breaking news
Pratika Rawal
-
చరిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ ప్రతీక రావల్ దుమ్ములేపుతోంది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ప్రతీక హాఫ్ సెంచరీతో మెరిసింది. రావల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 78 పరుగులు చేసింది.ఈ క్రమంలో రావల్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రతీక రికార్డులకెక్కింది. 24 ఏళ్ల ప్రతీక రావల్ (Pratika Rawal) తన వన్డే అరంగేట్రం నుంచి అదరగొడుతోంది.ఈ క్రమంలో కేవలం 8 మ్యాచ్‌లలోనే ప్రతీక 500 పరుగుల మార్క్‌ను అందుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ మహిళల జట్టు మాజీ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. 9 ఇన్నింగ్స్‌లలో ఆమె ఈ ఫీట్‌ను సాధించింది. తాజా మ్యాచ్‌తో ఎడ్వర్డ్స్ ఆల్‌టైమ్ రికార్డును రావల్ బ్రేక్ చేసింది.మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన ప్లేయర్స్ వీరే..ప్రతికా రావల్ - 8 ఇన్నింగ్స్లుషార్లెట్ ఎడ్వర్డ్స్ - 9 ఇన్నింగ్స్లునికోల్ బోల్టన్ - 11 ఇన్నింగ్స్లుబెలిండా క్లార్క్ - 12 ఇన్నింగ్స్లువెండీ వాట్సన్ - 12 ఇన్నింగ్స్లుఇక ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 15 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 277 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా అమ్మాయిలు..49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచే కన్పించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. రాణా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది.చదవండి: సూర్యవంశీకి భారీ నజరానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం -
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ ఇవాళ (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు. ఈ టోర్నీలో భారత్ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్
సైకాలజీ స్టూడెంట్ ఇప్పుడు టీమిండియా తరఫున సత్తా చాటుతోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఆరో ఇన్నింగ్స్‌లోనే ఏకంగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. భారత మహిళా క్రికెట్ జట్టులోకి దూసుకువచ్చిన ఆ యువ కెరటం మరెవరో కాదు.. ప్రతీకా రావల్(Pratika Rawal).యువ ఓపెనర్ షఫాలీ వర్మ(Shafali Verma) వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు ప్రతీకా రావల్‌కు పిలుపునిచ్చారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న 24 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. గతేడాది డిసెంబరులో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసింది. ఈ క్రమంలో ఆడిన తొలి నాలుగు వన్డేల్లోనే రెండు అర్ధ శతకాలతో మెరిసింది.వరల్డ్ రికార్డు బద్దలుతాజాగా ఐర్లాండ్‌తో వన్డే సిరీస్(India Women Vs Ireland Women) జట్టులోనూ చోటు దక్కించుకున్న ప్రతీకా రావల్.. మూడు మ్యాచ్‌లలోనూ అదరగొట్టింది. తొలి వన్డేలో 89, రెండో వన్డేలో 67 పరుగులు సాధించిన ప్రతీకా.. బుధవారం నాటి మూడో వన్డేలో భారీ శతకంతో అదరగొట్టింది. మొత్తంగా 129 బంతులు ఎదుర్కొని 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 154 పరుగులు సాధించింది.ఈ క్రమంలో ప్రతీకా రావల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. ప్రతీకా రావల్ భారత్ తరఫున మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు (154)ను సాధించింది. దీప్తి శర్మ (188), హర్మన్‌ప్రీత్ (171 నాటౌట్) ఆమెకంటే ముందున్నారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి ఆరు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్లు👉ప్రతీకా రావల్(ఇండియా)- 444 పరుగులు👉చార్లెట్ ఎడ్వర్డ్స్(ఇంగ్లండ్)- 434 పరుగులు👉నథాకన్ చాంథమ్(థాయ్‌లాండ్)- 322 పరుగులు👉ఎనిడ్ బేక్వెల్(ఇంగ్లండ్)- 316 పరుగులు👉నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)- 307 పరుగులు.అతిపెద్ద వన్డే విజయంరాజ్కోట్ వేదికగా ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత ఓపెనర్లు ప్రతీక రావల్(154), స్మృతి మంధాన(135) శతకాలతో చెలరేగారు. వీరిద్దరికి తోడు రిచా ఘోష్ హాఫ్ సెంచరీ(59)తో రాణించింది. ఈ క్రమంలో భారత జట్టు 435 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది. పురుషులు, మహిళల వన్డే క్రికెట్లో భారత్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. ఓవరాల్‌గా మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. టాప్–3 అత్యధిక స్కోర్లు న్యూజిలాండ్ (491/4; 2018లో ఐర్లాండ్‌పై; 455/5; 1997లో పాక్‌పై; 440/3; 2018లో ఐర్లాండ్‌పై) పేరిటే ఉండటం విశేషం.ఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 304 పరుగులతో ఐర్లాండ్‌పై టీమిండియా జయభేరి మోగించింది. పరుగుల తేడా పరంగా భారత మహిళా జట్టుకిదే అతిపెద్ద విజయం. 2017లో భారత్ 249 పరుగుల తేడాతో ఐర్లాండ్‌నే ఓడించింది. ఇక ఈ గెలుపుతో 3–0తో వన్డే సిరీస్‌ను స్మృతి బృందం క్లీన్‌స్వీప్ చేసింది. అదే విధంగా.. భారత జట్టు ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయడం ఇది 13వసారి. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన రికార్డు ఆస్ట్రేలియా (33 సార్లు) పేరిట ఉంది. ఇక.. ఐర్లాండ్‌తో ఇప్పటి వరకు ఆడిన 15 వన్డేల్లోనూ భారత జట్టే గెలవడం మరో విశేషం.చదవండి: ముంబై రంజీ జట్టుతో రోహిత్ శర్మ, యశస్వి ప్రాక్టీస్A post-series chat with the record-breaking opening duo! 😎From Maiden ODI century to Fastest ODI Hundred for India in women's cricket 💯Captain Smriti Mandhana and Pratika Rawal 𝙚𝙡𝙖𝙗𝙤𝙧𝙖𝙩𝙚 it all 😃👌 - By @mihirlee_58 #TeamIndia | #INDvIRE | @IDFCFIRSTBank pic.twitter.com/7c0xsYGaIo— BCCI Women (@BCCIWomen) January 16, 2025 -
భారత్ ఖాతాలో అతిపెద్ద వన్డే విజయం
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు(India Women vs Ireland Women)తో మూడో వన్డేలో స్మృతి సేన ఘన విజయం సాధించింది. పర్యాటక జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. తద్వారా భారత మహిళా క్రికెట్ వన్డే చరిత్రలో అతి భారీ గెలుపు(Largest Margin Win)ను నమోదు చేసింది. అంతేకాదు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.కాగా ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా భారత్- ఐర్లాండ్ మధ్య మూడు వన్డేలు జరిగాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. ఆమె స్థానంలో స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇక శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఐర్లాండ్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో 116 పరుగుల తేడాతో ఐరిష్ జట్టును చిత్తు చేసింది.శతకాలతో చెలరేగిన స్మృతి, ప్రతికాఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బుధవారం మూడో వన్డే జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి.. రికార్డు స్కోరును సాధించింది. ఓపెనర్లు ప్రతికా రావల్(Prathika Rawal 129 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్- 154), స్మృతి మంధాన(80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకాలతో చెలరేగగా.. వికెట్ కీపర్ రిచా ఘోష్ అర్ధ శతకం(42 బంతుల్లో 59) రాణించింది.మిగిలిన వాళ్లలో తేజల్ హెసాబ్నిస్(28) ఫర్వాలేదనిపించగా.. హర్లీన్ డియోల్(15), జెమీమా రోడ్రిగ్స్(4*), దీప్తి శర్మ(11*) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. ఈ నేపథ్యంలో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 435 పరుగులు చేసింది. మెన్స్, వుమెన్స్ వన్డే క్రికెట్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఆది నుంచే ఐర్లాండ్ తడ‘బ్యా’టుఇక లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ ఆది నుంచే తడబడింది. ఓపెనర్లలో కెప్టెన్ గాబీ లూయీస్(Gaby Lewis- 1) పూర్తిగా విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ కౌల్టర్ రెలీ(0) డకౌట్‌గా వెనుదిరిగింది. ఈ క్రమంలో మరో ఓపెనర్ సారా ఫోర్బ్స్(41)తో కలిసి ఓర్లా ప్రెరెండెర్గాస్ట్(36) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.చెలరేగిన భారత బౌలర్లుఅయితే, భారత బౌలర్ల ధాటికి ఈ ఇద్దరు కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. సారా, ఓర్లా అవుటైన తర్వాత ఐర్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. లారా డెలానీ(10), లీ పాల్(15), అర్లెనె కెలీ(2), అవా కానింగ్(2), జార్జియానా డెంప్సీ(0), అలనా డాల్జెల్(5*), ఫ్రేయా సార్జెంట్(1) త్వరత్వరగా పెవిలియన్ చేరారు. ఫలితంగా ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులు చేసి.. ఆలౌట్ అయింది. దీంతో భారత్ 304 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇక భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో చెలరేగగా.. తనూజ కన్వార్ రెండు వికెట్లు పడగొట్టింది. మరోవైపు.. టైటస్ సాధు, సయాలీ సట్ఘరే, మిన్ను మణి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. సెంచరీతో రాణించిన ప్రతికా రావల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.మహిళల వన్డే క్రికెట్లో భారత్ సాధించిన అతిపెద్ద విజయాలు👉ఐర్లాండ్‌పై రాజ్‌కోట్ వేదికగా 2025లో 304 పరుగుల తేడాతో గెలుపు👉ఐర్లాండ్‌పై పోచెఫ్‌స్ట్రూమ్ వేదికగా 2017లో 249 పరుగుల తేడాతో గెలుపు👉వెస్టిండీస్‌పై వడోదర వేదికగా 2024లో 211 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్‌పై డంబుల్లా వేదికగా 2008లో 207 పరుగుల తేడాతో గెలుపు👉పాకిస్తాన్‌పై కరాచీ వేదికగా 2005లో 193 పరుగుల తేడాతో గెలుపు.చదవండి: అతడు లేకుంటే.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మనమే గెలిచేవాళ్లం: అశ్విన్