ఫుడ్ రెస్టారెంట్ లేదా హోటల్ నడపడం అంటే అంత ఈజీ కాదు. చాలా శ్రమతో కూడిన పని. అభిరుచి లేదా ప్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. కానీ ఈ యువకుడు చక్కగా అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగాన్ని కేవలం దోసెలు అమ్మడం చాలా తృణపాయంగా వదిలేశాడు. ఇదేం ఆసక్తి అనుకోకండి. ఆయన ఆరోగ్యకరమైన రీతీలో దోసెలను అమ్మాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడట. వినడానికి ఏంటిది అనిపించినా..? మరి.. అంత రిస్క్ తీసుకుని ఆ యువకుడు సక్సెస్ అయ్యాడా అంటే..
జర్మన్‌లో అధిక జీతం వచ్చే టెక్ ఉద్యోగం చేసేవాడు మోహన్. స్కాలర్‌షిప్‌పై పారిస్‌లో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో అధిక వేతనంతో కూడాన ఉద్యోగాలు వచ్చాయి. అయితే వాటన్నింటిని కాదనుకుని స్నేహితులతో కలిసి దోసె రెస్టారెంట్‌ని ప్రారంభించాలనుకున్నాడు. అది కూడా ఆరోగ్యకరమైన గ్లూటెన్ రహిత దోసెలను అందించాలనే లక్ష్యంతో ఆ టెక్ ఉద్యోగాలను వద్దనుకున్నానంటూ తన స్టోరీని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో షేర్ చేసుకున్నాడు.
అలాతాను 2023లో తన దోసెమా రెస్టారెంట్‌ని ప్రారంభించినట్లు తెలిపాడు. అతను సహా వ్యవస్థాపకుడిగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా రెస్టారెంట్ బాధ్యతలు చూసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఆకస్మిక మార్పు చాలా కొత్తగా..ఇష్టంగా ఉన్నా..చాలా సవాళ్లు ఎదుర్కొన్నానని కూడా వివరించాడు. బాగా అలసిపోయి, నిద్రలేని రాత్రులు గడిపిన రోజులు చాలా ఉన్నా..ఇష్టంతో చేసే పనిలో ఆ ఇబ్బందులు పెద్ద కష్టంగా అనిపించవని అంటున్నాడు.
ఇవాళ తన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లో శాఖలు ఉన్నాయని, తాజాగా భారతదేశంలో పుణేలో కూడా శాఖలు ఉన్నాయని వీడియోలో మోహన్ చెప్పుకొచ్చారు. నెటిజన్లు ఆ యువకుడి ధైర్యానికి ఆశ్చర్యపోవడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే అతడి తపన మమ్మల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసింది, పైగా అతడిపై గౌరవం ఇంకా పెరిపోయింది అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: కూతురిని అలా చూసి..! ఆ తల్లిదండ్రుల రియాక్షన్ మాములుగా లేదుగా..)


