సాక్షి, అమరావతి: ఇండిగో సమస్యను ఏపీ మంత్రి నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీ కొట్టుకున్న సెల్ఫ్ డబ్బా ఎంత ట్రోలింగ్‌కు దారి తీసిందో చెప్పనక్కర్లేదు. అసలు ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు లోకేష్ ఎవరంటూ ఎవరు? అంటూ జాతీయ మీడియా చానెల్స్ ఏకిపారేశాయి. అదే టైంలో.. టీడీపీ నుంచి విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్‌నాయుడిని సైతం రాజీనామా చేయాలంటూ బలమైన డిమాండే వినిపిస్తోంది. ఈ దరిమిలా ఇండిగో సమస్యను అవలీలగా కేంద్రంపైకి నెట్టేశారు చంద్రబాబు.
మంచి జరిగితే క్రెడిట్‌ను నిసిగ్గుగా తన ఖాతాలో వేసుకునే నారా చంద్రబాబు నాయుడు.. ఇండిగో సమస్య విషయంలో మాత్రం యూటర్న్ తీసుకున్నారు. ఈ సంక్షోభాన్ని కేంద్రమే పరిష్కరించాలంటూ సోమవారం వ్యాఖ్యలు చేశారాయన.
‘‘ఇండిగో ప్రమాణాలు పాటించడం లేదు. టైం ఇచ్చినా చేయలేకపోయారు. ఇండిగో గుత్తాధిపత్యం వల్లే సమస్యలు వచ్చాయి. ఈ విషయంపై మేమేం మానిటరింగ్ చేయడం లేదు. ఇండిగో సమస్యపై కేంద్రం దృష్టి పెట్టింది. వాళ్లే సమస్యకు కేంద్రమే పరిష్కారం కనిపెట్టాలి’’ అంటూ వ్యాఖ్యానించారాయన.
ఏపీలో ప్రభుత్వంలో ఉంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. కానీ, సంక్షోభ బాధ్యతలను మాత్రం భాగస్వామిగా స్వీకరించడం లేదు. పైగా ఇండిగో సమస్యతో దేశం పరువు తీసిన రామ్మోహన్‌నాయుడుతో బాధ్యతగా మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిన పని కూడా చేయలేదు. ఇవేవీ చేయకపోగా.. ట్రోలింగ్ దెబ్బకు యూటర్న్ తీసుకుని ఇప్పుడు ‘‘అబ్బే.. ఇండిగో సమస్యతో మాకేం సంధం లేదని.. అంతా కేంద్రందే’’నంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం.


