వైభవ్‌ సూర్యవంశీని ఎలా ఔట్‌ చేయాలి? హర్భజన్ సమాధానమిదే | How to stop Vaibhav Sooryavanshi? Harbhajan Singh reveals the only way | Sakshi
Sakshi News home page

వైభవ్‌ సూర్యవంశీని ఎలా ఔట్‌ చేయాలి? హర్భజన్ సమాధానమిదే

Aug 14 2026 6:33 PM | Updated on Aug 14 2026 7:07 PM

How to stop Vaibhav Sooryavanshi? Harbhajan Singh reveals the only way

టీమిండియా చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం​ 15 ఏళ్ల వయస్సులోనే వరల్డ్ క్లాస్ బౌలర్లను అతడు ఎదుర్కొంటున్న తీరు నిజంగా ఒక అద్భుతం​.

మైదానంలో సూర్యవంశీని అడ్డుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ వైభవ్‌ను కట్టడి చేసేందుకు ఒకే ఒక్క మార్గం ఉందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అతడికి డిఫెన్సివ్‌గా బౌలింగ్ చేయడం కంటే, వికెట్ పడగొట్టేందుకు ప్రయత్నించడమే బెటర్‌ అని భజ్జీ తెలిపాడు. 

"వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతమైన ప్లేయర్‌. కేవలం 14-15 ఏళ్ల వయసులోనే ప్రపంచ క్రికెట్‌ను శాసించే ఆటగాడిని నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. వరల్డ్ క్లాస్‌ బౌలర్లు సైతం అతడికి బౌలింగ్ చేయడానికి భయపడుతున్నారు.

అయితే అతడిని ఔట్‌ చేయాలంటే ఒకే మార్గం ఉంది. అతడిని పరుగులు సాధించకుండా ఉండేలా బౌలింగ్‌ చేస్తే మీరు అతడిని ఔట్‌ చేయలేరు. వికెట్ గురుంచే ప్రయత్నం చేయాలి. షాట్‌ ఆడేందుకు ఆఫర్‌ చేయాలి. ఇది ప్రతిసారీ వర్కవుట్ కాకపోవచ్చు. 

కొన్ని సార్లు ఆ బంతులు సిక్సర్లగా కూడి వెళ్లవచ్చు. ఇదంతా ఆటలో భాగమే. ఏదేమైనప్పటికి వైభవ్‌ ఒక అసాధరణ ప్లేయర్‌ అని మనం అంగీకరించాలి" అని ఓ ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement