breaking news
Womens ODI World Cup
-
‘బంగభూషణ్’ రిచా ఘోష్
కోల్‌కతా: మహిళల వన్డే వరల్డ్ కప్‌ను భారత జట్టు తొలిసారి గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు, భారత మాజీ కెపె్టన్ సౌరవ్ గంగూలీ, మాజీ ప్లేయర్ జులన్ గోస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగాల్ రాష్ట్ర అత్యుత్తమ పౌర పురస్కారం ‘బంగభూషణ్’ను రిచాకు అందిస్తున్నట్లు ప్రకటించిన మమతా బెనర్జీ దీనికి సంబంధించిన మెడల్‌ను అందజేశారు. దీంతో పాటు బెంగాల్ పోలీస్ శాఖలో రిచాను డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వరల్డ్ కప్‌లో 133.52 స్ట్రయిక్ రేట్‌తో 235 పరుగులు సాధించిన రిచా...ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలిగా ఉన్న తొలి బెంగాల్ క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. రిచాపై ప్రశంసల వర్షం కురిపించిన గంగూలీ భవిష్యత్తులోనూ ఆమె ఇదే జోరును కొనసాగించడంతో పాటు మున్ముందు భారత కెప్టెన్ కూడా కావాలని ఆశీర్వదించారు. ‘క్యాబ్’ తరఫున రిచాకు బంగారు తాపడంతో చేసిన ఒక ప్రత్యేక బ్యాట్‌ను బహుకరించడంతో పాటు రూ.34 లక్షల నగదు పురస్కారాన్ని అందించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రిచా 34 పరుగులు సాధించగా, ఆమె చేసిన ఒక్కో పరుగుకు ఒక్కో లక్ష చొప్పున ఈ బహుమతిని ఇస్తున్నట్లు ‘క్యాబ్’ ప్రకటించింది. మరో వైపు గంగూలీ ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి అధ్యక్షుడవుతారని, అందుకు అన్ని విధాలా ఆయన అర్హుడని మమతా బెనర్జీ ఆకాంక్షించారు. -
‘మన అమ్మాయిలు అందరికీ స్ఫూర్తి’
న్యూఢిల్లీ: దేశంలోని వేర్వేరు ప్రాంతాలు, భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన అమ్మాయిలంతా ఒకే లక్ష్యంతో పని చేసి దేశానికి ప్రపంచ కప్‌ను అందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. మహిళల వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా సభ్యులు గురువారం రాష్ట్రపతి భవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా అమ్మాయిల ఘనతలను రాష్ట్రపతి కొనియాడారు. వ్యక్తిగతంగా ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమించి వారు సాధించిన విజయం అపూర్వమని ఆమె అన్నారు. ‘మన మహిళల క్రికెట్ జట్టు అసలైన భారత్‌కు ప్రతీక. భిన్న ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు, వేర్వేరు పరిస్థితుల నుంచి వచ్చినవారు ఒక జట్టుగా ఆడి విజేతగా నిలిచారు. ఎన్నో త్యాగాలు చేసి మరీ వీరంతా ట్రోఫీని సాధించారు. న్యూజిలాండ్‌పై గెలుపు తర్వాత మనవాళ్లు సాధించగలరనే నమ్మకం కలిగింది. ఇదే తరహాలో మున్ముందూ మన క్రికెట్‌ను వీరంతా మరింత ముందుకు తీసుకెళతారనే నమ్మకం ఉంది. ముఖ్యంగా కొత్త తరం అమ్మాయిలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు’ అని ముర్ము సందేశానిచ్చారు. ఈ సందర్భంగా జట్టు సభ్యుల సంతకాలతో కూడిన జెర్సీని రాష్ట్రపతికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బహుకరించింది. -
'వంట నూనె వాడకం తగ్గించండి': వరల్డ్‌కప్ విజేతలతో ప్రధాని మోదీ
భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. వారితో సంభాషణ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశ పౌరులంతా తమవంతు సాయం అందించాలని కోరారు. జాతీయ ఆరోగ్య చొరవలో భాగంగా నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఫిట్ ఇండియ ఉద్యమం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నిజానికి మోదీ ప్రతి భారతీయుడు దైనందిన జీవితంలో ఫిట్నెస్ను అంతర్భాగం చేయడానికి 2019 నుంచి ఈ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మన దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ఫిట్ ఇండియా ఒక్కటే పరిష్కారమని నొక్కి చెబుతున్నారు. దయచేసి అంతా వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తే, పైగా కొనుగోలు చేసే సమయం కూడా తగ్గుతుందని అన్నారు. అలాగే భారత మహిళా జట్టుని ఉద్దేశించి..తమ పాఠశాలలను సందర్శించి యువతరాలకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. కాగా, గట్టి భద్రతా చర్యల మధ్య ప్రదానమంత్రితో సమావేశం కావడానికి భారత జట్టు మంగళవారమే న్యూఢిల్లీకి చేరుకుంది. అలాగే భాతర జట్టు అద్భుతమైన విజయ సాధించిన వెంటనే మోదీ సోషల్ మీడియా పోస్ట్‌లో "టోర్నమెంట్ అంతటా భారత జట్టు అసాధారణమైన కృషిని, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారులందరికి అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు చాంపియన్ క్రీడలను చేపట్టడానికి ప్రేరేపిస్తుంది." అని పోస్ట్‌లో పేర్కొన్నారు మోదీ.(చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..) -
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?
భారత మహిళల క్రికెట్ చిరకాల స్వప్నం నెరవేరింది. మూడోసారి ఫైనల్ చేరిన మన వనితలు కప్‌ను ఒడిసి పట్టుకున్నారు. కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎట్టకేలకు విశ్వ విజేతగా నిలిచారు. భారత మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు మన మహిళలను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల టీమ్‌ను సైతం కొనియాడారు.అయితే తమ టీమ్ రన్నరప్‌గా నిలవడంతో ప్రముఖ దక్షిణాఫ్రికా నటి స్పందించింది. సౌత్ఆఫ్రికాకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ విన్నర్‌గా నిలిచిన భారత మహిళల టీమ్‌పై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో సొంత దేశంలోని పురుష క్రికెటర్లతో పాటు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులు చూపించిన ప్రేమ, మద్దతు.. మన మహిళా క్రికెట్ జట్టుకు సౌతాఫ్రికన్స్ సపోర్ట్ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు మనవాళ్లకు ఎందుకు రాదని ప్రశ్నించింది.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారని కొనియాడింది. మరి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ? అని నిలదీసింది. ఎందుకంటే మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చంటూ సౌతాఫ్రికా పురుష క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా విమర్శించింది. సౌతాఫ్రికా క్రీడా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మహిళల క్రీడల పట్ల తన దేశ వైఖరిని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది.స్మృతి మంధానతో పాటు భారత మహిళ క్రికెటర్స్ చాలా బాగా ఆడారని తంజా వుర్ ప్రశంసలు కురిపించింది. భారతీయ అభిమానుల నమ్మకాన్ని ఆమె కొనియాడింది. ఇలాంటి మద్దతు టీమ్ ఇండియాకు బాాగా కలిసొచ్చిందని తంజా వుర్ తెలిపింది. ఏది ఏమైనా ఈ రోజు మీరు ఈ ప్రపంచ కప్ విజేతలు.. మీరు దానికి అర్హులు అంటూ టీమిండియాను ప్రశంసంచింది. కాగా.. ఈ ప్రతిష్టాత్మ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్స్ జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్లెవరూ కూడా స్టేడియంలో కనిపించలేదు. దీంతో నటికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Thanja Vuur 🔥 (@cape_town_cricket_queen) -
ఓటముల నుంచి ఉవ్వెత్తున ఎగసి...
ఎనిమిదేళ్ల క్రితం... వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 229 పరుగుల లక్ష్య ఛేదనలో చివర్లో తడబడిన భారత మహిళలు 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆఖరి 3 ఓవర్లలో 3 వికెట్లతో 14 పరుగుల చేయాల్సిన స్థితిలో అంత చేరువగా వచ్చి ఓడటం అందరినీ వేదనకు గురి చేసింది. అయితే 2017 వరల్డ్ కప్ ప్రదర్శన గతంతో పోలిస్తే మహిళల జట్టుకు ఎంతో మేలు చేసింది. అన్ని వైపుల ఆసక్తి కనిపించడంతో పాటు టీమ్ స్థాయి కూడా పెరిగింది. ప్రతీ దశలో బీసీసీఐ అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తూ టీమ్‌కు తగిన అవకాశాలు కల్పించింది. అయినా సరే, 2021 వరల్డ్ కప్ మరోసారి నిరాశను మిగిల్చింది. ఈ టోర్నీలో భారత్ సెమీస్‌కు కూడా చేరలేకపోయింది. దీని తర్వాత మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సి వచ్చింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్‌ప్రీత్ చేతుల్లోకి వన్డే టీమ్ సారథ్య బాధ్యతలు వచ్చాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం అమోల్ మజుందార్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన తర్వాత టీమ్‌లో అసలైన మార్పు మొదలైంది. ఆ సమయంలో వేరే ఆలోచన లేకుండా 2025 వరల్డ్ కప్ కోసమే పక్కా ప్రణాళికతో జట్టు సన్నద్ధమైంది. టోర్నీ వేదిక భారత్ కావడంతో దానికి అనుగుణంగా జట్టును తీర్చిదిద్దేందుకు టీమ్ మేనేజ్మెంట్ ప్రయత్నించింది. 2023లో పూర్తి స్థాయిలో వచ్చిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రభావం కూడా టీమ్‌పై కనిపించింది. ఈ లీగ్ మన ప్లేయర్లకు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడు నేర్పించింది. అప్పుడప్పుడు కొన్ని ఓటములు వచ్చినా ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే పరిస్థితిలో మార్పు కూడా కనిపించింది. ప్రత్యేక శిబిరాలు, ఎక్కువ విరామం లేకుండా వరుసగా వేర్వేరు జట్లతో సిరీస్‌లు భారత్ ఆటను మరింత పదునుగా మార్చాయి. గత రెండేళ్లలో ఇది క్రమ పద్ధతిలో సాగింది. బలమైన ప్రత్యర్థులైన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్ గెలవడం టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. సరిగ్గా టోర్నీకి ముందు స్వదేశంలోనే జరిగిన సిరీస్‌లో ఆ్రస్టేలియాతో ఓడినా... మన జట్టు కూడా బలమైన ప్రదర్శనే ఇచ్చింది. ముఖ్యంగా మూడో వన్డేలో 412 పరుగుల లక్ష్య ఛేదనలో ఏకంగా 369 పరుగులు చేయగలిగింది. ఇదే మ్యాచ్ సెమీస్‌లో ఆసీస్‌పై విజయానికి స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 434 పరుగులతో ఎప్పటిలాగే స్మృతి జట్టు నంబర్‌వన్ బ్యాటర్‌గా తన స్థాయిని ప్రదర్శించగా, గాయంతో 7 మ్యాచ్‌లకే పరిమితమైన ప్రతీక 308 పరుగులు సాధించింది. విజయం సాధించిన తర్వాత వీల్‌చైర్‌లో కూర్చొని ఆమె సంబరాల్లో పాల్గొనడం సగటు అభిమానులందరికీ సంతృప్తినిచ్చింది. జెమీమా 292 పరుగులే చేసినా, ఆసీస్‌పై సెమీఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ను ఆమెను చిరస్థాయిగా నిలబెట్టింది. రిచా ఘోష్ ఏకంగా 133.52 స్ట్రయిక్‌రేట్‌తో చేసిన 235 పరుగులు జట్టుకు ప్రతీసారి కావాల్సిన జోరును అందించాయి. 260 పరుగులు చేసిన హర్మన్ నాయకురాలిగా జట్టును సమర్థంగా నడిపించింది. సెమీస్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఆమె స్థాయిని చూపించింది. కెప్టెన్‌గా సాధించిన ఈ గెలుపుతో భారత క్రికెట్లో ఆమె దిగ్గజాల సరసన నిలిచింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ 22 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా విజయంలో ప్రధాన భూమిక పోషించింది. ముఖ్యంగా ఫైనల్లో తీసిన ఐదు వికెట్లు ఎప్పటికీ మర్చిపోలేనివి. బ్యాటింగ్‌లో కూడా ఆమె 3 అర్ధసెంచరీలు సాధించింది. రేణుక, క్రాంతి, అమన్‌జోత్, రాధ అంకెలపరంగా పెద్ద గణాంకాలు నమోదు చేయకపోయినా... జట్టుకు అవసరమైన ప్రతీసారి కీలక సమయంలో తామున్నామంటూ ముందుకు వచ్చారు. ఇదే జట్టును నడిపించింది. లీగ్ దశలో వరుసగా దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లాంటి చేతుల్లో ఓడి ఒక్కసారిగా జట్టు నిరాశలో కూరుకుపోయింది. అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఆట మాత్రం మారడం లేదని సూటిపోటు మాటలు వినిపించాయి. కానీ అక్కడినుంచి టీమ్ ఉవ్వెత్తున ఎగసింది. సెమీస్ స్థానం ఖాయం చేసుకోవడంతో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో అద్భుత విజయాలతో చాంపియన్‌గా నిలిచింది. ఈ అసాధారణ, అద్భుత ప్రదర్శనకు దేశం మొత్తం సలామ్ చేస్తోంది. -
IND W Vs SA W: మన అమ్మాయిల మహాద్భుతం
మన అతివల ఆట అంబరాన్ని తాకింది... ఆకాశమంత అంచనాలతో బరిలోకి దిగిన భారత బృందం వాటిని అందుకొని అందనంత ఎత్తులో నిలిచింది... గతంలో రెండుసార్లు అందినట్లుగా అంది చేజారిన వన్డే వరల్డ్ కప్‌ను ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ముద్దాడింది... ఆఖరి సమరంలో అద్భుత ప్రదర్శనను కనబర్చిన మన అమ్మాయిలు విశ్వ విజేతలుగా శిఖరానికి చేరారు... ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు... సమష్టిగా చెలరేగిన టీమిండియా ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకుంది. ఈ ప్రపంచకప్ గెలుపు సాధారణమైంది కాదు. మన మహిళల క్రికెట్‌ను మరింత పెద్ద స్ధాయికి చేర్చే పునాదిరాయి. పురుషుల క్రికెట్లో 1983 వరల్డ్ కప్ గెలుపునకు సమానంగా మన అమ్మాయిల జట్టు రాత మార్చే అరుదైన ఘట్టం. దాదాపు 40 వేల మంది ప్రేక్షకులతో మైదానం నీలి సముద్రంగా మారిపోగా... ఆసక్తిగా సాగిన ఫైనల్లో బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్మృతి మంధాన భారీ స్కోరుకు బాటలు వేసి ప్రత్యర్థికి సవాల్ విసరగా... బౌలింగ్‌లోనూ దీప్తి, షఫాలీ సత్తా చాటి విజయానికి బాటలు పరిచారు. అభిమానులు అండగా నిలుస్తూ మైదానాన్ని హోరెత్తిస్తుండగా... 46వ ఓవర్ మూడో బంతికి డిక్లెర్క్ షాట్ కొట్టగా, కవర్స్‌లో కెప్టెన్హర్మన్ప్రీత్ క్యాచ్ అందుకొని విజయధ్వానం చేయడం టోర్నీకి లభించిన సరైన ముగింపు. ముంబై: భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకొని విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా ఈ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి. ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (78 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (58 బంతుల్లో 58; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా...స్మృతి మంధాన (58 బంతుల్లో 45; 8 ఫోర్లు) రాణించింది. షఫాలీ, స్మృతి తొలి వికెట్‌కు 106 బంతుల్లో 104 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్లారా వోల్వార్ట్ (98 బంతుల్లో 101; 11 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ (5/39) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా, షఫాలీ 2 వికెట్లతో కీలక పాత్ర పోషించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్’ పురస్కారం షఫాలీ వర్మకు... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దీప్తి శర్మకు లభించాయి. భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం... టోర్నీలో గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి భారత్‌కు మరింత మెరుగైన ఆరంభం లభించింది. సెమీస్‌లో విఫలమైన షఫాలీ ధాటిగా మొదలు పెట్టగా, స్మృతి కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడింది. కాప్ వేసిన మొదటి ఓవర్ మెయిడిన్‌గా ముగిసినా... తర్వాత భారత బ్యాటర్లిద్దరూ జోరు ప్రదర్శించారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇద్దరూ చెరో 5 ఫోర్లు బాదగా, స్కోరు 64 పరుగులకు చేరింది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరు. 17.2 ఓవర్లలో స్కోరు 100కు చేరగా, ఆ తర్వాత ట్రయాన్ తొలి ఓవర్లోనే స్మృతిని అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం షఫాలీ మరింత వేగంగా ఆడే ప్రయత్నం చేసింది. అయితే సెంచరీకి చేరువవుతున్న దశలో అలసటతో ఇబ్బంది పడిన ఆమె వికెట్ సమర్పించుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 24; 1 ఫోర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 20; 2 ఫోర్లు) విఫలమయ్యారు. ముఖ్యంగా ఎంలాబా చక్కటి బంతితో హర్మన్‌ను బౌల్డ్ చేయడంతో సఫారీలకు పైచేయి సాధించే అవకాశం దక్కింది. దీప్తి భారీ షాట్లకంటే సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టగా, అమన్‌జోత్ (14 బంతుల్లో 12; 1 ఫోర్) విఫలమైంది. అయితే రిచా ఘోష్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు తనదైన శైలిలో దూకుడుగా ఆడటంతో జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. కెప్టెన్ మినహా.. ఛేదనను వోల్వార్ట్, బ్రిట్స్ (35 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ప్రారంభించారు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 52 పరుగులు చేసింది. అయితే 10వ ఓవర్లో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించిన బ్రిట్స్‌ను అమన్‌జోత్ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడంతో జట్టు వికెట్ల పతనం మొదలైంది. అనెక్ బాష్‌ను (0) తన తొలి ఓవర్లోనే అవుట్ చేసి శ్రీచరణి మళ్లీ దెబ్బ తీసింది. 21వ ఓవర్లో పార్ట్‌టైమర్ షఫాలీని బౌలింగ్‌కు దించడం భారత్‌కు కలిసొచ్చింది. 9 పరుగుల వ్యవధిలో లూస్ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు), కాప్ (4)లను షఫాలీ అవుట్ చేసింది. ఒకవైపు వోల్వార్ట్ పోరాడుతున్నా...మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. డెర్క్సెన్ (37 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొద్ది సేపు సహకరించినా లాభం లేకపోయింది. 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం వోల్వార్ట్ వెనుదిరగడంతో సఫారీ ఓటమి లాంఛనమే అయింది. మన చరణి బంగారం... ప్రపంచకప్‌కు ముందు 9 వన్డేలు ఆడి ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోగలిగింది. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌లో సత్తా చాటింది. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల చరణి తన లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో ప్రత్యర్థులందరినీ కట్టి పడేసింది. తొలి సారి ఆడిన ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలిగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లలో 27.64 సగటుతో ఆమె 14 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున రెండో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది. ఐదుకంటే తక్కువ ఎకానమీ (4.96)తో ఆమె పరుగులు ఇచ్చింది. హైదరాబాద్‌కే చెందిన అరుంధతి రెడ్డి కూడా భారత విశ్వవిజేత జట్టులో సభ్యురాలిగా ఉంది. షఫాలీ సూపర్.... ‘నన్ను దేవుడు ఒక ప్రత్యేక పని కోసమే ఇక్కడికి పంపించినట్లున్నాడు’... ఫైనల్ తర్వాత షఫాలీ వర్మ వ్యాఖ్య ఇది. నిజంగానే అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టంతో జట్టులోకి వచ్చిన ఆమె తాను అరుదైన ఘనతను నమోదు చేసి చూపించింది. ప్రతీక రావల్‌తో హడావిడిగా షఫాలీని సెమీస్‌కు ముందు టీమ్‌లోకి చేర్చారు. సెమీస్‌లో విఫలమైనా... ఫైనల్లో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచి షఫాలీ తానేమిటో ప్రపంచానికి చూపించింది. బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా బౌలింగ్‌లో కూడా 2 కీలక వికెట్లు ఆమె ఫైనల్ ఫలితాన్ని శాసించింది. గతంలో అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన షఫాలీ ఇప్పుడు సీనియర్ ప్రపంచకప్‌లోనూ భాగమైంది. వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు కూడా అండర్–19 తర్వాత ఇది రెండో ప్రపంచ కప్ విజయం కావడం విశేషం. ఆ ముగ్గురు... 2017లో ఇంగ్లండ్ చేతిలో ఫైనల్లో అనూహ్య ఓటమి భారత ఆటగాళ్లకు వేదనను మిగిల్చింది. నాటి జట్టులో సభ్యులైన హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఇప్పుడు ఎట్టకేలకు విశ్వవిజేతలుగా నిలిచారు. ఈ ముగ్గురూ తమదైన ప్రత్యేకతలతో ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసుకున్నారు. హర్మన్ కెపె్టన్‌గా చరిత్రను సృష్టించగా...స్మృతి టాప్ స్కోరర్‌గా, దీప్తి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం వారి ఆటకు ఘనమైన గుర్తింపు అనడంలో సందేహం లేదు. 4 మహిళల వన్డే వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది. ఆస్ట్రేలియా ఏడుసార్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022), ఇంగ్లండ్ నాలుగుసార్లు (1973, 1993, 2009, 2017), న్యూజిలాండ్ (2000), భారత్ (2025) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.4 ఆతిథ్య దేశం హోదాలో వన్డే వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన నాలుగో జట్టు భారత్. గతంలో ఇంగ్లండ్ (1973, 1993, 2017), ఆ్రస్టేలియా (1988), న్యూజిలాండ్ (2000) ఈ ఘనత సాధించాయి.571 ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా కెపె్టన్ వోల్వార్ట్ నిలిచింది. ఆ్రస్టేలియా కెపె్టన్ అలీసా హీలీ (2022లో 509 పరుగులు) పేరిట ఉన్న రికార్డును వోల్వార్ట్ బద్దలు కొట్టింది.22 ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా దీప్తి శర్మ (9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు) గుర్తింపు పొందింది. నీతూ డేవిడ్ (2005లో 20 వికెట్లు), శుభాంగి కులకర్ణి (1982లో 20 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును దీప్తి శర్మ సవరించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జాఫ్తా (బి) ట్రయాన్ 45; షఫాలీ (సి) లూస్ (బి) ఖాకా 87; జెమీమా (సి) వోల్వార్ట్ (బి) ఖాకా 24; హర్మన్‌ప్రీత్ (బి) ఎంలాబా 20; దీప్తి శర్మ (రనౌట్) 58; అమన్‌జోత్ (సి అండ్ బి) డిక్లెర్క్ 12; రిచా (సి) డెర్క్సెన్ (బి) ఖాకా 34; రాధ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 298. వికెట్ల పతనం: 1–104, 2–166, 3–171, 4–223, 5–245, 6–292, 7–298. బౌలింగ్: కాప్ 10–1–59–0, ఖాకా 9–0–58–3, ఎంలాబా 10–0–47–1, డిక్లెర్క్ 9–0–52–1, లూస్ 5–0–34–0, ట్రయాన్ 7–0–46–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (సి) అమన్‌జోత్ (బి) దీప్తి 101; బ్రిట్స్ (రనౌట్) 23; బాష్ (ఎల్బీ) (బి) శ్రీచరణి 0; లూస్ (సి అండ్ బి) షఫాలీ 25; కాప్ (సి) రిచా (బి) 4; జాఫ్తా (సి) రాధ (బి) దీప్తి 16; డెర్క్సెన్ (బి) దీప్తి 35; ట్రయాన్ (ఎల్బీ) (బి) దీప్తి 9; డిక్లెర్క్ (సి) హర్మన్ (బి) దీప్తి 18; ఖాకా (రనౌట్) 1; ఎంలాబా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 246. వికెట్ల పతనం: 1–51, 2–62, 3–114, 4–123, 5–148, 6–209, 7–220, 8–221, 9–246, 10–246. బౌలింగ్: రేణుక 8–0–28–0, క్రాంతి 3–0–16–0, అమన్‌జోత్ 4–0–34–0, దీప్తి 9.3–0–39–5, శ్రీచరణి 9–0–48–1, రాధ 5–0–45–0, షఫాలీ 7–0–36–2. -
WC 2025: తొలిసారి ప్రపంచాన్ని గెలిచేందుకు...
ప్రపంచ కప్‌లో రెండు సార్లు ఫైనల్‌కు అర్హత సాధించినా నిరాశతో వెనుదిరిగిన జట్టు ఒక వైపు... సమష్టితత్వంలో మొదటి సారి తుది పోరుకు చేరిన టీమ్ ఒక వైపు... సొంతగడ్డపై పెద్ద ఎత్తున అభిమానుల ఆకాంక్షలు, మైదానంలో అండతో ఒక జట్టు కప్‌పై ఆశలు పెట్టుకోగా, తమ బలాన్నే నమ్ముకొని ప్రత్యర్థికి సవాల్ విసురుతున్న టీమ్ మరో వైపు... 12వ మహిళల వన్డే వరల్డ్ కప్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. అన్ని అడ్డంకులను దాటి అగ్రగామిగా నిలిచిన రెండు టీమ్‌లు భారత్, దక్షిణాఫ్రికా పైనల్లో తలపడనున్నాయి. ఇప్పటికే టోర్నీని సాధించిన మూడు జట్లు ముందే నిష్క్రమించడంతో వరల్డ్ కప్‌లో కొత్త విజేత రావడం ఖాయమైంది. 2017 టోర్నీ ఫైనల్లో ఓడిన జట్టులో సభ్యులైన హర్మన్, స్మృతి, దీప్తి మాత్రమే ఈ సారి వరల్డ్ కప్ బరిలో నిలిచారు. ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్ పలు ఆసక్తికర సమరాల తర్వాత తుది ఘట్టానికి చేరింది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆతిథ్య భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇరు జట్ల లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో సఫారీ టీమ్ గెలుపొందగా దానికి సరైన ప్రతీకారం తీర్చేందుకు హర్మన్ బృందం సిద్ధమైంది. సెమీస్‌లో రెండు జట్లూ అద్భుత విజయాలతో తుది పోరుకు అర్హత సాధించాయి. ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత్ అతి చేరువగా వచ్చిన ఈ అవకాశాన్ని వృథా చేసుకోరాదని పట్టుదలగా ఉండగా, బలబలాల పరంగా దక్షిణాఫ్రికా కూడా ఏమాత్రం తక్కువగా లేదు. ఈ మైదానంలో మన జట్టుకు బాగా అనుకూలమైంది కాగా...దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో తొలిసారి ఇక్కడ మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం ఖాయం. మార్పుల్లేకుండా... సెమీఫైనల్లో ఆ్రస్టేలియాపై సంచలన విజయం సాధించిన జట్టునే సహజంగా భారత్ కొనసాగించే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన షఫాలీ దూకుడుగా ఆడి మెరుపు ఆరంభం ఇవ్వడంలో సమర్థురాలు. సెమీస్‌లో అనూహ్య రీతిలో వెనుదిరిగిన స్మృతి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే మన జట్టు ఓపెనింగ్‌తో మంచి పునాది ఖాయం. జెమీమా, హర్మన్ బ్యాటింగ్ సామర్థ్యం ఏమిటో సెమీస్‌లో కనిపించింది. వీరిద్దరు దానిని కొనసాగిస్తే తిరుగుండదు. భారీ షాట్లకు పెట్టింది పేరైన రిచా ఘోష్‌తో పాటు మిడిల్ ఓవర్లలో సమర్థంగా ఆడే దీప్తి కూడా రాణిస్తే మన బ్యాటింగ్‌కు తిరుగుండదు. అదనపు బ్యాటింగ్ కోసం ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాను తీసుకోవాలని భావిస్తున్నా... దక్షిణాఫ్రికా టీమ్‌లో అంతా కుడి చేతివాటం బ్యాటర్లే కావడంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధనే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. రేణుక, క్రాంతి తమ పేస్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరు. అదనపు బ్యాటర్‌తో... కెప్టెన్ లారా వోల్వార్ట్ అసాధారణ బ్యాటింగ్‌తో దూసుకుపోతుండటం దక్షిణాఫ్రికా ప్రధాన బలం. గత మ్యాచ్‌లో ఆమె మెరుపు సెంచరీతో చెలరేగింది. టోర్నీలో పెద్దగా ప్రభావం చూపకపోయినా మరో సీనియర్ ఓపెనర్ బ్రిట్స్ అసలు పోరులో సత్తా చాటాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. లూస్, మరిజాన్ కాప్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. వైజాగ్ మ్యాచ్‌లో భారత్‌పై చెలరేగి ఒక్కసారి స్టార్‌గా మారిన డిక్లెర్క్ లాంటి బ్యాటర్ 9వ స్థానంలో ఆడే అవకాశం ఉండటం సఫారీ టీమ్‌కు మరో సానుకూలాంశం. ఆల్‌రౌండర్ క్లో ట్రయాన్ కూడా మ్యాచ్ ఫలితాన్ని శాసించగలదు. సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఒక బ్యాటర్‌ను తప్పించి బౌలర్ క్లాస్‌ను ఆడించింది. అయితే పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని చూస్తే క్లాస్ స్థానంలో అనరీ డెర్క్సన్ రావచ్చు. 20 భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు 34 వన్డేలు జరగ్గా... భారత్ 20 గెలిచి 13 ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వరల్డ్ కప్ మ్యాచ్‌లలో గత మూడు సార్లూ దక్షిణాఫ్రికానే నెగ్గింది.పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. సెమీస్లాగే భారీ స్కోరుకు అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండటంతో పాటు రాత్రి వేళ ఛేదన సులభం కాబట్టి టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన ఉంది. అయితే సోమవారం రిజర్వ్ డే ఉంది. ఆట ఎక్కడ ఆగిపోతే అక్కడినుంచి మళ్లీ కొనసాగిస్తారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షఫాలీ, జెమీమా, దీప్తి, రిచా, అమన్‌జోత్, రాధ, క్రాంతి, శ్రీచరణి, రేణుక. దక్షిణాఫ్రికా: వోల్వార్ట్ (కెప్టెన్), బ్రిట్స్, అనెక్ బాష్, లూస్, కాప్, జాఫ్తా, డెర్క్సన్, ట్రయాన్, డిక్లెర్క్, ఖాకా, ఎంలాబా -
‘ఆస్ట్రేలియా స్కోరు చూసి భయపడలేదు’
ముంబై: ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా నిర్దేశించిన లక్ష్యాన్ని చూసి తాము ఏ దశలోనూ భయపడలేదని, సాధించగలమనే నమ్మకంతోనే బరిలోకి దిగామని భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ వెల్లడించింది. ఈ పోరులో 134 బంతుల్లో 127 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్‌తో జెమీమా మన జట్టును గెలిపించింది. ‘ఆ్రస్టేలియా జట్టు ఇన్నింగ్స్ ప్రారంభమైన తీరు, చివరకు వారు సాధించిన స్కోరును చూస్తే కనీసం 30 పరుగులు తక్కువగా చేశారని చెప్పగలను. డీవై పాటిల్ స్టేడియం పిచ్‌పై ఎలాంటి లక్ష్యమైనా ఛేదించవచ్చని మాకు బాగా తెలుసు. కొద్ది సేపు క్రీజ్‌లో ఉండి నిలదొక్కుకుంటే పరుగులు వాటంతట అవే వస్తాయని కూడా మాకు ఇక్కడ ఉన్న అనుభవం చెబుతుంది. అందుకే ముందు పట్టుదలగా నిలబడటంపైనే దృష్టి పెట్టాను’ అని జెమీమా వ్యాఖ్యానించింది. తాను, హర్మన్ కలిసి మ్యాచ్‌ను ముగించాలని గట్టిగా అనుకున్నామని...అయితే హర్మన్ అవుట్‌తో తన బాధ్యత మరింత పెరిగిందని ఆమె పేర్కొంది. ‘ఒక దశలో నేను బాగా అలసిపోయి ఏకాగ్రత కోల్పోతూ వచ్చాను. అయితే హర్మన్ అవుట్ కావడంతో మళ్లీ పరిస్థితి మారిపోయింది. ఇది ఒక రకంగా నాకు మేలు చేసింది. ఆమె పరుగులు కూడా నేను చేయాల్సి ఉందని అనిపించింది. దాంతో మళ్లీ సరైన స్థితికి వచ్చి జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాను’ అని జెమీమా చెప్పింది. -
World Cup 2025: భారత్ సత్తాకు పరీక్ష
నవీ ముంబై: సొంతగడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. లీగ్ దశలో పడుతూ లేస్తూ సాగిన టీమిండియా... నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో పోరుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు నాలుగుసార్లు సెమీఫైనల్ ఆడిన టీమిండియా అందులో రెండుసార్లు గెలిచి ఫైనల్లో పరాజయం పాలైంది. చివరిసారిగా 2017లో ఆ్రస్టేలియాతో జరిగిన సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో విజయం సాధించిన టీమిండియా... ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇటీవలి కాలంలో ఆ్రస్టేలియాకు గట్టి పోటీనిస్తున్న హర్మన్‌ప్రీత్ బృందం ఈ మ్యాచ్‌లోనూ సమష్టిగా సత్తా చాటి తొలి టైటిల్ కరువు తీర్చుకోవాలని భావిస్తోంది. స్మృతి, హర్మన్‌లపైనే భారం 2017 ప్రపంచకప్ సెమీఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిన తర్వాత ఆ్రస్టేలియా జట్టుకు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురవ్వలేదు. లీగ్ దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసినా ... బౌలర్లు విఫలమవడంతో దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఆసీస్‌తో ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో స్మృతి మంధాన వరుసగా 105, 58, 117, 125, 80 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు కూడా ఆసీస్‌పై మంచి రికార్డే ఉంది. వీరిద్దరూ చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. గాయం కారణంగా మరో ఓపెనర్ ప్రతీకా రావల్ వరల్డ్‌కప్‌నకు దూరం కావడంతో ఈ మ్యాచ్‌లో స్మృతితో కలిసి షఫాలీ వర్మ ఇన్నింగ్స్ ఆరంభించనుంది. హర్లీన్æ, జెమీమా, రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. బౌలింగ్‌లో రేణుక, శ్రీచరణి, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా కీలకం కానున్నారు. మరోవైపు అలీసా హీలీ, ఎలీస్ పెర్రీ, సదర్లాండ్, బెత్ మూనీ, యాష్లే గార్డ్‌నర్‌లతో ఆసీస్ బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. మేగన్ షుట్, అలానా కింగ్ బౌలింగ్ భారం మోయనున్నారు. సెమీఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. వరుణుడి కారణంగా మ్యాచ్ సాగకపోతే శుక్రవారం ‘రిజర్వ్ డే’ ఉంది. అందులోనూ ఆట సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో మెరుగ్గా ఉన్న జట్టు (ఆస్ట్రేలియా) ఫైనల్‌కు చేరుతుంది. 11భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఇప్పటి వరకు 60 మ్యాచ్‌లు జరిగాయి. 11 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచి, 49 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక వన్డే ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు 14 సార్లు తలపడ్డాయి. 3 సార్లు భారత్ గెలిచి, 11 సార్లు పరాజయం పాలైంది. -
దక్షిణాఫ్రికా...ఈసారైనా!
గువాహటి: అన్ని విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ... మహిళల వన్డే ప్రపంచకప్‌లో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ బెర్త్‌పై గురి పెట్టింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరుకోలేకపోయింది. మూడుసార్లు సెమీఫైనల్లోకి ప్రవేశించినా ఆ అడ్డంకిని దాటడంలో విఫలమైంది. నాలుగో ప్రయత్నంలోనైనా సెమీఫైనల్ అవరోధాన్ని అధిగమించి ఫైనల్లోకి దూసుకెళ్లాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఎనిమిదిసార్లు ఫైనల్ చేరుకున్న ఇంగ్లండ్... నాలుగుసార్లు విజేతగా నిలిచి, మరో నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. ఇక తాజా ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. తమతో ఆడిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 69 పరుగులకు కుప్పకూల్చిన ఇంగ్లండ్ మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఎదురైన తొలి మ్యాచ్ పరాజయానికి బదులు తీర్చుకోవాలని దక్షిణఫ్రికా భావిస్తోంది. ఆస్ట్రేలియాతో లీగ్ దశ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 97 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు సందర్భాల్లోనూ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సఫారీ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లోపాలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ ప్రణాళికలు రచిస్తోంది. సోఫీ ఎకిల్‌స్టోన్, లిన్సే స్మిత్, చార్లీ డీన్ రూపంలో ఇంగ్లండ్‌కు ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్... ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 50.16 సగటుతో 301 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపిస్తోంది. బ్రిట్స్, సునే లుస్, మరిజాన్ కాప్ రూపంలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో కాప్, ఖాకా, ఎంలాబా కీలకం కానున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ సారథి కెప్టెన్ హీథర్ నైట్ ఈ వరల్డ్‌కప్‌లో 288 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. అమీ జోన్స్, బ్యూమౌంట్ కూడా రెండొందల పైచిలుకు పరుగులు చేశారు. కెప్టెన్ సివర్ బ్రంట్ రూపంలో నిఖార్సైన ఆల్‌రౌండర్ అందుబాటులో ఉంది. రిజర్వ్ డే... మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఈ టోర్నీలోని రెండు సెమీఫైనల్స్‌కు, ఫైనల్ మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’ ఉంది. బుధవారం వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే... గురువారం నిర్వహిస్తారు. ఒకవేళ గురువారం కూడా మ్యాచ్ జరగపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ (ఇంగ్లండ్) చేరుకుంటుంది.36 దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 47 వన్డేలు జరిగాయి. 36 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా ... 10 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా నెగ్గింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. 7 సార్లు ఇంగ్లండ్, 2 సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించాయి. -
ప్రతీక స్థానంలో షఫాలీ
ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌కు భారత ఓపెనర్ ప్రతీక రావల్ దూరమైంది. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఆమె గాయపడింది. ఫిజియో సహాయంతో ఆమె మైదానం వీడాల్సి వచ్చింది. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం ప్రతీక తర్వాతి మ్యాచ్ ఆడే అవకాశం లేదని ఖాయమైంది. ప్రతీక స్థానంలో షఫాలీ వర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమ్‌లో షఫాలీకి చోటు దక్కలేదు. ఏడాది క్రితం షఫాలీ తన చివరి వన్డే ఆడింది. వరుస వైఫల్యాల తర్వాత ఆమె స్థానంలోనే వచ్చిన ప్రతీక తన నిలకడైన ఆటతో ఓపెనింగ్ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రతీక ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో (308 పరుగులు) ఉంది. ఇప్పుడు టీమ్‌లో ఉన్న ప్లేయర్లలో హర్లీన్, అమన్‌జ్యోత్, ఉమా ఛెత్రి, జెమీమాలతోపాటు రిజర్వ్ బ్యాటర్ తేజల్ హసబ్నిస్కు కూడా ఓపెనింగ్ చేసే సామర్థ్యం ఉన్నా... వారిని కాదని రిజర్వ్ జాబితాలో కూడా లేని షఫాలీని జట్టులోకి తీసుకున్నారు. దూకుడుకు మారుపేరైన 21 ఏళ్ల షఫాలీ కీలక మ్యాచ్‌లో స్మృతితో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగనుంది. భారత్ తరఫున 29 వన్డేల్లో 23 సగటుతో షఫాలీ 644 పరుగులు చేసింది. ఇందులో 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. టీమ్‌లో స్థానం కోల్పోయిన తర్వాత భారత ‘ఎ’ జట్టు తరఫున ఆమె నిలకడగా రాణిస్తూ పరుగులు సాధిస్తోంది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. -
మరో పోరు వర్షార్పణం
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌ను వరుణుడు వీడటం లేదు. ఇప్పటికే వర్షం కారణంగా పలు మ్యాచ్‌లు రద్దు కాగా... లీగ్ దశలో చివరి మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. ఆదివారం ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో చివరకు ఫలితం తేలకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అయితే ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారు అయిపోవడంతో ఈ మ్యాచ్‌కు ప్రాధాన్యత లేకుండా పోయింది. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభం కాగా... ముందుగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ఆ తర్వాత తిరిగి వర్షం పడటంతో 27 ఓవర్లకు తగ్గించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 27 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. షర్మిన్ అక్తర్ (53 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... శోభన (26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో రాధ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా... ఆంధ్ర స్పిన్నర్ శ్రీచరణి 2 వికెట్లు ఖాతాలో వేసుకుంది. రేణుక సింగ్, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్ కౌర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 27 ఓవర్లలో 126 పరుగుల లక్ష్యంతో ఛేదన ఆరంభించిన భారత జట్టు 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగుల వద్ద ఉన్న స్థితిలో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో పలుమార్లు సమీక్షించిన అనంతరం అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన టీమిండియా ఓపెనర్ ప్రతీక రావల్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో ఈ మ్యాచ్‌లో అమన్‌జ్యోత్ కౌర్ (15 నాటౌట్; 2 ఫోర్లు) ఓపెనర్‌గా బరిలోకి దిగింది. స్మృతి మంధాన (27 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. రెండు రోజుల విరామం తర్వాత... గువాహటిలో బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా... నవీముంబైలో గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్‌లకు వర్ష సూచన ఉంది. అయితే సెమీఫైనల్స్‌తోపాటు ఫైనల్ మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’ ఉంది. ‘రిజర్వ్ డే’ రోజున కూడా వర్షంతో మ్యాచ్‌లు సాధ్యంకాకపోతే లీగ్ దశలో మెరుగైన స్థానాల్లో నిలిచిన జట్లు (ఆస్ట్రేలియా, ఇంగ్లండ్) ఫైనల్‌కు చేరుతాయి. ఫైనల్ కూడా రద్దయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.6 ప్రస్తుత ప్రపంచకప్‌లో వర్షం కారణంగా రద్దయిన మ్యాచ్‌లు. శ్రీలంకలో జరిగిన 11 మ్యాచ్‌ల్లో ఐదు వర్షంతో రద్దయ్యాయి. తాజాగా ముంబై పోరు కూడా ఆ జాబితాలో చేరింది. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి ఆస్ట్రేలియా
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో తలపడనుంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 6 విజయాలతో (1 రద్దు) పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానాన్ని అందుకుంది. నేడు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్‌కు నాలుగో స్థానం ఖాయమైంది. భారత్, ఆ్రస్టేలియా సెమీస్ 30న ముంబైలో జరగనుండగా, గువాహటిలో 29న జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడనుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. లారా వోల్వర్ట్ (30), సినాలో జాఫ్తా (29) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (7/18) తన లెగ్ స్పిన్‌తో 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. అనంతరం ఆ్రస్టేలియా 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసి విజయాన్నందుకుంది. బెత్ మూనీ (42), జార్జియా వోల్ (38 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు. -
భారత్ x బంగ్లాదేశ్
ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించే వరకు భారత జట్టు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. గత మ్యాచ్‌లో సెమీస్ స్థానం ఖాయమైన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఆదివారం జరిగే ఈ పోరులో తమకంటే బలహీనమైన బంగ్లాదేశ్‌తో హర్మన్ సేన తలపడుతుంది. ఈ మ్యాచ్ ఫలితం లీగ్ దశలో భారత్ స్థానంపై ప్రభావం చూపే అవకాశం లేదు. గెలిచినా 8 పాయింట్లతో నాలుగో స్థానంతోనే ముగుస్తుంది. అయితే ఓడితే మాత్రం సెమీస్‌కు ముందు టీమ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో అసలు పోరుకు ముందు తమ జట్టులోని లోపాలు సవరించుకొని అన్ని విధాలా సిద్ధమయ్యేందుకు భారత్‌కు ఈ మ్యాచ్ అవకాశం కల్పిస్తోంది. మరో వైపు బంగ్లాదేశ్ సంచలనాన్ని ఆశిస్తోంది. టోరీ్నలో ఒకే ఒక విజయం (పాక్‌పై) సాధించిన బంగ్లా ఇతర మ్యాచ్‌లలో ప్రత్యర్థులకు గట్టి పోటీనిచి్చంది. ప్రధానంగా తమ బలమైన స్పిన్‌పైనే ఆ జట్టు ఆధారపడుతోంది. -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్..
మహిళల వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో జట్టు మరో అలవోక విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.టామీ బీమాంట్ (105 బంతుల్లో 78; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... అలైస్ క్యాప్సీ (38) రాణించింది. ఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ 3 వికెట్లు పడగొట్టగా... యాష్లే గార్డ్నర్, మోలినో చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆ్రస్టేలియా 40.3 ఓవర్లలో 4 వికెట్లకు 248 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. యాష్లే గార్డ్నర్ (73 బంతుల్లో 104 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా... అనాబెల్ సదర్లాండ్ (112 బంతుల్లో 98 నాటౌట్; 9 ఫోర్లు 1 సిక్స్) త్రుటిలో శతకానికి దూరమైంది. ఒకదశలో ఆ్రస్టేలియా 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్నర్, సదర్లాండ్ ఐదో వికెట్‌కు అభేద్యంగా 180 పరుగులు జోడించి గెలిపించారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. గాయం కారణంగా కెప్టెన్ అలీసా హీలీ ఈ మ్యాచ్‌కు దూరమైనా ఆ్రస్టేలియాకు ఎలాంటి సమస్య ఎదురు కాలేదు.చదవండి: PKL 2025: భరత్ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు -
పాకిస్తాన్ అవుట్
కొలంబో: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన రెండో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. సోమవారమే బంగ్లాదేశ్ నిష్క్రమించగా... ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. కొలంబోలో వాన బారిన పడిన మరో మ్యాచ్‌లో ఫాతిమా సనా సారథ్యంలోని పాక్ జట్టు చిత్తుగా ఓడింది. ఆ జట్టుకిది నాలుగో పరాజయం. మంగళవారం జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 150 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవడం ఇదే మొదటిసారి. టాస్ ఓడిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే 2 ఓవర్లకే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. దాదాపు రెండు గంటల తర్వాత ఆట మళ్లీ మొదలు కాగా... మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. అన్ని వరల్డ్ కప్‌లలో కలిపి దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు. కెపె్టన్ లారా వోల్వర్ట్ (82 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా... మరిజాన్ కాప్ (43 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూన్ లూస్ (59 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఓపెనర్ తజ్మీన్ బ్రిట్స్ (0) టోర్నీలో మూడోసారి డకౌటైన అనంతరం వోల్వర్ట్, లూస్ కలిసి రెండో వికెట్‌కు 93 బంతుల్లోనే 118 పరుగులు జోడించారు. చివర్లో డి క్లెర్క్ (16 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సఫారీ టీమ్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆఖరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 72 పరుగులు సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో నష్రా సంధు, సాదియా ఇక్బాల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలయ్యాక వాన కారణంగా పలు మార్లు అంతరాయం ఏర్పడటంతో మళ్లీ మళ్లీ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చింది. చివరకు పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234 పరుగులుగా నిర్దేశించారు. అయితే పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేయగలిగింది. సిద్రా నవాజ్ (22 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ ఫాతిమా సనా రెండు పరుగులే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజాన్ కాప్ 3 వికెట్లు పడగొట్టగా, షాంగసే 2 వికెట్లు తీసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన మరిజాన్ కాప్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఇండోర్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. -
ఆశలు రేపి... ఆఖర్లో కూల్చారు!
లక్ష్యఛేదనలో 253/4 స్కోరు వద్ద భారత్ 30 బంతుల్లో 36 పరుగుల సమీకరణమపుడు గెలుపే... భారత్‌వైపు తొంగిచూస్తోంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో హిట్టర్ రిచా ఘోష్, ఫిఫ్టీ చేసిన దీప్తిశర్మ అవుటవడంతోనే మహిళల జట్టు గెలుపునకు దూరమైంది. క్రీజులో ఉన్న అమన్‌జోత్, స్నేహ్రాణా సింగిల్స్‌కే పరిమితం కావడం... భారీ షాట్లు ఆడలేకపోవడంతో గెలుపు దారితప్పి ఓటమిబాట పట్టింది.ఇండోర్: ఇక గెలుపు ఖాయమేలే... విజయానికి చేరువయ్యామని అనుకుంటుండగా ఊహించని ఫలితం భారత శిబిరాన్ని ముంచేసింది. విజయం ఆశలు రేపిన మహిళలు ఆఖరికొచ్చేసరికి తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో గెలుపుదాకా వచ్చిన భారత్ 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇంగ్లండ్ అమ్మాయిల చేతిలో ఓడిపోయింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్‌నైట్ (91 బంతుల్లో 109; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించింది. అమీ జోన్స్ (68 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధశతకం చేసింది. దీప్తిశర్మ (4/51) ప్రత్యర్థి బ్యాటింగ్‌కు దెబ్బతీయగా, శ్రీచరణి 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసి ఓడింది. స్మృతి మంధానా (94 బంతుల్లో 88; 8 ఫోర్లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70; 10 ఫోర్లు), దీప్తిశర్మ (57 బంతుల్లో 50; 5 ఫోర్లు)ల అర్ధశతకాల మోత బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రత్యర్థి బౌలర్లలో నాట్ సీవర్ బ్రంట్ 2 వికెట్లు తీసింది. కదంతొక్కిన హీథర్‌నైట్ ఓపెనర్ బ్యూమోంట్ (22) తక్కువ స్కోరుకే అవుటైనా... మరో ఓపెనర్ అమీ జోన్స్ ఫిఫ్టీతో, టాపార్డర్ బ్యాటర్ హీథర్‌నైట్ శతకంతో ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేశారు. కెపె్టన్ నాట్ సీవర్ బ్రంట్ (38; 4 ఫోర్లు), హీథర్‌నైట్ మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు. దీప్తి శర్మ వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి స్కోరు మరింత పెరగకుండా చేసింది. 289 పరుగుల లక్ష్యఛేదనలో ప్రతీక (6) వికెట్‌ను కోల్పోయినప్పటికీ స్మృతి, హర్లీన్ (24), కెపె్టన్ హర్మన్, దీప్తిల రాణింపుతో విజయంవైపు అడుగులు వేసింది. అయితే 234 స్కోరు వద్ద మంధాన అవుటవడం మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. రిచా, దీప్తిలు అవుటవడంతో పరాజయం ఖాయమైంది.స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: బ్యూమోంట్ (బి) దీప్తి 22; అమీ జోన్స్ (సి) మంధాన (బి) దీప్తి 56; హీథర్‌నైట్ (రనౌట్) 109; నాట్ సీవర్ (సి) హర్మన్‌ప్రీత్ (బి) శ్రీచరణి 38; సోఫియా (సి) దీప్తి (బి) శ్రీచరణి 15; ఎమా లంబ్ (సి) మంధాన (బి) దీప్తి 11; అలైస్ క్యాప్సీ (సి) హర్లీన్ (బి) దీప్తి 2; చార్లీ (నాటౌట్) 19; సోఫీ ఎకిల్‌స్టోన్ రనౌట్ 3; లిన్సే స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–73, 2–98, 3–211, 4–249, 5–254, 6–257, 7–276, 8–280. బౌలింగ్: రేణుక 8–0–37–0, క్రాంతి 8–0–46–0, స్నేహ్ రాణా 10–0–56–0, శ్రీచరణి 10–0–68–2, దీప్తిశర్మ 10–0–51–4, అమన్‌జోత్ 4–0–26–0. భారత మహిళల ఇన్నింగ్స్: ప్రతీక (సి) అమీజోన్స్ (బి) లారెన్ బెల్ 6; స్మృతి (సి) క్యాప్సీ (బి) లిన్సే స్మిత్ 88; హర్లీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) చార్లీ 24; హర్మన్‌ప్రీత్ (సి) ఎమా లంబ్ (బి) నాట్ సీవర్ 70; దీప్తి (సి) సోఫియా (బి) ఎకిల్‌స్టోన్ 50; రిచా (సి) హీథర్‌నైట్ (బి) నాట్ సీవర్ 8; అమన్‌జోత్ (నాటౌట్) 18; స్నేహ్ రాణా (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 284. వికెట్ల పతనం: 1–13, 2–42, 3–167, 4–234, 5–256, 6–262. బౌలింగ్: లారెన్ బెల్ 9–0–52–1, లిన్సే స్మిత్ 10–0–40–1, నాట్ సీవర్ 8–0–47–2, చార్లీ డీన్ 10–0–67–1, సోఫీ ఎకిల్‌స్టోన్ 10–0–58–1, అలైస్ క్యాప్సీ 3–0–20–0. -
హర్మన్ బృందానికి పరీక్ష
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు అత్యంత కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం ఇంగ్లండ్‌తో తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్‌లలో శ్రీలంక, పాకిస్తాన్లను ఓడించి సానుకూలంగా టోర్నీని మొదలుపెట్టిన భారత్ ఆ తర్వాత తడబడింది. రెండు పటిష్ట జట్లు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా చేతిలో పరాజయంపాలైంది. ఇప్పుడు మరో కఠిన ప్రత్యర్థి ఇంగ్లండ్ రూపంలో ఎదురైంది. ఇటీవలి కాలంలో ఈ జట్టుపై మన రికార్డు బాగున్నా... వరల్డ్ కప్ ఒత్తిడిని అధిగమించి పైచేయి సాధించడం ముఖ్యం. ఈ మ్యాచ్‌లో ఓడితే తర్వాతి రెండు మ్యాచ్‌లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై భారత్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. మరో వైపు నాట్ సివర్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి (ఒకటి రద్దు) జోరు మీదుంది. అమన్‌జోత్ స్థానంలో రేణుక! తొలి మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఆ్రస్టేలియాపై భారత్‌కు మెరుగైన ఆరంభం లభించింది. స్మతి మంధాన, మరో ఓపెనర్ ప్రతీక కూడా అర్ధసెంచరీలు సాధించారు. హర్లీన్, జెమీమా కూడా కీలక పరుగులు సాధించారు. అయితే హర్మన్ మరోసారి అంచనాలకు తగినట్లు ఆడటంలో విఫలమైంది. రిచా ఘోష్ దూకుడుగా ఆడటం పెద్ద సానుకూలాంశం. దీప్తి చాలా కాలంగా బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేకపోతోంది. మరో సారి ప్రధాన బ్యాటర్లంతా మెరుగ్గా ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంది. అయితే ఆసీస్‌పై 330 పరుగులు చేసి కూడా భారత్ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ఇలాంటి స్థితిలో బౌలింగ్ బలహీనత బయటపడింది. ఐదుగురు రెగ్యులర్ బౌలర్లు విఫలమైనా మరో ప్రత్యామ్నాయం లేకపోయింది. అయినా సరే అదే వ్యూహాన్ని జట్టు కొనసాగించే అవకాశం ఉంది. హర్మన్ ఎలాగూ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయగలదు. ఆల్‌రౌండర్ అమన్‌జోత్ స్థానంలో పేసర్ రేణుక జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. యువ బౌలర్లు క్రాంతి, చరణి ఒత్తిడిని అధిగమించాల్సి ఉంది. చరణితో పాటు దీప్తి, స్నేహ్ స్పిన్‌తో ఇంగ్లండ్‌కు కట్టడి చేయాలని భారత్ భావిస్తోంది. ఫామ్‌లో కెప్టెన్... పాకిస్తాన్‌తో గత మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, అంతకు ముందు బలహీన బంగ్లా, శ్రీలంకను ఇంగ్లండ్ ఓడించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాను 69కే కుప్పకూల్చినా... జట్టు బ్యాటింగ్ అంత గొప్పగా ఏమీ లేదు. కెపె్టన్ సివర్ బ్రంట్, హీతర్ నైట్ మాత్రమే ఫామ్‌లో ఉన్నారు. ఎమీ జోన్స్, బీమాంట్లలో ఇంకా తడబాటు కనిపిస్తోంది. సోఫీయా డంక్లీ, ఎమా ల్యాంబ్లనుంచి జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. బ్యాటింగ్‌తో పోలిస్తే ఇంగ్లండ్ స్పిన్ బౌలింగ్ కూడా బలంగా ఉండటం విశేషం. భారత్‌పై పలు మార్లు చక్కటి ప్రదర్శన కనబర్చిన సోఫీ ఎకెల్‌స్టోన్‌తో పాటు మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ లిన్సీ స్మిత్ కూడా వరల్డ్ కప్‌లో చక్కగా రాణిస్తున్నారు. ప్రధాన పేసర్ లారెన్ బెల్ ఆరంభంలో ప్రత్యర్థిని నిలువరించగలదు. -
సెమీఫైనల్లో ఆస్ట్రేలియా
సాక్షి, విశాఖపట్నం: నాలుగు రోజుల క్రితం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో చెలరేగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ ఇదే మైదానంలో మరో శతకంతో అదరగొట్టింది. ఆసీస్ బౌలర్ల ప్రదర్శనతో తోడు హీలీ, ఫోబీ లిచ్‌ఫీల్డ్ మెరుపు భాగస్వామ్యం డిఫెండింగ్ చాంపియన్‌కు ఘన విజయంతోపాటు సెమీఫైనల్ బెర్త్‌ను కూడా అందించింది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా గురువారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. శోభన మొస్తరి (80 బంతుల్లో 66 నాటౌట్; 9 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, రుబియా హైదర్ (59 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించింది. ఆసీస్ ఆటగాళ్లు నాలుగు క్యాచ్‌లు వదిలిపెట్టడంతో బంగ్లా ఈమాత్రం స్కోరు చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (2/18) ప్రత్యర్థిని కట్టడి చేయగా... వేర్హామ్, అనాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డ్నర్ కూడా తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా 24.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 202 పరుగులు సాధించి గెలిచింది. అలీసా హీలీ (77 బంతుల్లో 113 నాటౌట్; 20 ఫోర్లు) కెరీర్లో ఏడో సెంచరీ సాధించగా... లిచ్‌ఫీల్డ్ (72 బంతుల్లో 84 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) అండగా నిలిచింది. బంగ్లాదేశ్ ఎంత ప్రయత్నించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. తాజా విజయంతో 5 మ్యాచ్‌ల తర్వాత 9 పాయింట్లతో ఆసీస్ తమ అగ్రస్థానాన్ని మరింత పటిష్టపర్చుకొని సెమీఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్‌కు ఇది నాలుగో పరాజయం. నేడు కొలంబోలో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో శ్రీలంక తలపడుతుంది. -
పాక్ బౌలర్ల విజృంభణ.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ఇంగ్లండ్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (అక్టోబర్ 15) జరుగుతున్న మ్యాచ్‌లో (Pakistan vs England) పాకిస్తాన్ బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 31 ఓవర్లకు కుదించబడిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను కేవలం 133 పరుగులకే పరిమితం చేశారు. ఓ దశలో పాక్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 100 పరుగులు కూడా చేయలేని పరిస్థితిలో ఉండింది. 25 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 7 వికెట్ల నష్టానికి 79 పరుగులుగా ఉండింది. ఈ దశలో వర్షం మొదలైంది.సుదీర్ఘ విరామం తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్‌ను 31 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ పునఃప్రారంభమయ్యాక ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. అప్పటిదాకా ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బందిపడ్డ వారు, చివరి 6 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సాధించారు. తొలి 25 ఓవర్లలో పాక్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. 150 బంతుల్లో ఏకంగా 117 బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. పైగా స్వల్ప విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్‌కు ముచ్చెమటలు పట్టించారు.కెప్టెన్ ఫాతిమా సనా 6 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి 4 వికెట్లు తీసింది. సదియా ఇక్బాల్ 6 ఓవర్లలో 12 పరుగులకు 2 వికెట్లు పడగొట్టింది. డయానా బేగ్, రమీన్ షమీమ్ తలో వికెట్ తీశారు. నష్రా సంధు వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా (7-2-12-0) బౌలింగ్ చేసింది.ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో నంబర్ ప్లేయర్ ఛార్లీ డీన్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఎమ్ ఆర్లాట్ (18), హీథర్ నైట్ (18), అలైస్ క్యాప్సీ (16), సోఫీ డంక్లీ (11) రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఓటమి ఎరుగని ఇంగ్లండ్ నుంచి ఇది అత్యంత ఘోరమైన ప్రదర్శన. ఈ టోర్నీలో ఇంగ్లండ్ సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. పాక్ విషయానికొస్తే.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదర్కొని చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది.కాగా, వర్షం కారణంగా పాకిస్తాన్ లక్ష్యాన్ని కుదించారు. 31 ఓవర్లలో ఆ జట్టు టార్గెట్ 113 పరుగులుగా నిర్దేశించారు. చదవండి: కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కులను దక్కించుకున్న భారత్ -
టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's CWC 2025) భారత్‌కు (Team India) వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. టోర్నీ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో (శ్రీలంక, పాకిస్తాన్) గెలిచిన టీమిండియా, ఆతర్వాత వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో పరాభవాలు ఎదుర్కొంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలిచే స్థితిలో ఉండి కూడా అవకాశాలు చేజార్చుకుంది. ముఖ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత్ 330 పరుగులు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. సౌతాఫ్రికా మ్యాచ్‌లో ఇంత భారీ స్కోర్ చేయకపోయినా బౌలర్ల వైఫల్యం కారణంగా చేతిలోకి వచ్చిన మ్యాచ్ చేజారింది.తాజాగా ఆసీస్ కొట్టిన దెబ్బ నుంచి ఇంకా తేరుకోక ముందే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌ల్లో 5 శాతం కోత విధించారు. నిర్దేశిత సమయంలోగా భారత బౌలర్లు ఓ ఓవర్ వెనుకపడి ఉండటంతో ఐసీసీ ఈ జరిమానా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 నిబంధన ప్రకారం నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయని ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కొత విధిస్తారు.ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ కప్‌లో భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 19న ఇండోర్‌లో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. చదవండి: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన పాకిస్తాన్ -
గట్టెక్కిన దక్షిణాఫ్రికా
సాక్షి, విశాఖపట్నం: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా కష్టపడి గెలిచింది. లక్ష్యఛేదనలో 78 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న సఫారీ జట్టును మరిజన్ కాప్ (71 బంతుల్లో 56; 4 ఫోర్లు, 1 సిక్స్)... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రయాన్ (69 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటంతో గట్టెక్కించారు. దీంతో దక్షిణాఫ్రికా ఆఖరి ఓవర్‌దాకా పోరాడి 3 బంతులు మిగిలి ఉండగా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై నెగ్గింది. సఫారీకిది వరుసగా మూడో విజయం కాగా... బంగ్లాదేశ్‌కు మూడో పరాజయం. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫర్జానా హక్ (30; 3 ఫోర్లు), రుబియా హైదర్ (25) తొలి వికెట్‌కు 53 పరుగులతో చక్కని ఆరంభాన్నిచ్చారు. వీళ్లిద్దరు అవుటయ్యాక... టాపార్డర్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (77 బంతుల్లో 50; 6 ఫోర్లు), కెపె్టన్ నిగార్ సుల్తానా (42 బంతుల్లో 32; 5 ఫోర్లు) కుదురుగా ఆడి మరో పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. షర్మిన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆఖర్లో షోర్న అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడింది. రీతూ మోనీ (8 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు)తో కలిసి వేగంగా పరుగులు జతచేసింది. సఫారీ బౌలర్లలో ఎంలాబా 2 వికెట్లు, డి క్లెర్క్, ట్రయాన్ చెరో వికెట్ తీశారు. అనంతరం 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే బ్రిట్స్ (0) వికెట్ కోల్పోగా... లారా వోల్వార్ట్ (56 బంతుల్లో 31; 5 ఫోర్లు), అనికె బాష్ (35 బంతుల్లో 28; 6 ఫోర్లు) జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. అయితే 20 పరుగుల వ్యవధిలో క్రీజులో పాతుకుపోయిన వీరిద్దరితో పాటు డెర్క్సెన్ (2), సినాలో జాఫ్టా (4) నిష్క్రమించారు. దీంతో 78/5 స్కోరు వద్ద సఫారీకి పరాజయం తప్పదనిపించింది. ఈ దశలో మరిజన్ కాప్, ట్రయాన్ ఆరో వికెట్‌కు 85 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా గెలుపు ట్రాక్‌లో పడింది. ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తయ్యాక అవుటయ్యారు. అయితే డిక్లెర్క్ (29 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేసింది. భారత్ చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేసినట్లే కీలకమైన పరుగులతో బంగ్లాదేశ్‌తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇంకో 3 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో నహిదా అక్తర్ 2, రబియా ఖాన్, ఫాహిమా, రీతు మోని తలా ఒక వికెట్ తీసి సఫారీని ఇబ్బంది పెట్టారు. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్ తలపడుతుంది. -
330 సరిపోలేదు.. భారత్‌పై ఆసీస్ గ్రాండ్ విక్టరీ
స్టార్ బ్యాటర్ స్మృతి ఫామ్‌లోకి వచ్చింది. ప్రతీక, జెమీమా కూడా రాణించారు. 330 పరుగుల భారీ స్కోరు నమోదైంది. పిచ్ బ్యాటింగ్‌కు కాస్త అనుకూలంగానే ఉన్నా... ఈ భారీ స్కోరును కాపాడుకోవచ్చని భారత మహిళలు భావించారు. కానీ అటువైపు ఉన్నది ఆస్ట్రేలియా... కెప్టెన్ అలీసా హీలీ నేతృత్వంలో డిఫెండింగ్ చాంపియన్ జట్టు ఎక్కడా తగ్గకుండా దూసుకుపోయింది. చివర్లో కొన్ని అవకాశాలు సృష్టించుకొని భారత్ పట్టు బిగించినట్లు కనిపించినా... ప్రత్యర్థి విజయాన్ని ఆపడానికి అవి సరిపోలేదు. దాంతో గత మ్యాచ్ తరహాలోనే గెలుపునకు చేరువైనట్లు కనిపించినా... మరో ఓటమితో టీమిండియాకు నిరాశ తప్పలేదు. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: సొంతగడ్డపై మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భారత్‌కు మరో నిరాశజనక ఫలితం ఎదురైంది. ఆదివారం ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో హోరాహోరీగా సాగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా జట్టు 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. అన్ని వరల్డ్‌కప్‌లలో కలిపి భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు స్మృతి మంధాన (66 బంతుల్లో 80; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రతీక రావల్ (96 బంతుల్లో 75; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 24.3 ఓవర్లలో 155 పరుగులు జోడించారు. ఆ్రస్టేలియా బౌలర్ అనాబెల్ సదర్లాండ్ 40 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అనంతరం ఆ్రస్టేలియా 49 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు సాధించి గెలిచింది. మహిళల వన్డేల చరిత్రలో ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (107 బంతుల్లో 142; 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో చెలరేగింది. ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీచరణి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. భారత్ తమ తర్వాతి పోరులో ఈ నెల 19న ఇంగ్లండ్‌తో ఇండోర్‌లో తలపడుతుంది. నేడు విశాఖపట్నంలో జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో దక్షిణాఫ్రికా తలపడుతుంది. భారత ఓపెనర్లు ప్రతీక, స్మృతి ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా మొదలు పెట్టారు. ఫలితంగా తొలి 7 ఓవర్లలో 26 పరుగులే వచ్చాయి. పవర్‌ప్లే తర్వాత 11–15 ఓవర్లలో భారత్ 15 పరుగులే చేసింది. ఓపెనర్లు ధాటిని పెంచడంతో 21–24 మధ్య 4 ఓవర్లలోనే 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు రావడం విశేషం. ఎట్టకేలకు స్మృతిని అవుట్ చేసి మోలినే ఈ భాగస్వామ్యాన్ని విడదీసింది. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకోగా, 30 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 192/1కు చేరింది. అయితే తర్వాతి బంతికే ప్రతీక వెనుదిరగ్గా, హర్మన్‌ప్రీత్ (22; 3 ఫోర్లు) ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగింది. అయితే జెమీమా రోడ్రిగ్స్ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు), రిచా ఘోష్ (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శిస్తూ స్కోరును 300 దాటించారు.వీరిద్దరు ఐదో వికెట్‌కు 34 బంతుల్లో 54 పరుగులు జత చేశారు. అయితే ఆఖర్లో భారీ షాట్లకు యత్నించి భారత బ్యాటర్లు వరుసగా వెనుదిరిగారు. 36 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ మరో 7 బంతుల ముందే ముగిసింది. ఓపెనర్ల దూకుడు... భారీ ఛేదనలో ఆసీస్‌కు ఓపెనర్లు హీలీ, లిచ్‌ఫీల్డ్ ఘనమైన ఆరంభం అందించారు. క్రాంతి ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో హీలీ దూకుడు కనబర్చగా, అమన్‌జోత్ ఓవర్లో లిచ్‌ఫీల్డ్ 4 ఫోర్లు బాదింది. తొలి వికెట్‌కు వీరిద్దరు 68 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు. అయితే లిచ్‌ఫీల్డ్‌తో పాటు తక్కువ వ్యవధిలో బెత్ మూనీ (4), అనాబెల్ సదర్లాండ్ (0) అవుటయ్యారు. కానీ మరోవైపు హీలీ ఎక్కడా తగ్గకుండా ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ క్రమంలోనే 84 బంతుల్లో ఆమె శతకం పూర్తి చేసుకుంది. ఆసీస్ విజయానికి చేరువవుతున్న దశలో ఒక్కసారిగా భారత బౌలర్లు పైచేయి సాధించారు. ఫలితంగా 38 పరుగుల వ్యవధిలో జట్టు 4 వికెట్లు చేజార్చుకోవడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే ఒత్తిడిని అధిగమించి ఆసీస్ ఒక ఓవర్ ముందే గెలిచింది.112 స్మృతి 5 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు పట్టిన ఇన్నింగ్స్‌ల సంఖ్య. మహిళల వన్డేల్లో అందరికంటే వేగంగా ఆమె ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే ఇన్నింగ్స్‌లో ఒకే ఏడాది 1000 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా కూడా స్మృతి గుర్తింపు పొందింది.331 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. శ్రీలంక జట్టు (302 దక్షిణాఫ్రికాపై 2024లో) పేరిట ఉన్న రికార్డును ఆస్ట్రేలియా అధిగమించింది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (సి) పెరీ (బి) సదర్లాండ్ 75; స్మృతి (సి) లిచ్‌ఫీల్డ్ (బి) మోలినే 80; హర్లీన్ (సి) సదర్లాండ్ (బి) మోలినే 38; హర్మన్‌ప్రీత్ (సి) మోలినే (బి) షుట్ 22; జెమీమా (సి) మూనీ (బి) సదర్లాండ్ 33; రిచా (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 32; అమన్‌జోత్ (సి) మోలినే (బి) గార్డ్నర్ 16; దీప్తి (సి) మూనీ (బి) మోలినే 1; స్నేహ్ (నాటౌట్) 8; క్రాంతి (సి) (సబ్) వేర్హమ్ (బి) సదర్లాండ్ 1; శ్రీచరణి (బి) సదర్లాండ్ 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 330. వికెట్ల పతనం: 1–155, 2–192, 3–234, 4–240, 5–294, 6–309, 7–320, 8–327, 9–330, 10–330. బౌలింగ్: గార్త్ 5–0–35–0, షుట్ 6.1–0–37–1, యాష్లే గార్డ్నర్ 7–0–40–1, మోలినే 10–1–75–3, సదర్లాండ్ 9.5–0–40–5, తాలియా మెక్‌గ్రాత్ 4.5–0–43–0, అలానా కింగ్ 6–0–49–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 142; లిచ్‌ఫీల్డ్ (సి) స్నేహ్ (బి) శ్రీచరణి 40; ఎలీస్ పెరీ (నాటౌట్) 47; మూనీ (సి) రోడ్రిగ్స్ (బి) దీప్తి 4; సదర్లాండ్ (బి) శ్రీచరణి 0; యాష్లే గార్డ్నర్ (బి) అమన్‌జోత్ 45; తాలియా మెక్‌గ్రాత్ (ఎల్బీ) (బి) దీప్తి 12; మోలినే (ఎల్బీ) (బి) అమన్‌జోత్ 18; కిమ్ గార్త్ (నాటౌట్) 14; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (49 ఓవర్లలో 7 వికెట్లకు) 331. వికెట్ల పతనం: 1–85, 2–168, 3–170, 4–265, 5–279, 6–299, 7–303. బౌలింగ్: అమన్‌జోత్ 9–0–68–2, క్రాంతి 9–1–73–0, స్నేహ్ రాణా 10–0–85–0, శ్రీచరణి 10–1–41–3, దీప్తి 10–0–52–2, హర్మన్‌ప్రీత్ 1–0–10–0. -
IND VS AUS: చెలరేగిన మంధన.. టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో (India vs Australia) టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆస్ట్రేలియా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసి 330 పరుగులు (48.5 ఓవర్లలో ఆలౌట్) చేసింది. ఓపెనర్లు స్మృతి మంధన (Smriti Mandhana), ప్రతిక రావల్ (Pratika Rawal) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మంధన తన సహజ శైలిలో చెలరేగిపోయింది. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనతో పోలిస్తే ప్రతిక రావల్ కాస్త నిదానంగా ఆడింది.96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 75 పరుగులు చేసింది. వీరిద్దరు ఔటయ్యాక స్కోర్ కాస్త నెమ్మదించింది. హర్లీన్ డియోల్ (38), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (22), జెమీమా రోడ్రిగెజ్ (33), రిచా ఘోష్ (32), అమన్‌జోత్ కౌర్ (16) అడపాదడపా మెరుపులు మెరిపించారు. టెయిలెండర్లు దారుణంగా విఫలమయ్యారు. వీరు కూడా తలో చేయి వేసి ఉంటే టీమిండియా ఇంకాస్త భారీ స్కోర్ చేసుండేది. 21 పరుగుల వ్యవధిలో భారత్ చివరి 5 వికెట్లు కోల్పోయింది. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్ తలా ఒకటి, శ్రీ చరణి డకౌటయ్యారు. స్నేహ్ రాణా 8 పరుగులతో అజేయంగా నిలిచింది.ఆసీస్ బౌలర్లలో అన్నాబెల్ సదర్‌ల్యాండ్ 5 వికెట్లతో సత్తా చాటగా.. సోఫీ మోలినెక్స్ 3, మెగాన్ షట్, ఆష్లే గార్డ్నర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో మంధన పలు రికార్డులు నెలకొల్పింది. 18 పరుగుల స్కోర్ వద్ద ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఆమె.. వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది.అలాగే అర్ద సెంచరీ తర్వాత వన్డేల్లో 5000 పూర్తి చేసుకున్న మంధన.. బంతులు, ఇన్నింగ్స్‌ల పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్‌లు, 5569 బంతులు అవసరమయ్యాయి. ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29 ఏళ్లు) సొంతం చేసుకున్న ప్లేయర్‌గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.చదవండి: భారత్‌తో రెండో టెస్ట్.. విండీస్ బ్యాటర్ల అనూహ్య పోరాటం -
IND VS AUS: అరుదైన మైలురాయిని తాకిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది.తొలుత మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో (2025) 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆమె.. ఆతర్వాత కొద్ది నిమిషాలకే వన్డేల్లో 5000 పరుగుల అరుదైన మైలురాయిని అందుకుంది. 1000 పరుగుల మార్కును సిక్సర్‌తో తాకిన మంధన.. 5000 పరుగుల మైలురాయిని కూడా సిక్సర్‌తోనే అందుకుంది.బంతులు, ఇన్నింగ్స్‌ల పరంగా మంధన ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని తాకిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మైలురాయిని తాకేందుకు ఆమెకు కేవలం 112 ఇన్నింగ్స్‌లు, 5569 బంతులు అవసరమయ్యాయి. గతంలో ఈ రికార్డులు స్టెఫానీ టేలర్ (129 ఇన్నింగ్స్‌లు), సూజీ బేట్స్ (6182 బంతులు) పేరిట ఉండేవి.ఈ రికార్డును అత్యంత పిన్న వయసులో (29) సొంతం చేసుకున్న ప్లేయర్‌గానూ మంధన రికార్డు నెలకొల్పింది.వన్డే క్రికెట్లో మంధన సహా కేవలం 5 మంది మాత్రమే 5000 పరుగులు పూర్తి చేశారు. మిథాలీ రాజ్ (7805) తర్వాత భారత్ తరఫున ఈ మైలురాయిని చేరుకున్న రెండో ప్లేయర్ మంధన మాత్రమే.ఈ మ్యాచ్‌లో మంధన 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి ఔటైంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో మంధనకు ఇదే తొలి అర్ద సెంచరీ (4 మ్యాచ్‌ల్లో).వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 27 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 171/1గా ఉంది. మంధన ఔట్ కాగా.. ప్రతిక రావల్ (68), హర్లీన్ డియోల్ (12) క్రీజ్‌లో ఉన్నారు. మంధన వికెట్ సోఫీ మోలినెక్స్కు దక్కింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్ -
చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (అక్టోబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. ఎవరూ సాధించని ఈ ఘనతను మంధన భారీ సిక్సర్‌తో చేరుకోవడం మరో విశేషం.వన్డేల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (2025లో 18 ఇన్నింగ్స్‌ల్లో 1000* పరుగులు) చేసిన బ్యాటర్ల జాబితాలో మంధన తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (1997లో 970 పరుగులు), లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. వైజాగ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి ఆసీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేస్తుంది. 17 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 90/0గా ఉంది. ఓపెనర్లు మంధన 49, ప్రతిక రావల్ 40 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.మంధన@18మంధన ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మార్కును 18 పరుగుల వద్ద చేరుకుంది. 1000 పరుగుల మార్కును ఆమె 18వ ఇన్నింగ్స్‌లో చేరుకుంది. మంధన జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌పై విజయాలు సాధించి, మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడింది. వాస్తవానికి ఆ మ్యాచ్‌లోనూ భారత్‌కు గెలిచే అవకాశం ఉండినప్పటికీ.. నదినే డి క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. ప్రస్తుతం భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.ఆసీస్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆ తర్వాతి మ్యాచ్ (శ్రీలంక) వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది (ఓ పాయింట్ లభించింది). మూడో మ్యాచ్‌లో ఆసీస్ పాక్‌పై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆసీస్ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 5 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండి పట్టికలో రెండో స్థానంలో ఉంది. 3 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ టాప్ ప్లేస్‌లో ఉంది.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
నాట్ సీవర్ సెంచరీ
కొలంబో: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ‘హ్యాట్రిక్’ విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నాట్ సీవర్ బ్రంట్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు 89 పరుగుల తేడాతో శ్రీలంకపై జయభేరి మోగించింది. బ్యాటింగ్‌లో విరోచిత శతకం సాధించిన కెప్టెన్ బ్రంట్ (117 బంతుల్లో 117; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బౌలింగ్‌తో 2 వికెట్లు పడగొట్టింది. టాస్ నెగ్గిన లంక ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. టాపార్డర్‌లో అమీ జోన్స్ (11), బ్యూమోంట్ (29 బంతుల్లో 32; 6 ఫోర్లు), హీథర్‌నైట్ (47 బంతుల్లో 29; 2 ఫోర్లు) ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదు. ఇలాంటి స్థితిలో నాట్ సీవర్ బ్రంట్ ఒంటరి పోరాటం చేసింది. సోఫియా డన్క్లే (18), ఎమ్మా లాంబ్ (13), చార్లీ డీన్ (19)లతో కలిసి జట్టు స్కోరును నడిపించింది. 110 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసింది. లంక బౌలర్లలో ఇనోక రణవీర 3 వికెట్లు పడగొట్టగా, ఉదేశిక ప్రబోధని, సుగంధిక కుమారి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 45.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ హాసిని పెరిర (60 బంతుల్లో 35; 3 ఫోర్లు), మిడిలార్డర్లో హర్షిత సమరవిక్రమ (37 బంతుల్లో 33; 5 ఫోర్లు) మాత్రమే మెరుగ్గా ఆడారు. మిగతా వాళ్లంతా ఇంగ్లండ్ బౌలింగ్‌కు తలొంచారు. నీలాక్షిక సిల్వా (23) మినహా ఇంకెవరూ రెండు పదుల స్కోరైనా చేయలేకపోయారు. సోఫి ఎకిల్‌స్టోన్ (10–3–17–4) తన మ్యాజిక్ స్పెల్‌తో లంకను కూల్చేసింది. నాట్ సీవర్, చార్లీ డీన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ ఆడిన మూడు గెలిచి పట్టికలో అగ్రస్థానంలో నిలువగా, ఇంకా బోణీ చేయలేకపోయిన శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. లంక మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ మహిళల ఇన్నింగ్స్: అమీ జోన్స్ రనౌట్ 11; బ్యూమోంట్ (సి)హర్షిత (బి) సుగంధిక 32; హీథర్‌నైట్ (సి) విహంగ (బి) ఇనొక 29; నాట్ సీవర్ (సి) నీలాక్షిక (బి) ప్రబోధని 117; సోఫియా (సి) అండ్ (బి) కవిశా 18; ఎమ్మా లాంబ్ (బి) ఇనొక 13; క్యాప్సీ (స్టంప్డ్) సంజీవని (బి) ఇనొక 0; చార్లీ డీన్ (సి) విహంగ (బి) ప్రబోధని 19; సోఫి ఎకిల్‌స్టోన్ (స్టంప్డ్) సంజీవని (బి) సగంధిక 3; లిన్సే స్మిత్ నాటౌట్ 5; లారెన్ బెల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 253. వికెట్ల పతనం: 1–24, 2–49, 3–109, 4–146, 5–168, 6–168, 7–206, 8–216, 9–252. బౌలింగ్: ప్రబోధని 9–0–55–2, సుగంధిక 10–0–66–2, చమరి 5–0–21–0, ఇనొక 10–1–33–3, విహంగ 8–0–42–0, కవిశా 8–0–34–1. శ్రీలంక మహిళల ఇన్నింగ్స్: హాసిని (సి) క్యాప్సీ (బి) సోఫి 35; చమరి (బి) సోఫి 15, విష్మీ (బి) చార్లీ డీన్ 10; హర్షిత (సి) బెల్ (బి) సోఫి 33; కవిశా (బి) సోఫి 4; నీలాక్షిక (సి)హీథర్‌నైట్ (బి) క్యాప్సీ 23; అనుష్క (ఎల్బీడబ్ల్యూ) (బి) నాట్ సీవర్ 10; విహంగ (సి) చార్లీ డీన్ (బి) నాట్ సీవర్ 3; సుగంధిక (బి) చార్లీ డీన్ 4; ప్రబోధని (సి) నాట్ సీవర్ (బి) లిన్సే స్మిత్ 0; ఇనొక నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (45.4 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–37, 2–95, 3–98, 4–103, 5–116, 6–134, 7–145, 8–157, 9–157, 10–164. బౌలింగ్: లారెన్ బెల్ 8–1–32–0, లిన్సే స్మిత్ 8.4–1–22–1, నాట్ సీవర్ 5–0–25–2, చార్లీ డీన్ 9–1–47–2, అలైస్ క్యాప్సీ 5–1–15–1, సోఫి 10–3–17–4. -
న్యూజిలాండ్ బోణీ
గువాహటి: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మాజీ చాంపియన్ న్యూజిలాండ్ ఆలస్యంగా బోణీ చేసింది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన కివీస్ జట్టు శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు సుజీ బేట్స్ (29; 6 సిక్స్‌లు), ప్లిమర్ (4), అమెలియా కెర్ (1) విఫలమవడంతో 38 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి. ఈ దశలో కెప్టెన్ సోఫీ డివైన్ (85 బంతుల్లో 63; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బ్రూక్ హాలిడే (104 బంతుల్లో 69; 5 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 112 పరుగులు జోడించడంతో కివీస్ కుదురుకుంది. అయితే 29 పరుగుల వ్యవధిలో వీళ్లిద్దరు అవుటయ్యాక న్యూజిలాండ్ మళ్లీ తడబడింది. ఆఖరి ఓవర్లలో మ్యాడీ గ్రీన్ (25; 3 ఫోర్లు), జెస్ కెర్ (0), రోజ్మేరీ (2), ఇసాబెల్లా గేజ్ (12) వికెట్లను కోల్పోయింది. ప్రత్యర్థి బౌలర్లలో రబియా ఖాన్ 3 వికెట్లు పడగొట్టింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు 39.5 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఫాహిమా ఖాతూన్ (34; 2 ఫోర్లు), రబియా ఖాన్ (25; 2 ఫోర్లు) రాణించారు. జెస్ కెర్, లీ తహుహు చెరో 3 వికెట్లు తీయగా, రోజ్మేరీకి 2 వికెట్లు దక్కాయి. కొలంబోలో నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టుతో శ్రీలంక తలపడుతుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) 28 ఏళ్ల కిందటి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి, చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో 32 బంతుల్లో 23 పరుగులు చేసిన మంధన ఈ క్యాలెండర్ ఇయర్లో (2025) పరుగుల సంఖ్యను 982కు (17 ఇన్నింగ్స్‌ల్లో) పెంచుకుంది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ (Belinda Clark) పేరిట ఉండేది. క్లార్క్ 1997 క్యాలెండర్ ఇయర్లో 970 పరుగులు చేసింది. ఈ విభాగంలో మంధన, క్లార్క్ తర్వాత సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ (2022లో 882 పరుగులు), న్యూజిలాండ్‌కు చెందిన డెబ్బీ హాక్లీ (1997లో 880), న్యూజిలాండ్‌కు చెందిన యామీ సాటర్థ్వైట్ (2016లో 853) ఉన్నారు. మంధన వన్డేల్లో ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా, అంతకుముందు అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది మంధన ఖాతాలో నాలుగు వన్డే శతకాలు కూడా ఉన్నాయి.మ్యాచ్ విషయానికొస్తే.. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో నంబర్ ప్లేయర్ నదినే డి క్లెర్క్ (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది.భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్, క్లో ట్రయాన్ (49) సహకారంతో మ్యాచ్‌ను గెలిపించింది. చివరి 5 ఓవర్లలో 52 పరుగులు చేయాల్సిన దశలో క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది. అంతకుముందు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (70) రాణించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్ రాణా (33) సహకారంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా భారత్ ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంది. చదవండి: చరిత్ర సృష్టించిన రిచా ఘోష్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా -
గట్టెక్కిన ఇంగ్లండ్
గువాహటి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. తొలి పోరులో దక్షిణాఫ్రికాపై సునాయాసంగా నెగ్గిన ఇంగ్లండ్... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచేందుకు కష్టపడాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యఛేదనలో మొదట్లో తడబడ్డా ఆ తర్వాత తేరుకొని విజయ తీరాలకు చేరింది. మంగళవారం జరిగిన ఈ పోరులో నాట్ సీవర్ బ్రంట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 49.4 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. శోభన మోస్తారీ (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధశతకంతో మెరిపించింది. ఆఖర్లో రాబియా ఖాన్ (27 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ షాట్లతో ఆకట్టుకుంది. షర్మిన్ అక్తర్ (30; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ నిగార్ సుల్తానా (0) డకౌట్ కాగా... రూబ్యా (4), షోర్నా అక్తర్ (10), రీతు మోని (5), ఫహీమ ఖాతూన్ (7), నహిదా అక్తర్ (1) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్ 3 వికెట్లు పడగొట్టగా... లిన్సే స్మిత్, చార్లీ డీన్, అలీస్ కాప్సీ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హీథర్ నైట్ (111 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది. కెప్టెన్ సీవర్ బ్రంట్ (41 బంతుల్లో 32; 5 ఫోర్లు), అలీస్ కాప్సీ (20; 3 ఫోర్లు), చార్లీ డీన్ (27 నాటౌట్; 2 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకోవడంతో... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. లక్ష్యం చిన్నదే అయినా... బంగ్లా క్రమశిక్షణాయుత బౌలింగ్‌తో దాన్ని కఠినతరంగా మార్చింది. అమీ జోన్స్ (1), బ్యూమౌంట్ (13), సోఫీ డంక్లీ (0), ఎమ్మా లాంబ్ (1) విఫలమయ్యారు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే బంగ్లాదేశ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా హీథర్ నైట్ ఇన్నింగ్స్‌కు ఇరుసుగా నిలిచింది. వన్‌డౌన్‌లో దిగిన నైట్... చివరి వరకు అజేయంగా నిలిచింది. అబేధ్యమైన ఏడోవికెట్‌కు డీన్‌తో కలిసి 79 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహీమా ఖాతూన్ 10 ఓవర్ల కోటాలో 16 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. మారుఫా అక్తర్ 2 వికెట్లు తీసింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఇంగ్లండ్ 4 పాయింట్లతో అగ్రస్థానానికి చేరింది. నేడు కొలంబో వేదికగా జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో ఆ్రస్టేలియా తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్
సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ తజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) మహిళల వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో ఐదు సెంచరీలు బాదిన తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 6) జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో ఈ ఘనత సాధించింది.తజ్మిన్కు ముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) ఖాతాలో ఉండిది. మంధన 2024, 2025 క్యాలెండర్ ఇయర్స్‌లో నాలుగు సెంచరీలు బాదింది. తాజాగా తజ్మిన్ మంధన రికార్డును బద్దలు కొట్టి, సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగనుండటంతో మంధన తిరిగి తన రికార్డును తజ్మిన్ నుంచి చేజిక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇటీవలికాలంలో మంధన కూడా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. అయితే ఈ ప్రపంచకప్‌లో మాత్రం తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైంది.తజ్మిన్ ఖాతాలో మరో భారీ రికార్డుతాజా సెంచరీతో తజ్మిన్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ రికార్డును బ్రేక్ చేసింది. వన్డేల్లో 7 సెంచరీలు పూర్తి చేసేందుకు లాన్నింగ్‌కు 44 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. తజ్మిన్ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రపంచంలో తజ్మిన్, లాన్నింగ్ మినహా ఏ ఒక్క మహిళా ప్లేయర్ కూడా కనీసం 50 ఇన్నింగ్స్‌ల్లో 7 వన్డే సెంచరీలు పూర్తి చేయలేకపోయారు.మ్యాచ్ విషయానికొస్తే.. తజ్మిన్ మెరుపు సెంచరీతో (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తజ్మిన్కు సూన్ లస్ (83 నాటౌట్) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా సునాయాస విజయాన్ని సాధించింది. అంతకుముందు సోఫీ డివైన్ (85) రాణించడంతో న్యూజిలాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్ తజ్మిన్తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్స్ సూజీ బేట్స్, సోఫీ డివైన్‌కు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే బేట్స్ మహిళ క్రికెట్లో 350 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సోఫీ డివైన్‌కు కూడా ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్. అతి తక్కువ మంది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.వైరలవుతున్న తజ్మిన్ సంబరాలుఈ మ్యాచ్‌లో తజ్మిన్ సెంచరీ తర్వాత చేసుకున్న 'బౌ అండ్ యారో' సంబరాలు వైరలవుతున్నాయి. తజ్మిన్ సెలబ్రేషన్స్‌కు భారత క్రికెట్ అభిమానులు సైతం ముగ్దులవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. The moment Tazmin Brits made it 4️⃣ hundreds in her last 5️⃣ ODIs 🤩Watch #NZvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29#CWC25 pic.twitter.com/NfSYRjCsOY— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2025తజ్మిన్ ఇంతకుముందు కూడా ఇలాంటి వినూత్న సంబరాలు చేసుకొని వార్తల్లో నిలిచింది. ఒంటికాలిపై యోగాసనం లాంటివి చేసి బాగా పాపులరైంది.యాదృచ్చికంతజ్మిన్ ఓ క్యాలెండర్ ఇయర్లో 5 సెంచరీలు చేసిన రోజే (అక్టోబర్ 6), సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ గ్యారీ కిర్‌స్టన్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. పురుషుల క్రికెట్లో కిర్‌స్టన్ 1996 క్యాలెండర్ ఇయర్లో ఇదే రోజు తన ఐదో వన్డే సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సౌతాఫ్రికన్‌గా చరిత్ర సృష్టించాడు. ఒకే రోజు ఇద్దరు సౌతాఫ్రికన్లు ఒకే ఫీట్‌ను సాధించడం యాదృచ్చికంగా జరిగింది.5 ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాలుతజ్మిన్ తన వన్డే కెరీర్లో చేసిన 7 సెంచరీల్లో నాలుగింటిని గత 5 ఇన్నింగ్స్‌ల్లోనే చేయడం విశేషం. ఈ సెంచరీకి ముందు ఇంగ్లండ్‌తో వన్డేలో (5) విఫలమైన ఆమె.. అంతకుముందు మూడు వన్డేల్లో పాక్‌పై 2, వెస్టిండీస్‌పై ఓ సెంచరీ సాధించింది.గత 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో తజ్మిన్ స్కోర్లు- 101(91) Vs వెస్టిండీస్- 101*(121) Vs పాక్- 171*(141) Vs పాక్- 5(13) Vs ఇంగ్లండ్- 101(89) Vs న్యూజిలాండ్ (WC)తజ్మిన్ గురించి ఆసక్తికర విషయాలు..ప్రస్తుతం స్టార్ క్రికెటర్‌గా చలామణి అవుతున్న తజ్మిన్ తన కెరీర్‌ను అథ్లెట్‌గా మొదలుపెట్టింది. 2007లో ఆమె వరల్డ్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది. 2012 ఒలింపిక్స్‌కు ఎంపిక కావాల్సిన సమయంలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురై, రెండు నెలలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. దీంతో అథ్లెట్‌గా ఆమె కెరీర్ అక్కడితో ముగిసింది. ఆతర్వాత 2018లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన తజ్మిన్ అప్పటి నుంచి కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తుంది. తజ్మిన్ తన తొలి 40 వన్డేల్లో ఒక్క డకౌట్ కూడా కాకుండా ఆడి అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచింది. చదవండి: రిషబ్ పంత్ రీఎంట్రీ..! -
విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు..ఫోటోలు కోసం ఎగబడ్డ ఫ్యాన్స్ (ఫొటోలు)
-
పాక్‌పై రికార్డు విజయం.. ఆసీస్ దిగ్గజాన్ని అధిగమించిన టీమిండియా కెప్టెన్
మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025లో (Women's Cricket World Cup 2025) భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (అక్టోబర్ 5) జరిగిన మ్యాచ్‌లో (India vs Pakistan) టీమిండియా 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్‌కే (247) పరిమితమైనప్పటికీ.. ఆతర్వాత ఆ స్కోర్‌ను విజయవంతంగా కాపాడుకుంది. క్రాంతి గౌడ్ (10-3-20-3) అద్భుతమైన బౌలింగ్‌తో పాక్ పతనాన్ని శాశించింది. క్రాంతితో పాటు దీప్తి శర్మ (9-0-45-3), స్నేహ్ రాణా (8-0-38-2) కూడా సత్తా చాటడంతో పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్ తరఫున సిద్రా అమీన్ (81) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అంతకుముందు భారత ఇన్నింగ్స్ డయానా బేగ్ (10-1-69-4) ధాటికి తడబడింది. టాపార్డర్ మొత్తానికి మంచి ఆరంభాలు లభించినా, ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించింది.ఈ గెలుపుతో భారత్ వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ పాక్‌పై ఆధిపత్యాన్ని (5-0) కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్‌ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించాయి. దీనికి ముందు భారత పురుషుల జట్టు ఆసియా కప్‌లో పాక్‌ను వరుసగా మూడు ఆదివారాల్లో ఓడించి ఆసియా ఛాంపియన్‌గా అవతరించింది.ఇదిలా ఉంటే, నిన్నటి గెలుపుతో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet kaur) ఓ అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో ఆమె ప్లేయర్‌గా 90వ విజయాన్ని నమోదు చేసి, మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ల జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజ ప్లేయర్, ఆ జట్టు మాజీ కెప్టెన్, రెండు సార్లు వన్డే ప్రపంచకప్ విన్నర్ మెగ్ లాన్నింగ్‌ను (Meg Lanning) అధిగమించింది. లాన్నింగ్ తన కెరీర్లో ప్లేయర్‌గా 89 విజయాలు సాధించగా.. హర్మన్ నిన్నటి మ్యాచ్‌తో ఆమెను దాటేసింది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానంలో ఉంది. మిథాలీ తన వన్డే కెరీర్లో 129 విజయాలు సాధించింది.మహిళల వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్లుమిథాలీ రాజ్- 129ఎల్లిస్ పెర్రీ- 125అలైస్సా హీలీ- 103బెలిండ క్లార్క్- 94కేట్ సీవర్ బ్రంట్- 93కేట్ ఫిజ్‌ప్యాట్రిక్- 91హర్మన్‌ప్రీత్ కౌర్- 90మెగ్ లాన్నింగ్- 89 చదవండి: లంక ప్రీమియర్ లీగ్‌లో భారత ఆటగాళ్లు.. చరిత్రలో తొలిసారి..! -
టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (అక్టోబర్ 5) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ (Inida vs Pakistan) జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి, వన్డే ఫార్మాట్లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ పాక్‌పై ఆధిపత్యాన్ని 5-0 తేడాతో కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్‌ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించారు.తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో టీమిండియా గ్రూప్ (సెప్టెంబర్ 14), సూపర్-4 (సెప్టెంబర్ 21), ఫైనల్ (సెప్టెంబర్ 28) మ్యాచ్‌ల్లో వరుసగా మూడు ఆదివారాల్లో పాక్‌ను ఓడించగా.. ఇప్పుడు భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌ను వరుసగా నాలుగో ఆదివారం (అక్టోబర్ 5) చిత్తు చేసింది.తాజా మ్యాచ్‌లో భారత మహిళా జట్టు చేతిలో ఓడినా పాక్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో పాక్ తొలిసారి భారత్‌ను ఆలౌట్ చేసింది. ఇరు జట్ల మధ్య దీనికి ముందు 11 మ్యాచ్‌లు జరిగినా, అందులో పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా భారత్‌ను ఆలౌట్ చేయలేదు.నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాక్ పేసర్ డయానా బేగ్ (10-1-69-4) చెలరేగడంతో భారత్ సరిగ్గా 50 ఓవర్లు ఆడి 247 పరుగులకు ఆలౌటైంది. మహిళల వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకుండా టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఏకంగా 173 బంతులకు పరుగులు చేయలేదు.ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఓ జట్టు ఇన్ని బంతులకు పరుగులు చేయలేకపోవడం ఇదే ప్రప్రధమం. గత 34 వన్డేల్లో భారత మహిళల జట్టు ఈ మార్కును (173 డాట్ బాల్స్) తాకడం ఇది రెండోసారి. 2023 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 181 బంతులను వృధా చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. భారత బ్యాటర్లను ఉన్న టాలెంట్ ప్రకారం ఈ స్కోర్ నిజంగానే చాలా చిన్నది. అయినా భారత బౌలర్లు దాన్ని విజయవంతంగా కాపాడుకొని పాక్‌ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోర్‌కే (247 ఆలౌట్) పరిమితం కావడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి.టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో పురుగులు చాలా ఇబ్బంది పెట్టాయి. వీటి వల్ల భారత బ్యాటర్లు ఏకాగ్రత సాధించలేకపోయారు. ఓ దశలో పురుగులను పారద్రోలేందుకు స్ప్రేను కూడా ప్రయోగించారు. అయితే అప్పటికే సగం మ్యాచ్ ఆయిపోయింది. నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాక్‌పై భారీ స్కోర్ చేయలేకపోవడానికి పిచ్ మరో కారణం. పిచ్‌ను మ్యాచ్‌కు 48 గంటల ముందు వరకు క్లోజ్ చేసి ఉంచారు. దీంతో తేమ ఎక్కువై బంతి నిదానంగా కదిలింది. దీని వల్ల కూడా భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే భారత్ ఇంకాస్త తక్కువ స్కోర్‌కే పరిమితమై ఉండేది. చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్ -
రేపటి నుంచి క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం
రేపటి నుంచి (సెప్టెంబర్ 30) మహిళల క్రికెట్ మహా సంగ్రామం (ICC Women's World Cup-2025) ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి భారత్ (India), శ్రీలంక (Sri Lanka) సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. నవంబర్ 2 వరకు జరిగే ఈ క్రికెట్ పండుగలో మొత్తం 8 జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక) పాల్గొంటున్నాయి. 5 వేదికలపై 34 రోజుల పాటు 31 మ్యాచ్‌లు జరుగనున్నాయి. మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఇది 13వ ఎడిషన్.మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి..?భారత్‌లో: గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, నవి ముంబై శ్రీలంకలో: కొలంబో కొలంబోలో మొత్తం 10 మ్యాచ్‌లు జరుగుతాయి. పాకిస్తాన్ జట్టు ఆడే అన్ని మ్యాచ్‌లు ఇక్కడే షెడ్యూల్ అయ్యాయి.మ్యాచ్ టైమింగ్స్..ఒక్క మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 26న న్యూజిలాండ్ vs ఇంగ్లండ్ మ్యాచ్ మాత్రం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది.జట్ల కెప్టెన్లు.. భారత్- హర్మన్‌ప్రీత్ కౌర్ఆస్ట్రేలియా- అలిస్సా హీలీ ఇంగ్లాండ్- నాట్ స్కివర్-బ్రంట్న్యూజిలాండ్- సోఫీ డివైన్పాకిస్తాన్- ఫాతిమా సనాదక్షిణాఫ్రికా- లారా వోల్వార్డ్ట్బంగ్లాదేశ్- నిగార్ సుల్తానా జోటి శ్రీలంక- చమారి అటపత్తుభారత మ్యాచ్‌లు..సెప్టెంబర్ 30: భారత్ vs శ్రీలంక – గౌహతి అక్టోబర్ 5: భారత్ vs పాకిస్తాన్ – కొలంబో అక్టోబర్ 12: భారత్ vs ఆస్ట్రేలియా – విశాఖపట్నం అక్టోబర్ 19: భారత్ vs ఇంగ్లాండ్ – ఇండోర్ అక్టోబర్ 23: భారత్ vs న్యూజిలాండ్ – నవి ముంబై అక్టోబర్ 26: భారత్ vs బంగ్లాదేశ్ – నవి ముంబై అక్టోబర్ 29, 30: సెమీఫైనల్స్ నవంబర్ 2: ఫైనల్భారత జట్టు..హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధన (వైస్ కెప్టెన్), జెమిమా, రిచా ఘోష్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, స్నేహ్ రాణా, హర్లీన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, ఉమా చేత్రి, అమన్‌జోత్, కాంతి గౌడ్, శ్రీ చరణి, ప్రతికా రావల్ రిజర్వ్స్: తేజల్ హసాబ్నిస్, ప్రీమా రావత్, ప్రియా మిశ్రా, మిన్ను మణి, సయాలి సత్ఘారేప్రసార వివరాలు.. మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025ను భారత్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. JioHotstar యాప్ మరియు వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంటుంది.చదవండి: టీమిండియాకు కొత్త టాస్క్.. మరో మూడు రోజుల్లో ప్రారంభం -
ఐసీసీ చారిత్రక నిర్ణయం
మహిళల క్రికెట్ అభివృద్ధి దిశగా ఐసీసీ మరో కీలక అడుగు వేసింది. 13వ మహిళల వన్డే వరల్డ్ కప్ (2025) కోసం 14 మంది మహిళా అంపైర్లు, నలుగురు మహిళా మ్యాచ్ రిఫరీలను ఎంపిక చేసింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పూర్తిగా మహిళా అధికారులనే నియమించడం ఇదే మొదటిసారి.ఈ చారిత్రక నిర్ణయం తీసుకోవడంలో ఐసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా కీలకపాత్ర పోషించారు. ఇది మహిళల క్రికెట్ ప్రయాణంలో కీలక ఘట్టమని ఆయన అన్నారు.ఓవరాల్‌గా చూస్తే అందరూ మహిళా అధికారులే ఉన్న నాలుగో గ్లోబల్ టోర్నమెంట్ ఇది. 2022 కామన్వెల్త్ క్రీడలు, తాజాగా జరిగిన రెండు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో మ్యాచ్ అధికారులంతా మహిళలే.ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 కోసం ఎంపిక చేసిన మ్యాచ్ రిఫరీలు- ట్రూడీ ఆండర్సన్, - షాండ్రే ఫ్రిట్జ్ - జి.ఎస్. లక్ష్మి - మిచెల్ పెరెరాఅంపైర్లు- లారెన్ ఏజెన్బ్యాగ్ - కాండేస్ లా బోర్డే - కిమ్ కాటన్ - సారా డాంబనేవనా - షతిరా జకీర్ జెసీ - కెరిన్ క్లాస్టే - జనని ఎన్ - నిమాలి పెరెరా - క్లేర్ పోలోసాక్ - వృందా రాథీ - సూ రెడ్‌ఫెర్న్ - ఎలోయిస్ షెరిడన్ - గాయత్రి వేణుగోపాలన్ - జాక్వెలిన్ విలియమ్స్కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లో ఆతిథ్య దేశాలే తలపడనున్నాయి. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. -
విజేత జట్టుకు రూ. 39 కోట్ల 42 లక్షలు
దుబాయ్: మహిళల క్రికెట్‌కు మరింత ఊతమిచ్చే నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీసుకుంది. ఈనెల 30 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు భారత్–శ్రీలంక వేదికగా జరిగే మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో విజేతతో పాటు రన్నరప్, ఇతర నగదు పురస్కారాన్ని భారీగా పెంచింది. గత టోరీ్నతో పోలిస్తే మొత్తం ప్రైజ్‌మనీ దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. 2025 వన్డే వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచే జట్టుకు 48 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 42 లక్షలు) లభిస్తాయి. 2022 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఇది 239 శాతం ఎక్కువ కావడం విశేషం. ఫైనల్లో ఓడిన జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 70 లక్షలు) అందుకుంటుంది. సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లకు 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 85 లక్షలు) చొప్పున లభిస్తాయి. గ్రూప్ దశలో ప్రతి విజయానికి ఒక్కో జట్టు 34,314 డాలర్ల (రూ. 30 లక్షల 18 వేలు) చొప్పున అందుకుంటుంది. 5వ, 6వ స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 15 లక్షలు) చొప్పున... 7వ, 8వ స్థానాల్లో నిలిచిన రెండు జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 46 లక్షలు) చొప్పున ఇస్తారు. మొత్తంగా ఈ టోర్నీ కోసం 1 కోటీ 38 లక్షల 80 వేల డాలర్లు (రూ. 122 కోట్ల 10 లక్షలు) ప్రైజ్‌మనీగా కేటాయించారు. గత టోర్నీ ప్రైజ్‌మనీ 35 లక్షల డాలర్లతో పోలిస్తే ఏకంగా 297 శాతం పెరగడం పెద్ద విశేషం. రెండేళ్ల క్రితం భారత్‌లో జరిగిన పురుషుల వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఇంతకంటే తక్కువ ప్రైజ్‌మనీనే (సుమారు రూ.88.26 కోట్లు) ఉంది. ‘మహిళల క్రికెట్‌ను మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు పురుషులతో సమానంగా గుర్తింపు ఇవ్వడమే ఐసీసీ లక్ష్యం. దానికి అనుగుణంగానే ఈ భారీ ప్రైజ్‌మనీ పెంపుదలను నిర్ణయించాం. ఈ పెరుగుదల మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త మలుపుగా నిలిచిపోతుంది’ అని ఐసీసీ చైర్మన్ జై షా ప్రకటించారు. -
చిన్నస్వామిలో క్రికెట్ బంద్!
న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్ వేదికల జాబితా నుంచి బెంగళూరును తొలగించారు. ఇక్కడ జరగాల్సిన మ్యాచ్‌లను నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియానికి తరలించారు. టోర్నీకి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న భారత్, శ్రీలంక మధ్య చిన్నస్వామి స్టేడియంలో సెప్టెంబర్ 30న తొలి మ్యాచ్‌తో పాటు మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ మ్యాచ్‌ల నిర్వహణకు బెంగళూరు పోలీసుల నుంచి అనుమతి పొందడంలో కర్నాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) విఫలమైంది. ఐపీఎల్–2025లో విజేతగా నిలిచిన అనంతరం జూన్ 4న ఇక్కడ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించిన సంబరాల్లో ప్రమాదవశాత్తూ 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన దర్యాప్తులో ఆర్సీబీ యాజమాన్యాన్ని, కేఎస్‌సీఏను తప్పు పట్టిన కమిటీ... చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌లు నిర్వహించేదుకు సురక్షితం కాదని తేల్చింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అధికారులు ఈ స్టేడియానికి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. ఇలాంటి స్థితిలో వరల్డ్ కప్ కోసం అనుమతి సాధించడం అసాధ్యంగా మారింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కేఎస్‌సీఏ హామీ ఇచ్చినా పోలీసులు స్పందించలేదు. ఇదే కారణంతో ఇంతకు ముందే అసోసియేషన్ తమ ఫ్రాంచైజీ టోర్నీ మహరాజా ట్రోఫీని బెంగళూరు నుంచి మైసూరుకు తరలించింది. తాజా పరిణామాలన్నీ ఐసీసీ మ్యాచ్‌ల నిర్వహణా నిబంధనలకు ప్రతికూలంగా ఉండటంతో బెంగళూరు నుంచి మ్యాచ్‌లు తరలించాల్సి వచ్చింది. బెంగళూరులో సాధ్యం కాకపోతే తాము తిరువనంతపురంలో మ్యాచ్‌లు నిర్వహిస్తామని కేరళ సంఘం ముందుకు వచ్చినా... అక్కడి నుంచి ప్రధాన నగరాలకు తగినన్ని ఫ్లయిట్లు అందుబాటులో లేకపోవడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టారు. డీవై పాటిల్ స్టేడియంలో సెమీఫైనల్‌తో పాటు పాక్ అర్హత సాధించకపోతే ఫైనల్‌ను కూడా నిర్వహిస్తారు. ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీకి నవీ ముంబైతో పాటు విశాఖపట్నం, గువహటి, ఇండోర్, కొలంబో ఆతిథ్యం ఇస్తాయి. -
వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియా ప్రకటన.. డ్యాషింగ్ బ్యాటర్‌కు దక్కని చోటు
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఇవాళ (ఆగస్ట్ 19) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధన కొనసాగనున్నారు. యువ డాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. గాయం కారణంగా చాలాకాలం ఆటకు దూరంగా ఉన్న పేసర్ రేణుకా ఠాకూర్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకుంది. తేజల్ హసబ్నిస్ , ప్రేమ రావల్, ప్రియా మిశ్రా, ఉమా చెత్రీ, మిన్నూ మణి, సయాలీ సత్ఘరే స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు. వరల్డ్‌కప్ టోర్నీ సెప్టెంబర్ 30న మొదలవుతుంది. ఓపెనింగ్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి. అక్టోబర్ 5న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అక్టోబర్ 9న భారత్ సౌతాఫ్రికాతో తలపడుతుంది. అక్టోబర్ 12న ఆస్ట్రేలియా, అక్టోబర్ 19న ఇంగ్లండ్, అక్టోబర్ 23న న్యూజిలాండ్, అక్టోబర్ 26న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడాల్సి ఉంది.వన్డే ప్రపంచకప్-2025 కోసం భారత మహిళల క్రికెట్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్‌కీపర్), యాస్తికా భాటియా (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, స్నేహ్ రాణా, అమన్‌జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్మెగా టోర్నీకి ముందు భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే సెప్టెంబర్ 14న, రెండో వన్డే 17న, మూడో వన్డే సెప్టెంబర్ 20న జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఒక్క మార్పు మినహా వరల్డ్‌కప్‌కు ప్రకటించిన జట్టునే కొనసాగించనున్నారు. ఆసీస్ సిరీస్‌లో అమన్‌జోత్ స్థానంలో సయాలీ సత్ఘరే ఆడనుంది. -
‘స్పిన్ సవాలు ఎదుర్కోవాల్సిందే’
బ్రిస్బేన్: భారత్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్‌లో స్పిన్ సవాలు ఎదురవడం ఖాయమని ఆ్రస్టేలియా మహిళల జట్టు కెప్టెన్ అలీసా హీలీ పేర్కొంది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ఏడుసార్లు వరల్డ్‌కప్ టైటిల్ గెలుచుకున్న ఆ్రస్టేలియా జట్టు ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. 2022లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ఆసీస్ ఘనవిజయం సాధించగా... డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అదే తీవ్రత కొనసాగించాలని భావిస్తున్నట్లు హీలీ వెల్లడించింది. భారత మహిళల ‘ఎ’ జట్టుతో మూడో వన్డేలో హీలీ అజేయ శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం హీలీ మాట్లాడుతూ... భారత్, శ్రీలంక వేదికగా వచ్చే నెలలో ప్రారంభంకానున్న వరల్డ్‌కప్‌లో స్పిన్ కీలక పాత్ర పోషించనుందని వెల్లడించింది. ‘భారత్ ‘ఎ’ జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వరల్డ్‌కప్‌లో మాకు మరింత స్పిన్ సవాలు ఎదురుకానుంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం కీలకం’ అని హీలీ పేర్కొంది. ఆ్రస్టేలియా ‘ఎ’తో వన్డే సిరీస్‌లో భారత ‘ఎ’ జట్టు తరఫున రాధ యాదవ్, మిన్ను మణి, తనూజ కన్వర్, ప్రేమ రావత్ స్పిన్ బాధ్యతలు నిర్వర్తించారు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన హీలీ... రెండో వన్డేలో 91 పరుగులతో సెంచరీ చేజార్చుకుంది. ఇక ఆదివారం జరిగిన సిరీస్ చివరి వన్డేలో 85 బంతుల్లోనే 23 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 137 పరుగులు చేసి ఫామ్ చాటుకుంది. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు హీలీ సత్తాచాటడం ఆ్రస్టేలియా జట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆసీస్ మహిళల ‘ఎ’ జట్టు కోచ్ డాన్ మార్‡్ష అన్నాడు. ‘భారత్‌లో వన్డే ప్రపంచకప్ వంటి మెగాటోర్నీకి ముందు అలీసాకు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దక్కింది. భారత ‘ఎ’ జట్టుతో టి20, వన్డే సిరీస్‌లతో హీలీ చక్కటి ప్రదర్శన కనబర్చింది. చివరి వన్డేలో సాధించిన అజేయ శతకం మెగా టోర్నీకి ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది’ అని మార్‡్ష పేర్కొన్నాడు. -
WC 2011: ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి... వారిద్దరి సలహాల వల్లే..: యువీ
గెలిస్తే పొంగిపోవద్దు.. ఓటములకు కుంగిపోవద్దు.. గెలిచినపుడు ఆకాశానికి ఎత్తిన వాళ్లే.. కీలక సమయాల్లో ఓడిపోతే విమర్శలు, తిట్లతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం అధఃపాతాళానికి జారుకునేలా చేస్తారు. అయితే, అలాంటపుడే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తే.. సూపర్ కదా!2011లో తాము కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నామని టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) అన్నాడు. వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో తాము చేసిన తప్పిదాల వల్ల విమర్శల పాలయ్యామని.. అయితే, సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తమ స్ఫూర్తిదాయక మాటలతో ఆత్మవిశ్వాసం నింపారని తెలిపాడు.ఈసారి ఎలాగైనా కప్ గెలవాలికాగా మహిళల ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2025 (ICC Women's ODI World Cup)కి ఈ ఏడాది శ్రీలంకతో కలిసి భారత్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 30- నవంబరు 2 వరకు జరిగే ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఈసారి ఎలాగైనా కప్ గెలవాలనే పట్టుదలతో ఉంది.మన మహిళల జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందుకోలేదు. 2005, 2017 వన్డే వరల్డ్‌కప్ టోర్నీల్లో ఫైనల్ వరకు చేరినా రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. అయితే, ఈసారి పాత తప్పిదాలు పునరావృతం చేయకుండా గెలిచి తీరతామని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది. ఈ మెగా టోర్నీ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం జరిగిన ఈవెంట్లో యువరాజ్ సింగ్ కూడా పాల్గొన్నాడు.అప్పుడు మాపై తీవ్ర వ్యతిరేకతఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టులో ఆత్మవిశ్వాసం నింపేలా.. 2011 నాటి పరిస్థితుల గురించి యువీ పంచుకున్నాడు. ‘‘అప్పటికి ఏ క్రికెట్ జట్టు కూడా సొంతగడ్డపై ఐసీసీ ట్రోఫీని గెలవనే లేదు. అంతేకాదు 28 ఏళ్లుగా భారత్ మళ్లీ వరల్డ్‌కప్ దక్కించుకోలేదు.కాబట్టి అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ టై చేసుకున్నాం.. ఈ తర్వాత సౌతాఫ్రికాతో గెలిచే మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాం. అప్పుడు మాపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.టీవీ చూడొద్దు.. హెడ్ఫోన్లు ఆన్‌లో పెట్టుకోండిఆ సమయంలో సచిన్ టెండుల్కర్, కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ‘మనం ఈ టోర్నమెంట్లో విజయం సాధించాలంటే ఈ పనులు తప్పక చేయాలి.. మొదటిది.. ఎవరూ కూడా టీవీ చూడొద్దు.అంతేకాదు.. ఎవరూ వార్తా పత్రికలు చదవొద్దు. అంతేకాదు గ్రౌండ్‌కు వెళ్లే సమయంలో మీ హెడ్ఫోన్లు ఆన్‌లో పెట్టుకోండి. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించండి. ఆ తర్వాత మళ్లీ డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లే సమయంలో హెడ్‌ఫోన్స్ ఆన్ చేసుకోండి.ధోని సేనదే ట్రోఫీబయటి నుంచి వచ్చే మాటలను మీరు పట్టించుకోవద్దు. అలాంటపుడే మనం అనుకున్న ఫలితాన్ని రాబట్టగలుగుతాం’ అని చెప్పారు’’ అని యువీ పేర్కొన్నాడు. ఇక దిగ్గజాల సూచనను పాటించిన ధోని సేన ఫైనల్‌కు చేరడమే కాదు.. శ్రీలంకను వాంఖడేలో ఓడించి నాటి వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకుంది కూడా!!.. నాటి ఈ టోర్నీలో యువీ ఆద్యంతం అద్భుతంగా ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.చదవండి: ఆసియా కప్ 2025కు టీమిండియా ఇదే..? -
వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. భారత్ ఎవరితో ఆడనుందంటే..?
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ నిన్న (జులై 15) విడుదలైంది. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 25-28 మధ్య తేదీల్లో జరుగనున్నాయి. వరల్డ్‌కప్ మెయిన్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 20 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు జరుగనున్నాయి.ప్రపంచకప్‌కు అర్హత సాధించిన 8 జట్లు వార్మప్ మ్యాచ్‌ల్లో పాల్గొంటాయి. ఆస్ట్రేలియా మినహా ప్రతి జట్టు రెండ్రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. వార్మప్ మ్యాచ్‌ల కోసం నాలుగు వేదికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వార్మప్ మ్యాచ్‌ల్లో భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్లు కూడా పాల్గొంటాయి. శ్రీలంక-ఏ జట్టు రెండు, భారత-ఏ జట్టు ఓ మ్యాచ్ ఆడనుంది.వార్మప్ మ్యాచ్‌ల్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 25న భారత్, ఇంగ్లండ్ మధ్య బెంగళూరు వేదికగా జరుగనుంది. వరల్డ్‌కప్ సన్నాహకంగా మొత్తం 9 వార్మప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. భారత్ రెండో వార్మప్ మ్యాచ్ కూడా బెంగళూరులోనే సెప్టెంబర్ 27న న్యూజిలాండ్‌తో జరుగనుంది. అన్ని వార్మప్ మ్యాచ్‌లు డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతాయి.వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్..25 సెప్టెంబర్: ఇండియా v ఇంగ్లాండ్, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, బెంగళూరు, 3 PM25 సెప్టెంబర్: దక్షిణాఫ్రికా v న్యూజిలాండ్, M. చిన్నస్వామి, బెంగళూరు, 3 PM25 సెప్టెంబర్: శ్రీలంక v పాకిస్థాన్, కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో, 3 PM25 సెప్టెంబర్: బంగ్లాదేశ్ v శ్రీలంక ‘ఎ’, ఆర్.ప్రేమదాస, కొలంబో, 3 PM27 సెప్టెంబర్: ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, బెంగళూరు, 3 PM27 సెప్టెంబర్: భారత్ v న్యూజిలాండ్, ఎం. చిన్నస్వామి, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు27 సెప్టెంబర్: శ్రీలంక v బంగ్లాదేశ్, కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో, 3 PM28 సెప్టెంబర్: దక్షిణాఫ్రికా v ఇండియా ‘ఎ’, BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, బెంగళూరు, 3 PM28 సెప్టెంబర్: పాకిస్తాన్ v శ్రీలంక ‘ఎ’, కొలంబో క్రికెట్ క్లబ్, కొలంబో, 3 PM -
భారత్ తొలి ప్రత్యర్థి శ్రీలంక
దుబాయ్: భారత గడ్డపై మరోసారి మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీకి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు వేర్వేరు వేదికలపై ఈ టోర్నమెంట్ జరుగుతుంది. గతంలో 1978, 1997, 2013లలో భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈసారి శ్రీలంకతో కలిసి సంయుక్తంగా టోర్నీని నిర్వహించనుంది. సెప్టెంబర్ 30న తొలి మ్యాచ్ జరగనుండగా, నవంబర్ 2న జరిగే ఫైనల్‌తో వరల్డ్ కప్ ముగుస్తుంది. 28 లీగ్ మ్యాచ్‌లు, 3 నాకౌట్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో భారత్‌లోని నాలుగు వేదికలు బెంగళూరు, ఇండోర్, గువహటి, విశాఖపట్నంలతో పాటు శ్రీలంకలోని కొలంబో స్టేడియం కూడా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. ప్రపంచ కప్‌లో 8 జట్లు పాల్గొంటుండగా... ఎప్పటిలాగే రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ప్రతీ టీమ్ మిగతా 7 ప్రత్యర్థులతో తలపడుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి. ఇప్పటి వరకు మొత్తం 12 వరల్డ్ కప్‌లు జరగ్గా భారత్ 10 టోర్నీల్లో పాల్గొంది. ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేకపోయిన మన టీమ్... రెండుసార్లు (2005, 2017) ఫైనల్ వరకు చేరడమే అత్యుత్తమ ప్రదర్శన. సెప్టెంబర్ 30న బెంగళూరు వేదికగా జరిగే తొలి పోరులో శ్రీలంకతో భారత్ తలపడుతుంది. సొంతగడ్డపై ఈసారైనా మన మహిళలు సత్తా చాటి ట్రోఫీ సాధిస్తారా అనేది ఆసక్తికరం. వరల్డ్ కప్‌లో భాగంగా సాగర తీరం విశాఖపట్నంలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో భారత్ ఆడే 2 మ్యాచ్‌లు ఉండటం విశేషం. శ్రీలంకలో పాకిస్తాన్ మ్యాచ్లుపురుషుల క్రికెట్ తరహాలో మహిళల క్రికెట్లోనూ భారత్, పాకిస్తాన్ జట్లు ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య అక్టోబర్ 5న జరిగే పోరుకు కొలంబో వేదికవుతోంది. సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఇలాంటి సమయంలో ఐసీసీ టోర్నీలోనూ భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా అనే సందేహాలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజా షెడ్యూల్ ప్రకటనతో మ్యాచ్ ఖాయమైనట్లు తేలింది. ఈ ఏడాది పురుషుల చాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వగా... భారత్ మాత్రం అక్కడికి వెళ్లేందుకు నిరాకరించింది. ఫలితంగా మన మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే జరిగాయి. దాంతో తాము కూడా మహిళల వరల్డ్ కప్‌కు భారత్‌కు రాలేమని, మరో చోట మ్యాచ్‌లు జరపాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది. దీనికి అంగీకరించిన ఐసీసీ పాక్ మ్యాచ్‌లను తటస్థ వేదిక శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయించింది. పాక్ సెమీస్ చేరితే కొలంబోలో మ్యాచ్ ఆడుతుంది. లేదంటే తొలి సెమీస్ గువహటిలో జరుగుతుంది. అదే తరహాలో పాక్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మ్యాచ్ కొలంబోలోనే నిర్వహి స్తారు. పాక్ చేరకపోతే ఫైనల్ బెంగళూరులో జరుగుతుంది. -
వన్డే వరల్డ్‌కప్ ఫిక్చర్స్ విడుదల.. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?
మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫిక్చర్స్‌ను ఐసీసీ ఇవాళ (జూన్ 16) విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్ 30-నవంబర్ 2 మధ్యలో భారత్, శ్రీలంక వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంక ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది. భారత్-శ్రీలంక మ్యాచ్ మాత్రం భారత్‌లోనే జరుగనుంది.టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో (సెప్టెంబర్ 30) టీమిండియా శ్రీలంకతో బెంగళూరు వేదికగా తలపడనుంది. అక్టోబర్ 29న తొలి సెమీఫైనల్ (గౌహతి లేదా కొలొంబో (పాక్ క్వాలిఫై అయితే)), 30న రెండో సెమీఫైనల్ (బెంగళూరు) జరుగనున్నాయి. నవంబర్ 2న ఫైనల్ (బెంగళూరు లేదా కొలొంబో) జరుగుతుంది. మహిళల వన్డే వరల్డ్‌కప్ 12 ఏళ్ల తర్వాత భారత్‌లో జరుగుతుంది.భారత్‌లోని చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు), ఏసీఏ స్టేడియం (గౌహతి), హోల్కర్ స్టేడియం (ఇండోర్), ఏసీఏ-వీడిసీఏ స్టేడియంలో (విశాఖపట్నం) మ్యాచ్‌లు జరుగుతాయి. శ్రీలంకలో ప్రేమదాస స్టేడియంలో (కొలంబో) మ్యాచ్‌లు జరుగుతాయి.ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు (భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్) పాల్గొంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను ఓడించి ఏడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నీలో అత్యంత విజయంవంతమైన జట్టు ఆస్ట్రేలియానే.పాకిస్తాన్ మ్యాచ్‌లు కొలొంబోలో ఎందుకు..?ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడే మ్యాచ్‌లు కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి. పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ భారత్‌లో పర్యటించదు. ఆ టోర్నీ పాకిస్తాన్లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టలేదు.భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్దతి ప్రకారం దుబాయ్‌లో జరిగాయి. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం పాకిస్తాన్ కూడా భారత్‌లో ఆడదని అప్పుడే ఒప్పందం చేసుకున్నారు.🚨 SCHEDULE OF WOMEN's ODI WORLD CUP 2025 🚨 pic.twitter.com/n1nB6iYi14— Johns. (@CricCrazyJohns) June 16, 2025భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడంటే..?ఈ మెగా టోర్నీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబోలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. గ్రూప్ దశతో భారత్ మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. దాని షెడ్యూల్ కింది విధంగా ఉంది.మంగళవారం, సెప్టెంబర్ 30—భారత్ vs శ్రీలంక—బెంగళూరు—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 5—భారత్ vs పాకిస్తాన్—కొలంబో—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 9—భారత్ vs దక్షిణాఫ్రికా—వైజాగ్—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 19—భారత్ vs ఇంగ్లాండ్—ఇండోర్—మధ్యాహ్నం 3గురువారం, అక్టోబర్ 23—భారత్ vs న్యూజిలాండ్—గౌహతి—మధ్యాహ్నం 3ఆదివారం, అక్టోబర్ 26—భారత్ vs బంగ్లాదేశ్—బెంగళూరు—మధ్యాహ్నం 3 -
వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి పాక్ అర్హత
లాహోర్: ఈ ఏడాది సెప్టెంబర్ –అక్టోబర్లలో భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ జట్టు అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరుగుతున్న వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో టాప్–2లో నిలిచిన జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు లభిస్తాయి. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 87 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 205 పరుగులు చేసింది. సిద్రా అమిన్ (80; 9 ఫోర్లు), కెపె్టన్ సనా ఫాతిమా (62 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం థాయ్‌లాండ్ జట్టు 34.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లలో సనా ఫాతిమా, నష్రా సంధూ, రమీన్ షమీమ్ 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. ఎనిమిది పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శనివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయినా ఆ జట్టుకు వచ్చిన ఢోకా లేదు.బంగ్లాదేశ్ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందుతుంది. బంగ్లాదేశ్ ఓడిపోయి... వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈ మూడు జట్లు 6 పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. రన్‌రేట్ పరంగా బంగ్లాదేశ్‌కే మరో బెర్త్ దక్కే అవకాశం ఉంది. -
బంగ్లాదేశ్‌ను గెలిపించిన రీతూ
లాహోర్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు జోరు కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. లౌరా డెలానీ (75 బంతుల్లో 63; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా... ప్రెండర్‌గాస్ట్ (41), అమీ హంటర్ (33) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రాబియా ఖాన్ 3, ఫహిమా ఖాతూన్ 2 వికెట్లు పడగొట్టారు.అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ మహిళల జట్టు 48.4 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఒకదశలో బంగ్లాదేశ్ 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే రీతూ మోనీ (61 బంతుల్లో 67 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) లోయర్ ఆర్డర్ బ్యాటర్ల సహకారంతో బంగ్లాదేశ్‌ను విజయతీరానికి చేర్చింది. అంతకుముందు కెప్టెన్ నిగార్ సుల్తానా (68 బంతుల్లో 51; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకుంది. ఐర్లాండ్ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్, అర్లీనా కెల్లి చెరో 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బంగ్లాదేశ్ 4 పాయింట్లతో పట్టిక అగ్రస్థానానికి చేరింది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం స్కాట్లాండ్తో బంగ్లాదేశ్ తలపడుతుంది. స్కాట్లాండ్ రెండో విజయం మరోవైపు స్కాట్లాండ్ జట్టు కూడా రెండో విజయం సాధించింది. థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ 58 పరుగుల తేడాతో గెలిచింది. మొదట స్కాట్లాండ్ 41 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ క్యాథరిన్ బ్రైస్ (58 బంతుల్లో 60; 7 ఫోర్లు), మేగన్ మెక్కాల్ (60 బంతుల్లో 57; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు.అలీసా లిస్టర్ (38; 6 ఫోర్లు) రాణించింది. అనంతరం లక్ష్యఛేదనలో థాయ్‌లాండ్ జట్టు 31.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఈ టోర్నమెంట్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరగనున్న మహిళల వన్డే ప్రపంచకప్‌నకు అర్హత సాధిస్తాయి. -
ముల్లాన్‌పూర్‌లో మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్ వేదికల వివరాలు బహిర్గతమయ్యాయి. ముల్లాన్‌పూర్ (పంజాబ్)లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ స్టేడియం ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుందని సమాచారం. 34 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంగల ఈ స్టేడియం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు రెండో హోంగ్రౌండ్‌గా ఉంది.ముల్లాన్పూర్తోపాటు విశాఖపట్నం, తిరువనంతపురం, ఇండోర్, రాయ్‌పూర్‌లలో వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ముల్లాన్‌పూర్, తిరువనంతపురం, రాయ్‌పూర్‌లలో ఇప్పటి వరకు మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగలేదు. » అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్ ఈ ఏడాది సెపె్టంబర్ 29 నుంచి అక్టోబర్ 26 వరకు జరగనుంది. అయితే ఈ తేదీలను ఐసీసీ, బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. » ఎనిమిది దేశాల మధ్య వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆతిథ్య దేశం భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించాయి. » ఏప్రిల్ 9 నుంచి 19 వరకు లాహోర్‌లో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా చివరి రెండు జట్లు ఖరారవుతాయి. క్వాలిఫయింగ్ టోర్నీలో పాకిస్తాన్, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, థాయ్‌లాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తారు. పాకిస్తాన్ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంక లేదా యూఏఈలలో నిర్వహిస్తారు. » భారత్ నాలుగోసారి మహిళల వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. గతంలో భారత్ 1978, 1997, 2013లలో ఈ మెగా టోర్నీని నిర్వహించింది. ఇప్పటి వరకు వన్డే వరల్డ్‌కప్ 12 సార్లు జరగ్గా... భారత్ రెండుసార్లు (2005, 2017) రన్నరప్‌గా నిలిచింది. -
మహిళల ప్రపంచకప్ కోసం...
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ ఆతిథ్యమివ్వబోయే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఈ నెల 22న కోల్‌కతాలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కానుంది. అదే రోజు అక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆర్గనైజింగ్ కమిటీపై కసరత్తు పూర్తి చేయనుంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పొగాకు, మద్యం ఉత్పాదనలకు సంబంధించిన ప్రకటనలు క్రికెట్ మైదానంలో నిషేధం, క్రిప్టో కరెన్సీపై గట్టి నిర్ణయం కూడా తీసుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్‌లో వన్డే మెగా ఈవెంట్ జరగాల్సి ఉంది. ఈ కౌన్సిల్ అజెండాలో కమిటీ ఏర్పాటుతో పాటు మెగా ఈవెంట్ వేదికలపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు 2025–26 దేశవాళీ సీజన్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారని, అలాగే భారత పర్యటనకు వచ్చే వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలతో ద్వైపాక్షిక సిరీస్ వేదికలపై కూడా అపెక్స్ కౌన్సిల్ చర్చించే అవకాశముందని బోర్డు వర్గాలు తెలిపాయి. పొగాకు, మద్యం ప్రకటనలపై ఇదివరకే ఐపీఎల్ సీజన్లో విధించిన నిషేధాన్ని బోర్డు అమలు చేయనుంది. టీమిండియా పురుషుల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను రెండుసార్లు గెలిచినప్పటికీ... భారత మహిళల జట్టుకు మాత్రం ఆ ‘కప్’ అందని ద్రాక్షే అయ్యింది. ఫైనల్ చేరిన రెండు సార్లు కూడా అమ్మాయిల జట్టు రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సేన కనీసం ఈ ఏడాదైన సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతుందో చూడాలి! -
50 ఏళ్ల క్రితమే వరల్డ్‌కప్ కొట్టింది.. ఇప్పటికీ అవార్డులు
ఎనిడ్ బెక్వెల్.. ఇంగ్లీష్ మహిళా క్రికెట్లో తనకంటూ ప్రత్యేక పేజీని రూపొందించుకుంది. ఇంగ్లండ్ మహిళా ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఎనిడ్ బెక్వెల్ ఖాతాలో ఒక వన్డే ప్రపంచకప్ ఉండడం విశేషం. ఇక 1968 నుంచి 1979 వరకు ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టులతో పాటు 23 వన్డే మ్యాచ్‌లు ఆడింది. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఎనిడ్ బెక్వెల్ 12 టెస్టుల్లో 1078 పరుగులతో పాటు 50 వికెట్లు, 23 వన్డేల్లో 500 పరుగులతో పాటు 25 వికెట్లు పడగొట్టింది. ఇక 1973లో ఆస్ట్రేలియాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆమె ప్రదర్శన ఎవరు అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఎందుకంటే ఆరోజు జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌లో రాణించిన బెక్వెల్ సెంచరీతో(118 పరుగులు) మెరిసింది. అనంతరం బౌలింగ్‌లో 12 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్ అనే పదానికి నిర్వచనం చెప్పింది. 1973 వరల్డ్‌కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఎనిడ్ బెక్వెల్.. వరల్డ్‌కప్ సాధించి 50 ఏళ్లు కావొస్తున్నా ఇంకా అవార్డులు అందుకుంటూనే ఉందట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఎంత వరల్డ్‌కప్ గెలిచినా మహా అయితే పొగుడడం తప్పిస్తే ప్రతీ ఏడాది అవార్డులు ఇవ్వడం కుదరదు. కానీ ఎనిడ్ బెక్వెల్ అందుకు మినహాయింపు. 1973 నుంచి చూసుకుంటే గత 50 ఏళ్లుగా ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికి 82 ఏళ్ల వయసులోనే మొకాళ్లు సహకరించకపోయినప్పటికి రెగ్యులర్‌గా మైదానంలో క్రికెట్ ఆడుతూనే కనిపిస్తుంది. తాజాగా ఎనిడ్ బెక్వెల్ క్రికెట్ ఆడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానానికి ఒక హద్దు ఉంటుంది.. కానీ ఎనిడ్ బెక్వెల్ విషయంలో మాత్రం అది తప్పని నిరూపితమైంది. చదవండి: Rishabh Pant: కోలుకోవడానికే ఆరు నెలలు.. ఈ ఏడాది కష్టమే -
భారత్‌లో 2025 మహిళల వన్డే ప్రపంచకప్
దుబాయ్: భారత్ మరో క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు. ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. ఇవన్నీ రొటీన్ ఈవెంట్లు... అయితే ఈ ఎఫ్టీపీలో కొత్తగా మహిళల చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి చోటిచ్చారు. ఈ టోర్నీని 2027లో శ్రీలంకలో నిర్వహిస్తారు. టి20 ఫార్మాట్లో ఆరు జట్లే పాల్గొనే ఈ టోర్నీలో శ్రీలంక అర్హత సాధిస్తేనే ఆతిథ్య వేదికవుతుంది. లేదంటే మరో దేశానికి ఆతిథ్య అవకాశం దక్కుతుంది. -
Starc-Healy: నాడు భర్త, నేడు భార్య.. చరిత్ర సృష్టించిన ఆసీస్ జంట
మహిళల వన్డే ప్రపంచకప్ 2022 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) భారీ శతకంతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీకి జతగా మరో ఓపెనర్ రేచల్ హేన్స్ (68), వన్ డౌన్ బ్యాటర్ మూనీ (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నతాలీ స్కీవర్ (121 బంతుల్లో 148 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) ఒంటరిపోరాటం చేసినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ (3/64), జెస్ జోనాస్సెన్ (3/57), మెగాన్ షట్ (2/42) ధాటికి 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నతాలీ మినహా మరే ఇతర బ్యాటర్ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో పాటు వెస్టిండీస్‌తో జరిగిన సెమీస్‌లోనూ శతకం (129) బాదిన అలీసా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. Alyssa Healy gives another master class in a World Cup final. 170 runs from 138 balls as Australia fly high @cricketworldcup #CWC22 #Final #TeamAustralia pic.twitter.com/ZcXNrvLMDY — Anjum Chopra (@chopraanjum) April 3, 2022 కాగా, 2022 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 56.56 సగటున 2 సెంచరీలు, 2 హాఫసెంచరీల సాయంతో 509 పరుగులు చేసిన ఆసీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అలీసా హీలీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 🔥 Player of the Match of #T20WorldCup 2020 Final 🔥 Player of the Match of #CWC22 Final Champion, @ahealy77 👑 pic.twitter.com/TxvRbbffDy — ICC Cricket World Cup (@cricketworldcup) April 3, 2022 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హీలీ తాజాగా ఆ ఘనతను మరోసారి సాధించింది. ఇదిలా ఉంటే.. హీలీ భర్త, స్టార్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ 2015 పురుషుల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2015లో భర్త ఆసీస్ వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించగా.. తాజాగా భార్య తన దేశాన్ని ఏడోసారి జగజ్జేతగా నిలిపింది. చదవండి: World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా -
వారెవా వ్యాట్... సిక్సర్ సోఫీ..!
క్రైస్ట్‌చర్చ్: డిఫెండింగ్ చాంపియన్, నాలుగు సార్లు ప్రపంచ కప్ విజేత ఇంగ్లండ్ జట్టు మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఈ టోర్నీ తొలి మూడు మ్యాచ్‌లలో ఓడి ఒక దశలో లీగ్ స్థాయిలోనే నిష్క్రమించేలా కనిపించిన టీమ్...మ్యాచ్ మ్యాచ్‌కు పదునైన ఆటను ప్రదర్శిస్తూ ఆరో సారి మెగా టోర్నీలో తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ 137 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 293 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డ్యానీ వ్యాట్ (125 బంతుల్లో 129; 12 ఫోర్లు) శతకంతో చెలరేగగా, సోఫీ డన్‌క్లీ (72 బంతుల్లో 60; 4 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 116 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 38 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. డు ప్రీజ్ (30)దే అత్యధిక స్కోరు. లెఫ్టార్మ్ స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ (6/36) ఆరు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఆరు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. శతక భాగస్వామ్యం... ఓపెనర్ బీమాంట్ (7), కెప్టెన్ హీతర్ నైట్ (1), సివర్ (15) విఫలం కాగా, ఎమీ జోన్స్ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. అయితే వ్యాట్, డన్‌క్లీ కలిసి భారీ స్కోరుకు బాటలు వేశారు. వీరిద్దరిని నిలువరించేందుకు దక్షిణాఫ్రికా తీవ్రంగా ప్రయత్నించి విఫలమైంది. ఒకటి కాదు రెండు కాదు...ఏకంగా వ్యాట్ ఇచ్చిన ఐదు క్యాచ్‌లు వదిలేసి (22, 36, 77, 116, 117 పరుగుల వద్ద) సఫారీ టీమ్ ప్రత్యర్థికి మేలు చేసింది! ఈ క్రమంలో 98 బంతుల్లోనే వ్యాట్ సెంచరీ పూర్తయింది. ఎట్టకేలకు పార్ట్నర్షిప్ వంద పరుగులు దాటిన తర్వాత 45వ ఓవర్లో వ్యాట్ వెనుదిరిగింది. చివరి 10 ఓవర్లలో ఇంగ్లండ్ 75 పరుగులు చేసింది. టపటపా... 2017 వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్ చేతిలో సెమీస్‌లోనే ఓడిన దక్షిణాఫ్రికా ఈ సారీ అదే తరహాలో వెనుదిరిగింది. ఛేదనలో ఆ జట్టు ఏ దశలోనూ కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. టోర్నీలో టాప్ స్కోరర్ అయిన లౌరా వాల్వార్ట్ (0) డకౌట్‌తో దక్షిణాఫ్రికా పతనం మొదలు కాగా, ఆ తర్వాత ఒక్కరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దలేకపోయారు. 67/4 తర్వాత ఎకెల్‌స్టోన్ జోరు మొదలైంది. తర్వాతి ఆరు వికెట్లూ ఆమె ఖాతాలోనే చేరడం విశేషం. -
మిథాలీ రాజ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు .. ప్రపంచకప్ చరిత్రలో..!
Mithali Raj: భారత మహిళా క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (84 బంతుల్లో 68; 8 ఫోర్లు) చేసిన ఆమె.. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత లేటు వయసులో ఈ ఘనత సాధించిన భారత మహిళా బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించింది. Youngest Indian to score 50 in WC - Mithali Raj Oldest Indian to score 50 in WC - Mithali Raj Pure class, quality and longevity. Well done, skip @M_Raj03 🙌🏾🙌🏾 pic.twitter.com/4HbpjPm12P — BCCI Women (@BCCIWomen) March 27, 2022 యాదృచ్చికంగా ప్రపంచకప్ టోర్నీల్లో అత్యంత చిన్న వయసులో, ఇదే ప్రత్యర్ధిపై (దక్షిణాఫ్రికా) హాఫ్ సెంచరీ (2000 వన్డే ప్రపంచకప్‌లో) చేసిన భారత మహిళా బ్యాటర్ రికార్డు కూడా మిథాలీ పేరిటే నమోదై ఉంది. దీంతో ప్రపంచకప్ టోర్నీల్లో అతి చిన్న వయసులో, అతి పెద్ద వయసులో ఒకే ప్రత్యర్ధిపై హాఫ్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా మిథాలీ రాజ్ రికార్డుల్లోకెక్కింది. ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికాతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. స్మృతి మంధాన (71), షఫాలీ వర్మ (53), మిథాలీ (68), హర్మాన్‌ప్రీత్ కౌర్ (48) రాణించంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఛేదనలో లారా వోల్వార్ట్ (80), లారా గూడాల్ (49), డుప్రీజ్ (51 నాటౌట్) రాణించడంతో సఫారీ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆఖరి బంతి వరకు పోరాడినప్పటికీ ఫలితంగా లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో టీమిండియా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. చదవండి: IPL 2022: లేటు వయసులో లేటెస్ట్ రికార్డు నెలకొల్పిన ధోని -
గెలిచి నిలిచాం.. బంగ్లాదేశ్‌పై భారత్ ఘనవిజయం
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ముందుకెళ్లేందుకు అవసరమైన విజయాన్ని సాధించింది. స్నేహ్ రాణా (27 పరుగులు; 4/30) ఆల్‌రౌండ్ షోతో... బంగ్లాదేశ్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా సెమీస్ అవకాశాల్ని సజీవంగా నిలబెట్టుకుంది. టాస్ నెగ్గిన మిథాలీ బృందం మొదట బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ 40.3 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో టాపార్డర్ బ్యాటర్ యస్తిక భాటియా (80 బంతుల్లో 50; 2 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (42 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 30; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. ఒకే స్కోరు వద్ద 3 వికెట్లు... షఫాలీతో తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించాక స్మృతి అవుటైంది. ఆ వెంటే 5 బంతుల వ్యవధిలో అదే స్కోరు వద్ద షఫాలీ, మిథాలీ రాజ్ కూడా (0) వెనుదిరగడంతో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో యస్తిక కీలకమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకుంది. తొలుత హర్మన్‌ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 14; 1 ఫోర్)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. తర్వాత రిచా ఘోష్ (36 బంతుల్లో 26; 3 ఫోర్లు) అండతో ఐదో వికెట్‌కు 54 పరుగులు జతచేసింది. ఇన్నింగ్స్‌ను కుదుట పరిచిన యస్తిక 79 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. మరుసటి బంతికే జట్టు స్కోరు 176 పరుగుల వద్ద ఆమె ఆరో వికెట్‌గా వెనుదిరిగింది. అనంతరం పూజ వస్త్రకర్ (33 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు), స్నేహ్ రాణాలు జట్టు స్కోరును 200 పైచిలుకు తీసుకుకెళ్లారు. బంగ్లా బౌలర్లలో రీతూ మోని 3, నహీదా 2 వికెట్లు తీశారు. తిప్పేసిన స్నేహ్ ఏమంత కష్టసాధ్యం కానీ లక్ష్యమే అయినా... భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణా తన బౌలింగ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్‌ను కనీసం లక్ష్యం దరిదాపుల్లోకి అయినా వెళ్లకుండా కట్టడి చేసింది. టాపార్డర్‌ను పూనమ్ యాదవ్ (1/25), రాజేశ్వరి గైక్వాడ్ (1/15), పూజ (2/26) కలిసి దెబ్బతీయడంతో బంగ్లా 35 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి ఓటమికి సిద్ధమైంది. ఈ ఐదుగురిలో ముర్షిదా ఖాతున్ (19) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మిడిలార్డర్లో లతా మండల్ (24), సల్మా ఖాతున్ (32) కాస్త మెరుగనిపించడంతో బంగ్లాదేశ్ 100 పరుగులు దాటింది. వెటరన్ సీమర్ జులన్ గోస్వామి 2 వికెట్లను పడగొట్టింది. తాజా విజయంతో భారత జట్టు రన్‌రేట్ పెరగడమే కాదు... 6 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా (12 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) ముందు వరుసలో ఉన్నాయి. ఈనెల 27న దక్షిణాఫ్రికాతో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మిథాలీ జట్టు గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ చేరుతుంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. -
సెమీస్‌కు చేరువయ్యేందుకు...
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు ముందుకెళ్లేందుకు మంచి అవకాశాలున్నాయి. వీటిని మెరుగుపర్చుకోవాలంటే మంగళవారం జరిగే మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు... బంగ్లాదేశ్‌పై తప్పకుండా గెలవాలి. గత మ్యాచ్‌లో ఓపెనర్లు, బౌలర్ల వైఫల్యంతో భారత్‌కు పటిష్టమైన ఆస్ట్రేలియాతో చుక్కెదురైంది. ఫలితం నిరాశపరిచినప్పటికీ సీనియర్ బ్యాటర్స్ కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో అదరగొట్టడం జట్టుకు శుభ పరిణామం. కీలక తరుణంలో వీళ్లంతా ఫామ్‌లో ఉంటే ఒక్క సమష్టి ప్రదర్శన ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. ఓపెనింగ్‌లో స్మృతి మంధాన, షఫాలీ వర్మలు కూడా రాణిస్తే ప్రత్యర్థిపై భారీ స్కోరు సాధ్యమవుతుంది. దీంతో పాటు బౌలర్లు కూడా బాధ్యత తీసుకుంటే జట్టు విజయానికి బాట పడుతుంది. ‘సెమీస్’ చేజారకుండా ఉంటుంది. కొత్త ఉత్సాహంతో... మిథాలీ సేన వరుసగా ఓడిన గత మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇంగ్లండ్‌తో బ్యాటర్ల వైఫల్యం, ఆస్ట్రేలియాతో పసలేని బౌలింగ్ జట్టు ఫలితాలను మార్చేసింది. ఇప్పుడు ఈ లోపాలపై దృష్టిపెట్టిన టీమ్ మేనేజ్మెంట్... జట్టుపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేసే పనిలో పడింది. వెటరన్ సీమర్ జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్‌లు వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్స్‌ను ఇరకాటంలో పడేస్తే జట్టు పరిస్థితి మెరుగవుతుంది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ దాకా మన బ్యాటర్స్ పరుగులు సాధిస్తే మ్యాచ్‌లో పైచేయి సాధించొచ్చు. మరో వైపు బంగ్లాదేశ్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క పాకిస్తాన్‌పై మాత్రమే గెలిచి మూడు పరాజయాలతో రేసుకు దాదాపు దూరమైంది. ఆ గెలిచిన మ్యాచ్ మినహా మిగతా మూడు మ్యాచ్‌ల్లో బంగ్లా అత్యధిక స్కోరు 175. ఇలాంటి ప్రత్యర్థితో భారత్‌కు గెలుపు ఏమంత కష్టం కాదు. తర్వాత ఈ నెల 27న దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో మిథాలీ సేన పొరపాటున ఓడినా కూడా మూడు విజయాలతో సెమీస్ రేసులో ఉంటుంది. ఎందుకంటే కీలకమైన మ్యాచ్‌లో వెస్టిండీస్ అనూహ్యంగా పాక్ చేతిలో ఓడిపోవడం భారత్ కలిసొచ్చింది. మూడు విజయాలతో రేసులో ఉన్న విండీస్ రన్‌రేట్ దారుణంగా ఉంది. మంచి రన్‌రేట్ ఉన్న భారత్... బంగ్లాపై గెలిస్తే మరింత మెరుగవుతుంది. దీంతో రన్‌రేట్‌తో ముందంజ వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
ఇంగ్లండ్ కెప్టెన్ అద్భుత విన్యాసం.. నోర్లెళ్లబెట్టిన ప్రత్యర్ధులు.. రెప్పపాటులోనే..!
NZW VS ENGW: మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా ఆతిధ్య న్యూజిలాండ్‌తో ఇవాళ (మార్చి 20, ఆదివారం) జరిగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ వికెట్ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ కాగా, ఛేదనలో ఇంగ్లండ్ 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. ఆల్‌రౌండర్ నతాలీ స్కివర్ (108 బంతుల్లో 61; 5 ఫోర్లు) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. అంతకుముందు మ్యాడీ గ్రీన్ (52) అజేయమైన అర్ధశతకంతో రాణించడంతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోరైనా చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ చేసిన ఓ అద్భుతమైన విన్యాసం మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఇన్నింగ్స్ 39వ ఓవర్ రెండో బంతికి సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ పవర్ హిట్టర్ లీ తహుహు భారీ షాట్‌కు ప్రయత్నించగా.. ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో అద్భుతమైన క్యాచ్‌ను అందుకుంది. రెప్పపాటు సమయంలో నైట్ చేసిన ఈ విన్యాసాన్ని చూసి మైదానంలో ఉన్న వాళ్లంతా నోర్లెళ్లబెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. చదవండి: ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్ విజయం.. న్యూజిలాండ్‌కు ఇక కష్టమే! -
ఇదేం షాటయ్యా ఇది.. ప్రపంచకప్‌లో అతి భారీ సిక్సర్ బాదిన టీమిండియా బ్యాటర్
Womens World Cup 2022: టీమిండియా బ్యాటర్ పూజా వస్త్రాకర్ మహిళల ప్రపంచకప్ 2022లో అతి భారీ సిక్సర్ బాది రికార్డుల్లోకెక్కింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వస్త్రాకర్.. ఆసీస్ పేసర్ మెగాన్ షట్ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో ఏకంగా 81 మీటర్ల అతి భారీ సిక్సర్ బాది ఔరా అనిపించింది. ప్రస్తుతప్రపంచకప్లో ఇప్పటి వరకు ఇదే అత్యంత భారీ సిక్సర్ కాగా, అంతకుముందు ఈ మెగా టోర్నీలో భారత బ్యాటర్ స్మృతి మంధాన, సౌతాఫ్రికా క్రీడాకారిణి క్లో టైరన్లు 80 మీటర్ల సిక్సర్లు బాదారు. తాజాగా వస్త్రాకర్ వీరిద్దరిని అధిగమించి 2022 వన్డే ప్రపంచకప్‌లో అతి భారీ సిక్సర్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిలా ఉంటే, ఆక్లాండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. యస్తికా భాటియా (59), మిథాలీ రాజ్ (68), హర్మన్‌ప్రీత్ కౌర్ (57 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా, ఛేదనలో ఆసీస్ మహిళా జట్టు మరో 3 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుని సూపర్ విక్టరీ సాధించింది. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (97) మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ జట్టును విజయపుటంచులదాకా తీసుకురాగా, ఓపెనర్లు అలైసా హీలీ (72), రేచల్ హేన్స్ (43) విజయానికి గట్టి పునాది వేశారు. ఆఖర్లో బెత్ మూనీ (30 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చింది. చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్ -
ఆసీస్‌ను నిలువరించేనా?
ఆక్లాండ్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు గెలుస్తూ, ఓడుతూ సాగిన పయనం ఇప్పుడు గెలవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా నేడు జరిగే లీగ్ మ్యాచ్‌లో మిథాలీ బృందం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. నాలుగు మ్యాచ్‌లాడిన భారత్ రెండు గెలిచి మరో రెండు ఓడింది. ఇక మిగిలింది మూడు మ్యాచ్‌లే. ఇప్పుడు సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రతీ పోరు కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియాతో కఠిన సవాల్‌కు మిథాలీ సేన సిద్ధమైంది. అయితే నిలకడలేమి జట్టును ఆందోళన పరుస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ రంగాల్లో భారత్ స్థిరంగా రాణించాలి. అప్పుడే మిగతా మ్యాచ్‌ల్ని గెలవొచ్చు. సెమీస్ చేరొచ్చు. లేదంటే లీగ్ దశలోనే వెనుదిరిగే ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, ఆస్ట్రేలియా జట్లు 12 సార్లు తలపడ్డాయి. భారత్ 3 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓవరాల్‌గా ఈ రెండు జట్ల మధ్య 49 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ 10 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 39 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. -
చరిత్ర సృష్టించిన టీమిండియా బౌలర్
మహిళల వన్డే ప్రపంచకప్ 2022లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు (40 వికెట్లు) తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కింది. విండీస్ బ్యాటర్ అనిసా మహ్మద్‌ను ఔట్ చేయడం ద్వారా ఝులన్ ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలో ఆమె ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్స్టన్ (39 వికెట్లు)ను అధిగమించి వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రికెటర్‌గా అవతరించింది. 🚨 RECORD ALERT 🚨 Wicket No. 4⃣0⃣ in the WODI World Cups for @JhulanG10! 🔝 🙌 What a champion cricketer she has been for #TeamIndia ! 👏 👏 #CWC22 | #WIvIND Follow the match ▶️ https://t.co/ZOIa3L288d pic.twitter.com/VIfnD8CnVR — BCCI Women (@BCCIWomen) March 12, 2022 ఫుల్స్టన్ 20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 39 వికెట్లు పడగొట్టగా, ఝులన్ 31 వన్డేల్లో ఫుల్స్టన్ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్‌లు ఆడిన 39 ఏళ్ల ఝులన్, వన్డే ఫార్మాట్లో 198 మ్యాచ్‌ల్లో 249 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, సెడాన్పార్కు వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 155 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మంధాన(119 బంతుల్లో 123; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్(107 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. స్నేహ్ రాణా(3/22), మేఘనా సింగ్ (2/27)ల ధాటికి 40.3 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విండీస్ జట్టులో ఓపెనర్ డియాంద్ర డొటిన్(62) టాప్ స్కోరర్‌గా నిలిచింది. చదవండి: World Cup 2022: శెభాష్ స్మృతి, హర్మన్.. ఇదే అత్యధిక స్కోరు! -
ఉత్కంఠపోరులో దక్షిణాఫ్రికా విజయం
మౌంట్ మాంగనుయ్: మహిళల వన్డే ప్రపంచకప్ లో పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు పరుగుల తేడాతో గెలిచింది. చేతిలో రెండు వికెట్లు ఉండగా పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో 10 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ షబ్నిమ్ (3/41) ఐదు బంతుల్లో మిగిలిన రెండు పాక్ వికెట్లు తీసి తమ జట్టును గెలిపించింది. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 49.5 ఓవర్లలో 217 పరుగుల వద్ద ఆలౌటై ఈ టోర్నీలో వరుసగా మూడో ఓటమి చవిచూసింది. ఒమైమా (65; 7 ఫోర్లు), నిదా దార్ (55; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 9 వికెట్లకు 223 పరుగులు సాధించింది. లౌరా వోల్వార్ట్ (75; 10 ఫోర్లు), సునె లుస్ (62; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. -
విండీస్ రూపంలో సవాల్!
హామిల్టన్: మహిళల వన్డే ప్రపంచకప్‌లో మరో కీలక పోరుకు భారత జట్టు సన్నద్ధమైంది. నేడు జరిగే పోరులో వెస్టిండీస్‌తో మిథాలీ బృందం తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో పాక్‌పై ఘన విజయం సాధించినా... గత మ్యాచ్‌లో కివీస్ చేతిలో భారీ పరాజయం బ్యాటింగ్‌లో మన పరిమితులు చూపించింది. ముఖ్యంగా హర్మన్ మినహా ఇతర బ్యాటర్లంతా విఫలం కావడం ఆందోళన కలిగించేదే. బౌలర్లు రెండు మ్యాచ్‌లలోనూ చక్కటి ప్రదర్శన కనబర్చగా, బ్యాటింగ్ వైఫల్యమే జట్టును దెబ్బ తీసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, యస్తిక శుభారంభం అందిస్తేనే తర్వాతి బ్యాటర్లు దానిని కొనసాగించగలరు. పేలవ స్ట్రయిక్‌రేట్‌తో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మ్యాచ్‌లోనైనా ధాటిగా ఆడి రాణిస్తే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. హర్మన్ ఫామ్‌లోకి రావడం సానుకూలాంశం కాగా... రిచా ఘోష్ కూడా చివర్లో దూకుడుగా ఆడాల్సి ఉంది. జులన్, మేఘన, రాజేశ్వరి, పూజ, దీప్తిలతో బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు విండీస్ జోరు మీదుంది. ఆతిథ్య న్యూజిలాండ్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌లపై సంచలన విజయాలు సాధించిన విండీస్ భారత్‌నూ ఓడించాలని పట్టుదలగా ఉంది. జట్టులో క్యాంప్‌బెల్, డాటిన్, హేలీ మాథ్యూస్, స్టెఫానీ, అనీసా కీలక ప్లేయర్లుగా ఉన్నారు. -
INDW Vs PAKW: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
-
INDW Vs PAKW: పాక్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకునేనా..?
India Take On Pakistan In Womens ODI World Cup 2022: గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి భారత మహిళల జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా రేపు (మార్చి 6) పాక్‌తో జరగబోయే మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనూయి ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. Pakistan and India captains exchanging greetings on the eve of their match. How excited are you? #CWC22 #BackOurGirls pic.twitter.com/fTEawDeiUI — Pakistan Cricket (@TheRealPCB) March 5, 2022 వార్మప్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా, విండీస్లపై విజయాలు సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న మిథాలీ సేన.. పాక్‌తో రేపు జరగబోయే మ్యాచ్‌లోనూ పైచేయి సాధించాలని ఆశిస్తుంది. మరోవైపు భారత్‌ను ఓడించేందుకు బిస్మా మహరూఫ్ నేతృత్వంలోని పాక్ సైతం ఉవ్విళ్లూరుతుంది. భారత్‌కు కలిసొచ్చే విషయం ఏంటంటే పాక్‌తో మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండటమే కాకుండా మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ కౌర్ వార్మప్ మ్యాచ్‌లో సెంచరీ సాధించి సూపర్ ఫామ్‌లో ఉంది. గత రికార్డులను పరిశీలిస్తే.. మహిళల వన్డే క్రికెట్లో భారత్-పాక్‌లు ఇప్పటి వరకు 10 సందర్భాల్లో ఎదురెదురుపడగా, అన్ని సార్లు టీమిండియానే విజయం వరించింది. ఇందులో 3 విజయాలు ప్రపంచకప్ టోర్నీల్లో దక్కినవే కావడం విశేషం. ఇక పొట్టి క్రికెట్లో ఇరు జట్లు తలపడిన 11 మ్యాచ్‌ల్లో టీమిండియా ఒకేసారి ఓడిపోయింది. చదవండి: బంగ్లాకు షాకిచ్చిన అఫ్ఘానిస్థాన్.. టీ20 సిరీస్ సమం -
ప్రపంచ కప్ సమరానికి సై.. భారత్ తొలి మ్యాచ్‌లోనే..
సాక్షి క్రీడా విభాగం: క్రికెట్లో మరో విశ్వ సమరానికి రంగం సిద్ధమైంది. కరోనా కారణంగా దాదాపు ఏడాది ఆలస్యంగా జరగబోతున్న మహిళల వన్డే ప్రపంచకప్ పోరుకు రేపటితో తెర లేవనుంది. అందమైన న్యూజిలాండ్ వేదికగా ఎనిమిది జట్లు 31 రోజుల పాటు తమ సత్తాను చాటేందుకు సన్నద్ధమయ్యాయి. మహిళల క్రికెట్‌ను శాసిస్తున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు ఆతిథ్య కివీస్ కూడా తమ వరల్డ్‌కప్ విజయాల సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతుండగా... భారత్ సహా మిగిలిన ఐదు జట్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తాయనేది ఆసక్తికరం. గత రెండేళ్ల పరిస్థితితో పోలిస్తే న్యూజిలాండ్ వేదికగా కోవిడ్ కట్టుబాట్లను దాటి కాస్త స్వేచ్ఛగా క్రికెటర్లు బరిలోకి దిగనుండటం ఈ మెగా టోర్నీలో ఊరట కలిగించే అంశం. ఐదేళ్ల తర్వాత జరగబోతున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి విశేషాలు. టోర్నీలో 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్ అర్హత సాధించగా, ఐసీసీ ర్యాంకింగ్ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికాలకు అవకాశం దక్కింది. మిగిలిన మూడు స్థానాలను క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉండగా... కోవిడ్ ప్రభావంతో ఆ టోర్నీ రద్దయింది. దాంతో మళ్లీ వన్డే ర్యాంకింగ్ ప్రకారమే పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. క్వాలిఫయింగ్‌లో పోరాడేందుకు సిద్ధమైన శ్రీలంక జట్టు వరల్డ్‌కప్ అవకాశం కోల్పోయింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడం ఇదే తొలిసారి. టోర్నీ తేదీలు/వేదికలు: మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు 6 వేదికల్లో టోర్నీ (మొత్తం 31 మ్యాచ్‌లు) నిర్వహిస్తారు. ఏప్రిల్ 3న క్రైస్ట్‌చర్చ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫార్మాట్: ప్రతీ టీమ్ మిగిలిన ఏడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్–4లో నిలిచిన టీమ్‌లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. పాయింట్లపరంగా రెండు జట్లు సమంగా నిలిస్తే రన్‌రేట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. లీగ్ దశలో ‘టై’ మ్యాచ్‌లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అయితే సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రం ‘సూపర్ ఓవర్’ ఉంది. సూపర్ ఓవర్ కూడా సమమైతే ఫలితం తేలే వరకు మళ్లీ మళ్లీ ఆడిస్తారు. ఈ సారి లీగ్ దశ నుంచి కూడా అన్ని మ్యాచ్‌లలో ‘డీఆర్ఎస్’ అమల్లో ఉంటుంది. ఆశల పల్లకిలో... 2017లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఫైనల్ చేరిన భారత జట్టు చివరకు 9 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఫలితం తర్వాత మన అమ్మాయిల వేదనతో కూడిన దృశ్యాలు క్రికెట్ అభిమానుల దృష్టిలో నిలిచిపోయాయి. ఈ సారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో మన జట్టు టైటిల్ గెలుచుకోగలదా అనేది ఆసక్తికరం. గత టోర్నీ సమయంతో పోలిస్తే ఈ సారి భారత జట్టు ఫామ్ అంత గొప్పగా లేదు. ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ విజయాలు కూడా టీమ్ సాధించలేకపోయింది. పైగా న్యూజిలాండ్ గడ్డపై ఆడటం మన యువ క్రీడాకారిణులకు పెద్ద సవాల్‌తో కూడుకున్నది. ఈ నేపథ్యంలో మన జట్టు మొదటి లక్ష్యం సెమీస్ చేరడమే. 2005 వరల్డ్‌కప్‌లో కూడా ఫైనల్లో ఓడిన మన టీమ్ రన్నరప్‌గా నిలిచింది. ఈసారి భారత్ తమ తొలి మ్యాచ్‌ను 6వ తేదీన పాకిస్తాన్‌తో ఆడుతుంది. అనంతరం 10న న్యూజిలాండ్‌తో, 12న వెస్టిండీస్‌తో, 16న ఇంగ్లండ్‌తో, 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, 27న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడుతుంది. భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, జులన్ గోస్వామి, పూజా వస్త్రకర్, మేఘన సింగ్, రేణుక సింగ్ , తానియా, రాజేశ్వరి, పూనమ్ యాదవ్. గత రికార్డు: మహిళల వన్డే వరల్డ్‌కప్ 11 సార్లు జరగ్గా... ఆస్ట్రేలియా 6 సార్లు, ఇంగ్లండ్ 4 సార్లు, న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలిచాయి. ప్రైజ్‌మనీ ఎంతంటే: 2017 కంటే ఈసారి ప్రైజ్‌మనీని రెట్టింపు చేశారు. విజేతకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్ జట్టుకు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 54 లక్షలు), సెమీస్‌లో ఓడిన జట్లకు 3 లక్షల డాలర్ల (రూ. 2 కోట్ల 26 లక్షలు) చొప్పున లభిస్తాయి. -
World Cup 2022: టీమిండియా స్టార్ బ్యాటర్ తలకు గాయం.. బీసీసీఐ అప్డేట్
మహిళల వన్డే ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. సౌతాఫ్రికా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన వార్మప్ మ్యాచ్‌లో షబ్నీమ్ ఇస్మాయిల్ విసిరిన బౌన్సర్.. వేగంగా వచ్చి మంధాన హెల్మెట్‌కు బలంగా తాకింది. దీంతో మంధాన రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు చేరి, ఆ తర్వాత ఫీల్డింగ్‌కు కూడా రాలేదు. దీంతో మంధాన తలకు పెద్ద గాయమైందేమోనని ఆమె అభిమానులు ఆందోళన చెందారు. కీలక టోర్నీకి ముందు మంధాన జట్టుకు దూరమైతే టీమిండియా విజయావకాశాలను దెబ్బతీస్తుందని వారు అభిప్రాయపడ్డారు. 🚨 UPDATE 🚨: Smriti Mandhana stable after being struck on the head in #CWC22 warm-up game. #TeamIndia Details 🔽— BCCI Women (@BCCIWomen) February 28, 2022 అయితే మంధాన తలకు తగిలిన గాయం పెద్దది కాదని, కన్కషన్ ఏమీ జరగలేదని జట్టు వర్గాలు ఇవాళ వెల్లడించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మహిళల వన్డే ప్రపంచకప్ మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మార్చి 6న టీమిండియా.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. భారత ప్రపంచకప్ జట్టు: మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్ చదవండి: ICC World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం.. 9 మంది ప్లేయర్స్‌తో బరిలోకి దిగవచ్చు..! -
ICC World Cup 2022: ఐసీసీ కీలక నిర్ణయం.. 9 మంది ప్లేయర్స్‌తో బరిలోకి దిగవచ్చు..!
మార్చి 4 నుంచి ప్రారంభంకానున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2022కి సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో మెగా టోర్నీ సజావుగా సాగాలనే ఉద్దేశంతో నిబంధనలు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఏదైనా జట్టులో కరోనా వ్యాప్తి చెందితే, కనీసం 9 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు ఐసీసీ అనుమతిచ్చింది. అలాగే ప్లేయర్స్‌ను బయో బబుల్స్‌లో ఉంచడం, బంతి బౌండరీ లైన్ దాటి వెలుపలకు వెళ్లినప్పుడు శానిటైజ్ చేయడం, ఓ ప్లేయర్ కరోనా బారిన పడితే జట్టులో ప్రతి ప్లేయర్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించడం వంటి నిబంధనలను యధాతథంగా కొనసాగుతాయని ఐసీసీ ప్రకటించింది. ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచ కప్‌లో టీమిండియా సహా పలు జట్లలో కరోనా కేసులు నమోదై, కనీసం 11 మంది ఆటగాళ్లను బరిలోకి దించలేని పరిస్థితి ఏర్పడింది. ఓ జట్టైతే ఆటగాళ్లు అందుబాటులో లేక టోర్నీలో నుంచే వైదొలిగింది. ఈ నేపథ్యంలో ఐసీసీ నిబంధనలను సవరించింది. ఇదిలా ఉంటే, మహిళల వన్డే ప్రపంచకప్ 2022కు న్యూజిలాండ్ ఆతిధ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభంకానుంది. మార్చి 6న టీమిండియా.. చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో తలపడనుంది. అనంతరం మార్చి 10న న్యూజిలాండ్‌తో, మార్చి 12న వెస్టిండీస్‌తో, మార్చి 16న ఇంగ్లండ్‌తో, మార్చి 19న ఆస్ట్రేలియాతో, 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. భారత ప్రపంచకప్ జట్టు: మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్, యాస్తికా భాటియా, స్నేహ రాణా, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ ఠాకూర్, తానియా భాటియా, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్ చదవండి: టీమిండియా స్టార్ క్రికెటర్లకు అరుదైన గౌరవం -
ఉన్నపళంగా ఫామ్ అందుకోలేం
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత ఉన్నపళంగా ఫామ్‌ను అందుకోవడం చాలా కష్టమని భారత మహిళల క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్‌నకు ముందు భారత్ ఏకైక అంతర్జాతీయ టోర్నీలో ఇంగ్లండ్‌తో తలపడాల్సి ఉంది. కరోనా కారణంగా అది కాస్తా రద్దు కావడంతో పూనమ్ నిరాశ వ్యక్తం చేసింది. చివరగా ఈ ఏడాది మార్చిలో టి20 ప్రపంచకప్‌లో తలపడిన భారత్ కరోనా కారణంగా నాలుగు నెలలుగా ప్రాక్టీస్‌కు దూరమైంది. తాజాగా ఇంగ్లండ్ టూర్ కూడా ఆగిపోవడంతో నేరుగా వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటాలంటే అంత సులువు కాదని పూనమ్ పేర్కొంది. న్యూజిలాండ్ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో జరగాల్సిన ఈ మెగా టోర్నీ భవితవ్యంపై రానున్న రెండు వారాల్లో స్పష్టత వస్తుందని వ్యాఖ్యానించింది. ‘ఇదో కఠిన సవాల్. నాలుగైదు నెలల విరామానంతరం మునుపటి ఫామ్ కొనసాగించలేం. చివరగా మార్చిలో బరిలో దిగాం. ఇప్పటికీ మేం ఆడబోయే తదుపరి సిరీస్‌పై స్పష్టత లేదు. ఒకవేళ అనుకున్న సమయానికి వన్డే ప్రపంచకప్ జరిగితే సన్నద్ధతకు సమయమే ఉండదు’ అని భారత్ తరఫున ఒక టెస్టు, 46 వన్డేలు, 67 టి20లు ఆడిన పూనమ్ పేర్కొంది. -
ప్రపంచ కప్ అర్హత టోర్నీలు వాయిదా
దుబాయ్: కరోనా (కోవిడ్–19) ధాటికి ఇప్పటికే ఒలింపిక్స్, యూరో కప్‌లు వచ్చే ఏడాదికి తరలిపోగా... ఐపీఎల్ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పుడు కరోనా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈవెంట్లపైనా ప్రభావం చూపడం మొదలుపెట్టింది. 2021లో జరిగే టి20 ప్రపంచ కప్, 2023లో జరిగే వన్డే ప్రపంచ కప్ ఈవెంట్లకు సంబంధించి ఈ ఏడాది జూన్ 30లోపు జరగాల్సిన అన్ని అర్హత టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. దాంతో పాటు శ్రీలంక వేదికగా జరగాల్సిన 2021 మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌ను అనుకున్న తేదీల్లో జరపాలా వద్దా అన్న విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని క్రిస్ అన్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఏప్రిల్‌లో ఆరంభం కావాల్సిన ట్రోఫీ టూర్‌ను కూడా ఐసీసీ వాయిదా వేసింది. -
ఇంగ్లండ్... కాచుకో!
►మిథాలీ రాజ్ సవాల్ ► ఆతిథ్య జట్టుకు అంత సులువు కాదన్న భారత కెప్టెన్ డెర్బీ: మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ఇదే ఊపులో తొలిసారి విశ్వ విజేతగా నిలవాలని మన జట్టు పట్టుదలగా ఉంది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌కు తమ నుంచి గట్టి పోటీ తప్పదని భారత కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉందని ఆమె, ఆతిథ్య జట్టును హెచ్చరించింది. టోర్నీ తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 35 పరుగులతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ‘ప్రపంచ కప్ ఫైనల్ ఆడబోవడంపై మా జట్టు సభ్యులందరూ ఉద్వేగానికి లోనవుతున్నారు. ఈ టోర్నీ కష్టమైనదని మాకు తెలుసు. కానీ జట్టుకు అవసరమైన ప్రతీ సందర్భంలో అందరూ తమ సత్తా చాటారు. కాబట్టి ఫైనల్లో మమ్మల్ని ఓడించడం ఇంగ్లండ్‌కు అంత సులువు కాదని గట్టిగా చెప్పగలను. ఆ రోజు ఎలా ఆడతామన్నది ముఖ్యం. మాతో ఓడిన తర్వాత ఆతిథ్య జట్టు ఆట కూడా మారింది కాబట్టి ఈ మ్యాచ్ కోసం మా వ్యూహాలు మార్చుకోవాలి. దీని కోసం మేమంతా సిద్ధంగా ఉన్నాం’ అని మిథాలీ చెప్పింది. మహిళల క్రికెట్ రాత మారుతుంది... భారత జట్టు ప్రపంచ కప్ గెలిస్తే అది దేశంలో మహిళా క్రికెట్ దశ, దిశను మార్చగలదని మిథాలీ అభిప్రాయపడింది. ‘మేం లార్డ్స్‌లో విజయం సాధిస్తే అది గొప్ప ఘనత అవుతుంది. సరిగ్గా చెప్పాలంటే మహిళల క్రికెట్లో విప్లవంలాంటిది రావచ్చు. మహిళలు కనీసం ఒక ఐసీసీ టోర్నీ అయినా గెలవాలని ఇప్పటి వరకు అంతా చెబుతూ వచ్చారు. దానికి ఇప్పుడు ఇదే సరైన వేదిక. భారత్ గెలిస్తే ఆ ఘనతను వర్ణించేందుకు నాకు మాటలు చాలవేమో’ అని ఈ హైదరాబాద్ అమ్మాయి పేర్కొంది. సెమీస్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ మెరుపు బ్యాటింగ్‌కు తోడు బౌలర్లుగా కూడా చాలా బాగా ఆడారని సహచరిణులపై మిథాలీ ప్రశంసలు కురిపించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ సమయంలో కండరాల గాయంతో బాధపడిన హర్మన్‌ప్రీత్ కోలుకుంటుందని మిథాలీ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ప్రపంచ కప్ ఫైనల్లో బరిలోకి దిగాలని హర్మన్ కూడా పట్టుదలగా ఉంటుందని నేను చెప్పగలను. ఇది జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం. మేమందరం కూడా ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం’ అని మిథాలీ తన మనసులో మాట చెప్పింది. హర్మన్ ఇంట్లో సంబరాలు... ప్రపంచ కప్ సెమీస్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ స్వస్థలం మోగా (పంజాబ్)లో గురువారం రాత్రి నుంచి వేడుకలు కొనసాగాయి. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున పండగ వాతావరణం ఉండగా, ఆ ఊర్లోని మిత్రులు, సన్నిహితులు కూడా పంజాబీ సాంప్రదాయ నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. తమ కూతురి ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నామని... ఆడపిల్లను సరిగ్గా ప్రోత్సహిస్తే అద్భుతాలు జరుగుతాయని ఆమె నిరూపించిందని హర్మన్ తల్లిదండ్రులు హర్మందర్ సింగ్ భుల్లర్, సతీందర్ కౌర్ వ్యాఖ్యానించారు. సెహ్వాగ్ శైలిలో బ్యాటింగ్ చేసే హర్మన్, మైదానంలో కోహ్లి తరహాలో దూకుడుగా వ్యవహరిస్తుందని ఆమె సోదరి హేమ్‌జిత్ కౌర్ చెప్పింది. తన తోటి అమ్మాయిలు సరదాగా గడుపుతున్నా, వాటికి దూరంగా కఠోర సాధన చేసిన హర్మన్ శ్రమ ఫలితాన్ని ఇచ్చిందని ఆమె వెల్లడించింది. బీసీసీఐ అభినందన ప్రపంచకప్‌లో ఫైనల్ చేసిన భారత మహిళల జట్టుకు బీసీసీఐ శుభాకాంక్షలు తెలిపింది. టోర్నీలో నిలకడగా రాణించిన మిథాలీ బృందాన్ని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి అభినందించారు. హర్మన్‌ను ప్రత్యేకంగా ప్రశంసించిన ఆయన... ఫైనల్ మ్యాచ్ కోసం జట్టుకు బెస్టాఫ్ లక్ చెప్పారు. -
ధనాధన్ కౌర్...
‘ఒంటి చేత్తో’ విజయం అందించడం అంటే ఏమిటో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చాలా బాగా తెలుసు! గత ఫిబ్రవరిలో కొలంబోలో జరిగిన ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో విజయం కోసం చివరి 2 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన దశలో ఆమె ఐదో బంతిని అద్భుతమైన సిక్సర్‌గా మలచడంతో పాటు మరో రెండు పరుగులు కూడా సాధించి గాల్లో బ్యాట్ విసిరేసి సంబరాలు చేసుకుంది. ఆ సమయంలో కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న కౌర్ నొప్పిని భరిస్తూనే చివరి వరకు పట్టుదలగా ఆడి గెలిపించింది. ‘ఆ సమయంలో నన్ను నేను ధోనీలా భావించాను’ అని మ్యాచ్ అనంతరం కౌర్ వ్యాఖ్యానించింది. కౌర్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేయడం, అలవోకగా బౌండరీలు, భారీ సిక్సర్లు బాదడం కొత్త కాదు. ఇది ఆమె సహజశైలి మాత్రమే. ఈ తరహా దూకుడైన బ్యాటింగ్ వల్లే బిగ్‌బాష్ జట్టు సిడ్నీ థండర్స్ హర్మన్‌ను ఏరికోరి ఎంచుకుంది. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారత క్రీడాకారిణి కౌర్ కావడం విశేషం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కౌర్ తొలి మ్యాచ్‌లోనే 28 బంతుల్లో 47 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె లాఫ్టెడ్ కవర్ డ్రైవ్‌ను అద్భుతమైన సిక్సర్‌గా మలచడం చూసి కామెంటరీలో ఉన్న గిల్‌క్రిస్ట్ ‘నేను చూసిన అత్యుత్తమ క్రికెట్ షాట్. ఆమె ఆటతో నేను అచ్చెరువొందాను’ అని వ్యాఖ్యానించడం విశేషం. గత ఏడాది అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై టి20ల్లో భారత్ అత్యుత్తమ లక్ష్య ఛేదనలో కూడా కౌర్ (31 బంతుల్లో 46)దే కీలక పాత్ర. టి20 క్రికెట్ ఎలా ఆడాలో కౌర్ తమకు చూపించిందని మ్యాచ్ తర్వాత ఆసీస్ కీపర్ ఎలీసా హీలీ చెప్పింది. ఇప్పుడు తాజా ఇన్నింగ్స్‌తో వన్డే క్రికెట్ ఎలా ఆడాలో కూడా ఆస్ట్రేలియన్లకు హర్మన్ బాగా నేర్పించింది! తొమ్మిదేళ్ల క్రితమే భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన హర్మన్ చాలా వేగంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. 2013లో జరిగిన గత ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ కౌర్‌కు మరింత గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా ఆమె మెరుపు బ్యాటింగ్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిసాయి. చాలా మంది భారత మహిళా క్రికెటర్ల తరహాలో హర్మన్‌కు సినిమా కష్టాలేమీ లేవు. పంజాబ్‌లోని మోగాకు చెందిన క్లబ్ స్థాయి క్రికెటర్ అయిన తండ్రి హర్మీందర్ సింగ్ భుల్లర్ ఆమెను ఎంతగానో ప్రోత్సహించారు. ముగ్గురు పిల్లల్లో పెద్దదైన హర్మన్ ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ కాదనలేదు. కౌర్ కెరీర్‌ను తీర్చి దిద్దడంలో స్థానిక కోచ్ కమల్దిష్ సింగ్ అన్నింటా తానై కీలక పాత్ర పోషించారు. వివిధ వయో విభాగాల్లో రాణించి పంజాబ్ జట్టులోకి వచ్చిన ఆమెకు భారత టీమ్ తలుపు తట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్‌ను పిచ్చి పిచ్చిగా అభిమానించే కౌర్, ఇప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో సరిగ్గా అదే సెహ్వాగ్‌ను మరిపించింది. బంతిని చూడటం, బలంగా బాదడమే తనకు తెలిసిన విద్య. ‘టీవీలో నేను క్రికెట్ మ్యాచ్‌లు చూసిందే సెహ్వాగ్ కోసం. అతడిని తప్ప మరే ఆటగాడిని నేను అభిమానించలేదు. అతడు ఫోర్లు, సిక్సర్లు కొట్టే శైలి నాకు చాలా ఇష్టం. ఎన్నో సార్లు వీరూ షాట్లను ఆడే ప్రయత్నం కూడా చేశాను’ అని 28 ఏళ్ల కౌర్ తన ఆటపై ఎవరి ప్రభావం ఉందో చెప్పేసింది. బిగ్‌బాష్ తర్వాత తాజాగా ఇంగ్లండ్ టి20 సూపర్ లీగ్‌లో కూడా సర్రే స్టార్స్ తరఫున ఆడే అవకాశం హర్మన్‌కు దక్కింది. – సాక్షి క్రీడావిభాగం ‘84 మాత్రం వద్దు’ హర్మన్ ఇప్పుడు 17 నంబర్ జెర్సీ ధరిస్తోంది. అయితే కెరీర్ ఆరంభంలో ఆమె 84 నంబర్‌తో ప్రపంచ కప్ ఆడింది. ఆమె తండ్రి ఏదైనా పెట్టుకో కానీ 84 మాత్రం వద్దని చెప్పినా... అప్రయత్నంగా ఆమె రాసిన అంకె 84 కావడంతో బీసీసీఐ అదే నంబర్‌ను ఇచ్చింది. దీనికి తండ్రి చాలా బాధ పడ్డారు. 1984 అల్లర్ల సమయంలో కౌర్ తండ్రి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ఆ సంఖ్య చూస్తే అదే గుర్తుకొస్తుంది కాబట్టి ఆయన దానిని వద్దన్నారని తర్వాత కౌర్ వివరించింది. చాలా ఆనందంగా ఉంది. మేం గెలవడం వల్లే నా ఇన్నింగ్స్ విలువ పెరిగింది. టోర్నీకి ముందు సెమీస్ చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత అది ఫైనల్‌గా మారింది. టోర్నమెంట్లో నాకు ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ అవకాశాన్ని వాడుకోవాలని భావించాను. దొరికిన బంతిని బాదడమే పనిగా పెట్టుకున్నాను. నా వ్యూహం ఫలించింది. – హర్మన్‌ప్రీత్ కౌర్ ►పరుగులు 171 ►బంతులు 115 ►ఫోర్లు 20 ►సిక్స్‌లు 7 -
'హర్మన్' తుఫాన్
►ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ►సెమీస్‌లో 36 పరుగులతో ఆసీస్ చిత్తు ►ఆదివారం ఇంగ్లండ్‌తో టైటిల్ పోరు ఎప్పుడైనా చూశారా మహిళల క్రికెట్లో ఇంతటి వీర విహారాన్ని... మంచినీళ్ల ప్రాయంలా బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థిపై విరుచుకుపడ్డ తీరును... ఎప్పుడైనా ఊహించారా మన అమ్మాయినుంచి ఈ తరహా మెరుపు ఆటను... అన్ని ప్రశ్నలకు తన బ్యాట్‌తోనే హర్మన్‌ప్రీత్ కౌర్ సమాధానం చెప్పింది. ఆడుతోంది ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్... అయితేనేం ప్రత్యర్థి బౌలర్లపై సునామీలా చెలరేగిన ఆమె అద్భుతాన్ని ఆవిష్కరించింది. బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ చెలరేగిపోయి పరుగుల వరద పారించిన ఈ పంజాబ్ సివంగి భారత్‌కు అపురూప విజయాన్ని అందించింది. ఒక్క మాటలో చెప్పాలంటే 1983లో టన్‌బ్రిడ్జ్‌వెల్స్‌లో జింబాబ్వేపై కపిల్‌దేవ్ ఇన్నింగ్స్‌తో పోల్చదగిన ప్రదర్శనతో కౌర్ ఆసీస్ ఆట కట్టించింది. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో మరే భారత క్రికెటర్ కూడా సాధించని ఘనతను తన పేరిట లిఖించుకున్న హర్మన్, ఆల్‌టైమ్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. ఆరుసార్లు చాంపియన్ ఆసీస్‌ను ఇంటిదారి పట్టించి ఈ మెగా ఈవెంట్లో రెండోసారి ఫైనల్ చేరింది. డెర్బీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌కు మరో చిరస్మరణీయ రోజు... అంచనాలకు అందని రీతిలో అద్భుతంగా ఆడిన మిథాలీ సేన సగర్వంగా ఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ 36 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్లకు 281 పరుగుల భారీ స్కోరు సాధించింది. మెరుపు ఇన్నింగ్స్‌తో హర్మన్ ప్రీత్ కౌర్ (115 బంతుల్లో 171 నాటౌట్; 20 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆసీస్ భరతం పట్టింది. అనంతరం తీవ్ర ఒత్తిడి మధ్య ఆడిన ఆస్ట్రేలియా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్ బ్లాక్వెల్ (56 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విలాని (58 బంతుల్లో 75; 13 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. హర్మన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఆదివారం లార్డ్స్‌లో జరిగే ఫైనల్లో భారత్ ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతుంది. చేతులెత్తేశారు... భారీ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా కష్టాలు రెండో ఓవర్ నుంచే మొదలయ్యాయి. మూనీ (1)ని పాండే అవుట్ చేసి ఆ జట్టును దెబ్బ తీసింది. ఆ తర్వాత కెప్టెన్ లానింగ్ (0)ను జులన్, బోల్టన్ (14)ను దీప్తి అవుట్ చేశారు. అనంతరం విలానీ, పెర్రీ (38) నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే భారత బౌలర్ల ధాటికి స్వల్ప వ్యవధిలో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించింది. స్మృతి మళ్లీ విఫలం... టోర్నీలో తన వరుస వైఫల్యాలను కొనసాగిస్తూ స్మృతి మంధన (6) తొలి ఓవర్లోనే వెనుదిరిగింది. మరో ఓపెనర్ పూనమ్ రౌత్ (14) కూడా కొద్ది సేపటికే వెనుదిరిగింది. అనంతరం మిథాలీ రాజ్ (61 బంతుల్లో 36; 2 ఫోర్లు) కూడా క్రీజ్‌లో ఉన్నంత సేపు అసౌకర్యంగా కనిపించింది. చివరకు బీమ్స్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో భారత్ పరిస్థితి చూస్తే సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే ఆ తర్వాత దీప్తి శర్మ (35 బంతుల్లో 25; 1 ఫోర్) అండగా హర్మన్‌ప్రీత్ చెలరేగిపోయింది. వీర విధ్వంసం... గత మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీతో రాణించిన హర్మన్‌ప్రీత్ ఈసారి అసలైన తరుణంలో తన మెరుపు బ్యాటింగ్‌ను ప్రదర్శించింది. షుట్ వేసిన 23వ ఓవర్లో మోకాళ్లపై కూర్చొని కౌర్ ఆడిన షాట్ ఇన్నింగ్స్ హైలైట్లలో ఒకటి. ఇదే ఓవర్లో కౌర్‌ను స్టంపౌంట్ చేసే సునాయాస అవకాశాన్ని హీలీ చేజార్చింది. ఆ సమయంలో కౌర్ స్కోరు 35. ఆ తర్వాత ఇక ఆమెను ఆపడం ఆసీస్ తరం కాలేదు. గార్డ్నర్ వేసిన 37వ ఓవర్లో కౌర్ పండగ చేసుకుంది. తొలి బంతికి శర్మ సింగిల్ తీయగా, తర్వాతి ఐదు బంతుల్లో కౌర్ 6, 6, 4, 4, 2 బాదడంతో ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. చివరి 10 ఓవర్లలో భారత్ ఏకంగా 129 పరుగులు సాధించడం విశేషం. సంబరాలు లేవు! అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ తన చిరస్మరణీయ సెంచరీ క్షణాన్ని మాత్రం ఆస్వాదించలేకపోయింది. నాన్‌స్ట్రైకర్ దీప్తి శర్మతో సమన్వయ లోపం ఆమెను తీవ్ర అసహనానికి గురి చేసింది. 98 పరుగుల వద్ద ఉన్న సమయంలో బీమ్స్ బౌలింగ్‌లో కౌర్ మిడ్ వికెట్ దిశగా ఆడింది. వేగంగా సింగిల్ పూర్తి చేసుకున్న ఆమె, రెండో పరుగు కోసం ప్రయత్నిం చింది. దానికి దీప్తి సరిగా స్పందించలేదు. చివరకు ప్రమాదం లేకుండా ఆ పరుగు పూర్తయి కౌర్ సెంచరీ సాధించింది. అటువైపు దీప్తి కూడా రనౌట్ కాకుండా బయటపడింది. కానీ కౌర్ మాత్రం తన కోపాన్ని దాచుకోలేక సహచరిణిపై ప్రదర్శించింది. భారత ఇన్నింగ్స్ తర్వాత మాట్లాడుతూ... ఆ సమయంలో తన ఆవేశాన్ని నియంత్రించుకోలేకపోయానని, ఆ తర్వాత దీప్తికి సారీ చెప్పినట్లు కౌర్ వెల్లడించింది. -
తొలి బెర్త్ ఎవరిదో!
బ్రిస్టల్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడమే లక్ష్యంగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య నేడు తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. భారత్‌తో ఒక్క ఆరంభ మ్యాచ్‌లోనే ఇంగ్లండ్ ఓడింది. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. పైగా లీగ్ దశలో దక్షిణాఫ్రికాను ఓడించిన ఆత్మవిశ్వాసం కూడా జట్టులో ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా పడుతూ లేస్తూ సెమీస్ చేరింది. ఆతిథ్య జట్టుతో పాటు పటిష్టమైన ఆసీస్ చేతిలో ఓడింది. అయితే విండీస్, భారత్‌లపై భారీ విజయాలతో సత్తా చాటుకుంది. 17 ఏళ్ల తర్వాత (2000) సెమీస్ చేరిన సఫారీ జట్టు టైటిల్‌తో మెగా టోర్నీని ముగించాలనే పట్టుదలతో ఉంది. నేటి మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
‘హ్యాట్రిక్’పై గురి
♦ నేడు పాకిస్తాన్‌తో భారత్ ‘ఢీ’ ♦ దుర్భేద్యంగా మిథాలీ రాజ్ బృందం ♦ మహిళల వన్డే ప్రపంచకప్ దాయాదుల మధ్య ఇది మరో క్రికెట్ యుద్ధమే కానీ ఈసారి మహిళలది. జైత్రయాత్ర కొనసాగించేందుకు ఓ జట్టు... బోణీ కొట్టాలన్న ఆశతో మరో జట్టు ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. వరుస విజయాలతో భారత మహిళలు దూసుకెళుతుంటే... వరుస వైఫల్యాలతో పాక్ పరువు కోసం పాకులాడుతోంది. ఎలాగైనా దాయాదిని ఓడించి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. కానీ ఆల్‌రౌండ్ నైపుణ్యమున్న మిథాలీ సేనను పాక్ ఏ మాత్రం నిలువరిస్తుందో చూడాలి. డెర్బీ: ఇప్పుడు మహిళల వంతు వచ్చింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు సమరానికి సై అంటున్నాయి. చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం లీగ్ పోరు జరగనుంది. వరుస విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో మిథాలీ సేన ఉండగా ... అసలు బోణీనే చేయని పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. ఈ టోర్నీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన పాకిస్తాన్‌కు ఈ మ్యాచ్ కీలకం. విజయంతో గెలుపు బాట పడితే తర్వాత సెమీస్ లక్ష్యంపై ఆలోచించవచ్చనే ధైర్యంతో ఉంది. తిరుగులేని రికార్డు... పాకిస్తాన్‌పై భారత మహిళలది తిరుగులేని రికార్డు. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ భారతే గెలిచింది. మిథాలీ సారథ్యంలోనే ఏకంగా 8 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఇక ప్రపంచకప్ చరిత్ర కూడా భిన్నంగా ఏమీ లేదు. ఈ మెగా ఈవెంట్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ మిథాలీ సేననే విజయం వరించింది. ఇక ఈ చరిత్రను పక్కనపెట్టి... కేవలం ఈ టోర్నీనే పరిశీలిద్దామంటే... ఇందులోనూ భారత్ జోరు, హోరు ఏమాత్రం తక్కువలేదు... ప్రత్యర్థులకు తలొగ్గలేదు. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను, రెండో మ్యాచ్‌లో గత రన్నరప్ విండీస్‌ను కంగుతినిపించింది. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ మొదలు బౌలర్లంతా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు. ఎవరినీ తక్కువ అంచనా వేయడం లేదు. ఓపెనింగ్‌లో స్మృతి మంధన అసాధారణరీతిలో రాణిస్తోంది. ఇంగ్లండ్‌తో కేవలం 10 పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయిన ఆమె ఆ వెంటనే విండీస్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేసింది. విజయసారథి మిథాలీ రెండు మ్యాచ్‌ల్లోనూ నిలకడగా ఆడింది. మిడిలార్డర్లో దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్‌లు కూడా పాక్ బౌలర్ల భరతం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలోనూ భారత పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకనొక దశలో లక్ష్యంవైపు దూసుకెళుతున్న ప్రత్యర్థి జట్టును స్పిన్నర్లు దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌లు సమర్థంగా కట్టడి చేశారు. గెలుపే లక్ష్యంగా పాక్ మరోవైపు సనా మీర్ సారథ్యంలోని పాక్ పరిస్థితి భారత్‌కు పూర్తి భిన్నంగా ఉంది. టీమిండియా రెండు విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉంటే... పాక్ రెండు పరాజయాలతో డీలా పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాక్ లక్ష్యం సెమీసో... ఫైనలో కాదు. ఒక్క గెలుపే! ఎందుకంటే ఒక్కసారి గెలుపుబాట పడితే తమ ప్లేయర్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక ముందు జరిగే మ్యాచ్‌ల్లో ధీమాతో ఆడే అవకాశం ఏర్పడుతుంది. పైగా జోరుమీదున్న మిథాలీ సేనను ఓడిస్తే వచ్చే కిక్కే వేరు. జట్లు (అంచనా) భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, మోనా మేశ్రమ్, వేద కృష్ణమూర్తి, జులన్ గోస్వామి, శిఖా పాండే, పూనమ్ యాదవ్, సుష్మ వర్మ. పాకిస్తాన్: సనా మీర్ (కెప్టెన్), అయేషా జాఫర్, నహిదా ఖాన్, జవేరియా ఖాన్, బిస్మా మరూఫ్, నయిన్ అబిది, కైనత్ ఇంతియాజ్, అస్మావియా ఇక్బాల్, సిద్రా నవాజ్, నష్రా సంధు, సాదియా యూసుఫ్. మధ్యాహ్నం గం. 2.50 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
కివీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షంతో రద్దు
డెర్బీ: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో బుధవారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఎడతెరిపిలేని భారీ వర్షంతో ఇక్కడి కౌంటీ గ్రౌండ్ చిత్తడిగా మారిపోయింది. దీంతో కనీసం టాస్ వేసే పరిస్థితి కూడా లేకపోయింది. ఇక చేసేదేమి లేక ఫీల్డు అంపైర్లు లాంగ్టన్ రూసెర్, పాల్ విల్సన్ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. -
దక్షిణాఫ్రికా బోణీ
లీసెస్టర్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. మొదట పాక్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. నహిదా ఖాన్ (79; 9 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. తర్వాత దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఓపెనర్లు లారా వొల్వార్డ్ (52; 5 ఫోర్లు), లీజెల్లి లీ (60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. -
విజయోస్తు!
► నేటి నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ ► తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ‘ఢీ’ ► టీమిండియా తొలి లక్ష్యం సెమీస్ ► మిథాలీ రాజ్‌పైనే అందరి దృష్టి ఆదరణలో, ఆర్జనలో భారత పురుషుల క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లు ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. పురుషుల జట్టుకు తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించుకునేందుకు భారత మహిళల జట్టుకు వన్డే ప్రపంచకప్ రూపంలో సువర్ణావకాశం లభించింది. ఈ మెగా ఈవెంట్‌కు పూర్తిస్థాయిలో సన్నద్ధమైన టీమిండియా ఇక దానిని ఆచరణలో పెట్టి అనుకున్న ఫలితాన్ని సాధించడమే మిగిలింది. తాము ప్రపంచకప్ గెలిస్తే భారత్‌లో మహిళల క్రికెట్‌కు మహర్దశ వస్తుందని నమ్మకంతో ఉన్న మిథాలీ రాజ్ బృందం అద్భుతం చేయాలని, కప్‌తో తిరిగి రావాలని ఆశీర్వదిద్దాం. డెర్బీ (ఇంగ్లండ్) : అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నప్పటికీ భారత మహిళల క్రికెట్ జట్టుకు ఐసీసీ ప్రపంచకప్ టోర్నమెంట్ టైటిల్ మాత్రం అందని ద్రాక్షలానే ఉంది. ఈ మెగా ఈవెంట్లో ఎనిమిదిసార్లు పాల్గొన్న భారత్ అత్యుత్తమ ప్రదర్శన 2005లో రన్నరప్‌గా నిలువడం. 2013 ఈవెంట్లో స్వదేశంలో భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన కనబరిచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈసారి మాత్రం ఎలాగైనా కప్‌తో తిరిగి రావాలని, దేశంలో మహిళల క్రికెట్‌కు మంచి రోజులు తేవాలని మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది. శనివారం మొదలయ్యే ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే అసలు సిసలు సవాల్ ఎదురుకానుంది. ఆతిథ్య జట్టు, మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. తొలి రోజు జరిగే మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో శ్రీలంక ఆడుతుంది. ఇంగ్లండ్‌తో ఆడిన గత 10 మ్యాచ్‌ల్లో భారత్ ఎనిమిదిసార్లు ఓడిపోయింది. అయితే అన్ని విభాగాల్లో సమతుల్యంతో ఉన్న భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేస్తే ఈ టోర్నీని విజయంతో ప్రారంభించడం కష్టమేమీ కాదు. ‘మా తొలి లక్ష్యం సెమీఫైనల్‌కు చేరడమే. ఇది నెరవేరాలంటే లీగ్ దశలో నిలకడగా ఆడాలి. ఇక్కడి పరిస్థితులకు జట్టు సభ్యులు అలవాటు పడ్డారు’ అని మిథాలీ వ్యాఖ్యానించింది. మరో 212 పరుగులు చేస్తే మిథాలీ రాజ్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో భారత్ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. గత ఫిబ్రవరిలో కొలంబోలో జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలిచి ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. ఇటీవలే దక్షిణాఫ్రికాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో మిథాలీ బృందం విజేతగా నిలిచింది. మిథాలీ, జులన్ కీలకం... వరుసగా ఆరు అర్ధ సెంచరీలు సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మిథాలీ రాజ్... దక్షిణాఫ్రికాలో జరిగిన నాలుగు దేశాల టోర్నీలో ఐర్లాండ్‌పై తొలి వికెట్‌కు 320 పరుగుల రికార్డు భాగస్వామ్యం జోడించిన ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్... మిడిల్ ఆర్డర్లో హర్మన్‌ప్రీత్ కౌర్, మోనా మేశ్రమ్... వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జులన్ గోస్వామిలతో భారత్ పటిష్టంగానే కనిపిస్తోంది. మరోవైపు స్వదేశంలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలోనూ విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ముచ్చటగా మూడోసారి మళ్లీ గెలవాలని తహతహలాడుతోంది. సారా టేలర్, కెప్టెన్ హీథెర్ నైట్, పేసర్ కేథరీన్ బ్రంట్, సివెర్ రాణిస్తే ఇంగ్లండ్ శుభారంభం చేసే అవకాశముంది.ఓవరాల్‌గా భారత్, ఇంగ్లండ్ జట్లు 61 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 25 మ్యాచ్‌ల్లో భారత్... 34 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు తొమ్మిది సార్లు ముఖాముఖి తలపడగా... మూడుసార్లు భారత్, ఆరుసార్లు ఇంగ్లండ్ విజయం సాధించాయి. జట్ల వివరాలు భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, జులన్ గోస్వామి, మాన్సి జోషి, హర్మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి, స్మృతి మంధన, మోనా మేశ్రమ్, నుజత్ పర్వీన్, శిఖా పాండే, పూనమ్ రౌత్, దీప్తి శర్మ, సుష్మా వర్మ, పూనమ్ యాదవ్. ఇంగ్లండ్: హీథెర్ నైట్ (కెప్టెన్), తమ్సీన్ బెమౌంట్, కేథరీన్ బ్రంట్, జార్జియా ఎల్విస్, జెన్నీ గన్, అలెక్స్ హార్ట్లె, హాజెల్, బెథ్ లాంగ్స్టన్, లారా మార్‡్ష, నటాలీ సివెర్, ష్రుబ్సోల్, సారా టేలర్, ఫ్రాన్ విల్సన్, లారెన్ విన్ఫీల్డ్, డానియెలా వ్యాట్. గత చాంపియన్స్ ఏడాది విజేత రన్నరప్ 1973 ఇంగ్లండ్ ఆస్ట్రేలియా 1978 ఆస్ట్రేలియా ఇంగ్లండ్ 1982 ఆస్ట్రేలియా ఇంగ్లండ్ 1988 ఆస్ట్రేలియా ఇంగ్లండ్ 1993 ఇంగ్లండ్ న్యూజిలాండ్ 1997 ఆస్ట్రేలియా న్యూజిలాండ్ 2000 న్యూజిలాండ్ ఆస్ట్రేలియా 2005 ఆస్ట్రేలియా భారత్ 2009 ఇంగ్లండ్ న్యూజిలాండ్ 2013 ఆస్ట్రేలియా విండీస్ ప్రపంచకప్ చరిత్రలో భారత్ 54 మ్యాచ్‌లు ఆడింది. 28 మ్యాచ్‌ల్లో గెలిచి, 24 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా, మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. గెలిస్తే ఎవరికెంత... విజేత రూ. 4 కోట్ల 25 లక్షలు రన్నరప్ రూ. 2 కోట్ల 12 లక్షలు సెమీస్‌లో ఓడిన జట్లకు రూ. కోటి చొప్పున గ్రూప్ దశలో నిష్క్రమించిన జట్లకు రూ. 19 లక్షల చొప్పున ఇదీ ఫార్మాట్ మొత్తం ఎనిమిది జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడతాయి. లీగ్ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ తేదీ ప్రత్యర్థి సమయం జూన్ 24 ఇంగ్లండ్ మ.గం. 3.00 నుంచి జూన్ 29 విండీస్ మ.గం. 3.00 నుంచి జూలై 2 పాకిస్తాన్ మ.గం. 3.00 నుంచి జూలై 5 శ్రీలంక మ.గం. 3.00 నుంచి జూలై 8 దక్షిణాఫ్రికా మ.గం. 3.00 నుంచి జూలై 12 ఆస్ట్రేలియా మ.గం. 3.00 నుంచి జూలై 15 న్యూజిలాండ్ మ.గం. 3.00 నుంచి జూలై 18 తొలి సెమీఫైనల్ మ.గం. 3.00 నుంచి జూలై 20 రెండో సెమీఫైనల్ మ.గం. 3.00 నుంచి జూలై 23 ఫైనల్ (లార్డ్స్‌లో) మ.గం. 3.00 నుంచి మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం


