బాలీవుడ్ ప్రముక నటుడు భాయిజాన్ సల్మాన్‌ఖాన్(Salman Khan)కి ఈ డిసెంబర్27కి 59 ఏళ్లు నిండనున్నాయి. ఇంకో ఆరు రోజుల్లో 60వ పుట్టిన రోజు జరుపుకునున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ..తాను అరవైవ దశకంలో కూడా ఇంతే యంగ్‌గా ఫిట్‌గా ఉండాలనుకుంటున్నా అంటూ పోస్టుపెట్టారు. అంతే ఒక్కసారిగా ఈ పోస్ట్ వైరల్‌గా మారడమే కాకుండా అభిమానులు భాయిజా మీరు 45 ఏళ్ల వయసులోనూ అందుకు ఉన్నారు, మీరు ఫిట్‌నెస్ ఐకాన్ అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతలా ఆరుపదుల వయసులోనూ అలాంటి బాడీ మెయింటైన్ చేయాలంటే ఈ ఆరోగ్య సూత్రాలు ఫాలో అవ్వాల్సిందే అని చెబుతన్నారు నిపుణులు. అవేంటంటే..
కండలు కలిగిన దేహధారుఢ్యం కోసం..
ముందు నుంచి వ్యాయమాలు చేసే అలవాటు ఉంటే..మంచి ఫిట్‌నెస్ ట్రైనర్ సమక్షంలో కసరత్తులు ప్రారంభించాలి. క్రమంతప్పకుండా వర్కౌట్లు చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా కండలు తిరిగి దేహధారుడ్యం కోసం..ట్రెడ్‌మిల్, క్రాస్ ట్రైనర్, సైక్లింగ్..లాంటి కార్డియో వ్యాయామాలు, వెయిట్ ట్రైనింగ్ కసరత్తులు, తదితరాలు తప్పనిసరి అని చెబుతున్నారు ఫిట్‌నెస్ నిపుణుల.
అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆరుపదుల వయసులోనూ యంగ్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే..వారానికి 150 నిమిషాల వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయాలని నొక్కిచెప్పింది. అంతేగాదు ఏం చేయాలన్నా..ఆరోగ్యం బాగుండాలన్న సూత్రం మరువకండి అంటున్నారు నిపుణులు.కనీసం జిమ్ వెళ్లని వాళ్లు ఓ ఇరవై నిమిషాలు నడిస్తే మంచిదని సూచించింది డబ్ల్యూహెచ్‌ఓ.
డైట్ ఎలా ఉండాలంటే..
ఉదయం: 5 ఎగ్‌వైట్స్, ఉడికించిన కూరగాయలు. పాల నుంచి తీసిన పెద్ద చెంచాడు వెన్న ప్రొటీన్. రెండుసార్లు రెండు రకాల పండ్లు. పది వేయించిన లేదా నానబెట్టిన బాదం పప్పులు.
మధ్యాహ్నం: నూనె లేకుండా చేసిన 100 గ్రాముల చికెన్, కూరగాయలు, 50 గ్రాముల అన్నం, 150 గ్రాముల పండ్లు.
రాత్రి: 100 గ్రాముల చికెన్ లేదా 150 గ్రాముల చేపలు, కూరగాయలు. వాటితోపాటు మూడు పూటలా కూరగాయలు, కీర దోస, పండ్లు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే చాలట.
అయితే ఇది వ్యక్తికి-వ్యక్తికి డైట్ మారిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల దృష్ట్యామార్పులుచేర్పులు ఉంటాయన్నారు. ఇది కేవలం ఆరోగ్యకరమైన వృధాప్యాన్ని ఆస్వాదించడం కోసం ఇచ్చిందే తప్ప అందరికీ సరిపడదని కూడా హెచ్చరించారు ఆరోగ్య నిపుణులు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: Roblox CEO David Baszucki: విండో క్లీనర్ నుంచి బిలియనీర్ రేంజ్‌కి..! ఆ ఉద్యోగాల వల్లే..)


