ప్రారంభించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ వారంలో జరిగే చీఫ్ సెక్రటరీల 5వ జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు కొనసాగుతుందని అధికారులు సోమవారం తెలిపారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సదస్సుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పనిచేసే యువ జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లతోపాటు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు అధికారులు సైతం ఇందులో పాల్గొనే అవకాశముందని చెప్పారు.


