Photo Credit: SAI Twitter
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై ఈసారి భారీ అంచనాలున్నాయి. రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టిన నీరజ్ చోప్రా ఈసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణం అందిస్తాడని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసింది.
అందరి అంచనాలను అందుకుంటూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్‌చోప్రా ఫైనల్ చేరినప్పటికీ, అంతా అనుకుంటున్నట్లుగా నెంబర్‌వన్ స్థానంలో కాకుండా ఐదో స్థానంలో మెడల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు. ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు.

అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్‌వీర్ సింగ్ కూడా టాప్-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు. శ్రీలంకకు చెందిన జావెలిన్ త్రోయర్ రుమేశ్ తరంగ పతిరగే (రియల్ పెద్ది) 82.84 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు.
కాగా గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 81.29 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో, సౌతాఫ్రికాకు చెందిన డౌ స్మిత్ 80.64 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన బెన్ ఈస్ట్ (80.38 మీటర్లు) విసిరి నాలుగో స్థానంలో నిలిచారు. ఇక భారత్ నుంచి నీరజ్ చోప్రానే కాకుండా రోహిత్ యాదవ్ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్‌వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరి వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు.
మరోవైపు.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (78.63 మీటర్ల) దూరం బల్లాన్ని విసిరి టాప్-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం జూలై 31న రాత్రి 10.15 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అర్షద్ కాదు అతడితోనే పోటీ

అయితే నీరజ్ చోప్రాకు ఈసారి స్వర్ణ పతకం అంత ఈజీగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. క్వాలిఫయింగ్ పోటీల్లో పీటర్స్ అండర్సన్, అర్షద్ నదీమ్‌లను కూడా వెనక్కి నెట్టిన శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ తొలి స్థానంలో నిలిచి నీరజ్‌కు సవాల్‌గా మారాడు. దీంతో ఈసారి ఫైనల్లో నీరజ్ చోప్రాకు అర్షద్ నదీమ్, అండర్సన్ పీటర్స్‌తో పాటు రుమేశ్ తరంగ రూపంలో మరో బలమైన ప్రత్యర్థి ఎదురవ్వనున్నాడు. దీంతో నీరజ్‌కు ఈసారి అర్షద్ నదీమ్ నుంచి కాకుండా రియల్ పెద్ది (క్రాస్ ఓవర్ అథ్లెట్) అనిపించుకున్న రుమేశ్‌తోనే మెడల్ కోసం టఫ్ ఫైట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఫైనల్ కోసం దాచుకున్నాడా?
కామన్‌వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు. ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు.
ఆటోమేటిక్ క్వాలిఫయింగ్ మార్క్ అయిన 84 మీటర్ల మార్క్‌ను నీరజ్ అందుకోలేకపోయాడు. అయితే ఫైనల్లో తన అసలైన పవర్‌ను బయటికి తీస్తాడని, అక్కడే తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రుమేశ్ తరంగ క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే ఈటెను 82.84 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు.
క్వాలిఫయింగ్‌లో తొలి స్థానం ఇచ్చిన కిక్‌తో ఫైనల్లో రికార్డు ప్రదర్శన చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైతే నీరజ్ చోప్రా రికార్డును కూడా బద్దలు కొట్టే సత్తా రేమేశ్ తరంగలో కనిపిస్తోందని జోస్యం చెబుతున్నారు. మరి వీళ్లంతా వేస్తున్న లెక్కలు నిజమవుతాయా లేదా అన్నది ఫైనల్ రౌండ్‌తో తేలిపోనుంది.
Neeraj Chopra books his place in the Men's Javelin Final with a 79.61m throw despite challenging conditions. 👏
Watch the Golden Boy in action on 1st August, 12:45 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/M4kYPIuCTJ— Sony Sports Network (@SonySportsNetwk) July 30, 2026
Rumesh Tharanga qualifies for Javelin Finals at Commonwealth Games
Full Story: https://t.co/4qSMn90KjA pic.twitter.com/lwt3lINSfx— NewsWire 🇱🇰 (@NewsWireLK) July 30, 2026
చదవండి: రియల్ పెద్ది షాకింగ్ జర్నీ


