Asia Cup 2026: టీమిండియాకు భారీ షాక్‌ | Jemimah Ruled Out Of Asia Cup Asian Games BCCI Name Replacement | Sakshi
Sakshi News home page

Asia Cup 2026: భారత జట్టుకు భారీ షాక్‌

Aug 14 2026 6:47 PM | Updated on Aug 14 2026 7:15 PM

Jemimah Ruled Out Of Asia Cup Asian Games BCCI Name Replacement

PC: BCCI X

ఏసీసీ మహిళల ఆసియా కప్‌-2026 టోర్నమెంట్‌ ఆరంభానికి ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ ఈ టోర్నీకి దూరమైంది. ఆసియా కప్‌ ఈవెంట్‌తో పాటు.. ఆసియా క్రీడలకు కూడా ఆమె అందుబాటులో ఉండటం లేదు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

 కాగా ఇంగ్లండ్‌ వేదికగా ‘ది హండ్రెడ్‌’ మహిళల లీగ్‌-2026లో జెమీమా రోడ్రిగ్స్‌ సదరన్‌ బ్రేవ్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అయితే, ఇటీవల ఆగష్టు 3 నాటి మ్యాచ్‌ సందర్భంగా తొడ కండరాల నొప్పితో విలవిల్లాడింది.

గాయం తీవ్రతరం
ఫలితంగా హండ్రెడ్‌ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు జెమీమా దూరమైంది. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్న ఆమె గాయం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వైద్య బృందం సూచన మేరకు ఆమెకు విశ్రాంతి అవసరమని నిర్ణయించింది.

ఈ క్రమంలో ఆసియా కప్‌, ఆసియా క్రీడలకు జెమీమా రోడ్రిగ్స్‌ దూరమైనట్లు బోర్డు ప్రకటించిది. ఇక ఆసియా కప్‌ టోర్నీకి మాత్రం జెమీమా స్థానంలో ప్రతికా రావల్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది.  కాగా ఆసియా కప్‌ నిర్వహణకు ఆగష్టు 28- సెప్టెంబరు 13 మధ్య షెడ్యూల్‌ ఖరారైంది. ఇందుకు యూఏఈ వేదిక.

ఆసియా కప్‌-2026 టోర్నీకి భారత మహిళల జట్టు (అప్‌డేటెడ్‌)
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, భారతి ఫల్మలి, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), జి.కమలిని (వికెట్‌ కీపర్‌), అరుంధతి రెడ్డి, ప్రేమా రావత్‌, రాధా యాదవ్‌, శ్రీచరణి, రేణుకా ఠాకూర్‌, నందిని శర్మ, క్రాంతి గౌడ్‌, ప్రతికా రావల్‌.

చదవండి: ఇదేం బ్యాటింగ్‌.. ముసలోళ్ల జట్టు: ఆసీస్‌పై పాంటింగ్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement