న్యూఢిల్లీ: వచ్చే నెలలో జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ జట్టును ప్రకటించారు. మొత్తం 72 మంది అథ్లెట్లు ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్)... తెలంగాణకు చెందిన నిత్య గంధే (4–100 మీటర్ల రిలే) భారత జట్టులోకి ఎంపికయ్యారు.
జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షాట్‌పుటర్ తజిందర్‌పాల్ సింగ్ తూర్ కూడా ఆసియా క్రీడల బరిలో ఉన్నారు. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు 29 పతకాలు సాధించారు. ఇందులో ఆరు స్వర్ణాలు, 14 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి.
ఆసియా క్రీడలకు భారత అథ్లెటిక్స్ జట్టు:
కరణ్‌వీర్, తజిందర్‌సింగ్ తూర్, మన్‌ప్రీత్ కౌర్, కృష్ణ జయశంకర్ (షాట్‌పుట్), రోహిత్ యాదవ్, నీరజ్ చోప్రా, అన్ను రాణి (జావెలిన్ త్రో), దమ్నీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, అనుష్క యాదవ్, తాన్యా చౌధరీ (హ్యామర్ త్రో), సీమా, సాన్యా యాదవ్ (డిస్కస్ త్రో), మొహమ్మద్ అఫ్సల్, కృష్ణ కుమార్, గౌతమి జయరామన్ (800 మీటర్లు), పారుల్ చౌధరీ (1500, 3000, 5000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), గుల్వీర్ సింగ్ (5000, 10000 మీటర్లు), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్).
సర్వేశ్ కుషారే, ఆదర్శ్ రామ్, పూజా సింగ్, సుప్రియ (హైజంప్), మురళీ శ్రీశంకర్, షానవాజ్ ఖాన్, అన్సీ సోజన్, శైలి సింగ్ (లాంగ్‌జంప్), ప్రవీణ్ చిత్రావెల్, కార్తీక్ ఉన్నికృష్ణన్, ఆశా ఇలాంగో, నిహారిక వశిష్ట (ట్రిపుల్ జంప్), దేవ్ మీనా, కుల్దీప్ యాదవ్, సింధుశ్రీ, బరాణిక ఇలాంగోవన్ (పోల్‌వాల్ట్). తేజస్ శిర్సే (110 మీటర్ల హర్డిల్స్), జ్యోతి యర్రాజీ, నందిని (100 మీటర్ల హర్డిల్స్), యశష్, సంతోష్ (400 మీటర్ల హర్డిల్స్), విత్యా రాంరాజ్ (400 మీటర్ల హర్డిల్స్, 4్ఠ400 మీటర్ల రిలే), అను (400 మీటర్ల హర్డిల్స్).
మంజురాణి, ప్రియాంక గోస్వామి (రేస్ వాక్ మారథాన్), తౌఫీక్, తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), పూజ, అనామిక (హెప్టాథ్లాన్), గురీందర్‌వీర్ సింగ్ (100 మీటర్లు, 4x100 మీటర్ల మిక్స్‌డ్ రిలే), అనిమేశ్ కుజుర్ (100, 200 మీటర్లు, 4x100 మీటర్ల మిక్స్‌డ్ రిలే), హరిత భద్ర (200 మీటర్లు, 4x100 మీటర్ల మిక్స్‌డ్ రిలే), ఉన్నతి బొల్లంద (200 మీటర్లు, 4x100 మీటర్ల మిక్స్‌డ్ రిలే), విశాల్, రాజేశ్ రమేశ్, మను, ధరమ్‌వీర్ చౌధరీ, జయ్ కుమార్, అషా్ఫక్ (4x400 మీటర్ల రిలే).
ప్రాచీ, కిరణ్ పహల్, నీరూ పాథక్, రష్‌దీప్ కౌర్, అన్సా బాబు, పూవమ్మ, సలోని నాగర్ (400 మీటర్లు, 4x400 మీటర్ల రిలే), ప్రణవ్ గురవ్, స్నేహ, తమన్నా, సుదేష్ణ శివాంకర్, నిత్య గంధే, శ్రాబణి నంద, అభినయ (4x100 మీటర్ల రిలే), కార్తీక్ కర్కేరా, సావన్ బర్వాల్ (మారథాన్), అంకిత ధ్యాని (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), పూజ (800 మీటర్లు), యూనుస్ షా (1500 మీటర్లు).


