8 రోజులు.. 800 కిలోమీటర్లు..! | Hyderabad to Mumbai Cycle Tour 30 places to raise Fitness awareness | Sakshi
Sakshi News home page

8 రోజులు.. 800 కిలోమీటర్లు..!

Mar 9 2026 5:30 PM | Updated on Mar 9 2026 5:36 PM

Hyderabad to Mumbai Cycle Tour 30 places to raise Fitness awareness

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది రోజుల పాటు హైదరాబాద్‌ నుంచి ముంబై వరకూ 800 కిలోమీటర్ల సైకిల్‌ యాత్రకు సంకలి్పంచాడు.. ఇందులో భాగంగా 30 చోట్ల ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు నిర్ణయించుకున్నాడు.. మార్చి 7 ప్రారంభమైన ఈ సైకిల్‌యాత్ర 14 వరకూ కొనసాగనుంది. ప్రజలకు ఫిట్‌నెస్, సైక్లింగ్‌ ప్రాముఖ్యతను వివరించడమే లక్ష్యంగా వెల్‌నెస్‌ అడ్వొకేట్‌ కాంతి దత్‌ ముందుకు కదులుతున్నాడు. 

ఫియర్‌ ప్రాజెక్ట్‌ పేరిట స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నోవోటెల్‌ హోటల్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్‌నెస్‌ ప్రేమికులు పాల్గొని కాంతి దత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడి నుంచే సైక్లింగ్‌ యాత్రను ప్రారంభించారు. 

ఎనిమిది రోజుల పాటు.. 
మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యత, సైక్లింగ్‌ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. 

‘పర్యావరణానికి అనుకూలమైన రవాణా వ్యవస్థ అయిన సైక్లింగ్‌ను ప్రోత్సహించడం, రోజువారీ జీవితంలో సైక్లింగ్‌ను భాగం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై అవగాహన కల్పించడం’ ప్రాధాన లక్ష్యమని కాంతి దత్‌ తెలిపారు.  

(చదవండి: తండ్రైన క్షణం..! ఎంత స్ట్రాంగ్‌గా ఉండేవాడైనా..)

Advertisement
 
Advertisement
Advertisement