వెయిట్‌లాస్‌ డ్రగ్‌ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత | Grammy Winner Jelly Roll Shares How He Lost 90 Kg With His Weight Loss Tips, More Details Inside | Sakshi
Sakshi News home page

వెయిట్‌లాస్‌ డ్రగ్‌ ఉపయోగించకుండానే..90 కిలోలు తగ్గిన గ్రామీ విజేత

Feb 4 2026 8:25 AM | Updated on Feb 4 2026 9:54 AM

Weight Loss Tips: Grammy Winner Jelly Roll Shares How He Lost 90 Kg

సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ ప్రముఖులు బరువు తగ్గేందుకు వెయిట్‌లాస్‌ డ్రగ్స్‌ లేదా సర్జరీలు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. గ్లామర్‌ ఫీల్డ్‌ కాబట్టి..అక్కడ వారి ఆహార్యం, లుక్‌ అత్యంత ప్రధానం. అదీగాక నిధానంగా బరువు తగ్గాలనేంత వ్వవధి వారికి ఉండదు కూడా కానీ ఈ అమెరికన్‌ రాపర్‌, గాయకుడు అలా కాదు..తొందరగా బరువు తగ్గించే మందులు జోలికే పోకుండా..ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గాడు. అదీకూడా ఏకంగా 90 కిలోలు పైనే బరువు తగ్గడం విశేషం. ఎంతో ఓపికతో..ఫుడ్‌ ఎడిక్షన్‌ని దూరం చేసుకుని మరి..స్లిమ్‌గా మారి స్ఫూర్తిగా నిలిచాడు. మరి అతడి వెయిట్‌లాస్‌ జర్నీ ఎలా సాగిందంటే..

పాటల రచయిత, గాయకుడు జెల్లీ 2026 గ్రామీ అవార్డుల ప్రెస్‌ ఈవెంట్‌లో స్మార్ట్‌లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేగాదు అక్కడ మీడియా ఇంటర్వ్యూలో తాను ఇంతలా స్లిమ్‌గా మారేందుకు తన ఫుడ్‌ ఎడిక్షన్‌పై ఎంతలా పోరాటం చేశాడో బహిరంగా వెల్లడించారు. తన కొకైన్‌ అడిక్షన్‌ని దూరం చేసుకున్నట్లుగానే ఈ ఆహార వ్యసనానికి చెక్కుపెట్టగలిగానని అన్నారు. అలాగే తన ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు చేసుకున్నట్లు తెలిపారు.

ఆహార వ్యసనానికి చెక్‌పెట్టడం అంటే..తినాలనే ఆలోచనను రానివ్వకుండా చేయడమేని అంటున్నాడు.  అలాగే జీవనశైలిలో వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్యకరమైన ఫుడ్‌ని తీసుకోవడం వల్ల ఈ మార్పులు సాధ్యమైనట్లు షేర్‌ చేసుకున్నారు. ఇంతకుమునుపు తన టూర్‌లన్నీ పార్టీలు, డ్రింక్‌, మత్తుపదార్థాల చుట్టూ తిరిగేది. ఇప్పుడు తన టూర్‌ సంస్కృతి మంచి ఆహారం, వ్యాయామం, భావోద్వేగ పరంగా బలంగా ఉండటం చుట్టూ ఉందని ఆనందంగా చెబుతున్నాడు జెల్లీ.

బరువు తగ్గడంలో ఆ రెండే కీలకం..
జెల్లీ రోల్‌ బరువు తగ్గించే ప్రయాణంలో నడక, పరుగు చాలా కీలకమైన ప్రభావాన్ని చూపించినట్లు పేర్కొన్నాడు. తాను 5కే రన్‌ కోసం శిక్షణ పొందుతున్నప్పుడు..చాలా బరువు తగ్గినట్లు పేర్కొన్నాడు. అలాగే 2024లో ఓ రన్‌ ఈవెంట్‌ కోసం సిద్దమయ్యే నేపథ్యంలో రోజుకి రెండు నుంచి మూడు మైళ్లు చోప్పున వారానికి నాలుగు నుంచి ఆరు రోజులు పరిగెత్తేవాడట. 

ఇలా బరువు తగ్గడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని..అందువల్ల మరింత బరువు తగ్గేలా ప్లాన్‌ చేయాలని అనుకుంటున్నట్లు వివరించాడు. పైగా తేలిగ్గా ఉండి, ఏ టూర్‌ అయినా ఇట్టే వెళ్లిపోగలం, హాయిగా ఎంజాయ్‌ చేయగలం అని అంటున్నాడు. 

 

(చదవండి: తరుచుగా ఉద్యోగాలు మారుతున్నారా..!? కానీ ఆ ఏజ్‌కి..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement