అమ్మాయి-అబ్బాయి కనిపిస్తే ‘పెళ్లి’?.. అ నోటీసుల్లో నిజమెంత? | Jamia Millia Islamia University Condemns Nikah Notice | Sakshi
Sakshi News home page

అమ్మాయి-అబ్బాయి కనిపిస్తే ‘పెళ్లి’?.. అ నోటీసుల్లో నిజమెంత?

Feb 26 2026 4:59 PM | Updated on Feb 26 2026 5:09 PM

Jamia Millia Islamia University Condemns Nikah Notice

న్యూఢిల్లీ:  నగరంలోని జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక నోటీసుపై క్లారిటీ ఇచ్చింది. ఆ నోటీసులో పవిత్ర రమజాన్ నెలలో విద్యార్థులపై కొన్ని పరిమితులు విధించారని పేర్కొనబడింది. ప్రధానంగా యూనివర్శిటీ క్యాంపస్‌లో అమ్మాయి-అబ్బాయి కనిపిస్తే పెళ్లి చేసేస్తామంటూ సదరు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న నోటీసుపై స్పష్టత ఇచ్చింది. అది నిజం కాదని,  ఆ నోటీసు నకీలీ నోటీసు అని పేర్కొంది.

దీనిపై విశ్వవిద్యాలయం అధికారులు ఈ నోటీసును పూర్తిగా నకిలీది అని ఖండించారు. వారు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని, ఇది తప్పుడు ప్రచారం అని స్పష్టం చేసింది. ఈ నోటీసుతో ప్రజల్లో గందరగోళం సృష్టించే యత్నం చేశారని, దీనిపై సైబర్‌ విభాగానికి అధికారిక ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నారు. క్యాంపస్‌లో అమ్మాయి-అబ్బాయి కలిసి ఉన్నందుకు ఎలాంటి పరిమితులు విధించలేదని స్పష్టం చేసింది. 

ఈ క్రమంలోనే జామియా మిల్లియా ఇస్లామియా ప్రతినిధులు ఒక విన్నపాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ‘కేవలం అధికారిక వెబ్‌సైట్‌ లేదా విశ్వ విద్యాలయం నుండి విడుదలైన ప్రకటనలే నమ్మాలి. సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారం వల్ల తప్పుదారి పట్టవద్దు’ అని సూచించారు.

పవిత్ర రంజాన్‌ నెలలో అబ్బాయి-అమ్మాయి  కలిసి నిలబడి ఉన్నప్పుడు నికా ఏర్పాటు చేయాలని  ఫిబ్రవరి 20 తేదీన.. ఒక నోటిఫికేషన్ సోషల్ మీడియాలో వెలుగు చూసింది నోటిఫికేషన్‌లో ఉన్నది పూర్తిగా తప్పుడు సమాచారం. విశ్వవిద్యాలయ అధికారులు అలాంటి నోటిఫికేషన్‌ను జారీ చేయలేదు. అందువల్ల దానిని సీరియస్‌గా తీసుకోవద్దని అందరిని కోరుతున్నాము. విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి మాత్రమే ఆ నోటిఫికేషన్‌ను ప్రచారం చేశారు. విశ్వవిద్యాలయ పరిపాలన అలాంటి నోటిఫికేషన్‌ను ఖండిస్తోంది. ఈ విషయమై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశాం’ అని సదరు యూనివర్శిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement