న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన ప్రతీక రావల్... తొలిసారి టెస్టు జట్టులో చోటు దక్కించుకుంది. ప్రతీకతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మ, మీడియం పేసర్ క్రాంతి గౌడ్ కూడా మొదటిసారి భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. మార్చి 6 నుంచి పెర్త్ వేదికగా ఆ్రస్టేలియాతో జరగనున్న ఏకైక టెస్టు కోసం సెలెక్షన్ కమిటీ శనివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈ పర్యటనలో భాగంగా ఆసీస్‌తో 3 టి20లు, 3 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. పరిమిత ఓవర్ల కోసం ఇప్పటికే జట్లను ప్రకటించగా... తాజాగా టెస్టు జట్టును ఎంపిక చేశారు. వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌కు ముందు గాయంతో జట్టుకు దూరమైన ప్రతీక ఇప్పుడు పూర్తి స్థాయిలో కోలుకుంది. ఇక అండర్–19 ప్రపంచకప్ మెరుపులతో భారత టి20 జట్టులోకి వచి్చన వైష్ణవి ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్‌లో చోటు దక్కించుకుంది. ఇక వన్డే, టి20 సిరీస్‌లకు ఎంపికైన వికెట్ కీపర్ కమలిని గాయపడటంతో ఆమె స్థానంలో ఉమఛెత్రీకి అవకాశం దక్కింది.
భారత మహిళల టెస్టు జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జ్యోత్ కౌర్, రిచా ఘోష్, ఉమా ఛెత్రీ, ప్రతీక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, రేణుక ఠాకూర్, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, సయాలి సత్‌గరే.
ఆ్రస్టేలియాతో ఏకైక టెస్టుకు భారత మహిళల జట్టు ప్రకటన


