breaking news
west asia
-
కంపెనీల ఆదాయాలపై పశ్చిమాసియా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీ కార్పొరేట్ల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపనున్నాయి. వీటికి ఎల్‌నినో ఎఫెక్ట్ కూడా తోడు కావడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఉంది. సుమారు 100–150 బీపీఎస్ మేర తగ్గొచ్చని అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎల్ నినో పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ దెబ్బతినవచ్చు. అలాగే కార్పొరేట్ రంగంలో పలు సంస్థల ఆదాయాలపైనా ప్రభావం పడొచ్చు. ‘క్రూడాయిల్ రేట్లు భగ్గుమనడం, రూపాయి క్షీణత వల్ల దిగుమతుల వ్యయాలు పెరిగిపోవడం కారణంగా 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) నిర్వహణ లాభాల మార్జిన్ (ఓపీఎం) 100–150 బేసిస్ పాయింట్ల (ఒకటి–ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉంది‘ అని ఇక్రా వెల్లడించింది. సమీప భవిష్యత్తులో కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎల్నినోపరంగా డిమాండ్‌కి రిసు్కలు పొంచి ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తోడై కార్పొరేట్ల ఆదాయాల మీద ప్రభావం పడొచ్చని వివరించింది. 2026–27లో కార్పొరేట్ ఇండియా ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్‌కి పరిమితం కావొచ్చని తెలిపింది. 2025–26 క్యూ4లో వార్షిక ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 13.2 శాతంగా నమోదైంది.ధరల పెంపుతో కాస్త ఊరట..పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధనాలు, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. అలాగే రూపాయి పతనంతో దిగుమతి చేసుకునే ముడి వస్తువుల ధరలూ పెరిగాయి. ఇవన్నీ వెరసి సమీప భవిష్యత్తులో లాభాల మార్జిన్లపై ప్రభావం చూపవచ్చు. అయితే, పాక్షికంగానే అయినప్పటికీ ధరలను పెంచడం వల్ల మార్జిన్లపై ఒత్తిడిని కంపెనీలు కొంత మేర అధిగమించవచ్చు. కాకపోతే, హఠాత్తుగా ధరలను పెంచేస్తే డిమాండ్ దెబ్బతిని, పోటీ సంస్థలతో పోలిస్తే వెనుకబడిపోయే అవకాశాలూ ఉన్నాయి. వేతన జీవుల ఆదాయాలు స్థిరంగా ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో వినియోగం కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం కారణంగా ఓవరాల్ డిమాండ్‌కి మాత్రం సవాళ్లు తప్పేలా లేవు. క్రూడాయిల్ ధరలు ఎగియడం, రూపాయి క్షీణించడంలాంటి అంశాల వల్ల వినియోగ ఆధారిత రంగాల్లో అమ్మకాల పరిమాణం.. ఆశించినంత స్థాయిలో పెరగకపోవచ్చు. ‘బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, పశ్చిమాసియా సంక్షోభం వల్ల నిర్వహణ పరిస్థితులనేవి పెట్టుబడులకు అనువైనవిగా ఉండటం లేదు. తయారీ (డిఫెన్స్, ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఇతరత్రా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వర్తించే సెగ్మెంట్లు), పవర్ పరికరాలు, రియల్ ఎస్టేట్, డేటా సెంటర్లలాంటి కొన్ని నిర్దిష్ట రంగాల్లో మాత్రమే ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి‘ అని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ (కార్పొరేట్ రేటింగ్స్) కింజల్ షా తెలిపారు. మధ్యకాలికంగా చూస్తే, అంతర్జాతీయ వాణిజ్యం, కమోడిటీల ధరలపరమైన హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ రిసు్కలు మొదలైన అనిశ్చితులను ఎదుర్కొనేందుకు రంగాలవారీ పరిణామాలు, విధానపరమైన చర్యలు ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నాయనే దానిపై దేశీ కార్పొరేట్ల రుణ పరపతి ఆధారపడి ఉంటుందని షా చెప్పారు. -
డీల్‌తో ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పెడుతూ, శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా–ఇరాన్ నిర్ణయంతో భారత్‌కి ఊరట లభించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈసారైనా ఒప్పందం సజావుగా అమలైతే, పశ్చిమాసియాకి భారత్ ఎగుమతులు మళ్లీ పుంజుకునేందుకు ఊతం లభిస్తుందని ఎగుమతిదారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని, రూపాయి స్థిరపడగలదని భావిస్తున్నారు. వెరసి వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు. జూన్ 19 స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ‘ దాదాపు 50 శాతం క్రూడాయిల్, సుమారు 70 శాతం వంట గ్యాస్, 90 శాతం ద్రవీకృత సహజ వాయువు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్ ఆధారపడుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో సరఫరా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో శాంతి ఒప్పందంతో భారత్‌కి తక్షణం ఆర్థికంగా ఊరట లభిస్తుంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే, ఇంధన మార్కెట్లు స్థిరపడతాయి. చమురు..గ్యాస్ ధరలపై ఒత్తిడి తగ్గి రూపాయి బలపడవచ్చు. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగుపడొచ్చు‘ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అనిశ్చితికి తెర.. శాంతి ఒప్పంద ప్రకటనతో అనిశ్చితి, ఆర్థిక మందగమనం, అనవసర సమస్యలకి తెర పడుతుందని టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ తెలిపారు. ఎగుమతులు ఎగియడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరా, ధరలు తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావొచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. హార్మూజ్ మూసివేత వల్ల నౌకలు ఆఫ్రికా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనితో సముద్ర మార్గంలో రవాణా, నౌకల బీమా వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో పాటు డెలివరీల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. హార్మూజ్ తెరుచుకుంటే నౌకల రాకపోకలకు కూడా వెసులుబాటు లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఆ దేశంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో మార్చిలో భారత్ ఎగుమతులు 7 శాతం క్షీణించి అయిదు నెలల కనిష్ట స్థాయి 38.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాకి ఏకంగా 58 శాతం తగ్గి 3.5 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు 52 శాతం పడిపోయాయి. ఇక ఇంధనాల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లను ఇటీవల పాక్షికంగా పెంచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎగిసిన స్థాయికి తగ్గట్లు పెంచకపోవడంతో ఆదాయ నష్టాలను చవిచూస్తున్నాయి. అవి పూర్తి ఆర్థిక సంవత్సరపు లాభాలకు సరిసమానంగా ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు నమోదు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకుంటే సరఫరా మెరుగుపడి, ముడి చమురు ధరలు నెమ్మదించవచ్చు. -
డీల్ ఓకే.. ఎట్టకేలకు శాంతి వీచికలు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/టెల్ అవీవ్: దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సంతకాల కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. శాంతి ఒప్పందంలో ఏఏ వివరాలను పొందుపర్చబోతున్నారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ప్రపంచ మార్కెట్లపై యుద్ధ్దకుంపట్లను రాజేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అమెరికా కాలమానంప్రకారం ఆదివారం రాత్రి ఇరాన్‌తో డీల్‌పై ప్రకటన చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఒక పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది. అందరికీ అభినందనలు. ఇకపై ఎలాంటి సుంకాల్లేకుండా హార్మూజ్ తెరుచుకోబోతుంది. హార్మూజ్ వద్ద అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేస్తున్నాం. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్ చేయండి. చమురు సరఫరాను సముద్రమార్గంలో ఉరకలెత్తించండి. గొప్పదైన ఈ ఒప్పందంలో పశ్చిమాసియాలో శాంతి, భద్రత నెలకొంటాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నించి విఫలమయ్యారు. తొలిసారిగా నేను శాంతి పవనాలు వీచేలా చేశా. శుక్రవారం సంతకాలు పూర్తయ్యాక హార్మూజ్ తెరుచుకుంటుంది. సముద్ర మందుపాతరల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి’’అనిట్రంప్ తెలిపారు. 60 రోజుల సంప్రదింపుల వ్యవధి! ‘‘ఇరు వైపుల ప్రతినిధి బృందాలు వచ్చాక శుక్రవారం స్విట్జర్లాండ్‌లో సంతకాలు చేస్తారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాక 60 రోజులపాటు సంప్రదింపుల వ్యవధి ఉంటుంది. యురేనియంను అత్యంత నాణ్యత స్థాయికి శుద్ధిచేయడం, ఇప్పటికే శుద్ధచేసిన యురేనియంను నిర్వీర్యంచేయడం, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు, రెండో దశ ఆంక్షలు, అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి’’అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాసిం ఘరిబాబాడీ వెల్లడించారు. మరోవైపు ఒప్పందానికి అంగీకరించిన అమెరికాకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించిన ఖతర్, తుర్కియే, సౌదీ అరేబియాలను షెహబాజ్ అభినందించారు. దాడి చేస్తే ప్రతిదాడి: ఇజ్రాయెల్ ఓవైపు శాంతి ఒప్పందానికి అమెరికా ముందడుగేస్తుంటే మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం అదే యుద్ధధోరణిని మళ్లీ కనబర్చింది. ‘‘ఇరాన్ గనక మళ్లీ మాపై దాడులకు దిగితే మేం యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఇప్పటిదాకా గాజా స్ట్రిప్, సిరియా, లెబనాన్‌లో మేం ఆక్రమించుకున్న సరిహద్దు ప్రదేశాలకు ఖాళీచేసేదే లేదు’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. శాంతి ఒప్పందంలో లెబనాన్నూ చేర్చాలని ఓవైపు ఇరాన్ పట్టుబడుతుంటే అదే లెబనాన్‌పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ సోమవారం సైతం స్పష్టంచేయడంతో శాంతి ఒప్పందం ఏ మేరకు సవ్యంగా అమలవుతుందనే కొత్త అనుమానాలు బయల్దేరాయి. గత రెండున్నరేళ్లలో సిరియా, లెబనాన్, గాజా స్ట్రిప్‌లో మొత్తంగా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇది దాదాపు అమెరికాలోని న్యూయార్క్ సిటీ అంత ఉంటుంది. ‘‘కొత్త ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత అమెరికాదే. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను అమెరికా నిలువరించాల్సిందే’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టంచేశారు. ఖమేనీ మృతి నుంచి ఒప్పందం దాకా.. వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఇరాన్‌తో మూడ్రోజుల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించడంతో ఇన్నాళ్లూ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌పై అమెరికా కాల్పులు మొదలెట్టి తాజాగా చర్చలు మొదలెట్టిన దాకా జరిగిన క్రమంలో కీలక పరిణామాలు కొన్ని... ఫిబ్రవరి 28: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు. దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా సయీద్ అలీ ఖమేనీ సహా పలువురు టాప్ కమాండర్ల దుర్మరణం మార్చి 1: దూరంగా ఉన్న అమెరికా భూభాగాలకు బదులు అమెరికా స్థావరాలున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఇరాన్ దాడులు మార్చి 2: పొరపాటున అమెరికా యుద్ధవిమానాలను నేలకూల్చిన కువైట్ మార్చి 4: ఇరాన్ యుద్దనౌక ఐఆర్ఎస్ డేనాను హిందూమహాసముద్రంలో టోర్పెడోతో దాడిచేసి ముంచేసిన అమెరికా మార్చి 8: సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి. శకలాలు పడి భారతీయుడు మృతి మార్చి 9: తండ్రి స్థానంలో ఇరాన్ సుప్రీంనేతగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ మార్చి 17: అమెరికా దాడిలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ అంతం మార్చి 18: సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై అమెరికా భీకర దాడులు మార్చి 21: చమురు సంక్షోభం పెరగడంతో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురు విక్రయానికి అమెరికా తాత్కాలిక అనుమతి మార్చి 27: ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బాంబర్ విమానాల దాడి మార్చి 31: ఐదు అంశాలతో శాంతి ప్రతిపాదనలను తెచ్చిన చైనా, పాకిస్తాన్ ఏప్రిల్ 3: తొలిసారిగా అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇరాన్ ఏప్రిల్ 8: రెండు వారాల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఓకే చెప్పిన అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 11: పాక్ వేదికగా తొలిసారిగా చర్చలకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏప్రిల్ 12: చర్చలు విఫలమైనట్లు అమెరికా ప్రకటనఏప్రిల్ 15: ఇరాన్లో పర్యటించిన అగ్రనాయకత్వంతో చర్చించిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏప్రిల్17: హార్మూజ్‌ను తెరుస్తున్నామన్న ఇరాన్. తాము దిగ్బంధించామన్న అమెరికా ఏప్రిల్ 20: ఇరాన్ జెండాతో రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం మొదలెట్టిన అమెరికా ఏప్రిల్ 22: హార్మూజ్‌లో మూడు నౌకలపై దాడిచేసి రెండింటిని స్వా«దీనంచేసుకున్న ఇరాన్ ఏప్రిల్ 24: తమ ప్రతిపాదనలు తెలియజేసేందుకు పాక్‌లో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబాŠబ్స్ అరాఘ్చీ ఏప్రిల్ 27: అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేస్తే హార్మూజ్‌ను తెరుస్తామని తొలిసారిగా ప్రకటించిన ఇరాన్ మే 6: విదేశీ నౌకలు హార్మూజ్‌ను సురక్షితంగా దాటేందుకు ఇకపై అమెరికా యుద్దనౌకలు రక్షణగా రాబోవని ప్రకటించిన ట్రంప్ మే 13: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి మే 18: చర్చలు కీలకదశలో ఉండటంతో దాడులు తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటన జూన్ 1: తమ ఎంక్యూ–1 ప్రిడేటర్ డ్రోన్‌ను కూల్చినందుకు ఇరాన్‌పై భీకర దాడులు మొదలెట్టినట్లు ట్రంప్ వెల్లడి జూన్ 3: కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడి దుర్మరణం జూన్ 6: బహ్రెయిన్, కువైట్‌లపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్ జూన్ 7: చర్చల ప్రక్రియలో కదలిక తెచ్చిన పాక్ జూన్ 8: కాల్పుల విరమణకు తూట్లుపొడుస్తూ పరస్పర దాడులకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్ జూన్ 9: అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌ను కూల్చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటానన్న ట్రంప్ జూన్ 10: పలావూ జెండాతో ఉన్న నౌకపై అమెరికా దాడిలో ముగ్గురు భారతీయుల దుర్మరణం జూన్ 15: కాల్పులకు ముగింపు పలుకుతూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటన ఒప్పందంలో ఏముంది ? మరో మూడ్రోజుల్లో ముసాయిదా ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌లు సంతకాలుచేసి తదుపరి సమగ్రమైన సంప్రదింపుల ప్రక్రియకు తెరలేపనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ముసాయిదా ఒప్పందంలో ఏమేం అంశాలను పొందుపరిచారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కువైంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు విధిస్తారా? అణ్వాయుధం తయారీ కోసం ఇప్పటికే అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధికి సాహసించిన ఇరాన్‌ను ఆ దిశగా మరో అడుగు ముందుకువేయకుండా అమెరికా షరతు విధించింది? అనే పలు సందేహాల నడుమ ఇరాన్ మీడియా ఈ ముసాయిదాలోని 14 అంశాలను సంపాదించిందని కథనాలు వెలువడ్డాయి. సైనిక, ఆర్థిక, అణు అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాల గురించి క్లుప్తంగా...1. అమెరికా, ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకు ఇకనైనా ముగింపు పలకడం 2. ముడి చమురు సహా వాణిజ్య వస్తూత్పత్తుల సరఫరా కోసం నౌకల రాకపోకల నిమిత్తం హార్మూజ్ తెరవడం 3. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలు, అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం 4. చర్చలు ఓవైపు జరుగుతుండగా ఒప్పందం తమకు అనుకూలంగా కుదిరేలా ఇరాన్‌పై ఒత్తిడి పెంచేలా ఆ దేశంపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించకపోవడం 5. ఈలోపు ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై తక్షణం ఆంక్షలు ఎత్తేయడం 6. విదేశీ బ్యాంకుల ఖాతాల్లో అమెరికా, మిత్రదేశాలు స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల డాలర్ల నిధులను విడుదలచేయడం 7. కనీసం 60 రోజులపాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం 8. ఇరాన్ ఇకపై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలను విరమించుకోవడం 9. ఇరాన్ ఇకపై మిలటరీ గ్రేడ్‌లో నాణ్యత స్థాయికి యురేనియంను శుద్ధిచేయకుండా మిన్నకుండిపోవడం 10. అణు కేంద్రాల విస్తరణ ప్రతిపాదనలను ఇరాన్ పక్కనపడేయడం 11. అణుకేంద్రాలపై అమెరికా బాంబర్ దాడులతో భూస్థాపితమైన శుద్ధయురేనియం అప్పగింత లేదా నిర్వీర్యంచేయడంపై చర్చలు జరపడం 12. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని స్పష్టమయ్యేలా ఇరాన్ సైనిక చర్యలను ఉపసంహరించుకోవడం 13. ఆర్థికపర ఆంక్షలను అమెరికా ఎత్తేయడంతోపాటు ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషిచేయడం 14. సమగ్రమైన తుది ఒప్పందం కోసం కృషిచేయడంతెరమీదకు మరికొన్ని అంశాలు! ఇవిగాక మరిన్ని ప్రతిపాదనలు ముసాయిదా ఒప్పందంలో ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లతో ఆర్థికాభివృద్ధి ప్యాకేజీని ట్రంప్ అందించడం, ఇరాన్లో అమెరికా సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఇరాన్ పునరుజ్జీవనానికి పాటుపడటం, ఆర్థికసహకారం, రుణాలు అందివ్వడం, భవిష్యత్‌లో ఉద్రిక్తతలు తలెత్తకుండా తగు పరస్పర సహకార విభాగాలను ఏర్పాటుచేయడం, గ్లోబల్ మార్కెట్లతో ఇరాన్‌ను మరింతగా అనుసంధానం చేయడం వంటివీ ఇందులో ఉన్నాయని వార్తలొచ్చాయి. పరస్పర దాడులు ఆపేస్తే సరిపోదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇరాన్ యుద్ధంలో కీలకమైన నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. చమురు సంక్షోభం భవిష్యత్‌లో తలెత్తకుండా సుంకాల్లేకుండా చమురు నౌకల రాకపోకలను శాశ్వతంచేయడం, దెబ్బతిన్న ఇరాన్ ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేలా పలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందివ్వడం, అణ్వస్త్ర సామర్థ్యంలేకపోవడంతోనే తమపై అగ్రదేశాలు దాడులుచేస్తున్నాయనే భావన ఇరాన్లో లేకుండా చేయడం, తద్వారా ఇరాన్.. లెబనాన్(హెజ్»ొల్లా), యెమెన్(హూతీ), గాజా(హమాస్)లో పరోక్ష సైన్యాలను పెంచిపోషించకుండా అడ్డుకోవడం వంటివి చేయగలిగితేనే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సుసాధ్యమవుతుంది’’అని నిపుణులు విశ్లేషించారు. తర్వాత ఏం జరగొచ్చు? ప్రతిపాదిత ముసాయిదా ఒప్పందం అమల్లోకి వచ్చాక తొలి 60 రోజులపాటు హార్మూజ్ తెరుచుకోవడంతో చమురు సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగే ఆస్కారముంది. అయితే ఈ 60 రోజుల్లో సమగ్ర శాంతి ఒప్పందం కుదిరితే అందరికీ లాభమే. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఏళ్ల తరబడి ఇరాన్‌పై అమెరికా సహా ఏ దేశమూ ఆంక్షలు విధించకుండా చూసుకోవడం, ఒప్పందాన్ని సమగ్రస్థాయిలో అమలుచేసే వ్యవస్థను కొలువుతీర్చడం, ఇరాన్ దొంగచాటుగా యురేనియంను శుద్ధిచేయకుండా అడ్డుకోవడం వంటివి కీలకంగా మారనున్నాయి. 14 అంశాలపై ఇరుదేశాలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొస్తే చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఈ 14 అంశాలే మూలస్తంభాలుగా నిలుస్తాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్ధానికి స్వస్తి?
ప్రపంచాన్ని పలుమార్లు అంతిమ ఘడియల అంచులవరకూ తీసుకెళ్లిన పశ్చిమాసియా యుద్ధం పరిసమాప్తమైంది. ఘర్షణలు నిలిచిపోయాయని ఈ 107 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి గనుక, యుద్ధం ఆగిందంటే ఎవరూ నమ్మలేదు. చివరకు ఇరాన్ ధ్రువీకరించాకే ట్రంప్ మాటను అందరూ విశ్వసించారు. దీన్ని భగ్నం చేసితీరాలన్న కాంక్షతో ఇజ్రాయెల్ చెలరేగిపోతోంది. లెబనాన్‌పై క్షిపణి దాడులు చేస్తోంది. హార్మూజ్ జలసంధి దగ్గర ప్రస్తుతం 800 నౌకలు నిలిచిపోయాయి. వీటిల్లోని 20,000 మంది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో పడ్డారు. అంతక్రితం మాటెలా వున్నా ట్రంప్ రెండో ఏలుబడిలో అమెరికా, ఇజ్రాయెల్ అవిభక్త కవలల్లా ప్రవర్తించటం మొదలెట్టాయి. సకల వ్యవస్థల్లో ఇజ్రాయెల్ చాపకింద నీరులా విస్తరిస్తున్న తీరుపై అమెరికా ఉన్నతాధికార యంత్రాంగంలోనే భయాందోళనలు అలుముకున్నాయి. నిరుడు సెప్టెంబర్‌లో ట్రంప్ వీరాభిమాని, మాగా ఉద్యమ సారథుల్లో ఒకరైన చార్లీ కిర్క్‌ను దుండగుడు కాల్చిచంపిన ఉదంతంలో ఇజ్రాయెల్ హస్తముందని ఆ ఉద్యమకారులే ఆరోపించారు. అతను ఇరాన్‌పై యుద్ధానికి బద్ధవ్యతిరేకి. ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందాన్ని గత ఏలుబడిలోనే రద్దుచేసిన ట్రంప్... దాన్ని తలదన్నేలా కొత్త ఒప్పందం సాధించితీరతానని శపథం చేశారు. తాజా ఒప్పందం వివరాలు తెలియాల్సేవున్నా, ఇరు దేశాలమధ్యా కుదిరిందంటున్న అవగాహన గమనిస్తే ఆ శపథం నీరుగారినట్టే. తననూ, పార్టీనీ, దేశాన్నీ అధః పాతాళానికి నెట్టేసిన ఈ యుద్ధం నుంచి బయటపడాలని మొదటి వారానికే ట్రంప్ తహతహలాడారు. కానీ దోవ దొరకలేదు. దీనికి ప్రపంచం భారీ మూల్యం చెల్లించింది. క్షిపణి దాడుల్లో దాదాపు 4,000 మంది ఇరాన్ పౌరులు చనిపోగా, అమెరికావైపు 13 మంది సైనికులు మరణించారు. ఇరాన్లో 240 వైద్య ఆరోగ్య కేంద్రాలు ధ్వంసంకాగా, 20 పాఠశాలలు శిథిలాలయ్యాయి. ప్రపంచ పురావస్తు సంపదగా గుర్తించిన అయిదు ప్రాంతాలు, 54 మ్యూజియంలు నాశనమయ్యాయి. చివరకు హార్మూజ్‌లో భారత్ వస్తున్న నౌకపై దాడి జరిగి మన నావికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావటంతో పలు సంస్థలు వేలాది విమాన సర్వీసుల్ని రద్దు చేశాయి. చమురు ధరలు పైపైకి ఎగబాకి ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ యుద్ధంతో మూడున్నర కోట్లమంది పేదరికంలోకి జారుకున్నారని ఏప్రిల్ నెలాఖరున ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అమెరికా యుద్ధ వ్యయం లక్ష కోట్ల డాలర్లు ఉండొచ్చని హార్వర్డ్ ఆర్థికవేత్త లిండా బిల్మ్స్ అంచనా. విదేశీ యుద్ధాల్లో అమెరికా ప్రమేయం ఉండబోదని హామీ ఇచ్చి అధికారంలోకొచ్చిన ట్రంప్... దేశాన్ని యుద్ధం ఊబిలోకి నెట్టారు. యుద్ధం మొదలెడుతూనే ఆయతుల్లా అలీ ఖమేనీతోసహా పలువురు అగ్రనాయకుల్ని హతమార్చి అమెరికా చాలా నష్టపోయింది. ఉన్నంతలో మధ్యేవాద దృక్పథంతో ఉండే ఆ నాయకత్వంతో పోలిస్తే ఇప్పుడున్నవారంతా అత్యంత కఠినంగా వ్యవహరించే రకం. అందుకే ‘బేషరతు లొంగుబాటు’ తప్ప దేనికీ అంగీకరించబోనని మొదట్లో బీరాలు పలికిన ట్రంప్, చివరకు రాజీకోసం కాళ్లావేళ్లా పడాల్సివచ్చింది. ఇంతకూ తనదగ్గరున్న శుద్ధి చేసిన యురేనియంను ఇవ్వ డానికీ, బాలిస్టిక్ క్షిపణుల తయారీని ఆపటానికీ, హార్మూజ్ వద్ద యథాపూర్వస్థితి పునరుద్ధరణకూ ఇరాన్ అంగీకరించిందా? మరో నాలుగు రోజుల్లో ఆ సంగతి తేలాక ట్రంప్ పరువు మరింత దిగజారుతుంది. వచ్చే నవంబర్ మధ్యంతర ఎన్నికలనాటికి ఆర్థికవ్యవస్థ ఎంతో కొంత మెరుగు పడితేనే రిపబ్లికన్ పార్టీకి ఓట్లు రాలతాయనీ, లేదంటే అమెరికన్ కాంగ్రెస్‌పై పట్టు కోల్పోవటం ఖాయమనీ ట్రంప్ బెంగపడుతున్నారు. కానీ ఇంతవరకూ వెల్లడైన వివరా లకే అన్ని వర్గాలూ ఆయన్ను దుయ్యబడుతున్నాయి. ఇరాన్ ముందు సాగిలపడ్డారని విమర్శిస్తున్నాయి. ఆర్థికంగా, సైనికంగా నష్టపోయినా తనకున్న అరకొర బలంతోనే చివరివరకూ దృఢంగా పోరాడి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. ఏదేమైనా యుద్ధంలో ఆయుధ సంపత్తి కాదు... సంకల్ప బలమే విజేతను నిర్ణయిస్తుందన్న పురాతన చైనా యుద్ధ వీరుడు సన్ జూ మాట మరోమారు రుజువైంది. -
రూపాయి 60 పైసలు క్రాష్..!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 60 పైసలు క్షీణించి 95.85 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం కావడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 95.55 వద్ద ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనవుతూ, కోలుకోలేకపోయింది. ఒకానొకదశలో ఇంట్రాడే కనిష్ట స్థాయి 95.85ను తాకిన రూపాయి, చివరికి అదే స్థాయి వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 95 డాలర్ల దిశగా కదలడం, అమెరికా చమురు నిల్వలు తగ్గడం వల్ల సరఫరా కొరత భయాలు నెలకొన్నాయి. -
విదేశీ పెట్టుబడులకు సంస్కరణల కార్పెట్!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితులను సమర్థవంతంగా గట్టెక్కడం, విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు కేంద్రం తన సంస్కరణల అజెండాను మరింత వేగంగా ముందుకు తీసుకుపోనుంది. గత ఏడాదిన్నరగా మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోతుండడం చూస్తున్నాం. హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ సరఫరాల్లో సమస్యలు ఏర్పడి వాటి ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో దిగుమతుల బిల్లు పెరిగిపోయి రూపాయి విలువ క్షీణిస్తోంది. ఇది విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరిచే అంశం. ఈ తరుణంలో తిరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షల ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశాయి. దేశీ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని.. బలమైన వినియోగానికి తోడు మెరుగైన జీఎస్టీ వసూళ్లు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు మెరుగుపడుతున్న పరిస్థితులను అవి గుర్తు చేస్తున్నాయి. చమురు, ఎరువుల దిగుమతుల బిల్లు పెరిగిపోయిన తరుణంలో దేశీ వృద్ధి పథాన్ని కాపాడుకోవడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను, ఆస్తుల విక్రయాన్ని మరింత వేగిరపరచాలని సర్కారు యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్థికరంగ సంస్కరణలు.. ఆర్థిక రంగంలో సంస్కరణలను కొనసాగించడం ద్వారా దీర్ఘకాల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా క్యాపిటల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయాలనుకుంటోందని తెలిపాయి. అవసరమైన చర్యలను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చేపడుతుందని, తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించనున్నట్టు చెప్పాయి. గత వారం ప్రభుత్వ సెక్యూరిటీల్లో (జీ–సెక్‌లు) విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) పెంచడం కోసం చర్యలు తీసుకోవడం తెలిసిందే. వడ్డీ ఆదాయం, దీర్ఘకాల, స్వల్పకాల మూలధన లాభాలపై పన్నుల నుంచి విదేశీ పెట్టుబడిదారులకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇది రూపాయి బలోపేతానికి కొంతమేర సాయపడినట్టు పేర్కొన్నాయి. బంగారం, వెండి దిగుమతులపైనా సుంకాలను 6% నుంచి 15 శాతానికి పెంచడం ఫలితాన్నిస్తున్నట్టు చెప్పాయి. బీమాలో 100% ఎఫ్‌డీఐను అనుమతించడం గమనార్హం.కట్టడిలోనే ద్రవ్యలోటు.. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో మాదిరే వృద్ధి కార్యకలాపాలు ప్రస్తుత త్రైమాసికంలోనూ (2026–27 ఏప్రిల్–జూన్) కొనసాగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లు కూడా స్థిరంగానే ఉన్నట్టు చెప్పాయి. దిగుమతుల వ్యయాలు పెరిగిపోయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును బడ్జెట్లో పేర్కొన్న విధంగా జీడీపీలో 4.3 శాతానికి కట్టడి చేయడం ఇప్పటికీ సాధ్యమేనని పేర్కొన్నాయి. -
భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ ఒక్కసారిగా భగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ మరోసారి పరస్పర దాడులకు దిగాయి. రెండు నెలల క్రితం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఇదే మొదటిసారి. ఇరాన్ సోమవారం ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ వెంటనే ఎదురుదాడి ప్రారంభించింది. మధ్య, పశ్చిమ ఇరాన్‌పై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడికి దిగింది. రాజధాని టెహ్రాన్‌తోపాటు చుట్టుపక్కల నగరాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ అధికారిక టీవీ చానల్ వెల్లడించింది. రాజధానిలో ఇమామ్ ఖమేనీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుతోపాటు పరిసర ప్రాంతాల్లో ఎయిర్‌స్పేస్‌ను ఇరాన్ మూసివేసింది. మాషహర్ సిటీలోని ఇరాన్ పెట్రోకెమికల్ ఫ్యాక్టరీపై ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ నిర్ధారించింది. బాలిస్టిక్ మిస్సైళ్ల పరికరాలు తయారుచేస్తున్న ఈ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మిస్సైల్ లాంచర్లను కూడా ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగానే తాము దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. ఉద్రిక్తతలకు అమెరికాయే కారణం: ఇరాన్ తొలుత లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేయగా, ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ప్రతీకారం తప్పదని ఆదివారం హెచ్చరించింది. అనుకున్నట్లుగానే ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. ప్రధానంగా సెంట్రల్ ఇజ్రాయెల్‌లో దాడులు జరిగాయి. రెండు సైనిక స్థావరాలను టార్గెట్ చేసినట్లు ఇరాన్ ఐఆర్జీసీ వెల్లడించింది. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజా ఉద్రిక్తతలకు ముమ్మాటికీ అమెరికా కారణమని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘే ఆరోపించారు. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ రెచ్చిపోతోందని మండిపడ్డారు. ఈ ఘర్షణలు పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉన్నందున దాడులు నిలిపివేస్తున్నట్లు కొన్ని గంటల తర్వాత ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ క్షిపణి దాడులను నిలిపివేస్తే ఇజ్రాయెల్ సైతం వెనక్కి తగ్గుతుందని ఇరాన్‌కు అమెరికా సూచించినట్లు సమాచారం. మరోవైపు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ అండదండలున్న నౌకలపై దాడులు చేస్తామని యెమెన్ హౌతీ మిలిటెంట్లు హెచ్చరించారు. హౌతీలకు ఇరాన్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌లోని భారతీయులను భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది. నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సోమవారం సూచించింది. స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని పేర్కొంది. అలాగే ఆ రెండు దేశాలకు వెళ్లే ప్రణాళిక ఉంటే వాయిదా వేసుకోవాలని పేర్కొంది. -
కల్లలైన కుటుంబం కల
ఉజ్జయిని: పశ్చిమాసియా యుద్ధం మధ్యప్రదేశ్‌లోని ఒక భారతీ యుని ఇంట్లో విషాదం నింపింది. గత 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉంటూ టైలర్‌గా పనిచేస్తున్న 55 ఏళ్ల మన్జూర్ అహ్మద్ ఈనెల 8వ తేదీన మేనల్లుడి పెళ్లి చూడ్డానికి భారత్‌కు బయల్దేరుతుండగా కువైట్ విమానాశ్రయంలపై జరిగిన దాడిలో ప్రా ణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు కువైట్ నుంచి ముంబై బయల్దేరాల్సిన విమానం ఎక్కాల్సిన మన్జూర్ అదే ఎయిర్‌పోర్ట్‌లో చనిపోయారన్న వార్త విని ఉజ్జయిని జిల్లాలోని అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘‘మేనల్లుడి పెళ్లి అనగానే మా నాన్న ఎంతో సంబరపడ్డారు. వెంటనే బయల్దేరాలని ఆశ పడ్డారు. బహుమతులతో బ్యాగు సర్దుకుని ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరారు. ముంబైదాకా విమానంలో వచ్చి అక్కడి నుంచి రైళ్లో మధ్యప్రదేశ్‌కు వస్తానని నాతో అన్నారు. నాన్నతో అర్ధరాత్రి 2.30 గంటలకు కూడా మాట్లాడా. ఇంతలోనే పిడుగులాంటి వార్త వినాల్సి వచ్చింది’’అని మన్జూర్ కుమారుడు, 18 ఏళ్ల అనాస్ అహ్మద్ విలపించారు. ‘‘కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి అంటే ఎవరో చనిపోయారని భావించాం. హఠాత్తుగా బుధవారం మధ్యాహ్నం భారత రాయబార కార్యాలయం నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. మన్జూర్ చనిపోయారని చెప్పగానే మా కాళ్ల కింద నేల కదిలినట్లయింది. ఆయనకు ఉజ్జయినిలో రైల్వేస్టేషన్లో ఘనంగా స్వాగతం పలకాలని పూలమాలలు కూడా కొనేశాం. ఇప్పుడు వాటినే ఆయన మృతదేహంపై కప్పేందుకు, మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గుజరాత్ వెళ్తున్నాం’’అని అతని బావ మొహమ్మద్ ఇస్మాయిల్ ఏడుస్తూ చెప్పారు. సన్నిహిత బంధువుల వివాహం తర్వాత దగ్గరి బంధువుల ఇళ్లకు వెళ్లి కలిసిరావాలని మన్జూర్ ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాడు. ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మన్జూర్కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. కుటుంబ పోషణభారం మొత్తం ఒక్కడే మోస్తున్నాడు’’అని ఆప్తులు తెలిపారు. నేడు భారత్‌కు మన్జూర్ పార్థివదేహం విమానంలో కువైట్ నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మన్జూర్ పారి్థవదేహాన్ని శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకల్లా భారతప్రభుత్వం తరలించనుంది. అక్కడి నుంచి ఉజ్జయిని నగరానికి రోడ్డు మార్గంలో తీసుకురానున్నారు. బాధితుని స్వస్థలం ఉజ్జయిని జిల్లాలోని చంబా నదీతీరంలోని నాగ్డా పట్టణం. ‘‘ఎయిర్పోర్ట్ టరి్మనల్1పై ఇరాన్ డ్రోన్లు దాడిచేయడంతో మన్జూర్ చనిపోయారు. మరో 13 మంది భారతీయులు గాయపడ్డారు. మన్జూర్ పారి్థవదేహం తరలింపు విషయంలో ఆయన కుటుంబంతో నిరంతరం మంతనాలు జరుపుతున్నాం. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’’అని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి ఆసీం ఆర్ మహాజన్ తెలిపారు. -
ఇరాన్ ప్రతీకారం
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు ఇరాన్ సైన్యం అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా మిలటరీ స్థావరాలే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మృతిచెందాడు. మరికొందరు గాయపడ్డారు. మృతుడు ఏ రాష్ట్రానికి చెందినవాడనే విషయం తెలియరాలేదు. బాధితుడి కుటుంబాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని, అవసరమైన సాయం అందిస్తామని కువైట్‌లోని భారత ఎంబసీ ప్రకటించింది. ఇరాన్ దాడిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిన్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. కువైట్ ఎయిర్‌పోర్టుపై దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారతీయుడి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు 10 మంది భారతీయులు మరణించారు. కువైట్‌కు విమాన సేవలను గురువారం వరకు నిలిపివేస్తునట్లు భారత్‌లో ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. మాటకు కట్టుబడి దాడులు చేశాం.. బహ్రెయిన్‌లోని పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ప్రజలను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక సైరన్‌ను మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని జనానికి సూచించింది. బహ్రెయిన్ గగనతలం గుండా క్షిపణులు దూసుకెళ్తున్నాయని పేర్కొంటూ ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ ‘ఎక్స్’లో ఒక వీడియోను పోస్టు చేసింది. ఇరాన్‌కు చెందిన ఖేష్మ్ ఐలాండ్‌పై ఈ నెల 2న అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది. డ్రోన్ కార్యకలాపాలను నిర్దేశించడానికి ఉపయోగించే ఇరాన్ మిలటరీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ టెలికమ్యూనికేషన్ యాంటెన్నా, ఆయిల్ ట్యాంకర్ ధ్వంసమైనట్లు సమాచారం. ఇందుకు ప్రతీకారంగానే ఇరాన్ తాజాగా పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఏ విధమైన దురాక్రమణకైనా భిన్నమైన, మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని తాము ఇంతకుముందే హెచ్చరించినట్లు ఇరాన్ గుర్తుచేసింది. ఆ మాటకు కట్టుబడి నేడు దాడులు చేశామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయంగా ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గల్ఫ్ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. కువైట్, బహ్రెయిన్‌పై దాడుల్లో అమెరికాకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు. అమెరికా సైన్యం స్పందించలేదు. -
పరిశ్రమలకు ‘పశ్చిమాసియా’ గండం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయంగా చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థల ఆదాయాలు, లాభాలపై గణనీయంగా ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వాటి ఆదాయాలు 100 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు (1 శాతం) తగ్గి 7.5 – 8.5 శాతం శ్రేణికి పరిమితం కానున్నాయి. ఇక ఎబిటా సైతం 50–100 బేసిస్ పాయింట్లు క్షీణించి 5–5.5 శాతానికి నెమ్మదించవచ్చునని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజాగా ఎంఎస్ఎంఈ రిపోర్టులో అంచనా వేసింది. దీని ప్రకారం మోర్బి, ఫిరోజాబాద్, సూరత్, వదోదరలాంటి క్లస్టర్లపై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఏడాదికి రెండుసార్లు వెలువరించే ఈ నివేదికలో 69 రంగాలు, 147 క్లస్టర్లను పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆదాయం రూ. 75 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 20–25 శాతం, ఎంఎస్ఎంఈ పరిశ్రమలో మూడింట రెండొంతులు ఉంటుంది. మూడు కేటగిరీలు.. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావానికి గురయ్యే ఎంఎస్ఎంఈలను మూడు కేటగిరీలుగా నివేదికలో వర్గీకరించారు. గ్యాస్‌లాంటి ఇంధన సంబంధ ముడిసరుకుపై ఆధారపడినవి, ఇంధన సంబంధ డెరివేటివ్స్‌పై ఆధారపడినవి, వ్యాపారపరంగా అవరోధాల ప్రభావం ఎక్కువగా ఎదుర్కొనేవి వీటిలో ఉన్నాయి. గ్యాస్‌లాంటి ఇంధనాలపై ఆధారపడే యూనిట్లపై అత్యధిక ప్రభావం పడనుంది. మోర్బి క్లస్టర్ ఇందుకు ఉదాహరణ. దేశీయంగా సెరామిక్ టైల్స్ ఉత్పత్తిలో దీని వాటా 80 శాతం పైగా ఉంటుంది. ఇందులో 80–85 శాతం తయారీ .. గ్యాస్ ఆధారంగానే ఉంటోంది. క్లస్టర్‌లోని సెరామిక్ రంగం ఆదాయంలో దీని వాటా 85 శాతంగా ఉంటుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ క్లస్టర్ ఆదాయ వృద్ధి 9–11 శాతంగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1–3 శాతానికి పడిపోనుంది. ఇక్కడ ప్రధానంగా ఎగుమతుల కోసమే ఉత్పత్తి (80–90 శాతం) జరుగుతుండటం ఇందుకు కారణం. ఇందులో 20–25 శాతం ఉత్పత్తి.. పశ్చిమాసియాకే ఎగుమతి అవుతోంది. మోర్బి క్లస్టర్ సెరామిక్ పరిశ్రమ ఎబిటా మార్జిన్ ఈ ఆర్థిక సంవత్సరం 300–400 బేసిస్ పాయింట్లు క్షీణించి 4–6 శాతానికి పరిమితం కానుంది. అదే విధంగా ఫిరోజాబాద్‌లోని గ్లాస్ సెక్టార్ ఉత్పత్తి 40 శాతం తగ్గడంతో పరిశ్రమ ఆదాయ వృద్ధి 1–3 శాతానికి పరిమితం కానుంది. పశ్చిమాసియా నుంచి మిథనాల్లాంటి వాటిని 90 శాతం మేర దిగుమతి చేసుకునే కెమికల్ రంగానికి ముడిసరుకు వ్యయాలు 1.2–1.4 రెట్లు పెరిగిపోయాయి. ఇందులో కొంత భారాన్ని అవి బదలాయించినప్పటికీ 2027 ఆర్థిక సంవత్సరంలో వదోదరలోని కెమికల్ ఎంఎస్ఎంఈల మార్జిన్లు 150–250 బీపీఎస్ మేర తగ్గొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇక రోడ్ల నిర్మాణంలాంటి రంగాలపై డీజిల్ రేట్ల పెరుగుదల ప్రభావం పడే అవకాశం ఉంది. సదరు సంస్థల మొత్తం వ్యయాల్లో ఇంధన వ్యయాల వాటా 8–10 శాతం ఉంటుంది. దీంతో వాటి మార్జిన్లు 50–100 బేసిస్ పాయింట్లు తగ్గి 8–10 శాతానికి పరిమితం కావచ్చు. అలాగే, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపార సంస్థల ఖర్చులో 10–15 శాతం ప్యాకింగ్ వ్యయాలు ఉంటాయి. ఫలితంగా వాటి మార్జిన్లు కూడా 50–100 బేసిస్ పాయింట్లు తగ్గి 6–6.5 శాతానికి నెమ్మదించనున్నాయి.కొత్తేమీ కాదు.. పరిశ్రమకు ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదని నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద కంపెనీల ఆదాయాలు 1 శాతం వరకు, ఎంఎస్ఎంఈల రెవెన్యూ 3–5 శాతం మేర క్షీణించినట్లు తెలిపింది. అలాగే ఎంఎస్ఎంఈల ఎబిటా మార్జిన్లు 2021 ఆర్థిక సంవత్సరంలో 80 బీపీఎస్ క్షీణించి 4.7 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం తీరుతెన్నులు కూడా అదే తరహాలో ఉన్నట్లు తెలిపింది. చిన్న వ్యాపారాలపై ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోందని నివేదిక వివరించింది. ఎంఎస్ఎంఈలు రెండు రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. గ్యాస్‌లాంటి ముడి సరుకు లభ్యత తగ్గిపోవడం వల్ల ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చి, ఆ కారణంగా ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది. ఇక రెండో అంశం విషయానికొస్తే వ్యాపారానికి అవరోధాలు, పెరిగిన కమోడిటీ..ఇంధన వ్యయాలను కస్టమర్లకు బదలాయించేలా, రేట్లను పెంచలేని పరిస్థితి వల్ల మార్జిన్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటోందని నివేదిక పేర్కొంది. -
ఎరువుల సంక్షోభం ముంచుకొస్తోంది..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తీవ్రమైన ఎరువుల సంక్షోభం ముంచుకొస్తోందని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ గులాటి హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుందని ఆయన విశ్లేషించారు. త్వరలోనే ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ప్రస్తుతానికి మన దగ్గర తగినన్ని ఎరువుల నిల్వలు ఉండటం రైతులకు ఊరట కలిగించే శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలికంగా చూస్తే ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, సబ్సిడీలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేశారు. డా. అశోక్ గులాటి తెలిపిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తనున్న ఎరువుల సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాలి. ఖరీఫ్ సాగు సీజన్ త్వరలో మొదలవనున్న నేపథ్యంలో మన దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయన్నది రైతులకు శుభవార్త.ఇక రెండోది మన వ్యవసాయానికి అత్యంత కీలకమైన యూరియా. మనం ఏటా సుమారు 40 మిలియన్ టన్నుల యూరియా వాడుతున్నాం. గతేడాది 11 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకున్నాం. ఇటీవలే ప్రభుత్వం యూరియా దిగుమతి కోసం టన్నుకు 935 డాలర్ల కనీస ధరతో టెండర్లు ఆహ్వానించింది. రైతులకు విక్రయిస్తున్న ధర సుమారు 65 డాలర్లు.ఒకవేళ ధరలు పెరగకుంటే ఈ ఏడాది బడ్జెట్లో రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించిన ఎరువుల సబ్సిడీ తడిసిమోపడవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది రూ.2.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం త్వరగా చల్లారకపోతే, సబ్సిడీ మొత్తం ఏకంగా రూ. 3 లక్షల కోట్లను కూడా దాటిపోవచ్చనేది ఎరువుల శాఖ అధికారుల తాజా లెక్క.హార్మూజ్ జలసంధిలో దిగ్బంధనం మరో 2–3 నెలలు పాటు కొనసాగితే, రాయితీల విషయంలో ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు తలెత్తుతాయి. ఇంతకు మించిన ఆందోళన ఏంటంటే, ఎరువుల కోసం మనం 70% దిగుమతులపైనే ఆధారపడుతున్నాము.దేశీయంగా యూరియా ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే, దీనికి అవసరమైన గ్యాస్ (ఎల్ఎన్జీ)లో 85% దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా ఎగబాకుతుంది, మొత్తంమీద ఖరీఫ్ సీజన్ మధ్యలోనో, లేదంటే చివర్లోనో తీవ్రమైన ఎరువుల సంక్షోభం పొంచి ఉంది.ఎరువుల ధరలు పెంచకపోతే, సబ్సిడీల భారం పెరిగి ద్రవ్యలోటు ఎగబాకుతుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. విదేశీ పెట్టుబడుల తగ్గుదల, రూపాయి మరింత పతనం వంటి దుష్ర్పభావాలు తీవ్రమవుతాయి.ఈ సంక్షోభాన్ని సదవకాశంగా మలచుకొని సంస్కరణలకు నడుంబిగించాలి. ఎరువుల ధరల సబ్సిడీ విధానం నుంచి ఆదాయ మద్దతు విధానానికి మారాలి. రైతులతో మాట్లాడి, ఎరువుల ధర రాయితీలకు బదులు ఆదాయపరమైన రాయితీలతో ఆదుకుంటామన్న భరోసా కల్పించాలి. దీనికి ఒక వ్యవస్థ ఉండాలి. అవసరమైతే ‘పీఎం కిసాన్’ పథకంలో విలీనం చేయవచ్చు. దీని ద్వారా కూడా రైతులకు రూ. 2 లక్షల కోట్ల రాయితీలను నేరుగా ఇవ్వొచ్చు. తద్వారా కనీసం రూ. 40,000 కోట్లు ఆదా చేయగలుగుతారు.ప్రభుత్వం ఇంత భారీ సబ్సిడీలను ఇప్పుడున్నట్లే ఇవ్వాలనుకుంటే, వినియోగ పరిమితులను విధించాల్సి ఉంటుంది. అంటే, పొలం విస్తీర్ణాన్ని బట్టి, పండించే పంట ఆధారంగా రైతుకు అందించే ఎరువుల పరిమాణాన్ని కేటాయించాలి.15 ఏళ్లుగా వరి, గోధుమలు.. ఇలా అనేక ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ యూరియా ధరలు మాత్రం అక్కడే ఉండిపోయాయి. ఈ విధానం సరికాదు. ఎరువుల సరఫరా వ్యవస్థలో లీకేజీల (వృథా/అక్రమాలు) కారణంగా సబ్సిడీ నిథులు పక్కదారి పడుతున్నాయి. ఎరువుల ధరలు సహజ మార్కెట్ స్థాయికి చేరుకుంటే, లీకేజీలన్నీ వాటంతటవే మాయమైపోతాయి.– డా. అశోక్ గులాటి, వ్యవసాయ ఆర్థికవేత్త -
మళ్లీ బాంబుల వాన
దుబాయ్/వాషింగ్టన్: ఓవైపు పశ్చిమాసియాలో శాశ్వత శాంతిస్థాపనకు దౌత్యమార్గంలో చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియాలో బాంబులమోత మోగించాయి. గత వారం తమ అత్యాధునిక ఎంక్యూ–1 డ్రోన్‌ను ఇరాన్ క్షిపణులు కూల్చేసినందుకు ప్రతీకారంగా సోమవారం ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. డ్రోన్లను ప్రయోగించే ప్రయోగకేంద్రాలనూ అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో ప్రతీకారంతీర్చుకుంది. అమెరికా వైమానిక స్థావరాలకు నిలయమైన కువైట్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. డ్రోన్లతో తెగబడింది. వీటిలో దాదాపు అన్నింటినీ కూల్చేశామని కువైట్ పేర్కొంది. ‘‘అంతర్జాతీయ జలాలపై నిఘా, పర్యవేక్షణ విధుల్లో ఉన్న తమ యూఎస్ ఎంక్యూ–1 డ్రోన్‌ను ఇరాన్ జలసమాధి చేసింది. అందుకే వాళ్ల రాడార్లను మేం నాశనంచేశాం. డ్రోన్ లాంఛింగ్ సైట్లను బూడిదచేశాం. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హార్మూజ్ జలసంధి గుండా మా రక్షణలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడికి బయల్దేరినా డ్రోన్లనూ నేలకూల్చాం. ప్రతిగా ఇరాన్ మొదలెట్టిన దాడుల్లో మా బలగాలకు, మా సైనిక సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు’’అని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ సోమవారం ప్రకటించింది. ఆదివారం గెరూక్, ఖేష్మ్ ద్వీపం మీదా దాడులు చేశామని అమెరికా మిలటరీ పేర్కొంది. అయితే టెలికమ్యూనికేషన్ టవర్ మీద సైతం అమెరికా దాడిచేసిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. దౌత్యం జరుపుతూ దాడులు చేయడంపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘మొదట్నుంచీ అమెరికా మమ్మల్ని నమ్మట్లేదు. చర్చలు సైతం అపనమ్మకంతో కొనసాగుతున్నాయి. అవిశ్వాస వాతావరణంలో దౌత్యం ఏనాటికీ కొలిక్కిరాదు’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్ చక్క టి ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా మాటిమాటికి బాంబులేయడం మానేసి ఓపికపడితే కుదురుకుంటుంది’’అని ఆయన అన్నారు. భద్రంగా హార్మూజ్‌ను దాటిన 70 నౌకలు అమెరికా బలగాల రక్షణంలో గత వారం రోజుల వ్యవధిలో ఏకంగా 70 వాణిజ్య నౌకలు హార్మూజ్ జలసంధి గుండా పయనించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ జలాలకు అటువైపు, ఇటువైపు ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించగలిగాయని అమెరికా అధికారులు వెల్లడించారని సోమవారం న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ముందుజాగ్రత్తగా నౌకలన్నీ తమ లొకేషన్‌ను చూపించే ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేశాయని వెల్లడించింది.అమెరికాతో చర్చలనునిలిపేసిన ఇరాన్! లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తుండటంపై నిరసనగా అమెరికాతో దౌత్యచర్చలను నిలిపేస్తున్నట్లు ఇరాన్ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతంలో నిర్ణయించుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులుచేస్తోందని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘దాడులకు నిరసనగా ఇకపై మధ్యవర్తులతో తమ దౌత్య ప్రతినిధులు చర్చలు జరపబోరు. తక్షణం లెబనాన్‌పై కాల్పులు, దురాక్రమణను ఇజ్రాయెల్ నిలిపేయాలి. బీరుట్ ఆక్రమణ ప్రయత్నాలను ఇజ్రాయెల్ విరమించుకోవాలి. ఇప్పటికే ఆక్రమించుకున్న సరిహద్దు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్)బలగాలు వెనుతిరగాలి. ఈ దిశగా ఇజ్రాయెల్ తీసుకునే చర్చలతో మేం సంతృప్తి చెందేదాకా మధ్యవర్తులతో చర్చలపై ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుంది. అప్పటిదాకా చర్చలకు వెళ్లే ప్రసక్తేలేదు’’అని ఇరాన్ ఒక ప్రకటనలో పేర్కొందని ఇరాన్‌లోని మీడియాలో కథనాలొచ్చాయి. బీరుట్ సమీప దహియే జిల్లాపై దాడులను ముమ్మరంచేయాలని సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
మేము కోరుకున్నది దక్కకపోతే..
వాషింగ్టన్: పశ్చిమాసియాలో హార్మూజ్ జలసంధి దిగ్బంధం సహా యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో మంచి ఒప్పందానికి అమెరికా, ఇరాన్‌లు చాలా దగ్గరగా వచ్చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, తాము కోరుకున్నది లభించకపోతే ఆ ఒప్పందాన్ని వేరే విధంగా ముగిస్తామని ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్‌లో తన కోడలు లారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు అంశాలపై మాట్లాడారు. ఇరాన్‌తో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చేశామని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ, తొందరపడితే మంచి ఒప్పందం కుదరదని అభిప్రాయపడ్డారు. నెమ్మదిగా అయినా సరే కచ్చితంగా తాము కోరుకున్నది సాధిస్తున్నామని తేల్చిచెప్పారు. కోరుకున్నది దక్కేదాకా వేచి చూస్తామని, ఒప్పందం విషయంలో తొందరేమీ లేదని సంకేతాలిచ్చారు. చర్చల విషయంలో ఇరానీయులు మంచి నిపుణులు అని అన్నారు. కానీ, ఇరాన్ సైనికపరంగా ఇప్పటికే ఓడిపోయినందున ప్రస్తుతం అన్ని అవకాశాలు అమెరికా చేతిలోనే ఉన్నాయని స్పష్టంచేశారు. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోగలిగితే మంచిదేనని.. లేకపోతే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడం లేదని ఇరాన్ చెప్పిందని ట్రంప్ అన్నారు. ఒకవేళ వారు(ఇరాన్) అణ్వాయుధాన్ని కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అలాంటి అయుధాన్ని కొనుగోలు చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చిందన్నారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికాకు గణనీయమైన పట్టు సాధించిందని తెలిపారు. అయితే, ఇరాన్ నాయకత్వంలో కొందరు మితవాదులు ఉండడంతో తాము ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నిరీ్వర్యం చేయలేదని అన్నారు. ఇరాన్‌లోని అత్యంత తీవ్రవాద శక్తులను, కీలక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నామని పునరుద్ఘాటించారు. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన 60 రోజల తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేయడానికి ట్రంప్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అందులోని అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
దేశీయ విమాన సర్వీసులను తగ్గించనున్న ఎయిరిండియా, ఇండిగో
న్యూఢిల్లీ: దేశంలోని రెండు అతిపెద్ద విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లు రోజువారీ దేశీయ విమాన సర్వీసులను తగ్గించనున్నాయి. జూన్ నుంచి 250 సర్వీసులను ఉపసంహరించుకుంటున్నట్టు విమానాయన సంస్థలు ప్రకటించాయి. ఇంధన ధరలు పెరిగిపోవడం, ప్రయాణికుల సంఖ్య తగ్గడమే దీనికి కారణంగా తెలుస్తోంది. జూన్ నుంచి ఆగస్టు వరకు ఈ కోతలు కొనసాగున్నాయి. దేశీయ పర్యాటకానికి ఇది అత్యంత కీలకమైన సెలవుల కాలం. ఈ సమయంలో సర్వీసుల తగ్గింపు అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. రోజుకు 500 దేశీయ విమానాలను నడిపే ఎయిరిండియా జూన్, జూలై నెలల్లో తన దేశీయ షెడ్యూల్లో సుమారు 22% తగ్గిస్తోంది. దీంతో రోజుకు సుమారు 110 విమానాలు తగ్గుతాయి. ఇక, రోజుకు సుమారు 2,200 విమానాలను నడిపే ఇండిగో, తన దేశీయ సామర్థ్యాన్ని 5 నుంచి 7% మేర తగ్గిస్తోంది. ఇవి కూడా రోజుకు దాదాపు 110 సర్వీసులు తగ్గుతాయి. ఎయిరిండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కూడా రోజువారీ సుమారు 340 దేశీయ సర్వీసుల్లో దాదాపు 10% కోత విధిస్తోంది. ఈ సర్దుబాట్లు తాత్కాలిక చర్యని ఎయిరిండియా ఒక ప్రకటనలో తెలిపింది. డిమాండ్, నిర్వహణ పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొంది. వేసవి తర్వాత వ్యాపారం మందగించిన కాలంలో డిమాండ్ తగ్గడమే ఈ కోతకు కీలక కారణమని ఇండిగో పేర్కొంది. పరిస్థితులు మెరుగుపడిన వెంటనే విమానాలను పునరుద్ధరిస్తామని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. దీని కారణంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాలపై తీవ్ర ప్రభావం పడనుంది. కీలక వ్యాపార, విహార మార్గాలతో అనుసంధానించి ఉండే ఈ నగరాలు నిత్యం రద్దీగా ఉంటాయి. ముంబై నుంచి జైపూర్, గోవా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, నాగ్‌పూర్, పాటా్న, భోపాల్‌కు వెళ్లే సర్వీసుల సంఖ్య తగ్గుతుంది. ఢిల్లీ నుంచి గోవా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, కొచ్చి, కోల్‌కతాకు వెళ్లే విమానాలపై ప్రభావం పడింది. దక్షిణ భారతంలోని ఒక ప్రధాన కేంద్రంగా ఉన్న బెంగళూరు సైతం తిరుగు ప్రయాణ విమానాల తగ్గింపు వల్ల ఇబ్బంది పడనుంది. అయితే, గగనతల ఆంక్షలు సడలించడంతో విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు కొన్ని అంతర్జాతీయ సర్వీసులను పునరుద్ధరించడం కొంత ఊరట. ఎందుకు తగ్గిస్తున్నాయి? పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశీయ కార్యకలాపాలకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు సుమారు 25%, అంతర్జాతీయ విమానాలకు ఇంకా ఎక్కువగా పెరిగాయి. విమానయాన సంస్థల బడ్జెట్లలో అత్యధిక భాగం ఇంధన ఖర్చులే. సరిగ్గా నెల రోజుల క్రితం, జెట్ ఫ్యూయల్ ధరల్లో ఈ పెరుగుదల కార్యకలాపాలపై ఒత్తిడిని పెంచింది. ఈ పెరుగుదల విమానయాన సంస్థలను కార్యకలాపాలను హేతుబదీ్ధకరించేలా చేసింది. ఇటీవలి వారాల్లో అనేక మార్గాల్లో ఛార్జీలు ఇప్పటికే 30% పెరిగాయి. ఏటీఎఫ్ ఖర్చుల కారణంగా విమానయాన సంస్థలు ప్రతి ప్రయాణికుడికి రూ. 400–450 ఇంధన సర్ఛార్జీలను ప్రవేశపెట్టాయి. సీట్ల సంఖ్య తక్కువగా ఉండటంతో రద్దీ మార్గాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే మూడు నెలల్లో విమాన ప్రయాణం సామాన్యులకు అందుబాటులో ఉండకపోవచ్చు. -
చిన్న సంస్థల్లో ‘పశ్చిమాసియా’ సంక్షోభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశీయంగా దాదాపు 61 శాతం చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) పెను సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పరిశ్రమల సమాఖ్య అసోచాం సెక్రటరీ జనరల్ సౌరభ్ సన్యాల్ తెలిపారు. సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, వ్యాపారాలు మందగించడంతో పలు సంస్థలు తీసుకున్న రుణాలు ఎన్పీఏలుగా మారే ముప్పు నెలకొందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ. 2.55 లక్షల కోట్లతో ఈసీఎల్జీఎస్ (ఎమర్జెన్సీ క్రెడిట్లైన్ గ్యారంటీ స్కీమ్) తరహాలో రాష్ట్రాలు ప్రత్యేక స్కీమ్లాంటిదేదైనా ప్రవేశపెట్టొచ్చని పేర్కొన్నారు. అలాగే సంక్లిష్టమైన నిబంధనల అమలుకు సంబంధించి కొంత వెసులుబాట్లు కల్పించాలని గురువారమిక్కడ డేటా సెంటర్స్, ఏఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. చిన్న సంస్థలకు ఉపశమనం కలిగించే ప్రయత్నాల్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్‌కి కూడా అసోచాం పలు ప్రతిపాదనలు చేసినట్లు సన్యాల్ చెప్పారు. ఆరు నెలల పాటు రుణాలపై మారటోరియం విధించడం, గత ఆర్థిక సంవత్సరం స్థాయిలో విదేశీ మారకంలో ప్రీ–షిప్మెంట్ రుణాలు కల్పించడం, వాటి కాల వ్యవధిని 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచడంలాంటి చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. అలాగే తదుపరి రుణాలిచ్చేందుకు వీలుగా బ్యాంకులు అవసరమైనప్పుడు తీసుకునేలా రెపో రేటుకే రూ. 1 లక్ష కోట్లు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సన్యాల్ తెలిపారు. మరో మూడు నుంచి ఆరు నెలల వరకు ఎకానమీ సాధారణంగానే ఉన్నా, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఆ తర్వాత సమస్యలు తలెత్తవచ్చని చెప్పారు. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు ఎలా ఉన్నా, వృద్ధి రేటు 7 శాతం లోపునకు తగ్గకపోవచ్చని అంచనా వేస్తున్నట్లు సన్యాల్ తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తకపోయి ఉంటే ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల దేశీ సంస్థలకు గణనీయంగా ప్రయోజనాలు లభించేవని చెప్పారు. -
బీమా రంగం డీలా
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం దీర్ఘకాలం పాటు కొనసాగితే బీమా రంగం వృద్ధి మందగించొచ్చని ఎల్ఐసీ సీఈవో, ఎండీ ఆర్.దొరైస్వామి అభిప్రాయపడ్డారు. ‘‘ప్రధాని చెప్పినట్టు మనం కష్టకాలాన్ని చూస్తున్నాం. ఇప్పటి వరకు పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం వినియోగదారులపై పూర్తి స్థాయిలో పడకుండా రక్షణ కలి్పంచారు. ఒకవేళ ఈ సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే అది వ్యక్తుల ఖర్చులు, పొదుపులను ప్రభావితం చేస్తుంది. ఈ సంక్షోభం సాధ్యమైనంత త్వరలో ముగిసి, పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నాం’’అని దొరైస్వామి చెప్పారు. ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ప్రభావితమైతే బీమా రంగం దీనికి దూరంగా ఉండలేదన్నారు. వ్యక్తుల ఆదాయాలు, వారి సామర్థ్యాలు ప్రభావితమైతే బీమా రంగంపైనా ప్రభావం చూపిస్తుందన్నారు. ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో మరికొంత విక్రయించే విషయమై ఎదురైన ఒక ప్రశ్నకు.. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దొరైస్వామి చెప్పారు. లిస్టింగ్ నిబంధనలను పాటించడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి సారించినట్టు దొరైస్వామి పేర్కొన్నారు. వాటాలను దశల వారీగా 10–15 శాతం మేర తగ్గించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టు చెప్పారు. 2022లో ఎల్ఐసీ ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాలను రూ.21,000 కోట్లకు విక్రయిచడం గమనార్హం. -
ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచాలి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎగుమతుల పోటీతత్వం పెంచేందుకు పన్నుల తగ్గింపు, అవసరం లేని, అనర్ధదాయక వస్తువుల దిగుమతులపై నిషేధం విధించడంతోపాటు.. తగిన రక్షణ చర్యలు అవసరమని ఒక నివేదిక సూచించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్టు తెలిపింది. దీనివల్ల ఇంధనం, వ్యవసాయం, ఉత్పాదక రంగాలలో వ్యయాలు పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నట్టు ‘థింక్ చేంజ్ ఫోరమ్’ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి సబ్సిడీలపై ఆధారపడటం పరిష్కారం కాదని సూచించింది. సబ్సిడీలు ఇవ్వడం వల్ల పరిశ్రమలు అంతర్జాతీయ సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని, సమర్థతను కోల్పోతాయంటూ.. వీటికి బదులు ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడానికి పన్నుల నిర్మాణంలో మార్పులు చేయాలని, దేశీయ పరిశ్రమలకు మేలు జరిగేలా దిగుమతి సుంకాలను ఎప్పటికప్పుడు సవరించాలని, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి అనవసరమైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవాలని సూచించింది. అవసరం లేని వస్తు దిగుమతులను తగ్గించడం అన్నది కేవలం పొదుపు చర్య మాత్రమే కాదని, అది దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ముఖ్యమైందన్న ప్రధాని మోదీ ఇటీవలి పిలుపును ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 774.98 బిలియన్ డాలర్లకు పెరగ్గా.. ఎగుమతులు 441.78 బిలియన్ డాలర్లుగా నమోదవడం తెలిసిందే. దీనివల్ల దేశ వాణిజ్య లోటు 333 బిలియన్ డాలర్లు దాటిపోయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ డేటాను ఉదహరించింది. రూపాయిని కాపాడుకోవాలి.. → అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన కరెన్సీ (రూపాయి) విలువను కాపాడుకునేందుకు తక్కువ విలువ జోడించే విడిభాగాలను కట్టడి చేయాలి. వీటి తయారీకి సంబంధించి దేశీయంగా తగిన తయారీ వ్యవస్థ ఉంది. → హానికారక వస్తు దిగుమతులను సైతం నిషేధించాలి. తక్కువ విలువతో కూడిన విచక్షణారహిత దిగుమతులను అనుమతించడం వల్ల విదేశీ మారకం నిల్వలపై ఒత్తిళ్లు పడుతున్నాయి. అదే సమయంలో దేశీయంగా బలమైన విలువ జోడింపు అవకాశాలు, సామర్థ్య విస్తరణ, ఉపాధి కల్పన అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. → పొగాకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో అతిపెద్ద దేశమైనప్పటికీ.. 116 మిలియన్ డాలర్ల విలువైన సిగరెట్లు, సిగార్లు, టుబాకో, టుబాకో ప్రత్యామ్నాయాలను దిగుమతి చేసుకుంటోంది. → ఖరీదైన కన్ఫెక్షనరీలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, విలాసవంతమైన వాచీలు, కార్ల దిగుమతులను సాధారణ అనుమతుల జాబితా నుంచి తొలగించి, కఠినమైన నిబంధనలతో కూడిన ప్రత్యేక లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలి. → విదేశీ వస్తు దిగుమతులతో దేశీ పరిశ్రమలు నష్టపోతున్నప్పుడు, వాటిని రక్షించడానికి తగిన వాణిజ్య చర్యలను తగిన కాలపరిమితితో తక్షణమే అమలు చేయాలి. -
తైవాన్‌పై ఉభయుల చదరంగం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల రెండవ వారంలో చైనాను సందర్శించిన సందర్భంగా తైవాన్ విషయమై అన్న మాటలు కొన్ని అపోహలను కలిగించాయి. తన వ్యాఖ్యలను కొందరు స్థూల దృష్టితో చూసి నిజమని నమ్ముతున్నారు కూడా. తైవాన్‌కు సంబంధించి ఆయన ఇక చేతులు ఎత్తివేసినట్లేననే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్త వమో జాగ్రత్తగా పరిశీలించటం అవసరం.మార్పున్నట్టా? లేనట్టా?రెండు దేశాల అధ్యక్షుల మధ్య తొలి సమావేశం మే 14న జరిగినపుడు షీ జిన్‌పింగ్ తైవాన్ ప్రస్తావన చేస్తూ, తమ ప్రయోజ నాలకు ముఖ్యమైన అంశాలలోకెల్లా అతిముఖ్యమైనది తైవాన్ అనీ, అందుకోసం తాము అమెరికాతో ఘర్షణకైనా సిద్ధమనీ చెప్పారు. ఈ ప్రస్తావన సాగినంత కాలం ట్రంప్ ముఖకవళికలు బరువుగా కనిపించాయి. స్పందనలేవీ లేవు. మరునాడు స్వదేశానికి తిరిగి వెళుతుండగా విమానంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నుంచి మూడు మాటలు వినిపించాయి. అమెరికా నుంచి 9,500 మైళ్ల (15 వేల కిలోమీటర్ల) దూరంగల తైవాన్ కోసం తాము శక్తిమంతమైన చైనాతో యుద్ధం చేయలే మన్నది ఒకటి. స్వతంత్రాన్ని ప్రకటించ వద్దంటూ తాను తైవాన్ నాయకత్వానికి చెప్పానన్నది రెండు. తైవాన్‌కు విక్రయించదలచిన ఆయుధాల విషయమై తుది నిర్ణయ మేదీ తీసుకోలేదన్నది మూడు. పోతే, చైనాకు బయలుదేరే ముందు రోజున అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, తైవాన్ విధానంలో మార్పేమీ ‘ప్రస్తుతానికి’ లేదన్నారు. చైనా అధ్యక్షుడు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు ముఖాముఖిన చేయటం, అందుకు అమెరికా వైపు నుంచి ఎన్నడూ లేనంత జాగ్రత్తతో కూడిన స్పందనలు రావటంపై సహజంగానే విస్తృతమైన చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. తైవాన్, జపాన్ కలవరపడగా, అమెరికాలోని మితవాద లాబీలు విమర్శించాయి. ఇంతకూ అమెరికా తన చిరకాలపు విధానాన్ని మార్చుకునే దిశలో ఉన్నట్లా? చేతులు ఎత్తివేస్తున్నట్లా?యుద్ధానికి దూరంతో ఏం పని?అందుకోసం మొదట అమెరికా అధ్యక్షుని మూడు మాటలను, ఆయన విదేశాంగ మంత్రి మాటను తిరిగి చూడాలి. చైనాతో యుద్ధం చేయదలిస్తే అమెరికన్లు 15,000 కి.మీ.లు ప్రయాణించ వలసిన అవసరమే లేదు. వారికి చైనాకు పొరుగున గల జపాన్‌లో 4, దక్షిణ కొరియాలో 2, గువామ్‌లో 2 బలమైన సైనిక స్థావరాలున్నాయి. ఫిలిప్ఫైన్స్లో సైనిక వెసులుబాట్లున్నాయి. స్థావరాలతో సరిపోల్చగల అత్యాధునిక విమాన వాహక నౌకాదళాలను, అణ్వాయుధాలనైనా ప్రయోగించగల జలాంతర్గములను చైనా సమీపాన మోహరించగలరు. దీర్ఘశ్రేణి క్షిపణులూ ఉండనే ఉన్నాయి. అందువల్ల వేల కిలోమీటర్ల దూరమన్నది అర్థం లేని మాట. ఏమి చేస్తారన్నది రాజకీయ నిర్ణయం మాత్రమే. పైన పేర్కొన్న స్థావరాలు, నౌకా బలంతో, తైవాన్‌కు ఇప్పటికే సమకూర్చిన ఆయుధ సంపత్తితో, చైనీయులు తైవాన్‌పై దాడి చేసినట్లయితే తాము కూడా సైనిక జోక్యం చేసు కోగలమంటున్న జపాన్, ఫిలిప్ఫైన్స్ల ప్రకటనలతో, చైనాను ఓడించగలరా లేదా అన్నది వేరే ప్రశ్న. కానీ, తమకు తైవాన్ అత్యంత ముఖ్యమంటున్న చైనాతో యుద్ధానికి సిద్ధపడటమన్నది రాజకీయ నిర్ణయం. ఆ నిర్ణయం మునుముందు అనేక పరిస్థితులపై ఆధార పడి ఉంటుంది. కనుక ప్రస్తుతం ట్రంప్ అన్నది తుది వాక్యం కాదు. రెండవ మాటకు వస్తే, ‘స్వాతంత్య్రం ప్రకటించవద్దని’ తైవాన్‌కు సూచించటం ఇది కొత్త కాదు. తమది ‘వ్యూహాత్మక అస్పష్టత’ అన్న మాట అమెరికా ఉపయోగిస్తున్నదే. స్వాతంత్య్రం ప్రకటించు కొండి అనరు, అసలు ప్రకటించకుండా ఒకే చైనా విధానం ప్రకారం చైనాలో విలీనమైపొండి అని కూడా అనరు. సూత్ర రీత్యా తైవాన్ చైనాలో భాగమే అయినా ఆ పని బలవంతంగా జరిగితే ఒప్పుకో బోమంటారు. తైవాన్ సంరక్షణ చట్టమంటూ చేసి వారికి ఆయు ధాలు అమ్మే విచిత్రమైన విధానాన్ని అనుసరిస్తుంటారు. అందువల్ల, తాను తైవాన్‌కు స్వాతంత్య్రం ప్రకటించవద్దంటూ చెప్పానన్న ట్రంప్ మాట కూడా అర్థం లేనిదే.మూడవది పెండింగ్‌లో ఉన్న ఆయుధాల విక్రయం. వాటి విలువ 14 బిలియన్ల డాలర్లు. అమెరికా అధ్యక్షుడు అన్నది ఆ విష యమై ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తైవాన్ నాయకత్వంతో మాట్లాడుతాను’ అని. అంతే తప్ప అమ్మబోము అనలేదు. ట్రంప్ ఆ మాత్రపు మాట అన్న వెంటనే ఒకవైపు తైవాన్ నుంచి, మరొకవైపు రిపబ్లికన్లతో పాటు డెమోక్రటిక్ సెనేటర్ల నుంచి ఒత్తిడులు మొద లయ్యాయి. చైనా వ్యతిరేకించినా ఆయుధాల విక్రయం జరుగు తూనే వస్తున్నది గనుక, ఈసారి కూడా కొంత వ్యవధి తర్వాత అదే జరిగితే ఆశ్చర్యపడనక్కర లేదు. ఎందుకంటే, చైనా విషయంలో, మొత్తం పసిఫిక్ విషయంలో అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలలో, వ్యూహాలలో మార్పు లేదు గనుక. కాకపోతే, ప్రస్తుత పరిస్థితులలో చైనాతో కొంత మెత్తగా వ్యవహరించాలన్నది ఒక ఎత్తుగడ అయినందున ఈ విధంగా మాట్లాడతారు.వ్యూహం ఉండనే ఉంది!ఆ ప్రయోజనాలు, వ్యూహాలు ఏమిటో, అందులో భాగంగా చైనాను నియంత్రించటం ఎట్లానో, అందుకు తైవాన్ అవసరం ఏమిటో 2022లో బైడెన్, తర్వాత 2025, 2026లో ట్రంప్ స్వయంగా తమ వ్యూహపత్రాలలో వివరించి చెప్పారు. వారిద్దరి కన్నా ముందే ఒబామా– ఇరాక్, అఫ్గాన్ పరాభవాల దరిమిలా ఇక తమ దృష్టి పసిఫిక్ వైపు, చైనా వైపు మళ్లటం అవసరమని ప్రతిపా దించి పోయారు. ఇదంతా లాటిన్ అమెరికా నుంచి పశ్చిమాసియా మీదుగా తూర్పు ఆసియా వరకు అమెరికా ప్రయోజనాలను, ఆధిప త్యాన్ని సుస్థిరపరచుకునే విస్తృతమైన, దీర్ఘకాలికమైన ప్రణాళికలో భాగం. అందుకోసం తైవాన్ను తమ ప్రభావం కింద ఉంచుకోవ టమే కాదు, ఇంకా అనేకం చేయవలసి ఉంటుంది. ఆ వివరాలు కూడా కొన్ని పైన పేర్కొన్న వ్యూహ పత్రాలలో పేర్కొన్నారు.అందువల్ల, తైవాన్ గురించి ఇపుడు ట్రంప్ ఏమన్నారో చూసి ఆయన చేతులు ఎత్తేశారంటూ అపోహ పడటం పొరపాటు అవు తుంది. చారిత్రకంగా తమ దేశంలో భాగమైన తైవాన్ను ఎప్పటికైనా నయానో భయానో విలీనం చేసుకోవటం చైనా లక్ష్యం. హాంకాంగ్, మకావూ వలెనే తైవాన్లోనూ ఒక దేశం రెండు వ్యవస్థల పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమని చైనా గతంలోనే ప్రకటించింది. ఆ విధంగా ‘శాంతియుత విలీనానికి’ అడ్డంకులు కల్పించరాదని అమె రికాను కోరుతున్నది. అందుకు తైవాన్ ప్రతిపక్షం సుముఖత చూపు తుండగా, అధికారపక్షం నిరాకరిస్తున్నది. ఆ పార్టీకి అమెరికా ప్రోత్సాహం ఉంది. ఈ మొత్తం పరిస్థితులు ఎట్లా పరిణమించేదీ భవిష్యత్తులో చైనా, అమెరికాల ఆర్థిక, సైనిక, రాజకీయ బలాబలాలు ఎట్లా మారుతూ పోగలవన్న దానిపైనే ఆధారపడి ఉండవచ్చు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
సజావుగానే శాంతి ఒప్పందం చర్చలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా ఇరాన్‌తో చర్చలు సజావుగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చెప్పారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టుచేశారు. ఇరాన్‌తో శాంతి చర్చల్లో పాల్గొంటున్న దేశాలు.. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేయాలని సూచించారు. ఆ ఒప్పందాలపై ఇరాన్ కూడా సంతకం చేయడం గౌరవంగా ఉంటుందని వెల్లడించారు. అత్యంత సంక్లిష్టమైన చిక్కుముడిని విడదీయడానికి అమెరికా కృషి చేస్తోందన్నారు. చర్చల్లో పాల్గొంటున్న దేశాలు ఏకకాలంలో అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడం తప్పనిసరి కావాలని ఆకాంక్షించారు. ఒకరిద్దరు సంతకాలు చేయకపోవడానికి తగిన కారణం ఉంటే అంగీకరించవచ్చని తెలిపారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చల్లో యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్టు, జోర్డాన్ భాగస్వామిగా కొనసాగుతున్నాయి. అయితే, యూఏఈ, బహ్రెయిన్ దేశాలు అబ్రహం ఒప్పందాలపై ఇప్పటికే సంతకాలు చేశాయి. మిగిలిన దేశాలు కూడా అదే బాటలో నడవాలని ట్రంప్ కోరుకుంటున్నారు. ఖమేనీ నుంచి ప్రతిస్పందన ఆలస్యం ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడున్నారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆయన గుర్తు తెలియని ప్రాంతం నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఆయనను కలుసుకోవడం ఇరాన్‌లోని అత్యంత ముఖ్యులకు తప్ప ఇతరులకు సాధ్యపడదు. శాంతి చర్చల విషయంలో అమెరికా ప్రతిపాదనలను మొజ్తబా ఖమేనీకి చేరవేయడం, ఆయన నుంచి ప్రతిస్పందన రావడానికి చాలా సమయం పడుతోందని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. అందుకే శాంతి ఒప్పందం ఖరారు కావడం ఆలస్యమవుతోందని అంటున్నారు. ఒప్పందం ముసాయిదాను ఖమేనీ దాదాపు అంగీకరించారని సీనియర్ పరిపాలనా అధికారి ఒకరు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇరాన్ నుంచి తుది నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. చాలామంది ఇరాన్ నాయకులు పగటి వెలుగు చూడకుండా, వారాల తరబడి అత్యంత పటిష్టమైన బంకర్లలో గడుపుతూ, అవసరమైతే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదని అమెరికా మీడియా వెల్లడించింది. చర్చల్లో గణనీయమైన పురోగతి: రూబియో హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్‌తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం చెప్పారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాగ్రత్తతో కూడిన వైఖరిని అవలంబిస్తున్నారని, చెడ్డ ఒప్పందాన్ని ఆయన అంగీకరించబోరని తేల్చిచెప్పారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. ఒప్పందం అత్యవసరమేమీ కాదు: ఇరాన్ అమెరికాతో ఇప్పటికిప్పుడు శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం అత్యవసరమేమీ కాదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఖై స్పష్టంచేశారు. చర్చలో ఉన్న చాలా అంశాలపై ఒక ముగింపునకు వచ్చామని చెప్పడం సరైనదే అవుతుందన్నారు. అయితే, దీని అర్థం ఒప్పందంపై సంతకాలు త్వరలో జరగబోతున్నాయని చెప్పడం కాదని ఉద్ఘాటించారు. అమెరికా, ఇరాన్‌లు ఇప్పటికే ఈ అవగాహనా ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో 60 రోజులపాటు కాల్పుల విరమణ, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై తదుపరి చర్చల ప్రణాళిక వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం. -
పశ్చిమాసియా పరిస్థితులే దిక్సూచి
ప్రధానంగా పశ్చిమాసియా పరిస్థితులు ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. వీటికితోడు ముడి చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాలు చూద్దాం.. గత ఆర్థిక సంవత్సరం(2025–26)తోపాటు నాలుగో త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాల సీజన్ దాదాపు ముగింపునకు రావడంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఇకపై పశ్చిమాసియా పరిస్థితులు నిర్దేశించనున్నాయి. యూఎస్, ఇరాన్ మధ్య రోజుకోతీరుగా మారుతున్న యుద్ధ వాతావరణం లేదా చర్చలపై అవకాశాలు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు స్టాక్ నిపుణులు పేర్కొంటున్నారు. వారాంతన యూఎస్ అత్యున్నత అధికారి మార్కో రూబియో రెండు దేశాల మధ్య చర్చులు పురోగతి సాధిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. మరోపక్క ఇటీవలే ముగిసిన యూ ఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ చైనా పర్యటన ప్రకటనలవరకే ఫలవంతమైనట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇవికాకుండా కొన్నేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొనసాగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, భౌగోళిక పరిస్థితులు గ్లోబల్ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. 4 రోజులే ట్రేడింగ్ బక్రీద్ సందర్భంగా గురువారం దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇటీవల ముడిచమురు ధరలు మండుతున్నాయి. దీంతో ఎయిర్లైన్స్సహా పలు రంగాల ముడివ్యయాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో ఆర్బీఐతోపాటు.. ఫెడరల్ రిజర్వ్(యూఎస్) తదితర పలుదేశాల కేంద్ర బ్యాంకుల పరపతి విధానాలు కఠినతరమయ్యే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది రుణాలకు డిమాండును తగ్గించడంతోపాటు.. కార్పొరేట్ల రుణ వ్యయాలు పెరిగేందుకు కారణంకానున్నట్లు అంచనా వేశారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు యథాప్రకారం ఆటుపోట్లను చవిచూసే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. రూపాయి ఎఫెక్ట్ భారత్ దిగుమతుల బిల్లును ప్రధానంగా చమురు, పసిడి ధరలు పెంచే సంగతి తెలిసిందే. ఇది వాణిజ్య లోటు పెరిగేందుకు దారి చూపుతోంది. దీనికితోడు ఇటీవల కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) భారీ అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలన్నీ కొద్ది రోజులుగా దేశీ కరెన్సీని దెబ్బతీస్తు న్నాయి. దీంతో డాలరుతో మారకంలో రూపా యి ఏకంగా 96 స్థాయికి పడిపోయింది. ఆర్బీఐ చర్యల కారణంగా వారాంతాన కొంతమేర బలపడినప్పటికీ 94–95 స్థాయిలో కదులుతోంది. కాగా.. వా రాంతాన ఆర్బీఐ కొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్ల డివిడెండ్ ప్రకటించడం సానుకూల అంశమని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ఫోకస్ యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు, ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ, విదేశీ ఇన్వెస్టర్ల తీరు వంటి అంశాలపై ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. ఆర్బీఐ భారీ డివిడెండ్ ప్రభుత్వ వ్యయాలకు దన్నునివ్వవచ్చని, లిక్విడిటీని పెంచే వీలున్నదని మిశ్రా అభిప్రాయపడ్డారు. చమురు ధరలు బలహీనపడటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలపై అంచనాలు, మరింత నిర్మాణాత్మక మార్కెట్లు తదితర అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు.గతవారం అక్కడక్కడే గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీ ఆటుపోట్ల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 177 పాయింట్లు(0.23 శాతం) బలపడి 75,415 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 76 పాయింట్లు(0.32 శాతం) పుంజుకుని 23,719 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్ క్యాప్ 1 శాతం లాభపడగా.. స్మాల్ క్యాప్స్ ఫ్లాట్‌గా ముగిసింది. సాంకేతికంగా చూస్తే.. సుమారు రెండు వారాలుగా దేశీ స్టాక్‌మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదులుతున్నాయి. తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నప్పటికీ గత వారం సైతం పరిమితుల మధ్యే కదిలాయి. వెరసి సమీప భవిష్యత్‌లో మార్కెట్ల కదలికలపై స్పష్టమైన సంకేతాలు అందడంలేదని సాంకేతిక నిపుణులు చెబుతునన్నారు. ఫలితంగా ప్రధాన ఇండెక్సులు అటు ఎగువముఖంగా లేదా ఇటు దిగువ ముఖంగా బ్రేక్ సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. నిఫ్టీ 23,860–23,250 పాయింట్ల మధ్యే కదులుతోంది. 24,000 పాయింట్ల సమీపంలో రెసిస్టెన్స్ ఎదురవుతోంది. దీనిని అధిగమిస్తే 24,300వరకూ బలపడవచ్చు. 23,250 దిగువకు బలహీనపడితే.. 22,750– 22,350 పాయింట్ల వద్ద సపోర్ట్ లభించే వీలుంది. సెన్సెక్స్ 76,000–74,000 పాయింట్ల మధ్య కదులుతోంది. ఈ శ్రేణిని ఛేదించవలసి ఉంది. ఎగువన 77,000 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్, దిగువన 73,000 వద్ద సపోర్ట్ కనిపించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మూడు రిస్క్ లు పొంచి ఉన్నాయ్..
→ పశ్చిమాసియా సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడేలా లేదు. ఉద్రిక్తతలు మరింత ముదిరితే ముడి చమురు రేటు ఇప్పుడున్న 100 డాలర్ల స్థాయి నుంచి 140 డాలర్లకు ఎగబాకే ప్రమాదం ఉంది. బహుశా జూన్‌లోనే ఇది జరగవచ్చు. → దీనివల్ల భారత్ ఎకానమీపై తీవ్ర ప్రభావం తప్పదు. ముఖ్యంగా పెట్రో ధరలు మరింత ఎగబాకుతాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. మరోపక్క వృద్ధి మందగిస్తుంది. అయితే, ఈ సమస్య ఒక్క భారత్‌కే పరిమితం కాదు, ప్రపంచమంతా ఎదుర్కొంటున్నదే. వాస్తవానికి మన ఎకానమీ కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది. → ప్రస్తుతం అధిక చమురు ధరల కంటే సరఫరాపరమైన అడ్డంకుల వల్లే భారత్‌కు అధిక నష్టం వాటిల్లుతోంది. క్రూడ్ ఒక్కటే కాదు, వంట గ్యాస్, ఎల్ఎన్జీ, ఎరువులు ఇలా అన్నింటికీ సప్లై షాక్ తగులుతోంది. ఒకవేళ పశ్చిమాసియా ఉద్రిక్తతలు త్వరలో శాంతించినప్పటికీ, సరఫరా వ్యవస్థ కుదుటపడేందుకు రెండు మూడు నెలలు పడుతుంది. → క్రూడ్ సెగతో ప్రభుత్వం పెట్రో ధరలను మరింత పెంచాల్సి వస్తుంది. రవాణా, తయారీ వ్యయాలు దూసుకెళ్తాయి. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. రూపాయి మరింత బలహీనపడుతుంది. → డాలరుతో రూపాయి మారకం విలువ 100 స్థాయికి పడిపోతుండటంపై మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక సైకలాజికల్ నంబర్ మాత్రమే. ఎందుకంటే, కొన్ని అనవసర దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా సర్దుబాటు చేసుకోవడానికి వీలుంది. → క్రూడ్ షాక్సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితులను తట్టుకునేందుకు భారత్ వద్ద తగినన్ని విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు (దాదాపు 700 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. అధిక దిగుమతుల బిల్లు వల్ల ఇవేమీ తరిగిపోవు, ఒకవేళ ఆర్బీఐ రూపాయి పతనాన్ని (తాజాగా 96.95ని తాకింది) అడ్డుకోవడం కోసం ఉపయోగిస్తేనే అవి వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. → కాబట్టి, రూపాయికి దన్నుగా నిలిచేందుకు ఆర్బీఐ ఎట్టిపరిస్థితుల్లోనూ ఫారెక్స్ నిల్వలను వాడకూడదు. ఎగుమతులకు మద్దతివ్వాలంటే కరెన్సీ విలువను మార్కెట్ వర్గాలే నిర్ణయించేలా చూడాలి. → పశ్చిమాసియా సంక్షోభం తీవ్రమైతే ఆర్థికంగా బలహీన వర్గాలు, చిన్న వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి. నగదు బదిలీలను మరింత పెంచడం, చిన్న సంస్థలకు మరిన్ని రుణాలివ్వడం, నగదు సరఫరా పెంపు ద్వారా మద్దతివ్వాలి. – గీతా గొపీనాథ్, హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థికవేత్త, ఐఎంఎఫ్ మాజీ డిప్యూటీ ఎండీ -
బడ్జెట్ బాబు.. ఖాళీ జేబు
హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో అద్దె ఇంట్లో నివసించే మన ‘బడ్జెట్ పద్మనాభం’ నవీన్‌కుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఆయన భార్య గృహిణి కాగా, ఇద్దరు పిల్లలు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ఆయన నెలవారీ జీతం సుమారు రూ.50 వేలు. ఇంటి అద్దె, ఈఎంఐలు, టూవీలర్‌కు పెట్రోల్, ఇతర నెలవారీ ఖర్చులు పోగా రూ.3 వేలు చిట్టీ (పొదుపు) కడుతున్నాడు. అయితే అటు గ్యాస్ ఇటు పెట్రో ధరల పెంపుతో ఆయన నెలవారీ బడ్జెట్ ఛిన్నాభిన్నం అయ్యింది. పాలు, పెరుగు, కిరాణా, కూరగాయలు తదితర నిత్యావసరాల ధరలన్నీ పెరుగుతుండటంతో నవీన్‌కుమార్ లబోదిబోమంటున్నాడు.సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న చమురు ధరలు, తదనుగుణంగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంటి ఖర్చులు ఎలా నెట్టుకు రావాలో తెలియక సతమతమవుతున్నారు. చాలీచాలని జీతం, అంతకంతకూ పెరుగుతున్న ఖర్చులతో సగటు జీవి అతలాకుతలం అవుతు న్నాడు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెంపు ప్రభావం క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిపైనా పడుతోంది. క్రూడాయిల్ ధర పెంపుతో దేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. కాగా క్రూడాయిల్ ఆధారంగా తయారయ్యే ప్లాస్టిక్, ఇతర పారిశ్రామిక సామగ్రి ధరలు పెరిగాయి. ఇదే సమయంలో డీజిల్ ధర పెంపు కూరగాయలు, కిరాణా, పాలు, పెరుగు తదితర నిత్యావసరాల ధరలపై ప్రభావం చూపించింది. ఆయా వస్తువుల ధరలన్నీ పెరిగిపోవడంతో సామాన్యుడి ఇంటి బడ్జెట్ లెక్క తప్పుతోంది. కూలీ నుంచి కార్మికుడి వరకు, ఆటో డ్రైవర్ ఉంచి సాధారణ వేతన జీవి వరకు.. పెరిగిన ముడి చమురు ధరల చట్రంలో చిక్కుకుని విలవిల్లాడే పరిస్థితి ఉంది. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తరువాత అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమ బెంగాల్‌తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంధన కంపెనీలు వారం వ్యవధిలో రెండుసార్లు లీటర్‌కు దాదాపు రూ.4 మేర పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. త్వరలో మరింత పెరుగుతాయనే అంచనాలూ ఉన్నాయి. ఇది వాహనదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తుండగా.. పరోక్షంగా అన్ని వర్గాల ప్రజలపై పడింది. పాలిథిన్ కవర్ నుంచి ప్లాస్టిక్ కుర్చీల వరకు, ఎలక్ట్రికల్ వైర్లు నుంచి ఎరువుల తయారీ వరకు అనేక ఉత్పత్తుల తయారీలో క్రూడాయిల్ కీలక ముడి పదార్థంగా ఉండటంతో ధరల పెరుగుదల అన్ని వస్తువులపై ప్రభావం చూపుతోంది. ఇక రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో కూరగాయలు, కిరాణా, పాలు లాంటి నిత్యావసరాలతో పాటు ప్యాకేజింగ్ వస్తువులు, నిర్మాణ సామగ్రి, డిటర్జెంట్లు, పెయింట్లు.. ఇలా ప్రతి రంగంలో వస్తువులు, సామాగ్రి ధరలు పెరుగుతున్నాయి.ప్రతి వంటింటిపై భారంఇంధన ధరల పెంపు ప్రభావం సామాన్యుడి వంటింటి ఖర్చులపై స్పష్టంగా కనిపిస్తోంది. కూరగాయలు, పాలు, నూనెలు, కిరాణా సరుకుల ధరలు పెరుగుతుండటంతో గృహిణులు తల పట్టుకుంటున్నారు. గత నెల వరకు రూ.500లో సరిపోయే వారాంతపు కూరగాయల కొనుగోలు ఇప్పుడు రూ.700–800 దాటుతోందని చెబుతున్నారు. తమ బడ్జెట్ పెంచమని భర్తల్ని అడుగుతున్నారు. ఆ అదనపు మొత్తం ఎలా సర్దుబాటు చేయాలో పాలుపోక ఇంటి యజమానులు బిక్కముఖం వేస్తున్నారు. ముఖ్యంగా వారం రోజుల్లోనే కూరగాయల ధరలు రూ.5–20 వరకు పెరిగాయి. బోయినపల్లి హోల్‌సేల్ మార్కెట్, మోండా మార్కెట్, గుడిమల్కాపూర్ మార్కెట్లలోనూ కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. డీజిల్ ఖర్చులు అధికమై రవాణా వ్యయం పెరగడం, జిల్లాల నుంచి సరుకు రాక తగ్గడంతో హోల్‌సేల్ వ్యాపారులు రేట్లు పెంచినట్లు చిల్లర వర్తకులు చెబుతున్నారు. ఈ ప్రభావం నేరుగా రిటైల్ మార్కెట్‌పై పడుతోందని అంటున్నారు. డీజిల్ ధర పెరిగిన నేపథ్యంలో స్కూల్ బస్సు, ఆటో చార్జీలు సైతం పెరగడం, ఎల్పీజీ గ్యాస్ ధర మరింత పెరిగే అవకాశం ఉందనే వార్తలతో సామాన్య కుటుంబాలు మరింత ఆందోళన చెందుతున్నాయి. చిన్న చిన్న ఖర్చులకు జేబులు తడుముకోవాల్సి వస్తోందని అంటున్నారు.గ్రామీణ రైతు కుటుంబాలపై..ఖరీఫ్ సీజన్‌కు ముందు డీజిల్ ధరల పెరుగుదల రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ట్రాక్టర్లు, నీటి మోటార్లు, వ్యవసాయ యంత్రాల వినియోగ వ్యయం పెరుగుతోంది. క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఎరువులు, పురుగు మందులు కూడా ప్రియం కానున్నాయి. యాంత్రీకరణతో పంటలు సాగు చేసే రైతులు వినియోగించే వివిధ రకాల యంత్రాలకు డీజిల్ ఇంధనంగా ఉండడంతో గతంలో కన్నా అధికంగా వెచ్చించాల్సి వస్తోంది. పంటల రవాణా ఖర్చులు కూడా అధికమవుతుండటంతో సాగు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వీటి ధరలూ పెరిగే చాన్స్క్రూడాయిల్ ఆధారంగా తయారయ్యే అనేక ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెరగగా, మరిన్ని వస్తువుల ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ బకెట్లు, బాటిళ్లు, ప్లాస్టిక్ కుర్చీలు, గృహోపకరణాలు, డిటర్జెంట్లు, కాస్మెటిక్స్, పెయింట్లు, టైర్లు, లూబ్రికెంట్లు, ఎలక్ట్రికల్ వైర్లు, ఎరువులు, పురుగుమందులు, ప్యాకేజింగ్ మెటీరియల్ మొదలైన ఉత్పత్తులన్నీ క్రూడాయిల్‌తో ముడిపడి ఉన్నవే కావడంతో వాటి ధరలు పెరిగి, అంతిమంగా సామాన్యుడి బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. మొత్తానికి ముడి చమురు ధరల మంటలు ఇప్పుడు పెట్రోల్ బంక్‌లను దాటి ప్రతి ఇంటి వంటగదిలోకి చేరాయి. -
ఇజ్రాయెల్‌కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి
టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్‌కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్‌పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్‌ను వదులుకోవాలని అమెరికా కోరింది.దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్‌లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్‌పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది. -
వచ్చే 6 నెలలు ఎలా ఉంటుందంటే.. భయంకర ఆందోళన
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాబోయే నెలల్లో వ్యాపార రంగాలు ఎదుర్కోబోయే గడ్డు పరిస్థితులపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' (ట్విట్టర్) లో ఒక ప్రముఖ టెక్స్టైల్ ఫౌండర్ చేసిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ముడి పదార్థాల ధరల పెరుగుదల, కంపెనీలలో సామూహిక లేఆఫ్‌లపై ఆయన చేసిన హెచ్చరికలు నెట్టింట వైరల్‌గా మారాయి.‘రాబోయే ఆరు నెలలు అత్యంత కీలకం’టెక్స్టైల్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అక్షయ్ జైన్ తన 'ఎక్స్' పోస్ట్‌లో వ్యాపారాల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ముడి పదార్థాల సరఫరా దెబ్బతిని, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. "ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వల్ల రాబోయే ఆరు నెలలు కంపెనీలకు అత్యంత బాధాకరంగా మారబోతున్నాయి. ఖర్చులు గనుక ఇదే వేగంతో పెరిగితే, పలు రంగాలలో సామూహిక ఉద్యోగాల తొలగింపులతో పాటు వ్యాపారాలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది," అని జైన్ హెచ్చరించారు. ముఖ్యంగా తక్కువ మార్జిన్లతో నడిచే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ ముడి పదార్థాల ధరల పెరుగుదల "అస్సలు భరించలేనిది" గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మందగమనం రెండేళ్లు ఉండొచ్చుఅక్షయ్ జైన్ పోస్ట్‌పై స్పందిస్తూ పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ఆర్థిక మందగమనం కేవలం ఆరు నెలలతో ముగిసేది కాదని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) మళ్లీ కోలుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని ఒక వినియోగదారుడు అంచనా వేశారు. పెరుగుతున్న నిర్వహణ వ్యయం, కార్మికుల కొరత, మార్కెట్లో వినియోగదారుల డిమాండ్ తగ్గడం వంటి అంశాలు యువ పారిశ్రామికవేత్తలకు మునుపెన్నడూ లేని సవాలును విసురుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ ప్రభావం కేవలం టెక్స్టైల్ రంగానికే పరిమితం కాదని.. వ్యవసాయం, ఉత్పాదక రంగం, ఐటీ, ముడిసరుకు ఆధారిత పరిశ్రమలన్నింటిపై పడుతుందని మరో నిపుణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇంకా దిగజారితే, ఆ ప్రభావాన్ని తట్టుకోవడం భారతదేశానికి కూడా పెద్ద సవాలుగా మారుతుందని హెచ్చరించారు.ధరలు పెంచలేక.. నష్టాలు భరించలేక..ఉత్పత్తి వ్యయం పెరిగినప్పటికీ, కస్టమర్ల కొనుగోలు శక్తి తగ్గడం వల్ల వ్యాపారాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వస్తువుల ధరలు, రవాణా ఖర్చులు 20% కంటే ఎక్కువ పెరిగినప్పటికీ, మార్కెట్లో డిమాండ్ పడిపోతుందనే భయంతో ఉత్పత్తుల ధరలను పెంచలేకపోతున్నామని ఒక పారిశ్రామికవేత్త ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాతావరణంలో వ్యాపారాన్ని విస్తరించడం అసాధ్యంగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితి!ట్రావెల్ ఎసెన్షియల్స్ రంగానికి చెందిన ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తన అనుభవాన్ని పంచుకుంటూ.. ప్రయాణాలు తగ్గడం వల్ల తమ అమ్మకాలు అప్పుడే పడిపోయాయని తెలిపారు. "కోవిడ్-19 మహమ్మారి సమయంలో మాస్కుల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చి మా కంపెనీని గట్టెక్కించాం. కానీ ప్రస్తుత పరిస్థితి అంతకంటే భిన్నంగా, మరింత సవాలుగా ఉంది. ఇప్పుడు మాకు పెద్ద ఫ్యాక్టరీ సెటప్, వందలాది మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలాంటి అనిశ్చిత సమయంలో ఏ వస్తువులను తయారు చేయాలో, వేటిని విక్రయించాలో అర్థం కావడం లేదు" అని ఆయన పేర్కొన్నారు.మొత్తానికి, పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నేరుగా సామాన్య వ్యాపారాలపై చూపిస్తున్న ప్రభావంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితులు త్వరగా చక్కబడకపోతే ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం తప్పదని ఈ చర్చల ద్వారా స్పష్టమవుతోంది.The next 6 months are going to be very painful for businesses due to rising costs. We might be looking at mass layoffs and companies closing down in many sectors. Current rates of raw materials due to war are absolutely unsustainable.— Akshay G Jain (@Ajain112) May 16, 2026 -
మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్ భేటీ
న్యూఢిల్లీ: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా పరిణామాలతోపాటు పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. వివాదాలు, సంఘర్షణల పరిష్కారానికి సంప్రదింపులు, దౌత్య మార్గాలకే భారత్ స్థిరంగా కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లావ్రోవ్ను నందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాల పురోగతిపై తాజా సమాచారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశానని వెల్లడించారు. రష్యా అధినేత పుతిన్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని లావ్రోవ్ను మోదీ కోరారు. మోదీని కలిసిన ‘బ్రిక్స్’విదేశాంగ మంత్రులు బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీని కలిశారు. ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చారు. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, బ్రెజిల్ మంత్రి మౌరో, ఇండోనేíÙయా మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా మంత్రి రోనాల్డ్ లామోలా ఉమ్మడిగా మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు బ్రిక్స్దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సు గురువారం ప్రారంభమైంది. -
మోదీ వార్నింగ్‌తో వణికిన మార్కెట్లు
(సాక్షి, బిజినెస్): ‘ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి. ఎలక్ట్రిక్ వాహనాలను, ప్రజా రవాణాను మరింతగా ఉపయోగించుకోండి. వంట నూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ వస్తువులు వద్దు... స్వదేశీయే ముద్దు’ అంటూ ప్రధాని మోదీ తాజాగా ఎత్తుకున్న పొదుపు రాగంతో మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు రేట్లు భారీగా ఎగబాకటం.. రూపాయి విలువ పాతాళానికి జారిపోతుండటం.. ద్రవ్యోల్బణం సెగలు రేగటంతో ఇప్పటికే దేశీ స్టాక్ మార్కెట్లలో ‘బేర్’ బాజా మోగుతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మోదీ పొదుపు సూచనలతో ప్రజల వినిమయం పడిపోయి జీడీపీ వృద్ధికి చిల్లు పడొచ్చని ఆర్థిక నిపుణుల వార్నింగ్‌లు మొదలయ్యాయి. ఇవన్నీ కలిసి మార్కెట్లను వణికిస్తుండటంతో గత రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరి కావడం ఇన్వెస్టర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడిచమురు, బంగారం, ఎరువులతో సహా అనేక కమోడిటీల ధరలు ఇప్పటికే భారీగా ఎగిశాయి. ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడిన భారత్‌పై దీని ప్రభావం తీవ్రంగా పడింది. ముడి చమురు రేటు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతోంది. డాలర్లను అధికంగా వెచ్చించాల్సి రావడంతో మన చేతి ‘చమురు’ వదులుతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీంతో రూపాయి ఇంకా పడిపోతోంది. మన దిగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా క్రూడ్, పసిడి, ఎరువులు, వంటనూనెలదే కావడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అందుకే మోదీ వీటి కొనుగోళ్లు, వాడకాన్ని తగ్గించేందుకు పొదుపు మంత్రాన్ని జపించారు. ఎకానమీలో నెలకొన్న బలహీనతలకు ఇది అద్దం పడుతోందన్నది నిపుణుల మాట. మార్కెట్లకు షాక్...: మోదీ సూచనలను జరగబోయే పరిణామాలకు వార్నింగ్‌గా భావించిన మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రెండు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 3,000 పాయింట్లు, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా కుప్పకూలాయి. సోమవారం రూ.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరికాగా, మంగళవారం మరో రూ.10 లక్షల కోట్లు ఎగిరిపోయాయి. మోదీ సూచనల ప్రభావానికి తోడు ఇరాన్‌తో సీజ్ఫైర్ గాల్లో దీపమంటూ.. ట్రంప్ చేసిన ప్రకటనతో మడిచమురు ధరలు భగ్గుమనడం ఈ మార్కెట్ పతనానికి ప్రధాన కారణం. గోల్డ్ రిటైల్ సంస్థలు, ట్రావెల్, వినియోగ వస్తువుల షేర్లు వరుసగా రెండో రోజూ పడిపోవడం గమనార్హం. పసిడి కొనుగోళ్లపై గందరగోళం... బంగారాన్ని ఏడాది పాటు కొనొద్దంటూ స్వయంగా మోదీయే చెప్పడంతో జనానికి ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో తులం రూ.1.85 లక్షల ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని తాకిన పుత్తడి. ఇప్పుడు రూ.1.5 లక్షల స్థాయిలో ఉంది. అంతర్జాతీయంగానూ ఔన్స్ 5,600 డాలర్లను తాకి ప్రస్తుతం 4,600 డాలర్ల వద్ద ఉంది. అయితే, రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడంతో దేశీయంగా పసిడి రేట్లు పెద్దగా దిగిరాలేదు. భారతదేశ మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా దాదాపు 9 శాతం. మనం వినియోగించే బంగారంలో దిగుమతుల వాటా ఏకంగా 90 శాతం. అంటే ఏటా 700–800 టన్నులు. దీనికి భారీగా డాలర్లు వెచ్చించాల్సి రావటంతో మన ఫారెక్స్ నిల్వలకు గండి పడుతోంది. గడిచిన రెండు నెల్లల్లో దాదాపు 38 బిలియన్ డాలర్లు తగ్గి మన నిల్వలు 690.69 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇది రూపాయి పతనాన్ని పెంచుతోంది. దీనికి అడ్డకట్టవేయడానికే మోదీ పొదుపు మంత్రం ఎత్తుకున్నారు. కాకపోతే రేటు మరింత పెరిగితే కొనలేమేమోనన్న ఆందోళనలో ఉన్న సామాన్యుల్లో ప్రధాని ప్రకటన గందరగోళాన్ని పెంచింది. యుద్ధం మళ్లీ తీవ్రమైతే బంగారం దూసుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొనుగోళ్లకు బ్రేక్ వేసేందుకు అవసరమైతే దిగుమతి సుంకాన్ని (ప్రస్తుతం 6 శాతం) కూడా ప్రభుత్వం పెంచవచ్చన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చేస్తే బంగారం రేట్లు దేశీయంగా మరింత భగ్గుమంటాయి. మరోపక్క, పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరిస్తే ఆభరణాల పరిశ్రమపై ప్రభావం పడి, లక్షల మంది ఉపాధి కోల్పోవచ్చన్న ఆందోళనలూ ఉన్నాయి. క్రూడ్ పైపైకి.. త్వరలో పెట్రో వాత! కాల్పుల విరమణ తర్వాత కాస్త శాంతించిన క్రూడ్ రేట్లు మళ్లీ యుద్ధ భయాలతో భగ్గుమన్నాయి. మంగళవారం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 109 డాలర్లను తాకింది. చమురు సెగతో ఎఫ్ఎంసీజీతో సహా ఇప్పటికే దేశీయంగా పలు ఉత్పత్తుల ధరలు ఎగబాకుతున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు దాదాపు రూ.1,700 కోట్ల ఆదాయ నష్టాల నేపథ్యంలో నేడోరోపో పెట్రో వాత ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ రెండు రోజుల క్రితం జపించిన పొదుపు మంత్రం నేపథ్యంలో బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది. పెట్రో రేట్లను పెంచితే ద్రవ్యోల్బణం మరింత ఎగబాకి, వడ్డీ రేట్ల పెంపునకు దారితీస్తుందని.. ఎకానమీ మరింత మందగమనంలోకి జారిపోతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. మోదీ పొదుపు సూచనలు ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక ఉపశమనాన్నే ఇస్తాయని.. క్రూడ్ రేట్లు 100 డాలర్ల పైన ఎక్కువ కాలం ఉంటే జీడీపీ వృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్‌తో సహా పలు రేటింగ్ ఏజెన్సీలు ఈ ఏడాది వృద్ధి రేటుకు కోత వేయటం తెలిసిందే. 6– 6.5 శాతానికే వృద్ధి పరిమితమవుతుందన్న అంచనాల నేపథ్యంలో మోదీ పొదుపు పిలుపు ప్రభావంతో 6 శాతం కిందికి పడిపోవచ్చని విశ్లేషకులు లెక్కలేస్తున్నారు. రూపాయి విలవిల.. ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ రూపాయి జారుడుబల్లపైనే ఉంది. చమురు రేట్ల దెబ్బతో దిగుమతుల బిల్లు పెరగటం దీనికి ప్రధాన కారణం. మరోపక్క, విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడం కూడా దేశీ కరెన్సీని వణికిస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా ఏకంగా రూ.2 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు విక్రయించడం గమనార్హం. 2025 చివర్లో డాలర్‌తో 90 స్థాయిలో ఉన్న రూపాయి... ఇపుడు 95కి చేరింది. ఏడాది కాలంలో దాదాపు 10 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఆసియాలో దారుణంగా పడిపోయిన కరెన్సీ మనదే. కాగా, మంగళవారం మరో 40 పైసలు పడ్డ రూపాయి.. సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టమైన 95.68కి జారిపోయింది. రూపాయి ఇలా పతనమవటం దిగుమతుల బిల్లు మరింత పెరిగేలా చేస్తోంది. ఎందుకంటే దిగుమతుల కోసం డాలర్ల రూపంలో చెల్లించడానికి మనం మరిన్ని రూపాయలు ఖర్చు చేయాలి కదా!!. ఎరువులు, వంట నూనెల మంట! యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో రవాణా ఆగిపోవటంతో దేశంలో ఎరువుల రేట్లకు రెక్కలొస్తున్నాయి. మన యూరియా దిగుమతుల్లో 75 శాతం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నాయి. ఇక డీఏపీ దిగుమతుల్లో సౌదీ వాటా 40 శాతం. 2025–26లో భారత్ ఏకంగా 14.5 బిలియన్ డాలర్ల విలువైన ఎరువులను దిగుమతి చేసుకుంది. ఇప్పుడు సరఫరాపరమైన ఇక్కట్లు.. రూపాయి తీవ్ర పతనంతో ఈ దిగుమతులు మరింత భారమై, దేశీయంగా రేట్లు ఎగబాకుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌కు సమాయత్తమవుతున్న రైతులు రేట్ల పెరుగుదలకు తోడు తగినంత సరఫరా ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క, వంటింట్లో వంటనూనెల మంట మండుతోంది. భారత్ వంటనూనెల అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2025–26లో 19.5 బిలియన్ డాలర్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంది. రూపాయి వాతతో దేశీయంగా రేట్లు ఇప్పటికే భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ఎరువులు, వంట నూనెల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ మోదీ పిలుపునివ్వడం గమనార్హం. -
రగిలిపోయిన ఇరాన్.. యూఏఈపై మిస్సైళ్ల వర్షం
అబుదాబి: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో అనూహ్య మలుపు తిరిగాయి. అమెరికా, ఇరాన్ మధ్య భీకర పోరు జరుగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక వెల్లడించింది. ఇరాన్‌లోని ప్రధాన చమురు శుద్ధి కర్మాగారంపై గత నెలలో యూఏఈ రహస్యంగా దాడులు చేసినట్లు ఆ నివేదిక పేర్కొనడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది.లావన్ ఐలాండ్ టార్గెట్‌గా దాడిగత నెలలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఐదు వారాల పాటు జరిపిన వైమానిక దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని కీలక ఇంధన కేంద్రమైన లావన్ ద్వీపంలోని రిఫైనరీపై యూఏఈ టార్గెట్ చేసి దాడి చేసింది. రోజుకు దాదాపు 60,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ కేంద్రం ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలలో అత్యంత కీలకమైనది. అయితే ఈ దాడిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అమెరికా మౌన మద్దతు.. గల్ఫ్ దేశాల ఎంట్రీయూఏఈ చేసిన ఈ దాడులకు అమెరికా తెరవెనుక మౌనంగా మద్దతు పలికినట్లు, గల్ఫ్ దేశాలు ఈ వివాదంలో విస్తృతంగా భాగస్వామ్యం కావడాన్ని స్వాగతించినట్లు నివేదిక పేర్కొంది. అధికారిక ధృవీకరణ లేకపోయినప్పటికీ, ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు అనూహ్యంగా పెరిగాయి. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో కాల్పుల విరమణ పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేశాయి.ప్రతీకారంతో రగిలిపోయిన ఇరాన్లావన్ ద్వీపం ఘటన జరిగిన కొద్దిసేపటికే ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రకటించింది. యూఏఈ, కువైట్‌లపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అదే రోజు తమ ఇంధన, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసినట్లు యూఏఈ, కువైట్ కూడా ధృవీకరించాయి. ఒకే సమయంలో చోటుచేసుకున్న ఈ పరస్పర దాడుల వ్యవహారం ఆ ప్రాంతంలో నెలకొన్నయుద్ధ తీవ్రతను తెలియజేస్తోంది.ఇది కూడా చదవండి: లక్షద్వీప్ వెళ్లేవారికి పండుగే.. ఆ రూల్స్ రద్దు! -
కాల్పుల విరమణ గాల్లో దీపం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్‌తో కొనసాగుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలవంతంగా కొనసాగిస్తున్నామని, అది గాల్లో దీపంలా తయారైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘కాల్పుల విరమణ సమర్థంగా అమలుకావట్లేదు. కాల్పుల విరమణ అనేది అత్యంత బలహీనంగా ఉంది. ఒక రకంగా అది ఐసీయూలో వెంటిలేటర్ మీద ప్రాణాధార వ్యవస్థ మీద నడుస్తోంది. అది ముగిసిపోయే అవకాశాలే చాలా ఎక్కువ’’అంటూ యుద్ధం ఏ క్షణంలోనైనా మొదలుకావొచ్చని ట్రంప్ పరోక్ష సంకేతాలిచ్చారు. ఇరాన్ పంపిన ప్రతిపాదనలను వెనువెంటనే తిరస్కరించానని ట్రంప్ వెల్లడించారు. ‘స్పష్టమైన నిర్ణయాలు తీసుకోలేని ఇరాన్ నాయకత్వం మధ్యవర్తుల ద్వారా కొన్ని చెత్త ప్రతిపాదనలను తాజాగా నా ముందుకు తెచ్చింది. అందుకే వాటిని పూర్తిగా చదవకుండానే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించా. అవి నాకు అస్సలు నచ్చలేదు. ఆ ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవు’’అని అన్నారు. ఇరాన్ నాయకత్వ ఆలోచనా ధోరణిపై ట్రంప్ మాట్లాడారు. ‘‘ప్రతిపాదనలు ఇచ్చిపుచ్చుకోవడం, మా మిత్రదేశాలపై క్షిపణులు, డ్రోన్ల దాడులతో నేను ఇబ్బంది పడతానని, ఏం చేయాలో తోచక పిచ్చెక్కుతుందని ఇరాన్ భావిస్తోంది. నాపై ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నారు. వాస్తవానికి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. మేం విజయం సాధించబోతున్నాం. నా దగ్గర అద్భుతమైన ప్రణాళిక ఉంది. సైనికపరంగా ఇరాన్‌ను ఎప్పుడో ఓడించాం. వాళ్ల దగ్గర పరిమితస్థాయిలోనే సైనిక సంపత్తిఉంది. అదికూడా ఈ కాల్పుల విరమణ కాలంలో సమకూర్చుకున్నదే. ఈపాటి ఇరాన్ బలాన్ని మేం ఒక్కరోజులో సర్వనాశనం చేయగలం. అందుకు నా దగ్గర చక్కటి ప్లాన్ ఉంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని సాధించబోదు. వాస్తవానికి ఇరానియన్లు చాలా ప్రమాదకరం. ఎప్పుడు ఎలాంటి విపరీత ఆలోచనలు చేస్తారో ఎవరికీ తెలీదు’’అని అన్నారు. -
వృద్ధి రేటు 6.6తగ్గొచ్చు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ తెలిపింది. గతంలో 7.1 శాతం వృద్ధి అంచనాను ప్రకటించడం గమనార్హం. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంధన, ఆహార భద్రత రంగాల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్అండ్పీ గ్లోబల్, క్రిసిల్ సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని తెలిపింది. వీటిని అధిగమించేందుకు భారత్ తగినన్ని ఇంధన నిల్వలు సమకూర్చుకోవాలంటూ.. ఇందుకు వీలుగా ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుకోవాలని సూచించింది. చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం ఆర్థిక వృద్ధిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి పేర్కొన్నారు. ఆహార భద్రతకు రిస్క్ పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా శీతాకాలం పంటలకు ఎరువుల కొరత ఏర్పడొచ్చని జోషి అంచనా వేశారు. భారత్ ఇంధన, ఆహార భద్రత, ఎరువుల రంగంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. భారత్ వివిధ దేశాలతో ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) ద్వారా తగిన ప్రయోజనాలను అందుకోవాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో మరింత పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని.. ఎఫ్‌టీఏలతో మరిన్ని మార్కెట్ అవకాశాలు లభించినప్పటికీ, వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టినప్పుడే పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని నివేదిక తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు ఒక దశలో 126 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల స్థాయిలో ఉండడం గమనార్హం. యుద్ధానికి ముందు 60–70 డాలర్ల మధ్యే ఉంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తోంది. ఎక్సైజ్ ట్యాక్స్ వరకు తగ్గించడం తెలిసిందే. టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ), రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ)పై అధిక చమురు ధరల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్నకు జోషి స్పందిస్తూ.. అంతర్జాతీయంగా అధిక ధరలు ఉన్నప్పటికీ భారత్‌లో వినియోగదారులకు దాన్ని బదిలీ చేయనట్టు చెప్పారు. దీని కారణంగా టోకు ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది గరిష్ట స్థాయి అయిన 3.4 శాతానికి పెరగ్గా.. టోకు ద్రవ్యోల్బణం 38 నెలల గరిష్ట స్థాయి 3.88 శాతానికి చేరడం తెలిసిందే. -
ఆరు ఐపీఓలకు గ్రీన్ సిగ్నల్
ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నప్పటికీ, దేశీయ ఐపీఓ మార్కెట్ మాత్రం ఆశావహ సంకేతాలు ఇస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడం, కార్యకలాపాలను విస్తరించుకోవడం, డైవర్సిఫికేషన్ లక్ష్యాలతో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన ఆరు కంపెనీలకు తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించాయి. తద్వారా ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులను లెక్కచేయకుండా, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఐపీఓలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. విభిన్న రంగాలకు చెందిన జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్, హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్, సర్జివేర్, క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్, హోటల్ పోలో టవర్స్ అక్టోబర్–ఫిబ్రవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మే 4 నుంచి 8 మధ్య ఈ దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీఓలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి. రాబోయే ఐపీవోల వివరాలివీ.. జెప్టో రూ.11,000 కోట్ల ఇష్యూ క్విక్ కామర్స్ యూనికార్న్ సంస్థ జెప్టో ప్రస్తుతం మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి దిగ్గజాలతో పోటీపడుతోంది. త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రాథమిక మార్కెట్ నుంచి దాదాపు రూ.11 వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. సెబీ తాజా అనుమతులతో షేరు ధరల శ్రేణి, సబ్ర్స్కిప్షన్ తేదీలు, లిస్టింగ్ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కంపెనీ సన్నద్ధం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్, స్టార్టప్ ఐపీఓలపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న వేళ జెప్టో పబ్లిక్ ఆఫర్‌కు రావడం గమనార్హం. లిస్టింగ్ పూర్తైతే ఇప్పటికే స్టాక్ ఎక్సే్చంజీల్లో ఉన్న జొమాటో, స్విగ్గీ సరసన జెప్టో చేరనుంది. ధూత్ ట్రాన్స్మిషన్ ఆటో ఉపకరణాల తయారీ సంస్థ ధూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓ ద్వారా దాదాపు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,258 కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా షేర్ల జారీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అయితే ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా తమ వాటాలను విక్రయించబోరని సమాచారం. కంపెనీలో బెయిన్ క్యాపిటల్ పెట్టుబడులు ఉన్నాయి. → జెప్టో, ధూత్ ట్రాన్స్మిషన్ సంస్థలు ‘కాని్ఫడెన్షియల్ ప్రీ–ఫైలింగ్ రూట్’ను ఎంచుకున్నాయి. ఈ విధానం ద్వారా ముసాయిదా పత్రాలను బహిరంగపరచకుండానే సెబీ నుంచి ప్రాథమిక అనుమతులు పొందే అవకాశం లభిస్తుంది. హొరైజన్ ఇండస్ట్రియల్ పార్క్స్బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న హొరైజన్ ఇండ్రస్టియల్ పార్క్స్ ఐపీఓ ద్వారా రూ.2,600 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఉంటుంది. ఓఎఫ్ఎస్ లేదు. సమీకరించే నిధుల్లో సుమారు రూ.2,250 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. సర్జివేర్ఉత్తరప్రదేశ్కు చెందిన మెడికల్ డివైసెస్ తయారీ సంస్థ సర్జివేర్ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఐపీఓకు సిద్ధమైంది. తాజా ఈక్విటీల జారీ ద్వారా రూ. 370 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ ఘనశ్యామ్ దాస్ అగర్వాల్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మరో రూ.370 కోట్ల ఈక్విటీలను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త యంత్రాల కొనుగోలు, తయారీ సామర్థ్యాల పెంపు, రుణాల చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ వ్యవసాయ పంటల రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ రూ.600 కోట్ల తాజా షేర్ల జారీతో ఐపీఓకు రానుంది. అదనంగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 74.05 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనున్నారు. ఇందులో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐఎఫ్‌సీ ఎమర్జింగ్ ఆసియా ఫండ్ వాటాలను విక్రయించనున్నాయి. సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, అనుబంధ సంస్థ సఫైర్ క్రాప్ సైన్స్ మూలధన అవసరాలు, భవిష్యత్ కొనుగోళ్లు, వ్యూహాత్మక విస్తరణకు వినియోగించనుంది. హోటల్ పోలో టవర్స్ హాస్పిటాలిటీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హోటల్ పోలో టవర్స్ సంస్థ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. ప్రమోటర్లు ఓఎఫ్ఎస్ ద్వారా 71.2 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త హోటల్ ప్రాజెక్టుల అభివృద్ధి, అప్పుల తగ్గింపు, మౌలిక సదుపాయాల విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగించే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధానంగా ఈశాన్య, తూర్పు, ఉత్తర భారతదేశాల్లో ‘పోలో’, ‘మ్యాక్స్’ బ్రాండ్ల పేరుతో అప్స్కేల్, మిడ్‌స్కేల్ హోటళ్లు, రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.మే 12న ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ఇష్యూ షురూ.. ఫ్లెక్సిబుల్ ప్యాకింగ్ మెటీరియల్స్ తయారీదారు ఆర్ఎఫ్బీఎల్ ఫ్లెక్సీ ప్యాక్ ఐపీఓ ఈ నెల 12న ప్రారంభమై 14న ముగియనుంది. ధరల శ్రేణి రూ. 47–50గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ రూ.35.32 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ ద్వారా కంపెనీ 70.65 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.35.32 కోట్ల సమీకరించనుంది. మే 11న యాంకర్ ఇన్వెస్టర్ బిడ్డింగ్ ఉంటుంది. -
కల్లోల కాలంలో శిఖరాగ్రం!
ప్రపంచం పెనుసంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో ఫిలిప్పీన్స్‌లోని సెబూ నగరంలో శుక్రవారం ఆగ్నేయాసియా దేశాల సంస్థ (ఏసియాన్) శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కాబోతోంది. దీనికి ముందు గురువారం ఏసియాన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న వారంతా ఈ సంక్షోభ స్థితి గురించీ, దాన్ని అధిగమించటానికి గల మార్గాల గురించీ స్థూలంగా చర్చించారు. అమెరికా అనుసరిస్తున్న వైఖరి కారణంగా పశ్చిమాసియాలో ప్రతిష్టంభన ఏర్పడి, ఇంధన సంక్షోభం చుట్టుముడుతోంది. ఈ సంస్థలోని 11 సభ్య దేశాలూ ఇంధన దిగుమతులపై ఆధారపడినవే. ఈ ప్రతిష్టంభన వల్ల ఆహార సరఫరా మార్గాలు సైతం మూసుకుపోయాయి. వీటి జనాభా మొత్తంగా 70 కోట్లు. సంక్షోభం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరలు ఆకాశాన్నంటడంతోపాటు ఆహార పదార్థాల, సరుకుల లభ్యత గణనీయంగా పడిపోతుందనీ, ప్రాణావసర ఔషధాలు దొరక్క జనం తీవ్ర ఇబ్బందులకు లోనవుతారనీ ఆసియాన్ దేశాలు భయాందోళనలు చెందుతున్నాయి. అర్థరహితమైన ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో తన తొలి ఏలుబడిలోనే డోనాల్డ్ ట్రంప్ స్వీయరక్షణ చర్యలు మొదలెట్టారు. రెండోసారి దాన్ని మరింత ముమ్మరం చేయటంతో పాటు స్వపర భేదం లేకుండా అదనపు సుంకాలతో ప్రపంచ దేశాలన్నిటినీ బెంబేలెత్తించారు. దాన్ని తట్టుకోవటం ఎలాగన్న మీమాంసలో అందరూ పడిన తరుణంలో గ్రీన్ ల్యాండ్ సొంతం చేసుకుంటామనీ, కెనడాను విలీనం చేసుకుంటామనీ బెదిరింపులు ప్రారంభించారు. కెనడాలో నిరుడు ఎన్నికల తర్వాత ప్రధానిగా వచ్చిన మార్క్ కెర్నీ ‘త్వరలోనే మా 51వ రాష్ట్ర గవర్నర్ అవుతారు’ అంటూ ట్వీట్ చేశారు. ఇక వెనెజులా వ్యవహారం అత్యంత దారుణమైనది. ఆ దేశాధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అపహరించి తీసుకొచ్చి అమెరికాలో తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి విచారిస్తు న్నారు. ఇక ఇరాన్‌పై 68 రోజుల క్రితం అకారణంగా యుద్ధానికి దిగారు.ఇరాన్‌కు ఒకే ఒక పేజీలో తాజా ప్రతిపాదనలు పంపామనీ, దానిపై ఆ దేశం తీసుకునే నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలుంటాయనీ అమెరికా చెబుతోంది. ఇది కేవలం ఏసియాన్ శిఖరాగ్ర సదస్సును దృష్టిలో ఉంచుకుని, దాన్ని మభ్యపెట్టేందుకు సాగిస్తున్న కపట నాటకమా లేక చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నమా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ తాజా ప్రతిపాదనలన్నీ ఒబామా హయాంలో 2015 జూలైలో ‘ఉమ్మడి సమగ్ర కార్యాచరణ’ పేరిట ఇరాన్‌తో కుదిరిన అణు ఒప్పందంలోని అంశాలకు దగ్గరగా ఉన్నాయంటున్నారు. గత ఏలుబడిలో అది పనికిమాలిన ఒప్పందమంటూ బుట్టదాఖలా చేసింది ట్రంపే. సుదీర్ఘ ప్రతిష్టంభన వల్ల ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కూడా దివాలా తీస్తుందన్న భయంతో కాళ్లబేరానికొస్తే మంచిదే. ఏసియాన్ దేశాల ఉమ్మడి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 3,80,000 కోట్ల డాలర్లు. ఇది కాస్తా దిగజారడం మొదలైందంటే... పొదుపు చర్యల అమలు తప్పనిసరైతే ఎక్కడి కక్కడ ప్రజాగ్రహం వెల్లువెత్తి ప్రభుత్వాలు కుప్పకూలే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే చాన్నాళ్లుగా ఫిలిప్పీన్స్ ప్రాంతీయ చమురు పంపకం ప్రతిపాదన చేస్తోంది. అన్ని ఆర్థిక వ్యవస్థలూ ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉంటాయి గనుక ఇలాంటి సహకారం సంక్షోభాన్ని నివారిస్తుందన్నది ఆ ప్రతిపాదన సారాంశం. కానీ పశ్చిమాసియాలో తిరిగి ప్రశాంతత నెలకొనడం తప్ప మరేదీ పరిష్కారం కాదు. మిగిలినవన్నీ తాత్కాలిక ఉపశ మనాలే. దీర్ఘకాలం కొనసాగించటానికి పనికొచ్చేవి కాదు. అమెరికా చాటున అణిగి మణిగి ఉండే పాత రోజులు అంతరించాయనీ, గట్టిగా నిలబడి స్వరం పెంచితేనే ఏదో మేరకు ఆ దేశం దిగొస్తుందనీ ఏసియాన్ గుర్తించాలి. అదే సమయంలో ఆహారం,ఇంధనం, వాణిజ్యం అంశాల్లో ఇతర ప్రాంతీయ బృందాలతో సమన్వయం చేసుకోవాలి. వాటి సహకారం పొందాలి. తమ వంతు సాయం అందించాలి. ఏసియాన్‌తో భారత్ వాణిజ్యం సరిగా లేదు. ఆ దేశాలనుంచి వచ్చే దిగుమతులతో పోలిస్తే, అక్కడికి మన ఎగుమతులు చాలా తక్కువున్నాయి. ఈ వాణిజ్యలోటు 2023 నాటికి 4,400 కోట్ల డాలర్లుంది. ఇలాంటి లోటుపాట్లన్నిటినీ సరిచేసుకుంటేనే ఏసియాన్ అన్ని రకాల సంక్షోభాలనూ దృఢంగా ఎదుర్కొనగలుగుతుందని శుక్రవారం జరగబోయే దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు గుర్తించాల్సి ఉంది. -
భారత్ వృద్ధికి యుద్ధం బ్రేక్
పశ్చిమాసియా ఘర్షణలతో నౌకల రవాణాకు అటంకాలు, ఇంధన ధరల పెరుగుదల భారత జీడీపీ వృద్ధికి జోరుకు అవరోధాలు కలి్పంచొచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంలోపునకు తగ్గిపోవచ్చని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన ఇంధన సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధితోపాటు భారత్ వృద్ధికీ అతిపెద్ద రిస్క్‌గా పేర్కొన్నారు. ఒకవేళ సకాలంలో పరిష్కారమైతే అప్పుడు వృద్ధి పుంజుకుంటుందన్నారు. అప్పుడు 6.5–7 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది 6.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చన్నారు.పశ్చిమాసియా సంక్షోభం పరిష్కారమయ్యేంత వరకు జీడీపీపై, వడ్డీ రేట్లపై ఒక నిర్ణయాత్మక అభిప్రాయానికి రాలేమన్నారు. చమురు ధరలు అధిక స్థాయిల్లో (100 డాలర్లకు పైన) ఉంటే, అది వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందన్నారు. కాకపోతే గత 10–12 ఏళ్లలో ఏవో కొన్ని సందర్భాలను మినహాయిస్తే దాదాపు చమురు ధరలు కనిష్టాల్లోనే ఉన్నాయంటూ.. అది దేశ వృద్ధికి సాయపడినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.6 శాతంగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు..వడ్డీ రేట్లు సమీప కాలంలో కిందకు దిగొచ్చే పరిస్థితుల్లేవని రాజీవ్ మెమానీ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు మద్దతుగా లక్ష్యిత చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా రుణసాయం విషయంలో సమస్యలున్నట్టు చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణ, చిన్న తప్పులను నేరాలుగా చూడకపోవడం, న్యాయ సంస్కరణల విషయంలో వేగవంతమైన చర్యలు అవసరమన్నారు. ఈ దిశగా గత 12–18 నెలల్లో పభుత్వం చేసిన కృషిని అభినందించారు. వివాదాల సంఖ్యను సాధ్యమైనంత తగ్గించాలని, పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని మెమానీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి సీఐఐ సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. వృద్ధి 6.3 శాతమే: ఏడీబీపశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముఖ్య ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ అంచనా వేశారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందన్నారు. 2025–26లో భారత్ జీడీపీ బలంగా 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, 2027–28లో 7.3 శాతానికి పుంజుకుంటుందని.. 2026–27లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఏడీబీ ఏప్రిల్‌లో అంచనాలు ప్రకటించడం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం ఏప్రిల్ అంచనా కంటే 2.4 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి చేరుకోవచ్చని పార్క్ తెలిపారు. చమురు, గ్యాస్ కోసం దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేశారు.ఎల్‌నినో ప్రభావంఎల్నినో ప్రభావంపై మాట్లాడుతూ.. భారత్‌లో సాగుపై ప్రభావం పడినప్పుడల్లా ధరల పరమైన సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో పెద్ద వాటా కలిగి ఉన్నందున, భారత్‌లో సాగుకు ఇబ్బందులు ఏర్పడితే ప్రపంచ దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు తక్కువగా వినియోగిస్తారని.. దీంతో దిగుమతి తగ్గి ఆ తర్వాత ఆహార లభ్యత తగ్గుతుందన్నారు. ధరలపై దీని ప్రభావం కచి్చతంగా ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లడం, ఇతర ఇంధన వనరుల దిగుతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం అవసరమన్నారు. అయితే భారత్‌లో ఎన్నో సంస్కరణలు కొనసాగుతున్నాయంటూ, వృద్ధి అవకాశాలు దీర్ఘకాలానికి ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నట్టు పార్క్ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) మెరుగుపడతాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సాయపడతాయన్నారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
ఎల్పీజీపై రూ.300 తగ్గించుకోండిలా!
అంతర్జాతీయంగా కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభం, ముడి చమురు ధరల ఒడిదుడుకుల ప్రభావం సామాన్యుడి వంటగదిపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు రికార్డు స్థాయికి చేరడం హోటల్, రెస్టారెంట్ రంగాల్లో ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, దేశీయ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ కొంతవరకు ఊరటనిస్తోంది.గరిష్టానికి కమర్షియల్ గ్యాస్ ధరలుమే 1న ప్రభుత్వం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను గణనీయంగా పెంచింది. రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఒక్కసారిగా రూ.993 పెరిగి రూ.3,071.50కు చేరింది. ఇది చరిత్రలోనే అత్యధిక ధర. కేవలం మూడు నెలల కాలంలోనే ధరలు రూ.1,303 మేర పెరగడం వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.గత మూడు నెలల గణాంకాలుమార్చి: రూ.114.50 పెంపుఏప్రిల్: రూ.195.50 పెంపుమే: రూ.993 పెంపుచిన్న సిలిండర్లు: 5 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.549 నుంచి రూ.810.50కి పెరగడంతో చిన్న వ్యాపారులకు కూడా భారం పెరిగింది.డిమెస్టిక్ వినియోగదారుల పరిస్థితి ఏమిటి?ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్ (14.2 కేజీలు) ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. అయితే, మార్చి నెలలో జరిగిన చివరి సవరణలో సిలిండర్‌పై రూ.60 పెంచిన విషయాన్ని గమనించాలి. అంతర్జాతీయంగా చమురు ధరల అస్థిరత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గృహ అవసరాలకు వాడే గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.సబ్సిడీతో ఉపశమనం.. రూ.300 ఆదా ఇలా!ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం అర్హులైన కుటుంబాలకు అండగా నిలుస్తోంది. ఉజ్వల లబ్ధిదారులు ప్రతి 14.2 కిలోల సిలిండర్‌పై రూ.300 సబ్సిడీని పొందుతున్నారు. ఇది సంవత్సరానికి గరిష్టంగా తొమ్మిది రీఫిల్లకు వర్తిస్తుంది. 5 కిలోల సిలిండర్ వాడే వారికి దామాషా పద్ధతిలో సబ్సిడీ అందుతుంది. పేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా సిలిండర్ డిపాజిట్, రెగ్యులేటర్, సేఫ్టీ హోస్, ఇన్స్టలేషన్ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోంది. ఉజ్వల 2.0 కింద కొత్తగా కనెక్షన్ తీసుకునే వారికి మొదటి రీఫిల్, స్టవ్‌ను కూడా ఉచితంగా అందిస్తూ సామాన్యులు క్లీన్ ఫ్యూయెల్ ఎల్పీజీ వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోంది.వాణిజ్య సిలిండర్ ధరల పెంపు ప్రభావం హోటల్ మెనూ ధరలపై పడే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ వినియోగదారులకు ప్రస్తుతానికి సబ్సిడీల రూపంలో కొంత రక్షణ ఉన్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు గ్యాస్ ధరలను ఎలా శాసిస్తాయనేది వేచి చూడాలి. ఈ తరుణంలో ఉజ్వల పథకం వంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు సామాన్యులకు ఊపిరినిస్తున్నాయి.ఇదీ చదవండి: ఇండియన్స్ నిజంగా గ్రేట్! -
ఎకానమీకి పశ్చిమాసియా సవాళ్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. దీనివల్ల వస్తువుల సరఫరాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే, ఎగుమతులు, పెట్టుబడులపైనా ప్రభావం చూపించొచ్చని తెలిపింది. అయితే, బలమైన దేశీ వినియోగం, విధానపరమైన వెసులుబాట్లు, బలమైన ఆర్థిక వ్యవస్థలు, ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని తాజా నివేదికలో పేర్కొంది. అనిశ్చితులు ఎక్కువ కాలం పాటు కొనసాగితే.. ముఖ్యంగా ఇంధనం, ఎరువుల సరఫరాపై ప్రభావం పడితే అది దేశ స్థూల ఆర్థిక పరిస్థితుల బలాన్ని పరీక్షించొచ్చని తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాను ప్రస్తావించింది. ఇది వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చని ఆర్థిక శాఖ నివేదిక అభిప్రాయపడింది. చమురు, ఎరువుల సరఫరాలో అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగితే, ముడి సరుకుల కోసం వాటిపై ఆధారపడే ఇతర పరిశ్రమల ఉత్పత్తి వ్యయం పెరిగి సామాన్యులపై భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. దేశీ ద్రవ్యోల్బణానికి రూపాయి బలహీనత సైతం ఒత్తిళ్లను పెంచుతున్నట్టు తెలిపింది. కనుక ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు పెరిగి, వృద్ధి తగ్గే రిస్క్‌లు ఉన్నాయని వివరించింది. పశ్చిమాసియా సంక్షోభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసినట్టు వివరించింది. ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తూనే.. మధ్య కాలానికి ద్రవ్యలోటు, వెలుపలి స్థిరత్వాన్ని (కరెంట్ ఖాతా లోటు, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ తదితర) కొనసాగించేందుకు విధానపరమైన చర్యలతో భరోసా అవసరమని పేర్కొంది. బలమైన వృద్ధి.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత వృద్ధి రేటు 7 నుండి 7.4 శాతం మధ్య ఉండవచ్చన్న అంచనాలు ఉత్సాహానిస్తున్నట్టు ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వృద్ధి రేటుగా నిలుస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల వల్ల రూపాయి విలువ బలహీనపడితే, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరగొచ్చని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న పలు చర్యలను ప్రస్తావించింది. ఎరువుల ఉత్పత్తికి సహజ వాయువు కేటాయింపులను పెంచడంతోపాటు ఖరీఫ్ సీజన్ కోసం ఎరువులపై ఇచ్చే రాయితీలను 12 శాతం పెంచడం, ఎగుమతులు, దిగుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు పరిపాలనాపరమైన చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేసింది. అవకాశాలు.. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం భారత్‌కు ఒక సవాలు మాత్రమే కాదని.. గొప్ప అవకాశమని ఈ నివేదిక అభిప్రాయపడింది. బలమైన దేశీయ మార్కెట్, స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల భారత్ సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ దేశాలు తమ సరఫరా వ్యవస్థలను వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్న తరుణంలో, భారత్ ఒక నమ్మకమైన తయారీ, సేవల కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవడం, వ్యూహాత్మక ఇంధన నిల్వలను సిద్ధం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది. -
ప్రధాని యూరప్ పర్యటన 15 నుంచి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో యూరప్‌లో పర్యటించనున్నారు. మే 15 నుంచి 20 వరకు ఆయన నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలలో పర్యటించున్నారు. ఇంధన సరఫరాలను పరిరక్షించడం, పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల కలిగే వాణిజ్య అంతరాయాలను తగ్గించడం, కీలక సాంకేతికతలలో సహకారం బలోపేతం ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సెమీకండక్టర్లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్, వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక అవకాశంగా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాగే, స్వీడన్ పర్యటన సందర్భంగా ఆవిష్కరణల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరుపక్షాలు దృష్టి సారించనున్నాయి. ప్రధాని ఇటలీ పర్యటన వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాలను వేగవంతం చేయనుంది. ఇరు దేశాలు సైనిక పరికరాలను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఒక రక్షణ పారిశ్రామిక చట్రాన్ని రూపొందించే లక్ష్యంతో ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని యూరప్ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. అయితే, పర్యటనకు వెళ్లే లేదా వచ్చే మార్గంలో ప్రధాని మోదీ నాలుగు గంటలపాటు యూఏఈలో ఆగే అవకాశం ఉంది. -
బీటలువారిన ఒపెక్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకటి తలిస్తే జరిగేది ఎప్పుడూ మరోటి. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తే అది నాలుగురోజుల్లో పాదాక్రాంతమవుతుందని అంచనావేసుకుని ప్రారంభించిన యుద్ధం కాస్తా వికటించి ఆయన ఆ ఊబిలో కూరుకుపోయారు. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియని తరుణంలో పశ్చిమాసియాలో ఆయన ఉద్దేశించని పరిణామం సంభవించింది. మే 1 నుంచి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. దాన్నుంచి మాత్రమే కాదు... 2016లో ఏర్పడిన ‘ఒపెక్ ప్లస్’నుంచి కూడా వైదొలగనున్నట్టు తెలిపింది. ఒపెక్‌లో సభ్యత్వం తీసుకోని రష్యావంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో ఈ గ్రూప్ ఏర్పడింది. ఒపెక్ ప్రపంచ చమురు ఉత్పత్తుల పరిమాణాన్నీ, ఎగుమతుల్నీ, వాటి ధరల్నీ నిర్దేశిస్తున్న కీలక సంస్థ. ప్రపంచ ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులు దానిపైనే ఆధారపడతాయి. ప్రపంచ పెట్రో ఉత్పత్తుల్లో ఒపెక్ వాటా మూడోవంతుకన్నా ఎక్కువ. ఒపెక్ నుంచి తప్పుకోవాలన్న యూఏఈ ఆలోచన చాలా పాతది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ ఇరాన్ యుద్ధంతో అది తుది నిర్ణయానికొచ్చింది.ఒపెక్ సంస్థ ఆవిర్భావానికీ, విస్తరణకూ పాశ్చాత్య బహుళజాతి సంస్థల నిర్వాకం కారణం. చమురు దేశాలు ఎంత ఉత్పత్తి చేయాలో, ఏ ధర నిర్ణయించాలో అవి నిర్దేశించేవి. వాటి చెప్పుచేతల్లో ఉండటం ఇక సాధ్యంకాదన్న నిర్ణయానికొచ్చిన చమురు దేశాలు 1960 సెప్టెంబర్‌లో బాగ్దాద్‌లో సమావేశమై ఒపెక్ ఏర్పాటుకు తీర్మానించాయి. ఇరాన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనెజులా దేశాలు ఇందులో భాగస్వాములు. 1967లో యూఏఈ చేరింది. 1973లో అరబ్–ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకొస్తున్న అమెరికా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్ తదితర దేశాల వైఖరిపై ఆగ్రహించిన ఒపెక్... చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తూ, ఆ దేశాలకు ఎగుమతుల్ని నిషేధించింది. దాంతో పెను సంక్షోభం ఏర్పడింది. అనంతరకాలంలో ఈ దేశాలన్నీ అమెరికాకు సాగిలబడ్డాయి. అది వేరే కథ!ఒపెక్‌లో రాజుకుంటున్న అసంతృప్తికి సౌదీ పెద్దన్న పాత్ర పోషిస్తుండటం ఒక కారణం. ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలో అదే నిర్ణయించటంవల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని సభ్యదేశాల్లో ఎప్పటినుంచో అసంతృప్తి ఉంది. అందుకే 2019లో ఖతార్, ఆ మరుసటి ఏడాది ఈక్వెడార్, 2024లో అంగోలా సంస్థనుంచి వైదొలగాయి. ఆ వరసలో యూఏఈ నాలుగో దేశం. అంతర్జాతీయ చమురు ధరల్ని బట్టి ఉత్పత్తిని నియంత్రించుకుంటూ, అది కోరుకున్న ధరలో ఉండేలా చూసుకోవటం ఒపెక్ అలవాటు. తన తొలి ఏలుబడిలో ఒపెక్ దేశాలపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. చమురు ధరలు పెంచుతూ ప్రపంచ ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అయితే 2020లో కోవిడ్ సమయంలో పాతాళానికి పడిపోయిన చమురు ధరలతో దివాలా స్థితికి చేరిన అమెరికన్ సంస్థల్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిని తగ్గించమని ఒపెక్‌ను వేడుకున్నది కూడా ఆయనే. సౌదీ తీరుపై యూఏఈ ఆగ్రహంతో ఉండటానికి కారణం ఉంది. అది ప్రస్తుతం రోజుకు 35 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. తనకున్న సామర్థ్యంతో అంతకన్నా ఎక్కువ చేయగలిగినా, సౌదీ అరేబియా నిర్దేశిస్తున్న కోటా ఆటంకంగా ఉంది. వచ్చే ఏడాదికల్లా దాన్ని 50 లక్షల బ్యారెళ్లకు పెంచాలంటే తప్పుకోవటమే ఉత్తమమని అది భావిస్తోంది. ఈలోగా ఇరాన్ యుద్ధం దాని సమస్యల్ని పెంచింది. గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడుల్లో ఆ దేశమే అధికంగా నష్టపోయింది. కనుకనే ఈ బాదరబందీని వదుల్చుకోవాలని నిర్ణయించుకుంది. పర్యవసానంగా వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మూడు శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా, దీర్ఘకాలంలోగానీ దాని అసలు ప్రభావం కనబడదు. యూఏఈ మిత్రదేశంగా భారత్‌కు ఈ పరిణామం లాభదాయకమే. కానీ ఒపెక్ ఎలాంటి ఆంక్షలు పెడుతుందో చూడాలి. మొత్తానికి ఇన్నాళ్లూ కలిసికట్టుగా ఉన్నట్టు కనబడిన గల్ఫ్, ఒపెక్ బీటలువారుతున్నాయి. ఈ పరిణామం పశ్చిమాసియాలో అమెరికా పలుకుబడిని తగ్గిస్తుంది. ఇరాన్ పాదాక్రాంతం మాటేమో గానీ... అమెరికాకు మున్ముందు ఇది సమస్యాత్మకం. -
జలసంధిలో చట్టాల ఉల్లంఘన!
ప్రపంచమంతా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ, యుద్ధ విరమణ గురించి ఉత్కంఠగా పరిశీలిస్తున్నది. విచిత్రమయిన, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ యుద్ధంలో న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, మధ్యవర్తి అర్హతల గురించిన చర్చ మచ్చుకు కూడా లేదు. యుద్ధంలో భాగస్వాములు కాని అరబ్ దేశాల అవస్థల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరి దృష్టీ కేవలం హార్మూజ్ జలసంధిని ఒకవైపు ఇరాన్, మరోవైపు పరోక్షంగా అమెరికా దిగ్బంధించడం మీదనే ఉన్నది. ఎందుకంటే హార్మూజ్ గుండా చమురు, గ్యాస్ నిరాటంకంగా రవాణా జరిగితే చాలు, మిగతా విషయాలు మాకేమిటనే ధోరణిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ఉల్లంఘన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘బలవంతుడి మాటే చట్టం’ అని ప్రపంచ దేశాలు రాజీ పడినట్టుగా కనిపిస్తున్నది. అంతర్జాతీయ చట్టాల అమలుకు బాధ్యత తీసుకోవాల్సిన ఐక్యరాజ్య సమితి కోమాలో ఉన్నట్టుగా తోస్తున్నది.మౌనం దాల్చిన ప్రపంచ దేశాలు!పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలలో ప్రతిష్ఠంభనకు రెండు ప్రధాన పీటముడులు ఉన్నాయి. ఒకటి, హార్మూజ్ దిగ్బంధనం; రెండు, ఇరాన్ అణు కార్యక్రమం. హార్మూజ్ జలసంధిని పూర్తిగా నియంత్రించే అధికారం తనకున్నదని ఇరాన్ వాదిస్తున్నది. మొదటి విడత చర్చల తర్వాత ఇరాన్ కాస్త మెత్తబడి హార్మూజ్ నుండి అన్ని నౌకల రవాణాకు సహకరించడానికి ముందుకొచ్చింది. కానీ, ఇరాన్ రేవు పట్టణాల నుండి వచ్చే నౌకలను, ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను అడ్డగిస్తామని అమెరికా మంకుపట్టు పట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇరాన్, అమెరికాలకు ఈ రకంగా ప్రపంచ వాణిజ్యాన్ని అడ్డుకొనే హక్కు ఉందా అని ప్రపంచ దేశాలు ప్రశ్నించాల్సింది పోయి, నోరు మెదపకుండా కూర్చోవడం శోచనీయం. సన్నని జలసంధులు, సముద్ర మార్గాల గుండా సరుకుల రవాణాను నియంత్రించడానికి రెండు ప్రధాన అంతర్జాతీయ చట్టాలున్నాయి. 1. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యు.ఎన్.సి. ఎల్.ఓ.ఎస్), 2. శాన్ రెమో మాన్యువల్. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. రెండు రకాల జలసంధి రవాణా మార్గాలను గుర్తించింది. అవి : 1. ఇన్నోసెంట్ పాసేజ్, 2. ట్రాన్సిట్ పాసేజ్. తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం లోపు నౌకల రవాణా జరిగితే ఆ మార్గాన్ని ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 19 కింద తీరదేశాల భద్రతకు ముప్పు లేకుండా నౌకలు ప్రయాణించవచ్చు. ఆర్టికల్ 25 (3) ప్రకారం తీర దేశం ఇన్నోసెంట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను తన దేశ భద్రత దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. భౌగోళిక రాజకీయ వ్యూహాలు12 నాటికల్ మైళ్లకు ఆవల ఉండే జలమార్గాలను ట్రాన్సిట్ ప్యాసేజ్గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 44 ప్రకారం తీరదేశాలు ట్రాన్సిట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను అడ్డుకోవడం నిషేధం. ఇరాన్–ఒమన్ తీరాలను విభజించే హార్మూజ్ జలసంధి వెడల్పు కనిష్ఠంగా 21 నాటికల్ మైళ్లు. ఒమన్, ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాలు (టెరిటోరియల్ వాటర్స్) చెరొక 12 నాటికల్ మైళ్లకు విస్తరిస్తే మొత్తం 24 నాటికల్ మైళ్లు. కానీ జలసంధి 21 నాటికల్ మైళ్లు మాత్రమే. అంటే నౌకలు ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఇరాన్ హార్మూజ్‌ను ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తూ, తన భద్రత దృష్ట్యా మూసివేస్తానని వాదిస్తున్నది. ఇక అమెరికా హార్మూజ్ జలసంధి గుండా ఇరానియన్ రేవు పట్టణాలకు నౌకల రవాణాను అడ్డుకోవడం యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్ నిబంధనలను, యుఎన్ ఛార్టర్, హై సీస్ ఫ్రీడమ్ యాక్ట్ నిబంధనలను అతిక్రమించడమే. 1908లో ఇరాన్లో చమురు నిల్వలు కనుగొన్నప్పటి నుంచి మధ్యప్రాచ్యం... యూకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా; అనంతరం అమెరికాల జియోపొలిటికల్ వ్యూహంలో పావుగా మారింది. యూకే, ఫ్రాన్స్, డచ్, జర్మన్, యూఎస్ఏల చమురు కంపెనీలు, రాత్స్‌చైల్డ్ వంటి యూదుల ప్రైవేట్ బ్యాంకులు చక్రం తిప్పాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా పంచుకున్నాయి. టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ల సరిహద్దులను తమ ఇష్టానుసారం చమురు నిల్వల ప్రయోజనాల ఆధారితంగా నిర్ధారించాయి. వలస పాలకులు, చమురు కంపెనీల వారు సరిహద్దులను గీయటం, మధ్యప్రాచ్యంలో సున్నీ–షియా–కుర్ద్ –యూదుల మధ్య వైషమ్యాలు తీవ్రరూపం దాల్చటం... ప్రస్తుత రావణకాష్టానికి కారణం. షియాల ప్రాబల్యమున్న ఇరాన్–ఇరాక్‌ల నుంచి రక్షణ కోసం అరబ్ దేశాలు అమెరికా పంచన చేరాయి. అమెరికా ఈ దేశాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. పెట్రో డాలర్ బూమ్‌తో అరబ్ దేశాలు బలమైన ఆర్థిక శక్తులుగా తయారయ్యాయి. కానీ పొరుగున పాలస్తీనా (గాజా), సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్లలో అనిశ్చితి కొనసాగుతున్నది. ఈ ప్రాంతీయ అనిశ్చిత స్థితి తమ ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ముప్పు అని గుర్తించి అరబ్ దేశాలు క్రమంగా ఇజ్రాయిల్‌తో మైత్రికి ముందుడుగు వేశాయి. ఇజ్రాయిల్‌తో సంబంధాలను మెరుగుపరచుకున్నాయి. ఇరాన్ మంత్రి రష్యా పర్యటన!2020 కల్లా చైనా, రష్యా, భారత్‌లు అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తులుగా ఆవిర్భవించాయి. 2023లో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీ అరేబియా ఇరాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసింది. భారత్ ప్రతిపాదించిన ఐమెక్ (ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్)లో యూఏఈ, సౌదీ చేరాయి. అమెరికా–ఐరోపాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పాటయిన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో సౌదీ, యూఏఈలు 2024లో సభ్యులుగా చేరడం అరబ్ దేశాల నూతన వ్యూహాన్ని బలపరుస్తున్నది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీలు ‘పెట్రో యువాన్’ను బలపరచటానికి తోడ్పడుతున్నాయి. భారత్–యూఏఈలు డాలర్లో కాకుండా స్థానిక కరెన్సీలలో వాణిజ్యానికి ఒప్పందం చేసుకున్నాయి. యూఎస్ఏ నాయకత్వంలోని పశ్చిమ దేశాల స్విఫ్ట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీ, చైనా, హాంకాంగ్‌లు ఎం–బ్రిడ్జ్ ప్రాజెక్టును పరీక్షిస్తున్నాయి. డాలర్లకు బదులుగా ఖతర్, సౌదీలు బంగారంలో పెట్టుబడులను అధికం చేస్తున్నాయి. మరోవైపు అరబ్ దేశాలు గత దశాబ్దకాలంగా చైనా, భారత్, రష్యాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. భారత్ అనుసరిస్తున్న మల్టీ అలైన్మెంట్ విధానం అరబ్ దేశాలకు కూడా అనుసరణీయంగా కన్పిస్తున్నది. ఈ నేపథ్యంలో, ఇరాన్–అమెరికాల మధ్య శాంతి చర్చల సమన్వయ ప్రయత్నాలలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి జరిపిన రష్యా పర్యటన క్రమంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇరాన్ యుద్ధంలో రష్యా ప్రత్యక్ష పాత్రకు బహుశా ఇది నాంది కావచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
దౌత్యమా... ఇంకా దాదాగిరీయేనా?
మొదటి విడత చర్చలు ఏప్రిల్ 12న విఫలమై, రెండవ విడతకు ముహూర్తమైనా కుదరని స్థితిలో, తాను దౌత్యానికి మారదలచుకున్నారా లేక దాదాగిరీ పద్ధతిలోనే కొనసాగుతారా అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చుకోవలసి ఉంది. లేదంటే ఇరాన్‌తో మళ్ళీ చర్చలు గానీ, సమస్య పరిష్యారం గానీ జరిగే సూచనలు లేవు. రెండవ విడత కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తుండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్లామాబాద్‌కు ఏప్రిల్ 24, 25వ తేదీలలో వెళ్ళి చర్చల పునరారంభానికి తమ షరతులేమిటో చెప్పి తిరిగిపోవటం, తమ ప్రతినిధుల ప్రయాణాన్ని ట్రంప్ అకస్మాత్తుగా రద్దు చేయటాన్ని బట్టి అర్థమవుతున్నది ఇదే. అరాగ్చీ ప్రతిపాదించిన షరతులేమిటో అధికారికంగా వెల్లడి కాలేదు గానీ, అవి గతానికన్నా భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. అసలు విషయం అది కాదు. ఇరాన్‌కు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్‌ల లక్ష్యాలు మారటమన్నది మౌలిక ప్రశ్న. ఒకసారి అది తేలితే ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో రాజీలు కుదరటం సాధ్యమవుతుంది. మొదట్నుంచీ అదే వైఖరిఈ మాట అనటం ఎందుకంటే, ఇరాన్ పట్ల దౌత్యానికి బదులు దాదాగిరీ వైఖరిని తన మొదటి విడతలోనే (2017–21) ప్రదర్శించిన ట్రంప్, ఈ రెండవ విడతలోనూ అదే పని చేస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగానే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు ఆరంభించటం మొదలుకొని, మొదటి విడత చర్చల వైఫల్యం మీదుగా ఈ రెండవ విడత చర్చల అనిశ్చితి వరకు తను చూపుతున్నది ఆసాంతం దాదాగిరీయే. తమ అసమానమైన ఆర్థిక, సైనిక శక్తులు మినహా ఆయన నోటి నుంచి మరొక మాట వినిపించదు. వాటిని ఉపయోగించి ఇరాన్ సహా ఎవరినైనా సర్వనాశనం చేయగలమంటారు. ఇందులో దౌత్య విధివిధానాలు ఆవగింజంతయినా కనిపిస్తున్నాయా?ట్రంప్‌లో దౌత్య నీతి లక్షణాలుంటే, యురేనియం శుద్ధి విషయమై ఇరాన్, అమెరికాల మధ్య (రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో కలిపి) 2015లో కుదిరిన ఒప్పందం సజావుగా సాగుతుండగా 2018లో దానిని అకస్మాత్తుగా రద్దు చేసేవారు కాదు. ఇరాన్‌పై యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఎంత ఒత్తిడి చేసినా బుష్, ఒబామా, బైడెన్లు నిరాకరించిన స్థితిలో, తాను దాడులకు సిద్ధమయ్యేవారు కాదు. పరిష్కారం లభించవచ్చుననుకున్న ప్రతి దశలోనూ ఆ అవకాశాలను ఇజ్రాయెల్ భంగపరుస్తుండగా మౌనం వహించేవారు కాదు. వాస్తవానికి దాదాగిరీ లక్షణాన్ని ఆయన చూపుతున్నది ఇరాన్ విషయంలోనే కాదు. రెండవసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పనామా కాలువ, కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనిజులా విషయమై చేసిందేమిటో తెలిసిందే. యుద్ధాలు ఆపే ప్రతిజ్ఞలు చేసిన మనిషి, 9 యుద్ధాలు ఆపానంటూ ఇప్పటికి కొత్తగా 8 సైనిక దాడులు సాగించారు. టారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాల అరాచకం సరేసరి. ఇందులోనూ గమనించదగ్గ విశేషం ఒకటున్నది. తన పులి చారలు, కోరలను అనునిత్యం ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టజూసే ఆయనలో ‘కాగితం పులి’ లక్షణాలు కూడా ఉన్నాయి. అది, బలహీనుల ముందు విజృంభించి బలవంతుల ఎదుట తగ్గి ఉండటం. పనామా, వెనిజులా విషయంలో జరిగింది ఒకటైతే, తనను ధిక్కరించిన కెనడా, గ్రీన్‌ల్యాండ్ (యూరప్), బ్రెజిల్, దక్షిణాఫ్రికాల సంగతి వేరయ్యింది. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాను లొంగదీయలేక తానే రాజీకి ప్రయత్నిస్తున్నారు. చైనా మాట అయితే చెప్పనక్కరలేదు. ఇరాన్ ప్రతిఘటనలు మరొక దృష్టాంతం.పరిష్కారానికి రాజమార్గంకొంత లోతుకి వెళ్ళినట్లయితే, ట్రంప్ ద్వారా ప్రదర్శితమవుతున్న ఈ లక్షణాలన్నీ అమెరికా సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడుతూ... దానికి స్లో–మోషన్ సంకేతాల వంటివి. అమెరికన్ నాయకత్వపు ‘నాటో’ కూటమిలోనే పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు, కనీసం ఇరాన్ దిగ్బంధానికైనా ఏ ఒక్కరూ కలిసి రాకపోవటం, మరొక స్థాయిలో బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలు విస్తరిస్తుండటం ఈ మార్పులను ప్రతిఫలిస్తున్నాయి. ఈ పలు విధాలైన పరిణామాల దశలో ఇరాన్ ఒక హీరోలా లేచి నిలుచున్నది. అందువల్ల అమెరికా అధ్యక్షుడు వాస్తవాలను కనీసం ఇప్పటికైనా గుర్తించి, ఇజ్రాయెల్ ప్రభావం నుంచి బయటపడి, దౌత్యమార్గం వైపు మళ్లటం మంచిదవుతుంది. తమ సార్వభౌమతను, హక్కులను కాపాడుకునేందుకు ఇరాన్ చూపుతున్న దృఢ సంకల్పం, ప్రతిఘటన సాధారణమైనవి కావు. మనం స్వయంగా చూసినంతవరకు వియత్నాం(1955–75), అఫ్గానిస్తాన్(2001–21) తర్వాత, 1953 నుంచి మొదలై నేటికీ సాగుతున్న ఇరాన్ పోరాటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. యురేనియం శుద్ధి తదితర అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతుండగానే అకస్మాత్తుగా దాడులు జరిపి ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వాలను నిర్మూలించటం నుంచి మొదలు కొని, ఇరాన్ రేవులను దిగ్బంధించటం వరకు గల క్రమం అంతా చూపుతున్నది అమెరికా దౌత్య నీతినా లేక బస్తీ రౌడీ లక్షణాలనా? ఇరాన్ రెండవ విడత చర్చలకు నిరాకరించటమే సరైనదని భావించక తప్పదు. విదేశాంగ మంత్రి అరాగ్చీ ఇస్లామాబాద్‌లో 25వ తేదీన మరోమారు అన్నమాట: అమెరికాకు విశ్వసనీయత లేకుండా పోయిందనీ, అది కుదిరేవరకు తాము చర్చలకు వెళ్లబోమనీ, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనీ. ఆ తర్వాత ఒమాన్, రష్యా సందర్శనల వెనుక ఆయన తెహ్రాన్‌కు తిరిగి వెళ్ళి అన్ని పరిస్థితులను సమీక్షించుకున్నపుడు, వైఖరి అంటూ మార్చుకోవలసింది స్వదేశంలోనూ విశ్వసనీయతను కోల్పోతున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని అర్థమవుతుంది. సమస్య పరిష్కారానికి రాజమార్గం ఎదుటనే ఉంది. అది అంతర్జాతీయ నిబంధనల మేరకు అణుశుద్ధికి ఇరాన్‌కు గల హక్కులకు అడ్డుచెప్పకపోవటం, పాలస్తీనా సృష్టిని అంగీకరించటం, గ్రేటర్ ఇజ్రాయెల్ పథకాన్ని రద్దు చేయటం!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మళ్లీ మొదటికి!
ఇస్లామాబాద్/వాషింగ్టన్/దుబాయ్: పశ్చిమాసియాలో హార్మూజ్ దిగ్బంధం ఏ స్థాయిలో కొనసాగుతోందో పాకిస్తాన్ వేదికగా రెండో దఫా ప్రత్యక్ష చర్చలపై ప్రతిష్టంభన అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒకడుగు ముందుకేసి పాకిస్తాన్‌కు స్వయంగా విచ్చేసి ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లతో చర్చిస్తున్న వేళ సంతోషం వ్యక్తంచేసిన అమెరికా తన బృందాన్ని సైతం పంపేందుకు సంసిద్ధమవుతుండగా అరాఘ్చీ హఠాత్తుగా పాక్‌కు వీడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కోపం తెప్పించారు.దీంతో ఇరాన్ బృందంలేని పాకిస్తాన్లో తాము మాత్రం ఎలా ప్రత్యక్ష చర్చలకు కూర్చోగలమనే అసహనంతో ట్రంప్ వెంటనే తన బృందం ప్రయాణాన్ని రద్దుచేశారు. దీంతో రెండోదఫా ప్రత్యక్ష చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ అంశంలో ఇరాన్ ఒక స్పష్టతనిచ్చింది. అమెరికాతో మరోమారు ప్రత్యక్షచర్చలకు కూర్చోబోమని తెగేసి చెప్పింది. పరోక్ష చర్చలకే తాము సుముఖంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ శనివారం ప్రకటించారు. పాక్ ప్రధాని, ఫీల్డ్ మార్షల్‌తో మంతనాలు పాక్ నుంచి ఒమన్‌కు వెళ్లిపోయే ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషక్ దార్లతో విస్తృతస్థాయిలో చర్చించారు. శాంతి చర్చలకు సంబంధించిన తమ దేశ డిమాండ్లను అమెరికాకు తెలియజేయాలని సంబంధిత ప్రతిపాదనల చిట్టాను షెహబాజ్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తరఫున ఉప విదేశాంగ మంత్రి కజీమ్ ఘరీబ్అబాదీ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్, పాక్ తరఫున పాక్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.అయితే చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాల వివరాలను అటు పాక్‌గానీ ఇటు ఇరాన్‌గానీ అధికారికంగా బహిర్గతంచేయలేదు. ప్రాంతీయ అస్థిరత, శాంతి చర్చల అంశాలపై నేతలు చర్చించారని సామాజిక మాధ్యమంలో ఇరాన్ రాయబార కార్యాలయం ఒక పోస్ట్పెట్టింది. ఇరాన్ పెట్టిన షరతులను ఇస్లామాబాద్‌కు విచ్చేసే అమెరికా ప్రతినిధుల ఎదుట పాక్ పెట్టనుందని, వాటికి సమ్మతిస్తేనే ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ బృందం పాక్‌కు రానుందని పాక్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ వివరాలను తుర్కియేతో పాక్ పంచుకుంది. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.. తమ బృందం రాకముందే ఇరాన్ మంత్రి పాక్ నుంచి వెళ్లిపోయారనే వార్త తెల్సి ట్రంప్ వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రతినిధులనూ పాక్‌కు పంపబోమని తెగేసి చెప్పారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘18 గంటలు ప్రయాణించి ఇస్లామాబాద్‌కు వెళ్లేందుకు నా బృందం సిద్ధమవుతుంటే వెంటనే ఆగిపొమ్మని చెప్పేశా. పాక్‌కు అన్ని గంటలపాటు ప్రయాణంచేయడం వృథా. అనవసర శ్రమ. పాక్‌లో మనతో మాట్లాడ్డానికి ఎవరూ లేనప్పుడు, ఎలాంటి చర్చల్లేనిదానికి అంతదూరం వెళ్లడం దండగ.అసలే ఇరాన్లో ఎవరు తమ నేతనో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. వాళ్లలో ఇన్చార్జ్ ఎవరో వాళ్లకే తెలీడంలేదు. ఆట మనచేతుల్లోనే ఉంది. వాళ్లకు అంతగా మాట్లాడాలనుకుంటే ఇరాన్ నాయకులు మనకు ఫోన్‌చేసి మాట్లాడతారు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ట్రంప్ స్పష్టంచేశారు. పశి్చమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్‌లను పాక్‌కు కొద్దిసేపట్లో పంపబోతున్నామని శ్వేతసౌధంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అంతకుముందే ప్రకటించగా కొన్ని నిమిషాలకే ట్రంప్ విరుద్ధమైన ప్రకటన చేశారు.దీంతో అమెరికా ప్రతినిధి బృందం పాక్ పర్యటన చివరినిమిషంలో వాయిదాపడింది. ఈ బృందం ఇక ఎప్పుడు పాక్‌కు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రత్యక్ష చర్చల కోసం తమ ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగుతాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్ పునరుద్ఘాటించారు. అమెరికా చిత్తశుద్ధిచూద్దాం.. పాక్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌కు చేరుకున్న ఇరాన్ మంత్రి అరాఘ్చీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘పాక్‌లో పర్యటన సత్ఫలితాలనిచ్చింది. యుద్ధం శాశ్వత పరిసమాప్తికి మేం చేసిన ప్రతిపాదనలను పాక్ ముందుంచాం. వాటిని వినేందుకు, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ఏపాటి చిత్తశుద్ధిచూపుతుందో చూద్దాం’’అని అన్నారు. ఒమన్ తర్వాత రష్యాలో అరాఘ్చీ పర్యటిస్తారు. తిరిగి ఆయన శనివారం లేదా ఆదివారం పాక్‌కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇంధనాన్ని ఆదా చేసుకోవాలి: మసూద్ యుద్ధకాలంలో ఇరాన్ ఇంధన వనరులు, మౌలికవసతులను అమెరికా సేనలు దారుణంగా దెబ్బతీయడంతో వాటిని ఇప్పుడు పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సూచించారు. ‘‘ఇంట్లో పది లైట్లు ఉంటే అన్ని వెలిగించాల్సిన అవసరమేంటి? ఒక రెండు వెలిగిస్తే సరిపోతుంది’’అని సలహా ఇచ్చారు. కరెంట్ వృథా ఖర్చును భారీగా తగ్గించుకోవాలని ఇరాన్ విద్యుత్ సంస్థ సీఈవో తవానిర్ ఇరానియన్లను కోరారు. -
కండోమ్ ధరల పెంపు! ఎంతంటే..
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కండోమ్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మలేషియాకు చెందిన ‘కారెక్స్’ సంస్థ కీలక ప్రకటన చేసింది. ముడి పదార్థాల కొరత, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో తమ ఉత్పత్తుల ధరలను 30 శాతం వరకు పెంచాలని నిర్ణయించినట్లు సంస్థ వెల్లడించింది.ధరల పెంపునకు కారణాలుప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 500 కోట్ల (5 బిలియన్ల) కండోమ్‌లను ఉత్పత్తి చేసే కారెక్స్, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ‘ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా రవాణా నిలిచిపోవడం వల్ల చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. కండోమ్ తయారీలో వాడే నైట్రైల్, సింథటిక్ రబ్బర్, సిలికాన్ ఆయిల్, ప్యాకేజింగ్ కోసం వాడే అల్యూమినియం షీట్ వంటి పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ సరుకు రవాణా రేట్లు పెరగడంతో పాటు సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది’ అని చెప్పింది.‘కొన్ని రకాల ముడి పదార్థాల ధరలు ఏకంగా 100 శాతం పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ధరల సవరణ చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు’ అని కారెక్స్ సీఈఓ గోహ్ మియా కియాట్ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం..ప్రపంచ కండోమ్ అవసరాల్లో దాదాపు 20 శాతం వాటాను కారెక్స్ ఒక్కటే భర్తీ చేస్తోంది. ఆసియా, యూరప్ దేశాల నుంచి సేకరించే 100కు పైగా రసాయనాలపై ఈ పరిశ్రమ ఆధారపడి ఉంటుంది. ఒక్క కెమికల్ లేదా ఒక ప్యాకేజింగ్ మెటీరియల్ అందుబాటులో లేకపోయినా మొత్తం ఉత్పత్తి ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఉందని గోహ్ హెచ్చరించారు. మలేషియా, థాయ్‌లాండ్‌లోని కంపెనీ ప్లాంట్లలో పనిచేస్తున్న సుమారు 3,000 మంది కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఉత్పత్తి తగ్గితే ఉద్యోగ కోతలు తప్పవని యాజమాన్యం సంకేతాలిస్తోంది.ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
పశ్చిమాసియా యుద్ధంతో ఆర్థిక సవాళ్లు
పశ్చిమాసియాలో ఘర్షణలు, సరఫరా వ్యవస్థలో అవరోధాలతో ఇంధన ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో మార్చి నెలలో అంతర్జాతీయ సరఫరా వ్యసవ్థపై ఒత్తిడులు పెరిగిపోయినట్టు పేర్కొంది. కాకపోతే ఏప్రిల్ మొదటి భాగంలో ఇవి కాస్తంత సడలినట్టు తెలిపింది. చాలా విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రంగాల్లో నిదానించినట్టు వివరించింది.పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితుల తీవ్రత, అవి ఎంత కాలం పాటు కొనసాగుతాయి.. దీని ఫలితంగా ఇంధన, ఇతర మౌలిక వసతులకు వాటిల్లే నష్టం ద్రవ్యోల్బణం, వృద్ధికి రిస్క్‌లు కాగలవని పేర్కొంది. ‘‘ఘర్షణలు కొనసాగి, సరఫరా వ్యవస్థలు వేగంగా పునరుద్ధరణకు నోచుకోకపోతే అధిక ఇంధన ధరలు, అధిక తయారీ వ్యయాలు, వాణిజ్య ఎగుమతుల రూపంలో సవాళ్లకు దారితీయొచ్చు’’అని ఆర్బీఐ బులెటిన్ తెలిపింది.ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, సరఫరా వైపు సమస్యలు, వాతావరణ సంబంధిత సమస్యలతో పెరిగే రిస్క్‌లు నెలకొన్నట్టు వెల్లడించింది. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల తాత్కాలిక సంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనంగా పేర్కొంది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నందున షాక్‌లకు తట్టుకుని నిలబడగలదని ఈ బులెటిన్‌ను రూపొందించిన ఆర్బీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. -
గల్ఫ్ దేశాలకు ఇంజనీరింగ్ ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్ ఎగుమతులను 250 బిలియన్ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్‌లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్ డాలర్లు, కొరియాకి 3 బిలియన్ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి. ఇవి ఎక్కువ – ఇవి తక్కువ గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్టరిక్ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి. -
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యం, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. కరెంటు అకౌంటు లోటు, రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభావం పడుతుందని 2025–26 అక్టోబర్, డిసెంబర్ ట్రేడ్ వాచ్ రిపోర్టులో నీతి ఆయోగ్ ఈ విషయాలు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇండియా–గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) పురోగతి నెమ్మదించి, డైవర్సిఫికేషన్‌పై ప్రభావం పడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనేవి వన్–వే మార్గం కాదని, దీని వల్ల కొత్త మార్కెట్ లభిస్తుందని మనం అనుకున్నట్లే అటువైపు దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. కఠినతరమైన పరిస్థితుల్లోను భారత్ వాణిజ్య కార్యకలాపాలు మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తూ గత 20 ఏళ్లుగా భారత్ సగటున 6 శాతం వృద్ధి చెందింది. → రత్నాభరణాల రంగం మిడ్–వేల్యూ ఉత్పత్తుల నుంచి అధిక విలువ చేసే ఎగుమతులవైపు మళ్లాలి. → డిజైన్ ఆధారిత తయారీ, క్లస్టర్ ఆర్అండ్డీ, జీఐ బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. → డ్యూటీ డ్రాబ్యాక్/ రీఫండ్స్‌ను క్రమబదీ్ధకరించాలి. ముడి సరుకుల వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ) మార్జిన్లను పెంచేందుకు, సరఫరాను మెరుగుపర్చాలి. → రుణ లభ్యతను పెంచాలి. పెట్టుబడుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి. క్రెడిట్ గ్యారంటీలు, వడ్డీ రాయితీ, సప్లై చెయిన్ ఫైనాన్స్‌ను మెరుగుపర్చాలి. → 2026 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో ఉత్పత్తులు, సేవల వాణిజ్యం 5.3 శాతం పెరిగి 1.37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. → మొత్తం వాణిజ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) భాగస్వాముల వాటా పెరిగింది. → రత్నాభరణాల రంగంలో భారత్ కీలకంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్ వాటా 73 శాతంగా ఉంది. దిగుమతుల్లో యూఏఈ, స్విట్జర్లాండ్, హాంకాంగ్ వాటా 60 శాతంగా ఉంది. -
దుబాయ్ రియల్టీలో భారత పెట్టుబడులకు బ్రేక్!
పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులకు అత్యంత ఇష్టమైన పెట్టుబడి గమ్యస్థానమైన దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో భారతీయ పెట్టుబడిదారులు కొంతకాలం వేచి చూసే ధోరణిని అవలంబించవచ్చని, దీనివల్ల దుబాయ్ రియల్టీలోకి వచ్చే భారతీయ మూలధనం తగ్గే అవకాశం ఉందని అనారాక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయుష్ పురి విశ్లేషించారు. అయితే, ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని, భారత్-దుబాయ్ మధ్య ఉన్న సుదీర్ఘ పెట్టుబడి బంధం చెక్కుచెదరదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఆర్థిక అంశాలే కీలకంపశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి భారత్‌పై రెండు రకాలుగా ప్రభావం చూపుతుందని ఆయుష్ పేర్కొన్నారు. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం హార్మూజ్ జలసంధిపై గణనీయంగా ఆధారపడుతుంది. అక్కడ అంతరాయం కలిగితే చమురు ధరలు పెరిగి దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగినప్పుడల్లా రూపాయి విలువ ఒడిదుడుకులకు లోనవుతుంది. దీనివల్ల విదేశీ కేటాయింపులు చేసే పెట్టుబడిదారులు తమ నిర్ణయాలను పునసమీక్షించుకోవాల్సి వస్తోంది.‘సంఘర్షణ స్వల్పకాలికమైతే అది కేవలం భయాందోళనలకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ అది సుదీర్ఘకాలం కొనసాగితే వినియోగదారుల ప్రవర్తన మారుతుంది. పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, రూపాయిపై ఒత్తిడి వల్ల పెట్టుబడిదారులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తారు’ అని ఆయూష్ వివరించారు.స్వదేశీ మార్కెట్‌కు కలిసొచ్చే అవకాశందుబాయ్లో పెట్టుబడులు తగ్గడం భారతీయ ప్రీమియం హౌసింగ్ మార్కెట్‌కు వరంగా మారే అవకాశం ఉంది. విదేశాల్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన స్వదేశీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో గురుగ్రామ్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
చల్లారని పశ్చిమాసియా!
పశ్చిమాసియా మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన రెండు వారాల అరకొర కాల్పుల విరమణకు ఆదినుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అది కాస్తా మంగళవారం అర్ధరాత్రి ముగియబోతుండగా, ఇరుపక్షాల మధ్యా పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత చర్చలకు అమెరికా దుందుడుకు చర్యవల్ల గండిపడింది. అరేబియా సముద్రం వైపునుంచి హార్మూజ్ జలసంధిలో ప్రవేశించబోతున్న ఇరాన్ రవాణా నౌకపై సోమవారం వేకువజామున దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది. కనుక రెండో విడత చర్చలకు పోదల్చుకోలేదని ఇరాన్ ప్రకటించటంలో వింతేమీ లేదు. శత్రుత్వంతో రగిలిపోయే వైరిపక్షాలమధ్య ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదు. ఇరుపక్షాలూ నిజాయితీగా వ్యవహరిస్తే ఏదోమేరకు అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన మరుక్షణంనుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్‌ను రెచ్చగొట్టారు. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్‌కు ప్రతినిధి బృందాన్ని పంపారు. విట్కాఫ్, తన అల్లుడు జేడీ కుష్నెర్లాంటి రియలెస్టేట్ ఏజెంట్లున్న ఈ ప్రతినిధి బృందానికి కాల్పుల విరమణ గురించి ఏం అవగాహన ఉంటుంది? అసలు హార్మూజ్ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమనీ గతవారం ట్రంప్ ప్రకటించినప్పుడే ఆ ఒప్పందం కాస్తా అర్థరహితంగా మారింది. ఇరాన్‌ను చుట్టుముట్టి దిగ్బంధిస్తే, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే పాదాక్రాంత మవుతుందని ఇప్పటికీ ట్రంప్ కలలుగంటున్నారు. నష్టపోకతప్పని స్థితి ఏర్పడితే అది తనతో ఆగకుండా ప్రపంచం మొత్తానికి అంటుకునేలా ఇరాన్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచే ఉంచింది. తాజా పరిణామాలతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి బ్యారెల్ చమురు 89 డాలర్లకు చేరుకోవటం జరగబోయేదేమిటో సూచిస్తోంది. గత నెల్లాళ్ల చమురు ధరలు గమనిస్తే ఇప్పటికీ ఆ ధరలు దాదాపు 10.4 శాతంమేర తక్కువగానే ఉన్నాయి. కానీ నిరుటితో పోల్చిచూస్తే 41.01 శాతం అధికం! అసలు గతవారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ సంయమనం పాటించకపోతే ఈపాటికే ఆ ప్రాంతం ఘర్షణలతో అట్టుడికేది. ఎక్కడో వేలమైళ్ల దూరంనుంచి వచ్చి, నావికా దళాలను మోహరించి దిగ్బంధిస్తామని హెచ్చరిస్తే ఏ దేశమైనా సహించగలదా? సమర్థవంతంగా వ్యవహరించగలిగితేనే మధ్యవర్తి పాత్ర పోషించాలని పాకిస్తాన్‌కు ఈ పరిణామాల తర్వాతైనా అర్థమైవుండాలి. మధ్యవర్తిత్వమంటే పోస్టుమాన్ పని కాదు. భిన్న వాదనల్ని వినిపిస్తున్న ఇరుపక్షాలూ వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించేలా చేసి, తన తర్కంతో ఒప్పందానికి ఒప్పించే నేర్పుండాలి. వెనకుండి ప్రోత్సహించిన చైనా ఏం చెప్పిందోగానీ... తనకు హఠాత్తుగా దక్కిన ఈ నడమంత్రపు కీర్తితో పాకిస్తాన్ అన్నీ మరిచినట్టు కనిపిస్తోంది. తమ వద్ద యురేనియం ఉండాలో లేదో నిర్ణయించటానికి అమెరికా ఎవరన్న ఇరాన్ తాజా ప్రశ్నకు ట్రంప్ ఏం జవాబివ్వగలరు? అమెరికా దగ్గర దండిగా అణ్వాయుధా లున్నాయి. దశాబ్దాల క్రితమే తన మిత్రదేశం ఇజ్రాయెల్‌కు సైతం వాటిని చేరేసింది. అది అమెరికా అవలక్షణాలను పుణికిపుచ్చుకుని పశ్చిమాసియా దేశాలను బెదిరిస్తూ, అకారణంగా దాడులకు పాల్పడుతూ ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తోంది.ఇలాంటి స్థితిలో తన ఆత్మరక్షణకు ఇరాన్ సైతం అదే బాట పడితే ఆశ్చర్యమేముంది? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, కాల్పుల విరమణ పేరిట మాయచేసి ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్నదే ట్రంప్ ఆంతర్యంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధ విరమణ ప్రకటించినా అమెరికాలో ఇప్పటికే 3.3 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం కనీసం మరో ఏడాది వరకూ దిగిరాదు. 38 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) పరిధిలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటొచ్చన్న అంచనాలున్నాయి. కనుక ఇప్పటికైనా అమెరికా తన వైఖరి మార్చుకోవాలి. ఓటమిని అంగీకరించి గౌరవప్రదంగా తప్పుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని గ్రహించాలి. -
మార్కెట్‌కు హార్మూజ్ టెన్షన్!
పశ్చిమాసియా యుద్ధ ఆందోళనలకు తాత్కాలికంగా తెరపడినట్లు గత వారాంతాన వెలువడిన వార్తలు ఒక్క రోజులోనే రివర్స్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహానికి బ్రేక్ పడనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు తిరోగమన పథం పట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ముడిచమురు ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపగల యూఎస్, ఇరాన్ యుద్ధ ఆందోళనలు తిరిగి పెరగనున్నాయి. హార్మూజ్ జలాలపై యూఎస్, ఇరాన్ బలప్రయోగ వార్తలు అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితికి దారితీయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రధానంగా చమురు రవాణాకు విఘాతం కలగడంతో ధరలు మళ్లీ ఊపందుకునే వీలుంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చమురు ధరలు, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్‌కు కీలకమైన ఇరాన్, యూఎస్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్. తెలియజేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఈ నెల 22న ముగియనుంది. రిజల్ట్స్ సీజన్.. గత వారాంతాన బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐతోపాటు యస్ బ్యాంక్ క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ ప్రభావం నేడు ఆయా స్టాక్స్‌పై కనిపించే వీలుంది. ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి ఫలితాల సీజన్ మరింత ఊపందుకోనుంది. ఈ వారం పలు దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాసహా.. హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, పీఎన్బీ హౌసింగ్, నెస్లే, పెర్సిస్టెంట్, ఒరాకిల్, ఎస్బీఐ లైఫ్, ఎల్టీ టెక్, ఎల్‌టీఎం, ఎల్అండ్టీ ఫైనాన్స్ తదితరాలున్నాయి. గణాంకాలు కీలకం మార్చి నెలకు నేడు(20న) ఇన్ఫ్రా ఔట్పుట్ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో గురువారం(23న) హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు తదితర పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. గత వారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ పాలసీ నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వీటికితోడు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, చమురు ధరలు తదితర అంశాలు దేశీయంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు.గత వారమిలా వరుసగా రెండో వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ నికరంగా 943 పాయింట్లు(1.2 శాతం) బలపడి 78,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 303 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,354 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మరింత అధికంగా 3.2 శాతం, 4.6 శాతం చొప్పున ఎగశాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సామాన్యుడిపై ధరల భారం తప్పదా?
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర ఇటీవలే 110 డాలర్ల మార్కును తాకడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే రాష్ట్ర ఎన్నికల అనంతరం సామాన్యుడిపై ఇంధన ధరల భారం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కంపెనీల నెత్తిన నష్టాల భారంఅంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) సంస్థలు ఏప్రిల్ 2022 నుంచి రిటైల్ ధరలను సవరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్పుట్ ఖర్చులు పెరగడం, విక్రయ ధరలు స్థిరంగా ఉండటంతో ఈ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై నష్టం లీటరుకు సుమారు రూ.18, డీజిల్‌పై నష్టం లీటరుకు సుమారు రూ.35గా ఉందని అంచనా. ఓఎంసీలకు ఒక దశలో రోజుకు రూ.2,400 కోట్లుగా ఉన్న ఈ నష్టం ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ప్రస్తుతం రూ.1,600 కోట్లకు చేరింది.మాక్వారీ నివేదిక విశ్లేషణప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ (Macquarie) తాజా నివేదిక ప్రకారం, చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన స్వల్ప లాభాలను మార్చి నెల నష్టాలు తుడిచిపెట్టేశాయి. ‘అంతర్జాతీయంగా స్పాట్ ధరలు బ్యారెల్‌కు 135 - 165 డాలర్ల మధ్య ఉన్న తరుణంలో భారత్‌లో విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీలు భారీ నష్టాలను ప్రకటించే అవకాశం ఉంది’ అని తెలిపింది. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.దిగుమతులపై ఆధారపడటం ఒక సవాల్భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది (2025 గణాంకాల ప్రకారం). మధ్యప్రాచ్యం, రష్యా, అమెరికాల నుంచి మనం చమురును సేకరిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే, దేశీయంగా లీటరుపై రూ.6 నష్టం అదనంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు కంపెనీలు మనుగడ సాగించాలంటే బ్యారెల్ ధర 80-85 డాలర్ల మధ్య ఉండాలి, కానీ ఇప్పుడు అది 120 డాలర్ల వద్ద ఉండటం ఆందోళనకరం.అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గని పక్షంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చమురు ధరల పెంపు అనేది అనివార్యంగా కనిపిస్తోంది. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేసే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
రెమిటెన్సులకు యుద్ధం సెగ
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో భారత్‌కు వచ్చే రెమిటెన్స్ ప్రవాహం తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ప్రవాస భారతీయుల నుంచి వచ్చే మొత్తం రెమిటెన్స్‌ల్లో సుమారు మూడో వంతు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల నుంచే వస్తుందని పేర్కొంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే ఈ ప్రవాహం మందగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాస భారతీయుల ఆదాయాలు తగ్గితే కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వాణిజ్య లోటు ఒత్తిడిలో ఉన్న సమయంలో రెమిటెన్స్ తగ్గుదల ఆర్థిక సమతౌల్యంపై మరింత ప్రభావం చూపవచ్చని పేర్కొంది. ప్రవాసుల నుంచి రెమిటెన్స్‌లు అత్యధికంగా పొందుతున్న దేశంగా భారత్ ప్రపంచంలో ముందంజలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఈ రూపంలో 135 బిలియన్ డాలర్లకు పైగా వచ్చాయి. ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడిపశ్చిమాసియా ఘర్షణల కారణంగా గ్లోబల్ వాణిజ్య ప్రవాహాల్లో అంతరాయం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల భారత ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. అయితే అమెరికా సుంకాలు తగ్గడం కొంతమేర మద్దతు ఇస్తుందని పేర్కొంది. మరోవైపు ముడి చమురు ధరలు సంవత్సరానికి 8–9% పెరగడం వల్ల దిగుమతి బిల్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. లాజిస్టిక్ సమస్యలు, సరఫరా గొలుసు పునర్వ్యవస్థీకరణ కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు ప్రభావితమవుతున్నాయని తెలిపింది. ఎగుమతులు ఇలాజీసీసీ దేశాలకు భారత్ 57 బిలియన్ డాలర్లు (మొత్తం ఎగుమతుల్లో 13%), ఇతర పశ్చిమ ఆసియా దేశాలకు 9 బిలియన్ డాలర్లు (2%) ఎగుమతులు చేసింది. బాస్మతి బియ్యం (70% పైగా), బోవైన్ మీట్ (30%), సిరామిక్ ఉత్పత్తులు (25%), పెట్రోలియం ఉత్పత్తులు (15%), రత్నాలు – ఆభరణాలు (20%) వంటి ఉత్పత్తుల్లో ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఉందని నివేదిక వెల్లడించింది. రవాణా సమస్యలు, సరఫరా విధానాల్లో మార్పుల కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు తగ్గడం లేదా ఆలస్యం కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
హంగేరిలో కొత్త గాలి
పశ్చిమాసియా మొదలుకొని ప్రపంచం నలుమూలల నుంచీ దుర్వార్తలే వింటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇది మరో పిడుగుపాటు. పదహారేళ్లుగా హంగేరిని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతున్న కన్సర్వేటివ్ జాతీయవాది, ప్రధాని విక్టర్ ఒర్బాన్ ఘోరంగా ఓటమిపాలయ్యారు. 199 స్థానాలున్న పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఫిడెస్కి కేవలం 55 స్థానాలు మాత్రమే రాగా, ఆయన్నుంచి విడిపోయి, మధ్యేవాద మితవాద పక్షం టీసా పార్టీని స్థాపించిన పీటర్ మాజార్కు అనూహ్యంగా 138 స్థానాలు లభించాయి. తీవ్ర మితవాద పక్షం అవర్ హోంల్యాండ్‌కు 6 దక్కాయి. తుది ఫలితాలు అధికారికంగా ప్రకటించాల్సివుంది. ఎన్నికల సంఘం మొదలుకొని న్యాయవ్యవస్థ, మీడియా వరకూ అన్నిటినీ అధీనంలోకి తెచ్చుకుని తిరుగులేని అధికారం చలాయిస్తున్న ఒర్బాన్ ఓటమిని ఎవరూ ఊహించలేదు. ఆయనపై ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్వతంత్ర సర్వే సంస్థలు చెప్పినా ఎవరూ నమ్మలేదు. టీసా పార్టీ దాదాపు 6 శాతం పాయింట్ల ఆధిక్యత తెచ్చుకుంటేనే కనీసం సాధారణ మెజారిటీ కూడా అసాధ్యమని కొన్ని మీడియా సంస్థలు చెప్పగా... అధికార పార్టీకన్నా టీసా పది పాయింట్లు వెనకబడివుందని ప్రభుత్వ అనుకూల మీడియా ఢంకా బజాయించింది. ఈ ఎన్నికల సందర్భంగా హంగేరి ఏమాత్రం పొంతనలేని రెండు భిన్న ప్రపంచాలు చూసింది. అధికారపక్షం వైపు మొగ్గే ప్రపంచం ఒర్బాన్ మరో నాలుగేళ్లు ఏలబోతున్నారంటూ మోత మోగించింది. అందులో మీడియా సంస్థలూ, సామాజిక మాధ్యమాలూ, ‘సాధారణ పౌరులూ’ ఉన్నారు. అటు పీటర్ మజార్‌ను సమర్థించే ప్రపంచం అందుకు భిన్నమైన విశ్లేషణలు చేసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ‘నిజమైన ప్రపంచం’ అయివుంటుందని అందరికీ తెలుసు. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత ‘నకిలీ ప్రపంచం’ బట్టబయలైంది. ఒర్బాన్ హంగేరికి మాత్రమే పరిమితమైన సాధారణ నాయకుడు కాదు. ఆయన్ను అధికార పీఠం ఎక్కించిన ఫార్ములా దేశదేశాల నాయకులకూ శిరోధార్యంగా మారింది. సంప్రదాయవాదాన్నీ, జాతీయవాదాన్నీ నెత్తికెత్తుకుని ప్రజల భావోద్వేగాలను ఉచ్ఛస్థితికి తీసుకెళ్లటం ఎలాగో ఒర్బాన్ నేర్పారు. అమెరికాకు మాత్రమే కాదు... ప్రపంచానికంతకూ పెను సమస్యగా మారిన ట్రంప్ ఆయన స్ఫూర్తితోనే మాగా (మళ్లీ అమెరికాను మహోన్నతం చేద్దాం) ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ఒర్బాన్కు ట్రంప్, పుతిన్ సన్నిహితులు. వారిద్దరి మాదిరే ఈయూతో వైరం. ఒర్బాన్ మార్కు ఏలుబడికి ఇంటా బయటా శత్రువులు అవసరం. వారు– ఈయూ, కమ్యూనిస్టులు, వలసదారులు, శతకోటీశ్వరుడు, దాత జార్జి సోరోస్– ఎవరైనా కావొచ్చు. అభద్రతా భావన కూ. విదేశీ బెడదకూ, సమాజంలోని నైతిక పతనానికీ, ఇతరత్రా ప్రమాదాలకూ సర్వరోగ నివారిణి తాను మాత్రమేనని ఒర్బాన్ పదహారేళ్లపాటు నమ్మించగలిగారు. ‘సూపర్ మెజారిటీ’ వచ్చినా పాలనపై పూర్తిస్థాయి పట్టు సంపాదించటం టీసా పార్టీకి అంత సులభం కాదు. ఎందుకంటే సకల అధికార వ్యవస్థలూ ఒర్బాన్ అనుకూలురతో నిండివున్నాయి. ఆర్థిక సంస్థలూ, అధికార యంత్రాంగం, ఎన్నికల సంఘం, అవినీతి నిరోధక విభాగం వగైరాలన్నీ ఆయన మనుషుల చెప్పుచేతల్లో నడుస్తున్నాయి. ఈయూ నుంచి బయటికొస్తేనే సకల సమస్యలూ పరిష్కారమవుతాయని ఆయన చెప్పిన మాటలు విశ్వసించబట్టే ఆర్థికంగా అధోగతిలోవున్నా జనం నమ్మారు. ఒర్బాన్ అనుకూల వ్యాపార సంస్థలు మాత్రమే లాభార్జనతో కళకళలాడాయి. నిరుద్యోగం పదేళ్ల రికార్డును అధిగమించింది. నిరుడు ఆర్థిక వృద్ధి 0.4 శాతం. కొన్నేళ్లుగా కష్టాల్లోవున్న పోలెండ్ సైతం 3.6 వృద్ధి రేటు సాధించగా... బల్గేరియా, రుమేనియా సైతం మెరుగ్గా ఉన్నాయి. ఇక అవినీతిలో హంగేరిది అగ్రస్థానం. ఇరాన్ శాంతి చర్చలకన్నా ముందు, ఒర్బాన్ గెలుపుకోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హంగేరి వెళ్లి ప్రచారం చేశారు. కానీ ఇరాన్ శాంతి చర్చల మాదిరే, ఒర్బాన్ కూడా కుప్పకూలారు. ఆయన ఓటమితో ఈయూ దేశాలు పండగ చేసుకుంటున్నాయి. హంగేరి ప్రజలు తమతోనే ఉన్నారని సంబరపడుతున్నాయి. కానీ అధోగతిలోవున్న హంగేరికి అందరూ ఆపన్న హస్తం అందించటం అత్యవసరం. -
మార్కెట్‌కు మళ్లీ ‘పశ్చిమాసియా’ సెగ?
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో పశి్చమాసియా మళ్లీ భగ్గుమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి డీల్ కుదరకుండానే ఇరు పక్షాల మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో మార్కెట్ సెంటిమెంట్‌పై దీని ప్రభావం తీవ్రంగానే ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దాడులు మొదలై హార్మూజ్ జలసంధిలో తిరిగి ఇరాన్ అడ్డంకులు సృష్టిస్తే.. క్రూడ్ ధరలు దూసుకెళ్లడంతో పాటు దీని సెగ మార్కెట్‌కు గట్టిగానే తగలవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం (14న) మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్పశ్చిమాసియాలో చోటుచేసుకునే కీలక పరిణామాలకు తోడు క్రూడ్ ధరల కదలికలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయి. ఇరాన్–అమెరికా మధ్య సీజ్ఫైర్... శాంతి ఒప్పందంపై ఆశలతో గతవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు రివ్వుమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రూడ్ 100 డాలర్ల కిందికి జారడంతో సూచీలకు బూస్ట్ లభించింది. అణు కార్యకలాపాలకు స్వస్తి చెప్పేందుకు ఇరాన్ ససేమిరా అనడంతో చర్చలు విఫలయ్యాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపించగా.. యూఎస్ అలవికాని డిమాండ్లే డీల్ కుదరకపోవడానికి కారణమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ పేర్కొనడం విశేషం.చర్చలు విఫలమైన నేపథ్యంలో సమీపకాలానికి మార్కెట్ ముఖచిత్రం మళ్లీ మారిపోయే అవకాశం ఉందని లివ్‌లాంగ్ వెల్త్ రీసెర్చ్ ఎనలిస్ట్ హరిప్రసాద్ కె అభిప్రాయపడ్డారు. ’నిఫ్టీ శరవేగంగా తిరిగి 24,000 స్థాయిని అధిగమించిన నేపథ్యంలో సూచీకి ఈ వారం చాలా కీలకంగా మారనుంది. అయితే, ఇరాన్–అమెరికా శాంతి చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో మళ్లీ మార్కెట్లలో ఆటుపోట్లు తప్పకపోవచ్చు. సోమవారం సూచీలు భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తాజా సీజ్ఫైర్ ర్యాలీలో ఆర్జించిన లాభాలు చాలా వరకు ఆవిరయ్యే ప్రమాదం నెలకొంది’ అని ఆయన పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం డేటా.. ఈ వారంలో విడుదలయ్యే ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.. మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ఏప్రిల్ 13న, టోకు ధరల ద్రవ్యోల్బణం 14న వస్తుంది. ఆహార ధరల మంటతో ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.21 శాతానికి ఎగబాకగా.. టోకు ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ట స్థాయి అయిన 2.13 శాతానికి చేరింది. రానున్న కాలంలో ఆర్బీఐ పాలసీ నిర్ణయంలో ద్రవ్యోల్బణం గణాంకాలు కీలక పాత్ర పోషించనున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఈ డేటాపై మరింత ఫోకస్ చేయనున్నారు.ఫలితాలపై దృష్టి... గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (2025–26, క్యూ4) ఫలితాల సీజన్‌ను గతవారంలో టీసీఎస్ బోణీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల ఫలితాలు వెలువడనున్నాయి. క్యూ4తో పాటు విదేశీ ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని మిశ్రా పేర్కొన్నారు.సాంకేతికంగా చూస్తే... ఇరాన్–అమెరికా చర్చలు విఫలం కావడంతో మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 23,700 వద్ద తొలి మద్దతు లభించచ్చని.. ఆ స్థాయిని కోల్పోతే 23,500 మద్దతు కీలకమని మార్కెట్నిపుణులు చెబుతున్నారు. ఇక సూచీ గనుక పెరిగితే 24,100 వద్ద తొలి నిరోధం, ఆపై 24,300 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉందనేది వారి విశ్లేషణ.గత వారమిలా...ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకోవడం, రూపాయి బలోపేతం, క్రూడ్ ధరలు శాంతించడం వంటి పరిణామాలతో దేశీ మార్కెట్లు కూడా భారీగా కోలుకున్నాయి. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4,231 పాయింట్లు (5.77%) దూసుకెళ్లగా.. ఎస్ఎస్ఈ నిఫ్టీ 1,338 పాయింట్లు (5.88%) ఎగబాకింది.విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల బాట... దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల తొలి 10 రోజుల్లో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.48,213 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం దీనికి నిదర్శనం. ఫిబ్రవరిలో రూ.22,615 కోట్ల నికర పెట్టుబడుల అనంతరం, మార్చిలో రికార్డు స్థాయిలో రూ. 1.17 లక్షల కోట్ల విలువైన షేర్లను ఎఫ్‌పీఐలు అమ్మేసిన సంగతి తెలిసిందే. దీంతో 2026లో ఇప్పటిదాకా మొత్తం రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులను వారు ఉపసంహరించుకున్నారు.పశ్చిమాసియా సంక్షోభం తర్వాత మార్కెట్ భారీ పతనానికి విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలే కీలకంగా నిలిచాయి. ‘పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా క్రూడ్ ధరలు భగ్గుమనడంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం రిస్కులు తీవ్రమయ్యాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు తోడు స్థూల ఆర్థిక ప్రతికూలతలు ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలకు పురిగొల్పుతున్నాయి’ అని మార్నింగ్ స్టార్ రీసెర్చ్ ఇండియాకు చెందిన హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
మన ఆయిల్, గ్యాస్.. ఎంత ఖర్చయినా తెచ్చుకుందాం
న్యూఢిల్లీ: సంప్రదాయ ఇంధన సరఫరాల కోసం పశ్చిమాసియా దేశాలపై అధికంగా ఆధారపడడంపై అప్రమత్తత అవసరమని ఓఎన్జీసీ చైర్మన్, సీఈవో అరుణ్ కుమార్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ తన చమురు దిగుమతుల్లో సగం మేర, గ్యాస్ అవసరాల్లో 30 శాతం, ఎల్పీజీ అవసరాల్లో 85–90 శాతాన్ని మధ్యప్రాచ్య దేశాల నుంచి సమకూర్చుకుంటున్నట్టు చెప్పారు.పశ్చిమాసియాలో సంఘర్షణల కారణంగా దశాబ్దాలలో ఎన్నడూ లేనంతటి ఇంధన సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో అరుణ్ కుమార్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు ప్రాధాన్యం నెలకొంది. పశ్చిమాసియా మనకు సమీపంలో ఉండడంతో అక్కడి వనరులను సులభంగా పొందొచ్చనుకోవడాన్ని కొంత సందేహంగానే చూడాలన్నారు. ఇంధన భద్రతపై పీఎన్జీఆర్బీ నిర్వహించిన సదస్సులో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రపంచ క్రమం మారుతోందని, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఇంధన భద్రతపై దీర్ఘకాలం నుంచి ఉన్న అంచనాలు మారిపోతున్నాయంటూ హెచ్చరించారు. కనుక దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ ఆయిల్, గ్యాస్ ఉన్నా.. ఎంత ఖర్చు అయినా దాన్ని వెలుగులోకి తెచ్చుకోవాలంటూ.. సంక్షోభంలో మనకు ఎవరూ సాయం చేయరన్నారు. అలాగే, దేశంలో ఇంధన నిల్వల సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సానుకూలంగా చర్చలు షురూ!
ఇస్లామాబాద్/లాహోర్/దుబాయ్: పశ్చిమాసియా లో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరిపక్షాలైన అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు శనివారం అధికారికంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ మంతనాలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఓ స్టార్ హోటల్ వేదికగా మారింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్చలు ఆరంభమైనట్లు పాక్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చరిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ శనివారం ఉదయం వేర్వేరుగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సాయంత్రం అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. రెండు రౌండ్లు చర్చలు జరిగాయి. మరో దఫా చర్చలు జరగాల్సి ఉన్నట్లు సమాచారం. ఇప్పటిదాకా చర్చల్లో సాధించిన పురోగతి ఏమిటన్నది ఇరుపక్షాలు ఇంకా బయటపెట్టలేదు. ఆదివారం కల్లా స్పష్టత రావొచ్చని తెలుస్తోంది. 1979 తర్వాత తొలి ప్రత్యక్ష చర్చలు అమెరికా, ఇరాన్ బృందాలు ఒకే బల్ల వద్ద కూర్చున్నాయని, చారిత్రాత్మక శాంతి చర్చలు ప్రారంభమయ్యాయని, తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుపక్షాలు ముఖాముఖిగా కలుసుకోవడం ఇదే మొదటిసారి అని పాకిస్తాన్ టీవీ తెలియజేసింది. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ నేతృత్వంలోని ఇరాన్ బృందంలో విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతోపాటు ఇతర నాయకులు ఉన్నారు. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్‌ల మధ్య ఇవే తొలి ఉన్నతస్థాయి ప్రత్యక్ష చర్చలు కావడం గమనార్హం. అంతకుముందు ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ బృందాలకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఉప ప్రధాని ఇషాఖ్ దార్, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ స్వయంగా స్వాగతం పలికారు. ఇరాన్ బృందానికి సైనిక దుస్తులు ధరించి, అమెరికా బృందానికి సూటు బూటు ధరించి అసిమ్ మునీర్ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా, ఇరాన్ బృందాలతో షరీఫ్ భేటీ పశ్చిమాసియాలో శాశ్వత శాంతి నెలకొనాలని పాక్ ప్రధాని షెహబాజ్ ఆకాంక్షించారు. శాంతి సాధనకు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇరాన్‌ల మధ్య సయోధ్యకు తప్పకుండా సహకరిస్తామని చెప్పారు. అమెరికాతో చర్చల్లో పాల్గొనడానికి ఇస్లామాబాద్‌కు చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో శనివారం షెహబాజ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. శాంతి యత్నాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ రజా నఖ్వీ తదితరులు పాల్గొన్నారు. శాంతి చర్చలకు ముందుకొచి్చన ఇరాన్ బృందాన్ని షెహబాజ్ షరీఫ్ అభినందించారు. ప్రాంతీయ ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, సుస్థిరతల కోసం ఈ చర్చల్లో అర్థవంతమైన ఫలితాలను సాధించే దిశగా మధ్యవర్తిగా తమ పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగైతేనే ఒప్పందం కుదురుతుంది: రెజా అరెఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ‘అమెరికా ఫస్ట్’ సిద్ధాంతానికి అనుగుణంగా అమెరికా అధికారులు స్వదేశ ప్రయోజనాల కోసం కృషి చేస్తే అమెరికా–ఇరాన్ శాంతి చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇరాన్ ప్రథమ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రెజా అరెఫ్ పేర్కొన్నారు. అలా కాకుండా ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ సిద్ధాంతానికి మద్దతిచ్చే ప్రతినిధులతో చర్చలు జరిగితే మాత్రం ఎలాంటి ఒప్పందం కుదరదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇస్లామాబాద్ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగుతాయని, ప్రపంచం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ డిమాండ్లు → హార్మూజ్ జలసంధిపై సంపూర్ణ ఆధిపత్యం మాకే ఉండాలి. అక్కడ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదు. → గల్ఫ్ దేశాల నుంచి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలి. ఈ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలు ఉండడానికి వీల్లేదు. → ఇరాన్‌పై అమెరికాతోపాటు యూరప్ దేశాలు విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. యురేనియం శుద్ధి సహా అణు కార్యక్రమాలపై ఎలాంటి ఆంక్షలు విధించకూడదు. → స్తంభింపజేసిన మా ఆస్తులను విడుదల చేయాలి. అమెరికా డిమాండ్లు → ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. → యురేనియం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వెంటనే ఆపాలి. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించాలి. → హార్మూజ్ నుంచి స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలి. విదేశీ నౌకల రాకపోకలను అడ్డుకోరాదు. చర్చలు విఫలమైతే కఠినంగా ప్రతిస్పందిస్తాం: ట్రంప్ అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు షెడ్యూల్ కంటే ఐదు గంటలు ఆలస్యంగా ఆరంభమయ్యాయి. కొన్ని అంశాలపై ఇరుపక్షాలు పట్టు వీడకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇస్లామాబాద్ చర్చలు ఎలా సాగుతాయో తనకు ఏమాత్రం అవగాహన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. చాలా తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని అంచనా వేస్తామని చెప్పారు. హార్మూజ్ జలసంధి త్వరలోనే తిరిగి తెరుచుకుంటుందని పునరుద్ఘాటించారు. ప్రత్యామ్నాయ చమురు రవాణా మార్గాలు కూడా అందుబాటులోకి వస్తాయని సంకేతాలిచ్చారు. ఇరాన్‌ను విఫలమవుతున్న దేశంగా అభివరి్ణంచారు. ఒకవేళ శాంతి చర్చలు ఫలించకపోతే తమ వైఖరిని పునఃసమీక్షించుకుంటామని చెప్పారు. అవసరమైతే మరింత కఠినమైన ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. -
కొత్త ప్రపంచం వైపు అడుగులు?
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే ట్రంప్ నినాదం ఆచరణలో తల్లకిందులు కాబోయే కాలం తరుముకొస్తున్నదా? ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నది. ఇప్పటికీ అమెరికా సూపర్ పవర్ హోదాను అనుభవిస్తూనే ఉన్నది. అమెరికా ఆజ్ఞలు ఖండాంతరాల్లో ఇంకా చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మధ్యతరగతి యువతీ యువకులకు అమెరికా ఒక ఆశల పందిరిగా దర్శనమిస్తూనే ఉన్నది. తానా అంటే తందానా అనేందుకు పాకిస్తాన్ వంటి తొత్తు దేశాలు కూడా అమెరికాకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో అమెరికా అతి పెద్ద వాటాదారుగానే కొనసాగుతున్నది. దాని మిలిటరీ బడ్జెట్ ఒక్కటే భారతదేశపు మొత్తం బడ్జెట్‌కు రెట్టింపు.అయినప్పటికీ భవిష్యత్తులో అమెరికాకు దిగే మెట్లు తప్ప ఎక్కే మెట్లు లేవనే వాదన బలంగా వినిపిస్తున్నది. అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా అమెరికా డాలర్ పెత్తనం కారణంగా 39 ట్రిలియన్ డాలర్ల అప్పును అది మేనేజ్ చేయగలుగుతున్నది. కానీ డాలర్ పెత్తనానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘బ్రిక్స్’ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి చేరితే అమెరికాకు గడ్డు కాలమే! ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడి ఫలితాలు ప్రమాదకరమైన ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మూజ్‌ను ‘విముక్తం’ చేయకుండా, ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చకుండా యుద్ధం నుంచి తప్పుకొంటే డాలర్ పెత్తనానికి పునాది వంటి పెట్రో డాలర్ వ్యవస్థ విచ్ఛిన్నం కావచ్చు. యుద్ధం కొనసాగిస్తే రోజులూ, నెలల్లో అది ముగిసే అవకాశం లేదు. మోయలేని భారంగా మారుతుంది.వాణిజ్య రంగంలో ట్రంప్ స్వీయ రక్షణాత్మక చర్యలు చేపట్టారు. దేశాల వారీగా వాణిజ్య లోటును సవరించుకునే పేరుతో ఎడాపెడా ట్యారిఫ్‌లు విధిస్తూ పోతున్నారు. ఈ చర్యలు అంతిమంగా అమెరికాకు నష్టం చేస్తాయని నిపుణులు చెబు తున్న మాటలను ఆయన చెవికెక్కించుకోవడం లేదు. ట్యారిఫ్ దాడులతో ఆయన అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక గమనాన్ని సంపూర్ణంగా మార్చే సామర్థ్యం గల ఏఐ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో చైనా భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ రేస్‌లో రెండు దేశాల మధ్య దూరం పెద్దగా లేదు. త్వరలో చైనావాళ్లు అమెరికాను ఓవర్టేక్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదనే అంచనాలు వెలువడుతున్నాయి.దౌత్యపరంగా కూడా ట్రంప్ దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకుంటున్నారు. ఎనిమిది దశాబ్దాలుగా అమెరికాకు కుడిభుజంగా ఉంటున్న ‘నాటో’ కూటమిని ఆయన స్వయంగా విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. గ్రీన్‌ల్యాండ్ రచ్చ, క్యూబాకు బెదిరింపులు, వెనుజువేలా అధ్యక్షుని కిడ్నాప్ వంటివన్నీ అంత ర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చాయి. యుద్ధరంగంలో వస్తున్న సాంకేతికపరమైన మార్పులు అమెరికా భారీ మిలిటరీని కలవరపెడుతున్నాయి. చౌకరకం డ్రోన్లు, సైబర్ తంత్రాలు, ఉపగ్రహ విధ్వంసక దాడులు పైచేయి సాధిస్తున్నాయి. ఇరాన్ ఘర్షణలో ఈ పరి ణామం అనుభవంలోకి వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలను చిన్న సినిమాలు అల్లాడించాయి.ఈ రకమైన పరిణామాలన్నీ అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యా నికి క్రమక్రమంగా ఎసరు పెట్టే స్వభావం కలిగినవే! కాకపోతే ఈ క్రమాన్ని ఇరాన్ యుద్ధం వేగిరపరిచిందనే అంచనాలు వెలు వడుతున్నాయి. ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు నికోలస్ స్పీక్‌మాన్ ప్రతి పాదించిన రిమ్‌ల్యాండ్ థియరీని గుర్తుచేస్తున్నారు. యూరే షియా ప్రధాన భూభాగానికి అంచు మాదిరిగా ఉండే తీర ప్రాంతాన్ని ‘రిమ్‌ల్యాండ్’ అన్నారు. స్పీక్‌మాన్ లెక్క ప్రకారం పశ్చిమ యూరప్ నుంచి మొదలుకుని పశ్చిమాసియా, దక్షిణా సియా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలు ఈ రిమ్‌ల్యాండ్ పరిధిలోకి వస్తాయి. ఇరవయ్యో శతాబ్దం అట్లాంటిక్ దేశాలదైతే, ఇరవై ఒకటో శతాబ్దం మాత్రం ఈ రిమ్ల్యాండ్దేననీ, ఈ ప్రాంతంపై ఎవరు ఆధిపత్యం సాధిస్తే వారిదే ప్రపంచాధిపత్య మని ఆయన ప్రతిపాదించారు.తర్వాత కాలంలోని అమెరికన్ అంతర్జాతీయ నిపుణులు రిమ్‌ల్యాండ్ థియరీ నుంచి పశ్చిమ యూరప్‌ను తొలగించి ఆఫ్రికా కొమ్ము దగ్గర నుంచి అరబ్ ద్వీపకల్పం, పర్షియా పీఠ భూమి, భారత ఉపఖండం మీదుగా తూర్పున చైనా కోస్తా ప్రాంతం దాకా, ఆగ్నేయంగా ఇండోనేషియా ద్వీప సముదాయం దాకా ఈ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. కైరో నుంచి జకార్తా దాకా అనవచ్చు. లేదా ఎర్ర సముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం (తూర్పు), జావా సముద్రం (ఆగ్నేయం) దాకా అని కూడా చెప్పవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంత మని కూడా పిలవవచ్చు. ‘ఇది ఇండియన్ ఓషన్ సెంచరీ’ అని పిలవడంలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులకు ఏకాభి ప్రాయం ఉన్నది.యూరప్ దేశాల వలసల వేటలకు ముందు ఈ ప్రాంత వాణిజ్యాన్ని భారత్, చైనాలు శాసించాయి. భూమార్గం ద్వారా యూరేషియా ప్రాంతాలలో చైనా వర్తకం జరిగితే సముద్రమార్గ వాణిజ్యంలో భారత్ ఆధిపత్యం వహించింది. భారత నావికా దళాలు ఆగ్నేయాసియా దేశాల్లో హిందూ సామ్రాజ్యాలను నెల కొల్పిన చరిత్ర మనకు తెలిసిందే. హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు పెట్రోలియం తెచ్చుకుంటున్నాం కానీ, పూర్వకాలంలో ఎక్కువగా అరబ్బీ గుర్రాలను ఇక్కడినుంచే తీసుకొచ్చేవారట! ప్రాచీన తెలుగు సాహిత్యంలో హురుమంజి (హార్మూజ్) ప్రస్తా వన చాలా సందర్భాల్లో వచ్చిందని చెబుతున్నారు.అత్యధిక జనాభా, అందులోనూ యువతరం, వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, విస్తారంగా సహజ వన రులు, ప్రపంచ వాణిజ్యంలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న నేపథ్యం దృష్ట్యా ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని అమెరికా విదేశాంగ నిపుణులు ప్రత్యేక దృష్టితోనే చూస్తూ వచ్చారు. ఇక్కడ ఆధిపత్యాన్ని కోల్పోతే ప్రపంచాధిపత్యానికి కూడా నూకలు చెల్లినట్టే అనే అవగాహన వారికి మొదటి నుంచి ఉన్నది. అందుకే డిగోగార్షియా దీవిలో అతిపెద్ద మిలిటరీ స్థావ రాన్ని అమెరికా ఏర్పాటు చేసుకున్నది. వివిధ దేశాల్లో ఉన్న స్థావరాల కంటే ఇది చాలా పెద్దది. ముఖ్యంగా పశ్చిమాసియా వ్యవహారాలను అదుపు చేయడం దీని బాధ్యత. తూర్పున ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తన బలిష్ఠమైన సప్తమ నౌకాదళాన్ని (సెవెంత్ ఫ్లీట్) చాలాకాలం నుంచే మోహరించింది. అయినప్పటికీ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి అమెరికాకు గట్టి పోటీనే ఎదురుకానున్నది. ఇరాన్ యుద్ధ ఫలి తంగా పశ్చిమాసియాలో అమెరికా తన పట్టును కోల్పోతే ఒక సరికొత్త నూతన అధ్యాయానికి స్వాగతం పలకడానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది.ఇరాన్‌పై ‘ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో మహా విధ్వంసకరమైన దాడికి ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఎందుకింత హఠాత్తుగా ఒడిగట్టిందో అమెరికా అధికార వర్గాలే అర్థం చేసుకోలేకపోతు న్నాయి. బిలియన్లకొద్దీ డాలర్లను ఏ ప్రయోజనాన్ని ఆశించి తగ లేస్తున్నారని అమెరికన్లు నిలదీస్తున్నారు. ఆరు వారాల యుద్ధం తర్వాత ఈరోజు (శనివారం) పాకిస్తాన్లో ఇరాన్ – అమెరికాలు చర్చలకు ఉపక్రమించాయి. ఆరు వారాల యుద్ధంలో అమెరికా సాధించిందేముంది? అలీ ఖమేనీని, ఉన్నత స్థానాల్లోని మరి కొందరినీ హతం చేశారు. కానీ పాలనా వ్యవస్థ మారలేదు. ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చడమన్నది అమెరికా పెట్టుకున్న ప్రధానమైన మూడు యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. అది నెరవేరలేదు.అణుశుద్ధి కార్యక్రమాలను పూర్తిగా నిర్మూలించడం మరో లక్ష్యం. అదీ నెరవేరలేదు. పైగా ఇరాన్ ఇప్పటికే అణ్వస్త్రాలను సమకూర్చుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నదని ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త థియోడర్ పోస్టల్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పలు టెలివిజన్లు శనివారం నాడు ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. హార్మూజ్ మార్గాన్ని ఇరాన్ చెర నుంచి విముక్తి చేస్తామని పలికిన బీరాలు కూడా నీరుగారిపోయాయి. ఇరాన్ దర్జాగా తన కరెన్సీలో టోల్ వసూలు చేసుకుంటున్నది. చివరికి చర్చల ప్రారంభానికి ముందు కూడా ట్రంప్ తన హూంకరింపులను ఆపలేదు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే భారీ విధ్వంసం ఉంటుందనీ, నౌకల్లోకి ఆయుధాలను లోడ్ చేస్తున్నామనీ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అదేదో తెలుగు సినిమాలో ‘రమణా లోడెత్తాలిరా, టోల్గేట్ పడుతుందీ’ అనే పాపులర్ డైలాగ్ ఉంటుంది.ఆరు వారాల్లో ట్రంప్ రకరకాల మాటలు విన్నవారికి అదే గుర్తొస్తుంది. నాలుగైదు రోజుల కింద ‘ఈ రాత్రితో ఒక నాగరికత అంతం కాబోతోందం’టూ ట్రంప్ చేసిన హెచ్చరికపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నాగరికతలను అంతం చేసే విప రీత బుద్ధి ఏమిటని ప్రశ్నించారు. పర్షియా (ఇరాన్) చరిత్రలో ప్రసిద్ధుడెన సైరస్ ది గ్రేట్ చక్రవర్తి ఆదర్శాలు తనకు స్ఫూర్తి నిచ్చాయని అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రూపొందించిన థామస్ జెఫర్సన్ ప్రకటించారు. 2500 సంవత్సరాలకు పూర్వం సైరస్ ది గ్రేట్ బాబిలోన్‌ను జయించినప్పుడు అక్కడి బానిస లందరికీ, అలాగే ఖైదీలకూ విముక్తి ప్రసాదించారు. వీరిలో పెక్కుమంది యూదులు. తన సామ్రాజ్యంలో మత స్వేచ్ఛనూ, జాతి సమానత్వాన్నీ ఆ రోజుల్లోనే ప్రబోధించారు. అటువంటి నాగరికతను ట్రంప్ అంతం చేయడానికి సిద్ధమయ్యాడు.పాక్‌లో ప్రారంభమైన చర్చలు ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశం లేదు. అమెరికాకు మెసెంజర్‌గా ప్రారంభ మైన పాకిస్తాన్ పాత్ర చర్చల్లో మధ్యవర్తి స్థాయికి మారింది. ఇరాన్ ఇప్పటికీ పాక్‌ను పూర్తిగా నమ్మడం లేదు. యుద్ధంలో అమెరికాతో పాటు భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్‌కు చర్చల్లో ఏ పాత్రా లేదు. పాకిస్తాన్ మిలిటరీ అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్‌పై ట్రంప్‌కు అవ్యాజమైన అనురాగం ఉన్నది. ట్రంప్ శాంతికాముకతకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మునీర్ బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తిని ఇరాన్ మధ్య వర్తిగా అంగీకరించడానికి చైనా సలహానే కారణమనే అభిప్రాయం ఉన్నది.పేరుకు పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా అన్ని వ్యవహారాలూ మునీర్ చేతుల మీదుగానే నడిచిపోతున్నాయి. మరో ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ మాదిరిగా పాక్ పాలనా పగ్గాలను అందిపుచ్చుకోవాలని మునీర్ ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికా, చైనాల సహకారం ఉన్నది కనుక అతని కోరిక నెరవేరే అవకాశం ఉండవచ్చు. భారత్‌పై విపరీతమైన వ్యతిరేకత ఉన్న వ్యక్తి మునీర్. కశ్మీర్ కోసం వెయ్యేళ్లయినా యుద్ధం చేస్తామన్న భుట్టో మాటల్ని పదేపదే వల్లెవేస్తుంటాడు. ఆయన ఏర్పాట్లతో జరుగుతున్న చర్చల ఫలితంపై ఆయనకే ఆసక్తి లేదు. ప్రజల్లో తన ప్రతిష్ఠ పెరగడం, అమెరికా ఆజ్ఞలు పాటించడమే ఆయనకు కావాల్సింది! పరస్పర విరుద్ధమైన డిమాండ్లపై కాలయాపన కోసమే రెండు దేశాలూ చర్చలకు సిద్ధమయ్యాయన్న అభిప్రాయం ఉన్నది.ఇరాన్‌కు లోపాయకారీ సహాయం చేయడం తప్ప యుద్ధం విషయంలో చైనా బహిరంగంగా మాట్లాడడం లేదు. శత్రువు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నప్పుడు, అందులో తలదూర్చ వద్దనేది యుద్ధనీతి. తప్పిదం ఫలితాన్ని శత్రువు అనుభవిస్తాడు. ఇంకో నెలరోజుల్లో ట్రంప్ – షీ జిన్‌పింగ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ లోపల ఇరాన్ యుద్ధంలో చేతులు కాల్చుకొని బలహీనపడే ట్రంప్ తన ఎదురుగా కూర్చుంటే గట్టిగా బేరమాడే శక్తి షీకి లభిస్తుంది. చైనా వాళ్లకు వ్యాపార కిటుకులు బాగా తెలుసు. ట్రంప్ ఇరాన్ యుద్ధంలో నిజంగానే చేతులు కాల్చుకుంటే ఇరాన్ ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదుగుతుంది. ఇప్పటికే రిమ్‌ల్యాండ్ తూర్పున ఉన్న చైనా ఒక బలమైన శక్తి. దృఢమైన నాయకత్వం ఉంటే భారత్ కూడా ప్రభావ శీల శక్తిగా ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ప్రాంతీయ శక్తుల ఆవిర్భావం జరిగి, బహుముఖీన ఒప్పందాలతో అంతర్జాతీయ సంబంధాలు కొనసాగవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పశ్చిమాసియా సంక్షోభానికి మోక్షం లభించేనా?
వేలాది మంది ప్రాణాలను బలిగొని ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపుకు చేరుకుంది. నెలల తరబడి సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నేడు (ఏప్రిల్ 11, 2026) పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ మేఘాల మధ్య ఆశా కిరణంలా కనిపిస్తున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.శాంతి మంతనాలు - పట్టువిడుపులుమధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతాధికారులు ఇస్లామాబాద్‌లో ముఖాముఖి భేటీ అవుతున్నారు. అయితే, చర్చల ప్రారంభానికి ముందే ఇరు దేశాలు తమ పంతాలను నెగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్‌లో కాల్పుల విరమణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయి భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అడ్డంకిగా మారిన హెజ్బుల్లా అంశంమార్చి నెలలో ప్రారంభమైన పోరాటంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అయితే, లెబనాన్ అంశాన్ని ఈ ద్వైపాక్షిక చర్చలతో ముడిపెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ ససేమిరా అంటున్నాయి.ఆర్థిక ఆంక్షలు.. అణు కార్యక్రమంసంవత్సరాలుగా తమ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆంక్షలను అమెరికా వెంటనే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు, క్షిపణి తయారీ కార్యక్రమాలు నిలిపేస్తేనే ఆంక్షల ఉపశమనం ఉంటుందని వాషింగ్టన్ సంకేతాలిచ్చింది. ముఖ్యంగా యురేనియం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిపై పట్టుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని గుర్తించాలని, అక్కడ రవాణా రుసుములు వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరుతోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా, ఎటువంటి పరిమితులు లేకుండా అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల రాకపోకలు సాగాలని డిమాండ్ చేస్తోంది.సైనిక ఉపసంహరణ - పరిహారంగత ఆరు వారాలుగా జరిగిన యుద్ధ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేయనుండగా, అమెరికా దీనిపై మౌనం వహిస్తోంది. అలాగే, మధ్యప్రాచ్యం నుంచి అమెరికా తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా, శాంతి ఒప్పందం కుదిరే వరకు సైన్యం కదిలేది లేదని, ఒకవేళ ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధం తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
చర్చలపై ప్రతిష్టంభన!
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించి, శాంతిని సాధించడమే ధ్యేయంగా శనివారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గతంగా విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇరాన్ ప్రతినిధులు రెండు వర్గాలుగా విడిపోయారు. తమ వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. శాంతి చర్చలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఒకవర్గం పట్టుబడుతుండగా, మరో వర్గం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే చర్చలంటూ మెలిక పెడుతోంది. మొత్తానికి శాంతి చర్చలకు ఇరాన్ హాజరవుతుందా? లేదా? అనేది అనుమానంగానే మారింది. శుక్రవారం రాత్రి వరకూ ఎటూ తేల్చుకోకపోవడం గమనార్హం. మరోవైపు చర్చలకు అమెరికా సిద్ధమవుతోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ శుక్రవారం ఇస్లామాబాద్‌కు బయలుదేరారు. చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరుగుతాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. శాంతి చర్చల పట్ల ఇరానియన్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్నేహహస్తం అందిస్తామని తెలిపారు. ఒకవేళ వారు తమతో ఆడుకోవాలని చూస్తే తదుపరి పరిణామాలు మరోలా ఉంటాయని తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్లు పేర్కొన్నారు. చర్చల విషయంలో ట్రంప్ కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారని వాన్స్ వెల్లడించారు. రెండు అంశాలు పరిష్కారమైతేనే... ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంతి చర్చల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 10 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ చర్చలను పాక్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అయితే, ఇరాన్ ప్రతినిధి బృందం రాకపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగకపోతే ఇస్లామాబాద్ చర్చల నుంచి పూర్తిగా వైదొలుగుతామని టెహ్రాన్ హెచ్చరించినట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది. పరస్పరం అంగీకరించిన రెండు అంశాలు ఇప్పటికీ అమలు కాలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘలిబాఫ్ శుక్రవారం విమర్శించారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ పాటించడం లేదని, ఇరాన్‌కు సంబంధించిన కొన్ని ఆస్తులను ఇప్పటికీ విడుదల చేయలేదని తప్పుపట్టారు. శాంతి చర్చలు ప్రారంభం కావాలంటే ఈ రెండు అంశాలు అమల్లోకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ఇరాన్ నుంచి పది మందితో కూడిన ప్రతినిధి బృందం చర్చలకు రాబోతోందని పాకిస్తాన్‌లోని ఇరాన్ రాయబారి రెజా అమీర్ మొఘదామ్ గురువారం నిర్ధారించారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే, ఇరాన్ ప్రతినిధి బృందం రాకను ఉద్దేశపూర్వకంగానే రహస్యంగా ఉంచారని, వారి కోసం పాక్ ప్రభుత్వం ప్రత్యేకంగా సెక్యూరిటీ కారిడార్‌ను ఏర్పాటు చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దాడులు జరుగుతుండగానే చర్చలా? లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగించడం ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టంచేశారు. ఒకవైపు దాడులు కొనసాగుతుండగానే మరోవైపు చర్చలు జరపడం అర్థంపర్థం లేని పని అంటూ తేల్చేశారు. ఇదిలా ఉండగా, ఇస్లామాబాద్‌లో చర్చలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇరుపక్షాలను స్వాగతించడానికి పాక్ సర్కార్ సిద్ధమయ్యింది. చర్చల కోసం వచ్చే ప్రతినిధులకు, విలేకరులకు ‘వీసా ఆన్ అరైవల్’కింద వీసాలు ఇవ్వనున్నట్లు పాక్ ఉప ప్రధానమంత్రి ఇషాఖ్ దార్ శుక్రవారం తెలిపారు. పాక్ మంత్రికి మునీర్ మందలింపు మానవాళికి శాపం ఇజ్రాయెల్, అదొక దయ్యం, క్యాన్సర్ అంటూ దూషించిన పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్‌ను ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తీవ్రంగా మందలించారు. ఆయనపై పెద్ద ఎత్తున కేకలు వేసినట్లు తెలిసింది. బాధ్యత లేకుండా వ్యవహరించడం ఏమిటని మండిపడినట్లు సమాచారం. ఇజ్రాయె ల్ను దూషిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టును ఖవాజా అసిఫ్ తర్వాత తొలగించారు. -
సవాళ్లున్నా.. భారత్ భేష్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలను తట్టుకునేలా భారత్ పటిష్టమైన స్థితిలోనే ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారీ స్థాయిలో విదేశీ మారక నిల్వలు, తక్కువ స్థాయి ద్రవ్యోల్బణం, మరింతగా వ్యయం చేయగలిగే సామర్థ్యాల వల్ల గ్లోబల్ ఇంధన షాక్‌లను ఎదుర్కొనగలదని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) వృద్ధి అంచనాలను 6.6 శాతానికి పెంచినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం వాణిజ్య సంక్షోభాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్, ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభంలోకి పటిష్టమైన స్థితిలోనే అడుగుపెట్టిందని వరల్డ్ బ్యాంక్ రీజనల్ ప్రాక్టీస్ డైరెక్టర్ (దక్షిణాసియా) సెబాస్టియన్ ఎకార్ట్ తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడంతో పాటు సానుకూల పాలసీలు మొదలైన అంశాలు భారత్ అధిక వృద్ధి సాధించేందుకు తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ, మిగతా వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత్‌తో పాటు ప్రాంతీయంగా మిగతా దేశాలు పటిష్టమైన వృద్ధి సాధించగలవని భావిస్తున్నాం‘ అని వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా ఉన్న భారత్ వృద్ధి 2026 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతానికి చేరింది. దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటం, ఎగుమతులు మెరుగ్గా నమోదు కావడం ఇందుకు తోడ్పడ్డాయి. ఈ ఆర్థిక సంవత్సరపు అంచనాలు అంతకన్నా తక్కువగా 6.6 శాతంగానే ఉన్నప్పటికీ, జనవరిలో వరల్డ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న 6.5 శాతం కన్నా కొంత ఎక్కువే కావడం గమనార్హం. వేగవంతమైన వృద్ధి..: ఎగుమతులపై అత్యధిక టారిఫ్‌లను ఎదుర్కొన్నప్పటికీ గతేడాది భారత్ అత్యంత వేగవంతంగా వృద్ధి చెందిన ఎకానమీగా నిల్చిందని ఇండియాకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ లీడ్ ఎకానమిస్ట్ ఆరిలియెన్ క్రూస్ తెలిపారు. ఆదాయ పన్ను కోతలు, జీఎస్టీ రేట్ల తగ్గింపులాంటివి దేశీ వినియోగం పెంచడానికి దోహదపడ్డాయన్నారు. ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్ధవంతంగా ఎదుర్కొందని, అయితే రాబోయే రోజుల్లో భారీ స్థాయిలో రిస్క్ లు తలెత్తే అవకాశం ఉన్నందున వృద్ధిపై ప్రభావం పడొచ్చని క్రూస్ పేర్కొన్నారు. -
‘కాల్పుల విరమణ’కు తూట్లు!
ప్రపంచమంతా ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురుచూసిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకుండానే ముగిసిపోయే ప్రమాదం కనబడుతోంది. తీవ్ర వైషమ్యాలతో కాలుదువ్వుకునే వైరిపక్షాలు యుద్ధ క్షేత్రాన్ని విడిచిపెట్టడం అంత సులభమేమీ కాదు. అందుకే ఒప్పందం కుదిరాక కూడా అక్కడక్కడ పరస్పర దాడులు తప్పవు. కానీ పశ్చిమాసియా పరిస్థితి కాస్త భిన్నమైనది. కాల్పుల విరమణపై తొలుత అమెరికా, ఆ తర్వాత ఇరాన్ ధ్రువీకరించాక, మధ్యవర్తి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ప్రకటన చేశారు. ఎప్పుడూ లేనిది ఇజ్రాయెల్ కూడా ఒప్పందాన్ని అంగీక రిస్తున్నట్టు తెలిపింది. కానీ 24 గంటలు గడవకుండానే అందరిదీ తలోమాట అయింది. మధ్యవర్తి పాత్ర పోషించే దేశం దృఢమైన స్వరం వినిపించగలగాలి. అవసరమైతేశాసించగలగాలి. కానీ అమెరికా అప్పులపై ఆధారపడే పాక్ ఆ పని చేయగలదా? ఘర్షణలు నివారించిన ఖ్యాతిని కూడా ‘త్యాగం’ చేసి, తెరవెనకుండి పాకిస్తాన్ ద్వారా కథ నడిపిస్తున్న చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ మాదిరి డ్రామాలకు సాహసించేవి కాదు. అసలు పశ్చిమాసియాకు సంబంధించి ఏ ఒప్పందం కుదరాలన్నా అమెరికాను సంతృప్తిపరిస్తే సరిపోదు. ఆ దేశం ఒకటి కాదు... రెండు! అవిభాజ్య కవలల మాదిరిగా వ్యవహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఒప్పుకుంటే తప్ప ఏదీ సాధ్యపడదు. ఒక్కోసారి ఆ రెండూ కావాలని భిన్న స్వరాలు వినిపిస్తాయి. దీన్ని వ్యూహం అనాలో, చవకబారు ఎత్తుగడగా భావించాలో ఎవరికీ తెలియదు. అమెరికా అవునంటుంది... కాసేపటికి ఇజ్రాయెల్ కాదంటుంది. పర్యవసానంగా అనుకున్నది అమలుకాక అవతలి పక్షం అయోమయంలో పడుతుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకమయ్యాక ఆయన అల్లుడు జేర్డ్ కుష్నెర్ ద్వారా ఇజ్రాయెల్‌కు చుట్టరికం కలవడంతో పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. అందుకే వైట్‌హౌస్‌లో, ట్రంప్‌కు బాగా దగ్గరగావుండే వ్యక్తుల్లో కలకలం మొదలైంది. ఇప్పుడు తోకే కుక్కను ఆడిస్తోందన్న రీతిలో వ్యవహారం ముదిరింది. కనుకనే ఒప్పందంపై తొలుత ప్రకటించిన ట్రంప్ లెబనాన్‌పై దాడులు సాగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. అటు తర్వాత ఒప్పందంలో లెబనాన్ ప్రస్తావన లేదని బుకాయించటం మొదలుపెట్టారు. ఇరాన్ 10 అంశాల ముసాయిదా కొత్తదేమీ కాదు. దురాక్రమణకు ముందే ఇరాన్ దాన్ని ప్రతిపాదించింది. అప్పట్లో అది ట్రంప్‌కు నచ్చలేదు. ఇక ఇరాన్ ఎంతకూ లొంగకపోవటం, చమురు ధరలు ఆకాశాన్నంటడంతో కొంపమునుగుతుందని అర్థమై అది ఆచరణయోగ్యమేనని అంగీకరించక తప్పలేదు. తన కూటమిలోని ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయరాదంటున్న ట్రంప్... ఆ దేశానికి మద్దతుగా నిలబడిన లెబనాన్‌లో మాత్రం ఇజ్రాయెల్ ఊచకోత కొనసాగించటం సబబేనంటున్నారు. ఇది మర్కట తర్కం కాదా? కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఉత్సవం చేసుకుంటున్న జనంపై పది నిమిషాలపాటు ఏకధాటిగా సాగించిన కాల్పుల్లో 250 మందికిపైగా మరణించారు. మరో 1,000 మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రకటించాక అంతవరకూ 119 డాలర్లుగావున్న బ్యారెల్ ముడి చమురు ధర 94 డాలర్లకు చేరింది. కానీ ఇజ్రాయెల్ హంతక దాడులతో అదికాస్తా మళ్లీ 97కు పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ కపట నాటకాలు కట్టిపెడితే తప్ప ప్రపంచం ప్రశాంతంగా మనుగడ సాగించలేదు. అది జరగాలంటే ఆ రెండు దేశాల్లోని ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచం సంక్షోభం అంచుల్లో ఉంది. ఇరాన్ ఇప్పటికే యుద్ధంవల్ల సమస్తం కోల్పోయింది. 3,000 మంది పౌరులు మరణించగా, లక్షలాది జనావాసాలు శిథిలాలుగా మారాయి. మౌలిక సదుపాయాలన్నీ ధ్వంస మయ్యాయి. ఇరాన్ శక్తిమేరకు ప్రతీకార దాడులు చేస్తూ దురాక్రమణకు దిగిన ఆ రెండు దేశాలతోపాటు, వాటికి సహకరిస్తున్న ఇరుగు పొరుగు దేశాలను సైతం దెబ్బతీయగలిగింది. పశ్చిమాసియాలో ఇంతకుమించి మరేం జరగకూడదకునే దేశాలు ఇక తటస్థ అవతారాలు చాలించి నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎన్ని లోటుపాట్లున్నా ఈ ఒప్పందం కొనసాగేలా చూడాలి. శుక్రవారం జరిగే చర్చలు ఫలవంతం కావాలి. లేనట్టయితే చరిత్ర క్షమించదు. -
సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు
దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎరువుల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతను సమీక్షించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎరువుల తయారీ యూనిట్లకు సరఫరా చేసే సహజ వాయువు కోటాను 95 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కేటాయింపులు గురువారం (ఏప్రిల్ 9, 2026) నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఇటీవల జరిగిన ఇతర మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గడిచిన ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా ఈ కేటాయింపులు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.పెరిగిన కేటాయింపులుగత వారం (ఏప్రిల్ 6) ఎరువుల రంగానికి గ్యాస్ సరఫరాను 90 శాతానికి పెంచిన ప్రభుత్వం, తాజాగా అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ ప్రకారం వస్తున్న ఎల్ఎన్జీ కార్గోలను దృష్టిలో ఉంచుకుని మరో 5 శాతం పెంచి మొత్తం కోటాను 95 శాతానికి చేర్చింది. దేశ సగటు గ్యాస్ వినియోగం రోజుకు సుమారు 196 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు(ఎంఎస్‌సీఎం). ఎరువుల రంగ అవసరం రోజుకు సుమారు 52 ఎంఎస్‌సీఎండీగా ఉంది. ఒక ఎంఎస్‌సీఎం గ్యాస్‌తో సుమారు 1,600 టన్నుల యూరియాను ఉత్పత్తి చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎరువుల రంగం 9,753 ఎంఎస్‌సీఎంల గ్యాస్‌ను వినియోగించింది. ఇది దేశ మొత్తం వినియోగంలో 28 శాతానికి సమానం.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
రియల్టీకి ‘సీజ్ఫైర్’ ఊతం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సద్దుమణగడం అంతర్జాతీయ స్థిరాస్తి మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం కారణంగా గత కొన్ని వారాలుగా దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగాన్ని వెనక్కి నెట్టింది. అయితే, ప్రస్తుతం ఇరాన్, అమెరికా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణతో తిరిగి ఈ రంగం గాడిలో పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం అనిశ్చితి భయాలతో నిలిపివేసిన లావాదేవీలు ఇప్పుడు పట్టాలెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు.యుద్ధంతో వెనక్కి తగ్గిన పెట్టుబడిదారులుఇరాన్-ఇజ్రాయెల్ వివాదం గరిష్ట స్థాయికి చేరుకున్న తరుణంలో పెట్టుబడిదారులు తమ మూలధనాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు మొగ్గు చూపారు. దీని ప్రభావం దుబాయ్ రియల్టీ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల కొనుగోలుదారులు తమ నిర్ణయాలను వాయిదా వేయడంతో మార్చి నెలలో నివాస గృహాల అమ్మకాలు 30 శాతానికి పైగా పడిపోయాయి. ప్రధానంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల లావాదేవీల విలువ, పరిమాణం గణనీయంగా క్షీణించాయి. దుబాయ్ రియల్టీలో దాదాపు 20 శాతం వాటా కలిగిన భారతీయ పెట్టుబడిదారులు కూడా తాత్కాలికంగా తమ కొనుగోలు ప్రయత్నాలను విరమించుకున్నారు.డిమాండ్ బౌన్స్బ్యాక్కాల్పుల విరమణ ప్రకటన వెలువడగానే మార్కెట్లో ఒక్కసారిగా చలనం మొదలైందని నిపుణులు చెబుతున్నారు. గత నెలలో కొనుగోళ్లపరంగా వెనక్కి తగ్గిన క్లయింట్లు ఇప్పుడు తిరిగి బ్రోకర్లను సంప్రదిస్తున్నారు. ‘గతంలో ఒప్పందం కుదుర్చుకుని హోల్డ్‌లో పెట్టిన వారు ఇప్పుడు తిరిగి మార్కెట్లోకి వస్తున్నారు’ అని ప్రోయాక్ట్ లగ్జరీ రియల్ ఎస్టేట్ సీఈఓ రీతూ కాంత్ ఓజా తెలిపారు. వాయిదా పడిన లావాదేవీలన్నీ ఒక్కసారిగా కార్యరూపం దాల్చనుండటంతో ఏప్రిల్ నెలలో దుబాయ్ రియల్టీ రంగం భారీగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, రాబోయే 6 నుంచి 8 వారాలు మార్కెట్ స్థిరత్వానికి అత్యంత కీలకమని హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే..పెట్టుబడిదారులకు నిపుణుల సూచనలుఅనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రాజెక్టుల కంటే వెంటనే అందుబాటులో ఉన్న ఇళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి.దుబాయ్ మెరీనా, డౌన్‌టౌన్ దుబాయ్, జుమేరా విలేజ్ సర్కిల్ (జేవీసీ) వంటి ప్రాంతాల్లో అద్దె ఆదాయం స్థిరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.యుద్ధ మేఘాలు తొలగిపోతుండటంతో దుబాయ్ మరోసారి గ్లోబల్ ఇన్వెస్టర్లకు ‘సేఫ్ హెవెన్’గా మారుతోంది. పెండింగ్‌లో ఉన్న డిమాండ్ అంతా ఒక్కసారిగా మార్కెట్లోకి రానుండటంతో ఈ వేసవిలో దుబాయ్ రియల్టీ సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. -
గోల్డ్–సిల్వర్ జూమ్.. క్రూడ్ క్రాష్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ వాతావరణానికి తాత్కాలికంగా బ్రేక్ పడటంతో బంగారం, వెండి ధరలు తిరిగి జోరందుకున్నాయి. యూఎస్, ఇరాన్ మధ్య రెండు వారాలపాటు కాల్పుల విరమణకు తెరలేవడంతో విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ వివరాల ప్రకారం స్థానిక మార్కెట్లో కేజీ వెండి రూ. 11,000 (5 శాతం) జంప్‌చేసి రూ. 2,51,000ను తాకింది. ఇక మేలిమి బంగారం సైతం 10 గ్రాములు రూ. 3,200 (2 శాతం) ఎగసి రూ. 1,56,400కు చేరింది. విదేశీ మార్కెట్లోనూ: అంతర్జాతీయ మార్కెట్లలోనూ వెండి, బంగారం మెరిశాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 2 శాతంపైగా (97 డాలర్లు) బలపడి 4,803 డాలర్లకు చేరింది. మరోపక్క సిల్వర్ ఔన్స్ 6% జంప్‌చేసి 77.33 డాలర్లను తాకింది. హార్మూజ్‌ను తెరిచే వీలున్నట్లు ఇరాన్ సంకేతాలివ్వడంతో సెంటిమెంటు మెరుగుపడినట్లు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. ముడిచమురు 20% క్షీణత కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న క్రూడ్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. నౌకల రవాణాకు అడ్డంకులు తొలగనున్న అంచనాలతో చమురు ధరలు తొలుత 20% పతనమయ్యాయి. తదుపరి బ్రెంట్ పీపా 15.5% (17 డాలర్లు) దిగజారి 92 డాలర్లస్థాయిలో ట్రేడవుతోంది. ఇక డబ్ల్యూటీఐ పీపా 18% (20 డాలర్లు) పడిపోయి 93 డాలర్ల దిగువకు చేరింది. రూపాయికి జోష్ పశ్చిమాసియాలో పరిస్థితులు శాంతించడంతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 1%పైగా బలహీనపడి 98.5కు చేరింది. దీంతోపాటు.. దేశీ స్టాక్ మార్కెట్లు హైజంప్ చేయడం రూపాయికి బలాన్నిచి్చనట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఫలితంగా డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 52 పైసలు పుంజుకుని 92.54 వద్ద ముగిసింది. -
వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్!
గత కొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ భయాలు తాత్కాలికంగా సద్దుమణిగాయి. పశ్చిమాసియాలో ముంచుకొస్తున్న పెను ప్రమాదాన్ని నివారిస్తూ ఇరాన్‌పై తలపెట్టిన సైనిక చర్యను రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి తొలగి పెట్టుబడిదారుల్లో ఒక్కసారిగా ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ ఉదయం గిఫ్ట్ నిఫ్టీ ఏకంగా 2 శాతంపైగా లాభపడటం భారత మార్కెట్లలో బుల్ రన్‌కు సంకేతాలు పంపుతోంది.ట్రంప్ వ్యూహాత్మక అడుగుఏప్రిల్ 8, 2026 ఉదయం 4:30(అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలు) వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఈ కీలక ప్రకటన చేశారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ల మధ్యవర్తిత్వంతో ఇరాన్ చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంతో సైనిక దాడులను 14 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘వినాశకరమైన యుద్ధం కంటే శాంతికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించాం. అయితే హార్మూజ్ జలసంధిని తక్షణమే సురక్షితంగా తెరిస్తేనే ఈ వెసులుబాటు వర్తిస్తుంది’ అని ట్రంప్ స్పష్టం చేశారు.చమురు ధరల పతనం..యుద్ధం వాయిదా పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ దాదాపు 18 శాతం తగ్గి 92.60 డాలర్లు వద్దకు చేరింది. బ్రెండ్ క్రూడ్ 6 శాతం తగ్గి 103.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుండటం వల్ల సరఫరా పునరుద్ధరిస్తారనే ఆశలు చిగురించాయి. ప్రపంచ ఇంధన అవసరాల్లో 20 శాతానికి పైగా ఈ మార్గం నుంచే సాగుతుండటంతో గడిచిన నెల రోజులుగా ఆకాశాన్ని తాకిన ధరలు ఇప్పుడు కిందికి దిగివస్తున్నాయి.దలాల్ స్ట్రీట్‌లో పండగభారతీయ కాలమానం ప్రకారం ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభానికి ముందే గిఫ్ట్ నిఫ్టీ 450 పాయింట్ల పైగా లాభంతో ఉంది. దీని ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఈరోజు చారిత్రాత్మక గరిష్టాలను తాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియా మార్కెట్లో నికాయ్, హాంగ్ సెంగ్ మార్కెట్లు ఇప్పటికే 2-3 శాతం లాభాల్లో కొనసాగుతున్నాయి.ఇంతకాలం యుద్ధం వస్తుందేమో అన్న ఆందోళనతో నగదును వెనక్కు తీసుకున్న ఇన్వెస్టర్లకు ఇదొక గొప్ప ఊరట. ఇరాన్ తన 10 సూత్రాల శాంతి ప్రణాళికను అమలు చేస్తే ఈ రెండు వారాల విరామం శాశ్వత శాంతికి దారి తీయవచ్చు. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు చమురు ధరల తగ్గింపు బూస్టర్ డోస్ లాంటిది. అయితే, ఇది కేవలం రెండు వారాల గడువు మాత్రమేనని, మధ్యవర్తిత్వ చర్చల ఫలితాలను బట్టే మార్కెట్ల తదుపరి దిశ ఉంటుందని పెట్టుబడిదారులు గమనించాలి.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే.. -
భారత్‌వైపు టెక్ కంపెనీల చూపు..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం ప్రపంచ ఐటీ ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తోంది. మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ డేటా భద్రత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో భౌగోళికంగా, ఆర్థికంగా సురక్షితమైన స్థావరంగా భావిస్తున్న భారతదేశం ప్రపంచ డేటా సెంటర్ హబ్‌గా అవతరించేందుకు సిద్ధమవుతోంది.గూగుల్ క్లౌడ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి గ్లోబల్ కంపెనీలు ప్రస్తుతం భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాల కోసం కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా అమెజాన్ ఇప్పటికే దేశంలోని ప్రముఖ డేటా సెంటర్ ఆపరేటర్లయిన CtrlS, Sify, NTT, CapitaLand, Airtel Nxtraలతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పశ్చిమాసియా క్లయింట్లు సైతం తమ డేటాను భారత్‌కు తరలించేందుకు ఆసక్తి చూపుతున్నారు.భారత్ ఎందుకు అత్యుత్తమ ఎంపిక?అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తమ వర్క్‌లోడ్‌ను యూరప్ లేదా అమెరికాకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ భారత్ వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ధరల ప్రయోజనం. నిపుణులు విశ్లేషణ ప్రకారం, భారత్‌లో ఒక డేటా సెంటర్ నిర్మించే ఖర్చుతో పోలిస్తే సింగపూర్ వంటి దేశాల్లో రెండింతలు ఖర్చవుతుంది. అంటే భారత్‌లో పెట్టుబడి పెడితే మిగిలిన సొమ్ముతో మరో అదనపు కేంద్రాన్ని ఉచితంగా నిర్మించుకున్నంత లాభం చేకూరుతుంది.జీపీయూలకు భారీ డిమాండ్కేవలం డేటా స్టోరేజ్ మాత్రమే కాకుండా కృత్రిమ మేధ ప్రాసెసింగ్‌కు అవసరమైన జీపీయూ(గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు) కోసం కూడా అంతర్జాతీయ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ‘యొట్టా’ డేటా సర్వీసెస్ ఇప్పటికే అమెరికాకు చెందిన పలు సంస్థలతో 16 మిలియన్ డాలర్ల నుంచి 1.3 బిలియన్ డాలర్ల విలువైన భారీ జీపీయూ ఒప్పందాలను కుదుర్చుకుంది. పెరిగిన డిమాండ్‌ను తట్టుకోవడానికి రాబోయే నాలుగు నెలల్లో సుమారు 30,000 అదనపు B300/B200 జీపీయూలను సిద్ధం చేయాలని యొట్టా భావిస్తోంది.సాధారణ కార్యాలయాల వలె డేటా సెంటర్లను తక్షణమే మార్చడం సాధ్యం కాదు కాబట్టి, ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాలు దీర్ఘకాలికంగా భారత్‌కు మేలు చేయనున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, గల్ఫ్ దేశాల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్.. భారత్‌ను గ్లోబల్ క్లౌడ్ కారిడార్‌లో ఒక శక్తివంతమైన సెకండరీ హబ్‌గా నిలబెడుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, గ్లోబల్ టెక్ రంగంలో ఇదొక నిర్మాణాత్మక మార్పు. భారత్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే డిజిటల్ ఎకానమీలో తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయం.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే.. -
పెట్టుబడులకు బూస్ట్.. వడ్డీరేట్ల కట్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ అటు పెట్టుబడులకు ఊతమిస్తూనే ఇటు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేలా వడ్డీ రేట్లను కూడా తగ్గించగలిగే సామర్థ్యాలు భారత్‌కి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దశాబ్దకాలంగా పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రతిఫలం ఇదని ఆమె పేర్కొన్నారు. కఠినతరమైన పరిస్థితులను అధిగమించాలంటే మేలైన ఆర్థిక విధానాలు పాటించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. భారీ రుణ భారాలు, ద్రవ్య లోటుతో సతమతమవుతున్న కొన్ని దేశాల్లో భారత్‌లో ఉన్నటువంటి వెసులుబాటు లేదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ముందుంది గడ్డుకాలం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలనేవి ప్రాంతీయ భద్రతా సవాళ్ల స్థాయి నుంచి వ్యవస్థాగతంగా ప్రకంపనలు సృష్టించే స్థాయికి విస్తరించాయని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు కీలకమైన మార్గాలకు పెను ముప్పుగా మారాయని మంత్రి చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత కఠినతరంగా ఉండబోతోందని తెలిపారు. గతేడాది వాణిజ్యపరమైన ఉద్రిక్తతలతో గ్లోబల్ సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొని, గ్లోబల్ వృద్ధి అంచనాలను దిగువముఖంగా తిరగరాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయినప్పటికీ భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. జీడీపీలో ప్రభుత్వ రుణభారం సుమారు 81 శాతమేనని, జర్మనీ మినహాఅతి పెద్ద ఎకానమీల్లో ఇదే తక్కువ స్థాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
కాల్పుల విరమణకు ఇరాన్ నో!..హెచ్చరించిన ట్రంప్
దుబాయ్/జెరూసలేం/వాషింగ్టన్: నెలన్నర రోజులుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రతరమయ్యే సంకేతాలు కన్పిస్తున్నాయి. కాల్పులకు 45 రోజుల పాటు విరామం ఇచ్చేలా అమెరికా, ఇరాన్‌లను ఒప్పించేందుకు ఈజిప్టు, టర్కీ, పాకిస్తాన్ సోమవారం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాల్పులకు విరామంతో పాటు హార్మూజ్ జలసంధిని తెరవడం తదితరాలతో కూడిన ప్రతిపాదనను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్కు ఆయా దేశాల ప్రతినిధులు అందజేశారు. కానీ ఈ ప్రతిపాదనను ఇరాన్ పూర్తిగా తిరస్కరించింది. ‘‘తాత్కాలిక కాల్పుల విరమణ కోసం హార్మూజ్‌ను తెరవడం ఇరాన్‌కు ఏ మాత్రమూ అంగీకారం కాదు. ఈ విషయాలన్నింటినీ పాక్ ద్వారా ఇప్పటికే అమెరికాకు తెలియజేశాం’’ అని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. యుద్ధానికి శాశ్వతంగా తెర దించడం మినహా మరేదీ తమకు అంగీకారయోగ్యం కాదని కైరోలోని ఇరాన్ దౌత్య బృందం సారథి మొజ్తబా ఫిర్దౌసీ పోర్ కుండబద్దలు కొట్టారు! అంతేగాక యుద్ధానికి తెర దించే విషయమై ఇరాన్ తాజాగా అమెరికాకు 10 షరతులు కూడా విధించింది! ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేశారు. హార్మూజ్‌ను తెరవడంపై కూడా అంతకుముందే ఇరాన్‌కు ఆయన మరిన్ని హెచ్చరికలు చేశారు. ‘‘మీకు మంగళవారం రాత్రి 8 (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5) గంటల వరకే గడువు. ఆలోపు దిగిరాకుంటే కనీవినీ ఎరగని దాడులతో సర్వనాశనం చేసేస్తాం’’ అంటూ హెచ్చరించారు. ఇరాన్‌పైకి అమెరికా ఇప్పటికే అత్యాధునిక లాంగ్ రేంజ్ జేఏఎస్‌ఎస్‌ఎం–ఈఆర్ క్షిపణులను భారీ సంఖ్యలో ఎక్కుపెట్టినట్టు వస్తున్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి! సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ దాడులుఇజ్రాయెల్, అమెరికా సోమవారం ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇరాన్‌కు అత్యంత కీలకమైన సౌత్ పార్స్ చమురు క్షేత్రంపై కూడా ఇజ్రాయెల్ భారీగా దాడులకు దిగింది. దాంతో అక్కడి పెట్రో కెమికల్ ప్లాంటుకు తీవ్ర నష్టం వాటిల్లినట్టు సమాచారం. టెహ్రాన్‌పై యుద్ధ విమానాలు గంటల తరబడి అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) నిఘా విభాగం అధిపతి మజీద్ ఖదేమీ మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేగాక ఐఆర్‌జీసీకి చెందిన ఖుద్స్ ఫోర్స్ కీలక నేత అస్ఘర్ బకేరీని కూడా అంతం చేసినట్టు పేర్కొంది. రాజకీయ, సైనిక ప్రముఖులందరినీ ఒక్కొక్కరుగా అంతం చేసి తీరతామని స్పష్టం చేసింది. మజీద్ మృతిని ఇరాన్ అధికారిక మీడియా కూడా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ దాడుల్లో టెహ్రాన్‌లోని షరీఫ్ యూనివర్సిటీలో పలు భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆన్లైన్ క్లాసుల కారణంగా విద్యార్థులెవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఎస్లాంషార్ నగరంపై దాడుల్లో 15 మంది దాకా మరణించినట్టు అధికారులు వెల్లడించారు. కోమ్ నగరంలో పౌర ఆవాసాలపై దాడుల్లో ఐదుగురు, ఇతరచోట్ల మరో ఆరుగురి దాకా మృతి చెందారన్నారు. టెహ్రాన్‌లో ఓ ఇంటిపై జరిగిన దాడికి మరో ముగ్గురు బలయ్యారు. లెబనాన్‌లో కూడా దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. ఐన్ సాదే నగరంలో లెబనాన్ సైనికాధికారి ఒకరు దాడుల్లో మరణించారు.ఒక్క రాత్రిలోనే నాశనం చేసేస్తాంఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరికలు ఇరాన్ అంతటినీ ఒకే ఒక్క రాత్రిలో సర్వనాశనం చేసేయగల సత్తా అమెరికా సొంతమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘అది బహుశా మంగళవారం రాత్రే కావచ్చు’’ అంటూ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయన హెచ్చరించారు. ఇరాన్ భూభాగం నుంచి ఎఫ్–15ఇ యుద్ధ విమానం తాలూకు ఎయిర్‌మ్యాన్‌ను కాపాడేందుకు అమెరికా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ చరిత్రాత్మకమని అభివరి్ణంచారు. అందుకోసం ఏకంగా 155 యుద్ధ విమానాలను రంగంలోకి దించినట్టు చెప్పుకొచ్చారు! దీని గురించి తొలుత రిపోర్ట్ చేసిన అమెరికా జర్నలిస్టు ఓ అత్యంత పనికిమాలిన వ్యక్తి అంటూ అధ్యక్షుడు మండిపడ్డారు. ‘‘అతను చేసిన పని వల్ల రెస్క్యూ ఆపరేషన్ గురించి ఇరాన్‌కు తెలిసిపోయింది. దాంతో అందులో పాల్గొన్న సైనికులందరి ప్రాణాలూ ముప్పులో పడ్డాయి’’ అంటూ దుయ్య బట్టారు. సదరు కథనానికి సోర్స్ ఏమిటో బయట పెట్టకుంటే ఆ జర్నలిస్టును జైల్లో పెడతామని హెచ్చరించారు. ఇరాన్ షరతులివే! → పశ్చిమాసియాలో అమెరికా–ఇజ్రాయెల్ ఏకపక్షంగా మొదలుపెట్టిన యుద్ధానికి తక్షణం తెర దించాలి → ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మరింకెప్పటికీ దండెత్తరాదు. ఈ మేరకు ఇరు దేశాలూ స్పష్టమైన హామీలివ్వాలి → ఇరాన్‌పై ఆర్థిక తదితర ఆంక్షలను పూర్తిగా ఎత్తేయాలి → ఇరాన్ పునర్నిర్మాణానికి పూర్తిస్థాయిలో నిధులివ్వాలి → హార్మూజ్‌ను పూర్తిస్థాయిలో తెరవాలంటే మేం రూపొందించే ప్రొటోకాల్స్‌కు కట్టుబడాలి -
ఇరాన్‌తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు
పశ్చిమాసియాలో యుద్ధ భయాల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత్ వంటి ఇంధన అవసరాలు అధికంగా ఉన్న దేశాలు ఇరాన్‌తో జరిపిన చర్చలు సఫలం కావడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.రెండు రోజుల్లో 21 నౌకల ప్రయాణంగత వారాంతంలో ఈ జలమార్గం గుండా ఏకంగా 21 నౌకలు ప్రయాణించాయి. మార్చి మొదటి వారంలో ట్రాఫిక్ నిలిచిపోయిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో నౌకలు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ 21 నౌకలలో 13 నౌకలు ఇప్పటికే అరేబియా సముద్రంలోకి చేరుకున్నాయి. ఇరాన్ నౌకల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ మిత్రదేశం అనే కారణంతో ఇరాక్ ముడి చమురు ట్యాంకర్లకు టెహ్రాన్ ప్రత్యేక మినహాయింపునిచ్చింది. భారతదేశం ఇరాన్‌తో జరిపిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా ఎనిమిది ఎల్పీజీ ట్యాంకర్లు ఈ మార్గం ద్వారా సురక్షితంగా బయటపడ్డాయి.అగ్రరాజ్యం హెచ్చరికలుయుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని, ఆ దేశానికి నరకం చూపిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. నౌకల ప్రయాణంపై టోల్ వసూలు చేసే ప్రక్రియను చట్టబద్ధం చేస్తూ కొత్త నిబంధనలను తీసుకువస్తామని చెప్పింది. యుద్ధం వల్ల కలిగే నష్టాలను ఈ రుసుములతోనే భర్తీ చేస్తామని టెహ్రాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి భారత్, చైనా, గ్రీస్, టర్కీ, థాయ్‌లాండ్ దేశాలకు చెందిన నౌకలు ఇరాన్ సూచించిన తీర ప్రాంత మార్గాల గుండా ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. అయినప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య రంగాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు! -
25 లక్షల టన్నుల యూరియా దిగుమతికి రంగం సిద్ధం
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత లేకుండా చూసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా దిగుమతిదారు అయిన భారతదేశం సుమారు 2.5 మిలియన్ (25 లక్షల) టన్నుల యూరియాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.టెండర్ల జారీప్రభుత్వ పక్షాన ఎరువుల కొనుగోళ్లు జరిపే ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) ఇటీవల భారీ అంతర్జాతీయ టెండర్‌ను జారీ చేసింది. ఈ టెండర్ ద్వారా 1.5 మిలియన్ టన్నుల యూరియాను పశ్చిమ తీర నౌకాశ్రయాల ద్వారా దిగుమతి చేసుకోనున్నారు. మిగిలిన మొత్తాన్ని తూర్పు తీర ప్రాంతాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎరువుల రవాణా నౌకలు జూన్ 14వ తేదీ నాటికి సంబంధిత ఓడరేవుల నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. టెండర్ల ఆఫర్ల సమర్పణకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా, ఇవి ఏప్రిల్ 23 వరకు చెల్లుబాటులో ఉంటాయి.భారతదేశ యూరియా ఉత్పత్తి ప్రధానంగా సహజ వాయువుపై ఆధారపడి ఉంటుంది. దేశీయంగా వినియోగించే సహజ వాయువులో మెజారిటీ భాగం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి అవుతోంది. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల హార్మూజ్ జలసంధి వద్ద రాకపోకలకు ఆటంకం కలగడంతో ఎల్ఎన్జీ కొరత ఏర్పడింది. ఈ ప్రభావంతో గత నెలలో దేశంలోని కొన్ని కీలక ఎరువుల ప్లాంట్లు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.ఖరీఫ్ సన్నద్ధత - నిల్వల వివరాలుజూన్-సెప్టెంబర్ వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటల సాగు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు దేశవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ టన్నుల ఎరువులు అవసరమని ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ప్రస్తుత నిల్వ 18 మిలియన్ టన్నులుగా ఉంది. మిగిలిన 21 మిలియన్ టన్నులను దేశీయ ఉత్పత్తి, ప్రస్తుత దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు! -
యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు!
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్మన్ తుహిన్ కాంత పాండే హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలు చమురు, గ్యాస్ సరఫరాలపై తీవ్ర ఆంక్షలకు దారితీసి అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.సోమవారం ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (సీఐఐ) నిర్వహించిన కార్పొరేట్ గవర్నెన్స్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, కార్పొరేట్ రంగం ఎదుర్కోవాల్సిన సవాళ్లపై వ్యాఖ్యలు చేశారు.సంక్షోభంలో ప్రపంచంగత కొన్నేళ్లుగా వ్యాపార సంస్థలు, నియంత్రణ సంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పాండే గుర్తుచేశారు. ‘కొవిడ్ సృష్టించిన అస్థిరత నుంచి కోలుకోకముందే కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతిక మార్పులు వ్యవస్థలను పరీక్షించాయి. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరోసారి ప్రమాదంలోకి నెట్టేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సంస్థాగత అంశాలు, బలమైన పాలనా పద్ధతులు అత్యంత అవసరమన్నారు.కార్పొరేట్ గవర్నెన్స్‌లో మార్పుకంపెనీల బోర్డులు కేవలం నామమాత్రంగా ఉండకూడదని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో నాణ్యత పెరగాలని సెబీ ఛైర్మన్ స్పష్టం చేశారు. ‘బోర్డు సభ్యులుగా ఎవరున్నారన్న దానికంటే వారు సంస్థ పర్యవేక్షణలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారనేది ముఖ్యం. పటిష్టమైన పాలనా ప్రమాణాల అమలులో స్వతంత్ర డైరెక్టర్లే కీలకం. వారి పనితీరును మెరుగుపరిచేందుకు సెబీ త్వరలో ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. పెరుగుతున్న సంక్లిష్ట వ్యాపార వాతావరణంలో స్వతంత్ర డైరెక్టర్లకు శిక్షణ, అవగాహన కల్పించడానికి ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని సెబీ యోచిస్తోంది’ అన్నారు.నిరంతర పర్యవేక్షణే మార్గంపాలనా పరమైన సంస్కరణల్లో భాగంగా కాలానుగుణ సమీక్షల స్థానంలో నిరంతర పర్యవేక్షణ పద్ధతిని తీసుకురావాలని పాండే సూచించారు. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడమే తదుపరి దశ పాలనా సంస్కరణల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా భారతీయ కంపెనీలు తమ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని ఈ సదస్సు వేదికగా సెబీ ఛైర్మన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు! -
ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు!
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని కుదిపేస్తోంది. మార్చి నెలలో ఏకంగా 5,500కు పైగా విమానాలు రద్దు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఏప్రిల్ నెల అంటే భారతీయులకు సెలవుల కాలం. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో చాలామంది విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం 2025లోనే సుమారు 3.27 కోట్ల మంది భారతీయులు విదేశాలకు వెళ్లారు. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ ప్రయాణం చేసేవారు కేవలం ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుందని భావిస్తే పొరపాటే. యుద్ధ సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీల నిబంధనలు పూర్తిగా మారిపోతాయి.సాధారణ సమయాల్లో ఇన్సూరెన్స్ కవరేజీ ఇలా..సాధారణంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రధానంగా ఐదు అంశాలను కవర్ చేస్తుంది.సామాను కోల్పోవడం: 300 డాలర్ల నుంచి 1,000 డాలర్ల వరకు కవరేజీ.పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడం: 200 నుంచి 300 డాలర్ల వరకు.వైద్య ఖర్చులు: 2,50,000 నుంచి 5,00,000 డాలర్లు వరకు (కనీసం 24 గంటల హాస్పిటలైజేషన్ అవసరం).ప్రమాదాలు: 20,000 నుంచి 30,000 డాలర్ల వరకు.ట్రిప్ క్యాన్సిలేషన్: అనారోగ్యం, వాతావరణం లేదా సాంకేతిక కారణాల వల్ల విమానం రద్దయితే సుమారు 1,000 డాలర్ల వరకు కవరేజీ ఉంటుంది.యుద్ధం వస్తే.. మీ పాలసీ పనిచేయదు!ఇక్కడే అసలు చిక్కు ఉంది. ఒకవేళ మీ విమానం రద్దు కావడానికి లేదా మీకు గాయాలు కావడానికి యుద్ధం ప్రత్యక్ష కారణమైతే (ఉదాహరణకు: ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడులు, రన్‌వేల మూసివేత, బాంబు దాడులు) ఇన్సూరెన్స్ కంపెనీలు పైసా కూడా చెల్లించవు. మెజారిటీ ఇన్సూరెన్స్ పాలసీల్లో ‘వార్ ఎక్స్‌క్లూజన్’ క్లాజ్ ఉంటుంది.వైద్య సాయం: యుద్ధం వల్ల కలిగే గాయాలకు (పేలుళ్ల వల్ల వచ్చే శిథిలాలు తగలడం వంటివి) ఇన్సూరెన్స్ వర్తించదు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వాల సాయం లేదా సొంత ఖర్చులపైనే ఆధారపడాలి.హోటల్ ఖర్చులు: విమానాలు రద్దయి యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకుపోతే హోటల్ ఖర్చులను ప్రయాణికులే భరించాలి లేదా ఎయిర్‌లైన్స్ ఇచ్చే వెసులుబాటును వాడుకోవాలి.సురక్షితంగా ప్రయాణించడం ఎలా?ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియా మీదుగా కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించడం ఉత్తమం. ప్రస్తుతం క్షేమంగా ఉన్న మార్గాలు.. జపాన్, చైనా, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, వియత్నాం, ఆస్ట్రేలియా. అమెరికా పశ్చిమ తీరానికి వెళ్లేవారు హాంకాంగ్ మీదుగా వెళ్లడం సురక్షితం. అలాగే యూరప్ వెళ్లే కొన్ని విమానాలు పశ్చిమాసియాను తప్పించుకుంటూ మ్యూనిచ్ వంటి నగరాల మీదుగా నడుస్తున్నాయి.ఇన్సూరెన్స్ ప్రీమియం ఎంత ఉండొచ్చు?టాటా ఏఐజీ, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, డిజిట్ వంటి కంపెనీలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. షెంజెన్ దేశాలకు వెళ్లే నలుగురు సభ్యులున్న కుటుంబానికి (ఇద్దరు పిల్లలతో కలిపి) రూ.6,500 నుంచి రూ.10,000 వరకు వసూలు చేస్తున్నాయి. అమెరికా ట్రిప్ కోసం రూ.10,000 నుంచి రూ.24,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. అయితే, విదేశీ ప్రయాణానికి వెళ్లేముందు మీ పాలసీలోని నిబంధనలు, మినహాయింపులు, షరతులు క్షుణ్ణంగా చదవాలి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎయిర్‌లైన్స్ ఇచ్చే రీఫండ్, రీషెడ్యూల్ ఆప్షన్లపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా? -
ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేదెలా?
ఒకపక్క దేశంలో వేలాది మంది ఎల్పీజీ సిలిండర్ల కోసం బారులు తీరి నిలబడితే మరోపక్క ప్రభుత్వం నుంచి ఒక విచిత్ర ప్రకటన వెలువడింది. వాతావరణ మార్పును అరికట్టేందుకు ఉద్గారాలను మరింతగా తగ్గించుకుంటామని ప్రకటించింది. శిలాజేతర ఇంధన వనరుల వైపు మళ్ళే విషయంలో నిర్దేశించుకుంటున్న లక్ష్యాలను పెంపొందించుకోవడం వినడా నికి చెవులకింపుగానే ఉంటుంది. కానీ, వంట చేసుకునేందుకు, స్కూటర్లకు, కార్లకు అవసరమైన ఇంధనం నిమిత్తం జనం అవస్థలు పడుతున్న సమయంలో ప్రభుత్వం నుంచి ఆ రకమైన ప్రకటన వెలువడటమే చోద్యం. వాతావరణ మార్పును నిరోధించే ఐక్యరాజ్య సమితి ఒడంబడిక కింద దేశాలు ప్రకటించవలసి ఉన్న లక్ష్యాలకు అనుగుణంగానే ప్రభుత్వం ఆ ప్రకటన చేసి ఉండవచ్చు. సందర్భమే వింత గొలిపేదిగా ఉంది. ఎందుకీ హెచ్చుతగ్గులు?శిలాజేతర ఇంధన వనరుల వాటాను (2031 నుంచి 2035 మధ్య కాలంలో) 60 శాతానికి పెంచుకుంటామని ప్రభుత్వం మాటి చ్చింది. వాటిని జాతీయ దృఢసంకల్ప వాగ్దానా (ఎన్డీసీ)లుగా పిలుస్తున్నారు. దానికి మార్చి 25న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 2035 నాటికి ఉండే విద్యుదుత్పాదన సామర్థ్యంలో 60 శాతం వాటా శిలాజేతర ఇంధన వనరుల ద్వారా సమ కూరుతుందని అర్థం. మన దేశం 2026 ఫిబ్రవరి నాటికే శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 52.57% మేరకు సాధించినట్లు ప్రభుత్వం చెప్పుకొంది. ప్రకటించిన తేదీల కన్నా ముందే తమ వాగ్దానాలను నిలబెట్టుకున్నామని కూడా గొప్పగా చాటుకుంది. వాస్తవంలో అటు వంటి విద్యుదుత్పాదన సామర్థ్యం 22% మాత్రమే.దేశంలో 2026 ఫిబ్రవరి నాటికి నెలసరి విద్యుదుత్పాదన సామర్థ్యంలో పునరుత్పాదక (భారీ జలవిద్యుచ్ఛక్తి, సౌర శక్తి) ఇంధన వనరుల వాటా 22.73% మాత్రమేనని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ పేర్కొంది. మొత్తం మీద (2025 ఏప్రిల్ నుంచి 2026 ఫిబ్ర వరి మధ్య కాలానికి) సంఖ్యలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఆ కాలంలోని మొత్తం విద్యుదుత్పాదనలో తాప(థర్మల్) విద్యుత్ వాటా 70.40% కాగా, పునరుత్పాదక ఇంధన వనరులది 26.16%. వాతావరణ పరిస్థితులు, వేసవి, శీతాకాలం, వర్షాకాలం వంటి అంశాల వల్ల విద్యుదుత్పాదనలో హెచ్చుతగ్గులను అర్థం చేసు కోవచ్చు. కానీ, ఇంతటి భారీ వ్యత్యాసానికి (30%) ఆ అంశాలు మాత్రమే కారణ మని అనుకోలేం. సప్లై చెయిన్లు చైనా చేతిలో...అంతర్జాతీయ ఒడంబడిక మేరకు ఐక్యరాజ్య సమితికి నివేదిస్తున్నవి కనుక ఈ సంఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిందే. ఈ సంఖ్యలను ఉటంకిస్తూ ఇంధన పరిణామ క్రమంలో తాను గ్లోబల్ లీడర్‌గా వెలుగొందుతున్నట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో భారత్ ఘనతను చాటుకుంటోంది. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్ళడం, బ్యాటరీలతో నడిచే వాహనాల వైపు మొగ్గు చూపడం వంటి అంశాలు భౌగోళిక రాజకీయాలు, శిలాజ ఇంధనాల సరఫరాలకు దిగుమతులపై ఆధారపడటం వంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి. పవన, సౌర విద్యుదుత్పాదన కూడా ఒక రకంగా కీలక సామగ్రి, సబ్–సిస్టంలు, ఎక్విప్మెంట్ దిగుమతులపై ఆధారపడి ఉంది. తిరిగి ఈ దిగుమతు లలో చాలా భాగం గ్లోబల్ సప్లై చెయిన్లతో ముడిపడి ఉన్నాయి. వాటిలో చాలా భాగం చైనా అధీనంలో ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన వనరుల పరికరాల తయారీకి రేర్ ఎర్త్ మెటల్స్ అవసరం. అవి చైనా చేతిలో ఉన్నాయి. బ్యాటరీలు, విండ్ టర్బైన్లు వంటి రేర్ ఎర్త్ ఇన్పుట్స్ హెచ్చుగా ఉన్న సబ్–సిస్టంల దిగుమతికి మనం ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతున్నాం. కాలుష్య రహిత శక్తి వినియోగంలో చాలా వాటికి లిథియం బ్యాట రీలు కావాలి. వాటిలో శక్తిని నిల్వ చేయడం కుదురుతుంది. తెలుపు రంగులో ఉండే ఈ క్షార లోహానికీ చైనాయే ప్రధాన సరఫరాదారు. ప్రపంచవ్యాప్తంగా సోలార్ ఫొటో–వోల్టాయిక్ వ్యాఫర్ ఉత్ప త్తిలో 2023 నాటికే 98% చైనా గుప్పెట్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విండ్ టర్బైన్ల తయారీలో 70% చైనాయే చేజిక్కించుకున్నట్లు చెబు తున్నారు. హరిత హైడ్రోజన్ ఉత్పాదనలో, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ల ఉత్పత్తిలో చైనా 2024 నాటికే ఏకైక పెద్ద ఉత్పత్తిదారుగా నిలిచిందని యూరోపియన్ యూనియన్ ఇన్స్టిట్యూట్ ఇటీవల జరిపిన అధ్య యనంలో వెల్లడైంది. కీలక వస్తువుల ఎగుమతులు, టెక్నాలజీ బదిలీపై చైనా ఆంక్షలు విధించింది. మిగిలిన దేశాలు పారిశ్రామికంగా తనపై ఆధారపడ టాన్ని చైనా ఒక ఆయుధంగా మలుచుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే, గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళడం కూడా భౌగోళిక రాజకీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని తేలుతోంది. పరికరాల విషయంలో చైనాపై ఆధారపడటం వల్ల మరో బెడద ఉంది. దాని నుంచి గ్రిడ్లు దిగుమతి చేసుకుంటే, వాటిలో అది నిక్షిప్తం చేసిన కంట్రోళ్ళ వల్ల అవాంత రాలు ఏర్పడవచ్చు. భద్రతాపరంగా అది ముప్పే! సోలార్ ఇన్స్టలే షన్లతో బ్యాక్–డోర్ కమ్యూనికేషన్‌కు ఉద్దేశించిన ఇన్వెర్టర్లను చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంది. వాటిలో తమకు అంతు బట్టని మరికొన్ని భాగాలు ఉన్నట్లు అమెరికా గతేడాది గుర్తించింది. ప్రత్యామ్నాయమే శరణ్యంపశ్చిమాసియాలో యుద్ధం ప్రపంచాన్ని ఇంధన సంక్షోభానికి గురి చేసింది. ప్రపంచ చమురు మార్కెట్ చరిత్రలో, సరఫరాలో ఇంతటి విఘాతం ఎన్నడూ ఏర్పడలేదని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజన్సీ చెబుతోంది. ఎంతమాత్రం వీలున్నా సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయాలని కోరాలని చెప్పింది. హైవేలలో వేగాన్ని గంటకు కనీసం 10 కిలోమీటర్ల మేరకైనా తగ్గించాలని చెప్పింది. ప్రైవేటు కార్ల బదులు బస్సులు, రైళ్ళ వాడకానికి మారాలని సూచించింది. వాహనాలు కూడా అన్నీ రోజూ రోడ్డుపైకి రాకుండా సరి, బేసి సంఖ్యల పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పింది. ఎల్పీజీ వంటింటికి ఎక్కువ అవసరం కనుక, దాన్ని ఉపయోగించే వాహనాలు పెట్రో లుకు మారాలని పేర్కొంది. ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు ఉన్నపుడు విమాన ప్రయాణాల జోలికి వెళ్ళవద్దంది. చాలా దేశాలు తమ పరిస్థితులను బట్టి వాటిలో కొన్నింటిని అమలులోకి తెస్తు న్నాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సంప్రదాయ, పునరుత్పా దక ఇంధన వనరుల పరిశోధన–అభివృద్ధిపై గణనీయమైన పెట్టు బడులు పెట్టక తప్పదు. ఇంధన రంగానికి అంకితమైన పరిశోధన కేంద్రాలు మన దేశంలోనూ చాలా ఉన్నాయి. కానీ, అవి పారిశ్రామిక స్థాయిలో ఆలోచించకుండా వేటికవి విడివిడిగా పనిచేస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనం వైపు ఏనాడో మళ్ళిన దేశాలలో భారత్ కూడా ఉంది. సోలార్ కుక్కర్లు, హీటర్లు, బయోమాస్, బయోగ్యాస్, చివరకు బ్యాట రీలతో నడిచే బస్సుల వాడకంలో కూడా చొరవ చూపిన దేశాల్లో మనమూ ఉన్నాం. 1973లో ఎదుర్కొన్న చమురు సంక్షోభంతోనే ఆ దిశగా ఆలోచించాం. భౌగోళిక రాజకీయ వాస్తవికతల నేపథ్యంలో ఇంధన భద్రత ప్రణాళికా పటాన్ని తిరిగి రూపొందించుకోవాలి.దినేశ్ సి. శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత -
ట్రంప్ పాచిక పారేనా?
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నుంచి సులభంగా నిష్క్రమించగలరా? అనే ప్రశ్న వస్తోంది. ఈ అనిశ్చితుల నేపథ్యంలో చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లు విలువ పరంగా ఇటీవల కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భౌగోళిక రాజకీయ పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి.వ్యూహాత్మక ఆధిపత్యం: ఇరాన్ ఎందుకు కీలకం?గత కొంతకాలంగా ఇజ్రాయెల్-అమెరికా కూటమి గాజా, సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో తమ వ్యతిరేక శక్తులను క్రమపద్ధతిలో బలహీనపరుస్తూ వస్తున్నాయి. గల్ఫ్ దేశాలు పాలస్తీనాకు సానుభూతి తెలుపుతున్నట్లు కనిపిస్తున్నా లోలోపల అమెరికా రక్షణ గొడుగు కిందకే చేరుతున్నాయి. గల్ఫ్ దేశాల సంపద అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడిగా మారుతూ యూఎస్ ఆర్థిక ఆధిపత్యాన్ని బలపరుస్తోంది.అయితే, ఈ పూర్తిస్థాయి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది ఇరాన్, దాని ప్రాక్సీలు (హిజ్బుల్లా, హౌతీలు). హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం ద్వారా చైనా వంటి ఆసియా దేశాల ఇంధన సరఫరాను నియంత్రించే ‘ట్రంప్ కార్డ్’ అమెరికాకు ఇక్కడే దొరుకుతుంది. అందుకే ఈ దశలో యుద్ధం నుంచి వైదొలగడం అంటే ఇరాన్ సామీప్య శక్తులకు తలవంచడమే అవుతుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అమెరికా చర్యలను ఇరాన్ ప్రతిఘటిస్తుండడం అగ్రరాజ్యానికి మింగుడుపడడం లేదు. దాంతో యూఎస్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. అందుకు తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్పింది.ఆర్థిక సంక్షోభంఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బదీస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థికవేత్త కెన్నెత్ రోగోఫ్ హెచ్చరించినట్లుగా, ఐదు దశాబ్దాల్లో ప్రపంచం చూడని అతిపెద్ద స్టాగ్ఫ్లేషనరీ ముప్పు (ఆర్థిక మందగమనం + అధిక ద్రవ్యోల్బణం) దిశగా ఈ యుద్ధం దారితీస్తోంది. మార్చి నెల జేపీ మోర్గాన్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ప్రకారం, ఇన్పుట్ ధరల ద్రవ్యోల్బణం 44 నెలల గరిష్టానికి చేరింది. ఇది వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లింది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, చమురు, ఎరువుల సరఫరాలో అంతరాయం, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం, గల్ఫ్ నుంచి వచ్చే రెమిటెన్స్‌లు తగ్గడం వంటి అంశాలు రూపాయి విలువను మరింత పాతాళానికి నెట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రతిచర్యగా ఆర్బీఐ ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది.భారత మార్కెట్లు - రంగాల వారీ విశ్లేషణవిమానయానం, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలు పెరిగిన ఇంధన, ముడిసరుకు ధరల వల్ల ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.రక్షణ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. యుద్ధతంత్రంలో మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే భారతీయ రక్షణ కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశం.రసాయన, సిరామిక్ రంగాల్లో కొన్ని బలహీనమైన సంస్థలు నిష్క్రమించి, పటిష్టమైన కంపెనీలకు మార్కెట్ వాటా పెరిగే అవకాశం ఉంది.ట్రంప్ ఏం చేయబోతున్నారు?ప్రముఖ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎంత దారుణంగా నిర్వహించినా చివరకు తనే గెలిచినట్లు ప్రకటించుకుని వైదొలిగే అవకాశం ఉంది. ఆయనకు ఓటమిని అంగీకరించే అలవాటు లేదు. యుద్ధం ముగిసినా దాని వల్ల కలిగే ఆర్థిక పర్యవసానాలు మాత్రం దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి అనిశ్చిత సమయంలో పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వేచి చూసే ధోరణి ఉత్తమం.ఇదీ చదవండి: వైద్యరంగానికి ‘సహకారి’ కరవు -
వంతెనలు.. అభివృద్ధికి వారధులు
పశ్చిమాసియాలో భీకరపోరు కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను, పశ్చిమ నగరమైన కరాజ్‌తో అనుసంధానిస్తూ సుమారు 136 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్న అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై అమెరికా తాజాగా జరిపిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగానే కాకుండా ఒక దేశ ఆర్థిక వెన్నెముకపై దెబ్బకొట్టే వ్యూహంగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.ఆర్థికాభివృద్ధికి వంతెనలే ప్రాణాధారంఏ దేశానికైనా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. వంతెనలు ఇరు ప్రాంతాలను కలపడంతోపాటు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటి వల్ల..ప్రయాణ దూరాన్ని తగ్గించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.పారిశ్రామిక హబ్‌లను నౌకాశ్రయాలతో లేదా మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి.భారీ వంతెనల నిర్మాణం వల్ల వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.సరిహద్దు ప్రాంతాలకు సైనిక బలగాలను, సామగ్రిని వేగంగా తరలించడానికి వంతెనలు కీలకం.దేశ ప్రగతికి నిదర్శనాలుభారతదేశం కూడా గత దశాబ్ద కాలంలో అద్భుతమైన వంతెనలను నిర్మించి తన ఆర్థిక శక్తిని చాటుకుంది.అటల్ సేతు: ముంబై - నవీ ముంబైలను కలిపే ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన. ఇది పారిశ్రామిక కారిడార్లకు ఊపిరిపోస్తోంది.చీనాబ్ వంతెన: జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఇది వ్యూహాత్మకంగా, పర్యాటక పరంగా భారత్‌కు ఎంతో కీలకం.ధోలా-సాదియా వంతెన: అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనే మార్చివేసింది.నెక్ట్స్ ‘కింగ్ ఫహాద్ కాజ్వే’?ఇరాన్ వంతెనపై దాడి నేపథ్యంలో కింగ్ ఫహాద్ కాజ్వే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియాను బహ్రెయిన్‌తో కలిపే ఈ 25 కిలోమీటర్ల భారీ వంతెన మిడిల్ఈస్ట్లో అత్యంత కీలకమైన రవాణా మార్గం. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళన నెలకొంది. ఒకవేళ కింగ్ ఫహాద్ కాజ్వే వంటి వంతెనలు దెబ్బతింటే గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోతుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు! -
మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు!
పశ్చిమాసియాలోని యుద్ధ భయం భారత్‌లో మందుబాబుల పాలిట శాపంగా మారింది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు మన దేశంలోని మద్యం బాటిళ్ల ధరలను పెంచేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వీటి ధరలు పెరగకపోయినా సమీప భవిష్యత్తులో మద్యం మరింత ప్రియం కానుందని కొందరు భావిస్తున్నారు.బాటిళ్ల తయారీకి గ్యాస్ సెగమద్యం తయారీలో ముడిసరుకు కంటే ప్యాకేజింగ్ ఖర్చే ఇప్పుడు కంపెనీలకు భారంగా మారింది. దీనికి ప్రధాన కారణం సహజ వాయువు. మద్యం బాటిళ్లు తయారు చేసే గాజు ఫర్నెస్‌లను(కొలిమి) నిరంతరం మండించాలంటే గ్యాస్ తప్పనిసరి. బీర్ తయారీ ఖర్చులో ప్యాకేజింగ్ వాటా సుమారు 40% కాగా, స్పిరిట్స్ (విస్కీ, బ్రాండీ తదితరాలు)లో ఇది 20% వరకు ఉంటుంది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సహజ వాయువు దిగుమతిదారు అయిన భారత్ తన అవసరాల కోసం 40% వరకు ఖతార్ పైనే ఆధారపడుతోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే అది నేరుగా గాజు బాటిళ్ల ఉత్పత్తిపై దెబ్బకొడుతుంది.ధరల పెరుగుదల ఎంత ఉండవచ్చు?ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ (ఐఎండబ్ల్యూఏ) డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రాజేష్ చోప్రా అంచనా ప్రకారం, కేవలం గ్యాస్ ధరల వల్లే గాజు బాటిళ్ల ధర 15-20% పెరిగింది. దీనికి అదనంగా షిప్పింగ్ ఛార్జీలు తోడవ్వడంతో కంపెనీలు బ్రాండ్ల వారీగా 10-15% ధరల సవరణ కోరుతున్నాయి. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లలో ఈ ప్రభావం తక్షణమే కనిపించనుంది.బీర్ కొరత పొంచి ఉందా?వేసవి కాలం బీర్లకు గరిష్ట డిమాండ్ ఉండే సమయం. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో సరఫరా తగ్గితే వినియోగదారులు ఇబ్బందులు పడక తప్పదు. ‘గ్యాస్ లభ్యత తగ్గితే గాజు ఫర్నెస్‌లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. ఫలితంగా బాటిళ్ల కొరత ఏర్పడి పీక్ సీజన్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా ఉండకపోవచ్చు’ అని మెడుసా బేవరేజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్దీప్ సింగ్ హెచ్చరించారు. ప్రస్తుతం పరిశ్రమ ఇప్పటికే 12-13 కోట్ల బాటిళ్ల వార్షిక కొరతను ఎదుర్కొంటోంది. అల్యూమినియం ధరలు కూడా 15% పెరగడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.ఇన్వెంటరీయే రక్షణ కవచంప్రస్తుతానికి కొన్ని కంపెనీలు ముందస్తు జాగ్రత్తలతో గండం నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తున్నాయి. రాడికో ఖైతాన్ కంపెనీకి సొంత పవర్ ప్లాంట్ ఉండటం వల్ల ఇంధన ధరల అస్థిరత నుంచి కొంత ఉపశమనం లభిస్తోంది. అలైడ్ బ్లెండర్స్ తమ వద్ద ఒకటిన్నర నెలలకు సరిపడా గాజు బాటిళ్ల స్టాక్ ఉందని, ఇది తక్షణ షాక్ నుంచి కాపాడుతుందని పేర్కొంది.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
త్వరలోనే ఖేల్ ఖతం
వాషింగ్టన్: ఇరాన్లో కీలక వ్యూహాత్మక లక్ష్యాలు పూర్తి కావొస్తున్నాయని, తమ సైనిక దళాలు త్వరలోనే అక్కడ పని పూర్తి చేస్తాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధాన్ని గట్టిగా సమర్థించారు. ట్రంప్ బుధవారం రాత్రి జాతినుద్దేశించి దాదాపు 20 నిమిషాలపాటు ప్రసంగించారు. పశ్చిమాసియాలో కల్లోలం మొదలైన తర్వాత ఆయన ప్రైమ్–టైమ్ ప్రసంగం చేయడం ఇదే మొదటిసారి. అమెరికా సైన్యం ఇప్పటికే ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిందని అన్నారు. తమ లక్ష్యాలన్నీ ఇప్పటివరకు నెరవేరాయని, కొన్నిసార్లు లక్ష్యం కంటే ఎక్కువే సాధించామని చెప్పారు. స్వల్పకాలంలో ఇరాన్ వరుస దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని హెచ్చరించారు. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చారు. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని ట్రంప్ గుర్తుచేశారు అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. అయితే, ఇరాన్‌పై భూతల దాడుల గురించి ట్రంప్ ప్రస్తావించలేదు. నాటో కూటమి తీరుపైనా స్పందించలేదు. నాటో దేశాలు తమకు సహకరించడం లేదని ఆయన కొన్నిరోజులుగా అసంతృప్తి వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌తో చర్చల గురించి కూడా మాట్లాడలేదు. ట్రంప్ తన ప్రసంగంలో ఇంకా ఏం చెప్పారంటే.. హార్మూజ్‌ను స్వాధీనం చేసుకోండి ‘‘అమెరికా సైన్యం గతంలో ఎన్నో యుద్ధాల్లో పోరాటం సాగించింది. ఇరాన్‌పై పోరు 32 రోజులకు చేరింది. ఈ యుద్ధం ముగించడానికి కొంత సమయం పడుతుంది. రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, ఇరాక్ యుద్ధాలు సంవత్సరాలపాటు కొనసాగాయి. ఇరాక్ యుద్ధభూమిలో అమెరికా సాయుధ బలగాలు వేగవంతమైన, నిర్ణయాత్మకమైన, తిరుగులేని విజయాలు సాధించాయి. అమెరికా సైనిక చర్య చాలా శక్తివంతమైనది, అద్భుతమైనది. అమెరికా అత్యంత శక్తివంతమైన దేశం అనే సంగతి మర్చిపోవద్దు. ఇరాన్‌లోని యురేనియం స్వా«దీనం చేసుకోవడానికే ఈ యుద్ధం ప్రారంభించామన్న వాదనలో నిజం లేదు. ఇరాన్ అణు కేంద్రాలను చాలావరకు ధ్వంసం చేశాం. అక్కడున్న అణు ధూళి దగ్గరికి చేరడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఉపగ్రహాలతో నిఘా కొనసాగుతుంది. మరోసారి అణ్వ్రస్తాల ఆలోచన చేస్తే క్షిపణులతో చావుదెబ్బ కొడతాం. హార్మూజ్ విషయంలో ప్రపంచదేశాలు ఇప్పటిదాకా వాయిదా వేసుకున్న ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. వెంటనే వెళ్లి ఆ జలసంధిని చేజిక్కించుకోవాలి. ఈ యుద్ధం.. భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి నా అధ్యక్ష పదవీకాలంలో గత ఐదేళ్లుగా అమెరికా విజయాలు సాధిస్తూనే ఉంది. ఇప్పుడు మునుపెన్నడూ లేనట్టి ఘన విజయం సాధించబోతున్నాం. అమెరికాతోపాటు ప్రపంచ భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ క్యూరీ ప్రారంభించాం. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడానికి ఎంతమాత్రం వీల్లేదు. అలాంటి ఆయుధాలు ఉండడం మనకు భరించలేని ముప్పు అవుతుంది. గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేశాం. అయినా సరే అక్కడ అణ్వాయుధ కార్యకలాపాలు ఆగడం లేదు. మరోచోట అణు కేంద్రాలు నిర్మించాలని చూస్తున్నారు. అణ్వాయుధాలపై ఇరాన్‌కు ఆశలు చావడం లేదు. నేరుగా అమెరికా భూభాగంపై దాడిచేసేలా బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ తయారు చేస్తోంది. ఇరాన్‌పై యుద్ధంతో అమెరికాకు తప్పనిసరిగా మేలు జరుగుతుంది. అమెరికా మరింత మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇది మీ పిల్లలు, మీ మనవళ్ల భవిష్యత్తు కోసం పెడుతున్న నిజమైన పెట్టుబడి’’అని ట్రంప్ తమ దేశ పౌరులకు తేల్చిచెప్పారు. అమెరికన్లకు అంత ఓపిక ఉందా? ఇరాన్‌పై యుద్ధం కొనసాగించడానికి అమెరికా ప్రజలకు ఓపిక ఉందో లేదో తనకు తెలియదని ట్రంప్ అన్నారు. బుధవారం వైట్‌హౌస్‌లో ఈస్టర్ విందు కార్యక్రమంలో అతిథులతో ఆయన ముచ్చటించారు. ఇరాన్ చమురును అత్యంత సులభంగా స్వా«దీనం చేసుకోగల సత్తా అమెరికాకు ఉందని చెప్పారు. కానీ, అలాంటి ప్రయత్నం పట్ల అమెరికన్లలో తగినంత సహనం ఉన్నట్లు కనిపించకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యుద్ధం ముగిసిపోవాలని వారు కోరుకుంటున్నారని ఆక్షేపించారు. ఇరాన్ చమురును తీసుకురావడానికే తాను ఇష్టపడుతున్నానని తెలిపారు. కానీ, తమ ప్రజలు మాత్రం ఇరాన్లో గెలిచేసి, ఇంటికి తిరిగి రండి అంటున్నారని విమర్శించారు. వారే అలా అంటే ఇక తాను చేసేది ఏముంటుందని నిర్వేదం వ్యక్తంచేశారు. నాటో ఒకకాగితం పులి హార్మూజ్‌ను తెరిపించడానికి చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు చొరవ తీసుకోవాలని ట్రంప్ సూచించారు. కొన్ని ఆసియా దేశాలు అమెరికా చమురు కంటే గల్ఫ్ చమురుపై అధికంగా ఆధారపడుతున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. నాటో కూటమిని సైతం దూషించారు. అందులో పనికిమాలిన భాగస్వామ్య దేశాలు ఉన్నాయని మండిపడ్డారు. నాటో ఒక పేపర్ టైగర్ అంటూ ఎద్దేవా చేశారు. నాటోతో తమకు అవసరం లేదని, తమ అవసరమే వారికి ఉంటుందని తేల్చిచెప్పారు. అసలు అమెరికా లేకపోతే నాటో పట్టుకొచ్చేదా? అని ప్రశ్నించారు. ఈస్టర్ విందులో ట్రంప్ మాట్లాడిన వీడియోను ఓ వార్తా సంస్థ సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
పెట్రోకెమికల్ ఉత్పత్తులపై సుంకం మినహాయింపు
న్యూఢిల్లీ: కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను తాత్కాలికంగా (జూన్ 30 వరకు) మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. మెథనాల్, అనిహిడ్రస్ అమ్మోనియా, టోల్యూన్, స్టైరిన్, డైక్లోరో మెథేన్ (మెథిలిన్ క్లోరైడ్), వినిల్ క్లోరైడ్ మోనోమర్, పాలీ బూటాడీన్, స్టైరిన్ బూటాడీన్, అన్‌శాచురేటెడ్ పాలిస్టర్ రెజిన్లను సుంకాల్లేకుండా దిగుమతి చేసు కోవచ్చు. ఈ నిర్ణయం ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్, టెక్స్‌టైల్స్‌తోపాటు ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, ఆటో విడిభాగాల తయారీ సంస్థలకు ఉపశమనం కల్పించనుంది. పశ్చిమాసియా సంక్షోభంతో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరా స్థిరంగా ఉండేందుకు ప్రభుత్వ నిర్ణయం సాయం చేయనుంది. ఈ చర్యతో ప్రభుత్వ ఖజానాపై రూ.1,800 కోట్ల భారం పడినప్పటికీ.. ధరలస్థిరత్వానికి, ఉత్పత్తి, సరఫరా కొనసాగేందుకు సాయపడుతుందని పరోక్ష పన్నుల కేంద్ర మండలి సభ్యుడు సంజయ్ మంగల్ తెలిపారు. అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయిన నేపథ్యంలో వినియోగదారులపై ఈ భారం పడకుండా.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తాజాగా తగించడం తెలిసిందే. -
ఒక్క ఉద్యోగమూ పోదు.. దుబాయ్ కంపెనీ అధినేత హామీ
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉద్యోగుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలకు దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సాజన్ తెరదించారు. తన సంస్థలో పనిచేస్తున్న 6,000 మందికి పైగా ఉద్యోగులకు ఆయన కొండంత అండగా నిలిచారు. ఈ క్లిష్ట సమయంలో ఎవరి ఉద్యోగానికి డోకా లేదని, అందరికీ సకాలంలో వేతనాలు అందుతాయని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.కుటుంబంలా అండగా ఉంటాంఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిజ్వాన్ సాజన్ స్పందిస్తూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. "మా 6,000 మందికి పైగా ఉద్యోగులు మమ్మల్ని విశ్వసించి, డానుబే గ్రూప్‌ను ఇటుక ఇటుక పేర్చి నిర్మించారు. నేడు వారికి అండగా నిలవడం నా కనీస బాధ్యత. మా గ్రూప్‌లో ఎటువంటి తొలగింపులు ఉండవు, అందరికీ జీతాలు సకాలంలో అందుతాయి" అని ఆయన ప్రకటించారు.ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇది 6,000 మంది ఉద్యోగుల విషయం మాత్రమే కాదు, 6,000 కుటుంబాల జీవనాధారం. మీరు నిజమైన నాయకుడు" అంటూ నెటిజన్లు ఆయనను కొనియాడుతున్నారు.హార్డ్‌వేర్ షాప్ నుంచి బిలియనీర్ స్థాయికి..రిజ్వాన్ సాజన్ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1993లో కేవలం కొన్ని వేల దిర్హామ్‌లతో దుబాయ్‌లో అడుగుపెట్టిన ఆయన, మొదట ఒక హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేశారు. 1993లోనే 'డానుబే' పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014లో 'డానుబే ప్రాపర్టీస్'ను స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించారు. ఆయన సంస్థ నేడు సుమారు 5.13 బిలియన్ దిర్హామ్‌ల వార్షిక ఆదాయాన్ని గడిస్తోంది. దుబాయ్‌తో పాటు భారత్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, చైనా దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఇటీవల దుబాయ్‌లో 55 అంతస్తుల వాణిజ్య టవర్‌ను నిర్మించి, దానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పేరు పెట్టడం విశేషం. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ప్రకటించిన "2025 టాప్ 10 అత్యంత ప్రభావవంతమైన రియల్ ఎస్టేట్ లీడర్స్" జాబితాలో రిజ్వాన్ సాజన్ చోటు సంపాదించుకున్నారు. సంక్షోభ సమయాల్లో కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో, రిజ్వాన్ సాజన్ తీసుకున్న ఈ నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. View this post on Instagram A post shared by Rizwan Sajan (@rizwan.sajan) -
పాకిస్థాన్‌కు వీసా నిలిపివేసిన ఖతార్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు వివిధ దేశాల్లోని దౌత్య, రవాణా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు, దానికి అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు ఇప్పటివరకు కల్పిస్తున్న ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.రాయబార కార్యాలయం ప్రకటనవీసా ఆన్ అరైవల్ అంటే ఒక దేశానికి వెళ్లాలనుకునే ప్రయాణికులు తమ స్వదేశంలోనే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. నేరుగా ఆ దేశానికి చేరుకున్న తర్వాత అక్కడి విమానాశ్రయంలోనో లేదా సరిహద్దు చెక్-పోస్ట్ వద్దనో వీసా పొందవచ్చు. ఈ తాజా పరిణామంపై దోహాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఖతార్ ఈ నిర్ణయం తీసుకుందని, పాక్ పౌరులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే ముందస్తుగానే వీసాలు పొందాలి’ అని పాక్ ఎంబసీ స్పష్టం చేసింది.ఎవరిపై ప్రభావం?ఖతార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల తక్షణం పనుల నిమిత్తం వెళ్లే వ్యాపారులకు ఇది సమస్యగా మారుతంది. స్వల్పకాలిక ప్రాజెక్టుల కోసం వెళ్లే నిపుణులు, వీసా నిబంధనల సరళీకరణతో ఖతార్ వెళ్లాలనుకున్న సందర్శకులకు ఇది అవాంతరంగా మారుతుంది. కేవలం పాకిస్థానే కాకుండా లెబనాన్ పౌరులపై కూడా ఖతార్ ఇవే ఆంక్షలు విధించింది. లెబనాన్ నుంచి వచ్చే వారు ఇప్పుడు అధికారిక ‘Hayya.qa’ ప్లాట్‌ఫారమ్ ద్వారా ముందుగా వీసా పొంది దాని ప్రింటెడ్ కాపీని వెంట ఉంచుకోవడం తప్పనిసరి.ఎందుకీ నిర్ణయంఖతార్ ప్రభుత్వం పాకిస్థాన్, లెబనాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని నిలిపివేయడం వెనుక ప్రధానంగా భద్రతా, దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఖతార్ భౌగోళికంగా ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉంది. దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనే అంశంపై పూర్తి నియంత్రణ సాధించాలని ఖతార్ భావిస్తోంది. వీసా ఆన్ అరైవల్ ఇస్తే ప్రయాణికుల పూర్తి నేపథ్యాన్ని వారు దేశానికి రాకముందే పరిశీలించడం కష్టం. అదే ముందస్తు వీసా అయితే, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.దౌత్యపరమైన వ్యూహాలు - పాక్ ప్రతిపాదనమరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో పాకిస్థాన్ కొన్ని ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ హార్మూజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరించాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని పాక్ కోరుతోంది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ బుధవారం టర్కీ, పాకిస్థాన్, ఖతార్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది! -
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్‌ల వంతు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిణామాలు కేవలం పెట్రోల్ ధరలనో, స్టాక్ మార్కెట్లనో ప్రభావితం చేస్తాయని భావిస్తే పొరపాటే. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న భీకర పోరు ఇప్పుడు సామాన్యుడి వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా దేశంలోని కండోమ్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతీయ రబ్బరు పరిశ్రమ వర్గాల తాజా సమాచారం ప్రకారం, కండోమ్‌ల తయారీ వ్యయం గణనీయంగా పెరగడమే కాకుండా సరఫరా గొలుసు పూర్తిగా అస్తవ్యస్తమైంది.ఏమిటీ సమస్య?భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కండోమ్ తయారీదారులలో ఒకటి. అయితే, ఈ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా ఇప్పుడు యుద్ధం కారణంగా సంక్షోభంలో పడింది. కండోమ్ తయారీలో వాడే సింథటిక్ రబ్బరు, ఇతర పెట్రోకెమికల్ అనుబంధ పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.ఎందుకు ఈ అంతరాయం?కండోమ్‌ల తయారీలో వాడే పాలిమర్లు, సింథటిక్ రబ్బరు, లూబ్రికెంట్లు ముడి చమురు ఉప ఉత్పత్తులు. యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధర పెరగడంతో వీటి తయారీ వ్యయం 30% నుంచి 40% వరకు పెరిగింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా భారత్‌కు వచ్చే రసాయనాలు, గ్యాస్ సరఫరా నిలిచిపోవడం లేదా ఆలస్యం కావడం వల్ల ఉత్పత్తి కేంద్రాల్లో ముడి పదార్థాల కొరత ఏర్పడింది. ఎర్ర సముద్రం ప్రాంతంలో అస్థిరత వల్ల నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో రావాల్సి వస్తోంది. దీనివల్ల ఫ్రైట్ ఛార్జీలు పెరగడంతోపాటు డెలివరీ సమయం 20 రోజుల నుంచి 40 రోజులకు పెరిగింది.ఎవరు ప్రభావితమవుతున్నారు?దేశంలోని దిగ్గజ కండోమ్ తయారీ సంస్థలు పెరిగిన ఖర్చులను భరించలేక ఇప్పటికే తమ ఉత్పత్తుల ధరలను 10% నుంచి 20% వరకు పెంచే యోచనలో ఉన్నాయి. భారత్ నుంచి ఆఫ్రికా, ఐరోపా దేశాలకు జరిగే కండోమ్ ఎగుమతులు మందగించాయి. ఇది దేశీయ విదేశీ మారక నిల్వలపై కూడా ప్రభావం చూపుతుంది. ఉచితంగా పంపిణీ చేసే గర్భనిరోధక సాధనాల కోసం ప్రభుత్వం వెచ్చించే బడ్జెట్ భారం పెరగనుంది.ఎక్కడ ప్రభావం ఎక్కువగా ఉంది?భారతదేశంలో రబ్బరు ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్న కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోని తయారీ యూనిట్లు ఈ ముడి పదార్థాల కొరతను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సింథటిక్ రబ్బరు కోసం మనం సుమారు 48% దిగుమతులపైనే ఆధారపడుతున్నాం.ఎంత మేర నష్టం?గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల రబ్బరు రసాయనాల దిగుమతి వ్యయం భారీగా పెరిగింది. పరిశ్రమ వర్గాల లెక్కల ప్రకారం, పెరిగిన లాజిస్టిక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియంల వల్ల ఒక్కో కంటైనర్ రవాణా ఖర్చు రెట్టింపు అయ్యింది.ముందున్న సవాళ్లుయుద్ధం మరికొంత కాలం కొనసాగితే కేవలం కండోమ్‌లే కాకుండా గ్లౌజులు, క్యాథెటర్లు వంటి వైద్య పరికరాల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారనున్నాయి. గ్లోబల్ సప్లై చైన్ ఎంతటి సున్నితమైనదో ఈ పరిస్థితి అర్థం చేస్తోంది. ఇంధన భద్రతతో పాటు రసాయన ముడి పదార్థాల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత -
పశ్చిమాసియా యుద్ధం మరింత కాలం కొనసాగితే?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు ఇలాగే కొనసాగితే (ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా), దీని కారణంగా దేశీ పరిశ్రమలపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు, ఉపశమన ప్యాకేజీలను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో, దేశీయంగా వినియోగదారులపై ఈ ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.3 ఎక్సైజ్ సుంకం తగ్గించగా, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. అదేవిధంగా దేశీయ సరఫరా పెంచేందుకు డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై మళ్లీ సుంకాలు విధించడం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు ఫిబ్రవరి 28న ప్రారంభమైన తరువాత, ఇరాన్ ప్రతీకార చర్యలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సుమారు 50 శాతం వరకు పెరిగాయి. ఈ నెల ప్రారంభంలో బ్యారెల్‌కు 119 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల పైనే ట్రేడ్ అవుతున్నాయి. మన దేశ చమురు, గ్యాస్ అవసరాల్లో 88 శాతం దిగుమతి చేసుకుంటుండడం తెలిసిందే. వీటిలో ఎక్కువ భాగం హార్మూజ్ జలసంధి నుంచే వస్తుంటాయి. ఎగుమతిదారులకు అండ.. ఈ సంక్షోభం కారణంగా ఎగుమతిదారులు సరుకుల రవాణాలో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో.. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎగుమతిదారులకు కొన్ని సడలింపులు ఇచి్చంది. రూ.497 కోట్లతో ‘రిలీఫ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం తెలిసిందే. దీంతో నౌకా రవాణా మార్గం మార్చుకోవడం కారణంగా అధిక సమయం పట్టడం, ట్రాన్స్షిప్మెంట్ హబ్‌ల వద్ద రద్దీ పెరగడం, బీమా చార్జీలు పెరగడం, అత్యవసర సర్‌చార్జీలు విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల రవాణా (లాజిస్టిక్స్) ఖర్చులు పెరిగిపోయాయి. ఇలా పెరిగిన రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలను ఎదుర్కొనేందుకు రిలీఫ్ పథకం సాయం అందించనుంది. అలాగే, రాడ్‌టెప్ పథకం కింద ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31, 2026 వరకు అన్ని అర్హత గల ఉత్పత్తులపై పూర్తి ప్రయోజనాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. గత నెలలో ఈ ప్రయోజనాలను సగానికి తగ్గించడంతో ఎగుమతిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో వాటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణ ఉపశమనం అవసరం.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా ప్రభావితమయ్యే వర్గాలు, వ్యాపారాలకు తక్షణ ఉపశమనం అవసరం. అదే సమయంలో వ్యూహాత్మక, దీర్ఘకాల అవసరాలకు వీలుగా తగినంత ద్రవ్య వెసులుబాటు కూడా అవసరమే. కేవలం ఇంధన అవసరాలే కాకుండా.. పలు కమోడిటీలు, మెటీరియల్స్ పరంగానూ దీర్ఘకాల నిల్వలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది’’అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తాజాగా నెలవారీ ఆర్థిక సమీక్ష వివరాలు విడుదల సందర్భంగా పేర్కొన్నారు. -
2025-26కు నష్టాల వీడ్కోలు.. బేర్ బాజా!
ముంబై: ఆర్థిక సంవత్సరం 2025–26కు దలాల్ స్ట్రీట్ నష్టాలతో వీడ్కోలు పలికింది. పశ్చిమాసియా యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించడం, క్రూడాయిల్ ధరలు పెరగడంతో మార్కెట్ రెండోరోజూ ‘బేర్’ మంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, రూపాయి జీవితకాల కనిష్టానికి పతనం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,636 పాయింట్లు కుప్పకూలి 71,948 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 488 పాయింట్లు పతనమై 22,331 వద్ద నిలిచింది. ఒక దశలో సెన్సెక్స్ 1,809 పాయింట్లు 71,774 పాయింట్లు వద్ద, నిఫ్టీ 536 పాయింట్లు క్షీణించి 22,284 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. ఆసియాలో జపాన్ 3%, దక్షిణ కొరియా 3%, తైవాన్ 2%, హాంకాంగ్ 1% పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 1–0.5% లాభపడ్డాయి. అమెరికా సూచీలు అర శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, దేశీ స్టాక్ మార్కెట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 7% పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 5,467 పాయింట్లు, నిఫ్టీ 1,188 పాయింట్లు పడ్డాయి. → రంగాల వారీ బీఎస్ఈ ఇండెక్సుల్లో పీఎస్‌యూ బ్యాంక్ 4.60%, ప్రైవేట్ బ్యాంక్స్ ఇండెక్స్ 3.50%, ఫైనాన్సియల్ సర్వీసెస్ 3.46%, టెలికమ్యూనికేషన్ 3.09%, రియల్టీ 3.03% క్షీణించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 3.13%, 2.14% పతనమయ్యాయి. సెన్సెక్స్ సూచీలో పవర్‌గ్రిడ్ (0.27%) మాత్రమే స్వల్ప లాభంతో గట్టెక్కింది. మిగిలిన 29 షేర్లూ నష్టాలతో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ (–5.09%), ఎస్బీఐ (–3.95%), ఇండిగో (–3.80%), బజాజ్‌ఫిన్‌సర్వ్ (–3.71%) అత్యధికంగా నష్టపోయాయి. కీలక దశలోకి పశ్చిమాసియా యుద్ధంఎన్ని దాడులు చేసినా ఇరాన్ లొంగే పరిస్థితి కని్పంచకపోవడంతో అమెరికా ఆఖరి అస్త్రంగా భూతల దాడులు చేయడానికి సిద్ధమైంది. దాడులు జరిపేందుకు 3,500 మంది మెరైన్లు, సైనికులతో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని పశ్చిమాసియాకు తరలించారు. యూఎస్ భూతల దాడులు చేస్తే, ఎదుర్కోడానికి సిద్ధమేనని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బఘర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. పశ్చిమాసియా యుద్ధం కీలక దశకు చేరుకోవడంతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 115 డాలర్లకు చేరుకుంది. బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన విక్రయాలుఆర్బీఐ విధించిన ఫారెక్స్ ఆంక్షల ప్రభావంతో బ్యాంకింగ్ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు తమ నికర ఓపెన్ ఫారెక్స్ పొజిషన్లను రోజువారీ ట్రేడింగ్ ముగిసే సరికి 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయాల్సి ఉంటుంది. దీనితో ఆర్బిట్రాజ్ పొజిషన్ల అన్‌వైండింగ్ నేపథ్యంలో డాలర్ విక్రయాలు పెరిగే అవకాశముంది. ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం రూపాయికి తాత్కాలిక ఊరట ఇచ్చినా, బ్యాంకింగ్ షేర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ పీఎస్‌యూ ఇండెక్స్ 4.60 క్షీణించగా, ప్రైవేట్ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బీఎస్ఈ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3.50% పతనమైంది. ఎక్స్పైరీ ఒత్తిడితో తీవ్ర ఊగిసలాటనిఫ్టీ నెలవారీ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ఎక్స్పైరీ నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లలో మార్పులు చేసుకోవడంతో ఇంట్రాడేలో సూచీలు భారీ ఊగిసలాటలకు లోనయ్యాయి. సాధారణంగా నెలవారీ ఎక్స్పైరీ నెల చివరి మంగళవారం జరుగుతుంది. అయితే మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు సెలవు కావడంతో ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ సోమవారం నిర్వహించారు. ఆగని ఎఫ్ఐఐల విక్రయాలుపశ్చిమాసియా యుద్ధం అయిదో వారంలోకి ప్రవేశించడంతో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ మరింత ఊపందుకుంది. గడిచిన 20 రోజులుగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తుండం మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం ఒక్క రోజే రూ.11,163 కోట్లు అమ్మకాలకు పాల్పడటం పతనం తీవ్రతకు నిదర్శనం.సీఎంపీడీఐ.. లిస్టింగ్ నిరాశకోల్ ఇండియా అనుబంధ సంస్థ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్(సీఎంపీడీఐ) షేరు లిస్టింగ్‌లో నిరాశపరించింది. ఇష్యూ ధర (రూ.172)తో పోలిస్తే 5.43 శాతం డిస్కౌంటుతో రూ.163 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ పతనంలో భాగంగా ఒక దశలో 11.45% క్షీణించి రూ.152 ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 10.43% నష్టంతో రూ.154 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,999 కోట్లుగా నమోదైంది.2 రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల ఆవిరిబేర్ ఎటాక్‌తో రెండు రోజుల్లో రూ.18.60 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.412.41 లక్షల కోట్లకు దిగివచి్చంది. తాజాగా సోమవారం ఒక్కరోజే రూ.9 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 23 మధ్య) సెన్సెక్స్ 9,339 పాయింట్లు (11.48%) క్షీణించింది. -
తేల్చకుంటే సర్వనాశనమే
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇరాన్‌కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ఇరాన్లో మేం చేపట్టిన సైనిక చర్యలను తక్షణం ఆపేసే అంశంపై ఇరాన్ దేశ నూతన పాలక వర్గంతో విస్తృతస్థాయిలో సమగ్రంగా సహేతుకంగా చర్చలు జరుపుతున్నాం. చర్చల్లో అద్భుతమైన పురోగతి సాధించాం. కానీ ఏదైనా కారణంతో ఈ ఒప్పందం గనక సఫలీకృతంకాకపోతే ఇరాన్ అంతుచూస్తాం. సరుకు రవాణా నౌకల రాకపోకల కోసం హార్మూజ్‌ను తెరవకపోతే ఇన్నిరోజులు ఇరాన్ విషయంలో మేం చూపించిన సహనం మాలో చచ్చిపోతుంది. వెంటనే ఇరాన్‌లోని అన్ని చమురు క్షేత్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీలు, ఖర్గ్ ద్వీపంసహా ఉప్పునీటిని తాగు నీటిగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్లనూ సర్వనాశంచేస్తాం. ఇరాన్ గత 47 ఏళ్ల ఉగ్రపాలనలో వేలాది మంది అమెరికన్ సైనికుల ప్రాణాలు తీసింది. వారి మరణాలకు తాజా దాడులతో మేం ప్రతీకారం తీర్చుకుంటాం’’అని ట్రంప్ హెచ్చరించారు. ఖర్గ్‌ను స్వాధీనం చేసుకోవచ్చేమో.. ఇరాన్ చమురు మౌలికరంగంలో గుండెకాయ అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకునే ఆలోచన ఉందని ట్రంప్ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు కూడా. ఈ విషయంలో మాకెన్నో ఆప్షన్లు ఉన్నాయి. మా పంతం నెగ్గాలంటే ఖర్గ్ ద్వీపం మా అ«దీనంలో ఉంటే మంచిదేమో. దానిని కాపాడుకునే వ్యవస్థ ఏదీ ఇరాన్ వద్ద లేదు. సులభంగా స్వా«దీనం చేసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. డిమాండ్లను తప్పుబట్టిన ఇరాన్ అమెరికా పంపిన 15 అంశాల డిమాండ్లను ఇరాన్ చెత్త ప్రతిపాదనలుగా అభివరి్ణంచింది. ‘‘గల్ఫ్ అరబ్ దేశాల్లోకి ఇప్పటికే అమెరికా సేనలు ప్రవేశించాయి. కానీ పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లోకి అమెరికా సేనలు అడుగుపెడితే ఆ ప్రాంతం మొత్తాన్నీ సముద్ర మందుపాతరలతో నింపేస్తాం. అమెరికా పంపిన డిమాండ్లు అన్నీ అతిగా, అవాస్తవంగా, ఏమాత్రం హేతుబద్ధత లేకుండా ఉన్నాయి’’ అని ఇరాన్ విదేశాంగశాఖ అధికారప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ వ్యాఖ్యానించారు. పాక్ మధ్యవర్తిత్వం మాకొద్దు.. ‘‘ఇప్పుడు నేరుగా అమెరికాతో చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా కేవలం అసంబద్ధమైన ప్రతిపాదనలు వస్తున్నాయి. అమెరికా దౌత్యం మాటమాటకి మాటిమాటికీ మారుతోంది. మధ్యవర్తిత్వంపై అమెరికా పిల్లిమొగ్గలేస్తోంది. మేం స్థిరంగా ఒకే నిర్ణయంపై కట్టుబడి ఉన్నాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. ప్రాంతీయ పోరు ఆగాలనే పిలుపు మంచిదే. కానీ అసలే పోరు మొదలెట్టింది ఎవరు?’’ అని ముంబైలోని కాన్సులేట్ జనరల్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఎలాంటి చర్చలు జరగట్లేదు. అమెరికా బలగాల కోసం ఇరాన్ సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాగానే కాల్చి బూడిదచేస్తాం. అమెరికా మిత్రదేశాలకూ ఇదే మా హెచ్చరిక’’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాహ్ అన్నారు. ఇరాన్ దాడుల పరంపర అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ సోమవారం సైతం దాడులను కొనసాగించింది. కువైట్‌లోని జల, విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా సిటీలోని భారీ చమురు రిఫైనరీపై ఇరాన్ బాంబులేసింది. దీంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు వెలువడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యాయి. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌పై క్షిపణులను ప్రయోగించగా ఐదింటిని గగనతల రక్షణవ్యవస్థలు కూల్చేశాయి. దుబాయ్‌లోనూ ఒక క్షిపణిని అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం మీదా ఇరాన్ దాడులుచేసింది. దీంతో ఆ ప్రాంతమంతా హెచ్చరికల సైరన్లతో మోగిపోయింది. అయితే ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,900 మంది చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలోముగ్గురు ఐరాస శాంతివిభాగ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. బీరుట్ శివారు టైర్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒక లెబనాన్ సైనికుడు చనిపోయారు. మరోవైపు ఇరాక్‌లోని మొహమ్మద్ అలా వైమానిక స్థావరంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడి తమ ఆంటోనోవ్–132 ఆర్మీ రవాణా విమానం ధ్వంసమైందని ఇరాక్ రక్షణ శాఖ తెలిపింది.గగనతలాన్ని మూసేసిన స్పెయిన్ ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా తమ గగనతలాన్ని వినియోగిస్తుండటంపై ఆగ్రహంతో ఉన్న స్పెయిన్ సోమవారం తమ ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. ‘‘సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనికస్థావరాలను యుద్ధం కోసం ఉపయోగించకూడదు. కానీ మా మాట అమెరికా వినట్లేదు. అందుకే మా గగనతలాన్ని మూసేస్తున్నాం. ఈ యు ద్ధం చట్టవ్యతిరేకం, అన్యాయం’’అని స్పెయిన్ రక్షణమంత్రి మార్గరీటీ రూబెల్స్ ప్రకటించారు. నేవీ చీఫ్ మరణాన్ని ద్రువీకరించిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)లోని నేవీ విభాగ సారథి అలీరెజా తంగసిరి ఇటీవల దాడుల్లో కన్నుమూశారని ఇరాన్ ఎట్టకేలకు అధికారికంగా ధ్రువీకరించింది. ఇరాన్ నేవీ రియర్ అడ్మిరల్ను గత గురువారమే అంతంచేశామని ఇజ్రాయెల్ ప్రకటించినా ఇప్పటిదాకా ఇరాన్ ధ్రువీకరించలేదు. ‘‘దాడుల్లో తీవ్రంగా గాయపడిన అలీరెజా అమరుడయ్యారు. దేశసేవలో అత్యున్నత త్యాగం చేశారు’’ అని ఇరాన్ నేవీ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తంచేసింది. కువైట్‌లో భారతీయుని దుర్మరణం కువైట్‌లో సముద్రనీటిని మంచినీరుగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఒక భారతీయుడు సోమవారం ఆ ప్లాంట్‌పై ఇరాన్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా పశ్చిమాసియా యుద్ధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ప్లాంట్‌లోని ఒక భవనం దెబ్బతినడంతో ఇతను చనిపోయాడని కువైట్ విద్యుత్, జల, పునరుత్పాదక ఇంధన శాఖ తెలిపింది. -
డాలరు ధాటికి రూపీ విలవిల
భారత కరెన్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీ పతనానికి గురైంది. సోమవారం (మార్చి 30, 2026) నాటి ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 95.45 స్థాయికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఈ అసాధారణ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మంట దీనికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.పతనానికి ప్రధాన కారణాలుఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో మార్కెట్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది డాలర్‌కు విపరీతమైన డిమాండ్‌ను పెంచి, రూపాయిని బలహీనపరిచింది.చమురు ధరలుభారతదేశం తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవల బ్యారెల్‌కు 115 డాలర్ల మార్కు వరకు వెళ్లడంతో చమురు దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. చమురు కంపెనీలు డాలర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో రూపాయిపై ఒత్తిడి తీవ్రమైంది.ఎల్పీజీ దిగుమతులుకేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా వంటగ్యాస్(ఎల్పీజీ) దిగుమతులపై కూడా యుద్ధ ప్రభావం పడింది. సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో ముందస్తుగా నిల్వలను పెంచుకోవడానికి కంపెనీలు చేస్తున్న కొనుగోళ్లు కరెన్సీ విలువను మరింత తగ్గించాయి.విదేశీ పెట్టుబడుల ఉపసంహరణఒక్క మార్చి నెలలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు సుమారు 13.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించి భారత మార్కెట్ల నుంచి నిష్క్రమించారు. 2020 నాటి కోవిడ్ పరిస్థితుల తర్వాత ఈ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి వెళ్లడం ఇదే మొదటిసారి.ఆర్థిక వ్యవస్థపై ప్రభావంరూపాయి బలహీనపడటంతో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు (ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెలు) పెరిగి సామాన్యుడిపై భారం పడనుంది.పెరిగిన చమురు బిల్లుల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు భారీగా విస్తరించే అవకాశం ఉంది.విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, విదేశీ ప్రయాణాలకు వెళ్లే వారికి ఖర్చు భారీగా పెరుగుతుంది.ఆర్బీఐ చర్యలురూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బ్యాంకుల ఫారెక్స్ పొజిషన్లపై కఠినమైన పరిమితులు విధించడంతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డాలర్లను విక్రయించడం ద్వారా లిక్విడిటీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తోంది. అయితే, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే అత్యవసర డిపాజిట్ పథకాలను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయ స్థిరత్వం ఏర్పడే వరకు రూపాయిపై ఈ ఒత్తిడి కొనసాగేలా కనిపిస్తోంది. యుద్ధం చల్లారకపోతే రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
రంగంలోకి హూతీలు!
దుబాయ్: పశ్చిమాసియాలో కల్లోలం నానాటికీ విస్తరిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు తెర తీసి నెల రోజులైనా ఉద్రిక్తతలు చల్లారకపోగా నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఇరాన్‌కు దన్నుగా యెమన్‌కు చెందిన హూతీలు కూడా యుద్ధరంగంలోకి అడుగు పెట్టారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని కీలక సైనిక స్థావరాలపై శనివారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు దిగినట్టు ప్రకటించారు. వారికి మద్దతుగా హెజ్బొల్లా ఉగ్ర సంస్థ కూడా ఇజ్రాయెల్‌పై ఎడాపెడా క్షిపణులు ప్రయోగించింది. దాంతో పరిస్థితి మరింతగా విషమించేలా కన్పిస్తోంది. ఎర్రసముద్రంలో ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్ల మేరకు వాణిజ్యం జరిగే కీలకమైన బాబ్ ఎల్మందెబ్ జలసంధిని కూడా హూతీలు మూసేసే సూచనలు కన్పిస్తున్నాయి.అదే జరిగితే అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన సరఫరా మరింతగా కుదేలవడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులను తీవ్రస్థాయిలో కొనసాగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ఏకంగా 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లు ప్రయోగించింది. దాంతో కనీసం 15 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు వారాల్లో గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 25 దాటింది. మొత్తమ్మీద ఈ యుద్ధంలో క్షతగాత్రులైన వారి సంఖ్య 300 దాటింది. మూడు రీ ఫ్యూయలింగ్ విమానాలతో పాటు అమెరికాకు చెందిన పలు యుద్ద విమానాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నట్టు స్థానిక అధికార వర్గాలు తెలిపాయి.దుబాయ్‌లో ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న యాంటీ డ్రోన్ సిస్టమ్స్ నిల్వ కేంద్రంపైనా దాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఆ సమయంలో అందులో 20 మంది దాకా ఉక్రేనియన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒమన్ సమీపంలో ఒక అమెరికా నౌకపై కూడా దాడి చేసినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా సైనికులు తలదాచుకున్నారన్న సమాచారంతో దుబాయ్‌లో ఒక హోటల్‌పై కామికాజ్ క్షిపణితో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. కువైట్‌పై దాడుల్లో పలు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయి.దక్షిణ లెబనాన్‌లో యుద్ధాన్ని కవర్ చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు! యూఏఈలోని ఖలీఫా ఎకనామిక్ జోన్‌పై ఇరాన్ క్షిపణి దాడిలో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ కూడా అల్లాడిపోయింది. జెరూసలేం, టెల్ అవీవ్, బీర్ షెబాతో పాటు పలు నగరాల్లో నిర్విరామంగా సైరన్లు మోగాయి. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఎషో్టల్లో కనీసం 11 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 3,500 మంది అమెరికా సైనికులు గల్ఫ్‌కు చేరుకున్నట్టు సమాచారం! దద్దరిల్లిన టెహ్రాన్ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు శనివారం కూడా కొనసాగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. పలు ప్రాంతాల్లో మంటలు, పొగ కనిపించాయి. మీనాబ్ నగరంలో ఒక క్లినిక్‌పై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ప్రాణనష్టమేమీ సంభవించలేదని స మాచారం. తమ దేశంలో మృతుల సంఖ్య 1,900 దాటినట్టు ఇరాన్ పేర్కొంది. లెబనాన్‌లో 1,100కు పైగా, ఇజ్రాయెల్‌లో 19 మంది, గల్ఫ్ దేశాల్లో 20 మంది మరణించారు. లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా క్షిపణి దాడుల్లో కనీసం 9 మంది సైనికులు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వారి్నంగ్ యుద్ధం ఆగి శాంతి నెలకొనాలంటే గల్ఫ్ దేశాలు తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్‌పై దాడులకు వారి గగనతలాలను వాడుకునేందుకు అమెరికాను అనుమతించరాదన్నారు. శత్రువుకు సహకరించేవారిని వదలబోమని పునరుద్ఘాటించారు. భూతల దాడులకు అమెరికా 10 వేల సైన్యాన్ని పంపుతోందన్న వార్తలపై ఇరాన్ మీడియా వ్యంగ్యంగా స్పందించింది. ‘నరకానికి స్వాగతం’ అనే శీర్షికలతో దీనిపై వార్తలు ప్రచురించింది. ఇరాన్ గడ్డపై అడుగు పెట్టే ప్రతి అమెరికా సైనికుడూ శవపేటికలోకి చేరడం ఖాయమని హెచ్చరించింది. మరోవైపు ఇంధన సంక్షోభం ఇరాన్‌కు వరంగా మారుతోంది. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశం రోజుకు ఏకంగా రూ.1,319 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నట్టు సమాచారం. అమెరికా, ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభనఇరాన్తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా పరిస్థితిలో మాత్రం పెద్దగా పురోగతి కన్పించడం లేదు. చర్చల విషయంలో అమెరికా చిత్తశుద్ధిపై తమకు నమ్మకం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం కుండబద్దలు కొట్టారు! ఈ నేపథ్యంలో యుద్ధానికి తెర దించే మార్గాలను అన్వేషించేందుకు పలు గల్ఫ్ దేశాల నడుమ ఆదివారం కీలక సమావేశం జరగనుంది.ఇందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానుంది. మరోవైపు ఐరాస విజ్ఞప్తి మేరకు హార్మూజ్ గుండా మానవీయ సాయం, వ్యవసాయోత్పత్తులతో కూడిన నౌకలను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. హార్మూజ్‌ను తెరిచేందుకు ఆ దేశానికి విధించిన డెడ్‌లైన్‌ను ఏప్రిల్ 6 దాకా ట్రంప్ పొడిగించడం తెలిసిందే. ఇరాన్‌పై దాడి ద్వారా తాము ఆశించిన లక్ష్యాలను భూతల దాడులతో నిమిత్తం లేకుండానే సాధిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధీమా వెలిబుచ్చారు. -
పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో సంక్షోభ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ.. సామాన్య ప్రజలు, రైతులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామన్నారు.‘‘నోయిడాలో సెమీ కండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు సహా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వానికి నిదర్శనం. జేవర్ ఎయిర్పోర్ట్ ఉత్తర భారతాన్ని ప్రపంచానికి అనుసంధానిస్తుంది. ప్రతి రెండు నిముషాలకు ఒక విమానం ఎగురుతుంది. గత యూపీఏ ప్రభుత్వం యూపీని దోచుకుంది. 2004 నుంచి 2014 వరకు జేవర్ ఎయిర్పోర్ట్ ఫైళ్లకి మాత్రమే పరిమితమైంది. యూపీలో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తయి అందుబాటులోకి కూడా వచ్చింది’’ అని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.రైతులు పండించే పంటలు, ఉద్యోగులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలకు చేరుతాయి. అంధ విశ్వాసాలతో నోయిడాను పక్కన పడేశారు. ఎస్పీ హయాంలో ముఖ్యమంత్రి నోయిడా వచ్చే దైర్యం చేయలేదు. నోయిడా ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ.. రైతుల వల్ల నోయిడాలో కొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందంటూ తెలిపారు. -
భారత్ పై యుద్ధ ప్రభావం మోదీ అలర్ట్ సీఎంలతో అత్యవసర మీటింగ్
-
నేడు సీఎంలతో మోదీ వర్చువల్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశం కాబోతున్నారు. పశ్చిమాసియా యుద్ధం, తాజా పరిణామాల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను ఆయన సమీక్షిస్తారు. ప్రస్తుత సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్రం, రాష్ట్రాలు ‘టీమ్ ఇండియా’గా కలిసికట్టుగా పని చేయాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయంపై ముఖ్యమంత్రులతో మోదీ చర్చించనున్నట్లు సమాచారం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత అన్ని రాష్ట్రాల సీఎంతో ప్రధానమంత్రి భేటీ అవుతుండడం ఇదే మొదటిసారి. అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ భేటీ నుంచి మినహాయించారు. అక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండడమే ఇందుకు కారణం. ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ ప్రత్యేకంగా సమావేశం కానుంది. -
సంక్షోభ సమయం
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగానే ఉండబోతున్నదనీ, అది దీర్ఘకాలం కొనసాగుతుందనీ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సంకేతాలు సహజంగానే అందరినీ కలవరపెడతాయి. ఆయన సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చేసిన ప్రసంగాల్లో ఆరేళ్ల క్రితం కోవిడ్ రోజుల నాటి పరిస్థితులతో వర్తమాన స్థితిని పోల్చారంటే దేశం మున్ముందు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 23 రోజుల క్రితం ఇరాన్‌పై ప్రారంభించిన యుద్ధం ట్రంప్ తాత్కాలిక విరామం ప్రకటన తర్వాత ఆగిన సంకేతాలు కనబడినా, యుద్ధ విరమణ ఉండబోదన్న ఇజ్రాయెల్ తీరు చూస్తే అందరిలోనూ సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాదు... అటు ఇరాన్ సైతం అమెరికాతో చర్చించలేదని చెబుతోంది. చివరకు అదేమవుతుందన్న సంగతలా ఉంచితే, ఇప్పటికే ప్రపంచంతోపాటు మనమూ సంక్షోభంలో చిక్కుకుపోయామని తెలుస్తూనే ఉంది. క్షణక్షణం మాట మార్చే ట్రంప్‌ను ఇరాన్‌తోపాటు ప్రపంచ ప్రజానీకం కూడా పెద్దగా విశ్వసించలేదుగానీ... స్టాక్ మార్కెట్లు మాత్రం నమ్మదల్చుకున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. మార్కెట్లన్నీ మంగళవారం ఉత్సాహంతో ఉరకలెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా 10 శాతం పడిపోయాయి. కానీ ఈ ధోరణి దీర్ఘకాలం కొనసాగటం అనుమానమే. యుద్ధంపై కేంద్రం నుంచి వెలువడిన ఈ తొలి ప్రకటన సాధారణ జనంలో కొద్ది రోజులుగా ఉన్న భయాందోళనలు నిర్హేతుకం కాదని సూచిస్తోంది. ఆర్థిక, జాతీయ భద్రతా రంగాలతోపాటు మానవతారంగంలోనూ పెను సవాళ్లను ఎదుర్కొనబోతున్నామని ప్రధాని చెబుతున్నారు. మన ఆర్థిక ప్రగతికి ప్రధానంగా తోడ్పడే చమురు, సహజవాయువుల్లో సింహభాగం పశ్చిమాసియా నుంచే రావాలి. ఆ ప్రాంతం మామూలు స్థితికి చేరేదాకా ఆ రెండు దిగుమతులపైనా అనిశ్చితి కొనసాగుతుంది. గల్ఫ్ దేశాల్లో భిన్న వృత్తి ఉద్యోగాల్లో ఉన్న కోటిమంది భారతీయుల్లో 3 లక్షల మంది ఇప్పటికే వెనక్కొచ్చారు. ఇరాన్ ప్రతిదాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. చమురు, గ్యాస్ ఎగుమతులు నిలిచిపోవటం వల్ల అవి గడ్డు పరిస్థితుల్లో పడ్డాయి. జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. తమ గ్యాస్ ఉత్పాదక క్షేత్రాన్ని చక్కదిద్దటానికి చాలా ఏళ్లు పట్టవచ్చని ఖతార్ అంటున్నది. కనుక గల్ఫ్‌లో ఉపాధి కల్పన మళ్లీ పట్టాలెక్కడం అంత సులభం కాదు. గల్ఫ్ సంక్షోభంతో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన స్థాయిలో ఎరువులు అందుతాయా అన్న సందేహాలున్నాయి. సాగుకు లోటురానీయబోమని మోదీ హామీ ఇవ్వడం అందుకే. ఆయన చెబుతున్న ప్రకారం కొన్ని శక్తులు ఈ సంక్షోభాన్ని స్వప్రయోజనాలకు వినియోగించుకునే ప్రయత్నం చేస్తాయి. అది ఆంతరంగిక భద్రతపై ప్రభావం చూపుతుంది. దేశం ఐక్యంగా ఉండి ఈ సంక్షోభాన్ని అధిగమించాలని ఆయన పిలుపునిచ్చారు. సాధారణ సమయాల్లో పెద్దగా చర్చకు రాని విదేశాంగ విధానం సంక్షోభ కాలంలో ముందుకొస్తుంది. మనది మోదీ వ్యక్తిగత విధానంగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. తమ కాలంలో ఎప్పుడూ ఇలా లేదని కూడా చెబుతున్నారు. కానీ నాటి ద్విధ్రువ ప్రపంచం ఏకధ్రువ ప్రపంచంగా మారింది. అప్పుడు అలీన విధానం అని చెప్పుకున్నామేగానీ సోవియెట్‌కు సన్నిహితంగా మెలిగాం. అప్పట్లో అమెరికాపై దూకుడు ప్రదర్శించటం అందులో భాగమే. నిజంగా తటస్థంగా ఉన్నట్టయితే హంగేరీ (1956), జెకొస్లోవేకియా(1968), అఫ్గాన్(1979)లపై సోవియెట్ దురాక్రమణకు దిగినప్పుడు ఖండించి ఉండేవాళ్లం. మారిన పరిస్థితుల్లో భిన్న దేశాలపై వేర్వేరు అంశాల్లో ఆధారపడి ఉన్నామన్నది కాదనలేని సత్యం. నిజానికి అన్ని దేశాల పరిస్థితీ అదే. చైనా, రష్యాలు ఇరాన్‌కు గట్టి మద్దతుదార్లుగా నిలిచినా ఆపత్సమయంలో అవి తటస్థంగానే ఉండిపోక తప్పలేదు. ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేయటాన్ని చూపి, కనీసం రష్యా ఇరాన్‌కు నిఘా సమాచారాన్ని ఇచ్చింది. పరిస్థితులు మున్ముందు మరింత సంక్లిష్టంగా మారినా మారొచ్చు. ఈలోగా మన రాజ్యాంగ విలువలను ప్రతిబింబించే మెరుగైన విదేశాంగ విధానం రూపుదిద్దుకుంటే మంచిది. -
యుద్ధ సంక్షోభం.. రంగంలోకి మంత్రుల బృందం..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యులపై దాని ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంక్షోభం వల్ల ఏర్పడే సవాళ్లను ఎదుర్కోవడానికి మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారు. ఈ సమావేశానికి హోం, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులతో సహా మొత్తం 13 మంది మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏకతాటిపై పని చేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు.ఆహార, ఇంధన భద్రతపై ప్రత్యేక దృష్టిపశ్చిమాసియా పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సామాన్యుడి అవసరాలకు విఘాతం కలగకుండా కొన్ని అంశాలపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారు.ముడి చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడటంపై చర్చించారు. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న బఫర్ స్టాక్ వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేదని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.దిగుమతుల వైవిధ్యం - ఎగుమతుల విస్తరణరసాయనాలు, ఫార్మాసూటికల్స్, పెట్రోకెమికల్స్ వంటి కీలక పారిశ్రామిక రంగాలకు అవసరమైన ముడి పదార్థాల కోసం కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను వైవిధ్యీకరించాలని సమావేశం నిర్ణయించింది. అలాగే, భారతీయ వస్తువుల కోసం కొత్త ఎగుమతి గమ్యస్థానాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారు.రాష్ట్రాలతో సమన్వయం..ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని మోదీ ఆదేశించారు. ‘నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
పశ్చిమాసియాపైనే ఫోకస్!
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయగల కీలక ఆర్థిక అంశాలు కొరవడిన నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులే దారి చూపనున్నాయి. దీంతో చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల తీరు, రూపాయి మారకం తదితర అంశాలు కీలకంగా నిలవనున్నాయి. గురువారం(26న) శ్రీరామ నవమి సందర్భంగా దేశీ స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. వివరాలు చూద్దాం... రోజులు గడిచేకొద్దీ పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం ముదురుతోంది. యుద్ధానికి త్వరలోనే ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన తదుపరి పరిస్థితులు మరింత వికటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. దీంతో ఆసియా మొదలు అమెరికా వరకూ స్టాక్ మార్కెట్లు పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా పశ్చిమాసియా యుద్ధ ప్రకంపనలే ప్రధానంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. శ్రీరామ నవమి(26న) సెలవుతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. గణాంకాల విడుదల దేశీయంగా ఈ వారం మార్చి నెలకు రేపు(24న) హెచ్ఎస్బీసీ ఫ్లాష్ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. తయారీ, సర్వీసులు, కాంపోజిట్ వివరాలు వెల్లడికానున్నాయి. తద్వారా బిజినెస్ యాక్టివిటీ ముందస్తు అంచనాలకు వీలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఈ బాటలో 28న ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మ్యాన్యుఫాక్చరింగ్ గణాంకాలు విడుదలకానున్నాయి. హార్ముజ్‌పై ఫోకస్ కొద్ది రోజులుగా హార్ముజ్ ద్వారా జల రవాణా దాదాపు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో పశ్చిమాసియా పరిస్థితులు కీలకంగా మారినట్లు ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. సమీప కాలంలో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని అంచనా వేశారు. బ్రెంట్ చమురు 100 డాలర్ల ఎగువన కదులుతుండటం దేశీయంగా వాణిజ్య లోటును పెంచడంతోపాటు రూపాయిని బలహీనపరుస్తున్నట్లు ఆర్థికవేత్తలు విశ్లేషించారు. చమురు ధరలతో పలు దేశాలలో ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తుండటంతో కేంద్ర బ్యాంకులు కఠిన పరపతి విధానాలవైపు చూపు సారించవచ్చని వివరించారు. గత వారం అక్కడక్కడే తీవ్ర ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు దాదాపు అక్కడక్కడే అన్నట్లుగా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 31 పాయింట్ల స్వల్ప నష్టంతో 74,533 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 37 పాయింట్లు క్షీణించి 23,115 వద్ద స్థిరపడింది.సాంకేతికంగా ఈ వారంయుద్ధ భయాల నుంచి గత వారం నెమ్మదిగా రికవరీ బాట పట్టిన దేశీ స్టాక్ మార్కెట్లను ప్రయివేట్ బ్యాంకింగ్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ దెబ్బకొట్టింది. మరోపక్క ముడిచమురు ధరల మంట సెంటిమెంటుకు షాకివ్వడం దీనికి జత కలసింది. దీంతో చివరికి మార్కెట్లు దాదాపు యథాతథంగా ముగిశాయి. అయితే సాంకేతికంగా చూస్తే ఈ వారం పశ్చిమాసియా ప్రకంపనల ఆందోళనలతో బలహీనపడటానికే అధిక వీలుంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీస్థాయిలో విక్రయాలకు పాల్పడుతుండటం బ్లూచిప్స్‌ను పడగొడుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. → నిఫ్టీకి తొలుత 22,900 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. తదుపరి 22,300–22,200 స్థాయిలో కొనుగోళ్లకు వీలుంది. ఒకవేళ తొలి మద్దతుస్థాయి నుంచి బలపడితే.. 23,800–24,000 వరకూ పుంజుకోవచ్చు. సమీప కాలంలో 22,900– 24,000 శ్రేణిలో కదిలేందుకు వీలుంది.ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు.. యుద్ధ భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఇటీవల దేశీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలోనే ఇప్పటివరకూ నగదు విభాగంలో ఏకంగా రూ. 88,180 కోట్ల(9.6 బిలియన్ డాలర్లు) విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ధరల పెరుగుదలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఆందోళనలు వ్యక్తం చేయడానికితోడు.. డాలరుతో మారకంలో రూపాయి పతనంకావడం సైతం కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ముదురుతున్న పశ్చిమాసియా యుద్ధం, ముడిచమురు ధరలతో కార్పొరేట్ ఫలితాలు నీరసించవచ్చన్న ఆందోళనలు ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. కాగా.. అంతకుముందు నెల(ఫిబ్రవరి)లో గత 17 నెలల్లోనే అత్యధికంగా ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇజ్రాయెల్ అణు కేంద్రమే లక్ష్యంగా... క్షిపణుల వర్షం
దుబాయ్/టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు నానాటికీ విస్తరిస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. యుద్ధం ఆదివారం 23వ రోజుకు చేరుకుంది. నతాంజ్ అణు కేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం హెజ్బోల్లా మిలిటెంట్లతో కలిసి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. నెగెవ్ ఎడారిలోని ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా దాడులకు దిగింది. దాని సమీపంలోని అరాద్, డిమోనా పట్టణాలపై బాంబుల వర్షం కురిపించింది. వందల కిలోల వార్హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. ఈ ఘటనలో కనీసం 180 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో అత్యాధునిక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం గమనార్హం. ఇరాన్ దాడిలో ఎవరూ మరణించకపోవడం నిజంగా అద్భుతమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అరాద్‌లో ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధిస్తామని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సమాజం తమకు సహకరించాలని కోరారు. తద్వారా యుద్ధం మరింత తీవ్రతరం కావడం తథ్యమని సంకేతాలిచ్చారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు తమ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకుని ఎలా రాగలిగాయన్న దానిపై ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్‌లో వైమానిక దాడిలో ఒకరు మృతిచెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్‌లో సైరన్ల మోతలు వినిపించాయి. టెల్ అవీవ్‌పై క్షిపణి దాడులు సౌదీ అరేబియా, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ఆయుధాలను మధ్యలోనే కూల్చివేశామని ఆయా దేశాలు వెల్లడించాయి. ఇరాన్‌లోని అండిమెష్క్ సిటీ ఆసుపత్రిపై భారీ దాడి జరిగింది. రోగులు, వైద్యులను మరో నగరానికి తరలించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. హెజ్బోల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలను ఇజ్రాయెల్ సరిహద్దుకు తరలిస్తున్నారు. లెబనాన్‌లోని ఖస్మియే వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఉత్తర సరిహద్దుకు సమీపంలోని లెబనాన్ నివాసాలను ధ్వసం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తమ సైన్యాన్ని ఆదేశించారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌కు ఇప్పటికే వెయ్యి మందికిపైగా మృతిచెందారు. 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హెజ్బోల్లా గ్రూప్ వందలాది రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లో కీలక నగరం టెల్ అవీవ్‌పై ఇరాన్ ఆదివారం బాలిస్టిక్ క్షిపణితో దాడికి దిగింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు తెలిసింది. హార్మూజ్ నుంచి రాకపోకలు సాగించేందుకు కొన్ని దేశాల నౌకలకు తాజాగా అనుమతి లభించింది. ఇందులో భారత్, జపాన్, చైనా, పాకిస్తాన్, తుర్కియే చమురు నౌకలు ఉన్నాయి. ప్రపంచానికి పెనుముప్పు ఇరాన్: నెతన్యాహు ఇరాన్ వద్ద అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదివారం ఆరోపించారు. డీగో గార్సియా దీవిపై జరిగిన దాడిని ప్రస్తావించారు. సుదూరంలో ఉన్న యూరప్ దేశాలపైనా దాడి చేసే సామర్థ్యం ఇరాన్‌కు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోందని అన్నారు. ప్రపంచానికి ఇరాన్ పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలందరి బాగు కోసమే అమెరికాతో కలిసి తాము పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. శనివారం రాత్రి రెండు పట్టణాలపై దాడులకు దిగడం అత్యంత దారుణమని మండిపడ్డారు. సాధారణ జనావాసాలను ఇరాన్ టార్గెట్ చేసిందన్నారు. ప్రజలను హత్య చేయాలన్నదే ఇరాన్ అసలు ఉద్దేశమని విమర్శించారు. అదృష్టవశాత్తూ ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదని వ్యాఖ్యానించారు.హార్మూజ్‌ను తెరవకుంటే వినాశనమే: ట్రంప్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. గల్ఫ్ వ్యవస్థలను నేలమట్టం చేస్తాం: ఇరాన్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. అమెరికా ఎఫ్–15నూ కూల్చేశాం: ఇరాన్ ముంబై: తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానం ఎఫ్–15ను హార్మూజ్ ద్వీపం సమీపంలో నేలకూల్చామని ఇరాన్ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సురేట్ జనరల్ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘శత్రువుల ఎఫ్–15 ఫైటర్‌జెట్ మా గగనతలంలోకి ప్రవేశించి మా గగనతల రక్షణ వ్యవస్థకు సవాల్ విసిరింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లోని భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఆ విమానం పనిపట్టాయి. చివరకు అది నేలకూలింది’’ అని ఇరాన్ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే విమానం పూర్తిగా ధ్వంసమైందా? పైలట్ చనిపోయాడా? వంటి వివరాలను వెల్లడించలేదు. ఇటీవల ఎఫ్–35 యుద్ధ విమానం మీద సైతం ఇరాన్ దాడి చేసింది. దీంతో అది వెనువెంటనే పశ్చిమాసి యాలోని స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇరాన్ గగనతలంపై ఎప్పుడంటే అప్పుడు మేం విమానాలను చక్కర్లు కొట్టించగలం అంటూ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఆరోజు ఎఫ్–35ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. -
అమెరికా మాపై దాడిచేస్తే మేం భారత్‌పై బాంబులేస్తాం
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఛాందసవాదం, వితండవాదానికి పాకిస్తాన్ చిరునామా అని ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మారోమారు నిరూపించారు. భారత్ మీద తమ అంతులేని విద్వేషాన్ని తన వాచాలత్వం ద్వారా బాసిత్ మరోమారు రుజువుచేసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం దక్షిణాసియాకు విస్తరించి అమెరికాగనక పాకిస్తాన్‌పై దాడి చేస్తే ప్రతిగా అమెరికాపై దాడిచేయాల్సిందిపోయి భారత్‌పై బాంబులేస్తామని బాసిత్ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్ దౌత్యవర్గాల్లోనూ జిహాదీవాదం ఒంటబట్టించుకున్న వితండవాదులకు కొదవలేదని భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎన్ఎన్–న్యూస్18తో జరిగిన ఒక చర్చావేదికలో బాసిత్ మాట్లాడారు. ‘‘యుద్ధంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయెల్‌కు తదుపరి లక్ష్యంకావొచ్చు. ఇజ్రాయెల్ చెప్పుడుమాటలు వినే అమెరికాకు అప్పుడు పాకిస్తాన్ అణుకార్యక్రమాలు రుచించకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్‌పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ దాడి చేస్తే ప్రతిదాడి చేసే సత్తా పాకిస్తాన్‌కు ఉంది. అయితే ప్రతిదాడి కోసం అమెరికా ప్రధాన భూభాగం లేదా గల్ఫ్ లేదా ఇజ్రాయెల్‌పై మేం దాడిచేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూరంగా ఉన్నాయి. సమీప లక్ష్యం మీదే మేం దాడిచేయగలం. అలాంటి సమీప లక్ష్యం ఒక్క భారత్ మాత్రమే. ఏమాత్రం ఆలస్యంచేయకుండా ముంబై, న్యూఢిల్లీలపై దాడులుచేస్తాం. తర్వాత ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధంలేదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం’’అని అన్నారు. ‘‘మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే. భారత్‌లోని మెట్రోపాలిటన్ నగరాలపై దాడులు చేస్తాం’’అని అన్నారు. దీంతో భవిష్యత్‌లో అమెరికాతో సంబంధాలు చెడిపోతే దాని విపరిణామాలను భారతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్లు బాసిత్ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శత్రుదేశం(అమెరికా)పై ఎదురుదాడి చేసే దమ్ములేక పొరుగుదేశంపై బాంబులేసే నిస్సహాయ పాకిస్తాన్ వైఖరి బాసిత్ మాటలతో బహిర్గతమైందని అంతర్జాతీయ రాజకీయవిశ్లేషకులు తప్పుబడుతున్నారు. ‘‘బాసిత్ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. సైన్యం కనుసన్నల్లో నడిచే పాక్ ప్రభుత్వాల కుటిలనీతిలో నిర్లజ్జ నియమాలు ఎలా ఉంటాయో బాసిత్ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధం దక్షిణాసియాకు విస్తరిస్తే పాకిస్తాన్ పట్ల మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని బాసిత్ మాటలు హెచ్చరిస్తున్నాయి’’అని భారత నిఘా వర్గాలు సూచించాయి. -
ఇంధన భద్రతలో భారత్ ముందున్న సవాలు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల, సరఫరా గొలుసులో అంతరాయాలు భారత్ వంటి భారీ వినియోగ క్రూడ్ దేశాలకు హెచ్చరిక లాంటిది. ఈ నేపథ్యంలో దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలవాల్సిన వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు భారత్‌లో ఏ స్థాయిలో ఉన్నాయి? మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.వ్యూహాత్మక నిల్వలు ఎందుకు కీలకం?ఇంధన నిల్వలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వం నిర్వహించే వ్యూహాత్మక నిల్వలు, రిఫైనరీలు నిర్వహించే వాణిజ్య నిల్వలు. వీటి ప్రాముఖ్యత ఆర్థిక పరంగానే కాకుండా దేశ రక్షణకు కూడా సంబంధించింది కావడం గమనార్హం.భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరంతర ఇంధన సరఫరాకు ఇవి అండగా నిలుస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఈ నిల్వలు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. ఇంధనాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించే దేశాల ముందు భారత్ తలవంచకుండా ఉండేందుకు ఈ బఫర్ స్టాక్ రక్షణ కవచంగా పనిచేస్తుంది.ఆందోళనకరంగా ఎల్పీజీ నిల్వలుభారత్ వంటగ్యాస్ పంపిణీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ, నిల్వ సామర్థ్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉంది. విశాఖపట్నం కేవర్న్(హెచ్‌పీసీఎల్, టోటల్ఎనర్జీస్ జేవీ) సామర్థ్యం 60,000 టన్నులు, మంగళూరు కేవర్న్(హెచ్‌పీసీఎల్) 80,000 టన్నులతో మొత్తం సామర్థ్యం 1,40,000 టన్నులుగా ఉంది.దేశవ్యాప్తంగా రోజువారీ ఎల్పీజీ డిమాండ్ సుమారు 90,000 టన్నులు అని అంచనా. అంటే మన దగ్గర ఉన్న వ్యూహాత్మక నిల్వలు కనీసం రెండు రోజులకు కూడా సరిపోవు. ప్రస్తుతం మన మౌలిక సదుపాయాలన్నీ గ్యాస్‌ను పోర్టుల నుంచి నేరుగా వినియోగదారులకు చేరవేసే ‘ఆపరేషనల్ ఫ్లో’ మోడల్లోనే ఉన్నాయి తప్ప దీర్ఘకాలిక నిల్వ కోసం ఉద్దేశించినవి కావని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎందుకీ పరిస్థితి?ముడి చమురు నిల్వల విషయంలో భారత్ ఇప్పటికే భారీ వ్యూహాత్మక నిల్వలను నిర్మించుకుంది. కానీ గ్యాస్ విషయంలో మాత్రం ఆ పురోగతి కనిపించలేదు. దీనికి కొన్ని కారణాలున్నాయి.గతంలో గ్యాస్ సరఫరా సులభంగా, తక్కువ ధరకే లభించడంతో నిల్వల కంటే సరఫరా వ్యవస్థపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.గ్యాస్‌ను భూగర్భంలో నిల్వ చేయడానికి తగిన సహజ కేవర్లు గుర్తించడం సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రక్రియ.గ్యాస్ స్టోరేజ్ టెర్మినల్స్ నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్నది.కొత్త వ్యూహం: ప్రభుత్వం ఏం చేస్తోంది?పశ్చిమాసియా సంక్షోభం తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ భద్రతపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వ్యూహాత్మక గ్యాస్ నిల్వల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు పెట్రోలియం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎల్ఎన్జీ/ఎల్పీజీ టెర్మినల్స్‌లో అదనంగా 10 శాతం నిల్వ సామర్థ్యాన్ని తప్పనిసరి చేసే నిబంధనను సమీక్షిస్తున్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఆరు కొత్త ప్రాంతాల్లో నిల్వ కేంద్రాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతంలో ఉన్న ‘సాల్ట్ కేవర్లు’ గ్యాస్ నిల్వకు అత్యంత అనువైనవిగా భావిస్తున్నారు.అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోవాలంటే భారత్ కేవలం సరఫరాపైనే కాకుండా నిల్వపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. విధానపరమైన వేగం, సాంకేతిక తోడ్పాటు తోడైతేనే ఇంధన భద్రతలో భారత్ స్వయంసమృద్ధి సాధించగలదు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
సిరామిక్ టైల్స్‌పై యుద్ధం ఎఫెక్ట్
దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై పశ్చిమాసియా యుద్ధం ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ తాజా నివేదికలో పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో పరిశ్రమ ఆదాయం 1–2 శాతంస్థాయిలో నీరసించనున్నట్లు అంచనా వేసింది. వెరసి వరుసగా రెండో ఏడాది ఆదాయంలో క్షీణత నమోదుకానున్నట్లు తెలియజేసింది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా సిరామిక్ టైల్స్ ఉత్పత్తి, ఎగుమతులు, సరఫరాలకు విఘాతం కలగనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ. 53,000 కోట్ల విలువైన దేశీ సిరామిక్ టైల్స్ పరిశ్రమపై యుద్ధం రెండు విధాల ప్రభావం చూపనున్నట్లు వివరించింది.మధ్యప్రాచ్య దేశాలకు లాజిస్టిక్స్‌పరంగా సవాళ్లు ఎదురవుతుండటంతో సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంకావడంతోపాటు ఎగుమతులు దెబ్బతినే వీలున్నట్లు క్రిసిల్ పేర్కొంది. సిరామిక్ టైల్స్ ఆదాయంలో ప్రధానంగా ఎగుమతులు 40 శాతం వాటా ఆక్రమిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎగుమతుల్లో మధ్యప్రాచ్య దేశాల వాటా 15 శాతంగా తెలియజేసింది. హార్ముజ్ ద్వారా జల రవాణాకు అవాంతరాలు ఎదురవుతుండటంతో ఎగుమతుల ఆదాయం 6–7 శాతం క్షీణించనున్నట్లు అంచనా వేసింది. డెలివరీలు నిలిచిపోవడంతోపాటు.. బీమా వ్యయాలు పెరిగిపోనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు చేపట్టే ఎగుమతి వ్యయాలు సైతం పెరగనున్నట్లు వెల్లడించింది.ఎల్ఎన్జీ సెగతయారీ వ్యయాల్లో 35 శాతం వాటా ఆక్రమించే కీలక ముడిసరుకులు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ), ప్రొపేన్ సరఫరాలు తగ్గడంతో దేశీయంగా పలు సిరామిక్ టైల్స్ తయారీ కంపెనీల కార్యకలాపాలు మూతపడటం లేదా ఉత్పత్తి నిలిచిపోవడం లేదా ఉత్పత్తిలో భారీ క్షీణతకు అవకాశమున్నట్లు క్రిసిల్ నివేదికలో వివరించింది. ఈ నెల(మార్చి)లో టైల్స్ ఉత్పత్తి దాదాపు నిలిచిపోగా.. దేశీ వినియోగ వ్యయాలు సైతం మందగించనున్నట్లు తెలియజేసింది. ఫలితంగా దేశీ టైల్స్ మార్కెట్ వృద్ధి గతంలో వేసిన 7–8% అంచనాలస్థానే 4–5 శాతానికి పరిమితంకానున్నట్లు పేర్కొంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు మరో రెండు, మూడు వారాలు కొనసాగితే కంపెనీల దీర్ఘకాలిక మూసివేతలు, భారీ నష్టాలకు కారణంకావచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలియజేశారు. దీంతో నెలవారీ ఆదాయంలో 7–8 శాతం క్షీణత నమోదుకావచ్చని అంచనా వేశారు. ఈ అంశాలన్నీ కంపెనీల నిర్వహణ లాభదాయకతను 1.3–1.5%మేర దెబ్బతీయవచ్చని నివే దిక పేర్కొంది. వెరసి ఐదేళ్ల కనిష్టం 9.3–9.5%నికి మార్జిన్లు బలహీనపడవచ్చని అభిప్రాయపడింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ముదురుతోన్న సంక్షోభం.. కీలక రంగాలకు ముప్పు
పశ్చిమాసియాలో అలుముకున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ పదకొండో రోజుకు చేరుకోవడంతో.. కేవలం చమురు, సహజ వాయువు సరఫరా మాత్రమే కాకుండా, నిత్యవసర రంగాలు సైతం సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఎరువులు, అల్యూమినియం, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పాటు ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అన్నదాతపై ఎరువుల సెగభారతదేశంలో విత్తనాల సీజన్ (ఖరీఫ్) ప్రారంభంకానున్న తరుణంలో ఎరువుల కొరత ఆందోళన కలిగిస్తోంది. దేశీయ ఎరువుల అవసరాల్లో 30% దిగుమతుల ద్వారానే తీరుతుండగా అందులో 40% వాటా ఒక్క మధ్యప్రాచ్య దేశాలదేనని క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది.మెరుగైన రుతుపవనాల కారణంగా డిమాండ్ పెరగడంతో 2026 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల దిగుమతులు 41% పెరిగి 22.3 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీని కేంద్రం తొలుత రూ.1.67 లక్షల కోట్లుగా అంచనా వేసినప్పటికీ అది రూ.1.86 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అయితే, 2027 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించడం గమనార్హం.చైనా ఆంక్షలుచైనా విధిస్తున్న సరఫరా పరిమితులతో గత నెలలోనే యూరియా ధరలు 20% పెరిగాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఇప్పుడు యుద్ధం తోడవడంతో ఈ ఖర్చు మరింత భారమవ్వనుంది.అల్యూమినియం రంగంలోనూ అస్థిరతప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో 8-9% వాటా కలిగిన గల్ఫ్ దేశాల నుంచి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది. యుద్ధం మొదలైన వారంలోపే ‘హైడ్రో’, ‘ఆల్బా’ వంటి దిగ్గజ సంస్థలు ఫోర్స్ మేజర్ (అనివార్య కారణాల వల్ల ఒప్పందాలను అమలు చేయలేకపోవడం) ప్రకటించాయి. అల్యూమినియం స్మెల్టర్లు ముడి పదార్థాల కోసం హార్మూజ్ జలసంధిపైనే ఆధారపడతాయి. యుద్ధం కారణంగా అటు ముడి పదార్థాలు, ఇటు ఇంధన లభ్యత రెండూ ప్రశ్నార్థకంగా మారాయి.ప్యాకేజింగ్ పరిశ్రమకు దెబ్బయుద్ధం కారణంగా పాలిమర్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది నేరుగా ప్యాకేజింగ్ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. ప్యాకేజింగ్ తయారీదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్న బ్రాండ్లు కొంతవరకు తట్టుకోగలిగినా స్పాట్ మార్కెట్లో కొనుగోలు చేసే చిన్న సంస్థలు అధిక ధరల అస్థిరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘సరఫరా అంతరాయాలు కలగకుండా కస్టమర్లతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సవాళ్లను అధిగమిస్తామనే నమ్మకం ఉంది’ అని ఆల్టర్నిక్ ఎండీ, సీఈఓ తిమ్మయ్య ఎన్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోతే రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం పడే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే దౌత్యపరమైన, ఆర్థికపరమైన చర్యలే కీలకం కానున్నాయి. -
పేపర్ పరిశ్రమకు ‘పశ్చిమాసియా’ సెగ
పశ్చిమాసియా సంక్షోభంతో దేశీ పేపర్ పరిశ్రమను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇంధన వ్యయాలు పెరిగిపోవడం, ఎగుమతులకు అవరోధాలతో వ్యాపారాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన పేపర్ పరిశ్రమకు కీలక ఎగుమతి మార్కెట్లలో పశ్చిమాసియా కూడా ఒకటిగా ఉంటోంది. 2024–25లో దేశీ పరిశ్రమ 980 మిలియన్ డాలర్ల పేపర్, పేపర్బోర్డును ఎగుమతి చేయగా అందులో పశ్చిమాసియా దేశాల వాటా 290 మిలియన్ డాలర్లుగా (సుమారు 30 శాతం) ఉన్నట్లు పేపర్ తయారీ సంస్థల సమాఖ్య ఐపీఎంఏ తెలిపింది.అన్‌కోటెడ్ రైటింగ్..ప్రింటింగ్ పేపర్, కోటెడ్ పేపర్..పేపర్‌బోర్డ్, క్రాఫ్ట్ పేపర్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. తమ పరిశ్రమలో ప్రధానంగా ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుందని, దీనితో భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తమపైనా ఉంటోందని ఐపీఎంఏ వివరించింది. ఇంధన రేట్లు పెరిగిపోవడం, సరఫరాపరమైన అవరోధాల వల్ల దేశీ పేపర్ మిల్లుల ఉత్పత్తి వ్యయాలపై నేరుగా ప్రభావం పడుతోందని వివరించింది. పేపర్ తయారీ ప్రక్రియకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్..బైండర్స్లాంటి ఉత్పత్తులను సమకూర్చుకోవడంలో మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.మరో వైపు, పేపర్ని ఉత్పత్తి చేసే చైనా, ఇండొనేషియాలాంటి దేశాలు ఎగుమతి కోసం పశ్చిమాసియాపై ఆధారపడతాయని, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల, సదరు ఉత్పత్తులను ఇప్పుడు అవి భారత్ వైపు మళ్లించే అవకాశం ఉందని ఐపీఎంఏ తెలిపింది. దీనితో చౌక దిగుమతులు వెల్లువెత్తి, దేశీ తయారీ సంస్థలపై ఒత్తిడి పెరిగిపోయే ముప్పు ఉందని వివరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే ముప్పు నెలకొందని ఐపీఎంఏ ప్రెసిడెంట్ పవన్ అగర్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష
పశ్చిమ ఆసియా సంక్షోభం కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, భారతీయ కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి స్థాయి అనిశ్చితిని సృష్టించిన ఈ పరిణామాలను ఎదుర్కోవడంలో కార్పొరేట్ కంపెనీల సీఈఓలు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రత్యేక కథనం.మునుపెన్నడూ లేని సవాలుసాధారణంగా ఏదైనా విపత్తు సంభవించినప్పుడు కంపెనీల అధినేతలు గత చరిత్రను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ప్రస్తుత పశ్చిమ ఆసియా సంక్షోభం అసాధారణమైంది. గత అనుభవాలేవీ దీనికి సరిపోలవు. ఈ నేపథ్యంలో వ్యాపార రంగానికి పొంచి ఉన్న ప్రధాన ముప్పులు కింది విధంగా ఉన్నాయి.ముడి చమురు ధరల పెరుగుదల వల్ల పెట్రోల్ నుంచి ఎరువుల వరకు అన్ని ఉత్పత్తుల ధరలు భారమవుతాయి.ఎఫ్ఎంసీజీ రంగంలో ప్యాకేజింగ్ ఖర్చు 10% కంటే ఎక్కువగా ఉంటుంది. పెట్రో-డెరివేటివ్స్ ధరలు పెరగడం వల్ల ఈ వ్యయం మరింత భారం కానుంది.కొవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న గ్లోబల్ సప్లై చైన్ మళ్లీ సంక్షోభంలో పడింది. పశ్చిమ ఆసియా మీదుగా సాగే రవాణా మార్గాలపై అనిశ్చితి నెలకొంది.గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే పెట్టుబడులు, రెమిటెన్స్‌లు తగ్గే అవకాశం ఉంది. ఇది భారతీయ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.దుబాయ్ వంటి పర్యాటక కేంద్రాలకు డిమాండ్ తగ్గి విమాన ప్రయాణాలు మరింత భారంగా మారుతాయి.బంగారం ధరలు తగ్గడం, విలాసవంతమైన బ్రాండ్ మార్కెట్ దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.సీఈఓల వ్యూహరచన.. ఏం చేయాలి?వినియోగదారుడి కొనుగోలు శక్తిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు తమ కార్యాచరణను మార్చుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో రాబడిని అందించే వినియోగదారుడిని కాపాడుకోవడం ముఖ్యం. ధరలు పెంచడం లేదా ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించడం వంటి పనులు చేయకపోవడమే మంచిది. ఇది దీర్ఘకాలంలో బ్రాండ్ విలువను దెబ్బతీస్తుంది.వ్యయ నియంత్రణఉద్యోగులను తొలగించడం కంటే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. అవసరంలేని ఇన్వెంటరీ, ఎంతోకాలంగా జాప్యం జరుగుతున్న నిర్ణయాలు, భారీ అప్పులపై వడ్డీలను తగ్గించుకోవాలి. సిబ్బంది సంఖ్యను కత్తిరించకుండానే 20% ఖర్చులను తగ్గించే ప్రణాళికలు సిద్ధం చేయాలి.కాలానుగుణంగా ప్రణాళికలురాబోయే 30 రోజులు, 90 రోజులు, 300 రోజులకు స్పష్టమైన కార్యాచరణ ఉండాలి. దీన్ని ఉద్యోగులందరికీ వివరించాలి. వారిలో భయాందోళనలు కలగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలి. నగదు నిల్వలను కాపాడుకోవడం ముఖ్యం. అదే సమయంలో జీతాల్లో కోతలు విధించకూడదు.బ్యాంకులు, ప్రభుత్వంతో సమన్వయంఇది అసాధారణ పరిస్థితి కాబట్టి బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపు గడువును, మూలధన అవసరాలను పునర్వ్యవస్థీకరించుకోవాలి. అలాగే, పరిశ్రమ వర్గాలన్నీ ఏకమై ప్రభుత్వం నుంచి అవసరమైన రాయితీలు, మద్దతు కోరాలి.ఈ సంక్షోభ సమయంలో సీఈఓలు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరగడం, మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి రావడం వంటి మార్పులను అందిపుచ్చుకోవాలి. తిరిగి పోటీలో నిలబడగలిగే సామర్థ్యాన్ని కాపాడుకోవడమే ప్రస్తుత అసలైన నాయకత్వ లక్షణం.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
బ్రిక్స్‌లో ఏకాభిప్రాయ గండం!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న వివాదంపై బ్రిక్స్ కూటమిలో ఉమ్మడి వైఖరిని రూపొందించడం సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ పరిణామాల్లో బ్రిక్స్ సభ్య దేశాలకు నేరుగా ప్రమేయం ఉండటమే దీనికి ప్రధాన కారణమని విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.జైశంకర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలుఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో భారత్ నాయకత్వంలోని బ్రిక్స్ కూటమి చురుకైన పాత్ర పోషించాలని అరాగ్చి ఈ సందర్భంగా ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ పోన్ సంభాషణ తర్వాత జైశంకర్ స్పందిస్తూ.. పశ్చిమాసియా పరిస్థితులపై బ్రిక్స్ సభ్య దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు. అయితే, కూటమిలోని కొన్ని దేశాలు ఈ వివాదంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములు కావడమే ఉమ్మడి ప్రకటనకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది.ఏకాభిప్రాయానికి ఆటంకాలు ఇవే..బ్రిక్స్ వేదికగా యుద్ధం పరంగా ఒకే మాట వినిపించడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. దీనికి కొన్ని అంశాలు అంశాలు కారణమవుతున్నాయి. జనవరి 2024లో బ్రిక్స్‌లో చేరిన ఇరాన్ ఈ వివాదంలో ప్రధాన పక్షంగా ఉంది. మరో సభ్య దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఈ ప్రాంతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. (2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇరాన్‌తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యూఏఈలకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించారు) సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక ప్రయోజనాలు వేర్వేరుగా ఉండటంతో ఈ సంఘర్షణపై ఒకే రకమైన వైఖరిని తీసుకోవడంలో ప్రతిష్టంభన నెలకొంది.భారత్ సారథ్యంబ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సంక్షోభ పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తోంది. సభ్య దేశాల మధ్య చర్చలను భారత్ సమన్వయం చేస్తోంది. ‘మార్చి 12న జరిగిన వర్చువల్ బ్రిక్స్ షెర్పా సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. పశ్చిమాసియాలోని సభ్య దేశాల నాయకులతో భారత అగ్రనాయకత్వం నిరంతరం టచ్‌లో ఉంది’ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
దద్దరిల్లిన ‘ఖర్గ్’
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్‌కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలనే గాక ఆ దేశంతో సంబంధమున్న చమురు వ్యవస్థలన్నింటినీ ఇకపై లక్ష్యం చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. తమపై అమెరికా దాడులకు ఉపయోగపడుతున్న గల్ఫ్ నగరాలన్నింటిపైనా ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది.అమెరికా సేనలు మోహరించిన ప్రదేశాల నుంచి పౌరులంతా తక్షణం వెళ్లిపోవాలని సూచించింది! మరోవైపు ఖర్గ్పై భూతల దాడులకు కూడా అమెరికా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2,500 మందితో కూడిన నావికా దళాన్ని, మరిన్ని ఆంఫీబియస్ యుద్ధ నౌకలను హుటాహుటిన గల్ఫ్‌కు తరలిస్తుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. వీటికి తోడు ఇరాన్‌తో యుద్ధం నిర్ణాయక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధ పరిధి మరింతగా విస్తరించడం ఖాయమని, తద్వారా మరింత జనహననం, ఆస్తి నష్టం తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చమురు వ్యవస్థలు బుగ్గే: ట్రంప్ఇరాన్ చమురు నెట్‌వర్క్‌కు జీవనాడి వంటి ఖర్గ్ దీవిపై అమెరికా భారీ స్థాయిలో దాడులకు దిగింది. అక్కడ పదులకొద్దీ సంఖ్యలో భారీ పేలుళ్లు విని్పంచాయి. సముద్రంలో అమర్చే మందుపాతరల నిల్వ కేంద్రం, క్షిపణి నిల్వ కేంద్రం, బంకర్లతో పాటు మొత్తం 90కి పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. దీవిలోని కీలకమైన సైనిక స్థావరాలను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే కీలకమైన చమురు వ్యవస్థల జోలికి మాత్రం పోలేదని తెలిపారు.హార్మూజ్ గుండా నౌకల ప్రయాణాన్ని ఇరాన్ నిరోధిస్తే వాటిని కూడా తుడిచి పెట్టేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ఆయన పోస్టులు చేశారు. జపాన్ నుంచి తక్షణం పశ్చిమాసియాకు తరలాలంటూ 31వ మరీన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్, యాంఫిబియస్ షిప్ యూఎస్ఎస్ ట్రిపోలీకి ఆదేశాలు జారీ అయ్యాయి. యూఎస్ఎస్ అబ్రహంలింకన్తో పాటు అమెరికా ఇప్పటికే 12 యుద్ధ నౌకలను, 8 డి్రస్టాయర్లను గల్ఫ్‌లో మోహరించింది. అమెరికా దాడిలో ఖర్గ్‌లోని తమ చమురు వ్యవస్థలకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ఇరాన్ పేర్కొంది.ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, నావల్ బేస్, విమానాశ్రయ కంట్రోల్ టవర్, ఒక చమురు కంపెనీ తాలూకు హెలికాప్టర్ హ్యాంగర్‌పై దాడులు జరిగినట్టు తెలిపింది. శనివారం ఇరాన్లో 200 పై చిలుకు లక్ష్యాలను తుడిచిపెట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిలో క్షిపణి కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలున్నట్టు తెలిపింది. అయితే ఖర్గ్ నుంచి చమురు ఎగుమతులు నిర్నిరోధంగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది. లెబనాన్‌లో మృతులు 826 మంది లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. బీరూట్, శివార్లపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 826 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వం పేర్కొంది. వారిలో 31 మంది వైద్య సిబ్బందేనని తెలిపింది. దాడుల తీవ్రతకు ఐదు ఆస్పత్రులను మూసేయాల్సి వచ్చినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా 8.5 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. మొజ్తబాపై 92 కోట్ల రివార్డు ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ జాడ తెలిపిన వారికి కోటి డాలర్ల (రూ.92.5 కోట్ల) రివార్డును అమెరికా ప్రకటించింది. విదేశాంగ శాఖ ఎక్స్‌లో ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఖమేనీతో పాటు ఆయన కార్యాలయ చీఫ్ అలీ హస్గర్ హెజాజీ, భద్రతా విభాగం ఉన్నతాధికారి అల లరిజానీ తదితరుల పేర్లను కూడా పేర్కొంది. వాళ్లకు సంబంధించిన సమాచారం అందించే వారికి తగిన పారితోíÙకంతో పాటు పునరావాసం కూడా కలి్పస్తామని పేర్కొంది.గల్ఫ్‌పై క్షిపణుల వర్షంఖర్గ్పై అమెరికా దాడులకు తమ ప్రతీకారం ఊహించని స్థాయిలో ఉంటుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘెర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. కనీవిని ఎరుగని రీతిలో పూర్తిస్థాయి దాడులకు దిగుతామన్నారు. అందుకు తగ్గట్టే ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాలపైనా దాడుల తీవ్రతను ఇరాన్ యథాతథంగా కొనసాగించింది. శనివారమంతా వాటిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌పై క్షిపణి దాడికి దిగింది. తీవ్ర నష్టానికి సంకేతంగా అక్కడినుంచి భారీగా పొగలు వెలువడ్డాయి.ఇరాన్ డ్రోన్ దాడిలో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడి నుంచి వెలువడే పొగలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా బ్యాంకులు, ఇతర వ్యవస్థలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు జరుపుతోంది. దుబాయ్‌లోని జెబెల్ అలీ, అబుదాబిలోని ఖలీఫా, పుజైరా నౌకాశ్రయాలను విడిచి వెళ్లాల్సిందిగా సిబ్బందిని, ప్రజలను ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాటిపైనా భారీ దాడులు తప్పవని భావిస్తున్నారు. 9 బాలిస్టిక్ క్షిపణులను, 33 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.నిమిషాల్లో 1,430 క్షిపణులు! ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్ ఖర్గ్ దీవిపై అమెరికా దాడితో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌పై శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1,430 క్షిపణులు ప్రయోగించింది! ఇజ్రాయెల్ వైద్య సేవా విభాగానికి చెందిన మాగెన్ డేవిడ్ ఆడొమ్ దీన్ని ధ్రువీకరించారు. ఈలట్ నగరంలో చాలా ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఎంతోమంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు కూడా క్షిపణుల మోతతో దద్దరిల్లిపోయాయి.హార్మూజ్‌కు యుద్ధనౌకలు పంపండి ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తిహార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పలు దేశాలు ఇప్పటికే అమెరికాకు దన్నుగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని చెప్పారు. హార్మూజ్‌ను త్వరలో తెరిపించి అక్కడినుంచి అంతర్జాతీయ రవాణా యథావిధిగా సాగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.గల్ఫ్ దేశాలపై దాడులొద్దు ఇరాన్‌కు హమాస్ పిలుపు గల్ఫ్ దేశాలపై దాడులకు ఇరాన్ స్వస్తి పలకాలని పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్ విజ్ఞప్తి చేసింది! పొరుగు దేశాలపై దాడులు మానుకోవాలని హితవు పలికింది. యుద్ధానికి తక్షణం తెర దించేలా దేశాలన్నీ కృషి చేయాలని కూడా పిలుపునిచి్చంది. ఇరాన్‌కు హమాస్ అత్యంత సన్నిహితమన్నది తెలిసిందే. దానికి ఇరాన్ పూర్తిస్థాయిలో సాయుధ, ఆర్థిక సాయం చేస్తుంటుంది. హమాస్ ప్రకటనపై ఇరాన్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.మరో ఐదు విమానాలను నష్టపోయిన అమెరికా! ఇరాన్ దాడుల్లో అమెరికా గత రెండు రోజుల్లో మరో ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలను నష్టపోయినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడుల్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు కేసీ–135 స్ట్రాటో ట్యాంకర్ రీ ఫ్యూయలింగ్ విమానాలకు భారీ నష్టం వాటిల్లినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేపట్టారని ఇద్దరు అమెరికా సైనికాధికారులను ఉటంకిస్తూ కథనం వెలువరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చారు. ఇదంతా అమెరికా ఓటమిని కోరుకునే కొన్ని పనికిమాలిన మీడియా సంస్థల దిగజారుడు ప్రచారమేనంటూ మండిపడ్డారు. ‘‘నాలుగు విమానాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. ఇరాన్‌పై దాడుల్లో అవి చురుగ్గా పాల్గొంటున్నాయి. ఒక్క రీ ఫ్యూయలింగ్ విమానానికి స్వల్ప నష్టం జరిగింది. మా సైన్యం దానికి వెంటనే మరమ్మతు చేసింది కూడా’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
ఏం కావాలో ‘ట్రంప్’కు తెలుసు!
‘ట్రంప్ ఏం కోరుకుంటున్నారో ఆయనకే తెలియడం లేదు’ అని మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తనకి ఏమి కావాలో ట్రంప్‌కు బాగానే తెలుసు. తెలియంది తల్మీజ్కే! ఇరాన్లో చమురు ఉంది. గ్యాస్ ఉంది. అది తనకి కావాలి. ఈ మాట మనం చెప్పడం కాదు; ట్రంపే స్వయంగా చెప్పాడు. 2019లో సిరియా యుద్ధం గురించి మాట్లాడుతూ ‘ఆ చమురు మనదే. దాన్ని మనమే ఉంచుకోవాలి అని నేను ఎప్పటినుంచో చెబు తున్నాను’ అని అన్నాడు. ఇరాన్ సుమారుగా 4,800 పై చిలుకు బావులున్న ప్రాంతం. వాటి మీద అనాదిగా అమెరికా కన్ను ఉంది.‘ఇరాన్ అణ్వాయు ధాల్ని తయారు చేస్తుంది అందుకే దాడుల్ని చేశాము’ అనేది పైకి చెప్పే మాట. చమురు, గ్యాస్ ఉన్న ప్రాంతాలన్నిటినీ కబళించాలనేది అమెరికా చిరకాల వాంఛ. ఇరాక్, లిబియా, సిరియాల మీదా అందుకే దాడి చేసింది. అవి ఆక్రమణలోకి రాక పోవొచ్చు. అది వేరే సంగతి. ‘అవి రావు’ అని కూడా అమెరికాకు తెలుసు. కానీ తన ప్రయత్నం మానదు. అ ప్రయత్నం వల్ల కొంత లొంగుబాటు ఉంటుంది. రాజీలు ఉంటాయి. టెక్నాలజీ పేరుతో ప్రపంచంలో పెద్ద చమురు కంపెనీలైన ఎక్సోనా మొబైల్, చెవ్రోనా (అమెరికా), బీపీ (బ్రిటన్), షెల్ (నెదర్లాండ్), టోటల్ ఎనర్జీస్ (ఫ్రాన్స్) లాంటి కంపెనీలను అక్కడ దించుతుంది. ఎక్కువ కమి షన్లను రాబడుతుంది. ఇది ఇప్పటి కథ కాదు, అనాదిగా జరుగుతున్నది ఇదే! ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్ లాంటి దేశాల్లో చమురు ఉంది. కానీ టెక్నాలజీ ఉండేది కాదు. 1940–1970 మధ్యకాలంలో ‘సెవెన్ సిస్టర్స్’ అని పెద్ద చమురు కంపెనీలు ఉండేవి. ఇవి ఆ యా దేశాల్లోకి వెళ్లి తక్కువ ధరలకే ఒప్పందాలు చేసుకుని, ఎక్కువ లాభం వేసుకునేవి. ఈ దోపిడీని భరించలేక, 1960లో కొన్ని చమురు దేశాలు కలిసి ‘ఒపెక్’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సంస్థ ద్వారా చమురు ధరలపై ఆ యా దేశాల స్వయం నియంత్రణ పెంచడం, పాశ్చాత్య కంపెనీల ప్రభావాన్ని తగ్గించడం చేశాయి. 1973లో జరిగిన ఒక పెద్ద సంఘటన ప్రపంచ చమురు రాజకీయాలను పూర్తిగా మార్చింది. దీనిని ‘చమురు ఆయుధం (ఆయిల్ వెపన్)’ అని అంటారు. 1973లో మధ్యప్రాచ్యంలో ‘యోమ్ కిప్పూర్’ పేరుతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అప్పుడు అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇచ్చింది. దానికి ప్రతిగా చమురు ఉత్పత్తి చేసే అరబ్ దేశాలు ‘అమెరికాకు, దానికి మద్దతు ఇచ్చిన దేశాలకు చమురు అమ్మకాలు ఆపివేయాలి’ అని ఒక నిర్ణయం చేశాయి. దీంతో ప్రపంచంలో పెద్ద సమస్య వచ్చింది: చమురు ధర 4 రెట్లు పెరిగింది. ఈ యుద్ధం వలన కూడా మళ్లీ అలాంటి సంక్షోభం వచ్చినా ఆశ్చర్యం లేదు! – నన్నూరి వేణుగోపాల్ ‘ మానవ హక్కుల కార్యకర్త -
సామాన్యుడి జేబుకు ‘యుద్ధం’ చిల్లు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలోని వివిధ దేశాలతోపాటు భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. యునైటెడ్ స్టేట్స్-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం దౌత్యపరమైన అంశాలకే పరిమితం కాకుండా భారతీయులు రోజువారీ వాడే ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు కొరతతో ప్యాకేజింగ్ ఖర్చులు భారమవడంవల్ల కంపెనీలు ధరల పెంపు లేదా పరిమాణం తగ్గింపు దిశగా అడుగులు వేస్తున్నాయి.పశ్చిమాసియా ప్రాంతం ప్యాకేజింగ్ పరిశ్రమకు కీలకంగా ఉంది. సబ్బులు, బిస్కెట్లు, డిటర్జెంట్ల ప్యాకింగ్‌కు వాడే పాలిమర్లు (పాలీప్రొపైలిన్, పాలిథిలిన్) నేరుగా ముడి చమురు నుంచే తయారవుతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా గొలుసు దెబ్బతింది.ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి 50% పాలిమర్లను దిగుమతి చేసుకున్న భారత కంపెనీలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా చైనా, థాయ్‌లాండ్, సింగపూర్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ముడి చమురు ధరలు పెరగడంతో రవాణా, ముడిసరుకు సేకరణ ఖరీదైన వ్యవహారంగా మారింది.ధర పెంపు లేదా క్వాంటిటీలో కోత?వ్యాపార నిర్వహణ భారమవడంతో దిగ్గజ సంస్థలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా దీనిపై స్పందిస్తూ.. తమ మొత్తం ఖర్చులో ప్యాకేజింగ్ వాటా 15-20 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. ‘చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే చిన్న ప్యాకెట్లలో పరిమాణాన్ని తగ్గించడం, పెద్ద ప్యాకెట్ల ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదు’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తుల తయారీలో కీలకమైన లీనియర్ ఆల్కైల్ బెంజీన్ (ఎల్ఏబీ) ధరలు కూడా చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. డిటర్జెంట్ ముడి పదార్థాల ఖర్చులో దీని వాటా దాదాపు 50% ఉండటం గమనార్హం.జీఎస్టీ లాభాలకు గండిఈ ధరల పెంపు నిర్ణయం సామాన్య వినియోగదారుడికి భారంగా మారనుంది. గత సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సవరణల వల్ల కంపెనీలు ప్యాకెట్ల పరిమాణాన్ని పెంచి, ధరలను తగ్గించాయి. తద్వారా లభించిన ఉపశమనాన్ని ప్రస్తుత యుద్ధ వాతావరణం పూర్తిగా తుడిచిపెట్టేసే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. -
నౌకా విలాపం..
రణక్షేత్రంలో శత్రుసేన తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తుంటే సైనికుడు రక్షణగా దాక్కోడానికి కందకాల వంటి ఏర్పాట్లు ఉంటాయి. కనీసం కొండప్రాంతాల్లో పెద్దరాళ్ల మాటున నిలబడి ప్రతిదాడి చేయొచ్చు. కానీ సువిశాల సముద్రంలో నిరాయుధంగా వెళ్లే నౌకలకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దాంతో పశ్చిమాసియా యుద్ధంలో ముడి చమురు, సరకు రవాణా నౌకలు సులభంగా చిక్కి శత్రుదాడుల్లో దారుణంగా ధ్వంసమవుతున్నాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడిగా దాడిచేస్తే ఆ తర్వాతి రోజు నుంచే నౌకలపై దాడుల పర్వం మొదలైంది. ఆనాటి నుంచి ప్రతిరోజూ ప్రత్యర్థిదేశ దాడులతో దారుణంగా దెబ్బతింటూ శి«థిలమయమై ఎలాగోలా కొన్ని హార్బర్లకు చేరుకుంటున్నాయి. మరికొన్ని నీటమునిగి సముద్రగర్భానికి చేరుకుంటున్నాయి. మార్చినెల తొలిరోజు నుంచీ దాదాపు 19 నౌకలపై దాడులు జరిగాయి.మార్చి 1: ఒమన్ రాజధాని మస్కట్‌కు 50 నాటికల్ మైళ్ల దూరంలో మార్షల్ ఐలాండ్స్ జెండాతో వెళ్తున్న చమురునౌక ‘ఎంకేడీ వ్యోమ్’పై దాడి జరిగింది.ఈ ఘటనలో నౌక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమా పోర్ట్‌కు 17 నాటికల్ మైళ్ల దూరంలో గిబ్రాల్టన్ జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ‘హెర్కులస్ స్టార్’పైనా దాడి జరిగింది. ఒమన్‌లోని కుమ్జార్ సమీప హార్మూజ్ జలసంధిలో పలావూ జెండాతో వెళ్తున్న ట్యాంకర్ ‘స్కైలైట్’మీదా దాడి జరిగింది.మార్చి 2 : బహ్రెయిన్ నౌకాశ్రయంలో అమెరికా జెండాతో నిలిచి ఉన్న సరకుల నౌక ‘స్టెనా ఇంపరేటివ్’పై దాడి జరిగింది. అగ్నికీలలను వెంటనే ఆర్పేశారని యునైటెడ్ కింగ్డమ్ మ్యారటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) తెలిపింది.మార్చి 3 : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా పోర్ట్‌కు 10 నాటికల్ మైళ్ల దూరంలోని మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న చమురు ట్యాంకర్ ‘లిబ్రా ట్రేడర్’, పనామా జెండాతో ఉన్న చమురు నౌక ‘గోల్డ్ ఓక్’పైనా దాడి జరిగింది.మార్చి 4: ఒమన్‌కు ఉత్తరాన హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న మాలీ్టస్ జెండాతో ఉన్న కంటైనర్ నౌక ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’పై దాడి జరిగింది. దీంతో నౌక నుంచి అందరూ సముద్రంలోకి దూకేశారు.మార్చి 5: ఇరాక్‌లోని ఖోర్ అల్ జుబేర్ పోర్ట్‌లో లంగరేసిన చమురునౌక ‘సోనాంగోల్ నమీబే’పై దాడి జరిగింది. బహమాస్ జెండాతో వెళ్తున్న మరో నౌకను ఇరాన్ పేలుడుపదార్థాలున్న పడవను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రిస్తూ ఢీకొట్టించింది. దీంతో నౌక ధ్వంసమైంది.మార్చి 6: మార్చి నాలుగోతేదీన ధ్వంసమైన ‘సఫీన్ ప్రిస్ట్రీజ్’కు మరమ్మత్తులు చేసేందుకు సిబ్బందితో వచ్చిన టగ్బోట్ పైనా దాడి జరిగింది.ఒమన్‌కు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.మార్చి 7: సౌదీ అరేబియాలోని జుబేల్‌కు ఉత్తరంగా 10 నాటికల్ మైళ్ల దూరంలో మరో నౌకపై దాడి జరిగింది. నౌక అగి్నకి ఆహుతి అవుతుండటంతో సిబ్బంది అంతా సముద్రంలో దూకారు.మార్చి 11: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఖలీఫా పోర్ట్ నుంచి గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి బయల్దేరిన సరుకు రవాణా నౌక ‘మయూరి నారీ’హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేటప్పుడు దానిపై ఇరాన్ దాడి చేసింది. దీంతో నౌక పైభాగంలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. వెంటనే సహాయక చర్యలు చేపట్టి 20 మంది సిబ్బందిని ఒమన్ నేవీ కాపాడింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్‌ఖైమా నౌకాశ్రయం నుంచి ఉత్తరంగా 29 నాటికల్ మైళ్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో జపాన్ జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘వన్ మ్యాజిస్టీ’పైనా ఇరాన్ దాడిచేసింది. దుబాయ్‌కు ఉత్తరంగా 92 కిలోమీటర్ల దూరంలో హార్మూజ్ జలసంధిలో మార్షల్ దీవుల జెండాతో వెళ్తున్న ‘స్టార్ గేనిత్’నౌక మీదా ఇరాన్ దాడిచేసిందని నౌకల భద్రతా సంస్థ వ్యాన్‌గార్డ్ ప్రకటించింది.మార్చి 12: ఇరాక్‌లోని ఉమ్ ఖాసర్ నగరంలోని ఖోర్ అల్ జుబేర్ నౌకాశ్రయంలోని అమెరికాకు చెందిన మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ముడిచమురు రవాణా నౌక ‘సేఫ్సీ విష్ణు’పై ఇరాన్ దాడిచేసింది. ఈ ఘటనలో భారతీయుడు చనిపోయారు. మాల్టా దేశ జెండాతో ఉన్న జిఫిరోస్ నౌక పై ఇరాన్ ఆత్మాహుతి పడవలు దాడిచేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా వ్యవస్థలో మరింత అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు, నివాసితులకు మార్గదర్శకాలు జారీ చేసింది.మెనూ నుంచి చపాతీ, దోశ అవుట్?గ్యాస్ కొరత దృష్ట్యా హాస్టల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ఒక నోటీసును విడుదల చేసింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే అల్పాహారాలను ప్రస్తుతానికి నిలిపివేయాలని హాస్టల్ యజమానులను కోరింది. చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలకు స్వస్తి పలకాలని సూచించింది. పరిస్థితి మెరుగుపడే వరకు కేవలం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందించే అవకాశం ఉంది. లభ్యతను బట్టి అదనపు కూరలు, స్నాక్స్‌ను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసితులు హాస్టళ్ల యాజమాన్యానికి సహకరించాలి. వంటకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని హాస్టల్ యజమానులను కోరుతున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు.హోటల్ పరిశ్రమలోనూ ఆందోళనహాస్టళ్లు మాత్రమే కాకుండా నగరంలోని హోటళ్లు కూడా వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.25 రోజుల వెయిటింగ్ పీరియడ్మరోవైపు, తెలంగాణలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలను అధికారులు పాక్షికంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల సిలిండర్ల సరఫరా స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే, ప్రజలు భయంతో సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ బుకింగ్‌ల కోసం 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమలులోకి వచ్చింది. సరఫరా క్రమబద్ధీకరణ కోసమే ఈ నిబంధన విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
బంగ్లాదేశ్‌కు భారత్ ఆపన్నహస్తం
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు దక్షిణ ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన బంగ్లాదేశ్ తన అవసరాల కోసం ఇప్పుడు పూర్తిగా భారత్ వైపు చూస్తోంది. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడంతో తలెత్తిన కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి అత్యవసరంగా డీజిల్ దిగుమతులను వేగవంతం చేసింది.బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) ఛైర్మన్ ముహమ్మద్ రెజానుర్ రెహ్మాన్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా 5,000 టన్నుల డీజిల్ సరుకు బంగ్లాదేశ్‌కు చేరుతోంది. భారత్ నుంచి ఏటా 1.8 లక్షల టన్నుల డీజిల్‌ను పైప్‌లైన్ ద్వారా దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఆరు నెలల్లో కనీసం 90 వేల టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందుతున్న 5,000 టన్నులతో పాటు రాబోయే రెండు నెలల్లో ఆరు నెలలకు సరిపడా కోటాను పూర్తిగా భారత్ నుంచి దిగుమతి చేస్తామని రెహమాన్ తెలిపారు.మూతపడుతున్న యూనివర్సిటీలుబంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఇంధన పరిమితులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేసింది. ల్యాబ్‌లు, ఏసీలు, హాళ్లలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండటమే దీనికి కారణం. ప్రజలు ఇంధనాన్ని నిల్వ చేయకుండా ఉండేందుకు రోజువారీ విక్రయాలపై పరిమితులు విధించారు. స్పాట్ మార్కెట్ నుంచి అత్యధిక ధరలకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) కొనుగోలు చేస్తోంది.భారత్ పాత్ర కీలకంఅంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండుతున్న వేళ పొరుగు దేశానికి భారత్ అందిస్తున్న ఈ సహకారం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘వినియోగాన్ని తగ్గించడానికి, ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మరింత కాలం కొనసాగితే బంగ్లాదేశ్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారత్ వంటి దేశాలు భరోసాగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు -
ఐటీ కంపెనీలూ...పారాహుషార్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళికరాజకీయ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో కార్యకలాపాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హెచ్చరించింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేలా ఆపరేషనల్ సన్నద్ధతను పెంచుకోవాలని, సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచిస్తూ తాజాగా అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతానికి వ్యాపార కార్యకలాపాలు నిలకడగానే ఉన్నప్పటికీ పరిస్థితులు దిగజారితే ఎదురయ్యే అవరోధాలను అదిగమించేందుకు కంపెనీలు క్రియాశీలకంగా తమ అత్యవసర ప్రణాళికలను పునఃసమీక్షించుకుంటున్నాయని, పటిష్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని నాస్కామ్ పేర్కొంది. కీలకమైన సరీ్వసులు దెబ్బతినకుండా సిస్టంలు పటిష్టంగా ఉండేందుకు క్లౌడ్ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్లకు ప్రత్యామ్నాయ రూటింగ్ ఆప్షన్లను కూడా పరిశీలించాలని సూచించింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటు కల్పిస్తున్నాయని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను నిశిచంగా పరిశీలిస్తున్నాయని వివరించింది. అనిశ్చితితో సైబర్ దాడుల ముప్పులు సాధారణంగా భౌగోళికరాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు మూకుమ్మడి సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాలు, మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంలాంటి ఉదంతాలు చోటు చేసుకుంటూ ఉంటాయని నాస్కామ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ని అమల్లోకి తేవడం, పశి్చమాసియా దేశాల్లో కార్యకలాపాలున్న థర్డ్ పార్టీ వెండార్లతో లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం తదితర చర్యలు తీసుకోవాలని సూచించింది.యుద్ధ పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అలర్టుల్లాగా మభ్యపెట్టే థీమ్‌లతో జరిగే సోషల్ ఇంజినీరింగ్ దాడులపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నాస్కామ్ పేర్కొంది. పశ్చిమాసియాలో పరిణామాలను తాము కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన మద్దతును అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని వివరించింది. -
చమురు నిల్వలే లక్ష్యం!
దుబాయ్: పశ్చిమాసియాలో పోరు బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇరాన్ చమురు నిల్వలపై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్ మరింతగా పెంచింది. ఆదివారం 4 కేంద్రాలపై దాడులు చేయగా సోమవారం ఏకంగా 30 చమురు నిల్వ డిపోలపై బాంబుల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా భారీగా మంటలు చెలరేగి భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ క్షిపణి, అణు కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్, అమెరికా తీవ్రస్థాయిలో దాడులను కొనసాగించాయి. దాంతో నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు, పరిసర ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. ఇస్ఫహాన్‌లోని రివల్యూషనరీ గార్డ్ కమాండ్ కేంద్రాలు, దాని అనుబంధ సంస్థ బసీజ్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం భారీగా దెబ్బతిన్నాయి.రాకెట్ ఇంజిన్ల తయారీ కేంద్రంతో పాటు క్షిపణి ప్రయోగ కేంద్రాలను కూడా నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై కూడా రోజంతా ఎడతెరిపి లేకుండా క్షిపణులు, బాంబుల వర్షం కురిసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని చమురు నిల్వలనే లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ దాడుల్లో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి భారీగా నిప్పంటుకుంది. బహ్రెయిన్‌లోని ఏకైక చమురు రిఫైనరీ కూడా మంటల్లో చిక్కింది. సౌదీ అరేబియాలో అతి పెద్దదైన షైబా చమురు క్షేత్రంపైనా పలు డ్రోన్ దాడులు జరిగాయి. వాటిని అడ్డుకున్నట్టు సౌదీ ప్రకటించింది. అయినా షైబా వైపు దశలవారీగా డ్రోన్లు దూసుకొస్తున్నట్టు వెల్లడించింది. ఇరాన్ తీరు బాధ్యతారహితమంటూ మండిపడింది.అరబ్ దేశాలపై ఇలాగే దాడులు కొనసాగిస్తే అంతిమంగా అందరికంటే భారీగా నష్టపోయేది ఆ దేశమేనంటూ తీవ్రంగా హెచ్చరించింది. అటు ఇజ్రాయెల్‌పైకి కూడా ఇరాన్ భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలు బంకర్లలో తలదాచుకుంటున్నారు. దాడుల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడ్డారు. ఆదివారం తమపై ఇరాన్ జరిపిన దాడుల్లో మరణించిన ఇద్దరిలో ఒక భారతీయుడు ఉన్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని సౌదీ అరేబియా పేర్కొంది. బహ్రెయిన్‌లో 32 మందికి గాయాలు యూఏఈ, బహ్రెయిన్, కువైట్, దోహా, ఖతర్ తదితర గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు భారీ స్థాయిలో కొనసాగాయి. బహ్రెయిన్‌లో ఓ పౌర ఆవాస ప్రాంతం కుప్పకూలడంతో 32 మంది గాయపడ్డారు. వారిలో పలువురు చిన్నారులున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యూఏఈపై కూడా 15 బాలిస్టిక్ మిసైళ్లు, 18 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. తమ దేశంపైకి దూసుకొచ్చిన 17 క్షిపణులు, ఆరు డ్రోన్లను అడ్డుకున్నట్టు ఖతర్ పేర్కొంది. పర్షియన్ గల్ఫ్ తీర సమీపంలో అమెరికా యుద్ధ నౌకలతో పాటు చమురు నౌకలను కూడా లక్ష్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.తమ దేశ గగనతలంలోకి దూసుకొచ్చిన ఇరాన్ ఖండాంతర క్షిపణిని నాటో డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకుని కూల్చేసినట్టు టర్కీ ప్రకటించింది. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్‌ను నిర్వీర్యం చేసినట్టు ఇరాక్ వెల్లడించింది. మరోవైపు లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 486కు చేరినట్టు లెబనాన్ పేర్కొంది. ఎన్నికపై నిరసనలు! సుప్రీం నేత పదవిని వారసత్వంగా మొజ్తబాకు కట్టబెట్టడంపై ఇరాన్లో పలువురు రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1979లో వారసత్వ పోకడలపై పోరాడి రాచరికాన్ని కూలదోసి, ఇప్పుడు మళ్లీ అదే దారిలో వెళ్లడం ఏ మేరకు సరైందని వాళ్లు ప్రశి్నస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ వార్తలను కొట్టిపారేస్తోంది. ఇరాన్‌కు మా దన్ను: పుతిన్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఇరాన్‌కు పూర్తిస్థాయిలో మద్దతుగా నిలుస్తామని రష్యా ప్రకటించింది. నూతన సుప్రీం నేతగా ఎన్నికైన మొజ్తబాకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరాన్‌కు అన్నివిధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో పౌరులపై ఇరాన్ దాడులను జపాన్, ఈజిప్ట్ ఖండించాయి. మొజ్తబాకే ఓటుఅమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఫిబ్రవరి 28న తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం తెలిసిందే. ఆయన వారసుడు ఎవరన్న సస్పెన్షన్‌కు ఇరాన్ సోమవారం తెర దించింది. ఊహించినట్టుగానే ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా హొసేనీ ఖమేనీనే సుప్రీం నేతగా ప్రకటించింది. 88 మంది మత పెద్దలతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్’ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. ఖమేనీపై జరిగిన దాడిలో 56 ఏళ్ల మొజ్తబా కూడా గాయపడ్డట్టు వార్తలు రావడం తెలిసిందే.ఖమేనీతో పోలిస్తే మొజ్తబా మరింత కరడుగట్టిన మతవాదిగా, అమెరికా విద్వేషిగా పేరుబడ్డారు. దీనికి తోడు తండ్రితో పాటు మొజ్తబా తల్లి, భార్య, చిన్న కుమారుడు కూడా ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. దాంతో ఆయన ప్రతీకారంతో రగిలిపోతున్నారు. దాంతో మొజ్తబా సారథ్యంలో ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతిదాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని భావిస్తున్నారు. మరోవైపు, ఖమేనీ వారసునిగా ఎవరిని ఎన్నుకున్నా మట్టుబెట్టి తీరతామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పోరు మరింత ముమ్మరం కావడమే తప్ప నెమ్మదించే పరిస్థితులు కని్పంచడం లేదు.ఎరిత్రియా దాకా వెళ్లి తిరిగొచ్చిన ఇండిగో విమానం న్యూఢిల్లీ: భారత్ నుంచి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌కు బయల్దేరిన ఇండిగో విమానం పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎరిత్రియా నుంచే వెనక్కు తిరిగొచ్చింది. ఈ ఉదంతం సోమవారం చోటుచేసుకుంది. విమానం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి మాంచెస్టర్ బయల్దేరింది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం అనంతరం, ఎరిత్రియా గగనతలంలోకి ప్రవేశించనుందనగా ఉన్నట్టుండి వెనుదిరిగి ఢిల్లీ చేరుకుంది.ఇందుకు దారితీసిన కారణాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఎరిత్రియా హఠాత్తుగా గగనతలాన్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుందని ఇండిగో వర్గాలు అంటున్నాయి. యూరప్ రూట్లలో నడిపేందుకు నార్వేకు చెందిన నోర్సే అట్లాంటిక్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన బోయింగ్ 787 విమానాలను ఇండిగో లీజుకు తీసుకుంది. ఇక్కడే ఎరిత్రియా ఎయిర్ ట్రాఫిక్ విభాగం అయోమయానికి లోనై అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. ప్రయాణాన్ని తిరిగి కొనసాగించేందుకు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది.చమురు ధరలు దిగొస్తాయి: ట్రంప్పశ్చిమాసియా పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు విపరీతంగా రెక్కలొచ్చాయి. అయితే రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు చూసి భయపడాల్సిన పనేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘‘చమురు నిల్వలకు కొరతేమీ లేదు. వాటి ధరలు త్వరలోనే దిగొస్తాయి’’ అని ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. వెనెజువెలా చమురు సాయంతో పరిస్థితిని చక్కదిద్దుతామని చెప్పారు. ఇరాన్ క్షిపణి పాటవాన్ని పూర్తిగా నేలమట్టం చేసేందుకు అతి దగ్గర్లో ఉన్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు.మరో అమెరికా సైనికుని మృతిమార్చి 1న కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల్లో గాయపడ్డ మరో సైనికుడు తాజాగా మృతి చెందాడు. అమెరికా సైన్యం సోమవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దాంతో ఇప్పటిదాకా మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 8కి పెరిగింది.ఇజ్రాయెల్‌లో గాయపడ్డ భారతీయుడుఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల్లో ఒక భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం క్షిపణి దాడుల సందర్భంగా టెల్ అవీవ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ‘‘మెడకు తీవ్ర గాయంతో విషమ పరిస్థితుల్లో అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్నాడు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది’’ అని వెల్లడించారు. -
‘కోటి మంది భారతీయుల క్షేమమే మా ప్రాధాన్యత’
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతకంతకూ క్షీణిస్తున్న భద్రతా వాతావరణంపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా, భారత ఇంధన భద్రత, కోటి మంది ప్రవాస భారతీయుల జీవనానికి ముప్పుగా పరిణమించిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత తొలి రోజైన సోమవారం ఆయన రాజ్యసభలో పశ్చిమాసియా పరిణామాలపై మాట్లాడారు.క్షీణించిన భద్రత.. ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థపశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు దిగజారాయని మంత్రి పేర్కొన్నారు. ‘మేము అక్కడి పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఈ సంఘర్షణ ఆ ప్రాంతంలో సాధారణ జనజీవనాన్ని, ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇది ఇప్పటికే పొరుగు దేశాలకు వ్యాపించి విధ్వంసానికి దారితీస్తోంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సభ తరఫున ఆయన సంతాపం ప్రకటించారు.సరఫరా గొలుసుపై ప్రభావంభారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం ప్రధానంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలు ఇంధన భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని జైశంకర్ అన్నారు. ముడిచమురుకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత, సరఫరాలో అంతరాయాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు ఈ ప్రాంతంలోనే ఉండటంతో సరఫరా గొలుసు దెబ్బతినడం భారత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతుందని పేర్కొన్నారు.కోటి మంది భారతీయుల భద్రతపశ్చిమాసియాలో సుమారు కోటి మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారని, వారి శ్రేయస్సు అత్యంత ప్రధానమైన అంశమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇరాన్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని, వారి భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భారతీయుల రక్షణే తమ మొదటి ప్రాధాన్యతని పునరుద్ఘాటించారు.ఇరాన్ నౌకల అభ్యర్థనపై స్పష్టతసముద్ర లాజిస్టిక్స్ విషయంలో ఇరాన్ ఇటీవల భారతదేశాన్ని సంప్రదించిందని జైశంకర్ వెల్లడించారు. భారత తీరాల్లో మూడు ఇరాన్ నౌకలు లంగరు వేయడానికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. అయితే, ఈ అభ్యర్థనను భారత ప్రభుత్వం తన జాతీయ ప్రయోజనాలను, అంతర్జాతీయ నిబంధనలను బేరీజు వేసుకుంటూ నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.చర్చలు ముఖ్యం‘ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదు. చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచీ నమ్ముతోంది. ఇటీవల కూడా మేము ఇదే విషయాన్ని చెప్పాం’ అని జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడం భారతదేశ ఆర్థిక పురోగతికి, ప్రాంతీయ భద్రతకు అత్యవసరమని సభకు వివరించారు.ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం! -
కాంపోజిషన్ ఫీజు ఉండదు.. ఎగుమతిదారులకు కేంద్రం ఊరట
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఎగుమతిదారులకు ఊరటనిచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి మే 31 మధ్య ముగిసిపోయే ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్ (ఈవో) వ్యవధిని ఆటోమేటిక్‌గా ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) వెల్లడించింది. ఇందుకోసం కాంపోజిషన్ ఫీజు ఉండదని పేర్కొంది.సాధారణంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ క్యాపిటల్ గూడ్స్ (ఈపీసీజీ) స్కీము కింద దేశీ సంస్థలు సుంకాల రహితంగా మెషిన్లను దిగుమతి చేసుకోవచ్చు. అయితే, దానికి ప్రతిగా నిర్దిష్ట వ్యవధిలో ఎగుమతులు చేయాల్సి ఉంటుంది. అమెరికా టారిఫ్‌లతో సతమతమవుతుండగా ఇటు పశ్చిమాసియాలో సంక్షోభం కూడా తోడు కావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఎగుమతిదారులు ఈ విషయంలో వెసులుబాటునివ్వాలని కొంతకాలంగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. పోర్టుల్లో వెసులుబాటు.. ఎగుమతి సంస్థలకు మద్దతుగా నిల్చేలా కేంద్ర షిప్పింగ్, పోర్ట్స్, జలమార్గాల శాఖ నిర్ణయాలు తీసుకుంది. స్టోరేజి అద్దెలు, నౌకలను మార్చుకోవడానికి సంబంధించిన చార్జీలు మొదలైన వాటిని తగ్గించాలని లేదా మినహాయింపునివ్వాలని యూజర్ల నుంచి వచ్చే అభ్యర్ధనలను పరిస్థితిని బట్టి పరిగణనలోకి తీసుకోవాలని పోర్టులకు సూచించింది. పశ్చిమాసియా నుంచి వచ్చే పెరిషబుల్ కార్గో (ఎక్కువ కాలం నిల్వ ఉండని ఉత్పత్తుల)కి ప్రాధాన్యమివ్వాలని పేర్కొంది.అలాగే పోర్టుల్లో సమస్యలేవైనా తలెత్తితే సంప్రదించేందుకు నిర్దిష్టంగా నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం సూచించింది. ఆ అధికారి సదరు సమస్యలను ఆయా విభాగాల దృష్టికి తీసుకెళ్లి 24–72 గంటల్లోగా తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) ప్రకారం పోర్ట్ చైర్పర్సన్లు తరచుగా షిప్పింగ్ లైన్స్, ఎగుమతిదారులు, కస్టమ్స్, టర్మినల్ ఆపరేటర్లు మొదలైన వర్గాలతో సమావేశమై, పరిస్థితులను సమీక్షిస్తూ ఉండాలని తెలిపింది. -
వ్యవసాయ ఎగుమతులకు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల భారత వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వెల్లడించింది. జలరవాణా మార్గాల్లో ఆటంకాలు, పెరుగుతున్న బీమా వ్యయాలు, లాజిస్టిక్స్‌కి సంబంధించి అనిశ్చితితో దాదాపు 11.8 బిలియన్ డాలర్ల ఎగుమతులకు రిస్క్‌లు నెలకొన్నాయని పేర్కొంది.భౌగోళికంగా భారత్‌కి దగ్గరగా ఉండటంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉంటుండటంతో ఆ ప్రాంతం చారిత్రకంగా మన ఎగుమతులకు కీలక మార్కెట్‌గా నిలుస్తోందని జీటీఆర్ఐ పేర్కొంది. 2025లో పశ్చిమాసియాకు భారత్ దాదాపు 11.8 బిలియన్ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యవసాయ, ఆహారోత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ విభాగంలో మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 21.8 శాతంగా నిల్చింది. వీటిలో 7.48 బిలియన్ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి.పశ్చిమాసియా దేశాలకు బియ్యం, అరటిపళ్లు, ఉల్లి, పప్పు ధాన్యాలు, కాఫీ, టీ మొదలైన వాటిని కూడా భారత్ ఎగుమతి చేస్తోంది. ‘అత్యధికంగా బియ్యం మీద ప్రభావం పడొచ్చు. పశ్చిమాసియాకు భారత్ 4.43 బిలియన్ డాలర్ల బియ్యం ఎగుమతి చేసింది. ఇది అంతర్జాతీయంగా మన దేశం నుంచి బియ్యం ఎగుమతుల్లో 36.7 శాతం. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాలకు గల్ఫ్ దేశాలు కీలక మార్కెట్‌గా ఉంటున్నాయి‘ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ రూట్లలో ఆటంకాలు ఏర్పడి, బీమా వ్యయాలు పెరిగిపోయి ఎగుమతిదారులకు సందిగ్ధ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇది దేశీయంగా పలు రాష్ట్రాల్లోని రైతులు, ఫుడ్ ప్రాసెసర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. గత దశాబ్దకాలంగా వ్యవసాయ ఎగుమతుల కోసం పశ్చిమాసియా మార్కెట్‌పై భారత్ ఆధారపడటం పెరిగింది. బియ్యం, అరటిపళ్లు, సుగంధ ద్రవ్యాలు, డెయిరీ ఉత్పత్తులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. 2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలకు 396.5 మిలియన్ డాలర్ల విలువ చేసే అరటిపళ్లు, 111 మిలియన్ డాలర్ల ఉల్లి, వెల్లుల్లి ఎగుమతయ్యాయి. యాలకులు, జాజికాయలాంటివి (295.5 మిలియన్ డాలర్లు), జీలకర్ర–ధనియాల్లాంటివి (163 మిలియన్ డాలర్లు), అల్లం–పసుపు (173 మిలియన్ డాలర్లు), కాఫీ (240.7 మిలియన్ డాలర్లు), టీ (410.1 మిలియన్ డాలర్లు), ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ తదితరాలు (1.35 బిలియన్ డాలర్లు), చేపలు, మాంసం, ఫ్రోజెన్–ప్రాసెస్డ్ ఉత్పత్తులు (1.81 బిలియన్ డాలర్లు) మొదలైనవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 281.1 మిలియన్ డాలర్ల డెయిరీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇవి భారత్ నుంచి మొత్తం డెయిరీ ఎగుమతుల్లో 28.9 శాతం. 197.5 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆల్కహాలిక్, నాన్–ఆల్కహాలిక్ పానీయాలను పశ్చిమాసియాకి భారత్ ఎగుమతి చేసింది. -
పండ్ల రవాణాపై గల్ఫ్ గుబులు
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భాగ్యనగరం పండ్ల మార్కెట్‌పై పడింది. అరబ్బు దేశాల్లో కార్గో రవాణాపై ఆంక్షల నేపథ్యంలో పండ్లు, ఇంటీరియర్, ఫర్నిచర్ వంటి వస్తువులపై ప్రభావం పడింది. దీంతో ఇరాన్, దుబాయ్, టర్కీ, తుర్కియో వంటి దేశాల నుంచి నుంచి హైదరాబాద్‌కు దిగుమతి అయ్యే యాపిల్స్, కివీ, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ విదేశీ పండ్ల దిగుమతి తగ్గింది. వీటితో పాటు ఇంటీరియర్ ఫర్నిచర్లపై ప్రభావం ఉంది. రెండింతలైన ధరలు.. రంజాన్ మాసం కావడంతో సాధారణంగానే ఖర్జూరం, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌కు డిమాండ్ ఎక్కువ. పశి్చమాసియాలో యుద్ధంతో ధరలు దాదాపు రెండింతలు పెరిగాయి. సాధారణంగా అక్కడి మార్కెట్లో యాపిల్స్ ధర (బాక్స్) రూ.1,200 ఉంటుంది. అదే బాక్స్ నగర మార్కెట్లో దిగుమతి అయ్యాక రూ.1,800కు విక్రయిస్తుంటారు. కానీ, యుద్ధం నేపథ్యంలో అదే బాక్స్ ధర అక్కడి మార్కెట్లో రూ.1,800 ఉండగా.. ఇక్కడికొచ్చేసరికి రూ.2,500కు పెరిగింది. నిర్మాణ సామగ్రిపైనా.. ఇంధన, చమురు దిగుమతులతో పాటు స్థిరాస్తి మార్కెట్ కూడా ప్రభావం చూపిస్తుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ నుంచి ఇనుము, స్టీల్, కాపర్ వైర్లు దిగుమతి అవుతుంటాయి. గల్ఫ్ దేశాల నుంచి పెట్‌కోక్ (సిమెంట్‌లో ఉపయోగించేవి), పాలిమర్లు, సల్ఫర్,, సున్పపురాయి దిగుమతి అవుతాయి. ఈ ముడి పదార్థాలతో ఇంటీరియర్, నిర్మాణ సామగ్రి తయారవుతుంటాయి. మార్బుల్స్, టైల్స్, గ్లాస్ వంటివి దిగుమతులపై ప్రభావం ఉంటుంది. ఈ మేరకు తుది దశ నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో పాటు ధరలలో 1–2 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
ఇండియాలోని ఇజ్రాయెల్‌లో నిశ్శబ్దం
హిబ్రూ–ప్రభావిత కేఫ్ సంస్కృతి సహా పలు ఇతర లక్షణాల కారణంగా మన దేశంలోని హిమాలయ ప్రాంత గ్రామమైన కసోల్ ను ‘మినీ ఇజ్రాయెల్‘ గా పేర్కొంటారు. ఈ ప్రాంతం తొలిసారి ఈ పర్యాటక సీజలో అసాధారణ నిశ్శబ్ద వాతావరణాన్ని చవిచూస్తోంది. చాలా కాలంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చే సందర్శకులపై ఆధారపడిన స్థానిక వ్యాపారాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.సుందరమైన పార్వతి లోయలో ఉన్న కసోల్, కల్గా , పుల్గా వంటి సమీప గ్రామాలు సంవత్సరాలుగా ఇజ్రాయెల్ బ్యాక్ప్యాకర్లకు ఇష్టమైన స్టాప్‌లుగా నిలుస్తూన్నాయి. చెక్క ఇళ్ళు, ఆపిల్ తోటలు, ప్రశాంతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామాలు ఇజ్రాయెల్ ప్రయాణికులకు ఉపకరించేప్రత్యేక పర్యాటక సంస్కృతికి నిలయాలుగా మారాయి.ఇక్కడి చాలా కేఫ్‌లు ఇజ్రాయెల్ శైలిలో రూపొందిన వంటకాలను అందిస్తాయి అతిథులకు ఇంట్లో ఉన్నట్లు అనిపించేలా హోమ్‌స్టేలు తరచుగా తమ మెనూలను హిబ్రూలో ముద్రిస్తాయి. అయితే, ఈ సంవత్సరం, సందర్శకుల రాక కనిపించక సందడి తగ్గిపోయింది. ‘‘అంతర్జాతీయ బ్యాక్ప్యాకర్లకు బాగా ప్రసిద్ధి చెందిన జిప్సీ హౌస్ కేఫ్ – హోమ్‌స్టే దగ్గర ఆ తేడా కనిపిస్తోందని సిబ్బంది అంటున్నారు. ‘సీజన్ ఇప్పుడే ప్రారంభమైంది కానీ డిమాండ్ లో తరుగుదల స్పష్టంగా ఉంది‘ అని ఒక ఉద్యోగి అన్నారు. ‘సాధారణంగా ప్రతి సీజన్ లో మాకు 50 నుంచి 100 మంది ఇజ్రాయెల్ పర్యాటకులు వస్తారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్కరు కూడా రాలేదు అని చెప్పారు.ఈ పరిస్థితికి కారణం ప్రస్తుతం ఇజ్రాయెల్ – ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలే అని వీరు అంటున్నారు, యుద్ధం ప్రయాణ సౌకర్యాలకు అంతరాయం కలిగించింది. అదే ధరమ్‌కోట్ కసోల్ వంటి బ్యాక్ ప్యాకింగ్ కేంద్రాలను ప్రభావితం చేసిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిస్థితి ఇక్కడితో ఆగకపోవచ్చునని విదేశీ పర్యాటకులకు కీలక ప్రవేశద్వారాలుగా ఉంటున్న మనాలి, సిమ్లా వంటి టాప్ హిల్ స్టేషన్స్ ను కూడా ప్రభావితం చేయవచ్చునని అంచాన వేస్తున్నారు. స్థానిక ఆపరేటర్ల ప్రకారం, సాధారణంగా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పార్వతి లోయలో ఇజ్రాయెల్ ప్రయాణికులకు ఫుల్ సీజన్. ‘ప్రతి సంవత్సరం 10,000 కంటే ఎక్కువ మంది ఇజ్రాయెల్ బ్యాక్‌ప్యాకర్లు కసోల్ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు అని ఓ ట్రావెల్ సంస్థ ప్రతినిధి అన్నారు. ‘ఈసారి, ఈ సంఖ్యలు వందల్లోనే ఉండవచ్చు’’ అన్నారాయన. ఈ మార్పు బుకింగ్ విధానాలలో కూడా కనిపిస్తుందని ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు.‘ఇజ్రాయెల్ పర్యాటకులు సాధారణంగా తమ బసలను 20–30 రోజుల ముందుగానే బుక్ చేసుకుని మార్చి నాటికి రావడం ప్రారంభిస్తారు‘ అని విదేశీ సందర్శకులతో పనిచేసే ట్రావెల్ ఏజెంట్ రంజిత్ రాణా అంటున్నారు. ‘‘ఈ సంవత్సరం దాదాపుగా ఏ మాత్రం బుకింగ్‌లు లేవు. ఫిబ్రవరిలో వచ్చిన వారు కూడా ముందుగానే వెనుదిరిగారు.’’ అని చెప్పారాయన.హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విడుదల చేసిన పర్యాటక డేటా ప్రకారం, కాంగ్రా జిల్లా సిమ్లా జిల్లా తర్వాత పార్వతి లోయను కలిగి ఉన్న కులు జిల్లా విదేశీ పర్యాటకుల రాకపోకలలో రాష్ట్రంలోని మొదటి మూడు జిల్లాల్లో ఒకటి. అందువల్ల అంతర్జాతీయ పర్యాటకుల రాకలో తేడా వస్తే అది స్థానిక జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఎయిర్ కనెక్టివిటీ కూడా ఈ పరిస్థితిలో కీలక పాత్ర పోషించింది. టెల్ అవీవ్, న్యూఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమానాలను నడుపుతున్న ఏకైక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, కానీ ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ మార్గం తాత్కాలికంగా మూతబడింది. అలాగే చాలా కాలంగా భారతదేశానికి వెళ్లే ఇజ్రాయెల్ ప్రయాణికులకు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. టెల్ అవీవ్ నుంచి దుబాయ్‌కు వెళ్లే మార్గాల్లో అనిశ్చితి...తో చాలా మంది పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేస్తున్నారు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఎమిరేట్స్ కీలక నిర్ణయం
దుబాయ్ విమాన సర్వీసులను ఎమిరేట్స్ తాత్కాలికంగా నిలిపేసింది. ఎయిర్‌పోర్టుకు రావద్దని ప్రయాణికులకు ఎమిరేట్స్ సూచించింది. దుబాయ్ ఎయిర్‌పోర్టుపై మరో మిస్సైల్ దాడి జరిగింది. ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడులు చేసింది. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్పోర్ట్ అధికారులు.. ప్రయాణికులను తరలించారు. మిస్సైల్ దాడితో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.ఇరాన్ క్షిపణుల, డ్రోన్లను యూఏఈ వైమానిక దళం అడ్డుకుంది. భద్రత కారణంగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను అధికారులు బంద్ చేశారు. తదుపరి నోటీసు వచ్చేవరకు దుబాయ్ వచ్చే, వెళ్లే అన్ని విమానాలు రద్దయ్యాయి. మరోవైపు, గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ చెప్పారు. ఇరాన్ దాడి చేసిన పొరుగు దేశాలకు నేను క్షమాపణలు కోరుతున్నారు.పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయకూడదని.. నిన్న సమావేశమైన తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ అంగీకరించింది. పొరుగు దేశాలపై ఎటువంటి క్షిపణులను ప్రయోగించం. ఆయా దేశాల ప్రాంతాల నుంచి ఇరాన్‌పై దాడి జరిగితేనే.. ఇరాన్ తిరిగి ప్రతిదాడి చేస్తుంది. ఈ నిర్ణయాన్ని తాత్కాలిక లీడర్షిప్ కౌన్సిల్ అంగీకరించింది’’ అని ఇరాన్ అధ్యక్షుడు తెలిపారు. -
మళ్లీ మనకి రష్యా క్రూడ్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో అమెరికా అనుమతి మేరకు, రష్యా నుంచి మళ్లీ క్రూడాయిల్ కొనుగోలు చేసేందుకు భారత్‌కి అవకాశం లభించింది. ఇందుకు సంబంధించి 30 రోజుల పాటు భారత్‌కి వెసులుబాటునిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.‘‘అధ్యక్షుడు ట్రంప్ ఎజెండాతో చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో చమురును అందుబాటులో ఉంచే దిశగా రష్యా ఆయిల్‌ని భారత రిఫైనరీలు కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల పాటు మినహాయింపునిస్తున్నాం. ఇంధనాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు ఇది తోడ్పడుతుంది. కీలక భాగస్వామి అయిన భారత్, ఈ వ్యవధి ముగిసిన తర్వాత మా దగ్గర్నుంచే మరింతగా ఆయిల్ కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యన్ ట్యాంకర్ల నుంచి మాత్రమే కొనుగోళ్లకు అనుమతించినందున, ఈ తాత్కాలిక వెసులుబాటుతో రష్యాకి భారీగా ఆర్థిక ప్రయోజనాలేమీ చేకూరవని బెసెంట్ తెలిపారు. సముద్ర జలాల్లో 130 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ఆంక్షలు వర్తించని సంస్థల నుంచి దేశీ రిఫైనింగ్ సంస్థలు ఇప్పటికే దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, అమెరికా మినహాయింపునివ్వడానికి ముందే, పశ్చిమాసియా నుంచి సరఫరా దెబ్బతిన్నప్పటి నుంచే కొనుగోళ్లు మొదలయ్యాయని వివరించాయి. ఆంక్షలు ఎదుర్కొంటున్న సంస్థల నుంచి కొనుగోళ్లకు కూడా మినహాయింపు వర్తిస్తుందా లేదా అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం 15 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్‌తో అరేబియన్ సముద్రం, బంగాళాఖాతంలో రష్యన్ ట్యాంకర్లు నిల్చి ఉండగా, మరో 7 మిలియన్ బ్యారెళ్ల ట్యాంకర్లు సింగపూర్ దగ్గర్లో ఉన్నాయి. వీటికి తోడు కొద్ది రోజుల వ్యవధిలోనే భారత్‌కి చేరుకునేంత దూరంలో, సింగపూర్ సమీపంలో మరో ఎనిమిది ట్యాంకర్లు ఉన్నాయి. ఇవే కాకుండా నెల రోజుల వ్యవధిలో భారత్‌కి రాగలిగేలా మధ్యధరా సముద్రం, సూయెజ్ కెనాల్లో మరిన్ని నౌకలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దాదాపు 50 శాతం క్రూడ్ దిగుమతుల కోసం హార్మూజ్ జలసంధిపై ఆధారపడటంతో సరఫరా సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్‌కి 30 రోజుల వెసులుబాటు భారీ ఊరటనిచ్చే విషయమని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ’కెప్లర్’ అనలిస్ట్ సుమీత్ రితోలియా తెలిపారు. ప్రస్తుతం 130 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ క్రూడ్, సముద్ర జలాల్లో ఉందని, సరైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే అది దేశీ పోర్టులకు మళ్లడానికి వీలవుతుందని వివరించారు. దేశీ రిఫైనర్లు ఇప్పుడు రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ఆయిల్ కొంటున్నాయని, తాజాగా దాన్ని మరింతగా పెంచేందుకు వీలు చిక్కిందని వివరించారు. అయితే, అదే ఆయిల్ కోసం చైనా కూడా పోటీపడుతున్నందున డిస్కౌంట్లపరంగా భారత్‌కి పెద్దగా ప్రయోజనం లభించకపోవచ్చని పేర్కొన్నారు. 25 రోజులకు సరిపడా నిల్వలు...ఉక్రెయిన్ మీద దాడికి శిక్షగా పాశ్చాత్య దేశాలు రష్యాపై 2022లో ఆంక్షలు విధించడం, అటుపైన ఆ దేశం భారత్‌కి భారీ డిస్కౌంటుపై చమురును ఆఫర్ చేయడం తెలిసిందే. దీనితో మిగతా దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించుకున్న భారత్ 2023 మేలో రోజుకు ఏకంగా 2.15 మిలియన్ బ్యారెళ్ల స్థాయిలో రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసింది. కానీ అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గించుకోవాల్సి వచి్చంది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 25 రోజులకు సరిపడే చమురు నిల్వలు ఉన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు తీవ్రమై.. క్రూడ్ రేట్లు కొండెక్కుతున్న నేపథ్యంలోనే అమెరికా మినహాయింపునివ్వడం కొంత ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు తెలిపారు. -
కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదరడంతో భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం కారణంగా సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో భారతీయ ఓడరేవుల్లో సుమారు 38,000 కంటైనర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటు సరుకు పంపలేక, ఇటు పోర్టుల్లో ఉంచితే పెరిగే భారీ అద్దెలను భరించలేక ఎగుమతిదారులు ఇప్పుడు తమ కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్నారు.సగానికి పైగా కంటైనర్లు వెనక్కి!తాజా అధికారిక సమాచారం ప్రకారం, నిలిచిపోయిన కంటైనర్లలో దాదాపు 50 శాతం అంటే సుమారు 19,000 కంటైనర్లను ఎగుమతిదారులు వెనక్కి రప్పించుకుంటున్నారు. దీనికోసం కస్టమ్స్ శాఖకు ‘బ్యాక్ టు టౌన్’ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు, ఔషధాల విషయంలో ఎగుమతిదారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు.వీటిని ఏం చేస్తారు?విదేశాలకు వెళ్లాల్సిన ఉల్లి, అరటి, ద్రాక్ష, బాస్మతీ బియ్యం ఇప్పుడు భారతీయ మార్కెట్లలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల దేశీయంగా వీటి ధరలు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఎగుమతిదారులకు మాత్రం ప్యాకేజింగ్, రవాణా ఖర్చుల రూపంలో నష్టం తప్పదనే అభిప్రాయాలున్నాయి. పోర్టుల్లో కంటైనర్ నిలిచి ఉంటే నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. షిప్పింగ్ లైన్లు కూడా 2,000 డాలర్ల వరకు అదనపు సర్ఛార్జీలు విధిస్తుండటంతో ఎగుమతి లాభదాయకం కాదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కింద తెలియజేశాం.ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం -
పశ్చిమాసియా సంక్షోభానికి తక్షణం ముగింపు పలకాలి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం మరింత ముదరకుండా తక్షణమే ముగింపు పలకాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సైనికపరమైన జోక్యం ద్వారా ఏ సమస్యనూ పరిష్కరించలేమని ఆయన చెప్పారు. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో గురువారం ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఐక్యరాజ్యసమితిలో ప్రధాన విభాగం భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫిన్లాండ్ గట్టి మద్దతు దారుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు స్టబ్ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ, పశ్చిమాసియా సంక్షోభంతో నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం మారిన భౌగోళిక పరిణామాలను ప్రతిఫలించేలా ఐరాసలో సంస్కరణలు చేపట్టాలని స్టబ్ కోరారు. రక్షణ, అంతరిక్షం, సెమీకండక్టర్లు, అరుదైన ఖనిజాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చర్చల సందర్భంగా ఇరు దేశాల నేతలు అంగీకరించారు. ‘చట్టాలు, దౌత్యం, చర్చలపై భారత్, ఫిన్లాండ్లకు విశ్వాసముంది. సైనికపరంగా తలపడటం ద్వారా ఏ సమస్యకూ పరిష్కారం కనుగొనలేమనే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చాం’అని ప్రధాని మోదీ అనంతరం ఒక ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలకు తక్షణమే ముగింపు పలకాలి. శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. భారత్–యూరప్ దేశాల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో ఎంతగానో మెరుగుపడ్డాయని తెలిపిన ప్రధాని మోదీ.. ఇది ప్రపంచ స్థిరతకు, అభివృద్ధికి దారితీస్తుందన్నారు. భారత్–ఈయూల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్, ఫిన్లాండ్ల మధ్య సంబంధాలను పెంచేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఫిన్లాండ్కు చెందిన టెలికం దిగ్గజ సంస్థ నోకియా భారత్‌లో చేపట్టిన వివిధ భారీ ప్రాజెక్టులను ఆయన మెచ్చుకున్నారు. -
వార్.. బేర్!
ముంబై: పశ్చిమాసియాలో ‘పోరు’ తారాస్థాయికి చేరుకోవడంతో ఈక్విటీ మార్కెట్లలో నాలుగో రోజు ‘బేర్ జోరు’ కొనసాగింది. హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అమాంతం పెరిగాయి. దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించి జీవితకాల కనిష్టాలకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాల పరంపర కొనసాగుతోంది. ఈ పరిణామాలూ దలాల్ స్ట్రీట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 1,123 పాయింట్లు పతనమై 79,116 వద్ద స్థిరపడింది. ఇది 10 నెలల కనిష్టం. నిఫ్టీ 385 పాయింట్లు కుప్పకూలి 6 నెలల కనిష్టం 24,481 వద్ద నిలిచింది. ఇంట్రాడే ట్రేడింగ్ ఇలా: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,780 పాయింట్లు కుప్పకూలి 78,443 వద్ద, నిఫ్టీ 560 పాయింట్లు తగ్గి 24,305 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. దిగువ స్థాయిలో నాణ్యమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలకు కొంతమేర నష్టాలు తగ్గాయి. బీఎస్ఈ రంగాల వారీగా ఇండెక్సుల్లో మెటల్ ఇండెక్స్ 4%, పీఎస్‌యూ బ్యాంక్ 3.50%, ఇండ్రస్టియల్స్ 3.29%, రియల్టీ 3.16%, కమోడిటిస్ 3.12%, క్యాపిటల్ గూడ్స్ 2.64%, ఇంధన 2.59%, సర్వీసెస్ 2.25%, పతనమమ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 2.42%, 2.10 శాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌లో 30 షేర్లలో ఎయిర్టెల్ (1.78%), ఇన్ఫోసిస్ (1.5%), టెక్ మహీంద్రా (0.44%) మాత్రమే లాభపడ్డాయి. → పీఎన్‌జీఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ లిస్టింగ్ రోజు మెరిసింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.386)తో పోలిస్తే 3.62% డిస్కౌంటుతో రూ.372 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ అనిశ్చితుల్లో షేరు నష్టాల నుంచి పుంజుకుంది. చివరికి షేరు 7% లాభపడి రూ.412 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,312.16 కోట్లుగా నమోదైంది.ఆయిల్ మార్కెటింగ్, పెయింట్స్ షేర్లు డౌన్ గల్ఫ్ ఉద్రిక్తతలతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్, పెయింట్ తయారీ కంపెనీ షేర్లు రెండోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్‌పీసీఎల్ 5.41%, బీపీసీఎల్ 4.94%, ఐఓసీ 4.78% నష్టపోయాయి. షాలిమార్ పెయింట్స్ 2.6%, బర్జర్ పెయింట్స్ 2.22%, ఇండిగో పెయింట్స్ 1.49%, ఏషియన్ పెయింట్స్ 0.95 పడిపోయాయి. ఆసియా మార్కెట్లు అల్లకల్లోలం: దక్షిణ కొరియా ‘కాస్పీ’ ఇండెక్సు 14% కుప్పకూలింది. థాయ్‌లాండ్ ‘సెట్ కాంపోసిట్’ సూచీ 6%, ఇండోనేసియా ‘జకార్తా కాంపోసిట్’ 5% పతనమయ్యాయి. తైవాన్ 4.50%, జపాన్ 4%, సింగపూర్ 2.16%, హాంగ్‌కాంగ్ 2.05%, చైనా 1% నష్టపోయాయి. 3 రోజుల నష్టాల తర్వాత యూరప్, అమెరికా మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. జర్మనీ డాక్స్ 2%, ఫ్రాన్స్ సీఏసీ 1%, బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ అరశాతం లాభపడ్డాయి. నాస్డాక్ 1.27% లాభంతో 22,803 వద్ద, డోజోన్స్ 0.5 పెరిగి 48,776 వద్ద ట్రేడవుతున్నాయి. -
ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!
పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా తన వ్యూహాన్ని మార్చుకుంది. సౌదీ ఆరామ్కో మద్దతు ఉన్న చైనాలోని చమురు రిఫైనరీలు తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి.హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. క్రూడ్ సరఫరాకు బ్రేక్ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా ప్రస్తుతం సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ క్రూడాయిల్ అవసరాల్లో 20 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. యుద్ధ వాతావరణం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ సరఫరా ఒత్తిడి ఇతర దేశాల రిఫైనర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రంగంలోకి చైనా రిఫైనరీ దిగ్గజాలుసౌదీ ఆరామ్కో భాగస్వామ్యం కలిగిన చైనా ప్రధాన రిఫైనరీ జెజియాంగ్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీపీసీ) రోజుకు 2 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న తన యూనిట్‌ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన ప్లాంట్ నిర్వహణ పనులను ప్రస్తుత సరఫరా సంక్షోభం దృష్ట్యా ముందే చేపడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌కు తెలిపారు.రోజుకు 8 లక్షల బ్యారెళ్ల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ చైనాలోనే అతిపెద్దది. తాజా నిర్ణయంతో మార్చి నెలలో ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, ఫుజియాన్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ కో (ఫ్రెప్) కూడా తన 80,000 బీపీడీ సామర్థ్యం గల చిన్న ముడి చమురు యూనిట్‌ను తాత్కాలికంగా మూసివేసింది.ఇదీ చదవండి: ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో! -
భారత్ క్రూడాయిల్, ఎల్పీజీ నిల్వలు ఇలా..
పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు) మారుతున్న యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఎదుర్కోవడానికి దేశం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మన వద్ద 50 రోజులకు సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.నిల్వల లభ్యత ఇలా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారత్ వద్ద ప్రస్తుతం ముడి చమురు 25 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు మరో 25 రోజులకు సరిపోతాయి. మొత్తంగా 50 రోజుల వరకు ఎటువంటి సరఫరా అంతరాయం లేకుండా దేశ అవసరాలను తీర్చవచ్చు. ఇవి కాకుండా విశాఖపట్నం, మంగళూరు, పాడూరులోని వ్యూహాత్మక నిల్వల్లో 4.094 మిలియన్ టన్నుల ముడి చమురు సిద్ధంగా ఉంది. ఇది మన మొత్తం సామర్థ్యంలో (5.33 మెట్రిక్ టన్నులు) సుమారు 77 శాతానికి సమానం.స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్..భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోంది. ప్రతిరోజూ సుమారు 5.6 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తులను దేశం వినియోగిస్తోంది. గతంలో దిగుమతుల్లో 40% స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వచ్చేవి. ప్రస్తుతం ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈల నుంచి దిగుమతులు పెరగడంతో ఈ వ్యూహాత్మక జలసంధి గుండా వచ్చే చమురు వాటా 50 శాతానికి చేరింది. యుద్ధం తీవ్రమైతే ఈ మార్గం ద్వారా సరఫరా సవాలుగా మారే అవకాశం ఉంది.ప్రభుత్వ చర్యలుపరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ‘మేము అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యామ్నాయంగా చమురును సేకరిస్తున్నాం. రిఫైనరీలు అవసరమైనప్పుడు ఇతర వనరుల నుంచి కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నాయి’ అని ఒక అధికారి తెలిపారు.ధరల పెంపు ఉంటుందా?ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. అయితే, యుద్ధం 10-15 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎల్పీజీ పరిస్థితి ఏమిటి?వంట గ్యాస్ విషయంలోనూ భారత్ ఊరటనిచ్చే సమాచారమే ఇచ్చింది. భారత్ వద్ద 25-30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. మనం 80-85% ఎల్పీజీ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నాం. 2025 ఆర్థిక సంవత్సరంలో 20.67 మిలియన్ టన్నుల ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంది. వచ్చే రెండు వారాల్లో పశ్చిమ ఆసియాలో పరిస్థితులు కొంత సద్దుమణుగుతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతరాయాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఇదివరకే రాజ్యసభలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు -
ఇరాన్ సంక్షోభం.. ఎగుమతులు, దిగుమతులపై నీలినీడలు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటనూనెల విభాగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి, అటు నూనె గింజల దిగుమతులపై.. ఇటు ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.భారతదేశం తన వంటనూనె అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్; అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ ఆయిల్; రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ భారత్‌కు వస్తుంటాయి. అయితే, ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి, సూయజ్ కాలువ గుండానే సాగుతాయి.ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే, ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే రవాణా, బీమా ఖర్చులు పెరిగి అది దేశీయంగా వినియోగదారుడిపై భారం మోపుతుందని అంచనా వేస్తున్నారు.ఎగుమతులపై దెబ్బకేవలం దిగుమతులే కాకుండా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఆయిల్ మీల్స్(నూనె గింజల నుంచి నూనెను తీసేసిన తర్వాత మిగిలే ఉప ఉత్పత్తి ) ఎగుమతులు కూడా ప్రతిష్టంభనను ఎదుర్కోవచ్చు. భారత ఆయిల్ మీల్స్ ఎగుమతుల్లో ఆగ్నేయాసియా వాటా 65% కాగా, పశ్చిమాసియా (గల్ఫ్) 20%, యూరప్ 15% వాటాను కలిగి ఉన్నాయి. యుద్ధం ముదిరితే గల్ఫ్, యూరప్ దేశాలకు జరిగే ఎగుమతుల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది.క్రూడాయిల్ ధరల పెరుగుదల కేవలం రవాణా ఖర్చులనే కాకుండా గ్లోబల్ బయోఫ్యూయల్ మార్కెట్ ద్వారా వంటనూనెల ధరలను కూడా ప్రభావితం చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులు కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతాయని అంటున్నాయి. -
ట్రావెల్.. క్యాన్సిల్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులతో అటువైపు వెళ్లాల్సిన వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఫ్లయిట్లను డైవర్ట్ చేసే రిసు్కలు ఉండటం, ప్రయాణాలకు పట్టే వ్యవధిపై అనిశ్చితి నెలకొనడం, బీమా నిబంధనలపై సందేహాలు మొదలైన అంశాలు ట్రావెలర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీనితో 20–25% బుకింగ్స్ రద్దు లేదా రీషెడ్యూల్ అవుతున్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) వెల్లడించింది. గల్ఫ్ ట్రాన్సిట్ హబ్‌లు, సమీప ప్రాంతాల్లోని రూట్లకు ఇవి పరిమితమైనట్లు వివరించింది. గగనతలంపై ఆంక్షలు కొనసాగినా, పరిస్థితి మరింత తీవ్ర రూపు దాల్చినా వేసవి సీజన్లో ప్రయాణాలపై కూడా ప్రభావం పడొచ్చని ఐఏటీవో ప్రెసిడెంట్ రవి గొసెయిన్ తెలిపారు. సమీప భవిష్యత్తులో పశ్చిమాసియా దేశాలకు, లేదా ఆ ప్రాంతం మీదుగా ఇతర దేశాలకు బుక్ చేసుకున్న వారు తమ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నట్లు ట్రావెల్ బుకింగ్ అగ్రిగేటర్ మేక్మైట్రిప్ తెలిపింది. ఆయా ఎయిర్‌లైన్స్ పాలసీల ప్రకారం తేదీలను మార్చుకునే విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించింది. అలాగే, అబుదాబి, దుబాయ్‌లో ప్రస్తుతం ఉన్న ట్రావెలర్లకు స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్ల ఆధారంగా అప్డేట్స్ని అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ తెలిపారు. ప్రభావిత ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఒమన్ నుండి భారత్‌కి చార్టర్ ఫ్లయిట్స్ నడిపే యోచనలో ఉన్నట్లు వివరించారు. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను బట్టి అంతర్జాతీయ ట్రావెల్‌కి స్వల్పకాలిక సవాళ్లు ఎదురైనా, దేశీయంగా మాత్రం టూరిజానికి డిమాండ్ పటిష్టంగానే కొనసాగవచ్చన్నారు.చమురు భగ్గు.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల దెబ్బతో ముడిచమురు సరఫరాపై నీలినీడలు కమ్ముకోవడంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ రేటు బ్యారెల్‌కి 8.6 శాతం ఎగిసి 79.11 డాలర్లకు, నైమెక్స్ ఆయిల్ ధర 7.6 శాతం పెరిగి 72.12 డాలర్లకు ఎగిసింది. ప్రధాన సరఫరాదారైన ఖతర్ ఉత్పత్తి నిలిపివేయడంతో యూరప్‌లో సహజ వాయువు ధర 40 శాతం పైగా పెరిగింది. క్రూడాయిల్, గ్యాస్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటంతో రేట్లు మరింత భారీగా పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. హార్ముజ్‌ని పూర్తిగా మూసివేస్తే ఆయిల్ ధర 90 డాలర్లు, అటు పైన 100 డాలర్లకి కూడా ఎగియొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే అమెరికా సహా చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు. ముడిచమురు ధరలు స్థిరంగా 15 డాలర్లు పెరిగితే, యూరప్‌లో ద్రవ్యోల్బణం అర శాతం మేర పెరుగుతుందని బెరెన్బర్గ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ వృద్ధిని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే, అమెరికాలో నవంబర్‌లో మిడ్–టర్మ్ ఎన్నికల ముందు ప్రతికూల పరిస్థితులను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టపడకపోవచ్చు కాబట్టి ఇంధన రేట్లను మళ్లీ కిందికి దింపేందుకు ప్రయతి్నంచవచ్చని తెలిపింది. -
యుద్ధం తీవ్రరూపు
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా సోమవారం మూడో రోజు ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేశాయి. ఏకంగా 130 నగరాలపై బాంబులు, క్షిపణుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్ దాడులతో ఉక్కిరిబిక్కిరైంది. పలు దఫాలుగా జరిగిన దాడులతో అక్కడి వాయుసేన, మిసైల్ కమాండ్ కేంద్రాలు దద్దరిల్లిపోయాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 600 మందికి పైగా మరణించినట్టు ఇరాన్ పేర్కొంది. 1,000 మందికి పైగా గాయపడ్డట్టు తెలిపింది. ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి స్థావరాలపై అమెరికా బి–2 స్టెల్త్ బాంబర్ విమానాలు 2,000 పౌండ్ల బరువైన భారీ బాంబులను జారవిడిచాయి. యుద్ధ నౌకలను కూడా లక్ష్యం చేసుకున్నాయి. తమ సరిహద్దు ప్రాంతాలపైకి హెజ్బొల్లా క్షిపణులు ప్రయోగించడంతో ఇజ్రాయెల్ మండిపడింది. లెబనాన్‌పైనా భారీస్థాయిలో దాడులకు దిగింది. దాంతో హెజ్బొల్లా కీలక నేత మొహమ్మద్ రాద్తో పాటు 31 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ఇజ్రాయెల్‌తో పాటు పలు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ కూడా తీవ్ర స్థాయిలో ప్రతి దాడులకు దిగింది. వందలాదిగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్‌తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు బాంబు, క్షిపణి దాడులతో దద్దరిల్లాయి. జనం బంకర్లలో తలదాచుకునేందుకు పరుగులు తీశారు. ఇజ్రాయెల్‌లో ఇప్పటిదాకా 12 మంది దాకా మరణించినట్టు సమాచారం. గల్ఫ్ దేశాలపైనా భారీగా దాడులు జరిగాయి. దాంతో యూఏఈలో ముగ్గురు, కువైట్, బహ్రెయిన్లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. అమెరికా స్థావరాలనే గాక పౌర సదుపాయాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని ఆ దేశాలు మండిపడ్డాయి. తమను లక్ష్యం చేసుకోవడం మానకుంటే ఇరాన్‌పై భారీ దాడులు తప్పవని హెచ్చరించాయి. మరోవైపు లెబనాన్, ఇరాక్ తదితర దేశాలకు చెందిన పలు మిలిటెంట్ గ్రూపులు కూడా ఇరాన్‌కు దన్నుగా యుద్ధరంగంలోకి దిగుతున్నట్టు ప్రకటించాయి. ఇజ్రాయెల్‌పై ఇప్పటికే భారీగా ప్రతీకార దాడులు చేసినట్టు లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా గ్రూప్ ప్రకటించింది. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు అమెరికాకు దోహదపడతామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో యుద్ధం మరింతగా విస్తరిస్తూ గుబులు రేపుతోంది. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఈ దాడికి దిగినట్టు ప్రకటించింది. వాటిలో పలు క్షిపణులను అడ్డుకుని కూల్చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఆ వెంటనే లెబనాన్‌పై భారీగా క్షిపణి, బాంబు దాడులతో విరుచుకుపడింది. దాంతో 31 మంది మరణించగా 149 మంది గాయపడ్డట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులను లెబనాన్ ఖండించింది. అయినా ఆ దేశంపై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక ఇజ్రాయెల్, అమెరికా దాడులతో టెహ్రాన్ అట్టుడికింది. జనం ఇళ్లకే పరిమితం కావడంతో నగర వీధులు ఎడారులను తలపించాయి. ఈ నేపథ్యంలో అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని రక్షణ శాఖ ఉన్నతాధికారి అలీ లరిజానీ ప్రకటించారు. తమపై ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో చాలావరకు అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంలో అమెరికా సైనిక స్థావరంపై షియా మిలిటెంట్ సంస్థ డ్రోన్ దాడికి దిగింది. ఇరాన్ నూతన సుప్రీం నేతను అతి త్వరలో ఎన్నుకుంటామని అలీరెజా అరాఫీ తెలిపారు.సౌదీ చమురు కేంద్రంపై దాడి సౌదీ అరేబియాలోని రస్ తనౌరా చమురు శుద్ధి కేంద్రంపై సోమ వారం దాడులు జరిగాయి. దాంతో శుద్ధి కేంద్రం స్వల్పంగా దెబ్బతిన్నట్టు సమాచారం. సంబంధిత వీడియోల్లో అక్కడ నల్లని దట్టమైన పొగ అలముకుని కనిపిస్తోంది. దాంతో రోజుకు 5 లక్షల బ్యారెళ్ల పై చిలుకు సామర్థ్యమున్న ఈ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసేశారు. తనౌరా ప్రపంచంలోని అతి పెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటి. కువైట్‌లోనూ అహ్మదీ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ శకలాలు పడి ఇద్దరు కారి్మకులు గాయపడ్డట్టు ప్రభుత్వం పేర్కొంది.నెతన్యాహు ఆఫీసుపైకి క్షిపణిఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయంపై సోమ వారం క్షిపణి దాడులు చేసినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. దాడిలో కార్యాలయం తీవ్రంగా దెబ్బ తిన్నట్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాణాలతో ఉన్నదీ లేనిదీ అనుమానమేనని ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్పుకొచి్చంది. అయితే ఈ దాడి వార్తలను ఇజ్రాయెల్ ధ్రువీకరించలేదు. అంతేగాక ఇరాన్ ప్రకటన వెలువడ్డ కొద్ది గంటలకే నెతన్యాహు బహిరంగంగా కని్పంచారు. బెయిట్ షెమె‹Ùలో ఇరాన్ క్షిపణి దాడిలో దెబ్బ తిన్న ప్రాంతాలను సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. ఆ దాడిలో 9 మంది ఇజ్రాయెలీలు మరణించారు. మరో నాలుగైదు వారాలు: ట్రంప్ ఇరాన్‌పై దాడులు మరో నాలుగైదు వారాల పాటు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే మరింత సుదీర్ఘ పోరుకూ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇరాన్ దాడుల్లో మరణించిన నలుగురు అమెరికా సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘బాధాకరమే అయినా, యుద్ధం ముగిసేలోపు ఇలాటి మరణాలు మరిన్ని సంభవిస్తాయి. అది అనివార్యం. ఏమీ చేయలేం’’ అని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై దాడిలో గల్ఫ్ దేశాలన్నీ తమతో కలిసొస్తామంటున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే, ‘‘ప్రస్తుతానికి మాత్రం ఇరాన్‌పై దాడులు పూర్తిస్థాయి తీవ్రతతో కొనసాగుతాయి’’అని ప్రకటించారు. ఇరాన్‌పై దాడులు మరో నాలుగైదు వారాల పాటు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే మరింత సుదీర్ఘ పోరుకూ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఇరాన్ దాడుల్లో మరణించిన నలుగురు అమెరికా సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఇందుకు సంబంధించి సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘‘బాధాకరమే అయినా, యుద్ధం ముగిసేలోపు ఇలాటి మరణాలు మరిన్ని సంభవిస్తాయి. అది అనివార్యం. ఏమీ చేయలేం’’ అని అభిప్రాయపడ్డారు. ఇరాన్‌పై దాడిలో గల్ఫ్ దేశాలన్నీ తమతో కలిసొస్తామంటున్నాయని ఆయన తెలిపారు. ఇరాన్ కొత్త నాయకత్వంతో చర్చలకు తాను సిద్ధమని ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే, ‘‘ప్రస్తుతానికి మాత్రం ఇరాన్‌పై దాడులు పూర్తిస్థాయి తీవ్రతతో కొనసాగుతాయి’’అని ప్రకటించారు. అమెరికా విమానాలను భారీగా కూల్చేశాం: ఇరాన్ కువైట్‌లో మూడు అమెరికా ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానాలు నేలకూలాయి. ఇరాన్ క్షిపణులను అడ్డుకునే క్రమంలో కువైట్ సేనలే వాటిని పొరపాటున కూల్చేసినట్టు అమెరికా ప్రకటించినా, ఇరాన్ మాత్రం అది తమ పనేనని చెప్పుకుంది. నిజానికి తమ దాడుల్లో అమెరికా ఇంకా భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను నష్టపోయిందని పేర్కొంది.ఇజ్రాయెల్ దాడులతో సోమవారం లెబనాన్ రాజధాని బీరూట్‌లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ధూళి, పొగ -
Hyderabad: ఎరక్కపోయి.. ఇరుక్కుపోయి!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం హైదరాబాద్ వాసులపై పడుతోంది. అనేకమంది ప్రయాణికులు, యాత్రికులు విదేశాల్లో చిక్కుకుపోయారు. గగనతలాలను (ఎయిర్‌స్పేస్) మూసివేయడంతో పాటు ఎయిర్‌పోర్టులను ఖాళీ చేయిస్తుండడంతో పెద్ద ఎత్తున నగరవాసులు ఆయా దేశాల్లో ఇక్కట్లు పడుతున్నారు. ట్రాన్సిట్ వీసాలు తీసుకోవడానికీ అవకాశం లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అక్కడి ఎంబసీ కార్యాలయాలకు ఫోన్లు చేసినా స్పందన ఉండట్లేదని నగరంలో ఉన్న వారి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయా దేశాల్లోని అన్ని విమానాశ్రయాలు మూతపడడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అమెరికా, యూకేతో పాటు యూరోప్ దేశాలకు ప్రయాణించే వారు విమాన టిక్కెట్లు నేరుగా తమ గమ్యస్థానానికే తీసుకున్నా... అలా ప్రయాణించడం సాధ్యం కాదు. సింగపూర్‌తో పాటు దుబాయ్, దోహా, అబుదాబి తదితర ప్రాంతాల్లో కొన్ని గంటలు ఆగి ముందుకుసాగాల్సిందే. వీటినే ట్రాన్సిట్ పాయింట్స్ అంటారు. శనివారం నగరం నుంచి వెళ్లినవారు ట్రాన్సిట్ పాయింట్స్‌లో చిక్కుకుపోయారు. హఠాత్తుగా కమ్మేసిన యుద్ధ మేఘాలు, ఎయిర్ స్పేస్‌లు మూసేయడం, వందల అంతర్జాతీయ సరీ్వసుల రద్దు, ప్రయాణికుల లగేజీ దించేయడంతో దుబాయ్, అబుదాబి, దోహా తదితర విమానాశ్రయాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి లగేజీ కుప్పలు కనిపిస్తున్నాయి.హోటల్స్‌లోనూ బసకు అవకాశం లేక... ప్రయాణం మధ్యలో, ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో ఆయా దేశాల్లో కొన్ని రోజులు ఉండాలంటే కచి్చతంగా ట్రాన్సిట్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టుల్లో ఉండే ఈ వీసా కౌంటర్లు సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉంటాయి. ఇక యుద్ధ వాతావరణంలో శనివారం వీటి వద్ద భారీగా క్యూలు పెరిగిపోయాయి. దీంతో అందరికీ ఈ వీసాలు లభించట్లేదు. మరోపక్క విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో శనివారం రాత్రికే ప్రయాణికులను విమానాశ్రయం బయటకు పంపేశారు. సాధారణంగా విమానయాన సంస్థలకు హోటల్స్‌కు మ«ధ్య ఒప్పందాలు ఉంటాయి. అనివార్య పరిస్థితుల్లో ప్రయాణికులను ఎయిర్‌లైన్స్‌లు ఒప్పందం ఉన్న హోటల్స్‌కు పంపి బస కల్పిస్తాయి. శనివారం రాత్రి ఓచర్లు ఇచ్చి ఇలానే చేశాయి. అప్పటికే హోటళ్లు ఖాళీ లేకపోవడం, ఆహారం, నీరు అందించే పరిస్థితి లేకపోవడంతో యాజమాన్యాలు గదులు ఇవ్వడం లేదు.విహారయాత్రికులది మరో పరిస్థితి... ఆయా ట్రాన్సిట్ కంట్రీస్‌కు టూరిస్టులు సైతం ఎక్కువ సంఖ్యలోనే వెళ్తుంటారు. సాధారణంగా 4నుంచి 15 రోజుల ప్యాకేజీలతో వెళ్లి వస్తుంటారు. ఇందులోనే రాను–పోను చార్జీలు, బస, స్థానికంగా రవాణా తదితరాలు ఉంటాయి. నగరం నుంచి గత వారం రోజుల్లో దుబాయ్ సహా ఇతర ప్రాంతాలకు టూరిస్టులుగా వెళ్లినవాళ్లు హోటళ్లలో ఇరుక్కుపోయారు. ఇలాంటివారిలో పీవీ సింధు, మంచు విష్ణు వంటి సెలబ్రిటీలు సైతం ఉన్నారు. వీరికి ఇబ్బంది లేకపోయినా సాధారణ టూరిస్టులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ప్యాకేజీ సమయం మీరిన తర్వాత, కొన్ని హోటళ్లలో సమయం ఉన్నప్పటికీ బస చేయడానికి యాజమాన్యాలు అంగీకరించట్లేదు. తాము వసతులు కలి్పంచలేమని, ఆహారం అందించలేమని యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. కొన్ని హోటల్స్‌లో బస కలి్పంచడానికి భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.తెలిసిన వారు ఎవరూ లేకుంటే ఇబ్బందే గత నెల 22న విహార యాత్ర నిమిత్తం దుబాయ్ వచ్చా. తాజా ఉద్రిక్తతలతో శనివారం నుంచి హోటల్ రూమ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. ఇక్కడ వాట్సాప్ కూడా పని చేయకపోవడంతో కుటుంబీకులతో సంప్రదింపులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఎక్కడికక్కడ క్షిపణులు, పేలుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో తెలియట్లేదు. స్థానికంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నవారికి ఇబ్బంది లేదు. టూరిస్టు, ప్యాసింజర్‌గా వచి్చనవాళ్లు మాత్రం ఇబ్బంది పడాల్సిందే. భయానక పరిస్థితుల మధ్య క్షణమొక యుగంగా గడుపుతున్నాం. అబుదాబి, దోహాల్లోనూ ఇలానే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి విమానాశ్రయాలు మూసివేశారు. –వినయ్ కుమార్, మియాపూర్ -
పశ్చిమాసియా పైనే మార్కెట్ ఫోకస్
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆందోళనలు ఉపశమించే వరకూ సెంటిమెంటు బలహీనపడనున్నట్లు అంచనా వేశారు. వీటికితోడు చమురు ధరలకు రెక్కలువస్తే అటు వాణిజ్య లోటు, ఇటు రూపాయి బలహీనపడవచ్చని తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ఉన్నట్టుండి పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధపరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను దెబ్బతీసే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇరాన్‌పై యూఎస్, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఆ దేశం సైతం.. దుబాయ్, తదితర గల్ఫ్‌అరబ్ దేశాలపై మిసైళ్లను ప్రయోగించడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతుడైనట్లు వెల్లడికావడంతో ఆదివారానికల్లా మధ్యప్రాచ్యంలో పలు దేశాలకు విమాన సరీ్వసులు రద్దయ్యాయి. హుర్ముజ్ ప్రాంతంలో నౌకల రవాణాకు అంతరాయాలు, ఇరాన్లో పరిస్థితులు చమురు సరఫరాలను దెబ్బతీయనున్నాయి. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలకు రెక్కలురానున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముడిచమురు ధరలు పెరిగితే దేశీయంగా దిగుమతులు బిల్లు పెరిగిపోనుంది. ఫలితంగా ఓవైపు వాణిజ్య లోటు పెరిగపోనుండగా.. మరోపక్క దేశీ కరెన్సీ బలహీనపడే వీలుంది. వెరసి తాజా పరిస్థితులు దేశీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు ద్రవ్యోల్బణ సమస్యలు తలెత్తవచ్చని, దీంతో ఆర్బీఐ పరపతి విధానాలపై ప్రభావం పడవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొ న్నారు. టెక్నాలజీ స్టాక్స్‌లో బలహీనతలు ఇన్వెస్టర్లను ఆందోళనకు లోనుచేస్తున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా ప్రస్తావించారు. ఆటో అమ్మకాల ఎఫెక్ట్ రేపు(3న) హోలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. ఫిబ్రవరి నెలకు ఆటో రంగ(వాహన) అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఫలితంగా నేడు(2న) ఆటో కౌంటర్లు వెలుగులో నిలచే వీలుంది. వారాంతాన ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడిన సంగతి తెలిసిందే. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో కొత్త సిరీస్ ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం పురోగతి సాధించింది. ఈ బాటలో ఈ వారం పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), పీఎంఐ గణాంకాలు విడుదలకానున్నాయి. మరోపక్క యూఎస్, చైనా గణాంకాలు సైతం విడుదలకానున్నాయని, వీటి ఆధారంగా ఈ వారం మార్కెట్లలో యాక్టివిటీ నమోదుకానున్నట్లు నిపుణులు ప్రస్తావించారు. సాంకేతికంగా చూస్తే..గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడిదారులుగా మారి రూ. 22,615 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధభయాలు ఇండెక్సులను దెబ్బతీసే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. వీరి అంచనాల ప్రకారం.. → ఈ వారం నిఫ్టీ 25,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. 24,800–24,700 స్థాయిలో సపోర్ట్ లభించే వీలుంది. ఇక్కడినుంచి బౌన్స్ అయితే 25,500–25,700 పాయింట్లవరకూ బలపడవచ్చు. → సెన్సెక్స్ 81,000 పాయింట్ల దిగువకు చేరవచ్చు. ఆపై 80,500–80,100 పాయింట్లస్థాయిలో మద్దతు కనిపించే వీలుంది. ఇక్కడి నుంచి పుంజుకుంటే 82,000– 82,500 పాయింట్లవరకూ పురోగమించే అవకాశముంది. గత వారమిలా ఆటుపోట్ల మధ్య గత వారం(ఫిబ్రవరి 23–27) దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 1,528 పాయింట్లు(2 శాతం) పతనమై 81,287 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 393 పాయింట్లు(1.5 శాతం) క్షీణించి 25,179 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఖమేనీ అంతానికి... ఎందుకంత పంతం?
ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీతో అమెరికా వైరం దశాబ్దాల నాటిది. దీని మూలాలు ఇరాన్లో అపార చమురు నిక్షేపాల్లో దాగున్నాయి. 1950వ దశకంలో ఇరాన్ ప్రధాని మొహమ్మద్ మొసాదేగ్ను బ్రిటన్, అమెరికాలు ‘ఆపరేషన్ బూట్’ పేరుతో జరిగిన సైనిక తిరుగుబాటుతో గద్దె దించాయి. అంతకుముందు వరకు దశాబ్దాలు పరిపాలించిన రాజు మొహమ్మద్ రెజా పహ్లావీని మళ్లీ గద్దెనెక్కించాయి. కానీ అనూహ్యంగా కొంతకాలానికే రుహొల్లా ముసావీ ఖొమేనీ సారథ్యంలో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తలెత్తింది. అనంతరం ఆయన మరణంతో అధికార పగ్గాలు ఖమేనీ చేతికొచ్చాయి. నాటినుంచీ అమెరికాకు ఆయన కొరకరాని కొయ్యగా తయారయ్యారు.పశ్చిమాసియాపై పెత్తనం చేయడానికి అమెరికా చేసే ప్రతి ప్రయత్నాన్నీ ఖమేనీ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పశ్చిమాసియాను అమెరికాకు వ్యతిరేక శక్తిగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. అమెరికా కుయుక్తులను తన రాజకీయ చాణిక్యంతో తుత్తునియలు చేశారు. ఇరాన్‌కు తోడుగా పాలస్తీనా భూభాగంలో హమాస్‌ను, యెమెన్‌లో హూతీలను, లెబనాన్‌లో హెజ్»ొల్లా ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ తన ఆధిపత్యాన్ని బలపర్చుకున్నారు. దాంతో ఖమేనీ ఆధిపత్యానికి గండికొట్టేందుకు అమెరికా శతథా ప్రయతి్నంచింది. ఇరాన్లో నిఘాను పెంచి సైబర్ దాడులు చేయించి, సున్నీలను రెచ్చగొట్టి తిరుగుబాటు లేవదీసి... ఇలా పలు రకాలుగా ప్రయతి్నంచి విఫలమైంది. ఖమేనీ పాలనకు చరమగీతం పాడేందుకు అమెరికా ఎన్నోసార్లు కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేసింది. వాటికి సంబంధించిన ఆధారాలు లభించిన ప్రతిసారీ తనకేం సంబంధం లేదని బుకాయించింది. ఇస్లామిక్ విప్లవం వేళ 1979లో టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై విప్లవకారులు దాడిచేసి పలువురు దౌత్యవేత్తలు, సిబ్బందిని బంధించారు. వాళ్లను విడిపించేందుకు అమెరికా విశ్వప్రయత్నంచేసింది. ఆ విప్లవం తర్వాత ఇరాన్లో ఏర్పడిన మత రాజ్యాన్ని అస్థిరపరిచేందుకు అమెరికా స్థానిక తిరుగుబాటుదారులకు సాయపడింది. ముజాహిదీన్–ఇ–ఖల్ఫ్ (ఎంఈకే)కు ఆర్థికసాయం చేసింది. సున్నీ ఉగ్రవాద సంస్థ జూన్దుల్హాకు అండదండలు అందించింది. ఇరాన్ ప్రభుత్వ నేతలు, కార్యాలయాలపై దాడులకు ఉసిగొల్పింది. మతపాలకుల పరువు పోగొట్టేందుకు పుకార్లను షికార్లు చేయించేది. అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేయించేది. ఇరాన్లో సైబర్, నిఘా ఆపరేషన్లనూ విస్తృతపరిచింది. అణు పరిశోధనలు కొనసాగకుండా తరచూ ఆటంకపరిచేది. ఈ విషయంలో అమెరికాకు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సైతం తనవంతు సాయం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Israel Vs Iran War: పశ్చిమాసియాకు విమానాలు రద్దు
న్యూఢిల్లీ: ఇరాన్లో యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో ఆ దేశానికి విమానసరీ్వసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు భారతీయ పౌర విమానయాన సంస్థలు ప్రకటించాయి. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఖతార్లకు విమానసర్వీసులను తాత్కాలికంగా రద్దుచేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) భారతీయ విమానయాన సంస్థలకు సూచించింది.ఈ ఆదేశాల మేరకు తమ సరీ్వసులను నిలిపేస్తున్నట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ తదితర సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ప్రభుత్వ సూచనల మేరకు సరీ్వస్‌లు ఆగిపోవడంతో శనివారం సాయంత్రం 5.45 గంటలవరకు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 57 దేశీయ, అంతర్జాతీయ సర్వీస్‌లు రద్దయ్యాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.యుద్దం కారణంగా రద్దయిన విమానాల్లో టికెట్లను వేరే తేదీలకు ఉచితంగా షెడ్యూల్ చేసుకోవడానికి లేదా రద్దుచేసుకోవడానికి ప్రయాణికులకు విమానయాన సంస్థలు అవకాశం కల్పించాయి. పశ్చిమాసియాకు అన్ని దేశాల నుంచీ విమాన సరీ్వసులు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక రద్దీగా ఉండే దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.బ్రిటన్ సహా పలు దేశాల నుంచి పశి్చమాసియాకు విమానసరీ్వసులు రద్దయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడింది. బ్రిటన్ నుంచి దుబాయ్‌కు విమానాలు రద్దయ్యాయి. టర్కీ ఎయిర్‌లైన్స్ సైతం లెబనాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, జోర్డాన్లకు సోమవారం దాకా సరీ్వసులు ఆపేసింది. అమెరికాకు చెందిన డెల్టాఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్ఎం సైతం ఇజ్రాయెల్‌కు విమానాలను నిలిపేశాయి. -
భగ్గుమన్న పశ్చిమాసియా
దుబాయ్: అమెరికా అన్నంత పనీ చేసింది. పశ్చిమాసియాను మరోసారి రణరంగంగా మార్చింది. మిత్ర దేశం ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై శనివారం భారీ స్థాయిలో దాడులకు దిగింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’పేరిట అమెరికా, ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’పేరుతో ఇజ్రాయెల్ రణన్నినాదం చేశాయి. శనివారం ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాలపై క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఉత్తర టెహ్రాన్‌లో 30కి పైగా ప్రంతాలపై ఒకేసారి దాడులకు దిగాయి. ఇరాన్ నాయకత్వాన్నే లక్ష్యం చేసుకున్నట్టు ఇరు దేశాలూ ప్రకటించాయి. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (86), అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో పాటు ఇతర అగ్ర నేతలే లక్ష్యంగా దాడులు కొనసాగాయి. తొలి పేలుళ్లు ఖమేనీ, పెజెష్కియాన్ నివాసాలు, కార్యాలయాల సమీపంలోనే చోటుచేసుకున్నాయి. అప్పటికే ఖమేనీ, పెజెష్కియాన్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు ఇరాన్ వర్గాలు పేర్కొన్నా, పలువురు ఇరాన్ కీలక సైనిక కమాండర్లు, నేతలు దాడుల్లో మరణించినట్టు చెబుతున్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయ భవనంపై జరిగిన భారీ క్షిపణి దాడులు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. టెహ్రాన్‌తో పాటు ఇరాన్‌వ్యాప్తంగా పలు నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోతున్నాయి. టెహ్రాన్‌లో ఎక్కడ చూసినా దట్టమైన పొగ వెలువడుతోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడికి దిగడం 8 నెలల్లో ఇది రెండోసారి. గత జూన్‌లో అవి జరిపిన దాడుల్లో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు తదితరాలు బాగా దెబ్బతిన్నాయి. అమెరికాతో పూర్తి సమన్వయంతో దాడులు జరుపుతున్నట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇరు దేశాల సైన్యం నెలల తరబడి రూపొందించిన వ్యూహం మేరకు దాడులు కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. వీటిలో ఏ మేరకు ప్రాణనష్టం జరిగిందో తెలియరాలేదు. ఇరాన్ కూడా కొద్ది గంటల్లోనే తేరుకుని దీటుగా స్పందిస్తోంది. తొలుత ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఆ వెంటనే బహ్రెయిన్, కువైట్, ఖతార్, యూఏఈల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా క్షిపణి దాడులకు దిగింది. కువైట్ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి చేసింది. శనివారం రాత్రి సౌదీ అరేబియా, దుబాయ్‌పైనా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఘర్షణలు కనీసం కొద్ది వారాల పాటు కొనసాగుతాయని అమెరికా, ఇజ్రాయెల్ రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే జరిగితే పరిస్థితులు త్వరలోనే పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీయవచ్చంటున్నారు. ఇరాన్‌పై అమెరికా దాడిని విపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా యుద్ధానికి దిగారంటూ మండిపడింది. మరోవైపు ఇరాన్‌కు దన్నుగా తామూ యుద్ధరంగంలోకి దిగుతామని హెజ్బొల్లా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో పాటు ఎర్ర సముద్రంలోని రవాణా నౌకలను కూడా తిరిగి లక్ష్యంగా చేసుకుంటామని యెమన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ గ్రూపు పేర్కొంది. అణు స్థావరాలపైనా దాడులు ఇరాన్‌లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్, అమెరికా ముమ్మర దాడులు చేస్తున్నాయి. ఇస్ఫహాన్‌లోని అణు కేంద్రాలు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. ప్రధాన క్షిపణుల కేంద్రం తబ్రీజ్పైనా భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్‌తో పాటు నౌకా కేంద్రాలైన చాబహార్, బుషెహర్, అసాలుయెతో పాటు కోమ్, కరజ్, కెర్మన్షా తదితర నగరాలు కూడా దాడులకు గురయ్యాయి. వాటిమీదుగా వెలువడుతున్న దట్టమైన పొగ దాడుల తీవ్రతకు అద్దం పడుతోంది. దక్షిణ ఇరాన్‌లోని హొర్మోగన్ ప్రావిన్స్‌లో మినాబ్ నగరంలో ఓ బాలికల పాఠశాలపై జరిగిన దాడుల్లో ఏకంగా 85 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం పాలైనట్టు ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది. మరో 50 దాకా గాయపడ్డట్టు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 200 దాటిందని, 700 మందికి పైగా గాయపడ్డారని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ సైనిక, ప్రభుత్వ, నిఘా కార్యాలయాలను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా రక్షణ, అణు స్థావరాలపై పెద్ద సంఖ్యలో క్షిపణి దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ, ఇతర అగ్ర నేతల నివాసానికి దారితీసే మార్గాలన్నింటినీ మూసేశారు. దేశవ్యాప్తంగా మొబైల్ సేవలను కూడా నిలిపేశారు. ఖమేనీని టెహ్రాన్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెబుతున్నారు. దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు నగరాలు వీడి సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. ఇరాన్ ప్రతిదాడులతో ఇజ్రాయెల్‌లో ఏ మేరకు ఆస్తి, ప్రాణనష్టం జరిగిందీ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో దేశవ్యాప్త ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకుంటున్నట్టు సైన్యం పేర్కొంది. ఇరాన్‌పై దాడులను ట్రంప్ ఫ్లోరిడాలోని మారా లాగో ఎస్టేట్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అమెరికా సైనికులను వందలాదిగా చంపేశాం: ఇరాన్ గల్ఫ్వ్యాప్తంగా పలు దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. మొత్తం 14 స్థావరాలను తీవ్రంగా దెబ్బ తీయడంతో పాటు వందల మంది అమెరికా సైనికులను చంపేసినట్టు ప్రకటించింది! అబుదాబిలో అల్ దఫ్రా వైమానిక స్థావరంలోని అమెరికా సైనిక వ్యవస్థలపై క్షిపణి దాడులు జరిగాయి. తమ దేశంలోని అమెరికా నావికా స్థావరం ఐదో ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై క్షిపణి దాడులు జరిగినట్టు బహ్రయిన్ ధ్రువీకరించింది. పశ్చిమాసియాలో అమెరికా సైన్యానికి ప్రధాన స్థావరమైన కువైట్ కూడా సైరన్లు, పేలుళ్ల మోతతో అట్టుడికిపోయింది. ఖతర్‌లోని అల్ ఎదెయ్ద్, కువైట్‌లోని అల్ సలేం వైమానిక స్థావరాలపైనా దాడులు జరిగాయి. దుబాయ్, జోర్డాన్, దోహాతో పాటు ఇరాక్‌లో కూడా ఇవే దృశ్యాలు కన్పించాయి. రెండు బాలిస్టిక్ మిసైళ్లను నేలకూల్చినట్టు జోర్డాన్ సైన్యం పేర్కొంది. అయితే జోర్డాన్ రాజధాని అమ్మాన్తో పాటు ఇబ్రిద్, జర్ఖా, మదాబా, జరాష్ తదితర నగరాల్లో బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. యూఏఈపై ఇరాన్ క్షిపణి దాడుల్లో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. తమపై రెండు దఫాలుగా జరిగిన దాడి యత్నాలను పూర్తిగా నిరీ్వర్యం చేసినట్టు ఖతర్ ప్రకటించింది. యూఏఈ, బహ్రెయిన్, ఖతర్, కువైట్‌పై దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. వాటిని తక్షణం కట్టిపెట్టకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్‌ను హెచ్చరించింది. తర్వాత కాసేపటికే సౌదీలోని రియాద్ తదితర ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది! అయితే వాటిని మధ్యలోనే అడ్డుకుని కూల్చేసినట్టు సౌదీ ప్రకటించింది. తమపై ఇరాన్ దాడులను పిరికిపంద చర్యగా అభివరి్ణంచింది. ఆ దేశానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామంటూ హెచ్చరించింది. రోజుకు 1.4 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా జరిగే హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను నిలిపేసినట్టు ఇరాన్ ప్రకటించింది.తొలి దాడి ఇజ్రాయెల్‌దే శనివారం తొలుత ఇజ్రాయెలే దాడులకు తెర తీసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ, అధ్యక్షుడు పెజెష్కియానే లక్ష్యంగా ఉదయాన్నే వారి నివాసాలు, కార్యాలయ సముదాయాలపై పెద్దపెట్టున క్షిపణి దాడులకు దిగింది. ఆ వెంటనే మొత్తం టెహ్రాన్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. అనంతరం అమెరికా సైన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరాన్ అగ్ర నేతలతో పాటు అణు స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, భారీ బాంబులతో విరుచుకుపడింది. కొద్ది గంటల అనంతరం ఇరాన్ తేరుకుని ప్రతి దాడికి దిగింది. తొలుత ఇజ్రాయెల్‌పై రెండు దఫాలుగా క్షిపణులతో విరుచుకుపడింది. అనంతరం పలు గల్ఫ్ దేశాల్లోని పలు అమెరికా స్థావరాలపైనా దాడులకు తెర తీసింది.ఖమేనీ ఎక్కడ? అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఎక్కడున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇరాన్లో నాయకత్వ మార్పే తమ లక్ష్యమని అమెరికా, ఇజ్రాయెల్ విస్పష్టంగా ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ శనివారం ఉన్నట్టుండి విరుచుకుపడింది. ఖమేనీ నివాసం, కార్యాలయ సముదాయాలపై భారీ స్థాయి క్షిపణి దాడులతోనే యుద్ధానికి తెర తీసింది. ఆ వెంటనే అధ్యక్షుడు పెజెష్కియాన్ నివాసం, పరిసర ప్రాంతాలపైనా దాడులు చేసింది. అయితే అప్పటికే ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అసలు దాడుల సమయంలో ఆయన టెహ్రాన్‌లోనే లేరంటున్నాయి. కానీ ఈ మేరకు అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటనా రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఖమేనీ, అధ్యక్షుడు ‘తనకు తెలిసినంత వరకూ’జీవించే ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చెప్పడం విశేషం. ఇజ్రాయెల్ సైనిక వర్గాలు మాత్రం తమ దాడుల్లో ఖమేనీ మరణించే ఉంటారని అంటున్నాయి!ఇరాన్ రక్షణ మంత్రి మృతి! రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ కూడాఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే, రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్ చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే వీరిద్దరి మరణాన్ని ఇరాన్ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టకముందు అమీర్ నసీర్జాదే ఇరాన్ సాయుధ దళాలకు డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సేవలందించారు. ఆయన యుద్ధ పైలట్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి దేశ రక్షణమంత్రి అయ్యారు. -
అమెరికా దాడి చేస్తే.. రణరంగమే
దుబాయ్: అగ్ర రాజ్యం అమెరికా తమపై దాడి చేసిన పక్షంలో పశ్చిమాసియా యుద్ధ రంగంగా మారుతుందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ(86) తీవ్ర హెచ్చరికలు చేశారు. ప్రజల నిరసనలను హింసాత్మక అణచివేయాలని చూస్తే తీవ్ర దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం తెల్సిందే. విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్, ఇతర యుద్ధ నౌకలు అరేబియా జలాల్లోకి ప్రవేశించిన వేళ ఖమేనీ అమెరికానుద్దేశిస్తూ సూటిగా చేసిన హెచ్చరికలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా ముదిరే ప్రమాదముందని భావిస్తున్నారు. అదేవిధంగా, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలను తిరుగుబాటుగా ఖమేనీ అభివర్ణించారు. తమపై దాడులకు దిగితే అది ఈసారి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలన్నారు. ‘మేం రెచ్చగొట్టే వాళ్లం కాము. మేం ఎవరిపైనా యుద్ధానికి వెళ్లాలనుకోవడం లేదు. మమ్మల్ని వేధించాలని చూసినా, దాడులకు పాల్పడినా తీవ్రస్థాయిలో ప్రతిచర్యలు తప్పవు’అని ప్రకటించారు. అదేవిధంగా, గతంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా కొందరు నిరసనలకు పాల్పడుతున్నారంటూ గతంలో వ్యాఖ్యానించిన ఖమేనీ ఈసారి ఆందోళనకారులపై స్వరం పెంచారు. ‘ఇటీవల జరుగుతున్న నిరసనలు తిరుగుబాటుతో సమానమైనవి. అందుకే ఆ తిరుగుబాటును అణచివేశాం. దేశాన్ని నడిపించే కీలక వ్యవస్థలను ధ్వంసం చేయడమే నిరసనకారుల లక్ష్యం. అందుకే వారు పోలీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, రివల్యూషనరీ గార్డుల కేంద్రాలు, బ్యాంకులు, మసీదులపై దాడులకు పాల్పడ్డారు. ఖురాన్ ప్రతులను దహనం చేశారు’అని ఆరోపించారు.ఈయూ సైనికులూ ఉగ్రవాదులేనిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న రివల్యూషనరీ గార్డ్స్ విభాగం బలగాలను యూరోపియన్ యూనియన్(ఈయూ)ఉగ్రవాదులుగా పక్రటించడంపై ఇరాన్ మండిపడింది. ఈయూ సభ్యదేశాల మిలటరీని కూడా ఉగ్ర గ్రూపులుగా ప్రకటించే విషయం పరిశీలిస్తున్నామని ప్రకటించింది. అమెరికా ప్రభుత్వం 2019లోనే రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించింది. బదులుగా ఇతర దేశాల మిలటరీని ఉగ్రవాద గ్రూపుగా ప్రకటించే విషయం తామూ పరిశీలిస్తామని అప్పట్లోనే ఇరాన్ తెలిపింది. రివల్యూషనరీ గార్డు విభాగం సుప్రీం నేత ఖమేనీ కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అయితే, యూరప్‌లోకి ఉగ్రవాదం వ్యాప్తి చెందకుండా కట్టడి చేస్తున్న రివల్యూషనరీ గార్డులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ద్వారా యూరప్ తనకంటిని తానే పొడుచుకుందని గార్డుల మాజీ కమాండర్ మహ్మద్ బఘెర్ వ్యాఖ్యానించారు. అమెరికా మాట విని ఈయూ గుడ్డిగా ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. మరో పరిణామంలో...వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆది, సోమవారాల్లో లైవ్ ఫైర్ మిలటరీ డ్రిల్ చేపడుతోంది. ప్రపంచంలో జరిగే చమురు రవాణాలో ఐదో వంతు పర్షియన్ గల్ఫ్‌లోని ఈ జలసంధి ద్వారానే సాగుతోంది. తమ యుద్ధ నౌకలు, విమానాలకు నష్టం కలిగించాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ హెచ్చరికలు జారీ చేసింది. -
ఇరాన్‌పై యుద్ధమేఘాలు!
వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధానికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారా? పాలస్తీనాలో యుద్ధానికి తెర దించేందుకు ‘శాంతి బోర్డు’ ఏర్పాటును ప్రకటించిన మర్నాడే పశ్చిమా సియాను మరోసారి రణరంగంగా మార్చ బోతున్నారా? ఆ దిశగా సర్వసన్నాహాలూ శరవేగంగా జరిగిపోతున్నాయా? జరుగుతున్న పరిణామాలు, ట్రంప్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అవుననే సమాధానమే వస్తోంది. అమెరికా యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు భారీ స్థాయిలో పశ్చిమాసియా వైపు కదులుతున్నాయి. వాటితో పాటు పదాతి సైన్యాన్ని కూడా అమెరికా మోహరిస్తోంది. ఇజ్రాయెల్ కూడా ఐరన్‌డోమ్‌తో పాటు తన రక్షణ వ్యవస్థలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పటిష్టపరుచుకుంటోంది! దాంతో పశ్చిమాసియాపై మరోసారి యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నట్టే కనిపిస్తోంది. అరేబియా దిశగా నౌకలుయుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలతో కూడిన భారీ సైనిక పటాలాన్ని ఇరాన్ దిశగా అమెరికా తరలిస్తోంది! ఇటీవలి దాకా దక్షిణ చైనా సముద్రంలో లంగరేసిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమానవాహక యుద్ధనౌక అరేబియా సముద్రం కేసి కదులుతోంది. అది జనవరి 20 నాటికే మలక్కా జలసంధిని దాటి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నౌక తన ఆటోమాటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను ఆఫ్ చేయడం గమనార్హం. దాంతో ప్రస్తుతం అదెక్కడున్నదీ గుర్తించే వీల్లేకుండా పోయింది. గంటకు 20 నాటికల్ మైళ్లకు మించిన వేగంతో ప్రయాణిస్తున్న నేపథ్యంలో శుక్రవారానికే ఆ నౌక అరేబియా సముద్రంలోకి ప్రవేశించినట్టు భావిస్తున్నారు. ఇరాన్‌లోని లక్ష్యాలను ఢీకొట్టాలంటే అది ఉత్తర అరేబియా సముద్రంలో లంగరు వేయాల్సి ఉంటుంది. పలు డిస్ట్రాయర్ నౌకలు, అణ్వాయుధాలతో కూడిన జలాంతర్గాములు, యుద్ధ విమానాలు అబ్రహం లింకన్‌తో పాటు తరలి వెళ్తున్నాయి. దానిపై కనీసం 60 దాకా అత్యాధునిక ఎఫ్/ఏ–18 యుద్ధ విమానాలున్నట్టు సమాచారం. రీ ఫ్యూయలింగ్ అవసరం లేకుండా ఏకంగా 2,300 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేరగల సామర్థ్యం వాటి సొంతం! అయినా ముందుజాగ్రత్తగా యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపే కేసీ–135 ఏరియల్ రీఫ్యూయలర్లను కూడా అమెరికా రంగంలోకి దించుతోంది! ఇక ఐఎస్ఎస్ లింకన్‌కు తోడుగా వెళ్తున్న జలాంతర్గాముల్లో వీటితో పాటు ఒహాయో శ్రేణికి చెందిన అత్యాధునిక గైడెడ్ క్షిపణులుండటం విశేషం. వాటిలో ఒక్కో జలాంతర్గామికీ కనీసం 154 తోమహాక్ క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యముంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సర్వసన్నద్ధంగా ఉన్నట్టే. వీటితోపాటు ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు కూడా ఇప్పటికే పశ్చిమాసియాలోని పలు సైనిక స్థావరాల్లో మోహరించాయి. ఒక విమానం లాండవుతున్న ఫొటోలను యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇవేగాక థాడ్, పాట్రియాట్ వంటి అదనపు క్షిపణి విధ్వంసక వ్యవస్థలను పశ్చిమాసియా పొడవునా, ముఖ్యంగా ఇజ్రాయెల్, ఖతర్‌లోని అమెరికా సైనిక స్థావరాల్లో మోహరిస్తున్నట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. సీ–17 రవాణా విమానాలూ...అమెరికాకు చెందిన అత్యంత భారీ సీ–17 సైనిక రవాణా విమానాలు కూడా మూడు రోజులుగా జోర్డాన్‌లోని మఫ్రాక్ అల్ ఖవాజా వైమానిక స్థావరం నుంచి ఇరాన్ సమీపంలోని అమెరికా బేస్‌లకు చక్కర్లు కొడుతున్నాయి. ఇరాన్ దాడిని కాచుకునేందుకు అవి ఇజ్రాయెల్‌కు పాట్రియాట్–3 శ్రేణి క్షిపణులను సరఫరా చేస్తున్నట్టు భావిస్తున్నారు. తమపై దాడి అంటూ జరిగితే ముందుగా ఇజ్రాయెల్ భరతం పడతామని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మిత్ర దేశం భద్రత విషయంలో అమెరికా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇవేగాక అవసరాన్ని బట్టి డీగో గార్షియా దీవిలోని వైమానిక స్థావరం నుంచి బీ2 స్టెల్త్ బాంబర్లను కూడా అప్పటికప్పుడు రంగంలోకి దించాలని అమెరికా సైన్యం నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు! లేదంటే నేరుగా అమెరికా నుంచి కూడా వాటిని ఇరాన్ దిశగా తరలించే అవకాశముంది.ఇరాన్‌పై డేగకన్ను: ట్రంప్అతి పెద్ద అమెరికా సైనిక పటాలం ఇరాన్కేసి కదులుతోందని ట్రంప్ విస్పష్టంగా ప్రకటించారు. ‘‘మా కీలక యుద్ధ నౌకలు, డిస్ట్రాయర్లు గల్ఫ్కేసి దూసుకెళ్తున్నాయి. వాటన్నింటి దృష్టీ ఇరాన్ మీదే ఉంది’’ అని స్పష్టం చేశారు. గురువారం దావోస్ నుంచి వాషింగ్టన్ తిరిగి వెళ్తూ ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇప్పటికిప్పుడు ‘పెద్ద నిర్ణయం’ తీసుకునే ఉద్దేశం నాకేమీ లేదు. అయితే ఇరాన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాం. బహుశా ఈసారి ఆ దేశంపై మా సైనిక శక్తియుక్తులను ప్రయోగించాల్సిన అవసరం రాకపోవచ్చేమో. కానీ అక్కడి పరిస్థితిని డేగకళ్లతో గమనిస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో!’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.ట్రంప్‌వి పచ్చి అబద్ధాలుదుబాయ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ఉరిశిక్షల రద్దు’ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవలి భారీ నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న వందలాది మందికి ఇరాన్ ఉరిశిక్షలు విధించినట్టు వార్తలు రావడం తెలిసిందే. అలాగైతే సైనిక చర్య తప్పదన్న తన హెచ్చరకల వల్ల కనీసం 840 ఉరిశిక్షలను ఇరాన్ రద్దు చేసిందని గురువారం కూడా ట్రంప్ ప్రకటించుకున్నారు. అది పచ్చి అబద్ధమని ఇరాన్ న్యాయాధికారి మొహమ్మద్ మొవాహెదీ అన్నారు. ‘అసలు ఆ సంఖ్య ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. మా న్యాయవ్యవస్థ అలాంటి నిర్ణయమే తీసుకోలేదు’’ అని ఆయన శుక్రవారం చెప్పుకొచ్చారు. మరోవైపు, భారీ నిరసనల్లో మరణించిన వారి సంఖ్యను 3,117గా ఇరాన్ తాజాగా పేర్కొంది. కానీ 5,000 మందికి పైగా మరణించినట్టు హక్కుల సంఘాలు తెలిపాయి.వాణిజ్యం ఛిన్నాభిన్నమే!ఇరాన్‌పై అమెరికా యుద్ధానికే దిగితే ప్రపంచ వాణిజ్యం అతలాకుతలం కావడం ఖాయం. ముఖ్యంగా చాలా దేశాలకు చమురు సరఫరా నిలిచిపోనుంది. ఇరాన్ నియంత్రణలోని హార్మూజ్ జలసంధి గుండా రోజుకు ఏకంగా 2 కోట్ల బ్యారెళ్ల మేరకు చమురు రవాణా జరుగుతుంది. యుద్ధ పరిస్థితే వస్తే దాన్ని పూర్తిగా నిలిపేయవచ్చు. అంతేకాదు, ఇరాన్ దగ్గర భారీ పరిమాణంలో ఉన్న యురేనియం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారుతుంది. దాని వద్ద 10 అణుబాంబుల తయారీకి సరిపోయే 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టు అంచనా. -
మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం
మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకుంటున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని, సంబంధిత పక్షాలతో నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో మాట్లాడిన పుతిన్.. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ప్రాంతీయ స్థిరత్వం, భద్రత కోసం రాజకీయ, దౌత్యపరమైన ప్రయత్నాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో సంబంధాలను కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారని క్రెమిన్ వెల్లడించింది. అదేవిధంగా, ఆర్థిక సమస్యల కారణంగా కొనసాగుతున్న నిరసనలను చల్లార్చి, దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో పుతిన్‌కు వివరించారని కూడా తెలిపింది. ఐరాసతోపాటు ఇతర ప్రపంచ వేదికలపై ఇరాన్ వైఖరికి మద్దతు తెలిపేందుకు అంగీకరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పెజెష్కియాన్ ధన్యవాదాలు తెలిపినట్లు ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. ఇలా ఉండగా, ఇరాన్ అణు నిరాయు«దీకరణకు అంగీకరిస్తే ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం లభించినట్లేనని ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ చెప్పారని టాస్ పేర్కొంది. అలా జరక్కుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా తెలిపింది. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. కువైట్‌లో సైరన్ మోత
కువైట్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌లో ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా సైరన్లు మోగించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కేవలం సాధారణ పరీక్ష మాత్రమేనని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.దేశంలోని అత్యవసర హెచ్చరిక వ్యవస్థలు, పౌర రక్షణ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడమే ఈ చర్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికీ ఈ పరీక్ష ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ డ్రిల్‌లో మూడు రకాల సైరన్లు వినిపించనున్నట్లు తెలిపారు. ప్రతి సైరన్‌కు ప్రత్యేక అర్థం ఉంటుందని వెల్లడించారు. మొదటి సైరన్ ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికగా, రెండోది ప్రమాదం కొనసాగుతున్నదని సూచికగా, మూడో సైరన్ ప్రమాదం ముగిసినట్లు తెలిపే సంకేతంగా ఉంటుందని అధికారులు వివరించారు.ప్రజలు ఈ పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి 4,400 మంది వెనక్కి: కేంద్రం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌ల నుంచి 4,400 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఆపరేషన్ సిందూలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి వీరి కోసం 19 ప్రత్యేక విమాన సర్వీసులను నడిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నుంచి ఆర్మీనియా రాజధాని ఎరెవాన్ చేరుకున్న 173 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం తాజాగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుందని పేర్కొంది. అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేశాక తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు వివరించారు. మొత్తమ్మీద ఇరాన్లో 10 వేల మంది, ఇజ్రాయెల్‌లో 40 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో సహకరించిన ఈజిప్టు, జోర్డాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 20న గగనతలాన్ని భారతీయుల కోసం తెరిచిన ఇరాన్‌తోపాటు తుర్క్మెనిస్తాన్, ఆర్మీనియా ప్రభుత్వాలకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మద్య ఉద్రిక్తతలు మొదలుకాగా, 22న అమెరికా ఇరాన్ అణు వసతులపై దాడులకు దిగడంతో తీవ్ర రూపం దాల్చడం తెల్సిందే. -
విరమణ... నిజంగానా?!
ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బహుపాత్రాభినయంతో అందరినీ మెప్పిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు సాగించిన కొన్ని గంటలకే ఇరాన్–ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దాన్ని తాము స్వాగతిస్తున్నా మని మంగళవారం మధ్యాహ్నం ట్రంప్ ప్రకటించారు. దీనికి ఇరాన్ సానుకూలంగా స్పందించినా ఇజ్రాయెల్ మౌనం పాటించింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్ రాజధాని తెహ్రాన్‌పై అది బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశాలూ పరస్పరం ‘ఎందుకో కూడా తెలియని’ విధంగా కాల్పుల విరమణ ఒడంబడికను ఉల్లంఘిస్తున్నాయని ట్రంప్ నిందించి తన ‘తటస్థతను’ చాటు కున్నారు! ఇంతకూ కాల్పుల విరమణ నిజమేనా? ఒక సమాచారం ప్రకారం ఖతార్‌లోని అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించాక ట్రంప్ చొరవ తీసుకుని ఇరాన్‌తో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించమని ఖతార్‌ను కోరారు. ఖతార్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇరాన్ ఈ సంగతి బాహాటంగానే చెప్పింది. కాల్పుల విరమణ గురించి ట్రంప్ బతిమా లుకున్నారని వెల్లడించింది. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కాసేపటికే దాడులకు దిగడాన్నిబట్టి ఇజ్రాయెల్‌కు ఈ పరిణామం ససేమిరా ఇష్టం లేదని బోధపడుతోంది. యుద్ధం ఆపటం సులభ మేమీ కాదు. కాల్పుల విరమణ ప్రకటనకూ, దాని ఆచరణకూ మధ్య గంటలు మాత్రమే కాదు... రోజుల వ్యవధి కొనసాగటం రివాజే. మొన్న భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద మైనా, రష్యా–ఉక్రెయిన్ల కాల్పుల విరమణ అయినా ఈ సంగతే చెబుతాయి.యుద్ధానికి ముందు నెల నుంచి ట్రంప్ ఇరాన్‌కు రోజువారీ హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. అణు ఒప్పందంపై మొండి పట్టుదలకు పోతే దేశం సర్వనాశనమవుతుందని బెదిరించారు. ఆఖరికి ఒకపక్క ఇరాన్ అమెరికాతో చర్చలు సాగిస్తుండగానే పన్నెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఎలాంటి కవ్వింపూ లేకుండా ఆ దేశంపై దాడులు సాగించి ఇరాన్ సైనిక దళాల చీఫ్‌లు ఇద్దరినీ, అణు శాస్త్రవేత్తలతోసహా పలువురినీ హత్య చేసింది. ఇది తప్పని చెప్పాల్సిన ట్రంప్... ప్రతీకార దాడులకు దిగితే ఖబడ్దార్ అంటూ తిరిగి ఇరాన్‌నే హెచ్చరించారు. ఆఖరికి శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా తానే రంగంలోకి దిగి బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్లో మూడు అణు స్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇంతా అయినాక హఠాత్తుగా ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. ఏకపక్ష యుద్ధం ప్రారంభానికి పూర్వమే ఇరాన్ బలహీనతలు బయటపడ్డాయి. దశాబ్దాల ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతిన్న దేశం మెరుగ్గా ఉండగలదని ఎవరూ భావించలేరు. ఒకపక్క నేరుగా అమెరికా, ఇజ్రాయెల్ కుటిలత్వం తెలుస్తున్నా మిత్రులనుకున్నవారు కూడా ఖండించ టానికి సిద్ధపడకపోవటం... అండగా ఉండగలవని భావించిన రష్యా, చైనాలు ప్రకటనలకే పరిమితం కావటం, గల్ఫ్ దేశాలు నామమాత్రంగా ఖండించి ఊరుకోవటం ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి ఉంటాయి. అణు ఒప్పందానికి సిద్ధపడతామని ప్రకటించి ఆ దిశగా అడుగులేస్తున్న దేశం ప్రపంచంలో ఇలా ఏకాకిగా మిగిలిపోవటం వర్తమాన విషాదం. యుద్ధం పర్యవసానంగా ఇరాన్లో పలు దేశాల పెట్టుబడులు దెబ్బతింటాయి. పైగా ప్రపంచానికి పెద్ద పోలీసుగా వ్యవహరిస్తూ తాము చెప్పిందే ఒప్పందమని ఒత్తిడి తెచ్చే ధోరణి రేపన్నరోజు ఎవరికైనా ముప్పే. ఇజ్రాయెల్ దగ్గర... ఆ మాటకొస్తే పశ్చిమాసియాలో అణుబాంబుల జాడలేకపోతే, ఇరాన్ మాత్రమే ఆ పని చేస్తే దాన్ని నియంత్రించటంలో హేతుబద్ధత ఉన్నదని నమ్మినా తప్పుబట్టనవసరం లేదు. కానీ అసలు అమెరికా, రష్యా మొదలుకొని ఏకపక్ష యుద్ధాలతో అందరూ తమ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుంటుండగా ఒక్క ఇరాన్ మాత్రమే ధూర్త దేశమని ఎందుకు భావించాలి? ఇంతకూ ట్రంప్ హఠాత్తు నిర్ణయం వెనకున్న కారణాలేమిటి? సైనిక స్థావరంపై దాడి చేస్తున్నా మని ఇరాన్ ముందస్తు సమాచారం ఇవ్వటం, అందుకు అనుగుణంగా అమెరికా తన సైనికుల్ని తరలించటంతోపాటు క్షిపణుల్ని కూల్చే ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైంది. ఒకే ఒక్కటి పేలినా దానివల్ల నష్టం లేదు. అది ట్రంప్‌కు నచ్చినట్టుంది. దానికితోడు ఆయన అందలం ఎక్కటంలో కీలకపాత్ర పోషించిన ‘మాగా’ ఈ యుద్ధంపై చీలిపోయింది. గట్టి మద్దతుదారైన స్టీవ్ బెనన్ లాంటివారు సైతం ట్రంప్‌ను తప్పుబట్టారు. ఆ ఒత్తిళ్ల మాటెలావున్నా యూరప్ నుంచి వస్తున్న వార్తలు అమెరికాను భయపెట్టి ఉండాలి. అమెరికా తర్వాత బంగారం నిల్వల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ (3,352 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు) ఆ నిల్వల్లో మూడోవంతు భాగాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్‌లో ఉంచాయి. దాన్ని వెనక్కుతేవాలని ఆ దేశాల్లో డిమాండ్లు బయల్దేరాయి. నిల్వల విలువ 24,500 కోట్ల డాలర్ల పైమాటే. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతను దెబ్బతీసేలా ట్రంప్ వ్యవహరించటం, ప్రపంచాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకోవటం తదితర కారణాల వల్ల అమెరికాలో బంగారం ఉంచటం సురక్షితం కాదని విపక్షాలు వాదిస్తున్నాయి. అది ఆచరణ రూపందాలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోవటం ఖాయం. పైగా లండన్‌తో పాటు ప్రపంచంలోనే కీలకమైన బంగారం కేంద్రంగా వెలిగిపోతున్న న్యూయార్క్ కళ అడుగంటు తుంది. అందుకే ట్రంప్ పునరాలోచనలో పడ్డారా? లేక ముందస్తు సమాచారం ఇచ్చిన ఇరాన్ ‘మంచితనం’ నచ్చిందా? మొత్తానికి అగ్ని గుండం కాబోతున్న పశ్చిమాసియాలో సామరస్య గాలులు వీచటం ఆహ్వానించదగ్గది. ఇది పూర్తి స్థాయిలో సాకారం కావాలని ఆశించాలి. -
అణుశక్తి సంపన్న దేశం ఇజ్రాయెల్
టెల్ అవీవ్: ఇరాన్ అణు కేంద్రాలను సర్వనాశనం చేయడం తథ్యమని ఇజ్రాయెల్ పదేపదే చెబుతోంది. భవిష్యత్తులో తమ మనుగడకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే అణు బాంబు తయారు చేయకుండా ఇరాన్‌ను అడ్డుకోవడం ఒక్కటే మార్గమని అంటోంది. ఇజ్రాయెల్ విజ్ఞప్తి మేరు ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. మరోవైపు తన వద్దనున్న అణ్వస్త్రాల గురించి ఇజ్రాయెల్ నోరువిప్పడం లేదు. పశ్చిమాసియాలో అణుబాంబులు కలిగి ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ అన్న సంగతి బహిరంగ రహస్యమే. కానీ, దానిపై యూదు పాలకులు మాట్లాడడం గానీ, ఖండించడం గానీ చేయరు. అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ ఒప్పందం(ఎన్పీటీ)లో భాగస్వామి కాని ఐదు దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. దాంతో అణ్వాయుధాలు వదులుకోవాలంటూ ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయలేకపోతున్నాయి. ఇజ్రాయెల్ అణుకేంద్రాలను అంతర్జాతీయ నిపుణులు తనిఖీ చేసే అవకాశం కూడా లేదు. ఇరాన్ అణు కార్యక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌ను మాత్రం స్వేచ్ఛగా వదిలేయడం పట్ల అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సొంత భద్రత కోసం, శాంతియుత ప్రయోజనాల కోసమే అణు పరీక్షలు చేస్తున్నామని ఇరాన్ చెబుతున్నా పశ్చిమ దేశాలు ఒప్పుకోవడం లేదు. అణ్వస్త్రాలు కలిగిన ఇజ్రాయెల్‌ను ముద్దు చేస్తున్నాయి. 1,110 కిలోల ప్లుటోనియం నిల్వలు ఇజ్రాయెల్ అణు చరిత్ర ఈనాటిది కాదు. 1950వ దశకంలోనే అణ్వాయుధాలపై దృష్టి పెట్టింది. డిమోనా సిటీలో 1958లో నెగెవ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది. చుట్టూ శత్రుదేశాలే ఉండడంతో రక్షణ అణుబాంబులు అవసరమని అప్పటి ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గురియన్ నిర్ణయించారు. ప్లుటోనియం ఉత్పత్తి జరుగుతున్న నెగెవ్ సెంటర్ గురించి ప్రపంచానికి తెలియనివ్వలేదు. అదొక వ్రస్తాల ఫ్యాక్టరీ అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. 1970 నాటికి అణు వార్హెడ్లను ప్రయోగించే స్థాయికి ఇజ్రాయెల్ చేరుకుంది. నెగెవ్ సెంటర్లో జరుగుతున్న అణు కార్యకలాపాల సంగతి 1986లో బయటపడింది. అక్కడే పని చేస్తున్న ఓ టెక్నీషియన్ ఈ విషయం బహిర్గతం చేశారు. దాంతో దేశద్రోహం ఆరోపణల కింద ప్రభుత్వం అతడిని 18 ఏళ్లపాటు జైల్లో నిర్బంధించింది. ఇజ్రాయెల్ క్రమంగా అణుశక్తి సంపన్న దేశంగా మారింది. దాదాపు 200 న్యూక్లియర్ వార్హెడ్లు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 1,110 కిలోల(2,425 పౌండ్లు) ప్లుటోనియం ఇజ్రాయెల్ వద్ద నిల్వ ఉంది. దీంతో 277 అణు బాంబులు తయారు చేయొచ్చు. న్యూక్లియర్ క్రూయిజ్ క్షిపణులను, అణు వార్హెడ్లలను ప్రయోగించే ఆరు జలాంతర్గాములతోపాటు బాలిస్టిక్ మిస్సైళ్లు ఇజ్రాయెల్ వద్ద ఉన్నట్లు సమాచారం. 6,500 కిలోమీటర్ల పరిధి వరకు అణుబాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించగలదు. ఇజ్రాయెల్ అణ్వ్రస్తాల ముప్పును ఎదుర్కొంటున్న ప్రధాన దేశం ఇరాన్. -
Israel-Iran Conflict: పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల మూసివేత
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. ఆ దేశాలు ప్రతీకార చర్యలతో రగిలిపోతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టులను మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గగనతలాలపై ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.తమ గగనతలాన్ని ఇరాన్ పూర్తిగా మూసివేయగా.. అత్యంత కీలకమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. దీంతో లెబనాన్, జోర్డాన్, ఇరాక్‌లోనూ విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు, తమ అణు స్థావరాలను ధ్వంసం చేయడంతో అత్యున్నత సైనికాధికారులను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పాలన్న టార్గెట్‌తో సోమవారం ఉదయం క్షిపణుల వర్షం కురిపించింది.టెల్ అవీవ్, పెటా తిక్వా ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఈ దాడుల్లో కనీసం ఎనిమిది మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులు చేసింది. రెండు ఎఫ్-14 యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. -
దాడులు... ప్రతిదాడులు
టెహ్రాన్/జెరూసలేం/దుబాయి/వాషింగ్టన్: తొలిదెబ్బతోనే పలువురు ఇరాన్ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధిచేసిన ఇజ్రాయెల్ శనివారం మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. శనివారంనాటి దాడిలో మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు ప్రాణాలుకోల్పోయారు. సైనిక జనరల్ స్టాఫ్‌లో డెప్యూటీ ఇంటెలిజెన్స్ అధికారి అయిన జనరల్ గోలామ్‌రెజా మెహ్రీబీ, ఆపరేషన్స్ విభాగ డెప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీలు మరణించిన విషయాన్ని ఇరాన్ సైతం ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్‌లోని పలు జనావాసాలపై పడ్డాయి. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియరాలేదు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పైనా క్షిపణులు పడ్డాయి. ఆగ్నేయ ఇరాన్ ‘ఖుజెస్తాన్’ప్రావిన్సులోని అబదాన్ నగరంపై, మిలటరీ స్థావరం సమీపంలోని కెర్మాన్షా ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ దాడులుచేసింది. ఇరాన్ గగనతల రక్షణవ్యవస్థలు ధ్వంసంకావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంగా తయారైందని, ఇష్టమొచ్చినట్లు మేం దాడిచేయగలమని ఇజ్రాయెల్ రక్షణశా ఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీడెఫ్రిన్ ప్రకటించారు. 70 ఫైటర్జెట్లతో శత్రు గగనతల రక్ష ణ వ్యవస్థను భస్మీపటలం చేశామని పేర్కొన్నారు. రేడియో ధార్మికత సాధారణమే సైన్యాధికారులను కోల్పోయి సైనికంగా, స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ వెంటనే ప్రతికార దాడులకు దిగింది. శనివారం ఉదయం సైతం మరోసారి వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌రాజధాని టెల్ అవీవ్ సిటీమీదకు ఎక్కుపెట్టింది. ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ క్షిపణ విధ్వంసక వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గాల్లోనే పేల్చేసింది. దీంతో ఆకాశంలో భారీ విస్ఫోటనాలు, మెరుపులు చూసి, భారీ శబ్దాలు విని ఇజ్రాయెల్‌వాసులు భయకంపితులయ్యారు. అయితే భారీఎత్తున ఒకేసారి క్షిపణులు దూసుకురావడంతో కొన్ని ఐరన్‌డోమ్ వ్యవస్థను దాటుకొని మరీ లక్ష్యాలను ఢీకొట్టాయి. దీంతో రిషాన్ లీజియన్ నగరంలో ఇద్దరు, టెల్‌అవీవ్‌లోని రమాత్ గాన్ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడులనేపథ్యంలో టెల్ అవీవ్ సమీప బెన్ గురియణ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసేసింది. మృతసముద్రతీర ప్రాంతంలో చాలా డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ అణుకేంద్రంపై శుక్రవారం పలుమార్లు దాడులుజరిగాయని, రేడియోధార్మికత స్థాయిలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ శనివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేసింది. ఇరాన్ ఆర్మీ చీఫ్‌గా అమీర్ హతామి ఇరాన్ నూతన ఆర్మీ చీఫ్‌గా అమీర్ హతామి నియమితులయ్యారు. ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హతామి ఇరాన్ సైన్యానికి చీఫ్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. హతామి 2013 నుంచి 2021 వరకు ఇరాన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఇరాన్ సైనిక వ్యవస్థతో బలమైన సంబంధాలున్న హతామికి మూడు దశాబ్దాలకు పైగా వ్యూహాత్మక, కార్యాచరణ అనుభవం ఉంది. మరోవైపు బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం నూతన చీఫ్‌గా జనరల్ మజీద్ మౌసావితో ఖమేనీ శనివారం భర్తీచేశారు. ప్రస్తుత చీఫ్ అమీర్ అలీ హజిజాదే శుక్రవారంనాటి దాడుల్లో చనిపోవడం తెల్సిందే. యుద్ధాన్ని ఆపాలన్న ప్రపంచదేశాలు ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో అస్థిరత రాజ్యమేలుతుండగా కొత్తగా ఇరాన్‌తోనూ ఇజ్రాయెల్ సమరానికి సై అనడాన్ని ప్రపంచదేశాలు తప్పుబట్టాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని కోరాయి. శాంతిస్థాపన దిశగా చర్చలు జరపాలని శనివారం వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసిలికాలో నూతన పోప్ లియో–14 సందేశం ఇచ్చారు. ఇతర ఉనికి మరొకరు ప్రశ్నించకూడదని, బెదిరించకూడదని అన్నారు. ‘‘ఇరాన్ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ బాంబులేస్తే, టెల్‌అవీవ్‌పై ఇరాన్ క్షిపణులను పడేసింది. పెరిగిన ఉద్రిక్తతలను చాలించండి. ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయమిది. శాంతి, దౌత్యమార్గాల్లో నడవండి’’అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శనివారం పిలుపునిచ్చారు. రహస్యంగా డ్రోన్లు తరలించి.. రష్యాలోకి ఉక్రెయిన్ రహస్యంగా డ్రోన్లను తరలించినట్లే ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌లోకి రహస్యంగా డ్రోన్లను తరలించి గగనతల రక్షణవ్యవస్థల వద్దకు చేర్చింది. అదనుచూసి ఎస్–300 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ లాంఛర్లను, రాడార్ వ్యవస్థలను డ్రోన్లతో పేల్చేసింది. రాడార్లులేకపోవడంతో సులభంగా ఇజ్రాయెల్ ఫైటర్జెట్లు ఇరాన్ ప్రధానభూభాగందాకా వచ్చి భీకరస్థాయిలో బాంబులు జారవిడిచి వినాశనం సృష్టించాయి. అర్ధరాత్రి దాడి తాలూకు వీడియో ఫుటేజీని ఇజ్రాయెల్‌నిఘా విభాగం మొస్సాద్ శనివారం విడుదలచేసింది. ఇలాంటి వీడియోలను మొస్సాద్ విడుదలచేయడం అత్యంత అరుదు. విమానాలను కూల్చేసే లాంఛర్లపై ఇజ్రాయెల్ ఆత్మాహుతి డ్రోన్లు ల్యాండ్ అయి పేలిపోవడం ఆ దృశ్యాల్లో కనిపించింది. ‘‘మావైపుగా క్షిపణులు ప్రయోగించడం మానకుంటే టెహ్రాన్‌ను అగ్నికి ఆహుతిచేస్తాం. మరుభూమిగా మార్చేస్తాం. మా పౌరులకు హాని తలపెడితే మిమ్మల్ని మసిచేస్తాం. టెహ్రాన్‌పై మరోదఫా దాడులకు మా యుద్దవిమానాలు సదా సిద్ధంగా ఉన్నాయి’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’అన్నారు. ఈయన పేరులో దేశంపేరూ ఉండటం విశేషం. ‘‘ముప్పును సమూలంగా తొలగించేదాకా దాడులు ఆపబోం. దాడులు రోజులతరబడి కొనసాగొచ్చు’’అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు.ఇరాన్ ‘అణు’కల చెదిరింది యురేనియంను అత్యంత శుద్ధిచేసి అణుబాంబును తయారుచేయాలన్న ఇరాన్ కల చెదిరిపోయిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అణుకేంద్రం ధ్వంసంకావడం, అందులో కీలక వ్యవస్థలు కూలిపోవడంతోపాటు అత్యంత కీలకమైన 9 మంది అణుశాస్త్రవేత్తలు చనిపోయిన నేపథ్యంలో ఇరాన్ ఇప్పట్లో అణుబాంబును తయారుచేయడం అసాధ్యమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అణువిద్యుత్ కేంద్రానికి సరిపడా యురేనియంను శుద్ధిచేసేందుకు ఇరాన్‌కు అనుమతి ఉండగా అదనపు యురేనియంను శుద్ధిచేస్తోందని చాన్నాళ్ల నుంచి ఆరోపణలురావడం తెల్సిందే. శుక్రవారంనాటి దాడుల్లో అణువిద్యుత్కేంద్రం బ్యాకప్ ఇంధన శక్తివ్యవస్థను ఇజ్రాయెల్ నాశనంచేసింది. దీంతో కరెంట్ కష్టాలు సైతం పెరగనున్నట్లు తెలుస్తోంది.అణు చర్చలు అర్థ్ధరహితంఅమెరికా ఓవైపు మాపై యుద్ధానికి ఇజ్రాయెల్‌ను ఎగదోస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడటం అర్థ్ధరహితమని అగ్రరాజ్యంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అణుచర్చల కోసం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఐదుసార్లు చర్చలు జరగ్గా ఆరోసారి ఆదివారం ఒమన్‌లో జరగనున్నాయి. ఇజ్రాయెల్‌ను మాతో యుద్దానికి దించి అమెరికా మరోదఫా చర్చలకు అర్థంలేకుండాచేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయిల్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే పశ్చిమాసియాలోని మీ స్థావరాలపై దాడులుచేస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లను ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఆదివారం జరగబోయే చర్చలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఇజ్రాయెల్ వైపుగా వెళ్తున్న కొన్ని ఇరాన్ క్షిపణులను తాము ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థలతో కూల్చేశామని అమెరికా అధికారి ఒకరు వెల్లడించడం గమనార్హం. కశ్మీర్ ‘పోస్ట్’పై ఇజ్రాయెల్ క్షమాపణలుటెహ్రాన్పై వైమానిక దాడులు చేశామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శుక్రవారం తమ ‘ఎక్స్’ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘‘ఇరాన్ అనేది ప్రపంచం మొత్తానికి పెనుముప్పుగా మారింది. ఇది ఇజ్రాయెల్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. త్వరలో అన్ని దేశాలతోనూ ఇది ఇలాగే వ్యవహరిస్తుంది. అందుకే దాడులు చేయడం మినహా మాకు మరోదారి కనిపించలేదు’’అని ఐడీఎఫ్ శుక్రవారం ఒక మ్యాప్‌ను పోస్ట్పెట్టింది. అయితే ఈ మ్యాప్‌లో జమ్మూకశీ్మర్‌ను పాకిస్తాన్లో భాగంగా చూపించింది. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే తప్పు తెల్సుకున్న ఇజ్రాయెల్ శనివారం క్షమాపణలు చెప్పింది. ‘‘ఈ ప్రాంత భూభాగాన్ని చూపుతూ ఊహాత్మకంగా గీసిన మ్యాప్ అది. సరిహద్దులను కచ్చితంగా సూచించడంలో ఈ మ్యాప్ విఫలమైంది. మ్యాప్ కారణంగా మేం ఏదైనా నేరానికి పాల్పడినట్లు భారత్ భావిస్తే సారీ’అని ఐడీఎఫ్ శనివారం ఒ పోస్ట్ పెట్టింది. -
బంగారం భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు, పసిడి ధరలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా పసిడి మరో సరికొత్త రికార్డు దిశగా పరుగులు తీసింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులతో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో ఒక దశలో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,200 పెరిగి రూ.1,01,540 స్థాయిని తాకింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం ధర సైతం రూ.1,900 పెరిగి రూ.1,00,700 స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న నమోదైన పసిడి ధర (99.9 శాతం స్వచ్ఛత) రూ.1,01,600 ఇప్పటివరకు దేశీ మార్కెట్లో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిగా కొనసాగుతోంది. దీని ప్రకారం సరికొత్త రికార్డుకు చేరువైనట్టు తెలుస్తోంది. అయితే అమ్మకాల ఒత్తిడితో ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలు ఆ తర్వాత కొంత దిగొచ్చాయి. మరోవైపు వెండి సైతం కిలోకి రూ.1,100 పెరగడంతో సరికొత్త జీవిత కాల గరిష్ట స్థాయి రూ.1,08,100కు చేరుకుంది. ఎంసీఎక్స్ మార్కెట్లో ఆగస్ట్ డెలివరీ కాంట్రాక్టు పసిడి ధర రూ.2,011 పెరిగి రూ.1,00,403కు చేరుకుంది. ‘‘బంగారం ధరలు రూ.లక్ష మార్క్‌ను దాటి కొత్త గరిష్టాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం ధర 3,440 డాలర్లను అధిగమించింది. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనం వైపు మొగ్గుచూపించారు’’అని మెహతా ఈక్విటీస్ కమోడిటీస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ కళంత్రి తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధానికి దారితీయవచ్చన్న అంచనాలు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేసినట్టు చెప్పారు. -
ట్రంప్ మార్కు కనిపించేనా!
దూకుడుకు, ఆశ్చర్యకర నిర్ణయాలకు పెట్టింది పేరైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్నారు. ఈ పరిణామం అమెరికా మిత్ర దేశాల్లో భయాందోళనలకు, శత్రు రాజ్యాల్లో హర్షాతిరేకాలకు కారణమవుతోంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’అన్నదే మూల సిద్ధాంతంగా సాగుతానని తేల్చి చెప్పిన ఆయన అదే ప్రాతిపదికన విదేశాంగ విధానాన్ని పునర్నర్మీస్తారా? అదే జరిగితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరం. ఉక్రెయిన్ యుద్ధం నాటో పుట్టి ముంచేనా? రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే చెప్పారు. అదెలా అని మీడియా పదేపదే ప్రశ్నిస్తే ఒక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ సరిపెట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగించాలని, రష్యాతో ఆ దేశం శాంతి చర్చలు జరిపేలా చూస్తూనే షరతులు విధించాలని ట్రంప్ మాజీ జాతీయ భద్రతాధిపతులు ఇటీవల సూచించారు. నాటోలో ఉక్రెయిన్ ప్రవేశాన్ని వీలైనంత ఆలస్యం చేయడం ద్వారా రష్యాను తృప్తి పరచాలని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా వనరుల వృథాను అరికట్టడమే తన ప్రాథమ్యమని స్పష్టంగా చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్లకు పైగా ఉక్రెయిన్‌కు బైడెన్ సర్కారు అందిస్తూ వచ్చిన భారీ ఆర్థిక, ఆయుధ సాయాలకు భారీగా కోత పడవచ్చని భావిస్తున్నారు. అంతేగాక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా రష్యా, ఉక్రెయిన్ రెండింటిపైనా ట్రంప్ ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. స్వదేశంలో ఇమేజీ కోసం కనీసం తక్షణ కాల్పుల విరమణకైనా ఒప్పంచేందుకు ఆయన శాయశక్తులా ప్రయతి్నంచవచ్చు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్‌కు ట్రంప్ అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది నాటోలోని యూరప్ సభ్య దేశాలకు రుచించని పరిణామమే. కానీ నాటో కూటమి పట్ల ట్రంప్ తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా వాటి అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇది అంతిమంగా నాటో భవితవ్యంపైనే తీవ్ర ప్రభావం చూపవచ్చు. నాటో కూటమి రక్షణ వ్యయం తీరుతెన్నుల్లో భారీ మార్పులకు కూడా ట్రంప్ శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరుకుడు పడని పశ్చిమాసియా గాజా యుద్ధం, ఇరాన్‌తో ఇజ్రాయెల్ ఘర్షణ, దానిపై హమాస్‌తో పాటు హెజ్»ొల్లా దాడులతో అగి్నగుండంగా మారిన పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. తాను అధికారంలో ఉంటే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగేదే కాదని చెప్పుకున్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు, ఆ దేశంతో అణు ఒప్పందం రద్దు వంటి చర్యలకు ఆయన దిగవచ్చంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్‌పై ప్రతీకారం, హమాస్, హెజ్»ొల్లా తదితర ఉగ్ర సంస్థల నిర్మూలన విషయంలో నెతన్యాహు మొండిగా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు రక్షణ మంత్రినే ఇంటికి పంపించారు. కనుక ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. నిజానికి ట్రంప్ విధానాలే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీశాయన్నది ఆయన విమర్శకుల వాదన. వాటివల్ల పాలస్తీనియన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారంటారు. ఇజ్రాయెల్‌తో పాటు పలు అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు పాలస్తీనాను పూర్తిగా ఏకాకిని చేశాయి. ఇన్ని సంక్లిష్టతల నడుమ గాజా కల్లోలానికి ట్రంప్ చెప్పినట్టుగా తెర దించగలరా అన్నది వేచి చూడాల్సిన విషయమే. చైనా వ్యూహంలోనూ మార్పులు! అమెరికా విదేశాంగ విధానంలో చైనా పట్ల వైఖరి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది ప్రపంచ భద్రత, వాణిజ్యంపైనే ప్రభావం చూపుతుంది. ట్రంప్ అధికారంలో ఉండగా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు’గా పేర్కొన్నారు. పలు చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. దాంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగానే కోవిడ్ వచ్చి పడింది. దాన్ని ‘చైనీస్ వైరస్’గా ట్రంప్ ముద్ర వేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అనంతరం బైడెన్ సర్కారు కూడా చైనాపై ట్రంప్ సుంకాలను కొనసాగించింది. అమెరికాలో నిరుద్యోగం తదిరాలకు చైనా దిగుమతులను కూడా కారణంగా ట్రంప్ ప్రచారం పొడవునా ఆక్షేపించన నేపథ్యంలో వాటిపై సుంకాలను మరింత పెంచవచ్చు. అలాగే చైనా కట్టడే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పుచేర్పులకు ట్రంప్ తెర తీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ విధానానికి ఆయన తెర దించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. తైవాన్‌పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని కూడా ట్రంప్ పదేపదే చెప్పారు. కనుక తైవాన్‌కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బలహీనులకు అణ్వస్త్రాలే బలమా?
పశ్చిమాసియా ప్రస్తుత పరిణామాల సందర్భంలో బలహీనమైన దేశాలకు అణ్వస్త్రాలే బలమా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. చైనా నుంచి అణ్వస్త్ర ప్రమాదం లేనట్లయితే భారతదేశం ఆత్మరక్షణ కోసం అణ్వస్త్రాలు తయారు చేసుకునేదా? భారత్ నుంచి అదే ప్రమాదం లేనట్లయితే పాకిస్తాన్ తన అస్త్రాలు ఉత్పత్తి చేసుకునేదా? అమెరికా, రష్యాల అణు ప్రమాదం లేని పక్షంలో చైనా గానీ, అమెరికా ప్రమాదం లేని స్థితిలో సోవియెట్ యూనియన్ గానీ అణ్వాయుధాలు చేసేవా? వియత్నాం వద్ద అణ్వాయుధ శక్తి ఉండి ఉంటే, మొదట ఫ్రాన్స్, తర్వాత అమెరికా ఆ చిన్న దేశాన్ని ఏళ్ళ తరబడి ధ్వంసం చేసేందుకు సాహసించేవా? సూటిగా అడగాలంటే, పాలస్తీనాకు అణ్వస్త్ర శక్తి ఉండినట్లయితే ఇజ్రాయెల్ ఈ తరహా యుద్ధానికి పాల్పడి ఉండేదా?బలహీనమైన దేశాలకు బలవంతుల నుంచి ఆత్మరక్షణకు అంతిమంగా అణ్వస్త్రాలే శరణ్య మవుతాయా అన్నది ఆలోచించదగ్గ ప్రశ్న. మరీ ముఖ్యంగా తక్కిన ప్రపంచం, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ప్రేక్షక పాత్ర వహిస్తు న్నప్పుడు. బలహీనమైన దేశాలకు అణ్వస్త్రాలే బలమా, రక్షణా అని పశ్చిమాసియా ప్రస్తుత పరిణామాల సందర్భంలో చర్చించటానికి ముందు... ఇపుడు ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యాలు తమ అణ్వస్త్రాలను కవచంగా మార్చుకుని ఎంత భద్రతను అనుభవిస్తున్నాయో గమనించాలి. సూటిగా అడగాలంటే, పాలస్తీనాకు అణ్వస్త్ర శక్తి ఉండినట్లయితే ఇజ్రాయెల్ వంటి శక్తిమంతమైన దేశం గాజాలో గానీ, వెస్ట్ బ్యాంక్‌లో గానీ, తాజాగా లెబనాన్‌లో గానీ ఈ తరహా యుద్ధానికి పాల్పడి ఉండేదా? ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చి మొత్తం పశ్చిమాసియా స్థితి గతులనే మార్చి వేయగలమనే ఇటీవలి హెచ్చరికలను ఒకవేళ ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు తయారు చేసుకుని ఉండినట్లయితే జారీ చేయగలిగేదా? ఈ ప్రశ్నలన్నింటి ఉద్దేశం ప్రపంచం అంతా అణ్వస్త్రాల మయం అయిపోవాలని సూచించటం కాదు. అవెంత వినాశనకరమైనవో అమెరికన్ల హిరోషిమా, నాగసాకి ప్రయోగాల అనుభవం తర్వాత ఎవరికీ చెప్పనక్కర లేదు. ఉద్దేశపూర్వకంగా కాకున్నా ప్రమాదవ శాత్తునో, ఏదైనా యాంత్రికపరమైన పొరపాటు వల్లనో ఏ అగ్రరాజ్య శిబిరం వైపు నుంచో అణు ప్రయోగం జరిగి మరుక్షణం ఎదుటి శిబిరం కూడా వాటిని ప్రయోగించటం జరిగితే పరిస్థితి ఏమిటని? అసలు అణ్వస్త్రాలు అన్నవే మొత్తం మానవాళికి ఒక భయంకర స్థితి అనటంలో ఎటువంటి సందేహాలు లేవు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధానికి, అణ్వస్త్ర దేశాల వద్ద గల అణ్వాయుధాల పరిమితికి, కొత్తగా అణు పరీక్షలపై నియంత్రణకు, రోదసీలో అస్త్రాల మోహరింపుపై నిషేధానికి అనేక ఒప్పందాలు జరిగాయి. కానీ వాటన్నింటి ఉల్లంఘనలు జరుగు తున్నాయన్నది గమనించవలసిన విషయం.పాలస్తీనా వంటి ఒక అతి చిన్న దేశం వద్ద, ఇరాన్ వంటి ఒక మధ్యమ స్థాయి దేశం వద్ద అణ్వస్త్ర శక్తి ఉండి ఉంటే, పాలస్తీనా సమస్య 1948లోనే పరిష్కారమయ్యేదని కాదనగలమా? అందుకు ఇజ్రాయెల్‌తో పాటు అమెరికన్ శిబిరం అంగీకరించేవని చెప్పలేమా? ఈ పరిణామాల మధ్య మరొకవైపు ఏమవుతున్నదో గమనించండి. ఇరాన్ వద్ద అణ్వస్త్రాల ఉత్పత్తికి తగిన సామర్థ్యంతోపాటు, అవస రమైన సామగ్రి అంతా ఉన్నది. కానీ అణ్వస్త్రాలు ఇస్లాంకు విరుద్ధమైన వని అంటూ వాటి తయారీని ఇరాన్ అధిపతి అలీ ఖమేనీ బహిరంగంగా నిషేధించారు. శాంతియుత వినియోగానికి మాత్రమేనని చెబుతూ వారు ఆ శక్తిని అభివృద్ధి పరుస్తున్నారు. దానిని కూడా సహించని అమెరికా ఇరాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనేక తనిఖీలు జరిపింది. నెతన్యాహూ గత వారం ఒక రికార్డెడ్ వీడియో విడుదల చేశారు. అందులో రెండు గమనార్హమైన హెచ్చరికలున్నాయి. హమాస్, హిజ్బుల్లా తరహాలో ఇరాన్ నాయకత్వాన్ని కూడా అంతం చేసి ఇరాన్ ప్రజలను విముక్తం చేయగలమన్నది ఒకటి. మొత్తం పశ్చిమాసియాలో ఏ ప్రాంతం కూడా తమ శక్తికి అతీతమైనది కాదని, తాము క్రమంగా మొత్తంగానే ఆ ప్రాంతపు రూపును, స్థితిగతులను మార్చివేయనున్నా మనేది రెండోది.దీనంతటి మధ్య మరొక గమనించదగ్గ ఘటన చోటు చేసుకుంది. ఇరాన్‌లోని సెమ్నాన్ ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం 4.4 మాగ్ని ట్యూడ్తో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో ఆ ప్రాంతంలోని అరదాన్ పట్టణంతో పాటు టెహరాన్ నగరంలోని ఒక భాగంలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఇంతకూ అది నిజంగా భూకంపమా లేక భూగర్భ అణ్వస్త్ర ప్రయోగ ఫలితమా అన్న చర్చలు బయటి ప్రపంచంలో సాగుతున్నాయి. పాశ్చాత్య నిఘా సంస్థలు కూడా ఇంతవరకు నిర్ధారణగా ఏమీ చెప్పలేదు. సెమ్నాన్ ప్రాంతానికి సమీపంలోనే ఇరాన్ అణుశక్తి పరీక్షల ప్రధాన కేంద్రాలైన నాతాంజ్, ఫొర్దోవ్లు ఉండటం గమనించదగ్గది. ఒకవేళ రహస్యంగా అణ్వస్త్ర పరీక్షలు జరిగి ఉంటే భూప్రకంపనలు రావటం సహజం. భారత ప్రభుత్వం రాజ స్థాన్ ఎడారిలోని పొఖారణ్ వద్ద పరీక్షలు నిర్వహించినప్పుడు ఇదే జరిగింది. ఒకవేళ ఇరాన్ పరీక్షలు నిజమనుకుంటే, దేశాధిపతి తన నిషేధాన్ని సడలించి ఉంటారా అన్నది ఒక ప్రశ్న. ఇజ్రాయెల్ హెచ్చరి కలతో నాయకుల ప్రాణాలు, దేశ రక్షణ ప్రమాదంలో పడినపుడు, బయటకు చెప్పకుండా ఎందుకు సడలించరాదన్నది మరొక ప్రశ్న. మరొకవైపు, పోయిన ఆగస్టు చివరలో ఖమేనీ తమ ప్రధానికి ఒక ఆదేశాన్ని బహిరంగంగా ఇచ్చారు. ఒకవేళ తాము అణ్వస్త్రాలు ఉత్పత్తి చేయరాదంటే తమకు ఎటువంటి రక్షణలు కల్పించగలరో, పశ్చిమా సియాలోని వివిధ పరిస్థితుల గురించి ఏమి హామీలివ్వగలరో బైడెన్‌తో చర్చించాలని! అటువంటి చర్చలు ఇంతవరకేమీ జరగలేదు గానీ ఈ లోపల యుద్ధ రీత్యా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ పరిస్థితి దాదాపు చేయి దాటింది. వచ్చే నెల అమెరికా ఎన్నికలు న్నాయి. ఈ దశలో ఇక అటువంటి చర్చలకు అవకాశం లేదు. ఎన్ని కలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పడే సరికి ఇక్కడ గాజా, లెబనాన్, ఇరాన్లలో ఏమైన జరగవచ్చు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఇరాన్ నాయకత్వం తమ అణు విధానాన్ని రహస్యంగా సడలించు కున్నదేమో తెలియదు.ఇంతకూ ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయాలని ఇజ్రా యెల్ నిర్ణయించినా ఆ పని ఎంతవరకు సాధ్యమనే ప్రశ్న కూడా ఒకటున్నది. ఆ కేంద్రాలు ఇరాన్ తూర్పు ప్రాంతంలో ఏదో ఒక చోట కాకుండా విస్తరించి ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి నాతాంజ్, ఫొర్దోవ్లు. వాటి పరిశోధనాగారాలు భూగర్భంలో చాలా లోతున దుర్భేద్యమైన రక్షణలో ఉన్నాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచి వెయ్యి మైళ్ళకు పైగా దూరం. అంతవరకు వచ్చి దాడి చేయాలంటే సుమారు వంద యుద్ధ విమానాలు అవసరమని, అవి ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను, యుద్ధ విమానాల ఎదురుదాడులను దాటుకుంటూ రావాలన్నది అమెరికాయే ఒకప్పుడు వేసిన అంచనా. ఇది ఒక సమస్య అయితే, ఎంతో లోతున గల అణు కేంద్రాలను దెబ్బతీసే శక్తి అమెరి కన్ బంకర్ బస్టర్లకు తప్ప ఇజ్రాయెల్‌కు లేదు. మరి అమెరికా ఆ సహాయం చేస్తుందా? దీనంతటిలో అనిశ్చితి ఉంది. ఒకవేల పరిస్థి తులు ఇరాన్ ఆశించినట్లుగానే లేనట్లయితే? అందుకే ఇరానియన్ రిపబ్లిక్ అధికారులు, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్లు ఇటీవల, పరిస్థి తులు ఈ విధంగానే కొనసాగితే తమ సైనిక రక్షణ విధానాన్ని మార్చు కొనక తప్పదని తరచూ ప్రకటిస్తున్నారు.ఇదంతా ఏమి చెప్తున్నది? మొదటి నుంచి కూడా బలవంతులదే రాజ్యం అన్నట్లు ఉన్న ప్రపంచ పరిస్థితులు ఇప్పటికీ అదే విధంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ సంస్థలు, చర్చలు, ఒప్పందాల వంటివన్నీ బలవంతుల ఉల్లంఘనలకు గురవుతున్నాయి. ఆయుధ బలం, ధన బలం మాత్రమే రాజ్యమేలుతున్నాయి. న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, నీతి అవినీతుల ప్రసక్తే లేదు. అణ్వస్త్రాల మాట కూడా అందులో భాగమే. అంతెందుకు, జపాన్ వద్ద బాంబులు ఉండినట్ల యితే వారిపై మొదటి అణ్వస్త్ర ప్రయోగం జరిగేదా? ఇప్పుడు ఉత్తర కొరియా వద్ద అవి ఉన్నందుకే గదా అమెరికా వెనుకాడుతున్నది? ఉక్రెయిన్ యుద్ధంలో అణుప్రయోగ ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయి? ఇట్లా చెప్తూ పోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో అనేక ఉదాహరణలున్నాయి. అందువల్లనే, బలహీన దేశాల రక్షణకు అణ్వస్త్రాలే బలమా అనే ప్రశ్న వస్తున్నది. అదెంత ప్రమాద కరమైనది, అవాంఛనీయమైనది అయినా. చర్చకోసం.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ఇరాన్ భూగర్భ అణుపరీక్షలు?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ మరింత పరాకాష్టకు తీసుకెళ్తోందా? అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5న శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:45 ప్రాంతంలో ఇరాన్‌లోని అరదాన్ నగర సమీపంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. అక్కడికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా భూ¿ౌతిక సర్వే విభాగం ధ్రువీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయెల్‌లోనూ ప్రకంపనలు కన్పించాయి.యి. ఇది భూకంపం కాదని, కచి్చతంగా భూగర్భ అణు పరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంట్‌కు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూ కంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కి.మీ. లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు. -
యుద్ధానికి ఏడాది పూర్తయిన వేళ...పరస్పర దాడులు
రెయిమ్ (ఇజ్రాయెల్)/బీరూట్: గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పశి్చమాసియా దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్‌తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాది 1 క్షిపణులు ప్రయోగించింది. తమపైకి 130కి పైగా క్షిపణులు దూసుకొచి్చనట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ‘‘వాటిలో ఐదు మా భూభాగాన్ని తాకాయి. రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయి’’ అని సైన్యం ధ్రువీకరించింది. పది మందికి పైగా గాయపడ్డట్టు పేర్కొంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్‌పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే గాక టెల్ అవీవ్‌లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. దాంతో అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింతగా విరుచుకుపడింది. బీరూట్‌తో పాటు దక్షిణ లెబనాన్‌లోని బరాచిత్పై భారీగా వైమానిక దాడులు చేసింది. బీరూట్‌లో పలుచోట్ల ఇళ్లు, నివాస సముదాయాలు నేలమట్టమయ్యాయి. జనం కకావికలై పరుగులు తీశారు. దాంతో విమానాశ్రయం తదితర ప్రాంతాలు శ్మశానాన్ని తలపిస్తున్నాయి. బరాచిత్లో సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న 10 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది వైమానిక దాడులకు బలైనట్టు లెబనాన్ ప్రకటించింది. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌లో మరో 100 గ్రామాలను ఖాళీ చేయాల్సిందిగా స్థానికులను తాజాగా హెచ్చరించింది. సరిహద్దుల వద్ద సైనిక మోహరింపులను భారీగా పెంచుతోంది. గాజాలో జాబాలియా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైన్యం బాంబులతో విరుచుకుపడింది. దాంతో 9 మంది బాలలతోపాటు మొత్తం 20 మంది దాకా మరణించారు. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మేం విఫలమైన రోజు ఏడాది కింద హమాస్ ముష్కరులు సరిహద్దుల గుండా చొరబడి తమపై చేసిన పాశవిక దాడిని ఇజ్రాయెలీలు భారమైన హృదయాలతో గుర్తు చేసుకున్నారు. దేశమంతటా ప్రదర్శనలు చేశారు. టెల్ అవీవ్‌లో హైవేను దిగ్బంధించారు. ‘‘ప్రజల ప్రాణాల పరిరక్షణలో మేం విఫలమైన రోజిది’’ అంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జ్ హలెవీ ఆవేదన వెళ్లగక్కారు. -
Israel-Hamas war: గాజా మసీదుపై బాంబుల వర్షం
డెయిర్ అల్–బలాహ్: పశ్చిమాసియాలోఇరాన్ ప్రాయోజిత మిలిటెంట్ సంస్థల నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు ఉధృతం చేస్తోంది. సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్–బలాహ్ పట్టణంలో పాలస్తీనా పౌరులు ఆశ్రయం పొందుతున్న అల్–అక్సా అమరవీరుల మసీదుపై ఆదివారం ఉదయం బాంబుల వర్షం కురిపించింది. దాంతో కనీసం 19 మంది మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. డెయిర్ అల్–బలాహ్ సమీపంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై దాడుల్లో నలుగురు మృతిచెందారు. మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకొని మసీదు, పాఠశాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. జబాలియా దిగ్బంధం ఉత్తర గాజాలోని జబాలియా టౌన్‌ను ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులను హెచ్చరించింది. జబాలియాపై వైమానిక, భూతల దాడులకు సన్నాహాలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు జబాలియా వైపు కదులున్న ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. జబాలియాలో అతి పెద్ద శరణార్థుల శిబిరం ఉంది. ఇక్కడ హమాస్ మిలిటెంట్ల స్థావరాలను నేలమట్టం చేయడానికి ఇజ్రాయెల్ భారీ ఆపరేషన్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ‘యుద్ధంలో మరో దశలోకి ప్రవేశించాం’ అంటూ కరపత్రాలను జబాలియాలో జారవిడిచారు. ఉత్తర గాజాలో ఆదివారం భారీగా దాడులు జరిగినట్టు స్థానిక అధికారులు చెప్పారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. జబాలియాలో తమ ఇంటిపై వైమానిక దాడి జరిగిందని, తన తల్లిదండ్రులతోపాటు మొత్తం 12 మంది కుటుంబ సభ్యులు మరణించారని ఇమాద్ అలారాబిద్ అనేది వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇజ్రాయెల్ దాడుల్లో హసన్ హమద్, అనస్ అల్–షరీఫ్ అనే జర్నలిస్టులు మృతిచెందారు. ఉత్తర గాజాలో 3 లక్షల మంది పాలస్తీనా పౌరులు ఉన్నారు. వారందరినీ దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. బీరుట్లో ఆరుగురి మృతి ఇజ్రాయెల్ ప్రతిదాడులతో లెబనాన్ రాజధాని బీరుట్ దద్దరిల్లిపోతోంది. నగర దక్షిణ శివారు ప్రాంతమైన దాహియేపై సైన్యం విరుచుకుపడుతోంది. హెజ్»ొల్లా స్థావరాలే లక్ష్యంగా శనివారం రాత్రి నుంచి వైమానిక దాడులు సాగిస్తోంది. 30కిపైగా క్షిపణి దాడులు జరిగాయని, భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపించాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. సెపె్టంబర్ 23 తర్వాత ఇవే అతిపెద్ద దాడులని పేర్కొంది. గ్యాస్ స్టేషన్, ఔషధాల గోదాముతోపాటు ఒక ఆయుధాగారంపై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణులు ప్రయోగించిందని వెల్లడించింది. ఈ దాడుల్లో కనీసం ఆరుగురు మృతిచెందారని, మరో 12 మంది గాయపడ్డారని ప్రకటించింది. హెజ్»ొల్లా కూడా వెనక్కు తగ్గకుండా ఉత్తర ఇజ్రాయెల్‌లో సైనిక శిబిరాలపై దాడులకు దిగింది. లెబనాన్ నుంచి దూసుకొచ్చిన 30 రాకెట్లను మధ్యలోనే కూల్చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌లో గత రెండు వారాల్లో 1,400 మంది మృతిచెందారు. 10 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. 3.75 లక్షల మంది లెబనీయులు సిరియా చేరుకున్నారు. శనివారం ఇజ్రాయెల్ దాడుల్లో 23 మంది మరణించారని, 93 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రకటించింది. -
భారత్ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్ఐ
న్యూఢిల్లీ:పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఫలితంగా ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్ తదితర దేశాలతో భారత్ వాణిజ్యంపై ప్రభావం పడినట్టు పరిశోధనా సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) తెలిపింది. ఈ కల్లోల పరిస్థితుల్లో, పశ్చమాసియాలో వేగంగా మారిపోతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల భారత్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.2024 జనవరి–జూలై కాలంలో ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న దేశాలతో భారత వాణిజ్యం ప్రభావానికి లోనైనట్టు తెలిపింది. ‘‘ఇజ్రాయెల్‌కు భారత్ నుంచి ఎగుమతులు 63.5 శాతం తగ్గిపోయాయి. జోర్డాన్‌కు 38.5 శాతం క్షీణించాయి. లెబనాన్‌కు సైతం 6.8 శాతం తగ్గాయి’’అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలు కాగా, అది ఇప్పుడు లెబనాన్, సిరియాకు విస్తరించిందని.. ప్రత్యక్షంగా జోర్డాన్, ఇరాన్‌పైనా ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్ ఈ వివాదానికి దూరంగా ఉన్నాయి.తటస్థంగా ఉండడంతో ఈ గల్ఫ్ దేశాలతో (జీసీసీ) భారత్ వాణిజ్యం ఈ ఏడాది జనవరి–జూలై మధ్య 17.8 శాతం పెరిగినట్టు తెలిపారు. మరోవైపు సూయిజ్ కెనాల్, రెడ్సీ వంటి కీలక నౌకా రవాణా మార్గాల్లో అవరోధాలతో.. హార్న్ ఆఫ్ ఆఫ్రికా వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాల్సి రావడంతో షిప్పింగ్ వ్యయాలు 15–20 శాతం మేర పెరిగినట్టు జీటీఆర్ఐ నివేదిక తెలిపింది. ‘‘ఇది భారత కంపెనీల లాభాల మార్జిన్లను గణనీయంగా దెబ్బతీసింది. ముఖ్యంగా తక్కువ స్థాయి ఇంజనీరింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలు, టెక్స్టైల్స్,గార్మెంట్స్లపై ప్రభా వం ఎక్కువగా ఉంది’’ అనివెల్లడించింది. -
ప్రమాదంలో ప్రపంచం
వరస సంక్షోభాలతో నిరంతరం నెత్తురోడే పశ్చిమాసియా అందరూ చూస్తుండగానే పూర్తి స్థాయి యుద్ధంలోకి జారుకున్నట్టు కనబడుతోంది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, మరో ప్రధాన నగరం జెరూసలేంలపై మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడటం, ఆ వెంటనే హెజ్బొల్లా మిలిటెంట్లు టెల్‌అవీవ్‌లోని మొసాద్ ప్రధాన కార్యాలయంపై క్షిపణులతో దాడిచేయటం...ఇజ్రాయెల్‌కు దన్నుగా తాము సైతం రంగంలోకి దిగుతామని అమెరికా హెచ్చరించటం పరిస్థితులు వికటిస్తున్నాయన్న సంకేతాలిస్తున్నాయి. ఇరాన్–ఇజ్రాయెల్ నేరుగా తలపడటం ఇక లాంఛనం. ఒకపక్క తన కవ్వింపు చర్యలే ఇరాన్‌ను ప్రతీకారదాడికి పురిగొల్పాయని బట్టబయలైనా ఇరాన్ దాడిని వ్యతిరేకించలేదన్న కారణంతో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ను ‘అవాంఛిత వ్యక్తి’గా ప్రకటించి, తమ దేశంలో అడుగుపెట్టనీయబోమని నిషేధం విధించటం ఇజ్రాయెల్ తెంపరితనానికి నిదర్శనం. శరపరంపరగా వచ్చిపడుతున్న క్షిపణులను పూర్తిగా నిరోధించటం ఇజ్రాయెల్ గర్వంగా చెప్పుకునే రక్షణ ఛత్రం ఐరన్ డోమ్ వల్ల కూడా కాలేదంటే ఇరాన్ దాడి తీవ్రత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రాణనష్టం పెద్దగా లేకపోయినా భారీ భవనాలు నేలమట్టం కావటం, పౌరులు కకావికలై పరుగులు తీయటం, ప్రభుత్వాదేశాలతో పది లక్షలమంది ప్రజలు బంకర్లలో తలదాచుకోవటం ఇటీవలికాలంలో ఇదే మొదటిసారి. గాజాలో తన లక్ష్యం పూర్తిచేయగలిగానని భావిస్తున్న ఇజ్రాయెల్... రెండురోజుల క్రితం లెబనాన్‌పై పంజా విసరడం ప్రారంభించింది. హెజ్బొల్లా నేత నస్రల్లాను హతమార్చింది. ఆ సమయానికి ఆయనతో పాటున్న తమ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ నిల్ఫోరుషాన్ సైతం ప్రాణాలు కోల్పోవటం ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే అది తాజా దాడికి దిగింది. నిజానికి ఇరాన్‌ను ఏనాడూ ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉండనీయలేదు. అది అణ్వాయుధ దేశంగా మారవచ్చునన్న భీతితో గూఢచర్యం సాగిస్తూ పేరెన్నికగన్న శాస్త్రవేత్తలను... ప్రభుత్వంలో, సైన్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని హతమార్చటం ఇజ్రాయెల్ ఒక విధానంగా పెట్టుకుంది. మొన్న ఏప్రిల్‌లో సిరియాలోని డమాస్కస్‌లో ఇజ్రాయెల్ సాగించిన దాడిలో ఇరాన్‌కు చెందిన సైనిక నిపుణుడు, దౌత్యవేత్త మరణించారు. జూలైలో హెజ్బొల్లా నాయకుడు ఇస్మాయెల్ హనియేను ఇరాన్లో ఉండగా ఇజ్రాయెల్ హతమార్చింది. ఇలాంటి ఉదంతాలు జరిగిన ప్రతిసారీ డ్రోన్లతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగినా వాటివల్ల ఏనాడూ ఇజ్రాయెల్ పెద్దగా నష్టపోలేదు. ఇరాన్ దాడి అనంతరం అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ముడి చమురు ధర భగ్గున మండిన తీరు సమీప భవిష్యత్తులో ముంచుకురాబోతున్న ఆర్థిక సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇజ్రా యెల్ దాదాపు ఏడాదికాలంగా అన్ని రకాల వినతులనూ బేఖాతరు చేసి గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో సాగిస్తున్న నరమేధం తొలుత పశ్చిమాసియానూ, ఆ తర్వాత ప్రపంచాన్నీ యుద్ధం అంచుల్లోకి నెడుతున్నదని విశ్లేషకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. నిరుడు అక్టోబర్ మొదటివారంలో ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 1,200 మంది పౌరులను హతమార్చి, మరో 695 మందిని అపహరించుకుపోవటం ద్వారా హమాస్ దుస్సాహసానికి పాల్పడింది. ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన దేశాలు సైతం అనంతర ఇజ్రాయెల్ దాడులను అంగీకరించలేదు. ఐక్యరాజ్య సమితి ఖండించింది. అమెరికా కూడా గాజా నరమేధం విరమించుకోవాలని ఇజ్రాయెల్‌ను కోరిన మాట వాస్తవం. అలాగని అది ఏనాడూ ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా ఆపలేదు. ఫలితంగా ఇంతవరకూ దాదాపు 45,000 మంది గాజా పౌరులు మరణించారని అంటున్నారు. ఒకసారంటూ యుద్ధం మొదలైతే దాని గమనం, ముగింపు ఎవరి చేతుల్లోనూ ఉండవు. దాని తోవ అది వెదుక్కుంటుంది. రెండో ప్రపంచ యుద్ధ పర్యవసానాలు చూశాక మళ్లీ ఆ ఉత్పాతం జరగనీయరాదని ప్రపంచ దేశాలు ప్రతినబూనాయి. ఎందుకంటే ఆ యుద్ధంలో అయిదున్నర కోట్ల మంది సాధారణ పౌరులు, మరో రెండున్నరకోట్లమంది సైనికులు మరణించారు. కోట్లాదిమంది క్షతగాత్రులయ్యారు. ఒక్క సోవియెట్ యూనియన్లోనే దాదాపు రెండున్నర కోట్లమంది మరణించారు. మరో 90 లక్షలమంది వరకూ వ్యాధుల బారినపడ్డారు. కానీ విస్తరణ కాంక్షతో తహతహ లాడే అగ్రరాజ్యాలు తమ ౖ¯ð జం వదులుకోలేదు. ఆ వెనువెంటనే తమకు అలవాటైన యుద్ధ క్రీడ ప్రారంభించాయి. వర్తమాన పరిణామాలు దాని పర్యవసానమే. న్యూయార్క్ టైమ్స్ పరిశోధక పాత్రికేయురాలు అనీ జాకబ్సన్ యుద్ధం వల్ల మానవాళికి కలగబోయే హాని గురించి చెప్పిన అంశాలైనా అగ్రరాజ్యాల కళ్లు తెరిపించాలి. అణ్వాయుధ యుద్ధం కేవలం 72 నిమిషాల్లో భూగోళంపై 60 శాతం జనాభాను తుడిచిపెడుతుందని హెచ్చరించారామె. ఇజ్రాయెల్‌కు అమెరికా అండదండలున్నట్టే ఇరాన్‌కు రష్యా, చైనాల ఆశీస్సులున్నాయి. దానికి హమాస్, హిజ్బొల్లా గ్రూపులు, యెమెన్‌లోని హౌతీలు, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిటెంటు సంస్థలూ మరింత దగ్గరవుతాయి. ఇజ్రాయెల్‌తో సాన్నిహిత్యం నెరపుతున్న ఈజిప్టు, జోర్డాన్లకూ, ఆ తోవనే వెళ్తున్న సౌదీ అరేబియాకూ సంకటస్థితి ఏర్పడుతుంది. ఈ వైరిపక్షాలన్నీ కొంత హెచ్చు తగ్గులతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల మారణాయుధాలతో సంసిద్ధంగా ఉన్నాయి. అందుకే పాలస్తీనా ఆవిర్భావానికి సహకరించటం, దుందుడుకు విధానాలకు స్వస్తిపలకడం వంటి చర్యలే పశ్చిమాసియాకూ... మొత్తం ప్రపంచానికీ ప్రశాంతతనిస్తాయని ఇజ్రాయెల్ గుర్తించాలి. అమెరికా వివేకంతో మెలిగి సామరస్య ధోరణులకు తోడ్పాటునందించాలి. -
పశ్చిమాసియాలో యుద్ధం ఆపే శక్తి భారత్‌కే ఉందా ?
-
ఇజ్రాయెల్‌తో యుద్ధం... లెబనాన్ తరమా?
నాలుగైదు రోజుల నాటి ముచ్చట. లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లు ఇటీవల ఇజ్రాయెల్‌పై భారీ దాడికి సిద్ధపడ్డారు. కానీ దీన్ని ఇజ్రాయెల్ ముందే పసిగట్టింది. వాళ్లు కాలూచేయీ కూడదీసుకోకముందే వందలాది యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై మెరుపుదాడి చేసింది. అనంతర అందుకు ప్రతిగా హెజ్బొల్లా కూడా వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డా ఆ దాడులను సమర్థంగా కాచుకుంది. ఈ ఉదంతం పశి్చమాసియాలో ఇప్పటికే చెలరేగుతున్న యుద్ధ జ్వాలలను మరింతగా ఎగదోసింది. ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి లెబనాన్ సిద్ధపడుతోందంటూ జోరుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ వంటి అజేయ సైనిక శక్తిని ఓడించే సత్తా లెబనాన్‌కు ఉందా? దేశ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరిస్తుందా...?! లెబనాన్ చాన్నాళ్లుగా పెను రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అప్పుల కుప్ప కొండంత పెరిగిపోయింది. దేశంలో సరైన విద్యుత్ సరఫరా వ్యవస్థకే దిక్కు లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ సరేసరి. పేదరికం విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగి నెగ్గుకు రావడం లెబనాన్ సాధ్యపడే పని కాదంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఇరు దేశాలు నెల పాటు భీకరంగా తలపడ్డాయి. చివరికది అర్ధంతరంగా ముగిసినా లెబనాన్‌కు తీరని నష్టాలే మిగిల్చింది.దశాబ్దాల అవినీతి, రాజకీయ అస్థిరత లెబనాన్‌లో చాన్నాళ్లుగా రాజకీయ అస్థిరత నెలకొంది. అవినీతి పెచ్చరిల్లింది. అభివృద్ధి పూర్తిగా కుంటువడింది. ఆధునీకరణకు నోచుకోక బ్యాంకింగ్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ డీజిల్ జనరేటర్ ఆపరేటర్లు, చమురు సంస్థల చేతుల్లో చిక్కుకుపోయింది. ప్రభుత్వ సంస్థలు కూడా అంతర్జాతీయ రుణదాతల దయాదాక్షిణ్యాలపై నెట్టుకొస్తున్న పరిస్థితి! ఆర్థిక సాయానికీ, ఆహారానికీ విదేశాల మీదే ఆధారపడుతోంది. కోవిడ్ సంక్షోభం దెబ్బకు 2020 నుంచి లెబనాన్ పరిస్థితి పెనంనుంచి పొయ్యిలోకి చందంగా మారింది. బీరూట్ నౌకాశ్రయంలో రసాయన నిల్వల భారీ పేలుడు దెబ్బకు వాణిజ్య రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అంతో ఇంతో ఆదుకుంటున్న పర్యాటక రంగమూ ఇజ్రాయెల్ దాడులతో నేల చూపులు చూస్తోంది.నిల్వలు 3 నెలలకు మించవ్! 2022లో ఇజ్రాయెల్ దాడుల్లో ధాన్యాగారాలు చాలావరకు ధ్వంసం కావడంతో లెబనాన్ ఆహార నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయింది. దాంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతూ నెట్టుకొస్తోంది. ‘‘ఆహార, చమురు నిల్వలు దాదాపు నిండుకున్నాయి. రెండు మూడు నెలలకు మించి లేవు. అవీ అయిపోతే పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉంది’’ అని అంతర్జాతీయ సహాయ సంస్థ మెర్సీ కార్ప్స్ ఆందోళన వ్యక్తం చేసింది. రన్‌వేల పాక్షిక పునరుద్ధరణ తర్వాత ఎయిర్పోర్ట్ కాస్త అందుబాటులో వచి్చంది. శరణార్థుల బెడద లెబనాన్‌కు ఉన్న ఏకైక విమానాశ్రయాన్ని 2006లో ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేసింది. దాంతో సరుకు వాయు రవాణాను పూర్తిగా బ్రేకులు పడ్డాయి. నాటి దాడుల్లో మౌలిక వసతులన్నీ ధ్వంసమై లెబనాన్‌కు ఏకంగా రూ.26 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది! ఇజ్రాయెల్ గనక ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయి దాడికి దిగితే లెబనాన్ఇంకెంతటి నష్టం చవిచూడాల్సి ఉంటుం దో అనూహ్యమే. పైగా 2006 యుద్ధమప్పుడు శరణార్థుల బాధ లేదు. సిరియాలో అంతర్యుద్ధం దెబ్బకు ఇటీవల కోటి మందికి పైగా లెబనాన్‌కు పోటెత్తారు. ఈ శరణార్థులకు అందుతున్న అంతర్జాతీయ సాయం కూడా ఆగి ఆర్థిక భారం మరీ పెరిగింది.ఐరాస పెదవి విరుపు డ్రోన్ల వాడకంతో ఇప్పుడు ఆధునిక యుద్ధరీతులు సమూలంగా మారిన నేపథ్యంలో ఈసారి ఇజ్రాయెల్‌తో యుద్ధమంటూ వస్తే మరింత భీకరంగా ఉండొచ్చు. అందుకు కావాల్సిన సన్నద్ధత లెబనాన్‌కు ఏమాత్రమూ లేదని ఐరాస, లెబనాన్ సంయుక్త ముసాయిదా పత్రమే పరోక్షంగా తేల్చేయడం విశేషం. అదేం చెప్పిందంటే... → గాయపడే సైనికులు, పౌరుల కోసం ఆస్పత్రుల్లో ఔషదాలు, అత్యవసర చికిత్స, సదుపాయాలను భారీగా సమకూర్చుకోవాలి. → 2006లో మాదిరి చిన్నపాటి యుద్దమైనా కనీసం 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. → వారికి కనీస సదుపాయాల కల్పనకు నెలకు కనీసం రూ.420 కోట్లు కావాలి. → అదే పూర్తిస్థాయి భీకర యుద్ధమైతే కోటి మందికి పైగా శాశ్వతంగా నిర్వాసితులైపోతారు. → అప్పుడు వారి బాగోగులకు ఎంత లేదన్నా నెలకు రూ.838 కోట్లు కావాలి. → కొన్ని నెలలుగా ఇజ్రాయెల్–హెజ్బొల్లా పరస్పర దాడుల దెబ్బకు సరిహద్దు ప్రాంతాల్లోని లక్ష మంది ఇప్పటికే వేరే చోట్లకు తరలారు. వారి బాగోగులకు నెలకు రూ.209 కోట్ల కోసమే లెబనాన్ నానా ఆపసోపాలు పడుతోంది.తలకు మించిన నానారకాల సమస్యలతో లెబనాన్ ఇప్పటికే తీవ్రంగా సతమతమవుతోంది. ఇంట గెలవలేని ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగి నెలా నెగ్గుకురాగలదు? చైనా, రష్యా, ఇరాన్ నుంచి సమీకరించిన ఆయుధ సంపత్తి భారీగానే ఉన్నా ఇజ్రాయెల్ దాడులను హెజ్బొల్లా మిలిటెంట్లు తట్టుకుని నిలవడం దుస్సాధ్యమే’’ – అంతర్జాతీయ పరిశీలకులు– సాక్షి, నేషనల్ డెస్క్ -
Stock Market: బేర్ విశ్వరూపం
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం. రోజంతా నష్టాల కడలిలో ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. → బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్ గూడ్స్ 4.1%, ఇండస్ట్రీయల్ 4%, విద్యుత్ 3.9%, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ 3.75% చొప్పున క్షీణించాయి. → సెన్సెక్స్ సూచీలో హెచ్‌యూఎల్(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్ 7%, అదానీ పోర్ట్స్ 6%, టాటాస్టీల్ 5%, ఎస్బీఐ 4.50%, పవర్ గ్రిడ్ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి. → చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. → బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. → రిలయన్స్ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది. → మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్ బ్రదర్స్, కోవిడ్ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు పడింది.84 దిగువకు రూపాయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టంఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్ స్ట్రీట్ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది. ‘అమ్మో’రికా! ముసిరిన మాంద్యం భయాలు.. ఉద్యోగాల కోత.. హైరింగ్ తగ్గుముఖం.. మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్... ఫెడ్ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడాఅమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్డాక్ 2.4% కుప్పకూలింది. డోజోన్స్ 1.5%, ఎస్అండ్పీ–500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన నాస్డాక్ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్లోకి జారింది. ఆసియా, యూరప్ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్ డౌన్‌తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్.. ట్రిలియన్ డాలర్లు ఆవిరి రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్డాక్లో టాప్–7 టెక్ టైటాన్స్ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్ షేర్లు 10% క్రాష్ అయ్యాయి. ఫలితాల నిరాశతో ఇంటెల్ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్–7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్ ఇస్తున్నారు. యుద్ధ సైరన్..: పశ్చిమాసియాలో హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయిల్ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్ మొదలైతే క్రూడ్ ధర భగ్గుమంటుంది. బ్యారల్ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్.. సునామీ అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19 బ్లాక్ మండే (14.7% డౌన్) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్ ఆల్ టైమ్ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్‌తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్ మన మార్కెట్ సహా ఆసియా, యూరప్ సూచీలను కుదిపేస్తోంది.ఫెడ్ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్ ఫండ్స్ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్‌లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్‌లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ2) యూఎస్ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్‌లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్ మార్కెట్‌పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ అంటోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
టెల్అవీవ్లో కత్తిపోట్లు.. ఇద్దరి మృతి
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్ కేంద్రంగా ఇరాన్ మద్దతుతో పనిచేసే హిబ్బుల్లా మిలిటెంట్ గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులకు సిద్ధమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్‌పై మరోసారి బాంబుల వర్షం కురిపించింది.ఆదివారం(ఆగస్టు4) తెల్లవారుజామున ఉత్తరగాజాలోని టెంట్ క్యాంప్‌పై జరిగిన దాడుల్లో మొత్తం 18 మంది చనిపోయారు. మరోవైపు ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ శివార్లలో పాలస్తీనా మిలిటెంట్ ఒకరు జరిపిన కత్తిదాడిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్‌లోని జనావాసాలపై హిజ్బుల్లా ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చని సమాచారం. -
ఇరాన్-ఇజ్రాయెల్ దాడులు.. వీళ్ల వైరం ఏనాటిది!
పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. అయితే.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఈ నాటిది కాదు! దాదాపు అర్ధ శతాబ్దం క్రితమే ఈ రెండు దేశాల మధ్య వైరం మొదలైంది.పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియే (62) వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి టెహ్రాన్‌లో ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఇరాన్ దీన్ని తన బల ప్రదర్శనకు వేదికగా మలచుకుంది. అందులో భాగంగా గాజాను వీడి 2019 నుంచీ ఖతార్‌లో ప్రవాసంలో గడుపుతున్న హనియే తదితర హమాస్ నేతలతో పాటు పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హెజ్బొల్లా, యెమన్‌కు చెందిన హౌతీ తదితర ఉగ్ర సంస్థల అగ్ర నేతలంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ఇజ్రాయెల్‌కు మరణం’ అంటూ మూకుమ్మడిగా నినాదాలు చేశారు. కార్యక్రమం ముగిసి హనియే టెహ్రాన్‌లోని తన ఇంటికి చేరుకున్న కాసేపటికే వైమానిక దాడికి దిగింది. ఇల్లు దాదాపుగా ధ్వంసం కాగా హనియే, బాడీగార్డు చనిపోయారు. దీన్ని హమాస్ కూడా ధ్రువీకరించింది.హనియేను ఇజ్రాయెల్ వైమానిక దాడితో పొట్టన పెట్టుకుందని మండిపడింది. ఇజ్రాయెల్‌పై దీటుగా ప్రతీకార చర్యలుంటాయని స్పష్టం చేసింది. దాడిపై ఇరాన్ స్పష్టత ఇవ్వకున్నా ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డ్స్ దర్యాప్తు చేపట్టింది. ఇది ఇజ్రాయెల్ పనేనని అమెరికా కూడా అభిప్రాయపడింది. ఇజ్రాయెల్ మాత్రం దీనిపై స్పందించలేదు. అయితే, ‘‘మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గలాంట్ ప్రకటించారు.గతేడాది అక్టోబరు 7న తన గడ్డపై హమాస్ నరమేధానికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడం తెలిసిందే. హనియేతో పాటు హమాస్ అగ్ర నేతలందరినీ మట్టుబెట్టి తీరతామని ఆ సందర్భంగానే ప్రతిజ్ఞ చేసింది. హమాస్ నేతలు ఎక్కడున్నా వెంటాడి వేటాడాలంటూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్‌కు బాహాటంగానే అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్ 7 నాటి దాడిలో హనియేకు నేరుగా పాత్ర లేదు. పైగా హమాస్‌లో మితవాద నేతగా ఆయనకు పేరుంది. అయినా నాటి దాడికి ఆయన ఆశీస్సులూ ఉన్నాయని ఇజ్రాయెల్ నమ్ముతోంది.హనియే మృతికి ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. అది తమ పవిత్ర బాధ్యత అని స్పష్టం చేశారు. ‘‘మా ప్రియతమ అతిథిని మా నేలపైనే ఇజ్రాయెల్ పొట్టన పెట్టుకుంది. తద్వారా తనకు తానే మరణశాసనం రాసుకుంది’’ అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరాన్ స్పందన తీవ్రంగానే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బుధవారం మధ్యా హ్నం ఖమేనీ నివాసంలో సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరగడం దీన్ని బలపరుస్తోంది. తమపైకి వస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అన్నారు.మరోవైపు.. హెజ్బొల్లా మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్‌ను ఇజ్రాయెల్ హతమొందించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌లో హెజ్బొల్లా ఇటీవలి రాకెట్ దాడులతో చిన్నారులతో పాటు మొత్తం 12 మంది ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. దానికి ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్‌పై మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ రాకెట్ దాడులకు దిగింది. ఈ దాడుల నుంచి షుక్ర్ తప్పించుకున్నట్టు హెజ్బొ ల్లా చెప్పుకున్నా, అతను మరణించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. 1983లో బీరూట్‌లో అమెరికా సైనిక స్థావరంపై దాడులకు సంబంధించి షుక్ర్ ఆ దేశ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్‌కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానెల్ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్ తేలి్చచెప్పినట్లు వివరించింది. ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్ సైన్యమేనని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ చెప్పారు.హమాస్ మిలటరీ విభాగం ‘ఖస్సం బ్రిగేడ్స్’ అధి నేత మొహమ్మద్ దీఫ్‌ను ఖతం చేశామని ఇజ్రాయెల్ సైన్యం గురువారం ఒక ప్రకటనలో తేల్చిచెప్పింది. జూలై 13న దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ సిటీ శివారులో ఓ కాంపౌండ్‌పై నిర్వహించిన వైమానిక దాడులో అతడు హతమయ్యాడని వెల్లడించింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను హత్య చేసిన మరుసటి రోజే మొహమ్మద్ దీఫ్ మృతిని ఇజ్రాయెల్ నిర్ధారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం!గతంలో అమెరికాతో జతకట్టిన పహ్లావీ రాజవంశం 1979లో ఇరాన్ విప్లవంతో అధికార పీఠాన్ని కోల్పోయింది. అనంతరం ఇరాన్ పాలనా పగ్గాలను చేపట్టిన అయతుల్లా ఖమేనీ వర్గం అమెరికా పట్ల దేశ వైఖరిని మార్చేసింది. 1979లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిపోయింది. దాంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశానికి దూరం అయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్‌ను వ్యతిరేకించడం మొదలు పెట్టాయి. అమెరికాను ‘మహా సాతాను’గా, ఇరాన్ చివరి చక్రవర్తి మొహమ్మద్ రెజా పహ్లావీకి మద్దతు తెలుపుతున్న ఇజ్రాయెల్‌ను ‘చిన్న సాతాను’గా అభివర్ణించింది. నాటి నుంచి టెహ్రాన్-టెల్ అవీవ్ మధ్య శత్రుత్వం క్రమంగా పెరగడంతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నదని ఖమేనీ ఆరోపించారు.ఇజ్రాయెల్ పౌరుల పాస్‌పోర్టులను గుర్తించడం మానేసింది. టెహ్రాన్‌లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి, దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ)కు అప్పగించింది. 1990 వరకు కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్ మీద శ్రతుత్వం లేదు. కానీ కాలక్రమంలో ఇరాన్‌ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది. దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్లో షియాలు మెజార్టీ కాగా, మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తన పై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ హిజ్బుల్లాను పుట్టించింది.ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’ గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. ఈ షాడో వార్‌కు లెబనాన్, సిరియా యుద్ధవేదికలుగా ఆవిర్భవించాయి. లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హెజ్బొల్లా గ్రూపునకు ఇరాన్ అండగా నిలిచింది. మరోవైపు సిరియా భూభాగంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు కూడా ఇరాన్ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో 1967 యుద్ధం తర్వాత సిరియాలోని గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. నాటి నుంచి సిరియా, లెబనాన్‌పై దాడులు జరిపేందుకు గోలన్ హైట్స్‌ను ఇజ్రాయెల్ ఉపయోగించుకుంటుంది.1992లో ఇరాన్‌కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి, 29మంది మృతికి కారణమైంది. దానికి కొన్నిరోజుల ముందే హిజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు ఆపాదించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇరాన్ వద్ద అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మకపోవడం గమనార్హం. ఈక్రమంలో 2000 సంవత్సరంలో ఇరాన్ అణు సంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్‌దే బాధ్యత అని టెహ్రాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదెహ్ హత్యకు గురవడానికి కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. మరోవైపు తమ ప్రాంతాల్లో రాకెట్, డ్రోన్ల దాడులకు కారణం ఇరానేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాంతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలిచింది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్రసముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది.గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన భీకర దాడుల్లో తమ పాత్ర లేదని ఇరాన్ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ దాడిని స్వాగతించింది. మరోవైపు హమాస్‌కు మద్దతుగా లెబనాన్ నుంచి హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 1న ఇజ్రాయెల్‌కు చెందినవిగా అనుమానిస్తున్న కొన్ని యుద్ధ విమానాలు సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేశాయి. ఈ దాడిలో సీనియర్ కమాండర్లు సహా ఏడుగురు అధిదారులు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. -
Israel-Hamas war: యుద్ధమేఘాలు!
టెల్అవీవ్/వాషింగ్టన్: పశ్చిమాసియాపై యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియె హత్య, అందుకు దీటైన ప్రతీకారం తప్పదన్న ఇరాన్ హెచ్చరికలు అగ్గి రాజేశాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దూకుడు చర్యలకు దిగితే అడ్డుకునేందుకు అమెరికా అదనపు యుద్ధ నౌకలు, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్రూయిజర్లు, డి్రస్టాయర్లు, ఎఫ్–22 ఫైటర్ జెట్ స్క్వాడ్రన్‌ను మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. పసిఫిక్ సముద్రంలో ఉన్న విమానవాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌ను కూడా తరలించాల్సిందిగా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆదేశించారు. మిసైల్ డిఫెన్స్ బలగాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు వెళ్లాయి. ఇరాన్ సమీపంలో భూతల బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించే ప్రయత్నాలు కూడా జోరందుకున్నాయి. 40 ఎఫ్ఏ–18 సూపర్ హార్నెట్, ఎఫ్–35 అటాక్ ప్లేన్లతో కూడిన విమానవాహక నౌక థియోడర్ రూజ్వెల్ట్ అరేబియా తీర సమీపంలో; 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, 4,500 మంది మరైన్లు, నావికా దళ సభ్యులతో కూడిన యూఎస్ఎస్ వాస్ప్ కూడా తూర్పు మధ్యదరా సముద్రంలో పహారా కాస్తున్నాయి. మరో హమాస్ నేత హతం శనివారం గాజాపై వైమానిక దాడుల్లో హమాస్ సైనిక విభాగ కీలక నేత హైథమ్ బలిదీతో పాటు డజన్లకొద్దీ పాలస్తీనియన్లు మరణించినట్టు సమాచారం. వెస్ట్‌బ్యాంక్‌లో 9 మంది పాలస్తీనా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది.ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా: అమెరికా ఇజ్రాయెల్‌కు దన్నుగా నిలిచేందుకు అవసరమైతే మరిన్ని చర్యలూ చేపడతామని పెంటగాన్ తాజాగా ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొనడం ఈ ఏడాది ఇప్పటికే ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్త హై అలర్ట్ ప్రకటించింది. అయితే ఉద్రిక్తలు పెరగడం ఎవరికీ మంచిది కాదని పెంటగాన్ అధికార ప్రతినిధి సబ్రీనాసింగ్ అన్నారు. మధ్యప్రాచ్యంలో తాజా పరిస్థితులపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యొవ్ గాలంట్‌తో లాయిడ్సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. -
పశ్చిమాసియా ఓ మందు పాతర!
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్ సన్నాహాలు చేస్తున్నట్టు తాజా వార్తలు సూచిస్తున్నాయి. పశ్చిమాసియాలో తిష్ఠవేసి ఉన్న అమెరికా సైన్యాలు కూడా ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలవడానికి మోహరింపు మొదలుపెట్టాయి. ఇరాన్లో ఆ దేశపు అతిథిగా ఉన్న సమయంలో హమాస్ రాజకీయ విభాగపు నేతను హతం చేయడం ద్వారా ఇజ్రాయెల్ పెద్ద సవాల్నే విసిరింది. గత అక్టోబర్ మాసంలో ఇజ్రాయెల్ పౌరులపై దాడి చేసిన హమాస్ దుస్సాహసం కంటే ఈ చర్య తక్కువదేమీ కాదు. ఇది ఇరాన్‌కు విసిరిన సవాల్! ఇజ్జత్ కా సవాల్‌గా ఈ చర్యను ఇరాన్ పరిగణించకుండా ఉంటుందని భావించలేము.ఇజ్రాయెల్ పాల్పడిన దుశ్చర్యకు కఠిన శిక్ష తప్పదనీ, ప్రతీకారం తీర్చుకుంటామనీ ఇరాన్ సుప్రీమ్ లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఇప్పటికే ప్రకటించారు. ఇరాన్ యుద్ధంలో పాల్గొనడమంటే పశ్చిమాసియాలోని పలు ఉగ్రవాద సంస్థలు కూడా దాని వెన్నంటి ఉన్నట్టే! హమాస్‌తో పాటు లెబనాన్‌లో హెజ్బుల్లా, ఇరాక్, సిరియాల్లోని షియా మిలిషియాలు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు కూడా యుద్ధంలో పాల్గొంటారు. హౌతీ తిరుగుబాటుదారుల తడాఖా ఏమిటో ఇప్పటికే ప్రపంచ వాణిజ్యం చవిచూసింది.గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన ప్రతీకార దాడుల తర్వాత ఇరాన్ ఆదేశాల మేరకు యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. యూరప్ – ఆసియా దేశాల మధ్య జరిగే నౌకా వ్యాపారంలో సింహభాగం సూయెజ్ కెనాల్ ద్వారానే జరుగుతుంది. ఇది ప్రపంచ నౌకా వాణిజ్యంలో 30 శాతం. విలువ లక్ష కోట్ల డాలర్లు. యూరప్ వాణిజ్య నౌకలు మధ్యధరా సముద్రం నుంచి సూయెజ్ కెనాల్ ద్వారా ఎర్ర సముద్రంలోకి ప్రవేశించి ‘ఆఫ్రికా కొమ్ము’ (హార్న్ ఆఫ్ ఆఫ్రికా)గా పిలుచుకునే సోమాలీ ద్వీపకల్పానికి – అరబ్ ద్వీపకల్పానికి మధ్యనున్న సన్నని దారిగుండా బంగాళాఖాతంలోకీ, అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకీ ప్రవేశిస్తాయి. అరబ్ ద్వీపకల్పానికి బంగాళాఖాతపు అంచున ఉన్న దేశం యెమెన్. యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారులనే ‘హౌతీ’లుగా పిలుస్తున్నారు. హౌతీల దాడులకు భయపడి సూయజ్ నౌకా వాణిజ్యంలో 90 శాతం ఆగిపోయింది. యూరప్ నుంచి అట్లాంటిక్ సముద్రం ద్వారా ఆఫ్రికా ఖండపు ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ అంచును చుట్టి హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించడానికి ఈ నౌకలకు రెండు వారాల అదనపు సమయం పట్టింది. భారీగా అదనపు వ్యయాన్ని భరించాల్సి వచ్చింది. వాణిజ్యాల్లోని అదనపు భారాన్ని అంతిమంగా మోయాల్సింది వినియోగదారులైన ప్రజలే! హౌతీల దాడుల ప్రభావం 50 దేశాల నౌకా వాణిజ్యంపై పడిందని గత జనవరిలోనే వైట్‌హౌస్ ప్రకటించింది.ఇరాన్ – ఇజ్రాయెల్‌ల మధ్యన నిజంగానే యుద్ధం ప్రారంభమైతే దాని విధ్వంసకర ప్రభావాన్ని మొత్తం ప్రపంచమే ఎదుర్కోవలసి వస్తుంది. ఇక ఆ ప్రాంతపు సంక్షోభం గురించి చెప్పవలసిన అవసరమే లేదు. ఇజ్రాయెల్ జరిపిన గాజా దాడుల్లోనే 40 వేలమంది చనిపోయారు. పుష్కర కాలం కింద ప్రారంభమైన సిరియా అంతర్యుద్ధంలో ఇప్పటివరకు నాలుగు లక్షలమంది ప్రాణాలు పోగొట్టుకున్నట్టు అంచనా. తీవ్రమైన మానవతా హననాన్ని ఈ ప్రాంతం చవిచూసింది. ఉన్న ఊరు విడిచిపోయినవారూ, కన్నబిడ్డల్ని అనాథల్ని చేసినవారూ లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒక దశలో మధ్యధరా సముద్రపు అలల మీద శవాలు తేలియాడిన విషాద సన్నివేశాలను కూడా ప్రపంచం చూసింది. ఇక ఆర్థిక వ్యవస్థల విధ్వంసం, లక్షలాది ప్రజలు శరణార్థులుగా వలస వెళ్లడాలు యుద్ధ దేశాల్లో షరా మామూలే!పశ్చిమాసియా సంక్షోభంతో కానీ, దాని కారణాలతోగానీ ఎటువంటి సంబంధం లేని భారతదేశం కూడా యుద్ధం ప్రారంభమైతే తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. హమాస్ నాయకుడు ఇస్మాయెల్ హనియా హత్య జరిగి మూడు రోజులు గడిచినా భారతదేశం నుంచి ఖండన మండనల వంటి అధికారిక ప్రకటనలేమీ రాలేదు. ‘వ్యూహాత్మక నిశ్శబ్దాన్ని’ పాటిస్తున్నామనుకోవాలి. నిజంగా కూడా భారత్ పరిస్థితి అటువంటిదే! రెండు దేశాలతో మనకు మంచి సంబంధాలున్నాయి. అంతకు మించి రెండు దేశాలతో అవసరాలు కూడా ఉన్నాయి.ఇరాన్‌తో భారత స్నేహ సంబంధాలు తరతరాల నాటివి. ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిన సమయంలో మిత్రదేశంగా మనం బాసటగా నిలబడనప్పటికీ ‘చాబహార్ పోర్టు’ నిర్మాణ బాధ్యతలను మనకే అప్పగించి సౌహార్దం చాటుకున్న దేశం ఇరాన్. ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్‌తో కూడా భారత్ బంధం బాగా బలపడింది. భద్రత, మిలిటరీ వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య స్నేహ ఒడంబడికలున్నాయి. భారతదేశ ఇంధన అవసరాల్లో అత్యధిక భాగం పశ్చిమాసియానే తీరుస్తున్నది. ఈ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలతోనూ భారత్‌కు దౌత్య సంబంధాలున్నాయి.కొన్ని లక్షలమంది భారతీయులు ఈ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఏటా మూడు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఈ ప్రవాసులు భారత్‌కు పంపిస్తున్నారు. ప్రవాసుల భద్రత పట్ల కూడా భారత్‌కు ఆందోళన ఉంటుంది. ఇటీవలనే యూఏఈ, జోర్డాన్, గ్రీస్‌లతో కలిసి ‘ఇండియా – మిడిల్ ఈస్ట్ – యూరోప్ ఎకనామిక్ కారిడార్’ను కూడా భారత్ ప్రారంభించింది. ఉద్రిక్తతల కారణంగా ఈ నడవా ఇంకా నడకను మొదలుపెట్టలేకపోయింది. ఇజ్రాయెల్, యూఏఈ, అమెరికాలతో కలిసి ఏర్పాటు చేసుకున్న ‘ఐ టూ – యూ టూ’ ప్లాన్ పరిస్థితి కూడా ఇంతే!ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి రెండు ధ్రువాల ప్రపంచంలో ఏ దేశమైనా ఏదో ఓ కూటమి వైపు మొగ్గవలసిన పరిస్థితులుండేవి. అలీన దేశాలకు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడున్న పరిస్థితులను ఏకధ్రువ ప్రపంచంగా కూడా పిలువలేము. ఇది దేశాల మధ్య కీలక భాగస్వామ్యాల యుగం. భౌగోళిక – రాజకీయ, భౌగోళిక – ఆర్థిక అవసరాలను బట్టి ప్రాంతీయంగానూ, ఖండాంతర స్థాయుల్లోనూ ఈ వ్యూహాత్మక లేదా కీలక భాగస్వామ్య కూటములు ఏర్పాటవుతున్నాయి. ఇటువంటి భాగస్వామ్యాలు పశ్చిమాసియా దేశాలతో కూడా భారత్‌కున్నాయి. ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతంలో తలెత్తే సంక్షోభం కంటే కూడా పశ్చిమాసియా సంక్షోభమే భారత్‌పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రాంతంలో జరిగే యుద్ధం భారత్‌కు నిజంగా పీడకలే! కానీ, ఒక దేశపు దుశ్చర్యను ఖండించలేని స్థితిలో ఉన్న భారత్ యుద్ధాన్ని ఆపగలదని ఆశించలేము.ఇజ్రాయెల్... అమెరికా మాట వింటుంది. రష్యా – చైనాల మాటను ఇరాన్ వినే అవకాశం ఉంది. ఈ మూడు దేశాలు కలిసి సంయుక్తంగా యుద్ధాన్ని నివారించేందుకు పూనుకుంటాయా? అది సాధ్యమయ్యే పనేనా? అసలు యుద్ధం జరగకూడదని ఈ మూడు దేశాలు కోరుకుంటున్నాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. యుద్ధం జరిగితే రష్యాకు పోయేదేమీ ఉండకపోవచ్చు. ఇరాన్, సిరియాలు మిత్ర దేశాలు. వాటికి కావలసిన ఆయుధాలను నూటికి నూరు శాతం రష్యానే ఎగుమతి చేస్తున్నది. ఇప్పటికే ఆయుధ ఎగుమతులు తగ్గిపోయిన రష్యాకు ఇదో ఊరటే! కోల్పోయిన ఒకనాటి ప్రాధాన్యత మళ్లీ ఆ ప్రాంతంలో దక్కడం కంటే కావల్సిందేముంది! ఉక్రెయిన్‌కు అండగా నిలబడిన అమెరికాకు పశ్చిమాసియాలో పాఠం చెప్పే అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటుంది?దేశాల మధ్య ఉద్రిక్తతలు, వైషమ్యాలు ఉండే పరిస్థితులపై చైనా, అమెరికాలకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి యుద్ధాన్ని కోరుకోకపోవచ్చు. అమెరికాకు ఈ ప్రాంతంలో సైన్యం ఉన్నది. సైనిక స్థావరాలున్నాయి. ఇజ్రాయెల్ వంటి బలమైన శిష్య దేశాలు, సౌదీ వంటి మిత్ర దేశాలున్నాయి. వాటితో ప్రయోజనాలున్నాయి. ఇక్కడ యథాతథ స్థితి కొనసాగడం అమెరికాకు అవసరం. ఇక్కడి బలాబలాల సమతూకం చెదిరితే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం పడుతుంది.యుద్ధమే జరిగితే ఇజ్రాయెల్‌కు అండగా నిలవక తప్పని స్థితి అమెరికాది. ఒకవేళ అలా నిలబడకపోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా అమెరికా కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాలు, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా ఇండో – పసిఫిక్‌లో కుదిరిన ఒప్పందాల్లో భాగస్వాములు అమెరికాను విశ్వసించకపోయే అవకాశం ఉంటుంది. సొంత దేశంలోని యూదు లాబీ అభీష్టానికి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయాలు అమెరికా తీసుకోగలదా అన్నది కూడా సందేహమే. కనుక యుద్ధంలో అమెరికా పాత్ర ఉంటుంది.ఇజ్రాయెల్‌తో పాటు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఖతార్ తదితర దేశాలు పశ్చిమాసియాలో అమెరికాకు సన్నిహితంగా ఉంటాయి. ఈ దేశాలతో అమెరికాకు బలమైన వాణిజ్య, సహకార సంబంధాలున్నాయి. యుద్ధం ఇజ్రాయెల్ వర్సెస్ అరబ్ ఘర్షణగా మారితే ఈ మిత్రదేశాలకు కొంత ఇబ్బందికరంగా పరిణమించవచ్చు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఈ మధ్యకాలంలో అమెరికా విద్యార్థులు పెద్ద ఎత్తున గళం విప్పుతున్నారు. కాన్వొకేషన్ కార్యక్రమాలను పాలస్తీనా అనుకూల నినాదాలతో హోరెత్తించారు. దేశంలోని యూదు లాబీకి దీటుగా వ్యతిరేక శక్తులు కూడా బలపడుతున్న సూచనల నేపథ్యంలో ఈ యుద్ధం అధికార పార్టీ డెమోక్రట్ల పుట్టిని ఎన్నికల్లో ముంచినా ముంచవచ్చు.ఏ రకంగా ఆలోచించినా యుద్ధ నివారణే అమెరికాకు ప్రస్తుత అవసరం. అందుకు ఇరాన్‌ను నియంత్రించవలసిన అవసరం ఉన్నది. రష్యా సహకారంతో చైనా ఈ పని చేయాలని అమెరికా కోరిక. చైనాకు ‘బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్’లో భాగమైన మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఈ దేశాల్లో ఒప్పందాలున్నాయి. పశ్చిమాసియా యుద్ధం ఆర్థిక కారణాల రీత్యా చైనాకు కూడా ఆమోదయోగ్యం కాదని అమెరికా అంచనా. పశ్చిమాసియా సంక్షోభంలో అమెరికా కూరుకొనిపోయినట్లయితే ఇండో – పసిఫిక్‌లో తమను దిగ్బంధం చేసే ప్రయత్నాలు వెనుకడుగు వేస్తాయని చైనా దౌత్య నిపుణులు అంచనా వేసుకుంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇస్మాయెల్ హనియా హత్యను కూడా చైనా గట్టిగానే ఖండించింది. ఈ కోణంలో చూసినప్పుడు యుద్ధ నివారణకు చైనా చొరవ చూపే అవకాశాలు చాలా తక్కువ.పెత్తందారీ దేశాల ఎత్తుగడలు ఏ రకంగా ఉన్నా పశ్చిమాసియా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక మందుపాతర లాగా కనిపిస్తున్నది. పర్షియా, మెసపుటోమియా, ఫొనీషియన్, ఈజిప్టు నైలునదీ నాగరికతలు విలసిల్లిన చారిత్రక ధన్యభూమి ఇప్పుడు దగ్ధగీతాన్ని వినిపిస్తున్నది. ప్రపంచ జనాభాలో పశ్చిమాసియా వాటా రెండున్నర శాతం దాటదు. కానీ 30 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న ప్రాంతం ఇదే! సగటున తొమ్మిది శాతం జీడీపీని ఈ దేశాలు ఆయుధాల కోసం తగలేస్తున్నాయి. రష్యా మార్కెట్ ఇరాన్, సిరియాలు మాత్రమే! మిగతా మార్కెటంతా అమెరికాదే! ఈ దేశాలు ఆయుధాల మీద ఏటా వెచ్చిస్తున్న ఐదు లక్షల కోట్ల రూపాయల్లో భీముని వాటా అమెరికాదే. ఒకపక్క తుపాకులు చేరవేస్తూ, ‘కాల్చుకోకండి ప్లీజ్... జస్ట్ ఆడుకోండి’ అంటే కుదురుతుందా? అందుకే అమెరికా శాంతి ప్రబోధాలకు పెద్దగా విలువ ఉండదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడులు: ఇరాన్
టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశాలున్నాయని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్‌లోని సామాన్య సైనిక స్థావరాలతో పాటు సామాన్య పౌరులు కూడా లక్ష్యంగా దాడులు చేసే అవకాశాలున్నాయి. తమ సీనియర్ కమాండ్‌ర్ ఫాద్ షుక్ర్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందడంతో హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆగ్రహంతో రగిలిపోతున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ సంస్థకు ఇరాన్ పరోక్ష మద్దతుందన్న ప్రచారం ఉంది. ఒక పక్క హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య, మరోపక్క హెజ్బొల్లా సీనియర్ కమాండర్ మృతితో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజజ్రాయెల్‌పై ఎలాంటి దాడులు జరిగినా మద్దతిచ్చేందుకు అమెరికా ఇప్పటికే ఫైటర్జెట్లను పశ్చిమాసియాకు పంపుతుండటం ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది. -
హౌతీల మిసైల్ కూల్చివేసిన ఇజ్రాయెల్
జెరూసలెం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. శనివారం(జులై 20) యెమెన్‌లోని అల్ హొదైదా పోర్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా హౌతీ రెబెల్స్ ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ మిసైల్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్‌ఫోర్స్ (ఐడీఎఫ్) దళాలు మధ్యలోనే దానిని కూల్చివేశాయి.תיעוד: שיגור המיירט בערבה >>@ShaniRami (צילום: אלון וייס, קיבוץ יטבתה) https://t.co/4J3h0Jipsl pic.twitter.com/PnGcJhLIxc— גלצ (@GLZRadio) July 21, 2024 తమ దేశ గగనతలంలోకి ప్రవేశించకముందే క్షిపణిని యారో-3 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో కూల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్ నగరంలో ఇప్పటికీ క్షిపణి రక్షణ వ్యవస్థ (ఐరన్‌డోమ్) సైరన్లు మోగుతూనే ఉన్నాయి. శుక్రవారం రాజధాని టెల్‌అవీవ్‌పై హౌతీలు జరిపిన డ్రోన్ దాడికి ప్రతీకారంగా యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. మరోవైపు ఐడీఎఫ్ దళాలు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిపాయి. హెజ్బొల్లా తీవ్రవాదులకు చెందిన రెండు భారీ ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దాడులను లెబనాన్ మీడియా ధృవీకరించింది.


