భారతదేశంలోకి ప్రముఖ టెలికాం కంపెనీ 'ఎయిర్‌టెల్'.. ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా.. తన 36 కోట్ల వినియోగదారులకు ప్రముఖ డిజైన్ ప్లాట్‌ఫామ్ అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం (Adobe Express Premium)ను ఉచితంగా అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.
అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం అనేది కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే కాకుండా.. బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సుమారు రూ.4,000 విలువైన ఈ ప్రీమియం ప్యాకేజీని ఎయిర్‌టెల్ యూజర్లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా.. ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు.
అడోబ్ ఎక్స్‌ప్రెస్ అనేది.. అడోబ్ రూపొందించిన ఒక సులభమైన, వేగవంతమైన క్రియేట్ ఎనీథింగ్ యాప్. డిజైన్ అనుభవం లేకపోయినా, ఎవరికైనా ప్రొఫెషనల్ స్థాయి పోస్టర్లు, సోషల్ మీడియా కంటెంట్, వీడియోలు, ఆహ్వాన పత్రికలు, మార్కెటింగ్ మెటీరియల్ రూపొందించడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో ఉన్న AI ఆధారిత ఫీచర్లు పనిని మరింత వేగంగా, ఆకర్షణీయంగా చేస్తాయి. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ట్లో లాగిన్ అయి ఈ సర్వీస్ యాక్టివేట్ చేసుకోవచ్చు.
అడోబ్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఇంగ్లీష్ భాషలో మాత్రమే కాకుండా.. హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వినియోగదారులు తమ మాతృభాషలోనే డిజైన్ చేయగలుగుతారు. పండుగ శుభాకాంక్షలు, పెళ్లి ఆహ్వానాలు, వాట్సాప్ స్టేటస్‌లు, స్థానిక దుకాణాల ప్రమోషన్‌లు అన్నీ సులభంగా రూపొందించవచ్చు.
ఇదీ చదవండి: పెరిగిపోతున్న గోల్డ్ రేటు.. కియోసాకి కొత్త అంచనా
అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ద్వారా.. కంటెంట్ క్రియేటర్లు & ఇన్‌ఫ్లూయెన్సర్లు.. రీల్స్, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్, వైరల్ కంటెంట్ సులభంగా తయారు చేయవచ్చు. సాధారణ వినియోగదారులు పండుగ శుభాకాంక్షలు, వ్యక్తిగత ఆహ్వానాలు పంపుకోవచ్చు. విద్యార్థులు ప్రాజెక్టులు, ప్రెజెంటేషన్లు, పోర్ట్‌ఫోలియోలు రూపొందించవచ్చు. చిన్న వ్యాపారులు లోగోలు, పోస్టర్లు, సోషల్ మీడియా ప్రకటనలు నిమిషాల్లో రూపొందించవచ్చు.
You x Us x @adobeexpress - collab of the year!
Casually unlocking the quick & easy design app worth ₹4000 for all of you.#EveryoneCanDesign #MadeWithAdobeExpress #AirtelXAdobe pic.twitter.com/JmCHG4tvgE— airtel India (@airtelindia) January 29, 2026


