యాలకులను సువాసన కోసం వాడే వంట దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగి ఉన్నాయి.
తిన్న ఆహారం త్వరగా అరగడానికి యాలకులు బాగా పనిచేస్తాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి వాటిని తగ్గిస్తాయి.
భోజనానంతరం ఒక యాలక్కాయను నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి, నోరు తాజాగా ఉంటుంది.
తల తిరుగుతున్నప్పుడు యాలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది.
యాలకులు రక్తపోటును నియంత్రించి, గుండె పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతాయి.
గొంతు నొప్పి, దగ్గు ఉన్నపుడు యాలకులతో చేసిన కషాయం తాగితే ఉపశమనం లభిస్తుంది.


