు అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అనుసరిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తాయి. దుబాయ్ ఆర్థిక శాఖ ఈ ఒప్పందాలను పర్యవేక్షిస్తుంది. నియంత్రించే విధానాలను అమలు చేస్తుంది.

ఒక ప్రభుత్వ సంస్థ ఒకే సేవ కోసం ఒకటి కంటే ఎక్కువ కాంట్రాక్టర్‌లను నియమించవచ్చు. ఒక కంపెనీ ఏకైక బిడ్డర్‌గా ఉంటే మాత్రమే ప్రత్యేక ఒప్పందాలకు అనుమతి ఉంటుంది. ఇది న్యాయమైన పోటీని నిర్వహించడానికి ఉద్దేశించిన నిబంధన.

చట్టంలోని నిబంధనలు

  • చట్టంలో అవుట్‌సోర్సింగ్ ఒప్పందాల్లో కాంట్రాక్ట్ వ్యవధి, రద్దు విధానాలు, కాంట్రాక్టర్ ఆస్తులను రక్షించే చర్యలు తదితర అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు.

  • ప్రభుత్వ సంస్థలు కాంట్రాక్టర్ల పనితీరు సూచికల ద్వారా వారిని పర్యవేక్షించి, మూల్యాంకనం చేయాలి.

  • అవుట్‌సోర్సింగ్ కంపెనీలు ‍ప్రతి విదేశీ ఉద్యోగికీ ఒక యూఏఈ జాతీయుడని నియమించుకోవాల్సి ఉంటుంది.

  • ఎమిరాటీ సిబ్బందికి జీతాలు, ప్రోత్సాహకాలు ఒప్పంద నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.

  • జ్యుడీషియల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి ప్రభుత్వం నిర్ధారించిన పరిమితుల కంటే ఎక్కువ జరిమానాలు విధించే హక్కు లేదు.

  • ప్రభుత్వ సంస్థలు, కాంట్రాక్టర్లు చట్టాన్ని అమలు చేయడం మూడేళ్ల లోపే ప్రారంభించాలి.

Advertisement
 
Advertisement
Advertisement