అలాంటి డైట్‌లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి..!: నటి ఊర్మిళ | Urmila Matondkar turns 52: warned youngsters not go on starvation diet | Sakshi
Sakshi News home page

అలాంటి డైట్‌లతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి..!: నటి ఊర్మిళ

Feb 4 2026 2:11 PM | Updated on Feb 4 2026 2:54 PM

Urmila Matondkar turns 52: warned youngsters not go on starvation diet

ముంబై భామ ఊర్మిళ మాతోండ్కర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌, టాలీవుడ్‌లో తనదైన అభినయం, అందంతో విమర్శకులు ప్రశంలందుకున్న ప్రముఖ నటిగా పేరుతెచ్చుకున్నారు. అంతేగాదు యువ హీరోయిన్లకు తీసిపోనివిధంగా గ్లామరస్‌గా కనిపిస్తుంటారామె. నాజుకైన దేహంతో పదహారణాల అమ్మాయిల కనిపిస్తుంటుంది. ఇవాళ ఫిబ్రవరి 4తో 52వ పుట్టిరోజులోకి అడుగుపెడుతున్న అలనాటి ముద్దుగుమ్మ ఈతరం యువతరానికి హెల్దీగా ఉండటంపై సలహాలు సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దామా..!.

ముఖ్యంగా 2008లో సైజ్‌ జీరో ఫ్యాషన్ క్రేజ్‌ ఎలా ఉందో తెలిసిందే. ఆ టైంలో యువత ఆ ట్రెండ్‌తో ఉర్రూతలూగుతున్నప్పుడూ కూడా నటి ఊర్మిళ యువతకు చాలా చక్కటి పిలుపునిచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. నాజుకైన శరీరం కంటే..ఆరోగ్యం ముఖ్యం అనే విషయాన్ని గుర్తుచేస్తూ ఆలోచింపచేసేలా మాట్లాడారామె. 50 ప్లస్‌లో కూడా ఇంతలా స్లిమ్‌గా బాడీ మెయింటైన్‌ చేస్తున్న ఊర్మిళ యువతకు ఇస్తున్న సలహా ఏంటేంటే..

ఆరోగ్యం పట్ల తానెప్పుడూ ట్రెండీ పోకడల జోలికి పోనంటున్నారామె. మన పూర్వీకులు ఫాలో అయ్యే ఆరోగ్యకరమైన అలవాట్లకే ప్రాధాన్యత ఇస్తానని నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారామె. క్రాష్‌ డైట్లంటూ పొట్ట మాడ్చుకోనని కూడా చెప్పారు. దయచేసి యువత ట్రెండీ డైట్లు, షార్ట్‌కట్‌లో బరువు తగ్గే విధానాల జోలికిపోయి..ఆరోగ్యాన్ని చేజేతులారా పాడుచేసుకోవద్దని హితవు పలికారు. ఇటీవల కాలంలో వెయిట్‌లాస్‌ అవ్వడం ఓ ట్రెండీగా మారింది. ముఖ్యంగా స్లిమ్‌గా ఉంటేనే మనుషులు అనేలా పరిస్థితి మారిపోయింది. ఇవన్నీ ఎలా ఉన్నా..ఆరోగ్యంగా ఉండటమే అన్నింట్లకంటే ముఖ్యమని నొక్కి చెప్పారు. 

నాజుకైన శరీరం కోసం..
తాన నాజుకైన శరీరం కోసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తానే తప్ప ఆహారం మానేయడం వల్ల కాదని అన్నారు. క్రాష్‌ డైట్‌ల జోలికి పోనని కూడా అన్నారామె. దేవుడు తనకు ఇచ్చిన మంచి జీన్స్‌ విషయమై సదా కృతజ్ఞతలు చెబుతుంటానని అన్నారు. 

యువత ఎక్కువగా ఉపవాస డైట్లు పాటిస్తూ..శరీరాన్ని పాడుచేసుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారామె. దానికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారం ఆస్వాదిస్తూ..వ్యాయామాలు చేయండి చాలు అని పిలుపునిచ్చారామె. 

ఫిట్‌నెస్‌ సీక్రెట్‌..
చాలామంది సెలబ్రిటీలు తమ ఫిట్‌నెస్‌కి విదేశీ సూపర్‌ ఫుడ్స్‌కి క్రెడిట్‌ ఇస్తే..సాంప్రదాయ భారతీయ వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారామె. తన మెరుగైన జీవక్రియకు, శక్తికి అవే మహారాష్ట్ర సంప్రదాయ ఆహారమేనని నొక్కి చెబుతారామె. ఫిట్‌గా ఉండాలంటే..పోషకాహారం, ఇంట్లో వండిన వంట్లకే కట్టుబడి ఉండటం అని చెబుతున్నారు. 

తాను ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఇలా స్లిమ్‌గా ఉన్నానని నమ్మకంగా చెప్పారామె. కాబట్టి..ఇంకెందుకు ఆలస్యం హాయిగా నచ్చిన పోషకాహారం తింటూ..వర్కౌట్లు చేస్తూ హెల్దీగా ఉందాం మరి..!.

(చదవండి: మళ్లీ పెళ్లి చేసుకుంటారా..? వృద్ధ మహిళలు ఏమన్నారో తెలుసా..!)

 

Advertisement
 
Advertisement
Advertisement