అమెరికా వరస్ట్ క్రిమినల్స్‌ లిస్టులో 89 మంది భారతీయులు | US Worst Criminals List Released By Us Homeland Security | Sakshi
Sakshi News home page

Criminals List:అమెరికా వరస్ట్ క్రిమినల్స్‌ జాబితాలో భారతీయులు

Feb 7 2026 1:25 AM | Updated on Feb 7 2026 3:49 AM

US Worst Criminals List Released By Us Homeland Security

అక్రమ వలసలు, నేరాలపై గత కొన్నాళ్లుగా కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా.. తమ దేశంలో నివసిస్తున్న 89 మంది భారత పౌరులని తీవ్రమైన నేరస్థుల జాబితాలో చేర్చింది. ఈ జాబితాని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ కొత్త పబ్లిక్ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఇది తీవ్ర నేరాలకు పాల్పడిన అక్రమ వలసదారుల వివరాలని అందిస్తుంది. ఈ వెబ్‌సైట్‌లో క్రిమినల్స్ పేర్లు, ఫొటోలు, జాతీయత, నేరాల గురించిన సమాచారం ఉంచారు. 

నేరస్తులని, అక్రమ వలసదారులని అరెస్ట్ చేసి వారి కమ్యూనిటీల నుంచి తొలగించారో అమెరికన్ పౌరులకు చూపించడమే తమ లక్ష‍యమని సదరు విభాగం చెబుతోంది. జాబితాలో ఉన్న 89 మంది భారతీయులు.. లైంగిక నేరాలు, ‍అత్యాచారం, డ్రగ్స్ అక్రమ రవాణా, దొంగతనం, మద్యం తాగి వాహనం నడపడం, హిట్ అండ్ రన్, స్మగ్లింగ్, దోపీడి, దాడి, గృహ హింస లాంటి తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement