
ప్రోకబడ్డీ లీగ్-2025 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తెలుగు టైటాన్స్‌కు హరియాణా స్టీలర్స్ ఊహించని షాకిచ్చింది. బుధవారం రాత్రి ఢిల్లీ వేదికగా హరియాణా స్టీలర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34–45తో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది.
టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్ భరత్ (16) ఒక్కడే పోరాడాడు. 17 సార్లు కూతకెళ్లిన అతను 15 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను టాకిల్ చేసి మరో పాయింట్ అందించాడు. సహచరుల్లో డిఫెండర్ అంకిత్ (5) మెరుగ్గా ఆడారు. వీరిద్దరూ మినహా మిగితా అందరూ దారుణంగా విఫలమయ్యారు.
స్టీలర్స్ విజయంలో రెయిడర్లు వినయ్ (11), శివమ్ పతారే (8) కీలకపాత్ర పోషించారు. రెయిడింగ్‌లో చురుగ్గా వ్యవహరించిన ఇద్దరు అదేపనిగా పాయింట్లు తెచ్చిపెట్టారు. డిఫెండర్లలో రాహుల్ 4, నీరజ్, హర్దీప్, కెప్టెన్ జైదీప్ తలా 3 పాయింట్లు సాధించారు.
కాగా తెలుగు టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇక గురువారం జరిగే పోటీల్లో బెంగళూరు బుల్స్‌తో గుజరాత్ జెయింట్స్; యూపీ యోధాస్‌తో యు ముంబా; పట్నా పైరేట్స్‌తో జైపూర్ పింక్‌పాంథర్స్ తలపడతాయి.
చదవండి: సెమీఫైనల్లో స్థానం కోసం...