ఇరాన్‌ పవర్‌ ఇంకా పూర్తీగా చూడలేదు.. | Iran Deterrence Power Much Bigger Than What The World Has Seen, Says Former Military Intelligence Official | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ పవర్‌ ఇంకా పూర్తీగా చూడలేదు..

Mar 12 2026 10:49 PM | Updated on Mar 13 2026 1:41 PM

Irans Strategic Strike Capability Much Larger Than Current Displays Former Official

ఇరాన్‌ నిరోధక సామర్థ్యాన్ని ప్రపంచం ఇప్పటివరకు కేవలం కొంత భాగమే చూసిందని మాజీ సైనిక గూఢచారి విభాగ అధికారి మొహమ్మద్ హసన్ నామీ వ్యాఖ్యానించారు. ఆయన గతంలో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆర్మీలో గూఢచారి విభాగానికి ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

ప్రాంతవ్యాప్తంగా అమెరికాకు చెందిన ఉగ్రవాద స్థావరాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆక్రమిత ప్రాంతాల్లోని కీలక కేంద్రాలపై కూడా దాడులు జరిగాయని చెప్పారు.

ఇరాన్‌ క్షిపణి, డ్రోన్ దాడులతో శత్రు దేశాల సైనిక మౌలిక సదుపాయాలు వారి వ్యూహాత్మక లోతుల్లోనే ధ్వంసమయ్యాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచం చూస్తున్న ఈ ఘటనలు ఇరాన్‌ నిరోధక శక్తిలో కేవలం ఒక భాగమేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ తీవ్రమైన ప్రతిస్పందన ఫలితంగా శత్రు స్థావరాల శిథిలాల నుంచి మంటలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు చెందిన సైబర్ విభాగం ప్రచారం చేసినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement