శబరిమలలో మండల కాలంలో అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటైన థంక అంకి (స్వర్ణ వస్త్రం)తో కూడిన దీపారాధన డిసెంబర్ 26 సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు. అయితే అంతకంటే ముందు జరిగే ఈ థంక అంకి ప్రదక్షిణ లేదా ఊరేగింపు ఈ రోజు నుంచే మొదలవ్వుతుంది. ఇంతకీ అసలేంటి థంక అంకి ఊరేగింపు, దాని ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలుసుకుందామా..!
థంక అంకి ప్రదక్షిణ అంటే ..
శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజకు ముందు జరిగే పవిత్ర బంగారు వస్త్రాల ఊరేగింపు. ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది.
ఎప్పుడు జరుగుతుందంటే..
శబరిమలలో అయ్యప్ప మండల పూజకు నాలుగు రోజుల ముందు ఈ ఊరేగింపు ప్రారంభమవుతుంది.
ముందుగా పతనంతిట్టలోని అరన్ముల పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరుతుంది. నిలక్కల్ పంప మీదుగా శబరిమల సన్నిధానానికి చేరుతుంది. ఇక "థంక అంకి" అనేది అయ్యప్ప విగ్రహానికి అలంకరించే బంగారు వస్త్రం. ఇందులో కిరీటం, పాదుకలు, చేతి తొడుగులు, ముఖం, పీఠం వంటి ఆభరణాలు ఉంటాయి.
ప్రాముఖ్యత
ఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోతుంది అక్కడి వాతావరణం. వృశ్చికరాశి కాలంలో జరిగే మండల పూజలో అయ్యప్ప స్వామిని థంక అంకితో అలంకరించడం ఒక అనాదికాలపు సంప్రదాయం. థంక అంకిని దర్శించడం, ప్రదక్షిణలో పాల్గొనడం భక్తులకు మహా పుణ్యప్రదం అని నమ్మకం.
చరిత్ర:
ఈ థంక అంకిని 1973లో అప్పటి ట్రావెన్ కోర్ రాజ కుటుంబానికి చెందిన దివంగత చిత్తిర తిరునాళ్ బాలరామ వర్మ మహారాజు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సమర్పించారు. అరణ్ముల పార్థసారథి ఆలయం నుంచి భవ్యమైన ఊరేగింపుగా తీసుకురాబడే థంక అంకి డిసెంబర్ 26 సాయంత్రం సుమారు 5 గంటలకు శరన్ గుత్తికి చేరుతుంది.
ఆ రోజు సాయంత్రం దేవాలయం తెరచిన తరువాత తంత్రిగారు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర మాలలను అలంకరించిన అనంతరం థంక అంకిని స్వాగతించేందుకు బృందాన్ని పంపుతారు. సాంప్రదాయ వాద్యబృందాలు , కఠినమైన పోలీసు భద్రత మధ్య ఈ ఊరేగింపు సన్నిధానానికి చేరుతుంది.
18 పవిత్ర మెట్లు ప్రారంభంలో దేవస్వం బోర్డు అధ్యక్షులు, సభ్యులు థంక అంకిని స్వీకరించి సోపానం వరకు తీసుకువెళ్తారు. అక్కడ తంత్రి, మెల్సాంతి థంక అంకిని ఆచారపూర్వకంగా స్వీకరించి అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరిస్తారు. తదనంతరం దీపారాధన నిర్వహిస్తారు. ఈ ఘడియలోనే మండల కాలంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సన్నిధానంలో చేరుతారు.
థంక అంకి ఊరేగింపు మార్గం, సమయాలు
డిసెంబర్ 23–24 (మొదటి రోజు మార్గం)
మూర్తిత్త గణపతి ఆలయం – 7:15 AM
పున్నంథొట్టం దేవి ఆలయం – 7:30 AM
చవిట్టుక మహాదేవ ఆలయం – 7:45 AM
తిరువంచంకావు ఆలయం – 8:00 AM
నెడుంప్రయార్ తేవరశేరి దేవి ఆలయం – 8:30 AM
నెడుంప్రయార్ జంక్షన్ – 9:30 AM
కోజెంచెరి పట్టణం – 10:00 AM
అయ్యప్ప మండపం (కాలేజ్ జంక్షన్) – 10:15 AM
పంపడిమోన్ అయ్యప్ప ఆలయం – 10:30 AM
కరిమ్వేలి – 11:00 AM
ఎలంతూర్ ఎడతావళం – 11:15 AM
ఎలంతూర్ భగవతీకున్ను ఆలయం – 11:20 AM
ఎలంతూర్ గణపతి ఆలయం – 11:30 AM
ఎలంతూర్ నారాయణమంగళం – 12:30 PM
ఆయతిల్ మలానాడ జంక్షన్ – 2:00 PM
ఆయతిల్ గురుమండిరం జంక్షన్ – 2:40 PM
మెఝువేలి ఆనందభూతేశ్వర ఆలయం – 2:50 PM
ఎలవుంథిట్ట దేవి ఆలయం – 3:15 PM
ఎలవుంథిట్ట మలానాడ – 3:45 PM
ముట్టత్తుకోణం SNDP మందిరం – 4:30 PM
కైథవాన దేవి ఆలయం – 5:30 PM
ప్రకణం ఎడనాడ దేవి ఆలయం – 6:00 PM
చీకనల్ – 6:30 PM
ఉప్పమోన్ జంక్షన్ – 7:00 PM
ఒమల్లూర్ శ్రీరక్తకంఠ స్వామి ఆలయం – 8:00 PM
డిసెంబర్ 24 – రెండో రోజు (ఉదయం 8 గంటలకు ఒమల్లూర్ నుండి ప్రారంభం)
కొడుంతర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం – 9:00 AM
అఝూర్ జంక్షన్ – 10:00 AM
పథనంతిట్ట ఉర్మన్ కోవిల్ – 10:45 AM
పథనంతిట్ట ఆలయం – 11:00 AM
కరింపనక్కల్ దేవి ఆలయం – 11:30 AM
శారదామఠం ముండుకొట్టక్కల్ SNDP హాల్ – 12:00 PM
కడమణిట్ట భగవతి ఆలయం – 1:00 PM
కొట్టపారా కల్లెలిముక్కు – 2:30 PM
పెరుంకాడ SNDP హాల్ – 2:45 PM
మైకోజూర్ ఆలయం – 3:15 PM
మైలాప్ర భగవతి ఆలయం – 3:45 PM
కుంబఝా జంక్షన్ – 4:15 PM
పలమత్తూర్ అంబలముక్కు – 4:30 PM
వెట్టూర్ మహావిష్ణు ఆలయం (గోపురప్పడి) – 5:30 PM
ఎలకొల్లూర్ మహాదేవ ఆలయం – 6:15 PM
చిత్తూర్ముక్కు – 7:15 PM
కొన్నీ పట్టణం – 7:45 PM
కొన్నీ చిరైక్కల్ ఆలయం – 8:00 PM
కొన్నీ మురింగమంగళం ఆలయం – 8:30 PM
డిసెంబర్ 25 – మూడో రోజు (ఉదయం 7:30 – మురింగమంగళం నుండి)
చిత్తూర్ మహాదేవ ఆలయం – 8:00 AM
వెట్టూర్ ఆలయం – 9:00 AM
మైలాడుంపారా – 10:30 AM
కొట్టముక్కు – 11:00 AM
మలయాలపుఝ ఆలయం – 12:00 PM
మలయాలపుఝ తాళం – 1:00 PM
మన్నరకులంజి ఆలయం – 1:15 PM
రన్నీ రామపురం ఆలయం – 3:30 PM
ఇదక్కులం ఆలయం – 5:30 PM
వడశేరిక్కర చేరుకావు – 6:30 PM
ప్రయార్ మహావిష్ణు ఆలయం – 7:00 PM
మడమోన్ ఆలయం – 7:45 PM
పెరునాడ్ ఆలయం – 8:30 PM
డిసెంబర్ 26 – తుది రోజు (ఉదయం 8:00 – పెరునాడ్ నుండి)
లాహా – 9:00 AM
ప్లప్పల్లి – 10:00 AM
నిలక్కల్ మహాదేవ ఆలయం – 11:00 AM
పంప – 1:30 PM
శరణ్కుట్టి – 5:00 PM
అనంతరం శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానానికి థంక అంకి చేరుకుంటుంది. ఇక మండల పూజ అనంతరం థంక అంకి వస్త్రాన్ని అరన్ముల పార్థసారథి ఆలయానికి తీసుకెళ్లి దేవస్వామ్‌లోని స్ట్రాంగ్‌రూమ్‌లో ఉంచుతారు. తొలినాళ్లలో కొట్టాయం నుంచి హంస రథంలో ఈ థంక అంకి వస్త్రాన్ని సన్నిధానానికి తీసుకెళ్లేవారు.
అయితే గత కొన్నేళ్లుగా లక్షలాది మంది భక్తులు థంక అంగీ, దీపారాధన ఊరేగింపును చూసేందుకు భారీగా తరలివస్తుండటం విశేషం. ఇక ఈ ఏడాది కూడా మండలపూజకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు.
(చదవండి: శబరిమల యాత్రికులకు సాంప్రదాయ కేరళ సాద్య..! ఈ విందలో ఏం ఉంటాయంటే..)


