CWG 2026: భారత్ డబుల్ ధమాకా.. దిలీప్‌కు స్వర్ణం, బాసిల్‌కు రజతం | CWG 2026: Gavit strikes gold as India add three medals on Day 7, | Sakshi
Sakshi News home page

CWG 2026: భారత్ డబుల్ ధమాకా.. దిలీప్‌కు స్వర్ణం, బాసిల్‌కు రజతం

Jul 30 2026 7:17 AM | Updated on Jul 30 2026 9:33 AM

CWG 2026: Gavit strikes gold as India add three medals on Day 7,

గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌-2026లో భారత పారా అథ్లెట్లు సంచలనం సృష్టించారు. 100 మీటర్ల T47 స్ప్రింట్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటారు. రన్నర్‌ దిలీప్ మహాదు గావిత్ కేవలం 10.71 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. 

గావిత్ పసిడి పతకంతో పాటు కామన్‌వెల్త్ గేమ్స్ చరిత్రలోనే T47 స్ప్రింట్ విభాగంలో అత్యంతవేగంగా రేసును పూర్తి చేసిన అథ్లెట్‌గా కూడా రికార్డులకెక్కాడు. ఇక అతడి వెనుకే వచ్చిన మహమ్మద్ బాసిల్ 10.83 సెకన్ల టైమింగ్‌తో తన సీజన్‌లోని ఉత్తమ ప్రదర్శన ఇచ్చి రజతాన్ని అందుకున్నాడు. 

మ‌రోవైపు లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్‌కు రజత పతకం సాధించాడు. శ్రీశంకర్ తన చివరి జంప్‌లో 7.97 మీటర్ల‌తో రెండో స్ధానంలో నిలిచాడు. ఇక అగ్ర‌స్ధానంలో నిలిచిన జమైకాకు చెందిన తజాయ్ గేల్‌( 8.15 మీటర్లు) గోల్డ్‌మెడ‌ల్ సాధించాడు.

భారత్‌కు మూడో స్వర్ణం
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణ పతకం. అంతకుముందు మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను, మహిళల షాట్‌పుట్ F57 పారా అథ్లెటిక్స్ విభాగంలో షర్మిల ధన్కర్ భారత్‌కు పసిడి పతకాలను అందించారు. కాగా భారత్ మొత్తం 3 స్వర్ణాలు, 9 రజతాలు, 3 కాంస్యాలతో పతకాల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement