పండ్ల రవాణాపై గల్ఫ్‌ గుబులు | west asia war impact hyderabad fruit market imports prices doubled dry fruits ramadan | Sakshi
Sakshi News home page

పండ్ల రవాణాపై గల్ఫ్‌ గుబులు

Mar 8 2026 7:36 AM | Updated on Mar 8 2026 7:36 AM

west asia war impact hyderabad fruit market imports prices doubled dry fruits ramadan

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భాగ్యనగరం పండ్ల మార్కెట్‌పై పడింది. అరబ్బు దేశాల్లో కార్గో రవాణాపై ఆంక్షల నేపథ్యంలో పండ్లు, ఇంటీరియర్, ఫర్నిచర్‌ వంటి వస్తువులపై ప్రభావం పడింది. దీంతో ఇరాన్, దుబాయ్, టర్కీ, తుర్కియో వంటి దేశాల నుంచి నుంచి హైదరాబాద్‌కు దిగుమతి అయ్యే యాపిల్స్, కివీ, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్‌ విదేశీ పండ్ల దిగుమతి తగ్గింది. వీటితో పాటు ఇంటీరియర్‌ ఫర్నిచర్‌లపై ప్రభావం ఉంది.   

రెండింతలైన ధరలు.. 
రంజాన్‌ మాసం కావడంతో సాధారణంగానే ఖర్జూరం, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌కు డిమాండ్‌ ఎక్కువ. పశి్చమాసియాలో యుద్ధంతో ధరలు దాదాపు రెండింతలు పెరిగాయి. సాధారణంగా అక్కడి మార్కెట్‌లో యాపిల్స్‌ ధర (బాక్స్‌) రూ.1,200 ఉంటుంది. అదే బాక్స్‌ నగర మార్కెట్‌లో దిగుమతి అయ్యాక రూ.1,800కు విక్రయిస్తుంటారు. కానీ, యుద్ధం నేపథ్యంలో అదే బాక్స్‌ ధర అక్కడి మార్కెట్‌లో రూ.1,800 ఉండగా.. ఇక్కడికొచ్చేసరికి రూ.2,500కు పెరిగింది.  

నిర్మాణ సామగ్రిపైనా.. 
ఇంధన, చమురు దిగుమతులతో పాటు స్థిరాస్తి మార్కెట్‌ కూడా ప్రభావం చూపిస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ఇనుము, స్టీల్, కాపర్‌ వైర్లు దిగుమతి అవుతుంటాయి. గల్ఫ్‌ దేశాల నుంచి పెట్‌కోక్‌ (సిమెంట్‌లో ఉపయోగించేవి), పాలిమర్‌లు, సల్ఫర్,, సున్పపురాయి దిగుమతి అవుతాయి. ఈ ముడి పదార్థాలతో ఇంటీరియర్, నిర్మాణ సామగ్రి తయారవుతుంటాయి. మార్బుల్స్, టైల్స్, గ్లాస్‌ వంటివి దిగుమతులపై ప్రభావం ఉంటుంది. ఈ మేరకు తుది దశ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో పాటు ధరలలో 1–2 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement