గ్రాండ్‌గా విజయ్‌-రష్మిక పెళ్లి.. అతిథుల నోరూరించే స్పెషల్ వంటకాలు ఇవే.. ! | Vijay Devarakonda and Rashmika marriage special dishes to guests | Sakshi
Sakshi News home page

Vijay-Rashmika: గ్రాండ్‌గా విజయ్‌-రష్మిక పెళ్లి.. అతిథులకు వడ్డించిన స్పెషల్స్ ఇవే.. !

Feb 26 2026 3:40 PM | Updated on Feb 26 2026 4:02 PM

Vijay Devarakonda and Rashmika marriage special dishes to guests

టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.

అయితే ఇంతలా గ్రాండ్‌ వెడ్డింగ్‌ చేసుకున్న ఈ పెళ్లిలో అతిథులు సందడి చేశారు. వీరి పెళ్లి వేడుక గురించే టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఇంతకీ ఈ పెళ్లి ఎన్ని రకాల వంటకాలు చేశారనే విషయంపై నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. అసలు పెళ్లికి వచ్చిన అతిథులకు ఎలాంటి వంటకాలు వడ్డించారో మనం కూడా ఓ లుక్కేద్దాం.

ప్రత్యేక వంటకాలతో అతిథులకు విందు.. 

ఈ పెళ్లికి హాజరైన అతిథులకు ప్రత్యేక వంటకాలతో విందు ఏర్పాటు చేశారు విరోష్ జంట. ఈ వేడుకలో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు కన్నడకు చెందిన స్పెషల్స్ కూడా చేయించారు. విరోష్‌ వెడ్డింగ్‌లో కొడవ స్పెషల్ కర్రీ హైలెట్‌గా నిలిచింది. ఫుడ్ మెనూలో తెలంగాణ స్టైల్లో మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు అతిథులకు అందించారు. వెజ్‌ విషయానికొస్తే గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక స్పెషల్ అయిన బిసిబేలె బాత్‌, మైసూర్‌ పాక్‌ అతిథులకు రుచి చూపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement