సాధారణంగా ఏ వస్తువైనా కొందరికి నోట్లోకి వెళ్లిపోవాల్సిందే. అంటే కొంతమందికి అదో అలవాటులా ఏదోక వస్తువుని నోట్లో పెట్టుకుని నములుతున్నట్లుగా చేస్తుంటారు. అయితే అది ప్రమాదకరమైనదా లేద పెట్టకూడనిదా అని ఉండదు. ఏదైతేనేం..అలా నోటిలో పెట్టి నమలాల్సిందే. ఇక్కడొక యువకుడు అలాంటి పాడు అలవాటు కారణంగానే తీవ్ర గాయలపాయాలయ్యాడు.
అసలేం జరిగిందంటే..ఈ ఘటన చూశాక ఎవ్వరూ ఇలాంటి సాహసం చేసే యత్నమైతే చేయరని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడొక మొబైల్ షాప్‌లో యువకుడు కూర్చొని మొబైల్ ఫోన్ బ్యాటరిని నోటిలో పెట్టుకుని నమిలే ప్రయత్నం చేశాడు. అది లిథియం బ్యాటరీ కావడంతో.. ఇలా గట్టిగా నమిలాడో లేదో..అంతే ఒక్కసారిగా పెద్దశబ్దంతో కూడిన మంటలు ఎగిశాయి.
అదృష్టవశాత్తు ఆ అబ్బాయికి ఏం కాలేదు. కొద్దిపాటి గాయాలతో బయటపడ్డాడు. సమీపంలోని వ్యక్తులు అతడిని తక్షణమే ఆస్పత్రికి తరలించారు. ఇక ఆ మండుతున్న బ్యాటరీని అక్కడున్న మరో వ్యక్తి కాస్త ధైర్యం చేసి బయటకు విసిరే ప్రయత్నం చేశాడు. దాంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్యాటరీలను ఇలా నోట్లో పెట్టుకోకూడదని, అందులోనూ లిథియం అధిక శక్తిని నిల్వ చేస్తుందని దాంతో అస్సలు ఆడుకోవద్దని హెచ్చరిస్తూ పోస్టులు పెట్టారు.
Shocking incident inside a mobile shop when a boy began chewing on a Lithium Phone Battery. Within seconds, the battery exploded, leaving him seriously injured. The injured boy was rushed for medical treatment pic.twitter.com/03MeyXz28p
— Rosy (@rose_k01) February 5, 2026
(చదవండి: తస్మాత్ జాగ్రత్త..! ఎల్లప్పుడూ.."మంచి" ఆరోగ్యానికి ముప్పు..!)


