భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు. చారిత్రాత్మక విజయం సాధించినందుకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను ప్రధాని అభినందించారు. వారితో సంభాషణ సందర్భంగా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో దేశ పౌరులంతా తమవంతు సాయం అందించాలని కోరారు.
జాతీయ ఆరోగ్య చొరవలో భాగంగా నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఫిట్ ఇండియ ఉద్యమం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. నిజానికి మోదీ ప్రతి భారతీయుడు దైనందిన జీవితంలో ఫిట్‌నెస్‌ను అంతర్భాగం చేయడానికి 2019 నుంచి ఈ ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. మన దేశంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అందుకు ఫిట్ ఇండియా ఒక్కటే పరిష్కారమని నొక్కి చెబుతున్నారు. దయచేసి అంతా వంట నూనె వినియోగాన్ని 10 శాతం తగ్గిస్తే, పైగా కొనుగోలు చేసే సమయం కూడా తగ్గుతుందని అన్నారు. అలాగే భారత మహిళా జట్టుని ఉద్దేశించి..తమ పాఠశాలలను సందర్శించి యువతరాలకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. కాగా, గట్టి భద్రతా చర్యల మధ్య ప్రదానమంత్రితో సమావేశం కావడానికి భారత జట్టు మంగళవారమే న్యూఢిల్లీకి చేరుకుంది.
అలాగే భాతర జట్టు అద్భుతమైన విజయ సాధించిన వెంటనే మోదీ సోషల్ మీడియా పోస్ట్‌లో "టోర్నమెంట్ అంతటా భారత జట్టు అసాధారణమైన కృషిని, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారులందరికి అభినందనలు. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు చాంపియన్ క్రీడలను చేపట్టడానికి ప్రేరేపిస్తుంది." అని పోస్ట్‌లో పేర్కొన్నారు మోదీ.
(చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..)


