హైకోర్టులో ‘ది కేరళ 2’ చిత్రానికి భారీ షాక్‌ | Kerala HC Gives Big Shock To The Kerala Story 2 Movie, Release Postponed, Check Out More Details | Sakshi
Sakshi News home page

హైకోర్టులో ‘ది కేరళ 2’ చిత్రానికి భారీ షాక్‌

Feb 26 2026 3:00 PM | Updated on Feb 26 2026 3:39 PM

Kerala HC Gives Big Shock To The Kerala Story 2, Release Postponed

సంచలనం సృష్టించిన 'కేరళ స్టోరీ' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'కేరళ స్టోరీ 2' విడుదలకు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపు (ఫిబ్రవరి 26) విడుదల కావాల్సిన ఈ సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది. సినిమాలో వివాదస్పద అంశాలు ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను ప్రేరేపించే విధంగా, ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్న దృశ్యాలను సెన్సార్ బోర్డు ఎలా అనుమతించిందని ధర్మాసనం ప్రశ్నించింది.

అసలేం జరిగింది?
2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ది కేరళ స్టోరీ 2. కామాఖ్య నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్‌ జారీ చేసింది.  ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో ఫిబ్రవరి 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్‌ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం పేర్కొంది.  ఈ రోజు సినిమాను వీక్షించిన హైకోర్టు.. సినిమాలో  వివాదస్పద అంశాలు ఉన్నాయని, తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రదర్శనను నిలిపివేయాలని ఆదేశించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement