పర్వతాలు వాటి దిగువ ప్రాంతాలలో జీవిస్తున్నవారికి తాగు నీరు, ఆహారం, జీవనోపాధిని అందించేందుకు ప్రతి సంవత్సరం కృషి జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ హిమానీ నదాల సంరక్షణ సంవత్సరంగాప్రకటించడం వెనుక గల ఉద్దేశమూ అదే. డిసెంబర్ 11 ఇంటర్నేషనల్ మౌంటెయిన్ డే సందర్భంగాసుందర దృశ్యాలకు నెలవుగా ఉన్న హిమాలయాలలో సాహసోపేతమైన ట్రెక్కింగ్ మార్గాలను అన్వేషిద్దాం...
పర్వతారోహణలో సుందర దృశ్యాలు, ఆత్మిక శక్తి, శిఖరాగ్రం చేరుకున్నాక పూర్తి శాంతిని అనుభవంలోకి తీసుకువస్తాయి హిమనీ నదాలు. భారతదేశం, నేపాల్ అంతటా విస్తరించి ఉన్న హిమాలయాలు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక అనుభవాలను అందిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని పచ్చని లోయలు, కాశ్మీర్‌లోని స్వచ్ఛమైన సరస్సులు, లడఖ్‌లో క్లిష్టమైన మార్గాలు, సిక్కింలోని ప్రశాంతమైన కొండల నుండి నేపాల్‌లోని గంభీరమైన శిఖరాల వరకు హిమాలయాలు సాహస యాత్రకు ఆహ్వానం పలుకుతున్నాయి.
మన దేశంలో కేదార్‌కాంత ట్రెక్, ఉత్తరాఖండ్‌లోని ఉల్లాసకరమైన పంగర్చుల్లా పీక్ ట్రెక్, కాశ్మీర్ గ్రేట్ లేక్స్, పశ్చిమ బెంగాల్‌లోని సందక్‌ఫు ట్రెక్, సిక్కింలోని గోచల, లడఖ్‌లోని మార్ఖా లోయను వీక్షించి తీరాల్సిందే. నేపాల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్, సుందరమైన అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్, ప్రశాంతమైన లాంగ్‌టాంగ్ వ్యాలీ, అద్భుతమైన మార్డి హిమాల్ ట్రెక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ట్రెక్కింగ్ మార్గాలలోనూ మునిగిపోవచ్చు. హిమాలయాలలో భద్రత, సౌకర్యాలతో మరపురాని జ్ఞాపకాలను అందించేందుకు ట్రావెల్ ఏజెన్సీలు రూ.20,000 నుంచి లక్ష రూపాయల వరకు ప్యాకేజీలను అందిస్తున్నాయి.
అనువైన మరిన్ని ట్రెక్కింగ్ ప్లేస్‌లు...
కేదార్‌కాంతతో పాటు హిమాలయాలలోనే ఎత్తైన పర్వత శిఖరాలలో పేరొందినవి.
దయారా బుగ్వాల్ ట్రెక్
అతి ఎత్తైన శిఖరాలలో ఒకటిగా పేరొందిన దయారా పర్వతం ఎత్తైన గడ్డి మైదానాలతో నిండి ఉంటుంది. ఇది ఏడాది పొడవునా ట్రెకింగ్ చేయడానికి అందుబాటులో ఉండగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో స్కీయింగ్ చేసేవారికి మరింత అనుకూలం.
ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పచ్చదనంతో నిండి ఉంటుంది. నవంబర్ నుంచి మార్చి వరకు మంచుతో నిండి ఉంటాయి. హిమాలయ శిఖరాలను 360 డిగ్రీల కోణంలో చూడవచ్చు. ట్రావెల్ ఏజెన్సీలు అందిస్తున్న ప్యాకేజీలో భోజనం, టిఫిన్, టెంట్లు, స్లీపింగ్ బ్యాగులు, అనుభవజ్ఞులైన ట్రెక్కింగ్ గైడ్లు, వైద్య సౌకర్యాలు, ఆక్సిజన్ సిలిండర్లు.. వంటివి అందిస్తారు. డెహ్రాడూన్ నుండి దయారా బుగ్వాల్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ఉంది.
బ్రహ్మతల్... లేక్ ట్రెక్
పచ్చిక, అడవులు, మంచుతో నిండిన శిఖరాలను చూస్తూ సాగించే వింటర్ ట్రెక్ ఇది. బెకల్తాల్ సరస్సు పూర్తిగా ఘనీభవించి ఉంటుంది. దీనికి తోడు త్రిశూల్ పర్వతం, నందా ఘటి పర్వతం వంటి శక్తివంతమైన హిమాలయ శిఖరాలు కనిపిస్తాయి. ఇక బ్రహ్మతల్ శిఖరాగ్రం నుండి మరిన్ని అద్భుత శిఖరాలను చూడవచ్చు.
అడవులు, గ్రామాలు, పచ్చికభూములు, ఘనీభవించిన సరస్సు మీదుగా ఈ ట్రెక్కింగ్ సాగుతుంది. సరస్సు చుట్టూ పడే శీతాకాలపు సాయంత్రం నడక ఎప్పటికీ గుర్తుండి΄ోతుంది. బ్రహ్మతల్ సరస్సు వద్ద బ్రహ్మ తపస్సు చేశాడని, ఈ సరస్సును బ్రహ్మ పవిత్ర సరస్సుగా మార్చాడని స్థానిక గ్రామస్తులు చెబుతారు.
కువారీ పాస్ ట్రెక్
ఇది గర్హా్వల్ పర్వత శ్రేణిలోని ప్రాచీన ట్రెక్‌లలో ఒకటిగా పేరొందింది. ట్రావెల్ ఏజెన్సీలు ఆరు రోజులకు గాను రూ.7000 నుంచి రూ.9000 వరకు ప్యాకేజీలు అందిస్తున్నాయి. ఇది చారిత్రక ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్న ట్రెక్. 1905లో అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ ట్రెక్ చేరుకున్నాడు.
అప్పటి నుండి అతని పేరు మీదుగానే ఈ ట్రెక్‌ను పిలుస్తున్నారు. ఇది ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ ట్రెక్ రిషికేశ్ నుండి మొదలవుతుంది. జోషిమఠ ప్రాంతంలోని గ్రామాల మీదుగా ప్రయాణించాలి. మంచుతో నిండి, ఏడాది పొడవున ఉండే కువారీ పాస్ ట్రెక్ అన్ని సీజన్లలోనూ అందంగా ఉంటుంది.
సందక్పు ఫలుట్ ట్రెక్..
ఈ ట్రెక్‌లో నాలుగు ఎత్తైన శిఖరాలను చూసే ఉత్కంఠభరితమైన అనుభవాన్ని పొందవచ్చు. ఒకవైపు ఎవరెస్ట్, లోట్సే, మకాలు శిఖరాలు చూడవచ్చు. మరోవైపు గంభీరమైన కాంచన్‌జంగా శిఖరంపై కిరీటంలా ఉన్న ప్రసిద్ధ స్లీపింగ్ బుద్ధ మాసిఫ్‌ను చూడవచ్చు. సందక్పు ట్రెక్‌లో భారతదేశంలోనే అత్యుత్తమ సూర్యాస్తమయ, సూర్యోదయాలను చూడవచ్చు. వెదురు, రోడోడెండ్రాన్ అడవులు సందక్పు ట్రెక్ అందాన్ని మరింత పెంచుతాయి. హిమాలయా పుష్పాలుగా ప్రత్యేకత గల రోడోడెండ్రాన్‌లు ఇక్కడ కనిపిస్తాయి. అరుదైన ఎర్ర΄ాండాలను కూడా చూడవచ్చు.
ట్రావెల్ ట్రెండ్స్‌క్వయిట్ వోవర్‌ఎవ్రీ థింగ్
‘క్వయిట్ వోవర్ ఎవ్రీథింగ్’ హవా కొనసాగనుంది. ఆధునిక జీవితంలోని రకరకాల ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనే ట్రెండ్ ఇది. డిజిటల్ సంస్కృతిలో పీకల లోతు మునిగిపోయాక చాలామందికి ఇతర ప్రపంచాలేవీ కనిపించడం లేదు. డిజిటల్ సంస్కృతికి ఆవల అద్భుత ప్రపంచం ఉంది. ఆ ప్రపంచంలోకి వెళ్లాలంటే ప్రయాణించాలి.
ప్రయాణించాలంటే డిజిటల్ సంకెళ్లను ఛేదించాలి. ఈ క్రమంలోనే డిజిటల్ డిటాక్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. మితిమీరిన డిజిటల్ సంస్కృతి నుంచి బయటపడి మానసిక ప్రశాంతతను వెదుక్కుంటూ కొత్త ప్రదేశాలకు వెళ్లే ధోరణి పెరిగింది.
ఒరెగాన్స్ స్కైకేవ్ రిట్రీట్స్‌లో అతిథులు చీకటి క్యాబిన్‌లలో మూడు రోజులు బస చేస్తారు! కొన్ని రోజుల పాటు బాహ్యప్రపంచానికి, వెలుతురుకు దూరంగా ప్రత్యేకంగా సిద్ధం చేయబడిన పిచ్–బ్లాక్ గదులలో లేదా చీకటి గుహలలో గడపడం అనేది టిబెటన్ బౌద్ధంలోని సంప్రదాయం. ఈ బౌద్ధ సంప్రదాయం ట్రావెల్స్ ట్రెండ్స్‌లో ఒకటిగా మారింది. ‘స్వీయ–ఆవిష్కరణకు ఉపకరిస్తుంది’ అంటారు ఈ విధానాన్ని అనుసరించేవారు.
పర్వతారోహకులకు వెంట తప్పనిసరి...
పర్వతారోహణ చేసే పర్యాటకులు ఆడ/మగ సమకూర్చుకోవాల్సినవి, వెంట తెచ్చుకోవాల్సినవి...
రక్‌బ్యాక్, డౌన్ జాకెట్, గ్లౌజ్‌లు (వాటర్ ప్రూఫ్‌వి), పోంచో లేదా రెయిన్ కోట్, ట్రెక్కింగ్ పోల్, హెడ్ ??టార్చ్, ట్రెక్ షూస్, ట్రెక్ ΄్యాంట్ – 2, ఒక జత థర్మల్స్, వెచ్చని సాక్స్ (జత), కాటన్ సాక్స్ (3–4 జతలు), ఉన్ని టోపీ, సన్ క్యాప్, గ్లౌజులు (ఉన్ని, వాటర్ ప్రూఫ్), అవసరాన్ని బట్టి అదనపు దుస్తులు, ప్లేట్లు, చెంచా, కాఫీ కప్పు, ఫోటో గుర్తింపు కార్డు, సన్ గ్లాసెస్, హ్యాండ్ టవల్, సన్ స్క్రీన్ లోషన్, మాయిశ్చరైజర్, చెప్పులు. పవర్‌బ్యాంక్స్, టాయిలెట్ పేపర్ రోల్స్, టవల్స్, జిప్ లాక్ బ్యాగులు, శానిటైజింగ్ టాయిలెట్ స్ప్రే, సోప్, హ్యాండ్ వాష్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ .. మొదలైనవి అవసరం అవుతాయి.
ప్రపంచంలో.. ఎత్తైన ఏడు శిఖరాలు
ప్రపంచంలోని ప్రతి ఖండంలో ఉన్న ఎతైన శిఖరాలను అధిరోహించడం ఏ పర్వతారోహకుడికైనా లభించే అత్యంత గౌరవనీయమైన విజయాలలో ఒకటి. సెవన్ సమ్మిట్‌గా పేరొందిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఏడు శిఖరాలను కలిగి ఉన్న పర్వతాలు, వాటి మార్గాలు..
ఆసియా: ఎవరెస్ట్ శిఖరం
ఎవరెస్ట్ శిఖరం ఆసియాలోనూ, ప్రపంచంలోనే అత్యంత ఎతఐన పర్వతం. ఇది నేపాల్, టిబెట్ మధ్య సరిహద్దులో దక్షిణ ఆసియాలోని గ్రేట్ హిమాలయాలలో ఉంది. 29,035 అడుగుల (8,850 మీటర్లు) ఎత్తుకు చేరుకున్న దీనిని 1852లో గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియా భూమి ఉపరితలంపై ఎతైన ప్రదేశంగా గుర్తించింది. ఎవరెస్ట్ పైకి ప్రధాన యాత్రలు 1920లలో ప్రారంభమయ్యాయి. కానీ 1953లో ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గే లు దాని శిఖరాన్ని చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది పర్వతారోహకులు ఈ శిఖరాగ్రాన్ని చేరుకునేందుకు తపిస్తున్నారు.
దక్షిణ అమెరికా: మౌంట్ అకాన్‌కాగువా
దక్షిణ అమెరికా, పశ్చిమ అర్ధగోళం రెండింటిలోనూ అకాన్‌కాగువా పర్వతం ఎతై ్తనది. ఇది పశ్చిమ–మధ్య అర్జెంటీనాలోని చిలీ సరిహద్దులో ఉంది. అకాన్‌కాగువా పర్వతం ఉత్తర, దక్షిణ అనే రెండు శిఖరాలను కలిగి ఉంది, ఇవి ఒక శిఖరం ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. దక్షిణ శిఖరం 22,736 అడుగులు (6,930 మీటర్లు) ఎత్తులో ఉంది. 22,831 అడుగులు (6,959 మీటర్లు) ఎత్తులో ఉన్న ఎతైన ఉత్తర శిఖరాన్ని మొదటిసారిగా 1897లో స్విస్ అధిరోహకుడు మాథియాస్ జుర్బ్రిగ్గెన్ చేరుకున్నాడు.
ఉత్తర అమెరికా: డెనాలి
డెనాలి (మౌంట్ మెకిన్లీ అని కూడా పిలుస్తారు) ఉత్తర అమెరికాలో ఎత్తైన శిఖరం. ఇది దక్షిణ–మధ్య అలాస్కాలోని అలాస్కా శ్రేణిలో ఉంది. ఈ పర్వతం 18,000 అడుగులు (5,500 మీటర్లు) ఎత్తు ఉంటుంది. 1910లో ఇద్దరు ప్రాస్పెక్టర్లు ఉత్తర శిఖరాన్ని జయించిన మొదటి అధిరోహకులు. హడ్సన్ స్టక్, హ్యారీ కార్స్టెన్స్ జూన్ 7, 1913న సౌత్ పీక్‌కు ఒక బృందానికి నాయకత్వం వహించారు. ఈ రోజుల్లో, ప్రతి సంవత్సరం వందలాది మంది అధిరోహకులు ఈ శిఖరాగ్రాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఆఫ్రికా: కిలిమంజారో
కిలిమంజారో పర్వతం ఆఫ్రికాలో ఎతైన శిఖరం. ఇది కెన్యా సరిహద్దుకు సమీపంలో ఈశాన్య టాంజానియాలో ఉంది. ఈ పర్వతం మూడు అగ్నిపర్వతాలతో రూపొందింది. శంఖువును పోలి ఉండే కిబో, 19,340 అడుగులు (5,895 మీటర్లు) ఎత్తులో ఉంది. కిలిమంజారో పర్వతం ప్రపంచంలోనే నాల్గవ అత్యంత ప్రముఖ పర్వతం. 1889లో ఈ శిఖరాన్ని చేరుకున్న మొదటి వ్యక్తి జర్మన్ భౌగోళిక శాస్త్రవేత్త హాన్స్ మేయర్ , ఆస్ట్రియన్ పర్వతారోహకుడు లుడ్విగ్ పుర్ట్షెల్లర్. మౌంట్ కిలిమంజారో నేషనల్ పార్క్ 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
యూరప్: మౌంట్ ఎల్బ్రస్
కాకసస్‌లోని ఎతైన శిఖరం, ఐరోపాలోని ఎతైన ప్రదేశం నైరుతి రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్. 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ అంతరించిపోయిన అగ్నిపర్వతం జంట శంఖుల్లా ఉంటుంది. ఇవి 18,510 అడుగులు (5,642 మీటర్లు), 18,356 అడుగులు (5,595 మీటర్లు) ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి. పొడవైన శంఖువును మొదటిసారిగా 1874లో స్విస్ గైడ్ పీటర్ నుబెల్ నేతృత్వంలోని బ్రిటిష్ యాత్ర అధిరోహించింది.
అంటార్కిటికా: విన్సన్ మాసిఫ్
1935లో అమెరికన్ అన్వేషకుడు లింకన్ ఎల్స్‌వర్త్ కనుగొన్న విన్సన్ మాసిఫ్ అంటార్కిటికాలో అత్యంత ఎత్తై పర్వతం. ఖండంలోని పశ్చిమ భాగంలోని ఎల్స్‌వర్త్ పర్వతాల సెంటినెల్ శ్రేణిలో ఉన్న ఈ శిఖరం రోన్నే ఐస్ షెల్ఫ్‌ను చూస్తుంది. ఇది సముద్ర మట్టానికి 16,050 అడుగుల (4,892 మీటర్లు) ఎత్తున ఉంది. అంటార్కిటికా అన్వేషణకు నాయకత్వం వహించిన యుఎస్ కాంగ్రెస్ సభ్యుడు కార్ల్ విన్సన్ పేరు మీద విన్సన్ పేరు పెట్టారు. దీని శిఖరాగ్రాన్ని మొదటిసారిగా 1966లో అమెరికన్ ఆల్పైన్ క్లబ్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మద్దతుతో ఒక అమెరికన్ చేరుకున్నారు.
ఆస్ట్రేలియా: మౌంట్ కోస్సియుస్కో
మౌంట్ కోస్సియుస్కో ఆస్ట్రేలియాలో ఎతైన శిఖరం. ఇది ఆగ్నేయ న్యూ సౌత్ వేల్స్‌లోని ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ స్నోవీ పర్వతాలలో ఉంది. ఈ శిఖరం 7,310 అడుగులు (2,228 మీటర్లు) ఎత్తు. పోలిష్ అన్వేషకుడు, భూవిజ్ఞాన శాస్త్రవేత్త పాల్ స్ట్రెజెలెక్కి 1840లో మౌంట్ కోస్సియుస్కోను అధిరోహించిన మొదటి యూరోపియన్. అతను ఈ పర్వతానికి ΄ోలిష్ దేశభక్తుడు, అమెరికన్ విప్లవ వీరుడైన టాడ్యూస్జ్ కోస్సియుస్కో పేరు పెట్టాడు.
‘శీతాకాలపు ట్రెక్‌ల రారాణి’ కేదార్‌కాంత
భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం పూర్తిగా ప్రకృతి అద్భుతాలతో నిండి ఉంది. అందుకే ఈ భూమిని దేవుని స్వంత భూమి లేదా ‘దేవభూమి‘ అని పిలుస్తారు. ఈ ప్రదేశం ప్రత్యేకత ఏడాది పొడవునా సాహసయాత్ర కోరుకునే ట్రెక్కర్లను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఇక ప్రసిద్ధ శీతాకాల ట్రెక్ ప్రదేశం కేదార్‌కాంత.
ఈ ట్రెక్ ‘శీతాకాలపు ట్రెక్‌ల రాణి‘ గా పేరు పొందింది. గోవింద్ నేషనల్ పార్క్ దట్టమైన పైన్ అడవుల గుండా కేదార్‌కాంత శిఖరం వైపుగా ట్రెక్కింగ్ వెళుతుంది. మోకాలి లోతు మంచు, పై నుండి మంత్రముగ్ధులను చేసే దృశ్యం. కేదార్‌కాంత ట్రెక్ 12,500 అడుగుల ఎత్తులో ఉన్నప్పటికీ ట్రెక్కింగ్ మొదలుపెట్టేవారికి ఈ మార్గం సులభంగా ఉండటంతో మరింత ప్రాచుర్యం పొందింది.
ఇక్కడ మంచు ఏప్రిల్ నెల వరకు ఉంటుంది. ఇది ఇతర శీతాకాలపు ట్రెక్‌లకు భిన్నంగా చాలా ప్రజాదరణ పొందింది. ఈ ట్రెక్ సంక్రి అనే చిన్న గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఓక్, రోడోడెండ్రాన్ దట్టమైన అడవులు, గడ్డకట్టిన సరస్సు మధ్యలో నడక సాగిస్తూ, మంచు శిఖరాన్ని అధిరోహించడానికి ఎంతో మంది ఉత్సాహం చూపుతుంటారు. ప్రముఖ హిమాలయ శిఖరాలు అయిన బందర్‌పూంచ్, కాల్‌నాగ్, స్వర్గారోహిణి మొదలైనవి.. కేదార్‌కాంత శిఖరం నుండి కనిపిస్తాయి.
ఈ ట్రెక్ ప్రత్యేకత ఏమిటంటే...
దేశంలోని అత్యంత ప్రసిద్ధ శీతాకాలపు ట్రెక్‌లలో ఒకటిగా పేరొందింది.
హిమాలయాలలో శీతాకాలంలో అందుబాటులో ఉండే మంచు ట్రెక్‌కి ఇది అనుకూలమైనది.
ఇది హిమాలయ శిఖరాన్ని ఎక్కిన అనుభూతిని ఇస్తుంది.
మొదట్లో ట్రెక్కింగ్ చేసేవారికి అనువైన ప్రాంతం.
కేదార్‌కాంత బేస్ క్యాంప్ అద్భుతమైన సుందర దృశ్యాలకు ఆలవాలం.
శిఖరం నుండి కనిపించే దృశ్యం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది.
కేదార్కాంత శిఖరం నుండి సూర్యోదయం అత్యుత్తమమైనది.
కేదార్‌కాంత ట్రెక్ షెడ్యూల్
ఆరు పగళ్లు, ఐదు రాత్రుళ్లు ప్యాకేజీని ట్రావెల్ ఏజెన్సీలు అందిస్తున్నాయి.
1వ రోజు: డెహ్రాడూన్ నుండి సంక్రి వరకు 196 కి.మీ డ్రైవ్, దీనికి 8–9 గంటల సమయం పడుతుంది.
2వ రోజు: సంక్రి నుండి జుడా కా తలాబ్ క్యాంప్ సైట్ వరకు 3.5 కి.మీ ట్రెక్, 5–6 గంటలు
పడుతుంది. ఎత్తు 7200 అడుగుల నుండి 9186 అడుగుల వరకు ఉంటుంది.
3వ రోజు: జుడా కా తలాబ్ నుండి కేదార్‌కాంత బేస్ క్యాంప్‌కు 3 కి.మీ ట్రెక్ చేయాలి. ఇందుకు 4–5 గంటల సమయం పడుతుంది. ఎత్తు 9186 అడుగుల నుండి 10,334 అడుగుల వరకు ఉంటుంది.
4వ రోజు: సమ్మిట్ హర్గావ్ క్యాంప్‌లో పగలు, రాత్రి ప్రయాణం, బస సమయం మొత్తం 7 కి.మీ 9–10 గంటలు.
5వ రోజు: హర్గావ్ నుండి సంక్రికి దిగి డెహ్రాడూన్‌కు 4 కి.మీ దిగి, 196 కి.మీ ప్రయాణం చేస్తూ డెహ్రాడూన్‌కు చేరుకోవాలి.
సంక్రి ఎలా చేరుకోవాలంటే...
హిమాలయాల దిగువ ప్రాంతంలో ఉన్నది సంక్రి. కేదార్‌కాంత, హర్ కి డన్, ఫులారా రిడ్జ్, బాలి పాస్ వంటి అనేక ప్రసిద్ధ హిమాలయ ట్రెక్‌లకు బేస్‌క్యాంప్‌గా పనిచేస్తుంది. నగర జీవిత హడావిడికి దూరంగా ఉన్న ఈ చిన్న గ్రామం మన హృదయాలను ఇట్టే దోచుకుంటుంది. అందమైన హోమ్‌స్టేలు, రుచికరమైన తినుబండారాలు, కేఫ్‌లు, అద్భుతమైన స్వర్గరోహిణి శిఖరం, మంత్రముగ్ధులను చేసే దృశ్యాలతో సంక్రిప్రాంతం ప్రేమలో ఇట్టే పడిపోతాం. సంక్రి డెహ్రాడూన్ నుండి 206 కి.మీ. ఢిల్లీ నుండి 434 కి.మీ దూరంలో ఉంది. ఢిల్లీ నుండి నేరుగా సంక్రి చేరుకోలేం. డెహ్రాడూన్ చేరుకున్న తర్వాతనే సంక్రికి ప్రయాణించవచ్చు:
రోడ్డు మార్గం:
సంక్రి డెహ్రాడూన్ నుండి దాదాపు 206 కి.మీ దూరంలో ఉంది మరియు సాధారణంగా చేరుకోవడానికి 8–9 గంటలు పడుతుంది.
రెండు మార్గాలు ఉన్నాయి:
వయా ముస్సూరీ – తక్కువ దూరం. ఈ మార్గాన్నే చాలా మంది అనుసరిస్తారు.
వయా వికాస్‌నగర్ – ముస్సూరీ ట్రాఫిక్‌ను నివారించాలనుకుంటే మంచి ఎంపిక.
బస్సు ద్వారా:
డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ నుండి సంక్రికి ప్రైవేట్, ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉన్నాయి . సాధారణంగా రోజుకు 2–3 బస్సులు ఉంటాయి. చివరి బస్సు ఉదయం 8:00 గంటలకు బయలుదేరుతుంది. ఆ తరువాత, సంక్రికి బస్సులు అందుబాటులో లేవు.
టాక్సీ ద్వారా:
4 లేదా అంతకంటే ఎక్కువ మందితో కలిసి ప్రయాణిస్తుంటే టాక్సీని అద్దెకు తీసుకోవాలి. డెహ్రాడూన్ నుండి సంక్రికి టాక్సీ ధర రూ.6500 ఉంటుంది.
రైలు మార్గం:
సంక్రికి సమీప రైల్వే స్టేషన్ డెహ్రాడూన్ రైల్వే స్టేషన్. అక్కడి నుండి, సంక్రి చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీ తీసుకోవచ్చు.
విమాన మార్గం:
సంక్రికి సమీప విమానాశ్రయం డెహ్రాడూన్ లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయం. భారతదేశంలోని ప్రధాన నగరాల నుండి డెహ్రాడూన్‌కు విమానాలు అందుబాటులో ఉన్నాయి, ఆ తర్వాత రోడ్డు మార్గంలో సంక్రి చేరుకోవచ్చు. పర్వతారోహణలో సుందర దృశ్యాలు, ఆత్మిక శక్తి, శిఖరాగ్రం చేరుకున్నాక పూర్తి శాంతిని అనుభవంలోకి తీసుకువస్తాయి హిమనీ నదాలు.
భారతదేశం, నేపాల్ అంతటా విస్తరించి ఉన్న హిమాలయాలు ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సాంస్కృతిక అనుభవాలను అందిస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని పచ్చని లోయలు, కాశ్మీర్‌లోని స్వచ్ఛమైన సరస్సులు, లడఖ్‌లో క్లిష్టమైన మార్గాలు, సిక్కింలోని ప్రశాంతమైన కొండల నుండి నేపాల్‌లోని గంభీరమైన శిఖరాల వరకు హిమాలయాలు
సాహస యాత్రకు ఆహ్వానం పలుకుతున్నాయి.
మన దేశంలో కేదార్‌కాంత ట్రెక్, ఉత్తరాఖండ్‌లోని ఉల్లాసకరమైన పంగర్చుల్లా పీక్ ట్రెక్, కాశ్మీర్ గ్రేట్ లేక్స్, పశ్చిమ బెంగాల్‌లోని సందక్‌ఫు ట్రెక్, సిక్కింలోని గోచల, లడఖ్‌లోని మార్ఖా లోయను వీక్షించి తీరాల్సిందే. నేపాల్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్, సుందరమైన అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్, ప్రశాంతమైన లాంగ్‌టాంగ్ వ్యాలీ, అద్భుతమైన మార్డి హిమాల్ ట్రెక్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ట్రెక్కింగ్ మార్గాలలోనూ మునిగి΄ోవచ్చు. హిమాలయాలలో భద్రత,సౌకర్యాలతో మరపురాని జ్ఞాపకాలను అందించేందుకు ట్రావెల్ ఏజెన్సీలు రూ.20,000 నుంచి లక్ష రూపాయల వరకు ప్యాకేజీలను అందిస్తున్నాయి.
(చదవండి: ప్రత్యేక సామర్థ్యంతో అద్భుతాలు చేసిన అసామాన్య వ్యక్తులు..!)


