హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ విజయం | England win by 2 wickets against pakistan | Sakshi
Sakshi News home page

హ్యారీ బ్రూక్ వీరవిహారం.. పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ విజయం

Feb 24 2026 10:37 PM | Updated on Feb 24 2026 10:58 PM

England win by 2 wickets against pakistan

టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం, బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ రెండు వికెట్ల తేడాతో పాక్‌పై విజయం సాధించింది.  

ఇంగ్లండ్‌ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌ విరవిహారం సృష్టించాడు. 51 బంతుల్లో సెంచరీ చేశాడు. వరుసగా మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డులతో సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ ఫినిషర్ విల్ జాక్స్ దూకుడు ప్రదర్శించాడు. 28 పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు. ఇక పాక్‌ బౌలర్లలో షాహిన్‌ అఫ్రిదీ 4 వికెట్లు,మహ్మద్‌ నవాజ్‌, ఉస్మాన్‌ తారిక్‌ చెరో రెండు వికెట్లు తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement