విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం మధ్య ట్రాటా గ్రూపుసొంతమైన ఎయిరిండియా ఇచ్చిన పైలట్ల నియామక ప్రకటన సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఒక పక్క ఇండిగో పైలట్ల కొరతతో ఇబ్బంది పడుతోంటే సందట్లో సడేమియా అన్నట్టు ఎయిర్‌బస్ A320 మరియు బోయింగ్ B737 విమానాల కోసం పైలట్లు కావాలంటూ ఎయిరిండియా ప్రకటనలో జారీ చేయడం నెట్టింట చర్చకు దారి తీసింది.
"స్కై ఈజ్ నాట్ ది లిమిట్" ఇది ప్రారంభం మాత్రమే అని టాటా గ్రూప్ కంపెనీలో కెరీర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పైలట్లను కోరుతూ ఎయిరిండియా ప్రకటించింది. "భారత విమానయాన భవిష్యత్తును ఏలండి.. అనుభవజ్ఞులైన B737 , A320 పైలట్లను మా పెరుగుతున్న విమానాల సముదాయంలో చేరమని ఆహ్వానిస్తున్నాం. డిసెంబర్ 22 నాటికి మీ దరఖాస్తులను సమర్పించండి" అని ఎయిర్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌లో తెలిపింది. ఈ ప్రకటన సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.
మరోవైపు గత సంవత్సరం రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) జారీ చేసిన సవరించిన విమాన డ్యూటీ సమయ పరిమితులు (FDTL) నియమాలు, విమానాల రద్దు, రీషెడ్యూల్‌తో ఇండిగో తీవ్ర విమర్శలెదుర్కొంటోంది. తీవ్ర పైలట్ల కొరతను ఎదుర్కొంటున్న ఇండిగో కూడా ఇప్పటికే నిపుణులైన పైలట్ల, ఇతర సిబ్బంది నియామకాల కోసం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది.
ఇదీ చదవండి: ప్రమాదంలో చూపు పోయింది : లెఫ్టినెంట్ కల్నల్ సక్సెస్ జర్నీ
విమాన కార్యకలాపాలు సకాలంలో పనితీరు క్రమంగా మెరుగుపడుతున్నాయని ప్రకటించినప్పటికీ ఇండిగో విమానాలను రద్దు కొనసాగుతూనే ఉంది.
దీంతో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు ఈరోజు 6.9 శాతం పడిపోయాయి . దాదాపు 66 శాతం దేశీయ మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఇండిగోకు ఇది ఎనిమిది నెలల్లో అత్యధికం నష్టం.
ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్


