breaking news
Abishek Porel
-
అభిషేక్ పోరెల్‌కు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు
అత్యాచారం, బెదిరింపులు కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్-బ్యాటర్, బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌కు కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. 23 ఏళ్ల పోరెల్‌కు పశ్చిమ బెంగాల్‌లోని చిన్సురా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో శుక్రవారం అతడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా కర్ణాటకకు చెందిన ఒక వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోరెల్‌పై జూన్ 23న కేసులు నమోదు చేశారు. గత మూడేన్నరేళ్లుగా తమ మధ్య పరిచయం ఉందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు పేర్కొంది. గత ఏడాదిన్నరగా మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని పోరెల్ బెదిరింపులకు దిగాడని ఆరోపించింది. అయితే జూన్‌లో ఫిర్యాదు అనంతరం పోరెల్‌ను విచారించడానికి పోలీసులు పలుమార్లు ప్రయత్నించినా అతడు అందుబాటులోకి రాలేదు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు అతడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది. -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి... క్రికెటర్ అభిషేక్‌పై మహిళ కేసు
-
అభిషేక్ సంచలన క్యాచ్.. రోహిత్‌కు దిమ్మ తిరిగిపోయింది! వీడియో వైరల్
-
అభిషేక్ సంచలన క్యాచ్.. రోహిత్‌కు దిమ్మ తిరిగిపోయింది! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మను అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌తో పోరెల్ పెవిలియన్‌కు పంపాడు. ముంబై ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన ముస్తిఫిజర్ రెహ్మన్ బౌలింగ్‌లో ఐదో బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి థిక్ ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ తన కుడివైపు డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. అతడు క్యాచ్ అందుకున్న విధానాన్ని చూసిన రోహిత్ ఆశ్చర్యపోయాడు. కీలక సమయంలో ఔట్ కావడంతో హిట్‌మ్యాన్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ ఏడాది సీజన్‌కు దూరమైన ఢిల్లీ కెప్టె్న్ రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్‌కు చెందిన అభిషేక్ పోరల్ ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండడంతో ఈ యవ వికెట్ కీపర్ బ్యాటర్‌కు ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో భాగమయ్యే ఛాన్స్ వచ్చింది. చదవండి: IPL 2023: ఏం చేస్తున్నావు.. లలిత్‌పై కోపంతో ఊగిపోయిన వార్నర్! వీడియో వైరల్ -
రిషబ్ పంత్ స్థానంలో బెంగాల్ సంచలనం!
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ పలు సర్జరీల అనంతరం కోలుకుంటున్నాడు. పంత్ కోలుకోవడానికి దాదాపు తొమ్మిది నెలలకు పైగా పట్టే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు. అయితే పంత్ స్థానంలో మాత్రం ఇప్పటివరకు ఎవరిని ఎంపిక చేయని ఢిల్లీ ఫ్రాంచైజీ తాజాగా బెంగాల్ సంచలనం.. వికెట్ కీపర్, బ్యాటర్ అభిషేక్ పోరెల్‌ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఒక జర్నలిస్ట్ తన ట్విటర్లో షేర్ చేశాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విషయాన్ని అధికారికంగా దృవీకరించాల్సి ఉంది. ఇక అభిషేక్ పోరెల్ బెంగాల్ తరపున 16 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 695 పరుగులు చేశాడు. ఇందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో నాయకుడిగా వార్నర్‌కు ఘనమైన రికార్డు ఉంది. గతంలో ఎస్ఆర్హెచ్కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్ 67 మ్యాచ్‌ల్లో 35 విజయాలు అందుకున్నాడు. అంతేకాదు ఎస్ఆర్హెచ్కు 2016లో ఐపీఎల్ టైటిల్ కూడా అందించాడు. తాజాగా అతని నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి టైటిల్ కొట్టబోతుందని జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ''పంత్ ఐపీఎల్‌కు ఫిజికల్‌గా దూరమైనప్పటికి అతను మాతోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.. అతని టీషర్ట్ నెంబర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీపై ప్రత్యేకంగా ముద్రించాలనుకుంటున్నాం'' అంటూ పాంటింగ్ తెలిపాడు. ఇక పంత్ స్థానంలో అభిషేక్ పోరెల్‌ను ఎంపిక చేసినప్పటికి అతనికి తుది జట్టులో అవకాశం రావడం కష్టమే. దేశవాలీ క్రికెట్లో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక గతేడాది డిసెంబర్లో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి లక్నో వస్తుండగా రూర్కీ సమీపంలో కారు ప్రమాదానికి గురయ్యింది. దీంతో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పలు సర్జరీలు నిర్వహించగా ప్రస్తుతం పంత్ కోలుకుంటున్నాడు. ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌కు కూడా పంత్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎన్గిడి ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఫిల్ సాల్ట్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసోవ్, రిపాల్ పటేల్, అభిషేక్ పోరెల్ #BreakingNews: Bengal keeper batter Abhishek Porel is set to named @RishabhPant17 's substitute in @DelhiCapitals for this season. Done well in warm up games and more importantly only 21 years old who can be groomed.#IPL2023 — Kushan Sarkar (@kushansarkar) March 29, 2023 Update! #delhicapitals #rishabhpant #IPL2023 #IPL #T20Cricket #wolf777news pic.twitter.com/bZE6wQUYSB — Wolf777News (@Wolf777news) March 29, 2023 చదవండి: చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట


