ఇంగ్లాండ్‌లోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు | ayyappa swamy padi pooja at kent ayyappa temple | Sakshi
Sakshi News home page

kent ayyappa temple: ఇంగ్లాండ్‌లో అయ్యప్పస్వామి ప్రత్యేక పూజలు

Jan 6 2026 12:43 AM | Updated on Jan 6 2026 9:15 AM

ayyappa swamy padi pooja at kent ayyappa temple

బ్రిటన్‌లో అయ్యప్ప మకరవిళక్కు మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఇంగ్లాండ్‌లోని రోచెస్టర్‌లో ఉన్న  కెంట్ అయ్యప్ప ఆలయంలో ఈ వేడుక జరగనుంది. జనవరి 14, 2026న ఈ మకరవిళక్కు మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తుల కోసం పూజకు ఏర్పాట్లు, అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు.

అదే రోజు ఉదయం ఏడు గంటలకు ఈ మహోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత  నిర్మాల్య దర్శనం, ఉష పూజ, గణపతి హోమం,  పూజలు జరుగుతాయి. అనంతరం ఉదయం 9.30 గంటలకు ఆలయం మూసివేయనున్నారు. తిరిగి సాయంత్రం ఐదు గంటలకు ఆలయం తెరిచిన అనంతరం స్వామివారికి విశేష అభిషేకం, పూజ, దీపారాధన, సహస్రనామార్చనలు నిర్వహిస్తారు. అనంతరం తత్త్వమసి భజన బృందం నేతృత్వంలో భజనలు, రమ్య అరుణ్ కృష్ణన్‌చే భరతనాట్యం కార్యక్రమం ఉండనున్నాయి.

రాత్రి నిర్వహించే వేడుకల్లో రాత్రి తొమ్మిది గంటలకు అట్టాస పూజ, తొమ్మిదినర్ర గంటలకు పడి పూజ, ఆ తర్వాత హరివరాసనం నిర్వహిస్తారు. రాత్రి పది గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ పూజా కార్యక్రమాలను అభిజిత్, తాజూరు మన హరినారాయణన్ నంబితీశ్వరర్, సహ అధికారిగా అద్రిత్ వాసుదేవ్ వ్యవహరిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement