breaking news
Rumesh Tharanga Pathirage
-
పతిరగేతో మరోసారి తలపడనున్న నీరజ్ చోప్రా?
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా బ్రసెల్స్ వేదికగా జరుగుతున్న డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన డైమండ్ లీగ్ క్వాలిఫికేషన్ రౌండ్లో నీరజ్ 12 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. సెప్టెంబర్ 4-5 తేదీల్లో బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్ ఈవెంట్ జరగనుంది. ఇక ఆగస్టు 21న జరిగిన లుసానే డైమండ్ లీగ్‌లో ఈటెను 88.05 మీటర్ల దూరం విసిరిన నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఇది అతడికి ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన. అంతకముందు దోహా డైమండ్ లీగ్‌లో 85.69 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో నాల్గో స్థానంతో తన సీజన్‌ను ప్రారంభించాడు. జూలైలో కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలుచుకున్న ఈ భారత జావెలిన్ త్రోయర్, మొత్తం 12 పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచి బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్‌కు చేరుకున్నాడు.డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు1. రుమేష్ తరంగ పతిరాగే (శ్రీలంక) - 39 పాయింట్లు2. అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) - 35 పాయింట్లు3. కేశోర్న్ వాల్కాట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో) - 23 పాయింట్లు4. కర్టిస్ థాంప్సన్ (అమెరికా) - 20 పాయింట్లు5. జూలియస్ యెగో (కెన్యా) - 13 పాయింట్లు6. నీరజ్ చోప్రా (భారతదేశం) - 12 పాయింట్లురుమేష్ పతిరాగే క్వాలిఫికేషన్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, పీటర్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ కెషోర్న్ వాల్కాట్, యూఎస్ఏకు చెందిన కర్టిస్ థాంప్సన్, యెగో సహా నీరజ్ చోప్రాలు విజయవంతంగా ఫైనల్‌కు చేరుకున్నారు.పాయింట్లు ఎలా ఇస్తారంటే?ప్రతి డైమండ్ లీగ్ మీటింగ్‌లో, పురుషుల జావెలిన్ త్రోలో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. మొదటి స్థానంలో ఉన్న అథ్లెట్‌కు 8 పాయింట్లు మొదలుపెట్టి.. 8వ స్థానం వరకు ఒక్కో పాయింట్ తగ్గించుకుంటూ పోతారు. అయితే క్వాలిఫయింగ్ సిరీస్ ముగింపులో అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి ఆరుగురు అథ్లెట్లు మాత్రమే సీజన్ చివర్లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్లో స్థానం సంపాదిస్తారు. స్థానాలు టై అయితే సదరు అథ్లెట్ సీజన్లో అత్యుత్తమ చట్టబద్ధమైన ప్రదర్శన ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.ఇక కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైన కెన్యాకు చెందిన జూలియస్ యెగో, జూరిచ్‌లో 81.66 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఐదవ స్థానంలో నిలిచి, ఆరుగురు సభ్యుల డైమండ్ లీగ్ ఫైనల్లో మాత్రం చోటు దక్కించుకున్నాడు. బ్రసెల్స్ క్వాలిఫయింగ్ రౌండ్లోనూ తొలి స్థానంలో నిలిచిన రుమేశ్ తరంగ పతిరగే 2026 సీజన్లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. రెండుసార్లు 90 మీటర్లకు పైగా త్రోలు విసిరిన పతిరగే, ఏడుసార్లు 88 మీటర్లకు మించి త్రోలు విపిరాడు. వాటిలో ఐదు 89 మీటర్లు ఉండడం విశేషం. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న 23 ఏళ్ల పతిరగే వచ్చే వారం బ్రసెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్లో మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.🚨 NEERAJ CHOPRA QUALIFIES FOR THE DIAMOND LEAGUE FINAL! After the Zurich Diamond League results, India’s golden boy Neeraj Chopra has secured his place in the Diamond League Final in Brussels, the final leg of the 2026 Diamond League season.He has qualified alongside 5 other… pic.twitter.com/9Dao3Por7k— nnis Sports (@nnis_sports) August 28, 2026Read: జడేజా ఖాతాలో ఊహకు కూడా అందని చెత్త రికార్డు! -
మళ్లీ దెబ్బేసిన పతిరగే.. నీరజ్ చోప్రాకు రజతం
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లుసానే డైమండ్ లీగ్ మీట్లో రజతంతో మెరిశాడు. ఈటెను 88.05 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ త్రో నమోదు చేశాడు. కామన్వెల్త్లో స్వర్ణంతో మెరిసిన లంక స్టార్ జావెలిన్ త్రోయర్ రుమేశ్ పతిరగే మరోసారి పసిడి పతకాన్ని కొల్లగొట్టాడు. పతిరగే తన మూడో ప్రయత్నంలో ఈటెను నీరజ్ కంటే 9 సెంటీమీటర్లు ఎక్కువ దూరం విసిరాడు. దీంతో నీరజ్ స్కోరును దాటేసిన పతిరగే తొలి స్థానంలో నిలిచి భారత స్టార్‌ను మరోసారి దెబ్బకొట్టాడు. ఇక గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ మూడో ప్రయత్నంలో ఈటెను 86.61 మీటర్ల దూరం విసిరి బెస్ట్ నమోదు చేయడంతో పాటు కాంస్య పతకం సాధించాడు.కామన్వెల్త్ గేమ్స్‌లో అంత ఫిట్‌గా కనిపించనప్పటికీ నీరజ్ చోప్రా రజతంతో మెరిశాడు. అయితే లుసానే డైమండ్ లీగ్‌లో మాత్రం నీరజ్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తొలి రౌండ్లో ఈటెను 83.54 మీటర్లు విసిరి మంచి స్టార్ట్ ఇచ్చాడు. ఇక రెండో రౌండ్లో 88.05 మీటర్లు విసిరిన నీరజ్ ఈ సీజన్లోనే బెస్ట్ ప్రదర్శన కనబరిచాడు. ఇక లంక స్టార్ పతిరగే 87.06 మీటర్లు విసిరి నీరజ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. పీటర్స్ కూడా 84.76 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. మూడో రౌండ్లో నీరజ్ ఈటెను 83.72 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. కానీ పతిరగే మాత్రం ఈటెను 88.14 మీటర్లు విసిరి నీరజ్ స్కోరును దాటేసి అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగో రౌండ్లో నీరజ్ ఫౌల్ చేయగా, పతిరగే మాత్రం 86.71 మీటర్ల దూరం విసిరాడు. ఇక పీటర్స్ మాత్రం నాలుగో రౌండ్లో ఈటెను 86.61 మీటర్లు విసిరి తన స్కోరును కాస్త పెంచుకున్నాడు. ఇక చివరి రౌండ్‌కు నీరజ్ దూరంగా ఉన్నాడు. అదే సమయంలో పతిరగే ఫౌల్ చేయగా, మిగతా అథ్లెట్లు 70 నుంచి 80 మీటర్ల మధ్యలోనే విసరడంతో నీరజ్‌కు రజతం ఖరారైంది.కామన్వెల్త్ క్రీడలు ముగిసిన తర్వాత నీరజ్ స్విట్జర్లాండ్‌లోని బీల్లో ఉన్న తన శిక్షణా కేంద్రానికి వెళ్లిపోయాడు. తన కోచ్ జైవీర్ చౌధరీ, ఫిజియో ఇషాన్ మార్వా సమక్షంలో అతను రీహాబిలిటేషన్‌ను కొనసాగించడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. బ్రసెల్స్‌లో జరిగే ఫైనల్స్‌కు ఆరుగురు త్రోయర్లు క్వాలిఫై అవుతారు. లుసానే తర్వాత తమ ర్యాంక్‌ను మెరుగపర్చుకునేందుకు ఆటగాళ్లకు ఈ నెల 27 నుంచి జ్యూరిచ్‌లో జరిగే అంచెలో కూడా అవకాశం ఉంది. 2022లో డైమండ్ లీగ్ చాంపియన్‌గా నిలిచిన నీరజ్, ఆ తర్వాత వరుసగా మూడేళ్ల పాటు రెండో స్థానంతో ముగించాడు. లుసానేలో టాప్–3లో నిలవడంతో తొలిసారి భారీ ప్రైజ్‌మనీ ఈవెంట్ వరల్డ్ అథ్లెటిక్స్ అల్టిమేట్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు నీరజ్‌కు మార్గం సుగమమయింది.NEERAJ CHOPRA FINISHED 2ND AT THE DIAMOND LEAGUE LAUSANNE! 💎- Season Best throw of 88.05m 🔥🔥🔥 pic.twitter.com/iKbpOS2Li7— The Khel India (@TheKhelIndia) August 21, 2026 NEERAJ CHOPRA FINISHED 2ND AT THE DIAMOND LEAGUE LAUSANNE! 💎- Season Best throw of 88.05m 🔥🔥🔥 pic.twitter.com/iKbpOS2Li7— The Khel India (@TheKhelIndia) August 21, 2026చదవండి: 'భారత్, బ్రెజిల్ మ్యాచ్ బహిష్కరించండి' -
నీరజ్‌కు చెక్.. ఫాస్ట్ బౌలర్ నుంచి జావెలిన్ చాంపియన్ దాకా
కామన్వెల్త్ గేమ్స్ 2026లో జావెలిన్ త్రోలో శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ పతిరగె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో రుమేశ్ తరంగా పతిరగె 89.75 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని సాధించగా, నీరజ్ చోప్రా ఈ సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శన (85.83 మీటర్లు) చేసినప్పటికీ రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్‌కే చెందిన మరో జావెలిన్ త్రోయర్ యశ్వీర్ సింగ్ తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో 85.41 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని ఒడిసిపట్టాడు. కామన్వెల్త్లో రుమేశ్ స్వర్ణం సాధించడం వెనుక పెద్దగా ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే ఈ ఏడాది రోమ్ డైమండ్ లీగ్‌లో 90 మీటర్ల మార్కును దాటిన తొలి అథ్లెట్‌గా నిలిచిన పతిరగే, 92.62 మీటర్లతో ప్రపంచంలోనే అత్యుత్తమ త్రో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.క్రికెటర్ నుంచి జావెలిన్ ఛాంపియన్‌గా..రుమేశ్ పతిరగే ప్రస్థానం ఎంతో ఆసక్తికరమైనది. జావెలిన్ క్రీడలోకి రాకముందు అతను ఒక క్రికెటర్. అండర్-18 కేటగిరీలో శ్రీలంక పేసర్ ఇషాన్ మలింగ తర్వాత గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన రెండో ఫాస్టెస్ట్ బౌలర్‌గా అతనికి పేరుంది. అయితే, కోచ్ టోనీ ప్రసన్న ప్రోత్సాహంతో జావెలిన్ వైపు మళ్లినట్లు పతిరగే 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. "నాకు జావెలిన్‌ను పరిచయం చేసింది కోచ్ టోనీనే. ఆయన నాకు క్రీడ గురించే కాదు, జీవితం గురించి కూడా నేర్పించారు" అని పేర్కొన్నాడు.చదవండి: బాక్సింగ్‌లో డబుల్ స్వర్ణాలు.. ట్రిపుల్ జంప్‌లో రెండు పతకాలు -
గోల్డ్ మెడల్స్ నుంచి.. ఒక్కసారిగా ‘పాతాళానికి’!
పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్స్ పసిడి పతక విజేత అర్షద్ నదీమ్‌కు కామన్వెల్త్ క్రీడలు-2026 చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గత ఎడిషన్‌లో స్వర్ణ పతకం గెలిచిన అతడు.. ఈసారి ఫైనల్ ఈవెంట్లో కనీసం చివరి మూడు అవకాశాలు ఉపయోగించుకోలేని దుస్థితిలో నిలిచాడు.ఫైనల్‌కు చేరినా....కాగా కామన్వెల్త్ క్రీడల తాజా ఎడిషన్‌లో గురువారం జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ నిర్వహించారు. ఇందులో పద్దెనిమిది మంది పాల్గొనగా అత్యుత్తమంగా ఈటెను ఎక్కువ దూరం విసిరిన టాప్-12 మంది ఫైనల్‌కు అర్హత సాధించారు. శ్రీలంకకు చెందిన రుమేశ్ తరంగ పతిరగే అగ్రస్థానం సంపాదించగా.. భారత అథ్లెట్లు నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ వరుసగా ఐదు, తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచారు.ఫౌల్‌తో మొదలు.. ఇక అర్షద్ నదీమ్ టాప్-7లో చోటు సంపాదించి ఫైనల్లో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఫైనల్ ఈవెంట్లో అర్షద్‌కు చేదు అనుభవం ఎదురైంది. తొలి మూడు త్రోలలో భాగంగా అతడు ఫౌల్‌తో ఈవెంట్ మొదలుపెట్టాడు.ఇక రెండో ప్రయత్నంలో 77.41 మీటర్ల దూరం ఈటెను విసిరిన అర్షద్.. మూడో ప్రయత్నంలో 75.39 మీటర్లు మాత్రమే విసిరాడు. దీంతో టేబుల్లో అతడు తొమ్మిదో స్థానానికి పరిమితమయ్యాడు. నిబంధనల ప్రకారం.. ఫైనల్‌కు వచ్చిన టాప్-12లోని అథ్లెట్ల తొలి మూడు త్రోల ఆధారంగా.. చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జావెలిన్ త్రోయర్లు ఎలిమినేట్ అవుతారు.ఎలిమినేట్...దీంతో తొమ్మిదో స్థానంలో నిలిచిన అర్షద్ నదీమ్ ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో పతక వేటలో భాగంగా చివరి మూడు ప్రయత్నాలు చేయకుండానే అతడు వెనుదిరగాల్సి వచ్చింది. కాగా 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో అర్షద్ నదీమ్ స్వర్ణం గెలిచాడు. నాడు అతడు ఈటెను 85.28 మీటర్ల దూరం విసిరాడు.ఇక పారిస్ ఒలింపిక్స్‌లో అత్యుత్తమంగా రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల దూరం ఈటెను విసిరి పసిడి పతకం గెలుచుకున్నాడు అర్షద్ నదీమ్. దీంతో అతడి పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అయితే, ఆ తర్వాత అర్షద్ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. టోక్యోలో వరల్డ్‌కప్ చాంపియన్‌షిప్స్ మెడల్ ఈవెంట్లో అత్యుత్తమంగా 82.75 మీటర్లు ఈటెను విసిరిన అర్షద్ నదీమ్.. ఆ తర్వాత కనీసం 80 మీటర్ల మార్కు దాటలేకపోయాడు.Champions know. 💫 The javelin was still in the air. The message was already clear. 🔥Neeraj Chopra's second throw travelled 85.83m, his season's best. 🤩Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/OZpCUfPVFA— Sony Sports Network (@SonySportsNetwk) July 31, 2026భారత్‌కు రెండు పతకాలుకామన్వెల్త్ క్రీడలు-2026 జావెలిన్ త్రో విభాగంలో శ్రీలంక స్టార్ రుమేశ్ పతిరగే 89.75 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణం గెలిచాడు. ఇక టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత, భారత స్టార్ జావెలిన్‌త్రోయర్ నీరజ్ చోప్రా 85.3 మీటర్ల దూరం విసిరి రజతంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కే చెందిన యశ్వీర్ 85.41 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్యం దక్కించుకున్నాడు. మొత్తానికి ఈ విభాగంలో మూడు పతకాలు సౌత్ ఆసియా ప్లేయర్లకే దక్కడం విశేషం. Bronze unlocked! 🔥𝐏𝐨𝐝𝐢𝐮𝐦 𝐰𝐨𝐫𝐭𝐡𝐲 𝐭𝐡𝐫𝐨𝐰! 🚀Despite the challenging conditions, Yash Vir Singh unleashed a personal best of 85.41m to win bronze! 🥉Watch the Commonwealth Games Glasgow 2026 LIVE & EXCLUSIVE on Sony Sports Network TV channels & Sony LIV.… pic.twitter.com/Y1zmDC50iV— Sony Sports Network (@SonySportsNetwk) July 31, 2026 -
పాకిస్తానీ కాదు.. ‘రియల్ పెద్ది’తోనే నీరజ్‌కు సవాల్!
గ్లాస్కో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై ఈసారి భారీ అంచనాలున్నాయి. రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు కొల్లగొట్టిన నీరజ్ చోప్రా ఈసారి కామన్వెల్త్ గేమ్స్‌లో జావెలిన్ త్రోలో దేశానికి స్వర్ణం అందిస్తాడని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసింది. అందరి అంచనాలను అందుకుంటూ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్‌చోప్రా ఫైనల్ చేరినప్పటికీ, అంతా అనుకుంటున్నట్లుగా నెంబర్‌వన్ స్థానంలో కాకుండా ఐదో స్థానంలో మెడల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు. ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. కాగా మొత్తంగా 18 మంది జావెలిన్ త్రోయర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు.అయితే, ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్ కూడా టాప్-12లో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు. శ్రీలంకకు చెందిన జావెలిన్ త్రోయర్ రుమేశ్ తరంగ పతిరగే (రియల్ పెద్ది) 82.84 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు.కాగా గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 81.29 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో, సౌతాఫ్రికాకు చెందిన డౌ స్మిత్ 80.64 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో, ఇంగ్లండ్‌కు చెందిన బెన్ ఈస్ట్ (80.38 మీటర్లు) విసిరి నాలుగో స్థానంలో నిలిచారు. ఇక భారత్ నుంచి నీరజ్ చోప్రానే కాకుండా రోహిత్ యాదవ్ అత్యుత్తమంగా ఈటెను 78.37 మీటర్ల దూరం విసరగా.. యశ్వీర్ సింగ్ 78.36 మీటర్ల దూరం విసిరి వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు.. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (78.63 మీటర్ల) దూరం బల్లాన్ని విసిరి టాప్-7లో నిలిచాడు. కాగా భారత కాలమానం ప్రకారం జూలై 31న రాత్రి 10.15 గంటలకు జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.అర్షద్ కాదు అతడితోనే పోటీఅయితే నీరజ్ చోప్రాకు ఈసారి స్వర్ణ పతకం అంత ఈజీగా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. క్వాలిఫయింగ్ పోటీల్లో పీటర్స్ అండర్సన్, అర్షద్ నదీమ్‌లను కూడా వెనక్కి నెట్టిన శ్రీలంక స్టార్ రుమేశ్ తరంగ తొలి స్థానంలో నిలిచి నీరజ్‌కు సవాల్‌గా మారాడు. దీంతో ఈసారి ఫైనల్లో నీరజ్ చోప్రాకు అర్షద్ నదీమ్, అండర్సన్ పీటర్స్‌తో పాటు రుమేశ్ తరంగ రూపంలో మరో బలమైన ప్రత్యర్థి ఎదురవ్వనున్నాడు. దీంతో నీరజ్‌కు ఈసారి అర్షద్ నదీమ్ నుంచి కాకుండా రియల్ పెద్ది (క్రాస్ ఓవర్ అథ్లెట్) అనిపించుకున్న రుమేశ్తోనే మెడల్ కోసం టఫ్ ఫైట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది.ఫైనల్ కోసం దాచుకున్నాడా?కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగిన నీరజ్ చోప్రా జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్ల దూరం విసిరాడు. ఇక రెండో ప్రయత్నంలో అత్యుత్తమంగా 79.61 మీటర్ల దూరం ఈటెను విసిరి ఐదో స్థానం దక్కించుకున్నాడు. ఆటోమేటిక్ క్వాలిఫయింగ్ మార్క్ అయిన 84 మీటర్ల మార్క్‌ను నీరజ్ అందుకోలేకపోయాడు. అయితే ఫైనల్లో తన అసలైన పవర్‌ను బయటికి తీస్తాడని, అక్కడే తన అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రుమేశ్ తరంగ క్వాలిఫయింగ్ రౌండ్లోనే ఈటెను 82.84 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాడు.క్వాలిఫయింగ్‌లో తొలి స్థానం ఇచ్చిన కిక్‌తో ఫైనల్లో రికార్డు ప్రదర్శన చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు. అవసరమైతే నీరజ్ చోప్రా రికార్డును కూడా బద్దలు కొట్టే సత్తా రేమేశ్ తరంగలో కనిపిస్తోందని జోస్యం చెబుతున్నారు. మరి వీళ్లంతా వేస్తున్న లెక్కలు నిజమవుతాయా లేదా అన్నది ఫైనల్ రౌండ్‌తో తేలిపోనుంది. Neeraj Chopra books his place in the Men's Javelin Final with a 79.61m throw despite challenging conditions. 👏Watch the Golden Boy in action on 1st August, 12:45 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #Glasgow2026… pic.twitter.com/M4kYPIuCTJ— Sony Sports Network (@SonySportsNetwk) July 30, 2026 Rumesh Tharanga qualifies for Javelin Finals at Commonwealth Games Full Story: https://t.co/4qSMn90KjA pic.twitter.com/lwt3lINSfx— NewsWire 🇱🇰 (@NewsWireLK) July 30, 2026చదవండి: రియల్ పెద్ది షాకింగ్ జర్నీ


