ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌.. | Australia Continues Dominance, Defeats England By 6 Wickets In Women’s ODI World Cup | Sakshi
Sakshi News home page

World cup 2025: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్‌..

Oct 23 2025 8:46 AM | Updated on Oct 23 2025 11:21 AM

Gardner, Sutherland help Australia crush England

మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా జోరు కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో జట్టు మరో అలవోక విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.

టామీ బీమాంట్‌ (105 బంతుల్లో 78; 10 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా... అలైస్‌ క్యాప్సీ (38) రాణించింది. ఆసీస్‌ బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌ 3 వికెట్లు పడగొట్టగా... యాష్లే గార్డ్‌నర్, మోలినో చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆ్రస్టేలియా 40.3 ఓవర్లలో 4 వికెట్లకు 248 పరుగులు సాధించి విజయాన్నందుకుంది. 

యాష్లే గార్డ్‌నర్‌ (73 బంతుల్లో 104 నాటౌట్‌; 16 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించగా... అనాబెల్‌ సదర్లాండ్‌ (112 బంతుల్లో 98 నాటౌట్‌; 9 ఫోర్లు 1 సిక్స్‌) త్రుటిలో శతకానికి దూరమైంది. ఒకదశలో ఆ్రస్టేలియా 68 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే గార్డ్‌నర్, సదర్లాండ్‌ ఐదో వికెట్‌కు అభేద్యంగా 180 పరుగులు జోడించి గెలిపించారు. 

ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన సదర్లాండ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. గాయం కారణంగా కెప్టెన్‌ అలీసా హీలీ ఈ మ్యాచ్‌కు దూరమైనా ఆ్రస్టేలియాకు ఎలాంటి సమస్య ఎదురు కాలేదు.
చదవండి: PKL 2025: భరత్‌ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement