#Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక | Virosh: Vijay Devarakonda Tied Knot To Rashmika Mandanna | Sakshi
Sakshi News home page

Virosh Wedding: రష్మిక మెడలో మూడు ముళ్లు వేసిన విజయ్ దేవరకొండ

Feb 26 2026 10:41 AM | Updated on Feb 26 2026 10:49 AM

Virosh: Vijay Devarakonda Tied Knot To Rashmika Mandanna

హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మెడలో మూడు ముళ్లు వేసేశాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా ఉదయం 10:10 గంటలకు కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితుల నడుమ వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగింది. ఇదే రోజు సాయంత్రం 4 గంటలకు కన్నడ(కొడవ) సంప్రదాయంలోనూ విజయ్-రష్మిక పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లిలో నో ఫేన్ నిబంధన కారణంగా ఫొటోలు ఇంకేం బయటకు రాలేదు. అధికారికంగా విజయ్-రష్మిక వాటిని పోస్ట్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)

తెలంగాణకు చెందిన విజయ్ దేవరకొండ.. తొలుత చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం చిత్రాలు మంచి పాపులారిటీ తీసుకొచ్చాయి. గీతగోవిందం మూవీలో తనతో పాటు కలిసి నటించిన రష్మికనే ఇప్పుడు విజయ్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరూ డియర్ కామ్రేడ్ అనే మూవీ కూడా చేశారు. ప్రస్తుతం 'రణబాలి'లో చాన్నాళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.

రష్మిక విషయానికొస్తే కర్ణాటకలోని కొడుగు ప్రాంతానికి చెందిన అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మహేశ్ బాబు, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది. 'పుష్ప' దెబ్బకు ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీలో వరస సినిమాలు చేస్తూ రష్మిక బిజీగా ఉంది.

విజయ్-రష్మిక చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ తమ బంధాన్ని అస్సలు బయటపెట్టలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్లు డేటింగ్, ట్రిప్స్ గురించి ఎప్పటికప్పుడు ఫొటోలు బయటకొస్తూనే ఉండేవి. ఇప్పుడు పెళ్లి బంధంతో దాన్ని అధికారికం చేసేశారు.

(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్‌?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement