కార్లూన్లతో పాపులర్ అయిన పిల్లల కామెడీషో నికెలోడియన్ లో నటించిన అలనాటి నటుడు ఇపుడు దీనమైన స్థితిలో కనిపించాడు. కాలిఫోర్నియా వీధుల్లో 36 ఏళ్ల టైలర్ చేజ్ కాలిఫోర్నియా వీధుల్లో నివసిస్తున్నట్లు కనిపించడం అభిమానులలో, సహనటులలో ఆందోళన రేకెత్తించింది. తమకెంతో సుపరిచితమైన బాల నటుడిని ఇలా హృదయ విదారకమైన రీతిలో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో చూడటం చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బాల నటులు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలు, మానసిక ఆరోగ్య సవాళ్లపై చర్చకు దారి తీసింది.
2004-2007 మధ్య నెడ్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్‌లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు చేజ్. లాస్ ఏంజిల్స్‌లోని రివర్‌సైడ్‌లో సెప్టెంబర్‌లో కనిపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మాసిపోయిన లాస్ ఏంజిల్స్ రైడర్స్ పోలో షర్ట్ జీన్స్ ధరించి కనిపించాడు. జీన్స్ ప్యాంట్ ఎగదోసుకుంటూ,మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా కనిపించడం, అభిమానులు దిగ్భ్రాంతికి గురిచేసింది. అపుడు వీడియో తీసిన వ్యక్తి అతని గురించి ప్రస్తావించినపుడు తాను నికెలోడియన్ బాల నటుడిని అని చేజ్ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో చేజ్ పేరు మీద GoFundMe పేజీని ఏర్పాటు చేసి 1,200 డాలర్లకు పైగా నిధులను సేకరించారు. అయితే ఈ విరాళాలను చేజ్ తల్లి నిరాకరించారు. విరాళాల సేకరణను నిలిపివేయాలని కోరారు. టైలర్‌కు డబ్బు కాదు వైద్య సహాయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నోసార్లు చాలా ఫోన్లు కొనిచ్చా. కానీ ఒకటి, రెండు రోజుల్లోవాటిని పోగొట్టుకుంటాడు. వైద్య ఖర్చుల కోసం మనీ మేనేజ్ చేయడం అతనికి తెలియ దంటూ వివరించారు. ఈ సందర్భంగా గోఫండ్‌మీ ద్వారా విరాళాల సేకరణను అభినందించారు. కానీ నిజానికి ఈ డబ్బుతో లాభం లేదన్నారు.
మరోవైపు చేజ్ పరిస్థితి గురించి అతని మాజీ సహనటులు డెవాన్ వెర్క్‌హైజర్, లిండ్సే షా . డేనియల్ కర్టిస్ లీ కూడా నెడ్స్ డిక్లాసిఫైడ్ పాడ్‌కాస్ట్ సర్వైవల్ గైడ్ ఎపిసోడ్ సందర్భంగా బహిరంగంగా చర్చించారు. తమ సహనటుడి ప్రస్తుత పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. టైలర్‌కు మళ్లీ మంచి రోజులు రావాలని ఆశించారు. కాగా చేజ్ 1989 సెప్టెంబర్ 6 న అరిజోనాలో జన్మించాడు. 2000ల ప్రారంభంలో బాటనటుడుగా తన నటనతో ఆకట్టుకున్నాడు. 2004 నుండి 2007 వరకు ‘నెడ్స్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్’లో మార్టిన్ క్వెర్లీ పాత్రను పోషించాడు. గుడ్ టైమ్ మాక్స్ (2007), ఎవ్రీబడీ హేట్స్ క్రిస్ (2005)లలో కూడా కనిపించాడు.
ఇదీ చదవండి: రూ. 8.10 కోట్ల మోసం.. తుపాకీతో కాల్చుకున్న మాజీ ఐజీ
Former Nickelodeon child stars are having a rough one pic.twitter.com/qN95SrxOmJ
— 𓅃 (@FalconryFinance) December 21, 2025


