అభిషేక్‌ పోరెల్‌కు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు | Abishek Porel denied bail after arrest in Molestation case | Sakshi
Sakshi News home page

అభిషేక్‌ పోరెల్‌కు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు

Aug 14 2026 9:29 PM | Updated on Aug 14 2026 9:32 PM

Abishek Porel denied bail after arrest in Molestation case

PC: BCCI/IPL

అత్యాచారం, బెదిరింపులు కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్, బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌కు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. 23 ఏళ్ల పోరెల్‌కు పశ్చిమ బెంగాల్‌లోని చిన్సురా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. 

మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో శుక్రవారం అతడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కర్ణాటకకు చెందిన ఒక వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోరెల్‌పై జూన్ 23న కేసులు నమోదు చేశారు. 

గత మూడేన్నరేళ్లుగా తమ మధ్య పరిచయం ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు పేర్కొంది. గత ఏడాదిన్నరగా మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని పోరెల్ బెదిరింపులకు దిగాడని ఆరోపించింది. 

అయితే జూన్‌లో ఫిర్యాదు అనంతరం పోరెల్‌ను విచారించడానికి పోలీసులు పలుమార్లు ప్రయత్నించినా అతడు అందుబాటులోకి రాలేదు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అతడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement