పతిరగేతో మరోసారి తలపడనున్న నీరజ్‌ చోప్రా? | Patirage-Clinch-1st-Place Neeraj Chopra Qualifies-Diamond League Finals | Sakshi
Sakshi News home page

పతిరగేతో మరోసారి తలపడనున్న నీరజ్‌ చోప్రా?

Aug 28 2026 3:00 PM | Updated on Aug 28 2026 3:16 PM

Patirage-Clinch-1st-Place Neeraj Chopra Qualifies-Diamond League Finals

Photo Credit: Twitter

భార‌త స్టార్ జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా బ్రసెల్స్ వేదిక‌గా జ‌రుగుతున్న డైమండ్ లీగ్‌ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. భార‌త కాల‌మాన ప్ర‌కారం శుక్ర‌వారం తెల్ల‌వారుజామున జరిగిన డైమండ్ లీగ్ క్వాలిఫికేష‌న్ రౌండ్‌లో నీర‌జ్ 12 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో నిలిచి ఫైన‌ల్స్‌కు అర్హ‌త సాధించాడు. సెప్టెంబ‌ర్ 4-5 తేదీల్లో బ్ర‌సెల్స్ డైమండ్ లీగ్  ఫైన‌ల్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. 

ఇక ఆగ‌స్టు 21న జ‌రిగిన లుసానే డైమండ్ లీగ్‌లో ఈటెను 88.05 మీట‌ర్ల దూరం విసిరిన నీర‌జ్ రెండో స్థానంలో నిలిచాడు.  ఇది అత‌డికి ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన. అంతక‌ముందు దోహా డైమండ్ లీగ్‌లో 85.69 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో నాల్గో స్థానంతో తన సీజన్‌ను ప్రారంభించాడు. జూలైలో కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజతం గెలుచుకున్న ఈ భారత జావెలిన్ త్రోయర్, మొత్తం 12 పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచి బ్రసెల్స్‌ డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు.

డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు
1. రుమేష్ తరంగ పతిరాగే (శ్రీలంక) - 39 పాయింట్లు
2. అండర్సన్ పీటర్స్ (గ్రెనడా) - 35 పాయింట్లు
3. కేశోర్న్ వాల్కాట్ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో) - 23 పాయింట్లు
4. కర్టిస్ థాంప్సన్ (అమెరికా) - 20 పాయింట్లు
5. జూలియస్ యెగో (కెన్యా) - 13 పాయింట్లు
6. నీరజ్ చోప్రా (భారతదేశం) - 12 పాయింట్లు

రుమేష్ పతిరాగే క్వాలిఫికేషన్ స్టాండింగ్స్‌లో అగ్రస్థానంలో ఉండగా, పీటర్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ కెషోర్న్ వాల్కాట్, యూఎస్ఏకు చెందిన కర్టిస్ థాంప్సన్, యెగో స‌హా నీర‌జ్ చోప్రాలు విజ‌య‌వంతంగా ఫైన‌ల్‌కు చేరుకున్నారు.

పాయింట్లు ఎలా ఇస్తారంటే?
ప్ర‌తి డైమండ్ లీగ్ మీటింగ్‌లో, పురుషుల జావెలిన్ త్రోలో మొద‌టి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. మొద‌టి స్థానంలో ఉన్న అథ్లెట్‌కు 8 పాయింట్లు మొద‌లుపెట్టి.. 8వ స్థానం వ‌ర‌కు ఒక్కో పాయింట్ త‌గ్గించుకుంటూ పోతారు. అయితే క్వాలిఫ‌యింగ్ సిరీస్ ముగింపులో అత్య‌ధిక పాయింట్లు సాధించిన మొద‌టి ఆరుగురు అథ్లెట్లు మాత్ర‌మే సీజ‌న్ చివర్లో జ‌రిగే డైమండ్ లీగ్ ఫైనల్లో స్థానం సంపాదిస్తారు. స్థానాలు టై అయితే స‌ద‌రు అథ్లెట్ సీజ‌న్‌లో అత్యుత్త‌మ చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా విజేత‌ను నిర్ణ‌యిస్తారు.

ఇక కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైన కెన్యాకు చెందిన జూలియస్ యెగో, జూరిచ్‌లో 81.66 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శనతో ఐదవ స్థానంలో నిలిచి, ఆరుగురు సభ్యుల డైమండ్ లీగ్ ఫైనల్లో మాత్రం చోటు ద‌క్కించుకున్నాడు. బ్ర‌సెల్స్ క్వాలిఫ‌యింగ్ రౌండ్‌లోనూ తొలి స్థానంలో నిలిచిన రుమేశ్ త‌రంగ ప‌తిరగే 2026 సీజ‌న్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. 

రెండుసార్లు 90 మీట‌ర్ల‌కు పైగా త్రోలు విసిరిన ప‌తిర‌గే, ఏడుసార్లు 88 మీట‌ర్ల‌కు మించి త్రోలు విపిరాడు. వాటిలో ఐదు 89 మీటర్లు ఉండ‌డం విశేషం. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణం కొల్ల‌గొట్ట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్న 23 ఏళ్ల ప‌తిర‌గే వ‌చ్చే వారం బ్ర‌సెల్స్ డైమండ్ లీగ్ ఫైన‌ల్లో మ‌రోసారి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నున్నాడు.

Read: జ‌డేజా ఖాతాలో ఊహ‌కు కూడా అందని చెత్త రికార్డు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement