international
-
కేరాఫ్ కాంటినెంటల్ : ఇంటర్నేషనల్ చెఫ్‌లతో స్పెషల్ చిట్‌చాట్
కాంటినెంటల్ వంటకాలకు నగరం కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందుతోంది. సాధారణంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాలతో నగరానికి ప్రత్యేక అనుబంధముంది. ఈ మూడు దేశాల వంటకాలు భాగ్యనగరంలో విరివిగా లభ్యమవుతుండడం.. ప్రధానంగా సింగపూర్, మలేషియాలో దక్షిణాది వంటకాలకు మంచి ఆదరణ ఉండడం..చైనీస్ వంటకాలకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలోని ‘ది లీలా హైదరాబాద్’ ఆధ్వర్యంలో ఆగ్నేయాసియా వంటకాలను అందుబాటులోకి తీసుకురావడానికి, వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ)ను ప్రారంభించింది. ‘త్రీ’ అనే మలయ్ పదం నుంచి పుట్టుకొచ్చిన టీఐజీఏ సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో సాధారణంగా ఏ కాంటినెంటల్ వంటకం నగరానికొచ్చినా కాసింతైనా స్థానిక రుచులకు అనుగుణంగా వాటి ఫ్లేవర్స్, రుచిని మార్చుతారు. కానీ ఇక్కడ ఎలాంటి మార్పూ లేకుండానే స్వచ్ఛమైన ఆగ్నేయాసియా వంటకాలను అందిస్తామని ప్రముఖ సింగపూర్ మాస్టర్ చెఫ్ ఆల్బర్ట్ రాయన్ తెలిపారు. దీని ఆవిష్కరణ సందర్భంగా నగరంలో సందడి చేసిన ప్రముఖ చెఫ్‌లు ఆల్బర్ట్ రాయన్, మలేషియా వంటకాల నిపుణుడు, ప్రముఖ చెఫ్ ‘షా’ సాక్షితో ముచ్చటించారు. వారు పంచుకున్న అనుభవాలు వారి మాటల్లోనే.. దాదాపు 20 ఏళ్లకు పైగా ప్రొఫెషనల్ చెఫ్‌గా వివిధ దేశాల్లో వినూత్న వంటకాలను వండి వడ్డించాను.. కానీ హైదరాబాద్ నగరం ఆహ్వానించినంత ఉన్నతంగా మరే ప్రాంతం లేదని చెప్పగలను. ఆగ్నేయాసియాకు చెందిన పసందైన వంటకాలను చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌కు చేరువ చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి వినూత్న భోజన గమ్యస్థానం టిగా (టీఐజీఏ) ‘మూడు’ అనే మలయ్ పదంలో భాగంగా సింగపూర్, మలేషియా, చైనీస్ వంటకాల సమ్మేళనాన్ని అందిస్తుంది. నగరంలోని కాంటినెంటల్ రుచుల ఆసక్తికి అనుగుణంగా విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులతో మాత్రమే అరుదైన పసందైన డిషెస్ తయారు చేస్తున్నాం. ఈ వంటకాల్లో ఆయా దేశాల సంస్కృతి, పాకశాస్త్ర పరిపూర్ణ ప్రామాణికత నిర్ధారించడానికి రెస్టారెంట్ నిరి్థష్ట మూలికలు, సుగంధ ద్రవ్యాలను పెంచడం ప్రారంభించింది. చైనీస్, మలయ్, ఇండియన్ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన సింగపూర్ అద్భుత వంటల వారసత్వం, చిల్లీ క్రాబ్, హైనానీస్ చికెన్ రైస్ వంటి ఐకానిక్ వంటకాలను కలినరీ స్పెషల్‌గా అందిస్తున్నాం. నాసి లెమాక్, రెండాంగ్, సాటే వంటి మలేషియా ప్రత్యేకతలు ఆయా దేశం టేస్ట్ ప్రొఫైల్, పాక శాస్త్ర నైపుణ్యాలను హైలైట్ చేస్తాయి. వీటికి అనుబంధంగా అద్భుతమైన టీలు, ప్రసిద్ధ సామాజిక భోజన సంస్కృతి అయిన ఆరి్టసాన్ డిమ్ సమ్ వంటి క్లాసిక్ కాంటోనీస్ యమ్ చా అనుభవం చేయవచ్చు. ఇలా ఒక ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక వైభవాన్ని స్వచ్ఛంగా కలుషితం లేకుండా కొనసాగిస్తున్న నగరం హైదరాబాద్ కావడంవిశేషం. – ఆల్బర్ట్ రాయన్, చెఫ్ దక్షిణాది ప్రేరణతో.. మలేషియాలో దక్షిణాది వంటకాలకు ప్రత్యేక ఆదరణ ఉంది. ఇక్కడి నుంచి మలేషియాకి వచ్చినన ఫుడ్ లవర్స్ మామ అని సంబోధిస్తూ ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారు. ఇందులో భాగంగా కొన్ని మలేషియాయా వంటకాలకు మామ కలిపి వాటి పేర్లను తయారు చేశాము. మలేషియాలో చాలా వంటకాలు దక్షిణాది ప్రేరణతో వాటి వైవిధ్యాన్ని, తయారీ విధానాన్ని రూపొందించుకున్నాయి. ఆహారాన్ని ఆస్వాదించడంలో, గౌరవించడంలో దక్షిణాది ప్రజలు ఉన్నత స్థాయిలో ఉంటారు. ముఖ్యంగా హైదరాబాదీలు. ఈ నేపథ్యంలో నగరం వేదికగా సింగపూర్, మలేషియా, చైనా సాంస్కృతిక వంటకాలను అందించడం సంతోషంగా ఉంది. – షా, చెఫ్ -
Comment X: ఎవర్రా బాబూ ఇది ఎడిట్ చేసింది!
వైట్‌హౌజ్ ఓవెల్ ఆఫీస్‌లో జరిగిన పరిణామాలు.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అనుసరిస్తున్న వైఖరిని.. తమ సమక్షంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump_, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో ఖనిజ సంపద ఒప్పందాల సంతకం చేయకుండానే జెలెన్స్కీ అమెరికా నుంచి వెనుదిరిగారు. ట్రంప్‌నకు ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పనని జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు వైట్‌హౌజ్(White House) తలుపులు మూసుకుపోయినట్లేనని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో ఏఐ ఎడిట్లు ఎంతగా వైరల్ అవుతున్నాయో తెలిసిందే. గాజా విషయంలో అలాంటి ఓ వీడియోను ఎడిట్ చేసే.. ట్రంప్ విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తాజా భేటీని.. దాదాపుగా తన్నుకున్నంత పనిగా మార్చేయగా.. అది చక్కర్లు కొడుతోంది.LMAO! Who created this video?😂 pic.twitter.com/Gr8Pnl2Nz6— War Intel (@warintel4u) February 28, 2025ఏరా బుడ్డి.. ఇలాగైతే ఎలా?బరువు తగ్గేందుకు చాలామంది రకరకాల మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో చిత్తశుద్ధి ప్రదర్శించేది కొందరే. మరి మిగతా వారు?. ఓవైపు డైట్లు గట్రా అంటూనే.. ఇంకోవైపు నోటికి పని చెబుతుంటారు. పైగా ఏం చేసినా బరువు తగ్గడం లేదంటూ తెగ ఫీలైపోతుంటారు. అలాంటి వాళ్లను ప్రతిబింబించేలా ఈ బుడ్డోడి వీడియో అనే కామెంట్ వినిపిస్తోంది ఇప్పుడు. “I can't lose weight no matter what i do”Also me after 8 pm: pic.twitter.com/OpNxn3vKjB— NO CONTEXT HUMANS (@HumansNoContext) March 1, 2025 -
గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్
-
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది. ఈ దినోత్సవం భాషా వైవిధ్యం మరియు బహుభాషావాదం యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. జూమ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో, హాంకాంగ్‌లోని వివిధ భాషా సమాజాల నుండి ప్రతినిధులు మరియు అతిథులు పాల్గొన్నారు. వివిధ భాషలలో కవితలు, కథలు, ప్రదర్శనలు, పాటలు మరియు జానపద నృత్యాలు పంచుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న భాషలలో కాంటోనీస్, కుర్దిష్, బంగ్లా, మరాఠీ, రొమేనియన్, కన్నడ, సంస్కృతం, హిందీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, తమిళం, తెలుగు, బెంగాలీ మరియు నేపాలీ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు వీరే.. 1.మిస్టర్ యూజీన్ ఫాంగ్, పార్టనర్షిప్ ఎంగేజ్మెంట్ చైర్ మరియు మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్ గ్లోకల్ పీస్ సెంటర్2. మిస్టర్ మార్కో క్వాంగ్, ప్రాజెక్ట్స్ ఆఫీసర్, యునెస్కో HK అసోసియేషన్-గ్లోకల్ పీస్ సెంటర్3. మిస్టర్ అష్ఫాకుర్ రెహమాన్, బంగ్లాదేశ్ అసోసియేషన్ ఆఫ్ హాంకాంగ్ అధ్యక్షుడు4 శ్రీమతి రీటా గురుంగ్, హాంకాంగ్ నేపాల్ ఫెడరేషన్ చైర్పర్సన్5. మిస్టర్ మెసుట్ టెమెల్, ఆంటోలియా కల్చరల్ అండ్ డైలాగ్ సెంటర్ చైర్మన్6. మిస్టర్ థాపా చురా బహదూర్, సర్ ఎల్లిస్ కడూరీ సెకండరీ స్కూల్ (వెస్ట్ కౌలూన్)లో NET టీచర్, టీచర్/రచయిత/రచయితమిస్టర్.7. తిరుపతి నాచియప్పన్, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ & మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, యునెస్కో హాంకాంగ్ అసోసియేషన్-గ్లోకల్ పీస్ సెంటర్ సహ-చైర్.బాంగ్లాదేశ్ అసోసియేషన్ అఫ్ హంగ్ కాంగ్ ప్రతి సంవత్సరం 1952లో మాతృభాష పవిత్రతను, గుర్తింపును కాపాడే పోరాటంలో అంతిమ త్యాగం చేసిన భాషా అమరవీరులకు కృతజ్ఞతలు తెలుపుతూ 21 ఫిబ్రవరి ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. యునెస్కో వారి గ్లోకల్ పీస్ సెంటర్ కార్యకర్త శ్రీ తిరునాచ్ నాచియప్పన్ గారి సహాయ సహకారాలను మరియు ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. ది హంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు , ఈ కార్యక్రమ రూపకర్తగా మాట్లాడుతూ, హంగ్ కాంగ్ లో మొదటి సారిగా తమ సంస్థ మాత్రమే 2021 నుంచి అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థలకి, పిల్లలకు వారి తల్లి తండ్రులకు, గౌరవ్ అతిథులకు మరియు నిర్వహణ లో సహకరించిన వారందరికీ తమ కృతఙ్ఞతలు తెలిపారు. -
మహిళల సంతోషమే దేశానికి సంపద : శ్రీ శ్రీ రవిశంకర్
బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్న ఈ సదస్సులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని, శ్రేయస్సును అందుకునే దిశగా అడుగులు పడ్డాయి. సామాజిక, లౌకిక విషయాలపై లోతైన చర్చలు, ప్రగాఢమైన మానసిక విశ్రాంతి నిచ్చే అంతరంగ ప్రయాణాలు, వాటికి తోడుగా సాంస్కృతిక ప్రదర్శనలు కలగలిసి ఆహుతుల కోసం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. బహ్రెయిన్‌కు చెందిన మహిళా సైనిక సైనికాధికారిణి, ఒక భారతీయ నటి, టర్కీదేశపు డిజిటల్, కృత్రిమ మేధ కళాకారుడు కలుసుకుని,మనస్సు, చైతన్యం - వీటిపై సృజనాత్మకత ప్రభావం గురించి చర్చించారు.ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, “నేను ఎదుగుతున్న దశలో కళలు నాకు ధ్యానాన్ని నేర్పాయి. అది సహజంగా జరిగిపోయింది. ఐతే నేను ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే నా శక్తిసామర్థ్యాలలో చిత్రమైన మార్పును గమనించాను. ప్రజలు మంచిగా ఉంటూ, అందరి మంచినీ కోరుకున్నప్పుడే సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.” అని అన్నారుబహ్రెయిన్ సైనిక, క్రీడా విభాగాలకు అధిపతిగా పనిచేస్తున్న కుమారి నూరా అబ్దుల్లా మాట్లాడుతూ, “సైన్యంలో ఆజ్ఞలను పాటించడమే తప్ప సృజనాత్మకతకు తావు లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను చూసిన తర్వాత, మార్పును సృష్టించేందుకు స్వేచ్ఛ అవసరమని, నిజమైన సృజనాత్మకత సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందని నేను గ్రహించాను.” అన్నారు.ఈ సదస్సుకు చోదకశక్తిగా ఉన్న చైర్ పర్సన్ భానుమతి నరసింహన్ మాట్లాడుతూ, మహిళల జీవితంలో విశ్రాంతి, పని మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. “మహిళలుగా మనము మరింత ఎక్కువగా, మరింత త్వరగా సాధించాలనే ఆతృతలో ఉంటాము. నిజానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నపుడే మీరు అనుకున్నవి సాధించగలరు. ఇది విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండేందుకు తగిన సమయం.” అని పేర్కొన్నారు. శ్రీ శ్రీ రవిశంకర్ 180 దేశాలలో కోట్లాదిప్రజలకు అంతర్గత శాంతిని అందించడంలో ప్రపంచ శాంతి నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పోషించిన పాత్రను ఈ సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో గురుదేవ్ పాత్రను ప్రశంసిస్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, “భారతదేశం ఆధ్యాత్మిక దేశం, కానీ మారుతున్న కాలంతో మనం మన మూలాలకు దూరమవుతున్నాము. అందుకోసమే, మనం మరచిపోయిన విలువలను గుర్తుచేందుకు, మనకు స్ఫూర్తినిచ్చేందుకుగురుదేవ్ వంటి ఆధ్యాత్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు.” అని అన్నారు.ప్రతిష్టాత్మకమైన విశాలాక్షి అవార్డు అందుకున్న సందర్భంగా కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ, "ఒక సాధుపుంగవునికి జన్మనిచ్చిన తల్లి పేరు మీద అవార్డును అందుకోవడం కంటే గొప్ప బహుమతి మరొకటి లేదు." అని భావోద్వేగానికి గురయ్యారు.జపాన్ మాజీ ప్రథమ మహిళ అకీ అబే మాట్లాడుతూ, హింసలేని ప్రపంచం కోసం గురుదేవ్ దృక్పథాన్నితన స్వీయ అనుభవంతో పోల్చి చూశారు. ఆమె భర్త, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుని కాల్పులలో మరణించిన సంగతి విదితమే.“ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడని గురుదేవ్ చెప్పడం నేను విన్నాను. నా భర్త ప్రాణం తీసిన వ్యక్తిని ద్వేషించే బదులు, నేను కరుణించగలనా? అటువంటి హింస జరుగకుండా ఉండేందుకు నేను ఏమైనా సహాయం చేయగలనా? కేవలం నేరం జరిగిన తర్వాత బాధితులకు మద్దతిచ్చే సమాజం కంటే, నేరాలు తక్కువ జరిగే సమాజమే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.” అని ఆమె అన్నారు.సీతా చరితం: సాంస్కృతికదృశ్య వైభవంఈ 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు కేవలం చర్చలు, ఆత్మపరిశీలనలకు మాత్రమే పరిమితం కాకుండా, సీతా చరితం అనే చక్కని రంగస్థల సాంస్కృతిక ప్రదర్శనకు, వేదికగా కూడా మారింది. భారతీయ కావ్యమైన రామాయణాన్ని ఏ షరతులూ లేని ప్రేమ, జ్ఞానం, ఆత్మస్థైర్యం, భక్తి, కరుణరసాల కలయికగా సీతాదేవి దృక్కోణం నుండి చూపే ప్రయత్నం ఇక్కడ జరిగింది. 500మంది కళాకారులు 30 విభిన్న సంగీత నృత్య రీతులను మేళవించి, దేశంలో మొట్టమొదటిసారిగా 4-డి సాంకేతికతను ఉపయోగించి చేసిన సంగీత నృత్య రూపకం ప్రపంచం నలుమూలలనుండి హాజరైన ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.కాలానికి అతీతంగా, మానవాళికి ఆదర్శంగా నిలచిన రామకథను ఈ ప్రదర్శన 190 దేశాలకు తీసుకువెళుతుంది. ఇంగ్లీషులో రూపొందించిన స్క్రిప్ట్ కోసం 20కి పైగా వివిధ భాషలు, సంస్కృతులలోని రామాయణాలను పరిశీలించారనీ, ఇది నిజమైన ప్రపంచ సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. సీతా చరితం నిర్మాణం వెనుక ఉన్న ప్రేరణ గురించి సృజనాత్మక దర్శకురాలు శ్రీవిద్యా వర్చస్వి మాట్లాడుతూ, “సీతమ్మవారి కథ పరివర్తకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అంతే కాక, ఈ నాటకం, స్క్రిప్ట్, డైలాగ్‌లు అన్నీ గురుదేవుల జ్ఞానంతో నిండి ఉన్నాయి.” అని అన్నారు. -
రైట్.. రైట్.. మిల్లెట్ డైట్
దేశ ప్రధాని నరేంద్ర మోదీ 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడం నుంచి తాము స్ఫూర్తి పొంది మిల్లెట్స్ నేషనల్ పోర్టల్(డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.మిల్లెట్ న్యూస్ డాట్‌కామ్) ఏర్పాటు చేశామని, దీనిని నగరంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సి.తారా సత్యవతి అధికారికంగా ప్రారంభించారని పోర్టల్ నిర్వాహకులు బిజినెస్ మెంటర్, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ శ్రీనివాస్ సరకదం తెలిపారు. ఏకకాలంలో 100 మిల్లెట్ స్టోర్లను నగరం వేదికగా ప్రారంభించిన సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ తమ కార్యక్రమం వివరాలను ఇలా వెల్లడించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..ఆరోగ్య అవగాహన కోసం.. చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఏ రకమైన ప్రయోజనాన్ని అందిస్తాయి? ఏ వ్యాధులను దూరం చేస్తాయి? తదితర విషయాలు తెలియజేసేందుకు హెల్త్ అండ్ న్యూట్రిషన్ అంబాసిడర్స్(హెచ్‌ఎన్‌ఏ) కౌన్సిల్‌ను స్థాపించాం.. ఇది ప్రస్తుతం 50 మంది వైద్యులను కలిగి ఉంది. ఈ సంవత్సరాంతానికి వెయ్యి మంది సభ్యులకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ కౌన్సిల్ మిల్లెట్ స్టోర్ యజమానులతో కలిసి పని చేస్తుంది. సహకారంలో భాగంగా.. మిల్లెట్ స్టోర్ యజమానులు పోషకాహార నిపుణులు వైద్యుల నుంచి నిరంతర మార్గదర్శకత్వాన్ని అందుకుంటారు. అలాగే.. స్టోర్ యజమానులకు అవసరమైన శిక్షణ, మద్దతు నిరంతరం అందిస్తాం. బీపీ, డయాబెటిస్, బీఎమ్ఐ అసెస్మెంట్లను కవర్ చేసే బేసిక్ హెల్త్ చెకప్ ట్రైనింగ్ సెషన్లను శనివారం నిర్వహించాం. ఈ సెషన్లను పోషకాహార నిపుణుడు ఓ.మనోజ ప్రకృతి వైద్యురాలు డాక్టర్ మోనికా స్రవంతి సారథ్యం వహించారు. కొత్త చిరుధాన్యాల గుర్తింపు.. దేశంలోని 50 అధిక–నాణ్యత గల మిల్లెట్ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాం. ఇవి ఇప్పుడు కొత్తగా ప్రారంభించబడిన స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. పెద్దగా పెట్టుబడి పెట్టలేని వారు సైతం వ్యాపారులుగా మారడానికి వీలుగా, మిల్లెట్ స్టోర్ ఏర్పాటుకు ప్రారంభ పెట్టుబడిని తగ్గించగలిగాం. తమ వ్యాపారాన్ని కనీస పెట్టుబడి రూ.85 వేలతోనే ప్రారంభించవచ్చు. ఇందులో 50 మిల్లెట్ ఉత్పత్తులు, బిల్లింగ్ మెషిన్, ఆరోగ్య అవగాహన కంటెంట్‌ను ప్రదర్శించడానికి టీవీ సెటప్, బ్యానర్లు, బ్రోచర్లు, వెబ్సైట్, హెల్త్ చెకప్ కిట్ బ్రాండింగ్ మెటీరియల్ సైతం అందిస్తాం. 100 మిల్లెట్ స్టోర్ల ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పిన 100 మిల్లెట్ స్టోర్లను మాదాపూర్‌లోని మినర్వా హోటల్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి వర్ధమాన తారలు వేది్వక, వాన్యా అగర్వాల్‌లు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మహిళా ఔత్సాహిక వ్యాపారులు 100 మంది పాల్గొన్నారు. మిల్లెట్ పోర్టల్‌తో కలిసి పనిచేస్తున్న వైద్యులు, రైతులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కొత్త మిల్లెట్ ఉత్పత్తులను విడుదల చేశారు. -
'పుష్ప-2కు ఇంటర్నేషనల్ క్రేజ్'.. తమ్ముడి ట్వీట్ వైరల్!
అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ మూవీపై ఐకాన్ స్టార్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రానికి.. ఓటీటీలోనూ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే దాదాపు ఏడు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పుష్ప-2 చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆదరిస్తున్నందుకు అల్లు శిరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మీ సంస్కృతికి.. అంతగా పరిచయం లేని చాలా భిన్నమైన ఇలాంటి చిత్రానికి ఆదరణ దక్కడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. క్లైమాక్స్ సీన్‌పై ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ స్పందించడం అద్భుతమని పోస్ట్ చేశారు.సుకుమారా- బన్నీ కాంబోలో వచ్చిన పుష్ప- 2 ది రూల్ జనవరి 30 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్‌తో అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్గా నటించింది. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరోసారి కీలక పాత్రలో మెప్పించారు. టాలీవుడ్ నుంచి జగపతి బాబు, సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. I am glad the Pushpa 2 is receiving insane love from Western audience as well. Esp for a film like this which is vastly different from their culture or something they're not too familiar with.. @alluarjun @aryasukku @ThisIsDSP @MythriOfficial https://t.co/KprBKRPluw— Allu Sirish (@AlluSirish) February 4, 2025 -
పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా?.. ఇంటర్నేషనల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఇటీవల పుష్ప-2 ది రూల్ ఓటీటీకి కూడా వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదనంగా యాడ్ చేసిన సీన్స్‌తో పాటు ఓటీటీలో సందడి చేస్తోంది. అయితే ఈ చిత్రంలోని క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం అడియన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తోంది. అల్లు అర్జున్ గాల్లోకి ఎగిరే ఫైట్ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. దీంతో పలువురు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆ ఫైట్ సీక్వెన్స్ వీడియోలను షేర్ చేస్తున్నారు.బన్నీ ఫైట్ సీక్వెన్స్ వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేయగా.. ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ సైతం స్పందించారు. అమెరికా చిత్రాల కంటే బాగానే ఉందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. మార్వెల్‌లో కూడా ఈ క్రియేటివీటీ సాధ్యం కాలేదు.. కానీ వాళ్లు చేసి చూపించారు అని మరో నెటిజన్ రిప్లై ఇచ్చాడు. మరికొందరైతే పుష్ప-2 గ్లోబల్, ఇంటర్నేషనల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా పుష్పరాజ్ మూవీలోని డైలాగ్‌ను నిజం చేశారు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. Action scene from an Indian movie pic.twitter.com/k9lhfXDIdp— non aesthetic things (@PicturesFoIder) February 3, 2025 -
అలాంటి కాల్స్‌లో 90% మోసపూరితమే
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నంబర్లతో వచ్చే ఫోన్‌కాల్స్‌లో 90 శాతం వరకు మోసపూరితమైనవేనని టెలీకమ్యూనికేషన్స్ విభాగం వెల్లడించింది. టెలీకమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల అందుబాటులోకి తెచ్చిన సంచార్‌సాథీ మొబైల్‌యాప్‌తో వీటికి అడ్డుకట్ట వేయగలుగుతున్నట్టు అధికారులు తెలిపారు. సైబర్ నేరగాళ్లు విదేశాల్లో ఉంటూ చేస్తున్న ఫోన్‌కాల్స్‌ను ఆధునిక టెక్నాలజీ వాడి భారతీయ నంబర్ల మాదిరిగా కనిపించేలా చేసి కూడా మోసాలకు పాల్పడుతున్నట్టు వారు వివరించారు. వాస్తవానికి మనకు ఫోన్‌కాల్ వచ్చినప్పుడు ఆ నంబర్.. భారతీయ ఫోన్ నంబర్ +91తో మొదలైనట్టుగా కనిపించినా, అవన్నీ అంతర్జాతీయ ఫోన్‌కాల్సే అని అధికారులు పేర్కొన్నారు.ఇలాంటి ఫేక్‌కాల్స్‌పై వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు ఇటీవల టెలీకమ్యూనికేషన్స్ విభాగం సంచార్‌సాథీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫిర్యాదు మేరకు ఆయా నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. ఇందుకు అన్ని టెలికాం సర్విస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్ల విభాగం ఇంటర్నేషనల్ ఇన్కమింగ్ స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టం అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. గతంలో దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు 1.35 కోట్ల స్పూఫ్డ్ ఫోన్‌కాల్స్ వచ్చేవని, ఇటీవల స్పూఫ్డ్ కాల్స్ ప్రివెన్షన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గినట్టు అధికారులు తెలిపారు.ప్రస్తుతం స్పూఫ్డ్ కాల్స్ రోజుకు సుమారు 4 లక్షలవరకు మాత్రమే వస్తున్నట్టు వెల్లడించారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌ను కట్టడి చేయడం సైబర్‌నేరాల నియంత్రణలో కీలకమని అధికారులు చెపుతున్నారు. కాగా, మొబైల్ వినియోగదారులు సంచార్ సా మొబైల్ యాప్ గూగుల్‌ప్లే స్టోర్, యాపిల్యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను వాడి అనుమానాస్పద నంబర్లను వెంటనే బ్లాక్ చేసే వీలుంటుందని వారు పేర్కొంటున్నారు. -
పుస్తకాలతో పెంచుదాం
‘కౌమార వయసులో ఉండే పిల్లలు చదవడానికి పుస్తకాలు లేవు. వారి కోసం ప్రపంచ దేశాలు పుస్తకాలు అచ్చు వేసే పనిలో పడ్డాయి’ అన్నారు ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్’కు హాజరైన ప్రసిద్ధ పబ్లిషర్లు. ప్రతి సంవత్సరం ఇటలీలో, షాంఘైలో ‘ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్‌ఫెయిర్’లు భారీగా జరుగుతాయి. కాని మన దేశంలో కోట్ల మంది బాలలున్నా బాల సాహిత్యం ఊసే ఉండదు. బాల సాహిత్యమే కేంద్రంగా సాగిన చెన్నై ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ నుంచి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి.‘కాలేజీ చదువుల తర్వాత కూడా అందరూ అవే క్లాసు పుస్తకాలు చదవక తప్పని పరిస్థితి ఉంటే బతుకు ఎంత నరకంగా ఉంటుందో... స్కూలు పుస్తకాలు మాత్రమే చదవమంటే పిల్లలకూ అంతే నరకంగా ఉంటుంది. విద్య అనేది అందరికీ దొరికే అవకాశం. కాని వినోదం, ఆహ్లాదం, విజ్ఞానం కలిగించే బాలల సాహిత్యం చదవడమే పిల్లలకు జీవితం అంటే ఏమిటో తెలియచేస్తాయి. మనం మాత్రం కాల్పనిక సాహిత్యం చదువుతూ పిల్లలను స్కూలు పుస్తకాలకు వదిలిపెట్టడంలో ఔచిత్యం ఏమిటో మీరే ఆలోచించండి’ అన్నారు సైమన్ జాకస్. కెనడాలో పిల్లల పుస్తకాల పబ్లిషర్‌గా ప్రసిద్ధి పొందిన జాకస్ ప్రస్తుతం ఆ దేశంలో బాలల వికాసం కోసం పుస్తకాలు అందుబాటులోకి తేవడానికి చేస్తున్న ప్రయత్నాలను చెప్పారు– ‘చెన్నై ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్’ (సి.ఐ.బి.ఎఫ్)లో. ఈ ఉత్సవం జనవరి 16–18 తేదీల్లో జరిగింది. తమిళ సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి, ఇతర భాషల సాహిత్యాన్ని తమిళంలోకి తీసుకురావడానికి పబ్లిషర్ల మధ్య ఒడంబడికలు చేసే ప్రత్యేక పుస్తక ఉత్సవం ఇది. ‘కెనడాలో ఇప్పుడు ప్రతి క్లాస్‌లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నారు. స్కూలు పుస్తకాలు కాకుండా పిల్లలు ఈ సాహిత్య పుస్తకాలను ఖాళీ ఉన్నప్పుడు చదువుకోవచ్చు. బాల సాహిత్యం కోసం వారికి తెలియాల్సిన అన్ని విషయాలను కథలుగా రాయించి అందుబాటులోకి తెస్తున్నాం. ఉదాహరణకు ఊహ తెలిశాక దత్తతకు వచ్చిన పిల్లవాడు తన అంతర్మథనాన్ని అర్థం చేసుకునే పుస్తకం కూడా సాహిత్యరూపంలో పెడుతున్నాం’ అన్నారాయన.అంతర్జాతీయ ఉత్సవాలు‘భారతదేశంలో కోట్లమంది బాలలు ఉన్నారు. కాని బాల సాహిత్యం తగినంత అందుబాటులో లేదు. పిల్లలను సినిమాకు తీసుకెళతారుగాని వారికి పుస్తకాలు కొనివ్వరు తల్లిదండ్రులు. కాని ప్రపంచ దేశాలు ఇప్పుడు కేవలం పిల్లలకు సాహిత్యం అందించే ప్రయత్నంలో ఉన్నాయ’ని అన్నారు సి.ఐ.బి.ఎఫ్లోపాల్గొన్న పబ్లిషర్లు. ఇటలీలోని బొలొనియా నగరంలో రాబోయే మార్చిలో ‘బొలొనియా అంతర్జాతీయ పిల్లల పుస్తక ప్రదర్శన’ జరుగుతుంది. దీని నిర్వాహకురాలు జాక్స్ థామస్ కూడా ఈ వేదిక మీదపాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ‘బొలొనియా చిల్డ్రన్స్ బుక్ఫెయిర్లో ప్రపంచ దేశాల బాలల రచయితలు, పబ్లిషర్లు, చిత్రకారులుపాల్గొంటారు. ఒక దేశ రచయితలు మరో దేశ పబ్లిషర్లతో ఒడంబడికలు చేసుకుంటారు.ఇటలీ రచయిత, జపాన్ పబ్లిషర్, రష్యన్ చిత్రకారుడు కలిసి ఒక పుస్తకం తయారు చేసే ఆలోచన చేయడం ఇక్కడ కనిపిస్తుంది. అదొక పిల్లల ప్రపంచం. తమిళనాడు ప్రభుత్వం ఇక్కడ తమ పుస్తకాలు ప్రదర్శనకు పెడుతోంది. ఇలా ప్రతి భారతీయ భాష నుంచి జరగాలి’ అని అన్నారు. బొలొనియా బాలల బుక్ ఫెయిర్ జరిగినంత ఘనంగా షాంఘైలో ప్రతి నవంబర్‌లో పిల్లల బుక్‌ఫెయిర్ జరుగుతుంది. ఎక్కడ చూసినా బాల సాహిత్యమే కనపడుతుంది అక్కడ. కాని మన దేశంలో ‘అడవిలో దూరంగా పులి గాండ్రింపు వినిపించింది’ అనే వాక్యం చదివి దానికి తగ్గ బొమ్మను చూస్తే పిల్లల్లో కలిగే ఊహను మనవాళ్లు ఏమాత్రం అనుమతించడం లేదు. మార్కులు కావాలి మన తల్లిదండ్రులకు.లైంగిక చైతన్యం‘నేనొక కథ రాశాను. ఆ కథను చాలా స్కూళ్లలో లైంగిక చైతన్యంలో భాగంగా చదివి వినిపిస్తున్నారు. స్కూల్లో ఆపాఠం విన్న ఒక పిల్లవాడు నాకు ఫోన్ చేశాడు. అంకుల్... నన్ను ఒకతను అబ్యూజ్ చేశాడు. ఆ రోజు నుంచి ఆ తప్పు చేసింది నేనే అనే భావనతో నలిగిపోతున్నాను. కాని మీ కథ చదివాక తప్పు చేసింది ఆ వ్యక్తి అని, నేను బాధితుణ్ణి అని తెలుసుకున్నాను. నా బాధపోయింది. నన్ను బాధ పెట్టినవాడి గురించి ఇప్పుడు మా ఇంట్లో చెప్పగలను– అని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. బాల సాహిత్యం ఏం చేస్తుందంటే ఇదంతా చేస్తుంది’ అన్నారు మరో రచయిత బాల భారతి.టీనేజ్ పిల్లలకు పుస్తకాలు లేవుచెన్నై బుక్ ఫెయిర్‌లో ప్రసిద్ధ బాలసాహిత్య ప్రచురణ సంస్థ ‘తులిక బుక్స్’ ఎడిటర్ ప్రియ కృష్ణన్పాల్గొన్నారు. ‘పది పన్నెండేళ్ల వయసున్న పిల్లలు చదవదగ్గ పుస్తకాలు ఇప్పుడు లేవు. ఈ విషయంలో చాలా కొరత ఉంది. పిల్లలు పుస్తకాలు చదవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని మనకు బాలల రచయితలు, ప్రచురణ కర్తలు, బాల సాహిత్యానికి బొమ్మలు వేసే చిత్రకారులు చాలా తక్కువగా ఉన్నారు. అందరం పూనుకొని శ్రద్ధపెట్టకపోతే పిల్లలు సెల్ఫోన్లలో కనిపించే డిజిటల్ ప్రపంచంలో తప్పిపోతారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.పిల్లలకు మనోవికాసం, సమాజాన్ని ఎదుర్కొనే దిలాసా కలగాలంటే సాహిత్యం వల్ల కలుగుతుంది. చిన్న విషయాలకే పిల్లలు ఎందుకు కలత పడుతున్నారో అర్థం చేసుకుంటే ప్రతి తల్లిదండ్రులు వారి చేతుల్లో ఇవాళే పుస్తకాలు పెట్టగలరు. – సాక్షి ప్రతినిధితల్లిదండ్రులతో వెళ్లొద్దు‘మన దేశంలో కొన్ని నగరాల్లో బుక్‌ఫెయిర్‌లు జరుగుతుంటాయి. పిల్లల్ని తల్లిదండ్రులు ఆ బుక్ఫెయిర్లకు తీసుకువెళతారు. కాని పిల్లలు ఇలాంటి వాటికి తల్లిదండ్రులతో వెళ్లకూడదు. ఎందుకంటే తల్లిదండ్రులు నేరుగా వారిని తీసుకెళ్లి కలెక్టర్ కావడం ఎలా వంటి పుస్తకాలు కొనిపెడతారు. దయచేసి వాళ్లకు డబ్బు ఇచ్చి వదిలిపెట్టండి. ఏం కావాలో అది కొనుక్కోనివ్వండి. అదొక్కటే కాదు... పిల్లల పుస్తకాలు అత్యంత తక్కువ ధరకు దొరికే ఏర్పాటు చేయాలి. ఆ పుస్తకాన్ని ఆశించిన ఏ ఒక్క పిల్లవాడు కూడా అది దక్కలేదని నిరాశపడకూడదు’ అన్నారు రచయిత నటరాజన్. ఆయన బాలల కోసం 120కి పైగా పుస్తకాలు రాశారు. -
Mahakumbh 2025: నేడు అంతర్జాతీయ ప్రతినిధుల బృందం పవిత్ర స్నానాలు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. దీనిలో దేశవిదేశాలకు చెందినవారు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు (గురువారం) పవిత్ర తీవేణీ సంగమంలో పది దేశాల నుంచి వచ్చిన 21 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం పవిత్ర స్నానాలు ఆచరించనుంది. వీరి పర్యటనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పర్యావేక్షిస్తోంది.నేడు ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో పవిత్ర స్నానాలు ఆచరించే ప్రతినిధి బృందంలో ఫిజీ, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యూఎఈ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఈ పుణ్యస్నానాలు ఆచరించే ముందు ఈ బృందం సభ్యులు వారసత్వ నడకను చేపట్టారు. ఈ సందర్భం వీరు ప్రయాగ్‌రాజ్‌కు చెందిన సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని తెలుసుకున్నారు. వీరు బస చేసేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది.ఈ ప్రతినిధి బృందం పుణ్యస్నానాలు ఆచరించిన అనంతం హెలికాప్టర్(Helicopter) ద్వారా మహా కుంభ్ ప్రాంతాన్ని ఏరియల్ సర్వే చేయనుంది. కాగా గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఈ కుంభమేళాకు 45 కోట్ల మంది వరకూ యాత్రికులు వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.ఇది కూడా చదవండి: Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి -
సికింద్రాబాద్‌లో పతంగుల సందడి.. కైట్స్ ఎగరేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ (ఫోటోలు)
-
సాయి పల్లవి కు ఉత్తమ నటిగా మరో అవార్డ్
-
ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్
-
ట్రంప్‌నకు హష్ మనీ కేసులో ఎదురుదెబ్బ
-
విజయవాడలో ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో (ఫొటోలు)
-
ఢిల్లీ కాలుష్యంపై కాప్-29లో చర్చ
బాకు: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లోని వాయు కాలుష్యం ఇక్కడి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు కూడా దారితీసింది. అజర్బైజాన్ రాజధాని బాకులో పర్యావరణంపై జరిగిన కాప్-29 శిఖరాగ్ర సదస్సులో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరిగింది.కాప్-29 సదస్సులో పాల్గొన్న నిపుణులు వాయు కాలుష్యంతో వచ్చే అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించారు. క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తీ ఖోస్లా మాట్లాడుతూ ఢిల్లీలోని ఏక్యూఐ ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని, కొన్ని ప్రాంతాల్లో క్యూబిక్ మీటర్‌కు 1,000 మైక్రోగ్రాముల కంటే అధికస్థాయి కాలుష్యం నమోదవుతున్నదన్నారు. బ్లాక్ కార్బన్, ఓజోన్, శిలాజ ఇంధనాల దహనం, ఫీల్డ్ మంటలు వంటి అనేక కారణాలతో కాలుష్యం ఏర్పడుతున్నదని తెలిపారు. వీటన్నింటిని ఎదుర్కొనే పరిష్కార మార్గాలను తక్షణం అమలు చేయాల్సివున్నదన్నారు.ఢిల్లీలోని గాలి అత్యంత విషపూరితంగా మారిందని, అక్కడి ప్రజలు ప్రతిరోజూ 49 సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారన్నాని ఖోస్లా పేర్కొన్నారు. తక్కువ గాలి వేగం గాలిలో కాలుష్య కారకాలను బంధిస్తుందని, ఇటువంటి పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు.గ్లోబల్ క్లైమేట్ అండ్ హెల్త్ అలయన్స్ వైస్ ప్రెసిడెంట్ కోర్ట్నీ హోవార్డ్ కెనడాలో జరిగిన ఉదంతాన్ని ఉదహరిస్తూ 2023లో అడవిలో కార్చిచ్చు కారణంగా, వాయు కాలుష్యం ఏర్పడి 70 శాతం జనాభా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వచ్చిందని అన్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు పేద దేశాలకు సంపన్న దేశాలు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రీత్ మంగోలియా సహ వ్యవస్థాపకుడు ఎంఖున్ బైయాంబాడోర్జ్ తమ దేశంలోని తీవ్రమైన వాయు కాలుష్య సమస్యను గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలతో పోలిస్తే నగరాల్లో నివసించే పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యం 40 శాతం తక్కువగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం -
మిసెస్ ఆసియాకు భారత్ తరపున మన హైదరాబాదీ..!
ప్రఖ్యాత క్లాసిక్ మిసెస్ ఆసియా ఇంటర్నేషల్ పేజెంట్ 2024లో భారత్ తరపున తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఏ విజయ శారదా రెడ్డి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీ ఈ నెల 13 నుంచి 19 వరకూ థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనుంది. ఈ ఏడాది మిసెస్ ఇండియా టైటిల్‌ను కైవసం చేసుకున్న విజయ గతేడాది మిసెస్ ఇండియా– తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టైటిల్‌ను సూపర్ క్లాసిక్ కేటగిరిలో సొంతం చేసుకోవడంతో జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం ఆమె అసాధారణ ప్రతిభ, మహిళలను ప్రేరేపించే కృషికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నో రంగాల్లో విజయకేతాలను ఎగురవేసిన విజయ రెండు సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులు పొందడమే కాకుండా విద్య, వ్యాపార రంగాల్లో ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో మిసెస్ ఆసియా ఇంటర్నేషనల్ పేజెంట్ 2024లో ఆమె పాల్గొనడం దేశానికే గర్వకారణంగా పేర్కొనవచ్చు. అందం, విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ కాంటెస్టులో ఆసియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన వారు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. (చదవండి: శీతాకాలంలో గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి..!) -
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్‌కాల్
-
వీల్‌ఛైర్‌తో విల్ పవర్‌కి అసలైన అర్థం ఇచ్చాడు!
‘శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది’ అనే మాటకు ఈ యువకుడే నిదర్శనం. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ధర్మతండాకు చెందిన రమావత్ కోటేశ్వర్ నాయక్ చిన్నప్పుడే పోలియో బారిన పడ్డాడు. ఒక కాలు సహకరించకపోయినా తాను కల కన్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. చదువుకునే రోజుల్లోనే ఆటలపై ఆసక్తి పెంచుకున్న కోటేశ్వర్ వీల్ ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నేటి యువతలో క్రీడా స్పూర్తిని నింపుతున్నాడు...నేరేడుగొమ్ములోని గిరిజన హాస్టల్లో ఉండి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు, దేవరకొండలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. ఆ తరువాత హైదరాబాద్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశాడు. ఉస్మానియా యూనివర్సీటీలో పీజీ చేస్తున్న సమయంలో వీల్‌ఛైర్ స్పోర్ట్స్‌లో కోటేశ్వర్ నాయక్ ప్రతిభను కోచ్ గ్యావిన్స్ సోహెల్ ఖాన్ గుర్తించాడు. వీల్‌ఛైర్ హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్‌లో శిక్షణ ఇచ్చాడు. గురువు ఇచ్చిన శిక్షణతో తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకున్న కోటేశ్వర్ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.మెరుగైన ప్రదర్శనతో 2019లో తొలిసారి భారత జట్టుకు ఎంపికైన కోటేశ్వర్ పట్టాయ (థాయ్‌లాండ్)లో జరిగిన ఆసియా ఓషియానియా చాంపియన్ షిప్లో మన దేశం తరుపున బరిలో దిగాడు. 2022లో నోయిడాలో వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ సాధించాడు. 2022లో పోర్చుగల్ జరిగిన వీల్ ఛైర్ హాండ్‌బాల్ యూరోపియన్ అండ్ వరల్డ్ ఛాంపియన్ షిప్లో మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు. అందులో ఒక మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ సొంతం చేసుకున్నాడు. 2023లో ఏసియా కప్ పోటీలు నేపాల్‌లోని ఖాట్మాండులో జరిగాయి. అందులో బెస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.చదవండి: సెలబ్రిటీలు మెచ్చిన స్టార్గ్వాలియర్లో ఈనెల 9 నుంచి 15 వరకు జరిగిన వీల్ ఛైర్ బాస్కెట్ బాల్ నాలుగో నేషనల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో కెప్టెన్ గా కోటేశ్వర్ నేతృత్వంలోని టీమ్ సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. ఇటీవల చెన్నైలో జరిగిన సౌత్‌జోన్ వీల్‌ఛైర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో కోటేశ్వర్ కెప్టెన్సీలో జట్టు సిల్వర్ మెడల్ సాధించింది.ఒలింపిక్స్ నా లక్ష్యంఒలింపిక్స్లో మన దేశం తరపున ఆడి పతకం సాధించాలన్నదే నా లక్ష్యం. ఇందుకు నిరంతర సాధన, కఠోర శ్రమ అవసరం. దీనికి తోడు పోటీలో రాణించాలంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన వీల్‌ఛైర్ అవసరం తప్పనిసరి. దీనికి ఏడు నుంచి ఎనిమిది లక్షలు అవుతుంది. ఇందుకు ప్రభుత్వం సహకరించాలి. – కోటేశ్వర్ నాయక్ – చింతకింది గణేష్, సాక్షి, నల్లగొండ -
Internet Day: మొదటి ఎలక్ట్రానిక్ సందేశం చేరిందిలా..
ఈ రోజు (అక్టోబర్ 29) అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం. ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగానికున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకునేందుకే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1969, అక్టోబర్ 29న ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్‌కు మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపారు. నాడు ఇంటర్నెట్ను అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్(ఆర్పానెట్) అని పిలిచేవారు.ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కనెక్ట్ చేసింది. ఎటువంటి సమాచారాన్నయినా తక్షణమే అందుకునేలా చేసింది. వివిధ రంగాలలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికింది. మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని 1969లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన చార్లెస్ .. స్టాన్ఫోర్డ్ పరిశోధనా సంస్థకు పంపారు. ఇది గ్లోబల్ నెట్వర్క్ అభివృద్ధికి పునాది వేసింది. అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరపుకుంటున్నారు.అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా, ఇంటర్నెట్ చరిత్రకు సంబంధించిన అంశాలను వివిధ పత్రికల్లో ప్రచురిస్తుంటారు. టెక్ ఔత్సాహికులు ఈరోజున కొత్త ఆన్లైన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు వర్చువల్ సెమినార్లు ఏర్పాటు చేస్తారు. నేడు పాఠశాలలలో పాటు వివిధ సంస్థలలో డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, ఇంటర్నెట్ భవిష్యత్తుపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో.. -
విదేశాల నుంచి కూడా స్విగ్గీలో ఆర్డర్లు
న్యూఢిల్లీ: విదేశాల్లో నివసిస్తున్న వారు భారత్‌లో తమ వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు వీలుగా స్విగ్గీ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ’ఇంటర్నేషనల్ లాగిన్’ను ప్రవేశపెట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లో నివసిస్తునవారికి ఇది అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ యూజర్లు ఇక్కడి వారి కోసం ఫుడ్ ఆర్డర్ చేసేందుకు, స్విగ్గీలో భాగమైన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం ఇన్‌స్టామార్ట్‌లో షాపింగ్ చేసేందుకు, డైన్అవుట్ ద్వారా హోటల్స్‌లో టేబుల్స్‌ను బుక్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు లేదా అందుబాటులో ఉన్న యూపీఐ ఆప్షన్ల ద్వారా చెల్లించవచ్చని స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు ఫణి కిషన్ తెలిపారు. -
స్విగ్గీ కొత్త ఫీచర్: విదేశాల్లో ఉంటూనే..
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్విగ్గీ 'ఇంటర్నేషనల్ లాగిన్' పేరుతో సరికొత్త ఫీచర్ తీసుకువచ్చింది. ఇది యునైటెడ్ స్టేట్స్, కెనడా, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, యూఏఈతో సహా 27 దేశాలలోని వినియోగదారులు ఫుడ్ డెలివరీ, కిరాణా షాపింగ్ వంటి వంటివి చేయడానికి అనుమతిస్తుంది.భారతదేశంలోని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు అవసరమైన వస్తువులు లేదా బహుమతులను ఆర్డర్ చేయడానికి లేదా పంపడానికి స్విగ్గీ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ ఎంపికలతో డబ్బు చెల్లించవచ్చు.స్విగ్గీ ఇంటర్నేషనల్ లాగిన్ ఫీచర్ ద్వారా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కిరాణా లేదా నిత్యావసర వస్తువులను ఇంటికి పంపించడానికి పనికొస్తుంది. అంతే కాకుండా.. కుటుంబ సమావేశాలకు, ముఖ్యంగా పండుగల సమయంలో ఫుడ్, గిఫ్ట్స్ వంటివి చాలా అవసరం. అయితే విదేశాల్లో నివసిస్తున్న వారు నేరుగా గిఫ్ట్స్, ఫుడ్ ఇవ్వలేరు. కాబట్టి ఇంటర్నేషనల్ లాగిన్ ద్వారా ప్రత్యేక సందర్భాలలో తమ ప్రియమైన వారికి ఇలాంటివి స్విగ్గీ ద్వారా అందించి ఆశ్చర్యపరచవచ్చు.ఇదీ చదవండి: యూట్యూబ్ కొత్త ఫీచర్: మరింత ఆదాయానికి సులువైన మార్గంస్విగ్గీ గురించి2014లో ప్రారంభమైన స్విగ్గీ ప్రస్తుతం లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా ఉంటూ సుమారు 600 కంటే ఎక్కువ నగరాల్లో రెండు లక్షల కంటే ఎక్కువ రెస్టారెంట్లతో సహకరిస్తోంది. 43 నగరాల్లో పనిచేస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కేవలం 10 నిమిషాల్లో 20 కంటే ఎక్కువ కిరణా, ఇతర నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తోంది. వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించడమే లక్ష్యంగా స్విగ్గీ ముందుకు సాగుతోంది. -
Hyderabad: ఫ్లైట్.. రైట్ రైట్
సాక్షి, సిటీబ్యూరో: ఫ్లైట్ కనెక్టివిటీ విస్తరిస్తోంది. హైదరాబాద్ నుంచి మరిన్ని కొత్త నగరాలకు విమాన సరీ్వసులు పెరిగాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి 7 ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ నగరాలకు సైతం కనెక్టివిటీ క్రమంగా పెరుగుతోంది. దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన ముఖ ద్వారం కావడంతో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. దీంతో ఎప్పటికప్పు డు ప్రయాణికుల డిమాండ్ మేరకు కొత్త నగరాలకు సరీ్వసులను విస్తరించేందుకు పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. 10 రోజుల్లోనే 7 కొత్త సరీ్వసులు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన సరీ్వసులు అందుబాటులో ఉన్నాయి. గత నెలలో కేవలం 10 రోజుల్లో 7 కొత్త సరీ్వసులను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి రాజ్‌కోట్, అగర్తలా, జమ్మూ, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా నగరాలకు సరీ్వసులు అందుబాటులోకి వచ్చాయి. కొత్త సర్వీసుల్లో ఆక్యుపెన్సీ సైతం సంతృప్తికరంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. రాజ్‌కోట్‌కు ప్రతిరోజూ ఫ్లైట్ సర్వీసును ఏర్పాటు చేశారు. అగర్తలాకు వారానికి 3 సర్వీసులు నడుస్తున్నాయి. జమ్మూ కశీ్మర్‌కు ప్రారంభించిన విమాన సర్వీసులకు పర్యాటకుల నుంచి అనూహ్య ఆదరణ లభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి జమ్మూకు వారానికి మూడు సర్వీసుల చొప్పున రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో డొమెస్టిక్ కనెక్టివిటీ 69 నుంచి 76 నగరాలకు పెరిగినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. నిత్యం 60 వేల మంది ప్రయాణం.. 👉 ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 60 వేల మంది దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలు సాగిస్తుండగా.. ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, కోల్‌కతా నగరాలకు ఎక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. 👉 గోవా, విశాఖ, కొచ్చిన్, తిరుపతి, అహ్మదాబాద్ నగరాలకు సైతం హైదరాబాద్ నుంచి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అయోధ్యకు పెరిగిన భక్తులు.. బాలరాముడు కొలువుదీరిన అయోధ్య రామజన్మభూమి ఆలయానికి నేరుగా రాకపోకలు సాగించేందుకు విమాన సరీ్వసులు లేకపోవడంతో నగర వాసులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు. రైళ్లలో రద్దీ, సుదీర్ఘమైన ప్రయాణ సమయంతో ఒక్క అయోధ్య పర్యటనకే కనీసం మూడు నాలుగు రోజుల పాటు కేటాయించాల్సి వచ్చేది. మందిరం ప్రారంభించిన తర్వాత అన్ని వైపుల నుంచి భక్తుల రద్దీ పోటెత్తింది. కానీ ఇందుకనుగుణంగా ప్రయాణసదుపాయాలు మాత్రం విస్తరించలేదు. గత నెల 27వ తేదీ నుంచి సరీ్వసులు ప్రారంభమయ్యాయి. అయోధ్యతో పాటు భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగించే ప్రయాగ్‌రాజ్‌కు కూడా గత నెలలోనే విమాన సరీ్వసులు ప్రారంభమయ్యాయి. పర్యాటకుల డిమాండ్ ఎక్కువగా ఉన్న ఆగ్రాకు సైతం గత నెల 28 నుంచి సరీ్వసులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నేషనల్ కనెక్టివిటీ విస్తరణ..హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రస్తుతం 18 అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 15 వేల మందికి పైగా ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా జర్మనీకి సరీ్వసులు ప్రారంభమయ్యాయి. లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సర్వీసులు వారానికి 5 చొప్పున హైదరాబాద్ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే బ్యాంకాక్, రియాద్, జెడ్డా, తదితర నగరాలకు సర్వీసులు పెరిగాయి. ఈ ఏడాది చివరి వరకు మరిన్ని నగరాలకు కొత్తగా సరీ్వసులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, డల్లాస్, మెల్బోర్న్, సిడ్నీ, పారిస్, ఆమ్స్టర్డ్యామ్ తదితర నగరాలకు కొత్తగా సరీ్వసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం దుబాయ్, సింగపూర్, అబుదాబి, లండన్ నగరాలకు ప్రయాణికుల రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. -
మరో విమానానికి బాంబు బెదిరింపు.. జైపూర్‌లో అత్యవసర ల్యాండింగ్
జైపూర్: విమానాలకు తరచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం నంబర్ IX-196కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ విమానం దుబాయ్ నుంచి జైపూర్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జైపూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులున్నారు. ల్యాండింగ్ తర్వాత భద్రతా బలగాలు విమానం మొత్తం గాలించగా, వారికి అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ‘విస్తారా’ విమానంలో బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన మరువక ముందు తాజా ఉదంతం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలకు చెందిన దాదాపు 40 విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని దర్యాప్లు తరువాత తేలింది. విమానయాన సంస్థలకు తప్పుడు బాంబు బెదిరింపులు అందకుండా ఉండేందుకు కొత్త టెక్నాలజీని వినియోగించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. Jaipur, Rajasthan | An Air India Express flight IX-196 flying from Dubai to Jaipur, with 189 passengers onboard, received a bomb threat via email. The plane landed at the Jaipur International Airport at 1:20 am. After a thorough check by the security forces, nothing suspicious…— ANI (@ANI) October 19, 2024ఇది కూడా చదవండి: US Elections: ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేవారికే పట్టం -
నిచ్చెన మెట్లు... చక చకా!
చెట్టులెక్కగలవా? ఓ నరహరి పుట్టలెక్కగలవా?చెట్టులెక్కి.. ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా?అప్పుడెప్పుడో లక్ష్మీదేవి పెట్టిన వర పరీక్ష ఇది! ఇప్పుడా అవసరం మనిషికి లేదు కానీ.. అన్ని రంగాల్లోకీ దూసుకొస్తున్న యంత్రులకు అదేనండి రోబోలకు కావాలి. ఎందుకంటే.. చెట్టూ పుట్ట ఎక్కే రోబోలను మరిన్ని ఎక్కువ చోట్ల వాడుకోవచ్చు మరి. ఇప్పటివరకూ తయారైన రోబోలు కొంచెం తడబడుతూ మెట్లు ఎక్కగలిగేవి కానీ.. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జూరిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ‘ఎనిమల్’ మాత్రం చాలా వేగంగా నాలుగు కాళ్లతో నిచ్చెన మెట్లు ఎక్కేయగలదు. రెండు కాళ్లపై నుంచోవడం, అడ్డ కూలీల్లా బాక్స్‌లను దూరంగా విసిరివేయడం, ఎక్కినంత వేగంగా మెట్లు దిగగలగడం వంటి పనులన్నీ ఠకీ మని చేసేయగలదీ రోబో. ఏడేళ్ల క్రితం ఈ సంస్థ స్కైస్కాపర్లలో ఎలివేటర్లను వాడుకునే శక్తిగల రోబోలను తయారు చేసింది. అప్పటి నుంచి ఇది ఎనీబోటిక్స్ అనే సంస్థ ద్వారా వాణిజ్యస్థాయిలో అందుబాటులో ఉంది కూడా. తాజాగా ఈ సంస్థే ‘ఎనిమల్’ను అభివృద్ధి చేసింది. ఎనిమల్ నిమిషానికి 0.75 మీటర్ల వేగంతో నడవగలదు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా గంటన్నర నుంచి రెండు గంటల పాట పనిచేస్తుంది. ఇంటా బయట ఎక్కడైనా సరే.. అడ్డంకులను తప్పించుకుని ప్రయాణించగలదు. చుట్టూ జరుగుతున్న విషయాలను చూసి అర్థం చేసుకునేందుకు వీలుగా ఇందులో 360 డిగ్రీ లైడర్ మాడ్యూల్, లోతును అంచనా కట్టేంఉదకు ఆరు సెన్సింగ్ కెమెరాలు, చూపునకు రెండు కెమెరాలు ఉన్నాయి. ఈ సెన్సర్లు, కెమెరాలిచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు అర్థం చేసుకునేందుకు ఇంటెల్-6 కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కొక్కేల్లాంటి కాళ్లు...మెట్లు ఎక్కే ప్రత్యేకమైన శక్తి కోసం ‘ఎనిమల్’ నాలుగు కాళ్లకు కొక్కేల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ‘సి’ ఆకారంలో ఉండే ఈ నిర్మాణాలు నిచ్చెన మెట్లను గట్టిగా పట్టుకునేందుకు, అవసరమైనప్పుడు వదిలేసేందుకు ఉపయోగపడతాయి. కాళ్లు, చేతులతో పైకి ఎక్కేందుకు మన మాదిరి ప్రయత్నిస్తుందన్నమాట. కంప్యూటర్ మోడళ్ల సాయంతో ఈ కొక్కేలను ఎలా వాడాలో ఎనిమల్కు నేర్పించారు శాస్త్రవేత్తలు. పరిశోధనశాల ప్రయోగాల్లో ఈ రోబో 70 నుంచి 90 డిగ్రీల కోణమున్న నిచ్చెనలను కూడా 90 శాతం కచ్చితత్వంతో ఎక్కగలిగింది. మరీ ముఖ్యమమైన విషయం ఏమిటంటే... ఇలా మెట్లు ఎక్కగల రోబోలతో పోలిస్తే దీని వేగం 232 రెట్లు ఎక్కువ! నమ్మడం లేదా.. వీడియో చూసేయండి మరి... -
‘ఈవీ’లు... టైంబాంబులు!
“టిక్.. టిక్.. టిక్..” అంటూ నిశ్శబ్దంగా ఆడుతున్న టైంబాంబులు అవి! ఆదమరిస్తే ఏ క్షణమైనా అంటుకోవచ్చు. కన్ను మూసి తెరిచేంతలో ఉవ్వెత్తున మంటలు చెలరేగవచ్చు. విధ్వంసం సృష్టించవచ్చు. ప్రాణాలు తీయవచ్చు. ఆస్తినష్టం కలిగించవచ్చు. ఇంతకీ ఏమిటవి అంటారా? కాలుష్యం కలిగించకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయని మనం ఎంతో గొప్పగా చెబుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ). అమెరికాలో తాజాగా విరుచుకుపడుతున్న హరికేన్ ‘మిల్టన్’ మరో ఉపద్రవాన్ని మోసుకొస్తోంది. ఈవీలు, హైబ్రిడ్ వాహనాలు వంటి రీఛార్జి బ్యాటరీ ఆధారిత ఇంధనాన్ని వాడే వస్తువాహనాలతో ప్రస్తుతం అమెరికన్లకు ముప్పు పొంచివుంది.ఇదంతా వాటిలోని లిథియం-అయాన్ బ్యాటరీలతోనే. ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే కాకుండా రీఛార్జి బ్యాటరీల శక్తితో పనిచేసే స్కూటర్లు, బైకులు, హోవర్ బోర్డులు, వీల్ ఛైర్లు, లాన్ మూవర్స్, గోల్ఫ్ కార్లు, బొమ్మలతోనూ ఇకపై అప్రమత్తంగా మెలగక తప్పదు. హరికేన్ ‘మిల్టన్’ ఉప్పునీటి వరద ముంపు బారినపడిన ఈవీలను అగ్నికీలలు చుట్టుముట్టే అవకాశముంది. హరికేన్ల ప్రభావంతో 15 అడుగుల లోతుతో ఉప్పునీటి వరద నీరు చేరుకునే తీరప్రాంతాలు అమెరికాలో చాలా ఉన్నాయి.కొద్ది రోజుల క్రితం హరికేన్ ‘హెలెన్’ వచ్చిపోయాక అమెరికాలో పలు చోట్ల లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల కారణంగా 48 ఎలక్ట్రిక్ వస్తువాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఫ్లోరిడాలోని ఓ ఇంటి గ్యారేజీలో నిలిపివుంచిన టెస్లా కారు ఇటీవలి ‘హెలెన్’ ప్రభావపు ఉప్పునీటి ముంపు కారణంగా మంటల్లో ఆహుతి కావటంతో ఆ ఇంట్లోని వారు భయంతో బయటకు పరుగులు తీశారు. గతంలో 2022లో సంభవించిన హరికేన్ ‘ఇయాన్’ సందర్భంగానూ అమెరికాలో పలు ఈవీలు అగ్నికి ఆహుతయ్యాయి.తొలుత వేడి... తర్వాత మంటలు! ఈవీల్లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లోపల సెల్స్, జ్వలించే స్వభావం గల విద్యుద్వాహక ద్రావణి ఉంటాయి. ఉప్పునీరు విద్యుద్వాహకం. ఈ-బైకులతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వాహనాల్లో వెయ్యి రెట్లు ఎక్కువగా సెల్స్ (చిన్న ఘటాలు) ఉంటాయి. ఎక్కువ సెల్స్ ఉండే హై ఎనర్జీ బ్యాటరీలు విఫలమయ్యే అవకాశాలు మరింత అధికం. సాధారణ వర్షపు నీటితో లేదా నదుల మంచినీటితో తలెత్తే ముంపుతో ఈవీలకు పెద్దగా నష్టం ఉండదు. కానీ ఎక్కువ కాలం... అంటే కొన్ని గంటలు లేదా ఒకట్రెండు రోజులపాటు ఉప్పునీటిలో వాహనాలు మునిగితే మాత్రం ఉప్పు వల్ల ఈవీ ‘బ్యాటరీ ప్యాక్’ దెబ్బతింటుంది.ఉప్పునీటికి ‘తినివేసే’ (కరోజన్) లక్షణం ఉంది. బ్యాటరీ లోపలికి ఉప్పునీరు చేరాక విద్యుద్ఘటాల్లోని ధనాత్మక, రుణాత్మక టెర్మినల్స్ మధ్య కరెంటు ప్రవహించి షార్ట్ సర్క్యూట్లు సంభవిస్తాయి. ఫలితంగా వేడి పుడుతుంది. విద్యుద్ఘటాలను వేరు చేసే ప్లాస్టిక్ లైనింగ్ ఈ వేడికి కరిగిపోతుంది. దాంతో వేడి ఓ శృంఖల చర్యలాగా (థర్మల్ రన్ అవే) ఒక విద్యుద్ఘటం నుంచి మరో విద్యుద్ఘటానికి ప్రసరించి మరిన్ని షార్ట్ సర్క్యూట్లతో విపరీతంగా వేడిని పుట్టిస్తుంది. అలా చివరికి అగ్గి రాజుకుని వాహనాలు బుగ్గి అవుతాయి.ఎత్తైన ప్రదేశాలకు తరలించాలి హరికేన్లు తీరం దాటడానికి మునుపే ప్రజలు అప్రమత్తమై తమ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈవీలు తుపాన్ల ఉప్పునీటిలో తడవకుండా, వరద ముంపులో నానకుండా వాటిని ఎత్తైన, సురక్షిత ప్రదేశాల్లో భద్రంగా పార్క్ చేయాలి. ఇంటికి కనీసం 50 అడుగుల దూరం అవతల వాటిని పార్క్ చేయడం వల్ల రిస్క్ తగ్గుతుంది. తుపాన్లు/హరికేన్లు దాటిపోయాక రీ-స్టార్ట్ చేయడానికి ముందు బ్యాటరీ వాహనాలను ఖాళీ ప్రదేశాలకు తరలించాలి.వాటిని మెకానిక్ సాయంతో అన్ని రకాలుగా పరీక్షించాకే పునర్వినియోగంలోకి తేవాలి. వరద నీటిలో మునిగిన వాహనాలను పరీక్షించకుండా నేరుగా కరెంటు ప్లగ్గులో వైరు పెట్టి వాటిని రీఛార్జి చేయడానికి ఉపక్రమించరాదు. ఆ వాహనాలను ఇళ్లలోనే ఉంచి రీ-స్టార్ట్ చేస్తే లిథియం-అయాన్ బ్యాటరీలు వేడెక్కి, మంటలు అంటుకుని గృహాలు సైతం అగ్నిప్రమాదాల బారినపడవచ్చు. హరికేన్ ‘మిల్టన్’ నేపథ్యంలో ఈవీల వినియోగదారులకు పలు హెచ్చరికలు చేస్తూ ఫ్లోరిడా ఫైర్ మార్షల్ జిమ్మీ పాట్రోనిస్ ఓ ప్రకటన విడుదల చేశారు.- జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The New York Times, The Washington Post, CBS News, Business Insider) -
Translation Day: ప్రపంచాన్ని మరింత దగ్గర చేస్తూ..
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి, పరస్పరం కమ్యూనికేట్ చేసుకునేందుకు అనువాదం అనేది ఒక ముఖ్యమైన సాధనం. అనువాదకుల కీలక పాత్రను గుర్తిస్తూ, సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున అనువాదకుల, భాషావేత్తల కృషి, అంకితభావాన్ని గుర్తిస్తూ, పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.బైబిల్‌ను లాటిన్లోకి అనువదించిన సెయింట్ జెరోమ్ జ్ఞాపకార్థం ప్రతీ ఏటా సెప్టెంబర్ 30న అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. సెయింట్ జెరోమ్‌ను అనువాదకుల పోషకునిగా పరిగణిస్తారు. ఈయన బైబిల్‌ను లాటిన్లోకి అనువదించగా, దానిని వల్గేట్ అని పిలుస్తారు. ఈ అనువాద రచన ఆయన పాండిత్యానికి, భాషా జ్ఞానానికి నిదర్శనమని చెబుతారు. సెయింట్ జెరోమ్‌ను గుర్తుచేసుకుంటూ అనువాద దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని అంతర్జాతీయ అనువాదకుల సమాఖ్య (ఎప్ఐటీ) ప్రారంభించింది.ఈ సంస్థ 1953లో స్థాపితమయ్యింది. 1991 నుంచి వారు ఈ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. దీనిని 2017లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా గుర్తించింది. అనువాదకులు ప్రపంచ శాంతి, సహకారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఆలోచనలు, భావజాలాలు, సంస్కృతుల మార్పిడికి అనువాదం వారధిగా పనిచేస్తుంది. సాహిత్యం, సైన్స్, వ్యాపారం, రాజకీయ రంగాలలో అనువాదం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.ప్రపంచ వాణిజ్యం, దౌత్యం, శాస్త్రీయ పరిశోధనలు సజావుగా సాగాలంటే అనువాదకులు సహాయం అవసరమవుతుంది. వివిధ భాషలలో రాసిన సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు, కమ్యూనికేట్ చేయడానికి అనువాదకులు ఉపయోగపడతారు. అనువాదం అనేది లేకుంటే ప్రముఖ రచయితలు షేక్స్పియర్, టాల్‌స్టాయ్, రవీంద్రనాథ్ ఠాగూర్, ప్రేమ్‌చంద్ తదితరుల రచనలు ప్రపంచానికి తెలిసేవి కావనడంతో సందేహం లేదు. ఇది కూడా చదవండి: మద్యం మాఫియా దాడి.. ఆరుగురు పోలీసులకు గాయాలు -
హాలీవుడ్లో మనోడి సినిమా
కరీంనగర్ అర్బన్: సినిమా.. అదో రంగుల ప్రపంచం. అద్భుతంగా తెరకెక్కిస్తే సందేశమేదైనా చేరువ చేసే సాధనం. ఇక, సినిమా తీయాలంటే సాంకేతిక విభాగం, నటీనటులు, ప్రొడక్షన్, డైరెక్షన్ ఇలా ఎన్నెన్నో.. ఆపై హీరోనే నిర్మాతగా, ఫిల్మ్ మేకర్‌గా, కథా రచయితగా రాణించాలంటే కఠోర శ్రమ అవసరం. కానీ, అనుకుంటే కానిది ఏదీ లేదని కరీంనగర్ భగత్‌నగర్‌లోని శ్రీరామకాలనీకి చెందిన గుండ వెంకట్‌సాయి నిరూపించాడు. వృత్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రవృత్తి నటనగా ముందుకెళ్తూ నిరంతర శ్రమతో సఫలీకృతుడయ్యాడు. 31 ఏళ్ల వయసులోనే ఏకంగా హాలీవుడ్లో సినిమా నిర్మించి, ట్రైలర్‌తోనే 28 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాడు. 11 ఏళ్ల క్రితం అమెరికాకు..వెంకట్‌సాయి బీటెక్ పూర్తి చేసి, ఎంఎస్ చదివేందుకు 11 ఏళ్ల క్రితం ఆమెరికా వెళ్లాడు. తన భార్య ప్రత్యూషతో కలిసి న్యూజెర్సీలో ఉంటున్నాడు. అతనికి మొదటి నుంచి ఫొటోగ్రఫీ, నటనపై మక్కువ. తల్లిదండ్రులు గుండ సునీత–శ్రీనివాస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లినా, ఆరంకెల వేతనం వస్తున్నా వెంకట్‌సాయి ఫొటోగ్రఫీ, నటనను వదలలేదు. హాలీవుడ్‌లోనే సినిమా తీయాలి.. తెలుగువాడి సత్తా చాటాలన్న ఆలోచనతో విరామ సమయాల్లో వెబ్‌సిరీస్, ఫొటోగ్రఫీ చేసేవాడు. ‘వద్దంటే వస్తావే ప్రేమ’ 10 ఎపిసోడ్స్ తీసి, ప్రత్యేక గుర్తింపు పొందాడు. బెస్ట్ ఫొటోగ్రాఫర్‌గా అనేక అవార్డులు పొందాడు. 14 రోజుల్లోనే సినిమా తీశాడు..తప్పు చేసి, పశ్చాత్తపపడే ఇతివృత్తంతో ది డిజర్వింగ్ సినిమా నిర్మించాడు వెంకట్‌సాయి. చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్ మూవీస్ చూసే అలవాటు ఉండటంతో తదనుగుణ నటీనటులను ఆడిషన్స్ నిర్వహించి, ఎంపిక చేశాడు. అందరూ అమెరికన్లే. గంట పదిహేడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను 14 రోజుల్లోనే తీయడం విశేషం. హార్రర్, థ్రిల్లర్, సైకాలజికల్, ఎమోషనల్ సమ్మిళితమైన మూవీ ఇది. సాయిసుకుమార్, అరోరా(డైరెక్టర్), ఇస్మాయిల్, సీమోన్స్టార్లర్, కేసీస్టార్లర్, ప్రియ(మోడల్), మారియంలు సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారని వెంకట్‌సాయి తెలిపాడు. అక్టోబర్ 1న 128 దేశాల్లో సినిమా విడుదల కానుందని పేర్కొన్నాడు. సినిమా కోసం చాలా కష్టపడ్డానుది డిజర్వింగ్ సినిమా తీసేందుకు ఐదేళ్లు పట్టింది. కథ రాయడం నుంచి సినిమా పూర్తయ్యే వరకు చాలా కష్టపడ్డాను. టాలీవుడ్లో ఎన్నైనా టేక్‌లు తీసుకోవచ్చు. హాలీవుడ్లో అలా కాదు.. డబ్బింగ్ ఉండదు. నటులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలి. వాయిదా పడితే మళ్లీ ఏళ్లు పడుతుంది. చిన్నతనంలో తాతయ్య, నాన్న కథలు చెప్పేవారు. ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూసేవాణ్ణి. ఇంగ్లిష్‌వారికి నచ్చేలా మన కథనే కొంత మార్పు చేశా. సినిమా నిర్మాణంలో నా భార్య ప్రత్యూష సహకారం మరువలేను. టీం అంతా ఒక స్నేహపూర్వక వాతావరణంలో సినిమా చేశాం. తెలుగు వ్యక్తిగా త్వరలోనే టాలీవుడ్లో నటిస్తా. – గుండ వెంకట్‌సాయి ప్రపంచస్థాయిలో గుర్తింపునా కొడుకు వెంకట్సాయికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎక్కువగా ఇంగ్లిష్ మూవీస్ చూసేవాడు. కెమెరా పట్టుకొని, ఫొటోలు తీస్తూ తన సరదా తీర్చుకునేవాడు. మేము ఏనాడూ తన ఇష్టాలను కాదనలేదు. అమెరికా వెళ్తానంటే పంపించాం. అక్కడ ఉద్యోగం చేసూ్తనే ప్రపంచం మెచ్చే స్థాయిలో సినిమా తీస్తాడని కలలో కూడా ఊహించలేదు. గ్రేట్‌రా సాయి. – గుండ శ్రీనివాస్, వెంకట్‌సాయి తండ్రి -
Harini Amarasuriya: శ్రీలంక ప్రధాని హరిణి.. హక్కుల చుక్కాని!
శ్రీలంక నూతన ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య. ప్రధాని కావడానికి ముందు పార్లమెంట్ సభ్యురాలు. ఎంపీ కావడానికి ముందు లెక్చరర్. లెక్చరర్‌కు ముందు, లెక్చరర్ అయిన తరువాత స్త్రీవాదం, నిరుద్యోగం, లింగ వివక్ష... ఇలా ఎన్నో సామాజిక అంశాలపై హక్కుల కార్యకర్తగా తన గొంతును బలంగా వినిపించింది. సమస్యలు తెలిసిన... సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి ప్రధాని అయితే ఆ పాలన దేశ సామాజిక, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని చరిత్ర నిరూపించింది. ‘ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రయాణంతో శ్రీలంకలో మరో చరిత్ర మొదలుకానుంది’ అనే ఆశారేఖలు వెల్లివిరుస్తున్నాయి...కొలంబోలో పుట్టి పెరిగిన హరిణి అమరసూర్య హిందూ కాలేజ్, దిల్లీ యూనివర్శిటీలో బి.ఎ, సిడ్నీలోని మక్వరీ యూనివర్శిటీలో ఆంత్రోపాలజీ అండ్ డెవలప్మెంట్లో ఎం.ఎ, ఎడిన్‌బరో యూనివర్శిటీలో సోషల్ ఆంత్రోపాలజీలో పీహెచ్డీ చేసింది. యూత్, పాలిటిక్స్, యాక్టివిజం, జెండర్, డెవలప్మెంట్, శిశు సంరక్షణ, గ్లోబలైజేషన్ అండ్ డెవలప్మెంట్... ఇలా ఎన్నో అంశాలపై లోతైన పరిశోధన చేసింది. పుస్తకాలు రాసింది. డిగ్రీ తరువాత శ్రీలంకలోని మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ‘నెస్ట్’తో కలిసి పనిచేసింది హరిణి. ‘నెస్ట్’ వ్యవస్థాపకురాలైన సాలీ హులుగల్లే అట్టడుగు, అణగారిన వర్గాల కోసం పనిచేసింది. ‘నెస్ట్’ ద్వారా ఎంతో మార్పు తీసుకురాగలిగింది. ఆమె ప్రభావంతో మానసిక వైద్యశాలలలో ఎంతోకాలంగా దిక్కుమొక్కు లేకుండా పడి ఉన్న దీనులు, ఎవరూ పట్టించుకోని హెచ్ఐవీ బాధితులు, అనాథ పిల్లలతో కలిసి పనిచేసింది హరిణి.చైల్డ్ ప్రొటెక్షన్, సైకలాజికల్ ప్రాక్టీషనర్‌గా ఎన్నో సంవత్సరాలు పని చేసిన తరువాత శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరింది. యాక్టివిస్ట్‌గా ఉచిత విద్య కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది. ‘ఫెడరేషన్ ఆఫ్ యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్’ సభ్యురాలైన హరిణి లింగసమానత్వం నుంచి జంతుసంక్షేమం వరకు ఎన్నో అంశాలపై తన గళాన్ని వినిపించింది.ఇక రాజకీయాల విషయానికి వస్తే... 2019లో ‘నేషనల్ ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్’లో చేరిన హరిణి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల సమయంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ) అభ్యర్థి అనురా కుమార దిస్సానాయకే తరఫున ప్రచారం చేసింది. 2020 శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల తరువాత ఎంపీగా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టింది. ఎంపీగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించడానికి లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అత్యున్నత పదవి విషయంలో ‘సరిౖయెన వ్యక్తి’ అనే ప్రశంస చాలా తక్కువమందికి లభిస్తుంది. ఇలాంటి వారిలో 54 సంవత్సరాల హరిణి అమరసూర్య ఒకరు. ‘ప్రధానిగా ఆమె సరిౖయెన వ్యక్తి’ అనేది ఇప్పుడు చాలామంది నోట వినిపిస్తున్న మాట.సమాజం అనే పుస్తకాన్ని చదివి..హరిణికి ఆంగ్ల సాహిత్యం అంటే చాలా ఇష్టం. ‘ఇంగ్లీష్ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని ఉంది’ అంటూ నాన్న స్నేహితుడైన మాజీ దౌత్యవేత్త దగ్గర తన మనసులో మాట బయటపెట్టింది. మొదట ఆయన ఎగతాళిగా నవ్వినా ఆ తరువాత మాత్రం ఆంగ్ల సాహిత్యంలోని ఎంతో మంది దిగ్గజ రచయితలను పరిచయం చేశాడు. వారి రచనలు చదువుతుంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా అనిపించింది. ‘ఆంగ్ల సాహిత్యంలోకి అడుగు పెట్టిన తరువాత నా చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మొదలైంది. ఆ తరువాత కాలంలో సాహిత్య అధ్యయనం కంటే నా చుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయాలనిపించింది’ అంటుంది హరిణి. పుస్తక ప్రపంచంలో కంటే సామాజిక ప్రపంచంలోనే ఆమెకు ఎక్కువ విషయాలు తెలిసాయి. నిరుద్యోగం నుంచి లింగ వివక్ష వరకు ఎన్నో సమస్యలను ప్రత్యక్షంగా చూసింది. ఆమె ఉద్యమకారిణిగా ప్రయాణంప్రారంభించడానికి, ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ‘సమాజం’ అనే పుస్తకం ఎంతో ఉపయోగపడింది.అవును... ఆమె దిల్లీ స్టూడెంట్!‘హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయిన హరిణి శ్రీలంక ప్రధాని కావడం మా కళాశాలకు గౌరవంగా భావిస్తున్నాను. ఆమె విజయం పట్ల మేము గర్వపడుతున్నాం. హరిణి సాధించిన విజయం మా కళాశాల చరిత్రలో మరో మైలురాయి. హిందూ కళాశాలలో హరిణి గడిపిన కాలం ఆమె నాయకత్వానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ అంజు శ్రీవాస్తవ. హరిణి హిందూ కాలేజీలో 1991 నుండి 1994 వరకు చదివింది. బాలీవుడ్ దర్శకుడు నళిన్ రాజన్సింగ్ హిందూ కాలేజీలో హరిణి బ్యాచ్ మేట్.‘కాలేజీ ఉత్సవాలు, చర్చలలో హరిణి చురుగ్గా పాల్గొనేది. ఆమె ప్రధాని స్థాయికి ఎదగడం గర్వంగా ఉంది’ అంటున్నాడు నళిన్ రాజన్సింగ్.ఇవి చదవండి: మహిళల ప్రపంచకప్ టికెట్ల విక్రయం షురూ -
నేటి నుంచి యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో
లక్నో: ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో (యూపీఐటీఎస్) నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. ఇది సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకకూ కొనసాగనుంది. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో నేడు ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖర్ దీనిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పరిశ్రమల శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా నంది తదితరులు హాజరుకానున్నారు.ఈ ప్రదర్శనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇండియా ఎక్స్పొజిషన్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రదర్శనలో 2500కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 70 దేశాల నుంచి దాదాపు 500 మంది విదేశీ కొనుగోలుదారులు ఈ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను సందర్శించనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన ఉండనుంది. 'वैश्विक व्यापार का महाकुंभ'Uttar Pradesh International Trade Show के द्वितीय संस्करण का उद्घाटन आज माननीय उपराष्ट्रपति श्री जगदीप धनखड़ जी के कर कमलों से सम्पन्न होगा।कार्यक्रम में #UPCM श्री @myogiadityanath जी की भी गरिमामयी उपस्थिति रहेगी।दिनांक: 25 सितंबर 2024समय:… pic.twitter.com/wAk8ZggvqN— Government of UP (@UPGovt) September 25, 2024గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్‌లో జరిగిన ప్రీ-ఈవెంట్ బ్రీఫింగ్లో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రి రాకేష్ సచన్ మాట్లాడుతూ ఈ ఏడాది ట్రేడ్ ఫెయిర్ గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు. యూపీ ఆర్థికాభివృద్ధికి యూపీఐటీఎస్ చిహ్నంగా మారిందని సచన్ తెలిపారు. ఈ సంవత్సరం ఐదు లక్షల మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నామన్నారు.ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన కొత్త ఫోను సంబురం -
కూతుళ్లే అందం..ప్రముఖుల బ్యూటిఫుల్ డాటర్స్..!(ఫొటోలు)
-
ట్రంప్ అంటే విద్వేషం.. ఎఫ్‌బీఐ అదుపులో ర్యాన్ వెస్లీ రౌత్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డొనాల్డ్ ట్రంప్‌పై మరోమారు హత్యాయత్నం జరిగింది. గోల్ఫ్ క్లబ్ వెలుపల ట్రంప్‌పై కాల్పులు జరిపిన నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్‌ను ఏకే-47 ఆయుధంతో సహా ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకుంది.ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ర్యాన్ వెస్లీ రౌత్ కాల్పులు జరిపాడు . దీనిని గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సభ్యుడు రైఫిల్‌తో ఎదురు కాల్పులు జరిపాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అనుమానిత షూటర్ వాహనం, లైసెన్స్ ప్లేట్ ఫోటోను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ సేకరించాడు. ఇది దర్యాప్తునకు ఉపకరించింది. రెండు నెలల్లో రెండోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం గమనార్హం.తాజాగా ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు 58 ఏళ్ల ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తించారు. నార్త్ కరోలినాలో ఉంటున్న రౌత్ సుదీర్ఘ నేర చరిత్రను కలిగినవాడని పోలీసులు గుర్తించారు. ఎఫ్‌బీఐ ఇతనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించనప్పటికీ.. న్యూయార్క్ పోస్ట్ పలు వివరాలను అందించింది. లింక్డ్ఇన్ను ఆధారంగా చేసుకుని నిందితుడు నార్త్ కరోలినా అగ్రికల్చరల్ అండ్ టెక్నికల్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నాడని, 2018లో హవాయికి షిఫ్ట్ అయ్యాడని తెలిపింది.లింక్డ్ఇన్లో రౌత్ తన అభిరుచులు, ఆలోచనలు పంచుకున్నాడని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. నార్త్ కరోలినా డిపార్ట్మెంట్ ఆఫ్ అడల్ట్ కరెక్షన్స్లో రౌత్‌కు సంబంధించిన రికార్డులు 2002 నుంచి ఉన్నాయి. 2003లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, ఆయుధాలు కలిగి ఉండటం, హిట్ అండ్ రన్ కేసులలో రౌత్‌కు శిక్ష పడింది. 2010లో అతనిపై చోరీ కేసు నమోదయ్యింది. అమెరికా రాజకీయాల గురించి రౌత్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు రాసేవాడు.రౌత్ 2019లో డెమోక్రటిక్ అభ్యర్థులకు విరాళాలు అందించాడు. 2022 ఏప్రిల్‌లో ఒక పోస్టులో అతను ట్రంప్‌ను విమర్శించాడు. అమెరికాను ప్రజాస్వామ్యబద్ధంగా, స్వేచ్ఛగా ఉంచడంపై తన ప్రచారాన్ని కేంద్రీకరించాలని అధ్యక్షుడు జో బైడెన్‌కు రౌత్ సలహా ఇచ్చాడు. అమెరికన్లను బానిసలుగా చేయాలని ట్రంప్ భావిస్తున్నారని రౌత్ విమర్శించాడు.పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత రౌత్ అధ్యక్షుడు బైడెన్‌ను సలహా ఇచ్చాడు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించాలని, మరణించిన అగ్నిమాపక సిబ్బంది అంత్యక్రియలకు హాజరు కావాలని బైడెన్‌ను కోరాడు. రౌత్ గత జూలై 16న ఈ పోస్ట్ చేశాడు. నిజమైన నాయకులు ఏమి చేస్తారో ప్రపంచానికి చూపించాలని బైడెన్‌కు రౌత్ సూచించాడు.ఇది కూడా చదవండి: ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం? -
అంతర్జాతీయ మధ్యవర్తిత్వంలో సారథ్యానికి సమయమిదే
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్కృతిని పెంపొందించడంలో భారతదేశం ముందుండాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ‘చట్టాల పట్ల గౌరవం నిజాయతీని, స్థిరతను ప్రోత్సహిస్తుంది, ఆర్థిక వృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. హక్కులకు రక్షణ చేకూరి, ఒప్పందాలు అమలయి, వివాదాలు సమర్ధవంతంగా పరిష్కారమయ్యే ఇటువంటి వ్యవస్థలో పెట్టుబడి దారులు ముందుకొచ్చి వృద్ధికి అనుకూలమైన వాతా వరణం నెలకొంటుంది’అని ఆయన తెలిపారు. అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, చట్టపాలనపై శుక్రవారం జరిగిన సదస్సులో జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. చట్టబద్ధ పాలనతో విదేశీ పెట్టుబడులు, వాణిజ్యం పెరగడంతోపాటు అంతర్జాతీయంగా పోటీపడే వాతా వరణం దేశంలో నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా, అటార్నీ జనరల్ వెంకటరమణి, సుప్రీం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్ తదితరులు మాట్లాడారు. -
ఎలాన్ మస్క్‌పై సొంత కూతురే..
-
అంతర్జాతీయ వేదికపై వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు
-
కీలెంచి వాతపెడతారు!
బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చే వ్యవహారాన్ని అమెరికా అనుకూల ప్రతిపక్షం సాకుగా చూపి ఆ దేశాన్ని అంతర్యుద్ధానికి సన్నద్ధం చేసిందనేది అక్షర సత్యం. మతం ఆధారంగా ఈ దేశం నుంచి విడిపోయి తూర్పు పాకిస్తాన్‌గా పిలవబడిన బంగ్లాదేశ్‌లో మొదటి నుండి ఉర్దూ మాట్లాడే పాకిస్తాన్ అనుకూల వాదులకూ, బెంగాలీ మాట్లాడే ముస్లింలకూ అనేక విషయాల్లోౖ సెద్ధాంతిక వైరుద్ధ్యం ఉంది. బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువమంది అవామీ లీగ్ పార్టీకి విధేయులు.ఆ పార్టీ నాయకుడైన షేక్ ముజిబుర్ రెహమాన్‌ను బంగ్లాదేశ్ జాతిపితగా అక్కడి మెజారిటీ ప్రజలు చూస్తారు. అయినప్పటికీ పాకిస్తాన్ అనుకూల వాదులు సైన్యాన్ని అడ్డుపెట్టు కొని 1975లో ముజిబుర్ రెహమాన్‌తో సహా 22 మందిని మట్టు పెట్టారు. ఆయన ఏర్పాటుచేసిన అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు మైనారిటీలుగా హిందువులు ఎదుర్కొనే సమస్యలపై కొంత అవ గాహన ఉంది. అందుకే వారు అక్కడి హిందుత్వ సంస్థలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఈ కారణంతోనే హసీనా ప్రభుత్వ వ్యతిరేకులు హిందువులపై విచక్షణారహితంగా దాడులకు తెగ బడ్డారు. ఇక భారతదేశాన్ని పరిపాలించే ప్రభు త్వం హిందుత్వ ప్రభుత్వం అని నమ్మినవారు... షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడాన్ని సహించలేక బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణ హోమం జరిపారు. ఇది అక్షర సత్యం.షేక్ హసీనా రాజీనామా చేసి, ఇండియాకు పారిపోయి వచ్చిన వెంటనే బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ కార్యకర్తలూ, ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపు సభ్యులూ కలిసి బంగ్లాదేశ్‌లో జరిపిన మారణ హోమం, హసీనా ఇంట్లో చొరబడి చేసిన నిర్వాకం భారతదేశంలోని కొంతమందికి అమితానందాన్ని కలిగించింది. ఆ ఆనందంతోనే ‘భారత్‌లో కూడా బంగ్లాదేశ్ పరిస్థితులు రాబోతున్నాయనీ, మోదీ కూడా ఏదో ఒక రోజు దేశం విడిచి పారి పోతాడనీ, మోదీ ఇంట్లోకి ఏదో ఒక రోజు ప్రజలు దూరే పరిస్థితి వస్తుందనీ’ వారు వ్యాఖ్యలు చేస్తు న్నారు. ఈ మాటలు దేశ హితైషు లకు పట్టరాని కోపాన్ని తెప్పించాయి.ఇక భారతీయుల, బంగ్లాదేశీయుల ఆలోచనలు ఒకే కోణంలో ఉంటాయా అనే విషయాన్ని పరిశీలిద్దాం! మతం ఆధారంగా దేశాన్ని కోరు కుని, తమ సొంత మతస్థుల చేతిలో అరాచకానికి గురై, మన సైనిక సహకారంతో ఒక స్వతంత్ర భూభాగాన్ని ఏర్పాటు చేసుకుని, దేశానికి ఏది అవసరమో, ఏది అనవసరమో తెలియని ఒక గుంపు స్వభావం కలిగిన వారు బంగ్లా దేశీ యులు. ఇక భారతీయులు ఎంతో పరిణతి కలిగిన సుసంపన్న సాంస్కృతిక వారసత్వం కలవారు. వీరిని రెచ్చగొట్టి, తమ పైశాచికత్వాన్ని పండించుకోవాలని చూసే నాయకులకు ఇక్కడ మద్దతు లభించదు.1967లో కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువునా చీలినప్పుడు, రాజభరణాల రద్దు సమయంలో, 1971 బంగ్లాదేశ్ సంక్షోభ సమ యంలో మన సైన్యాన్ని పాకిస్తాన్ పైకి పంపి నప్పుడు, 1975 ఎమర్జెన్సీ సమయంలో ఈ దేశం అనేక రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొంది. కానీ ప్రజలు సంయమనంతో వ్యవహరించి, ప్రజా స్వామ్య పంథాను అనుసరించి, హుందాగా వ్యవహరించారు. బంగ్లాదేశీయుల్లా భారతీ యులు హింసను ఆశ్రయించి ఉంటే– దేశంలో ఎమర్జెన్సీని విధించిన కాంగ్రెస్ పార్టీ నాయ కులకూ, ఆ పార్టీ అనుయాయులకూ షేక్ హసీ నాకు పట్టిన గతే పట్టేది. ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారిపై ప్రజలు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. – ఉల్లి బాలరంగయ్య, వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
డయానా, గ్రాహం బెల్, సిల్వెస్టర్ స్టాలోన్, వీళ్లంతా ఒకపుడు..!
మన జీవితాల్లో తొలి గురువు అమ్మ. మలిగురువు మన స్కూలు ఉపాధ్యాయుడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పాఠశాల ఉపాధ్యాయులుగా వారి ప్రేరణ, స్ఫూర్తి జీవితాంతం గుర్తుండిపోయే వ్యక్తుల్లో ప్రముఖంగా నిలుస్తారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక బాధ్యత పాఠశాల ఉపాధ్యాయులదే. వారి అంకితభావం, విజ్ఞానంతో మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అంతేకాదు చిన్నపుడు దాదాపు అందరూ ఆడే తొలి ఆట టీచర్ ఆట. అంతగా మన జీవితాల్లో గురువు పాత్ర లీనమై ఉంటుంది. కానీ టీచర్లుగా పిల్లల్ని అదుపు చేయడం, విద్యాబుద్ధులు నేర్పించడం అంత ఆషామాషీకాదు. కత్తి మీద సామే. అయినా అంతులేని నిబద్ధతతో, క్రమశిక్షణతో మెలిగి, తన విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే గురువులెందరో...మన దేశంలో సెప్టెంబరు 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పాటిస్తాం. భారతరత్న స్వతంత్ర భారత తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురువులకే గురువుగా ఆయన చేసిన అపారమైన కృషిని, విజయాలను గుర్తించి, ఆయన జయంతిని (1888, సెప్టెంబరు 5) పురస్కరించుకుని, ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా తొలి నాళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసిన కొంతమంది అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం.జాన్ ఆడమ్స్: అమెరికా రెండో ప్రెసిడెంట్ కావడానికి ముందు, జాన్ ఆడమ్స్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ వోర్సెస్టర్లో ఉపాధ్యాయుడు. కానీ ఆయన ఈ ఉద్యోగం విసుగ్గా ఉండేదిట. అందుకే ఒక్క ఏడాదికే 1756లో న్యాయవాదిగా కొనసాగించడానికి ఈ పదవిని విడిచిపెట్టారట.లిండన్ బి. జాన్సన్: అమెరికా మాజీ అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ 1928లో మెక్సికో ,యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న టెక్సాస్‌లోని కోటుల్లాలోని వెల్హౌసెన్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. భాషా సమస్య ఉన్నప్పటికీ (అతని విద్యార్థులు స్పానిష్ మాత్రమే మాట్లాడేవారు ,లిండన్కు ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడేవారు), జాన్సన్ తన విద్యార్థుల ఆంగ్ల భాషను మెరుగుపరిచేందుకు విశేష కృషి చేశాడు. అలా 1965లో ఎలిమెంటరీ మరియు సెకండరీ ఎడ్యుకేషన్ యాక్ట్‌ను ఆమోదించడానికి దారి తీసింది.జిమ్మీ కార్టర్: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ జార్జియాలోని ప్లెయిన్స్‌లోని మరనాథ బాప్టిస్ట్ చర్చిలో సండే స్కూల్లో బోధించేవాడు. ఈ సందర్బంగా ఆయన బోధనలు చాలా ప్రజాదరణ పొందాయి. ఈ ఉపన్యాసాలు వినడానికి ప్రజలు కూడా వేల మైళ్లు ప్రయాణించి వచ్చేవారట.హిల్లరీ క్లింటన్: హిల్లరీ క్లింటన్ కూడా కొంతకాలం ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. 1960వ దశకంలో, క్లింటన్ 1974లో అర్కాన్సాస్‌కు వెళ్లడానికి ముందు వెల్లెస్లీ కాలేజీలో చదువు కున్నారు. అపుడు అర్కాన్సాస్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర బోధకులుగా ఉద్యోగం చేశారు. అలాగే హిల్లరీ, బిల్ క్లింటన్ ఇద్దరూ రాజకీయ నాయకులు కాకముందు ఒకే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులుగా పనిచేయడం విశేషం. హిల్లరీ తన ఉద్యోగాన్ని ఇష్టపడేవారట. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోమని విద్యార్థులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు. 2023లో, క్లింటన్ కొలంబియా యూనివర్సిటీ ఫ్యాకల్టీలో ప్రొఫెసర్‌గా , గ్లోబల్ అఫైర్స్‌లో ప్రెసిడెన్షియల్ ఫెలోగా చేరారు.బరాక్ ఒబామా: అమెరికా మాజీ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చికాగో యూనివర్సిటీ లా స్కూల్లో బోధించేవాడు. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో బీఏ, 1991లో హార్వర్డ్ లా స్కూల్ నుండి పీజీ పట్టా పుచ్చుకున్న తరువాత బోధన ప్రారంభించి, సీనియర్ లెక్చరర్ అయ్యారు దాదాపు పదేళ్లకుపైగా ఒబామా రాజ్యాంగ చట్టం మరియు జాతి సిద్ధాంతాన్ని బోధించారు.ప్రిన్సెస్ డయానా: వేల్స్ యువరాణి కాకముందు డయానా లండన్ నర్సరీ పాఠశాలలో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.అలెగ్జాండర్ గ్రాహం బెల్: టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహం బెల్ కూడా టీచర్‌గా పనిచేశారు. బోస్టన్ , కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లో చెవిటివారి కోస ఉపాధ్యాయుడిగా పని చేశారు. ఆ సమయంలోనే టెలిఫోన్‌ను రూపొందించడానికి ప్రేరణ లభించిందట. 1876లో అధికారికంగా టెలిఫోన్‌ను కని పెట్టారు. ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేశాడు. 1960లలో అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్విట్జర్లాండ్‌లో చదువు తున్నప్పుడు, అదనపు ఆదాయంకోసం జిమ్ టీచర్‌గా పనిచేశాడట. -
నిఫ్టీ ‘వరుస లాభాల’ రికార్డు
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో స్టాక్ సూచీల రికార్డుల ర్యాలీ శుక్రవారం కూడా కొనసాగింది. ఫైనాన్స్, ఐటీ, ఫార్మా, యుటిలిటీ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. అధిక వెయిటేజీ షేర్లు భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీ బ్యాంకు, ఇన్ఫోసిస్ సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. 1996లో ఎన్ఎస్ఈ ప్రారంభం తర్వాత 12 రోజులు వరుసగా లాభాలు గడించిన నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 25,236 వద్ద స్థిరపడింది. ఒక దశలో 116 పాయింట్లు బలపడి 25,268 వద్ద కొత్త ఆల్‌టైం హైని తాకింది. సెన్సెక్స్ 502 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్టం వద్ద మొదలైంది. చివరికి 231 పాయింట్ల లాభంతో 82,366 సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. ఈ సూచీకిది తొమ్మిదో రోజు లాభాల ముగింపు. ఎఫ్ఎంసీజీ మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 1,941 పాయింట్లు(2.41%) పెరగడంతో బీఎస్ఈలో 10 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.464.39 లక్షల కోట్ల(5.54 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1.85 లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సొంతమయ్యాయి. -
సమస్యల నడుమ సారథ్య పోరు..
ద్వీప దేశం శ్రీలంక రెండేళ్ల క్రితం కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అన్నం ముద్దకు, నీటి చుక్కకూ దిక్కులేని పరిస్థితి దాపురించడంతో జనం కన్నెర్రజేశారు. ప్రభుత్వంపై మూకుమ్మడిగా తిరగబడ్డారు. ఎటు చూసినా మొన్నటి బంగ్లాదేశ్ తరహా దృశ్యాలే కని్పంచాయి. దాంతో అధ్యక్షుడు గొటబయ రాజపక్స పదవి వీడి పారిపోయారు. నెలల పాటు సాగిన అనిశ్చితి తర్వాత అన్ని పారీ్టల అంగీకారంతో పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమసింఘె పలు సంస్కరణలకు తెర తీశారు. అయినా దేశం ఆర్థిక ఇక్కట్ల నుంచి ఇప్పుటికీ బయట పడలేదు. నానా సమస్యల నడుమే సెపె్టంబర్ 21న అధ్యక్ష ఎన్నికలకు సిద్ధమవుతోంది...బరిలో 39 మంది అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. 39 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. వీరిలో మాజీ ఆర్మీ చీఫ్ శరత్ ఫోన్సెకాతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులూ ఉండటం విశేషం! అయితే ప్రధాన పోటీ మాత్రం అధ్యక్షుడు రణిల్, శక్తిమంతమైన రాజపక్స కుటుంబ వారసుడు నమల్, విపక్ష నేత సజిత్ ప్రేమదాస మధ్యే కేంద్రీకృతమైంది. మిగతా వారిలో చాలామంది వీళ్ల డమ్మీలేనని చెబుతున్నారు. ఈ ముగ్గురిలోనూ ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మొగ్గు కన్పించడం లేదు. ఈ నేపథ్యంలో తొలి దశలో ఫలితం తేలడం అనుమానమేనని భావిస్తున్నారు.రణిల్ విక్రమ సింఘె ప్రస్తుత అధ్యక్షుడు. పూర్వాశ్రమంలో పేరుమోసిన లాయర్. రికార్డు స్థాయిలో ఆరుసార్లు ప్రధానిగా చేసిన రాజకీయ దిగ్గజం. ఆయన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)కి పార్లమెంటులో ఉన్నది ఒక్క స్థానమే. అయినా అన్ని పార్టీల విజ్ఞప్తి మేరకు 2022 జూలైలో అధ్యక్షుడయ్యారు. దేశాన్ని సంక్షోభం నుంచి కాస్త ఒడ్డున పడేయగలిగారు. కానీ 225 మంది ఎంపీలున్న రాజపక్సల శ్రీలంక పొడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) మద్దతుకు బదులుగా ఆ పార్టీ నేతల అవినీతికి కొమ్ము కాస్తున్నారంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దిగారు. ఎస్ఎల్పీపీ సొంత అభ్యర్థిని బరిలో దింపడం పెద్ద ప్రతికూలాంశం. పైగా రణిల్ పారీ్టకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. దీనికి తోడు విపక్ష నేత సజిత్ ప్రేమదాస నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. తాజాగా 92 మంది ఎంపీలు మద్దతు ప్రకటించడం 75 ఏళ్ల రణిల్‌కు ఊరటనిచ్చే అంశం.సజిత్ ప్రేమ దాస మాజీ అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కుమారుడు. విపక్ష నేత. 2019లో రణిల్ పార్టీ నుంచి విడిపోయి సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పేరిట వేరుకుంపటి పెట్టుకున్నారు. వామపక్ష భావజాలమున్న 57 ఏళ్ల సజిత్‌కు యువతలో ఆదరణ నానాటికీ పెరుగుతోంది. అవినీతినే ప్రధానాస్త్రంగా మలచుకున్నారు. దానిపై ఉక్కుపాదం మోపుతానన్న హామీతో జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. జనంపై పన్నుల భారాన్ని తక్షణం తగ్గించాల్సిందేనన్న సజిత్ డిమాండ్‌కు భారీ స్పందన లభిస్తోంది. దీనికితోడు శ్రీలంక ముస్లిం కాంగ్రెస్, డెమొక్రటిక్ పీపుల్స్ ఫ్రంట్ వంటి పారీ్టలతో పాటు చిన్న గ్రూపుల మద్దతుతో ఆయన నానాటికీ బలపడుతున్నారు. పలు తమిళ సంఘాల దన్ను సజిత్‌కు మరింతగా కలిసిరానుంది.నమల్ రాజపక్స మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు. 38 ఏళ్ల నమల్ శక్తిమంతమైన రాజపక్స రాజకీయ కుటుంబం నుంచి యువతరం వారసునిగా బరిలో దిగారు. అధ్యక్ష పోరులో తనకే మద్దతివ్వాలన్న రణిల్ విజ్ఞప్తిపై ఎస్ఎల్పీపీ రోజుల తరబడి మల్లగుల్లాలు పడింది. చివరికి సొంతగా పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి రణిల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించింది. అనూహ్యంగా నమల్ను బరిలో దించింది. ఆయన చిన్నాన్న గొటబయ రాజపక్సపై రెండేళ్ల క్రితం వెల్లువెత్తిన జనాగ్రహం ఇంకా తాజాగానే ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించం నమల్ ముందున్న అతిపెద్ద సవాలు. దీనికి తోడు ఎస్ఎల్పీపీకి 225 మంది ఎంపీలున్నా వారిలో పలువురు క్రమంగా రణిల్ వైపు మొగ్గుతున్నారు. మిగతా వారిలోనూ చాలామంది పార్టీ ఆదేశాలను కూడా లెక్కచేయడం లేదు.అనూర కుమార దిస్స నాయకె నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) సంకీర్ణం తరఫున బరిలో ఉన్నారు. పార్లమెంటులో కేవలం 3 సీట్లే ఉన్నా సుపరిపాలన హామీతో ఆకట్టుకుంటున్నారు. జనతా విముక్తి పెరమున (జేవీపీ) వంటి పార్టీల దన్ను కలిసొచ్చే అంశం. ఇక అంతర్యుద్ధ సమయంలో హీరోగా నిలిచిన ఫీల్డ్ మార్షల్ ఫోన్సెకా తనకు మద్దతుగా నిలిచే పారీ్టల కోసం చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వండర్బోయ్స్! ఎవర్రా మీరు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు..?
కనిపెట్టాలేగాని పిల్లల్లో వేయి రకాల టాలెంట్స్ఉంటాయి. వాటిని ప్రోత్సహిస్తే వారు వండర్బోయ్స్ అవుతారు. వండర్స్ సృష్టిస్తారు. ఇక్కడ ఉన్నపిల్లలు అలాంటి వారే. వారు చేసిన పని వారిని రికార్డ్ బుక్స్‌లో ఎక్కించింది. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఏదైనా టాలెంట్‌ని ప్రదర్శిద్దామా?ఇక్కడ కనిపిస్తున్న చిరుత పేరు శరణ్ గొరజాల. వయసు ఒక సంవత్సరం 9 నెలల 28 రోజులు (ఏప్రిల్ 30, 2024– రికార్డు సాధించే సమయానికి). ఈ బుడతడు ఏం చేశాడో తెలుసా? ‘పరిగెత్తు’ అనగానే పరిగెత్తాడు. 50 మీటర్ల దూరాన్ని 28 సెకన్లలో పూర్తి చేశాడు. ఇంతకు ముందు ఇదే వయసు బుడతడు ఈ దూరాన్ని 29 సెకన్లలో పూర్తి చేస్తే మనవాడు ఒక సెకను ముందే పూర్తి చేసి రికార్డు సాధించాడు.‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు. శరణ్ గొరజాలది చిత్తూరు జిల్లా. తండ్రి స్వరూప్, తల్లి ప్రియాంక. చిన్నప్పటి నుంచి బలే హుషారు. ఇంట్లో ఆడుకోమంటే పరిగెత్తడం నేర్చాడు. హాల్లో, వరండాలో, ప్లేగ్రౌండ్‌లో పరిగెత్తడమే పని. అందుకే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు. ఏముంది... 50 మీటర్లు లాగించేశాడు. పెద్దయ్యి 100 మీటర్ల పరుగులో రికార్డు సాధించాలని కోరుకుందాం.ఈ గంభీర వదన మహానుభావుని పేరు గోకుల్ పోఖ్రాజ్ పథ్. వయసు 3 సంవత్సరాల 3 నెలలు. కాని మైండు నిండా సమాచారం... ఏదడిగితే అది టక్కున సమాధానం. వీడి మెమొరీ చూసి వీళ్లమ్మ కొన్ని సంగతులు నేర్పింది. వాటిని మర్చి΄ోతేనా? ఎప్పుడు అడిగినా చెబుతాడు. వీడి వయసు పిల్లలు చిట్టి చిలకమ్మా... అమ్మ కొట్టిందా చెప్పమంటే మర్చి΄ోతారు. వీడు? శరీరంలో 33 భాగాల పేర్లు, 23 రకాల వాహనాలు, కంప్యూటర్లో ఉండే 19 రకాల పార్ట్‌ల పేర్లు, 12 పండుగలు, 17 పెంపుతు జంతువుల పేర్లు, 16 జలచరాల పేర్లు, 16 చారిత్రక స్థలాల పేర్లు, 8 మంచి అలవాట్లు, 6 నర్సరీ రైములు కాకుండా ఏబీసీడీలు అన్నీ వాటితో వచ్చే పదాలు చెబుతాడు. ఇంకా ఏమేమి చెబుతాడో మనకెందుకు... ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో ఇతడి పేరు రాసి చల్లగా జారుకోక.హరియాణలోని ఝుజ్జర్కు చెందిన పద్నాలుగు సంవత్సరాల కార్తికేయ జాఖర్ పన్నెండు సంవత్సరాల వయసులోనే ఎవరి గైడెన్స్ లేకుండా మూడు లెర్నింగ్ అప్లికేషన్లను డెవలప్ చేసి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సం΄ాదించాడు. కార్తికేయ నాన్న రైతు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆయన మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. తండ్రి దగ్గర ఉన్న ఫోన్ సహాయంతో బడి ΄ాఠాలు వినడమే కాదు టెక్నాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు కార్తికేయ. అలా అని కొత్త విషయాలు తెలుసుకోవడానికే పరిమితం కాలేదు.‘ఒకసారి ట్రై చేసి చూద్దాం’ అంటూ ఏవేవో ప్రయోగాలు చేసేవాడు. అలా చేస్తూ చేస్తూ మూడు యాప్‌లను సొంతంగా డెవలప్ చేశాడు. అవి: 1.జనరల్ నాలెడ్జీ యాప్: లుసెంట్ జీకే2. కోడింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ యాప్: రామ్ కార్తిక్ లెర్నింగ్ సెంటర్3. డిజిటల్ ఎడ్యుకేషన్ యాప్: శ్రీరామ్ కార్తిక్.‘కార్తికేయలో అద్భుతమైన ప్రతిభ ఉంది. ప్రభుత్వ సహకారం ఉంటే మా అబ్బాయి మరెన్నో సాధించగలడు. డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి కార్తికేయ దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను’ అంటున్నాడు కార్తికేయ తండ్రి అజిత్. -
గళానికీ సంకెళ్లు!
మిగతా ప్రపంచమంతా కాలంతో పందెం వేస్తూ దూసుకెళ్తుంటే అఫ్గానిస్తాన్ మాత్రం కాలంతో పాటు వెనక్కు పయనిస్తోంది. మూడేళ్ల క్రితం పాలన తాలిబన్ల చేతిలోకి వెళ్లినప్పటి నుంచీ అక్కడ రాతియుగపు పాలన నడుస్తోంది. మహిళల మనుగడ దినదిన గండంగా మారింది. ఆంక్షల కొలిమిలో నిలువునా కాలడం వారికి నిత్యకృత్యమైపోయింది. తాజాగా మహిళల గళానికి కూడా సంకెళ్లు పడ్డాయి... – సాక్షి, నేషనల్ డెస్క్అడుగు కదిపితే ఆంక్షలు. ఊపిరి కూడా ఆడని రీతిలో చుట్టూ నిబంధనల చట్రం. అఫ్గాన్‌లో మహిళపై తాలిబన్లు పాల్పడుతున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లు పెద్ద చదువులు చదివేందుకు వీల్లేదు. ఆరో తరగతి తర్వాత ఇంటికే పరిమితం కావాలి. ఒళ్లంతా పూర్తిగా కప్పుకుంటే తప్ప ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి లేదు. ఈ అణచివేతను పరాకాష్టకు తీసుకెళ్తూ తాలిబన్లు తాజాగా మరో మతిలేని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహిళలు బహిరంగ స్థలాల్లో మాట్లాడటానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. ప్రసార మాధ్యమాల్లో కూడా వారి స్వరం పొరపాటున కూడా విని్పంచకూడదని ఆదేశించారు! అంతేకాదు, ఇల్లు దాటాలంటే ఒంటితో పాటు ముఖాన్ని కూడా పూర్తిగా కప్పుకోవడం తప్పనిసరంటూ మరో నిబంధన విధించారు!! మహిళల అస్తిత్వానికే గొడ్డలిపెట్టు వంటి ఈ ఆటవిక నిర్ణయాలపై అంతర్జాతీయ సమాజంలో విస్మయం వ్యక్తమవుతోంది. ‘సద్గుణాల వ్యాప్తి, దుర్గుణాల కట్టడి’ పేరిట తాలిబన్లు మూడేళ్ల క్రితం ఏకంగా ఒక శాఖనే ఏర్పాటు చేశారు. మహిళలపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో 114 పేజీల డాక్యుమెంట్‌ను ఆ శాఖ విడుదల చేసింది. అందులో 35 రకాల నూతన నిబంధనలను పొందుపరిచారు. మహిళలు ఇకపై బహిరంగ స్థలాల్లో మాట్లాడేందుకు వీల్లేదన్నది వాటిలో ప్రధానమైనది. ఈ నిబంధనలకు తాలిబన్ పాలకుడు హిబతుల్లా అఖుంద్జాదా ఇటీవలే ఆమోదముద్ర వేశారు. ఆగస్టు 21 నుంచి అవి అమల్లోకి వచ్చాయి.‘మంచిని పెంచేందుకు, చెడును తుంచేందుకు ఈ నూతన ఇస్లామిక్ నిబంధనలు ఎంతగానో దోహదపడుతాయి’ అంటూ సంబంధిత శాఖ అధికార ప్రతినిధి అసోసియేటెడ్ ప్రెస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకొచ్చారు! కొత్త ఆంక్షలు ఇలా...– ఇకపై మహిళలు బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడటానికి ఏమాత్రం వీల్లేదు. – బహిరంగ ప్రదేశాల్లో గట్టిగా చదవొద్దు. పాటలు పాడొద్దు. రాగాలు తీయొద్దు. – మీడియాలో కూడా మహిళల గొంతు ఏ రకంగానూ విని్పంచకూడదు. – రక్త సంబం«దీకులను, భర్తను తప్ప మరే పురుషుని వైపూ కన్నెత్తి కూడా చూడొద్దు. – బహిరంగ ప్రదేశాలలో మహిళలు మగవాళ్లతో మాట్లాడటం నిషిద్ధం.– మహిళలను బయటికొచి్చనప్పుడు ముఖం పూర్తిగా కవరయ్యేలా కప్పుకోవాలి. లేదంటే వాళ్లను చూసి మగవాళ్లు ఉద్రేకానికి లోనయ్యే ఆస్కారముంది. – కనుక మహిళలు ఇకపై ముఖంపై పూర్తిగా మేలిముసుగు ధరించాల్సిందే. కేవలం జుత్తు, మెడను మాత్రమే కవర్ చేసే హిజాబ్ మాత్రం ధరిస్తే చాలదు. – మహిళలు ఇకనుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ సంగీత వాయిద్యాలను ముట్టుకోకూడదు. – వాహనదారులెవరూ మగవాళ్లు తోడు లేనిదే మహిళలను ఎక్కించుకోకూడదు. – పురుషులు గడ్డం చేసుకోకూడదు. నియమిత వేళల్లో విధిగా ఉపవాసముండాలి. – అఫ్గాన్ మీడియా ఇకపై షరియా చట్టాలను తూ.చా. తప్పకుండా పాటించాలి. – మీడియాలో ఎవరి ఫొటోలూ చూపించడానికి, ప్రచురించడానికి వీల్లేదు.శిక్షలు ఇలా... – నూతన నిబంధనలను ఉల్లంఘించే మహిళలకు... – తొలుత హెచ్చరికల జారీ. – అనంతరం ఆస్తుల జప్తు. – మూడు రోజులదాకా నిర్బంధం. – అనంతరం అవసరాన్ని బట్టి కఠిన శిక్షలు. – నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో వేలాది మంది అఫ్గాన్ మహిళలు ఇప్పటికే నిర్బంధంలో మగ్గుతున్నారు. ఇప్పటికే ఈ ఆంక్షలు... – బాలికలు ఆరో తరగతితోనే చదువు ఆపేయాలి. – మహిళలు ఎటువంటి స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయడానికి వీల్లేదు.– హిజాబ్ లేకుండా వాళ్లు ఇల్లు దాటకూడదు. -
అంతర్జాతీయ క్రికెట్ కు శిఖర్ ధావన్ గుడ్ బై
-
ఈ పోస్ట్‌కార్డు.. జీవితకాలం లేటు!
ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్ల కాలం. కానీ వందేళ్ల కిందట సమాచారం చేరవేతకు ఏకైక మార్గం పోస్టే. ఒక లెటర్ చేరడానికి మూడు నుంచి వారం రోజులు, ఒక్కోసారి పది రోజుల నుంచి నెల దాకా కూడా పట్టేది. కానీ ఒక పోస్ట్‌కార్డు చేరడానికి ఏకంగా 121 ఏళ్లు పట్టింది! 1903లో పోస్ట్ చేసిన ఆ లేఖ శతాబ్దం ఆలస్యంగా చేరుకుంది. బ్రిటన్‌లో స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ అడ్రస్‌తో ఉన్న ఈ క్రిస్మస్ థీమ్ కార్డు క్రాడాక్ స్ట్రీట్ శాఖకు గతవారం చేరింది. ఆ చిరునామాలో గతంలో నివసించిన మిస్ లిడియా డేవిస్ బంధువులను కనిపెట్టి ఈ కార్డు ఎవరికి రాసిందో తెలుసుకుని వాళ్లకు చేర్చాలని సిబ్బంది భావిస్తున్నారు. ఈ పోస్టుకార్డును ఎవార్ట్ అనే వ్యక్తి లిడియాకు రాశారు.స్వాన్సీ బిల్డింగ్ సొసైటీలో 121 ఏళ్ల కిందట ఆండ్రూ డల్లీ తన భార్య మరియాతో కలిసి నివసించారు. వారి ఆరుగురు పిల్లల్లో పెద్ద కూతురు లిడియా. ఈ పోస్టు కార్డు పంపిన సమయంలో ఆమెకు 16 ఏళ్లు. వారి కుటుంబం గురించిన సమాచారం ఆన్లైన్లో చాలా తక్కువగా ఉందని స్వాన్సీ బిల్డింగ్ సొసైటీ వర్గాలన్నాయి. ఆమెతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారేమో కనుగొని లేఖను అందజేస్తామని చెప్పుకొచ్చాయి.లేఖలో ఏముందంటే..‘డియర్ ‘ఎల్’.. నన్ను క్షమించండి. నేనా జత (ఏదో తెలియని వస్తువు) తీసుకోలేకపోయాను. నువ్వు ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నావని ఆశిస్తున్నా’ అని రాశారు. తన వద్ద 10 షిల్లింగ్లు ఉన్నాయని, రైలు చార్జీలను లెక్కించడం లేదని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. ‘గిల్బర్ట్, జాన్‌లను కలవాలి.. గుర్తుంచుకోండి’ అంటూ ముగించారు. ‘అందరికీ ప్రేమతో’అంటూ సంతకం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బర్గర్ కింగ్ వర్సెస్ బర్గర్ కింగ్..!
పుణె: అంతర్జాతీయ ఫాస్ట్–ఫుడ్ చెయిన్ బర్గర్ కింగ్ కార్పొరేషన్‌పై పుణెలో బర్గర్ కింగ్ పేరుతో ఉన్న రెస్టారెంట్ 13 ఏళ్లపాటు సాగిన న్యాయ పోరాటంలో విజయం సాధించింది. ‘బర్గర్ కింగ్’పేరును వాడుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 13 వేలకుపైగా ఔట్లెట్లు కలిగిన తమ పేరును దెబ్బతీస్తున్నారని అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థ బర్గర్ కింగ్ కార్పొరేషన్ 2011లో పుణె కోర్టులో కేసు వేసింది. ఆ పేరును వాడకుండా సంబంధిత రెస్టారెంట్‌ను ఆదేశించాలని, తమ బ్రాండ్‌కు పూడ్చలేని నష్టాన్ని కలుగజేసినందుకు రూ.20 లక్షలు చెల్లించాలని కూడా అందులో కోరింది. దీనిపై పుణె బర్గర్ కింగ్ యజమానులైన అనహిత, షాపూర్ ఇరానీలు న్యాయపోరాటం జరిపారు. ఒక్క పేరు తప్ప, బర్గర్ కింగ్ కార్పొరేషన్‌తో ఎలాంటి సారూప్యతలు తమ రెస్టారెంట్‌కు లేవన్నారు. తమ వంటి చిన్న వ్యాపారాలను దెబ్బకొట్టే దురుద్దేశంతోనే ఆ సంస్థ ఈ కేసు ఏళ్లపాటు కొనసాగించిందని ఇరానీ ఆరోపించారు. దీని కారణంగా తాము తీవ్ర వేదనకు, మానసిక ఒత్తిడికి గురయ్యామని చెప్పారు. విచారించిన జడ్జి సునీల్ వేద్ పాఠక్..‘ఇరానీ 1992లోనే బర్గర్ కింగ్ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. కానీ, అమెరికా కంపెనీ 2014 తర్వాతే దేశంలోకి అడుగుపెట్టింది. ఆ కంపెనీ వాదన చాలా బలహీనంగా ఉంది. పుణెలోని రెస్టారెంట్ బర్గర్ కింగ్ పేరుతో వినియోగదారులను తికమకపెట్టినట్లు గానీ, తప్పుదోవ పట్టించినట్లు గానీ నిరూపించలేకపోయింది’అని స్పష్టం చేశారు. అంతేకాదు, పుణె బర్గర్ కింగ్ రెస్టారెంట్‌తో తమ బ్రాండ్‌కు వాటిల్లిన నష్టంపై సరైన ఆధారాలను సైతం అమెరికా కంపెనీ చూపలేదన్నారు. అందుకే పరిహారం పొందే అర్హత కూడా ఆ సంస్థకు లేదన్నారు. ఈ విషయంలో ఎవరూ ఎవరికీ పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుణె రెస్టారెంట్ అదే పేరుతో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. -
Friendship Day: చెరగనిది మా స్నేహబంధం (ఫొటోలు)
-
తక్షణం తగ్గినా.. భవిత ‘బంగారమే’!
పుత్తడిపై కస్టమ్స్ సుంకాలు 15% నుంచి 6%కి తగ్గిస్తున్నట్లు వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వెంటనే ఇటు స్పాట్లో అటు ఫ్యూచర్స్ మార్కెట్లలో రూ.4,000 వరకూ పడిపోయిన పసిడి ధరలు.. ఇదే రీతిలో ముందు ముందు ఆభరణ ప్రియులకు అంతే సంతోషాన్ని కలిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయంగా రూపాయి విలువ పతనం ఇందుకు కారణం.→ భౌగోళిక ఉద్రిక్తతలను మొదట ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, దీనికి పశ్చిమ దేశాల మద్దతు అలాగే చైనాతో అమెరికాకు ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితికి దారితీసే అంశాలు. ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొన్నా.. పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ బంగారం వైపే చూస్తాడనడంలో సందేహం లేదు. → ఇక రెండో అంశానికి వస్తే.. అమెరికాతో సహా పలు దేశాలు సరళతర వడ్డీరేట్ల విధానంలోకి మారినప్పటికీ ఆ విధానాన్ని ఎంతవరకూ కొనసాగిస్తాయో తెలియని పరిస్థితి. సరళతర వడ్డీరేట్ల విధానంతో బంగారంలో కొనుగోళ్లు పెరుగుతాయి. అయితే ఈ విధానం కొనసాగింపునకు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. → కీలక మూడవ అంశం.. రూపాయి విలువ. డాలరుతో రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయి రికార్డులను కొనసాగిస్తోంది. బుధవారం ఆల్‌టైమ్ కనిష్టం 83.71 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 83.72 కనిష్టాన్ని తాకింది. → భౌగోళిక ఆర్థిక అనిశ్చితి అంశాల నేపథ్యంలో... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చ ంజ్లో ఈ నెల 16వ తేదీన ఔన్స్ కు (31.1గ్రా) ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ధర అటు పై కొంత తగ్గినప్పటికీ... పటిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. అంతర్జాతీయ ఫ్యూ చర్స్లో 18 డాలర్లు అధికంగా 2,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో రూపాయి క్షీణిస్తూ... అంతర్జాతీయంగా ధర పెరుగుదల ధోరణే కొనసాగిస్తే దేశీయంగా సైతం బంగారం మున్ముందుకే సాగుతుందనడంలో సందేహం లేదు. పెట్టుబడులకు ప్లస్సే... దేశీయంగా శుభకార్యాల్లో భారతీయులు పసిడి కొనుగోళ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిన అంశమే. ఇది ఎలాగూ తప్పని అంశం. ఇక పసిడి పెట్టుబడులకు ఇది తగిన అవకాశమనడంలో సందేహం లేదు. వినియోగదారులకు ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఎలానూ ఉంటుంది. తక్కువ ఖర్చులు అలాగే 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమ యం అనడంలో సందేహం లేదు.దేశీయంగా రెండోరోజూ భారీ తగ్గుదల బడ్జెట్లో నిర్ణయంతో దేశీయంగా రెండవరోజూ బుధవారమూ దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధానిలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.650 తగ్గి, రూ. 71,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇంతే స్థాయిలో దిగివచ్చి రూ. 71,300కు దిగివచి్చంది. ఇక మంగళవారం రూ.4 వేల వరకూ తగ్గిన వెండి ధర బుధవారం అక్కడక్కడే 87,500 వద్ద ముగిసింది. దేశ రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ. 451, రూ.449 తగ్గి రూ.69,151, రూ.68,874కు దిగివచ్చాయి. వెండి ధర రూ.57 తగ్గి రూ.84,862 వద్ద ముగిసింది. -
40 రోజుల చిన్నారికి ఆధార్
నస్పూర్: దేశంలోనే ఆధార్‌కార్డు కలిగిన పిన్న వయసు్కరాలిగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన ఐజల్ ఫాతిమా రికార్డు సృష్టించింది. నస్పూర్ కాలనీలో నివసించే సింగరేణి ఉద్యోగి మహ్మద్ అఫ్జల్ పాషా, సమీరా తబస్సుమ్ దంపతులకు.. ఈ ఏడాది జనవరి 12న ఐజల్ ఫాతిమా జన్మించింది. చిన్నారికి ఫిబ్రవరి 21న ఆధార్ కార్డు మంజూరైంది. దేశంలో జన్మించిన 40 రోజులకే ఆధార్‌కార్డు పొందిన తొలి వ్యక్తిగా ఐజల్ ఫాతిమా గుర్తింపు పొందినట్లు.. మహ్మద్ అఫ్జల్ పాషా తెలిపారు. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తమ కుమార్తె చోటు సాధించినట్లు ఆ సంస్థ నిర్వాహకులు సోమవారం తెలియజేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఇదే రికార్డు.. పుట్టిన 43 రోజులకు ఆధార్ కార్డు పొందిన నిజామాబాద్ జిల్లా వాసి ఆద్య పేరిట నమోదైందన్నారు. -
అంతర్జాతీయ దిగ్గజాలుగా దేశీ ఆడిటింగ్ సంస్థలు
న్యూఢిల్లీ: దేశం నుంచి అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థలను తీర్చిదిద్దేందుకు కేంద్ర సర్కారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో కలసి పనిచేస్తున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ గోవిల్ వెల్లడించారు. అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థల అగ్రిగేషన్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భారత్ నుంచి నాలుగు పెద్ద అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థలను తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ (కార్పొరేట్ పాలన)ను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బీమా రంగం, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్íÙప్ (ఎల్ఎల్పీలు)లకు అకౌంటింగ్ ప్రమాణాలు తీసుకు వచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే వీటిని తీసుకొస్తామన్నారు. బ్యాంక్‌లకు సంబంధించిన అకౌంటింగ్ ప్రమాణాల విషయంలో ఆర్బీఐతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఐసీఏఐ 75 వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. ఎల్ఎల్పీలు, కంపెనీల చట్టం నిబంధనలను సమీక్షిస్తున్నట్టు, కంపెనీల స్వచ్ఛంద మూసివేత సమయాన్ని తగ్గించడమే తమ ధ్యేయమన్నారు. -
తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!మోదీ 3.0 కేబినేట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.మధ్యయుగాల్లో..భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.గూంగీ గుడియా..మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్గా పిలిచే స్ఫూర్తిని చాటారు.కరోనాతో మరోసారి..రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.మరిన్ని రూపాల్లో.. యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!అత్యంత సంపన్న మహిళ..33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.సమస్యల వలయం..హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్‌గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.వరల్డ్ విడోస్ డే..ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.మెహినీ గిరి..మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.వార్ విడోస్ అసోసియేషన్..స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్మెంట్ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.దాడులు..ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.వితంతు రక్షణ చట్టాలు..వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
International Picnic Day : ఛలో పిక్నిక్...అటు విందు, ఇటు దిల్ పసందు
నేడు (జూన్ 18) అంతర్జాతీయ పిక్నిక్ డే నిర్వహించుకుంటారు. కచ్చితమైన కారణం, మూలంపై పూర్తి స్పష్టతలేనప్పటికీ పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఫ్రెంచ్ విప్లవం తరువాత ఇది ప్రాచుర్యంలోకి వచ్చిందని చెబుతారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ప్రజలకు అనుమతి ఉండేది కాదు. దీంతో విప్లవం తరువాత ప్రజలు అంతా తమ స్నేహితులు, సన్నిహితులతో గడిపేందుకు, కలిసి భోజనం చేసేందుకు పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవారట. పిక్నిల ద్వారా ప్రజలుకొత్త ఉత్సాహాన్ని పొందేవారట. కాలక్రమంలో ఇందులోని అసలు ఆనందం తెలిసి వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కూడా పాపులారిటీ పెరిగింది. 2009లో, పోర్చుగల్‌లోని లిస్బన్లో 20 వేల మందితో జరిగిన పిక్నిక్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతిపెద్ద పిక్నిక్గా రికార్డుల కెక్కింది. రొటీన్ దినచర్య నుండి కొంత విరామం తీసుకుని, మన ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడపడమే పిక్నిక్. పిక్నిక్ అనే పదం ఫ్రెంచ్ పదం పిక్-నిక్ నుండి ఉద్భవించిందని చెబుతారు. కుటుంబ సభ్యులతోపాటు హితులు, సన్నిహితులతో కలిసి ఉత్సాహంగా కాలం గడపడం, తద్వారా రోజువారీ జీవితాల్లోని ఆందోళన, ఒత్తిడి నుంచి దూరంగా గడిపి, కొత్త ఉత్సాహాన్ని తెచ్చుకోవాలనేదే ఈ అంతర్జాతీయ పిక్నిక్ డే ఉద్దేశం. పిక్నిక్లు పలు రకాలుచిన్నప్పుడు స్కూలు పిల్లలతో కలిసి సరదాగా జూకు, పార్క్‌లకు, జాతీయనేతల సినిమాలను చూడటానికి థియేటర్లకు, ఇతర ఎమ్యూజ్మెంట్ పార్క్‌లకు వెళ్లిన సందర్భాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.ఆ తరువాత కాలేజీ రోజుల్లో విహారయాత్రలు, పిక్నిక్ల గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. కొత్త కొత్త స్నేహాలతో కొత్త ఉత్సాహం ఉరకలేస్తూ, నవయవ్వనంలో చేసే చిలిపి చేష్టలు, సరదా సరదా పనులు అద్బుతమైన అనుభవాలుగా మిగిలి పోతాయి. ఇంకా కిట్టీ పార్టీలు, ఆఫీసుపార్టీలు, అసోసియేషన్ల సెలబ్రేషన్లు, కార్తీక వనభోజనాలు ఇలాంటివన్నీ బోలెడన్నీ కొత్త పరిచయాలను, సరికొత్త ఆనందాలను పంచుతాయి. అంతేనా..అటు విందు భోజనం, ఇటు ఆహ్లాదకరమైన వాతావరణంలో దిల్లంతా పసందు.పచ్చని ప్రకృతి, అద్హుతమైన సూర్యరశ్మి, చక్కటి సంగీతం, ఆటా, పాటా, వీటన్నింటికి మించి మనకు నచ్చిన దోస్తులు..ఈ కాంబినేషన్ సూపర్ హిట్టే కదా. అందుకే అప్పుడపుడూ నవ్వులు, కేరింతలతో గడిపేలా పిక్నిక్కి చెక్కేద్దాం. హ్యాపీ పిక్నిక్.. -
మహిళా సాధికారత థీమ్‌తో యోగా డే
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతియేటా జూన్ 21న నిర్వహిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా యునైటెడ్ కింగ్డమ్ (యుకె)లోని భారత హైకమిషన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది మహిళా సాధికారత థీమ్‌తో యోగా డేను నిర్వహించనున్నామని తెలిపారు. గత ఏడాది జరిగిన యోగా కార్యక్రమంలో 700 మందికి పైగా జనం పాల్గొన్నారని, వివిధ సంఘాల సభ్యులు కూడా హాజరయ్యారన్నారు. అదేవిధంగా ఈసారి కూడా అధిక సంఖ్యలో జనం యోగా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు.యోగా అన్ని వర్గాల వారినీ కలుపుతుందని, అందరికీ ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ తెలిపారన్నారు. ఈ ఏడాది జరిగే యోగా కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అధికసంఖ్యలో పాల్గొననున్నారన్నారు. బ్రిటిష్ పౌరుడు ఇందర్‌పాల్ ఓహ్రీ చందేల్ మాట్లాడుతూ యోగా అనేది మన వారసత్వంలో భాగమని, దానితో మనం కనెక్ట్ కావడం అందరికీ ముఖ్యమన్నారు. ఈ ఏడాది జరిగే యోగా దినోత్సవంలో భారత బధిర క్రికెట్ జట్టు సభ్యులు పాల్గొనబోతున్నారని అన్నారు. 2015 నుండి ప్రతీయేటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. -
అన్యాయంగా 37 ఏళ్లు ఖైదు : రూ. 116 కోట్లు పరిహారం
వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది ఒక ధర్మ సూత్రం. కానీ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 37 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ అతని మాటలు పట్టించుకోలేదు. ఫలితంగా విలువైన జీవితంలో విలువైన సమయంలో జైలులో మగ్గిపోవాల్సి వచ్చింది. చివరికి న్యాయమే గెలచింది. ఒక కేసులో దొరికిన ఓ సాక్ష్యం ఆధారంగా అతణిని నిర్దోషిగా తేల్చింది. ఈ తప్పిందం దొర్లినందుకు గాను అతనికి రూ. 116 కోట్ల రూపాయలు భారీ పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.అసలేమైందంటే..లైంగికదాడి, హత్య వంటి ఆరోపణలపై ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్‌ను 1982లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లు మాత్రమే. 19 ఏళ్ల బార్బరా గ్రామ్ను అత్యాచారం చేసి, చంపేశాడంటూ అభియోగాలు నమోదైనాయి. ఈ కేసులో విచారణ అనంతరం అమెరికాలోని ఒక కోర్టు తొలుత అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ సహాయంతో అతని శిక్షను 2018లో దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. చివరకు తప్పుడు నేరారోపణ కేసులను వాదించడంలో అపారమైన అనుభవం ఉన్న చికాగోకు చెందిన పౌర హక్కుల సంస్థ లోవీ & లోవీ ఈ కేసులో జోక్యం చేసుకుని, ఈ కేసులో బాధితుడి ప్రమేయం లేదని నిరూపించడంలో అతినికి విముక్తి లభించింది. 1980లలో అందబాటులోని, ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన డీఎన్ఏ టెస్ట్‌ద్వారా నిర్దోషిగా తేలాడు. 2020 ఆగష్టులో ఫ్లోరిడా జైలు నుండి విడుదలయ్యాడు.కొంతకాలం తర్వాత, రాబర్ట్ డుబోయిస్ తనకు జరిగిన నష్టానికి న్యాయం కావాలంటూ పోరాటానికి దిగాడు. టంపా నగరం అధికారులు, విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు , ఫోరెన్సిక్ దంతవైద్యుడిపై (బార్బరా మృతదేహంపై ఉన్న పంటి గాట్లను సరిపోలాయని సర్టిఫై చేసిన) కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన అమెరికా కోర్టు అతని వాదనను సమర్ధించింది. బాధితుడికి 1.4 మిలియన్ డాలర్ల (రూ. 116 కోట్లు) పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. విడతలవారీగా డుబోయిస్‌ను ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ సంవత్సరం 90 లక్షల డాలర్లు, వచ్చే ఏడాది 30 లక్షల డాలర్లు, చివరిగా 2026లో 20 లక్షల డాలర్లు డుబోయిస్ అందుకుంటాడు. -
డెన్మార్క్ ప్రధానిపై దాడి
కోపెన్‌హగన్: డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సెన్పై దాడి జరిగింది. కోపెన్హాగన్ స్క్వేర్ వద్ద ప్రధానిపై దుండగుడు ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఘటనతో ప్రధాని షాక్‌కు గురైనట్లు ఆమె కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దాడికి దిగిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తీసుకెళ్లారని ఘటనకు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.ప్రధానిపై దాడి తమను కలిచివేసిందని పర్యావరణ మంత్రి ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. మూడు వారాల క్రితమే యూరప్ దేశం స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. -
తానా ప్రపంచసాహిత్యవేదిక నాల్గవ వార్షికోత్సవ వేడుకలు !
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న 67వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో నాల్గవ వార్షికోత్సవ వేడుకలలో “ప్రజాభ్యుదయంలో సాహిత్యం, కళల పాత్ర: నాడు-నేడు” సదస్సు ఘనంగా జరిగింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయపు ఉపకులపతిఆచార్య డా. కె. పద్మరాజుముఖ్యఅతిథిగా పాల్గొని తమ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష, సాహిత్య వికాసాలకోసం జరుగుతున్న కృషిని సోదాహరణంగా వివరించారు. తానా పూర్వాధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, అంజయ్యచౌదరి లావు, ప్రస్తుత అధ్యక్షులునిరంజన్ శృంగవరపు, ఉత్తరాధ్యక్షులు డా. నరేన్ కొడాలి, సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాలు ఈ నాల్గవ వార్షికోత్సవం జరుపుకోవడంపట్ల హర్షాతిరేఖం తోపాటు ఈ సాహితీ ప్రయాణంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు సమస్యలుండేవి. ఆంధ్రప్రదేశ్‌లో ఆనాడు ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి వరకట్నం, మధు సేవ, చింతామణి, రక్త కన్నీరు, మా భూమి, పాలేరు లాంటి నాటకాలు, ప్రజా నాట్యమండలి, జననాట్య మండలి లాంటి సంస్థల ప్రభావం భూస్వామ్యుల, పెత్తందార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు నాయకుల పోరాటం, ఇక తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉద్యమ గీతాలు, కళాకారుల ఆట పాటలు ప్రజా చైతన్యాన్ని తీసుకువచ్చాయన్నారు”.ఇక విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యులు డా. గోరటి వెంకన్న,ప్రముఖ సినీగీత రచయితడా. సుద్దాల అశోక్ తేజ,‘తెలంగాణ రాష్ట్ర గీతరచయిత’డా. అందెశ్రీ, సినీగీత రచయిత శ్రీ మిట్టపల్లి సురేందర్, కళాభిమానిడా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, ప్రముఖ కవి శ్రీ గొడిశాల జయరాజు, గద్దర్కుమార్తె డా. వెన్నెల గద్దర్,అరుణోదయ కళాకారిణిబండ్రు విమలక్క, బుర్రకథ కళాకారులు పద్మశ్రీ నాజర్కుమారులుషేక్ బాబుజి (బుర్రకథ), ఏర్పుల భాస్కర్ (బైండ్ల గానం); డా. రవికుమార్ చౌదరపల్లి (ఒగ్గుకథ); పాతూరి కొండల్ రెడ్డి (యక్షగానం); దామోదర గణపతిరావు (జానపదగానం) మరియు చాట్రగడ్డ శ్రీనివాసుడు(డప్పువిన్యాసం) పాల్గొని ఎన్నో ఉదాహరణలతో చేసిన ఆసక్తికర ప్రసంగాలు, కళావిన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.(చదవండి: ఆనందమే జీవిత మకరందం!) -
అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
ప్రతి ఏడాది మే 21వ తేదీ అంతర్జాతీయ టీ దినోత్సవం( International Tea Day! జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 21, 2019న తీర్మానించింది. దీంతో ఏటా ఆహార, వ్యవసాయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా మే 21వ తేదీని ఘనంగా నిర్వహిస్తున్నాయి. టీని ఉత్పత్తి చేయడం, వినియోగానికి అనుకూలమైన కార్యకలాపాలను అమలు చేసేందుకు సమిష్టి చర్యలు తీసుకోవడం, ప్రోత్సహించడం ఈ రోజు ప్రధాన లక్ష్యం.చరిత్రఈశాన్య భారతదేశం, ఉత్తర మయన్మార్, నైరుతి చైనాలో ఈ టీ (Tea) ఉద్భవించిందని చాలా మంది నమ్ముతారు. కచ్చితమైన ప్రదేశం తెలియనప్పటికీ 5వేల ఏళ్ల క్రితం చైనాలో మొదటిసారిగా టీ తాగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. భారతదేశంతో పాటు శ్రీలంక, నేపాల్, వియత్నాం, ఇండోనేషియా, బంగ్లాదేశ్, కెన్యాస మలావి, మలేషియా, ఉగాండా, టాంజానియా వంటి టీ ఉత్పత్తి దేశాల్లో 2005నుంచి అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజున టీ ఉత్పత్తి చేసే దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లపై అవగాహన పెంచడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీ వర్కర్స్ సంస్థలు సెమినార్లు, పబ్లిక్ ఈవెంట్లను నిర్వహిస్తూ సమావేశమవుతాయి.పొద్దుపొద్దునే వేడి వేడి చాయ్ కడుపులో పడితేగానీ హాయిగా ఉండదు చాలామందికి. ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగించేది టీ. చుట్టాలు వచ్చినా ముందుగా గుర్తొచ్చొది టీ. అలాంటి టీలో ప్రపంచం నలుమూలల ఉన్న వెరైటీలు ఏంటో చూద్దామా..మాచా, జపాన్: గ్రీన్ టీ ఆకులతో ప్రాసెస్ చేసిన టీ పొడి. ఆకుపచ్చరంగులో ఉండే టీ. జపాన్‌లో ఈ టీ బాగా ఫేమస్. ఇది మట్టి రుచిని కలిగి ఉంటుంది. ముందు సిప్ చేస్తే చేదుగా ఉండి రానురాను మాధుర్యంగా ఉంటుంది. దీన్ని ఐస్డ్ టీ, ఐస్‌క్రీమ్‌లు, ఇతర డెజర్ట్‌లలో కూడా ఉపయోగించింది.టెహ్ తారిక్, మలేషియా: టెహ్ తారిక్ అనేది మలేషియా నుంచి వచ్చిన ఒక ప్రసిద్ధ వేడి పాల టీ పానీయం. సాధారణంగా నురుగుతో ఉంటుంది. 'తే తారిక్' అనే పేరుకు "తీసి తీసిన టీ" అని అర్ధం. ఈ తీపి టీలో ఉడికించిన, స్ట్రాంగ్ బ్లాక్ టీ, ఆవిరైన క్రీమర్, పాలు ఉంటాయి. మరింత రుచిగా ఉండేలా ఏలకులను కూడా జోడించవచ్చు. చా యెన్, థాయిలాండ్: చా యెన్ ఒక ప్రసిద్ధ థాయ్ ఐస్డ్ టీ. ఇది మంచి రిఫ్రెష్ నిచ్చే పానీయం. ఇది బ్లాక్ టీ, రూయిబోస్ టీ, స్టార్ సోంపు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, పాలు, పంచదారతో తయారు చేసే పానీయం. ఇది తీపి, క్రీము, సుగంధ రుచిని కలిగి ఉంటుంది. దీన్ని కొబ్బరి పాలను ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు. చా యెన్ని ఐస్‌ముక్కలతో సర్వ్ చేస్తారు.మసాలా చాయ్: భారతదేశం ఇది చాలా ఫేమస్. చాలా మంది భారతీయులు తమ రోజును ప్రారంభించేందుకు లేదా సాయంత్రం విశ్రాంతి తీసుకోనే టైంలో ఈ మసాలా చాయ్‌ని ఆస్వాదిస్తారు. ఇది బిస్కెట్లు, రొట్టెలు లేదా పకోరస్ వంటి భారతీయ స్నాక్స్‌తో కూడా బాగా జత చేస్తుంది. మసాలా చాయ్‌ని మొదటగా వేడినీటిలో ఆకుపచ్చ ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, నల్ల మిరియాలు, అల్లం, సోపు గింజలు వంటి మొత్తం మసాలా దినుసులను టీ ఆకులు వేసి బాగా మరిగిస్తారు. ఆ తర్వాత పాలు జోడించి, కావాల్సిన రంగు వచ్చేలా టీని తయారు చేసుకోవాలి. చాలా మంది ప్రజలు తమ కప్పు మసాలా చాయ్‌ను ప్రిపేర్ చేసేందుకు చక్కెర లేదా బెల్లం కూడా కలుపుతారు.సిలోన్ బ్లాక్ టీ, శ్రీలంక: సిలోన్ అనేది శ్రీలంకకు పూర్వపు పేరు, దీనిని ఇప్పటికీ టీ వ్యాపారంలో ఉపయోగిస్తున్నారు. శ్రీలంకకు చెందిన ఈ బ్లాక్ టీ స్ట్రాంగ్ రుచిని కలిగి ఉంటుంది. ఇది పూల వాసనలా ఉండి గొప్ప రంగును కలిగి ఉంటుంది. దీన్ని కూల్‌గా లేదా వెచ్చగా ఆస్వాదించవచ్చు. మీరు దీన్ని ఐస్డ్ టీ లేదా వెచ్చని బ్లాక్ టీగా ఆస్వాదించవచ్చు. -
ఇజ్రాయెల్‌కు హిజ్బుల్లా ముప్పు.. అధునాతన ఆయుధాలతో దాడులు
యుద్ధ వాతావరణం మధ్య ఇజ్రాయెల్ అట్టుడికిపోతోంది. తాజాగా లెబనీస్ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా ఉత్తర ఇజ్రాయెల్‌లోని మిలిటరీ పోస్ట్‌పై డ్రోన్, క్షిపణి దాడులను చేసింది. హిజ్బుల్లా దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ మీడియాకు తెలిపింది. హిజ్బుల్లా గత ఏడు నెలలుగా ఇజ్రాయెల్‌పై నిరంతరం దాడులకు తెగబడుతోంది. ఇజ్రాయెల్ గగనతలం నుండి హిజ్బుల్లా ఈ దాడులకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఈ దాడులలో హిజ్బుల్లా అధునాతన ఆయుధాలను ఉపయోగించిందని సమాచారం.ఇటీవలి కాలంలో హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై దాడులను తీవ్రతరం చేయడం గమనార్హం. గాజా స్ట్రిప్‌లోని దక్షిణ నగరమైన రఫాలో ఇజ్రాయెల్ చొరబాటు అనంతరం హిజ్బుల్లా ఇజ్రాయెల్ అంతర్గత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతూ వస్తోంది. గత ఏడాది అక్టోబర్ ప్రారంభం నుంచి సరిహద్దు వెంబడి హిజ్బుల్లా కాల్పులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ మధ్యలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడుల తర్వాత, హిజ్బుల్లా దాడులు తీవ్రమయ్యాయి.రఫాలో ఇజ్రాయెల్ సైనిక చర్య అనంతరం హిజ్బుల్లా ఈ విధమైన దాడులకు పాల్పడుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దూకుడు వైఖరిని అవలంబిస్తూ దాడులు కొనసాగిస్తే ఉత్తర ఇజ్రాయెల్ నివాసితులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లలేరని హిజ్బుల్లా హెచ్చరించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తున్నంత కాలం తమ బృందం పోరాడుతూనే ఉంటుందని హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా పేర్కొన్నారు. లెబనీస్ ఫ్రంట్, గాజా మధ్య సంబంధాలు స్థిరమైనవని, వాటిని ఎవరూ డీ లింక్ చేయలేరని హసన్ నస్రల్లా స్పష్టం చేశారు. -
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
బ్రెటిస్లావా: స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండగులు బుధవారం(మే15) కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దుండగులు నాలుగు రౌండ్లు జరిపిన కాల్పుల్లో ఫికో కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయింది.రాజధాని బ్రెటిస్లావాకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాండ్లోవా నగరంలోని హౌస్ ఆఫ్ కల్చర్ భవనం బయట ఫికోపై కాల్పులు జరిపారు. మద్దతుదారులతో సమావేశమైన సమయంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రధానిపై కాల్పుల ఘటనను డిప్యూటీ స్పీకర్ లుబోస్ బ్లహా ధృవీకరించారు. -
ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
అంతర్జాతీయ కుంటుబ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 15న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. నేటికాలంలో సమాజంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న ఈ నేపథ్యంలో కుటుంబాల విలువలను తెలియజేయడంకోసం ఈ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు అధికారులు. గతంలో మాదిరిగా ప్రస్తుతం ఉమ్మడి కుటుంబాలు ఉండడం లేదు. ఈ పరిణామం వల్ల ఒంటరితనం పెరిగిపోయి వ్యసనాలకు బానిసలు కావడం, పట్టించుకునేవారు లేకపోవడంతో మహిళలపై పనిభారం పెరిగి వారి ఆరోగ్యం దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని కారణంగా సమాజంలో జరిగే దుష్పరిణామాలు గ్రహించిన ఐక్యరాజ్య సమితి కుటుంబ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం 1993, మే 15ని అంతర్జాతీయ కుంటుబ దినోత్సవం ప్రకటించి వేడుకగా జరపడం ప్రారంభించింది. ఈ రోజున కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం అనే అంశాన్ని వివరిస్తూ ప్రజా చైతన్యంకోసం ప్రపంచవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేస్తారు అధికారులు. 1993 నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో ప్రతి ఏడాది ఒక అంశం థీమ్‌గా ప్రకటించి ఆ దిశగా ప్రజా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ "వాతారణ మార్పులు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుంది" అనే అంశాన్ని హైలెట్ చేశారు. ఈ థీమ్ ఉద్దేశ్యం..వాతావరణ మార్పు, కాలుష్యం కారణంగా కుటుంబాల ఆరోగ్యం, శ్రేయస్సుపై ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా దీన్ని ప్రకటించారు. అంటే తుపానులు, కరువులు, అనే వాతావరణ మార్పులు కారణంగా కుటుంబంలోని వ్యక్తులు జీవనోపాధిని కోల్పోతారు. తద్వారా ఆర్థిక పరిస్థితి వారి బాంధవ్యాలపై తీవ్ర ప్రభావం స్తుంది. కార్లమర్క్స్ చెప్పినట్లు ప్రతి బంధం ఆర్థిక సంబంధమే అన్న పదం అందరికీ స్ఫురణకు వచ్చేలా చేస్తుంది. ఈ ఒక్క వాతావరణ మార్పు మనిషి జీవన మనుగడను ప్రశ్నార్థకంగా మార్చి ఒంటిరిని చేస్తుంది. అందువల్ల ప్రతిఒక్కరూ ఈ వాతావరణ మార్పలు కోసం తమ వంతుగా బాధ్యత తీసుకుని వ్యర్థాలను తగ్గించి మంచి అలవాట్లతో వాతావరణాన్ని కాపాడుకునే యత్నం చేయాలి. ప్రతి కుటుంబం విద్యతోనే బలోపేతం కాగలదని గ్రహించాలి. సహజ వనురులను పునరుత్పత్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. వాతావరణాన్ని ఎంత ఆహ్లాదభరితంగా ఉంచుకుంటే అంతలా మను కుంటుంబాలు, గృహాలు పచ్చగా పదికాలాలు ఉంటాయని చెప్పడమే ఈ ఏడాది థీమ్ ముఖ్యోద్దేశం. అంతేగాదు ఈ ఏడాది 30వ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, కుటుంబ విలువలను హైలెట్ చేసేలా ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించేలా చాల చక్కగా థీమ్‌ని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్యసమితి. అంతేగాదు ఈ రోజు కుటుంబ (చదవండి: నాసా ఏరో స్పేస్ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!) -
ప్రపంచం మెచ్చిన ఏపీ విద్య
నానాజీ అంకంరెడ్డి, సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణలు, పథకాలపై అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యను అత్యంత ప్రాధాన్యత రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యలో దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని సంస్కరణలకు తెరతీసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదింటి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య అందిస్తూ ప్రపంచ స్థాయి పౌరులుగా తీర్చిదిద్దుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాసంస్కరణలపై ప్రపంచవ్యాప్తంగా మేధావులు, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు అభినందనల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు రాష్ట్రానికి వచ్చి ఇక్కడి విద్యా సంస్కరణలు, పథకాల తీరుతెన్నులను పరిశీలించి వెళ్లారు. తమ దేశాల్లోనూ వాటిని అమలు చేస్తామని చెప్పడం ఏపీ విద్యకు అంతర్జాతీయంగా దక్కిన గుర్తింపునకు నిదర్శనం. ఇలా ఏపీ విద్యా సంస్కరణలకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తుంటే చంద్రబాబు మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను వారికి దూరం చేయాలని కుట్రలు పన్నుతోంది. నాణ్యమైన విద్యే మార్గం..‘పేదరికాన్ని జయించాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ఒక్కటే మార్గం. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. అన్ని దేశాలు దీన్ని అంగీకరించాలి. దీన్ని ఐదేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయడం గొప్ప ముందడుగు’.. స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి ఇగ్నాజియో క్యాసిస్ ఇచ్చిన కితాబు ఇది. గతేడాది ఫిబ్రవరిలో జెనీవాలో ‘ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ అంశంపై మాట్లాడిన ఇగ్నాజియో.. ఏపీలో సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన విద్యా పథకాలు చాలా బాగున్నాయని కొనియాడారు. కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ప్రపంచాన్ని ప్రగతి వైపు నడిపించే విద్యా బోధన, సంస్కరణలను ఏపీ అమలు చేయడం గొప్ప ముందడుగని పేర్కొన్నారు. అలాగే కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్ జెఫ్రీ సాచ్ ఏపీ విద్యా విధానంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఏపీలో గ్లోబల్ విద్యా విధానం అనుసరించడం, పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం గొప్ప అంశంగా పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మ ఒడి, డిజిటల్ విద్య, ట్యాబ్స్ పంపిణీ, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు, టోఫెల్ శిక్షణ భవిష్యత్ తరాలకు ఎంతో అవసరమన్నారు. తాజాగా పలువురు అంతర్జాతీయ సంస్థల ప్రతిని«దులు సాక్షి ప్రతినిధితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు.ప్రపంచ పౌరులుగా పేద విద్యార్థులు..పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రయాణాన్ని ప్రారంభించింది. విద్యావ్యవస్థలో అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేయడం పేద పిల్లలకు దక్కిన గొప్ప గౌరవం. విద్యా సాధనలో అట్టడుగు స్థాయిల్లో ఇలాంటి సంస్కరణలనే కోరుకుంటున్నాం.స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఐక్యరాజ్యసమితి కార్యాలయం అట్టడుగు స్థాయిలో నాణ్యమైన, సమగ్ర విద్యను అందించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వాలకు ప్రాధాన్యతనిస్తోంది. ఏపీ ప్రభుత్వం నాడు–నేడు పథకం కింద విద్యకు ఇచ్చిన ప్రాధాన్యతను అభినందిస్తున్నా. – లిడియా గ్రిగొరెవా, చీఫ్ ఆఫ్ క్యాబినెట్, యూఎన్వో డైరెక్టర్ జనరల్ ఆఫీస్, జెనీవా ఏపీ పాఠశాలల్లో మార్పులను చూసి ఆశ్చర్యపోయా కంపారిటివ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీలో దక్షిణాసియా స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) చైర్‌గా నేను భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న మార్పులను చూసి ఆశ్చర్యపోయాను. గతేడాది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కొలంబియా విశ్వవిద్యాలయంలో వ్యక్తిగతంగా మాట్లాడాను. ఏపీలో విద్యావ్యవస్థ, మౌలిక సదుపాయాల గురించి వారు అనర్గళంగా వివరించారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా విద్యార్థులతో పోటీపడుతూ మాట్లాడారు. ఐఎఫ్‌పీలు, స్మార్ట్ బోర్డులు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీని వినియోగించడం నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ మార్పులతో ఏపీ విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తారు. – రాధిక అయ్యంగార్, సెంటర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ డైరెక్టర్, కొలంబియా యూనివర్సిటీ, న్యూయార్క్‌ప్రపంచ అవసరాలకు తగ్గట్టు ఏపీ విద్యార్థులుఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ప్రత్యేకంగా ఆకర్షించింది. అట్టడుగు వర్గాల విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ అందించినందుకు ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఏపీ విద్యార్థులు ప్రపంచ అవసరాలకు తగ్గట్టు మారుతున్నారు. ఇది ప్రపంచాన్ని సరికొత్తగా అర్థం చేసుకునేందుకు, పరస్పరం సహాయానికి, భవిష్యత్‌ను అద్భుతంగా మార్చుకునేందుకు దోహదం చేస్తుంది.బాలికల డ్రాపవుట్లను నియంత్రించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 10 లక్షల మంది బాలికలకు ఉచిత బ్రాండెడ్ శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేసింది. అంతేకాకుండా రన్నింగ్ వాటర్ సదుపాయంతో మరుగుదొడ్లను నిర్మించింది. యుక్త వయసు బాలికల సమస్యలను పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నాను. – దివ్యాన్షి వాధ్వా, ప్రపంచ బ్యాంక్ డేటా సైంటిస్ట్, వాషింగ్టన్ఏపీలో విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యఆకలిని, పేదరికాన్ని జయించాలంటే మొదట విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే చేస్తోంది. అణగారిన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తోంది. నైపుణ్య శిక్షణ అనేక మంది పేద విద్యార్థుల జీవితాలను మారుస్తోంది.దీనిద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలను, వేతనాలను పొందగలరు. ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం సమకాలీన ప్రపంచ సవాళ్లను అధిగమించి అవకాశాలను అందుకునేదిగా ఉంది. ప్రీ–స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు చేసిన మార్పులతో నాణ్యమైన విద్యాభివృద్ధిని సాధిస్తుంది. – రజనీ ఘోష్, బ్యూరో ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఆసియన్ ఎఫైర్స్ ఇండియా డెస్క్ ఆఫీసర్, అమెరికా ప్రభుత్వంకార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలునా చిన్నప్పటికి, ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్య చాలా అభివృద్ధి చెందింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్ విద్య, విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌లు, ఇంగ్లిష్ మీడియం బోధన వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఈ అంశాల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారడం గర్వకారణం.ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలుతో ప్రతిభ గల నాణ్యమైన విద్యార్థులను బయటకు తీసుకురావచ్చు. పేద విద్యార్థులకు ఆంగ్లంలో మంచి నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారు అంతర్జాతీయ విద్యాసంస్థల్లో రాణించేందుకు మార్గం సుగమమవుతుంది. పేద విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. – ఉపేందర్‌రెడ్డి గాదె, విజ్డమ్ టెక్ సొల్యూషన్స్ డైరెక్టర్, సిడ్నీ, ఆస్ట్రేలియాఆంధ్రప్రదేశ్లోనే ఇంత గొప్ప మార్పు..ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణలను ప్రభుత్వ విద్యార్థులే నేరుగా ఐక్యరాజ్యసమితిలో వివరించారు. దేశ చరిత్రలోనే ఇంత గొప్ప మార్పును ఏపీలో చూస్తున్నామని ప్రపంచ దేశాల ప్రతినిధులు అభినందించారు. కొలంబియా యూనివర్సిటీలో మన విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్‌లో మాట్లాడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.స్టాన్‌ఫర్డ్, కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్, జెనీవా యూనివర్సిటీ, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ గర్ల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ స్కూల్స్ ఫోరమ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ ఇన్‌క్లూజన్ వంటి వాటిలో గత ఐదేళ్లుగా ఏపీ విద్య సంస్కరణలపై చర్చ జరుగుతోంది. ప్రతిచోటా ఏపీ విద్యకు ప్రశంసలు లభిస్తున్నాయి. – ఉన్నవ షకిన్ కుమార్, ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ సభ్యుడు -
విశాఖ డ్రగ్స్: అంతర్జాతీయ లింకులపై సీబీఐ ఆరా.. బ్రెజిల్‌కు స్పెషల్ టీంలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులపై ఆరా తీస్తోంది. ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయి. డ్రగ్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులు ఛేదించే దిశగా సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డ్రై ఈస్ట్ సప్లయ్ చేసిన ఐసీసీ బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోంది. ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, ఈ మెయిల్స్, వాట్స్ అప్ చాటింగ్స్ ద్వారా కొంత మేర సమాచారం లభించింది. నార్కోటిక్స్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తు బృందం ఎదురు చూస్తోంది. సంచలనం రేకెత్తిచిన కేసులో డ్రగ్స్ నిర్ధారణ కోసం వివిధ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఆధారాలను సీబీఐ సేకరించింది. సంధ్య ఆక్వా ప్రతినిధుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. కాగా, తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్ బ్యాగుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటా, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా సీబీఐ ఫోకస పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. -
ముందు ఉట్టి కొడదాం!
'ఉట్టి కొట్టలేనమ్మ.. స్వర్గానికి నిచ్చెనలు వేసింది' అన్న చందంగా, భూమిపై బతకడం చేతకాని మనిషి అంతరిక్షంలో కాలనీలు కట్టి కాపరం చేస్తానంటున్నాడు. ఆ దిశగా ఆధునిక మానవుడు పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాడు. కానీ, అది అంత తేలిక కాదు, పైగా మనిషిని మనిషే చంపుకొని తినే దారుణమైన పరిస్థితులు వస్తాయని కొందరు శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. కరోనా వంటి ఊహాతీతమైన వ్యాధులు వచ్చి, మనిషిని పట్టి పీడిస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎటువంటి వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని మనిషి భయపడుతూనే ఉన్నాడు. కొత్త కొత్త వైరస్లు పుట్టుకొస్తూ వుంటే శాస్త్రవేత్తలు సైతం కంగారుపడిపోతున్నారు. సామాన్య మానవులు బెంబేలెత్తి పోతున్నారు. ఇది ఇలా ఉంటుండగానే, భూమి నుంచి దూరంగా వెళ్ళి, వేరే స్పేస్ లో జీవించవచ్చు అనే విశ్వాసాన్నీ పెంచుకుంటున్నాడు. ఇది కొత్తగా పుట్టిన కోరిక కాదు. ఎప్పటి నుంచో మనిషి ఆలోచిస్తున్నాడు. కరోనా కాలానికి ముందే కొందరు శాస్త్రవేత్తలు అంతరిక్ష జీవనాన్ని ప్రచారంలోకి తెచ్చారు. సాధ్యాసాధ్యాలపై ఇంకా విస్తృతంగా అధ్యాయనాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త ప్రపంచంలోకి అడుగు పెడదాం, కొత్త లోకాల్లో విహరిద్దాం అని మనిషి ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు. భూమిపై ఏదైనా విపత్తు వచ్చినా, పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు, వనరులు సరిపోకపోయినా.. పైకెళ్లి జీవించాలనే ఆలోచనలకు శాస్త్రవేత్తలు మరింత పదునుపెడుతున్నారు. అంగారక గ్రహం లేదా చంద్రమండలంపై కాలనీలు నిర్మంచి జీవించవచ్చు అని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు కూడా! భూమి నుంచి ఆహారాన్ని పంపించే పరిస్థితులపైనా దృష్టి సారిస్తున్నారు. ఇవ్వన్నీ సాధించడానికి సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందేనని అర్థం చేసుకోవాలి. ఆ మధ్య ఎడిన్ బర్గ్ యూనివర్సిటీకి చెందిన చార్లెస్ కొకెల్ కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. పాత విషయాలను కొన్నింటిని గుర్తు చేశారు. నిజంగా భూమి నివాసయోగ్యం కానప్పుడు అంతరిక్షం వైపు చూడవచ్చు. కానీ, దానిని సాధించాలంటే ఇంకా ఎన్నో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెబుతున్నారు. 19వ శతాబ్దంలో నార్త్ వెస్ట్ పాసేజ్‌ను వెతకాడానికి కెప్టెన్ సర్ జాన్ ఫ్రాంక్లిన్ బయలుదేరారు. సాంకేతిక సమస్య తలెత్తడంతో దారి తప్పారు. అత్యుత్తమ సాంకేతికత అందుబాటులో ఉన్నా, వారంతా ఒకరినొకరు చంపుకుతినే దారుణమైన దుస్థితి వచ్చిందని ప్రొఫెసర్ చార్లెస్ కొకెల్ గుర్తుచేస్తున్నాడు. అంతరిక్షంలో కూడా అటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. వనరులు, వసతులతో పాటు ఆహారకొరత ప్రధాన సమస్యగా నిలుస్తుందని ఆయన భావిస్తున్నాడు. డాక్టర్ కామెరన్ స్మిత్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అంతరిక్షంలో మానవ మనుగడ వేళ్లూనుకోవాలంటే? వ్యవసాయ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఎడిన్ బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు. గ్రహాంతర వాసులకోసం వెతుకులాట కూడా ఇప్పటికే మొదలైంది. అంతరిక్షంలోకి వెళ్లబోయే ముందు, ఈ భూమిని పవిత్రంగా, పచ్చగా కాపాడుకోవడం ముఖ్యం. స్వార్థం శృతి మించి, కోరికలు, విలాసాలు ఆకాశాన్ని అంటిన ఆధునిక మానవుడు సహజ వనరులను ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నాడు. తత్ఫలితంగా అడువులు అంతరించి పోతున్నాయి, జీవనదులు ఇంకిపోతున్నాయి. భూమి క్రుంగిపోతోంది, సముద్ర మట్టాలు పెరిగి పోతున్నాయి. అగ్ని గోళాలు బద్ధలై పోతున్నాయి. ఒక్కటేమిటి? విశ్వరూపమే మారిపోతోంది. ప్రకృతిని అందినకాడికి అంతం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో రుతువుల గమనం మారిపోయింది. భూమి వేడెక్కిపోతోంది. అతివృష్టి అనావృష్టి, ప్రకృతి వైపరీత్యాలు ప్రబలి పోయాయి. ఆణువణువూ కాలుష్య కాసారంగా మారింది. పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం అంతా కలుషితమై పోయింది. ఇంటాబయటా అంతా కాలుష్యమే. దీనికి ముందుగా మనిషి మనసే అత్యంత కలుషితమై పోయింది. అందుకే, కొంగ్రొత్త వింత వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. మంచినీరే కాదు, మంచిగాలి కూడా కొనడానికి కూడా దొరకని దుస్థితి వచ్చేసింది. పల్లెల ముఖచిత్రం మారిపోయింది. చేతివృత్తులు ఎగిరిపోయాయి. వ్యవసాయ విధానమే మారిపోయింది. ఆహారరక్షణపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతరిక్షానికి ఆహార సరఫరా సంగతి తర్వాత చూద్దాం. ముందుగా, భూమిపై పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార ఉత్పత్తి జరగడమే ప్రమాదంలో పడింది. ఆధునిక మానవుడు ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మమై పోతోంది. భూమిని పాడుచెయ్యడమే కాక, గ్రహాలను సైతం పాడు చెయ్యడానికి మనిషి తయారవుతున్నాడని కొందరు శాస్త్రవేత్తలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో, కరోనా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలకుండా చూడడం శాస్త్రవేత్తల ప్రథమ కర్తవ్యం. ప్రకృతిని, భూభాగాన్ని రక్షించుకోవడం మానవాళి ప్రాథమిక అవసరం. సహజ వనరులను నిలబెట్టు కోవడం అత్యంత ముఖ్యమైన అంశం. వీటన్నిటిపై దృష్టి సారించడమే అందరి తక్షణ కర్తవ్యం. సమాంతరంగా అంతరిక్ష పరిశోధనలు కొనసాగించుకోవచ్చు. అన్నింటి కంటే ముందుగా, మంచి వైపు మనిషి మారితే? అంతా మంచే జరుగుతుందని విశ్వసిద్దాం. - మాశర్మ -
ధ్యానంతోనే విశ్వశాంతి
నందిగామ/శంషాబాద్ (హైదరాబాద్): ప్రపంచ శాంతికి ధ్యానం ఒక్కటే మార్గమని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఆధ్యాత్మిక సమ్మేళనం ఆదివారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. హార్ట్ఫుల్నెస్ సంస్థ గురూజీ కమ్లేష్ పటేల్ (దాజీ)కు కామన్వెల్త్ ఆధ్వర్యంలో గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ అవార్డు రావడం ఆనందకరమన్నారు. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ మాట్లాడుతూ.. దాజీ 160 దేశాల్లో 16 వేల మంది వలంటీర్లు, 5 వేల కేంద్రాల్లో 5 మిలియన్లకు పైగా అభ్యాసీలను కలిగి ఉండటం ప్రపంచ స్థాయిలోనే గొప్ప విషయమని ప్రశంసించారు. ఆయన సేవలను గుర్తించి ‘గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్’ అవార్డు అందజేస్తున్నందుకు సంతోషిస్తున్నామని చెప్పారు. కమ్లేష్ పటేల్ (దాజీ) మాట్లాడుతూ.. తనకు కామన్వెల్త్ ఆధ్వర్యంలో అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతకుముందు అధ్యాత్మికవేత్తలు ధ్యానం చేశారు. కార్యక్రమంలో ప్రపంచ మత పెద్దల మండలి సెక్రటరీ జనరల్ భావాజైన్, సైంటిస్ట్ డాక్టర్ రోలీన్ మెక్క్రాటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్సియె ఎస్ బీయింగ్ వ్యవస్థాపకుడు డాక్టర్ జోసెఫ్ బెంటన్ హోవెల్ పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి దంపతులకు వీడ్కోలు ఆధ్యాత్మిక సమ్మేళనంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి దంపతులు జగదీప్ ధన్‌ఖడ్, సుధేష్ ధన్‌ఖడ్‌లు తమ పర్యటన ముగించుకుని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారిద్దరికీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గవర్నర్ తమిళి సై, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఘనంగా వీడ్కోలు పలికారు. -
నకిలీ మందుల ముఠా గుట్టు రట్టు!
దేశరాజధాని ఢిల్లీలో నకిలీ మందులను తయారు చేస్తున్న అంతర్జాతీయ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసులో ప్రముఖ క్యాన్సర్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు ఉద్యోగులతో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు రూ.1.96 లక్షల విలువైన క్యాన్సర్‌కు సంబంధించిన నకిలీ ఇంజెక్షన్లను విక్రయించారు. చైనా, అమెరికా తదితర దేశాలకు కూడా వీరు క్యాన్సర్ నకిలీ మందులను పంపారు. నిందితుల వద్ద నుంచి రూ.4 కోట్ల విలువైన రూ.89 లక్షల నగదు, రూ.18 వేల డాలర్లు, ఏడు అంతర్జాతీయ, రెండు భారతీయ బ్రాండ్లకు చెందిన క్యాన్సర్ నకిలీ మందులను క్రైమ్ బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది. స్పెషల్ సీపీ క్రైమ్ బ్రాంచ్ షాలినీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం మూడు నెలల విచారణ అనంతరం పోలీసుల దర్యాప్తు బృందం ఈ ముఠాను పట్టుకోగలిగింది. ఈ కేసులో దర్యాప్తు కోసం పోలీసుల బృందం ఢిల్లీ ఎన్సీఆర్లో ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు చేసింది. విఫిల్ జైన్ నకిలీ మందుల రాకెట్‌కు సూత్రధారిగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. ఇతనికి చెందిన ఇళ్ల నుంచి మూడు క్యాప్ సీలింగ్ మిషన్లు, ఒక హీట్ గన్ మెషీన్ మొదలైనవాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని క్యాన్సర్ ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు కోమల్ తివారీ, అభినయ్ కోహ్లీలను కూడా ఈ కేసులో అరెస్టు చేశారు. -
ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. మారణాయుధాలు స్వాధీనం!
బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్లు, 30 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై యూఏపీఏ, ఆయుధ చట్టం కింద అమృత్‌సర్‌లోని రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్లో కేసు నమోదు చేశారు. అమెరికాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పసియాన్, ఉగ్రవాది హర్విందర్ సింగ్ అలియాస్ రిండా, అర్మేనియాకు చెందిన షంషేర్ సింగ్ అలియాస్ షేరాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం హ్యాపీ పసియాన్, రిండా, షంషేర్‌లు పంజాబ్‌లోని యువతను దేశ వ్యతిరేక కార్యకలాపాల దిశగా పేరేపిస్తున్నారు. హర్‌ప్రీత్ సింగ్, హర్విందర్ సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. In an intelligence-based operation, Punjab Police averts possible target killings with the arrest of 2 members of Babbar Khalsa International (BKI)-backed terror module The module was operated by #USA based Harpreet Singh @ Happy Passian, a close aide of #Pakistan based… pic.twitter.com/Ab9FNk2xtf — DGP Punjab Police (@DGPPunjabPolice) March 7, 2024 -
సముద్ర వాణిజ్యంలో భద్రతా సవాళ్లను అధిగమిద్దాం
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్లూ ఎకానమీలో మారీటైమ్ డొమైన్ కీలకంగా వ్యవహరిస్తోందనీ.. 2047 నాటికి భారత్ పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా.. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలోని సాముద్రిక ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మారిటైమ్ సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథి ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ మహా సముద్రాలంతటా దేశాల మధ్య సహకారం, అభివృద్ధికి వేదికగా మిలాన్ మారిందన్నారు. దేశ చరిత్రలో కీలకంగా వ్యవహరిస్తూ సముద్ర భద్రతలో, భారతదేశ సముద్ర చరిత్రలో కీలకమైన పాత్రను పోషించిన ఈస్టర్న్ నేవల్ కమాండ్‌లో మిలాన్‌తో పాటు ఇంటర్నేషనల్ సెమినార్ నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, వివిధ దేశాలతో భాగస్వామ్యాలు, సహకారంతో సాగర జలాల్లో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో మన దేశం పెద్దన్న పాత్ర పోషిస్తోందన్నారు. సముద్ర వాణిజ్యంలో భద్రత సవాళ్లను కలిసికట్టుగా అధిగవిుంచాలని పిలుపునిచ్చారు. ఇండో పసిఫిక్ జలాల్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం ఎంతో అవసరమని, ఇందుకోసం భద్రత, సుస్థిరతను నిర్ధారించడానికి దేశాలు కలిసివచ్చి.. సహకార వ్యూహాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని ఉప రాష్ట్రపతి ధన్కర్ చెప్పారు. సదస్సులో నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, వివిధ దేశాల నౌకాదళ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకు ముందు మిలాన్–2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు ఐఎన్ఎస్ డేగాలో నాయకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మేయర్ హరివెంకటకుమారి, తూర్పు నావికాదళాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యే గణబాబు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, అడిషనల్ డీజీ(గ్రేహౌండ్స్) ఆర్కే మీనా తదితరులున్నారు. -
WINGS INDIA 2024: 20 ఏళ్లలో 2,840 విమానాలు కావాలి
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఏవియేషన్ రంగానికి భారత్ దన్నుగా నిలుస్తుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్ రెమి మిలార్డ్ తెలిపారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌కు వచ్చే 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు అవసరమన్నారు. అలాగే 41,000 మంది పైలట్లు, 47,000 మంది టెక్నికల్ సిబ్బంది కావాల్సి ఉంటుందని గురువారం వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంలో ఆయన చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనాలు ఉన్నట్లు రెమీ తెలిపారు. భారత్ నుంచి రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు రెమీ వివరించారు. ప్రస్తుతం 750 మిలియన్ డాలర్లుగా ఉన్న సోర్సింగ్‌ను ఈ దశాబ్దం చివరికి 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. భారత్ నుంచి గతేడాది 750 విమానాలకు ఆర్డర్లు రాగా 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లను దేశీ విమానయాన సంస్థలకు డెలివరీ చేసినట్లు వివరించారు. వీటిలో 41 విమానాలు ఇండిగో సంస్థకు, ఎయిరిండియాకు 19, విస్తారాకు 14, గో ఫస్ట్‌కు ఒకటి చొప్పున అందించినట్లు రెమీ చెప్పారు. తమ ఏ350 రకం విమానాలు భారత్‌లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఊతమివ్వగలవని పేర్కొన్నారు. గతేడాది ఎయిరిండియాకు ఆరు ఏ350 విమానాలను అందించినట్లు చెప్పారు. భారత్‌లో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవరాలింగ్ వ్యవస్థ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా హైలైట్స్ ► హెరిటేజ్ ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ చార్టర్ కంపెనీ హెరిటేజ్ ఏవియేషన్ తాజాగా హెచ్125, హెచ్130 హెలికాప్టర్ల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డరు ఇచి్చంది. వీటిని ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్ కింద సరీ్వసుల కోసం ఉపయోగించనున్నట్లు సంస్థ సీఈవో రోహిత్ మాథుర్ తెలిపారు. ఎత్తైన, వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణాల్లో ప్రయాణాలకు హెచ్125 హెలికాప్టర్ ఉపయోగపడుతుంది. ఇక సైట్ సీయింగ్, అత్యవసర వైద్య సరీ్వసులు మొదలైన వాటి కోసం హెచ్130 సహాయకరంగా ఉంటుంది. ► ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. జీఎంఆర్ ఏరో జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్ స్కూల్ వర్చువల్‌గా ప్రారంభం. టీఏఎస్ఎల్ విడిభాగాల తయారీకై మహీంద్రా ఏరోస్పేస్తో కలిసి ఎయిర్‌బస్ నుంచి ఆర్డర్లను పొందింది. -
పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
PhonePe: కొత్త సీఈవోను ప్రకటించిన ఫోన్‌పే
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అంతర్జాతీయ విస్తరణపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రితేష్ పాయ్‌ను తమ ఇంటర్నేషనల్ పేమెంట్స్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. ఫోన్‌పేలో చేరిన రితేష్ పాయ్.. యూకేకి చెందిన టెర్రాపే (TerraPay)లో ప్రాడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ విభాగానికి ప్రెసిడెంట్‌గా పనిచేసేవారు. యస్ బ్యాంక్‌లో సీనియర్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ డిజిటల్ ఆఫీసర్‌గా కూడా పనిచేసిన ఆయన అక్కడ బ్యాంక్ డిజిటల్ వ్యూహానికి నాయకత్వం వహించారు. రితేష్ పాయ్ చేరికపై ఫోన్‌పే చీఫ్, వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ అంతర్జాతీయ వృద్ధి ప్రణాళికలకు నాయకత్వం వహించడానికి రితేష్ మాతో చేరినందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫోన్‌పే 2015 డిసెంబర్లో ఏర్పాటైంది. ఆ తర్వాత దీన్ని ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసి వాలెట్‌గా రీబ్రాండ్ చేసింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. యూపీఐ యాప్‌ను ప్రారంభించిన మూడు నెలల్లోనే కోటి మంది యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 2018లో గూగుల్ ప్లేస్టోర్‌లో ఐదు కోట్ల బ్యాడ్జ్‌ని పొందిన అత్యంత వేగవంతమైన భారతీయ చెల్లింపు యాప్‌గా ఫోన్‌పే నిలిచింది. -
ఏపీ వర్సిటీల్లో అంతర్జాతీయ కోర్సులు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యలో అంతర్జాతీయ యూనివర్సిటీల కోర్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై సమగ్ర అవగాహన కల్పించేలా ఉన్నత విద్యామండలి రూపొందించిన ‘కెరీర్ టూల్ కిట్’ ఆన్లైన్ టీచింగ్ ప్రోగ్రామ్‌ను ఆయన మంగళవారం విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలోని యూనివర్సిటీలు ప్రపంచ వ్యాప్తంగా టాప్ 50 (సబ్జెక్టుల వారీగా) విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేసేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. తద్వారా విదేశాలకు వెళ్లి చదువుకోలేని ఎందరో విద్యార్థులు ఎంఐటీ, హార్వర్డ్ వంటి ప్రఖ్యాత వర్సిటీలు అందించే సుమారు 2 వేల కోర్సులను ఆన్లైన్లో చదువుకునే వెసులుబాటు కల్పింస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలోనే విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా చదువులు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తోందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం కంటే ముందుగానే ఏపీ విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగా ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశామన్నారు. తాజాగా తొలిసారిగా స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ను ఇచ్చేలా అనేక కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. ఉన్నత విద్యామండలి 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు మేలు చేస్తూ ప్రతి సెమిస్టర్లో విభిన్న అంశాల్లో మార్గనిర్దేశం చేసేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకురావడం అభినందనీయమన్నారు. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్, నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిందన్నారు. వాటి ఫలితాలే ఇండియా స్కిల్ రిపోర్టులో ఏపీని అగ్రగామిగా నిలబెట్టాయన్నారు. సెమిస్టర్ల వారీగా కెరీర్ గైడెన్స్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు సెమిస్టర్ల వారీగా కార్యాచరణ ప్రణాళిక అందించడం, ఎంచుకున్న రంగాల్లో నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ పెంపుపై ‘కెరీర్ టూల్‌కిట్’ మెంటార్‌గా నిలుస్తుందన్నారు. విద్యా ప్రయాణంలో ప్రతి దశలో విద్యార్థులకు వ్యక్తిగత మార్గదర్శకంగా పని చేసేలా 19 రకాల కెరీర్ టూల్ కిట్లను రూపొందించామని తెలిపారు. దేశంలో ఏ యూనివర్సిటీ, విద్యామండలి చేయని విధంగా విద్యార్థి కోర్సులో చేరినప్పటి నుంచి పూర్తి చేసి బయటకు వెళ్లేంత వరకు జాబ్, రీసెర్చ్ ఓరియంటేషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఆర్థిక క్రమశిక్షణ, సామాజిక దృక్పథాన్ని పెంపొందించేలా ‘కెరీర్ టూల్ కిట్’ను తీసుకొచ్చామన్నారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్లు రామ్మోహనరావు, ఉమా మహేశ్వరిదేవి, సెక్రటరీ నజీర్ అహ్మద్, సెట్స్ స్పెషల్ ఆఫీసర్ సు«దీర్‌రెడ్డి పాల్గొన్నారు. -
2024 కొత్త కొత్తగా వెల్కమ్
చూస్తూండగానే నూతన సంవత్సరం వచ్చేసింది. 2024కు గ్రాండ్‌గా వెల్కం చెప్పేందుకు అంతా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే కొన్ని దేశాల వారు కొత్త ఏడాదిని స్వాగతిస్తూ పార్టీ మూడ్‌లో ఉంటే.. మరికొన్ని దేశాల వారు ఇంకా రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు. అంతర్జాతీయ టైమ్ జోన్ల ప్రకారం.. ప్రపంచంలో మొట్టమొదటగా న్యూజిలాండ్ సమీపంలోని కిరిబతి దీవుల వారికి నూతన సంవత్సరం మొదలవుతుంది. తర్వాత న్యూజిలాండ్, ఆ్రస్టేలియా స్వాగతం పలుకుతాయి. ఇదే సమయంలో పలు దేశాల్లో ఇంకా డిసెంబర్ 31వ తేదీనే మొదలవుతూ ఉంటుంది. మరి ఇలా ఏయే దేశాలు కొత్త సంవత్సరానికి ముందుగా వెల్కం చెప్తాయో చూద్దామా.. ► ప్రపంచంలో మొదట పసిఫిక్ మహాసముద్రంలోని దీవులైన కిరిబతిలో నూతన సంవత్సరం మొదలవుతుంది. మన దేశంలో డిసెంబర్ 31న మధ్యాహ్నం 3.30 గంటలు అవుతున్న సమయంలోనే.. కిరిబతిలో అర్ధరాత్రి 12.00 గంటలు దాటేసి జనవరి 1 మొదలైపోయింది. మన దేశ సమయంతో పోల్చి చూస్తే, కొన్ని దేశాల్లో ఎప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతుందంటే.. ►న్యూజిలాండ్.. మనకు సాయంత్రం 4.30 ►ఆ్రస్టేలియా.. మనకు సాయంత్రం 6.30 ►జపాన్, దక్షిణ కొరియా.. మనకు రాత్రి 8.30 ►చైనా, మలేషియా, సింగపూర్.. మనకు రాత్రి 9.30 ►థాయిలాండ్, వియత్నాం.. మనకు రాత్రి 10.30 ►యూఏఈ, ఒమన్.. మనకు జనవరి 1 వేకువజాము1.30 ► గ్రీస్, దక్షిణాఫ్రికా, ఈజిప్‌్ట.. మనకు వేకువజామున 3.30 ►జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, మొరాకో, కాంగో.. మనకు జనవరి 1 తెల్లవారుజామున 4.30 ►యూకే, ఐర్లాండ్, పోర్చుగల్.. మనకు వేకువన 5.30 ►బ్రెజిల్, అర్జెంటీనా.. మనకు జనవరి 1 ఉదయం 8.30 ►ప్యూర్టోరికో, బెర్ముడా, వెనెజువెలా.. మనకు జనవరి 1 ఉదయం 9.30 ►అమెరికా తూర్పుతీర రాష్ట్రాలు, పెరూ, క్యూబా.. మనకు జనవరి 1 ఉదయం 10.30 ►మెక్సికో, కెనడా, అమెరికా మధ్య రాష్ట్రాలు.. మనకు జనవరి 1 ఉదయం 11.30 ►అమెరికా దక్షిణ తీర రాష్ట్రాలు (లాస్ ఎంజిలిస్, శాన్ఫ్రాన్సిస్కో..).. మనకు జనవరి 1 మధ్యాహ్నం 1.30 ►హవాయ్.. మనకు 1న మధ్యాహ్నం ఉదయం 3.30 ►సమోవా దీవులు.. మనకు జనవరి 1 సాయంత్రం 4.30 ►బేకర్, హౌలాండ్ దీవులు.. మనకు 1న సాయంత్రం 5.30 సమీపంలోనే ఉన్నా.. ఓ రోజు లేటు.. వివిధ దేశాలు చాలా విస్తీర్ణంలో ఉన్నా.. ఏదో ఒక సమయాన్ని మొత్తం దేశానికి పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ దేశాల్లో ఒక చివరన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక కొన్ని గంటల తర్వాతగానీ మరో చివరన ఉన్న ప్రాంతాల్లో తెల్లవారదు. ఇలా వివిధ దేశాల ఆదీనంలో ఉన్న ప్రాంతాల్లో ఆయా దేశాల సమయాన్నే పాటించే క్రమంలో.. సమీపంలోనే ఉన్న ప్రాంతాల్లో కూడా వేర్వేరు తేదీలు, సమయం ఉంటుంటాయి కూడా. ►దీనివల్ల పసిఫిక్ మహా సముద్రం మధ్యలో ఉండే అంతర్జాతీయ డేట్లైన్ కూడా మెలికలు తిరిగి ఉంటుంది. ►మామూలుగా అయితే.. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందే రోజు మారిపోయే కిరిబతి దీవులకన్నా రెండు గంటలు ఆలస్యంగా సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో అదే తేదీ, రోజు ఉండాలి. కానీ అమెరికా అధీనంలో ఉన్న ఈ దీవుల్లో ఆ దేశ సమయాన్ని పాటిస్తారు కాబట్టి.. అవి మొత్తంగా ఒక రోజు వెనకాల ఉంటాయి. ►ఉదాహరణకు కిరిబతిలో సోమవారం ఉదయం 8 గంటలు అవుతుంటే.. దానికన్నా రెండు గంటల తర్వాత సూర్యోదయం అయ్యే బేకర్, హౌలాండ్ దీవుల్లో మాత్రం ఆదివారం ఉదయం 6 గంటల సమయమే ఉంటుంది. ►ఈ కారణంతోనే ప్రపంచంలో అన్ని ప్రాంతాలకన్నా చివరిగా.. ఈ దీవుల్లో కొత్త సంవత్సరం మొదలవుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
A టు Z ఇయర్ ఎండర్
కరువులు. కల్లోలాలు. కొట్లాటలు. కన్నీళ్లు... క్లుప్తంగా చెప్పుకుంటే ప్రపంచానికి 2023 ప్రధానంగా మిగిల్చిన గుర్తులివే! 2022లో ఉక్రెయిన్‌పై రష్యా మొదలు పెట్టిన ఆక్రమణ 2023 పొడవునా పడుతూ లేస్తూ కొనసాగింది. ఇది చాలదన్నట్టు ఏడాది చివర్లో ఇజ్రాయెల్ దండయాత్ర పాలస్తీనాలో కనీవినీ ఎరగని మానవీయ సంక్షోభానికి కారణమైంది. లక్షలాది మంది ఆకలి కేకలు ఐరాస సామర్థ్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తాయి. అంతర్జాతీయ సమాజంలో మానవీయ స్పందన కరువైన తీరును కళ్లకు కట్టాయి. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అటు కరువు, ఇటు వరదలతో అతలాకుతలమయ్యాయి. భూతాపోన్నతి ఒకానొక దశలో 2 డిగ్రీల లక్ష్మణరేఖను దాటేసి ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును మరోసారి గుర్తు చేసింది. ఏదో ఒక రూపంలో అడపాదడపా తలెత్తుతున్న కరోనా ఏడాది ముగుస్తుండగా కొత్త వేరియంట్ రూపంలో మరోసారి గుబులు పుట్టిస్తోంది. చంద్రయాన్, జీ20 సదస్సు నిర్వహణ వంటివి భారత కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ వేదికపై మరింతగా చాటాయి. 2023 త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్‌లోనూ, అంతర్జాతీయంగానూ జరిగిన ప్రధాన సంఘటనలపై విహంగ వీక్షణం. – సాక్షి, నేషనల్ డెస్క్ A ఆర్టికల్ 370 జమ్మూ కశ్మిర్‌కు పలు విషయాల్లో ప్రత్యేక హోదా కల్పించిన ఈ వివాదాస్పద ఆర్టికల్‌ను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. ఏ రాష్ట్రానికీ విడిగా అంతర్గత ప్రజాస్వామ్యం అంటూ ఉండబోదని కుండబద్దలు కొట్టింది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం డిసెంబర్ 11న ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. దాంతో కశ్మిర్‌కు ప్రత్యేక పతాకం, రాజ్యాంగం, అంతర్గత వ్యవహారాల్లో పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయింది. B బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధ అధ్యక్షుడైన 81 ఏళ్ల బైడెన్.. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ నెగ్గి తన రికార్డును తానే మెరుగుపరచాలని ప్రయత్నిస్తున్నారు. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయుధ, ఆర్థిక మద్దతు కొనసాగింపుపై విమర్శలతో పాటు పాలస్తీనాలో మానవీయ సంక్షోభం ముదురుతున్నా యుద్ధం ఆపేలా ఇజ్రాయెల్‌ను ఒప్పించలేకపోతున్నారంటూ ఈ ఏడాది మరో అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నారాయన. రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష బరిలో దిగేలా ఉన్న డొనాల్డ్ ట్రంప్ నుంచి బైడెన్‌కు గట్టి పోటీ తప్పకపోవచ్చంటున్నారు. కోర్టు కేసులు 77 ఏళ్ల ట్రంప్ ఆశలపై నీళ్లు చల్లని పక్షంలో 2020లో మాదిరే ఈసారి కూడా అధ్యక్ష పీఠం కోసం వీరిద్దరే పోటీ పడేలా ఉన్నారు. C చంద్రయాన్–3 అంతరిక్ష రంగంలో భారత కీర్తి పతాకను సమున్నతంగా ఎగరేసిన కీలక ప్రయోగం. 2023 జూలై 14న శ్రీహరికోట నుంచి ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం దిగ్విజయం సాధించింది. ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన వ్యోమ నౌక 23న చంద్రుని దక్షిణ ధ్రువ సమీపంలో సురక్షితంగా దిగింది. ఈ విజయానికి గుర్తుగా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రధాని మోదీ ప్రకటించారు D డొనాల్డ్ ట్రంప్ బహుశా అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదుడైన నేత. ఆ దేశంలో నేరాభియోగాలు ఎదుర్కొన్న తొలి మాజీ అధ్యక్షునిగా రికార్డు సృష్టించారు. నీలి చిత్రాల తారతో అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు డబ్బుల చెల్లింపు వ్యవహారంలో గత ఏప్రిల్‌లో కోర్టు మెట్లెక్కిన సందర్భంగా సాంకేతికంగా అరెస్టు కూడా అయ్యారు! ఇదీ రికార్డే. దీంతోపాటు 2020 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ క్యాపిటల్ భవనంపై తన సమర్థకులను దాడికి ఉసిగొల్పిన కేసులో ట్రంప్‌ను కొలరాడో సుప్రీంకోర్టు తాజాగా దోషిగా తేల్చింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించింది! ఇలా అనర్హతకు గురైన తొలి మాజీ అధ్యక్షునిగా కూడా నిలిచారు. అయినా ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు! E ఎలక్షన్స్ 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊపునిస్తే విపక్ష కాంగ్రెస్‌ను తీవ్ర నిరాశకు లోను చేశాయి. ఈ ఏడాది చివర్లో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలిత రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ల్లో బీజేపీ విజయబావుటా ఎగరేయడమే గాక మధ్యప్రదేశ్‌లోనూ ఘనవిజయం సాధించింది. ఎన్ని హామీలిచ్చినా రాజస్తాన్‌లో ఓటమి చవిచూడటమే గాక అధికారం నిలుపుకోవడం ఖాయమని భావించిన ఛత్తీస్‌గఢ్‌నూ కోల్పోవడంతో కాంగ్రెస్ తీవ్ర నైరాశ్యానికి లోనైంది. తెలంగాణలో సాధించిన అనూహ్య విజయం ఈ ఓటముల ముందు చిన్నబోయింది. ఈ నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి సారథిగా కాంగ్రెస్ ప్రాధాన్యం కూడా తగ్గుముఖం పట్టింది. లోక్‌సభ ఎన్నికల్లో తమకే ఎక్కువ సీట్లు కేటాయించాలంటూ భాగస్వాముల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి! F ఫారిన్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల్లో 2023 భారత్‌కు మిశ్రమ ఫలితాలిచ్చింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాదిరిగానే గాజాపై ఇజ్రాయెల్ దాడి విషయంలో కూడా ఏ పక్షం వైపూ పూర్తిగా మొగ్గకుండా ఎప్పట్లాగే కేంద్రం ఆచితూచి స్పందిస్తూ వస్తోంది. అంతేగాక జీ20 సదస్సు నిర్వహణ వంటి పలు అంతర్జాతీయ విజయాలు మన ఖాతాలో పడ్డాయి. అయితే కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ ఉందన్న ఆ దేశ ప్రధాని ఆరోపణలు ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఒకరకంగా ఇరు దేశాల మధ్య నెలల తరబడి ‘దౌత్య యుద్ధమే’ జరిగింది. ఈ విషయంలో అమెరికా కూడా కెనడాకే దన్నుగా నిలవడం మనకు ఇబ్బందికరంగా మారింది. G జి 20 ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ తొలిసారి ఆతిథ్యమిచ్చింది. సెపె్టంబర్లో ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర ప్రముఖ దేశాల అధినేతలు తరలివచ్చారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మూడు రోజుల శిఖరాగ్రం ఘనవిజయం సాధించి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి ప్రతష్టలను మరింతగా పెంచింది. H హెచ్1బీ రెన్యువల్స్ వేలాది భారతీయ టెకీలకు అమెరికాలో ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్న కీలకమైన హెచ్1బీ వీసాల విషయంలో అగ్ర రాజ్యం ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ఇకపై అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. తొలి విడతగా 20 వేల దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియను మొదలు పెట్టింది కూడా. దాంతో రెన్యువల్స్‌కు భారత్కో, మరో దేశానికో వెళ్లాల్సిన అవస్థ తప్పనుంది. I ఇమ్రాన్ ఖాన్ గతేడాది పాకిస్తాన్ ప్రధాని పదవి పోగొట్టుకుని, హత్యాయత్నం నుంచి తూటా గాయాలతో బయట పడ్డ ఇమ్రాన్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా జైలుపాలయ్యారు! భూ వివాదం కేసులో తొలుత మే 9న హైకోర్టు ప్రాంగణంలోనే అరెస్టయ్యారు. తర్వాత విడుదలైనా తోషాఖానా కానుకల కేసులో ఆగస్టు 6న మళ్లీ అరెస్టయ్యారు. అప్పటినుంచీ జైల్లోనే మగ్గుతున్నారు. ఆయనపై 140కి పైగా కేసులు దాఖలయ్యాయి! ఫిబ్రవరిలో జరిగే సాధారణ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌ను అడ్డుకోవడమే లక్ష్యంగా పాకిస్తాన్ ముస్లిం లీగ్ పావులు కదుపుతోంది. పాక్‌లో సర్వశక్తిమంతమైన సైన్యం కూడా అందుకు పూర్తిగా సాయపడుతున్నట్టు కని్పస్తోంది. J జిన్‌పింగ్ మావో అనంతరం చైనాలో అత్యంత శక్తిమంతుడైన నాయకునిగా అవతరించారు. 2023 మార్చిలో ఏకంగా వరుసగా మూడోసారి దేశ అధ్యక్షునిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. చైనా చరిత్రలో ఈ ఘనత సాధించిన ఏకైక నాయకునిగా రికార్డులకెక్కారు. పార్టీలోని ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచివేస్తూ ఎదురులేని నాయకునిగా మారారు. అయితే కరోనా కల్లోలాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. లాక్‌డౌన్‌ను భరించలేక జనం భారీగా తిరుగుబాటుకు దిగడంతో నిబంధనలను సడలించాల్సి రావడం జిన్‌పింగ్ ప్రతిష్టకు మచ్చగా మిగిలింది. రియల్టీ భారీ పతనం, ఆర్థిక ఒడిదుడుకులు ఆయనకు సవాలుగా మారాయి. K కింగ్ చార్లెస్–3 బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం జరుపుకున్నారు. మే 6న అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలంతా హాజరయ్యారు. 73 ఏళ్ల చార్లెస్–3 2022 సెప్టెంబర్ 8న తన తల్లి క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో గద్దెనెక్కారు. అత్యంత పెద్ద వయసులో ఆ బాధ్యతలు చేపట్టి రికార్డులకెక్కారు. 8 నెలల తర్వాత లాంఛనంగా పట్టాభిషిక్తుడయ్యారు. L ఎల్జీబీటీక్యూఐ స్వలింగ సంపర్కం ఈ ఏడాదీ తరచూ వార్తల్లో నిలిచింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అది పార్లమెంటు పరిధిలోని అంశమంటూ అక్టోబర్ 17న తీర్పు వెలువరించింది. అయితే స్వలింగ సంపర్కులకూ ఇతరుల మాదిరిగానే అన్ని హక్కులూ ఉంటాయని స్పష్టం చేసింది. వాటిని కాపాడాలని, వారిని ఎవరూ చిన్నచూపు చూడకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని కేంద్రాన్ని, రాష్ట్రాలను ఆదేశించింది. M మణిపూర్ కల్లోలం ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ఈ ఏడాది జాతుల హింసతో అట్టుడికింది. సంఖ్యాధికులైన మెయితీ తెగ వారు తమను గిరిజనేతరులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ గిరిజన కుకీలు మే 3న జరిపిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కుకీ మహిళను దారుణంగా హింసించి నగ్నంగా ఊరేగించడమే గాక అత్యాచారానికి పాల్పడటంతో రాష్ట్రం భగ్గుమంది. అలా చెలరేగిన హింసాకాండ నేటికీ కొనసాగుతూనే ఉంది. వందలాది మంది మరణించగా కనీసం 40 వేల మందికి పైగా కుకీలు పొరుగు రాష్ట్రాలకు వలస బాట పట్టారు. కేంద్రం మెయితీల పట్ల పక్షపాతం చూపుతూ సమస్య పరిష్కారంపై మీనమేషాలు లెక్కిస్తోందంటూ విమర్శలపాలైంది. N నార్త్ కొరియా ఉత్తర కొరియా 2023 పొడవునా వరుస క్షిపణి పరీక్షలతో హోరెత్తిస్తూనే ఉంది. పొరుగు దేశం దక్షిణ కొరియానూ, అమెరికానూ హడలెత్తిస్తూనే ఉంది. మొత్తమ్మీద ఈ ఏడాది అది 36కు పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. వీటిలో రెండు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు కూడా ఉన్నాయి! దాంతో ఉద్రిక్తతల తగ్గింపుకు ఇరు దేశాల మధ్య 2018లో కుదిరిన ఒప్పందాన్ని దక్షిణ కొరియా రద్దు చేసుకునే దాకా వెళ్లింది. O అపోజిషన్ కాంగ్రెస్‌తో పాటు 28 విపక్షాలు ఒక్క వేదికపైకి రావడం 2023లో జరిగిన ముఖ్య రాజకీయ పరిణామం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ చొరవతో ఈ కూటమి తెరపైకి వచ్చింది. జూలై 18న బెంగళూరులో జరిగిన రెండో భేటీలో కూటమికి ఇండియా పేరును ఖరారు చేశారు. కూటమి నాలుగుసార్లు సమావేశమై భావి కార్యాచరణపై చర్చించింది. ఎన్నికలు ముంచుకొస్తున్నందున జనవరి రెండో వారంలోగా సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకునే పనిలో ఉంది. P పాకిస్తాన్ దివాలా 2023లో పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు మరింతగా పెరిగాయి. నిత్యావసరాలకు కూడా కటకటలాడే పరిస్థితి తలెత్తింది. బియ్యం, గోధుమ పిండి తదితరాల కోసం జనం కొట్టుకుంటున్న దృశ్యాలు పరిపాటిగా మారాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు అట్టడుగుకు చేరాయి. ఏడాది చివరికి వచ్చేసరికి పాస్‌పోర్టుల ముద్రణకు కావాల్సిన పేపర్ దిగుమతికి కూడా చెల్లింపులు చేయలేని పరిస్థితికి చేరింది. దాంతో ఒక దశలో పాస్‌పోర్టుల జారీయే నిలిచిపోయింది. Q క్వేక్స్ ఈ ఏడాది భారీ భూకంపాలతో పలు దేశాలు అతలాకుతలమయ్యాయి. ఫిబ్రవరి 6న 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తుర్కియే, సిరియాల్లో పెను విధ్వంసమే సృష్టించింది. 50 వేల మందికి పైగా దీనికి బలయ్యారు. వీరిలో 44 వేలకు పైగా మరణాలు తుర్కియేలోనే సంభవించాయి! అనంతరం సెపె్టంబర్ 8న మొరాకోలో వచ్చిన 6.8 తీవ్రతతో కూడిన భూకంపానికి 3,000 మందికి పైగా బలయ్యారు. డిసెంబర్ 19న వాయవ్య చైనాలో వచ్చిన భూకంపం 150 మందిని బలి తీసుకుంది. ఉత్తరాఖండ్‌లోని జోషీ మఠ్‌లో నేల కుంగుబాట పట్టిన వైనమూ కలకలం రేపింది. వందలాది ఇళ్లు నిలువునా పగుళ్లిచ్చాయి! R ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ ఈ ఏడాది తెలుగు సినిమా అంతర్జాతీయ వేదికపై దేశ గౌరవాన్ని రెట్టింపు చేసింది. ఆస్కార్ అవార్డు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటుకు ఉత్తమ పాట అవార్డు దక్కింది. మార్చిలో జరిగిన ఆస్కార్ వేడుకలో గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అవార్డును అందుకున్నారు. 2009లో భారతీయ సినిమా ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’లో ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన జై హో పాటకూ ఆస్కార్ వచ్చినా ఆ సినిమాను యూకే ప్రొడక్షన్స్ పతాకంపై హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ రూపొందించారు. S సస్పెన్షన్లు 2023 ముగింపుకు వచ్చిన వేళ విపక్ష ఎంపీల భారీ సస్పెన్షన్లు పార్లమెంటు శీతాకాల సమావేశాలను వేడెక్కించాయి. డిసెంబర్ 13న లోక్‌సభలో జరిగిన భద్రతా వైఫల్యంపై కేంద్రాన్ని నిలదీస్తూ విపక్ష ఎంపీలు ఉభయ సభలనూ రోజుల తరబడి హోరెత్తించారు. దాంతో లోక్‌సభ, రాజ్యసభ రెండింటి నుంచీ కలిపి వారం రోజుల వ్యవధిలో ఏకంగా 149 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే తొలిసారి. ఈ వరుస సస్పెన్షన్లు రాజకీయంగా దుమారం రేపాయి. T టన్నెల్ మనిషి సంకల్పం ముందు మంచు శిఖరం తలొంచింది. ఉత్తరాఖండ్‌లో సిల్‌్కయారా సొరంగం కుప్పకూలి లోన చిక్కుబడ్డ 41 మంది కార్మికులు 16 రోజుల ఉత్కంఠ తర్వాత సురక్షితంగా బయట పడ్డారు. హైవే పనుల్లో భాగంగా నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం నవంబర్ 12న పాక్షికంగా కూలిపోయింది. రెస్క్యూ ఆపరేషన్‌లో రోజుకో సమస్యలతో నిత్యం సస్పెన్సు నెలకొంటూ వచ్చింది. కీలకమైన చివరి అంకం సినిమా క్లైమాక్స్‌నే తలపించింది. యంత్ర బలం చేతులెత్తేసిన వేళ ర్యాట్ హోల్ కార్మికులు చివరి 12 మీటర్ల మేరకు శిథిలాలను జాగ్రత్తగా తవ్వేసి కారి్మకులను బయటికి తీసుకొచ్చారు. U యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) ఈ ఏడాది కూడా వార్తల్లో నిలిచింది. కులమత తదితర విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేసేందుకు ఉద్దేశించిన యూసీసీని అమలు చేసే దిశగా ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఏర్పాటైన దేశాయ్ కమిటీ నవంబర్‌లో ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో యూసీసీ విషయమై దేశవ్యాప్తంగా ఆసక్తికర పరిణామాలు జరగవచ్చు. V వెనెజులా పొరుగున ఉన్న బుల్లి దేశమైన గయానాలో ని ఎసిక్వెబో ప్రాంతంలో అపార చమురు నిక్షేపాలపై వెనెజులా కన్నేయడం ఉద్రిక్తతలకు కారణమైంది. అవసరమైతే సైనిక చర్యకు దిగైనా దాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతుండటంతో దక్షిణ అమెరికాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. W వార్స్ 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా మొదలు పెట్టిన యుద్ధం ఈ ఏడాదంతా కొనసాగుతూనే ఉంది. హమాస్ మెరుపుదాడి కారణంగా అక్టోబర్‌లో పాలస్తీనాపై ఇజ్రాయెల్ తలపెట్టిన యుద్ధమూ భీకరంగా సాగుతూనే ఉంది. ఇలా 2023 యుద్ధ సంవత్సరంగా గుర్తుండిపోనుంది. X ఎక్స్ ప్రముఖ సోషల్ సైట్ ట్విట్టర్‌ను సుదీర్ఘ కాలయాపన, వివాదాల తర్వాత 2022 చివర్లో సొంతం చేసుకున్న ఎలాన్ మస్‌్క, గత జూలైలో దాని పేరును ఎక్స్‌గా మార్చి మరో సంచలనం సృష్టించారు. బ్లూ టిక్ తీసేయడం మొదలుకుని ఆయన తీసుకున్న పలు నిర్ణయాలతో సంస్థ విలువ సగానికి సగం పడిపోయింది. Y యెవగనీ ప్రిగోజిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు. వాగ్నర్ ప్రేవేట్ సైనిక మూక చీఫ్. పుతిన్‌తో విభేదాల నేపథ్యంలో ఆగస్టు 23న ‘విమాన ప్రమాదం’లో ప్రిగోజిన్ మరణించాడు. రష్యాలో ఇలా అనుమానాస్పదంగా కాలగర్భంలో కలిసిపోయిన వారి జాబితాలో చేరిపోయాడు. Z జియోనిజం పశి్చమాసియాలో ప్రత్యేక యూదు రాజ్య స్థాపనకు పుట్టుకొచ్చిన ఉద్యమం. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో ఇది మరోసారి తెరపైకి వచ్చింది. తాను జియోనిస్టునని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది. -
ఎగుమతులు మళ్లీ మైనస్‌లోకి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్‌లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోయాయి. 2022 ఇదే నెలతో పోలి్చతే 2023 నవంబర్‌లో ఎగుమతుల విలువ 2.83% క్షీణించి 33.90 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక 10 నెలల తర్వాత అక్టోబర్‌లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్‌లో మళ్లీ క్షీణతలోకి జారాయి. 4.33% పతనంతో 54.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ముందు.. వెనుకలు ఇలా... అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్‌లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెలలోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఏప్రిల్–నవంబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎనిమిది నెలల కాలంలో పసిడి దిగుమతులు 21 శాతం పెరిగి 32.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
మన బలమేంటో మనమే నిరూపించాలి
క్రీడల పట్ల ఆసక్తితోపాటు చదువులోనూ రాణిస్తూ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది హైదరాబాద్ వాసి, 28 ఏళ్ల స్ఫూర్తి ఏనుగు. లా చదువుతూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాపోటీల్లోనూ పాల్గొని పతకాలు సాధిస్తోంది. ఇటీవల కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొని బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా పవర్ లిఫ్టర్ స్ఫూర్తి ఏనుగు పంచుకున్న విషయాలు ఇవి... ‘‘సహజంగా ఇళ్లలో బరువులెత్తే పనులు అమ్మాయిలకు చెప్పరు. అవి, కేవలం అబ్బాయిల పనే అన్నట్టు చూస్తారు. చిన్నప్పటి నుంచి శిక్షణ ఇవ్వడం లేదా టెక్నిక్స్ తెలుసుకుంటే బరువులు ఎత్తడం అమ్మాయిలకూ సులువే. ప్రొఫెషనల్ అవ్వాలన్నా, శారీరక బరువు, మానసిక సమతుల్యత సాధించాలన్నా వెయిట్ మానేజ్మెంట్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఛాలెంజెస్ అమ్మాయిలకు ఈ రంగంలో ప్రధాన సమస్య నెలసరి సమస్య. అది ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి ఒకే బరువును మోయలేం. శక్తిలోనూ మార్పులు వస్తుంటాయి. ఇందుకు తీసుకునే ఆహారం అబ్బాయిలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. బరువులు ఎత్తే సమయంలో కండరాలు పట్టేస్తుంటాయి. దెబ్బలు తగులుతుంటాయి. జాయింట్స్ దగ్గర సమస్యలు వస్తుంటాయి. బరువులు ఎత్తే సమయంలో ఊపిరిలో తేడాలు వస్తుంటాయి. కానీ, వీటన్నింటినీ సాధనతో అధిగమిస్తుంటాను. మంచి ఆహారం, సరైన నిద్రాసమయం, స్ట్రెస్ లెవల్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తుంటాను. ఈ విషయంలో మా అమ్మ సాధన, నాన్న రామారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. బరువును బ్యాలెన్స్ చేసుకోవడానికి... సెకండ్ క్లాస్ నుంచి స్పోర్ట్స్‌లో ప్రవేశం ఉంది. డిస్క్ త్రో, జావలిన్ త్రో వంటి క్రీడల్లో పతకాలు సాధించాను. రెండేళ్ల నుంచి వెయిట్‌లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కరోనా టైమ్‌లో బరువు పెరిగాను. పది కేజీల బరువు తగ్గాలనుకున్నాను. అందుకు డైట్లో మార్పులు చేసుకోవడానికి బదులు నాకు ఎలాగూ స్పోర్ట్స్ అంటే ఇష్టం కాబట్టి, బరువు తగ్గడానికి వెయిట్‌లిఫ్టింగ్ సాధన చేశాను. ప్రాక్టీస్ చేసేటప్పుడు మనల్ని మనం ఎలా క్రమశిక్షణగా మలచుకోవాలో నిపుణుల ఆధ్యర్వంలో తెలిసిపోతుంది. అందుకు అనుగుణంగా సరైన దినచర్యను అమలు చేసుకుంటూ, విజయం దిశగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. ఆలోచనలో మార్పు.. అమ్మాయిలు చిన్నప్పటి నుంచే క్రీడలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వారు ఎంచుకున్న రంగంలోనూ చాలా బాగా దూసుకుపోగలరు. ఇంట్లో వాటర్క్యాన్స్, గ్యాస్ సిలిండర్, సోఫా.. వంటి బరువులు ఎత్తడంలో కూడా టెక్నిక్స్ ఉంటాయి. సాధారణంగా అమ్మాయిలు కూడా 50–60 కేజీల బరువు ఎత్తగలరు. కానీ, టెక్నిక్స్ తెలియకుండా ఎత్తి, నొప్పితో బాధపడుతుంటారు. దీంతో అమ్మాయిలు వెయిట్ లిఫ్టింగ్ చేయలేరు అనే అభిప్రాయం మనలో చాలా మందిలో పాతుకుపోయి ఉంది. మన ఆలోచనలో మార్పు రావాలంటే తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్ దిశగా అమ్మాయిలను ప్రోత్సహించాలి. క్రీడలతోపాటు ... చదువునూ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎంబీయే పూర్తి చేశాను. సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతూనే స్పోర్ట్స్‌లో సాధన చేస్తూ వచ్చాను. ఇప్పుడు లా చదువుతున్నాను. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనే కాదు, కిందటి నెలలో కిర్గిజ్‌స్థాన్‌లో జరిగిన ఏడబ్ల్యూసీ ఓపెన్ వరల్డ్ కప్‌లో పాల్గొని బంగారు పతకాన్ని సాధించాను. మా అమ్మనాన్నల ప్రోత్సాహంతో పాటు కోచ్ ఇచ్చే గైడెన్స్ ఎంతగానో తోడ్పడుతున్నాయి. మరిన్ని పోటీలు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిచోటా ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాటిని దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఎదుర్కొన్నవారే విజేతలవుతారు. ‘వెయిట్ లిఫ్టింగ్ అంటే అబ్బాయిలదే. అమ్మాయిలకు ఏం సాధ్యమవుతుంది, సూటవదు’ అనే మాట ఇప్పటికీ ఈ రంగంలో మొదటగా వినిపిస్తుంది. కానీ, మనల్ని మనం గెలిచి చూపినప్పుడు అమ్మాయిలుగా మన బలం ఏంటో కూడా ప్రపంచానికి తెలుస్తుంది’’ అని వివరిస్తుంది స్ఫూర్తి. – నిర్మలారెడ్డి -
భారతీయలు పాక్‌లో వ్యాపారం చేయవచ్చా?
దేశంలో వ్యాపారరంగాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోంది. భారతీయుల వ్యాపార పరిధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగానూ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. భారతీయులెవరైనా విదేశాల్లో వ్యాపారం చేయాలని భావించినప్పుడు ముందుగా వారు అమెరికా, లండన్, పారిస్ ప్రాంతాల గురించి ఆలోచిస్తారని చాలామంది అంటుంటారు. భారతీయులు పొరుగుదేశమైన పాకిస్తాన్లో వ్యాపారం చేసే దిశగా ఎందుకు ఆలోచించరు? నిజానికి భారతీయ పౌరులు పాక్‌లో వ్యాపారం చేయడం సాధ్యమేనా? మన దేశంలోని వారు అక్కడ వ్యాపారం చేయాలంటే ఏ నియమనిబంధనలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ పౌరులు పాకిస్తాన్లో నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకోవచ్చు. పాకిస్తాన్ తమ దేశంలో భారత్ పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2012లో పాకిస్తాన్లో పెట్టుబడులను పరిమితం చేసే విదేశీ విధాన నియమాన్ని తొలగించింది. సెప్టెంబర్ 2012లో ఫెమా నిబంధనలు కూడా సవరించారు. భారత్‌కు చెందిన ఎవరైనా పాకిస్తాన్లో వ్యాపారం చేయవచ్చు. పాకిస్తాన్లో వ్యాపారం చేయడానికి ముందుగా కంపెనీని నమోదు చేసుకోవాలి. కంపెనీ రిజిస్ట్రేషన్‌కు సాధారణంగా ఆరు వారాల సమయం పడుతుంది. దీనికి సులభమైన ప్రక్రియ అందుబాటులో ఉంది. కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం మొదట దరఖాస్తు చేసి, అనంతరం అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఆ తర్వాతనే సంస్థకు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అందుతుంది. తర్వాత అమ్మకాలు, పన్నులకు సంబంధించి మిగిలిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఏర్పాటుకు కనీస మూలధనం పీకేఆర్ 1,00,000(పాకిస్తాన్ రూపాయలు) తప్పనిసరి. పాక్‌లో ఏదైనా కంపెనీ పెట్టాలనుకునేవారికి అక్కడ చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ , వీసా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే కంపెనీని నిర్వహించవచ్చు. పలువురు భారతీయులు పాక్‌లో వ్యాపారాలు చేస్తున్నారు. పాకిస్తాన్లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత పెట్టుబడిదారులకు వ్యాపార అవకాశాలను కల్పించాయి. అపోలో టైర్స్, మారికో, జేకే టైర్స్, డాబర్, పియోమా ఇండస్ట్రీస్, హిమాలయ డ్రగ్ కంపెనీ, కొఠారీ ఫుడ్స్, హౌస్ ఆఫ్ మల్హోత్రా, జగత్జిత్ ఇండస్ట్రీస్ తదితర భారత బ్రాండ్లు పాకిస్తాన్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తుంటాయి. ఇది కూడా చదవండి: మనిషికి చిరాయువు ఇక సాధ్యమే? -
రాబోయే వ్యాధులకు ముందే చెక్!
సాక్షి, హైదరాబాద్: మానవ కణజాల నమూనాల సంరక్షణ, విశ్లేషణ కోసం అంతర్జాతీయ ప్రమాణా లతో కూడిన అత్యాధునిక బయోబ్యాంక్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఏర్పాటు చేసింది. 3 లక్షలకుపైగా జీవ నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ చేసేందుకు వీలుగా ఈ బయోబ్యాంక్‌లో మైనస్ 80 డిగ్రీల ఫ్రీజర్లు పదిహేను, మైనస్ 20 డిగ్రీల ఫ్రీజర్లు ఐదు, మైనస్ 160 డిగ్రీలతో కూడిన మూడు లిక్విడ్ నైట్రోజన్ ట్యాంకులు ఉన్నాయి. ఈ తరహా నిల్వ కేంద్రం ఏర్పాటు దక్షిణాదిలోనే మొదటిదిగా పేర్కొంటున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త డాక్టర్ లెరోయ్ హుడ్ ఈ బయోబ్యాంక్‌ను మంగళవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ బయో బ్యాంక్ అర్థవంతమైన పరిశోధనలకు, వ్యాధుల నివారణకు వీలు కల్పిస్తుందని.. అంతిమంగా అత్యాధునిక వైద్య విధానాల అభివృద్ధికి దోహదపడుతుందని హుడ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిస్టమ్స్, బిగ్ డేటా టూల్స్, మెషీన్ లెర్నింగ్ అల్గా రిథమ్‌ల మేళవింపుతో ఈ బయోబ్యాంక్ పనిచేస్తుందన్నారు. కేన్సర్, డయాబెటిస్, హార్ట్ ఫెయిల్యూర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలు బయటపడక ముందే కచ్చితంగా అంచనా వేయగల సామర్థ్యాన్ని సంతరించుకొనే క్రమంలో బయోబ్యాంక్ ఏర్పాటును మేలిమలుపుగా లెరోయ్ హుడ్ అభివర్ణించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ ప్రెసిడెంట్, కో–ఫౌండర్ అయిన హుడ్... హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసిన ఆటోమేటెడ్ జీన్ సీక్వెన్సర్ను గతంలో కనుగొన్నారు. ఇదో మైలురాయి: ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి వైద్య పరిజ్ఞానాన్ని, ఆరోగ్య సంరక్షణలో పురోగతిని పెంపొందించే దిశగా బయోబ్యాంక్ ఓ మైలురాయి కాగలదని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశోధకులు, వైద్యులు, శాస్త్రవేత్తలకు కీలక వనరుగా ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. తమ బయోబ్యాంక్‌కు 3 లక్షల కంటే ఎక్కువ నమూనాలను నిల్వ చేయగల సామర్థ్యం ఉందని వివరించారు. వ్యాధుల నివారణకు తోడ్పడే ఔషధ రంగంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి బయోబ్యాంక్ ఏర్పాటు సహకరిస్తుందని చెప్పారు. దీనిద్వారా వచ్చే 5–10 ఏళ్ల వరకు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మంది రోగులతోపాటు ఆరోగ్యకరమైన వ్యక్తుల వివరాలను సేకరించి వారి జీవ నమూనాలను విశ్లేషిస్తామని వివరించారు. వ్యాధుల నిర్ధారణ, నివారణలో విప్లవం... బయోబ్యాంక్ అనేది ఒక రకమైన నిల్వ సౌకర్యం. ఇది 3 లక్షల కంటే ఎక్కువ మానవ కణజాల నమూనాలను 15 ఏళ్లకుపైగా నిల్వ ఉంచగలదు. మానవ కణజాల నమూనాల నిల్వ, విశ్లేషణ ద్వారా ఇది జన్యు పరిశోధనలో సహాయ పడుతుంది. సంక్లిష్ట వ్యాధుల చికిత్స రానురానూ కష్టతరంగా మారుతున్న పరిస్థితుల్లో వ్యాధుల రాకను ముందే పసిగట్టే అద్భుతమైన అవకాశాన్ని ఇది అందిస్తుంది. దీనికోసం వ్యక్తుల కణజాల నమూనాలను సేకరిస్తారు. వాటిని నిల్వ చేసి పదేళ్లపాటు వారి ఆరోగ్య స్థితిగతుల్ని నిశితంగా పర్యవేక్షిస్తారు. ఆ సమయంలో ఆయా వ్యక్తుల్లో ఆరోగ్యపరంగా చోటుచేసుకున్న మార్పుచేర్పుల్ని, వ్యాధుల దాడిని, వాటికి కారణాలను పసిగట్టడం ద్వారా వారసుల ఆరోగ్య స్థితిగతుల్ని అంచనా వేస్తారు. అలాగే దాదాపుగా అదే కణజాలానికి దగ్గరగా ఉన్న వ్యక్తులందరికీ భవిష్యత్తులో వచ్చే వ్యాధులను కూడా పసిగట్టే అవకాశం లభిస్తుంది. తద్వారా వ్యాధి రావడానికి ముందే నివారణ ప్రక్రియ ప్రారంభించేందుకు వీలవుతుంది. -
గాజాలో ఆగని వేట
గాజా స్ట్రిప్/జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మంగళవారం నెల రోజులకు చేరుకుంది. సోమవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు నిర్వహించింది. ఖాన్ యూనిస్, రఫా, డెయిర్ అల్–బలా నగరాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని గాజీ సిటీలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టినట్లు తెలిసింది. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. గాజాలో హమాస్‌ను అధికారం నుంచి కూలదోయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. మిలిటెంట్ల కోసం ఇజ్రాయెల్ సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉత్తర గాజాపై దృష్టి పెట్టింది. గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. మరో ఐదుగురు బందీల విడుదల ఇప్పటికే నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు మరో ఐదుగురికి విముక్తి కలిగించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దాడిచేసిన మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు తరలించడం తెల్సిందే. గాజా రక్షణ బాధ్యత మాదే: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్ రక్షణ బాధ్యతను నిరవధికంగా ఇజ్రాయెల్ తీసుకుంటుందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. తద్వారా గాజా స్ట్రిప్ మొత్తం ఇజ్రాయెల్ నియంత్రణ కిందికి వస్తుందని సంకేతాలిచ్చారు. గాజాను తమఅదీనంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడారు. గాజాలోకి మానవతా సాయాన్ని చేరవేయడానికి లేదా హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడిపించడానికి వీలుగా మిలిటెంట్లపై యుద్ధానికి స్వల్పంగా విరామం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా గాజాలో కాల్పుల విరమణ పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ! గాజాలోకి పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వడం లేదు. గాజాలో ఇంధనం నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు సమాచారం. ఇంధనం లేక పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాజాలో 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 15 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతోపాటు ఇంధనం లేకపోవడమే ఇందుకు కారణం. మిగిలిన ఆసుపత్రులు పాక్షికంగానే పని చేస్తున్నాయి. సమస్య పరిష్కారంలో భద్రతా మండలి విఫలం నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి పరిష్కారం సాధించడంలో ఐక్యరాజ్యసమితి భదత్రా మండలి మరోసారి విఫలమైంది. తాజాగా మండలిలో రెండు గంటలకుపైగా చర్చ జరిగింది. సభ్యదేశాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. రఫా పట్టణంలో ఇజ్రాయెల్ దాడి తర్వాత స్థానికుల ఆక్రందన -
విమానంలో వికలాంగుడి పట్ల అమానుషం: కన్నీటి పర్యంతమైన జంట
న్యూఢిల్లీ: వికాలాంగుడన్న కనీస కనికరం లేకుండా విమానంలో దారుణంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. తమకు జరిగిన అవమానాన్ని తడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంతో ఆనందంగా జరుపుకోవాలనుకున్న వివాహ వార్షికోత్సవ వేడుకల్లో తీరని మానసిక వేదనకు గురయ్యమాంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో చివరకు ఎయిర్ కెనడా క్షమాపణ చెప్పింది. బ్రిటిష్ కొలంబియాకు చెందిన హార్డ్‌వేర్ సేల్స్‌మ్యాన్ రోడ్నీ హాడ్జిన్స్ స్పాస్టిక్ సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. వీల్ చెయిర్ లేనిదే కదలలేని స్థితి. అయితే ఆగస్టులో వివాహ వార్షికోత్సవ వేడుకుల కోసం ఎయిర్ కెనడాలో భార్య డీనాతో కలిసి లాస్ వెగాస్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా విమానం ల్యాండ్ అయినప్పుడు మోటరైజ్డ్ వీల్‌చైర్ కావాలని అడిగాడు. అయితే విమానం మళ్లీ టేకాఫ్‌కు సిద్ధం కావడానికి ముందు వీల్‌చైర్‌ను ఎక్కించుకోవడానికి సమయం లేదని ఫ్లైట్ అటెండెంట్ దంపతులకు ఖరాఖండీగా చెప్పేశారు. పైగా దిగాలంటూ తొందరపెట్టారు. దీంతో రోడ్నీ భార్య అతడిని బలవంతంగా రెండు కాళ్లు పట్టి ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రోడ్నీ హాడ్జిన్స్ దంపతులు(ఫైల్ ఫోటో) ఈ విషయాన్ని డీన్నా హాడ్జిన్స్ ఇటీవలి ఫేస్బుక్ పోస్ట్ చేశారు. అందరూ చూస్తూ ఉండగానే దాదాపు 12 లైన్లకు వరకూ భర్త వీపుమీద జరుగుతూ ఉంటే, తాను రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటా వెళ్లాల్సి వచ్చిందని, దీంతో అతనికి వీపుపైన, కాళ్లకు గాయాలని చెప్పుకొచ్చారు. తనకూ వెన్నులో నొప్పి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనలో శారీరక బాధలతో పోలిస్తే.. తన భర్త హక్కులకు భంగం కలగడమే కాకుండా, తమకు తీరని మానసిక వ్యధను మిగిల్చిందంటూ కన్నీంటి పర్యంతమయ్యారు. ఎనిమిదినెలలకు ప్లాన్ చేస్తున్న టూర్ అవమానకరంగా సాగిందని పేర్కొన్నారు. ఈ అమానుష ఘటనపై సోషల్ మీడియాలోఆగ్రహం వ్యక్త మైంది. దీంతో వెంటనే స్పందించిన ఎయిర్ కెనడా వారు హాడ్గిన్స్ దంపతులు క్షమాపణలు చెప్పి, తగిన నష్టపరిహారాన్ని కూడా అందించారు. పరిహారంతో సరా...?: రోడ్నీ హాడ్జిన్స్ పరిహారంతో సమస్య పరిష్కారం కాదంటూ వికలాంగ ప్రయాణికుల పట్ల విమానయాన సంస్థ వ్యవహరించిన తీరుపై రోడ్నీ ఆగ్రహం వ్యక్తంచేశారు. తన లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదనేదే తన తాపత్రయమని చెప్పారు. -
లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో దీపావళి వేడుకలు
లండన్: యూకేలో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రముఖ ట్రఫాల్గర్ స్క్వేర్‌లో లండన్ మేయర్ సాధిక్ ఖాన్ దీపావళి వేడుకలను నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకొనే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేడకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ వేడుకలకు హాజరైన పలువురు మాట్లాడుతూ.. మొదటిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నామని, ఇదొ ఒక అద్భుతమైన అనుభవం అంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. That Mayor has a name, Sadiq Khan. https://t.co/U7jSV9PtG6 — Sushant Singh (@SushantSin) October 29, 2023 -
బతుకమ్మ పండగకు అరుదైన గౌరవం,గవర్నర్ ఆదేశాలు జారీ
అట్లాంటా: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ‘బతుకమ్మ’ పండగకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని జార్జియాలో బతుకమ్మ పండగను గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 3వ వారాన్ని బతుకమ్మ వారంగా ప్రకటించారు. ఈ ప్రకటనపై పలువురు తెలంగాణ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరి ఎంతో ఘనంగా పండగను జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అక్టోబర్ 15 నుంచి ఈనెల 23 వరకు 9రోజుల పాటు బతుకమ్మ పండగను జరుపుకున్న సంగతి తెలిసిందే.తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ సంబరాలు ఏటా పెతర అమావాస్య రోజున ఎంగిపూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ.బతుకమ్మను పేర్చడంలోని తీరొక్క పువ్వుకు తీరొక్క శాస్త్రీయత కనబడుతుంది. ప్రకృతిలోని పూలన్నింటికి ఔషధ గుణాలుంటాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. బతుకమ్మను చెరువులోగానీ కుంటలోగాని నిమజ్జనం చేసినప్పుడు రోగ నిరోధక శక్తితో నీరు ఔషధ గుణాలు పొందుతుందని అంటారు. కాకతీయుల కాలం అంటే సుమారు 12 వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు.తొమ్మిదిరోజులపాటు నిర్వహించే బతుకమ్మ పండుగకు 9 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. విదేశాల్లో ఉన్నా తెలంగాణ ఆడపడుచులంతా ఒకచోట చేరి బతుకమ్మ ప్రాముఖ్యతను చాటుకుంటారు. జార్జియాలోనూ ప్రతి ఏడాది జార్జియా తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా బతుకమ్మ పండగను జరుపుకుంటారు. -
సాగునీటి సమస్యను అధిగమించేలా..
సాక్షి, విశాఖపట్నం: మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు విశాఖ మహా నగరం వేదికకానుంది. ఐదున్నర దశాబ్దాల తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇంటర్నేషనల్ కమిషన్(ఐసీఐడీ) 25వ అంతర్జాతీయ కాంగ్రెస్‌ను నవంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు విశాఖ రిషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించనున్నారు. ‘వ్యవసాయంలో నీటి కొరతను అధిగమించడం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు 74 దేశాలకు చెందిన 1,200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరులశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సును రెండో తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఐసీఐడీ అధ్యక్షుడు డాక్టర్ రాగబ్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వివిధ దేశాల అంబాసిడర్లు, మంత్రులు పాల్గొంటారు. సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీగా జలవనరుల శాఖ ప్రత్యేక అధికారి ఎల్లారెడ్డి వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఐసీఐడీ 25వ అంతర్జాతీయ కాంగ్రెస్‌తోపాటు 74వ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఐఈసీ) సదస్సు కూడా ఇదే వేదికపై జరగనుంది. లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు విశాఖలో జరగనున్న 25వ అంతర్జాతీయ కాంగ్రెస్, 74వ ఐఈసీ సదస్సుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు 74 దేశాల నుంచి సభ్యులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఏర్పాట్లపై సమీక్షించి భద్రత, నిర్వహణపరంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. సదస్సుకు హాజరయ్యే అతిథుల్లో సుమారు 300మంది స్థానిక పర్యాటక ప్రాంతాలతోపాటు అరకు, తాటిపూడి రిజర్వాయర్లను సందర్శించనున్నారు. – డాక్టర్ మల్లికార్జున, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యక్రమం ఇలా... ఐసీఐడీ ఏర్పాటైన తర్వాత తొలి సదస్సు 1951లో భారత్‌లో నిర్వహించారు. ఆ తర్వాత 1966లో 6వ అంతర్జాతీయ కాంగ్రెస్‌ను ఢిల్లీలో నిర్వహించారు. మళ్లీ 57 ఏళ్ల తర్వాత విశాఖలో నిర్వహించనున్నారు. విశాఖ సదస్సులో వ్యవసాయం కోసం ప్రత్యామ్నాయ నీటి వనరులు ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఐసీఐడీలోని 54 సభ్యదేశాలు, మరో 20 అసోసియేట్ మెంబర్ సభ్యదేశాల ప్రతినిధులు చర్చించనున్నారు. సంప్రదాయ నీటివనరులను అభివృద్ధి చేయడం, నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడం, వర్షపునీటి సంరక్షణ, పొలాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు మార్గాలు, భూగర్భ జలాల పెంపు, మురుగునీటిని శుద్ధి చేసి సాగునీటిగా వినియోగించేందుకు ఉన్న మార్గాలు, అధిక దిగుబడుల కోసం శుద్ధజలాల వినియోగం తదితర అంశాలపై తొలి రెండు రోజులు సెషన్స్ నడుస్తాయి. రైతు సాధికారత అంశంపై సహకార సంస్థలు, నీటి వినియోగదారుల సంఘాల పాత్ర, వ్యవసాయ విస్తరణ సేవలు, రైతులకు ఉపయోగపడే సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, వ్యవసాయ రంగంలో సాంకేతికతను పెంపొందించడం, వ్యవసాయ పరిశోధనలు, ఆవిష్కరణలు, స్కాడా తదితర అంశాలపై ప్యానెల్ డిస్కషన్లు జరగనున్నాయి. 2 నుంచి 4వ తేదీ వరకు వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, ఆధునిక పద్ధతులు, కొత్త పరికరాలతో కూడిన 128 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. భారత్ నుంచి 300 మంది ప్రతినిధులు, ఇతర దేశాల నుంచి 900 మందికిపైగా ఈ సదస్సులో భాగస్వామ్యం కానున్నారు. -
5 రోజులు.. 15 లక్షల కోట్లు!
ముంబై: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా కీలక సూచీల పతనం కొనసాగుతోంది. స్టాక్స్ అధిక వేల్యుయేషన్స్‌తో ట్రేడవుతుండటం కూడా దీనికి తోడు కావడంతో బుధవారం మార్కెట్లు మరింత క్షీణించి, ఇన్వెస్టర్ల సంపద ఇంకాస్త కరిగిపోయింది. మొత్తంమీద అయిదు రోజుల్లో రూ. 14.60 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. బుధవారం సెన్సెక్స్ మరో 523 పాయింట్లు తగ్గి 64,049 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు క్షీణించి 19,122 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. గత అయిదు సెషన్లలో సెన్సెక్స్ 2,379 పాయింట్లు, నిఫ్టీ 690 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 309,22,136 కోట్లకు తగ్గింది. ‘అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లు వరుసగా అయిదో సెషన్లోనూ క్షీణించాయి. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ దీనికి సారథ్యం వహించాయి. దేశీ స్టాక్స్ అధిక వేల్యుయేషన్స్‌లో ట్రేడవుతుండటం, అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొనడం తదితర పరిణామాల కారణంగా ఇన్వెస్టర్లు ఈక్విటీల్లో తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు‘ అని కోటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ విభాగం (రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. లాభాల స్వీకరణ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లకు తగిన పరిస్థితులు ఏర్పడటంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నట్లు ఈక్విట్రీ సహ వ్యవస్థాపకుడు పవన్ భరాదియా వివరించారు. ఇన్ఫీ 3 శాతం డౌన్.. సెన్సెక్స్‌లో ఇన్ఫీ షేర్లు అత్యధికంగా 2.76 శాతం మేర క్షీణించాయి. భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ మొదలైనవి కూడా నష్టపోయాయి. టాటా స్టీల్, ఎస్బీఐ మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ తదితర స్టాక్స్ లాభపడ్డాయి. టెక్ సూచీ 1.39 శాతం, టెలికం 1.29 శాతం, యుటిలిటీస్ 1.25 శాతం మేర క్షీణించగా మెటల్స్ సూచీ మాత్రమే లాభపడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) నికరంగా రూ. 4,237 కోట్లు విక్రయించగా, దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ. 3,569 కోట్ల మేర కొనుగోళ్లు జరిపారు. అటు అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభపడగా, సియోల్ సూచీలు నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు నెగటివ్‌లో ట్రేడయ్యాయి. -
కులులో ఘనంగా అంతర్జాతీయ దసరా ఉత్సవాలు
విపత్తుల నుంచి కోలుకున్నమూడు నెలల తర్వాత హిమాచల్‌లోని కులులో దసరా సందడి నెలకొంది. అంతర్జాతీయ కులు దసరా వేడుకలు నేటి నుంచి(మంగళవారం) ధాల్పూర్ మైదానంలో ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 30 వరకూ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ దసరా ఉత్సవాలు కులు-మనాలిలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహకరంగా మారనున్నాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు రఘునాథుని రథయాత్రతో మహాకుంభ్ పేరుతో ఈ దసరా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. రఘునాథుని రథాన్ని లాగడానికి వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. రథమైదాన్ నుండి రథయాత్ర ‘జై సియారామ్’ నినాదాలతో రఘునాథ్ ధాల్‌పూర్‌కు చేరుకోనుంది. అనంతరం జిల్లా నలుమూలల నుంచి తీసుకువచ్చిన దేవతా మూర్తుల విగ్రహాలను ఆయా మండపాల్లో కొలువుదీర్చనున్నారు. 14 దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఈ ఉత్సవంలో వివిధ ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. దసరా చరిత్రలో తొలిసారిగా మలేషియా, రష్యా, దక్షిణాఫ్రికా, కజకిస్తాన్, రొమేనియా, వియత్నాం, కెన్యా, శ్రీలంక, తైవాన్, కిర్గిజిస్తాన్, ఇరాక్, అమెరికా తదితర దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వనున్నాయని పార్లమెంటరీ చీఫ్ సెక్రటరీ సుందర్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కులు దసరా వేడుకలు 1660 నుండి జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: రామరావణ యుద్ధానికి నేతలు, ప్రముఖులు -
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో సింగపూర్ బతుకమ్మ2023 పండగను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబవాంగ్ పార్క్‌లో ఈ బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. ప్రతీ ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా సింగపూర్‌లో తెలుగు వాళ్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సింగపూర్‌లో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారు కూడా బతుకమ్మ, బోనాలు జరుపుకోవడం ఎంతో అభినందనీయని సింగపూర్ కల్చరల్ సొసైటీ సభ్యులు అన్నారు. తెలంగాణ సాంప్రదాయ పండగలను అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అందంగా బతుకమ్మ పేర్చిన వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా ఉన్న వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
Global maritime india summit 2023: సముద్ర వాణిజ్య ఆర్బిట్రేషన్ కేంద్రంగా భారత్!
ముంబై: సముద్ర వాణిజ్య అంశాలు, వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం భారత్‌లో ఏర్పడాలన్న ఆకాంక్షను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. ఇందుకు తగిన సామర్థ్యాలు, న్యాయ వ్యవస్థలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు. దేశ నౌకానిర్మాణ సామర్థ్యాన్ని పెంచడానికి ఫైనాన్సింగ్, బీమా, మధ్యవర్తిత్వం, మరిన్ని విభిన్న సౌలభ్యాల సృష్టి అవసరమని కూడా అన్నారు. ముంబైలో జరిగిన గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, 2023 ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సరఫరాలు, సరఫరాల భద్రతలో అంతరాయాలు, సరఫరాల చైన్ విచి్ఛన్నం వంటి పలు సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమయంలో జరిగిన ఈ సదస్సుకు కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సు సందర్భంగా ‘మారిటైమ్ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఆర్బిట్రేషన్’ అన్న అంశంపై నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... సెషన్లో ప్రసంగించారు. ► లండన్ లేదా సింగపూర్ లేదా దుబాయ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బ్రిట్రేషన్) కేంద్రాలలో చాలా మంది భారతీయులు పనిచేస్తున్నప్పటికీ, వారంతా అక్కడి సీనియర్ న్యాయవాదులకు సహాయం చేస్తున్నారు తప్ప, ఒక కేసును స్వయంగా చేపట్టి, పరిష్కరించడంలేదు. ఈ ధోరణి మారాలి. ► మన మధ్యవర్తిత్వ ప్రక్రియలు, చట్టాలను మెరుగుపరచడం, బలోపేతం చేయడం అవసరం. తద్వారా అవి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. మనం ఈ దిశలో ఒక వ్యవస్థను అభివృద్ధి చేసినప్పుడు, మధ్యవర్తిత్వ కేంద్రాన్ని కూడా కలిగి ఉండవచ్చు. ► భారత్ మధ్యవర్తిత్వంలో తన బలాన్ని మెరుగుపరచుకుంటోంది. అయితే అంతర్జాతీయ ఆంక్షలు– ఒత్తిళ్లను తగ్గించుకునే దిశలో దేశం పూర్తి స్థాయి భారత్–ఆధారిత రక్షణ, నష్టపరిహార (పీఅండ్ఐ) సంస్థను కలిగి ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఇది షిప్పింగ్ కార్యకలాపాల లో మరింత వ్యూహాత్మక సౌలభ్యాన్ని అందిస్తుంది. తీరప్రాంత, లోతట్టు జలాల్లో పనిచేసే నౌక లకు తగిన రక్షణాత్మక చర్యలను అందిస్తుంది. ► ప్రధాన వస్తువుల ఎగుమతులు కొన్నిసార్లు అవాంతరాలకు గురవుతాయి. ఫలితంగా ఆహార అభద్రత శక్తి అభద్రత వంటి అంశాలు తీవ్రతరమవుతాయని. దీనితో ద్రవ్యోల్బణం సమస్యా తలెత్తవచ్చు. కోవిడ్ సవాళ్ల నుండి బయటకు వస్తున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రస్తుతం ఈ సవాలును ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్లను ప్రపంచవ్యాప్త పరస్పర సహకారంతో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ► సముద్ర రంగానికి ఫైనాన్సింగ్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్నప్పటికీ, బ్యాంకులు ఈ రంగానికి నిధులు సమకూర్చడంలో పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. ఈ రంగానికి సంబంధించిన అధిక నష్టాల అవకాశం దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సముద్రరంగం పట్ల మరింత సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ► భారత్– మిడిల్ ఈస్ట్–యూరోప్ ఎకనామిక్ కారిడార్ ఇప్పుడు కీలకం. మేము యూరప్, మధ్య ఆసియాలను సముద్రం అలాగే భూ మా ర్గం ద్వారా చేరుకోవాలని చూస్తున్నాము. తద్వా రా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రణాళికలను రూపొందించడం జరుగుతోంది. ► కోవిడ్–19 తర్వాత సముద్ర వాణిజ్యానికి మద్దతుగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), దేశీయ బీమా కంపెనీల మద్దతుతో ‘‘మెరైన్ కార్గో పూల్’’ ఆవిష్కరణ జరిగింది. ► 12 ప్రభుత్వ ఓడరేవుల్లో తొమ్మిదింటిలో 35 ప్రాజెక్టులను మానిటైజేషన్ కోసం గుర్తించడం జరిగింది. అన్నీ సవ్యంగా జరిగితే నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా రూ. 14,483 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోనటైజ్ చేయవచ్చు. ప్రభుత్వ ఆస్తులను దీర్ఘకాలంపాటు లీజుకు ఇవ్వడం తద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడం నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైప్‌లైన్ ప్రధాన ఉద్దేశం. గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్, 2023 సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జ్ఞాపికను బహూకరిస్తున్న ఓడరేవులు, షిప్పింగ్,జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి టి.కె. రామచంద్రన్ -
‘మామిడి’లో మనమే ఘనం
సాక్షి, అమరావతి : దేశంలో అత్యధికంగా మామిడి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అలాగే జాతీయ స్థాయి సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకతను మించి రాష్ట్రంలో సగటు హెక్టార్‌కు మామిడి ఉత్పాదకత అత్యధికంగా ఉంది. దేశంలో ఏపీ తర్వాత మామిడి ఉత్పత్తిలో ఒడిశా రాష్ట్రం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశాలో మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు మేలుతో పాటు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ అధ్యయన నివేదిక వెల్లడించింది. కొరియా ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ సహకారంతో ఈ అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ఆహార ప్రాసెసింగ్ రంగంలో సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేశారు. నివేదికలో ఉన్న ముఖ్యాంశాలు జాతీయ స్థాయిలో హెక్టార్‌కు సగటున 9.6 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా, ఏపీలో హెక్టార్‌కు సగటున 12 టన్నులు ఉత్పత్తి అవుతోంది. ఒడిశాలో హెక్టార్‌కు సగటున 4 నుంచి 6.3 టన్నుల మామిడి ఉత్పత్తి అవుతోంది. ఏపీలో ఉత్పత్తయ్యే మామిడి పండ్లలో 16% ఫ్రూట్ ప్రాసెస్ చేపడుతున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల డిమాండ్‌ను పెంచాల్సి ఉంది. ఏపీలో బంగినపల్లి, సువర్ణ రేఖ, నీలం, తోతాపురి రకాలు ఎక్కువగా పండుతుండగా, ఎగుమతికి అనువైన ఇమామ్ పసంద్, బంగినపల్లి, సువర్ణరేఖ వంటి గుజ్జు రకాలూ ఎక్కువగానే పండుతున్నాయి. ఏపీలో ఉత్పత్తి అయ్యే గుజ్జు రకాల పండ్లలో దాదాపు 54 శాతం ఎగుమతి అవుతున్నాయి. ప్రాసెస్ చేసిన పండ్ల ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. గుజ్జు రకాల మామిడి పండ్ల ఉత్పత్తి ఏపీ, ఒడిశాలో అత్యధికంగా ఉంది. పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా అధిక ఉద్యోగాలు కల్పించవచ్చు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్‌లో కీలకమైన పరిమితులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు నాణ్యమైన ముడి పదార్థాలను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ పథకాలను అందుబాటులో ఉంచడంతో పాటు త్వరగా అనుమతులివ్వాలి. పండ్ల ప్రాసెసింగ్‌లో 75 శాతం మహిళలకు, 25 శాతం పురుషులకు ఉపాధి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 3.39 మిలియన్ ఎంఎస్ఎంఈలను ఉండగా, ఒడిశాలో 1.98 మిలియన్ ఎంఎస్‌ఎంఈలున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎంఎస్‌ఎంఈల్లోనే 111 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. నమోదైన ప్రాసెసింగ్ యూనిట్ల కన్నా ఏపీ, ఒడిశాల్లో నమోదుకాని యూనిట్లు 26 నుంచి 80 రెట్లు ఉంటాయి. ఏపీ ప్రభుత్వం 2020–25 లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తెచ్చింది.. కొత్త సాంకేతిక బదిలీలను ప్రోత్సహించడం, సాంకేతికతను అప్‌గ్రేడేషన్ చేయడం, ముడి సరుకు సక్రమంగా సరఫరా అయ్యేలా సరైన పంటల ప్రణాళికలకు మద్దతు ఇవ్వడం, వ్యవసాయ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేయడం.యువతకు వ్యవస్థాపక నైపుణ్యాభివృద్ధి శిక్షణను అందించడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇంక్యుబేషన్ కేంద్రాల ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాలు తదితరాలతో బ్యాక్వర్డ్ లింక్‌లను ఏర్పరచుకోవడం వంటివి లక్ష్యంగా విధానాన్ని రూపొందించుకుంది. -
అతిపిన్న వయసులోనే రికార్డులు, అవార్డులు
సాక్షి, అనకాపల్లి: అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున జన్మించిన అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన లాస్విక ఆర్య అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 6 నెలల వయస్సులో ‘వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో, 9 నెలల వయస్సులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘మెమొరి ఆఫ్ జీకే అవార్డు’ బంగారు పతకం, ప్రశంసాపత్రాలు సాధించి అందరి మన్ననలు పొందుతోంది. జాతిపిత మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, దేశంలో గల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫొటోలను గుర్తిస్తుంది. 1 నుంచి 20 వరకూ స్క్వెర్స్‌ను గుర్తించి ‘ మెమొరీ ఆఫ్ జనరల్ నాలెడ్జ్’ విభాగంలో ‘చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. అక్టోబర్ మొదటి వారంలో ‘లిటిల్ చాంప్–2023’’ ప్రశంసా పత్రాలు, ట్రోఫీ, బ్యాడ్జ్, మెడల్‌ను అందించారు. ఈ ఏడాది జూలైలో ‘ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డు’లో కూడా చిన్నారి స్థానం పొందింది. 9 నెలల వయస్సులో 4 నిమిషాల వ్యవధిలో 24 మానవ శరీర భాగాలు గుర్తించడంతో ‘మాక్సిమమ్ బాడి పార్ట్స్ ఐడెంటిఫైడ్ బై ఏ ఇన్‌ఫ్యాంట్’గా ప్రశంసాపత్రంతో పురస్కారాన్ని పొందింది. గతేడాది అక్టోబర్ 11న జన్మించిన లాస్విక ఆర్య ఏడాది కూడా పూర్తి కాకుండానే సాధిస్తున్న విజయాల పట్ల మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్షం తెలిపారు. తాను పుట్టిన ప్రపంచ బాలికల దినోత్సవానికి ఎక్కడా తీసిపోకుండా తాను సాధించిన విజయాలతో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. -
విషయ పరిజ్ఞానమే కొలమానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), నేషనల్ అచీవ్మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ (ఎన్ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్ఏస్, 2022లో ఎఫ్ఎల్ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్‌లో వివిధ రాష్ట్రాల అసెస్మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్మెంట్లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో అసెస్మెంట్ సెల్ ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎఫ్ఎల్ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది. పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. -
విదేశీ విద్యకే మొగ్గు
సాక్షి, అమరావతి: విదేశీ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు/విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో విదేశాల బాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022 నాటికి 79 దేశాల్లో 13 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే గతేడాది ఏకంగా 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పయనమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3.37 లక్షల మంది తరలివెళ్లారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు కెనడా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాకే మొదటి ప్రాధాన్యత.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) కోర్సుల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సులకు మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు వాటినే ఎంచుకుంటున్నారు. మంచి పే ప్యాకేజీల కోసం బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేవారూ ఉంటున్నారు. ఈ క్రమంలో భారతీయులు తమ మొదటి ప్రాధాన్యతను అమెరికాకే ఇస్తున్నారు. ఇక్కడ స్టెమ్ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. రెండో స్థానంలో కెనడా.. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో నిలుస్తోంది. యూఎస్‌తో పోలిస్తే వర్సిటీల్లో సీటు సాధించడం, ఇమ్మిగ్రేషన్ విధానాలు అనుకూలంగా ఉండటంతో కెనడాకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్– సిటిజన్‌షిప్ డేటా ప్రకారం.. కెనడాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో 1.86 లక్షల మందితో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక యూకే తక్కువ కాల వ్యవధిలో వివిధ కోర్సులు అందిస్తుండటం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల్లో విద్యాభ్యాసం తర్వాత శాశ్వత నివాసితులుగా మారేందుకు అవకాశాలు ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉండటంతో జర్మనీని ఎంచుకుంటున్నారు. వెనక్కి వచ్చేవారు తక్కువే.. ముఖ్యంగా 2015–19 మధ్య విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చి మంచి ఉపాధిని పొందినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. -
అంగరంగవైభవంగా సౌదీలో సాటా తెలుగు దినోత్సవం
రియాధ్: సౌదీ అరేబియా రాజధాని రియాధ్ నగరంలో అంగరంగ వైభవంగా తెలుగు దినోత్సవం నిర్వహించారు. సౌదీ అరేబియా తెలుగు సంఘం (సాటా) అధ్వర్యంలో తెలుగు దినోత్సవం, సౌదీ అరేబియా జాతీయ దినోత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భారతీయ ఎంబసీ డిచార్జి (ఉప రాయబారి) అబూ మాథన్ జార్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉంటూ తెలుగు ప్రజలు తమ సంస్కృతిక పరిరక్షణ కోసం తెలుగు దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని భారతీయ ఎంబసీ సెకండ్ సెక్రటరీ మోయిన్ అఖ్తర్ అన్నారు. ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా ఎడారిలో ఆపద సమయంలో ఆపన్న హస్తంగా సాటా పనిచేస్తుందని ప్రధాన కార్యదర్శి ముజ్జమీల్ శేఖ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రవాసీయులకు సేవలందించె ప్రముఖ మలయాళీ సామాజిక సేవకులైన నాస్, షిహాబ్, సిద్ధీఖ్ తువూర్లతో పాటు మరికొందరిని అభినందిస్తూ ప్రత్యేకంగా వారికి శాలువాలు కప్పి సన్మానించారు. -
తెలంగాణ పల్లెకు పట్టం
సాక్షి, న్యూఢిల్లీ/చిన్నకోడూరు(సిద్దిపేట): రెండు తెలంగాణ గ్రామాలను ఉత్తమ పర్యాటక గ్రామాలుగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాకతీయుల కాలం నుంచీ హస్తకళలకు ప్రసిద్ధి చెందిన జనగామ జిల్లా పెంబర్తితోపాటు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామం ఈ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ నెల 27న ఢిల్లీలో జరగనున్న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందించనున్నారు. చంద్లాపూర్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల మంత్రి హరీశ్‌రావు గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. హరీశ్‌రావు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ అన్నారు. పెంబర్తి... చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీక ఇత్తడి, కంచు లోహాలతో పెంబర్తి గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి ద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని.. పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్రం చొరవతీసుకుంది. చంద్లాపూర్.. కళాత్మకత, చేనేతల కలబోత రంగనాయక స్వామి ఆలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభా మ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యా నికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబో తకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పె రుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీర ల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. రంగనాయక స్వామి ఆలయం, పరిసర ప్రాంతాలు గ్రామీ ణ పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన నేపథ్యంతో పాటు గొల్లభామల చీరలకున్న ప్రత్యేకత కార ణంగా ఈ ప్రాంతాన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల చొరవతో చంద్లాపూర్ లోని రంగనాయకసాగర్ రిజర్వాయర్ గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. -
ఐఎఫ్ఎస్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌షోలో అదరగొట్టిన మోడల్స్, విద్యార్థులు (ఫోటోలు)
-
పటిష్ట విద్యా వ్యవస్థతో యువత ప్రగతి
సాక్షి, అమరావతి: ఒక దేశం ఆర్థికంగా, శక్తివంతంగా ఎదగాలంటే ఉన్నత విలువలు గల యువత పాత్ర ఎంతో కీలకమని ఐక్యరాజ్య సమితి సదస్సులో ఏపీ విద్యార్థులు తెలిపారు. యువత ప్రగతికి పటిష్టమైన విద్యా వ్యవస్థ అవసరమని, ఇది భారతదేశంలోను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోను బలంగా ఉందని చాటిచెప్పారు. ఏపీ నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఐక్యరాజ్య సమితి వరల్డ్ ఎస్డీజీ సమ్మిట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. వీరు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ విభాగంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్‌కు వీరు హాజరయ్యారు. యూఎన్ఓ స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్‌కుమార్ నేతృత్వంలో సదస్సుకు హాజరైన విద్యార్థినులు రాజేశ్వరి, షేక్ అమ్మాజాన్ తమ ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆర్థిక ప్రగతిలో యువత పాత్ర, భారతదేశంలో సుస్థిరాభివృద్ధి, ప్రజావైద్యం అంశాలపైన, రాష్ట్రంలో ప్రజా వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌పై వారు ప్రసంగించారు. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలు సుస్థిరాభివృది్ధకి ఏ విధంగా తోడ్పడుతున్నాయో, ఏపీ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన స మూల మార్పులు పేద కుటుంబాలకు చెందిన తమను అంతర్జాతీయ వేదికలపై ఎలా నిలి పాయో అంతర్జాతీయ ప్రతినిధులు, మేధావుల ముందు వారు వివరించారు. ఏఐ టెక్నాలజీ వినియోగించుకోవాలి.. ఇక ఐక్యరాజ్య సమితి భాగస్వామ్య సంస్థలైన యూఎన్ హాబిటాట్, యూఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్, సివిల్ సొసైటీ యూనిట్, యునిసెఫ్, ఏఎస్ఎఫ్, యూత్ అసెంబ్లీ ఆధ్యర్యంలో రెండ్రోజులుగా యూత్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న రాజేశ్వరి, అమ్మాజాన్ మాట్లాడుతూ.. ప్రపంచాన్ని ఉన్నతంగా మార్చడంలో యువత చురుౖకైన పాత్ర పోషించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, శాంతిస్థాపన, రాజకీయాలు, విధాన రూపకల్పనలో యువత నిమగ్నం కావాలని, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వినియోగించుకోవాలన్నారు. ఏపీలో పాఠశాల విద్యలో ఈ తరహా పరి జ్ఞానం అమలు చేస్తున్నారని వివరించారు. అలాగే, పాలనలోనూ, విధానపరమైన నిర్ణయాల్లోనూ యువత అభిప్రాయాలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్–పేరెంట్ కమిటీలు వేసి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు రాజేశ్వరి వివరించింది. ఏపీలో విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారని అమ్మాజాన్ తెలిపింది. షకిన్‌కుమార్ మాట్లాడుతూ.. భారత్‌లో యువతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ వారికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇందుకు 10 మంది విద్యార్థులను ఐరాస సదస్సుకు పంపడమే నిదర్శనమన్నారు. -
విధి రాతను ఎదురించి.. విశ్వ వేదికపై నిలిచి..
అతడికి కాళ్లు లేవు.. కానీ కలలు ఉన్నాయి. ఆ కుర్రాడికి కదలడానికి శక్తి లేదు.. అయితేనేం ఎదగాలనే కాంక్ష ఉంది. యువకుడి చుట్టూ కష్టాల చీకట్లు అలముకున్నాయి.. మరేం కాదు రేపటి వెలుగు కోసం వెతకడం అతడికి తెలుసు. రోడ్డు ప్రమాదంలో కాళ్లు పోగొట్టుకుని కన్నీళ్లు పెట్టిన దశ నుంచి విశ్వ వేదికపై మువ్వన్నెల జెండా పట్టుకుని గర్వంగా ఆనంద భాష్పాలు రాల్చినంత వరకు పూర్ణారావు చేసిన ప్రయాణం సాధారణమైనది కాదు. ఒక్క రోడ్డు ప్రమాదం తన బతుకును మార్చేస్తే.. ఆ మార్పును తన కొత్త ప్రస్థానానికి దేవుడిచ్చిన తీర్పుగా చేసుకున్న నేర్పరి అతడు. శ్రీకాకుళం: ఇండోనేషియాలో ఈ నెల 5నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఓ సిక్కోలు కుర్రాడు మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇంత ఘనత సాధించిన ఆ క్రీడాకారుడికి రెండు కాళ్లు పనిచేయవు. అది కూడా పుట్టుకతో కాదు. అందరిలాగానే బాల్యంలో సరదాగా గడిపి, చక్కగా చదువుకుని, విదేశంలో ఓ ఉద్యోగం వెతుక్కుని కుటుంబాన్ని పోషించేంత వరకు అతను అందరిలాంటి వాడే. కానీ ఓ రోడ్డు ప్రమాదం అతడిని దివ్యాంగుడిని చేసింది. పరిపూర్ణంగా చె ప్పాలంటే రోడ్డు ప్రమాదానికి ముందు పూర్ణారావు వేరు. ప్రమాదం తర్వాత పూర్ణారావు వేరు. టెక్కలి మండలం శ్రీరంగం గ్రామంలో ని రుపేద కుటుంబానికి చెందిన చాపరా లక్ష్మణరావు, మోహిని దంపతుల చిన్న కుమారుడు చాపరా పూర్ణారావు. పూర్ణారావు ఇంటర్ పూర్తి చేసి 2015 సంవత్సరంలో సింగపూర్‌లో ఫైర్ సేఫ్టీలో ఉద్యోగంలో చేరాడు. తన తల్లిదండ్రులను చూసేందుకు 2017 సంవత్సరంలో సొంత గ్రామం వచ్చాడు. మరో రెండు రోజుల్లో సింగపూర్ వెళ్లిపోతున్న తరుణంలో వజ్రపుకొత్తూరు మండలం పూండి సమీపంలో ద్విచక్రవాహనంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో వెన్నుపూసకు తీవ్రంగా గాయం కావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆ ప్రమాదం పూర్ణారావు బతుకులో చీకట్లు నింపింది. 2020 వరకు ఇంటిలో మంచానికే పరిమితమయ్యాడు. చిన్నపాటి పాన్‌షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులకు పూర్ణారావు పరిస్థితి మరింత ఆవేదనకు గురి చేసింది. ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని.. అప్పుడే ఫేస్బుక్లో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రం గురించి పూర్ణారావు తెలుసుకున్నాడు. స్నేహితుల ఆర్థిక సహకారంతో బెంగళూరులో గల దివ్యాంగుల పునరావాస కేంద్రంలో చేరాడు. అక్కడ మనోధైర్యంపై నేర్చుకున్న అంశాలు అతడిని ఒక లక్ష్యానికి దగ్గర చేశాయి. ఈ క్రమంలో పారా బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది. యూట్యూబ్‌లో వీడియోలను చూస్తూ సొంతంగా నేర్చుకున్నాడు. తోటి మిత్రులతో కలిసి ప్రతి రోజూ సాధన చేసేవాడు. తొలి ఆటలోనే.. 2020లో కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పూర్ణారావు మొట్టమొదటిగా పాల్గొని గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించాడు. దీంతో అతని పట్టుదలకు మెడల్స్ మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. ఆ తర్వాత భువనేశ్వర్‌లో జరిగిన నాల్గో నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పాల్గొన్నప్పటికీ ఎలాంటి మెడల్స్ రాలేదు. దీంతో కొంత నిరాశ చెందినప్పటికీ, పూర్ణారావు ఆటను కోచ్ ఆనంద్‌కుమార్ గమనించారు. దీంతో మైసూర్లో 2 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత లక్నోలో జరిగిన ఐదో నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని క్వార్టర్స్ ఫైనల్ వరకు వెళ్లాడు. 2023 జూలై నెలలో యుగాండాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీలకు సిద్ధమైనప్పటికీ పాస్ పోర్టు సక్రమంగా లేదని ఎయిర్‌పోర్టులోనే ఆపివేశారు. దీంతో పూర్ణారావు తీవ్ర నిరాశతో వెనుతిరిగాడు. మెడల్స్‌తో ఉత్సాహం తాజాగా సెప్టెంబర్ 5 నుంచి 10 తేదీలలో ఇండోనేషియాలో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పూర్ణారావు పాల్గొని మిక్స్డ్ డబుల్స్‌లో సిల్వర్, డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. అతను ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను సాధించాడు. కర్ణాటక ఓపెన్ స్టేట్ టోర్నమెంట్లో 2 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించాడు. 2002లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2023లో విశాఖపట్టణంలో జరిగిన టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. వీటితో పాటు 2023 మార్చి నెలలో విశాఖపట్టణంలో జరిగిన ఏపీ నేషనల్ ట్రయల్స్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ గెలిచాడు. పారా ఒలింపిక్సే లక్ష్యం నాకు ఆర్థిక సాయం అందితే పారా ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి పతకం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మరి కొద్ది రోజుల్లో ఖేలో ఇండియా టోర్నమెంట్‌తో పాటు జపాన్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నా. – చాపరా పూర్ణారావు -
20 శాతం ట్యాక్స్.. అక్టోబర్ 1 నుంచే..
అంతర్జాతీయ వ్యయాలపై కేంద్రం పెంచిన 20 శాతం టీసీఎస్ (TCS) పన్ను అక్టోబర్ 1 నుంచే అమలు కానుంది. సరళీకృత రెమిటెన్స్ పథకం (LRS) కింద ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ. 7 లక్షల పరిమితికి మించి చేసిన విదేశీ ఖర్చులపై మూలం వద్ద ఈ పన్నును వసూలు చేస్తారు. విద్య లేదా వైద్య సంబంధ చెల్లింపులు మినహా ఇతర విదేశీ ఖర్చులపై ఈ పన్నును కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే ప్రస్తుతం 5 శాతం పన్ను ఉండగా అక్టోబర్ 1 నుంచి 20 శాతం ఉంటుంది. LRS కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.2,50,000 వరకు చెల్లింపులను అనుమతిస్తుంది. LRS చెల్లింపులు, వారి వెల్లడించిన ఆదాయాల మధ్య వ్యత్యాసాలను గుర్తించిన ఆర్థిక శాఖ LRS కింద కొత్త టీసీఎస్ రేట్లను 2023 బడ్జెట్ సందర్భంగా ప్రస్తావించింది. కొత్త రేట్లు వైద్య లేదా విద్యా ఖర్చులపై ఎటువంటి మార్పును తీసుకురానప్పటికీ, రియల్ ఎస్టేట్, బాండ్లు, విదేశీ స్టాక్‌లు, టూర్ ప్యాకేజీలు లేదా ప్రవాసులకు పంపే బహుమతులు వంటి వాటికి చేసే ఖర్చులపై ప్రభావం చూపనున్నాయి. ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 206C, సబ్-సెక్షన్ 1G ప్రకారం.. LRS లావాదేవీలపై, విదేశీ టూర్ ప్యాకేజీల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం టీసీఎస్‌ను వసూలు చేస్తుంది. -
సింగపూర్ లో శాస్త్రోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం
లోకాసమస్త సుఖినో భవంతు అన్న మహా సత్సంకల్పంతో మన ఋషులు వేద ప్రమాణంగా నిర్దేశించిన దిశను, సాంప్రదాయ, అనుష్ఠానాలని కొనసాగించాలన్న ముఖ్య ఉద్దేశం తో సింగపూర్ లో నివసించే కొంతమంది తెలుగు బ్రాహ్మణులు ఒక సమూహంగా ఏర్పడి, ధర్మ నిరతి, ధర్మ అనుష్టానం కొరకు 2014 నుంచి అనేక కార్యక్రమాలు (నిత్యసంధ్యావందనం, లక్ష గాయత్రి హోమం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతం, మాస శివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకం) నిర్వహిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో 16 Sept 2023 (భాద్రపద శుద్ధ పాడ్యమి నాడు) జరిగిన ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. దాదాపు 40 మందికి పైగా రుత్వికులు పాల్గొన్న ఈ కార్యక్రమములో సింగపూర్ లో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలు లలితా పారాయణం, సౌందర్య లహరి, లింగాష్టక పఠనం, హారతి గానంతో అందరిని మంత్రముగ్దులను చేసారు. కార్యక్రమమునకు విచ్చేసిన మహిళలు అందరు చక్కని సమన్వయంతో తీర్ధ ప్రాసాదాలను, చక్కటి తెలుగు సాంప్రదాయ ప్రసాద విందుని ఏర్పటు చేసారు. (చదవండి: కొలంబియా వర్సిటీలో ఏపీ విద్యార్థుల ప్రసంగం) -
చైనాలోని రాచప్రాసాదం.. ఏకంగా 8వేలకు పైగా గదులు
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాసాదం. చైనా రాజధాని బీజింగ్‌లో దాదాపు 178 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈ ప్రాసాదం ‘ఫర్బిడెన్ సిటీ’గా పేరు పొందింది. చైనాలోని మింగ్ వంశీయులు చేపట్టిన దీని నిర్మాణం 1406లో మొదలుపెడితే, 1420లో పూర్తయింది. హోంగ్వు చక్రవర్తి కొడుకు ఝుడి నాన్జింగ్ నుంచి బీజింగ్‌కు తన రాజధానిని మార్చుకున్నాక, బీజింగ్‌లో ఈ నిర్మాణం చేపట్టాడు. దాదాపు ఐదు శతాబ్దాల కాలం ఇది చైనా చక్రవర్తులకు రాచప్రాసాదంగా వర్ధిల్లింది. కమ్యూనిస్టు పాలన మొదలయ్యాక ఇది మ్యూజియంగా మారింది. దాదాపు ఒక ఊరంత విస్తీర్ణంలో ఉన్న ఈ సువిశాల ప్రాసాదంలో 980 భవంతులు, 8,886 గదులు ఉన్నాయి. యునెస్కో దీనిని 1987లోనే ప్రపంచ వారసత్వ నిర్మాణంగా ప్రకటించింది. ఈ అద్భుత నిర్మాణాన్ని ఏటా సుమారు 15 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తుంటారు. (చదవండి: Karnataka Sakaleshapura : సకలేశపుర చూడడానికి రెండు కళ్లు చాలవు.!) -
ఫ్యాషన్ నా పాషన్
‘మనలోని రకరకాల భయాలే అపజయాలకు కారణాలు అంటారు’ వాలెంటీనా మిశ్రా. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వాసి అయిన వాలెంటీనా జాతీయ, అంతర్జాతీయ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొనే కిడ్స్, మిస్, మిస్టర్ అండ్ మిసెస్ కి పద్దెనిమిదేళ్లుగా గ్రూమింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నారు.మనలోని ఆత్మవిశ్వాసమే కోరుకున్న శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది అని చెబుతున్న వాలెంటీనా శాస్త్రీయ నృత్యకారిణి కూడా. ఇద్దరు పిల్లలకు తల్లి. మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్ బల్గేరియా పోటీలకు వైస్ ప్రెసిడెంట్‌గా,15 అంతర్జాతీయ పోటీలకు నేషనల్ డైరెక్టర్‌గా, 12 దేశాలలో జరిగిన పోటీలకు 50 కి పైగా పోటీదారులను తీర్చిదిద్దిన వాలెంటీనా మిశ్రా ఫ్యాషన్ నా పాషన్ అంటూ ఆ రంగంలోకి తన పయనాన్ని ఈ విధంగా వివరించారు. ‘‘పద్దెనిమిదేళ్ల ఈ ప్రయాణంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని కలిశాను. ముఖ్యంగా మహిళలను. ఒక మహిళ మాత్రమే మరో మహిళను శక్తిమంతంగా మార్చగలదు అనేది నేను బలంగా నమ్ముతాను. సుస్మితా సేన్, ఐశ్వర్యారాయ్ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని గెలు΄పొందిన రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయి తనూ మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కావాలనుకుంది. అలాగే నేనూ అనుకున్నాను. లైట్స్, కెమరా ప్లాష్‌లు, స్టేజ్, చప్పట్ల మోతలు.. ఇవన్నీ అమ్మాయిలకు ఒక అద్భుతంగా ఉంటుంది. నన్ను నేను అలాంటి స్టేజ్‌పైన చూసుకోవాలనుకున్నాను. అదృష్టవశాత్తు చిన్నప్పడు శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నాను. గ్రూప్ సాంగ్ పోటీల్లోనూ చురుగ్గా ఉండేదాన్ని. స్టేజ్ ఫియర్ అస్సలు ఉండేది కాదు. ఇండస్ట్రియల్ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాను. కానీ, నాకు నచ్చిన రంగం ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఇండస్ట్రీ. పోటీలు నిర్వహించాను.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉండటం వల్ల గ్రూమింగ్ అవకాశాలు వచ్చాయి. గ్రూమింగ్ అంటే ఒక క్యాట్‌వాక్ ఒక్కటే కాదు, మాట్లాడటం, బాడీ లాంగ్వేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వ్యక్తిత్వం, ఐక్వూ్య లెవల్స్.. అన్నీ కలిసి ఉంటాయి. సాధారణంగా మోడల్స్ 18 నుంచి 25 వరకు ఇండస్ట్రీలో ఉంటారు.ఆ తర్వాత కొత్తవారు వస్తుంటారు. పెళ్లికి ముందు వరకు మెరుస్తారు. ఆ తర్వాత మాయమవుతారు. నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇవన్నీ చూశాను. చాలా మందిని కలవడం వల్ల కూడా గ్రూమింగ్ సెషన్స్వైపు దారితీసేలా చేసింది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే గ్రూమింగ్ సెషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాను. కేరళలో జరిగే మిస్ సౌత్ ఇండియా, మిస్ క్వీన్ ఆఫ్ ఇండియా ఈ రెండు పోటీలకు గ్రూమర్‌గా నా కెరియర్ స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి దేశ,అంతర్జాతీయ పోటీలకు గ్రూమర్‌గా వర్క్ చేస్తున్నాను. నా అనుభవాన్నంతా కలిపి ‘డీలా వాలెంటీనా’ అని నా సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. పిల్లలతో కాంటెస్ట్.. ఈ రోజుల్లో పిల్లలకు ఎక్స్పోజర్ చాలా ఎక్కువైపోయింది. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువస్తుంటారు. చాలా కంప్లైంట్స్ చెబుతుంటారు. కానీ, పిల్లలకు గ్రూమింగ్ చేస్తున్నప్పుడు వారితో నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇంటర్నేషనల్ పేజెంట్స్తోనూ కలిసి వర్క్ చేశాను. ఇండియన్ కిడ్స్, గర్ల్, బాయ్స్‌ని టీమ్స్‌గా ఎంపిక చేసి, 25 దేశాల్లో వారి ప్రతిభను పరిచయం చేశాను. దేశవ్యాప్తంగా వచ్చిన ఎంట్రీల నుంచి కొంతమందిని ఎంపిక చేసుకొని, ముందు ఇంటర్వ్యూ చేసి, షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. ఎవరైనా కాన్ఫిడెంట్ కాస్త లో ఉంది అనిపించినా వారిని ప్రిపేర్ చేస్తుంటాను. ప్రతి ఒక్కరిలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. వాటిలో సన్నగా లేదా లావుగా ఉన్నాను అనో, రంగు తక్కువ ఉన్నాననో.. ఇలాంటి భయాలను గుర్తించి, వారి ఆలోచనలను పాజిటివ్‌గా మారుస్తుంటాను. పెళ్లి తర్వాత... నేను ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటాను. నన్ను నేనే కాదు ఎదుటివారినిప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటాను. గతం వదిలేయాలి, భవిష్యత్తులో కాకుండా ప్రస్తుతంలో జీవించాలి.. అనుకుంటాను. నాకు 21 ఏళ్ల వయసులో పెళ్లి అయ్యింది. పెళ్లి తర్వాత ఫ్యాషన్ ఇండస్ట్రీ గురించి ఆలోచన అవసరమా.. అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. కానీ, మా అమ్మనాన్నలు, మా వారు నన్నుప్రోత్సహించారు. మా వారు రవికూమార్ నేవీ ఆఫీసర్. ఇద్దరు పిల్లలు. అబ్బాయి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నాడు, మా అమ్మాయి 12వ తరగతి చదువుతంది. తను కూడా కిడ్స్ గ్రూప్‌లో పదేళ్ల వయసు టీమ్‌లో సౌత్ ఆప్రికాలో జరిగిన బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్లొంది. ఒక వ్యక్తిత్వం సంతరించుకున్నాక ఏమీ చేయలేం అంటారు. కానీ, ఏ దశలోనైనా మానసిక స్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ఏ కష్టం లేకుండా రాత్రికి రాత్రి విజయాలు రావు. ఈ పద్దెనిమిదేళ్ల టైమ్‌లో నా ఎక్సీపీరియన్స్, హార్డ్ వర్క్‌తోనే సక్సెస్ అయ్యాను. నాకోసం కొంత సమయం.. పిల్లలు, పెద్దలు, ఆడ–మగ ఎవ్వరైనా.. ఫిజిక్‌ను కాపాడుకోవాలంటే అది ఫ్యాషన్ ఇండస్ట్రీయే కానక్కర్లేదు. గ్రూమర్‌గా రాణించనక్కర్లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవల్స్ పెంచుకుంటూ హార్డ్ వర్క చేస్తేనే విజయం సొంతం అవుతుంది. ఇంటి పని చేసే గృహిణి అయినా, ఉద్యోగి అయినా తమకోసం తాము ఓ అరగంట కేటాయించుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ కోసం ఏదైనా ఆరుబయట ఆడే ఆటలు, వాక్, యోగా, జుంబా, జిమ్... ఏదైనా చేయండి. ఒక అరగంట చాలు. అలాగే పోషకాహారం తీసుకోవడంలో శ్రద్ధ పెట్టాలి. కూరగాయలు, పండ్లు... ఏవైనా రొటీన్‌గా కాకుండా మార్చుకుంటూ తీసుకోవాలి. మన ΄÷ట్ట ఒక బెలూన్. ఎంత తింటే అంత పెరుగుతుంటుంది. బరువు పెరిగాక బాడీని వెనక ఫిట్నెస్కి తీసుకురావలని కష్టపడేకన్నా ముందే సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది’’ అని వివరించారు ఈ బ్యూటీ అండ్ గ్రూమర్.– నిర్మలారెడ్డి -
మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ మేటి
సాక్షి, హైదరాబాద్: ఏ నగరమైనా వృద్ధిలోకి రావాలంటే అక్కడి మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండాలని, ఈ విషయంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నా రు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా శనివారం ఏర్పాటు చేసిన 2 రోజుల ‘టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్పో’ మూడవ ఎడిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పల్లెలు సమగ్ర, సమీకృత, సమ తుల్య వృద్ధిలో కొనసాగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలు ఇక్కడి రియల్ రంగాన్ని ఉన్నతస్థాయిలో నిలుపుతూ, పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చెప్పారు. అయితే విశ్వనగరంగా నిరూపించుకోవడానికి ఈ వృద్ధి సరిపోదని తెలిపారు. 31 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో పూర్తి చేయబోతున్నామని, రానున్న పదేళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ దాదాపు 415 కిలో మీటర్ల మెట్రో కోసం ప్రణాళికలు చేపడుతు న్నామని వెల్లడించారు. ముంబై తరువాత అతిపెద్ద 2వ స్కై స్క్రీపర్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుందని, 57 అంతస్తులతో స్కై స్క్రీపర్స్ నిర్మించడానికి ఈ మధ్యనే హెచ్ఎండీఏ 12 అనుమతులను అందించిందని మంత్రి తెలిపారు. విశ్వనగరంగా మారాలంటే నగరం నలుమూలల్లో అభివృద్ధి జరగాలి. దీనికి రియల్ రంగం సహకరించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో 40 నుంచి 45 శాతం హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి ఉంటుంది. అందుకే నగరాల వృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి ప్రత్యేకంగా కోరారు. టీఎస్, ఏపీ రెస్పాన్స్ హెడ్ కమల్ క్రిష్ణన్ మాట్లాడుతూ, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్‌పోకు విభిన్న వర్గాల నుంచి అనూహ్య స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. -
అనారోగ్యంతో తుర్కియే గుహలో చిక్కుబడిన అమెరికా అన్వేషకుడు
ఇస్తాంబుల్: తుర్కియేలోని ఓ గుహలో వెయ్యి మీటర్ల లోతులో అనారోగ్యంతో చిక్కుకుపోయిన అమెరికాకు చెందిన మార్క్ డికే(40)ను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అన్వేషణలో భాగంగా తుర్కియేలోని టారస్ పర్వతాల్లో ఉన్న మోర్కా గుహల్లోకి మార్క్ డికే వెళ్లారు. మోర్కా గుహ లోతు 1,276 మీటర్లు కాగా, మార్క్ డికే 1,120 మీటర్ల లోతులోని బేస్‌క్యాంప్‌లో ఉన్నారు. జీర్ణాశయంలో రక్తస్రావం కారణంగా ముందుకు వెళ్ల్లలేని స్థితిలో ఉండిపోయారని యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ ప్రకటించింది. ఆయనకు అనేక అంతర్జాతీయ గుహాన్వేషణల్లో పాలుపంచుకున్న అనుభవం ఎంతో ఉంది. గృహల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో స్వయంగా ఆయన సిద్ధహస్తుడని వివరించింది. సాధారణ పరిస్థితుల్లో అనుభవజు్ఞలైన గృహాన్వేషకులకే అక్కడికి వెళ్లేందుకు 15 గంటలు పడుతుందని టర్కిష్ కేవింగ్ ఫెడరేషన్ వివరించింది. మార్క్ డికే కోసం ఆరు యూనిట్ల రక్తం పంపించామని టర్కీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. డికేను కాపాడేందుకు తుర్కియే, అమెరాకాతోపాటు హంగరీ, బల్గేరియా, ఇటలీ, క్రొయేíÙయా, పోలాండ్ దేశాలకు చెందిన 150 మంది నిపుణులను రప్పిస్తున్నట్లు యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ తెలిపింది. ఎంతో క్లిష్టమైన ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజుల వరకు పట్టవచ్చని చెబుతున్నారు. -
హార్ట్ ఎటాక్ రెస్టారెంట్.. ఫుడ్ తింటే నిజంగానే గుండెనొప్పి వస్తుందేమో!
ఈమధ్యకాలంలో రెస్టారెంట్ బిజినెస్‌కి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ట్రెండ్‌కు తగ్గట్లు కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు హోటల్ నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. డిఫరెంట్ థీమ్స్‌తో,క్యాచీ నేమ్స్‌తో వ్యాపారాన్ని బాగా విస్తరిస్తున్నారు. అయితే అమెరికాలోని ఓ రెస్టారెంట్ పేరు వింటే మాత్రం మీకు గుండెదడ వచ్చేస్తుంది. ఎందుకంటే, ఆ రెస్టారెంట్ పేరు హార్ట్ ఎటాక్. పేరుకు తగ్గట్లే హాస్పిటల్ థీమ్ మొత్తం హాస్పిటల్ మాదిరి ఉంటుంది. మరి ఈ వెరైటీ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? ఎలాంటి వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ అక్కడ దొరుకుతాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పటివరకు రకరకాల వెరైటీ రెస్టారెంట్ పేర్లను విన్నాం, చూశాం. కానీ ఈ రెస్టారెంట్ పేరు వింటేనే గుండెనొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ రెస్టారెంటపేరు హార్ట్ ఎటాక్ రెస్టారెంట్. అక్కడి ఫుడ్ ఐటెమ్స్ తింటే నిజంగానే మీకు హార్ట్ ఎటాక్ వస్తుందేమో. ఇక్కడ దొరికే బైపాస్ బర్గర్లు తింటే ఏకంగా 10వేల క్యాలరీల శక్తి లభిస్తుంది. బైపాస్ బర్గర్ అంటే ఒకదానిపై మరొకటి పెడుతూ వాటిలో ఉంచే పదార్థాల మోతాదును కూడా పెంచుకుంటూ పోతారు. కేవలం బర్గర్లు మాత్రమే కాదు, అక్కడ దొరికే ప్రతీ ఫుడ్ ఐటెంలో కొవ్వు అతిగానే ఉంటుంది. 2005లో జాన్ బాసో అనే వ్యక్తి ఈ ''హార్ట్ ఎటాక్ గ్రిల్'' రెస్టారెంట్‌ను ప్రారంభించగా వెరైటీగా ఉండటంతో కొద్ది నెలల్లోనే ఈ రెస్టారెంట్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ రెస్టారెంట్ లోపలికి వెళ్లగానే రెస్టారెంట్‌కి వచ్చామా? లేక హాస్పిటల్‌కి వచ్చామా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్ పేషెంట్స్‌లా గౌనులు వేసుకొని వెళ్లాలనే రూల్ ఉంది. ఇక అక్కడి వెయిటర్స్ నర్సులు, డాక్టర్లుగా డ్రెస్ చేసుకుంటారు. అంతేకాకుండా కస్టమర్లు ఇచ్చే ఆర్డర్స్‌ను ‘ప్రిస్క్రిప్షన్’ అంటారు. ఒకవేళ ఆర్డర్ చేశాక ఫుడ్ ఐటెమ్స్ తినకపోతే మీకు శిక్ష కూడా ఉంటుంది. అదేంటంటే నర్సులు వచ్చి సరదాగా బెల్ట్‌తో కొడతారట. ఇవన్నీ వింటుంటే..పిచ్చోళ్ల గురించి వినడమే కాదు.. చూడటం ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది కదా. ఈ రెస్టారెంట్లో మరో వింత ఏమిటంటే 350 పౌండ్ల కన్నా అధిక బరువున్న వాళ్లకు ఎంత తింటే అంత ఫుడ్ ఫ్రీగా పెడతారట. View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) View this post on Instagram A post shared by Heart Attack Grill (@heartattackgrill) అయితే కస్టమర్ల ఆరోగ్యాన్ని హానిచేసేలా విపరీతమైన జంక్‌ను ఎంకరేజ్ చేసేలా ఈ రెస్టారెంట్ ఉందని పలువురు విమర్శిస్తున్నారు. దీంతో తరచూ ఈ రెస్టారెంట్ వార్తల్లో నిలుస్తుంది. అయితే అక్కడ తినడం వల్ల ఆరోగ్యానికి హానీ అని తెలిసినా కస్టమర్ల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉండటం మరో విశేషం. -
నెట్టింట అద్భుతంగా అలరించిన అక్కినేని శతజయంతి
'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా', 'వంశీ ఇంటర్నేషనల్' అండ్ ' సాంస్కృతిక కళాసారథి- సింగపూర్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో "నవరసాల నటసామ్రాట్" (అక్కినేని నటనా వైదుష్యం) అనే విలక్షణ కార్యక్రమం అంతర్జాల మాధ్యమంలో ఆదివారం 2 గంటల పాటు అద్భుతంగా నిర్వహింపబడింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి సందర్భంగా.. అమెరికా, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, ఖతార్, ఒమాన్, భారత్ దేశాల నుంచి 50మంది ప్రఖ్యాత రచయితలు/రచయిత్రులు పాల్గొని, ఆణిముత్యాలైన 50 సినిమాలలో అక్కినేనిగారి నటనా వైదుష్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు అందించారు. నిర్వాహక సంస్థల అధ్యక్షులైన డా వంగూరి చిట్టెన్ రాజు, డా వంశీ రామరాజు, కవుటూరు రత్నకుమార్, ప్రముఖ సినీ కవి భువనచంద్ర తమ సందేశాలు అందించగా, కార్యక్రమ ప్రధాన సమన్వయకర్త రాధిక మంగిపూడి సభానిర్వహణ గావించారు. ప్రముఖ అవధాని డా పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, రచయిత్రులు కె.వి కృష్ణకుమారి, గంటి భానుమతి, డా తెన్నేటి సుధాదేవి, తిరునగరి దేవకీదేవి, గాయని సురేఖ మూర్తి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డా టి గౌరీశంకర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డా సూర్య ధనంజయ్ మొదలైనవారు ఈ కార్యక్రమంలో ప్రసంగించగా, "మనం" సినిమా మాటల రచయిత అయిన సినీ నటుడు హర్షవర్ధన్ మనం సినిమాపై విశ్లేషణ వ్యాసం అందించారని నిర్వాహకులు డా వంశీ రామరాజు తెలియజేశారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ అక్కినేని గారి అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన సంఘటనలను, తనకు వారితో ఉన్న ప్రత్యక్ష అనుబంధాన్ని గురించి పంచుకున్నారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక, భగ్న ప్రేమిక, హాస్య భరిత, భక్త పాత్రలలో దేనిలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి చిత్రం ఆసాంతం ఆకట్టుకునేలా నటించగలిగే అద్వితీయ ప్రతిభ అక్కినేనిగారిది. దానిని నిరూపించే విధంగా ఉన్న 50 సినిమాలలో వారి నట విశ్వరూపాన్ని విశ్లేషిస్తూ ఏడు దేశాల నుంచి 50 మంది వక్తలు మాట్లాడటం ఇదే తొలిసారి అని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. అనితర సాధ్యమైన నటనతో, అతి స్పష్టమైన ఉచ్చారణతో, కళ్ళతోనే అనేక భావాలు పలికించగలిగే అక్కినేని నాగేశ్వరరావు గారి నటన గురించి వారి శతజయంతి సందర్భంగా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అందరూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమం శ్రీ సాంస్కృతిక కళాసారథి అండ్ కల్చరల్ టీవి యూట్యూబ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. సుమారు వెయ్యి మందికి పైగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాల నుంచి వీక్షించారు. (చదవండి: ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే ఇక్కడ ఉన్నాం! సింగపూర్ ఎన్నారైల భావోద్వేగం) -
అంతర్జాతీయ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా మాజీ జస్టిస్ ఎన్వీ రమణ!
సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానల్ సభ్యునిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని ప్రధాన తెలుగు సంస్థలైన సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ మొదలైన సంస్థల ప్రతినిధులు వారిని గౌరవపూర్వకంగా కలిసి తమ సంస్థల తరఫున అభినందనలు తెలియజేసి సత్కరించారు. “తెలుగువారికే గర్వకారణమైన జస్టిస్ ఎన్వీ రమణను, వారి సింగపూర్ పర్యటన సందర్భంగా కలుసుకోవడం, వారికి తమ సంస్థ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అన్నింటిని తెలియపరచి వారి ఆశీస్సులు అభినందనలు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని" 'సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ "తెలుగు వారంతా ఒక్కటిగా, ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తించి మీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరం అవుతుందని, ఆ ప్రక్రియలో తమ సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని" అన్నారు. ఈ సందర్భంగా సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి తదితరులు జస్టిస్ రమణని కలిసి సత్కరించారు. (చదవండి: ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు!) -
అమెరికా పర్యటనలో కేటీఆర్...క్రిటికల్ రివర్ కంపెనీతో భేటీ
తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పారిశ్రామిక దిగ్గజాలను కలుస్తూ వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. తాజాగా క్రిటికల్ రివర్ కంపెనీ ప్రతినిధులు, ఫౌండర్ అంజి మారంతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ సెల్ కో-ఆర్టినేటర్ మహేశ్ బిగాల సైతం కంపెనీ ప్రతినిధులను కలిశారు. నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు వారు సంసిద్దత వ్యక్తం చేశారని మహేశ్ బిగాల తెలిపారు.నిజామాబాద్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని, రానున్న రోజుల్లో క్రిటికల్ రివర్ కంపెనీ ఓ బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. అలాగే ప్రస్తుతం కాలిఫోర్నియా, హైదరాబాద్, విజయవాడలో కలిసి 1000 మంది ఉద్యోగులతో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీలో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఎన్నారై, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ TSTPC విష్ణు వర్ధన్ రెడ్డి, క్రిటికల్ కేర్ ఫౌండర్ అంజి మారం, తదితరులు పాల్గొన్నారు. -
కువైట్‌లో ఘనంగా వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
కడప పార్లమెంట్ సభ్యులు వై.ఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా నిర్వహించారు. కువైట్ వైఎస్ అవినాష్ రెడ్డి యూత్ అసోషియేషన్ నాయకులు, ముల్లా జిలాన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ సిపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు పాల్గొన్నారు. వీరితో పాటు కువైట్ వైఎస్ఆర్ సిపీ నాయకులు సహా అవినాష్ అభిమానులు బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అవినాష్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రవాసాంధ్రులంటే ప్రత్యేక అభిమానమని, వాళ్ల సమస్యలు ఏవైనా ఆయన దృష్టికి వెళితే వెంటనే స్పందించి పరిష్కరించడానికి కృషి చేస్తారని గోవిందు నాగరాజు పేర్కొన్నారు. కరోనా కష్ట కాలంలో గల్ఫ్ లో ఉన్న ప్రవాసాంధ్రులను ఆదుకున్న గొప్ప వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి మైనార్టీ నాయకులు షేక్ రహమతుల్లా కొనియాడారు. -
విమానాశ్రయాల్లో చేనేత అమ్మకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత వస్త్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రధాన కాంప్లెక్స్‌లలో ఆప్కో స్టాల్స్ ఏర్పాటు చేసింది. తాజాగా విమానాశ్రయాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో విజయవాడ (గన్నవరం), తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయంతోపాటు మెహిదీపట్నం ( హైదరాబాద్), మృగనాయని(భోపాల్), కర్నూలు జిల్లా లేపాక్షి, మంగళగిరిలోనూ ఆప్కో నూతన షోరూంలను ప్రారంభించారు. ప్రైవేటు వస్త్ర వ్యాపార సంస్థలకు దీటుగా అధునాతన వసతులతో ఆప్కో షోరూంలను ప్రారంభించడం విశేషం. చేనేతను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా ఆప్కో స్టాల్స్, షోరూంలను పెంచడంతోపాటు మరోవైపు స్థానికంగా డిస్కౌంట్ సేల్, చేనేత సంఘాల ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతోను, వినూత్నమైన, నాణ్యమైన చేనేత వస్త్రాల తయారీని ప్రోత్సహిస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు వారానికి ఒక్కరోజైనా చేనేత వ్రస్తాలు ధరించేలా పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం జగన్ చర్యలు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్, ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ ఎంఎం నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చేనేత రంగానికి ఊతమిచ్చేలా సీఎం వైఎస్ జగన్ అనేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. ‘నేతన్న నేస్తం’ తదితర కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. చేనేత వస్త్రాల విక్రయాలను ప్రోత్సహించి ఆ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సుమారు 1.75లక్షల కుటుంబాలకు అండగా నిలిచేలా ఆప్కో ద్వారా పలు చర్యలు చేపట్టినట్టు వివరించారు. రాష్ట్రంలోని చేనేత సొసైటీల వద్ద ఉన్న వ్రస్తాల నిల్వలను క్లియర్ చేసి సొసైటీలను ఆదుకునేలా విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆప్కో షోరూంల ద్వారా ఈ ఏడాది రూ.50కోట్ల విక్రయాలు జరపాలని నిర్ణయించినట్లు ఎంఎం నాయక్ తెలిపారు. -
కార్బన్ క్రెడిట్స్ మార్కెట్‌కు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్ వచ్చే ఏడేళ్లలో భారీగా విస్తరించనున్నట్టు ఈ రంగానికి సేవలు అందించే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ సీఎండీ మనీష్ దబ్‌కర తెలిపారు. 2030 నాటికి ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు (రూ.20.75 లక్షల కోట్లు) చేరుకుంటుందన్నారు. పలు కారణాల వల్ల ప్రస్తుతం ఈ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వడ్డీ రేట్ల పెరుగుదల, డిమాండ్ తగ్గడంతో కార్బన్ క్రెడిట్ ధరలు 80 శాతం తగ్గినట్టు చెప్పారు. ‘‘స్వచ్ఛంద కార్బన్ ఆఫ్సెట్ మార్కెట్ 2021 నాటికి 2 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్కడి నుంచి క్షీణించడం వల్ల ఇప్పుడు 500 మిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అయినప్పటికీ పలు రేటింగ్ ఏజెన్సీలు కార్బన్ మార్కెట్ పుంజుకునే విషయమై సానుకూలంగా ఉన్నాయి’’అని దబ్‌కర వివరించారు. బార్క్లేస్ నివేదికను ఉదహరిస్తూ.. ‘‘పలు దేశాలు అమలు చేస్తున్న కఠినమైన పర్యావరణ అనుకూల విధానాలు, ప్యారిస్ ఒప్పందం కింద కర్బన ఉద్గారాలను తగ్గించుకునే విషయంలో వాటి అంకితభావం, కార్పొరేట్ సస్టెయినబులిటీ లక్ష్యాలు అనేవి కార్బన్ క్రెడిట్ మార్కెట్ వృద్ధికి దోహదపడతాయి. 2030 నాటికి 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుంది’’అని దబ్‌కర ఓ వార్తా సంస్థతో తెలిపారు. కార్బన్ క్రెడిట్ మార్కెట్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన సమయంలో మనీష్ దబ్‌కర తన అభిప్రాయాలను పంచుకున్నారు. కార్బన్ మార్కెట్‌కు కేంద్రం మద్దతు ‘‘కార్బన్ మార్కెట్‌కు సంబంధించి ఓ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే కొంత వరకు కార్బన్ మార్కెట్ ఇక్కడ ఉంది. పునరుత్పాదక ఇంధనం కలిగి ఉన్నామంటే అది కార్బన్ క్రెడిట్ అవుతుంది. ఇంధన ఆదా సరి్టఫికెట్లు కూడా కార్బన్ మార్కెట్లో భాగమే. ఈ రెండింటినీ కలిపి కార్బన్ క్రెడిట్‌గా మార్చి విక్రయిస్తాం’’అని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లోగడ చెప్పడం గమనార్హం. ఇండోర్ కేంద్రంగా పనిచేసే ఈకేఐ ఎనర్జీ సరీ్వసెస్ అంతర్జాతీయ కార్బన్ క్రెడిట్ మార్కెట్లో ప్రముఖ కంపెనీగా ఉంది. -
కూరగాయలే ఎక్కువగా తినాలి
రామచంద్రాపురం (పటాన్చెరు): ‘ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి..కానీ కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని’అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కో వోపేరీస్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఇక్రిశాట్లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మార్కో వోపేరీస్ విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లోనూ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారని, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పారు. ఆదాయం తక్కువగా ఉన్న ప్రజలు సైతం ఎక్కువ మాంసాహారం తీసుకుంటున్నారని, అభివృద్ధి చెందిన ఫ్రాన్స్‌లాంటి దేశాల్లో సైతం కూరగాయలు ఎక్కువగా తినడం లేదన్నారు. తైవాన్, జపాన్, వియత్నాం, కొరియాలాంటి దేశాల్లో కూరగాయలను ఆహారంగా తీసుకునేవారి ఎక్కువ అని, భారత్‌లో అయితే 145 గ్రాముల కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నారని తెలిపారు.కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు. అవసరమైతే కూరగాయల నుంచి తీసిన జ్యూస్ భద్రపరచుకొని దానిని తీసుకోవచ్చన్నారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ టీకే బెహెరా, ప్రపంచ విత్తనపరిశోధన సంస్థ రీజినల్ డాక్టర్ రామ్‌నాయర్ తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు విద్యార్థులకు షాక్ - 21 మంది అమెరికా నుంచి వెనక్కి
అమెరికాలో భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. పలు వర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను సరైన పత్రాలు లేవనే కారణంతో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించారు. విద్యార్థుల మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు చూసి తిప్పి పంపించినట్లు తెలుస్తోంది. అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తంగా 21 మంది విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో తిప్పి భారత్‌కు పంపించారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. -
దుబాయ్ టు సిటీ.. గోల్డ్ స్మగ్లింగ్
సాక్షి, హైదరాబాద్:ఆదివారం రూ.1.25 కోట్ల విలువైన 2 కేజీలు.. శనివారం రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోలు.. గురువారం రూ.33.53 లక్షల విలువైన 553 గ్రాములు..మంగళవారం రూ.93.26 లక్షల విలువైన 1.52 కేజీలు.. ఈ నెల 6న రూ.1.18 కోట్ల విలువైన 1.92 కేజీలు.. 4న రూ.28 లక్షల విలువైన 461 గ్రాములు.. 2న రూ.82.42 లక్షల విలువైన 1.34 కిలోలు.. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్న బంగారం లెక్కలు ఇవి. నగరానికి పెద్దయెత్తున బంగారం అక్రమ రవాణా అవుతుండటం కస్టమ్స్ అధికారులనే కలవరపరుస్తోంది. ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు మొత్తం రూ.9.66 కోట్ల విలువైన 15.79 కేజీల బంగారం పట్టుబడగా..ఇందులో 95 శాతానికి పైగా దుబాయ్ నుంచి తెచ్చిందే కావడం గమనార్హం. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో అక్రమ రవాణా గణనీయంగా పెరుగుతోంది. కిలోకు రూ.5 లక్షల లాభం విదేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలంటే పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. గతంలో 10 గ్రాముల బంగారానికి దిగుమతి సుంకం రూ.350 మాత్రమే ఉండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పసిడికి ఉన్న ప్రతి 15 రోజుల సరాసరి ధరను పరిగణనలోకి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం చెల్లించేలా కేంద్రం నిబంధనలు సవరించింది. ఈ కారణంగానే బంగారం స్మగ్లింగ్ పెరుగుతుండగా..దొంగ రవాణా విజయవంతమైతే అన్ని ఖర్చులూ పోనూ స్మగ్లర్లకు కిలోకు కనిష్టంగా రూ.5 లక్షల లాభం ఉంటున్నట్లు తెలుస్తోంది. టికెట్లు కొనిచ్చి.. విదేశాలకు పంపి.. బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు భారీగా అక్రమ రవాణాకు పాల్పడటం ద్వారా పెద్దయెత్తున లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యవస్థీకృత ముఠాలతో పాటు హైదరాబాద్‌కు చెందిన బడా బాబులు రంగంలోకి దిగినట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. ప్రముఖ జ్యువెలరీ సంస్థల యజమానులు, రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వాహకులతో పాటు పాత నేరగాళ్లు సైతం క్యారియర్లను ఏర్పాటు చేసుకుని ఈ దందా ప్రారంభించారు. మధ్యవర్తుల ద్వారా కేరళకు చెందిన వారితో పాటు పాతబస్తీకి యువకులు, యువతులు, మహిళలకు కమీషన్ ఇస్తామంటూ ఎర వేస్తున్నారు. వీరికి టికెట్లు కొనిచ్చి విదేశాలకు పంపడం ద్వారా తిరిగి వచ్చేటప్పుడు అక్కడి తమ ముఠా సభ్యుల సహకారంతో బంగారం ఇచ్చి పంపిస్తున్నారు. వీరినే సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలుస్తున్నారు. స్మగ్లర్లకు స్వర్గధామంగా దుబాయ్ దుబాయ్‌లో ఆదాయపుపన్ను అనేది లేకపోవడంతో మనీలాండరింగ్ అన్నదే ఉత్పన్నం కాదు. దీంతో ఇక్కడినుంచి హవాలా ద్వారా నల్లధనాన్ని అక్కడకు పంపి, దాన్ని బంగారంగా మార్చి ఇక్కడకు తీసుకువస్తున్నారు. దుబాయ్‌లో ఓ వ్యక్తి ఎంత భారీ మొత్తంలో అయినా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. దాన్ని విమానంలోకి తీసుకువచ్చేటప్పుడు కూడా కేవలం చోరీసొత్తు కాదని ఆధారాలు చూపిస్తే చాలు. దీన్ని ఆసరాగా చేసుకునే స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. జోరుగా రెక్టమ్ కన్సీల్మెంట్.. చాలామంది స్మగ్లర్లు ఈ బంగారాన్ని బ్యాగుల అడుగు భాగంలో ఉండే తొడుగులు, లోదుస్తులు, రహస్య జేబులు, బూట్ల సోల్, కార్టన్ బాక్సులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పౌడర్ డబ్బాలతో పాటు మైబైల్ చార్జర్స్ లోనూ దాచి తీసుకువచ్చేవారు. ఆ తర్వాత బ్యాగుల జిప్పులు, బెల్టుల రూపంలోకి బంగారాన్ని మార్చి పైన తాపడం పూసి తేవడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రెక్టమ్ కన్సీల్మెంట్ కూడా జోరుగా జరుగుతోంది. సుదీర్ఘకాలం తమ వద్ద పని చేసే క్యారియర్లకు సూత్రధారులు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. గరిష్టంగా కేజీ వరకు బంగారాన్ని అక్కడ దాచిపెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. క్లెయిమ్ చెయ్యకుంటే వేలం కస్టమ్స్ అధికారులు స్మగ్లర్లను గుర్తించడానికి 95 శాతం ప్రొఫైలింగ్ పదర్ధతినే అనుసరిస్తారు. ప్రయాణికుడి ప్రవర్తన, నడవడికతో పాటు పాస్‌పోర్ట్‌లో ఉన్న వివిధ దేశాల ఎంట్రీ, ఎగ్జిట్ స్టాంపులు, విదేశంలో ఉన్న సమయం తదితరాలను పరిగణలోకి తీసుకుంటారు. బయటి రాష్ట్రాల పాస్‌పోర్టులు కలిగిన వారు ఇక్కడ లాండ్ అయినా అనుమానిస్తారు. బంగారం స్మగ్లింగ్ వెనుక భారీ కుట్ర లేకపోతే దాన్ని తిరిగి అప్పగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. స్మగ్లర్ బంగారం తనదే అని క్లైమ్ చేసుకుంటే దాని విలువపై 50 నుంచి 60 శాతం కస్టమ్స్ డ్యూటీ వసూలు చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే ఆ బంగారాన్ని చెన్నై, ముంబైల్లో కస్టమ్స్ కార్యాలయాలకు తరలించి అక్కడ వేలం వేయడం ద్వారా విక్రయించి ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తారు. రియాద్ నుంచి వయా మస్కట్ శంషాబాద్ (హైదరాబాద్): రియాద్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని ఎయిర్‌పోర్టులో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి రియాద్ నుంచి వయా మస్కట్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న షేక్‌ఖాజా, షేక్‌జాని అనే ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్ తనిఖీలు పూర్తి చేసుకుని లాంజ్‌లోని సిటీసైడ్ ఏరియాలోకి వచ్చారు. వారి కదలికలను అనుమానించిన సీఐఎస్ఎఫ్ అధికారులు మరోసారి లగేజీని ఈకో–5 యంత్రంలో తనిఖీ చేశారు. దీంతో డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లో ఉంచిన కిలో బరువు కలిగిన బంగారు గొలుసులు బయటపడ్డాయి. దీంతో నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. -
క్రిప్టోల కట్టడికి అంతర్జాతీయ సహకారం కావాలి
న్యూఢిల్లీ: క్రిప్టో అసెట్స్‌ను నియంత్రించేందుకు అన్ని దేశాలు సమిష్టిగా కలిసి పనిచేయాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. వాటిని నియంత్రించాలన్నా లేక నిషేధించాలన్నా అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా సహకారం అవసరమవుతుందని ఆయన పేర్కొన్నారు. వాటిపై పన్నుల విధింపు, ప్రమాణాల మీద పలు దేశాలు, సంస్థలు అధ్యయనం చేస్తున్నందున అన్నీ సమిష్టిగా కలిసి రావడమనేది ఎప్పటికి జరుగుతుందని నిర్దిష్టంగా చెప్పలేమని లోక్‌సభకు మంత్రి తెలియజేశారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2014 మార్చి 31 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణభారం రూ. 58.6 లక్షల కోట్లుగా (స్థూల దేశీయోత్పత్తిలో 52.2 శాతం) ఉండగా 2023 మార్చి 31 నాటికి ఇది రూ. 155.6 లక్షల కోట్లకు (స్థూల దేశీయోత్పత్తిలో 57.1 (శాతం) చేరిందని చౌదరి తెలిపారు. -
సాయంతో మనసు గెలిచే యత్నం!
జూలై 21 నాటి రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటన తాలూకూ అజెండా బహుముఖీనమైనది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవడం ఒక సందర్భమైతే, శ్రీలంక రాజకీయాల్లో అత్యున్నత పదవిని అందుకునేందుకు పరోక్షంగా ఆశీస్సులందించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడం మరొకటి. శ్రీలంక ప్రస్తుత సంక్షోభం, ఆర్థికమే. అందుకే విక్రమసింఘే ఆర్థిక సహకారం కోరుతూనే భారత్‌ను సందర్శించారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలు సురక్షితంగా అభివృద్ధి చెందుతూండాలన్న లక్ష్యంతో రూపొందించిన ‘సాగర్’, ‘తొలుత పొరుగు’ విధానాలతో భారత్ కూడా శ్రీలంకతో గొప్ప ఆర్థిక సమన్వయాన్ని ఆశిస్తోంది. ఇది పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడమే కాకుండా, వ్యూహాత్మకంగా శ్రీలంకలో భారత్ తన ఉనికిని పెంచుకునేందుకూ ఉపయోగపడుతుంది. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇటీవలే భారత్‌కు వచ్చిపోయారు. బోలెడన్ని ఒప్పందాలు కుదిరాయి. చాలావరకూ ఆర్థిక వ్యవహారాలే. రణిల్ మనకు మిత్రుడే అన్నది చాలాకాలంగా ఉన్న గట్టి అభిప్రాయం. గత ఏడాది జూలైలో అధ్య క్షుడు గొటబయ రాజకపక్స దేశం నుంచి పారిపోవడం, ప్రజాగ్రహం నేపథ్యంలో తన పదవిని వదులుకోవాల్సి రావడం మనకు తెలిసిన విషయమే. అలాంటి అనూహ్యమైన, మునుపెన్నడూ లేని పరిస్థితుల్లో రణిల్ గద్దెనెక్కారు. దారుణమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టు మిట్టాడుతోంది ఆ దేశం అప్పుడు. సాధారణంగా పదవి చేపట్టిన కొద్ది కాలానికి శ్రీలంక నేతలు భారత్ పర్యటనకు రావడం కద్దు. కానీ ఈసారి రణిల్ ముందు దేశంలో పరిస్థితులు కొంతైనా చక్కబెట్టుకున్న తరువాతే, విదేశీ పర్యటనల గురించి ఆలోచించాల్సిన వచ్చింది. అటు ఆర్థిక, ఇటు రాజకీయాలూ సర్దుకున్న తరువాత ఆహ్వానం పంపు దామని భారత్ కూడా వేచి చూసింది. 75 ఏళ్ల దౌత్య బంధం జూలై 21 నాటి రణిల్ విక్రమసింఘే భారత్ పర్యటన తాలూకూ అజెండా బహుముఖీనమైనది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవడం ఒక సందర్భమైతే, శ్రీలంక రాజకీయాల్లో అత్యున్నత పదవిని అందుకునేందుకు పరోక్షంగా ఆశీస్సులందించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవడం మరో విషయం. దేశవాళీ ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు తగిన సాయం అందిస్తున్నందుకూ విక్రమసింఘే కృతజ్ఞతలు చెప్పుకుని ఉంటారు. ఈ సాయం భవిష్యత్తులోనూ కొనసాగించేందుకు భారత్‌తో సమావేశాలు ఉపయో గపడి ఉంటాయి. ఎందుకంటే భారత్‌తో పాటు ఐఎంఎఫ్ లాంటి సంస్థల సాయంతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో కొంత స్థిరత్వం కనిపిస్తున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు. సబ్సిడీల తగ్గింపు, పన్నుల పెంపు వంటి సంస్కరణలకు ఐఎంఎఫ్ షరతులు విధించిన విషయమూ చెప్పుకోవాలిక్కడ. ఈ సంస్కరణల భారం మోయడం సామాన్యుడికి కష్టమైతే, ఆ అసంతృప్తిని వాడుకుని తిరగబడేందుకు శ్రీలంకలోని కొన్ని నియోజకవర్గ నేతలు కాచుకుకూర్చున్నారు. శ్రీలంకకే చెందిన అంతర్జాతీయ ఆర్థికవేత్తలు సీపీ చంద్రశేఖర్, అహిల్ కదిర్గమర్ వంటి వారు ఐఎంఎఫ్ పథకం సమస్య పరిష్కా రానికి అస్సలు ఉపయోగపడదనీ, పరిస్థితిని మరింత దిగజారుస్తుందనీ అభిప్రాయపడుతున్నారు. ఐఎంఎఫ్ షరతుల ప్రకారం శ్రీలంక 2031 వరకూ సంస్కరణలు కొనసాగించాల్సి ఉంటుంది. అంటే ఇంకో ఎనిమిదేళ్లు. చాలా సమయం. విక్రమసింఘేకు ఈ విషయమే కాకుండా, భవిష్యత్తులో ఎదురుకాగల సవాళ్ల గురించి కూడా తెలుసు. విదేశీ అప్పులు ప్రస్తుతం 40 బిలియ¯Œ డాలర్ల వరకూ ఉంటే, అందులో 30 శాతం అయినా తగ్గించుకోవాలని చూస్తున్నారు. అలాగే తొమ్మిదేళ్లపాటు రుణాల చెల్లింపులను నిలిపివేయడం అప్పులిచ్చే వారి ఆగ్రహానికి కారణమవుతోంది. పొరుగుకు ప్రాధాన్యత శ్రీలంక ప్రస్తుత సంక్షోభం ఆర్థికమే. అందుకే విక్రమసింఘే ఆర్థిక సహకారం కోరుతూనే భారత్‌ను సందర్శించారు. దేశ ఆర్థిక వ్యవహా రాల్లో భారత్ జోక్యం పెరగాలని లంక ఆశిస్తోంది. హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దేశాలు సురక్షితంగా అభివృద్ధి చెందుతూండాలన్న లక్ష్యంతో భారత్ రూపొందించిన ‘సాగర్’(సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్), ‘తొలుత పొరుగు’ విధానాలతో భారత్ కూడా శ్రీలంకతో గొప్ప ఆర్థిక సమన్వయాన్ని ఆశిస్తోంది. వీటి ప్రకారం, పెరుగుతున్న చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడమే కాకుండా... వ్యూహాత్మకంగా శ్రీలంకలో భారత్ తన ఉనికిని పెంచుకునేందుకూ ఉపయోగపడుతుంది. ఇరుదేశాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు, ఆర్థిక సమృద్ధికి ఉపయోగపడే కొన్ని చర్యలకు ప్రధాని మోదీ, విక్రమసింఘే తమ దార్శనిక పత్రం ద్వారా శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం ఇరుదేశాల మధ్య అటు సముద్ర మార్గం ఇటు విమాన, భూతల మార్గాల ద్వారా కూడా కనెక్టివిటీ పెంచుకునేందుకు ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగానే తెగల పోరు నేపథ్యంలో 1980లో నిలిపివేసిన పడవల సేవలను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. యూపీఐ ద్వారా శ్రీలంకలో రూపాయి ద్వారా చెల్లింపులు జరపాలన్నది వీటిల్లో ఒకటి. ఇంధన రంగంతోపాటు ట్రింకోమలై ప్రాంతంలో అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి అదాని వంటి భారతీయ వ్యాపారవేత్తలకు సరికొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. భారత పర్యటనలో విక్రమసింఘేను గౌతమ్ అదాని కూడా కలిసిన విషయం గమనార్హం. శ్రీలంక తమిళుల సమస్య సున్నితత్వాన్ని గుర్తించిన విక్రమసింఘే ఆ విషయంలో తాను తీసుకోబోయే చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. 13వ రాజ్యాంగ సవరణ ప్రకారం, దక్షిణాఫ్రికా తరహాలో తమిళుల కోసం ఓ నిజనిర్ధారణ కమిటీ ఒకదాన్ని ఏర్పాటు చేయడం కూడా ఇందులో ఉంది. ప్రాంతాల వారీగా అధికార పంపిణీ జరగాలని 13వ సవరణ చెబుతోంది. అయితే దీని అమల్లో ఉన్న సాధకబాధకాల గురించి కూడా శ్రీలంక అధ్యక్షుడు భారత ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు అనుమతి లేకుండా పోలీసు తదితర సున్నితమైన వ్యవస్థల అధికారాలను పంపిణీ చేయడం కష్టమని వివరించారు. యునైటెడ్ నేషనల్ పార్టీ విక్రమసింఘే వర్గానికి ప్రతినిధి ఈయనొక్కరే. పార్లమెంటులో మద్దతు లభిస్తున్నది కూడా రాజపక్సే పార్టీ నుంచి మాత్రమే. రాజపక్సే పార్టీకి అధికార పంపిణీ సుతరామూ ఇష్టం లేకపోవడం గమనార్హం. ఈ విషయాలన్నింటినీ గుర్తు పెట్టుకునే ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణ అమలును మరోసారి గుర్తు చేశారు. తమిళులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల కౌన్సిల్ ఎన్నికలు తొందరగా జరిపించడం గురించి ప్రస్తావించారు. తమ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగడం లేదనీ, విక్రమసింఘే అధికార పంపిణీ ప్రణాళిక తమకు సమ్మతం కాదనీ తమిళ వర్గాలు ఇప్పటికే మోదీకి వేరుగా లేఖలు రాశాయి. తమిళ సామాజిక వర్గపు ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేలా లంకను ఒప్పించాలని వీరు కోరుతున్నారు. కలిసి పనిచేయాలి విక్రమసింఘే పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై చర్చలు జరక్కపోయినా, చైనా అంశం కచ్చితంగా ఇద్దరు నేతల మనసుల్లో ఉండి ఉంటుంది. విక్రమసింఘే కొన్ని రోజుల క్రితమే ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా శ్రీలంకలో చైనా భద్రతా వ్యవహారాలు లేవని స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాకుండా, భారత్‌కు ముప్పు కాగలఎలాంటి విషయానికైనా శ్రీలంక వేదిక కాదని కూడా ఆయన ప్రకటించారు. ఇది చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు కొంత ఫలితం లభించినట్లే భావించాలి. భారత ప్రధాని మాట్లా డుతూ, ‘భారత్ భద్రత, శ్రీలంక అభివృద్ధి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇరు దేశాలు భద్రత, సున్నితత్వాలను దృష్టిలో ఉంచుకుని కలిసి పని చేయాలి’ అన్నారు. అభివృద్ధి పనులతో భద్రతను పొందాలనుకోవడం భారత్ ఎంత సమర్థంగా, సకాలంలో తన ఆర్థిక హామీలు నెరవేర్చగలదన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. ఎస్.డి.ముని, వ్యాసకర్త మాజీ దౌత్యవేత్త, శ్రీలంక రత్న అవార్డు గ్రహీత- (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
సింగపూర్‌లో మొట్టమొదటిసారిగా తెలుగు పద్యాల పోటీ
తెలుగు భాషా ప్రాధాన్యం తగ్గిపోతున్న ఈ రోజుల్లో దేశం కాని దేశంలో తెలుగుపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు. సింగపూర్ తెలుగు తోరణము అనే పేరుతో ఓ రియాలిటీ షోను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేమన, సుమతి శతకాల నీతి పద్యాల పోటీని నాలుగు వృత్తాలుగా, పది ఎపిసోడ్లుగా నిర్వహిస్తున్నారు. 20 మంది చిన్నారులు ఈ పోటీలో పాల్గొన్నారు. తెలుగు భాషాభివృద్దికి ఈ కార్యక్రమం ఒక ముందడుగులా ఉంటుందని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అనంతరం పోటీలో పాల్గొన్న చిన్నారులకు పెద్ద బాలశిక్ష పుస్తకాన్ని అందజేశారు. కాగా మొదటి రౌండ్ పోటీకి రాంబాబు పాతూరి, గాడేపల్లి అపర్ణ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంఘ సింగపూర్ తెలుగు టీవీ యేట్యూబ్ చానల్లో ప్రతి శనివారం ఒక భాగంగా మొత్తం 10 భాగాలుగా విడుదల అవుందని నిర్వాహకులు తెలిపారు. -
ఉత్పాదకతకు ఊపు
కంచర్ల యాదగిరిరెడ్డి : అదండీ విషయం...ఈ రోజుల్లో మీకు ఏం కావాలన్నా క్షణంలో సమాచారంతో పాటు మీకు కావాల్సింది ఇచ్చే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లు పుట్టుకొచ్చేశాయి. ఏడాది క్రితం చాట్ జీపీటీ విడుదలతో మొదలైన కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు ఇప్పుడు ఓ ప్రభంజనంలా మారిపోయాయి. జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, అమ్మకాలు ఎక్కువవుతాయని, సాధారణ వినియోగదారులకూ లాభమని అంటున్నారు. బాగానే ఉంది కానీ, ఇది ఎంతవరకూ నిజం? వాటికంటూ విలువ కట్టగలమా? అవును అంటోంది .అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే! భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ కారణంగా ప్రపంచ వాణిజ్యానికి ఏటా కనీసం 2.6 లక్షల కోట్ల నుంచి 4.4 లక్షల కోట్ల డాలర్ల వరకూ లబ్ధి చేకూరనుందని తెలిపింది. చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా.. జనరేటివ్ ఏఐ మొదలై ఏడాది కూడా కాలేదు. మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రభావం ఎలా చూపగలదన్న ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. మెకిన్సే అంచనా ప్రకారం ఇవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటినుంచే వేగం పుంజుకుంటుందని 2030– 2060 మధ్యకాలంలో చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా అయిపోతాయని చెబుతోంది. ఇప్పుడు చేస్తున్న పనుల్లో సగం 2030 నాటికల్లా ఆటోమేటిక్ అవుతాయని తెలిపింది. మునుపటి అంచనాల కంటే ఇది పదేళ్లు తక్కువ కావడం గమనార్హం. కార్మికుల ఉత్పాదకత విషయానికి వస్తే 2040 నాటికి ఇది ఏటా 0.1 –0.6 శాతం పెరుగుతుందని కాకపోతే చేసే పనులు మారిపోతాయి కాబట్టి ఆ మార్పునకు అనుగుణంగా కారి్మకులు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు సాయం అందించాల్సి ఉంటుందని మెకిన్సే తెలిపింది. ఒకవేళ అన్ని రంగాల్లోనూ జనరేటివ్ ఏఐ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే మాత్రం పనుల ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత 0.2 –3.3 శాతం వరకు పెరుగుతుంది. బ్యాంకింగ్, జీవశాస్త్రంలో ఎక్కువ ప్రభావం! లక్షల కోట్ల మాట కాసేపు పక్కనపెడితే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లకు అన్ని రంగాల్లోనూ చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంది. అయితే బ్యాంకింగ్, జీవశాస్త్రంలో కాస్త ఎక్కువ ప్రభావం ఉంటుందని మెకిన్సే అంచనా వేసింది. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే ఈ సాఫ్ట్వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరిగి ఏటా రూ.16 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకూ లాభం చేకూరుతుందని తేలింది. ఇక రిటైల్, కన్సూ్యమర్ ప్యాకేజ్డ్ గూడ్స్లలో జనరేటివ్ ఏఐని పూర్తిస్థాయిలో వాడితే కలిగే లాభం రూ.60 వేల కోట్లకు పైమాటే. ఇక ఈ కృత్రిమ మేధ వాడకం కేవలం లాభాలకు మాత్రమే పరిమితం కాదు. చేసే పని తీరుతెన్నులు కూడా మారిపోతాయి. ఒక వ్యక్తి చాలా సాధారణంగా చేసే పనులన్నింటినీ ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ వారి ఉత్పాదకతను పెంచుతుంది. మెకిన్సే లెక్కల ప్రకారం మనుషులు చేసే వాటిల్లో 60 నుంచి 70 శాతం పనులను ఏఐలు ఆటోమేటిక్‌గా చేయగలవు. చాట్ జీపీటీ లాంటి వాటికి భాషను అర్థం చేసుకోగల సామర్థ్యం కూడా ఉండటం వల్ల బోధన వంటి పనులకు బాగా ఉపయోగపడుతుందని అంచనా. ఈ రంగాల్లో లాభాలెక్కువ జనరేటివ్ ఏఐతో అన్ని రంగాల్లోనూ ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా లాభాలూ పెరుగుతాయి. కానీ.. వినియోగదారుల వ్యవహారాలు, మార్కెటింగ్, సేల్స్ రంగాలతో పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జీవశా్రస్తాల్లో ఇవి మరింత ఎక్కువగా ఉండనున్నాయి. మెకిన్సే జరిపిన సర్వే ప్రకారం ఐదు వేల మంది సేల్స్ సరీ్వస్ ఉద్యోగులున్న కంపెనీలో జనరేటివ్ ఏఐ వాడకంతో ఒక్కో వినియోగదారుడి సమస్యను పరిష్కరించేందుకు పట్టే సమయం దాదాపుగా 10 శాతం తగ్గింది. కంపెనీ మొత్తమ్మీద చూస్తే గంటకు 14 శాతం ఎక్కువగా వినియోగదారుల సమస్యలు పరిష్కారమయ్యాయి. అలాగే ‘మీ మేనేజర్‌ను పిలవండి..’అన్న ఫిర్యాదులు 25 శాతం వరకూ తగ్గిపోయాయి. వినియోగదారుల డిమాండ్లు, పనిఒత్తిళ్ల కారణంగా ఉద్యోగాలు మానేయడం కూడా తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఇక మార్కెటింగ్, సేల్స్ రంగాల విషయానికి వస్తే జనరేటివ్ ఏఐ వినియోగంతో ఖర్చులు సగానికి సగం తగ్గడం మాత్రమే కాకుండా అమ్మకాలు పది రెట్లు పెరుగుతాయి. మార్కెటింగ్‌కు అవసరమైన సమాచారాన్ని వేగంగా సృష్టించడం, ప్రాంతాలకు, ఒక్కో వినియోగదారుడికి తగి న విధంగా మార్చడం కూడా ఈ జనరేటివ్ ఏఐతో సాధ్యమవుతుందని, భాషల అంతరం తొలగిపోయి ఎవరికి కావల్సిన భాష లో సమాచారం ఈమెయిళ్ల రూపంలో ఠకీమని పంపవచ్చునని మెకిన్సే చెబుతోంది. జనరేటివ్ ఏఐకి ఉన్న మరో సామర్థ్యం సాఫ్ట్వేర్ కోడ్ రాయగలగడం. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే చిన్నచిన్న పనులను వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్చు. సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ, బగ్స్ ను తొలగించడం వంటివి సులువైపోతాయి. చివరగా పరిశోధనలకు ఫార్మా వైద్యం వంటి రంగాలకు జనరేటివ్ ఏఐ ఎంతో ఉపయోగకరం. ఈ రంగానికి ఏటా రూ.25 వేల కోట్ల విలువను జోడించగల సామర్థ్యం దీనికి ఉంది. అమెరికాలో పెరుగుతున్న చాట్ జీపీటీ వాడకం అమెరికాలో చాట్ జీపీటీ వాడకం ఊపందుకుంటోంది. స్టాటిస్టా జరిపిన సర్వే ప్రకారం జనవరిలో సొంత అవసరాల కోసం ఈ జనరేటివ్ ఏఐని వాడామని 12 శాతం మంది చెప్పగా, ఇతరులు వాడటం చూశామని 38 శాతం మంది చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది మహిళలు మాత్రం తాము చాట్ జీపీటీ గురించి అస్సలు వినలేదని చెప్పారు. 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ నెక్స్ట్ మూవ్ స్ట్రాటజీ కన్సల్టింగ్ అంచనాల ప్రకారం 2030 నాటికి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ మార్కెట్ విలువ దాదాపుగా రెండు లక్షల కోట్ల డాలర్లు. హాలీవుడ్లో రచయితలు, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ లు వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తమ స్థానంలో ప్రొడక్షన్ కంపెనీలు జనరేటివ్ ఏఐలను వాడరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలకు అవసరమైన స్క్రిప్ట్ లు రాయడం మొదలుకొని, మనుషులను పోలిన గొంతులను కూడా సృష్టించగలదీ జనరేటివ్ ఏఐ. స్నాప్‌చాట్ ఇప్పటికే యానిమేషన్ల కోసం జనరేటివ్ ఏఐని వాడటం మొదలుపెట్టగా.. ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా అదే బాట పట్టింది. ఓరియో బిస్కెట్లు తయారు చేసే సంస్థ సినీ నటుడు ఫర్హాన్ అక్తర్, జనరేటివ్ ఏఐల సాయంతో సరికొత్త వాణిజ్య ప్రకటనను సృష్టించింది. -
Fact Check: ఆఫ్ఘన్ సింగర్ హత్య.. ఆ వార్తల్లో నిజం లేదన్న గాయని!
Afghan singer Hasiba Noori is ALIVE: గతంలో పాక్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రముఖ ఆఫ్ఝన్ సింగర్ హసీబా నూరి మరణించిందన్న సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిసింది. అయితే ఆ వార్తలను సింగర్ హసీబా నూరి ఖండించింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోలు, ఫోటోలు ఫేక్ అని కొట్టిపారేసింది. కాగా.. ఆఫ్ఘాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడంతో ఆమె పాక్‌లోని కరాచీలో శరణార్థిగా తలదాచుకుంటోంది. తాజాగా ఈ విషయానికి సంబంధించి ఫేస్బుక్లో ఒక వీడియో బయటపడింది. అందులో నూరి తన మరణ వార్తను ఫేక్ అని కొట్టిపారేయగా.. జర్నలిస్ట్ ఇఫ్తికార్ ఫిర్దౌస్ కూడా గాయనితో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడినట్లు ధృవీకరించారు. ఆమె సజీవంగా ఉందని నిరూపించడానికి వీడియో కాల్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో నూరి ఆసుపత్రి బెడ్‌పై పడుకున్నట్లు వచ్చిన ఫోటోలు.. ఆమె కరాచీలో జరిగిన శస్త్రచికిత్స తర్వాత తీసుకున్నట్లు సింగర్ స్పష్టం చేశారు. కాగా.. హసిబా నూరి ఫాలోయింగ్ ఉన్న పాష్టో గాయని. ఆమె అరియానా టెలివిజన్, ఏఎంసీ టీవీ లాంటి ఆఫ్ఘన్ ఛానెల్స్‌లో పనిచేసింది. "మినా," "సబ్జా జనమ్," "అల యారం" వంటి పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఆగష్టు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, హసిబా నూరీతో పాటు అనేక ఇతర కళాకారులు పాకిస్తాన్లో శరణార్థులుగా తలదాచుకుంటున్నారు. For reference I took Haseeba Noori on a video call to verify she was alive and it was her I was speaking to. The screen-grab from the video call has been taken with her permission. [Please verify news before you keep sharing it] https://t.co/CTWtnqY6Du pic.twitter.com/O8LAoL65IH — Iftikhar Firdous (@IftikharFirdous) July 17, 2023 FACT CHECK: Just spoke to Haseeba Noori, the Afghan Singer who was reported to be killed in Khyber Pakhtunkhwa. She is well and alive. She is in Karachi. Social media and some news websites had shared the news of her death. Her picture was taken while she was undergoing an… pic.twitter.com/61nEM4brM2 — Iftikhar Firdous (@IftikharFirdous) July 17, 2023 -
ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్!
ప్రపంచంలో జరిగే మోసాలకు అంతేలేకుండా పోతోంది. అమెరికాలో కరోనా కాలంలో జరిగిన ఒక మోసాన్ని అత్యంత ఘరానా మోసంగా చెబుతుంటారు. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం(పీపీపీ) లోన్ సిస్టమ్‌ను ఆధారంగా చేసుకుని $200 బిలియన్లను దక్కించుకుని, దానితో లంబోర్ఘినిలు, వెకేషన్ హోమ్‌లు, ప్రైవేట్ జెట్ ఫ్లైట్లు, కార్టియర్ ఆభరణాలు కొనుగోలు చేసి, వేలాది మంది మోసగాళ్లు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. మహమ్మారి సమయంలో అందించిన కోవిడ్ లోన్ స్కీమ్‌ను వారు అక్రమంగా దక్కించుకుని అవినీతికి పాల్పడ్డారు $200 బిలియన్ల మేరకు ఫ్రాడ్ 2020,2021లో అమెరికా ప్రభుత్వం దాదాపు $1.2 ట్రిలియన్ మొత్తాన్ని వివిధ వ్యాపారాల కోసం కోవిడ్ బెయిలౌట్ నగదు కింద కేటాయించింది. ఆర్థిక విపత్తు లోన్ ప్రోగ్రామ్ (ఈఐడీఎల్పీ), పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) స్కీమ్‌ల కోసం ఈ నిధులను ఖర్చు చేశారు. అయితే దీనికి సంబంధించిన స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ జనరల్(ఎస్బీఏ) నుండి వచ్చిన ఒక నివేదిక ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. దీనిలో 17% నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలింది. అంటే 200 బిలియన్ డాలర్ల (దాదాపు 16 లక్షల 40 వేల కోట్లు) మేరకు ఫ్రాడ్ జరిగింది. అక్రమంగా మిలియన్ల డాలర్ల లోన్ తీసుకుని.. ఈ మోసపూరిత వ్యవహారంలో 90,000కు మించిన యాక్టివ్ లీడ్లు ఉన్నాయని ఎస్బీఏ అంచనా వేసింది. ఈ ఉదంతంలో ఎస్బీఏ ఇప్పటికే మాజీ న్యూయార్క్ జెట్స్ వైడ్ రిసీవర్, జోష్ బెల్లామీతో సహా పలువురిని విచారణ చేసింది. ఈ జాబితాలో మాన్హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్ హైడ్ యజమాని డోనాల్డ్ ఫిన్లీ ఉన్నారు. ఈయన పీపీపీ,ఈఐడీఎల్పీ సాయంతో మిలియన్ల డాలర్ల లోన్ తీసుకుని వాటర్‌ఫ్రంట్ వీక్షణ కలిగిన డయోనిస్ బీచ్‌లో నాన్టుకెట్ ఇంటిని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం మాన్హాటన్ థీమ్ రెస్టారెంట్ జెకిల్ అండ్ హైడ్ మూతబడింది. ఈ ఘరానా మోసానికి పాల్పడిన ఫిన్లీ 30 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొననున్నాడు. అలాగే $3.2 మిలియన్ల మొత్తాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. దీనికితోడు ఆయనపై $1.25 మిలియన్ల మేరకు జరిమానా కూడా విధించారు. మే 2023 నాటికి మొత్తం 803 అరెస్టులు అక్రమంగా నగదును పొందేందుకు మోసగాళ్లు నకిలీ వ్యాపారాలను సృష్టించారని లేదా వారి ఉద్యోగుల సంఖ్య గురించి అబద్ధాలు చెప్పారని లెక్సిస్ నెక్సిస్ రిస్క్ సొల్యూషన్స్ ప్రతినిధి హేవుడ్ టాల్కోవ్ ది పోస్ట్‌కు తెలిపారు. మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో రోల్స్ రాయిస్ లేదా హై-ఎండ్ మెర్సిడెస్ వంటి కార్లను కొనుగోలు చేయడం చాలా కష్టమని భావించిన ఈ మోసగాళ్లు పీపీపీ ప్రోగ్రాంను అక్రమంగా వినియోగించుకున్నారని మరో అధికారి టాల్కోవ్ చెప్పారు.మహమ్మారి కాలంలో జరిగిన ఈ మోసానికి సంబంధించి మే 2023 నాటికి మొత్తం 803 అరెస్టులు జరిగాయని ఎస్బీఏ తెలిపింది. ఇది కూడా చదవండి: గూగుల్ మ్యాప్‌ను వినియోగిస్తూ.. ఆ గొంతు తెలియదంటే ఎలా? అత్యంత ఖరీదైన కార్ల కొనుగోలుకు.. పీపీపీ ప్రోగ్రాంను ఫ్లోరిడాకు చెందిన డేవిడ్ హైన్స్(29) అక్రమంగా వినియోగించుకుని $3.9 మిలియన్ల మొత్తాన్ని పొంది, అత్యంత విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎవో స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. అధికారులు ఇతని దగ్గర నుంచి స్పోర్ట్స్ కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు, అతని బ్యాంకు ఖాతాల నుండి $3.4 మిలియన్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల ముందు హైన్స్ తన నేరాన్ని అంగీకరించాడు. అతను హై-ఎండ్ దుకాణాలు, మయామి హోటల్లో అత్యధికంగా నిధులు ఖర్చుపెట్టాడు. తల్లికి $30,000 పన్నుచెల్లింపుదారుల నగదును పంపినట్లు అతని రికార్డులు చూపిస్తున్నాయి. ఫెడరల్ జైలులో గరిష్టంగా 30 సంవత్సరాల పెనాల్టీ జాక్సన్విల్లే తన ఇంటి, వ్యాపార ఆస్తి తనఖాను చెల్లించడానికి మొత్తం $910,000 పీపీపీ నిధులను అక్రమంగా ఉపయోగించాడు. ఆ తర్వాత తన నేరాన్ని అంగీకరించారు. జాక్సన్విల్లే ఈ నిధులతో 18-క్యారెట్ బంగారు రోలెక్స్ వాచ్, పాతకాలపు జాగ్వార్ ఎక్స్‌కే-ఈ, ఈ-టైప్, రోడ్‌స్టర్‌ను కొనుగోలు చేశాడు. అతను అందుకున్న పీపీపీ రుణాల ఆధారంగా నగదు ఉపసంహరణ ద్వారా $113,000 మొత్తాన్ని అందుకున్నాడు. కాగా ల్యాండర్లు ఫెడరల్ జైలులో గరిష్టంగా 30 సంవత్సరాల పెనాల్టీని ఎదుర్కొనబోతున్నారు. జార్జియాకు చెందిన డారెల్ థామస్‌కు పీపీపీ నిధులను వినియోగించి మెర్సిడీస్ బెంజ్ ఎస్-క్లాస్, ఒక ల్యాండ్ రోవర్,ఒక గోల్డ్ రోలెక్స్‌తో పాటు అకురా ఎన్ఎస్ఎక్స్ కోసం ఖర్చు చేసినందుకు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. డిజైనర్ నగలు, దుస్తుల కోసం ఖర్చు చేసి.. పీపీపీ నుండి $11.1 మిలియన్లు దక్కించుకునేందుకు 14 మోసపూరిత రుణాలను పొందానని బ్యాంకును మోసగించానని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డానని థామస్ నేరాన్ని అంగీకరించాడు. ఇదేవిధంగా రెస్టారెంట్ స్కామర్ మాన్‌హట్టన్ తన రెస్టారేటర్ బెసిమ్ కుకాజ్ రెస్టారెంట్ గ్రూప్ కోసం బోగస్ లోన్ల పేరిట $6.1 మిలియన్లను మోసగించినట్లు వెల్లడైంది. అతను నిర్వహిస్తున్న ఇంటర్మెజో, లిమోన్ జంగిల్, కారా మియాలు ఇప్పుడు మూతబడ్డాయి. మాన్‌హట్టన్ డిజైనర్ నగలు, దుస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: వీరు విమాన ప్రయాణికులేనా.. పెరుగుతున్న ఫిర్యాదుల పరంపర బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా.. మాన్‌హట్టన్ అత్యాశతోనే ఇదంతా చేశాడని, ఈ డబ్బులో కొంత భాగాన్ని ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ డెవలపర్‌కు పంపాడు. కార్టియర్, హ్యూగో బాస్ నుండి విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించాడని న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ న్యాయవాది డామియన్ విలియమ్స్ అన్నారు. ఈ మోసగాడు అరెస్టు అయి, బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా మహమ్మారి సహాయాన్ని అందుకున్నాడని ప్రాసిక్యూటర్ చెప్పారు. ఈ నేపధ్యంలో ఆయన న్యూజెర్సీలోని ఫోర్ట్ డిక్స్ ఫెడరల్ జైలులో ఆరు సంవత్సరాల ఎనిమిది నెలల శిక్షను అనుభవిస్తున్నాడు. విలాసవంతమైన ప్రయాణాల కోసం.. ప్లాస్టిక్ సర్జరీతో పాటు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు టేనస్సీలోని సర్గోయిన్స్విల్లేకు చెందిన లెస్లీ బెథియా, 2021లో మోసపూరితంగా $20,805 రుణం పొందింది. ఈ నేపధ్యంలో ఆమెకు 78 నెలల జైలు శిక్ష విధించారు. ఫ్లోరిడాలోని సన్నీ ఐల్స్ బీచ్‌లోని ఒక రిసార్ట్‌లో ఐదు రోజులు గడిపేందుకు ఆమె స్కామ్ చేసిన నగదును ఉపయోగించింది. ఆమె తన ఈ పర్యటనలో ప్లాస్టిక్ సర్జరీకి చెల్లించడానికి కూడా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసింది. ఇదేవిధంగా హ్యూస్టన్‌కు చెందిన స్కాట్ జాక్సన్ డేవిస్‌ను ఈ కేసులో జైలుకు తరలించారు. అతను మూడు నకిలీ వ్యాపారాల కోసం పీపీపీ రుణాలను మోసపూరితంగా అందుకున్నాడు. అతను $3.3 మిలియన్లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు పత్రాలు, తప్పుడు సమాచారంతో.. మాజీ ఎన్ఎఫ్ఎల్ ఆటగాడు జోష్ బెల్లామీ తప్పుడు పత్రాలు, తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి 2021లో తన కంపెనీ డ్రిప్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్సీ కోసం $1.2 మిలియన్ రుణాన్ని అక్రమంగా పొందాడు. బెల్లామీ ఈ మొత్తాన్ని నగల కొనుగోలుతో పాటు సెమినోల్ హార్డ్ రాక్ హోటల్, క్యాసినోలో బస చేయడానికి ఉపయోగించినట్లు అంగీకరించాడు. ఈ నేరంలో సహ-కుట్రదారుకు $311,000కు మించిన మొత్తాన్ని ఖర్చు చేశాడని విచారణతో తేలింది. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే.. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) అనేది 2020లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన పథకం. ఇది కరోనావైరస్ ఎయిడ్, రిలీఫ్, ఎకనామిక్ సెక్యూరిటీ యాక్ట్ (కేర్స్ యాక్ట్) ద్వారా కొన్ని వ్యాపారాలకు సహాయం అందించేందుకు ఏర్పాటుచేసిన $953-బిలియన్ల విలువైన వ్యాపార రుణ కార్యక్రమం. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్.. సంస్థాగత ఖర్చులు చెల్లించడానికి తక్కువ వడ్డీతో కూడిన రుణాల కోసం వివిధ కంపెనీలకు అనుమతి కల్పిస్తుంది. పీపీపీ లోన్ అనేది దరఖాస్తుదారు చెల్లించే సగటు నెలవారీ పేరోల్ ఖర్చుల కంటే దాదాపు 2.5 రెట్లు అధికంగా ఉంటుంది. దీనిలో కొన్నిసార్లు దరఖాస్తుదారు సాధారణంగా మొదటి డ్రాతో సమానంగా రెండవ డ్రాను కూడా అందుకోవచ్చు. ఈ రుణం పేరోల్ ఖర్చులు, అద్దె, వడ్డీ, యుటిలిటీలను కవర్ చేయడానికి అందిస్తారు. ఇది కూడా చదవండి: ఎరక్కపోయి వచ్చి ఎలుగుబంటి కంట్లో పడ్డాం.. పరుగో పరుగు -
స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్ఐఏ)లో భాగమైన స్కూట్ నెట్వర్క్ తాజాగా చౌక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్, వైజాగ్ సహా వివిధ నగరాల నుంచి విదేశాల్లోని 20 ప్రాంతాలకు ప్రయాణించేందుకు ఇవి ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది. రూ. 6,200 నుంచి చార్జీలు మొదలవుతాయని వివరించింది. హైదరాబాద్ నుంచి పెర్త్ (ఆస్ట్రేలియా)కు రూ. 12,900 నుంచి, వైజాగ్ నుంచి సెబూ (ఫిలిప్పీన్స్)కు రూ. 11,900 నుంచి వన్–వే చార్జీలు (పన్నులు సహా) ప్రారంభమవుతాయని స్కూట్ తెలిపింది. ఈ సేల్ జూలై 18 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ వ్యవధిలో బుక్ చేసుకున్న టికెట్లపై ప్రాంతాన్ని బట్టి వచ్చే ఏడాది మార్చి వరకు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. -
సింగపూర్‌లో ఘనంగా బోనాల పండగ
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తిగీతాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ, అమ్మవారి నామస్మరణలతో కార్యక్రమం హోరెత్తింది. పలువురు మహిళలు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనం ఆ జగన్మాతకు ఆషాడ మాసంలో సమర్పించే నైవేద్యం. అరకేసరి దేవాలయంలో మహిళలు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజు ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. పలువురు తెలుగువాళ్లు ఆ వేడుకలో పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు పండగ మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయక పండగని,దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు. బోనాలు సమర్పించిన మహిళలల్ని, కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్.. 24గంటలూ తెరిచే ఉంటుంది
ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ అది.. అక్కడ ఒకేసారి 5800 మంది భోజనం చేయొచ్చు. గతేడాది ఈ రెస్టారెంట్ గిన్నెస్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించింది. పగలు, రాత్రి అని తేడా లేకుండా 24 గంటలు ఈ రెస్టారెంట్ తెరిచే ఉంటుంది. మరి ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకతలు ఏంటన్నది తెలుసుకుందాం.. చుట్టూ పచ్చని కొండలు, అందమైన ప్రకృతిని చూస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కబుర్లు చెప్పుకుంటూ ఘుమఘుమలాడే వంటలు తింటుంటే.. ఆ ఫీలింగే వేరు. ఇలాంటి అనుభూతిని పొందాలంటే మాత్రం పిపా యువాన్ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. హాట్‌పాట్ రెస్టారెంట్‌గా పిలవబడే ఈ రెస్టారెంట్ చైనాలోని చాంగ్క్వింగ్ పట్టణానికి సమీపంలో కొండ మధ్యలో.. అద్భుతంగా ఉంటుంది. పదో, పాతికో కాదు.. ఈ రెస్టారెంట్లో ఏకంగా ఒకేసారి 5800 మంది భోజనం చేయొచ్చు. 3,300 చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 900కు పైగా టేబుళ్లు ఈ రెస్టారెంట్లో ఉన్నాయి. ఇక్కడ ముందుగానే టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంత పెద్ద రెస్టారెంట్లో మనకు బుక్ అయిన టేబుల్ ఏదో తెలుసుకోవడానికి కనీసం పావుగంటైనా సమయం పడుతుంది.. మరి టేస్టీ వంటలను రుచిచూడాలంటే ఆ మాత్రం సమయం వేచిచూడక తప్పదు. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్లో దొరుకుతాయి. చైనాలోని పాపులర్ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్లో దొరుకుతాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు,25మంది క్యాషియర్లతో పాటు వందల మంది క్లీనింగ్ సిబ్బందిఇక్కడ ఉంటారు. 24 గంటల పాటు ఈ రెస్టారెంట్ తెరిచే ఉంటుంది. ముఖ్యంగా రాత్రిళ్లు ఇక్కడికి వచ్చే కస్టమర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.విద్యుత్ దీపాల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత అందంగా కనిపించడమే దీనికి కారణమని చెబుతున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. -
మిస్టరీ: సముద్రంలో దాగి ఉన్న రహదారి.. ఎప్పటిదో తెలుసా?
కడలి అడుగున పురాతన రహదారి బయటపడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు ఇటీవల అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. ఇటీవల సముద్రంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని నిర్మించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది కొత్తరాతి యుగంలోని మంచుయుగం చివరి రోజులకు చెందినది కావచ్చని, కనీసం ఏడువేల ఏళ్ల కిందట దీనిని నిర్మించి ఉంటారని చెబుతున్నారు. సముద్ర గర్భానికి పదహారు అడుగుల లోతున దీనిని కనుగొన్నారు. జదార్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ మేట్ పారికా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సముద్రంలో దాగి ఉన్న ఈ పురాతన రహదారిని కనుగొంది. ఈ రహదారిపై రాతి గొడ్డళ్లు, పలుగులను కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించి, ఇవి క్రీస్తుపూర్వం 4,900 నాటివని తేల్చారు. వీటిని ఉపయోగించి జంతు బలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఇక్కడ లభించాయి. -
టీసీఎస్: క్రెడిట్ కార్డు వినియోగదారులకు భారీ ఊరట
కొత్త టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) రేటు అమలుపై కేంద్రం వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. టీసీఎస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి అమల్లోకి రావాల్సిన టీసీఎస్ రేట్ల అమలును మరో 3 నెలలు వాయిదా వేసింది. అలాగే ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులతో విదేశాల్లో చేసే వ్యయాలపై టీసీఎస్ లేదని పేర్కొంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 30, 2023న వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే ఎల్ఆర్ఎస్ పరిధి దాటితే చెల్లించాల్సిన కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. (ఆధార్-ప్యాన్ లింక్ చేశారుగా? ఐటీ శాఖ కీలక ప్రకటన) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త సవరణ ప్రకారం తదుపరి ఆర్డర్ వరకు విదేశాల్లో ఉన్నప్పుడు అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఖర్చుపై టీసీఎస్ వర్తించదు. అలా అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల వినియోగంపై వివాదానికి స్వస్తి పలికింది. అలాగే రిజర్వ్ బ్యాంక్ సరళీకృత చెల్లింపు పథకం (ఎన్ఆర్ఎస్) నిర్వహించే అన్ని లావాదేవీలకు టీసీఎస్ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. విదేశీ టూర్ ప్యాకేజీలకూ ఏడాదికి రూ. 7 లక్షల వరకు ఎలాంటి టీసీఎస్ ఉండదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ కింద రూ. 7 లక్షలకు మించిన టీసీఎస్ చెల్లింపులు 30 సెప్టెంబర్ 2023 తరువాత చేస్తే (ఒక్క విద్య తప్ప, మిగతా ప్రయోజనంతో సంబంధం లేకుండా) 0.5 శాతం రేటు వర్తిస్తుంది. (గుడ్‌న్యూస్: ఇక బ్యాంకుల్లోనూ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్) ఎల్ఆర్ఎస్ కింద ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్ల వరకు డబ్బులు విదేశాలకు పంపొచ్చు. ట్రావెల్, బిజినెస్ ట్రిప్స్, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం, మెడికల్ అవసరాలు, విద్యా, డొనేషన్, బహుమతులు, వలస పోవడం, బంధువుల మెయింటెనెన్స్ లాంటి చెల్లింపులు చేయవచ్చు. ఇంతకుమించి పంపాలంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. (ధోనీ ఎంత పని చేశాడు: సత్య నాదెళ్ల ‘క్రష్’ కూడా అదేనట!) -
1996లో ఒకరోజు.. ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన పిల్లాడిని గోరిల్లా ఏం చేసిందంటే..
గోరిల్లాలు చూడటానికి కాస్త భయంకరంగా కనిపించినా వాటి మనస్సు మంచిదే. 1996 నాటి జూ ఘటనలో మూడేళ్ల పిల్లాడిని కాపాడింది ఓ గోరిల్లా. అప్పట్లో ఈ సంఘటన చాలా పాపులర్. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన జనాలు కూడా ఈ సంఘటన తర్వాత ప్రత్యేకించి ఆ గోరిల్లాను చూడటినికి వచ్చేవారట. అంతలా అభిమానాన్ని చాటుకున్న గోరిల్లా కథేంటి? అసలు ఏం జరిగింది? 1996లో మూడేళ్ల బాలుడ్ని ఓ గోరిల్లా కాపాడిన ఘటన గుర్తుంది కదా..ఇల్లినాయిస్లోని బ్రూక్‌ఫీల్డ్ జూలో 8ఏళ్ల బింటి జువా అనే గోరిల్లా తన ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన బాలుడ్ని రక్షించింది. గోరిల్లా ఎగ్జిబిట్ చుట్టూ ఉన్న గోడను ఎక్కుతూ సుమారు 24 అడుగుల ఎత్తు నుంచి బాలుడు ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయాడు. ఆ బిడ్డను జాగ్రత్తగా తీసుకొని తన ఒళ్లో కూర్చోబెట్టుకొని తల్లిలా కాపాడింది. ఆ తర్వాత జూ సిబ్బంది సమన్వయంతో ఆ బాలుడు క్షేమంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో అంత ఎత్తునుంచి పడిపోవడంతో బాలుడి చేయి, ముఖంపై గాయాలు మినహా మరేం జరగలేదు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉండి ఆ బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గోరిల్లాపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. గోరిల్లా బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకున్న దృశ్యం అందరినీ కట్టిపడేసింది. అంతే ఆ ఫోటోలు, వీడియాలో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అప్పటిదాకా జూను చూడటానికి వచ్చిన వారు కూడా ఈ ఘటన తర్వాత గోరిల్లాను చూడటానికి వచ్చేవారట. దీంతో సందర్శకుల తాకిడి బాగా పెరిగి ఆ గోరిల్లాకు స్టార్ స్టేటస్ వచ్చిందట.అటు జూ సిబ్బంది కూడా గోరిల్లాకు ప్రత్యేకమైన విందు ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. 35ఏళ్ల వయసున్న గోరిల్లా బింటి జువా ఇప్పటికీ సజీవంగా ఉంది. ముగ్గురు మనవరాళ్లతో పాటు మునివడిని కూడా చూసుకుంటూ కాలం వెళ్లదీస్తుంది. In 1996, Binti Jua, an 8-year-old female Western lowland gorilla, tended to a 3-year-old boy who had fallen into her enclosure at the Brookfield Zoo in Illinois. On August 16, 1996, Binti Jua, who was eight years old at the time, witnessed a three-year-old boy climbing the wall… pic.twitter.com/OMFGmdRE4I — Historic Vids (@historyinmemes) June 22, 2023 في عام 1996، اهتمت بينتي خوا، وهي أنثى غوريلا الأراضي المنخفضة الغربية البالغة من العمر 8 سنوات، بصبي يبلغ من العمر 3 سنوات سقط في حظيرتها في حديقة حيوان بروكفيلد في إلينوي. في 16 أغسطس 1996، شهد بينتي خوا، الذي كان يبلغ من العمر ثماني سنوات في ذلك الوقت، صبيا يبلغ من العمر ثلاث… pic.twitter.com/dJnC16AFUn — ﮼الأعرابي القديم . (@radialonazi) June 22, 2023 -
ఆకాశ ఎయిర్ దూకుడు: 4 బోయింగ్ విమానాలకు సై
న్యూఢిల్లీ: ఆకాశ ఎయిర్.. మరో 4 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కొనుగోలు సన్నాహాల్లో ఉన్నట్లు పేర్కొంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది(2023) చివరికల్లా మూడంకెలలో విమాన కొనుగోలుకి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆర్డర్లు జారీ చేసిన 72 బోయింగ్ 737 మ్యాక్స్‌లకు జతగా మరో 4 విమానాలకు కాంట్రాక్టు ఇస్తున్నట్లు తెలియజేసింది.(క్వాంటమ్ ఎనర్జీ విస్తరణ:హైదరాబాద్‌లో మూడో షోరూం) ప్యారిస్‌లో జరుగుతున్న ఎయిర్ షో సందర్భంగా కంపెనీ ఈ అంశాలను వెల్లడించింది. 2023 చివరికల్లా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే లక్ష్యంతో సాగుతున్నట్లు తెలిపింది. తాజాగా కొనుగోలు చేయనున్న విమానాలతో విస్తరణ పటిష్టంకానున్నట్లు వివరించింది. అంతర్జాతీయ విస్తరణ కోసం నాలుగు 737-8 విమానాల కొనుగోలుకి తెరతీసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు. దీంతో రానున్న నాలుగేళ్లలో మొత్తం 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లను డెలివరీ తీసుకోనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా వేగవంత విస్తరణలో ఉన్న కంపెనీ అంతర్జాతీయ రూట్లలోనూ సరీ్వసుల ప్రారంభంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. (దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్) -
అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన సింగర్స్
-
బోరిస్ పతనావస్థకు అసలు కారణాలివే!
‘అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగింద’ని నానుడి. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు ఇది అక్షరాలా సరిపోతుంది. ఒక సాధారణ స్థాయి నుంచి రాజకీయాల్లోకొచ్చి ప్రధాని పీఠం వరకూ వెళ్లిన జాన్సన్ నిరుడు జూలైలో ఆ పదవి పోగొట్టుకోవటమే కాదు... గతవారం ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయక తప్పలేదు. తాజాగా సభాహక్కుల సంఘంతో అబద్ధాల కోరుగా ముద్రేయించుకున్నారు. ఎంపీగా తప్పుకున్నారు గనుక సరిపోయిందిగానీ, లేకుంటే ఆయన మూణ్ణెల్లపాటు దిగువ సభ నుంచి సస్పెండయ్యేవారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉండేవారు నిజాయితీతో మెలగకపోతే, విశ్వసనీయతను ప్రాణప్రదంగా భావించకపోతే ఏ గతి పడుతుందో చెప్పడానికి జాన్సన్ ప్రస్థానం ఒక ఉదాహరణ. మనకు జాన్సన్ చేసింది పెద్ద తప్పు అనిపించకపోవచ్చు. కానీ బ్రిటన్‌లో అది చెల్లుబాటు కాదు. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో జాన్సన్ తన మిత్ర బృందాలతో విందుల్లో మునిగారన్నది ప్రధాన ఆరోపణ. ఆ కాలంలో దేశమంతా లాక్ డౌన్ అమల్లో వుంది. ప్రధానిగా 2020 మార్చి 23న లాక్డౌన్ విధించింది ఆయనే. మరో నాలుగు రోజులకు కరోనా వాతపడ్డారు కూడా. లాక్డౌన్ వల్ల దిగజారిన ఆర్థిక పరిస్థి తులతో, కరోనా తీవ్రతతో జనం అల్లాడుతుంటే ఆ సమయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు చెలరేగాయి. కనీసం అప్పుడైనా ఆయన మేల్కొనివుంటే వేరేగా ఉండేది. కానీ విందులు జరగడం అబద్ధమని ఒకసారి, జరిగినా నిబంధనలు ఉల్లంఘించలేదని మరోసారి బొంకారు. పైగా పార్టీలోని తన వ్యతిరేకులనూ, దర్యాప్తు చేస్తున్న సభా హక్కుల సంఘాన్నీ భ్రష్టుపట్టించే ప్రయత్నం చేశారు. లండన్ మేయర్‌గా ఉన్నకాలంలో జాన్సన్ ఓసారి అమెరికా వెళ్లారు. ఆయన్ను చూసిన ఒక పౌరుడు జాన్సన్‌ను దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ దూకుడుగా ప్రచారం చేసుకుంటున్న ట్రంప్‌గా పొరబడ్డారట. ఇలా పొరబడిన పౌరుడెవరోగానీ ఇద్దరిలోనూ పోలికలు న్నాయన్నది వాస్తవం. భౌతికమైన పోలికల మాట అటుంచి తమకొచ్చిన అవకాశాన్ని దుర్వినియో గపర్చటంలో ఇద్దరూ ఇద్దరే. తోచినట్టు మాట్లాడటం, ఇష్టానుసారం వ్యవహరించటం ఇద్దరిలోనూ ఉంది. అమెరికాలో ట్రంప్‌ను దించటానికి ఎన్నికల వరకూ జనం వేచిచూడాల్సి వచ్చింది. కానీ పార్టీ గేటు వ్యవహారం గుప్పుమన్నాక జాన్సన్‌ను సొంత పార్టీయే దించేసింది. నిజానికి పార్టీ గేటు వ్యవహారం ప్రధానిగా జాన్సన్ వరసబెట్టి చేసిన నిర్వాకాలకు పరాకాష్ట. ఒక చట్ట ఉల్లంఘనలో పోలీసులు తనకు జరిమానా విధించారని నిరుడు ఏప్రిల్‌లో ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రధాని స్థాయి నేత జరిమానా చెల్లించవలసి రావటం దేశ చరిత్రలో అదే తొలిసారి. అయినా అందుకుగల కారణమేమిటో ఆయన చెప్పలేదు. ఈలోగా తన అధికారిక నివాసాన్ని విలాసవంతంగా మార్చడానికి చట్టవిరుద్ధంగా భారీ మొత్తం ఖర్చు చేశారన్న ఆరోపణలొచ్చాయి. ఇది చాల దన్నట్టు అత్యాచార ఆరోపణల్లో జాన్సన్‌కు సన్నిహితుడిగా ఉండే ఎంపీ అరెస్టయ్యాడు. ఆయన మిత్రబృందంలోని మరో మాజీ ఎంపీకి బాలుడిపై లైంగిక దాడి చేశారన్న ఆరోపణ రుజువై శిక్షపడింది. ఆ తర్వాత ‘పార్టీ గేట్’ గుప్పుమంది. పర్యవసానంగా వరస సర్వేల్లో జాన్సన్ రేటు పడిపోయింది. ఆయనపై జనం ఆగ్రహావేశాలతో ఉన్నట్టు వెల్లడైంది. దాంతో 40 శాతం మంది పార్టీ ఎంపీలు జాన్సన్‌ను పదవి నుంచి తప్పించాలని నిశ్చయించుకున్నారు. అయినా పార్టీలో అవిశ్వాసం నుంచి గట్టెక్కారు. కానీ మాజీ ఎంపీపై ఉన్న కేసు గురించి తెలిసినా ఆయన్ను నెత్తినబెట్టుకున్నారన్న నిజాన్ని పార్టీ సభ్యులు సహించలేకపోయారు. అది తప్పేనని జాన్సన్ అంగీకరించినా లాభం లేక పోయింది. అంతవరకూ మద్దతుదార్లుగా ఉన్న అప్పటి ఆర్థికమంత్రి, ప్రస్తుత ప్రధాని రిషి సునాక్, ఆరోగ్యమంత్రి సాజిద్ జావేద్ వంటివారు నిరుడు జూలైలో తమ పదవులకు రాజీనామా చేశారు. పలువురు మంత్రులు సైతం వారి బాట పట్టడంతో జాన్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా సభాసంఘం అభిశంసన కన్సర్వేటివ్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది వేచిచూడాలి. వచ్చే సోమవారం ఆ నివేదికపై జరిగే చర్చ సందర్భంగా పార్టీలో లుకలుకలు బయటపడక తప్పదు. నివేదికకు వ్యతిరేకంగా ఓటేయొద్దని పార్టీ ఎంపీలను బోరిస్ జాన్సన్ కోరు తున్నా, తన తప్పులకు మాత్రం పశ్చాత్తాపం ప్రకటించడం లేదు. సరిగదా ఇదంతా ప్రతీకార రాజకీ యాల పర్యవసానమని చెప్పుకొస్తున్నారు. కనీసం ఈ క్షణంలోనైనా పశ్చాత్తాప పడని నేతను ఎవ రైనా క్షమించగలరా? కన్సర్వేటివ్ పార్టీలో జాన్సన్ ఎదిగిన క్రమం అసాధారణమైనది. పాత్రికే యుడిగా ఉంటూ పార్టీలోకొచ్చిన జాన్సన్ 2008 నుంచి 2016 వరకూ రెండుసార్లు లండన్ మేయర్‌గా ఉన్నారు. పరిస్థితులు కలిసొచ్చి థెరిస్సా మే ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక 2019లో ఆ పదవి చేజిక్కించుకున్నారు. అదే సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయాన్నందించారు. 1987 తర్వాత అంత పెద్ద మెజారిటీతో కన్సర్వేటివ్‌లు నెగ్గటం అదే తొలిసారి. ఒంటరి తల్లుల సమస్య మొదలుకొని స్వలింగ సంపర్కం, బ్రిటన్ వలసవాదం, బ్రెగ్జిట్ వరకూ సమయానుకూలంగా అభిప్రాయాలు మార్చుకుంటూ వచ్చిన జాన్సన్ వంటివారిని కన్స ర్వేటివ్ పార్టీ నెత్తినపెట్టుకోవటం మొదటినుంచీ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. పోతూ పోతూ జాన్సన్ అంటించిన బురద నుంచి ఆ పార్టీ ఏనాటికైనా బయటపడగలదా అన్నది సందేహమే. -
అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఆర్బీఐ గవర్నర్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ 'గవర్నర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును లండన్‌లో అందుకున్నారు. సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2023 విజేతలను ఈ ఏడాది మార్చి చివరిలో ప్రకటించారు. నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఉక్రెయిన్‌కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు వచ్చాయి. సెంట్రల్ బ్యాంకింగ్, లండన్ జూన్ 13న నిర్వహించిన వేసవి సమావేశాల ప్రారంభ ప్లీనరీ సమావేశంలో శక్తికాంత దాస్ పాల్గొని ప్రసంగించారు. గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీకరించారు. కోవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణ కట్టడికి చేసిన కృషికి గానూ ఆయనకు గుర్తింపు లభించింది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి, వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన శక్తికాంత దాస్ రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. 2018లో ఆర్బీఐ 25వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా G20 షెర్పా ఆఫ్ ఇండియాగా ఉన్నారు. Governor @DasShaktikanta received the ‘Governor of the Year’ award from @CentralBanking_ as part of the Central Banking Awards 2023 in London yesterday. #RBI #RBIGovernor #Governor #shaktikantadas #centralbanking pic.twitter.com/zh5E1VRGsi — ReserveBankOfIndia (@RBI) June 14, 2023 ఇదీ చదవండి: ఆస్తి పత్రాలు బ్యాంకుల్లో ఉన్నాయా..? ఆర్బీఐకి కీలక ప్రతిపాదనలు! -
చిత్రాలు గీసేందుకు చేతులెందుకు?
12 ఏళ్ల వయసు వరకూ స్వప్న ఆగస్టయిన్కు తన చేతులు తనకు ఉపకరించవన్న సంగతే తెలియదు. వయసు పెరుగుతున్నకొద్దీ వాస్తవం ఆమెకు అవగతమవుతూ వచ్చింది. తాను జీవితాంతం చేతులు లేకుండానే ఉండాలన్న విషయం ఆమెకు స్పష్టమయ్యింది. దీనిని గ్రహించిన ఆమె ఏమాత్రం కుంగిపోలేదు. చేతులు లేకపోతేనేం తనకు చక్కనైన కాళ్లు ఉన్నాయి కదా అని అనుకుంది. తన పాదాలనే వినియోగిస్తూ స్వప్న తనలోని కళా ప్రతిభను ప్రపంచానికి చాటుతోంది. పాదాలతో అద్భుతమైన పెయింటింగ్స్ రూపొందించే ప్రపంచ కళాకారిణిగా స్వప్న పేరు తెచ్చుకుంది. వరల్డ్ మలయాళీ ఫౌండేషన్ ఆమెకు ‘ఐకాన్ ఆఫ్ ది ఇయర్- 2018’ అవార్డుతో సన్మానించింది. స్వప్న తన కుటుంబానికే కాకుండా యావత్‌దేశానికే గర్వకారణంగా మారింది. ఆమె తన పెయింటింగ్స్‌ను ఎంఎఫ్‌పీఏ ఫోరమ్‌కు విక్రయిస్తుంటుంది. ఈ ఫోరమ్‌లోని సభ్యులు ప్రతీనెలా రెమ్యునరేషన్ పొందుతుంటారు. 1999 నుంచి స్వప్న ఈ ఫోరమ్‌లో మెంబర్‌గా ఉంది. స్వప్న ఆగస్టయిన్ 1975, జనవరి 21న కేరళలోని ఎర్నాకులంలో జన్మించింది. ఆమెకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. ఆమె తండ్రి ఆగస్టయిన్ రైతు. తల్లి సోఫీ గృహిణి. స్వప్నకు ఆరేళ్లు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఒక దివ్యాంగుల పాఠశాలలో చేర్పించారు. అదిమొదలు ఆమె తన పాదాలతో బ్రెష్ పట్టుకుని పెయింటింగ్ వేయడం మొదలుపెట్టింది. స్వప్న పెయింటింగ్, డ్రాయింగ్ మాత్రమే కాకుండా అన్ని పనులను తన పాదాల సాయంతోనే చేస్తుంటుంది. ఆమె తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆమెలోని ప్రతిభను గుర్తించి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. ఐదుగురు తోబుట్టువులలో స్వప్న మొదటి సంతానం. డెలివరీ అనంతరం ఆమె తల్లికి.. స్వప్న చేతులు లేకుండా జన్మించిందని చెప్పారు. నాలుగేళ్ల వయసులోనే స్వప్న తన పాదాలతో పెన్సిల్ పట్టుకుని రాయడం మొదలుపెట్టింది. తరువాతి కాలంలో స్కెచ్చింగ్ వేయగలిగే స్థాయికి చేరింది. అలప్పుజాలోని సెంట్ జోసెఫ్ కాలేజీలో స్వప్న హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత పూర్తి స్థాయిలో పెయింటింగ్‌పై దృష్టి సారించింది. ప్రొఫెషనల్ పెయింటర్ స్థాయికి చేరింది. కేన్వాస్ మీద అద్భుతమైన పెయింటింగ్స్ రూపొందించసాగింది. అదే సమయంలో ఆమెకు మౌత్ అండ్ ఫుట్ ఆర్టిస్ట్స్(ఎంఎఫ్‌పీఏ) గురించి తెలిసింది. దానిలో స్వప్న సభ్యత్వం తీసుకుంది. ఎంఎప్పీఏ అనేది దివ్యాంగ కళాకారుల కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ. 27 మంది భారతీయ కళాకారులకు దీనిలో సభ్యత్వం దక్కింది. -
యుద్దానికి విరమణ ప్రకటించిన సూడాన్
సూడాన్‌లో గత కొన్ని రోజులు జరుగుతున్న అంతర్యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు వర్గాల సైన్యం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఇది చర్చల ద్వారా ఏర్పడిన మొదటి సంధి. అయితే సుడాన్ సైన్యం సోమవారం రాజధాని ఖార్టూమ్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. సహాయక చర్యలను అనుమతించే క్రమంలో వారం రోజుల కాల్పుల విరమణ అమలులోకి రావడానికి కొన్ని గంటల ముందు పారామిలిటరీ ప్రత్యర్థులపైచేయి సాధించేందుకు సూడాన్ సైన్యం ఈ చర్యకు పాల్పడింది. ఇరు సైనిక వర్గాల మధ్య వివాదం చెలరేగినప్పటి నుంచి రాజధానిలోని నివాస ప్రాంతాలలో పనిచేస్తున్న పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మొబైల్ యూనిట్ల వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఆదివారం సాయంత్రం వరకు వైమానిక దాడులు నిర్వహించినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే సోమవారం సాయంత్రం 7: 45 గంటల నుంచి కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలిపాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో సైన్యం, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రతినిధులు ఉన్నారు. జెడ్డాలో చర్చల తర్వాత ఒప్పందానికి ఈ బృందం మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం పొరుగు దేశాలకు పారిపోయిన 2,50,000 మందితో సహా దాదాపు 1.1 మిలియన్ల మందికి ఊరట కల్పించింది.సెంట్రల్ ఖార్టూమ్‌లోని వ్యూహాత్మక స్థానాల నుంచి పౌర భవనాలను ఆక్రమించిన పొరుగు ప్రాంతాల నుంచి RSFని తొలగించడానికి అక్కడి సైన్యం చాలా కష్టపడింది. -
అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆర్బీఐ గురి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ప్రయాణ సమయాల్లో వ్యయాలకు సంబంధించి అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల (ఐసీసీ) వినియోగాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెమిటెన్స్ పథకం (ఎల్ఆర్ఎస్) పరిధిలోకి తీసుకుని వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ ఒకటి తెలిపింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన దీని ప్రకారం అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా విదేశీ మారకంలో చేసే వ్యయాలు ఇకపై ఎల్ఆర్ఎస్ పరిధిలోకి వస్తాయి. ఒక రెసిడెంట్ రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా సంవత్సరానికి గరిష్టంగా 2.5 లక్షల డాలర్ల వరకూ వ్యయం చేసే అవకాశం ఏర్పడింది. 2.5 లక్షల డాలర్లు, లేదా మరేదైన విదేశీ కరెన్సీలో దానికి సమానమైన మొత్తానికి మించిన చెల్లింపులకు (రెమిటెన్స్) ఆర్బీఐ నుంచి అనుమతి అవసరం అవుతుంది. అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ చెల్లింపులను ఎల్ఆర్ఎస్లో చేర్చడానికి సంబంధించి విదేశీ మారక నిర్వహణ (కరెంట్ అకౌంట్ లావాదేవీలు) (సవరణ) రూల్స్, 2023ని మంత్రిత్వ శాఖ మే 16న నోటిఫై చేసినట్లు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్బీఐతో సంప్రదింపులతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఇదీ చదవండి: ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంలకు షాక్! కొత్త సర్వీస్‌ను తీసుకొచ్చిన జొమాటో.. -
థ్యాంక్యూ సిస్టర్
గుంటూరు మెడికల్: ఆసుపత్రిలో 24గంటలూ రోగి పడకవద్దే ఉండి చిరునవ్వుతో వైద్యసేవలందిస్తూ వ్యాధి నుంచి రోగి కోలుకోవటంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారు. అనారోగ్యంతో ఉన్న వారిని సొంతవారే ఈసడించుకుంటున్న నేటి దినాల్లో రోగులకు ఆప్యాయంగా సేవలు అందిస్తూ మానవత్వపు విలువలున్నాయని నిరూపించుకుంటుంది నర్సులు మాత్రమే అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కాలిన గాయలు... కుళ్లిన శరీరభాగాలు... గాయపడి, రక్తమోడుతూ దుర్గంధం వెదజల్లే శరీరాలకు నర్సులు సేవలను అందిస్తారు. æసేవకు ప్రతిరూపంగా చెప్పుకొనే నర్సుల దినోత్సవాన్ని ఏటా మే 12న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఇదీ నేపథ్యం.. లేడీ విత్ ది ల్యాంప్ గా పేరు గాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో జని్మంచారు. 1854–56 లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లారెన్స్ నైటింగేల్ తోటి నర్సుల సహాయంతో యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. వారికి ధైర్యమూ చెప్పింది. నర్సులు చేసిన సేవలవలన యుద్ధంలో మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బతిన్న ప్రతి సైనికుడికి తాను కోలుకుంటానన్న ఆశ చిగురింపచేసేలా ఆమె వైద్య సేవలందించింది. ఆమె సేవలను గుర్తించి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మే12న ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతి రోజున నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. నర్సులు అందించే సేవలు... ఆసుపత్రిలో డాక్టర్ల తరువాత అత్యంత కీలకమైన పాత్ర నర్సులదే. ఆసుపత్రికి నర్సులు వెన్నుముక లాంటివారు. నిత్యం తెల్లటి వ్రస్తాలు ధరించి రోగుల పడకల వద్దే ఉంటూ వారికి వైద్య సాయం అందించడంతోపాటు, మానసిక స్థైర్యాన్ని సైతం కలి్పస్తుంటారు. వార్డులో ఉంటున్న రోగులకు కావాల్సిన మందులను పంపిణీ చేయటం, వార్డులో ఉండే రోగులకు కావాల్సిన మందులను మెడికల్ స్టోర్ నుంచి ఇండెంట్ పెట్టి తెప్పించటం, రోగుల పడకలను శుభ్రంగా ఉండేలా చేయించటం, ఫ్లూయిడ్స్ ఎక్కించటం, వ్యాధినిర్ధారణ పరీక్షలకు రోగిని పంపించటం, వార్డులో వర్క్‌షాపునకు సంబంధించిన పనులు చూడటం, యూనిట్ చీఫ్, అసిస్టెంట్ డాక్టర్లు రోగులను పరీక్షించేందుకు వచ్చినప్పుడు వారి వెంట ఉండి సహాయం చేయటం, వార్డు శుభ్రంగా ఉండేలా చూడటం తదితర పనులను నర్సులు చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు, గర్భణులకు టీకాలు వేయటం, కాన్పులు చేయటం కూడా నర్సులే చేస్తారు. నర్సింగ్ ప్రాధాన్యత గుర్తించిన ప్రభుత్వం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో టీచింగ్ ఆసుపత్రి మొదలు పీహెచ్సీ వరకు పలు నర్సింగ్ సిబ్బంది పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో 300 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధుల్లో చేరారు. గుంటూరు జీజీహెచ్‌లో 250 పోస్టులు ఒకేసారి మంజూరు చేసిన ప్రభుత్వం తద్వారా నర్సింగ్ సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకుంది. డాక్టర్ వైఎస్సార్ విల్లేజ్ హెల్త్ క్లినిక్‌లలో సైతం బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ పేరుతో రిక్రూట్మెంట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నర్సింగ్ పోస్టులు పెంచినందుకు కృతజ్ఞతలు అధికారంలోకి రాగానే గుంటూరు జీజీహెచ్‌లో 250 స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. అధిక సంఖ్యలో పోస్టులు మంజూరు చేయడం ద్వారా రోగులకు మెరుగైన నర్సింగ్ సేవలు అందిస్తున్నాం. పలు రకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం. వారు వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లి మేము అందించిన సేవలను గుర్తించి ఫోన్లు చేస్తుంటారు. నా తల్లి చంద్ర లీలావతి, పిన్ని సుగుణ కుమారి, ఇరువురు కూడా నర్సింగ్ వృత్తిలో పనిచేశారు. పిన్ని ప్రొత్సాహంతో నర్సింగ్ వృత్తిలో ప్రవేశించాను. పలు ఆసుపత్రుల్లో వివిధ హోదాల్లో రోగులకు సేవలు అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది. – కర్రెద్దుల ఆషా సజని, గుంటూరు జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ పీహెచ్‌సీకి ముగ్గురు నర్సులు గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్కరు మాత్ర మే నర్సింగ్ సిబ్బంది ఉండేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేప ట్టగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నర్సింగ్ సే వలు మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతి పీహెచ్సీలో ముగ్గురు నర్సులను నియమించారు. అంతేకాకుండా సబ్ సెంటర్లు, సచివాలయాల్లో ఉండే ఏఎన్ఎంలకు సైతం జీఎన్ఎం శిక్షణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. – డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డీఎంహెచ్ఓ -
పసిడి దిగుమతులు 24 శాతం డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొ న్న నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం (2022– 23)లో పసిడి దిగుమతులు 24% తగ్గాయి. వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 35 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2021– 22లో ఇవి 46.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 ఆగస్టు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మందగించిన పసిడి దిగుమతులు మార్చిలో ఒక్కసారిగా ఎగిశాయి. ఆ నెలలో 3.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది మార్చిలో ఇవి 1 బిలియన్ డాలర్లే. ఇక వెండి దిగుమతులు గత ఆర్థిక సంవత్సరం 6 శాతం పెరిగి 5.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. బంగారం దిగుమతులు తగ్గినప్పటికీ వాణిజ్య లోటు భర్తీ యత్నాలకు పెద్దగా తోడ్పడలేదు. 2022– 23లో ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 181 బిలియన్ డాలర్ల నుంచి 267 బిలియన్ డాలర్లకు పెరిగింది. రత్నాభరణాల ఎగుమతులు 3 శాతం క్షీణించి 38 బిలియన్ డాలర్లకు పరిమిత మయ్యాయి. అధిక సుంకాలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు బంగారం దిగుమతులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దేశీ పరిశ్రమకు తోడ్పాటు అందించే దిశగా సుంకాలను తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని పేర్కొన్నాయి. అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో ఉండటం, రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం, చైనా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం తదితర అంశాల కారణంగా రత్నాభరణాల రంగానికి సవాళ్లు తప్పకపోవచ్చని పరిశ్రమ సమాఖ్య జీజేఈపీసీ మాజీ చైర్మన్ కొలిన్ షా అభిప్రాయపడ్డారు. జ్యుయలరీ పరిశ్రమ అవసరాల కోసం భారత్ ఏటా దాదాపు 800–900 టన్నులను దిగుమతి చేసుకుంటోంది. కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేసే దిశగా పసిడిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. -
జేపీ మోర్గాన్ చేతికి ఫస్ట్ రిపబ్లిక్
న్యూయార్క్: ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌లో తలెత్తిన సంక్షోభం మొత్తం వ్యవస్థకు వ్యాపించకుండా చూసేందుకు అమెరికా బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌ను తమ అధీనంలోకి తీసుకున్నాయి. బ్యాంకు డిపాజిట్లు, అసెట్లలో చాలా మటుకు భాగాన్ని జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంక్‌నకు విక్రయించాయి. అమెరికా చరిత్రలో ఓ భారీ స్థాయి బ్యాంకు విఫలం కావడం ఇది రెండోసారి. 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో వాషింగ్టన్ మ్యూచువల్ కుప్పకూలింది. ప్రస్తుత ఫస్ట్ రిపబ్లిక్ తరహాలోనే అప్పట్లో వాషింగ్టన్ మ్యూచువల్‌ను కూడా జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంకే టేకోవర్ చేసింది. సోమవారం నుంచి ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్‌కు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్న 84 శాఖలు .. జేపీమోర్గాన్ చేజ్ బ్యాంక్ బ్రాంచీలుగా పనిచేయడం ప్రారంభమవుతుందని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎఫ్‌డీఐసీ) వెల్లడించింది. ఏప్రిల్ 13 గణాంకాల ప్రకారం ఫస్ట్ రిపబ్లిక్కు 229 బిలియన్ డాలర్ల అసెట్లు, 104 బిలియన్ డాలర్ల మేర డిపాజిట్లు ఉన్నాయి. పరిమాణం ప్రకారం అమెరికన్ బ్యాంకుల్లో 14వ స్థానంలో ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సమస్య పరిష్కారానికి డిపాజిట్ ఇన్సూరెన్స్ ఫండ్‌పై 20 బిలియన్ డాలర్ల భారం పడగా, ఫస్ట్ రిపబ్లిక్పరంగా మరో 13 బిలియన్ డాలర్ల మేర ప్రభావం పడవచ్చని ఎఫ్‌డీఐసీ అంచనా వేసింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు సంక్షోభంలో చిక్కుకున్న ప్రభావంతో మార్చి నుంచి ఫస్ట్ రిపబ్లిక్ సైతం సవాళ్లు ఎదుర్కొంటోంది. తక్కువ వడ్డీ రేట్లకు ఎక్కువగా రుణాలివ్వడం, అధిక శాతం డిపాజిట్లకు బీమా భద్రత లేకపోవడం వంటి అంశాల కారణంగా బ్యాంకుపై డిపాజిటర్లలో నమ్మకం సన్నగిల్లింది. ఫలితంగా బిలియన్ల కొద్దీ డాలర్ల విత్‌డ్రాయల్స్ వెల్లువెత్తాయి. ఒక దశలో ఫస్ట్ రిపబ్లిక్కి సహాయం చేసేందుకు ఇతర బ్యాంకులు కూడా ముందుకు వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో గత వారాంతంలో భేటీ అయిన అమెరికా నియంత్రణ సంస్థలు పరిష్కార మార్గాన్ని అమలు చేశాయి. -
సముద్రంలో అత్యంత లోతులో జీవించే చేప ఇదే! వీడియో వైరల్
జలచరాలన్ని సముద్రంలో ఓ పరిమిత లోతు వరకే జీవిస్తాయి. కానీ దాదాపు 8,336 లోతులో జీవించే ఓ చేపను తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని పేరు స్నెయిల్ ఫిష్(snail fish). యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టోక్యో యునివర్శిటీ ఆఫ్ మెరైన్ సైన్స్ అండ్ టెక్కాలజీ శాస్త్రవేత్తలు చేపల మనుగడపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్ర అగాధాల్లో వీడియోలు తీస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ సమీపంలోని ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని అగాధంలో సముద్ర రోబోల కెమెరాకు ఓ అరుదైన చేప చిక్కింది. శాస్త్రవేత్తలు ఇప్పటివరకు అత్యంత లోతులో చిత్రీకరించిన చేపలు ఇవే కావడం గమనార్హం. సముద్ర రోబోల ద్వారా గత సెప్టెంబర్‌లో చిత్రీకరించిన వీడియో దృశ్యాలను ఇటీవల శాస్త్రవేత్తలు విడుదల చేశారు. చేపలు సముద్రంలో ఎంత లోతువరకు వెళ్లున్నాయో ఇది చూపిస్తోందని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన, మిండెరూ- యూడబ్ల్యూఏ డీప్ సీ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు, సముద్ర జీవశాస్త్రవేత్త అలాన్ జెమీసన్ అన్నారు. సముద్రంలోని చేపల మనుగడపై అధ్యయనం చేస్తున్నామని, ఇందులో భాగంగా జపాన్ పసిఫిక్ సముంద్రంలో ఇజు-ఒగాసవారా అగాధంలో 8,336 మీటర్ల లోతులో స్నెయిల్ ఫిష్‌ను గుర్తించామన్నారు. ఈ స్నెయిల్ ఫిష్‌లు పిల్ల చేపలని.. తక్కువ లోతులో నివసించే పెద్ద జీవుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు వీలైనంత లోతుకు వెళ్తాయని జెమీసన్ చెప్పారు. ఇదిలా ఉంటే 2008లో 7,703 మీటర్ల లోతులో మాత్రమే చేపలను గుర్తించారు. కానీ తాజాగా 8,022 మీటర్ల లోతులో శాస్త్రవేత్తులు రెండు చేపలను పట్టుకున్నారు. ఇప్పటివరకు అత్యంత లోతులో చిక్కిన చేపలు ఇవేనని అలాన్ జెమీసన్ పేర్కొన్నారు. లోతైన జలాల్లో అక్కడి తీవ్ర పరిస్థితులను తట్టుకుని ఎలా జీవిస్తున్నాయో అధ్యయనం చేసేందుకు ఇవి సహాయపడతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. 🌊 Scientists from #UWA and Japan have set a new record for the deepest fish ever filmed and caught! 🐟 They discovered a snailfish at a depth of 8,336m in the Izu-Ogasawara Trench and caught two more from 8,022m during a two-month expedition. @minderoo https://t.co/RjJ7CxD97d pic.twitter.com/kRdYJsI3yU — UWA (@uwanews) April 3, 2023 -
ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆరు నెలల పాటు హైరింగ్‌కు కాస్త విరామం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలను చూస్తే ప్రతి త్రైమాసికంలోనూ నికర నియామకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయని, రాబోయే రోజుల్లోనూ కొన్నాళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతక్రితం ఏడాది జోరుగా రిక్రూట్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం డిమాండ్ మాత్రమే కీలకాంశంగా మారిందని పేర్కొన్నాయి. మూడో త్రైమాసికంలోనే నియామకాలు తక్కువ స్థాయిలో ఉండగా.. నాలుగో త్రైమాసికంలోనూ దాదాపు అదే రకమైన ట్రెండ్ నెలకొందని టీమ్‌లీజ్ డిజిటల్ వర్గాలు వివరించాయి. చాలామటుకు కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయని పేర్కొన్నాయి. ఎక్స్‌ఫెనో జాబ్ రిపోర్ట్ ప్రకారం మార్చి త్రైమాసికంలో ఉద్యోగావకాశాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56 శాతం క్షీణించాయి. మరికొద్ది రోజుల్లో కంపెనీలు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ కష్టాలు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కూడా ఐటీ రంగంలో నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలకు సేవలు అందించే దేశీ ఐటీ కంపెనీల్లో హైరింగ్ మందగించింది. ఈ పరిస్థితి నెమ్మదిగా మారనున్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో మాత్రం ఆ ప్రభావాలు అలాగే కొనసాగవచ్చని ఎక్స్‌ఫెనో సహవ్యవస్థాపకుడు అనిల్ ఎథనూర్ పేర్కొన్నారు. గత రెండు త్రైమాసికాలుగా హైరింగ్‌పై కాస్త సానుకూలంగా ఉన్నా, ఇంటర్వ్యూ చేసిన అభ్యర్ధులను తీసుకునే విషయంలో మాత్రం కంపెనీలు ముందుకు వెళ్లడం లేదని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కొటిల్ తెలిపారు. ఆయా సంస్థలు వేచి, చూసే ధోరణి పాటిస్తున్నాయని, ఈ త్రైమాసికంలో నియామకాల పరిస్థితి ఆశావహంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. తొలి ఆరు నెలల్లో నికరంగా నియామకాలు 40% తగ్గొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా క్యూ4లో కంపెనీల ప్రణాళికలు మారిపోయాయని, హైరింగ్‌పై దాని ప్రభావం పడిందని కెరియర్‌నెట్ సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వాస్తవానికి అంతక్రితం త్రైమాసికంలో ఐటీ కంపెనీలు హైరింగ్‌ను ప్రారంభించడంపై సానుకూల యోచనల్లోనే ఉన్నప్పటికీ .. బ్యాంకింగ్ సంక్షోభంతో పెద్దగా రిక్రూట్మెంట్ తలపెట్టలేదని వివరించారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలలు హైరింగ్ అంత ఆశావహంగా కనిపించడం లేదన్నారు. పరిస్థితులపై ఇంకా స్పష్టత రానందున కంపెనీలు వేచి చూసే ధోరణే కొనసాగించవచ్చని.. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త మెరుగ్గా ఉండవచ్చని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2.5 లక్షలకు పరిమితం కావచ్చు.. దేశీ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా క్యూ1లో 59,704, క్యూ2లో 34,713 మందిని రిక్రూట్ చేసుకోగా క్యూ3లో ఇది ఏకంగా 4,904కి పడిపోయింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీవో సర్వీసుల విభాగంలో నికరంగా 4.80 లక్షల నియామకాలు జరగ్గా, 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.80 లక్షల స్థాయిలో ఉండొచ్చని హాన్ డిజిటల్ సీఈవో శరణ్ బాలసుందరమ్ తెలిపారు. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో నికర నియామకాలు సుమారు 2.5 లక్షల స్థాయిలో ఉండొచ్చని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని కంపెనీలు తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉండొచ్చని, మరికొన్ని వాటిని రద్దు చేసుకునే అవకాశం ఉందని బాలసుందరమ్ చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ అంతగా జరగకపోవడం, కోవిడ్ పరిస్థితులపరమైన డిమాండు కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగా జరిగాయని ఆయన చెప్పారు. ఆ ఒక్క సంవత్సరాన్ని పక్కన పెడితే ఐటీలో ఏటా 2–3 లక్షల మంది హైరింగ్ సాధారణంగానే ఉంటుందని పేర్కొన్నారు. -
క్యూ1లో హైరింగ్ అప్
ముంబై: అంతర్జాతీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సర్వీసులు, తయారీ రంగాల కంపెనీలు మాత్రం నియామకాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే 2023–24 క్యూ1లో ఇది 10 శాతం అధికంగా ఉండగలదని అంచనాలు నెలకొన్నాయి. అయితే, 2022–23 నాలుగో త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 4 శాతం తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌లీజ్ సర్వీసెస్‌కి చెందిన ఉపాధి అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 14 రంగాలకు చెందిన 809 చిన్న, మధ్య తరహా, భారీ సంస్థలపై చేసిన సర్వే ఆధారంగా టీమ్‌లీజ్ దీన్ని రూపొందించింది. ఇందులో పాల్గొన్న 64 శాతం మంది యజమానులు తమ సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. నివేదిక ప్రకారం సర్వీస్, తయారీ రంగాల్లో క్యూ1లో ప్రధానంగా ఎంట్రీ, జూనియర్ స్థాయి నియామకాలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సర్వీసుల్లో ఇవి వరుసగా 73 శాతం, 71 శాతంగా ఉండగా .. తయారీలో 49 శాతం, 55 శాతంగా ఉన్నాయి. మధ్య స్థాయి ఉద్యోగాలకు సంబంధించి సర్వీసుల్లో 54 శాతంగాను, తయారీలో 32 శాతంగాను ఉన్నాయి. అత్యధికంగా సర్వీస్ రంగంలో.. తయారీ విభాగంతో పోలిస్తే సర్వీసుల రంగంలో హైరింగ్‌కు ఎక్కువగా ఆస్కారం ఉంది. సేవా రంగం విషయానికొస్తే ఇది టెలికమ్యూనికేషన్స్‌లో 96%, ఆర్థిక సర్వీసులు (93%), ఈ–కామర్స్.. అనుబంధ స్టార్టప్‌లు (89%), రిటైల్ (87%), విద్యా సర్వీసుల్లో 83%గా ఉంది. తయారీ రంగంలో హెల్త్‌కేర్ .. ఫార్మాలో 91 శాతంగా, ఎఫ్ఎంసీజీలో 89 శాతంగా, ఎలక్ట్రిక్ వాహనాలు.. మౌలిక సదుపాయాల కల్పనలో 73 శాతంగా ఉంది. -
వృద్ధి బాటలో బయోమాస్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశంలో బయోమాస్ మార్కెట్ రానున్న సంవత్సరాల్లో మంచి వృద్ధిని చూడనుంది. 2030–31 నాటికి ఈ మార్కెట్ రూ.32,000 కోట్లను చేరుకోనుందని 1లాటైస్ నివేదిక తెలియజేసింది. ప్రభుత్వ పథకాల మద్దతుకుతోడు, అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ కంపెనీల పెట్టుబడులు ఈ మార్కెట్ వృద్ధికి సాయపడతాయని తెలిపింది. బయోమాస్ కోజనరేషన్ ప్రాజెక్టుకు మద్దతుగా కొత్త పథకాల ఆవిష్కరణతో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న పాటి బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వీలు కలుగుతుందని అంచనా వేసింది. ‘‘భారత్‌లో వ్యాపార సంస్థలకు శుద్ధ, నమ్మకమైన విద్యుత్ సరఫరాకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో బయోమాస్ కీలక వనరుగా విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడంలో ముఖ్య పాత్ర పోషించనుంది. భారత్‌లో ప్రస్తుతం బయోమాస్ ఉత్పత్తి సామర్థ్యం 10.2 గిగావాట్లుగా ఉంది. ఇది 2031 మార్చి నాటికి రూ.32,000 కోట్లకు విస్తరిస్తుంది’’అని 1లాటైస్ డైరెక్టర్ అభిషేక్ మైటి పేర్కొన్నారు. బయోమాస్ ఎనర్జీ విభాగంలో పెట్టుబడులు, సహకారం రూపంలో సంస్థలకు అవకాశాలు ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ పెట్టుబడుల రాకతో పర్యావరణ అనుకూల విద్యుత్‌ను సంస్థలు ఆఫర్ చేయగలవని, నెట్ జీరో లక్ష్యాల సాధనకు ఉపయోగకరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. బయోమాస్ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 4 శాతం చొప్పున పెరుగుతూ 2021–22 నాటికి 10 గిగావాట్లకు చేరుకున్నట్టు తెలిపింది. -
ఎస్‌యూవీలతో పర్యావరణ ముప్పు
బెర్లిన్: పెద్ద కార్లతో పర్యావరణానికి సమస్య పెరుగుతోంది. కర్బన ఉద్గారాలను ఎక్కువగా ఉత్పత్తి చేయడమే ఇందుకు కారణం’ అని ప్యారిస్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. ఎస్యూవీ సగటు సైజు తగ్గించడం, బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యాలు పెంచడం, వినూత్న బ్యాటరీ సాంకేతికతల్లో పెట్టుబడులు ఇందుకు పరిష్కారమని స్పష్టం చేసింది. ‘2022లో ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) 100 కోట్ల మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ను వెదజల్లాయి. ఇది జర్మనీ వంటి పారిశ్రామిక దేశ వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువ. పెద్ద కార్ల వైపు మార్కెట్ మళ్లడం, తక్కువ ఇంధన సామర్థ్యం గల సంప్రదాయ వాహనాలతో చమురు డిమాండ్‌తోపాటు కర్బన ఉద్గారాలు అధికం అవుతాయి. ఎస్‌యూవీలు మినహా సంప్రదాయ కార్లు వినియోగించిన చమురు 2021, 2022లో దాదాపు సమానం. ఎస్‌యూవీల విషయంలో చమురు వాడకం రోజుకు 5 లక్షల బ్యారెల్స్ దూసుకెళ్లింది. 2022 అమ్మకాల్లో చిన్న కార్లు 10 లక్షల యూనిట్లు, ఎస్‌యూవీలు 10 లక్షల యూనిట్లు తగ్గాయి. ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు రెండింతలై 1 కోటి యూనిట్లకు చేరాయి. గతేడాది ఎలక్ట్రిక్ నాన్–ఎస్‌యూవీలు 53 లక్షల యూనిట్లు అమ్ముడైతే, ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు 55 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. పెరుగుతున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ మార్కెట్‌తో బ్యాటరీ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి ఉంటుంది. బ్యాటరీలను తయారు చేయడానికి అవసరమైన క్లిష్ట ఖనిజాల కోసం డిమాండ్‌ను మరింత పెంచుతుంది’ అని ఏజెన్సీ వివరించింది. -
విమాన టికెట్లపై గో ఫస్ట్ అదిరిపోయే ఆఫర్: రేపటి వరకే ఛాన్స్
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. దేశీయ,అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలపై ఆఫర్‌ను అందిస్తోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 23-24) విక్రయిస్తున్న ఈ స్పెషల్ సేల్‌లో దేశీయ విమాన టికెట్ల ధరలు రూ. 1,199 వద్ద, అంతర్జాతీయ విమానాల ఛార్జీలు రూ. 6,139 నుంచి ప్రారంభమవుతాయని గో ఫస్ట్ తెలిపింది. (ఇదీ చదవండి: ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్) సమ్మర్ ట్రావెల్ సీజన్‌కు ముందు బడ్జెట్ ధరల విమానయాన సంస్థ గో ఫస్ట్ ఫిబ్రవరి 23న రెండు రోజుల ధరల విక్రయాన్ని ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుందని, ప్రయాణ కాలం మార్చి 12 నుంచి సెప్టెంబర్ 30, 2023 వరకు ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇదే విధమైన ఆఫర్ ప్రకటించింది.ఇండిగో దేశీయ విమాన టిక్కెట్లను రూ. 2,093 (ప్రారంభ ధర) ఆఫర్ ప్రకటించిన రోజు తర్వాత గో ఫస్ట్ ప్రకటన వచ్చింది. ఇండిగో సేల్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్లో బుక్ చేసుకున్న టికెట్లపై మార్చి 13 నుండి అక్టోబర్ 13, 2023 వరకు ప్రయాణించవచ్చు. (సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం) కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఫిబ్రవరి 20న విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2023లో 125.42 లక్షల మంది ప్రయాణీకులతో దేశీయ విమానాల రాకపోకలు గత ఏడాది కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. డిసెంబరు 2022 నుండి 127.35 లక్షలతో పోలిస్తే 1.5 శాతం తక్కువగా ఉంది. అయితే విమాన ట్రాఫిక్ ఇప్పటికీ ప్రీ-కోవిడ్ స్థాయిల కంటే తక్కువగా ఉంది. జనవరి 2020లో దేశీయ విమానయాన సంస్థలు 127.83 లక్షల మంది ప్రయాణికులతో ప్రయాణించారు. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) -
ఎగుమతులపై ప్రపంచ అనిశ్చితి ప్రభావం! డిసెంబర్లో వృద్ధిలేకపోగా..
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులపై అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం కనబడుతోంది. 2022 డిసెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా 12.2 శాతం క్షీణతను నమోదుచేసుకున్నట్లు వాణిజ్యశాఖ వెలువరించిన తాజా గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► 2022 డిసెంబర్లో వస్తు ఎగుమతుల విలువ 2021 ఇదే నెలతో పోల్చి 12.2 శాతం తగ్గి, 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇక వస్తు దిగుమతుల విలువ కూడా 3.5 శాతం తగ్గి 58.24 బిలియన్ డాలర్లుగా ఉంది. ► వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 23.76 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల విలువ డిసెంబర్లో 12 శాతం పడిపోయి 9.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు ఆభరణాల ఎగుమతులు సైతం 15.2 శాతం పడిపోయి 2.54 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ► కాఫీ, జీడిపప్పు, ఔషధాలు, కార్పెట్, హస్తకళ లు , తోలు ఉత్పత్తుల ఎగుమతులు కూడా భారీ గా తగ్గాయి. ► పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు కూడా 27 శాతం తగ్గి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక చమురు దిగుమతులు 6 శాతం పెరిగి 17.5 బిలియన్ డాలర్లకు చేరగా, పసిడి దిగుమతులు 75 శాతం క్షీణించి 1.18 బిలియన్ డాలర్లకు చేరాయి. తొమ్మిది నెలల పరిస్థితి ఇలా... ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య దేశ వస్తు ఎగుమతులు 9 శాతం పెరిగి 332.76 బిలియన్ డాలర్లుగా నమోదయితే, దిగుమతుల విలువ 24.96 శాతం పెరిగి 551.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 218.94 బిలియన్ డాలర్లుగా ఉంది. 2021–22లో దాదాపు 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరగ్గా, 2022–23లో ఈ స్థాయికి మించి ఎగుమతులు జరగాలన్నది కేంద్రం ధ్యేయం. అయితే అంతర్జాతీయ అనిశ్చితి వల్ల ఈ లక్ష్యంపై నీలినీడలు అలముకుంటున్నాయి. గడచిన తొమ్మిది నెలల్లో క్రూడ్ ఆయిల్ దిగుమతల విలువ 45.62 శాతం పెరిగి 163.91 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఎలక్ట్రానిక్స్ రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) వంటి ప్రోత్సాహకాల వల్ల ప్రయోజనం ఒనగూడిందని వాణిజ్యశాఖ కార్యదర్శి సునిల్ భరత్వాల్ పేర్కొన్నారు. ఈ రంగంలో ఎగుమతులు ఏప్రిల్–డిసెంబర్ మధ్య 52 శాతం పెరిగి 17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రష్యా నుంచి ఏప్రిల్–డిసెంబర్ మధ్య దిగుమతులు నాలుగురెట్లు పెరిగి 32.88 బిలియన్ డాలర్లకు చేరాయి. చైనా నుంచి సైతం దిగుమతులు 12 శాతం పెరిగి 75.87 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతులు 35.58 శాతం తగ్గి 11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులు విషయంలో 6.8 శాతం పెరుగుదలతో (59.57 బిలియన్ డాలర్లు) అమెరికా అతిపెద్ద ఎగుమతుల భాగస్వామిగా ఉండగా, తరువాతి స్థానంలో యూఏఈ, నెథర్లాండ్స్, బంగ్లాదేశ్, సింపూర్‌లు నిలిచాయి. -
Snehalatha Mekala: అట్టడుగు వర్గాల కోసం అంతర్జాతీయ వేదికలపై...
ఎనిమిది దక్షిణాసియా దేశాలూ, అభివృద్ధికి నోచుకోని అనేక ఆఫ్రికాలోని వెనకబడిన దేశాల పల్లెల్లోని అట్టడుగు వర్గాలు, మారుమూల గిరిజనులకు, నగరాల్లోని మురికివాడల్లో రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కోసం పనిచేస్తున్న వందలాది సంస్థల్ని సమన్వయం చేసే బాధ్యతలు... చాలా దేశాల్లోని పేదలూ, అణగారిన ప్రజలు, వికలాంగులు, ట్రాన్స్జెండర్స్లాంటి వారి అవసరాలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడంతో పాటు వారికి అందాల్సిన సేవలూ, సౌకర్యాల విధాన రూపకల్పనలకు కృషి.. తమ పరిశోధనల్ని అంతర్జాతీయ సంస్థలకూ, వివిధ దేశాల్లోని ప్రభుత్వాలకూ, అక్కడి నేతలకు తెలియజెప్పే పని... అర్ధరాత్రి, అపరాత్రుల్లేకుండా దాదాపు 35 పైగా దేశాల్లో పర్యటనలు... ఇవన్నీ నిర్విరామంగా నిర్వర్తిస్తున్న సార్క్ దేశాల, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్త ‘స్నేహలత మేకల’తో మాటా మంతీ... ► ప్రస్తుతం మీరు నిర్వహిస్తున్న బాధ్యతల గురించి... స్నేహలత : మన దేశంలోనే కాకుండా... మరెన్నో దేశాలలోని కుగ్రామాల్లో, గిరిజన ఆవాసాల్లో, పేదరికం తాండవిస్తున్న కొన్ని దేశాల్లోని మారుమూల పల్లెల్లో, పట్టణ మురికివాడల్లో మంచినీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కల్పనకు అవసరమైన విధాన రూపకల్పనలతో పాటు అనేక సేవా కార్యకలాపాల రంగంలో పాలుపంచుకుంటున్నాను. మనదేశంతోపాటు బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, పాకిస్తాన్, మాల్దీవ్స్, శ్రీలంక, నేపాల్ దేశాల్లోని 500 పైగా ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలను సమన్వయపరుస్తూ... అవి తమ అవసరాలను, అభిప్రాయాలను అంతర్జాతీయ వేదికలపైన తెలియజెప్పే బాధ్యతలను, ప్రభుత్వ సహాయాలు అందేందుకు లోపరహితమైన విధాన రూపకల్పనలో పాలుపంచుకునే‘సౌత్ ఏషియన్ కాన్ఫరెన్స్ ఆన్ శానిటేషన్ ఫర్ ఆల్’ (సాకోశాన్) ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. అట్టడుగువర్గాలు, గిరిజనలతో పాటు వికలాంగులు, ట్రాన్స్‌జెండర్స్ లాంటివారి వెతలను అంతర్జాతీయ వేదికలపై వినిపించడమే కాకుండా... ఆ సేవలన్నీ వారికి ఎలా అందాలన్న విధాన రూపకల్పనపై ప్రభుత్వాలతో కలిపి పనిచేస్తుంటాం. ఈ కార్యక్రమాల కోసం బాగా వెనకబడిన ఆఫ్రికా దేశాలు మొదలుకొని... యూఎస్, ఫ్రాన్స్, బెల్జియమ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తాం. ► ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ కార్యకలాపాలూ, వాటిల్లో మీ భాగస్వామ్యం... ఇది రెండు విధాలుగా జరుగుతుంది. వివిధ దేశాల్లోని 500 స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పాటు, బడుగువర్గాలు, నగర మురికివాడల్లోని పేద ప్రజల వెతలు తీర్చడానికి వివిధ దేశాల్లోని హైలెవల్ పొలిటికల్ కమిటీలు, ప్రభుత్వంలోని నేతలు, బాధ్యులందరూ తీసుకోవాల్సిన చర్యలు, అవి జరగడానికి అవసరమైన విధాన నిర్ణయాల రూపకల్పనలో తోడ్పాటు అందిస్తుంటాను. అలాగే అట్టడుగు వర్గాలు, గిరిజనుల గొంతుకను అంతర్జాతీయ వేదికలపై వినిపించడం... ఇదంతా ఒకవైపు కార్యక్రమం. ఇక మరోవైపున మా ప్రతిపాదనలు సాకారమయ్యాక... వీటి నిర్వహణకు కావలసిన పాలనాపరమైన ఆవశ్యకతలు, నిధులు... ఇవన్నీ అనేక దేశాల్లోని బడుగువర్గాలు, నగర మురికివాడల ప్రజలకు చేరేందుకు అవసరమైన సేవలందిస్తుంటాం. ► ఇన్ని దేశాల్లోని ఇన్నిన్ని మారుమూల ప్రాంతాల్లో కార్యకలాపాలకు నిధులెలా? మాకు యునిసెఫ్, శానిటేషన్ అండ్ వాటర్ ఫర్ ఆల్, వాటర్ ఎయిడ్, జీడబ్ల్యూపీ వంటివాటితో పాటు ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థలు నిధుల్ని అందిస్తాయి. ► అంతర్జాతీయ కార్యకలాపాల్లోకి మీ ప్రవేశం... ఇందుకు దోహదపడ్డ నేపథ్యం... నా కెరియర్ కర్నూలులో మొదలైంది. వాననీటిని ఒడిసిపట్టి, చెక్‌డ్యామ్స్ వంటివి నిర్మించి, భూగర్భజలాల వృద్ధికి తోడ్పడే ‘వాటర్‌షెడ్’ కార్యక్రమంలో చాలా చిన్నస్థాయి ‘సోషల్ ఆర్గనైజర్’గా కెరియర్ ప్రారంభించా. ఈ కార్యక్రమంలో ఓ వ్యవసాయ అధికారి, ఓ ఇంజనీర్, ఓ ఫారెస్టు అధికారితోపాటు కలిసి ఫీల్డ్‌లో పనిచేయాలి. మారుమూల ప్రాంతాలతోపాటు కొన్నిసార్లు గిరిజన, అటవీ ప్రాంతాల్లోనూ పనిచేయాల్సి వచ్చేది. క్రమక్రమంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలూ, వేదికలపై కార్యకలాపాలతో పాటు ప్రపంచబ్యాంకుకూ, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి సంస్థలకు కన్సెల్టెన్సీ బాధ్యతలనూ నిర్వర్తించా. ప్రస్తుతం తాజాగా ‘ఫాన్సా’ లో ముఖ్యంగా సమన్వయ బాధ్యతలు. ఈ కార్యక్రమంలోనే భాగంగా హైదరాబాద్‌లోని మెట్రో వాటర్ బోర్డుతో కలిసి ఇక్కడ కూడా నీటి వృథా నివారించడం, వర్షపు నీటిని కాపాడుకోవడం కోసం ఓ ప్రాజెక్టులో భాగం పంచుకున్నా. ► భవిష్యత్తు కార్యకలాపాల గురించి ఏమైనా ప్రణాళికలు? ప్రస్తుతం ఈ సేవలతో పాటు కొంపల్లి ప్రాంతంలో ‘నిశ్చింత’ అనే వృద్ధాశ్రమం నడుపుతున్నా. అది నాకెంతో ఇష్టమైన సేవా కార్యక్రమం. చేయగలిగినంత కాలం చేశాక... నేనూ, నా భర్త... పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్నే ఎంచుకుని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీలైనంతమందికి ఆరోగ్యాన్నివ్వాలన్నదే నా సంకల్పం. ఆమె సంకల్పం నెరవేరాలని ఆశిద్దాం. ► మహిళగా వివక్షగానీ, ఇబ్బందులుగానీ ఎదుర్కొన్నారా? స్నేహలత : వివక్ష కాదుగానీ... ఇబ్బందులు చాలానే ఎదుర్కొన్నా. మారుమూల పల్లెలకూ, దట్టమైన అడవుల్లోని చాలా గిరిజన గ్రామాలకు వెళ్లాల్సి రావడంతో నన్ను తీసుకెళ్లడానికి తోటివాళ్లు ఇబ్బంది పడేవారు. పట్నంలో చదువుకున్న ఓ అమ్మాయి ఇలా గ్రామాలు పట్టుకు తిరగడం నాకంటే... నాతోటివాళ్లనీ, గ్రామస్తుల్ని ఇబ్బంది పెట్టేది. వాళ్లతో మమేకం కావడానికీ, వయసుకంటే పెద్దగా కనిపించడానికీ చీరకట్టుతో వెళ్తుండేదాన్ని. అడవిబాటల్లో చీరకట్టుతో ప్రయాణం అదో ఇబ్బంది. కాన్ఫరెన్స్‌ల కోసం ఇంగ్లిష్ తెలియని ఆఫ్రికా ఖండంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటనలు ఓ సవాల్. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడాలేకుండా ఆఫ్రికాలోని బుర్కినాఫాస్ లాంటి చోట్లకు వెళ్లినప్పుడు కేవలం సైగలతో నెట్టుకురావడం లాంటివి ఇబ్బంది కలిగించేవే. ఒంటరిగా దాదాపు 35 దేశాలు తిరుగుతున్నప్పుడు కొన్ని అటవీ ప్రయాణాలు, అర్ధరాత్రి పయనాలు సాహసయాత్రకు తీసిపోనివిగా ఉండేవి. మహిళలకు ఫీల్డ్ జాబ్ అనువు కాదని ఈ రోజుల్లో అనుకోడానికి ఎంతమాత్రమూ వీల్లేదు. మూడు దశాబ్దాల కిందటే నేనూ, అలాగే మా తరంలోని అనేకమంది చేయగలిగినప్పుడు... ఇప్పుడిది ఓ అంశమే కాదు. – యాసీన్ ఫొటో: రాజేశ్ -
Roundup 2022: ఒక యుద్ధం.. ఒక హిజాబ్.. ఒక రాణి
ఒక యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టిస్తే, ఒక వైరస్ ప్రపంచదేశాల వెన్నులో ఇంకా వణుకు పుట్టిస్తూనే ఉంది. ఒక అమాయకురాలి మరణంతో ఈ హిజాబ్ మాకొద్దు అంటూ ఇరాన్ నవతరం నినదిస్తే, ఒక రాణి మహాభినిష్క్రమణంతో ఇంగ్లండ్‌లో ఒక శకం ముగిసిపోయింది. ఒకప్పుడు మన దేశాన్ని పాలించిన బ్రిటన్ పాలనా పగ్గాలను ఇప్పుడు భారతీయ మూలాలున్న వ్యక్తి తీసుకోవడం చూస్తే భూమి గుండ్రంగానే ఉంటుందన్న మాటలు అక్షర సత్యాలనిపిస్తాయి. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోవడం ఒక మైలురాయి అయితే, వాతావరణ మార్పులతో అగ్రరాజ్యాలు కూడా గడ్డ కట్టుకుపోవడం మన కళ్ల ముందే కనిపిస్తున్న కఠిన సత్యం. మొత్తంగా చూస్తే 2022 ప్రపంచదేశాలకు ఎన్నో చేదు జ్ఞాపకాలను, కొన్ని తీపి గురుతుల్ని మిగిల్చి వెళ్లిపోతోంది. ఒక్కసారి 2022లోకి తొంగిచూస్తే... వార్తల్లో వ్యక్తులు జెలెన్స్కీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ రష్యా దండయాత్రను సమర్థంగా ఎదుర్కొని ఈ ఏడాది హీరోగా మారారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ యుద్ధానికి దిగితే ధైర్య సాహసాలతో ఎదుర్కొన్నారు. వారంలో ముగిసిపోతుందనుకున్న పుతిన్ అంచనాలను పటాపంచలు చేస్తూ ఇంకా కదనరంగంలో పోరాడుతున్నారు. జెలెన్‌స్క్‌లో ఈ పోరాట స్ఫూర్తిని గుర్తించిన టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా కవర్ పేజీ ప్రచురించింది. రిషి సునాక్: ఒకప్పుడు భారత దేశాన్ని దాస్యం శృంఖలాల్లో బంధించి ఏళ్ల తరబడి పరిపాలించిన బ్రిటన్‌కు భారతీయ మూలాలున్న రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 42 ఏళ్ల వయసుకే ప్రధాని పీఠమెక్కి బ్రిటన్ చరిత్రలో పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బ్రిటన్ను గట్టెక్కించడంలో లిజ్ ట్రస్ విఫలం కావడంతో టోరీ ఎంపీల మద్దతుతో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి అల్లుడైన రిషి బ్రిటన్ ప్రధానిగా అక్టోబర్ 25న పదవీ ప్రమాణం చేశారు. ఎలాన్ మస్క్: నిత్యం సమస్యలతో చెలగాటమాడడాన్ని అమితంగా ఇష్టపడే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఈ ఏడాది వార్తల్లో నిలిచారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ని అక్టోబర్ 27న కొనుగోలు చేశారు. ఆ తర్వాత సంస్థలో ఉద్యోగుల తొలగింపు, బ్లూ టిక్క్ వంటి వివాదాలకు తెరలేపారు. చివరికి తాను ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న పోల్ నిర్వహిస్తే 57.5% మంది ఆయన పదవికి రాజీనామా చేయాలని తీర్పునివ్వడం విశేషం. విషాదాలు ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ (96) సంపూర్ణ జీవితాన్ని గడిపి అనారోగ్య సమస్యలతో సెప్టెంబర్ 8న కన్నుమూశారు. 70 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా బ్రిటన్ సింహాసనాన్ని ఏలిన ఆమె మరణంతో బ్రిటన్‌లో ఒక శకం ముగిసిపోయింది. దేశానికి మహరాణి అయినప్పటికీ ఆ అధికారం ఎప్పుడూ ప్రదర్శించకపోవడంతో ఆమె అందరి మన్ననలు పొందారు. ► సోవియెట్ యూనియన్ చిట్టచివరి అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్ 91 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో ఆగస్టు 31న కన్నుమూశారు. సోనియెట్ యూనియన్‌లో ఆర్థిక సంస్కరణలకు తెరతీసి ప్రపంచ గతినే మార్చిన గొప్ప దార్శనికుడు. సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నానికి సారథ్యం వహించి ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలికారు. అందుకే నోబెల్ శాంతి బహుమానం ఆయనను వరించింది. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబె నరా నగరంలో జూలై 8న డెమొక్రాటిక్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఒక దుండగుడు అత్యంత సమీపం నుంచి కాల్పలు జరపడంతో తూటాలు నేరుగా ఆయన ఛాతీలోకి వెళ్లడంతో తుది శ్వాస విడిచారు. ఎన్నికలు ► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ అక్టోబర్ 23న వరుసగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లో ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. చైనాలో ఈ పదవికి ఎన్నికైన వారే అధ్యక్ష పగ్గాలు చేపడతారు. ► బ్రెజిల్లో జరిగిన ఎన్నికల్లో రైట్ వింగ్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరాను ఓడించిన వామపక్ష వాది లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా అక్టోబర్ 30న నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ► ఇటలీ తొలి మహిళా ప్రధానమంత్రిగా జార్జియా మెలోని ఎన్నికయ్యారు. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత మెలోని అక్టోబర్ 25న దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇటలీలో అతివాద ప్రభుత్వం ఏర్పాటుకావడం విశేషం. ► ఇజ్రాయెల్‌లో మూడేళ్ల రాజకీయ ప్రతిష్టంభనకు తెరదించుతూ మరోసారి బెంజిమన్ నెతన్యాహూ ప్రధాని పదవి అందుకున్నారు. సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన రికార్డు నెతన్యాహూపై ఉంది. నవంబర్ 15న ఆయన మళ్లీ ప్రధాని పగ్గాలు చేపట్టారు. ► నేపాల్‌లో అయిదు పార్టీల సంకీర్ణ కూటమి కుప్పకూలిపోవడంతో మాజీ ప్రధాని, సీసీఎస్–మావోయిస్ట్ సెంటర్ పార్టీ చైర్మన్ ప్రచండ ప్రధాని పగ్గాలు చేపట్టారు. సహచర కమ్యూనిస్టు నేత కేపీ శర్మ ఓలి మద్దతుతో డిసెంబర్ 26న ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం కరోనా ప్రభావంతో ఆర్థికంగా దివాలా తీసిన దేశాల్లో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది. 2.2 కోట్ల జనాభా ఉండే దేశంలో ధరాభారాన్ని ప్రజలు మోయలేని స్థితికి వచ్చేశారు. ఆహార పదార్థాలు కూడా అందరికీ సరిపడా పంపిణీ చేయడంలో విఫలం కావడంతో జూలైలో ప్రజలు భారీగా నిరసనలు చేపట్టారు. జులై 9న ఆందోళనకారులు గొటబయ రాజపక్స అధికారిక నివాసాన్ని ముట్టడించడంతో ఆయన దేశం విడిచివెళ్లిపోయే దుస్థితి ఏర్పడింది. ఆ తర్వాత రణిల్ విక్రమ్‌సింఘె అధ్యక్ష పదవి చేపట్టినప్పటికీ శ్రీలంక ఇంకా అప్పులకుప్పగానే ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ► అఫ్గానిస్తాన్‌లో జూన్ 21నసంభవించిన భారీ భూకంపంలో వెయ్యి మందికిపైగా మరణించారు. ► జూన్‌లో పాకిస్తాన్‌ను వరదలు ముంచెత్తాయి. కొద్ది నెలల పాటు జనం నానా అవస్తలు పడ్డారు. అక్టోబర్ నాటికి పాకిస్తాన్లో వరద నష్టం 14.9 బిలియన్ డాలర్లుగా వరల్డ్ బ్యాంకు అంచనా వేసింది. ► ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సు ఈజిప్టులో షర్మ్ఎల్–షేక్‌లో నవంబర్ 6 నుంచి 18 వరకు జరిగింది. పర్యావరణ విపత్తులతో నష్టపోయే పేద, వర్ధమాన దేశాలను ఆదుకోవడానికి పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి సంపన్న దేశాలు అంగీకరించాయి. ► వాతావరణ మార్పులు ఈ ఏడాది అన్ని దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వేసవికాలంలో వడగాడ్పులతో పశ్చిమాది దేశాలు అల్లాడిపోతే ఇప్పుడు ఆర్కిటిక్ బ్లాస్ట్‌తో అమెరికా గడ్డకట్టుకుపోతోంది. మంచు తుపానుకు లక్షలాది మంది అంధకారంలో మగ్గిపోతూ ఇబ్బందులు పడుతున్నారు. అవీ ఇవీ ► అమెరికాలో మారిలాండ్లో బాల్టిమోర్‌లో వైద్యులు ఈ ఏడాది జనవరి 12న పంది గుండెని మనిషికి అమర్చే శస్త్రచికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే రెండు నెలలు తిరక్కుండానే మార్చి 9న ఆ వ్యక్తి మరణించడం విషాదం ► గర్భవిచ్ఛిత్తిపై అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. అబార్షన్‌ను నిషేధం విధిస్తూ 1973లో రియో వెర్సస్ వేడ్ తీర్పుని జూన్ 24న తోసిపుచ్చింది. దీంతో అమెరికాలో మహిళలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ► బ్రిటన్ రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె పెద్ద కుమారుడు చార్లెస్–3 రాజ సింహాసనాన్ని అధిష్టించారు. సెప్టెంబర్ 17న ఆయన గద్దెనెక్కి తల్లి అంతిమ సంస్కారం సహా అన్నీ దగ్గరుండి నిర్వహించారు. ► ప్రపంచ జనాభా మరో మైలు రాయి చేరుకుంది. మొత్తం జనాభా 800 కోట్లను దాటేసింది. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో నవంబర్ 15న జన్మించిన చిన్నారితో ప్రపంచ జనాభా 800 కోట్ల మార్కు దాటినట్టుగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది . ► కోవిడ్–19 ఈ ఏడాదితో ముగిసిపోతుందని అందరూ భావించినప్పటికీ చివరికొచ్చేసరికి చైనాలో తీవ్ర రూపం దాల్చింది. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఎఫ్7తో రోజుకి 10 లక్షలకుపైగా కేసుల నమోదవుతున్నాయని, రోజుకి అయిదు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నట్టుగా ఒక అంచనా. పుతిన్ యుద్ధోన్మాదం ఉరుములేని పిడుగులా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24న యుద్ధాన్ని ప్రకటించడంతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. నాటో కూటమిలో చేరడానికి ఉక్రెయిన్ చేస్తున్న సన్నాహాలను తీవ్రంగా వ్యతిరేకించిన పుతిన్ రాత్రికి రాత్రికి బాంబు దాడులు చేశారు. పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్ రష్యా సేనల్ని సమర్థంగా ఎదుర్కొంటూ ఉండడంతో పది నెలలు గడుస్తున్నా ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తే, పులి మీద పుట్రలా యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, మానవీయ సంక్షోభాన్ని సృష్టించింది. ఈ యుద్ధంలో సాధారణ పౌరులే 10 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని అంచనాలున్నాయి. ఉక్రెయిన్ నుంచి ప్రాణాలరచేతుల్లో పెట్టుకొని ఏకంగా 78 లక్షల మంది ఇతర దేశాలకు వలస వెళ్లిపోయారు. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలతో చమురుకు కొరత ఏర్పడి ఎన్నో దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ధరల పెరుగుదల, ఆహారం కొరత , సరఫరాలో అడ్డంకులు వంటివాటితో ప్రపంచమే స్తంభించిపోయినట్టయింది. రష్యా వైఖరిని నిరసిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ మానవ హక్కుల మండలి నుంచి రష్యాని సస్పెండ్ చేసింది. ఇరాన్లో మహిళల విజయగీతిక హిజాబ్ సరిగా ధరించని నేరానికి మహసా అమిన్ అనే 22 ఏళ్ల యువతిని నైతిక పోలీసులు సెప్టెంబర్ 13న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు సెప్టెంబర్ 16న లాకప్‌లో ఆమె మరణించడంతో ఇరాన్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 1979లో మత ఛాందసవాడులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయి సవాళ్లు ప్రభుత్వం ఎదుర్కోలేదు. దేశవ్యాప్తంగా యువతీ యువకులు ఏకమై రోడ్లపై హిజాబ్‌లను తగులబెట్టిన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలో నిలిచాయి. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. 18 వేల మందిని అరెస్ట్ చేశారు. అయినా నిరసనలు ఆగకపోవడంతో ప్రభుత్వం దిగి వచ్చి మోరల్ పోలీసు వ్యవస్థని రద్దు చేయడం ఆ దేశ ప్రజలు సాధించిన అతి పెద్ద విజయం. అయితే హిజాబ్‌ను రద్దు చేయాలంటూ 100 రోజులైనా ఇంకా ప్రజలు నిరసనలు చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు షురూ
-
పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం..
సాక్షి, అనంతపురం: టిబెటియన్ మస్టిఫ్.. టిబెట్ దేశానికి చెందిన ప్రత్యేక శునకం. ఇది చలి ప్రాంతాల్లోనే జీవించే అరుదైన జాతి కుక్క. తెలివైన, బలమైన, రక్షణ కల్పించే జాగిలంగా ప్రసిద్ధి. సాధారణంగా 15 ఏళ్లు జీవిస్తుంది. గరిష్టంగా 65 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఈ జాతి శునకానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. దీని కోసం శునక ప్రియులు రూ.లక్షలు వెచ్చిస్తుంటారు. మస్టిఫ్ జాతి శునకం అనంతపురం సాయి నగర్ ఒకటో క్రాస్‌లో ఉండడం విశేషం. బుక్కచెర్ల నల్లపరెడ్డి నివాసంలో ఉండే ఈ జాగిలం పలువురిని ఆకర్షిస్తోంది. అతిశీతల ప్రాంతం నుంచి వచ్చిన కుక్క అయినప్పటికీ, ఇక్కడి వాతావరణానికి అలవాటు పడింది. రోజుకో కేజీ చికెన్ లాగించేస్తూ హాయిగా జీవిస్తోంది. పూర్తిగా ఏసీ గదుల్లోనే సేద తీరుతోంది. ఏకంగా పులినే చంపగల శక్తిశాలి అయిన మస్టిఫ్.. ఎవరి మీదా దాడి చేయకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీనికి పాస్‌పోర్టు కూడా ఉండడం విశేషం. వీసాపై దీన్ని ఇక్కడికి తెప్పించారు. చిన్న పిల్లగా ఉన్నప్పుడు తెచ్చుకుని పెంచుకుంటున్నారు. (చదవండి: అనంతలో ఎల్లో కుట్రలు.. ఆ ఇద్దరే 22 కేసులు వేశారు) -
ఫిఫా వరల్డ్‌కప్ 2022: అదిరిపోయే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్స్
సాక్షి, ముంబై: క్రమేపీ యూజర్లను కోల్పోతున్న టెల్కో వోడాఫోన్ ఐడియా ఫిఫా ప్రపంచకప్- 2022 సందర్భంగా కొత్త ప్లాన్లలను ప్రకటించింది. ఫుట్‌బాల్ ప్రియులను ఆకట్టుకునేలా వోడాఫోన్ ఐడియా ఐదు కొత్త అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్‌లను తీసుకొచ్చింది. జియో ప్లాన్ల మాదిరిగానే వీఐ కూడా అయిదు ప్లాన్లను తీసుకొచ్చింది. ఖతార్, సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉన్న వినియోగ దారులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. వీఐ వెబ్సైట్, లేదా వీఐ యాప్ ద్వారా వీటిని కొనుగోలు చేయ వచ్చని తెలిపింది. రూ. 2,999 రోమింగ్ ప్లాన్: ఎస్ఎంఎస్ , వాయిస్ కాల్స్ ఈ ప్లాన్ ఏడు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. వినియోగదారులకు లోకల్ కాల్స్, ఇండియా అవుట్గోయింగ్ కాల్స్ కోసం 200 నిమిషాల టాక్ టైమ్‌ను వినియోగించుకోవచ్చు. ఇది కాకుండా, ఉచిత ఇన్కమింగ్ కాల్స్, 25 SMSలు ఉచితం. అదనంగా, వినియోగదారులకు 2 జీబీ డేటా కూడా. రూ. 3,999 రోమింగ్ ప్లాన్: ఎస్ఎంఎస్ , వాయిస్ కాల్స్ 10 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌తో, వినియోగదారులకు 300 నిమిషాల టాక్ టైమ్ వాడుకోవచ్చు, ఇందులో భారతదేశానికి స్థానిక, అవుట్గోయింగ్ కాల్స్ కూడా ఉన్నాయి. వినియోగదారులు 3 జీబీ డేటా , 50 ఎస్ఎంఎస్లు అదనం. రూ. 4,999 రోమింగ్ ప్లాన్: ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్ ఈ ప్లాన్ 14 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది. వినియోగదారులకు భారతదేశానికి 500 నిమిషాల లోకల్ , అవుట్గోయింగ్ కాల్స్. అలాగే 5 జీబీ డేటాతో పాటు ఉచిత ఇన్కమింగ్ కాల్స్. అదనంగా 50 ఎస్ఎంఎస్లు ఉచితం. రూ. 5,999 రోమింగ్ ప్లాన్: అన్ని ప్లాన్లలో అత్యంత ఖరీదైన ప్లాన్ ఇది. ఎస్ఎంఎస్, వాయిస్ కాల్స్, 500 నిమిషాల స్థానిక, భారతదేశానికి అవుట్గోయింగ్ కాల్స్ అందిస్తుంది. అలాగే 5 జీబీ డేటాతో పాటు ఉచిత ఇన్కమింగ్ కాల్స్. అదనంగా 100 50 ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇతర దేశాలకు కాల్స్ చేయడానికి సబ్స్క్రైబర్లకు నిమిషానికి రూ.35 వసూలు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. -
ప్లేస్ ఏదైనా, క్లాస్ ఏదైనా.. విస్తారా బంపర్ ఆఫర్ ఉందిగా!
సాక్షి, ముంబై: టాటా యాజమాన్యంలోని ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా ఎయిర్ లైన్స్ తమ ప్రయాణికులకు తక్కువ ధరల్లో విమాన టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో 4 రోజుల ఫెస్టివ్ సేల్‌ను ప్రకటించింది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ అనే మూడు క్యాబిన్ తరగతులకు ఈ సేల్ ఛార్జీలపై తగ్గింపులను అందిస్తుంది. అక్టోబర్ 17, 2022 నుంచి అక్టోబర్ 20, 2022 వరకు జరిగే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లపై అక్టోబర్ 23, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. దేశీయంగా అన్ని చార్జీలు కలుకుపుని 1499లకే విమాన టికెట్‌ను అందిస్తోంది. వన్-వేలో అన్నీ కలిపిన దేశీయ ఛార్జీలు ఎకానమీకి రూ. 1,499, ప్రీమియం ఎకానమీకి రూ. 2,999, బిజినెస్ క్లాస్‌కు రూ. 8,999 (సౌకర్యపు రుసుములు వర్తిస్తాయి) నుండి ప్రారంభమవుతాయి. ఇక అంతర్జాతీయ రూట్లలో, అన్నీ కలిపిన రిటర్న్ ఛార్జీలు ఎకానమీకి రూ. 14,149, ప్రీమియం ఎకానమీకి రూ. 18,499, బిజినెస్ క్లాస్‌కు రూ. 42,499 నుండి ప్రారంభం. ఇటీవలి కాలంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరగడం చాలా ప్రోత్సాహకరంగా ఉందని, ఈ పండుగ సందర్భంగా తమ కస్టమర్లకు సంతోష కరమైన క్షణాలను ఎంజాయ్ చేసి, ఆ జ్ఞాపకాలను గుర్తుంచుకునేలా చేయడమే తమ లక్క్ష్యమని విస్తారా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రజావత్ తెలిపారు. అత్యుత్తమ సేవలను అందించే ఎయిర్‌లైన్ విస్తారా కస్టమర్ల ఇష్టమైన ఎంపికగా కొనసాగుతుందనే విశ్వాసాన్ని ప్రకటించారు. Let your travel plans take flight with the Festive Sale! Enjoy discounted fares across different cabin classes on our international network. Book until 20-Oct-22 for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/Zs8ASBibng — Vistara (@airvistara) October 18, 2022 Travelling home for the festive season? Enjoy discounted fares across different cabin classes on our domestic network. Book now for travel between 23-Oct-22 and 31-Mar-23: https://t.co/rbWxAfgtNJ pic.twitter.com/oMhYkA5WQU — Vistara (@airvistara) October 17, 2022 -
అరకు కాఫీ అంతర్జాతీయ రికార్డులు.. కప్పు రూ.637
సాక్షి, అమరావతి: అరకు కాఫీ అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తోంది. మన కాఫీ బ్రాండ్ ఇమేజ్ను విదేశీ మార్కెట్లో సుస్థిరం చేస్తోంది. ప్రస్తుతం జపాన్‌లో కప్పు అరకు కాఫీని ఏడు పౌండ్లకు విక్రయిస్తున్నారు. ఏడు పౌండ్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.637. ఆదివారం జపాన్ పౌండ్ విలువ రూ.91.0267గా ఉంది. మొదటి నుంచి అంతర్జాతీయంగా అరకు కాఫీకి మంచి డిమాండ్ ఉంది. మరోవైపు అత్యధికంగా కాఫీ తోటలను సాగు చేసే బ్రెజిల్, మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అరకు కాఫీకి మరింత డిమాండ్ పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు కాఫీ ప్రాజెక్ట్ పరిధిలో ఏజెన్సీ ప్రాంతంలో అరబికా, రోబస్టా చెర్రీ కాఫీ రకాలను సాగు చేస్తున్నారు. ఇదే కాఫీ రకాలను సేంద్రీయ పద్ధతి(ఆర్గానిక్)లో కూడా సాగు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా మరింత డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న కాఫీ గింజల ధర గతేడాది అంతర్జాతీయంగా కాఫీ గింజల ఉత్పత్తి తగ్గడంతో అరకు కాఫీకి బయటి మార్కెట్లో మంచి ధర లభించింది. ఏడాది క్రితం వరకు అరకు కాఫీ గింజలు సాధారణంగా కిలో రూ.150 నుంచి రూ.180 ధర ఉండేది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో అరిబిక్ పార్చిమెంట్(తొక్క తీసిన కాఫీ గింజలు) కిలో రూ.350 నుంచి రూ.380కి పైగా ధర లభించింది. బెంగళూరులోని అనేక ప్రైవేటు సంస్థలు అరకు కాఫీ గింజలను సేకరిస్తాయి. ఆ గింజలను శుద్ధి చేసి ఇన్స్టెంట్ కాఫీ పొడిగా, వివిధ రకాల కాఫీ పొడులుగా మార్చి ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తాయి. అయితే, వ్యాపారులు అరకు కాఫీ పొడి పేరుతోనే బెంగళూరును కేంద్రంగా చేసుకుని బ్రెజిల్, జపాన్ తదితర దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. -
అంతర్జాతీయ టైగర్ డే-ఫొటో ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
కోవిడ్ పూర్వ స్థాయికి అంతర్జాతీయ ప్రయాణికులు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి విదేశీ రూట్లలో రాకపోకలు సాగించే అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య ఇది కోవిడ్ పూర్వ స్థాయిలో 96–97 శాతం స్థాయికి చేరవచ్చని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. 2022–23లో ఇది 32.9 కోట్లు – 33.2 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. 2024 మార్చి ఆఖరు నాటికి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ .. కోవిడ్ ముందు స్థాయిని దాటేయొచ్చని వివరించింది. కోవిడ్–19పరమైన ఆంక్షల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 27 నుంచి అంతర్జాతీయ రూట్లలో పూర్తి స్థాయి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్రా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మూడు నెలలుగా అప్.. అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత మూడు నెలలుగా క్రమంగా పెరుగుతోంది. జూన్ నెలలో కోవిడ్ పూర్వ స్థాయిలో 79 శాతానికి చేరింది. మొత్తం (దేశీ, అంతర్జాతీయ) విమాన ప్యాసింజర్ల సంఖ్య.. కోవిడ్ ముందు స్థాయిలో 88 శాతానికి పెరిగిందని ఇక్రా సీనియర్ అనలిస్ట్ అభిషేక్ లాహోటి తెలిపారు. పలు కీలక దేశాల్లో విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడం, ప్రయాణాలపై ఆంక్షల తొలగింపు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు పూర్తి సామర్థ్యాలతో పనిచేస్తుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ప్యాసింజర్ల ట్రాఫిక్ పెరగడానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, మే నెలతో పోలిస్తే జూన్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 98 శాతం నుంచి 91 శాతానికి తగ్గింది. వేసవి సెలవులు ముగియడం, పాఠశాలలు తెరుచుకోవడం, విహారయాత్రలు తగ్గడం వంటి అంశాలు ఇందుకు కారణమని లాహోటి వివరించారు. -
ఎయిర్ ఇండియా ఖాతాలో మరో 4 విమానాలు
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ కంపెనీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఖాతాలో కొత్తగా నాలుగు బోయింగ్ 737 రకం విమానాలు జతకూడనున్నాయి. కోవిడ్ సంక్షోభం తరువాత క్రమంగా ఆంక్షలు తొలగిపోతున్న నేపథ్యంలో విమానయాన రంగంలో డిమాండ్ పుంజుకుంది. ఈనేపథ్యంలోనే ఎయిరిండియా తాజా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ప్రయాణ అడ్డంకులు తొలగిపోయిన తర్వాత విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా అధికం అయిందని ఎయిరిండియా తెలిపింది. ఇప్పటికే సంస్థ వద్ద బోయింగ్ 737 విమానాలు 24 ఉన్నాయి. దీనికి మరో నాలుగు విమానాలు తోడు కావడంతో మొత్తం 28 విమానాలకు చేరనుంది.ఆగస్టు 2020లో కోజికోడ్ విమాన ప్రమాదంలో ఒక విమానాన్ని కోల్పోయింది. అన్ని విమాన మార్గాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని వివరించింది. ప్రయాణికుల సంఖ్య పరంగా కాలానుగుణ వ్యత్యాసాలు సహజమని తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ప్రతిరోజు 100 సర్వీసుల ద్వారా భారత్‌లోని 13 విమానాశ్రయాలతోపాటు అంతర్జాతీయంగా 13 ఎయిర్‌పోర్టుల్లో ఎయిరిండియా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. -
మేం ఆడితే లోకమే ఆడదా...