దుబాయ్‌లోని లగ్జరీ హోటల్‌లో యువతి దారుణ హత్య కలకలం రేపింది. ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతిని మాజీ భర్తే కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం దేశం విడిచి పారి పోయాడు.
పోలీసులు సమాచారం ప్రచారం రష్యన్ విమానసేవల సంస్థ పోబెడా ఎయిర్ లైన్స్‌లో క్రూ మెంబర్‌గా పనిచేస్తున్న అనస్తాసియా దుబాయ్‌లోని లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్‌లో శవమై తేలింది. దుబాయ్‌లోని జుమేరా లేక్స్ టవర్స్ ప్రాంతంలోని వోకోబోనింగ్టన్ హోటల్‌లోని ఒక గదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆమె మెడ, మొండెం, అవయవాలపై 15 కత్తి పోట్లున్నాయని, దర్యాప్తు అధికారులు తెలిపారు. దర్యాప్తు అనంతరం రష్యాలో ఆమె మాజీ భర్తను అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడుగా రష్యన్ జాతీయుడు అనస్తాసియా మాజీ భర్త అయిన 41 ఏళ్ల ఆల్బర్ట్ మోర్గాన్ గా గుర్తించారు. యుఎఇ చట్ట అమలు సంస్థల అభ్యర్థన మేరకు, డిసెంబర్ 20న దుబాయ్ నుండి రష్యాలో దిగిన కొద్దిసేపటికే మోర్గాన్‌ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ హత్య డిసెంబర్ 17-18 మధ్య హత్య జరిగిందని భావిస్తున్నారు. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దుబాయ్ పోలీసులు నిందితుడిని గుర్తించారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే దేశం విడిచి పారిపోయాడని భావిస్తున్నారు. మోర్గాన్‌ను అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా, ఫిబ్రవరి 18 వరకు కనీసం రెండు నెలల పాటు కస్టడీలో ఉంచాలని రష్యన్ కోర్టు ఆదేశించింది.
అనస్తాసియా మోర్గాన్ మధ్య విభేదాలు తలెల్తాయి. నిరంతరం ఆమెను అనుమానంతో వేధించేవాడు. దీంతో దాదాపు రెండేళ్ల నుంచీ వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం నిందితుడు దుబాయయ్‌లో ఉంటున్నాడు. అయితే నిర్భయంగా ఆమె జీవిస్తున్న తీరుపై అసూయ, అనుమానంతో రగిలిపోయి చివరకు ఈ దారుణానికి ఒడిగట్టాడు భర్త.
మరోవైపు ప్రభుత్వ సంస్థ ఏరోఫ్లాట్ యాజమాన్యంలోని పోబెడా ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
ఇదీ చదవండి: నువ్వా బాసూ నీతులు చెప్పేది... శివాజీపై నెటిజన్లు ఫైర్


