యూఏఈ గుడ్‌న్యూస్‌.. వీసా ముగిసినా రావచ్చు.. | UAE allows expats abroad with expired visas to return without new entry permit | Sakshi
Sakshi News home page

యూఏఈ గుడ్‌న్యూస్‌.. వీసా ముగిసినా రావచ్చు..

Mar 13 2026 1:16 AM | Updated on Mar 13 2026 1:42 AM

UAE allows expats abroad with expired visas to return without new entry permit

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) రెసిడెన్సీ వీసాల గడువు ముగిసిన ప్రవాసులకు కొత్త ప్రవేశ అనుమతి లేకపోయినా దేశానికి తిరిగి రావడానికి తాత్కాలికంగా వీలు కల్పించారు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసీపీ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రత్యేక వెసులుబాటు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 31 వరకు ఒక నెల పాటు అమల్లో ఉంటుంది. ఇక్కడ రెసిడెన్సీ వీసాలు ఉండి బయటి దేశాలకు వెళ్లి వీసా గడువు ముగిసేలోపు యూఏఈకి తిరిగి రాలేకపోయినవారికి వెసులుబాటు కల్పించేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

"ఈ చర్య ప్రవాస నివాసితులు తిరిగి రావడానికి సులభతరం చేస్తూ, నిర్దిష్ట వ్యవధిలో వారి ప్రయాణాలను సౌకర్యవంతం చేయడం లక్ష్యంగా ఉంది" అని ఐసీపీ ప్రకటనలో పేర్కొంది. అర్హులైన నివాసితులు తిరిగి యూఏఈలో ప్రవేశించి, తరువాత సంబంధిత అధికారిక విధానాల ద్వారా వారి నివాస స్థితిని క్రమబద్ధీకరించుకోవచ్చు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement